4, డిసెంబర్ 2023, సోమవారం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                  🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ సప్తమి - మఘా -‌ ఇందు వాసరే* *(04-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/hk0GqxKwnqU?si=em13zy2jGpC6vilb


🙏🙏

 !!!!! ఆలోచనాలోచనాలు !!!!!        (కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు!)        -------- O' GOD! --------.           Correct us when we are wrong,.                         Encourage us when we are 'right.'.                   Support us when we are in need.                        We do not seek bouquets too only.                We don't mind brickbats too---.                When we deserve ( them)----.                            ----- Repeat good acts.-----.                             As a horse when he has run, A dog when he has caught the game, A bee when it has made its honey, So a man when he has done a good act, does not call out for others to come and see, but he goes on to another act, as wine goes on to produce again the grapes in season. ---- Marcus Aurelius.                             ------ Where is life? ------.   Where is life? We have lost in living.                       Where is the wisdom? We have lost in knowledge.                       Where is knowledge?  We have lost in information.                     The cycles of Heaven in twenty centuries bring us farther from 'GOD' nearer to the 'Dust.' ---- T.S.Illiet.        -------Foot prints -------.        Lives of great men all remind us.                        We can make our lives sublime,.                  And, departing , leave behind us.                        Foot prints on the sands of time.                  Foot prints that perhaps another.             Sailing over life's solemn main,.                   A forlorn and ship wrecked brother,.             Seeing shall take heart again. ---- H. W. Longfellow.                        ---- The greatest things ----.                                         The best day--- Today.     The greatest sin --- Fear.                                   The best gift ---- Forgiving.                           The meanest feeling ---- Jealousy.                       The greatest need ---- Common sense.              The greatest teacher ---- One who makes you want to learn.              The best part of anyone's religion ---- Tolerance.                          Dt 11-- 12-- 2023, Monday.

 🕉️ *శివునికి సోమ‌వార‌మే ఎందుకు?* 🕉️


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


శివున్ని పూజించే భ‌క్తులంతా సోమ‌వారం రోజున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జం.

ఆ రోజునే ఉప‌వాసం ఉంటారు చాలామంది.ఎందుక‌ని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.


చంద్రుని ధరించినవాడు శివుడు. 

చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు. 

చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. 

అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.


ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! ఆ విధంగా సోమవారం శివునికి 

ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. 


స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.


సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెబుతారు. 


స్కాందపురాణం సోమవారవ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. 


నలదమయంతుల మనుమడు చంద్రాంగదుడు , అతడు చిత్రకర్మ కుమారై సీమంతినిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లోసుఖంగా గడిపాడు. ఓరోజు యమునా నదిలో మిత్రులతో నౌకావిహారం చేస్తూ పెద్దగాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు.అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి దైర్యంచెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవారవ్రతం చేయమని ప్రోత్సహించింది. అమె వ్రతం ఆరంభించింది. నౌకాప్రమాదంలో నీళ్ళలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు. అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయవిధేయతలకు మెచ్చి, కానుకల్చి, నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడిచ్చి సాగనంపాడు అప్పటికి భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. భార్య వ్రతదీక్షలో ఉంది.  పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారాలలో చేస్తే సత్ఫలితాన్నిస్తుంది...🚩


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


 

 https://youtube.com/shorts/sXpZW7Skls8?si=uQ6yvX64LptFQ14C


 *మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పు డైనా ఆలోచించారా………?*


గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది…….. ఎప్పుడైనా ఆలోచించారా………? మైదా పిండి ఎలా వస్తుంది???? అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ? గమనిద్దాం. 


మైదా వంటకం.. అబ్బో రుచిలో అమోఘం… మైసూరు బజ్జి, మైదాతో చేసిన పునుగులు, సమోసాలు, బ్రెడ్, బన్, కేక్.. అబ్బో… చెప్పుకూంటూ పోతే మైదా లేని వంటకం, జిహ్వ చాపల్యాన్ని తీర్చగలదా?


నోటి రుచి తీరాలంటే మైదా ఉండాల్సిందే… అంతగా వినియోగమవుతున్న మైదా గురించి కళ్లు తిరిగే నిజాలు చాలా మందికి తెలియవు. తెలిస్తే ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే దీనికి దూరంగా ఉండడం ఖాయం..!


మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.

అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్.

కొన్ని దేశాలలో, ఈ బ్రోమేట్ను కొన్ని రకాల క్యాన్సర్ కి కారకమని భావించి, దానిపై నిషేధం విధించారు. మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే, అవి తక్షణమే మరణిస్తాయి. మైదాపిండి అనేది సహజమైన క్రిమి-సంహారకారిగా ఉంటూ, తినే కీటకాలను వెంటనే చంపుతుంది. …

మైదాలో ఉండేది బూడిదే…


మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు.

మైదా వినియోగం ఆరోగ్యకరం కూడా కాదు.

ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఉంటుంది. మైదాను ద మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. ప్రతి ఒక్కరూ పరోటా తినడాన్ని ఇష్టపడతారు. గోధుమలతో చేసిన పరోటా తినడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. కానీ మైదాతో చేసింది తింటే మాత్రం కష్టమే. గోధుమలో ఫైటోకెమికల్స్, ఫైబర్ , బీ, ఈ విటమిన్లు ఉంటాయి. మైదాకు వచ్చే సరికి గోధుమల బయటి భాగాన్ని తొలగిస్తారు. లోపలి ఉండేది స్టార్చ్ మాత్రమే. నిజానికి ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. కానీ మనం కొనే మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా…?


ప్రమాదకరమైన కెమికల్స్ తో బ్లీచింగ్


గోధుమల్లోపలి భాగాన్ని పిండిగా మారిస్తే అది ఎల్లో రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా మార్చేందుకు గాను బ్లీచ్ చేస్తారు. ఇందుకోసం పెరాక్సైడ్ ను వాడతారు.

ఈ ద్రావకాన్ని హాస్పిటల్స్ లో గాయాలు క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. బెంజిల్ పెరాక్సైడ్ మొటిమల నివారణకు వాడే క్రీముల్లో ఉండే కెమికల్. దీనితో పాటు, క్లోరిన్ గ్యాస్ ను కూడా మైదా పిండిని తెల్లగా మార్చేందుకు ఉపయోగిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో నిషేధం… ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ను మెజారిటీ యూరోపియన్ దేశాలు, అమెరికా నిషేధించాయి.

ఇక మైదా సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపించేందుకు అల్లోక్సాన్ అనే కెమికల్ ను వాడతారు. ఇది రక్తంలో ఉన్న షుగర్ పై ఫైట్ చేస్తుంది. షుగర్ ఎక్కువైతే ఇన్ ఫ్లమేషన్ మార్పులు జరిగి ఆర్థరైటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయి. అల్లోక్సాన్ కెమికల్ అంత్యంత ప్రమాదకరం. ఇది పాంక్రియాస్ లోని బీటా కణాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) బారినపడతారు.

అల్లోక్సాన్ ను కలపడం వల్ల మైదా సాఫ్ట్ గా మారుతుంది.


గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.


మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు. మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.


శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?

మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే..

మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటాం

మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…


మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి.

అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి. సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. ఆల్సర్ , గ్యాస్త్రిక్ సమస్యలు కలిగిస్తాయి. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి. మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే. స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి. మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే. స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు. ఆ ఫుడ్స్ తినాలనిపించదు.

ప్రయోగశాలల్లో జంతువులపై ప్రయోగించేది…

ఇన్సులిన్ పనితీరును పరీక్షించేందుకు వీలుగా వైద్యులు అల్లోక్సాన్ కెమికల్ ను ప్రయోగశాలల్లో ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెడతారు. అవి మధుమేహం బారిన పడిన తర్వాత అప్పుడు మధుమేహ నియంత్రణ మందులను వాటిపై ప్రయోగించి ఫలితాలను చూస్తారు. మైదా ఉత్పత్తిలో ఉపయోగించే బెంజాయిక్ పెరాక్సైడ్ ను వస్త్ర కర్మాగారాల్లో ఉపయోగిస్తుంటారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కే.రాజేంద్రన్ అనే వ్యక్తి మైదాలో విషపూరిత కెమికల్స్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ 2016 మార్చిలో మద్రాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అల్లోక్సాన్, బెంజాయిక్ పెరాక్సైడ్, క్లోరిన్ ఆక్సైడ్ లను వాడుతున్నట్టు పిటిషనర్ ఆరోపణ. క్లోరిన్, బెంజాయిక్ పెరాక్సైడ్ లను అమెరికాలో నిషేధించారని, మైదాను బ్లీచ్ చేయడం వల్ల పోషక విలువలు, ఫైబర్ నశించిపోతాయని…. తెల్లగా మార్చడం అన్నది చాలా ప్రమాదకరమని, బ్లీచ్ డ్ మైదాను స్లో పాయిజన్ అని డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని రాజేంద్రన్ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. అల్లోక్సాన్ అనేది ఔషధ ప్రయోగ శాలల్లో ఎలుకల్లో మధుమేహం తీసుకొచ్చేందుకు ఉపయోగించే రసాయనంగా కోర్టుకు వివరించారు.

దీంతో ఈ విషయమై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

గోధుమలో ఏముంటాయి?


గోధుమ గింజలో పైన ఉండేది పొట్టు భాగం. దీన్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. తర్వాతి పొర జెర్మ్ భాగంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా గింజలో ఎక్కువ భాగం ఉండేది ఎండోస్పెర్మ్. దీన్నే మైదాగా పేర్కొంటారు. ఇందులో ఎటువంటి పోషకాలు ఉండవు. కార్బొహైడ్రేట్లు, షుగర్ ఎక్కువగా ఉంటాయి. మిల్లులో గోధుమలను పిండిగా కొట్టిన తర్వాత దాన్ని జల్లెడ పడతారు. ఈ జల్లెడలోనే మైదాను వేరు చేసే అతి సన్నని రంధ్రాలతో కూడిన వాటిని ఉపయోగిస్తారు. దీంతో ఫైబర్ సమృద్ధిగా ఉండే గోధుమ పై భాగం అంతా జల్లెడలోనే ఆగిపోయి ఎండోస్పెర్మ్ భాగం మాత్రం కిందకు దిగుతుంది. ఇందులో మూడొంతులు పోషకాలు తగ్గిపోయినట్టే అనుకోవాలి. ఇక దీన్ని మరింత తెల్లగా మార్చేందుకు కెమికల్స్ తో బ్లీచ్ చేస్తే అవి కూడా నశించిపోతాయి. దాంతో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.


వీటితో చాలా డేంజర్


పెట్రోలియం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అనే ఉత్పత్తులు తయారవుతాయన్న విషయం తెలుసు. పెట్రోలియం నుంచి ఈ ఉత్పత్తులను వేరు చేసిన అనంతరం మిగిలే మినరల్ ఆయిల్ కు పెద్దగా వాసన ఉండదు. దీన్ని ఏదైనా ఆహార పదార్థం తయారీలో వాడినా దీర్ఘకాలం పాటు పాడవకుండా ఉంటుంది. అదే కొబ్బరి నూనెతో చేసి చూడండి. రెండు మూడు రోజుల తర్వాత అది వాసన వస్తుంది. సహజంగా ఏ ఆహార పదార్థంలోనయినా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కానీ, మినరల్ ఆయిల్ లో చేసిన ఆహార పదార్థంలో బ్యాక్టీరియా మనలేదు. దీన్ని బట్టి ఇది ఎంత పవర్ పుల్ అనేది తెలుసుకోవచ్చు. మన దేశంలో చాలా రకాల ఆహార పదార్థాలు అజినోమోటోతో తయారవుతున్నాయి.

ఇది రుచిని పెంచుతుంది.


