7, మే 2022, శనివారం

ఆదిశంకరాచార్య జయంతి*_

 _*నేడు ఆదిశంకరాచార్య జయంతి*_

          


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*జగద్గురు ఆదిశంకరాచార్యులు*


హిందూ  మత  పరిరక్షణ  కొరకు  అవతరించిన  సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.



*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*

*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*


*ఆది శంకర జయంతి*


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల  ప్రగాఢ విశ్వాసం


*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*

*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)


*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*

*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*


శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)


జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.


ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం  గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 



☘  ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.


☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి

అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 


☘   ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.



☘   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


☘  ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.



☘   ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.



☘  ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.



☘  ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!

ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!



☘  ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.



☘  వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.



☘  హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


☘  గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.



☘  శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 



☘  ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.



*🌹మఠము-పీఠము🌹*



సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.


*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం  చేశారు* 


దేశంలో  నాలుగు  వైపుల  నాలుగు ప్రధానమైన  పీఠాల్ని  నెలకొల్పి దేశ సమగ్రత ను  ఆధ్యాత్మికతను కాపాడారు !!


*1 .తూర్పున  పూరీ  క్షేత్రంలో  గోవర్ధన  పీఠం రుగ్వేదం !!*


*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో  శారదా  పీఠం - యజుర్వేదం!!*


*3 - పశ్చిమాన ద్వారకలో  ద్వారక పీఠం - సామ వేదం !!*


*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*


నలుగురు శిష్యులను  నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.

*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని

రోజులు పీఠాన్ని అధిరోహించి  హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!

                        *చతుర్మఠాలు*



☘  *ద్వారకా మఠము :-*

ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 


☘  *గోవర్ధన మఠము:-*

దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో


☘  *శృంగేరీ మఠము :-*

ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది


☘  *జ్యోతిర్మఠము :-*

దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.


☘  *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.


🌳 *ఉన్నది ఒక్కటే  పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం    నుప్రభోధించారు  !!*  


🌳  *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో  వున్న వారికే ఈ  సత్యం  అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక  దేవీ  దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన  చేయమన్నారు !!*


🌳  *ప్రస్థాన త్రయం అంటే  భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*

*ఉపనిషత్తలు ! వీటికి  భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*


🌳  *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*


☘  ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

 

*శంకరులు :-*


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు

ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ

తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు

రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు

అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా

స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?

అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల

అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.



*" జయ  జయ  శంకర  హర  హర  శంకర "*

శంకర జయంతి ప్రత్యేకం -8

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం -8 

          ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )  


7. వివిధ స్తోత్రాలు 


      ఆదిశంకరులు వివిధ దేవతలని స్తుతిస్తూ అనేక స్తోత్రాలు అనుగ్రహించారు. 

     ఒక్కొక్క స్తోత్రం చివరిలో ఆ స్తోత్రంద్వారా ఆ దైవాన్ని స్తుతిస్తే పొందే ఫలాన్ని కూడా ఫలశ్రుతి పేరుతో తెలిపారు. 

     ఉదాహరణకి "రోగదోషాలు లేకుండానూ, సత్సంతానంతో అష్టైశ్వర్యాలు పొందుతారు" అనే ఫలశ్రుతితో గణేశ పంచరత్నాలు అందించారు. 


శారదా, లక్ష్మీ, పార్వతీ దేవతా స్తోత్రాలు 


    ఈ శక్తులకి సంబంధించి 

  - శ్రీ శారదాభుజంగ ప్రయాతాష్టకమ్, 

    కనకధారాస్తవమ్, 

    భ్రమరాంబాష్టకమ్, 

    అన్నపుర్ణాష్టకమ్, 

    శ్రీ త్రిపురసుందర్యష్టకమ్, 

    శ్రీరాజరాజేశ్వరష్టకమ్, 

    లలితాపంచరత్నం, 

    మహిషాసురమర్దనీ స్తోత్రమ్, 

    సౌందర్యలహరి వంటివి - వివిధ ఫలితాలు పొందేలా, స్త్రీమూర్తులను స్తుతిస్తూ స్తోత్రాలు అనుగ్రహించారు. 


