10, మే 2024, శుక్రవారం

వైశాఖ పురాణం - 2 వ అధ్యాయము🚩

 *శనివారం, మే 11, 2024*


_*🚩వైశాఖ పురాణం - 2 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు*


☘☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా ! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. 


వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. 

గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. 

జలదానముతో సమానమైన దానము లేదు. 

భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. 

వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.


నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము , ధర్మసమమైన మిత్రుడు , సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి , శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు , వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు , పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమ్మాసవ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట , యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము , సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.


బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారుల సర్వ దేవతలు పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు , జలమును(నీరుకల చెంబును), గొడుగును , విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన  కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.


దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకువచ్చిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు ఎండకువచ్చినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక , ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు నిహలోకమున బాధలను పొందడు , సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి , చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు , బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీషమహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవాని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము , గృహము , వస్త్రము , అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్ని అన్నదానముతో సమానమైన దానము యింతకు ముందులేదు , ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము , చత్రదానము , వ్యజనదానము , పాదుకాదానము , అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా ! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును , అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు , సర్వదేవతాస్వరూపుడు , సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున , అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని భావము.


*వైశాఖపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

  🌹🌷🌹🌷🌹🌷🌷🌹


🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

శనివారం*🍁 🌹 *మే 11, 2024*🌹

 *ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ*

   🍁 *శనివారం*🍁 

🌹 *మే 11, 2024*🌹

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

      *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

తిథి      : *చవితి* తె4.26 వరకు

వారం   : *శనివారం* (స్థిరవాసరే )

నక్షత్రం  : *మృగశిర* మ12.29 వరకు

యోగం : *సుకర్మ* మ12.20 వరకు

కరణం  : *వణిజ* సా4.40 వరకు

       తదుపరి *భద్ర* తె4.26 వరకు

వర్జ్యం   :  *రా9.01 - 10.39*

దుర్ముహూర్తము : *ఉ5.34 - 7.15* 

అమృతకాలం    :  *రా2.43 - 4.20*  

రాహుకాలం       : *ఉ10.30 - 12.00*

యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *5.34* || సూర్యాస్తమయం:* *6.18*


 🕉️ *శ్రీనివాసా గోవిందా*🙏

 🌹 *శ్రీవేంకటేశ గోవిందా*🌹

🪷 *ఆపద్బాంధవ గోవిందా*🪷

         👉 *నిజకర్తరి* 

*కృత్తిక కార్తె ప్రారంభం ఉ10.21* నుండి 


🌹 *సర్వేజనా సుఖినో భవంతు* 🌹

  🙏 *శుభమమస్తు* 🙏

----------------------------------------

🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Panchaag


 

చింతామణి- చిక్కబల్లాపూర్ ⚜ శ్రీ కైవారం కొలువు

 🕉 మన గుడి : నెం 313


⚜ కర్నాటక  :-


చింతామణి-  చిక్కబల్లాపూర్


⚜ శ్రీ కైవారం కొలువు



💠 కైవర అనేది చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం.  

ఈ పట్టణం ద్విభాషా కవి మరియు కన్నడ మరియు తెలుగులో కైవర తాతయ్యగా ప్రసిద్ధి చెందిన యోగి నారాయణప్పకు ప్రసిద్ధి చెందింది.  1726లో జన్మించిన శ్రీయోగి నారాయణ యతీంద్రులు 1836లో తనువు చాలించారు. తాతయ్య తల్లిదండ్రులు ముద్దమ్మ, కొండప్ప.


💠 నారాయణప్ప కైవారం వద్ద గల ఒక కొండగుహలో ధ్యానం చేశారు. కొన్నెండ్ల పాటు కఠోర తపస్సు చేసిన తర్వాత సాదాసీదా నారాయణప్ప యోగి పుంగవుడయ్యారు. సత్యం, ధర్మం, శాంతి వంటి ప్రవచనాలను బోధించారు. 


💠 నారాయణప్ప రచనలతో~ నారాయణప్ప ప్రవచించారు, అలాగే విష్ణువు అవతారమైన అమర నారాయణస్వామిని స్తుతిస్తూ కన్నడ మరియు తెలుగు భాషలలో కీర్తనలు  పాడారు.  కీర్తనలు కర్ణాటకలోని ప్రసిద్ధ కీర్తనాకారులైన పురందరదాసు మరియు కనకదాసులతో పోల్చదగినవి.  

తాతయ్య ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని వేమన కవి మరియు వీర బ్రహ్మేంద్ర స్వామిని మరియు ప్రస్తుత కర్ణాటకలోని సర్వజ్ఞను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. 


💠 నారాయణ యోగి తపస్సుచేసిన కొండ ప్రదేశంలో ఒక ధ్యాన మందిరం వెలసింది. కైవారంను సందర్శించే భక్తులు అక్కడికి కూడా వెళ్ళి వస్తుంటారు. 


💠 అతను 18వ శతాబ్దపు చివరి భాగంలో మరియు 19వ శతాబ్దం మొదటి భాగంలో నివసించాడు.  కైవరలో తాతయ్యకు అంకితం చేయబడిన ఆశ్రమం ఉంది మరియు తాతయ్య ధ్యానం చేసి అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన గుహ కారణంగా ఇది తీర్థయాత్ర మరియు పర్యాటక కేంద్రంగా మారింది. 