ముఖ్యంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్, సూప్, మైదాతో తయారయ్యే ఉత్పత్తుల్లో అజినోమోటోను ఉపయోగిస్తున్నారు. చైనీస్ ఆహార పదార్థాల్లో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంది. అజినోమోటో ఉన్న ఆహారపదార్థాన్ని తిన్న తర్వాత తలనొప్పి వస్తే అది కచ్చితంగా ఆ రసాయన ప్రభావమని తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం.


బేకరీ ఉత్పత్తులతోనూ ముప్పే…


ఇక బేకరీ ఉత్పత్తుల్లో వాడే సోడియం మెటా బై సల్ఫేట్, బెంజాయిక్, సిట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనుషులకు తీవ్ర హాని కలిగించే రసాయనాలే. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులకు వీటితో మరింత ముప్పు. నిజానికి 90 శాతం బేకరీ ప్రొడక్ట్స్ కు మైదానే ముడి సరుకు. బేకరీ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ ను వాడుతుంటారు. అసలు అవి ఏమిటో, వాటితో వచ్చే హాని ఏమిటో చాలా మందికి తెలియని విషయం. కేక్ ఎంతో మధురం, పిజ్జా, బర్గర్, బన్ మంచి రుచి ఉన్నాయి కదా అని బేకరీ ప్రొడక్ట్స్ ను లాగించడం కాదు… అందులో మైదా, మినరల్ ఆయిల్, అజినోమోటో, ప్రిజర్వేటివ్స్, డాల్డా, శాక్రిన్, షుగర్ వంటి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచేవి ఉంటాయన్న స్పృహతో ఉండాలి. సాధ్యమైనంత వరకూ బేకరీ ప్రొడక్ట్స్, చైనీస్ ప్రొడక్ట్స్, మైదా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.


ఎన్నో ఆరోగ్య సమస్యలు


ముఖ్యంగా తరచూ మైదాతో తయారయ్యే వాటిని తినడం వల్ల కచ్చితంగా వారు ఊబకాయం, మధుమేహం, మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమ పిండిలో గ్లైడిన్ ఉంటుంది. ఇది ఆకలిని పెంచుతుంది. తద్వారా అధిక కేలరీలు చేరతాయి. మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. బరువు పెరుగుతారు. మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల చైతన్యం తగ్గిపోతుంది. ఫలితంగా మలబద్ధకం బారిన పడతారు. దీనివల్ల పైల్స్, ఫిషర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఫైబర్ లేకపోవడం వల్ల కోలన్ కేన్సర్ కూడా రావచ్చు. ఫైబర్, ప్రొటీన్ లేకపోవడం వల్ల గ్యాస్టిక్, అల్సర్, గాల్ బ్లాడర్ సమస్యల బారిన పడతారు. అధిక జీఐతో కూడిన వాటిని తిన్న తర్వాత రక్తంలో వెంటనే గ్లూకోజ్ కలిసిపోతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం మైదా ఉత్పత్తుల వినియోగం కొనసాగితే ఇన్సులిన్ ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతుంది. దీంతో టైప్2 డయాబెటిస్ బారిన పడతారు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఓ ఆహార ఉత్పాదన బ్లడ్ గ్లూకోజ్ పై చూపించే ప్రభావం. దీన్నే జీఐ వేల్యూగా చూపిస్తారు. అధిక జీఐ ఉంటే ఆహారంలోని గ్లూకోజ్ సత్వరమే రక్తంలో కలిసిపోతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. శరీరానికి కావాల్సింది పోను మిగిలినది అంతా కొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. కనుక జీఐ అధికంగా ఉండే రిఫైన్డ్ మైదా ఫ్లోర్ వాడకం వల్ల శరీరంలో కొవ్వు బాగా పెరిగి గుండె జబ్బుల బారిన పడతారు. అదే జీఐ తక్కువగా ఉన్న వాటిని తీసుకుంటే నిదానంగా గ్లూకోజ్ రక్తంలోకి విడుదల అవుతుంది. పండ్లు, కూరగాయలు, నట్స్, బీన్స్ లో జీఐ తక్కువ ఉంటుంది. ముడి గోధుమ, దంపుడు బియ్యంలో మధ్యస్తంగా జీఐ ఉంటుంది. మైదా, వైట్ రైస్ లో జీఐ అధికంగా ఉంటుంది