విష్ణు సంబంధిత స్తోత్రాలు 


     వివిధ అవతారాలతో సహా విష్ణు సంబంధ స్తోత్రాలు అనేకం వారు అందించారు. 

  - నారాయణ స్తోత్రమ్, 

    గోవిందాష్టకమ్, 

    అచ్యుతాష్టకమ్, 

    శ్రీకృష్ణాష్టకమ్, 

    పాండురంగాష్టకమ్, 

    శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్, 

    శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్ అనేవి వాటికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు. 


శివునికి సంబంధించిన స్తోత్రాలు 


  - భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలనీ పేర్కొన్న  ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రమ్, 

    శివ పంచాక్షరీ నక్షత్రమాలా స్తోత్రమ్, 

    శివానందలహరి, 

    శివభుజంగ ప్రయాత స్తోత్రమ్, 

    దక్షిణామూర్తి స్తోత్రమ్, 

    ఆదిదంపతులకి సంబంధించి ఉమామహేశ్వర స్తోత్రమ్,  అర్ధనారీశ్వర స్తోత్రమ్ మొదలైనవి. 


ఇతర దేవతా స్తోత్రాలు 


  - ఇహపర సుఖాలకి భక్తసులభుడు ఆంజనేయస్వామిపై హనుమత్పంచరత్నాలు, 

    శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రమ్ 

    శ్రీ సుబ్రహ్మణ్య భుజంగమ్ మొదలైనవ అనుగ్రహించారు. 

     

      ఏదో ఒక దేవతనిగానీ, కొంతమంది దేవతలనుగానీ, అందరు దేవతలనూగానీ జనులు వారివారి ఇష్టాలతో స్తోత్రంచేసి, అవుసరమైన ఫలితాలు పొందేలాగా శంకరులు అనేక స్తోత్రాలు అందిచ్చారు. 


      దీనిద్వారా  మానవాళికి వారివారి ఇబ్బందులను తొలగించుకొనే అవకాశమూ, వారి కోరికలు సఫలమయ్యే మార్గము సులభంకావడమూ జరుగుతోంది. 


http://www.kamakoti.org/kamakoti/stotras/Shankara%20Stotras%20nine%20scripts.html


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

వైశాఖ పురాణం - 07.

 వైశాఖ పురాణం - 07.

7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ


నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?


తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.


వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.

ప్రహేళిక*

 తే.గీ.పడతి నాలుగక్ష రములు పదము లోన

వనిత మొదటి వర్ణము బోవ వందన మగు

వెలది ఒకటిమూడును వేసవియగు

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.

సప్తమీ భానునాయుతా

 రేపు అనగా 8.5.2022 తేదీ రోజున ఆదివారం, సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.


"అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!! తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?


తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,


ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.


ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.


శ్లో॥"" సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్.." అని బ్రహ్మాణపురాణమ్"


పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం


చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.


"శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్


అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..


ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.


గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.


గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కధ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*గాజు - వజ్రం* *కధ*


*ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది*.

*పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు*.


*పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు*. *రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు*. 

*అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి*, *నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ  ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు*. *అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను*.".

" *ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు*.


*అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా  ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి*.


*రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు*.

*దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క*.


*కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు*... *ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి*, *ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను*.

*కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ  ఇప్పటికి ఇలా  మొత్తాన్ని గెలుపొందాను*”.


" *నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు*.


*దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం*."


*ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు*


*హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది*.


*ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు*.


 *ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో* .... *ఒకవేళ  నేను విజయం సాధించలేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు*."


*అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు*.


*ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ  రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు*.


*ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి,  'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది  కేవలం గాజుముక్క!' అని చెప్పాడు*.


*అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...*ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.


*అందరూ చాలా సంతోషించారు*. *వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా  ఉన్నారని చాలా సంతోషించాడు*.


*వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు*?"


*అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే*."



*జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు*, *బంధింపబడిపోతారు*  ... *ఆ వ్యక్తులు"గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి  మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు*.

