17, అక్టోబర్ 2023, మంగళవారం

Tippateega develop immunity


 

Balaji swamy in tirupati


 

Plane journey


 

Small train


 

Tippa teega


 

Train manufacturing


 

Kakinada tiffin center


 

Steem railway


 

Srisailam street food


 

Joke


 

Peanut opening


 

Holiday in kuwait🇰🇼


 

Oil pockets packing work


 

Tourists in America


 

LED tubes


 

Hair making eith simple machine


 

Chapati making


 

India bazaar in America


 

Monkey bus travel


 

Puri making


 

Flight take off


 

Srisailam meals


 

Quenciland line train


 

Useful knots


 

Water bottle tips


 

Ceiling fan repair


 

Monaga chettu


 

Dharmapuri


 

Rama naamam


 

Train in airport


 

అమ్మలగన్నయమ్మ

 అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ బుచ్చెడు యమ్మ తన్ను లో నమ్మిన వేల్పు టమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృపాభ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.....

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,61వ శ్లోకం*


 *తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |* 

 *వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61* 


 *ప్రతి పదార్థం* 


తాని, సర్వాణి =ఆ సమస్తములైన ఇంద్రియములను ; సంయమ్య = వశము నందుంచుకొని; యుక్తః = సమాహిత చిత్తుడైన వాడు; మత్పరః = మత్పరాయణుడై; ఆసీతః = ధ్యానము నందు కూర్చోనవలెను; హి = ఏలనన ; యస్య = ఎవని యొక్క ; ఇంద్రియాణి = ఇంద్రియములు; వశే = వశమునందు ( ఉండునో ); తస్య = అతని యొక్క ; ప్రజ్ఞా = బుద్ధియే; ప్రతిష్థితా = స్థిరమై యుండును .


 *తాత్పర్యము* 


కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహిత చిత్తుడై ( చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసినవాడై ) మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొన వలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగా నుండును.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏*🙏

శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

 *శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

           ది:17-10-2023

శా॥

పాదమ్ముల్ సుకుమారకంజయుగళుల్ వర్షించు కెంజాయలున్ 

వాదే లేదిట నాభి పద్మమని సంభాషించు కేల్దమ్ములున్ 

సౌదామ్నీసమ కాయకోరకరుచుల్ స్వచ్ఛంపుమాణిక్యముల్ 

శ్రీదేవీ! వదనారవిందమును నీరేజాతసంబంధి గాన్ 

నీ దేహమ్మిట నబ్జబంధురమయెన్ నిన్నెంతు హృత్కంజమున్  -6

(కోరకము=తామరతూడు)

శా॥

నీకున్ భృత్యులు చంద్రషోడశకళల్ నిండార బ్రహ్మాదులున్ 

రాకాచంద్రుడు మిత్రుడున్ నయనముల్ లాస్యమ్ము శంపాలతల్ 

నీ కారుణ్యసుధాబ్ధిబిందురసముల్ నిక్కంపులక్ష్మీకళల్ 

నీ కాఠిన్యము రాక్షసాంతకము నిన్నేగొల్తు కామేశ్వరీ!  -7

శా॥

విశ్వత్రాతవు విశ్వదాతవు గనన్ విశ్వాంతరాళమ్ముయున్ 

విశ్వస్థమ్మగు భూతజాలమునకున్ విశ్వైకజీవమ్ముయున్ 

విశ్వాసమ్మును జూపువారలకు నిర్వేదమ్ము రానీయకన్ 

విశ్వమ్మంతయు గాచు మాతవుగదా! విశ్వేశ్వరీ! ప్రోవుమా!  -8

"కవితాభారతి"

*~శ్రీశర్మద*

8333844664

వయసుకు తగ్గ వ్యాపకం..*

 *వయసుకు తగ్గ వ్యాపకం..*


"ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పల్లకీసేవ నిర్వహించబడును..పల్లకీసేవ లో పాల్గొనదలచిన భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుతున్నాము.." అంటూ మా సిబ్బంది ఆ శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మైక్ లో చెపుతున్నారు..ఆ ప్రకటన విన్న కొంతమంది తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు.."ఏమండీ..ఇప్పుడే మైక్ లో పల్లకీసేవ గురించి చెపుతున్నారు..పల్లకీసేవ లో పాల్గొనలేని వాళ్లకు ఇబ్బందేమీ లేదు కదా?.." అని ఆ పెద్దాయన నన్ను అడిగారు.."అదేమీ లేదండీ..పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..కొద్దిదూరం ఆ పల్లకీని భుజాన మోసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే తమకు మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రజల్లో పాతుకుపోయింది..మీరు వయసులో పెద్దవారు కనుక..ఒక పని చేయండి..శ్రీ స్వామివారి పల్లకీ మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తిచేసుకున్న తరువాత..ఆ ప్రధాన ద్వారం వద్ద పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..మీరు ఆ పల్లకీ క్రింద వైపు నుండి నడచి రండి..అంటే పల్లకీ లో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తి పాదాల క్రింద మీ శిరస్సు ఆనించి నట్టుగా వుంటుంది..అలా చేస్తే కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందని మరో విశ్వాసం..దాదాపుగా అందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వస్తారు.." అని చెప్పాను.."ఆ పని చేస్తాను నాయనా..మంచి సలహా ఇచ్చావు.." అని చెప్పి వెళ్లారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ పూర్తి అయిన తరువాత..భక్తులందరూ స్వామివారి సమాధి దర్శనం కొఱకు గర్భాలయపు మంటపం లో వేచి వున్నారు..ఆ సమయం లో ముందురోజు పల్లకీసేవ గురించి మాట్లాడిన పెద్దాయన నా దగ్గరకు వచ్చారు.."బాబూ..స్వామివారి సమాధి ని దర్శించుకోవాలి..టికెట్ కూడా కొనుక్కున్నాను.." అన్నారు.."లోపల భక్తులు వేచి వున్నారు..మీ వంతు వచ్చేసరికి మరో గంట పడుతుంది..ఒక ప్రక్కగా కూర్చోండి.." అని చెప్పాను..ఆయన ముఖం లో నిరాశ కనబడుతోంది..మరో గంట తరువాత ఆ పెద్దాయన స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తన అర్చన చేయించుకున్నారు..మళ్లీ తిరిగి నా వద్దకు వచ్చారు.."మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని అడిగారు.."మరో గంట లోపల ఈ హడావుడి తగ్గిపోతుంది..మనం అప్పుడు మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే.." అని వెళ్ళిపోయి స్వామివారి ఎదురుగా ఉన్న మంటపం లో కూర్చున్నారు..స్వామివారి సమాధి దర్శనం తరువాత..ఆయన ముఖం లో ఇంతకుమునుపు ఉన్న నైరాశ్యం లేదు..ఏదో ఆనందం కనబడింది..


సరిగ్గా గంట తరువాత..నా వద్ద ఎవ్వరూ లేరని నిశ్చయం చేసుకున్నాక..ఆ పెద్దాయన వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.."మీతో మాట్లాడాలని చెప్పాను కదండీ.." అన్నారు.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."నా పేరు వాసుదేవరావు..ఇప్పుడు నా వయసు డెబ్భై ఐదేళ్లు..నాకు ఒక్కటే కూతురు..అల్లుడు కూతురు అమెరికా లో వున్నారు..నా భార్య చనిపోయి రెండేళ్లు అవుతోంది..దాదాపుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను..అమ్మాయి తన వద్దకు వచ్చి వుండమని చెపుతున్నది..వెళ్లలేక పోతున్నాను..ఏదో అశాంతి ఆవరించి ఉంది..ఇంటిలో ఒక్కడినే ఉండలేను..అందువల్ల ప్రతి నెలలో ఓ పదిరోజులు ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి రావడం అలవాటు చేసుకున్నాను..ఈసారి గొలగమూడి లోని శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చాను..అక్కడ రెండురోజులు వున్నాను..అక్కడా పల్లకీసేవ చేస్తారు..అక్కడ ఈ క్షేత్రం గురించి విని..ఇక్కడికి వచ్చాను..నిన్నరాత్రి మీరు చెప్పిన తరువాత..స్వామివారి పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకుంటూ నడచి వచ్చాను..ఒక్కసారిగా నా వళ్ళంతా తేలిక పడినట్లు అనిపించింది..అదే అనుభూతి ఈరోజు స్వామివారి సమాధి వద్ద కూడా పొందాను..నాలోని ఒంటరి తనపు భావన మాయం అయింది..ఇందాక ఆ మంటపం లో కూర్చున్న తరువాత..నాకొక ఆలోచన వచ్చింది..నాకు దేవుడు ఆయుష్షు ఎంతకాలం ఇచ్చాడో తెలీదు..ఇక మిగిలిన ఈ శేషజీవితాన్ని..ఒకరికి సేవ చేసుకుంటూ గడపాలి..అని అనిపించింది..ఆ ఆలోచన కూడా ఈ స్వామివారి సన్నిధి లోనే నాకు వచ్చింది..ప్రతినెలా ఒక నియమం పెట్టుకొని..ఒక్కొక్క క్షేత్రం లో ఏదో ఒక సేవలో పాల్గొంటాను..నాకు భుక్తికి కొరవ లేదు..ఇంకొకళ్లకు పెట్టగలిగే స్థాయి ఉన్నది..నా చేతనైన సేవ నేను చేయాలి అని నిశ్చయించుకున్నాను..అదికూడా ఈ స్వామివారి సన్నిధి నుంచే మొదలుపెడతాను..ఒక వారం పాటు నేను ఇక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి..నాకంటూ ప్రత్యేకంగా ఏ వసతీ వద్దు.." అన్నారు.."వయసులో పెద్దవారు..మీరు సేవ చేయడానికి సిద్ధంగా వున్నా..మీ చేత సేవ చేయించడానికి మాకు మనసు రాదు కదా..ఒక పని చేయండి..మీరు ఇక్కడ ఉన్న రోజుల్లో..రోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు పదార్ధాలు వడ్డన చేయండి.." అన్నాను.."అలాగే బాబూ..ధన్యవాదాలు.." అని చెప్పారు..


వాసుదేవరావు గారు మరో వారం పాటు మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద వున్నారు..వారికి ఒక గదిని కేటాయించాము..ఆ వారం రోజులూ ఆయన చాలా ఉత్సాహంతో వున్నారు..తన ఒంటరి తనాన్ని మరిచిపోయారు..ఆ తరువాత తన ఊరికి వెళ్లారు..ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వాసుదేవరావు గారు మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి.."ఒంటరితనం తో ఉన్న నాకు మార్గదర్శనం చేసిన స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీస బాధ్యత.." అంటూ వుంటారు..రెండు వారాల క్రితం వాసుదేవరావు గారు స్వామివారి దర్శనానికి వచ్చి.."స్వామివారి వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఒక గది నిర్మిస్తాననీ..అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తాననీ " చెప్పారు..


"మీకు ఒక విషయం చెప్పమంటారా..? నేను ఒంటరివాడిని అనే ఆలోచనే ఇప్పుడు రావడం లేదండీ..నేను వెళ్లిన ప్రతి క్షేత్రం లోనూ అక్కడి సిబ్బంది నన్ను తమలో ఒకడిగా చూసుకుంటూ..ఆప్యాయంగా పలకరించుకుంటారు..ఓపిక ఉన్నన్ని రోజులూ ఇలా సేవ చేసుకుంటాను..ఆపై ఈ దత్తుడి దయ.." అని నవ్వుతూ చెప్పారు..


ఎవరికి ఏ సమయం లో ఏ మార్గం చూపాలో స్వామివారికి స్పష్టంగా తెలుసు..వాసుదేవరావు గారికి తగిన వ్యాపకాన్ని నిర్దేశించి చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆలోచనాలోచనాలు

 💐 ఆలోచనాలోచనాలు💐 తెలుగు చాటు పద్య సుమ మాలిక💐                 పూర్వ కవుల సమస్యాపూరణములు 💐                                       సమస్య;---""" నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్నునిన్నునున్."""              "" రామాయణార్థముతో పూరణము""                           చం. అనిలజ! జాంబవంత ! కమలాప్తతనూభవ! వాయుపుత్ర! యో / పనస! సుషేషణ! నీల ! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁడ / ద్దనుజపురంబువేగెలువ దైత్యులఁజంపఁగ వేగరమ్మనెన్ / నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.""                                 ఇదే సమస్యను "" భారతార్థములో"" పూరించుట----                      చం. "" అనఘసురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం/ దన ! గురుపుత్ర! ద్రోణ! కృప ! నాగపురీశ్వర! దుస్ససేన! ర/ మ్మనుమనె రాజసూయము యమాత్మజుఁడిప్పుడు చేయఁబూని తా/ నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్."""               ఇదే సమస్యను"" భాగవతార్థములో"" పూరణము----                     చం.""" అనఘసురేశ! వాయుసఖ! ఆర్యమనందన! రాక్షసేంద్ర! యో/ వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర/ మ్మనుమనిచెప్పె మాధవుఁడు మారుని పెండ్లికి మిమ్మునందఱిన్ / నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్నునిన్నునున్."""               మరియొక సమస్య ----          "" తోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెరుంగుచాడ్పునన్.""        "" రామాయణార్థముతో""      ఉ."" తోఁచకపట్టి తెమ్మనుచుఁ దొయ్యలి వేఁడిన వెంటనంటి చేఁ/ జాచుచు మెల్లమెల్లఁగను జాడల జాడల నాశలాలన్/నాచుకవచ్చు రామరఘునాయకుముందర మాయలేడి తాఁ / దోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెరుంగుచాడ్పునన్.""          ఇదే రామాయణార్థముతో "" రామరావణయుద్ధ నేపధ్యం"" లో----                     ఉ."" పీఁచమడంచి రాఘవకపిప్రవరాదులు వాల్మగంటి మ/ న్నేఁచగ మిన్నుమన్ను దిశలెచ్చటి వచ్చటఁ గాలఁగారవిన్/ గ్రాచు శరాగ్నికీలల జగంబులు ఘూర్ణిల నింద్రజిత్తు తాఁ / దోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్.""          ఇదే సమస్యను """ భాగవతార్థములో"" పూరణము----                      పూచినమాటపట్లఁ దలపోయఁగలేక మనోభవుండు ప్రే / రేచ గణాలునాలుఁ దనురెప్పలనార్పక చూడఁగా మనం / బాచగలేనియట్టి త్రిపురారిపురస్థలి శౌరి నారియై / తోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్.""      "" ఇఱుకరాదు; కొఱుకరాదు; నఱుకరాదు; పెఱుకరాదు"" ఈ నాలుగు పదాలతో ఒక పద్యం.          తే.గీ. "" ఇఱుకరాదుచేత నిసుమంత నిప్పైన / గొఱుకరాదు యినుము కొంచెమైన / నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ/ బెఱుకరాదు బావి పెల్లగిలగ.""                            చివరగా ఒక చమత్కార పద్యంతో ముగింపు.              "" ఒకేపేరులో మూడేసి పేర్లు ఉండాలన్నది ఇందులోని షరతు.""         దశరథాగ్ర సుతుండు, శశియు, పట్టణంబొక పేరులోపల నుండ వలయు.                               దర్పకాంతకుడు , నేత్రంబును, మాలయు నొక పేరు లోపల నుండవలయు.                   వేల్పును, త్రోవయు, వెలయు ప్రసూనంబు నొక పేరు లోపల నుండవలయు.                     కనకంబు, కార్పాస మొనర మహీజంబు నొక పేరు లోపల నుండ వలయు.         దీన యర్థంబు తెలియంగ బూనుకొనుచు / మది విచారించి పదునైదుమాసములను / సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి / చెప్పలేకున్న నగుదు నే చిన్నినవ్వు.           సమాథానం చెప్పటానికి 15 నెలల గడువున్నా మనం ఇప్పుడే ప్రయత్నిద్దాం.                        దశరాథాగ్రసుతుడు = రాముడు , శశి = చంద్రుడు,  పట్టణం = పురం . ఈ మూడింటిని కలిపితే రామచంద్రాపురం అయ్యింది.                           ఇక రెండవది.                       దర్పకాంతకుడు = రుద్రుడు, నేత్రం = కన్ను, మాల = దండ - కాబట్టి రుద్రాక్ష మాల సమాధానం అవుతుంది.                            వేల్పు = దేవత, త్రోవ = దారి, ప్రసూనం = పుష్పం. వీటన్నింటినీ కలిపితే " దేవదారిపుష్పం" అయ్యింది.                            చివరగా కనకం = పైడి, కార్పాసం = పత్తి, మహీజం = చెట్టు, ఈ మూడింటిని కలిపితే "" పైడిపత్తిచెట్టు"" అవుతుంది. ఇప్పుడు మనం " భావజ్ఞ చక్రవర్తుల" మే! హాయిగా నవ్వుకొందాం.                        తేది 17--10--2023, మంగళవారం, శుభోదయం.

