: *కాశి వైభవము*
-----------------------
సీ. కాశికా పురినాథ గరళ కంఠేశ్వర
గంగమ్మ చేరెను కరములెత్తి
కేదార లింగేశ వేద స్వరూపుడా
జ్యోతి రూపమనుచు చూడ వస్తి
ఆకలి తీర్చెడు నన్నపూర్ణాదేవి
కాశీ విశాలాక్షి కరుణ చూపు
డుండి గణాధిపు డోలాయ మానుడై
తల్లిదండ్రుల సేవ నెల్ల వేళ
కాలభైరవ స్వామి కాంచిన చాలును
భక్తుల కష్టాలు పారిపోవు
వారాహి దర్శించి వచ్చిన వారల
పరిపూర్ణ యాత్రల ఫలము గలుగు
తే గీ. అంత్య ఘడియల యందున నాశపడుచు
భస్మదారులై మీ యొక్క భక్తులంత
నమ్మినట్టి వారల కోర్కె వమ్ముగాక
తనువు చాలించ వత్తురు మనుషులంత
సీ. నిశివేళ యందు నిటలాక్షునర్చించి
కైలాసమును చేరు కాంక్షనిండి
శివనామ స్మరణము చేయుచు భక్తితో
మ్రొక్కుబడుల నన్ని ముట్ట చేసి
గంగ హారతి చూసి ఘనమగు సేవలో
చేరుకున్న జన్మ శ్రేష్టమనుచు దేవతాగణమంత దీవెనలందించ
దివిని విడిచినారు భువిని చేరి
తే గీ.గుడులు గోపురా లెన్నియో కూల్చివేసి
తురక రాజ మసీదులు ధరణినిండ
ఆక్రమించి హిందువులను నణచివేసి
పుణ్య భూముల జాడను పూడ్చినారు
ధర్మరక్షణ భారంబు తలను దాల్చి
యోధుడై నిల్చె దేశాన మోది నేడు
*ఓం నమశ్శివాయ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి