1, జులై 2021, గురువారం

శాంతి: - అనగా అర్థం ఏమిటి?

 శాంతి - శాంతి - శాంతి: - అనగా అర్థం ఏమిటి???


మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రంలోనైనా  శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి శాంతి శాంతిః అని ముగుస్తాయి, 


దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం...

ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ...


శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో  తెలియదు, కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు...


*మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది*


1 ఆధ్యాత్మిక ...

2 ఆదీ దైవిక ... 

3 ఆది భౌతిక...

*ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...*


మొదటి " శాంతి " పదం .....


ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధ్యాత్మిక " అంటారు,


రెండవ " శాంతి " పదం .....


మనం మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, అందరికీ దేవుని అనుగ్రహ, ఆశీస్సులు ఉండాలని, ప్రార్థించేదే... దీన్ని  " ఆదీదైవిక " అంటారు,


మూడవ " శాంతి " పదం .....


ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి, దీన్ని " ఆధిభౌతికము " అంటారు,


ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ  చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు...


సర్వే జనా సుఖినో భవంతు ....

ఓం శాంతి - శాంతి - శాంతి:👏

శీర్యతే ఇతి శరీరః

 *శరీరం.....*


శరీరం అని ఎందుకంటున్నారు.. ‘శీర్యతే ఇతి శరీరః’ ..అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.


*దేహం...*


దేహమని ఎందుకన్నారు.. 'దహ్యతే ఇతి దేహః' ..అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా.. మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా.. అవి దహింపబడవు గదా.. మరి వాటిని దేహాలు అని అనరా.. చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలు అనే అగ్ని చేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయాలు.


*దేవాలయం...*


దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకనీ.. "దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః" ..అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం.. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయట గుడికి ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ:' అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది.. ఏ దేవుని పూజ గొప్పది.. ఆలోచించుకోవాలి...

భ్రమ

 💥భ్రమ


🌹నేేేనే_కనుక_లేకపోతే_ఏమి_జరిగి_ఉండేదో....!?*


పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు. 

*హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు...*

ప్రభూ!  లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంతవరకు , నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.

 ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరతభూమిలోనే ఉంటారనీ పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. 

కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయినవేళలో విభీషణుని సలహామేర తల్లిి 

దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధుపురుషుని ద్వారా తెలియజేయబడిందే.. 

బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని అనుకున్నాను... 


అశోకవనం లో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తిదూసిన క్షణంలో ,

ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైనకోరిక నాలో కలిగింది. 

కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడి ని వారించి వాడినుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది.


ప్రభూ! ఎంతచక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపం లో మండోదరి తల్లి ని చూపించావు,

నేనే  లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది.   


చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకు కూడ కలిిగిిఉండేేది...


కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయం రావణుని పత్ని మండోదరి చేత చేయించేవు. 

దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరి తో నీ పని చేయించాలనుకుంటావో వారి తో ఆ పని నెరవేర్చుకుంటావు. 

ఇందులో మా మహత్వమేమీలేదు. 


దేవా! త్రిజట తన స్వప్ననవృత్తాంతం తోటిరాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ, 

ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. 

ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని. 

రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించావని అర్ధమైంది. 


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...

రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...


లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు. 

లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....


ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపావు, అటువంటి ది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!🙏🙏


దీనిని పట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది,


💥నీతి : అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...

మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు..


🌷అందుకని నేనే కనక లేకపోతే ఏమీజరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు. 

మనం నిమిత్తమాతృలమే🌷


   🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Contact' and 'Connection',

 A saint was being interviewed by a reputed journalist in New York. 


Journalist: Sir, in your last lecture, you spoke about 'Contact' and 'Connection', but it was very confusing. Can you explain the difference between the two? 


The saint smiled and took a different approach. He started questioning the reporter instead. 


Saint: Are you from New York?


Journalist: Yeah...


Saint: Who all do you have in your family?


The journalist felt that the sage is trying to avoid his question because this question was very personal and very off-topic from what the sage was asked. 


But he still answered: My mother is no more. So, there's my Father and 3 brothers and a sister. All married. 


The saint asked with a smile: Do you talk to your father?


The journalist's face started showing signs of anger.


The saint asked: When did you last speak to your Father?


Suppressing his anger, the journalist replied: Maybe a month ago. 


The saint asked: Do you see your brothers and sisters often? When did you all last meet as a family?


With this question, sweat broke out on the journalist's forehead. Am I taking this interview, or is he?


It felt like the saint was interviewing the journalist. 


With a sigh, the journalist said: Christmas, but 2 years ago.


The saint further asked: For how many days did you all stay together?


"3 days," the journalist replied, wiping away his tears. 


Saint: How much time did you all (children) spend sitting close to your father?


The journalist was taken aback and looked embarrassed. He started scribbling on a paper.


The saint continued: Did you have breakfast, lunch or dinner with your father?


Did you ask him how he was?


How does he spend time after your mother's passing?



The saint held the journalist's hand and said: Don't be ashamed, or sad. I'm sorry if I have 

inadvertently/unknowingly hurt you.


But this is the answer to your question on 'Contact and Connection'. 


You are only in 'contact' with your father, but you have no 'connection' with him...you are not connected to him.


Connection is always with the soul. It is between hearts. 


Sitting together, sharing meals and taking 

care of each other, touch, handshakes, eye contact, spending a little time together...


With all this, you are just in contact with your father and siblings, but you all don't have any real connection with each other. 


The journalist wiped his eyes and said: Thank you for this invaluable and unforgettable lesson.


Today, this has become the reality of India as well.


Everyone has thousands of contacts. But there is no connection.


There is no real talk, real discussion or sharing of thoughts.


Everyone is lost in their own fake world. 


That saint who gave this lesson was none other than *"Swami Vivekananda"*.

వాత్సల్య గోదావరి*

 *వాత్సల్య గోదావరి*


🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊


 *రచన: శ్రీమతి మణి వడ్లమాని*

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍

      ఆషాడం చివరన,తొలకరి జల్లులు,కుంభవృష్టిగా   మారి ఆకాశం  చిల్లుపడ్డట్టుగా కుండపోతగా  వర్షం కురుస్తోంది.


వీధి వసారాలో సుబ్బుశాస్త్రిభోరున పడుతున్న వానను చూస్తూ,మనసులోబావురుమనుకుంటూ పీట మీద కూర్చొని శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు. పెదాలుమాత్రమేజపిస్తున్నాయి.చూపు మాత్రంవీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టు కొని ఆరోజు తిది,వార,నక్షత్రాలు తో సహా సిద్ధంగాఉన్నాడు.అలాగే ఎవరన్నా వచ్చిపిలుస్తారేమోఅనివడికిన జంద్యాలు కూడా పక్కనేపెట్టుకున్నాడు


‘శాస్త్రి గారు’ అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు.


అబ్బే ఏది ఎవరూ  రాందే?


నిరాశగా  మళ్ళి పంచాక్షరీ జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి


ఈవర్షం కనక లేకపోతెరోజూ  ఈ పాటికల్లాగోదారొడ్డున ఉన్న  కోటిలింగాల  రేవుదగ్గర  ఉండేవాడు. ఉదయాన్నే వెళ్లి గోదావరి లో ఓ నాలుగు మునకలు వేసి  సంధ్యావందనం అక్కడే కానిచ్చి, ఈశ్వరుడి దర్శనం చేసుకొని,  ఆ పావంచాల అంచున కూర్చొని  ఎక్కడెక్కడి నుంచోపరమపావని అయిన  ఈ  గోదావరి లో స్నానం చెయ్యడానికి  వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించివాళ్ళు ఇచ్చిన తృణమో పణమో  తీసుకొని  ఆరోజు కి సరిపడ సంబారాలు కొనుక్కొని  ఇంటికి వెళ్ళే వాడు.ఇది రోజూ అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కొని వస్తోంది , లేదు,సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది.


అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు “వర్ధనం,నీ చేతి లో ఏదో మంత్రదండం ఉంది సుమా!” అని. ఆ తృప్తి తోనే ఆవిడకి కడుపు నిండి పోయేది.


కాని  నాలుగు రోజులనుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి  వల్ల యాత్రికులు ఎవరూ రావటం లేదు. ఇంచుమించుగా భార్యభర్తలిద్దరూ  అర్ధాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు


 పోనీ,ఎవరైనా,ఆభ్దికాలకి భోక్తలుగా పిలుస్తున్నారా? అంటే అది లేదు. అయినా ఇళ్ళలో చేస్తేనే కదా  పిలిచేది అది కాస్తా మఠం  లోనే  కానిచ్చేస్తుంటే, ఇహ  చేసేదేముంది? అనుకుంటూ ‘ఆ గోదావరి తల్లినే నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా? సంకల్పం చెప్పక పోతానా? నాలుగు రూపాయలు తెచ్చుకురానా?” అని ఆశగా చూస్తున్నాడు.


అందరిలా తను పెద్దగా పండితుడు కాదు,పూజలు ,పెళ్ళిళ్ళు చేయడానికి.ఏదో  బతుకు తెరువు కోసం, ఆభ్దికాలకి,భోక్తలుగా వెళ్ళడం, లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్ధం దానం అందుకోవడం, అలా వాటితో వచ్చిన సొమ్ము తోనే  బ్రతుకును  వెళ్లదీసుకువస్తున్నాను.పిత్రార్జితం గ ఉన్న ఈ పెంకుటిల్లే.కాస్త నీడ నిస్తోంది.అది కాస్తశిధిలావస్థలోఉంది.ఉన్న ఈ ఆధారం  కూడా పోతె,ఇక నా దారి  నువ్వేతల్లీ, అనిగోదావరి వైపు దిగులుగాచూస్తున్నాడు.


నాలుగు రోజులనుంచి కడుపునిండా తిండి సరిగాలేదు,నిన్న రాత్రి తిన్న ఉప్పుడుపిండి ఏ మూలకు సరిపోతోంది. నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటెవర్ధనం  ఎలా తట్టుకుంటుందిఅనుకుంటూ పెరటివైపుకి చూసాడు. అక్కడ వసారాలో కూర్చొని వత్తులు చేసుకుంటూ ,గీతగోవిందం పాడుకుంటోంది.


జలజలా కురుస్తున్న వానని చూస్తూ “ఓ ఆకాశగంగాఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకి దూకుతున్నావు,ఆ గోదారేమోఅంతకంటే ఆవేశంతో నిన్నురమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది. అర్భకుడిని తల్లీ  మీ ఇద్దరిమధ్యలో  నన్ను బలి చెయ్యకండి.కాస్త  ఈదీనుడిని కరుణించి శాంతించండి” అని మనసులోనే వేడుకుంటున్నాడు.


భర్త ఆశగా చూసే చూపుని తప్పించుకుంటూ పెరటి వసారాలో వత్తులు చేస్తున్నవర్ధనమ్మ ఆవేదనగా తలపోస్తోంది. ఏదైనా వండి పెడదామన్నా, ఇంట్లో బొత్తిగా సరకులు  లేవు.ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడుపిండి చేసేసింది.ఈ పూట  ఏదైనా దొరికేతే పర్వాలేదు. లేకపోతె ఇహ ఈ పూట పస్తే. అని  ఏదోలెక్కలు వేసుకుంటూ అప్పుడే  గంట పదకొండు దాటి ఉండచ్చు ఆనుకుంది.


ఇంతలో   ముందు  వసారాలో ఏదో అలికిడి వినిపించింది. గభాల్న లేచి చెంగు దులుపుకుంటూ  వెళ్ళింది.  ఆ వానలో కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎవరా అనిఆరాగా తొంగి తొంగి చూసింది. “సుబ్బుశాస్త్రి  గారి ఇల్లు ఇదేనా?  అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకి వచ్చారు. “అవునండి,” అని సమాధానం ఇచ్చే లోపల ఒకఆడావిడా మరో  మగమనిషి కూడా లోపలికి వచ్చారు.


ఈ హడావుడి అంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా  లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులనువసారా మెట్ల మీద పెట్టారు. వాటి లోంచి చుక్కా చుక్కా నీరుమెట్ల మీద నుంచి కిందకిజారుతున్నాయి.వచ్చిన వాళ్ళ చేతులలోఏవో సంచులు కూడా ఉన్నాయి.


వాళ్ళలో  ముందు గా మాట్లాడిన అతను. “వీళ్ళు మా అక్క,బావగారు.  కెనడాలో ఉంటారు. ఇవాళ మా బావగారి తండ్రి తిధి , గోదావరి ఒడ్డున పెట్టుకుందామని  వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు కాని ఈ వానవల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక  స్వయం పాకం ఇచ్చేద్దాము అనుకుంటున్నాము”  అని అన్నాడు.


దానికి  సుబ్బుశాస్త్రి“ అబ్బే, నాకు ఏమిఫర్వాలేదు. మీ బావగారుఈ వానలో గోదారి ఒడ్డున కూర్చొని చెయ్యగలరా?”  అని సందేహం వెలిబుచ్చాడు.


“ఫర్వాలేదండి,వస్తాము… నేను కూర్చొని చేస్తాను” అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలు అన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు.అవి అందుకొని “ఓ పని చేద్దాము.మా ఆవిడ ఇంత పెసరపప్పు,పరమాన్నము చేసి పెడుతుంది.మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా” అని అన్నాడు.