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం : 18/100

                           SLOKAM : 18/100     


त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं

वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः ।

कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती

कदा वा मद्रक्षां वहसि करुणापूरितदृशा ॥ १८॥    


త్వమేకో లోకానాం పరమఫలదో 

                        దివ్యపదవీం 

వహంత స్త్వన్మూలాం పునరపి భజంతే 

                        హరిముఖాః I 

కియద్వా దాక్షిణ్యం తవ శివ! మదాశా చ 

                              కియతీ 

కదా వా మద్రక్షాం వహసి 

            కరుణాపూరితదృశా ॥          -18  


శంకరా! 

    సమస్తమైన వారికీ, నీవు ఒక్కడివే, 

    పరమఫలాన్ని - అంటే మోక్షాన్ని ఇచ్చేవాడవు. 

    నీవు కారణంగా దివ్యమైన పదవులు అనుభవిస్తున్నవారే అయినప్పటకీ, 

    విష్ణువు మున్నగువారు ఇంకా నిన్ను సేవిస్తూనే యున్నారు. 

    నీ దాక్షిణ్యం ఎంతటిదో కదా! అంటే అది చెప్పశక్యం కానిదీ, అపరిమితమైనదీ. 

    నా ఆశ ఏపాటిది? స్వల్పమైనదే కదా! 

    చల్లని చూపుతో మఱి నన్ను ఎప్పుడు రక్షిస్తావు? 

  (అంటే సంసారముక్తిని ఎప్పుడు కలిగిస్తావు?)  

 

O Shankara! 


    You alone grant great blessings and holy status to the common people of the world, 


    But carrying the holy position, 

    granted by thy kindness great, 

    Vishnu and others pray you always for getting more and more such positions great. 


    Your grace my Lord is immeasurable and 

    my desire too is immeasurable, 

    And so when are you taking up the job of protecting me by your merciful glance?


విశేషం 


    దేవతలందరిలో పరమఫలాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే!  

    దాన్ని పొందడంకోసం ఎంతటివారైనా ఆయనని ఆశ్రయింపవలసిందే! 

    పరమేశ్వరుని అనుగ్రహంచేతనే గొప్ప పదవులలో అంటే సృష్టి - స్థితి వ్యాపారాలలో ఉంటున్నప్పటికీ, బ్రహ్మ - విష్ణువు మరల మరల ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు.  

    పదవులు ఎంత విశిష్టమైనవి అయినప్పటికీ అశాశ్వతాలే! 

    పుణ్యం క్షీణింపగానే పదవి కోల్పోయి, 

    ఎంతటివాడైనా మళ్ళీ మర్త్యలోకంలో పుట్టి సంసార యాతనలు అనుభవింపక తప్పదు. 

  "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అని భగవద్గీతా వాక్యం. 

    కాబట్టి అత్యున్నతమైన పదవిలో ఉంటున్నప్పటికీ పరమేశ్వర సాయుజ్యాన్నే కోరుకోవాలి.  

    దానికి ఆయనని ఆరాధింపక తప్పదు.  


    అనంతమైన విశ్వంలో  భక్తుని స్థానం ఎంతో చిన్నది. 

    ఈ సంసార బంధాలనుండి ముక్తిని పొందాలన్న అతని కోరికకూడా అత్యంత అల్పమైనదే. 

    కాబట్టి అతడు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే, 

    ఆ స్వామి తప్పక కరుణార్ద్రమైన దృష్టితో భక్తుని రక్షిస్తాడు. 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

భాష్యపాఠం చెప్పిన స్వామివారు

 భాష్యపాఠం చెప్పిన స్వామివారు


దాదాపు ఇరవైఅయిదు సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు సతారాలోని శ్రీ శంకర మఠంలో పదకొండు నెలల పాటు మకాం చేశారు. 


అప్పుడు మా నాన్నగారు శ్రీ కాశీనాథ శాస్త్రి గారు మహాస్వామి వారి నోటి నుండి ప్రస్థానత్రయ (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యం వినాలన్న తమ కోరికను స్వామివారికి విన్నవించారు.


అందుకు స్వామివారు, “అలాగే భవిష్యత్తులో చూద్దాం” అని తెలిపారు.


రెండు నెలలు గడచిన తరువాత, స్వామివారు మమ్మల్ని పిలిచి, భాష్య పుస్తకాలను తెప్పించుకుని, వాటిని వివరించడం మొదలుపెట్టారు. శ్రీ రాజగోప అయ్యర్ అనే వారొకరు ప్రతి ఉపనిషత్తు నుండి మొదటి వాక్యాన్ని మాత్రం చదివేవారు. స్వామివారు ఆ ఉపనిషత్తుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా ఎందఱో భాష్యకారుల భాష్యాన్ని ఉదహరిస్తూ తెగిన ఆనకట్ట నుండి పారే నీటిలా విస్తారంగా వివరించేవారు. ప్రతి రోజూ ఏడుగంటల పాటు ఈ భాష్యపాఠం కొనసాగేది. మాపై పరమాచార్య స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని తెలపడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?


ఈ సుదీర్ఘ ఉపన్యాసాలు పన్నెండు రోజులపాటు సాగి చివరకు పరిసమాప్తమయ్యాయి. కేవలం పరమాచార్య స్వామివారు ఒక్కరే ఏడుగంటల పాటు పాఠం చెప్పేవారు. ఆశర్యపోయే విశ్స్యం ఏంటంటే, ఏమాత్రం శ్రమ లేకుండా చెప్పడమే కాకుండా ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంతో పాఠం చెప్పేవారు.


ఈ ఉపకారానికి మేము ఎన్ని జన్మలు ఎత్తి మహాస్వామివారికి సేవ చేసుకోవాలో.


స్వామివారి దర్శనానికి ప్రతిరోజూ ఒక కళాశాల అధ్యాపకులొకరు వచ్చేవారు. కాని అతను ఎన్నడూ స్వామివారికి తనను పరిచయం చేసుకోవడం కాని, మాట్లాడడానికి ప్రయత్నించడం చేయడం కాని చేసేవాడు కాదు. బహుశా స్వామివారి దర్శనమే తనకి అపరిమిత ఆనందాన్ని కలిగించేదేమో. 


అయిదారు నెలల తరువాత ఒకరోజు స్వామివారు అతణ్ణి చూసి, “నువ్వు ఇప్పుడు ఇక్కడకు వచ్చావేమిటి?” అని అడిగారు స్వామివారు.


అతను ఆశ్చర్యంతో, “నేను ఇక్కడకు రోజూ వస్తున్నాను పెరియవా” అని బదులిచ్చాడు.


మహాస్వామివారు మరలా అదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న పరమార్థం ఏమిటో అతనికి అర్థం కాక అయోమయంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే, నేలపై పడ్డ ఒక ఉత్తరం కంటపడింది. దాని తీసుకుని చదివాడు. “చాలా ముఖ్యమైన సమాచారం. వెంటనే ఫలానా ప్రాంతంలో ఉన్న ఫలానా కళాశాలకు వెళ్లి నీ పని మొదలుపెట్టు” అన్నది సారాంశం.


ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఏమిటో మహాస్వామివారికి ముందే ఎలా తెలుసు? ఏమైతేనేమి, ఆ అధ్యాపకుడు పెట్టెబేడా సర్దుకుని ఇంకో ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.


పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట విపరీతంగా నల్లులు చేరాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ నల్లులు ఉన్నాయి. కొన్నిసార్లు మహాస్వామి వారి శరీరంపై కూడా తెనేపట్టుని అంటుకున్న తేనెటీగల గుంపులా అధిక మొత్తంలో నల్లులు గుంపులుగుంపులుగా ఉండేవి.


వాటిని చంపడానికి ఒక భక్తుడు క్రిమిసంహారక మందును తెచ్చాడు. మహాస్వామివారికి ఈ విషయం తెలిసి ఆ భక్తుణ్ణి పిలిచారు.


“మన శరీర పోషణం కొరకు మనం ఆహారం తీసుకుంటాము. నల్లులకు మనుష్య శరీరంలో ఉన్న రక్తమే ఆహారం. నల్లులు తమకు తామే ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారం లేకపోతే అవి ఎలా బ్రతుకుతాయి? నిజమే కదా?” అని అడిగారు.


“బ్రతికున్నవాటికి జీవహింస జరగరాదు. మనకు ఏదైనా సహాయం చేసేవారిపై మనం ఇష్టం కలిగిఉండడం గొప్ప విషయమేమీ కాదు. మన పెద్దలు చెప్పినట్టు మనకు అపకారం చేసేవారిని కూడా అమనం ఇష్టపడగలిగే వారే ధర్మాత్ములు”

ఈ మాటలు విన్న తరువాత ఆ భక్తునికి పరమాచార్య స్వామివారి గదిలో ఆ క్రిమిసంహారక మందును చల్లడానికి మనస్సు ఉంటుందా?


ఆశ్చర్యపరిచేది ఇది కాదు. ఈ సంభాషణ జరిగిన ఒకట్రెండు రోజుల తరువాత ఆ గదిలో నుండి నల్లులు మాయమైపోయాయి - ఇది అద్బుతాలకే అద్భుతం అంటే.


--- బ్రహ్మశ్రీ కృష్ణ శాస్త్రి జోషి, శ్రీ శంకర మఠం, సతారా. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శంకర జయంతి ప్రత్యేకం - 7

 ॐ          శంకరజయంతి శుభాకాంక్షలు 


              శంకర జయంతి ప్రత్యేకం - 7

          ( ఈరోజు వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


శంకరుల అవతారం 


6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 


    ఇతర మతాలలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కటే గ్రంథం. సాధనలో ఏ స్థాయివారికైనా ఒకటే పద్ధతి తప్పని సరి. 

    కానీ హిందూత్వం - వివిధస్థితులలో, స్థాయిలలో ఉన్నవారికి సాధనలో వారిస్థాయి ఎరిగి, ఆ పైస్థితికి చేరుకునేందుకు సాహిత్యం వివిధ రకాలుగా ఉంటుంది. 

    జగద్గురువులు ఈ విషయానికి సంబంధించి, గ్రంథాలను మూడు రకాలుగా వర్గీకరించి అందించారు. అందులో 


అ) స్తోత్రాలు:— సామాన్యులకు కూడా ఇహలోక సుఖంతోనూ, మోక్షము  సులభంగా పొందేలాగానూ వివిధ దేవతలని స్తుతిస్తూండేవి స్తోత్రాలు. 

      శంకరులు అందించిన అనేక దేవుళ్ళమీద  అనేక స్తోత్రాలతోపాటు శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


ఆ) ప్రకరణ గ్రంథాలు:— విశేషమైన శాస్త్ర జ్ఞానంలేక, కొద్ది అవగాహనగల మధ్యస్థాయి వారికోసం ఉద్దేశింపబడినవి. 

    పైస్థాయికి చెందిన జ్ఞాన సంబంధ విషయసారాన్ని గ్రహించి మరింత ఉన్నత స్థాయికి చేర్చే -  ఆత్మబోధ,అపరోక్షానుభూతి, వివేకచూడామణి మొదలైనవి జగద్గురువులందించిన రెండవ కోవకు చెందినవి. 


ఇ) భాష్యాలు:— మూడవ భాగంగా, శాస్త్ర పండితులకు మాత్రమే అధ్యయనం చేయడానికి సాధ్యమయ్యే వ్యాఖ్యాన గ్రంథాలు భాష్యాలు. 

     వివిధ శాస్త్ర సంప్రదాయాలతో సమన్వయిస్తూ శ్రుతి స్మృతులలోని వాక్యాలనుదహరిస్తూ, అద్వైత సిద్ధాన్తాన్ని బలపరుస్తూ శంకరభగవత్పాదులు భాష్యాలు రచించారు. 

     బ్రహ్మసూత్రాలుగా పిలువబడే శారీరక మీమాంసా, ఉపనిషత్తులు,భగవద్గీతపై వ్రాసిన భాష్యాలని ప్రస్థానత్రయంగా పిలుస్తారు. ఆ భాష్యాలను శంకరులు అనుగ్రహించారు. ఇవి గొప్ప శాస్త్రజ్ఞానంగల పండితుల స్థాయికి అవుసరమైనవి. 


     ఇట్లా సాధారణ, మధ్య, పాండిత్య స్థాయిలలో మూడు రకాల సాహిత్యాన్ని అనుగ్రహించారు శంకరులు. 

     తద్వారా ఏ స్థాయిలవారైనా, మూడంచెల మార్గం ద్వారా మూడుమెట్లు ఎక్కి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం కల్పించారు. 


                              కొనసాగింపు 


                              =x=x=x= 


   — రామాయణం శర్మ 

            భద్రాచలం