 🕉 మన గుడి : నెం 358





⚜ గుజరాత్ : మూలద్వారక


⚜ శ్రీ మూల్ ద్వారాకాదీశ్ మందిర్



💠 భారతదేశం అంతటా శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలు ఉన్నాయి. 

శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయాలలో ప్రత్యేక హోదాను పొందుతాడు. ద్వారక కృష్ణ భక్తులకు ప్రధాన మతపరమైన తీర్థ ప్రదేశం మరియు ఇది ప్రధాన చార్ధామ్ యాత్రా స్థలాలలో ఒకటి. విస్తృతంగా తెలియని విషయం ఏమిటంటే, ఒక ద్వారక మాత్రమే కాదు, ఇతర కృష్ణ ధామ్ లు కూడా ద్వారకలుగా పిలువబడతాయి, వాటిలో మూల ద్వారక ఒకటి.


💠 జునాగఢ్ జిల్లాలో ఈ క్షేత్రాన్ని మూల ద్వారక అని పిలుస్తారు.

శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ద్వారకకు వెళ్లడానికి ముందు కొంత కాలం ఇక్కడే ఉండిపోయారని భావిస్తారు.


💠 మూల్ అంటే మూలం లేదా మూలం. శ్రీకృష్ణుడు మధుర నుండి ద్వారకకు వెళ్ళినప్పుడు అతను మొదట మూల్ ద్వారకలో స్థిరపడ్డాడని నమ్ముతారు.

పురాణాల ప్రకారం, జరాసంధ మహారాజు తన కుమారులను చంపినందుకు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు మరియు యుద్ధం చేశాడు కానీ ఎల్లప్పుడూ ఓడిపోయాడు. 

అయితే, జరాసంధుడు భీముని చేతిలో చనిపోతాడని విధి నిర్ణయించినందున కృష్ణుడు అతనిని ఎన్నడూ చంపలేదు మరియు అతను ద్వారకకు వెళ్ళిపోయాడు.


💠 అతను ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఉన్న శిలాఫలకం మూల ద్వారకలో ఉంది.

ఇక్కడ ఉన్న ప్రదేశం మహాభారత కాలం నాటిదని నమ్ముతారు. 


💠 ఇక్కడ శిథిలావస్థలో ఉన్న దేవాలయం మరియు శ్రీకృష్ణుడు స్నానమాచరించినట్లు చెప్పబడే దగ్గరలో ఒక లోతైన బావి ఉంది. 

ఈ ఆలయంలో రాధా కృష్ణ, రామ సీత మరియు లక్ష్మీ నారాయణ, గణేశ మరియు  శివుని విగ్రహాలు మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి.


💠 పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లే మార్గంలో విసావదా గ్రామంలో పోరుబందర్‌లో ఆగాడు. 

విశావద (మూల్ ద్వారక)లో దాని జ్ఞాపకార్థం శ్రీకృష్ణుని "పాదుకా" (పాదముద్ర) ఈ ఆలయంలో చూడవచ్చు. 


💠 గ్రామంలో ప్రతి సంవత్సరం జనమాష్టమి ప్రత్యేక సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు. 


💠 ఇది రాంచోద్రయ్ అని కూడా పిలువబడే శ్రీకృష్ణుని పవిత్ర దేవాలయం.  

అనేక దేవాలయాలతో కూడిన క్యాంపస్ ఉంది.  అక్కడ శివుని ఆలయం కూడా ఉంది.  భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రాంచోద్రే స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.  

ఈ ప్రదేశాన్ని మూల్ ద్వారక అంటారు.  

అసలు ద్వారక అని అర్థం.