💠 ఆశ్రమం, గుహ, అమర నారాయణస్వామి దేవాలయం, గుహ పక్కనే ఉన్న వైకుంట (ఆలయం) మరియు కొండ (భీముడు బకాసురుడిని సంహరించినట్లుగా భావించబడుతున్నది) అన్నీ చూడదగ్గ ప్రదేశాలు.


💠 ఇక్కడి అమరనారాయణ ఆలయంలో దేవేంద్రుడు తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవితో కలిసి నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించి, వారి స్తుతిస్తూ భజనలు పాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. చిన్న పద్యాలతో కూడిన ఈ భక్తి గీతాలను కైవార అని పిలిచేవారు మరియు ఆ పట్టణానికి దాని పేరు వచ్చింది.


💠 మరొక పురాణం ప్రకారం, రాముడు రెండుసార్లు ఈ పట్టణాన్ని సందర్శించాడు, ఒకసారి విశ్వామిత్ర మహర్షితో మరియు రెండవసారి తన భార్య మరియు సోదరుడితో వనవాస సమయంలో. 

ఇంకా, పాండవులు తమ తల్లి కుంతీ దేవితో కలిసి తమ అజ్ఞాతవాస  రోజులు ఇక్కడ గడిపారని చెబుతారు.

మరియు ద్వాపరయుగంలో ఈ పట్టణాన్ని ఏకచక్రపుర అని పిలిచేవారు. సమీపంలోని కొండపై భీమసేనుడు బకాసురుడు అనే రాక్షసుడిని చంపాడని కథనం. 

అనంతరం అక్కడ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. దీనికే భీమలింగేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. 


💠 ఆధునిక కాలంలో, కైవారా యోగి నారాయణ యతీంద్ర జన్మస్థలం, ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కైవార తాతయ్య అని పిలుస్తారు.

నారాయణయతి సమాధిపై ఒక అద్భుత ఆలయం వెలసింది. 


💠 ఆ ఆలయంలో కైవారం తాతయ్యగా ప్రజలు భక్తి ప్రవత్తులచే కొలిచే నారాయణయతి విగ్రహం వుంది. విగ్రహం పసిడి కాంతులతో మెరుస్తూ వుంటుంది. పుష్పాల అలంకరణతో తాతయ్య శోభ మరింతా మెరుస్తూ వుంటుంది. ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. పండుగలు, గురుపూజ ఆరాధన సమయంలో ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కైవారం తాతయ్యను దర్శించడానికి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదాన పథకం అమలులో వుంది.


💠 కైవార వైకుంట బెట్ట అని కూడా పిలువబడే కైవార తాతయ్య దేవాలయం ఒక ఆశ్రమం లాంటిది. ప్రవేశ ద్వారం వద్ద అందమైన తోరణం ఉంది. రెండు వైపులా, ఆది శంకరులు మరియు శ్రీ వేదవ్యాస వంటి సన్యాసుల జీవిత పరిమాణ శిల్పాలు ఉన్నాయి.

మధ్యలో ఒక పీఠంపై యోగ భంగిమలో ఉన్న తాతయ్య విగ్రహం, నరసింహ భగవానుడు మరియు లక్ష్మీ దేవి యొక్క పెద్ద విగ్రహాలకు ఎదురుగా ఉంది. 

తాతయ్య చాలాకాలం తపస్సు చేసి జ్ఞానోదయం పొందినట్లు విశ్వసించే ప్రదేశం ఇది.

పట్టణం లోపల, యోగి నారాయణ మఠం అని పిలువబడే మరొక పెద్ద సముదాయం ఉంది, తాతయ్యకు అంకితం చేయబడిన అందమైన ఆలయం. అతను ఈ ప్రదేశంలో జీవసమాధిని పొందాడని నమ్ముతారు.


💠 ఘాట్ రోడ్డు గుండా అరగంట ప్రయాణం కైలాసగిరి కొండలకు చేరుస్తుంది. ఆకాశంలో ఉన్న ఒక పెద్ద రాతి కొండ పాదాలకు చేరుకోవడానికి మీరు దాదాపు 15 నిమిషాల పాటు రాతితో చేసిన మార్గంలో కొండపైకి ట్రెక్కింగ్ చేయాలి. ఈ కొండ దిగువన మానవ నిర్మిత గుహలు ఉన్నాయి, దాని లోపల వల్లభ గణపతి అతని భార్య సిద్ధి, జగదంబ దేవి మరియు శివుని విగ్రహాలు ఉన్నాయి. 

గుహలు ప్రజలు నడవడానికి తగినంత ఎత్తులో ఉన్నాయి.


💠 కర్నాటక రాజధాని బెంగుళూరుకు 60 కి.మీ. దూరంలో కైవారం వుంది

Joke























 

Uchaarana


 

వైశాఖ పురాణం - 2

 వైశాఖ పురాణం - 2


2వ అధ్యాయము


- అక్షయతృతీయ విశిష్టత


నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయఅని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.


పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.


ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.


ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.


ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.


వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం.

సిరిధాన్యాలు గురించి

 సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .


 కొర్రలు యొక్క ఉపయోగాలు -


 * కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .


 * శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.


 * కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.


 * శరీరం నందు వేడిని కలిగించును.


 * జ్వరమును, కఫమును హరించును .


 * జీర్ణశక్తిని పెంచును.


 * రక్తమును వృద్దిచేయును.


 * నడుముకు మంచి శక్తిని ఇచ్చును.


 * అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.


 * గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.


 * కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .


 * కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .


 * కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .


 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.


 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.


 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.


   సామలు యొక్క ఉపయోగాలు - 


 * సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 


 * చలవ , వాతమును చేయును . 


 * మలమును బంధించును . 


 * శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 


 * ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.


 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.


 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 


  రాగుల యొక్క ఉపయోగాలు - 


 * వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 


 * రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 


 * శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 


 * మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 


 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 


 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 


 * కఫాన్ని పెంచును. చలవ చేయును . 


 * శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.


 * ఆకలిదప్పికలను అణుచును.


 * విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 


 * రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .


 * రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 


 * మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 

కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.


 * రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 


 * రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

 

 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఓటు విలువ

 *కొన్ని దేశాలలో ఓటు విలువ* 

👉 *బెల్జియం* లో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే..

 పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. 

మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, 

రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు.

 *ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు.* 

దీంతో 96 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.


👉 *ఆస్ట్రేలియా* లోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు.

 ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది.

 దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్‌ నమోదవుతోంది.


👉 *సింగపూర్‌* లో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు.

 కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఓటుహక్కు పునరుద్ధరిస్తారు.

 దీంతో 92 శాతం నమోదవుతుంది.

👉 *గ్రీస్‌* లో ఓటు వేయని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌,పాస్‌పోర్టు ఇవ్వరు. 

బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు.

 ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. 

ఇక్కడ 94శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.

కాశి వైభవము

 : *కాశి వైభవము*

-----------------------

సీ. కాశికా పురినాథ గరళ కంఠేశ్వర

      గంగమ్మ చేరెను కరములెత్తి

 కేదార లింగేశ  వేద స్వరూపుడా

         జ్యోతి రూపమనుచు చూడ వస్తి

ఆకలి తీర్చెడు నన్నపూర్ణాదేవి

      కాశీ విశాలాక్షి కరుణ చూపు 

డుండి గణాధిపు డోలాయ మానుడై               

     తల్లిదండ్రుల సేవ నెల్ల వేళ 

కాలభైరవ స్వామి కాంచిన చాలును

       భక్తుల కష్టాలు పారిపోవు

      వారాహి దర్శించి వచ్చిన వారల

      పరిపూర్ణ యాత్రల ఫలము గలుగు


తే గీ. అంత్య ఘడియల యందున నాశపడుచు

భస్మదారులై మీ యొక్క భక్తులంత

 నమ్మినట్టి వారల కోర్కె వమ్ముగాక

  తనువు చాలించ వత్తురు మనుషులంత



 సీ. నిశివేళ యందు నిటలాక్షునర్చించి

    కైలాసమును చేరు కాంక్షనిండి

శివనామ స్మరణము చేయుచు భక్తితో

      మ్రొక్కుబడుల నన్ని ముట్ట చేసి

గంగ హారతి చూసి ఘనమగు సేవలో

 చేరుకున్న జన్మ శ్రేష్టమనుచు దేవతాగణమంత దీవెనలందించ 

దివిని విడిచినారు  భువిని చేరి


తే గీ.గుడులు గోపురా లెన్నియో కూల్చివేసి 

తురక రాజ మసీదులు ధరణినిండ

ఆక్రమించి హిందువులను నణచివేసి

పుణ్య భూముల జాడను పూడ్చినారు

ధర్మరక్షణ భారంబు తలను దాల్చి

యోధుడై నిల్చె దేశాన మోది నేడు



*ఓం నమశ్శివాయ*

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

శ్రీ భోగ నందీశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 312


⚜ కర్నాటక  :- చిక్కబల్లాపూర్


⚜ శ్రీ భోగ నందీశ్వర ఆలయం 



💠 కొన్నిసార్లు మనం మనకు చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాలను సందర్శించడం మరచిపోతాము అలాంటి అలయమే  బెంగళూరు నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగ నందీశ్వర ఆలయం మరియు ప్రసిద్ధ నంది హిల్స్ నుండి 15 నిమిషాల ప్రయాణంలో ఉన్న భోగ నందీశ్వర దేవాలయం.


💠 గంగ కాలంలో చిక్కబల్లాపూర్ సామంతరాజులు ఇక్కడ కోట నిర్మించారు. 

ఆ తరువాత కాలంలో టిప్పు సుల్తాన్ దీనిని మరింత బలోపేతంగా మార్చదు కాకుండా తన వేసవి విడిదిగా అన్ని సదుపాయాలతోటి తీర్చిదిద్దాడు. నాటి నుంచి దీనిని టిప్పు సుల్తాన్  వేసవి విడిది అనే అంటున్నారు. ప్రస్తుతం దీని తలుపులు మూసేవుంటాయి. సామాన్య ప్రజలకి లోపలికి అనుమతించరు.


💠 చారిత్రకపరంగా ఈ నందికొండల ప్రాంతాన్ని ఆనందగిరిఅని పిలిచేవారు. అందుకు కారణం ఈ ప్రదేశం చాలా ఆనందాన్ని కలగచేస్తుంది. అనేది ఒక కథనమైతే, మరో కథనం ప్రకారం ఇక్కడ యోగి నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రాంతం కనుక ఆయన పేరుతోనే నందికొండలుగా ప్రసిద్ది చెందింది అని అంటారు. ఆలాగే దీనికి నందిదుర్గ అనే మరో పేరుతో వ్యవహరించడానికి కారణం ఈ కొండపై ఉన్న కోట టిప్పు సుల్తాన్ నిర్మించాడు. 

అదీకాక ఈ కొండ పడుకున్న నండి ఆకారంలో ఉంటుంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు.


💠 ఇక మరో కథనం ప్రకారం కొండమీద 1200 సంవత్సరాల క్రితం ద్రవిడ సంప్రదాయ వాస్తురీతిలో నందీశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. అలాగే అక్కడ శివపార్వతులు దేవాలయాలు కూడా ఉన్నాయి. 

ఈ దేవాలయంలోని నందిని భోగనందీశ్వరుడని అంటారు. ఇక్కడ ఉన్న అందమైన సరస్సుని కళ్యాణి చెరువు అంటారు.


💠 భోగ నందీశ్వర దేవాలయం బెంగళూరు రూరల్ జిల్లాలోని నంది హిల్స్ ప్రాంతంలో ఉంది.  నంది కొండల దిగువన గ్రామంలో భోగ నందీశ్వర దేవాలయం  ఒక ప్రసిద్ధ ఆలయ మరియు పిక్నిక్ స్పాట్. 


💠 కొండలు వాస్తవానికి ఐదు కొండలు, ఇవి పాలార్, పినాకిని, అక్రవతి, పాపాగ్ని మరియు స్వర్ణముఖి అనే ఐదు వేర్వేరు నదుల మూలాలు.


💠 దక్షిణ కర్ణాటక తూర్పు ప్రాంతాల చరిత్ర పురాతన కాలం నాటిది. వారు రాష్ట్రకూట మరియు గంగా రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందారు. 


💠 8వ శతాబ్దం నాటికి, హిందూ నోలంబలు - నోలంబ-పల్లవులు అని కూడా పిలుస్తారు - రాష్ట్రకూట మరియు గంగా రాజవంశాల కోసం ఈ ప్రాంతాన్ని పాలించారు. 

మహేంద్ర I (860–895 CE) పాలన అతను బనాస్‌ను ఓడించిన తర్వాత పునరుద్ధరించబడిన అధికారాలను మరియు ఆర్థిక శ్రేయస్సును తీసుకువచ్చింది. 

మహేంద్ర I మరణం తరువాత, అతని తల్లి దేవలబ్బరసి ఆమె రెండవ కుమారుడు ఇరివా-నోలాంబ సహాయంతో అధికారంలోకి వచ్చింది. ఆమె కళలకు గొప్ప పోషకురాలు, తన కుమారులకు నోళంబ అనే పేరును ఉపయోగించింది మరియు ఆమె నోళంబ-నారాయణేశ్వర ఆలయాన్ని నిర్మించింది. ఈ కాలం నుండి ఉద్భవించిన శైలి (850–1000 CE) ప్రాంతీయ హిందూ కళల సంశ్లేషణను ప్రతిబింబిస్తుంది మరియు ఇప్పుడు దీనిని నోలంబవాడి శైలి అని పిలుస్తారు. 


💠 ప్రధాన ఆవరణలో భోగ నందీశ్వరుడు, అరుణాచలేశ్వరుడు మరియు అర్ధనారీవరుడు (ఉమా మహేశ్వర అని కూడా పిలుస్తారు) అని పిలువబడే శివుని 3 మందిరాలు ఉన్నాయి, అలాగే ఆలయం వెనుక వైపున అనేక ఇతర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 


💠 ప్రధాన మందిరాల ముందు ఉన్న పెద్ద మండపంలో ప్రతి స్తంభంలో దేవతలు, జంతువులు, పురాణ పాత్రలు, ఋషులు మరియు హిందూ పురాణాల నుండి చిత్రీకరించబడిన దృశ్యాలు అందంగా చెక్కబడి ఉంటాయి.


💠 ప్రధాన మందిరానికి ఉత్తరం వైపున ఉన్న అందమైన ఆలయ పుష్కరిణి  తప్పక సందర్శించాలి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ఆలయ సందర్శకులకు ఉచిత భోజనం అందిస్తారు


💠 ఆలయంలో గర్భగుడిలో ఉమా మరియు మహేశ్వర దేవతలు ఉన్నారు. కళ్యాణ మండపం చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి దైవిక జంటను కలిగి ఉన్నాయి - శివుడు మరియు పార్వతి, బ్రహ్మ మరియు సరస్వతి, విష్ణు మరియు లక్ష్మి మరియు అగ్నిదేవుడు మరియు స్వాహా దేవి.


💠 భోగ నందీశ్వరుడు : 

ప్రధాన ఆలయం, భోగ నందీశ్వరుడు గర్భగుడిలో గంభీరమైన శివలింగం ఉంది. 

ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో రాజేంద్ర చోళునిగా భావించబడే చోళ రాజు బొమ్మ ఉంది.

ఈ ఆలయంలోని గర్భగుడి ముందున్న నంది విగ్రహం అరుణాచలేశ్వర ఆలయం ముందు ఉన్నదానికంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

విజయనగర పాలకులచే నిర్మించబడిన ఈ ఆలయానికి కల్యాణ మండపం మరియు తులాభార మండపం అని రెండు అదనంగా ఉన్నాయి.


💠 శృంగి తీర్థం : 

శృంగి తీర్థం ఆలయ చెరువు. 

దీని చుట్టూ నాలుగు వైపులా వాకిలి మరియు నడుస్తున్న మండపం ఉన్నాయి. 

ఈ చెరువుకు నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి.