“అయ్యో ఎంత మాట! అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది” అంటూ ఎంతగానో సంతోష పడ్డారు. నలుగురూ గొడుగులుతీసుకొని రేవు దగ్గరకి వెళ్లారు.


వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చక చకా,రెండు కూరలు, పప్పు, పరమాన్నంతో భోజనం వండిపెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకొని వచ్చారు.పెరట్లో ఉన్న అరటి ఆకులు కోసి  విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది.


భోజన కార్య క్రమం అయ్యాక “ అయ్యా! రండి,తమకి  తాంబూలం  ఇస్తాను” అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మగారు.


సుబ్బుశాస్త్రిని, వర్ధనమ్మని ఇద్దరినీ పక్కపక్కనే నిలుచోమని వాళ్ళ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గా ఇద్దరికీ చీరా,పంచెల చాపు  తో పాటుగా  భారీగా  తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు.


ఈ కార్య క్రమం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.ఆ బావమరది వెళుతూ “తొందరలోనేపుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు. అప్పుడు మళ్ళి వస్తాము. అన్నీ మీరే చెయ్యాలి” అని అన్నాడు.


“అయ్యో తప్పకుండా చేస్తాను బాబు” అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు.


www.bestsocialteacher.com 

అప్పుడు శ్రీపతిశర్మగారు,బావమరది తో అంటున్నారు’ చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాల భాదగా ఉంది. అయ్యో, ఏమిటిది? శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించే వాళ్ళు శుభకార్యాలు చెయ్యకూడదుట కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట. ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను. ఆర్ధికంగా కూడా వీళ్ళు చాలా  బలహీనులు.


 చాలీ చాలని, బతుకులు, ఎలాగడుస్తుంది,మరి వీళ్ళని ఆదుకునేది ఎవరు?అందరికి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని  ఆశీర్వదించే  వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చెయ్యలేమా? వాళ్ళకి కనీసం కడుపునిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించాలేమా? అనిపించింది.అప్పుడే  నాకు ఈ ఆలోచనకలిగింది.సుబ్బుశాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనము సాయం చేయాలి.దానికి ఒక చక్కటిప్రణాళిక వేసుకొని  ఒక ట్రస్ట్గా ఏర్పడదాం .వీళ్ళల్లా ఆర్ధికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాము. దానికి  నీసహయం కావాలి,నువ్వే కాదు సాయం చెయ్యాలన్న సంకల్పం,ఉద్దేశ్యం ఉన్న,ఎవరైనా సరే.వాళ్ళందరనీమన ప్రాజెక్ట్ ద్వారా కూడగట్టుకొని,ఈమంచిపనిని ఆరంభిద్దాము” అనిఆవేశంగా అన్నారు.           ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్.


దానికి శ్రీపతిగారి భార్య,విజయ “అవును తప్పకుండా చేద్దాము నేను నా స్నేహితులకి చెబుతాను. ఒకమూడు నెలల లోఅన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాము”అనిఆవిడ కూడా భర్త నిసమర్థించారు.


“మనదేశం, సంస్కృతీ,నదులు,వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవడమే కాదు,వాటిని రక్షించి ముందు తరాలకి ఇవ్వడం కూడా  మనబాధ్యత.”


“తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన  ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి.అందరికీ మనం సాయం చేయలేకపోయినా,  కొందరికైనా  చేద్దాము.ఒక ముందడగువేసాము. ఆ అడుగేమనలని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది.నేను సైతం ఈ పవిత్రమైన కార్యం లోభాగం పంచుకుంటాను”.అని భాస్కర్ కూడాశ్రీపతి,విజయలతో ఏకీభవిస్తూ  అన్నాడు.


ఇవేమీ తెలియని శాస్త్రి, వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ “చూసావా వర్ధనం ఈ వేళ ఆదేవుడు పంపినట్లు గా వాళ్ళు ఇంత కుంభవృష్టి లోరావడం తండ్రికి ఆబ్దికంపెట్టి తర్పణాలు వదిలివెళ్ళడం మాములువిషయం కాదు. అంతా  మనం నమ్ముకున్న  ఆ తల్లి గోదావరి వల్లే.అందులోను ఎక్కడో కెనడా నుంచి వచ్చారుట.ఈ అఖండ గోదావరి దర్శనం కోసం,నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం  చేసుకున్న పుణ్యమే. ” అని  తాంబూలం లో ఉన్న నోట్లను లెక్కపెట్టుకొని  నిర్ఘాంత పోయాడు. అక్షరాలా పదివేల రూపాయలు.ఉన్నాయి.           “వర్ధనం ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వుఓ సారి లెక్కపెట్టి  చూడు…” అన్నాడు ఖంగారుపడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టింది.“అవును,అచ్చంగా పదివేల రూపాయలే, యెంత దొడ్డ మనసు వాళ్లది” అని సంతోషంగాఅంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది


“అవును ఈ వేళ నిజంగా  చాల సుదినం.నా వొంట్లో శక్తుడిగిపోయినా  పర్వాలేదు తండ్రీ, కొంత కాలం దాన్ని మటుకు పునిస్త్రీ  గానే ఉంచమనికోరుతున్నాను  ఎందుకు అనుకుంటున్నావేమో, అదిఅలా ఐదో తనంతో ఉంటె అందరూ దాన్నిముత్తైదువ గ  ఆదరిస్తారు. అప్పుడు దానితిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని”. సుబ్బుశాస్త్రి మనసులో అనుకున్నాడు.


ఉరకలేస్తూ ఉప్పొంగు తున్న గోదావరిని చూస్తూ “తల్లీ,ఏదోచాపల్యంతో నేనన్న మాటలు పట్టించుకోకుండా, కన్నతల్లిలా వాత్సల్యం  చూపించి నన్ను  కరుణించావు.” అంటూ భక్తిగా నమస్కరించాడు, సుబ్బుశాస్త్రి.


గోదావరి నిండుగా  నవ్వి,నేనున్నానని  ప్రేమగా నిమిరినట్లు అనిపించింది సుబ్బుశాస్త్రి కి.


*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, 9492146689*

*ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత* *పాఠశాల గంటి, కొత్తపేట *మండలం తూర్పుగోదావరి.*

www.bestsocialteacher.com 

********

_*Don't edit this story. Don't remove the writer's n collector's details. It is the only respect we can pay to them. If you wish Forward to all.*_

🌏🙏💐🙏💐🙏💐🙏🌏

grass is green”.

 🄶🅁🄰🅂🅂 🄸🅂 🄱🄻🅄🄴


The donkey told the tiger :  ′′The grass is blue”.  The tiger replied: ′′No, the grass is green”.


The discussion became heated up, and the two decided to submit the issue to arbitration, and to do so they approached the lion, king  of the Jungle. 