రుద్రాక్షల విశేషాలు


 రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ - 2 . 


  అంతకు ముందు పోస్టులో రుద్రాక్షల గురించి కొంత వివరణ ఇచ్చాను . ఇప్పుడు మరికొంత వివరణ ఇస్తాను . 


      రంగును బట్టి రుద్రాక్షలను మూడు రకాలుగా విభజించవచ్చు . రుద్రాక్షలు శ్వేత ,రక్తపీత , కృష్ణ వర్ణాలలో ఉంటాయి . అంటే తెలుపు , ఎరుపు , నలుపు రంగులలో ఉంటాయి . నిజానికి రుద్రాక్షల యొక్క రంగు అంత ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలులేదు . నూటికి నూరుశాతం తెలుపు రుద్రాక్ష గాని లేదా మరో స్వచ్ఛమైన ఇంద్రధనస్సు రంగులలో ఏ ఒక్కదానికి చెందినది గాని ఉత్పత్తి అవుతున్న దాఖలాలు లేవు . 


     సాధారణంగా తెలుపు రుద్రాక్షలు అనేవి కాస్త జేగురు రంగు కలసినచో లేదా లేత పసుపు రంగులో ఉండేవో ఉంటాయి . ఈ రుద్రాక్షలు అరుదుగా ఉంటాయి .మనదేశములో మహారాష్ట్ర రాష్ట్రములో నాసిక్ పరిసర ప్రాంతాలలో ఈ రకం రుద్రాక్షలు లభ్యం అగును . పూర్తి ఎరుపు రంగు రుద్రాక్షలు కూడా సాధారణంగా తటస్థపడవు . రుద్రాక్ష పండు దశలో ఉండేటప్పుడు ఖచ్చితమైన ఎరుపు ఉండే అవకాశం ఉందిగాని ఎండి గట్టిబడిన తరువాత ఆ రంగు ఉండదు . సాధరణంగా ఎరుపు రుద్రాక్షలుగా పిలవబడేవి ఇటుక పొడి రంగులో ఉంటాయి . 


    స్వచ్చమైన నలుపు రంగు రుద్రాక్షలు కూడా ఎక్కడా లభించవు . మాములుగా ముదురు కాఫీ రంగు , ఎరుపు , నలుపుల మిశ్రమపు రంగులో ఉండే రుద్రాక్షలనే నలుపు రంగు రుద్రాక్షలు అంటూ ఉంటారు . ప్రపంచములో ఈ రంగు రుద్రాక్షలే ఎక్కువుగా లభిస్తాయి . 


   మొత్తానికి రుద్రాక్షల రంగు ఏదైనా వాటిలో పెద్ద పరిమాణంలో ఉన్నవి ధరించడం ఉత్తమ ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు . ఇప్పుడు ఆధునిక కొలమానం ప్రకారం మూడు రకాల కొలతలు గురించి వివరిస్తాను . 


 * పెద్దరకం రుద్రాక్షలు - 


 2 నుండి 2 .5 సెంటీమీటర్లు . 

వీటిని ధాత్రిఫల ప్రమాణం అని పిలుస్తారు . 

 

 * మధ్యరకం రుద్రాక్షలు - 


 1 నుంచి 2 సెంటీమీటర్ల మధ్య . 

వీటిని బదరీఫల ప్రమాణం అని అంటారు. 


 * చిన్నరకం రుద్రాక్షలు - 


 1 సెంటీమీటరు కన్నా తక్కువ . 

వీటిని చణమాత్ర ప్రమాణం అంటారు . 


   తరవాతి పోస్టు నందు ముఖాలు ను బట్టి రుద్రాక్ష విభజన వాటి యందలి అద్భుత శక్తులు మరియు ఉపయోగాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను . 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034


తల్లిపాలలో దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


    తల్లిపాలు శిశువుకు అమృతప్రాయమైనవి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువు యొక్క రోగనిరోధకశక్తిని పెంపొందించడం లో ప్రధానపాత్ర పోషించును . ప్రస్తుతం చాలమంది పిల్లలకు డబ్బాపాలు అలవాటు చేయడం జరుగుతుంది. దానివలన శిశువు శరీరం నందు కఫం పెరుగును . ఈ విధముగా కఫం పెరగటం వలన పాలఉబ్బసం , జీర్ణవ్యవస్థలో సమస్యలు , మలబద్ధక సమస్యలు వంటివి ఎన్నొ రోగాలు వస్తాయి.  


          ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిపాలు తాగుతున్న శిశువుకు కూడా ఎన్నొ రకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శిశువు తాగే తల్లిపాలలోని దోషాలు. మనం సమస్య ఎక్కడ ఉందో కనుగొనకుండా శిశువుకి మందుల మీద మందులు వాడి శిశువు యొక్క శరీరాన్ని మరింత బలహీనపరుస్తున్నాం. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం తల్లి తీసుకునే ఆహారం . పాతకాలంలో బాలింతకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు చాలామందికి ఏమి తినాలో తెలీదు. ఏదిపడితే అది తినటం వలన సంభవించే దోషప్రభావం చివరికి తల్లిపాల ద్వారా శిశువుకి సంప్రాప్తించి శిశువు రోగాలపాలవుతున్నాడు. 


  * వాతదోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు దుష్ప్రభావాలు - 


    తల్లి యందు వాతం పెరుగుట వలన స్తన్యం యొక్క రుచి చెడిపోవును . ఇలా దోషమును పొందిన స్తన్యమును సేవించిన బాలుడు కృశించును. శిశువు వృద్ది చెందుటకు చాలాకాలం పట్టును . వాతప్రభావం వలన స్తన్యము నురుగుతో కూడుకుని ఉండును. స్తన్యము కష్టము మీద బయటకి వచ్చును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు కృశించిన స్వరము , మలమూత్ర బంధనం జరిగి వాతదోషము వలన శిరోరోగము , పీనసరోగము ( పీనస రోగము అనగా ముక్కు వెంట నీరు కారుతూ ఉండును ) సంభంవించును . 


 * పిత్త దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు పిత్తము పెరుగుట వలన స్తన్యము పచ్చగా లేదా నలుపు రంగుతో వచ్చును. ఇట్టి స్తన్యమును తాగిన శిశువుకు శరీరవర్ణం మారును . చెమటయు , మలస్రావము ఎల్లప్పుడూ వేడిగా ఉండును. శరీరము ఎల్లప్పుడూ వేడిగా ఉండును . స్తన్యము నందు ఇష్టము లేకపోవుట జరుగును . పిత్తదోషము పొందిన స్తన్యమును సేవించు శిశువుకు పాండురోగము , కామెర్ల వ్యాధి సంభంవించును . 


 * కఫ దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు కఫము పెరుగుట వలన స్తన్యము జిడ్డుగా , జిగటగా ఉండును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు వాంతి , బాధ , నోటి నుండి చొల్లు కారుట , ఆయాసము , దగ్గు , నోటి నుంచి అతిగా నీరు వూరుట , నేత్రములు వాచుట , మందముగా ఉండటం వంటి సమస్యలు కలుగును. 


    మరింత విలువైన సమాచారం పూర్తి వివరణాత్మకంగా నేను రచించిన గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. వాటిని చదవగలరు . 


 

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

అన్నపూర్ణకివియె

 -సూర్య గండ్రకోట


es.3.:


నిరుపమ గుణశాలి నిత్యాన్నదాయిని ఈశుకైన భిక్ష నిచ్చు తల్లి! కామితముల దీర్చు కాశీశ్వరుని సతి అన్నపూర్ణకివియె యర్చనములు!!!


శరన్నవరాత్రులలో మూడవరోజున శ్రీ అన్నపూర్ణాదేవి అవతారము!

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


నారదా! పైకి రా. ఎంతసేపు నీ స్నానం? ఇంకా ఏం చేస్తున్నావ్ ఆ నీళ్ళల్లో నిలబడి?

అంటున్నాడు గట్టుమీద నిలబడ్డ శ్రీహరి.

(అధ్యాయం - 29, శ్లోకాలు 66)

నారదుడుగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజమహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. నా

భార్య ఏమయ్యింది? ఎటు మాయమయ్యింది? ఈ మునిసత్తముడెవరు? ఎలా ఊడిపడ్డాడు? మమ్మల్ని

ఇక్కడికి తెచ్చిన వృద్ధవిపుడు ఏడి? హాప్రియా! నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఎలా వెళ్ళగలిగావు?

పుత్రశోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచివెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పింది? నువ్వు లేనిదే

నేను జీవించలేను. నా జీవితం వ్యర్థం. నా రాజ్యమూ సంపదలూ వృధా. ఏమి చేసుకోను? ఎలా

జీవించను? నీతోపాటే నా ప్రాణాలను కూడా తీసుకుపోకపోయావా? నాకు బ్రతకాలని లేదు. ప్రాణాలపై

తీపి చచ్చిపోయింది. ప్రియా! ఎక్కడ ఉన్నావో! దయచేసి ఒక్కసారి పలుకు. ఈ దీనుడికి బదులు చెప్పు.

రవ్వంత ఓదార్చు. ఇంతలోనే ఇంత కఠినురాలివి ఎలా కాగలిగావు? ఆ ప్రేమా అనురాగమూ ఏమైపోయాయి?

ఈ నీళ్ళల్లో మునిగిపోయావా? జలచరాలు భక్షించేశాయా? వరుణదేవుడు అపహరించాడా? ఎంత

దురదృష్టవంతుణ్ణి! పుత్రుల్లో కలిసిపోయిన అదృష్టవంతురాలివి నువ్వు. అవును నీ పుత్రప్రేమ అంతటిదే.నేనెరుగుదును. కాకపోతే, నన్నుకూడా తీసుకువెళ్ళుంటే సంతోషించేవాడిని. ఒంటరిని చేసి వెళ్ళిపోయావా?

ఇదేమి అన్యాయం చెప్పు. ఇది నీకు భావ్యమా? నేను చేసిన అపరాధం ఏమిటి? ఎందుకు నాకు ఈ శిక్ష

విధించావు? నేను దీన్ని భరించలేను. అటు పుత్రులను కోల్పోయాను, ఇటు నిన్ను పొగొట్టుకున్నాను.

అయినా ఇంకా బతికే ఉన్నాను. పాడుప్రాణాలు వదిలిపోవు ఇదేమిటి! ఇప్పుడింక నాకు ఏది దారి?

ఎక్కడికి పోను? ఏమి చెయ్యను? భార్యావియోగ దుఃఖాన్ని తట్టుకుని నిలబడడానికి నేనేమన్నా

రఘురాముడినా ? అనురక్తులూ సమచిత్తులూ అయిన దంపతులకు విడివిడిగా మరణం ప్రాప్తించడం

కన్నా భరించరాని దుఃఖం మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో అయినా అలాగే జరుగుతోంది. ఆడవాళ్ళు

ఎంత అదృష్టవంతులు, ధర్మశాస్త్రాలు సహగమనం చెప్పాయి. ఇటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవలసిన

దుఃస్థితిని స్త్రీలకు తప్పించారుగదా ధర్మశాస్త్రకర్తలయిన మహర్షులు.

ఉపకారస్తు నారీణాం మునిఖిర్విహితః కిల

యదుక్తం ధర్మశాస్త్రేషు జ్వలనం పతినా సహ

నవరాత్రి అలంకార

 ద్విపద 

 

( విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి అలంకార రూపములను ప్రస్తుతిస్తూ )🙏


కీర్తన :-  // కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //🌹


*కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ*

*ధరనందరినిఁ బ్రోవ దయచేయవమ్మ !*


*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*


*మేలిమి బంగారు మిరుమిట్లు గురియ*

*బాలవై యలరించు ఫాలలోచనిగ !*

*పంచవదనమాకు బరమంబు దెల్పు*

*మంచియ గట్టితి మన్నపూర్ణవని !!*


*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*


*శ్రీలలితాంబవై శ్రీసరస్వతిగ ,* 

*యేలుకో మహలక్ష్మి యిందిరా రమణి*

*దుర్గతులను బాపు దుర్గవై నిలిచి*

*మార్గదర్శివినీవె మహిషమర్దినివి*

 