💠 శ్రీ కృష్ణ భగవానుడి పురాతన ఆలయం సముద్రానికి దగ్గరగా ఎత్తైన భూమిలో ఉంది.  ఈ చిన్న దేవాలయం శిథిలావస్థలో ఉంది. 

 ఈ మందిరం  10వ శతాబ్దానికి చెందినది మరియు గుజరాత్ ప్రభుత్వం ఈ ఆలయ సముదాయాన్ని భారీ స్థాయిలో పునరుద్ధరించాలని యోచిస్తోంది.


💠 కుశేశ్వర మహాదేవ్ ఆలయం లేదా సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయం, భీద్భంజన్ మహాదేవ్ ఆలయం మరియు ఖోడియార్ మాతాజీ ఆలయం సమీపంలో ఉన్నాయి.


💠 మూల్-ద్వారక సోమనాథ్ నుండి 45 కి.మీ.

 యమునానందము 


           మ:  ముదితా!  యేతటినీ  పయఃకణములన్  మున్   వేణువింతయ్యె   నా


                    నది,  సత్పుత్రునిఁ  గన్నతల్లి  పగిదిన్   నందంబుతో   నేఁడు     స


                   మ్మద   హంసధ్వని  పాటగా   వికచ  పద్మశ్రేణి   రోమాంచమై


                  యొదవన్  తుంగ తరంగ హస్త   నటనోద్యోగంబుఁ   గావింపదే.


                     

                    భాగవతము-  దశమస్కం-  778 పద్యం.  బమ్మెఱపోతన మహాకవి!


            

              అర్ధములు:  తటిని- నది; పయఃకణములు-నీటితుంపురులు;  వేణువు- వెదురు  (కృష్ణుని చేతిలోని మురళి ) పద్మశ్రేణి-తామరపూల సముదాయము; రోమాంచము-పులకలు; తుంగ-ఎత్తయిన; తరంగములు-కెరటములు;  నటనోద్యోగంబు- నాట్యమాడు ప్రయత్నము;


                      భావము: కృష్ణయ్య  బృందావనంలో  యమునాతీరంలో  భువన  మోహనంగా  వేణువు  నూదుతున్నాడు. అదిచూచి యమునానది  ఆనంద నాట్యం  చేసేందుకు  ప్రయత్నిస్తున్నట్టు  ఉన్నదట! ఇంతకూ  యెందుకా ఆనందం? ఆకన్నయ్య  చేతిలో  ధరించిన  ఆవెదురు గొట్టము ,( అదే  ఆవేణువు  ) చిన్న మొలకగా  తన నదీతీరంలో మొలచి , తన నిరు త్రాగి , పెరిగి పెద్దదైనది. దానియదృష్టము యెంతగొప్పదో!  చెప్పరానిది. అదికన్నయ్య  హస్తమునలంకరించు  భాగ్యమును పొందినది. అందువలన యమునకు  సత్పుత్రుని  గన్నతల్లివలె  మనమందు ఆ నందము  నిండిపోయినది. (ఆనందవశమున శరీరమున పులకలు మొలచుట యును

నాట్యమాడుకోరికయును గలుగుట సహజము.) యమునానదికిగూడ  పద్మ  సముదాయములను పులకలు గలిగినవి. నదిలో కెరటములుగాలికి పైకెగసిపడుచున్నవి.

అవి యామెకు  హస్తములవలెనైనవి. ఆ యానంద సమయమున  నీప్రయత్నములతో  యమున  నాట్యమాడ  ప్రత్నంచు

వనితవలెఁ  గన్పడుచున్నదట!


                        చూచితిరా?  పోతన చిత్రించిన  యమునానందమును 


                      చైతన్య రహితమైన  ప్రకృతియంతయు  సచేతనమై  పరవశించుచున్న దన్నమాట!


                       ఆహా!  కన్నయ్యా!  యెంత భువన మోహనముగా  మురళిని  మ్రోగించినావయ్యా.!   నీమురళీ రవళి  పోతనగారి  చెవిని బడినది గాబోలును. ఆయన పరవశించి  భాగవత పాఠకుల  నెల్లరను  పరవశింపఁ జేసినాడు. నమోస్తు పోతన కవీంద్రా  నీకీర్తి యజరామర మగుఁగాక!


                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 *కార్తిక పురాణం - 22*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

కార్తిక పురాణం – 22వ అధ్యాయం


అత్రిమహాముని ఇట్లు పల్కెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణ్వాలయమునకు బోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిరుటాకులచేతను, దళములచేతను, షోడశోపచారపూజల చేతను హరిణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును జేసి హరిమూర్తిని బంగారముతో చేయింది ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తిక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ స్మరణ జేయుచు ప్రాతఃకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకారధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహ ధ్వనులు జేయుచు బాణ వర్షములను కురిపించుచు పూర్వమువలె జయింతమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోను, వజ్రముల వంటి కత్తులతోను, ఐరావతము వంటి ఏనుగుల తోను, ఆకాశమునకు ఎగురు గుర్రములతోను, త్వరగా నడిచెడి రథములతోను, అన్యోన్య జయ కాంక్షతో భయంకరమయిన సంకుల యుద్ధము జేసిరి. ఆయుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణి గూలి, బాణ శరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై రథ, గజ, సాది, పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు, రక్షించుడు అని ప్రార్థించుచుండిరి.

కాంభోజరాజు తన సైన్యమంతయు హతమగుట జూచి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్దమును చాలించి మిగిలిన సేనలతో తనపురమును జేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమొందెను. హరి అనుకూలముగా ఉండిన యెడల శత్రువు మిత్రమగును. అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును. ధర్మమే అధర్మమగును. కార్తికవ్రతమును జేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన యెడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణువు తేజోవంతుడు ఇది సత్యము. అందును కార్తిక వ్రతమునందు కోరిక యుండుట మరీ దుర్లభము గదా! కలియుగమందు హరిభక్తులై కార్తికవ్రాత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తిక వ్రతమును జేయుచు హరిభక్తి గలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి గలిగి కార్తిక వ్రాత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టి వానియందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛ గలిగెనేని హరిభక్తి చేయవలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును.

అగస్త్య మునీంద్రా! హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును. పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు సగరాదులు హరినాశ్రయించి పరమపదమొందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతము గలవారై తానూ స్వతంత్రుడైనను అన్య తంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలయును. హరిభక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును, సమస్ర చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తీ గలవానికి కార్తిక వ్రతము సులభమని తలచెదను. కార్తిక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావిచెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్రా! కాబట్టి కార్తిక వ్రతము ఇష్టార్ధములనిచ్చును. సర్వ వ్రతోత్తమోత్తమము. ఇది సర్వ శాస్త్ర సారము. సర్వవేద సమ్మతము. కార్తిక మహాత్మ్య బోధకమైన యీ అధ్యాయమును నిత్యమూ వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణి జేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన యెడల పితృ దేవతలకు కల్పాంతము వరకు తృప్తి గలుగును.

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే ద్వావింశాధ్యాయ స్సమాప్తః!!

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లో* 𝕝𝕝 *సంసారసాగర నిమజ్జన మహ్యమానం*

*దీనంవిలోకయ విభో కరుణానిధే మాం* |

*ప్రహ్లాదఖేద పరిహార పరావతార*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 11_* _


*తా*: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము

పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను

సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి

యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.. *లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.

 🕉 మన గుడి : నెం 358





⚜ గుజరాత్ : మూలద్వారక


⚜ శ్రీ మూల్ ద్వారాకాదీశ్ మందిర్



💠 భారతదేశం అంతటా శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలు ఉన్నాయి. 

శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయాలలో ప్రత్యేక హోదాను పొందుతాడు. ద్వారక కృష్ణ భక్తులకు ప్రధాన మతపరమైన తీర్థ ప్రదేశం మరియు ఇది ప్రధాన చార్ధామ్ యాత్రా స్థలాలలో ఒకటి. విస్తృతంగా తెలియని విషయం ఏమిటంటే, ఒక ద్వారక మాత్రమే కాదు, ఇతర కృష్ణ ధామ్ లు కూడా ద్వారకలుగా పిలువబడతాయి, వాటిలో మూల ద్వారక ఒకటి.


💠 జునాగఢ్ జిల్లాలో ఈ క్షేత్రాన్ని మూల ద్వారక అని పిలుస్తారు.

శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ద్వారకకు వెళ్లడానికి ముందు కొంత కాలం ఇక్కడే ఉండిపోయారని భావిస్తారు.


💠 మూల్ అంటే మూలం లేదా మూలం. శ్రీకృష్ణుడు మధుర నుండి ద్వారకకు వెళ్ళినప్పుడు అతను మొదట మూల్ ద్వారకలో స్థిరపడ్డాడని నమ్ముతారు.

పురాణాల ప్రకారం, జరాసంధ మహారాజు తన కుమారులను చంపినందుకు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు మరియు యుద్ధం చేశాడు కానీ ఎల్లప్పుడూ ఓడిపోయాడు. 

అయితే, జరాసంధుడు భీముని చేతిలో చనిపోతాడని విధి నిర్ణయించినందున కృష్ణుడు అతనిని ఎన్నడూ చంపలేదు మరియు అతను ద్వారకకు వెళ్ళిపోయాడు.


💠 అతను ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఉన్న శిలాఫలకం మూల ద్వారకలో ఉంది.

ఇక్కడ ఉన్న ప్రదేశం మహాభారత కాలం నాటిదని నమ్ముతారు. 


💠 ఇక్కడ శిథిలావస్థలో ఉన్న దేవాలయం మరియు శ్రీకృష్ణుడు స్నానమాచరించినట్లు చెప్పబడే దగ్గరలో ఒక లోతైన బావి ఉంది. 

ఈ ఆలయంలో రాధా కృష్ణ, రామ సీత మరియు లక్ష్మీ నారాయణ, గణేశ మరియు  శివుని విగ్రహాలు మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి.


💠 పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లే మార్గంలో విసావదా గ్రామంలో పోరుబందర్‌లో ఆగాడు. 

విశావద (మూల్ ద్వారక)లో దాని జ్ఞాపకార్థం శ్రీకృష్ణుని "పాదుకా" (పాదముద్ర) ఈ ఆలయంలో చూడవచ్చు. 


💠 గ్రామంలో ప్రతి సంవత్సరం జనమాష్టమి ప్రత్యేక సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు. 


💠 ఇది రాంచోద్రయ్ అని కూడా పిలువబడే శ్రీకృష్ణుని పవిత్ర దేవాలయం.  

అనేక దేవాలయాలతో కూడిన క్యాంపస్ ఉంది.  అక్కడ శివుని ఆలయం కూడా ఉంది.  భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రాంచోద్రే స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.  

ఈ ప్రదేశాన్ని మూల్ ద్వారక అంటారు.  

అసలు ద్వారక అని అర్థం.


💠 శ్రీ కృష్ణ భగవానుడి పురాతన ఆలయం సముద్రానికి దగ్గరగా ఎత్తైన భూమిలో ఉంది.  ఈ చిన్న దేవాలయం శిథిలావస్థలో ఉంది. 

 ఈ మందిరం  10వ శతాబ్దానికి చెందినది మరియు గుజరాత్ ప్రభుత్వం ఈ ఆలయ సముదాయాన్ని భారీ స్థాయిలో పునరుద్ధరించాలని యోచిస్తోంది.


💠 కుశేశ్వర మహాదేవ్ ఆలయం లేదా సిద్ధేశ్వర మహాదేవ్ ఆలయం, భీద్భంజన్ మహాదేవ్ ఆలయం మరియు ఖోడియార్ మాతాజీ ఆలయం సమీపంలో ఉన్నాయి.


💠 మూల్-ద్వారక సోమనాథ్ నుండి 45 కి.మీ.