Before reaching the clearing in the forest where the lion was sitting on his throne, the donkey started screaming:

′′Your Highness, is it true that grass is blue?”.

The lion replied:

“True, the grass is blue”. 


The donkey rushed forward and continued: 

′′The tiger disagrees with me and contradicts me and annoys me please punish him”.

The king then declared:

′′The tiger will be punished with 5 years of silence”.


The donkey jumped with joy  and went on his way, content and repeating:

′′The grass is blue”...


The tiger accepted his punishment, but he asked the lion:

′′Your Majesty, why have you punished me, after all, the grass is green?”


The lion replied:

′′In fact, the grass is green”. The tiger asked: ′′So why do you punish me?”


The lion replied:

′′That has nothing to do with the question of whether the grass is blue or green. The punishment is because a brave, intelligent creature like you can’t waste time arguing with a donkey, and on top of that to come and bother me with that question”.


𝗗𝗲𝗯𝗿𝗶𝗲𝗳


The waste of time is arguing with the fool and fanatic who doesn’t care about truth or reality, but only the victory of their beliefs and illusions. Never waste time on discussions that make no sense. There are people who for all the evidence presented to them, cannot understand, and others who are blinded by ego, hatred and resentment, and the only thing that they want is to be right even if they aren’t.

వైద్యోనారాయణోహరిః

 వైద్యోనారాయణోహరిః


ఆ బ్రహ్మ దేవుని సృష్టి

మానవ జన్మ అంటారు

స్వర్గంలో ఉన్న బ్రహ్మకు

ఓ ప్రతినిధే మన వైద్యుడు


మన శరీరం ఓ అద్భుత సృష్టి

అది మమతాను బంధాలతో

కుటుంబ వ్యవస్థలో అల్లుకున్న 

ఓ పెద్ద తీగ 

భార్యా భర్తలు పిల్లాపాపలనే కొమ్మలు

ఆ మొదలు నుండి విస్తరించి

ఓ ఆకురాలినా, ఆ ఇంటిల్లిపాదీ

కన్నీటి పర్యంతం 

అయితే తన నైపుణ్యంతో 

ఈ కన్నీటిని ఆనంద బాష్పాలుగా

మార్చగలిగే ఒకే ఒక్కడు వైద్యుడు

 

అయితే జీవన పోరాటంలో

ఎన్నో పరాన్నజీవులు

మన శరీరంలో ప్రవేశిస్తూ

ఇప్పుడు మనంచూసే

కరోనా లాంటి 

అతి సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిమి

అనతికాలంలో మనల్ని

భయంకరమైన జబ్బులకు గురిచేస్తే

ఆదుకునే ఒకే ఒక దేవుడు వైద్యుడు


బ్రహ్మదేవుని ప్రతినిధిగా

ఆసుపత్రి అనే కోవెలలో

వెలసిన  నడిచే దేవుళ్ళే వైద్యులు


అవసరమైతే గుండె తీసి 

మరో గుండే అమర్చగలడు

రక్తనాళాలలో పేరుకుపోయిన

మలినాలు క్లీన్ చేసే ఓ స్కావింజర్

అవతారమెత్తగలడు

ప్రమాదాల్లో ఇరిగిన ఎముకల్ని

నేర్పుగా  అతికించి చక్కబెట్టే కార్పెంటర్ గా

కిడ్నీలలో రాళ్ళను బ్లాష్టింగ్ చేసి

తొలగించే ఓ మైనింగ్ ఇంజనీర్ డాక్టర్

కిడ్నీలే మార్పు చేయగల గడసరి డాక్టర్

ముక్కుసొట్టలు మూతిసొట్టలు సరిజేసె చక్కని శిల్పి డాక్టర్ 

పళ్ళూడి నమలండం చేతగాని

వృద్ధులకు ఏకంగా పళ్ళు అమర్చి పుణ్యం కట్టుకునే పుణ్యాత్ముడు డాక్టర్ 

ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం అనే ఈ యంత్రాన్ని రిపేర్ చేయగల ఓ మెకానిక్


మనందరి పరలోక పయనం 

వాయిదా వేయించగల నేర్పరి 

అందుకే యమధర్మరాజుకు

మన వైద్యుడంటే కోపం

ఓ సారి ఓ వైద్యుని పై యమలోకంలో

విచారణ జరుగుతోంది

వచ్చిన ఆరోపణ చిత్రగుప్తుడు చదువుతూ

ప్రభూ ఈయన భూలోకాన ఓ వైద్యుడు

యమలోకానికి రావలసిన మానవులను

తన వైద్యంచే అక్కడ నిలిపివేసి

యమధర్మానికి అడ్డుకట్ట వేశారు

అన్న ఆరోపణ లేవదీశాడు


ఇంతలో యమధర్మరాజుకు గుండె పోటు వచ్చి గిల గిల లాడుతున్నాడు

వైద్యుడు వెంటనే యమధర్మరాజుకు

వైద్యచేసి నయంచేశాడు


ఆ వెంటనే యమధర్మరాజు 

ఇకనుండి వైద్యులెవరొచ్చినా

నేరుగా స్వర్గలోకానికి పంపమని

యమలోక చట్టాలకు సవరణలు తెచ్చారు


ఈరోజు మానవజాతి ప్రాణదాతలకు

జాతీయ  డాక్టర్లదినోత్సవాన 

పలుకుదాం జేజేలు!

అరిషడ్వర్గాలు

 అరిషడ్వర్గాలు అంటే (అంతహ్ శత్రువులు)

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ను అరిషడ్వర్గాలు అని పేరు. అరి అంటే శత్రువు. ఆరుగురు శత్రువులని అర్థం. ఇవి ఎవరికి శత్రువులు? వీరెక్కడ ఉంటారు? ఎవర్ని అంటి పెట్టుకుని ఉంటే వారికే శత్రువులు. వారి మనస్సు లోనే నివాసముంటారు.

         ఒక మంచి పని చేయాలన్నా, ఒకదాన్ని బాగు చేయాలన్నా పదిమంది కావాలి. కానీ చెడగొట్టడానికి ఒక్కడు చాలు. ఈ ఆరు అంతహ్ శత్రువులు లో ఏ ఒక్కరు ఉన్న అది కలిగించే వినాశనం అంతా ఇంతా కాదు. మనస్సు స్వతహాగా వికారం లేనిది. ఈ అరిషడ్వర్గాలు మనస్సు ను పెనవేసుకుని దానిపైన వాటి ప్రభావం చూపెడతాయి. అందువలన మనస్సు ఇంద్రియాలకు వాటికనుకూలముగా ప్రేరణ ఇస్తుంది.

కామం :- తనకు ఇష్టమైన రూపం తనకు సొంతం కావాలని అనుకోవడం, తనకు నచ్చిన స్పర్శ నిత్యం అనుభవానికి రావాలని అనుకోవడం.

క్రోధం :- తాను కావాలని అనుకున్నది దక్కని పక్షంలో ఆ కామమే క్రోధం గా పర్యవసిస్తుంది. తనకు నచ్చిన రూపం మరొకరికి దక్కడం తను ఇష్టపడిన స్పర్శ తనకు దూరం కావడం వంటి పరిస్తితులలో మనిషి అనుభవించే ఒకానొక ఉద్రిక్తభరితమైన స్థితి పేరే క్రోధం.


లోభం :- కోరకూడని కోర్కె కోరడం, అంటే బంగారు లేడిని చూచి అది తనకు కావాలని సీతాదేవి కోరడం లోభం. బంగారు లేడి ఉంటుందా? లేదా? అనే వివేకం కోల్పోవడం, ఫలితంగా భర్తకు దూరమై పర పురుషుని ఇంట కష్టపడవలసి వచ్చింది.

మోహం :- దూరమైన దానిపట్ల స్మరణ అధికమై, మోజు పెరిగిపోయి, తన నిజ స్థితి ఏమిటో గ్రహించలేని దశకు మనిషి చేరుకుంటాడు. దాన్నే మోహం అంటారు. లేడి కోసం వెళ్లిన రాముడు భార్య వియోగము ను పొందాడు.

మదం :- తనంత శక్తి సంపన్నుడు లేడనేది మదం.

మాత్సర్యం :- తనకు దక్కని వస్తువేదైనా(సీతతో సహా) ఇతరులకు దక్కకూడదనేదే మాత్సర్యం.

          పై రెండు లక్షణాలు తోనే రావణుడు చెడిపోయేడు. ఇలా అనేకానేక మందిని పరిశీలించితే పైన పేర్కొన్న అరిషడ్వర్గాలు లో ఏదో ఒక లక్షణం కలిగిన వారే కావడం తోఏదో ఒకరకంగా కష్టాలు పాలైన వారే. ఒక లక్షణం కలిగిన వారే కావడం తో ఏదో ఒక రకంగా కష్టాలు పాలైనవారే ఈ అరిషడ్వర్గాలు ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉంటాయి.

      ఈ అరిషడ్వర్గాలు కు మూలమైన కోర్కెలు (కామం) ను జయించగలిగితే అంతా ఆనందమే. మామూలు ఆనందం కాదు. సచ్చిదానందం.

అంతమంది దేవుళ్ళు ఎందుకు?

 ప్రముఖ తమిళ కవిచక్రవర్తి కణ్ణదాసన్ ని ఓ విదేశీయుడు అడిగారిలా....


"మీకు (అంటే హిందువులకు) అంతమంది దేవుళ్ళు ఎందుకు? పైగా రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతి, సరస్వతి, లక్ష్మి, కాళి, కుమారస్వామి, బ్రహ్మ, వినాయకుడు ఇలా దేవుళ్ళకు అనేక పేర్లు పెట్టుకున్నారు. మీరూ మాలాగా ఒకే ఒక్క దేవుణ్ణి పెట్టుకో వలసింది కదా" అని!


కణ్ణదాసన్ ఆయన చెప్పినదంతా విని ఇలా అడగసాగారు...


"మీ తల్లిదండ్రులకు మేరేమవుతారు?"


దానికి విదేశీయుడి జవాబు "నేను వారికి కొడుకుని"


"మీ భార్యకు...?" అని కణ్ణదాసన్ ప్రశ్న.


"భర్తను"


"మీ పిల్లలకు...?"


"తండ్రిని" 


"మీ అన్నయ్యకు...?"


"తమ్ముడిని"


"తమ్ముడికి...?"


"అన్నయ్యను"


"మీ భార్య తమ్ముడికి?"


"బావను"


"అన్నయ్య పిల్లలకు...?"


"బాబాయిని"


అప్పటికీ ఆగక కణ్ణదాసన్ ప్రశ్నల పరంపర.


కొనసాగుతూనే ఉంది....


పెద్దనాన్న, మేనమామ, అల్లుడు, ఇలా అనేక బంధాలను అతనితో చెప్పించారు.


కొన్ని నిముషాల తర్వాత కణ్ణదాసన్ ఆగి


మళ్ళీ మాటలు కొనసాగించారు....


"చివరికి మట్టిలో కలిసిపోయే మీ దేహానికే ఇన్ని రకాల బంధాలూ, వాటికి రకరకాల పేర్లూ... అవసరమయ్యాయి. అటువంటిది ఇక్కడా అక్కడా అని కాకుండా సర్వాంతర్యామి అయి ప్రపంచాన్ని కంటికి రెప్పలా చూసుకునే పరమాత్మను అనేక నామాలు ఉండటంలో ఆశ్చర్యమేముంది...అయినా అవీ తక్కువే.... అతను దేనికీ లొంగడు. అన్నింటిలోనూ ఉండేవాడు. నీలోనూ ఉంటాడు. నాలోనూ ఉంటాడు. నిన్ను పిలిచినా అతనే. నన్ను పిలిచినా అతనే" అని అనగానే ఆ విదేశీయుడు మరొక్క మాట మాటాడితే ఒట్టు.

-------------------------------------------

మూలం - తమిళం

అనుసృజన - యామిజాల జగదీశ్

పురాకృతం..* *(రెండవ భాగం.)*

 *పురాకృతం..*  *(రెండవ భాగం.)*


*కర్మ క్షయము ఎలా అవుతుంది అనే చర్చచేసే ముందు  ఇంతవరకు చెప్పుకున్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకోసం సంచితం, ఆరబ్దము, అనారబ్దము, ఆగామి, పదాలు సరిగ్గా అర్థం అయ్యుండాలి.*


 అవి సరిగ్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ  చెప్తాను.


ఒకానొక కుటుంబంలో తాత  బాగా డబ్బు కూడబెట్టి అదంతా బంగారము రత్నాలు మొదలైనవి గా మార్చి ఇంటి వెనక పాతి పెట్టాడు. వాళ్ల కొడుకులు  ఆ నిధి లోంచి కొద్దిగా బంగారమూ రత్నాలూ బయటకు తీసి అవి అమ్మి ఆ డబ్బులో కొంత భాగం కుటుంబ అవసరాల కోసం సరుకులు మొదలైనవి కొని పెట్టుకున్నారు. మిగిలిన డబ్బు వడ్డీకి ఇవ్వడం షేర్లు కొనడం ఆస్తులు కొనడం మొదలైన విధాలుగా పెట్టుబడులు పెట్టుకున్నారు.