దివ్యమైన గంగా నది నుండి నీటిని బయటకు తీయడానికి నంది తన కొమ్మును భూమిలోకి నెట్టడం ద్వారా ఈ చెరువు సృష్టించబడిందని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ చెరువు దక్షిణ పినాకిని (దక్షిణ పెన్నార్) నదికి మూలం.


💠 నంది హిల్స్ చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. 60 కి.మీ దూరంలో ఉన్న బెంగళూరు నగరం నుండి తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.

పదభ్రమర ప్రహేళిక

 పదభ్రమర ప్రహేళిక (Puzzle of palindromes)


ఇది ఓ పది పాదాల సీస పద్యంలో నిక్షిప్తంగా వున్న ఓ ప్రహేళిక. పది ప్రశ్నలున్న 'పదభ్రమర ప్రహేళిక' (Puzzle of palindromes). అన్నింటికి సమాధానం ఐదక్షరాల పదాలు. ఇవి 'రెండు వైపుల నుంచి చదివినా అదే పదం' అని వేరే చెప్పనక్కరలేదు. 'Palindrome' అంటే అంతే గదా! ప్రయత్నించండి. మీకు తట్టకపోతే.. క్రింద సమాధానాలు చూడండి. తెలుగు భాష లోని మాధుర్యాన్ని చవి చూడండి.


ఏమి చేయక వృధా యేటి నీరేగును ?


రాముడెవ్వరి గూడి రావణు మర్దించె ?


సీతను చేకొన జెరచిన ధనువేది ?


సభవారి నవ్వించు జాణ యెవడు ?


శ్రీ కృష్ణుడే యింట చెలగుచుండె ?


భూపాలుడేటికి పుట్టువొందెను ?


కలహంస నివసించు కాసారమెయ్యది ?


వీరుడెద్దానిచే విజయమందు ?


లజ్జ యెవ్వరి అమూల్యపుటలంకారము ?


దేవాంగులకు దేన జీవనంబు ?


అన్నిటికి చూడ వైదేసి అక్షరములు ఒనర నిరుదెస చదివిన యొక్కతీరె చెప్పగలిగిన నేనిత్తు చిన్న మాడ! చెప్పలేకున్న నవ్వుదు చిన్న నవ్వు.


ఎంత చక్కనిదోయి మన తెలుగు తోట.


2. తోకమూకతో


సమాధానాలు:


1. కట్టకట్టక


5. నందనందనం.


9. కులస్త్రీలకు


6. నేలనేలనే


10. చేతనేతచే.


3. పంచాస్త్రచాపం


7. సురసరసు


4. వికటకవి.


8. చేతిహేతిచే

అక్షయతృతీయ పర్వదినము

 🌻అక్షయతృతీయ పర్వదినము 🌻


సీ. జమదగ్ని పుత్రుడై జగతిలో విష్ణువు 

                  రాముడై పుట్టిన రమ్య దినము 

     పావనగంగమ్మ ప్రవహించి సాగియు 

                 న్నుర్విని తాకిన  పర్వ దినము 

      రఘురామచంద్రుండు రాజ్య మేలినయట్టి 

                  త్రేతాయుగారంభ దివ్య దినము

      చిననాటి మిత్రుని శ్రీకృష్ణపరమాత్మ 

                   కూర్మి తోడను  కల్సుకొనిన దినము 

      గణపతి సాయాన ఘనుడగు వ్యాసుచే 

                   భారతమ్మొదలై న  పర్వ దినము

      భాను డక్షయపాత్ర పాండవాగ్రజునకు 

                   దీవించి యిచ్చిన దివ్య దినము 

      శంకరాచార్యుండు సంపద కొరకునై 

                   కనకధారాస్తుతి న్ననిన దినము

      అన్నపూర్ణాదేవి యవతార మెత్తియున్ 

                   నాహారమిడినట్టి యాది దినము

      పరమాత్మకృష్ణుండు పాంచాలిని సభలొ

                   కాచి రక్షించిన ఘన దినమ్ము 

 తే. దివ్యమైన యీ "అక్షయతృతియ దినము"

       బహువిధమ్ముల గమనించ పర్వదినము 

       పుణ్య కర్మల నీ వేళ పూని చేయ 

       శాంతి సిరి సంపద లమరు సత్వరముగ.


✍️గోపాలుని మధుసూదనరావు🙏

హిందూ ధర్మం జ్ఞానం మీద

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా 

1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*

*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం by జాజిశర్మ

దినత్రయ మహాపర్వం*

 *ఈనాడు శుక్రవారం తో కలిసిన అక్షయ్య తృతీయతో కూడిన దినత్రయ మహాపర్వం*.


   లక్ష్మీ దేవి ఆవిర్భవించిన అక్షయ్యతృతీయనాడు ఏ పని చేసిననూ అది మంచి అయిన నూ చెడు అయిన నూ *అక్షయ్యఫలితం అంటే అనేక రెట్లు ఫలితం* లభిస్తుంది. అందువలన ఈనాడు ఏ చెడ్డ పనినీ చేయక వీలైనన్ని మంచిపనులు చేయడం మంచిది.

    దినత్రయం/ ఏష్యం అనగా మూడు దినములతో సమానం., అంటే ఈనాడు ఏ శుభాశుభములైననూ మూడు రెట్లు ఫలితమునిస్తాయి. కావునా ఈనాడు ఏ తప్పు పనులనూ(పాపములను) చేయక వీలైనన్ని శుభకర్మలు చేయడం మంచిది.

    శుక్రవారం శుభసౌఖ్యములకు కారకం.

అందువలన ఈనాడు మద్యమాంసాదులు విడిచిపెట్టి, దూషణాది అరిషడ్వర్గములను తగ్గించుకుని గోసేవలు, గోపోషణములు,విత్తనాలు నాటడం, దైవారాధనం,దానధర్మాలు వంటి సత్కర్మలు చేసి తరించగలరు.

అక్షయం

 వైశాఖమాసం శుద్ధ తదియ "అక్షయ తృతీయ"గా భావిస్తారు.."అక్షయం" అంటే నాశనం లేనిది..

.కానిది...అని అర్థం..ఈ రోజున ఏ మంచి పని చేసినా దాని వలన కలిగే పుణ్యం "క్షయం" కాదు..ఈ రోజున "బంగారం"కొంటే మంచిది అంటారు..అది ఎలాగంటే..    కొని బీరువాలో దాచడం కాదు.కొనుగోలు చేసిన బంగారాన్ని "దానం" చేయాలి..అప్పుడు కీర్తి పెరుగుతుంది..వెండి పాత్రలో గానీ,"రాగి" పాత్రలో గానీ,నీళ్ళు పోసి దానిలో "తులసీ దళాలు"వేసి దానం చేస్తే ఆ కుటుంబం లోని పిల్లలకు త్వరగా వివాహాలు అవుతాయని శాస్త్ర వచనం..దానం చేయడం వలన అధిక ఫలం వస్తుంది..కానీ కొనడం వలన కాదు. ధన సంపదనను ఇచ్చే మంత్రం...."కుబేరత్వం ధనాదీశ గృహేతే కమలా స్తితా తాం దేవాం ,  తేషుయా సుసమృద్ధిత్వం మద్ గృహేత్ నమో నమః..." ఇది ఐశ్వర్య ప్రాప్తి మంత్రం..రోజుకు నిష్టగా108 పర్యాయములు"మండలం" రోజులు (40) జపిస్తే ఐశ్వర్యం లభిస్తుంది...ఈ తిథి నాడు అక్షతోదకంతో స్నానం చేసి,అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి,అర్చించి,ఆ తరువాత ఆ బియ్యాన్ని మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి ,మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణో చ్చిష్టంగాతలచి ,వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి" అక్షయ తృతీయ" ఫలం లభిస్తుందట.."రాజసూయ యాగం" చేసిన ఫలం లభిస్తుందట..అంత్యమున "జీవన్ముక్తి" లభిస్తుందట....

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం,

 శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, సింహాచలం చందనోత్సవము. సందర్భంగా ఈ కథనం





సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామీ వారి నిజ రూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది.


చైత్ర అమావాస్య ను గంధం అమావాస్య గా జరుపుతారు. ఇందుకు నిదర్శనం గా ఖచ్చితంగా గంధం అమావాస్య రోజున వర్షం పడుతుందని పెద్దలు చెపుతుంటారు.


విశాఖపట్టణం జిల్లా , సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 


దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.


స్థలపురాణం:-

******

తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.


హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.

చందనోత్సవం

 *వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు .*


ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం  కూడా జరుగుతుంది. 


స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు  చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం


1. పరశురాముని జన్మదినం.


2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.


3. త్రేతాయుగం మొదలైన దినం.


4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.


5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.


6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.


7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.


8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.


9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.


అక్షయ తృతీయ నాడు , మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా , (అది  పుణ్యం కావచ్చు , లేదా  పాపం  కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది.


పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా ,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ , కూజాలో గానీ ,  మంచి నీరు  పోసి , దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే ,  ఎన్ని  జన్మలలోనూ ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. 


అతిధులకు , అభ్యాగతులకు ,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే ,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన  రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. 


అర్హులకు  స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు  సమర్పించుకుంటే ,  మన  ఉత్తర జన్మలలో ,  వాటికి  లోటు  రాదు. గొడుగులు , చెప్పులు ,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు.


 ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం.

సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ


 అగ్రతశ్చతురో వేదాః

పృష్ఠతః సశరం ధనుః!!!

ఇదం బ్రాహ్మ్యమ్  ఇదం క్షాత్రం!!!

శాపాదపి శరాదపి!!!


నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి 

పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొదిని

ధరించి,చేతిలో ధనుస్సు తో  ఉన్న 

బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి


శాపమూ ఇవ్వగలడు..

శరమూ ప్రయోగించగలడు..

ఆశీర్వాదమూ ఇవ్వగలడు..

అస్త్రమూ సంధించగలడు..


ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన

హింసను కూడా చేపట్టగలడు..సమయాన్ని

బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని , క్షాత్ర ధర్మాన్ని ఒకేసారి పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ 🙏🙏


పరశురామ జయంతిశుభాకాంక్షలు

హిందువులు

 




పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో 1946 లో హిందు జనాభా దాదాపు 250000, ముస్లిం జనాభా దాదాపు 5000, దేశ విభజన సమయంలో సియాల్ కోట్ ని భారత్ లో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్ లో కలపాలని, ముస్లింలు పాకిస్తాన్ లో కలపాలని అడిగారు, 


అప్పుడు స్థానిక పెద్దలు వోటింగ్ పెడదాం, ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాము అని నిర్ణయించి వోటింగ్ కోసం ఒకరోజు ను నిర్ణయించారు. ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లిం లు మొత్తం ఓటు వేయడానికి క్యూ లో నిలబడ్డారు, దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలో నే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్లిన కొద్ది మంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి -----ఏం నిలబడతాం లే అని తిరిగి ఇళ్ళకి వెళ్లిపోయారు,ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బైటికి వచ్చారు.  


పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్ లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్ లో కలపడానికే మొగ్గుచూపినట్టు తేలింది. దాంతో సియాల్కొట్ పాక్ లో ఉండిపోయింది, వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా 500 కు తెచ్చారు. హిందువుల బద్ధకం, బుద్ధి హీనత, మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్ లో 3 లక్షల పైగా హిందూ హత్యలకు కారణం అయ్యాయి.    


పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా, కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాలకోసం ఎవడు పట్టుగెత్తుతాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమౌతుంది అన్నంత బద్ధకం హిందువులది, మిగిలిన కుటుంబ సభ్యులు అనాధలై, అడుక్కుతింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తోంది. లక్షల సందర్భాలలో ఇది నిరూపణ అయ్యింది. 


హిందూ అనైక్యతకు పాకిస్తాన్ లోని మరో సంఘటన చెప్తారు. విభజన కు ముందు ఒక హిందూ జామిందార్ ఎకరం విస్తీర్ణం లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించే సమయంలో తన మిత్రుడైనా ఒక ముస్లిం తో ------నా ఒక్కగానొక్క కొడుకు కోసం ఎంత పెద్ద బంగ్లా కట్టిస్తున్నానో చూడు అన్నాడు, అప్పుడు ఆ ముస్లిం దాన్ని ఏదో ఒక రోజున నా 5 మంది కొడుకులు ఆక్రమిస్తారు అన్నాడు, విభజన తర్వాత జమిందార్ ని కొడుకును అతని మిత్రుడే చంపి ఆ బంగ్లాని ఆక్రమించాడు, 


ఇలాంటివి వేల సంఖ్యలో చెప్పినా, చూసినా హిందువులు వాటిలో అర్ధాన్ని గ్రహించడం లేదు, 

గుర్తు పెట్టుకోవడం లేదు, 


ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి.

Shared from WhatsApp

https://whatsapp.com/dl/source=sfw

శుక్రవారం, మే 10, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శుక్రవారం, మే 10, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

      *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి      : *విదియ* ఉ5.45 వరకు

            తదుపరి *తదియ* తె4.55 వరకు

🔯వారం   : *శుక్రవారం* (భృగువాసరే )

⭐నక్షత్రం  : *రోహిణి* మ12.35 వరకు

✳️యోగం : *అతిగండం* మ2.03 వరకు

🖐️కరణం  : *కౌలువ* ఉ5.45 వరకు

       తదుపరి *తైతుల* సా5.20 వరకు

     ఆ తదుపరి *గరజి* తె4.55 వరకు

😈వర్జ్యం   :  *ఉ.శే.వ6.19వరకు*

               *సా6.10 - 7.45*

💀దుర్ముహూర్తము : *ఉ8.06 - 8.57* 

                           *మ12.20 - 1.11*

🥛అమృతకాలం    :  *ఉ9.27 - 11.01* 

                         మరల *తె3.43 - 5.19* 

👽రాహుకాలం       : *ఉ10.30 - 12.00*

👺యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

🌞సూర్యరాశి: *మేషం* || 🌝చంద్రరాశి: *వృషభం*

🌅సూర్యోదయం: *5.34* || 🌄సూర్యాస్తమయం:* *6.17*

       👉 *అక్షయతృతీయ*

      *సింహాచల చందనోత్సవం*

సర్వేజనా సుఖినో భవంతు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం  -‌ తృతీయ  - రోహిణీ -‌‌  భృగు వాసరే* (10.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నర్మదానది

 ॐ                       నర్మదానది 


*ఈ నెల 1వ తేదీ నుంచీ రేపు 12వ తేదీ వరకూ నర్మదానదీ పుష్కరాలు కదా! 


నర్మదా సరితాంశ్రేష్ఠా 

                  రుద్రదేహాద్విని సృతా I 

తీరమే త్సర్వభూతాని 

                 స్థావరాణి చరాణి చ ॥ 

 

  - నర్మద నదులలోకల్లా శ్రేష్ఠమైనది. 

    రుద్రుడైన శివుని దేహంనుండీ పుట్టింది. 

    చరాచర ప్రాణులన్నిటినీ తరింపజేయునట్టిది. 

    

    ఈ విధంగా నర్మదానదిని అతిపవిత్రమైనదిగా మన పూర్వులు భావించారు. 

    గంగాతీరాన కూడా లేనన్ని పుణ్యక్షేత్రాలు ఈ నర్మదా నదీ (నదము) తీరాన ఉన్నాయి. 


            నర్మద పుట్టుకపై పురాణగాథ 


    మండువేసవిలో ఒకనాడు శివునికి బాగా చెమట పట్టిందట. 

    ఆ చెమటనుండీ ఒక షందమైన అమ్మాయి ఉద్భవించింది. 

    అమే నర్మద నదిగా మారిపోయింది. 

    అందుకే నర్మదకు 'రుద్రదేహ' అనీ, శంకరుని కూతురు కనుక శాంకరీ అని కూడా పేర్లున్నాయి. 


                    ఉభయతట పావని 

  

    నర్మదా నదిని ఉభయతట పావని అంటారు. అంటే ఈ నదిలో ఏ ఒడ్డున ఎక్కడ స్నానం చేసినా పుణ్యప్రదమన్నమాట. 

