6, సెప్టెంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *6.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*6.11 (పదకొండవ శ్లోకము)*


*యశ్చింత్యతే ప్రయతపాణిభిరధ్వరాగ్నౌ త్రయ్యా నిరుక్తవిధినేశ హవిర్గృహీత్వా|*


*అధ్యాత్మయోగ ఉత యోగిభిరాత్మమాయాం 6'&ॐ జిజ్ఞాసుభిః పరమభాగవతైః పరీష్టః॥12386॥*


పరమేశ్వరా! ఋత్విక్కులు వేదోక్తవిధుల అంజలిద్వారా హవిస్సులను దీసికొని ఆహవనీయాది యజ్ఞాగ్నులయందు అర్చించు సమయమున నీ చరణకమలములను స్మరించుచుందురు. యోగులు అధ్యాత్మయోగముద్వారా నీ తత్త్వమును ఎరుంగుటకై సర్వదా నీ పాదపద్మములనే ధ్యానించుచుందురు. నీ మాయాస్వరూపమును తెలిసికొనగోరు భాగవతోత్తములు నీ పాదారవిందములనే సేవించుచుందురు. ఈ విధముగా నీ పరమభక్తులు నీ చరణకమలములనే సర్వారాధ్యములుగా భావించి వాటిని ఉపాసించుచుందురు. అట్టి నీ పాదపద్మములు, మా పాపరాశిని భస్మము చేయుగాక.


 *6.12 (పండ్రెండవ శ్లోకము)*


*పర్యుష్టయా తవ విభో వనమాలయేయం సంస్పర్ధినీ భగవతీ ప్రతిపత్నివచ్ఛ్రీః|*

యః

 *సుప్రణీతమముయార్హణమాదదన్నో భూయాత్సదాంఘ్రిరశుభాశయధూమకేతుః॥12387॥*


సర్వేశ్వరా! నీ భక్తులు ప్రేమతో నీకు వనమాలను సమర్పించుచుందురు. దానిని నీవు ఆదరముగా స్వీకరించుచుందువు. భక్తులయెడ నీకు గల వాత్సల్యమునకు ఇది తార్కాణము. పూజ్యురాలైన లక్ష్మీదేవి నీ వక్షస్థలమునందు నిత్యనపాయనియై యుండును. నీ పాదములవరకు వ్యాపించియున్న తులసీమాలను, అట్లే భక్తులపై నీకు గల వాత్సల్య వైభవములను గాంచి ఆ దేవి సవతివలె ఈర్ష్యపడుచుండును. వాస్తవముగా తులసీమాలను అర్పించుటవలననే నీ పూజ సార్థకమై నీవు ప్రసన్నుడవు అగుదువు. అట్టి నీ పాదారవిందములు మా అశుభములను రూపుమాపుగాక!


 *6.13 (పదమూడవ శ్లోకము)*


*కేతుస్త్రివిక్రమయుతస్త్రిపతత్పతాకో యస్తే భయాభయకరోఽసురదేవచమ్వోః|*


*స్వర్గాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్ పాదః పునాతు భగవన్ భజతామఘం నః॥12388॥*


పరమేశ్వరా! వామనావతారమున నీవు మూడు అడుగులతో ముల్లోకములను ఆక్రమించితివి. ఒక పాదముతో సత్యలోకమును ఆక్రమించితివి. అచట నీ పాదము నుండి జనించిన గంగాజలమలతో బ్రహ్మదేవుడు నీ పాదములను కడిగెను. ఆ గంగాజలమే త్రిలోకమల యందును ప్రవహించుచు నీ కీర్తిని సకలలోకములయందును వ్యాపింపజేయు పతాకమైనది. నీ త్రివిక్రమావతారము అసురసేనలకు భయమును కలిగించును. నీ భక్తులకును, దేవతలకును అభయమునిచ్చును. నీ చరణకమలములు సాధుపురుషలకు పరమపదప్రాప్తిని గూర్చెడి సాధనములు. కాని వీటిని అవహేళన చేసినవాడు నరకకూపములో పడిపోవును. అట్టి నీ దివ్యపాదములు మా ౌక్షైైైక్షపాపములను పారద్రోలి మమ్ములను పవిత్రులనుజేయుగాక!


 *6.14 (పదునాలుగవ శ్లోకము)*


*నస్యోతగావ ఇవ యస్య వశే భవంతి బ్రహ్మాదయస్తనుభృతో మిథురర్ద్యమానాః|*


*కాలస్య తే ప్రకృతిపూరుషయోః పరస్య శం నస్తనోతు చరణః పురుషోత్తమస్య॥12389॥*


పురుషోత్తమా! ముక్కుత్రాళ్ళువేయబడిన వృషభములు తమ యజమాని అధీనములో నుండునట్లు పిపీలికాది బ్రహ్మపర్యంతముగల దేహధారులందరును పరస్పరము బాధించుకొనుచున్నను కాలస్వరూపుడవైన నీకు వశవర్తులై యుందురు. నీవు ప్రకృతి పురుషులకును అతీతుడవు. అట్టి పరమాత్మవైన నీ యొక్క చరణకమలములు మాకు శుభములను ఒసంగుగాక!


 *6.15 (పదిహేనవ శ్లోకము)*


*అస్యాసి హేతురుదయస్థితిసంయమానామవ్యక్తజీవమహతామపి కాలమాహుః|*


*సోఽయం త్రిణాభిరఖిలాపచయే ప్రవృత్తః కాలో గభీరరయ ఉత్తమపూరుషస్త్వమ్॥12390॥*


దేవా! ఈ జగత్తుయొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణము నీవే. ఏలయన ప్రకృతి, పురుష, మహత్తత్త్వములను నియంత్రించునట్టి కాలపురుషుడవు నీవేయని వేదములు ఉద్ఘోషించుచున్నవి. శీత, గ్రీష్మ, వర్షాకాలములనెడి నాభిత్రయముతోగూడిన సంవత్సరరూపములో నీవు సకలజీవులను క్షయోన్ముఖముగా నడిపించెడి కాలపురుషుడవు. నీ గమనము గంభీరమైనది, మిక్కిలి వేగవంతమైనది. అట్టి పురుషోత్తముడవైన నీ చరణకమలములకు నమస్కారము.


 *6.16 (పదహారవ శ్లోకము)*


*త్వత్తః పుమాన్ సమధిగమ్య యయా స్వవీర్యం ధత్తే మహాంతమివ గర్భమమోఘవీర్యః|*


*సోఽయం తయానుగత ఆత్మన ఆండకోశం హైమం ససర్జ బహిరావరణైరుపేతమ్॥12391॥*


స్వామీ! సూత్రాత్ముడు, హిరణ్యగర్భుడు ఐన పురుషుడు నీ అమోఘమైన తేజస్సును పొంది, దాని ప్రభావమున మహత్తత్ప్వమును ధరించెను. హిరణ్యగర్భుడైన ఆ బ్రహ్మయే మాయతోగూడి, 'పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము' అను ఏడు ఆవరణములుగల సువర్ణమయమైన బ్రహ్మాండమును రచించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *06.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2253(౨౨౫౩)*


*10.1-1366-*


*ఆ. త్రిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు*

*వదనగహ్వరమున వఱదవాఱ*

*ముష్టికుండు ఘోరముష్టి సత్వము చెడి*

*గూలె గాలిఁ దరువు గూలునట్లు.* 🌺



*_భావము: బలరాముడు ఆ ముష్టికుణ్ణి అలా గిరగిరా త్రిప్పి నేలమీద విసిరి కొట్టగా, ప్రచండమైన వాయు వేగానికి కూలిన మహావృక్షములాగా నేలకూలాడు. బలరాముని దెబ్బకు గుహ వంటి వాడి నోటివెంట రక్తము వరదలై ప్రవహించి, శక్తి నశించిపోయింది._* 🙏



*_Meaning: As Balarama turned the warrior Mushtika round and round and threw him to ground, he fell like a massive tree hit by gale. Blood flowed like flood from Mushtika’s cave-sized mouth and he was crippled and lost the will to fight._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కినుక -- కానుక

 డా. దేవులపల్లి పద్మజ

విశాఖపట్టణము

ఫోను 9849692414


కినుక -- కానుక



సాయంత్రం 6గంటలకి ఆఫీసు నుంచి రాగానే తన మనసులో మాట చెప్పాడు రామం. ఆలోచించు వసుధా....నీ కష్టం కొంతైనా తగ్గుతుంది ఇలా చేస్తే.. ఎలా చేస్తే? అంటూ రెట్టించింది వసుధ. అంటే వినలేదనమాట అని లోపలే అనుకుంటూ.. అదే వాయిదాల పధ్ధతి లో వాషింగ్ మిషన్ కొనుక్కుని ఈ సంవత్సరం పెళ్ళి రోజు గుర్తుగా బట్టలు ఏదో మామూలుగా వేసుకునేవాటితో సరిపెట్టేద్దాం...ఏం..సరేనా అన్నాడు రామం.


     అదేమిటంటే మరి ఇది మన పదవ పెళ్ళి రోజు కదా. ఎప్పటికి మిగిలిపోయే అనుభూతులు ఉండాలని పట్టు చీర అడిగాను..పోనీండి కుదరకపోతే. బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం నాకు అలవాటైన పనే కదా! అంటూ సమాధానం చెప్పి , తెచ్చిన కాఫీ కప్పు చేతిలో పెట్టి వంట గదిలో కెళ్ళి ఎంతకీ బయటికి రాలేదు. వంటగదిలోనే పిల్లల చేత చదివిస్తూ పని చేసుకుంటోంది. ఏం చేస్తోందో అనుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని సీరియస్ గా కూరలు తరుగుతున్న భార్యకేసి చూస్తూ పిలిచాడు... చేస్తున్న పని ఆపకుండా అతనికేసి తిరిగి ఏమిటి అంది.


ఇంట్లో పని ఎక్కువైపోయి అలసిపోతున్నావు కదా...వీలైతే రెండూ ఆలోచిద్దాం..ఈరోజు ఓ కంపెనీ వారు కొత్తగా తయారు చేసిన వాషింగ్ మిషన్ లు మార్కెట్ కి పరిచయం చేస్తూ మా ఆఫీసు కి వచ్చి, వాయిదాల పధ్ధతి లో తక్కువ మొత్తం చెల్లించి తీసుకునే అవకాశం ఇచ్చారు. మా సెక్షన్ లో ఉన్న కొంతమందికి ఆ సౌకర్యం లేని వారు అందరం కలిసి యాభైమంది ధర విషయం లో ఇంకా తగిస్తే తీసుకుంటామని అడిగాము. దానికి అంగీకరించి ఒక్కొక్కటి ఎనిమిది వేలకు ఖాయం చేసాడు..నువ్వు సంతోషంగా ఒప్పుకుంటావని నా పేరు కూడా ఇచ్చేసాను..అదీ సంగతి...కాస్త నవ్వవా? అంటూ తప్పు చేసిన వాడిలా చెవులు పట్టుకున్నాడు. తండ్రిని చూసి పాప అమ్మా ! డాడీని చూడూ అంటూ అరిచింది.


ఆ అభినయం చూసిన వసుధ గల గలా నవ్వేసింది...జత కలిపాడు రామం... మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి. నేను ఎపుడైనా అభ్యంతరం చెప్పానా. నేను ఆలోచిస్తున్నాను...మనసులో రెండు ఫోటోలు కనపడ్డాయి పక్క పక్కనే, అంది. అలాగా ఏమిటో అవి...రామం అడిగారు. నేనూ వాయిల్ చీరలో స్టైల్ గా వాషింగ్ మిషన్ పక్కనే నిలబడినది, కంచిపట్టుచీర కట్టుకని పీట మీద కూర్చుని బట్టలు ఉతికేస్తున్నట్టూ రెండు ఫోటోలు కనపడ్డాయి...నేను మొదటి ఫోటోకే టిక్ పెట్టేసాను...అంది. హమ్మయ్యా నా మనసు తేలిక పడింది.. నిన్ను డిసప్పోయంట్ చేసానేమో అనుకున్నాను. అన్నాడు రామం. 

ఎందుకండీ అనవసర విషయాలకి అంత ప్రాధాన్యత ఇవ్వడం..వదిలేయండి..అంది. హాల్లోకి వచ్చి పేపర్ తిరగేస్తూంటే రామం ఆలోచనలు గతంలోకి వెళ్లిపోతున్నాయి కానీ కళ్ళు అక్షరాలవెంట పరిగెట్టడంలేదు.


పది సంవత్సరాల వైవాహిక జీవితం లో ఎప్పుడూ ఏదీ అడగలేదు. పరిస్థితిలకి తగినట్టుగా సర్దుకుపోతూ పరువుకి ఆత్మాభిమానానికి విలువ ఇస్తుంది..చిన్నతనం నుంచి టీచరైన తండ్రి నేర్పిన వాస్తవ పాఠాలు బాగానే నేర్చుకుంది..లేకపోతే అంతంత మాత్రం అయిన తన జీతంతో నేర్పుగా సంసారం నడుపుకొస్తోంది. ఈ దశాబ్ద కాలంలో ఓ పట్టుచీరే కదా అడిగింది. నేను తన మనసు కష్టపెట్టానేమో.. ఎలాగోలా మొదటి మొత్తం వాయిదా ఏర్పాటు చేసి తనకిష్టమైన వంగపండురంగు పట్టు చీర కూడా కొనేసి సర్పైజ్ చేయాలి ఓ నిర్ణయానికి వచ్చి గబగబా తయారై బయటికి వెళ్ళి పోయాడు. 

.

పెళ్ళి రోజు రానే వచ్చింది...ఉదయమే భర్తకి శుభాకాంక్షలు చెప్తూ చేతిలో ఓ డ్రస్ పెట్టి త్వరగా తయారవండి అంది. పిల్లలకు కొత్త బట్టలు వేసి సిధ్ధం చేసింది. రామం వచ్చేసరికి తన పెళ్ళినాటి చీర తో గుడికి వెళ్ళే ప్రయత్నం లో ఉంది. వసుధా! ఒకసారి ఇలా త్వరగా రావాలి గట్టిగా అరిచాడు. ఏమైందో అని కంగారుగా లోపలికి వెళ్ళింది. తన డ్రెసింగ్ టేబుల్ ముందు కూర్చుని వసూ ఇదిగో నాకు తెల్ల వెంట్రుకలొచ్చేసాయి. ఎలా మరి అన్నాడు. హాస్యంగా చాల్లెండి సంబరం.. ముందు దేవుడి దర్శనం చేసుకుని రావాలి రండి అంది .గది బయటికి అడుగులేస్తూ. ఆగు వసూ చేయి పట్టి ఆపి కళ్ళు మూసి, వెనుకనుంచి ఓ చీర ఆమెకి చూట్టేసాడు.. వసుధ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యం ఆనందంతో ఎందుకండీ ఇవన్నీ అంది. అదేమిటి నువ్వు మాకు కొత్త బట్టలు ఇస్తే మేము కట్చేసుకోవాలి మారు మాట్లాడకుండా. నేను ఇస్తే నువ్వు కూడా మాట్లాడకూడదు. రామం,వసుధా పిల్లలు ఆటోలో దగ్గరలో ఉన్న శివాలయం లో దర్శనం చేసుకుని వచ్చేసారు. భర్త తెచ్చిన వంగపండు రంగు కంచి పట్టు చీర లో ముఫ్ఫై ఐదేళ్ళ వసుధ అందమైనదే.


గులాబ్ జామ్, పులిహోర మధ్యతరగతి పండగ మెనూతో భోజనం చేసి టీ వీ చూస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. బాబు వెళ్లి తలుపు తీసాడు. వాషింగ్ మిషన్ తీసుకొచ్చి హాల్ లో పెట్టి, డెమోకి కంపెనీ నుంచి మనిషి వస్తాడని చెప్పి వెళ్లిపోయాడు. తన ఇష్టం, కష్టం కూడా ఆలోచించే భర్తని ఇచ్చిన భగవంతునికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసింది వసుధారామం.. పిల్లలిద్దరూ కొత్త వస్తువుని చూసి సంబరపడుతూ దానిచుట్టూ చెక్కెర్లు కొడుతున్నారు.