ఈ కథలో తాత పాతి పెట్టిన నిధి సంచితము.  కుటుంబ అవసరాల కోసం వీళ్లు సరుకులు కొనుక్కుని పెట్టింది వీళ్ళు తమ ఆదాయం లో నుంచి తమ జీవిత కాలంలో ఖర్చు చేసుకున్నది ప్రారబ్దము. నిధి లో ఉన్న మిగిలిన సంపద వీళ్లకు సంబంధించినంత వరకూ అనారబ్దము. అప్పుల మీద వచ్చే వడ్డీ లోనుంచి, షేర్ల మీద వచ్చే ఆదాయము లోనుంచి, వచ్చిన అద్దెల లోనుంచి, వీళ్ల ఖర్చులు పోను, వీళ్ళు మిగిలించి పిల్లలకు అంటే మనవళ్లకు ఇచ్చేది ఆగామి. 


వీళ్ళ పిల్లల దగ్గరికి (మనవళ్లకు) వచ్చేటప్పటికి నిధిలో మిగిలినదీ, తమ తండ్రులు సంపాయించి ఖర్చు పెట్టకుండా తమకు ఒప్ప చెప్పినదీ, రెండూ కలిసి మళ్లీ సంచితము అవుతుంది.


తాత పూర్వజన్మ అనుకోండి వీళ్లు ఇప్పటి జన్మ. వీళ్ళ పిల్లలు తర్వాత జన్మ. ఇలా అనుకుంటే పైన చెప్పిన ఉదాహరణ సులభంగా అర్థమవుతుంది.


*హిందూ మతం చెప్పేది ఏమిటంటే సంచితాన్ని, ఆగామిని రెండిటినీ నాశనం చేసుకోవచ్చు. కానీ ప్రారబ్దము నుంచి  తప్పించుకోవడానికి వీలుపడదు. కర్మ భక్తి జ్ఞాన మార్గాలు మూడూ ఇదే చెప్తాయి. తేడా లేదు.*


 కర్మక్షయం ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.


*పవని నాగ ప్రదీప్.*


తరువాయి భాగం..రేపు...

*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏* *14.ఋభు మహర్షి* ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు . అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట . ఈయనకి పూర్వజన్మ జ్ఞానం ఉంది . అసలు ఋభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నాడు . అదేంటో తెలుసా ? వచ్చే జన్మలో నేను ఋభువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం , గొప్ప తత్త్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని , వత్సమహర్షి ఆ జన్మ అయిపోయాక ఋభువు అనే పేరుతో మళ్ళీ పుట్టాడు . భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు . చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు . గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋభువు సరేనన్నాడు . నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు . ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు ఋభువు . ఒకనాడు ఋభు మహర్షి శిష్యుణ్ణి చదువు అయిపోయింది వెళ్ళి పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అన్నాడు . నిదాఘుడు పెళ్ళి చేసుకుని యజ్ఞాలు , యాగాలు , జపాలు , తపస్సు , అతిధులకి సేవచేస్తూ , గురువుని పూజిస్తూ కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . ఒకరోజు అయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు .. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు . నాకు అన్నం తినాలని లేదు . ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు . నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు . మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా ! ఆకలి తీరిందా ? భోజనం బాగుందా ? అనడిగాడు . ఆకలి వున్నవాడికి ఆకలి తీరిందా ? లేదా ? తెలుస్తుంది . నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు . భోజనము రుచిగా ఉందా ? లేదా ? అనేది దేహానికి సంబంధించింది . మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది . ఏది రుచి ఏది రుచి కాదు , నువ్వు , నేను ఇల్లాంటివన్నీ విడిచి పెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు . నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు . ఆ మహర్షి నా పేరు బుభుడు . నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది . అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు . ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . మళ్ళీ ఋభు మహర్షి శిష్యుడు ముందు ఉన్న నగరానికి వచ్చాడు . నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు , పండ్లు మొదలయినవి పట్టు కోస్తూ దార్లో నడవడానికి వీలపక ఒకచోట కూర్చున్నాడు . ఋభుమహర్షి నిదాఘుట్టి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు . శిష్యుడికి మళ్ళీ మామూలే . గురువుగార్ని గుర్తుపట్టలేదు . నడుస్తుంటే రాజబలగం అడొచ్చింది , అందుకే ఆగానన్నాడు . గురువు మళ్ళీ అడిగాడు . ఇందులో రాజెవరు ? బలం ఎవరు ? అని . శిష్యుడు అది కూడ తెలియదా ! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు . గురువు గారు ఊరుకోలేదు . రాజెవరు ? ఏనుగెవరు ? అన్నాడు . శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు , క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు . గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు . పైన అంటే ఏమిటి ? క్రింద అంటే ఏమిటి ? అన్నాడు . ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు . ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు . గురువుగారు ఇంకా వదలదల్చుకోలేదు శిష్యుణ్ణి . నువ్వంటే ఎవరు ? నేనంటే ఎవరు ? అన్నాడు . శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాలమీద పడి మహాత్మా ! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా..మిమ్మల్ని గుర్తించలేదు . క్షమించండి అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను . నీకేమయినా సందేహాలుంటే అడుగు . ఇంక రాను అన్నాడు . శిష్యుడు మహాత్మా ! ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు . ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో . సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ , చేసేది నువ్వు . కనుక నువ్వనేది లేదు . ఆత్మ ఒక్కటే సత్యం . ఆత్మ అంటే నేనే . భగవంతుణ్ణి కూడ నేనే . నాకు చిత్తము లేదు కాబట్టి చింత లేదు , దేహం లేదు కనుక రోగం లేదు , పాదాలు లేవు కనుక నడక లేదు , చేతులు లేవు కనుక పనులు లేవు , రోగం లేదు కనుక చావు లేదు , బుద్ధి లేదు కనుక సుఖం లేదు , శుభం లేదు అశుభం లేదు , భయం లేదు , బంధాలు లేవు , మోక్షము లేదు , ఉన్నది ఒక్కటే , అదే పరబ్రహ్మం . లోకమంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడ అదే ఆ పరబ్రహ్మ గురించే కదా ... అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడికి ఇంకా ఇలా చెప్పాడు . మాటలతో చెప్పడం , మనస్సుతో చింతించడం , బుద్ధితో నిశ్చయించడం అన్నీ మిథ్య , శాస్త్రాల వల్ల చెప్పబడింది , కళ్ళతో చూస్తున్నది . చెవులతో వింటున్నదీ అన్నీ మిథ్యే . నాది నీది , నాకు - నీకు , నాకోసం - నీకోసం అనుకోవడం కూడ మిథ్యే అని చెప్పాడు . నిదాఘుడు స్వామీ ! మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది . కానీ , ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు . ఋభువ మహర్షి వత్సా ! ఈ శరీరం మాయచే కప్పబడింది . మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది . నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది . పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు . ఆత్మే పరబ్రహ్మం . దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి . ఏది పరబ్రహ్మ స్వరూపమో , ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో , ఏది నిత్యమో అదే నేను . బ్రహ్మము నేను , నాలోంచే అన్నీ పుడుతున్నాయి . నశిస్తున్నాయి . నేనే విశ్వమంతా ఉన్నాను . కళ్ళు లేకపోయినా చూడగలను , చెవులు లేకపోయినా వినగలను , నాకు పాపము లేదు , చావు లేదు , వేరే జన్మము లేదు , నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే . నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత ? అంతా నేనే వేరే ఏమీ లేదు . నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా ... దాని గురించి నీకు ఆలోచన ఎందుకు ? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో . అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది . అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు . నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో , దానికి మార్గం భగవన్నామం భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి , ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు . శిష్యుడికి గురవెంత ముఖ్యమో , గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం . గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు . చూశారా ! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ , జ్ఞానం , మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో ! అదే ! గురశిష్య సంబంధం , తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్న కూడా పవిత్రయిందన్నమాట ! *14.ఋభు మహర్షి* *Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*14.ఋభు మహర్షి*


ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు . అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట . ఈయనకి పూర్వజన్మ జ్ఞానం ఉంది . అసలు ఋభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నాడు . అదేంటో తెలుసా ? వచ్చే జన్మలో నేను ఋభువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం , గొప్ప తత్త్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని , వత్సమహర్షి ఆ జన్మ అయిపోయాక ఋభువు అనే పేరుతో మళ్ళీ పుట్టాడు . భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు . చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు . గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋభువు సరేనన్నాడు . నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు . ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు ఋభువు . ఒకనాడు ఋభు మహర్షి శిష్యుణ్ణి  చదువు అయిపోయింది వెళ్ళి పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అన్నాడు .


నిదాఘుడు పెళ్ళి చేసుకుని యజ్ఞాలు , యాగాలు , జపాలు , తపస్సు , అతిధులకి సేవచేస్తూ , గురువుని పూజిస్తూ కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . ఒకరోజు అయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు .. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు . నాకు అన్నం తినాలని లేదు . ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు . నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు . మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా ! ఆకలి తీరిందా ? భోజనం బాగుందా ? అనడిగాడు . ఆకలి వున్నవాడికి ఆకలి తీరిందా ? లేదా ? తెలుస్తుంది . నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు . భోజనము రుచిగా ఉందా ? లేదా ? అనేది దేహానికి సంబంధించింది . మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది . ఏది రుచి ఏది రుచి కాదు , నువ్వు , నేను ఇల్లాంటివన్నీ విడిచి పెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు . నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు . ఆ మహర్షి నా పేరు బుభుడు . నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది . అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు . ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి . మళ్ళీ ఋభు మహర్షి శిష్యుడు ముందు ఉన్న నగరానికి వచ్చాడు . నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు , పండ్లు మొదలయినవి పట్టు కోస్తూ దార్లో నడవడానికి వీలపక ఒకచోట కూర్చున్నాడు . 


ఋభుమహర్షి నిదాఘుట్టి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు . శిష్యుడికి మళ్ళీ మామూలే . గురువుగార్ని గుర్తుపట్టలేదు . నడుస్తుంటే రాజబలగం అడొచ్చింది , అందుకే ఆగానన్నాడు . గురువు మళ్ళీ అడిగాడు . ఇందులో రాజెవరు ? బలం ఎవరు ? అని . శిష్యుడు అది కూడ తెలియదా ! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు . గురువు గారు ఊరుకోలేదు . రాజెవరు ? ఏనుగెవరు ? అన్నాడు . శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు , క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు . గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు . పైన అంటే ఏమిటి ? క్రింద అంటే ఏమిటి ? అన్నాడు . ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు . ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు . గురువుగారు ఇంకా వదలదల్చుకోలేదు శిష్యుణ్ణి . నువ్వంటే ఎవరు ? నేనంటే ఎవరు ? అన్నాడు . శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాలమీద పడి మహాత్మా ! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా..మిమ్మల్ని గుర్తించలేదు . క్షమించండి అన్నాడు .

ఋభు మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను . నీకేమయినా సందేహాలుంటే అడుగు . ఇంక రాను అన్నాడు . శిష్యుడు మహాత్మా ! ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు . ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో . సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ , చేసేది నువ్వు . కనుక నువ్వనేది లేదు . ఆత్మ ఒక్కటే సత్యం . ఆత్మ అంటే నేనే . భగవంతుణ్ణి కూడ నేనే . నాకు చిత్తము లేదు కాబట్టి చింత లేదు , దేహం లేదు కనుక రోగం లేదు , పాదాలు లేవు కనుక నడక లేదు , చేతులు లేవు కనుక పనులు లేవు , రోగం లేదు కనుక చావు లేదు , బుద్ధి లేదు కనుక సుఖం లేదు , శుభం లేదు అశుభం లేదు , భయం లేదు , బంధాలు లేవు , మోక్షము లేదు , ఉన్నది ఒక్కటే , అదే పరబ్రహ్మం . లోకమంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడ అదే ఆ పరబ్రహ్మ గురించే కదా ... అన్నాడు . ఋభు మహర్షి నిదాఘుడికి ఇంకా ఇలా చెప్పాడు . మాటలతో చెప్పడం , మనస్సుతో చింతించడం , బుద్ధితో నిశ్చయించడం అన్నీ మిథ్య , శాస్త్రాల వల్ల చెప్పబడింది , కళ్ళతో చూస్తున్నది . చెవులతో వింటున్నదీ అన్నీ మిథ్యే . నాది నీది , నాకు - నీకు , నాకోసం - నీకోసం అనుకోవడం కూడ మిథ్యే అని చెప్పాడు .


 నిదాఘుడు స్వామీ ! మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది . కానీ , ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని అడుగుతున్నాను చెప్పండి అని అడిగాడు . ఋభువ మహర్షి వత్సా ! ఈ శరీరం మాయచే కప్పబడింది . మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది . నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది . పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు . ఆత్మే పరబ్రహ్మం . దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి . ఏది పరబ్రహ్మ స్వరూపమో , ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో , ఏది నిత్యమో అదే నేను . బ్రహ్మము నేను , నాలోంచే అన్నీ పుడుతున్నాయి . నశిస్తున్నాయి . నేనే విశ్వమంతా ఉన్నాను . కళ్ళు లేకపోయినా చూడగలను , చెవులు లేకపోయినా వినగలను , నాకు పాపము లేదు , చావు లేదు , వేరే జన్మము లేదు , నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే . నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత ? అంతా నేనే వేరే ఏమీ లేదు . నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా ... దాని గురించి నీకు ఆలోచన ఎందుకు ? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో . అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది . అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు . నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో , దానికి మార్గం భగవన్నామం 


భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి , ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు .  శిష్యుడికి గురవెంత ముఖ్యమో , గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం . గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు . చూశారా ! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ , జ్ఞానం , మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో ! అదే ! గురశిష్య సంబంధం , తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్న కూడా పవిత్రయిందన్నమాట !  

*14.ఋభు మహర్షి*

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

సమస్త వేద వాఙ్మయం

 సమస్త వేద వాఙ్మయం మనిషి, జీవ ఆవిర్భావ మును తెలుపు చున్నది. నమకం, చమకం దశ,శాంతులు మంత్ర పుష్పం, పురుష సూక్తంతో సమస్త వేద ఉపనిషత్ సారము శక్తితో గల పదార్ధ నిరూపణకు సూత్ర పరంగా వివరించినది. అవి సూత్రములే తప్ప మరేమియు కాదు. సమస్త ప్రకృతి శక్తి లక్షణ సారమే జీవుడు దేహము. తేడాలు ఎందుకంటే రూప, లింగ, వర్ణ, కాల, ప్రకృతి, యే వివిధ రూపములుగా కనబడుట. జీవులు కూడా విభిన్నమైన మనస్తత్వములు కలిగియుండుట. చ మే మన శరీరముతో కలిగియున్న పదార్ధ రూప శక్తియే శివ తత్తవం. జీవ తత్వం. రోజూ లింగారాక్షన సాలగ్రామ రూపములో సాధనా తత్వము, దేహమును ఆశ్రయించియున్న గుణములను తెలియుటకై. పదార్ధము మార్పు చెందుతున్నది, దానియందు శక్తి యున్నట్లు, మన దేహము కూడా. అట్టి దేహమును కాపాడుటకు నియమిత మార్గంలో దేహమును బుధ్జిని ప్రగృతికి అనుగుణంగా స్థిరమైన భావముతో ప్రవర్తింప చేయుటయే. శంచమే మన దేహము ఈశతత్వమును పూర్ణముగా తెలుపు చున్నది. అది మనస్సు రూపమున సోమాయచ,చంద్ర లక్షణముగా మారి తెలుపుచున్నది. మనస్సు వకరూపంలేదు. అది శక్తియే. బుధ్దికి కూడా రూపం లేదు. కాని దాని మూలతత్వమైన చంద్రునికి, సూర్యునికి గోళాకృతితోగల  చైతన్యం కలదని దానివలన శక్తికి మార్పు చెందుతున్న లక్షణము. యిది ప్రకృతికి ఆధారభూతమై యున్నదని మనం భావించు చున్నాము. మనం మనకి స్నానము చేయుట వలన బాహ్య, అంతర శుచి ఏలాగునో అదే సూత్రము లింగమునకు అభిషేక రూపము వలన ప్రకృతిని సమ తుల్యత చేయుటకే. దీనికి కాలానుగుణంగా 12 నెలలకు 12 ఆదిత్యులు మాఘ మాసమునకు సూర్యుని పేరు. అర్కయని పేరు. అర్క శక్తిని జిల్లేడు ద్వారా దీనికి రేగుపండును చేర్చిన అర్క శక్తిని భౌతికంగా తెలియవచ్చును. రేగుపండును అనంత శక్తి ఆశ్రయించి యున్నది. దీనిలో యున్న శక్తి 6 రోజుల ఆహార శక్తితో అదియును మాఘ మాసములో మాత్రమే.తపస్సుకు సమతుల్యత ఆహారమునకు రేగు పండు స్వీకరించుట కలదు. వివిధ రూపములలో ఆహారం దొరకని సమయంలో రేగు పండును ఆహారమునకు సమానంగా ఔషధ పరంగా కూడా సమానం. మనలో క్షద్భాదనుధైనికి కారణమైన ఉష్ణ మును రేగు పండు సమతుల్యతను చేయుట. ఉపవాస దీక్షకు యిదికూడా వక ఆహార ప్రత్యామ్నాయం. యిక మాఘమాసంలో శతభిషంతో రాహువుతో మాసం ప్రారంభమై మఘతో కేతువుతో పూర్ణముగా లక్షణము పౌర్ణమి తో భూమి శక్తిని గ్రహించును.దీనివలన భూమిపై అంతవరకూ యున్న శీతలస్థితి నుండి ఉష్ణ శక్తిని ప్రకృతి గ్రహించి మానవ జీవనమునకు సూత్రపరమైన సంబంధం. దీని రంగు లక్షణము 🔴. సప్తమికి అర్ధ భాగంలోగల కాంతిని కృత్తిక నాటికి రధసప్తమి నాటికి జీవచైతన్యకారణమై యుండి పౌర్ణమికి పూర్తి శక్తి లభించును.మాఘ పౌర్ణమి శక్తి వలన అనంతమైన శక్తిని భూమి గ్రహించుట, యిది జీవ వ్యాప్తికి కారణమగును. అందుకే చిన్న పిల్లలుకు రేగు పళ్ళుతో భోగి పండుగనాడు సమస్త జనులకు జిల్లేడుతో కూడిన రేగు పళ్ళ స్నానం రధ సప్తమికి జీవ చైతన్యశక్తికి మూలకారణం.మాఘమాసంలో ఏ ఆరాధనలోనైనా ఎరుపు వర్ణ పుష్పములుతో  అనగా అర్చన చేయుటయే జీవునికి చైతన్య లక్షణము. యిలా అన్ని నెలలో ప్రతీ శక్తిని రూపములలో మానవ జీవనమునకు 12 నెలలు ప్రకృతి రూపంగా  వక్కొక్క నెలలో వక్కొక్క రూప నామ,లింగ, వర్ణ, రస,రంగులు కలిగి అర్చన చేయుట. అట్టి పదార్ధములను ఎక్కువగా స్వీకరించుట. వక్కొక్క నెలలో వక్కొక్క పేరుతో అభిషేక ప్రక్రియ.జిళ్ళేడు పూవులు కూడా అర్చన శివునికి.దీనిలో యు వి రేస్ అతినీలలోహిత శక్తి అధికంగా కలిగియుండుటవలన దానిని నీటితో శుద్ది చేసి అర్చించుటవలన దాని శక్తి మనకు కూడా. దీని వివరణ పూర్తి శక్తిని ప్రకృతి నుండి మాత్రమే స్వీకరించుటయనే జీవ లక్షణమునకు సంబంధించినది.ప్రకృతిలో అంతవరకూ యున్న వాత శక్తిని హరించి ఉష్ణ శక్తిని స్వీకరించుటయనే ప్రక్రియ. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం. 

.