*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*


*నవదుర్గ పాహిమాం నవనీత హృదయ*

*జవమునింపవె భువిజనకోటికెల్ల*

*రాజరాజేశ్వరి రాజిల్లవమ్మ*

*నీ జాలి జూపుమా నీరాజనములు !!*


*// కరుణాంబు రాశి శ్రీ కనకదుర్గమ్మ //*


🌹🙏🌹


✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*

*దేవీ నవరాత్రులు

 *దేవీ నవరాత్రులు - మూడవ రోజు - అన్నపూర్ణాదేవి అలంకారం*


నిత్యానందకరీ వరాభయకరీ 

సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిల పాపనాశనకరీ 

ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


నానారత్న విచిత్ర భూషణకరీ 

హేమాంబరాడంబరీ

ముక్తాహారవిడంబమాన విలసత్

వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరువాసితాంగ రుచిర 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


యోగానందకరీ రిపుక్షయకరీ 

ధర్మైక నిష్ఠాకరీ

చంద్రార్కానల భాసమానలహరీ 

త్రైలోక్య రక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


కైలాసాచల కందరాలయకరీ 

గౌరీ ఉమాశంకరీ

కౌమారీ నిగమార్థగోచరకరీ 

ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ


దృశ్యాదృశ్య విభూతి పావనకరీ 

బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ 

విజ్ఞాన దీపాంకురీ

శ్రీవిశ్వేశ మనఃప్రమోదనకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ 

శంభుప్రియే శంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ 

విశ్వేశ్వరీ శ్రీకరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ 

మాతా కృపాసాగరీ

నారీ నీలసమానకుంతలధరీ 

నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


దేవీ సర్వవిచిత్ర రత్నరచితా 

దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయోధరా ప్రియకరీ 

సౌభాగ్యమాహేశ్వరీ

భక్తాభీష్టకరీ సదాశుభకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


చంద్రార్కానల కోటికోటిసదృశా

చంద్రాంశుబింబాధరీ

చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ 

చంద్రార్కవర్ణేశ్వరీ

మాలాపుస్తక పాశసాంకుశధరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


క్షత్రత్రాణకరీ సదాశివకరీ 

మాతా కృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ 

విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ 

కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ 

మాతాన్నపూర్ణేశ్వరీ 


అన్నపూర్ణే సదాపూర్ణే 

శంకర ప్రాణ వల్లభే

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం 

భిక్షాం దేహిచ పార్వతి 


మాతా చ పార్వతీ దేవీ 

పితా దేవో మహేశ్వరః

బాంధవా శివభక్తశ్చ 

స్వదేశో భువనత్రయమ్


ఇతి శ్రీమద్ శంకరభగవద్పాద 

విరచితం అన్నపూర్ణా స్తోత్రం సంపూర్ణం


                 - ఆది శంకరాచార్యులు

       గానం - శ్రీమతి నిత్య సంతోషిణి

నవగ్రహా పురాణం🪐* . *56వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *56వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*కేతుగ్రహ జననం - 1*


నారదమహర్షి ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ హిమాలయ ప్రాంతంలో నేల మీదికి దిగాడు. ఆయన రాకకోసమే నిరీక్షిస్తున్నట్టు భూదేవి ఆయన ముందు నిలబడింది. *"మాతా !"* నారదమహర్షి ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఆకాశ మార్గాన నిన్ను చూశాను నారదా ! నింగి నుండి నేలకు దిగుతావేమో అని ఎదురు చూస్తున్నాను...”* *“నారాయణ ! జనని ముఖాన ఏదో విచారం..."* నారదుడు భూదేవిని చూస్తూ అన్నాడు.


*"విచారం లేకుండా ఎలా ఉంటుంది నారదా ! అందరి భారమూ సహించి , మోయాల్సింది నేనే కదా ! సృష్టికర్త సృజన నిర్విరామంగా సాగుతోంది. ఫలితంగా మను సంతతి నా మీద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. నా మీద భారం మోయలేనంతగా పెరిగింది నారదా ! నువ్వు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుడికి నా బాధ వివరించు. నా భారాన్ని తగ్గించే యోచన చేయమను !"*


*"నారాయణ ! భూభారం పెరిగితే ప్రమాదమేనని మా జనకులూ , ఆయన జనకులూ అనుకుంటూ ఉంటే విన్నాను ! ఇప్పుడే సత్యలోకానికి వెళ్తాను !"* అంటూ నారదుడు నింగికి ఎగిరాడు.


నారదుడు బ్రహ్మ దర్శనం చేసుకున్నాడు. భూమి ఉపద్రవాల అంచుకు చేరిందనీ , అందుకు కారణం ప్రాణుల సంఖ్య భయంకరంగా పెరిగిపోవడమేననీ వివరించాడు. భూదేవి సందేశాన్ని వినిపించాడు.


*"సమస్య తీవ్రమైందే , కుమారా !"* బ్రహ్మ సాలోచనగా అన్నాడు.


*"కొంత కాలం సృష్టి కార్యానికి విరామం ఇస్తే...”* నారదుడు సూచించాడు. 


సరస్వతి చిన్నగా నవ్వింది. *"దాని వల్ల ప్రయోజనం లేదు , నారదా ! ఇప్పటికే ఉన్న ప్రాణుల వల్లనే కదా భూభారం పెచ్చు పెరిగింది !”*


*“ఔను ! ఉన్న ప్రాణుల సంఖ్య పెరగకుండా చూడటం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదు , కుమారా ! ఉన్న సంఖ్య తరగాలి !"* బ్రహ్మ ఆలోచిస్తూ అన్నాడు.


*"ప్రాణుల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచిస్తాను !"* బ్రహ్మ మళ్ళీ అన్నాడు. *"నువ్వు వెళ్ళి భూమాతకు తెలియజేయి నారదా !".* 


*"ఆజ్ఞ!"* అన్నాడు నారదుడు.


బ్రహ్మ ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది కానీ , ఆయనకు పరిష్కారం తట్టలేదు. దాంతో ఆయనలో ఆగ్రహం పెచ్చరిల్లింది. మితిమీరిన ఆయన ఆగ్రహం వల్ల ఆయన నాలుగు ముఖాల నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆ మంటల మూలంగా ప్రాణులకే కాకుండా , లోకాలలోని అచేతన పదార్థాలకూ ప్రమాదం ఏర్పడింది. సకల లోకాలలో సర్వనాశనం తాండవం చేసే పరిస్థితి తలయెత్తింది. బ్రహ్మ తన తీవ్రాలోచనలో ఉండిపోయాడు.


బ్రహ్మ ముఖాల నుండి వెలువడే అగ్నిజ్వాలల ప్రమాదాన్ని ఊహించిన పరమశివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆలోచనా ధ్యానాన్ని భగ్నం చేశాడు.


*"సృష్టికర్తా ! మీ ఆలోచనను ఉపసంహరించి , తద్వారా అగ్నికీలలను అణగార్చండి. మీ కర్తవ్యం సృష్టి ; సంహారం కాదు !"* శివుడు అన్నాడు.  *"ఆ సంహార కార్యానికి మరొక తగిన శక్తిని సృష్టించండి. భూభారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయాల్సిన పని అది మాత్రమే. ఇక , నేను సంహారకర్తను , లయకారకుణ్ణి. నా విధి కూడా చంపడం కాదు. చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడం !".*


పరమశివుడి సూచన సృష్టికర్తకు నచ్చింది. శ్రీహరి ఉద్దేశం కూడా అదే ! తాను కేవలం సృష్టికర్త ! తన విద్యుక్త ధర్మం ప్రాణులను పుట్టించడం , చంపడం కాదు !