సాయంత్రం రామం, వసుధని, పిల్లలని తీసుకుని షికారుకని బయటికి తీసికెల్లేడు. డాడీ పార్క్ కి వెళదామా అన్నాడు. బాబు వద్దు డాడీ సినిమాకి వెళదాము అంటోంది పాప నవ్వుతూ వాళ్ళకేసి చూసి ముగిసిపోతోంది వసుధ. ఆటో ఎక్కించి ఎపుడూ చూడని ప్రదేశం పేరు చెప్పి తీసికెళ్ళమన్నాడు రామం. ఓ పదినిమిషాల తర్వాత అక్కడ దింపేశాడు 

ఆటో అతను. జనసంచారం ఎక్కువ లేదు గానీ, దూరంగా నిర్మాణంలో ఉన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఏమిటి డాడీ ఇక్కడ ఏమీ బాగా లేదు ఆడుకోడానికి..ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చారు అని బాబు నిరుత్సాహంగా అడుగుతున్నాడు.

ఓ నాలుగైదు వందల అడుగులు వేసాక అక్కడ ఆగమని పాపని చేయి వదిలి, షర్టు జేబులోంచి ఓ పేపర్ తీసి, భార్య చేతిలో ఉంచి ఇదిగో వసుధా! అంటూ ఆమె చేతిలో ఉంచాడు. ఏమిటిది అంటూ తీసుకుని చూసింది..ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన రెండు వందల గజాలు వసుధారామం పేరుతో ఉన్న దస్తావేజు..ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమిటండీ ఇదెలా వచ్చింది. ప్రశ్నలు ఒరవడి కురిపించేస్తోంది..స్వరంలో కంగారూ, ఆశ్చర్యం, ఆనందం కలగలిపేసి.



ప్రశాంతంగా విను, ఆవేశపడకు, నేనూ భారమైన పనేమీ చేయలేదు.. నా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఓవర్ టైం చేసిన మనీ అంతా వేరే ప్రత్యేకంగా దాస్తూ వచ్చాను...ఈ పన్నెండు సంవత్సరాలలో అది పెరిగి పెద్దదై మనకి ఈ స్థలం కొనిచ్చింది..దీనిని నీ పేరుతోనే కొన్నాను...ఈ రోజు నీకు కానుకగా ఇద్దామని...నీదే ఇది, నేనూ ఇద్దరు పిల్లలు ఫ్రీ ఆఫర్ ...బాగుందా సంతోషమే కదా! అన్నాడు. ఈ కానుక ఇవ్వకపోయినా సంతోషంగా నా కుటుంబంలో నాకు ఎప్పుడూ ఆనందమే...అతని చేయి తీసుకుని అతనిచ్చిన దస్తావేజు చేతిలో పెట్టింది...అయితే నేను , మీ నుంచి ఓ మాట కోరుకుంటున్నాను..ఇస్తారా అంగీకారం.,అంది వసుధ.  



 ఏమిటో అడగండి దేవి గారూ! ఏమీలేదు ఈరోజు గుర్తు గా నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. .. మనకి దగ్గర లో ఉన్న స్కూల్ లో ఎలిమెంటరీ పిల్లలకు టీచర్ గా నిన్ననే మాట్లాడి వచ్చాను. వచ్చే ఒకటవ తేదీ నుంచి తరగతులు ఇస్తామన్నారు... పదివేలు ఇస్తారు జీతం.. నేను ఆ మొత్తం మనం కట్టుకునే ఇంటి కోసం జమచేస్తూ ఉంటాను.మీరు సరే అంటే చేరిపోతాను వచ్చే నెలలో. తప్పకుండా వెళ్ళండి దేవి గారూ ముందుగా హృదయపూర్వక అభినందనలు కూడా అందిస్తూ, రామం సమాధానం. తనను అర్థం చేసుకునే భర్త లభిస్తే అంతకంటే ఏమి కావాలి ఇల్లాలికి. ఒకరికొకరు పరస్పర అవగాహన తో సంసారనావను లాహిరి లాహిరిలో జగమే ఊగెనుగా పాడుకుంటూ సాగిపోవడమే అనుకుంది వసుధ. చిరు చీకటి పడుతుండగా అక్కడ నుండి బయలుదేరి సినిమాకి టికెట్ 

దొరికితే చూసి, హోటల్ లో భోజనం చేసి ఇంటికి వెళ్లి సంతోషంగా దశమ వివాహ వార్షికోత్సవం జరిగింది. అని తృప్తిగా ఆ జంట మనసులో పదిలంగా రాసుకున్నారు... 


@@@@@

వ్యక్తిత్వం లో వజ్రం

 వ్యక్తిత్వం లో వజ్రం 


మన జాతికి దొరికిన ' రత్నం '


డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు. కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన్ టాటా. '' సార్ , మీరు ? '' '' అవును , మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? '' అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 


TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 


బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది. 


యవ్వనం లో ఆయన girl friend మోసం చేసింది. 


ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి. 


కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరవచిపోలేదు. TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చాడో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది : 


టాటా సంస్థ అయిన TCS యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.  


భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది. 


ప్రతి ఏటా అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50 000 + కోట్లు ]  


నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క Taj Hotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ] ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో , చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం , పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ] నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అప్పుడు [ 2008 లో]అధికారంలో వుండిన రాష్ట్రప్రభుత్వం [విలాస్ రావు దేశ్ ముఖ్ గారు ముఖ్యమంత్రిగా వుండిన కాంగ్రెస్ ప్రభుత్వం ] దాడిజరిగి 12 ఏళ్ళు అయినా ఇంకా అందరికీ నష్టపరిహారం చెల్లించలేదు. రతన్ టాటా కేవలం 480 గంటల్లో చెల్లించేసాడు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు : Don't mess with him ; if you give him Deep insults , he will transform them into Deep results.  


నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి '' ధనంతో '' దేశాన్ని సేవిస్తున్నాడు.🙏❤️👍

"కైలాస పర్వతం

 "కైలాస పర్వతం"

ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?


హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ, ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.


మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత కలిగి ఉంది.


కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి. శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని, అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు. కైలాస శిఖరాన్ని మరణం తరువాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు.


కైలాష్ పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేనివాడు అవుతాడని కూడా నమ్ముతారు. దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడం, అందుకే ఇప్పటివరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు.


1999 లో, రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం క్రింద ఒక నెల పాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది. ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కైలాస పర్వతాన్ని "శివ పిరమిడ్" అని కూడా పిలుస్తారు.


ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారెవరైనా చనిపోయారు, లేదా ఎక్కకుండా తిరిగి వచ్చారు.


2007 లో, రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు: "కొంత దూరం ఎక్కడం నా తలపై మరియు మొత్తం జట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది. అప్పుడు మా అడుగులు సమాధానం ఇచ్చాయి. నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి, మరియు నాలుక స్తంభింపజేసింది. నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది. ఎక్కేటప్పుడు, ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను. నేను వెంటనే టేకాఫ్ చేయడం మొదలుపెట్టాను, అప్పుడు నాకు విశ్రాంతి వచ్చింది.


"కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు, అతను ఇలా వివరించాడు:" నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే, మంచు కురుస్తుంది. మరియు ప్రతిసారీ నేను బేస్ క్యాంప్‌కు తిరిగి రావలసి వచ్చింది. "అప్పుడు చైనా ప్రభుత్వం కొంతమంది అధిరోహకులను కైలాస శిఖరాన్ని ఎక్కమని కోరింది. అయితే ఈసారి ప్రపంచం మొత్తం ఈ చైనా చేష్టలను వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వం ఈ పర్వతం ఎక్కడం మానేసింది. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు, అతను ఎక్కలేకపోతున్నాడు, అతని గుండె మారుతుంది. గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది. మీ జుట్టు మరియు గోర్లు 2 రోజుల్లో పెరుగుతాయి, ఇది 2 వారాలలో పెరుగుతుంది. కనిపిస్తోంది. వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది. కైలాస శిఖరం ఎక్కడం క్రీడ కాదు.


29,000 అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం. కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు. నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచుకొండలతో చేసిన కైలాష్ పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు. అతి పెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్ళను ఎక్కడానికి మోకరిస్తారు.ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాష్ పర్వతం చుట్టూ కక్ష్యలోకి వస్తారు. మార్గంలో, మానస సరోవరంను కూడా సందర్శిస్తాడు, కాని ఈ రోజు వరకు ఒక విషయం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ పర్వతం తగినంతగా తెలిస్తే, ఈ రోజు వరకు ఎవరూ ఎందుకు ఎక్కలేదు?

🔥🔥😊😊☺️☺️🔥🔥

సంస్కృత మహాభాగవతం*

 *6.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.6 (ఆరవ శ్లోకము)*


*స్వర్గోద్యానోపగైర్మాల్యైశ్ఛాదయంతో యుదూత్తమమ్|*


*గీర్భిశ్చిత్రపదార్థాభిస్తుష్టువుర్జగదీశ్వరమ్॥12381॥*


బ్రహ్మాదిదేవతలు స్వర్గమునగల నందనవనము, ఇతర ఉపవనములయందలి దివ్యకుసుమములతో ఆ యదువంశోత్తముని అలంకరించిరి. ఇంకను వారు చిత్రవిచిత్రములైన, అర్థవంతములగు వాక్కులతో ఆ జగదీశ్వరుని ఇట్లు ప్రస్తుతించిరి-


*దేవా ఊచుః*


*6.7 (ఏడవ శ్లోకము)*


*నతాః స్మ తే నాథ పదారవిందం బుద్ధీంద్రియప్రాణమనోవచోభిః|*


*యచ్చింత్యతేఽన్తర్హృది భావయుక్తైర్ముముక్షుభిః కర్మమయోరుపాశాత్॥12382॥*


*దేవతలు ఇట్లు స్తుతించిరి* "ప్రభూ! ముముక్షువులు (మోక్షేచ్ఛగలవారు) దృఢమైన తమ సంసారకర్మ బంధములనుండి విముక్తిని పొందుటకై తమ హృదయ కమలములయందు నీ పాదపద్మములను భక్తిశ్రద్ధలతో నిరంతరము స్మరించుచుందురు. అట్టి నీ పాదారవిందములకు మా బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, వాక్కులతో మేము ప్రణమిల్లుచున్నాము.


*6.8 (ఎనిమిదవ శ్లోకము)*


*త్వం మాయయా త్రిగుణయాఽఽత్మని దుర్విభావ్యం వ్యక్తం సృజస్యవసి లుంపసి తద్గుణస్థః|*


*నైతైర్భవానజిత కర్మభిరజ్యతే వై యత్స్వే సుఖేఽవ్యవహితేఽభిరతోఽనవద్యః॥12383॥*


పరమపురుషా! త్రిగుణాత్మకమైన నీ మాయ సులభముగా బోధపడదు. కాని అట్టి మాయద్వారా నీవు నీ నుండియే ఈ దృశ్యజగత్తును లీలగా వ్యక్తమొనర్చుచున్నావు. రజోగుణము ద్వారా జగత్తును సృష్టింతువు. సత్త్వగుణముద్వారా దానిని పాలింతువు. తమోగుణముద్వారా దానిని లయమొనర్తువు. ఐనను ఆ కర్మలు, కర్మఫలములు నీకు అంటవు. ఏలయన, నీవు త్రిగుణాతీతుడవు, ఆత్మారాముడవు. నిన్ను మాయ కప్పివేయజాలదు. నీవు నిరంజనుడవు. పరమానంద స్వరూపుడవు.


*6.9 (తొమ్మిదవ శ్లోకము)*


*శుద్ధిర్నృణాం న తు తథేడ్య దురాశయానాం విద్యాశ్రుతాధ్యయనదానతపఃక్రియాభిః|*


*సత్త్వాత్మనామృషభ తే యశసి ప్రవృద్ధసచ్ఛ్రద్ధయా శ్రవణసంభృతయా యథా స్యాత్॥12384॥*


సకలలోకపూజ్యుడవైన పురుషోత్తమా! అంతఃకరణశుద్ధిలేని జనులయొక్క చిత్తములు విద్యాభ్యాసము వలనగాని, వేదాధ్యయనమువలనగాని, దానములూ, తపస్సులు యజ్ఞాదిక్రియలు మొదలగు వాటివలనగాని సంపూర్ణముగా పరిశుద్ధి నొందజాలవు. కాని అంతఃకరణశుద్ధిగల నీ భక్తులు నీ అద్భుతలీలలను గూర్చిన కథలను, నీ ప్రభావములను, నీ యశస్సును, శుభప్రదములైన నీ గుణములను వర్ణించెదరు, వినెదరు. అందువలన వారికి నీయందు భక్తిశ్రద్ధలు ఏర్పడి, వెంటనే వారి అంతఃకరణములు పునీతమలగును (అంతఃకరణశుద్ధి లేనప్పుడు వేదాధ్యయనములు, విద్యాభ్యాసములు మొదలగునవి సత్ఫలితములను ఈయజాలవు).


*6.10 (పదియవ శ్లోకము)*


*స్యాన్నస్తవాంఘ్రిరశుభాశయధూమకేతుః క్షేమాయ యో మునిభిరార్ద్రహృదోహ్యమానః|*


*యః సాత్వతైః సమవిభూతయ ఆత్మవద్భిర్వ్యూహేఽర్చితః సవనశః స్వరతిక్రమాయ॥12385॥*


మునీశ్వరులు తమక్షేమమును కోరుతూ ప్రేమార్ధ్రములైన తమ హృదయములలో నీ పాదపద్మములను నిరంతరము ధ్యానించుచుందురు. సత్త్వగుణసంపన్నులగు, జితేంద్రియులైన నీ భక్తులు సమానైశ్వర్యములను పొందుటకై వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను నీ చతుర్వ్యూహరూపమున మూడుపూటలా నీ పాదములను ఆరాధించుచుందురు. వారు స్వర్గమును అతిక్రమించి వైకుంఠపదమును పొందుటకై వాటిని అర్చించుచుందురు. అట్టి నీ పాదారవిందములు మా పాపవాసనలను భస్మమొనర్చుటకు అగ్నిస్వరూపము అగునుగాక!


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*991వ నామ మంత్రము* 6.9.2021


*ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః*


మంత్రశాస్త్రమందలి షడధ్వములను (1.పదాధ్వము, 2. భువనాధ్వము, 3. వర్ణాధ్వము, 4. తత్త్వాధ్వము, 5. కలాధ్వము, 6. మంత్రాధ్వము అను మార్గములను) అతిక్రమించిన రూపము గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *షడధ్వాతీత రూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే బ్రహ్మజ్ఞాన తత్త్వమును తెలియదగు మార్గము సుగమమగును.


అధ్వము అనగా మార్గము. షడాధ్వము అనగా ఆరు మార్గములు. మంత్రశాస్త్రములో పదాధ్వ, భువనాధ్వ, వర్ణాధ్వ, తత్త్వాధ్వ, కలాధ్వ, మంత్రాధ్వ అను ఆరు ఉపాసనా మార్గములు గలవు. ఇందులో వర్ణాధ్వము, పదాధ్వము, మంత్రాధ్వము అను మూడును విమర్శాంశములు. అనగా నామాత్మకమగు శబ్ద బ్రహ్మ స్వరూపములు. ఇవి శక్తిరూపములు. కలాధ్వము, తత్త్వాధ్వము, భువనాధ్వము అను ఈ మూడును ప్రకాశాంశ స్వరూపములు. అనగా రూపాత్మక బ్రహ్మస్వరూపములు. ఇవి శివరూపములు. ఈ వివరము విరూపాక్ష పంచాశికయందు చెప్పబడినది. దీనిని బట్టి మంత్రశాస్త్రములో ఆరు అధ్వములు (మార్గములు) ఉండగా అందులో మూడు శక్తిరూపములు, మూడు శివరూపములు. 


జ్ఞానార్ణవ తంత్రములో "శ్రీచక్రమందు షడధ్వములు గలవనియు, అట్టి షడధ్వములతో గూడిన శ్రీచక్రమును చింతించవలయునని చెప్పబడినది. అలాగే దక్షిణామూర్తి సంహితయందుగూడ షడధ్వ స్వరూపము వివరింపబడి,అట్టి షడధ్వములు గల శ్రీచక్రమును భావించవలయునని చెప్పబడినది. ఈ షడధ్వములు (ఆరు మార్గములు) శ్రీచక్రోపాసనా మార్గములు అని తెలియగలము. ఈ మార్గములలో నిరంతరము, కలకాలము సాధనచేసినచో దేవీ ఉపాసనా విధానము తెలియును. ఏదైనా పనిచేయునపుడు వివిధమార్గములు ఉంటాయి. ఏ మార్గములో ఆ పని శాస్త్రసమ్మతముగాను, ఆమోదయోగ్యముగాను నిర్వహింపబడుతుందో, ఆ మార్గములో ముందుకు వెళ్ళినటులే , శ్రీచక్రార్చనకు కూడా ఉపాసనా మార్గములు ఉన్నవి. ఈ ఉపాసనా మార్గములను సాధకుడు శ్రీచక్రార్చనలో అనుసరించడం జరుగుతుంది. ఈ ఆరుమార్గాలు ఆ పరమాత్మవలననే కలుగుతున్నాయి. ఇది సాధకులవరకు మాత్రమే. అమ్మవారు వీటన్నిటికి అతీతమైన స్వరూపము గలిగినది.. గనుకనే ఆ తల్లి *షడధ్వాతీత రూపిణీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*745వ నామ మంత్రము*


*ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః*


ముసలితనపు అగచాట్లనే చీకట్లను పోగొట్టడానికి తానొక రవికిరణమై విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జరాధ్వాంతరవిప్రభా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు, వయసు మీదపడి ముసలితనము వచ్చినా, జగన్మాత ఆరాధనకు అవరోధమయే ముసలితనపు అగచాట్లు లేకుండా కాపాడును. సుఖశాంతులు ప్రసాదించి, ఆత్మానందానుభూతితో తరింపజేయును.


జరా అనగా ముసలితనము (అనే) ధ్వాంత అనగా చీకటి (కి) రవిప్రభా అనగా సూర్యకిరణముల (వంటిది).


జీవితంలో చివరియవస్థ వృద్ధాప్యము. వృద్ధాప్యం చాలా భారమైనది. పరమాత్మ తనను తీసుకుపోతే చాలు అనుకునే అవస్థ వృద్ధాప్యము. కాటికి కాళ్ళు, కూటికి నోరు చాపుకుని ఉన్న పరిస్థితి. కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినిపించవు, ఇష్టంగా ఏదైనా తినాలంటే అరగని పరిస్థితి, నాలుగడుగులు వేసి నడవాలంటే కర్ర చేతికి ఉండాలి. ఇదే జరాధ్వాంతము (ముసలితనపు చీకటి) అంటే. తనభక్తులకు ముసలితనం అనే చీకట్లు పోగొట్టడానికి తానొక రవికిరణమై జగన్మాత విరాజిల్లుచున్నది గనుకనే ఆ తల్లి *జరాధ్వాంతరవిప్రభా* యను నామము కలిగియున్నది. ఈ సందర్భంలోనే ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు:

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*సేకరణ*


*పూర్తిగా చదివితే ఆదిశంకరులు ఏమి చెప్పారో అర్థమవుతుంది*


 

*నరం వర్షీయాంసం - నయనవిరసం నర్మసు జడం*


*తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశః |*


*గలద్వేణీబంధాః - కుచకలశ విస్త్రిస్త సిచయా*


*హటాత్ త్రుట్యత్కాంచ్యో - విగలిత దుకూలా యువతయః॥*


దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.


*భావము:*

అమ్మా..నీ కృపాకటాక్ష వీక్షణం అపూర్వము కదా తల్లీ..ఏ పురుషునిపై నీ కరుణ దృష్టి ప్రసరిస్తుందో అతను వయసుడిగిన ముసలివాడైననూ, కనుచూపు మందగించి కన్నులకు పుసులు కట్టి అందవిహీనముగా ఉన్నా, కామ కళా చతుర పరిహాస నర్మభాషణములందు మూఢుడే అయినా వాడు నీ కడగంటి చూపుల కారుణ్యమునకు పాత్రుడగుటచే అతనిలో మన్మథుని దర్శించి మధవతులైన జవ్వనపు నవ యవ్వనవతులు వందలాదిగా అతని చుట్టూ గుమిగూడి, తమ జడముడులు కురులు విడిపోతున్నా పయోధరములపై పయ్యెదలు తొలగిపోవుచున్నా, తమ నడుముకి ఉన్న రతనాల మొలనూల్లు క్రిందకి జారిపోతున్నా తాము కట్టుకున్న వలువలు విడివడి ఊడిపోవుచున్నా వడివడిగా బిరబిర పరుగులిడి వచ్చి, బిడియము వీడి తమను స్వీకరించమని నీ దయాభిషిక్తుని వెనుక వెంటబడుచుందురు.


అమ్మవారి కడగంటి చూపు ఎంత మహత్తరమైన ప్రభావం కలదో శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నారు.


*నరం వర్షీయాంసం* అంటే బాగా వయసు మీదబడ్డ ముసలివా డయిన మనిషి.


*నరం నయనవిరసం* అంటే కళ్ళకు ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం కలవాడైన మనిషి.


*నరం నర్మసు జడం* అంటే వఠ్ఠి మందబుధ్ధి, ఓ సరసం చట్టుబండలూ తెలియని మానవుడు. ఇలాంటి వాడిని ఎవరైనా మెచ్చుకుంటారా?


ఇలాంటి మగవాడిని ఏయువతి ఐనా కన్నెత్తి చూస్తుందా?


ఒక్కనాటికీ అలా ఏ యువతీ కూడా చేయదు.


*అపాంగం* అంటే క్రీగంటి చూపు అని అర్థం. *ఆలోకనం* అంటే చూడటం. తవ + అపాంగే + ఆలోకే -> తవాపాంగేలోకే అంటె అమ్మా నీ యొక్క కడగంటి చూపు అని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ.


*తవాపాంగేలోకే పతితమ్‌* అంటే ఏ పురుషుడి మీద ఐతే అమ్మా నీ‌ యొక్క కడగంటి చూపు పడిందో వాడు అని, వాడికి పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు.


ఏమిటట వాడికి పట్టే అదృష్టం?  వాడు ఎంతగా పనికిమాలిన వాడైనా సరే,  అంటే చీకు ముసలాడైనా, కురూపి ఐనా, మందబుధ్ధి ఐనా సరే, వాడిని శతశః యువతయః అనుధావంతి అని అంటున్నారు. అంటే వందలకొద్దీ అమ్మాయిలు వెంటబడి పరుగులు పెడతారట వాడి కోసం. ఎందుకు? వాడికి అమ్మ కడగంటి చూపుల దయ దొరికిన కారణంగా.


ఆ వెంటబడటం కూడా ఏలాగనుకున్నారు?


*గలద్వేణీ బంధః* అనగా  జుట్టుముడి జారిపోతున్న వాళ్ళూగానూ,


*కుచకలశ విస్రస్త సిచయా* అనగా గుండెలనుండి పైటలు జారిపోతున్న వాళ్ళు గానూ,


*హఠాత్ తృట్యత్ కాంచ్యః* అనగా  హఠాత్తుగా మొలనూలు జరిపోతున్నవాళ్ళు గానూ


*విగళిత దుకూలాః* అనగా కట్టుబట్టలు ఊడిపోతున్నవాళ్ళుగానూ


ఆ మహానుభావుడి వెంట *శతశః* అంటే వందలమంది అమ్మాయిలు పరుగులు తీస్తూ వెంబడిస్తారట.


అదీ అమ్మవారి కడగంటి చూపు ఒక్కటి దక్కితే ఎంత ఘనమైన జగన్మోహనత్వం కలుగుతుందో ఎలాంటివాడికైనా అని శ్రీశంకరులు అనటం.


ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం‌ ప్రస్తావించాలి.  ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు అందరికీ అక్షరాలు వచ్చాయి కాని అందరూ చదువరులు కారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు ఏదో సందర్భంలో.  ఇక్కడ ఈ‌ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే రకరకాలుగా అర్థాలు తీసే ప్రమాదం ఉంది చదువరుల్లో కొందరు.  ఇలా ఒకే శ్లోకం లేదా ఒకే మాట జనంలో రకరకాలు అర్థం కావటానికి కారణం అధికార బేధం. ఈ‌ అధికార బేధం అనేది జన్మజన్మాంతరాలుగా సంపాదించుకొన్నదీ, ఈ‌ జన్మలో మనం మెఱుగు దిద్దుకుంటున్నదీ ఐన సంస్కారపు తీరుతెన్నులను బట్టి వస్తుంది. అదెలాగూ అంటే చూడండి.


అనధికారులుగా ఉన్నవాళ్ళు ఈ‌ శ్లోకం చదివి, చూసారా మీరేమో ఆ శంకరాచార్యులను ఇంతవారూ‌ అంతవారూ అంటారు, గొప్ప విజ్ఞానీ, వేదాంతీ అంటారు. అలాంటి వాడు ఇంత పచ్చి శృంగారవర్ణనతో వ్రాయటం ఏమిటీ అదీ‌ అమ్మవారి మిష పెట్టి? ఇదంతా చూస్తే ఈ వేదంతమూ వగైరా అంతా డొల్ల - పైపై మాటలే.  తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు ఈయన తలలో చాలా పైత్యం ఉందీ‌ అని హేళన చేస్తారు.  దానికి కారణం? వాళ్ళకు శ్లోకంలో *ముక్కస్య ముక్కార్థః* అన్నట్లుగా అన్వయం చూసుకొని అదే దానికి నిజమైన అర్థం అనుకుని అక్కడే ఆగిపోవటం.  అంతే కాదు. వాళ్ళలో చాలా మంది విమర్శించటానికి నోరు చేసుకుందుకు ఎక్కడ సందు దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేయటం కోసమే చదవటం మరొక ముఖ్యకారణం. వీళ్ళకి శ్లోకంలో మరేదన్నా అంతరార్థం ఉందా అన్నది పట్టదు. ఒక వేళ ఎవరన్నా సూచించినా బుధ్ధికి ఎక్కదు.  వీళ్ళతో‌ సమయం వృధా చేసుకోకూడదు.


అల్పాధికారులు కొందరుంటారు.  వాళ్ళూ శ్లోకంలో ప్రతిపదార్థం మాత్రమే గ్రహిస్తారు. విస్మయం చెందుతారు. ఓహో ఈ‌ శ్లోకం వలన స్త్రీవశ్యం లాంటి ప్రయోజనాలున్నాయన్న మాట అనుకుంటారు. వాళ్ళలో కొందరికి ఇలాంటీ అవసరాలు తోచవచ్చును.  వాళ్ళు ఇంక అటువంటి కోరికలతో శ్లోకాన్ని పారాయణం చేస్తారు. గీతలో భగవంతుడు చెప్పిన అర్థార్థులు వీరు. వీళ్ళకి లభించే ఫలితం స్వల్పమే. ఎందుకంటే వీళ్ళు చిత్తశుధ్ధితో శ్లోకాన్ని అవగతం చేసుకోలేదు కాబట్టి.


మధ్యమాధికారుల సంగతి. వీళ్ళకు శ్లోకంలో ఏదో‌ సంకేతికార్థం ఉండవచ్చును అనిపిస్తుంది. శంకరులు వెఱ్ఱివారా కేవలం‌ శృంగారదృష్టితో వ్రాయటానికి? అందుచేత సరైన అర్థం కోసం ఆరాటపడతారు. వారి సహజమైన భక్తిప్రపత్తుల కారణంగా సరిగా అర్థం చేసుకొనటానికి మరింత శ్రమిస్తారు. ఎవరైనా ఉత్తమాధికారులు అటువంటి సాంకేతికమైన సమధానంతో శ్లోకాన్ని అన్వయం చేస్తే ఆనందిస్తారు. 


ఉత్తమాధికారులు కొందరు. వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వారు పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ శ్లోకంలో ఉన్న విషయాన్ని సరైన దృక్పధంతో అర్థంచేసుకో గలరు. వారు అమ్మవారిని గురించి శ్రీశంకరులు ఇలా ఎందుకు చెప్పారు అని విస్మయపడరు. మనలా పైపై అర్థం వారిని భ్రమపెట్టలేదు కాబట్టి. వీరు ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. ఇలాంటి వారి గురించే స్వయం తీర్ణః పరాం స్తారయతి అని చెప్పారు.


ఇప్పుడు ఈ‌ శ్లోకాన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం. మూడు రకాలైనా అసమర్థులను గురించి ప్రస్తావిస్తూ శ్లోకారంభం చేసారు.  వయస్సుచేత సామాజికంగా వెనుకబాటు తనానికి గురౌతున్నవాళ్ళనీ,  లోకం కంటికి ఆనని వాళ్ళనీ, మాటకారి తనం లేక ఈ లోకంలో నెగ్గుకుని రాలేకపోతున్న వాళ్ళనీ‌ ప్రస్తావించారు.


వయసులో ఎంత వెలుగు వెలిగినా, వయసుడిగి, ఆర్జన కరువై, ఇతరుల సహాయం మీద ఆధారపడ్డవారిని ఈ లోకం ఇప్పుడే కాదు ఆ శ్రీశంకరుల రోజుల్లోనూ‌ లోకువగానే చూసేది మరి.  భజగోవింద శ్లోకాల్లో, యావద్విత్తో పార్జనసక్త: తావన్నిజ పరివారో రక్త:। పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపీ న పృఛ్ఛతి గేహే అని చెప్పారు కదా? ఇంట్లో పడి ఉన్న ముసలాణ్ణి ఎవరు పట్టించుకుంటారూ అని!  వీళ్ళకి దేవుడే దిక్కు.


లోకం కంటికి ఆనకపోవటం అనేది ముఖ్యంగా ఆ వ్యక్తి వయస్సూ, వర్చస్సూ, సామాజికస్థితిగతులూ వగైరా సంతతుల మీద ఆధారపడి ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటారు. సామాజికగౌరవం అనేది కేవలం ప్రతిభమీదనే లభించే అవకాశం తక్కువే. అలాంటి గౌరవం నోచుకోని వారికి భగవంతుడే సహాయం చేయాలి.


కొందరికి వయస్సూ ఉంటుంది. సామాజికంగా అన్ని ఆనుకూలతలూ ఉంటాయి. కాని ఏమీ మాటకారి తనం ఉండదు. పెళుసుమాటలో, నంగిమాటలో, సభాపిరికితనమో వీరిని జనామోదం పొందకుండా అడ్డుపడతాయి. ఇందులో చాలామందికి ఆ సమస్యను అధిగమించే దారి కనబడదు. వారికి కూడా భగవత్సహాయం అవసరమే.


*శ్రీశంకరులు ఇలా ఏ కారణంగా జనామోదానికి దూరం అవుతున్నా సరే, అమ్మని వేడుకోండయ్యా అని సలహా ఇస్తున్నారు. ఆవిడ వాడి కేసి తిరిగి ఏమీ చేయనక్కర లేదు.  కేవలం ఒక్క సారి కడగంటితో చూస్తే చాలు వాడి వెంట సమాజం అంతా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరాలలో ముంచెత్తుతారు అని నొక్కి చెబుతున్నారు. ఇలా లోకసమ్మోహనశక్తిని అమ్మ కడగంటి చూపు అనుగ్రహించటం అన్న దాంట్లొ సమ్మోహనం అన్న మాటమీద శృంగారపరమైన విస్తృతి కల్పిస్తూ, ఒక అసమర్థుడైన వాడి వెంట అమ్మ అనుగ్రహం స్త్రీజనాన్ని పరుగులు పెట్టించటం అనే ఉదాహరణగా చెప్పారు అంతే*


అమ్మ కడగంటి చూపు అంత శక్తిమంతమైనదా అని ఎవరికైన సంశయం ఉంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి నోట అక్షరమ్ముక్క లేని ఒక కుర్రవాణ్ణి అమ్మ క్రీగంటి చూపు మహాకవి కాళిదాసు అనే కవికుల గురువును చేసిన సంగతిని.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ముసలితనం ఎవరికీ శాపం కాదు. అది జీవితమనే పుస్తకాన్ని చదివి, జీవితమంటే ఏమిటో సవివరంగా అందరికీ తెలియజేయడానికి మాత్రమే.


ముసలితనం అనేది బాధ్యతలు తీరిపోయిన అవస్థ. ఏమైనా చేద్దామన్నా వద్దనేవారే ఉంటారు. అంతవరకూ జీవితంలో పరమాత్మను స్మరించడం జరగకపోతే కనీసం ఈ అవస్థలోనైనా పరమాత్మని మనసారా స్మరించుకునే అవకాశం.


తనకు సద్గతులు కలగాలన్నా, తెలిసిగాని, తెలియక గాని చేసిన పాపకర్మల ఫలముల దోషప్రభావంతగ్గాలన్నా, రోగములావహించకుండా, అనాయాస మరణం సంభవించాలంటే జగన్మాత నామస్మరణ ఒక్కటే శరణ్యం. గనుక జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*408వ నామ మంత్రము*  6.9.2021


*ఓం శివంకర్యై నమః* 


తన భక్తులకు మంగళమగు బ్రహ్మత్వమును కలిగించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివంకరీ* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం శివంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారి జీవనమంతయు మంగళమయముగా చేయును మరియు శాంతిసౌఖ్యమయమైన జీవనము కలుగునట్లు అనుగ్రహించును.


జగన్మాత తన భక్తుని మంగళకరుడైన శివరూపునిగా జేయును. తన భక్తులయొక్క అజ్ఞాన (అవిద్యా) పాశములను విడగొట్టి వారికి ఏ బ్రహ్మస్వరూపము గలదో ఆ బ్రహ్మ స్వరూపమును అనుగ్రహించును. భక్తుడు జ్ఞానస్వరూపుడై తనను తాను పరబ్రహ్మ స్వరూపునిగా భావించును. అట్లు తనను తాను పరబ్రహ్మస్వరూపునిగా భావించిన అతడు బ్రహ్మత్వ సిద్ధిని పొందుతాడు.  ఇది అంతయు అంతః పూజయే. అంతః పూజ చేసిన సాధకునికి కోరిన కోరికలు అప్రయత్నంగా నెరవేరుతాయి. సాధకునిలో అజ్ఞాన తిమిరములు పోయి జ్ఞానజ్యోతులతో ప్రకాశవంతుడౌతాడు. సాధకులకు సర్వము శుభమయము చేస్తుంది. శివుడు అంటేనే మంగళ స్వరూపుడు గనుక శివస్వరూపము దాల్చిన సాధకుడు మంగళస్వరూపుడౌతాడు. అంతటితో సాధకుడు ఆత్మానందానుభూతిని పొందుతాడు.  శివసాయుజ్యము లభింపజేస్తుంది ఆ పరమేశ్వరి.  తన భక్తులలో శివత్వము ప్రసాదించి మంగళస్వరూపులుగా జేస్తుంది గనుక అమ్మవారు *శివంకరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివంకర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మొగిలిచెర్ల

 *సంతానం..సంతోషం..*


2010 సంవత్సరం జూన్ నెల లోని ఒక ఆదివారం ఉదయం తొమ్మిది గంటలప్పుడు, సుమారు పది పన్నెండు మంది నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చారు..ఆ సమయం లో భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది..నేనూ, మా సిబ్బంది కూడా పనిలో ఉంటాము..వారిలో బాగా వయసు పైబడిన ఒక పెద్దాయన ముందుకువచ్చి.. "మేమూ 'తుమ్మల' వాళ్ళమే..(శ్రీ స్వామివారి పూర్వ నామం..తుమ్మల వేణుగోపాల నాయుడు..) ఈ స్వామికి బంధుత్వం రీత్యా దాయాదులం..మేము శిద్దనకొండూరు లో వుండేవాళ్ళము..ఇప్పుడు మద్రాసు లో వుంటున్నాము..మీ నాన్నగారు, అమ్మగారు కూడా బాగా తెలుసు..నాన్నగారు మంచం లో ఉన్నారట కదా..?" అని గబ గబా చెప్పుకొచ్చారు


శ్రీ స్వామివారికి బంధువులు అని వినగానే..లేచి నిలబడ్డాను.."మీరు కూర్చోండి.." అంటూ కుర్చీ చూపించాను..కుర్చీలో సేద తీరినట్టు గా కూర్చున్నారు..ఆయన చుట్టూరా..ఆయనతో వచ్చిన వాళ్ళంతా నిలబడ్డారు..

"స్వామివారికి బంధువులం అన్నారు గదా..శ్రీ స్వామివారి గురించి మీకు తెలిసిన విషయాలేమైనా చెపుతారా..?" అని అడిగాను..ఆయన ముఖంలో సంతోషం కనిపించింది.."తప్పకుండా చెపుతాను..ముందు వెళ్లి ఆయన్ను దర్శనం చేసుకొని వస్తాము.." అన్నారు.."పది నిముషాలు వేచి ఉండండి..ఇప్పుడున్న భక్తులు బైటకు రాగానే..మీరు వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అని చెప్పాను..అందరినీ ప్రదక్షిణ మంటపం లో కూర్చోమని చెప్పాను..


ఆ పెద్దాయన, ఆయనతోపాటు వచ్చిన ఆయన సంసారం అందరూ కొద్దిసేపటి తరువాత శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చేసారు..


స్వామివారి బంధువులం అని చెప్పిన ఆ పెద్దాయన నేరుగా నా దగ్గరకు వచ్చి ప్రక్కనే కూర్చున్నారు.."ఇప్పుడు చెప్పండి..మీకు స్వామివారు ఎప్పటి నుంచీ తెలుసు..? మీకేమైనా అనుభవాలు ఉన్నాయా..? " అని గబ గబా అడిగేసాను..


ఒక్క క్షణం ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి.."ఈ స్వామివారి కుటుంబం తో మాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది..అప్పుడప్పుడూ రాకపోకలూ ఉండేవి..ఈయన అన్నదమ్ములందరూ నాకు తెలుసు..స్వామి చిన్నతనం నుండీ తెలుసు..సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కానీ..ఈ స్వామి మాలకొండకు తపస్సుకు వెళ్లే ముందు కొద్దిరోజులు మా గ్రామం శిద్దనకొండూరు కు వస్తూ పోతూ ఉండేవాడు..నాకప్పుడు దగ్గర దగ్గర నలభైయేళ్ళ వయసు..పెళ్లై పది పన్నెండు సంవత్సరాలు గడిచింది..పిల్లలు పుట్టలేదు..ఇక మాకు సంతానయోగం లేదని అనుకున్నాము నేనూ నా భార్యా..మా ఊళ్ళో ఒకరి ఇంటికి వస్తున్నాడని తెలిసి..నేను, నా భార్య అక్కడికి వెళ్ళాము..వాళ్ళయింటి ముందు అరుగు మీద చాప పరచుకొని..దానిమీద పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు..మేము వెళ్లి ఆయన ముందు నిలబడ్డాము..కళ్ళు తెరచి నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు..నాకంటే వయసులో బాగా చిన్నవాడైనా..గబుక్కున నమస్కారం చేసాను..ఆయన ఏమీ మాట్లాడలేదు..అక్కడే నిలబడ్డాను..ఇంతలో ఆ ఇంటివాళ్ళు కొన్ని పళ్ళు, ఒక గ్లాసు లో పాలు తెచ్చి ఇచ్చారు..ఆ తెచ్చిన పళ్ళ లోంచి రెండు అరటిపళ్ళు చేతిలో తీసుకొని..గుండెలకు ఆనించుకొని..కళ్ళు తెరచి మా వైపు చూసి దగ్గరకు రమ్మన్నాడు..వెళ్ళాము..అరటిపళ్ళను నా భార్యకు ఇవ్వబోయాడు..ఆమె కొంగు పట్టింది..అందులో వేసాడు..నా వైపు తిరిగి.."మీకు సంతానయోగం ఉంది..ఇద్దరు పిల్లలు పుడతారు.." అన్నాడయ్యా.. ఆశ్చర్యం వేసింది..మేము సంతానం కోసం అడగాలని అనుకోలేదు అప్పుడు..కేవలం చూద్దామని వెళ్ళాము..మా మనసులోని వేదన కు పరిష్కారం అన్నట్టుగా గట్టిగా చెప్పాడు..భలే సంతోషం కలిగింది..నమస్కారం చేసుకొని వచ్చాము..ఆ మరుసటి ఏడే మగపిల్లవాడు పుట్టాడు..మరో రెండేళ్లకు అమ్మాయి పుట్టింది..ఆ మహానుభావుడి నోటి దీవేనే ఇది..ఇప్పుడు మా పెద్దాడికి ఇద్దరు పిల్లలు..అమ్మాయికి కూడా ఇద్దరు పిల్లలు..అందరమూ మద్రాసు లోనే వుంటున్నాము..కొన్నేళ్ల క్రితం వరకూ ప్రతి ఏడూ ఇక్కడకు వచ్చేవాళ్ళం..వయసు పైబడిన తరువాత రావడం తగ్గించేసాము..మా పిల్లలకూ స్వామివారంటే భక్తి.." అన్నారు..


"ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారట గదా..? ఒక ఆదివారం నాటికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను..ప్రతి ఏడూ మా పేరుతో ఒక రోజు అన్నదానం జరిపించు.." అని చెప్పారు..సరే అన్నాను..


శ్రీ స్వామివారు తన తపోసాధన కోసం మాలకొండ చేరే ముందు కొన్నాళ్ల పాటు ఇంటి వద్ద వున్నప్పుడు, శిద్దనకొండూరు గ్రామానికి వెళ్లి వచ్చేవారని నేనూ విని వున్నాను..ఈ అనుభవం వినడం అదే మొదటిసారి..శ్రీ స్వామివారు త్వరపడి ఎటువంటి వరాలు ఇచ్చేవారు కాదు..ముక్తసరిగా ఉండేది ఆయన మాట..కానీ ఆయన నోటి నుంచి ఏదైనా వాక్కు పలికితే..అది ఖచ్చితంగా నెరవేరేది..


ఆ పెద్దాయనా..ఆయన సంసారం..అందరూ ఆరోజు మధ్యాహ్నం దాకా స్వామివారి మందిరం వద్దే గడిపి..భోజనం చేసి..తిరిగి మద్రాసు కు వెళ్లిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

వినాయక చవితి సందేశం - 2

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 2


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం

                              చతుర్భుజమ్ I


ప్రసన్నవదనం ధ్యాయేత్ 

               సర్వవిఘ్నోపశాంతయే ॥


         ఇది అందఱూ అన్ని సందర్భాలలోనూ ప్రార్థనా శ్లోకంగా చదువుతాం.


       ఈ శ్లోకం 


1. వినాయకునికి సంబంధించి,


శుక్ల + అంబరధరమ్ = తెల్లని వస్త్రాలని ధరించినవాడు,


శశివర్ణం = చంద్రునిలా తెల్లనైన శరీరం కలవాడు,


చతుర్భుజమ్ = నాలుగు చేతులతో ఉండేవాడు,


ప్రసన్న వదనమ్ = అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు,


విష్ణుమ్ = సర్వవ్యాపి అయినవాడు,


సర్వ విఘ్న + ఉపశాంతయే = అన్ని విఘ్నాలనుంచీ బయటపడేసి, శాంతి పొందించేవాడు,

     అయిన "వినాయకు"ని


ధ్యాయేత్ = ధ్యానిస్తున్నాను.


      అని అర్థం.


   మరొక అన్వయం

   -----------------------

  

         ఈ శ్లోకంలో "చతుర్భుజమ్", "విష్ణుమ్" అనే మాటతో ఇది విష్ణువుకి సంబంధించింది అంటారు. కానీ,

* తెల్లవస్త్రాలు ధరించి అని ఉంటే, మరి విష్ణువు పసుపుబట్టలు ధరించే "పీతాంబర ధారి" కదా!

* చంద్రునిలా తెల్లని రంగుగలవాడు అని ఉంటే, మరి విష్ణువు "నీలమేఘశ్యాముడు" కదా!

* విఘ్నాలు తొలగించేవాడు అని ఉంటే, మరి "సృష్టి స్థితి లయా"లలో స్థితికి సంబంధించి , విష్ణువు "పుట్టిన వాడిని పోషించడం వరకే బాధ్యతగా కలవాడు" కదా! , ---------- ఇలా అంటూ,

         ఈ శ్లోకం విష్ణువుకు వర్తించదు అంటారు.


         మరి విష్ణువుకు ఎలా అన్వయిస్తాము?


2. విష్ణువునకు సంబంధించి,


* శుక్ల + అంబరధరమ్ 

- తెల్లనైన ఆకాశాన్ని(అంబర) ధరించేవాడు.

 ( విష్ణువునకు,

   నాభిర్వియత్ - ఆకాశం బొడ్డు

    ఆ బొడ్డులోనుంచీ సృష్టికర్త "బ్రహ్మ" వచ్చాడు.


      ఆకాశాద్వాయుః - వాయోరగ్నిః - అగ్నేరాపః - అబ్భ్యః పృథివీ - పృథివ్యా ఓషధయః - ఓషధీభ్యోన్నమ్ - అన్నాత్పురుషః - స ఏవా పురుషో అన్నరసమయః -

       ఆ ఆకాశం నుండీ వాయువూ - వాయువు నుండీ అగ్నీ - అగ్ని నుండీ నీరూ - నీటి నుండీ భూమీ - భూమి నుండీ ఓషధులూ - ఓషధుల నుండీ అన్నమూ - అన్నము నుండీ ప్రాణులూ కలుగుతాయి)


* విష్ణుమ్ 

    — అంతటా వ్యాపించినవాడు

   ( విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః )


* శశివర్ణమ్ 

  "శశము" అంటే కుందేలు.

   కుందేలు ఒక అడుగువేసి, మళ్ళీ గంతువేసి, మళ్ళీ దూకుతూ నడుస్తుంది.

   అలాగే 'కాలం' కూడా రోజు - పక్షం - నెల - సంవత్సరం అని కొలవబడుతూ, సంవత్సరాన్ని ప్రమాణంగా కొలవబడుతూంటుంది.

     విష్ణువు 'కాలాన్ని' అధీనంలో ఉంచుకున్నవాడూ, 'కాల స్వరూపుడు'గా "శశివర్ణమ్"


* చతుర్భుజమ్ 

    నాలుగు చేతులలో 

శంఖ - చక్ర - గద - పద్మాలు కలవాడు.


గద - అహంకారాన్ని అణుస్తుంది.

పద్మం - చిత్తాన్ని వికసింపచేస్తూ, విశ్లేషింపజేస్తుంది.

చక్రం - సంశయాత్మకమైన మనస్సులో సంశయనివృత్తి చేస్తుంది.

శంఖం - నిర్ణయాత్మకమైన బుద్ధిని ప్రామాణికమైన జ్ఞానంతో సరియైన నిర్ణయాన్నిస్తుంది.

 

శంఖ - చక్ర - గద - పద్మాలు నాలుగు చేతులలో మారుతూ 24 రకాలుగా( Factorial 4 = 4x3x2x1 = 24) కనబడే మూర్తులే

     కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ -అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరయ - శ్రీకృష్ణ.


     "మనో బుద్ధి చిత్త అహంకారాల"నే నాలుగు భాగాలుగా ఉండే "అంతఃకరణ" శుద్ధి అనుగ్రహించే స్వామి "విష్ణువు".


* ప్రసన్న వదనం

     భృగు మహర్షి వచ్చి కాలుతో తన్నినా వదనంలో మార్పులేదు.

 ( చేయవలసిన పనిని హావభావాలు కనబడనీయక నిశ్శబ్దంగా చేస్తాడు)


* సర్వవిఘ్నాలు పారద్రోలి శాంతి కల్గించే "స్థితి కారకుడై"న "విష్ణుమూర్తి"ని 


* ధ్యాయేత్ 

- ధ్యానిస్తాను. 


          పార్వతీపరమేశ్వరులకు దేవతలు విఘ్నం కల్గించడంవల్ల సంతానం కలుగలేదు. ఆదిదంపతుల ప్రార్థనతో విష్ణువే పుత్రుడుగా జన్మిస్తాడు. శని దృష్టివలన ఆతని శిరస్సు ఖండింపబడితే, గజశిరస్సు అమర్చారు. గజాననుడు సాక్షాత్తూ విష్ణువు అవతారమే 

                            - బ్రహ్మ వైవర్త పురాణం 



            వినాయకుడూ విష్ణువూ ఒకరే కాబట్టి స్వామిని "లక్ష్మీ గణపతి" విగ్రహ రూపంలో ఆరాధిస్తాం.


                    =x=x=x=


    — రామాయణం శర్మ

             భద్రాచలం