     కొందరు భక్తులు నర్మదా నదికి ప్రదక్షిణం చేస్తారు. దీన్ని పరిక్రమణం అంటారు. 


              నర్మదా నదికి  ఇతరపేర్లు 


    'నర్మద' అంటే ఆనందాన్నిచ్చేది అని అర్థం. 

 1.దీన్నే రేవా అనీ, రేవాజీ అనీ కూడా వ్యవహరిస్తారు. 

     రేవ - అంటే దుముకు అని అర్థం. రేవ్ ధాతువునుండి రేవ అయింది. 

    అమరకంటకం వద్ద ఇది 3500 అడుగుల ఎత్తునుండి దూకుతుంది. అందువల్లనే దీనికి 'రేవా' అనే పేరు. 


 2.మేఖల పర్వతాలలో పుట్టడంచేత - మేఖల కన్యక 


3.సూర్ పన్ జలపాతం తరువాత ఈనది హరన్ పాల్ అనేచోట గుజరాత్ లో మైదాన ప్రదేశంలో ప్రవహిస్తుంది. 

   'హరన్ పాల్' అంటే ఒకలేడి దుముకగలంత వెడల్పు. హరిణమంటే లేడి. 

    ఈ చోట నర్మదానది అంత సన్నగా ఉండడం వల్ల, ఈ నదికి 'హరన్ పాల్' అనేపేరు వచ్చింది. 


                నర్మదా నది ప్రత్యేకత 


    మూడు సంవత్సరాలు సరస్వతిలోనూ, 

    ఏడు రోజులు యమునా నదిలోనూ, 

    ఒక్కరోజు గంగానదిలోనూ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారు. 

    కానీ నర్మదానదిని చూస్తేచాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట. 


    గంగానది కూడా ఏడాదికి ఒకసారి నర్మదానదిలో స్నానంచేసి, తన పాపాలను (తనలో భక్తులు స్నానంచేయడం ద్వారా భక్తులపాపాలను) కడిగివేసుకుంటుంది. 

    గంగ నర్మదలో స్నానం చేసినరోజుని 'గంగాసప్తమి' అంటారు. 


                       నర్మద బాణం 


    నర్మదానదిలోని చిన్నచిన్న కంకరరాళ్ళన్నీ శివలింగాలని పోలి ఉంటాయి. 

   అందుకే నర్మదా నదిలోని ప్రతి కంకరా శంకరుడే అనే పలుకుబడి వచ్చింది. 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

మనం కావాలి

 మనం కావాలి అనుకున్నవాడు 

మనలో మంచిని చూస్తాడు..!! 


మనం వద్దు 

అనుకున్న వాడు 

మనలో చెడును చూస్తాడు..!! 


మనతో అవసరం ఉన్నవాడు మనలో బలహీనతను చూస్తాడు..!!


*శుభోదయం*

పంచాంగం 10.05.2024 Friday

 ఈ రోజు పంచాంగం 10.05.2024  Friday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: తృతీయా తిధి భృగు వాసర: రోహిణి నక్షత్రం అతిగండ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 02:52 వరకు.

రోహిణి పగలు 10:49 వరకు. 

సూర్యోదయం : 05:50

సూర్యాస్తమయం : 06:35


వర్జ్యం : సాయంత్రం 04:18 నుండి 05:52 వరకు. 


దుర్ముహూర్తం : పగలు 08:23 నుండి 09:14 వరకు తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 01:29 వరకు.


అమృతఘడియలు : పగలు 07:46 నుండి 09:18 వరకు తిరిగి రాత్రి 01:41 నుండి 03:15 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పొందరు దుఃఖముల్

 శు భో ద యం🙏


గోవింద పదారవింద మహిమ!


                  ఉ: పొందరు దుఃఖముల్, భయము పొందరు, పొందరు దైన్య మెమ్మయిన్,


                       పొందరు తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత కీర్తు లెందు,, గో


                       వింద పదారవింద పదవీ పరిణధ్ధ గరిష్ట చిత్తులన్;


                            నృసింహ పురాణము- ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద ధ్యాన పరాయణులకు దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము) భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు దాపురించవు. ప్రియములు కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో ఒక చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి కలుగని కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని కలిగించుటకు అది చక్కనిమార్గం. సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి ధ్యానం చేద్దాం. ముక్తిమాట యేమైనా కనీసం చిత్త శాంతితో ప్రశాంతంగా బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


                                                           స్వస్తి!

ధనము చేత

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లోకం|| *విత్తేన రక్ష్యతే ధర్మో విద్యా యోగేన రక్ష్యతే*|

       *మృదునా రక్ష్యతే భూపః సత్త్స్రీయః రక్ష్యతే గృహమ్‌*||


తా𝕝𝕝 ధనము చేత *ధర్మము* రక్షింపబడును, యోగము లేదా నిరంతర అభ్యాసం చేత *విద్య* రక్షింపబడును. మర్యాదస్వభావం చేత *రాజు* రక్షింపబడును. మంచి స్త్రీలచేత *గృహము* రక్షింపబడును*.


     👇 //------- ( *మోహముద్గరం* )------// 👇


శ్లో|| 

*అగ్రే వహ్నిః పృష్ఠేభానూ*

*రాత్రౌ చుబుకసమర్పితజానుః*

*కరతలభిక్షస్తరుతలవాసః*

*తదపి న ముంచత్యాశాపాశః* ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.