*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:17-10-2023
శా॥
పాదమ్ముల్ సుకుమారకంజయుగళుల్ వర్షించు కెంజాయలున్
వాదే లేదిట నాభి పద్మమని సంభాషించు కేల్దమ్ములున్
సౌదామ్నీసమ కాయకోరకరుచుల్ స్వచ్ఛంపుమాణిక్యముల్
శ్రీదేవీ! వదనారవిందమును నీరేజాతసంబంధి గాన్
నీ దేహమ్మిట నబ్జబంధురమయెన్ నిన్నెంతు హృత్కంజమున్ -6
(కోరకము=తామరతూడు)
శా॥
నీకున్ భృత్యులు చంద్రషోడశకళల్ నిండార బ్రహ్మాదులున్
రాకాచంద్రుడు మిత్రుడున్ నయనముల్ లాస్యమ్ము శంపాలతల్
నీ కారుణ్యసుధాబ్ధిబిందురసముల్ నిక్కంపులక్ష్మీకళల్
నీ కాఠిన్యము రాక్షసాంతకము నిన్నేగొల్తు కామేశ్వరీ! -7
శా॥
విశ్వత్రాతవు విశ్వదాతవు గనన్ విశ్వాంతరాళమ్ముయున్
విశ్వస్థమ్మగు భూతజాలమునకున్ విశ్వైకజీవమ్ముయున్
విశ్వాసమ్మును జూపువారలకు నిర్వేదమ్ము రానీయకన్
విశ్వమ్మంతయు గాచు మాతవుగదా! విశ్వేశ్వరీ! ప్రోవుమా! -8
"కవితాభారతి"
*~శ్రీశర్మద*
8333844664
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి