11, సెప్టెంబర్ 2024, బుధవారం

శ్లేష తో చమత్కారం !*

 *తెలుగు భాషాభిమానులకోసం…*


          *శ్లేష తో చమత్కారం !*

            


*కవుల మాటలేకాదు. కవిత్వభాష వంటబట్టినవారు కూడా చమత్కార భాసురంగా మాటలాడగలరు.* 


*ఆమాటలలోని చమత్కారం ఆభాష తెలిసినవారికే అర్థమవుతుంది!*


*ఈ కింద కంద పద్యం చిన్నదే కానీ చమత్కార రంజితమై, సరసుల హృదయరంజకంగా మారింది.*


*క: చవిగొని ఫలములుఁ గొననా?*

*చవిజూచిన పండ్లురాలు; చక్కగ బొమ్మా!!*

*కవినేను, కనులఁ గనవా?*

*కవి వైనచొ, చంకనాకు, ఘంటంబేదీ?*


*పూర్వం కవులకు సంఘంలో మంచి గౌరవముండేది. వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సమర్పించేవారు.*


*ఒక కవిగారు అరటిపండ్ల కోసం బజారుకు వచ్చారు. కొట్టు దగ్గర నిలబడ్డారు. పాపం వచ్చేటప్పుడు ‘ఘంటం, తాటియాకులు’ మరచారు.(అవి వారు కవులని సూచించే గుర్తులు. ’బొడ్డు దగ్గర ఘంటం, చంకలో నాలుగు తాటాకులు’ ఇదీవారి ఆహార్యం).*


*కవిగారు దుకాణదారునితో, "చవిగొని ఫలములుఁ గొననా?" అన్నారు.* 


*”రుచిచూచి నచ్చితే పండ్లు కొంటానయ్యా! రుచికి పండ్లు తీసికోనా?”అన్నారు.*


*దానికాదుకాణదారు, "చవిజూచిన పండ్లురాలు, చక్కగబొమ్మా?" అన్నాడు.*


*”రుచి కోసం చేతులేస్తే పళ్ళు రాలుతాయి, చక్కగా పో!” అన్నాడు.*


*ఒక అర్ధం ‘పళ్ళురాలుతాయి!’ అని తిట్టినట్టు. మరొకఅర్ధం ‘గెలకున్న పళ్ళు రాలిపోతాయి కెలకవద్దు!’ అని.*


*కవిగారికికోపంవచ్చింది. "కవి నేను కనుల గనవా?" అన్నారు.*


*”ఓ ఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను, నేను కవిని, ఆమాత్రం మర్యాద తెలియదా?” అని.*


*దుకాణదారుకూడా తక్కువవాడు కాదు మరి, "కవివైనచొ చంకనాకు", అన్నాడు.*

*అదిపెద్ద తిట్టు మరి! వెంటనే నాలిక కఱచుకొని, "ఘంటంబేదీ?" అన్నాడు.*


*”పోవయ్యా! ‘నీవు కవివైతే ఏమి గొప్ప చంకనాకవయ్యా?’ అని దూషించినట్టు ఒకఅర్ధం. ‘తమరు కవియైతే చంకలో ఆకులు, ఘంటమూ కనబడవేం?’ అని మరో అర్ధం.*


*చూశారా? శ్లేష సాయంతో కవి తన మాటలలో రెండర్ధాలను జోడించాడు. ఇదీ ఈ కందం లోని చమత్కారం!*


*తెలుగు భాషను ఆదరించండి,

గురువారం, సెప్టెంబరు 12, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*గురువారం, సెప్టెంబరు 12, 2024*

    *శ్రీ క్రోధి నామ సంవత్సరం*      

 *దక్షిణాయణం - వర్ష ఋతువు*

  *భాద్రపద మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి : *నవమి* సా6.06 వరకు

🔯వారం : *గురువారం* (బృహస్పతివాసరే)

⭐నక్షత్రం : *మూల* సా5.57 వరకు

✳️యోగం : *ఆయుష్మాన్* రా8.04 వరకు

🖐️కరణం : *బాలువ* ఉ6.10 వరకు

           తదుపరి *కౌలువ* సా6.06 వరకు

       ఆ తదుపరి *తైతుల* తె5.48 వరకు

😈వర్జ్యం : *సా4.18 - 5.57*

               మరల *తె3.35 - 5.11*

💀దుర్ముహూర్తము : *ఉ9.54 - 10.43*

                మరల *మ2.48 - 3.37*

🥛అమృతకాలం : *ఉ11.23 - 1.02*  

👽రాహుకాలం : *మ1.30 - 3.00*

👺యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

🌞సూర్యరాశి: *సింహం* || 🌝చంద్రరాశి: *ధనుస్సు*

🌄సూర్యోదయం: *5.50* || 🌅సూర్యాస్తమయం: *6.04*

సర్వేజనా సుఖినో భవంతు ఇరగవరపు రాధాకృష్ణ🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం - అష్టమి - జేష్ఠ -‌‌ సౌమ్య వాసరే* (11.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag

 



12. " మహా దర్శనము

 12. " మహా దర్శనము " --పన్నెండవ భాగము--మంత్రార్థము-1


12. పన్నెండవ భాగము-- మంత్రార్థము --1


        బాలుడికి రెండు వర్షములు నిండినాయి . లేచి బాగా అటూ ఇటూ బుడి బుడి నడకలు నడుస్తున్నాడు . అయినా తల్లి వెనకే ఉంటాడు . ఆమె పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయునపుడు , చలి యని తనకు కట్టిన ఉన్ని కుళావిని విప్పకుండానే , ఆమె వెనకాలే తిరుగుతాడు . ఆమె స్నానము చేయునపుడు తానూ స్నానము చేస్తాడు . ఆమె మడి కట్టుకుంటే తానూ మడి కట్టుకుంటాడు . ఆమె భర్తతో అగ్ని పరిచర్య చేస్తుంటే , తాను పక్కనే గోడకు ఆనుకొని కూర్చుంటాడు . ఆమె వంటలో ఉంటే , గౌరీ పూజలో ఉంటే , తాను కూడా అక్కడక్కడే ఉంటాడు . నిద్ర వస్తే వెళ్ళి పడకపైన పడుకోకుండా , అక్కడే తల్లి పక్కనే ఒక కృష్ణాజినము పైన ధావళి తుండు కప్పుకొని నిద్రపోతాడు . 


         అయితే ఇప్పుడొక మార్పు వచ్చింది . ఒక దినము తల్లి యేదో చిన్నగా జపము చేస్తున్నది విన్నాడు . వాడి కుతూహలము పెరిగి , ’ అమ్మా , నువ్వు చెప్పుతున్నది ఏమి ? ’ అన్నాడు . తల్లి ఏమి చెప్పవలెను ? ఆమెకు ఏమీ తోచక , ’ ఇంకొక దినము చెపుతానయ్యా ’ అన్నది . పాపడు సరేనమ్మా అని ఊరకున్నాడు . 


        తల్లికి గుర్తొచ్చింది , భర్త , " పాపడు దేహము చిన్నదైన మాత్రాన వాడికి ఏమీ తెలియదనుకున్నావా ? వాడు పెరిగినాడు . బుద్ధి, మనస్సులు రెండూ పెరిగినవాడు అనుకొని వ్యవహరించు " అని చెప్పినది స్మరణకు వచ్చినది . 


         వాడిని పిలచింది , " అది కాదురా , యజ్ఞీ , నువ్వు ఏదో అడిగినావు , నేను ఏదో ఆలోచిస్తూ ఇంకొక దినము చెపుతాను అంటిని . నువ్వు అదే చాలని సరేనమ్మా అనేసినావే ? న్యాయమేనా ? " అని అడిగింది . 


       కొడుకు పరుగెత్తి వచ్చి తల్లి మెడ చుట్టూ తన చిట్టి చేతులు వేసి ఊగుతూ , ’ నేనింకేమి చేసేదమ్మా ? నువ్వు చేసేదే నేనూ చేసినాను " అన్నాడు . 


"నేను చేసేది ఏమిటి ? " 


       " ఏమిటేమిటి ? ఎండిన పిడకల తో పాటూ పచ్చి పిడకలు కలిసిపోయి వస్తే , ఇదింకా పచ్చిది అని అటువైపుకు తీసి పెడతావు కదా ? నేనూ అట్లే , ఇంకా కాలము రాలేదు , వస్తే అమ్మే చెపుతుంది అనుకొని ఊరకే ఉన్నాను " 


       ఆలంబినికి ఆశ్చర్యమైంది . చూస్తే మూడు వర్షాల పిల్లవాడు . కానీ , వాడు ఆడిన మాట చూస్తే , పది సంవత్సరాల వాడికి కూడా లేని వివేకము కనిపిస్తోంది , మాటలో ఏ మాత్రమూ తడబాటుగానీ , పిల్లతనము కానీ లేక , స్ఫుటముగా ఉంది . శుద్ధంగా ఉంది , స్వర నియమాలకు సరిపోయినట్లుంది . ’ ఇందుకేనేమో , వారు అట్లు చెప్పినది ? " అనుకొని , మరలా పుత్రుడిని అలాగే హత్తుకొని అంది , " కాదయ్యా , నీకు ఆకలి అయిందనుకో , నేను ఇంకోదినము అంటే ఊరకుంటావా ? " 


          కొడుకు ఆలోచించి అన్నాడు , " నువ్వడిగేది సరిగ్గా లేదనిపిస్తుందమ్మా , అది ఊరికే ఉండుటకు వీలు కాదు . కడుపు నామాట వినదు . కాబట్టి నిన్ను గోడాడించుకుంటాను . ఉహూ , అది కాదు , పొట్ట నన్ను ఏడిపిస్తుంది , నేను ఏడుస్తాను . నువ్వు వెంటనే ఏదో ఒకటి చేసి ఆ ఏడుపు నిలుచునట్లు చేస్తావు . అయితే ఇది అలాగ కాలేదు . నేను అడిగినాను , నువ్వు ఇంకొక దినము అన్నావు . నాకన్నా నువ్వు పెద్ద దానివి కదా , నీమాట వినవలెను అనిపించినది . అందుకే ఊరకున్నాను . నేనింక ఏమి చేయవలసినదమ్మా ? ఏడ్చి ఉండవలెనా ? ఏడుపు రాలేదు . " 


" నువ్వు ఆకలైనపుడే ఏడవలేదు , నిద్ర వచ్చినపుడు కూడా ఏడవలేదు , ఇంక దేనికయ్యా , ఏడుస్తావు ? " 


       " కాదమ్మా , నేను ఏడువ వలెను అని నీ దగ్గరకు వస్తాను . నువ్వు వెనక్కు తిరిగి , మెడ వంకర చేసి చూస్తే ఏడుపు పారిపోతుంది , నవ్వు వస్తుంది . నేనేం చేసేది ? " 


          ఆలంబిని సంతోషముతో కొడుకును హత్తుకొని ముద్దు పెట్టుకుంది . వాడు తనలాగే తల తిప్పి , మెడ వంకర చేసుకొని చూచేది , తనకు కోపము వస్తే , తగ్గించేది , ఇష్టమైన మాట అంటే అనుకరించేది ...ఇవన్నీ ఆమెకు భలే ముద్దుగా అనిపించి , " నువ్వు ఇలాగ చేస్తుంటే నిన్నెవరురా , ముద్దు చెయ్యనిది ? " అని మరలా రెండు సార్లు ముద్దాడింది . 


         కొడుకు నవ్వుతూ , ఆమె ముద్దు తప్పించుకునేందుకు చేతితో తల్లి ముఖమును తోసేస్తూ , " ఇందుకేనా అమ్మా , నన్ను పిలచినది ? " అన్నాడు . వాడికి ఆమె చేతుల సంకెల నుండీ తప్పించుకొనుటకు వీలు కాలేదు . 


        " కాదు నాయనా , చెపుతాను , కూర్చో ..నేను నిన్ను ఎత్తుకున్నపుడల్లా, మూడు మంత్రములలో ఏదో ఒక మంత్రమును చెప్పుతూనే ఉండవలెను . " పూర్ణమదః " అనేది మొదటి మంత్రము . 


" అదా , నాకు తెలుసు , తండ్రి గారు మంట ముందర ..." 


" దాన్ని మంట అనకూడదయ్యా ...! అది యజ్ఞేశ్వరుడు . నోరు తిరగకుంటే , ’ అగ్ని ’ అను . " 


" అలాగ ఎందుకూ ?? అది మంట కాదా అమ్మా ? " 


         " చూడయ్యా , ఇప్పుడు పొయ్యిలో ఉన్నది మంట . అది మన పని చేస్తుంది . కానీ అక్కడ , అగ్ని మందిరములో ఉన్నది దేవత . ఆ దేవత పని మనము చేయవలెను . కాబట్టి ఆ దేవత మనకు యజమాని అన్నమాట . మన యజమానుని ఎవరైనా , రారా , పోరా అంటారా ? నేను నీ తండ్రి గారిని , రండి , వెళ్ళండి అని మర్యాదతో మాట్లాడించునట్లే , మనము ’ అగ్ని ’ , యజ్ఞేశ్వరుడు ’ అని గౌరవముతో పలుకవలెను , కాదా చెప్పూ ? " 


       " అటులనా అమ్మా , అయితే అలాగే . తండ్రిగారు అగ్నుల ముందర కూర్చొనునట్లే నేను కూడా పద్మాసనము వేసుకొని కూర్చుంటాను , చెప్పు " 


          ఆలంబినికి ఆశ్చర్యమైనది . " తాను మంట ను మర్యాదతో ’ అగ్ని ’ అని చెప్పమన్నట్లే , తాను జపించే మంత్రానికి కూడా మర్యాద ఇచ్చి , ఆసనములో సరిగ్గా కూర్చొని జపించవలెను. ఈ మొదటి నియమమే మరచిపోయినాను , కదా ! " అనిపించినది . అప్పుడు శిశువు అని ఎత్తుకొని తిరుగుతున్నపుడు , ఆసన నియమములు అవసరము లేకుండినవి . ఇప్పుడు శిశువు కొడుకైనపుడు , ఆ నియమము అవసరము లేదనుట న్యాయమా ? ఇది సరి కాదు . ఇది కూడా కొడుకు నుండే తెలిసింది . కొడుకుకు , శిష్యుడికి ఓడిపోతే తప్పులేదు . అదీకాక , వారు ఆదినమే చెప్పినారు కదా ? వీడు మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని , కాబట్టి , వీడితో ఓడిపోతే తప్పేమి ? " అనుకొని , తాను ఉన్నచోటే ఆసనమును సరిచేసుకొని , పూర్వాభిముఖముగా కూర్చున్నది . కొడుకు పక్కనే ఉత్తరాభిముఖముగా కూర్చున్నాడు . తల్లి చెప్పసాగింది . 


కుమారా , ఇది మొదటి మంత్రము 


|| ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే || 


" దీనికి అర్థమేమమ్మా ? " 


       " చూడయ్యా , మీ తండ్రిగారిని అడిగితే దాని అర్థము విస్తారముగా చెప్పగలరు . నేను చిన్నదిగా క్లుప్తముగా చెపుతాను " 


        " అంటే , నువ్వు చెట్టును లోపల ఉంచుకున్న గింజవలె చిన్న అర్థము చెపుతావు , తండ్రి గారైతే దానిని చెట్టును చేసి చెపుతారు , సరే చెప్పు , మధ్యలో ఈ మాటలేమిట్రా అనవద్దు , ఈ పూర్ణమూ , నువ్వు వంటింట్లో బొబ్బట్టుకు చేసే పూర్ణమూ ఒకటేనా అమ్మా ? " 


        " ఎక్కడి నుండీ ఎక్కడికి పోతావురా , ఆ పూర్ణము , కొబ్బరికాయ , బెల్లమూ తప్ప ఇంకేమీ అవసరము లేని పూర్ణము . కానీ మంత్రములో చెప్పే పూర్ణము వేరొకటి ! అది కూడా దీనిలాగానే ఇంకేమీ అవసరము లేని పూర్ణము . మంత్రపు అర్థము చెపుతాను విను , ’ అదీ పూర్ణము , ఇదీ పూర్ణము . పూర్ణము నుండీ పుట్టునదీ పూర్ణము . పూర్ణము నుండీ పూర్ణమును తీసివేసిననూ , పూర్ణము పూర్ణముగానే మిగులును . " 


       " ఇప్పుడు అర్థమైంది . వంటింట్లో ఉన్న పూర్ణము ఒకటి . దానినుండీ ఒక ఉండ తీసేస్తే , అదీ పూర్ణము , ఇదీ పూర్ణము. అదీకాక , పూర్ణము నుండీ పూర్ణమును తీసేస్తే పూర్ణము పూర్ణముగానే ఉంటుంది, సరిపోయిందా లేదా ? " 


        ఆలంబినికి ఏమి చెప్పాలో తోచలేదు . కొడుకు చెపుతున్నది, తాను చెప్పిన మాటలే ! దానిని పూర్ణపు ఉండకు పోల్చినాడు , అంతే ! ఇదెందుకు వీడికి ఇలాగ తోచినది ? " అని ఆలోచిస్తూ ఊరకే కూర్చుంది . 


ఆవేళకు పొయ్యిలో మంట కొంచము తక్కువవుతూ వచ్చింది . పొయ్యి వైపుకు తిరిగినది . 


         కొడుకు , " ఏమమ్మా , ఇంకొక అర్థమును చెపుతాను , విను . మన దొడ్లో చెట్లు ఉన్నాయి కదా ? మామిడి చెట్టే అనుకో , అది చెట్టు అగువరకూ దానిలో ఆకులు మాత్రమే ఉంటాయి . అది పెరిగి బలిసిన తరువాత దానిలో పూలు , కాయలూ పళ్ళు వస్తాయి . అంటే ఏమిటి ? పువ్వుగా ఉండినది కాయగా మారి , అది పండువరకూ వేచి ఉంటే అగు పండు పూర్ణము . అది పూర్ణమైన చెట్టు నుండీ వచ్చింది . దాన్ని కోసి , ఆ పండైన పూర్ణమును చెట్టు నుండీ తీసుకున్నా , చెట్టు పూర్ణముగానే మిగులుతుంది . అయితే , వంటింట్లో తయారైన పూర్ణము చెట్టుది కావడము వలన అయిన పూర్ణము . ( ఒకటి సిద్ధము , ఇంకోటి సిద్ధము నుండీ అగు సాధ్యము ) సరిగ్గా చెప్పితినా లేదా ? " 


         తల్లి కొడుకు మాటకు ఏమీ చెప్పలేకపోయినది . ఆమాటను అక్కడికి ముగించవలెనని , అపండితుడు పండితుడి మాటను ముగించుటకు అది తనకు అర్థము కాకున్ననూ " బహు బాగున్నది " అని తలఊపునట్లే , వాడి అర్థమును ఆమోదించి , " ఇదంతా నాకు చెప్పిన ఏమి ఫలము ? మీ తండ్రిగారి వద్ద చెప్పు . వారు దానిని నిర్ణయించి , తప్పో ఒప్పో చెప్పగలరు . తరువాతివి వింటావా లేదా ? " అన్నది . 


        కొడుకు తనవల్ల తప్పయింది అని తెలిసి పలుకు పెద్దవాడి వలె , అన్నాడు , ’ ఓహో , నేను మధ్యలో మాట్లాడినది తప్పయింది . దానివల్ల నీ మనసుకు బాధ కలిగిందో ఏమో ? ఇంక మాట్లాడనమ్మా , ఇప్పుడు నేనన్నది తప్పయిందమ్మా , ఇక నువ్వు చెప్పు , నేను వింటాను " అని చేతులు కట్టుకొని వినయ వినమ్రుడై కూర్చున్నాడు . 


        తల్లి కొడుకు ముఖము చూసినది . ఆమె సంతోషము పట్టరానంతగా అయిపోయింది . కొడుకు తల నిమిరి , హత్తుకొని , తొడపైన కూర్చోబెట్టుకొని , తరువాత మంత్రము చెప్పినది . 


" రెండవది " భద్రం కర్ణేభిః " మంత్రము .దాని పూర్ణ స్వరూపము ఇది : 


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః | భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః | 


స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః | వ్యశేమ దేవహితం యదాయుః || 


         దాని అర్థము ఇలాగు . ఓ దేవతలారా , చెవుల ద్వారా శుభమైనదానిని వినెదము , కన్నులనుండీ శుభమైనదానిని చూచెదము . యజ్ఞమునందు ఉండెదము . స్థిరమైన అంగములున్న , దేహములున్న వారమై పొగడెదము . ఆయుష్షు ఉన్నంతవరకూ దేవహితమును ఆచరిస్తాము . 


మూడో మంత్రము ఇది 


॥ అన్యత్ శ్రేయః అన్యదుతేవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సీనీతః | 

తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి | హీయతే అర్థాద్య ఉ ప్రేయోవృణీతే ॥


       దాని అర్థము , : శ్రేయస్సు అనునది ఒకటి , ప్రేయస్సు అనునదొకటి . రెంటికీ లక్ష్యములు వేరే వేరే . రెండూ పురుషుని కట్టివేస్తాయి . వాటిలో శ్రేయస్సును అంగీకరించినవానికి శుభము కలుగును . ఎవడు ప్రేయస్సును పట్టుకొనునో , వాడు గురి తప్పినవాడు . " 


        ఆలంబిని మంత్రార్థమునే మననము చేసి చెప్పుచూ కొడుకును చూడలేదు . ఆమెకు ఆ దినము ఆ మంత్రములను , మంత్రార్థము లను పలుకుతుంటే వాటిలో ఎన్నడూ చూడని సొగసు తోచి , వాటివైపుకే మనసు లాగబడి , కట్టుబడిపోయినది . కొడుకు ఒడిలోకి వచ్చి అలాగే ఎదపైన వాలి తలపెట్టుకున్నాడు . తల్లి వాత్సల్యముతో కొడుకును హత్తుకొని , వాడి తలపైన తన చెంపలు ఆనించి , ఏదో అనిర్వచనీయమైన సుఖము తోచి సర్వమునూ మరచిపోయినది . తానూ అలాగే కన్నులు మూసుకున్నది .

శ్రీ హరి నిద్ర

 


శ్రీ హరి నిద్ర! 

      కవి చమత్కారం!!


కలశపయోధిమీద తరగల్ మరి"హో"యనిమ్రోయ,వేయిభం/

గుల తలపాన్పుపాముబుసకొట్టగ,నేగతినిద్రచెందెదో?

అలసత తండ్రి!చీమచిటుకన్ననునిద్దురరాదుమాకు ఓ

బలవదరీ!దరీకుహర భాస్వదరీ! యదరీ!దరీ!హరీ!//

చాటుపద్యం:అజ్ఙాతకర్తుకం.

           చివరిపాదంపద్యావికి మకుటంలాకనిపిస్తోంది.అర్ధంమాత్రం సులభంగా బోధపడటంలేదు.మహావిష్ణువును సంబోధించుచున్నట్లున్నది.


ఒకవంకపాలసముద్రపుకెరటాలహోరు.

మరియొకవంక ఆదిశేషువు బుస,

 ఈరెండూ మహాధ్వనిచేస్తుంటే,యింతగడబిడలో యెట్లానిదురపడుతున్నదయ్యా !స్వామీ!నీకు.

మరి మాకేమోచీమచిటుక్కుమన్నా మెళకువ వచ్చేస్తుంది.ఇకనిదుర పట్టమన్నాపట్టదు.అనిమొత్తుకుంటున్నాడీకవిగారు.

"నిద్రసుఖమెరుగదు ఆకలిరుచియెరుగదు"-అంతేమరి.ఎవరికైనా.


చివరిపాదంసంగతిచూద్దాం!

బలవదరీ-బలవంతుడైనశత్రువుగలవాడా(హిరణ్యకశ్యపుడు)

దరీకుహర-పర్వతబిలంలో;

భాస్వత్+హరీ-ప్రకాశించు విష్ణుమూర్తీ!

అదరీ-భయరహితుడా!(చక్రధారీ!)

దరీ-శంఖహస్తుడా!

హరీ!-హేనృహరీ!

అనియర్ధం;

"అహోబిలక్షేత్రలోవెలసిసిన శంఖచక్రధారీ!ఓనృహరీ! యని సంబోధన.

                        స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శుక్లాం బరదరం

 శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.


'శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.


శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.

అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదే ‘శివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?


అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు.


అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు ‘సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు’ అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.


అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.


అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది.


మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.


త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -


నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ

నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)


అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -


'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'


'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.


నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!


అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!


ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.


ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.


కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!

నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!


అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!


అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.


పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం

బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా

నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్

శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!


‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

సత్సంగం

🔔 *సత్సంగం* 🔔


భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఉత్తమ పురుషునికి నృశంశ (క్రూరత్వం) లక్షణం కూడదు. ఎవరు అక్రూరుడో వానిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. 


ఎన్ని మొక్కుబడులు ఇస్తే అన్ని వరాలు ఇస్తాడు వేంకటేశ్వరుడు అనే భ్రాంతి నుంచి బయటపడి అక్రూరత్వం ఎంత పెరిగితే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని గ్రహించాలి.


*క్రూరత్వం 13 రకాలుగా ఉంటుంది. ఈ పదమూడు రకాల క్రూరత్వం లేకుండా ఉండడమే అక్రూరత్వం.* 


 వికత్థనః స్పృహయాలుర్మనస్వీ బిభ్రత్కోపం చపలోఽరక్షణశ్చ । 


 ఏతే ప్రాప్తాః షణ్నరాన్పాపధర్మాన్ ప్రకుర్వతే నోత్ర సన్తః సుదుర్గే !!


లోకంలో మంచి చెప్తే వినని వాళ్ళని క్రూరులు అని చెప్పుకోవచ్చు. వారిలో ఆరు లక్షణాలు ప్రబలంగా ఉంటాయి గనుక వినరు. 


ఆ ఆరు లక్షణాలు – 


1 తనకు తాను గొప్పగా అనుకోని విర్రవీగే వాడు (వికత్ధనుడు),


 2 ఇంద్రియలోలుడు,


 3 సహనం లేకుండా ప్రవర్తించే వాడు, 


4 నిరంతరం క్రోధం కలిగిన వాడు, 


5 స్థిరంగా ఉండలేకపోవడం, 


6 ఆశ్రయించిన వారిని రక్షించలేని వాడు. 


ఈ ఆరు దుర్లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు కష్టాలు వచ్చినా సరే నిర్భయంగా పాపాలు చేస్తూ ఉంటారు.


 సమ్భోగసంవిద్ద్విషమేధమానో దత్తానుతాపీ కృపణోఽబలీయాన్ । 


 వర్గ ప్రశంసీ వనితాసు ద్వేష్టా ఏతేఽపరే సప్త నృశంసధర్మాః !!


1 ఎప్పుడూ కామ భోగమునందే మనస్సు లగ్నం చేసేవాడు; 


2 దోషము, 


3 కఠినత్వము కలిగిన వాడు; 


4 అత్యంత అభిమానం కలిగిన వాడు; 


5 దానం చేసి పశ్చాత్తాపపడడం; 


6 లోభత్వం (పిసినారితనం); అర్థమును ప్రశంసించువారు (సంపద, కీర్తి వీటినే గొప్పవిగా భావించేవారు); 


7 స్త్రీలను ద్వేషించువారు.


*ఈ పదమూడు నృశంశ వర్గం అని చెప్పబడుతాయి. ఇవి ఎవరిలో ఉంటాయో వారు క్రూరులు. ఈ పదమూడు లేనివారు అక్రూరులు. క్రూరత్వం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసి దైవానుగ్రహానికి పాత్రులు అవుదాము.*



 

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు --

 🙏🙏🙏యుగ కర్త అవడానికి అన్ని అర్హతలు ఉన్న 

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు -- వ్యాసం 

జ్ఞానపీఠఅవార్డు గ్రహీత, పద్మభూషణ్ శ్రీ విశ్వనాథ

సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్‌ '10'న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించినారు. వీరు వెలనాటి శాఖీయులు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి, సంపన్న కుటుంబంలో పుట్టినా దారిద్య్ర వ్యధలను( చిన్నతనములో తల్లిని, యవ్వనములో భార్యను, వార్ధక్యములో కుమారుని కోల్పోయినారు ) అనుభవించిన వ్యక్తి ఆయన , విద్యార్ధి దశ అంతా బందరు హిందూ హైస్కూల్ లో, నోబుల్ కాలేజీ లో గడిపారు. హిందూ హై స్కూలు ఆవరణంలోకానుగ చెట్లెక్కి అలవోకగా 'శృంగార వీధి' పద్యాలు చెప్పారట!


విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివిఎన్నో ఉన్నాయి. 

తెలుగుదనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి

వారి గ్రంథ సముదాయం!

నవలా సాహిత్యం 

వేయిపడగలు, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలికట్ట

ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, జేబుదొంగలు

వీరవల్లడు,వల్లభమంత్రి, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, దేవతల యుద్ధము,పునర్జన్మ, పరీక్ష

నందిగ్రామ రాజ్యం, బాణావతి, అంతరాత్మ

గంగూలీ ప్రేమకథ, ఆఱునదులు, చందవోలు రాణి

ప్రళయనాయుడు, హాహాహూహూ మ్రోయు తుమ్మెద, సముద్రపు దిబ్బ, దమయంతీ స్వయంవరము, నీల పెండ్లి, శార్వరి నుండి శార్వరి దాక,కుణాలుని శాపము,ధర్మచక్రము, కడిమిచెట్టు

వీరపూజ, స్నేహఫలము, బద్దన్న సేనాని

నేపాళ రాజవంశ నవలలు (ఆరు నవలలు)

దిండు క్రింది పోకచెక్క, చిట్లీచిట్లని గాజులు

సౌదామిని, లలితాపట్టణపు రాణి దంతపు దువ్వెన దూతమేఘము

కాశ్మీర రాజవంశ నవలలు (ఆరు నవలు)

కవలలు, యశోవతి, పాతిపెట్టిన నాణెములు

సంజీవకరణి,మిహిరకులుడు, భ్రమరవాసిని

పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)

భగవంతుని మీది పగ, నాస్తిక ధూమము

ధూమరేఖ, నందోరాజా భవిష్యతి, చంద్రగుప్తుని స్వప్నము, అశ్వమేధము, అమృతవల్లి పులిమ్రుగ్గు, నాగసేనుడు, హెలీనా వేదవతి

నివేదిత.

పద్య కావ్యాలు

శ్రీమద్రామాయణ కల్పవృక్షము (6 కాండములు)

ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషము, విశ్వనాథ మధ్యాక్కఱలు, ఋతు సంహారము

శ్రీకుమారాభ్యుదయము, గిరికుమారుని ప్రేమగీతాలు, గోపాలోదాహరణము

గోపికాగీతలు, భ్రమరగీతలు, ఝాన్సీరాణి

ప్రద్యుమ్నోదయము, రురుచరిత్రము, మాస్వామి

వరలక్ష్మీ త్రిశతి, దేవీ త్రిశతి (సంస్కృతం)

విశ్వనాథ పంచశతి, వేణీభంగము, శశిదూతము

శృంగారవీధి, శ్రీకృష్ణ సంగీతము, నా రాముడు

శివార్పణము,ధర్మపత్ని, భ్రష్టయోగి (ఖండకావ్యము)

కేదారగౌళ (ఖండకావ్యము), గోలోకవాసి

దమయంతీస్వయంవరం మొదలగునవి 

నాటకములు!


అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)

గుప్తపాశుపతమ్ (సంస్కృతం)

గుప్తపాశుపతము, అంతా నాటకమే అనార్కలీ

కావ్యవేద హరిశ్చంద్ర, తల్లిలేని పిల్ల, త్రిశూలము

నర్తనశాల, ప్రవాహం, లోపల - బయట, వేనరాజు

అశోకవనము, శివాజి - రోషనార, ధన్యకైలాసము

నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శనా గ్రంధములు!


అల్లసానివారి అల్లిక జిగిబిగి, ఒకనాడు నాచన సోమన్న, కావ్య పరీమళము, కావ్యానందము

నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి

విశ్వనాథ సాహిత్యోపన్యాసములు

శాకుంతలము యొక్క అభిజ్ఞానత

సాహిత్య సురభి, నీతిగీత

సీతాయాశ్చరితమ్ మహాత్ కల్పవృక్ష రహస్యములు, సాహితీ మీమాంస.

శతక సాహిత్యం


విశ్వేశ్వర శతకము, విశ్వనాథ పంచశతి

శ్రీగిరి శతకము, శ్రీకాళహస్తి శతకము 

భద్రగిరి శతకము, కులస్వామి శతకము 

శేషాద్రి శతకము, ద్రాక్షారామ శతకము 

నందమూరు శతకము , నెకర కల్లు శతకము

మున్నంగి శతకము, వేములవాడ శతకము

పైన పేర్కొన్న శతకము అన్ని మధ్యాక్కఱలు


ఇతర రచనలు 

కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెండ్లి

పాము పాట, చిన్న కథలు, "ఆత్మ కథ"



తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠఅవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నారు. తమిళనాడులోని మదురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించారు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు ఆనాటి యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరసాధ్యమైన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.


విశ్వనాథ సత్యనారాయణ వారి ముఖ్య రచనా సాహిత్యంలో శతకములు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి, వీటి గురించి తప్పకుండా ప్రస్తావన చెయ్యాల్సిందే.

శ్రీ విశ్వనాధ వారి 10 శతకాలు వాటి పేర్లు, మకుటము కొఱకు మళ్ళీ ప్రస్తావించటం జరిగింది.

1. శ్రీగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!

2. శ్రీకాళహస్తి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!

3. భద్రగిరి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!

4. కులస్వామి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!

5. శేషాద్రి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!

6. ద్రాక్షారామ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!

7. నందమూరు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!

8. నెకరు కల్లు శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!

9. మున్నంగి శతకము (మధ్యాక్కరలు) - మకుటం: నిర్ముల! మున్నంగి వేణు గోపాల!

10. వేములవాడ శతకము (మధ్యాక్కరలు) - మకుటం: వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!


ఆయన తొలినాళ్ళలో వ్రాసిన "గిరికుమారుని ప్రేమగీతాలు" `రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రిలతో పాటుగా విశ్వనాథ సత్యనారాయణ కూడా భావకవిత్వ రంగంలో ప్రముఖునిగా పేరొందారు. విశ్వనాథ రచించిన ఋతుసంహారం, తెలుగు ఋతువులు వంటి కావ్యాలలో ఆయన చేసిన వర్ణనలు తెలుగు నాట ఋతువుల సూక్ష్మమైన వర్ణనలు చాలా పేరుపొందాయి

. భావకవిత్వంలో అతికొద్ది ఇతివృత్తమో, అసలు ఇతివృత్తమే లేకుండా కేవల ఖండకావ్యమో వ్రాయడం మరింత పెరగడం, నాజూకు దనంతో, ప్రతి పద్యమూ మాధుర్యంతో ఉండాలనే రీతులు ప్రాచుర్యం పొందడంతో విశ్వనాథ ఆ మార్గానికి దూరం కావడం జరిగింది. కథాంశం అత్యంత కీలకమని, కథను చెప్పడంలో వివిధ మలుపుల్లో అవసరమైనంత మేరకే ఏ చమత్కృతి అయినా రాణిస్తుందని విశ్వనాథ భావించేవారు, తదనుగుణమైన రచనలు చేసేవారు. నిజానికి తొలినాటి రచనలైనా ఈ పద్ధతిలో భావకవిత్వానికి ఎంతో భేదం ఉన్నాయి. కిన్నెరసాని పాటలు అమలిన శృంగారం వంటి భావకవితా లక్షణాలను కొంత కనబరిచినా, మౌలికమైన కథాంశ రాహిత్యం లేకపోవడంతో భావకవిత్వానికి - ఆయన మార్గానికి సంబంధం లేదని విమర్శకులు భావించారు. ఆతరువాత కాలంలో ఆయన చేసిన అనేకమైన పద్య రచనల్లో భక్తిరచనలు ముఖ్యమైనవి.


"విశ్వనాధ వారి మాటలు వారి కావ్యల గూర్చి" 

     

ఏ కవి అయినా 'తన కావ్యం గొప్పదంటాడు. ఎవరో నా 'ఏకవీర' ఉత్తమమని అన్నారు..నేను ఉత్తమమని ఎందుకనాలి?ఒక తరం పోయి మరొక తరం వచ్చినట్టు చెప్పిన'వేయి పడగలు' గొప్పది కాదా? దాని గుణ గణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన 'చెలియలి కట్ట' ఏమైనట్టు? 'పురాణ వైర గ్రంధ మాల' లో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే! ఎవరైనా చూశారా? మన ప్రమాణాలునిలుస్తాయా? ఎంతో పోయె..దేవాలయాలే కూలి పోయె! ''...అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పిన వాడు..


       ''రామాయణ కల్ప వృక్షాన్ని మించిన కవిత్త్వం ఉండదు..సర్వ శక్తులూ పెట్టి వ్రాశాను..పరమేశ్వరుడు అనుగ్రహించాడు..నారాయణుడే పరమేశ్వరుడు..'' అన్న ధీశాలి, జ్ఞాని...జ్ఞాన పీఠానికి ఘనతను తెచ్చిన ప్రజ్ఞాన ఖని.. '' సనాతన ధర్మం రాదు..కానీ..వేద మతానుసరణం తప్పదు..ఆది వినా ప్రపంచ శాంతిఉండదు..ఏ ఇజమూ గట్టెక్కించదు ..వేదిజం ఒక్కటే శరణ్యం..'' అని నిష్కర్షగాచెప్పిన వాడు... ''ఇంగ్లీషు లో ఏ రవీంద్రుడి లాగానో..ఇలియట్స్ లాగానో కవితా భాష వ్రాసే అలవాటుపోయింది..సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొకటో వాడినో అవుతాను..తెలుగులో నంటారా..పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాతపదమూడవ వాడిని నేను..'' అని రొమ్ము విరుచుకుని చెప్పగలిగిన దమ్మున్నదక్షుడు.. 


     సాక్షాత్తూ వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ ఆచార్యులచేత పొగడ్తలు పొందినారు '" ఈ గమకం, సంస్కృతవృత్తాల శయ్య, గతి ఈ దేశంలోనే అపూర్వం! సంస్కృతాంధ్రాలు ఇంత అందంగాసహజీవనం చేస్తాయని మాకు తెలియదు, .వీరి రచనా రీతి విశిష్టమైనది..దీనిని ఆంధ్రరీతి అని కానీ..విశ్వనాధరీతి అని కానీ పిలుద్దాము..'' అనిపించుకున్న మహాకవి సామ్రాట్టు..విశ్వ నాధ సత్యనారాయణ గారు.వారు స్వయం కృషితో,పట్టుదలతో తనను ఒక్కొక్క భాషా సాహిత్యం గురించి ఎవరైనా ఎద్దేవా చేసినప్పుడల్లా..ఆ భాషా సాహిత్యాన్ని మథించి...లోతులు తుద ముట్టిన వారు, 


. 1920 ప్రాంతంలో 'సాహితి' లోఅచ్చైన 'గిరికుమారుని ప్రేమ గీతాలు' వారి తొలి కవితలట. మొదటి నవల పేరు 'అంతరాత్మ'అట, జాతీయోద్యమ నేపధ్యంలో మొదలు పెట్టిన దీన్ని ఎందుకనో సగం వ్రాసి వదలి పెట్టారుట. 


              ఆయన రచనా విధానం అత్యంత విచిత్రమైనది. పద్యాలయితే ఒకేసారి ఒక వంద తమమనసులోనే పూర్తి చేసుకొని, ఒకే సారి వాటిని కాగితం మీద పెట్టేవారట. ప్రయాణం లోనో,వేరే ఎక్కడనో ఉన్నప్పుడైతే ఒక్కొక్క పద్యానికి అంగవస్త్రానికి ఒక్కొక్క ముడి వేశే వారట.ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక్కొక్క ముడి విప్పుతూ ఒక్కొక్కటి స్ఫురణకు తెచ్చుకునేవారట. వచనం అయితే చెప్తుంటే వేరే ఎవరైనా లేఖకుడు వ్రాయాల్సిందే. ;ఏక వీర' వ్రాస్తున్నప్పుడుమాత్రం ప్రతి శుక్ర వారం టెంకాయ కొట్టి, పూజ చేసి..ఆశువుగా వినిపించే వారట. 'వేయి పడగలు'మాత్రం మొదట్లో స్వయంగా వ్రాయడం మొదలు పెడితే..మూడు ప్రకరణాలకు మూడు నెలలు పట్టిందట, ఇలా కాదని, చెప్పడం.. లేఖకుడు వ్రాయడం మొదలు పెట్టిన తర్వాత..29 రోజులలో వేయి పేజీలు ఏక బిగిన చెప్పారట! 


        సుష్టుగా భోజనం చేసే భోజన ప్రియుడు, ఆవకాయలో పచ్చి మిరప కాయ కొరుక్కునే ఆశ్చర్యకరమైన అలవాటు, కామిక్స్ అన్నా..స్టంటు సినేమాలన్నా..ఇంగ్లీషు సినిమాలన్నావదిలిపెట్టని ప్రీతీ.. ఇవి కొన్ని వారి అభిరుచులు, అలవాట్లు! అప్పుడప్పుడు ఆయన పీఠికలు గొప్పవా.. ఆ పీఠికలు వున్న గ్రంధాలు గొప్పవా.? అని అనేకులు తర్కించుకునేవారు అంటే ఆయన పీఠికలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చు 


             ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. ద్రావిడ భాష సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. 

          ''ఒక జాతి జాతీయతకు సంప్రదాయము ప్రాణము.అదే ప్రాణశక్తి'' అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంప్రదాయ భీష్ముడు. ఆయన మాట కరుకు, మనసు వెన్న, ఆయన మరెవరో కాదు తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్‌, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకే పురాకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గంగా తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచారాయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ వైభవ పునరుద్దానికై త్రికరణశుద్ధిగా అంకితం చేసిన రుషి వంటి కవి ఆయన. 

                 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును. 

                విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.

అందుకే ఆయనను 20 వ శతాబ్దానికి యుగ కర్తగా సంపూర్ణము అర్హులు.ఆయన అభినవ శ్రీనాధుడు.శ్రీనాధుని వలెనే ఈయన కూడా బహు గ్రంథ కర్త. ఇరువురు కూడా అమరణాంతము కవితా వ్యవసాయం చేసి అద్భుతమైన కావ్య ఫలాలు అందించిన వారు. సమున్నత వ్యక్తిత్వం ఉన్నవారు ఆయన కవి సార్వభౌముడు అయితే ఈయన కవి సమ్రాట్ 

              

పాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. 

                 ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి 'వేయి పడగలు' మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ఆ కాలంలో విశ్వనాధ వాణి ఆంధ్ర పౌరుష(1917), ఆంధ్ర ప్రశస్తుల(1919) రూపంలో సాహితీ రంగ ప్రవేశం చేసింది. 

              తన తొలి రచనలతోనే శ్రీశ్రీ వంటి ప్రతిభావంతున్ని మంత్రముగ్థుణ్ణి చేసి అనుకర్తగా ఆరాధకుడుగా, తీర్చిదిద్దినవాడు విశ్వనాధ. ఆ తరువాత శతాధికరచనలు చేసిన కొద్ది మందిలోనూ ఆయనే అత్యంత ప్రశస్తి పొందినవాడు. శ్రీనాధుడు తరువాత పరిసర ప్రకృతిని అంతగా పరిశీలించి వర్ణించిన మరో కవి విశ్వనాథే. ఆయన భాషా జాత్యభిమానాలకు తెలుగు రుతువులే నిదర్శనం. ఆయన రచనల్లో ప్రజాభిమానం సంపాదించినవి' 'కిన్నెరసాని' పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఆంధ్రా ప్రశస్తులు, విశ్వనాథ సత్యనారాయణ అభిమానించిన రచన మాత్రం శ్రీ మద్రామాయణ కల్పవృక్షము మహారచన. ఆ రచనకు జ్ఞానపీఠ్‌ పురస్కారం లభించింది. ఏకవీర చలన చిత్ర మయింది. చెలియలికట్ట పేరు తెచ్చింది. వరలక్ష్మి శ్రీశతి అనే స్మృతికావ్యం గుండెలు కరిగిస్తుంది. చారిత్రక నవలగా బద్దెన్న సేనాని ప్రతిష్టతెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితాధోరణుల మీద ఆయన విమర్శ వ్యాసాలు ప్రశంసలు కురిపించాయి. ఆంధ్రసాహిత్య చరిత్రను, భారతావతరణము'వంటి పది రేడియో నాటికలుగా మలిచారు. అమృత శర్మిష్ఠమ్‌, గుప్తపాశుపతమ్‌, అనే నాటకాలను 'ఆశ నిరాసకు' అనే నాటికను, 'దేవీ త్రిశతి' శివసాహస్రకు, వంటి కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించాడు. సత్యనారాయణ గారి రచనలో ప్రతిదీ ఒక సంచలన రచనే అయింది. ఆ రచనలు వస్తురీత్యా, ప్రయో గరీత్యా, శిల్పరీత్యా, ప్రమాణాల రీత్యా సంచలనం కలిగించినవే. ఈ సంచలనంలో ఆయనను సాంప్రదాయకులూ, సాంప్రదేయే తరులూ విమర్శకుల రూపంతో సమంగానే ఎదుర్కొన్నారు. అడ్డగించటానికి ప్రయత్నించారు.

            అయినా ఈ అవరోధాలన్నింటినీ సమర్థంగా తొలగించుకొంటూ విశ్వనాధ తొలిసారిగా సాహిత్య సరస్వతి ప్రవహించింది. తెలుగు నవలా సాహిత్యంలో తొలిసారిగా నవలకు 'కావ్య' గౌరవం సంపాదించి పెట్టింది. 'ఏకవీర' వస్తువు,దీని నిర్వహణపరంగా నూత్న ద్వారాలు తెరిచింది. కిన్నెరసాని పాటలు తెలుగులోని మాధుర్యాన్ని వాగులు పారించింది. 

               ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా విశ్వనాథ సత్యనారాయణ మహాకవి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించనివారు కూడా ఆయన ప్రతిభని కొనియాడారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదీ ఆయన గొప్పదనం. అదీ ఆయన సాధించిన సర్వకాలీన సార్వత్రిక సాహితీ విజయం. ఆయన రామాయణ కల్ప వృక్షం అర్థం కాక పోతే కిన్నెసాని పాటలు ఆస్వాదించవచ్చు. ‘వేయి పడగలు’... అంత బృహత్‌ నవల చదివే తీరిక, ఓపిక, సమయం లేదనుకొంటే ‘చెలియలికట్ట’ లేదా ’ఏకవీర’ లేదా పులి ముగ్గు వంటివి చదవచ్చు. ఏ ప్రక్రియను అభిమానించే వారికి ఆ ప్రక్రియలో ఎన్నో రచనలు చేసిన జ్ఞానపీఠి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రచనలు ముద్రించే కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రితో ఏమాత్రం సంబంధం లేకుండా ‘‘విశ్వనాథ సాహిత్య పీఠం’’ వెలిసింది. ఆ సంస్థ ప్రచురించిన ‘‘విశ్వనాథ వారి ముద్దు వడ్దన్లు’’లో ఏముందో చూద్దాం. 

                 ఆయన చేపట్టని ప్రక్రియా ప్రయోగమూ లేదన్నట్టుగానే, మానవ జీవితంలో ఆయన స్మృశించని సమస్య కూడా లేదేమోననిపిస్తుంది. ఆయన ప్రతి నవలా, ప్రతి కథా ఏదో ఒక సామాజిక సమస్యనో, మానసిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, సాహిత్య సమస్యనో, ఆర్థిక, రాజకీయ సమస్యనో...ప్రధానీకరిస్తుంది. విశ్వనాధ సత్యనారాయణ ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, ఆధునికాంధ్ర సాహిత్యంలో వారసత్వం, గురువు చూపిన పద్యరచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిల్చిపోయాయి. తరతరాలుగా అవిచ్ఛన్నంగా వున్న భారతీయ ధర్మం, మాత్రమే ఏక కాలానికి అయినా మానవజాతికందరికి ఆదర్శం. అనుసరణీయమని ఆయన అచంచల విశ్వాసం. భారతీయ ధర్మాన్ని, ప్రతిభాపాండిత్యాన్ని విజ్ఞాన విశేషాలన్నీ కవిత్వంలో రసమయంగా మలచి అందించిన మహాకవి విశ్వనాథ. దాదాపు అరవై నవలలు రాసి, ఆ నవలా సృష్టిలో భారతీయ ధర్మంతో పాటు, ఆధునిక భావాలను వ్యాఖ్యాన ప్రాయంగా కథ కల్పన చేసిన నవలా చతురాస్యుడు. సంస్కృతనాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ఠ, తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి, కావ్యతేదహరిశ్చంద్ర ప్రసిద్ధమైనవి. దాదాపు 150 గ్రంథాలకు పైగా రచన చేసిన ఏకైక తెలుగు కవి, విమర్శకుడు విశ్వనాథ. ఆయనకు 1958లో శాసన మండలి సభ్యత్వం వచ్చింది. 1971లో ఆస్థానకవి పదవి సంక్రమించింది. 1942లో కలకత్తాలో పుష్పకిరీటసన్మానం జరిగాయి. 'విశ్వనాధ' కొలవెన్నురామకోటేశ్వరరావుతో కలిసి ''త్రివేణి' అనే దైవమాసికాంగ్ల పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించారు. ....'జయంతి' అనే దైవమాసిక తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించారు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 

                ఆయన మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఈ చిన్ని ఉదాహరనే చాలు...బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు. ” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 

” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. 

” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 

” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! ” అన్నాడా అబ్బాయి తాపీగా. 

అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది. 

” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు.

విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ ! 


            రచయితగా ఆయన సుదీర్ఘ జీవితంలో ఎదురైన వ్యక్తులతో జరిపిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వం, సాహిత్యంపై ఇతరుల అభిప్రాయాలు, వివిధ సంఘటనలపై ప్రతి స్పందనలు ఆయన వివిధ అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ నాలుగు సంకలనాల్లో ఉన్నాయి. అటువంటివి కొన్ని చూద్దాం. 

* ‘‘మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు చప్పండి’’ అని శ్రీశ్రీని ఎవరో అడిగారట ఒక తూరి. దానికి వారు ‘‘ఒకటి- మహా ప్రస్థానం గీతాన్ని భారతి మాసపత్రిక తిరగ్గొట్టడం. రెండు- కవితా! ఓ కవితా అనే గీతం చదువుతూ ఉంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అశ్వసిక్త( కన్నీరు )నేత్రులు కావడం’’ అని అన్నారట.’’ 

* ఈ జ్ఞానపీఠ బహుమతికి తగుదునా? తగనా? అన్న విచారణ ఉంది. ఇదివరకు వచ్చిన వాళ్లంతా తగితే నేను మాత్రం ఎందుకు తగకూడదు? అనే దురహంకారము లేకుండా ఉండేందుకు అంత చేవ చచ్చిలేను గదా. నాకు అవార్డు ద్వారా లభించిన లక్ష రూపాయలలో చాలా మొత్తాన్ని మా తండ్రిగారు అరవై యేండ్ల క్రితం నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తాను. మిగతాది అనేక రంధ్రాలున్న నా జేబులో వేసుకొంటాను.

.   

నేషనల్ కాలేజి, హిందూ కాలేజి, ఏ సీ కాలేజి,విజయవాడ లో కళాశాలలో, కరీంనగర్ కళాశాలతొలి ప్రిన్సిపాల్ గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసన మండలి సభ్యులుగాఎక్కడ వున్నా రచనా వ్యాసంగమే వారి ప్రధాన వ్యాసంగము.


కల్పవృక్షముల వంటి సాహితీ సంపదని మనకి వారసత్వంగా అందించి 1976 అక్టోబరు 18న శివైక్యం చెందారు

ఎవరేమన్నా నా ఉద్దేశ్యం ఆధునిక యుగానికి యుగ కర్త శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారే అర్హులు

                         స్వస్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శంఖు నామ చక్రములు

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *స్వామి వారి*

   *శంఖు నామ చక్రములు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*తిరుమల వేంకటేశ్వరుని శంఖు నామ చక్రములు ద్వారా ఇస్తున్న సందేశం.*


*శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం.*


*శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది.*


*కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు.*


*చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.*


*జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది.*


*ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.*


*ఓం నమో వేంకటేశాయ॥*

*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

*ఓం నమఃశివాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

సుబ్రహ్మణ్యస్వామిని

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సుబ్రహ్మణ్యస్వామిని సర్ప రూపం లో ఎందుకు ఆరాధిస్తారు?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*కుమారస్వామి తన అన్నగారు అయిన వినాయకునికి గణాధిపత్యం ఇచ్చుటవలన అలిగి క్రౌ౦చపర్వతము అనగా శ్రీశైలము చేరారు. కుమారస్వామిని భూలోకం నుంచి తీసుకు వెళ్ళుటకు శివ పార్వతులు వృద్దుల రూపమున మొదట వచ్చారు. గావున మొదట వృద్ద మల్లికార్జునుడు తరువాత యవ్వనులు (పడుచువారు గా) లోపల భ్రమరాంబ - మల్లికార్జునులు గా వెలిశారు. ఈ విధముగా శ్రీశైలము లో జోతిర్లిoగము ఏర్పడినది.*


*శివ పార్వతులు అక్కడ కుమారస్వామితో కలిసి కాపురము పెట్టారు. అక్కడ చుట్టూ ఉన్న అడవిలో చెంచులు ఎక్కువగా నివసిస్తారు. వారు నాగ దేవతలను కులదేవతగా పూజిస్తారు. వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషుని అనుగ్రహంతో వల్లి అనే ఆమెను పెంచుకున్నారు. ఈమె ఆదిశేషుని (కొడుకు కూతురు కూతురు) మనుమరాలు. భూలోకమునకు పాము రూపము వదిలి మామూలు మానవ స్త్రీ గా వచ్చినది. కుమారస్వామి ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు ఆమెను చూచి ప్రేమలో పడ్డారు.మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యమని ఆమె తండ్రిని కోరారు.*


*అపుడు వారు అయ్యా.. మా అమ్మాయి నాగ స్వరూపిణి. ఆమె రాత్రి పూట పామై తిరుగును. ఆమె పాముని తప్ప ఇంకెవరినీ వివాహము చేసుకోను అని శపధము చేసినది అని చెప్పిరి . అదేమంత కష్టం కాదు నాకు అని కుమార స్వామి సర్పరూపము ధరించి ఆమెను వివాహము చేసుకున్నారు. ఈ సర్పరూపము ధరించినది మార్గశిర శుక్ల షష్టి రోజు. పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండలినీ శక్తి కి ప్రతీక.*


*గనుక ఈ రోజు నుంచి నీవు బ్రహ్మణ్య దేవుడువి అనగా సు(మంచి) బ్రహ్మణ్య దేవుడువి అనగా సుబ్రహ్మణ్యడివి అని వల్లీ దేవి యొక్క అసలు తండ్రి కుమదుడు కుమారస్వామిని దీవించెను.ఈ విధముగా పెళ్లి కొరకు కుమారస్వామి తన జాతినే మార్చుకొని సర్పముగా మారి సుబ్రహ్మణ్యడు అయ్యెను.*


*ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

ప్రేమకు ప్రతిరూపాలు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *ప్రేమకు ప్రతిరూపాలు*

             *రాధాకృష్ణులు*

         *(ఈరోజు రాధాష్టమి)*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*చరిత్రలో రాధాకృష్ణులను  ప్రేమకు ప్రతిరూపంగా చెబుతారు. వారి ప్రేమకు పవిత్రమైన గౌరవం దక్కుతుంది. చిన్నతనంలో అంటే, ఎనిమిదేళ్ల వయసులో ఉండగానే కృష్ణుడు , రాధ ప్రేమలో పడతాడు. అప్పటి నుండీ, ఆమెను అమితంగా ఆరాధిస్తాడు కృష్ణుడు.  అయితే, వీరి ప్రేమ గురించి ఎన్నో గాధలు విన్నా మనం, ఎక్కడా మనం రాధా కృష్ణుల పెళ్లి ప్రస్థావన మాత్రం వినలేదు, అసలు కృష్ణుడి జీవితంలో రాధ ఏమైంది అనే విషయం చాలామందికి తెలియదు, రేపల్లెలో ఉన్నంతవరకూ కృష్ణుడు – రాధను ప్రేమించాడు కదా, ఆ తర్వాత రాధ ఏమైంది. రుక్మిణీ, సత్యభామలతో పాటు, 16 వేల మంది గోపికలను సైతం కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడంటారే. అందులో రాధ ప్రస్థావన ఎక్కడా లేదు. కృష్ణుడి భార్యల్లో రాధది ఎన్నో స్థానం అనేది  అసలు రాధా కృష్ణుల ప్రేమ వ్యవహారం ఏమైందో అనేది తెలుసుకుందాం...*


*చిన్నతనం నుండీ రాధా కృష్ణులు కలిసి పెరిగారు. బృందావనం మొత్తం వీరి ప్రేమ పలుకులు పలుకుతూనే ఉంటుంది. అక్కడి గాలిలో వీరి ప్రేమ గీతాలు తీయని సంగీతంలా వినిపిస్తుంటాయి. అక్కడ పారే ఏరులు రాధాకృష్ణుల రాగాలే పల్లవులుగా పాడుతూ పారాడుతుంటాయి. మనుషులు వేరైనా ఆత్మ ఒక్కటే అనేంతలా వీరిద్దరూ కలిసిపోయారు.*


*బృందావనంలోని గోపికలందరూ కృష్ణుడిని అమితంగా ఇష్టపడతారు. కానీ, వారందరిలో ప్రేమ కన్నా, రాధ ప్రేమ భిన్నమైనది. అందుకే ఆమె ప్రేమ పట్ల అంతగా ఆకర్షితుడయ్యాడు కృష్ణుడు. మరి అలాంటి రాధా కృష్ణులు, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే యుక్త వయసు రాగానే, మేనమామ కంసుడిని వధించే క్రమంలో తన విధి విధానాలను అమలు చేసేందుకు ద్వారకకు బయలుదేరతాడు  కృష్ణుడు. ఆ సమయంలో తనను కూడా పెళ్లి చేసుకుని వెంట తీసుకెళ్లమని ప్రార్ధిస్తుంది రాధ. కానీ, కృష్ణుడు అలా చేయలేదు. ద్వారకకు వెళ్లిన కృష్ణుడు తన మేనమామను సంహరించడం, రుక్మిణీ సత్యభామలను వివాహం చేసుకుని, అక్కడే రాజ్యానికి రాజుగా స్థిరపడిపోయాడు. ఆ క్రమంలో రాధను మరచిపోయాడంటారు. కానీ, రాధ మాత్రం అక్కడే బృందావనంలో ఒంటరిగా  కృష్ణుడిని తలచుకుంటూ ఉండిపోయింది. అసలు రాధను కృష్ణుడు ఎందుకు విడిచిపెట్టేశాడంటే, అందుకు కారణం లేకపోలేదు. రాధను  విడిచి వస్తున్నప్పుడే కృష్ణుడు చెప్పాడు.. ఇద్దరు వేర్వేరు ఆత్మలకు బంధం కావాలి. ప్రేమతో కలిసిన  రెండు మనసులు కలసే ఉండాలంటే, వారు పెళ్లి చేసుకోవాలి.  కానీ, రెండు వేర్వేరు శరీరాలు.. ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించాడు. అప్పుడు అర్ధమైంది రాధకు. తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యమైందని. తనను కృష్ణుడి నుండి వేరు చేయడం, వేరు కావడం అనే ప్రశ్నే లేదని.  అందుకే రాధా కృష్ణుల ప్రేమ పూర్తిగా భిన్నమైనది. వారు ఒకరి కోసం ఒకరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అందుకే వారి ప్రేమకు చరిత్రలో అంత గొప్ప స్థానం ఉంది. అదీ రాధా కృష్ణుల అపూర్వ ప్రేమ గాధ.*


*జై శ్రీరాధేశ్యామ్।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

సనాతన ధర్మం

 జై శ్రీ రామ్ 


సనాతన ధర్మం లో మీరు ఏ దేవతను పూజ చేయండి,పూజలో చిట్టచివర అడిగేవి మాత్రం రెండే వుంటాయి,మీరు శివ స్వరూపం గా చేయండి, విష్ణు స్వరూపం గా చేయండి, మీరు ఏమి అడుగుతారంటే బుద్ధిని ప్రచోదనం చేయమని అడుగుతారు. "ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నః దంతి ప్రచోదయాత్". "తన్నః రుద్ర ప్రచోదయాత్". "తన్నః విష్ణు ప్రచోదయాత్" మీరు ఏ రూపంలో ఈశ్వరుడిని పూజించారో ఆ రూపం అనుగ్రహించవలసినది ఒక్కటే. మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఏమిటి బుద్ధి ప్రేరేపించటం? మనస్సు చెప్పిన ప్రతిదానికీ నేను వశుడను కాకుండెదను గాక. నా బుద్ధి బలంగా వుండి అది శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసుకొని అది నా జీవితమును తరింపజేయు గాక." తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్యం వ్యవస్థితౌ".ఒక కార్యాన్ని ఎలా చేయాలి ఎందుకు చెయ్యలి అన్న దానికి ప్రమాణం నేను చెప్పింది కాదు,మీరు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు,శాస్త్రం చెప్పింది ఒక్కటే. శాస్త్రం మీద మీకు గురి కుదరాలి అంటే గురువాక్యం నందు శ్రద్ధ ఏర్పడటం వినా మార్గం లేదు. అందుకే శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న దానికి వ్యాఖ్యానం చేస్తూ,భాష్యం చేస్తూ ఒక మాట అంటారు,"శాస్త్రస్య,గురువాక్యస్య,సత్యబుధ్యావధారణ. శాస్త్రం,గురువు ఈ రెండు చెప్పినవి ఏవి ఉన్నాయో ,వారిద్దరు చెప్పినవి సత్యం. అది నన్ను ఈ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది అన్న విశ్వాసము,పూనిక, దాని మీద నువ్వు గట్టిగా నిలబడ గలిగితే దానికి శ్రద్ధ అని పేరు.ఆ శ్రద్ధ మీకు వుంటే సమస్త ప్రయోజనములు వచ్చేస్తాయి.అసలు అది లేదనుకోండి.మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగారనుకోండి? చెయ్యమన్నారండి,చెయ్యకపోతే ఇబ్బంది అన్నారండి,అన్నారనుకోండి.ఇప్పుడు శాస్రాన్ని మీరు పాటిస్తున్నారు, కానీ పరిపూర్ణమైన అవగాహన లేదు.అవగాహన లేని పని ఏది వుందో దానిని కేవలం తంతు అని పిలుస్తుంది శాస్రం. తంతు అంటే కర్మేoద్రియముల స్థాయికి మాత్రమే దిగి నిలబడుతుంది."ఓం నిధనపతయే నమః"అన్నాననుకోండి,ఓ మారేడు దళం వేయి,అప్పుడు నోరు ఏమి అంటుందంటే "ఓం నిధనపతయే నమః" ఈ చెయ్యి ఏమి అంటుందంటే ఓ మారేడు దళమును అక్కడ వెయ్యి.నిధనపతయే నమః అని మీకు అవగాహనకి వచ్చిందనుకోండి.లేదు షోడశనామ స్తోత్రం చేస్తున్నారు గణపతిమీద."సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః , వక్రతుండ శ్శూర్పకర్ణ హేరంభో స్కంధపూర్వజః, షోడసైతాని నామాని యః పఠే చ్రుణయాదపి”, మీరు చదువుతున్నారు. ఏదో ఓ నామం దగ్గర మీ మనస్సు ఆగిపోయింది. అబ్బ. ఏమి నామం .ఎంత గొప్పది.మహానుభావుడు ఎంత శక్తి మంతుడో కదా. అందుకు కదా ఈ నామం వచ్చింది అని.మీ మనస్సు ప్రీతి పొంది, ప్రీతి పొందగానే తరువాతి నామం స్ఫురణలోకి రాదు. రాకపోతే ఏమి అవుతుందంటే మీకు తెలియదని కాదు,మీకు ధారణలో లేదని కాదు.అక్కడ ప్రీతి ఆవిష్కృతమై పోయింది. ఆవిష్కృతమవటంలో ఏమవుతుందంటే "సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప,ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో" అబ్బ ఏమి నామం, ఏమి నామం శమంతకోపాఖ్యానం అంతా అక్కడే కదా వుంది, గజాననః రాదు ఇంక , ఫాలచంద్రో, ఫాలచంద్రో అంటూ ఉంటారు. అసలు శాస్త్రం అంది, ఎవడికి నామం దగ్గర ఆగిపోయిందో వాడు పూజ చేశాడు.ఎందుకంటే ఇప్పుడు మనస్సు నిలబడింది. మనస్సు నిలబడి ఆ మనస్సు చెందిన ప్రీతి చేత కర్మేద్రియములు పూజ యందు అన్వయమైతే దానికి పూజ అని పేరు.తప్ప అసలు మనస్సు అక్కడ లేదు.మనస్సు అక్కడ ఉండటానికి కారణమేమిటి. మీకు, ఆ మూర్తికి మధ్య వున్న అనుబంధమేమిటో మీకు తెలియాలి. తెలిస్తే మీకు ఒక ప్రీతి ఉంటుంది.వీడు నా కొడుకు, నా కొడుకు కనబడగానే నాలో ప్రీతి కలుగుతుంది.ఎందుకు? మా ఇద్దరి మధ్య వున్న అనుబంధమేమిటో తెలుసు. వాడు మూడో నెలలోనో, ఆరో నెలలోనో వుండగానే ఎవరో పట్టుకు పోయారనుకోండి. వాడికి పాతిక ఏండ్లు వచ్చాయి. వాడు వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.నాకేమన్నా ప్రీతి కలుగుతుందా? వాడు నా కొడుకని నాకు తెలిస్తే కదూ?ఎవరో వచ్చి వాడు మీ కొడుకే నండీ,మూడో నెలలో పట్టుకుపోయామని చెప్పారనుకోండీ,అప్పుడు,నాన్నా!అని వెళ్ళి కౌగలించుకొంటాను.ప్రీతి పొంగింది.ప్రీతి పొందటానికి హేతువు అనుబంధం. ఈ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని మీరు గ్రహిస్తే కదూ అసలు,ఆ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని గ్రహింపుకి వచ్చారనుకోండి, మీరు పొంగిపోతారు, ఆయన పొంగిపోతాడు, చంద్రుని చూసి సముద్రం పొంగినట్లు. సముద్రుడిని చూసి చంద్రుడు పొంగినట్లు. ఉభయులు పొంగిపోతారు. కాబట్టి ప్రీతి ఆవిష్కృతం కావాలి.ప్రీతి ఆవిష్కృతమగు మాటనే భక్తి అని పిలుస్తారు. ఆ ప్రీతి కేవలం భావన అని మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. ఎందుకంటే భక్తి అన్న మాట ప్రేమ యొక్క మరొక పేరు. ప్రేమలో ప్రతిఫలాన్వేషణ వుండదు.ప్రతిఫలాన్వేషణ వున్నదో అది కామం. అది ప్రేమ కాదు.శిష్యుల యెడ వుండేది వాత్సల్యం.ఎవరైనా బాధ పడుతుంటే కలిగేది కారుణ్యం. ఎవరైనా మహాత్ములు కనబడితే వంగి ఆయన కాళ్ల మీద పడతాము. అది గౌరవం. మా నాన్నగారండీ , మా నాన్నగారు చెప్పిన మాట వినద్దూ,నాన్నగారి మాటకి గౌరవమిచ్చారు.అది గౌరవం.ఆయన లేనిదే నాకు బతుకే లేదు. ఆయనకి , నాకు వున్న అనుబంధమటువంటిది. విశేషప్రీతి పొందాను ఒక వస్తువు మీద. అది భక్తి.భక్తి ఈశ్వరుని యందు, గురువు నందు, తల్లి యందు, తండ్రి యందు కూడా నిలబడి పోతుంది. మాతృ భక్తి, పితృ భక్తి,గురు భక్తి,ఈశ్వర భక్తి అన్నమాటలు రావటానికి కారణం అదే. ఈ నాలిగింటి యందే భక్తి అన్న మాట వాడతారు. కారణమేమంటే ఈ నాలుగు మిమ్మలను ఉద్ధరిస్తాయి.పునర్జన్మల యొక్క పరంపరను తగ్గించగలుగుతాయి ఈ నాలుగు. అధవా! మోక్షాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ నాలిగింటిని భక్తి అన్న పదం తో అన్వయిస్తారు. మిగిలిన అన్నింటినీ ప్రేమ యొక్క స్వరూపంగా అన్వయిస్తారు. కారుణ్యము, వాత్సల్యము, గౌరవము ఇలాంటి మాటలు పిలుస్తారు. మీకు ఒక అనుబంధమేర్పడిందనుకోండి! ఒక విశ్వాసము ఏర్పడుతుంది. కొడుకు మీద తండ్రికుండే విశ్వాసము ఏమిటంటే తండ్రి ఆరాధన ఎక్కడ ఆగిపోతుందో అది కొనసాగిస్తాడు. అందుకే "ఆత్మావై పుత్రణామసి" . తండ్రి దగ్గర ఆగిపోకుండా కొనసాగించేవా డు కొడుకు. అందుకే ఇద్దరూ చెయ్యి మార్చుకొంటారు. ఒకప్పుడు తండ్రి పట్టుకుంటాడు ఒకప్పుడు కొడుకు పట్టుకుంటాడు. సింహాసనం దగ్గర గోత్రనామములతో చేసే పూజ ఆగదు.తండ్రి తరువాత స్వామి సింహాసనం దగ్గర పూజ కొడుకు చేస్తాడు. అదే అన్నిటికన్నా ఆగకూడని పెద్ద ప్రతిబంధకం.ఆయన కంఠం వరకు నర శరీరం. కంఠం పైన గజ ముఖం. ఎందుకు అలా వుండాలి? అంటే భాద్రపద మాసం దాటిన తరువాత అరణ్యములన్ని కూడా తీగలతోను, ముళ్ళతోను, చెట్లతో,పొదలతో నిండిపోతాయి. అంత నిండిపోతే శాఖాహారం తీసికొనే గజము నడిచి వెళ్ళిపోయిందనుకోండి, తీగలు తెగిపోతాయి. ఆ వున్నటువంటి కొమ్మలూ అవీ విరిగిపోతాయి. అది అడ్డొచ్చిన వాటినంతటినీ విరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క ఏనుగు పట్ట గలిగిన త్రోవలో అరణ్యము లోని మిగిలిన ఏ ప్రాణి అయినా పడుతుంది. అందుకని ఏనుగు ఒకటి నడిచిందా! వెనకాల ఎంత మంది అయినా నడవవచ్చు.కాబట్టి ముందు ఏనుగుని నడిపిస్తారు.

జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

ముసలితనం

 *విధి విసిరే చివరి అస్త్రం "ముసలితనం"*


వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు  ఒంటరివి.

వృద్ధోపనిషత్ లోని  ప్రతీ పేజీ 'మసకే', సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే "వృద్ధాప్యం".

కాలధర్మంలో దేహధర్మమే "వృధ్ధాప్యం".

మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"

లో భాగస్వామి కాక తప్పదు. జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి 

వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక అయితే వృద్ధాప్యంలో  దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు.‌ ఓ సారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది. "ఆరోజుల్లో నేను" అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన వుండదు. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సడలి, కదల్లేక, మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతా కాదు.‌

వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో

పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులు‌ కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం 

తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి.

"ఏమండీ / నాన్నగారూ." అంటూ విధేయంగా వుండే  భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడింగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా, యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే, మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.

చివరి మజిలీ !!

మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే, శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా, రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడించి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.

అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది. కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి  అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక  వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు.

ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి

కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్ గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో, మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే 'సారీ.! బిజీ.' అంటూ సమాధాన మొస్తుంది.

పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి

ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం

బాగుంటే అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు.

అనాథాశ్రమంలో అయితే  వాళ్ళు కూడా ఉండరు.

అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.

కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని  ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగా

బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థను

తలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్.!

ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.

వృద్ధాప్యం శాపం కాదు.

ఓ వరం. 

ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.

ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.

చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు.

ఏం చేసినా అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో? మన 

వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు.

సో… ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు,

భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితాల మీద ఓ లుక్కేసి వుంచుకోండి.!🙏