ఆలోచనలను ఉపసంహరించిన బ్రహ్మలోంచి ఒక స్త్రీ మూర్తి ఆవిర్భవించింది. ఆమె శరీరం ఎరుపు , నలుపు , పసుపు వర్ణాల మేళవింపులో ఉంది. ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు అభిముఖంగా నిలుచుంది.


*“నేనెవరు ?"* అందామె బ్రహ్మను చూస్తూ.


*“నీ పేరు మృత్యువు ! ఒక మహాకార్యనిర్వహణ కోసం నిన్ను సృష్టించాను. సృష్టిలోని ప్రాణులను సంహరించడమే నీ కర్తవ్యం. వెళ్ళు ! ఆ కార్యంలో నిమగ్నురాలివై పో !"* అన్నాడు బ్రహ్మ.


బ్రహ్మ వాక్కు వినగానే మృత్యువు దీనంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లోంచి అశ్రువులు జలజల రాలాయి. బ్రహ్మ ఆ కన్నీటి బిందువులను తన దోసిట్లో పట్టుకున్నాడు.


*"నన్ను క్షమించండి. ప్రాణులను చంపడం అధర్మం. ఆ పనిని నేను చేయను. వెళ్తున్నాను ! తపస్సు చేసుకుంటాను !"* అంటూ , మృత్యువు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. 


బ్రహ్మ పరమశివుడి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. *"స్త్రీ సహజమైన వాత్సల్య లక్షణంతో మృత్యు దేవత అలా అంది. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి , కార్యోన్ముఖురాలిని చేయండి !”*


బ్రహ్మ వద్ద నుండి వెళ్లిపోయిన మృత్యుదేవత 'ధేనుకాశ్రమం' అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. కొన్నాళ్ళు జరిగాక బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు.


*“స్వామీ...”* అంది మృత్యువు ఆశ్చర్యంగా.


*“నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నువ్వు అంకితం చేసుకునే దాకా , నేను నీకు ప్రత్యక్షమవుతూనే ఉంటాను. నీ ఆవిర్భావానికి మూలం ప్రాణుల సంహార సంకల్పం. ఆ సంకల్పం వికల్పం కాకూడదు ; కాదు. ఈ విధి నీకు విధిస్తున్న విధి నుండి నువ్వు తప్పించుకోలేవు !"* బ్రహ్మ మృత్యువు ముఖంలో గూడుకట్టుకుంటున్న విచారాన్ని చూస్తూ క్షణకాలం ఆగాడు.


*"మృత్యుదేవీ ! జాగ్రత్తగా ఆలకించు. నీ చేతులతో నువ్వు ప్రాణులను వధించే అవసరం ఉండదు. ఆ రోజు నువ్వు కన్నీళ్ళు కార్చావు. ఆ అశ్రువుల్ని నేను దోసిట పట్టుకున్నాను. గుర్తుంది కదా ! ఒక్కొక్క అశ్రుకణం ఒక్కొక్క రోగంగా రూపొంది , ప్రాణులను మరణాలకు తరలిస్తాయి. ఆ కార్యాన్ని అధివీక్షించి , క్రమ పరచడమే నీ విధి. నా ఆదేశాన్ని శిరసా వహించు. నీ విధిని స్వీకరించు. కర్తవ్యాన్ని ఆచరించడం ప్రారంభించు !"* అన్నాడు గంభీరంగా బ్రహ్మ.


నిరాకరించలేని తన నిస్సహాయత అర్థమైందా మృత్యుదేవతకు. ఆ ఆలోచన కలిగిన మరుక్షణం ఆమెలోంచి వేడి నిట్టూర్పూ సెగలు కక్కుతూ వెలువడింది. పతాకాల ఆకారంతో వెలువడిన ఆ నిట్టూర్పులోంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు.


బ్రహ్మ ఆ బాలుణ్ణి చిరునవ్వుతో చూసి , చూపుల్ని మృత్యువు వైపు మరల్చాడు. *“నీ మూలంగా ఈ బాలుడు జన్మించాలన్న ఆశయంతోనే , నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి వెళ్ళనిచ్చాను. ఈ బాలుడు నీ కుమారుడు !"*


బ్రహ్మమాటలు వినగానే మృత్యువు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఎదకు హత్తుకుంది. *"కేతువు ఆకారంలో జన్మించిన నీ కుమారునికి 'కేతువు' అని నామకరణం చేస్తున్నాను. బాలకుణ్ణి పెంచి , పెద్దవాణ్ణి చేయి !”* అన్నాడు బ్రహ్మ.


మృత్యువు తలను అడ్డంగా ఊపింది. *"నా కర్తవ్యం కఠినాతి కఠినమైంది. పుత్రపోషణకూ , దానికీ సమన్వయం కుదరదు ; కుదుర్చుకోలేను. బాలకుణ్ణి మీరే స్వీకరించండి !"*


బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. *"నీ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. నీ కేతువు రాక్షస లక్షణాలతో జన్మించాడు. రాక్షస సంతతిని పొందిన కశ్యప ప్రజాపతి ఆ బాలకుణ్ణి పెంచడానికి తగినవాడు. కశ్యపుడు నీ పుత్రుడిని తన పుత్రుడిగా స్వీకరించి , పోషిస్తాడు. 'కేతువు' కశ్యపుడికి అందేలా చూడు !"*


*"ధన్యోస్మి !”* అంది మృత్యువు కేతువును ముద్దుపెట్టుకుంటూ.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 66*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 66*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*భగవంతుడు ఏం చేశాడు!*


భగవంతుని పట్ల ఒక వ్యక్తి సంతరించుకొన్న విశ్వాస ప్రగాఢతా, నిశ్చలతా అగ్నిపరీక్షలు ఎదురైనప్పుడు తేలిపోతుంది. "నేను ఇంతగా దుఃఖిస్తున్నానే, ఈ భగవంతునికి కళ్లు లేవా? అని ప్రశ్నించని సామాన్య వ్యక్తులు ఉండజాలరు. 


"కృష్ణా! నువ్వు దుష్టుడవు. నీ కొకటి చెబుతాను. నువ్వు నన్ను కౌగిలించుకొని నీ పాదపద్మాల మ్రోల శరణు ఒసగినా సరే, లేక నా చూపులకు అందకుండా నిలబడి ఆవేదన కలిగించినా సరే! నువ్వు నన్ను ఏం చేసినా నువ్వే నా సర్వస్వం. నువ్వు తప్ప నా కెవరూ లేరు!" అని చైతన్య మహాప్రభువు చెప్పినట్లు, భగవంతుణ్ణి దూషించినా ఆయననే విశ్వసించి జీవించడం సామాన్యమైన విషయం కాదు. 


నరేంద్రుడు ఏం చేశాడు? ఆయన మాటల్లోనే విందాం:......


"ఇన్ని కష్టాలూ, పరీక్షలు ఎదురైనప్పటికీ నా ఆస్తికత చెక్కుచెదరలేదు. 'భగవంతుడు మంచే చేస్తాడు' అనే భావనలో కించిత్తూ సందేహం జనించలేదు. ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి, ఆయన దివ్యనామాన్ని ఉచ్చరిస్తూనే పడక నుండి లేస్తాను. ఆ తరువాత పరిపూర్ణ విశ్వాసంతో ఉద్యోగాన్వేషణకు బయలుదేరేవాణ్ణి. అలవాటు ప్రకారం ఒక రోజు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పడక నుండి లేచాను. ప్రక్క గదిలో ఉన్న మా అమ్మ అది విని చిరాగ్గా, 'అది ఆపరా! చిన్నతనం నుండి దేవుడు, దేవుడు అంటూ పల్లవి పాడుతున్నావు. ఆ దేవుడే ఇంత చేశాడు కదా! ఇంకా ఎందుకు పలవరిస్తావు!" అని అంది. 


ఆమె మాటలు నా హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. 'దేవుడనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనిషి హృదయపూర్వక ప్రార్థనలను చెవొగ్గి వింటాడా? అలా అయితే, ఇంతగా విలపిస్తున్నానే, దానికి ఎలాంటి జవాబూ రాదు ఎందుకు? సౌజన్యం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో ఇంత చెడు ఎక్కణ్ణుండి వచ్చింది? మంగళమయుడైన భగవంతుని పాలనలో ఇంత అమంగళ మెందుకు?' అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాను. 


ఇతరుల దుఃఖం చూసి తల్లడిల్లిన విద్యాసాగర్ ఒకసారి, 'భగవంతుడు మంచితనమే మూర్తీభవించిన వాడు, మంగళమయుడైన వాడు అయినప్పుడు లక్షలాది ప్రజలు కరవు కాటకాల భయానక గుప్పిట్లో చిక్కి పిడికెడు అన్నం కోసం అలమటిస్తూ మరణిస్తున్నారెందుకు?' అని అడిగారు కదా, ఆ వాక్కు పరిహసిస్తున్నట్లు నా చెవుల్లో

ప్రతిధ్వనించాయి. ఆ రోజు భగవంతుని పట్ల ఎన్నడూ లేనంత విసుగు నాకు కలిగింది. ఇటువంటి సమయం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా, 'నిజంగానే భగవంతుడున్నాడా? అనే సందేహమూ నాలో తలెత్తింది.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 56*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 56*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః*

*నిలీయంతే తోయే నియత మనిమేషా శ్శఫరికాః |*

 *ఇయం చ శ్రీ ర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం*

 *జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి‖*


ఓ అపర్ణా, పార్వతీ! అమ్మవారు హిమవంతుని కుమార్తెగా, శివుని కోరి తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ఆహారము,నీరు తీసుకోకపోవటమే కాక అట్టి తపస్సులు చేయు మహర్షులు తిన్నట్లుగా ఎండిపోయి నేలవ్రాలిన పర్ణములను ఆకులను కూడా తీసుకొనేది కాదట.అందువలన అపర్ణ.


అమ్మా, నీ చెవుల సమీపాన సదా వుండే నీ విశాల నేత్రాలను చూసి సిగ్గుపడి, తమపై అమ్మవారి చెవులలో కొండెములు చెప్పుతాయనే భయంతో శఫరికలు (ఒక విధమైన చేపలు) నీటిలో దాక్కొని అట్టడుగున ఈదుతాయట. నీ రెప్పవేయని నేత్రాలు (రెప్ప మూస్తే లోకాలు లయమవుతాయని) ఆ విధంగా నీటిలో దాగున్న మీన నేత్రాల వలె వున్నాయమ్మా! చేపలు కూడా రెప్ప వేయవు కదా!   


అదే విధంగా కలువలు (కువలయములు) కూడా తమ అందాన్ని మించిన నీ నేత్రాల సౌందర్యాన్ని చూసి సిగ్గుపడి పగటి వేళల ముడుచుకొని ఉంటాయట. కలువలు రాత్రి సమయంలో విచ్చుకుంటాయి కదా. నీ నేత్ర లక్ష్మి పగలంతా నీ కన్నులలో వుండి రాత్రి వేళ కలువ దళాలను తెరచి అందులో వుంటుందట. ఉదయం కాగానే ఆ దళాలను మూసి వచ్చి మళ్ళీ నీ నేత్రాలయందు ఉంటుందట. 

అమ్మవారు మీనాక్షి అనీ, ఆమె నేత్రాలు పూర్తిగా విచ్చుకున్న కలువలను పోలి ఉంటాయనీ భావం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శరన్నవరాత్రాంతర్గత

 *శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*

           ది:17-10-2023

శా॥

పాదమ్ముల్ సుకుమారకంజయుగళుల్ వర్షించు కెంజాయలున్ 

వాదే లేదిట నాభి పద్మమని సంభాషించు కేల్దమ్ములున్ 

సౌదామ్నీసమ కాయకోరకరుచుల్ స్వచ్ఛంపుమాణిక్యముల్ 

శ్రీదేవీ! వదనారవిందమును నీరేజాతసంబంధి గాన్ 

నీ దేహమ్మిట నబ్జబంధురమయెన్ నిన్నెంతు హృత్కంజమున్  -6

(కోరకము=తామరతూడు)

శా॥

నీకున్ భృత్యులు చంద్రషోడశకళల్ నిండార బ్రహ్మాదులున్ 

రాకాచంద్రుడు మిత్రుడున్ నయనముల్ లాస్యమ్ము శంపాలతల్ 

నీ కారుణ్యసుధాబ్ధిబిందురసముల్ నిక్కంపులక్ష్మీకళల్ 

నీ కాఠిన్యము రాక్షసాంతకము నిన్నేగొల్తు కామేశ్వరీ!  -7

శా॥

విశ్వత్రాతవు విశ్వదాతవు గనన్ విశ్వాంతరాళమ్ముయున్ 

విశ్వస్థమ్మగు భూతజాలమునకున్ విశ్వైకజీవమ్ముయున్ 

విశ్వాసమ్మును జూపువారలకు నిర్వేదమ్ము రానీయకన్ 

విశ్వమ్మంతయు గాచు మాతవుగదా! విశ్వేశ్వరీ! ప్రోవుమా!  -8

"కవితాభారతి"

*~శ్రీశర్మద*

8333844664

పూర్వజన్మ సుకృతాలేవో

పూర్వజన్మ సుకృతాలేవో తెలుసా?


ఋణాను బంధ రూపేణ పశుపత్నీ సుతా లయా: 

ఋణ క్షయే క్షయం యాంతి కాతత్రపరివేదనా


పశువులు, భార్యలు, కొడుకులు, ఇళ్ళు - ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతారు. ఋణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి. కనుక మంచి గానీ చెడు గానీ అంతా రుణానుబంధమే.

 ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక     బాధ, దుఃఖం కలగవు.

ప్రార్థనను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు

 (ఆత్మ విద్య -మీ జన్మ రహస్యం )మనలో కొంత మంది, పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా, కేవలం దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, నివేదనలు అర్పించడం, దానికి మించిన కోరికలు కోరడం, ఆ కోరికలు తీరకపోతే ఈ దేవుడికి మహిమ లేదనుకోవడం, అక్కడితో ఆగిపోవడం. తనను గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవడం. ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు. కాని వీరు తమను తాము భగవద్భక్తులం అని చెప్పుకుంటారు. ఆడంబరంతో, ఆర్భాటాలతో, ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు వాటిని భగవంతుడు స్వీకరించడు, సంపూర్ణ భక్తితో ఆశరహిత ప్రార్థనను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు.


మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము, వివేకము, వైరాగ్యము, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శరణాగతి, భగవంతుని ఆశ్రయించడం కావాలి. దీని కంతా కావాల్సింది శాస్త్ర జ్ఞానం. గురువు దగ్గర నేర్చుకోవడం. సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవడం. అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది. కొంత మంది శాస్త్రాలు చదువుతారు జ్ఞానం సంపాదిస్తారు కానీ, రజోగుణము, తమోగుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును కప్పివేస్తుంది. దాని ఫలితంగా తమకు తెలుసు, తమనుమించిన వాడు లేడనుకుంటారు. అందుకే వాళ్లకు దేవుడు కనపడటం లేదు.


Follow : @bhagavadgithaa


       🚩🙏 జై శ్రీ కృష్ణ 🙏🚩

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం

 *ఆరోగ్య ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*  


https://youtube.com/shorts/QHYdNJJdQdQ?si=sd0Iv07CKp-TaB_H


వేద ఆశీర్వచనం.




 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - తృతీయ -  విశాఖ - భౌమ వాసరే* (17.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/lM-JG_ZcA4g?si=kJkGurrkq4NH6q45


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శాశ్వతమైన సంపద*

 *శాశ్వతమైన సంపద*


ఆరోగ్యం గా బతికినా, అనారోగ్యంతో బతికినా, ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా ఎలా బతికినా ఒక నాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం!


కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నైయ్యి ని దాచాడు భగవంతుడు.


కర్మతో  ‘కర్మ భూమి’లో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది!


ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం, దాచిన ధనం దొరలు పాలు లేదా దొంగల పాలు!


దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద.. అది ఎన్ని జన్మలు అయినా నీవెంట వస్తుంది.


నిత్య కర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మ బద్దమైన జీవితం గడుపుతూ దైవ స్మరణ విడువ కుండా సాధన మార్గంలో సాగిపోవాలి.


ఏ ఉపాసనా చేయకున్నా  నీ రోజు పూర్తి అవుతుంది. ఉపాసన చేస్తూ చేస్తే       నీ రోజు సారవంతంగా పూర్తి అవుతుంది. 


నీ కుటుంబ కోసం నువ్వు పాటు పడక తప్పదు!  అదేదో భగవంతుడు ని స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది, మరింత ఫలితాన్ని ఇస్తుంది.


ఇద్దరు వ్యక్తులు రోజు కూలి పనులకు వెళ్తున్నారు రోజు కూలి తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి.. అయితే ఒక అతను ‘నేను కూలి చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఇందులో దేవుడు చేసింది ఏముంది? నా కష్టం నాకు తప్పడం లేదు కదా!’ అని దేవున్ని తలవను కూడా తలవడు.


ఇంకో వ్యక్తి ‘దేవుని దయ ఉండబట్టే               ఈ పని అయినా దొరికి  నాకుటుంబాన్ని పోషించుకోగలుగు తున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి, నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని నిద్ర లేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునే వాడు.. పొద్దు పోయి సరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామ జపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది.. ఆ నామ స్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది, ఉన్నతంగా ఆలోచించడం ప్రశాంతంగా ఉండటం ధ్యానం చేయడం అలవాటు అయ్యింది.


ఇంకో వ్యక్తి ఆ చాకిరి తలుచుకుటూ ‘గాడిద చాకిరీ’ అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ పని చేయించిన యజమానిని తిట్టుకుంటూ రోజు ముగిసి పోయేది.


* చివరికి ఇద్దరి జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవ స్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆసామి  ఇంట్లో పుట్టాడు.. ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్ లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదకు పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు.*


చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరినీ దూషించ కుండా దైవ స్మరణతో చేస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ దక్కుతుంది.. ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటుంది అది తప్పదు. ఎంత నెత్తిన పెట్టుకొని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు.*


ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృద్ధాప్యం రాక తప్పదు.


సంపాదన  పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరూ తీసుకునే వీలు ఉండదు, అది అనుభవించాల్సిందే! అందుకే మీకంటూ మిగిలే సంపద మీవెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే! ఇది మరువకండి. ఈ మార్గం విడువకండి.


జీవితం అనే పాలలో, భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడి పైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన… మనసు లగ్నం చేసి చేసే ఉపాసన.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      

ప్రకృతి రమణీయత,

 సృష్టిలో ప్రకృతి రమణీయత, సకల జీవరాశి సుమనోవికసనకు చక్కటి నిదర్శనం "                 

విశ్వ నిత్య సుచైతన్య దివ్య తేజో ప్రకాశమై వెలుగొందు మానవాళి సృష్టి, మహోన్నత దివ్య దీప్తి ! శరన్నవరాత్రుల సుమనోహర శోభ వర్ణనాతీతం, జగన్మాత దివ్య శుభాశీస్సుల సుప్రకాశం ! సుహృద్భావ సువ్యక్తిత్వ సుచైతన్య విశ్వ సురక్షాత్మాత్మక సద్భావనకు, అమ్మ నిత్య సహృదయ సుసందేశం ! విశ్వ వ్యాప్త మహోన్నత వసుధైక కుటుంబక వ్యవస్థ సత్వర స్థాపనకు చక్కని సోపానం !                             

✍️గుళ్లపల్లి ఆంజనేయులు 

శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు ! సృష్టిలో మహోన్నత సుసంస్కార ప్రదాత, సకల ఐశ్వర్య సిద్ధికి మూలస్థానం, శ్రీ మహాదేవుడు ! పరమేశ్వర అనుగ్రహం పొందు జీవులకు విశ్వ సురక్షా భావన చక్కని సుహృద్భావ, నిత్య సుచైతన్య తేజోమయమై సిద్ధించు ! కైలాస గిరిపై పార్వతీ పరమేశ్వరులు, తమ పుత్రులతో శివ గణాలతో కొలువుతీరిన వైనం, విశ్వ సమైక్య భావనకు ప్రతీక ! విశ్వ సుసంక్షేమానికై, సకల విశ్వ సురక్షా మార్గాన, తమ అనుగ్రహాన్ని విశ్వ జీవరాశికి అందించే దృశ్యం, విశ్వ శ్రేయోదాయకమై, శోభించెడి దివ్య దీప్తి !                

✍️గుళ్లపల్లి ఆంజనేయులు

ఒకే దేవుడు

 శ్లోకం:☝️

*ఏకో దేవః సర్వభూతేషు గూఢః*

 *సర్వవ్యాపి సర్వభూతాన్తరాత్మా I*

*కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః*

 *సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ||*

  - శ్వాతాశ్వతర ఉపనిషత్


భావం: సమస్త జీవరాశులలో ఒకే దేవుడు దాగి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి (all pervading , omni present), సమస్త జీవరాశులలో అంతరాత్మ. అతను అన్ని కర్మలను పర్యవేక్షిస్తాడు. అతను అన్ని జీవులకు ఉనికి (existence). ఆయనే సాక్షి (witness) , స్వచ్ఛమైన చైతన్యం (pure consciousness). అతను ఒకడు , అతను కాకుండ రెండవది లేనివాడు , అద్వయుడు. అతను అన్ని గుణాలకు (properties or attributes) అతీతుడు.🙏

పంచాంగం 17.10.2023 Tuesday

 ఈ రోజు పంచాంగం 17.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: తృతీయా తిధి భౌమ వాసర: విశాఖ నక్షత్రం ప్రీతి యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 01:24 వరకు.

విశాఖ రాత్రి 08:27 వరకు .

సూర్యోదయం : 06:13

సూర్యాస్తమయం : 05:49

వర్జ్యం : రాత్రి 12:32 నుండి 02:10 వరకు

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:19 వరకు తిరిగి రాత్రి   10:47 నుండి 11:36 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు 


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార: