ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, ఆగస్టు 2023, ఆదివారం
⚜ శ్రీ చౌముఖి మహాదేవ ఆలయం
🕉 మన గుడి :
⚜ బీహార్ : వైశాలి
⚜ శ్రీ చౌముఖి మహాదేవ ఆలయం
💠 భారతదేశంలో లెక్కలేనన్ని శివుని ఆలయాలు ఉన్నాయి, కానీ కొన్ని ఆలయాలకు భిన్నమైన గుర్తింపు ఉంది. ఈ దేవాలయాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి.
వారితో ముడిపడి ఉన్న గుర్తింపు మరియు రహస్యం కారణంగా, ఇతర దేశాల నుండి ప్రజలు కూడా ఇక్కడకు వస్తారు.
అటువంటి అద్భుతమైన శివాలయం బీహార్‌లోని వైశాలిలో ఉంది.
దేశంలో నాలుగు ముఖాల (చక్రాకర్) శివలింగం ఉన్న ఏకైక ఆలయం ఇదే.
💠 చౌముఖి మహాదేవ్, లేదా చతుర్ముఖి మహాదేవ్, 'విక్రమాదిత్య చౌముఖి మందిర్' అని కూడా పిలువబడే ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు సూర్యునికి ప్రాతినిధ్యం వహించే నాలుగు ముఖాలతో కూడిన భారీ శివలింగం ఉంది.
శివలింగం యొక్క నాలుగు ముఖాలు 4 దిక్కుల వైపు చూపుతాయని చెబుతారు.
💠ఈ ఆలయ నిర్మాణ సమయం తెలియనప్పటికీ, ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు.
పురాణాల ప్రకారం, ఈ ఆలయం రామాయణ కాలంలో ఉండేది.
రాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్ర మహర్షి జనక రాజ్యమైన మిథిలాకు వెళుతున్నప్పుడు ఆలయాన్ని సందర్శించారు.
ఆ ముగ్గురూ చౌముఖి మహాదేవ్‌ను కూడా పూజించారు అంటారు .
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కాలంలో బాణాసురుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ఒక పురాణ.కథనం. ఇక్కడ ఉన్న శివలింగం నాలుగు ముఖాలు మరియు అలాంటి శివలింగం మరెక్కడా కనిపించదు.
💠 త్రినేత్రధారి శివుడు దక్షిణాన శివలింగ ముఖంలో ఉండగా, మిగిలిన మూడు దిశలలో బ్రహ్మ, విష్ణు మరియు సూర్యదేవుడు ఉన్నారు.
💠 శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు దాదాపు 25000 మంది శివ భక్తులు ఈ ఆలయంలో జలాభిషేకం చేస్తారు. తెల్లవారుజాము నుంచే హర్ హర్ మహాదేవ్ నినాదంతో ఆలయం మారుమ్రోగుతుంది. మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున క్యూ కడతారు
💠 ఈ ఆలయం జార్ఖండ్‌లోని బాబా వైద్యనాథ్ ఆలయం మరియు వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం మధ్య ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
అన్ని సోమవారాలు మరియు మహా శివరాత్రి నాడు పాదయాత్ర భక్తులు అధికంగా వస్తారు
ఆ రోజున తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాన్ని సందర్శించడం ప్రారంభిస్తారు
నిద్ర నియమాలు
ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు -
* ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.
* నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.
* రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.
* వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.
* ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .
* ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.
* నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .
* రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.
* నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.
* కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .
పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం.
ఆదిత్యనాథ్ కన్నా రజనీకాంత్ వయసులో చాల పెద్ద!
ఇలాంటివాటిని చూసైనా విద్వేషవాదులైన మేధగాళ్లు (మేధావులు) బుద్ధి తెచ్చుకోవాలి.
రజనీకాంత్ వినయానికి, నమ్రతకు పెట్టింది పేరు.
రజనీకాంత్ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి ఉచ్చస్థాయికి ఎదిగిన వ్యక్తి.
రజనీకాంత్ కులం, మతంతో ఎదిగిన తుచ్చుడు కాదు. వికృత స్వభావుడు కాదు.
ప్రభుత్వ రిజర్వేషన్లతో అక్రమంగానూ, అనర్హతతోనూ, పనికిమాలినతనంతోనూ పబ్బం గడుపుకుంటూ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక నీచుడు, భ్రష్టుడు, దుష్టుడు కాదు రజనీకాంత్.
రజనీకాంత్ జాతీయభావల వ్యక్తి.
మతి పగిలిపోయిన విద్వేషవాదులకు రజనీకాంత్ ఇలా యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చెయ్యడం అర్థం కాకపోవచ్చు; అభిశంసనీయం కావచ్చు. వాళ్ల వక్రతవల్ల వాళ్లకు ఔన్నత్యం అర్థం కాదు.
"తన విజయం తనది కాదు", "తాను ఒక సామాన్యుణ్ణి" అన్న భావన, ఆలోచన ఉన్న విజయవంతమైన వ్యక్తి తీరు ఇదిగో ఇలాగే ఉంటుంది.
- రోచిష్మాన్
9444012279
వేంకటేశ్వరునిగా
*భగవంతుడిని మనకు వేంకటేశ్వరునిగా అందించింది ఎవరు?*
*మనం తెలిసో తెలియకనో ఎన్నో దోషాలు చేస్తుంటాం , నడిచి వస్తుంటే ఎన్నో జీవరాశులని తొక్కి వేస్తుంటాం. కానీ ఆ దోషాలు మనకి అంటొద్దని కోరుకుంటాం, దాన్ని తొలగించే ఏదో ఒక సాధనం ఉండాలి. మామూలుగా లోకంలో ఒక్కో వస్తువుకు పట్టిన దోషాలు తొలగాలంటే ఒక్కో మార్గం ఉంది. బంగారానికి పట్టిన మళినాలు తొలగాలంటే పసుపుతో శుభ్రం చేయాలి. వెండిని తెల్లముగ్గుతో శుభ్రం చేయాలి. రాగిని శుద్ది చేయాలంటే చింతపండుతో చేయాలి, రాతిని శుద్ది చేయాలంటే ఒక రాతితోనే చేయాలి. ఇలానే మన మనస్సును శుద్ది చేయాలంటే ఒక జ్ఞాని అందించిన భగవంతుడిచే శుద్ది చేయబడాలి. అలా మనల్ని శుద్ది చేయగలడని భగవంతున్ని మనకు రామానుజులవారు చూపించారు, అందుకే ఆభగవంతుడికి వెంకటేశ్వరుడు అని పేరు.*
*ఏమిటి వెంకటేశ్వరుడు అంటే*
*ఈశ్వరుడు అంటే నియమించు వాడు అని అర్థం. దేనిని నియమించు వాడు అంటే వేంకటమును నియమించువాడు అని అర్థం. వేంకటము అంటే ఏమిటి, ఈ వెంకటేశ్వర అనే పదం ద్రవిడం మరియూ సంస్కృతం రెంటిలోంచి ఏర్పడింది. దీని అర్థం మనకు నమ్మాళ్వారు వివరించారు.*
*'వేంకడంగల్ మేయ్ మేల్ వినై ఉత్తమన్ తాంగల్ తంగర్కు నల్లనవే శేవాయ్ వేంగడ తురై వార్కు నమో వెన్నలాంకడమై అదిసుమందా అరర్కే'*
*అని అంటారు. 'కటంగల్' అంటే ఋణములవలే మనం అనుభవిస్తే తప్ప తొలగని పాపములకి పేరు.*
*ఋణం అంటే ఏమి*
*మనం పుట్టగానే కొన్ని ఋణములతో పుట్టాం. మనం పుట్టుకతో స్వతంత్రులం కాదు. మనం కొన్ని బంధాలతో పుడుతున్నాం. ఎందరితోనో బంధులుగా కల్గి ఉన్నాం. ఈ బంధాలన్నీ మనం తెచ్చుకుంటే రాలేదు, వాటంతట అవి ఏర్పడ్డాయి. చివరికి భార్యా భర్తల బంధం కూడా భగవంతుడు ఏర్పరిచిందే అని అంటుంటారు. అందుకే పుట్టుకతో వచ్చిన ఈ బంధాలని తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పారు మన పెద్దలు. మన భాద్యత ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. వీటిని ముఖ్యంగా మూడు భాగాలు చేసారు. ఆ మూడు రకాల ఋణాలని మనం క్రమ క్రమంగా తీర్చివేవాలి అని చెబుతారు. మన స్మృతులలో మను అనే మహర్షి చెబుతాడు 'ఋణాని త్రీని అపా కృత్య మనో బ్రహ్మని నివేస్యచ' మూడు ఋణాలు తీసివేసుకొని, మనస్సును భగవంతుడిపై పెట్టాలి అప్పుడు మానవుడిగా తరించవచ్చు అని దీని అర్థం.*
*మరి ఏమిటా ఋణాలు*
*ఒకటి పిత్రు ఋణం. మనల్ని కన్న తల్లి తండ్రుల కోసం చెయ్యాల్సింది. వారు చెప్పిన మాట వినడం, వారు ఏది సంకల్పిస్తే అది చేయాలి. రామచంద్రుడు తండ్రి మాటకై కట్టుబడి అడవికి వెళ్ళాడు. తండ్రి నోటితో రాముడిని అడవికి వెళ్ళమని చెప్పలేదు. తండ్రిగారి సంకల్పం తెలుసుకొని రాముడే వెళ్ళాడు. ఆనాడు రాముడు అడవికి బయలుదేరుతుంటే దశరథుడు తనని పట్టించుకోకుండా రాజ్యాన్ని నీవే తీసుకోవయ్యా అని చెబుతాడు. తన తల్లి కౌసల్యమ్మ అడ్డుకున్నా, పిన తల్లి కైకేయికి తన తండ్రి ఇచ్చిన మాట ఉందని తెలుసుకొని అడవికి వెళ్ళాడు. కేవలం అక్కడే కాదు తన వివాహ విషయాన కూడా తండ్రి ఆజ్ఞ మేరకే సీతాదేవిని వివాహమాడినట్లు మనకు వాల్మీకి రామాయణం తెలుపుతుంది. విశ్వామిత్ర మహర్షి ధనస్సు గురించి చెబితే శ్రీరామ చంద్రుడు జనక చక్రవర్తి సభకి వెళ్ళాడు, కానీ సీతాదేవిని వివాహం ఆడాలని వెళ్ళలేదు. ధనస్సు విరిచాక, సీతాదేవిని వివాహమాడాలని జనక చక్రవర్తి అడిగితే, ఆ విషయం తన తండ్రిగారిని అడగమని చెప్పాడు శ్రీరాముడు. ఆతర్వాత దశరథుడు ఈ సీతాదేవి నీకు తగును అని చెప్పాక ఆమెను వివాహం ఆడాడు. ఇది సంతానం యొక్క భాద్యత. పిత్రు ఋణం తేర్చుకోవడం అంటే అట్లాంటిది.*
*రెండవది దేవ ఋణం. మనం బ్రతక గల్గుతున్నాం అంటే మనకు గాలి, నీరు , నేల ఇలా ఎన్నో దేవతలు సహాయం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇలా అన్నో కోట్ల దేవతలు ఉన్నారు అంటారు, అందుకే అన్నింటి మూలమైన శ్రీకృష్ణా పరమాత్మని ఆరాధన చేస్తే అందరికీ చేసినట్లే, అలా దేవ ఋణం తీరుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే విషయం చెబుతాడు. ఈలోకం కోసం చేసేవి రెండు, పై లోకం కోసం చేసేవి రెండు, బాగు పడటానికి చేసేది ఒకటి ఈ అయిదూ నా కోసం చెయ్యి అని చెబుతాడు. ఈ లోకంలో కర్మ చేస్తుంటాం, ఆహారం తింటుంటాం. అవి కృష్ణుడికోసం అని చెస్తే చాలు. హోమం చేస్తున్నాం, దానం చేస్తున్నాం ఈ రెండు పై లోకం కోసం చేసేవి, అవీ కృష్ణార్పణం అని చెయ్యాలి. ఇక ఐదవది తపస్సు, తపస్సు అంటే ఆలోచన చెయ్యడం, శరీరాన్ని అధీనంలో పెట్టే ఉపవాసం వంటివి. ఇదీ శ్రీకృష్ణుడికై చెయ్యాలి. మన ఇంద్రియాలకు కూడా దేవతలనే పేరు. మన ఇంద్రియములని భగవంతుడి అభిముఖంగా వాటి ప్రవృత్తులని మార్చడం కూడా దేవఋణం తీర్చుకొనే సాధనమే.*
*మూడవది ఋషీ ఋణం. పశువుల వలె కాకుండా మనకు ఒక క్రమశిక్షణాయుత సమాజాన్ని మన చుట్టూ ఏర్పరిచినది ఋషులు. వారికి కొంత చేయ్యడం ఋషీ ఋణం తీర్చు కోవడం వంటిది. ఋషులు చెప్పిన వ్యాక్యాణాలను చదవడం, వాటిని అధ్యయనం చేసే వారిని ప్రోత్సాహం చెయ్యడం లాంటివి చేస్తే ఋషీ ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది. ఈ మూడింటిని మనం తీర్చుకోకుంటే అవి మనల్ని దిగజారేట్లు చేస్తాయి అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఋణాలు అట్లా అయితే తీర్చుకుంటే కానీ తీరవో మనపై ఉండే పాపాలు అనుభవిస్తే కాని తొలగవు. అన్నీ అనుభవించి తొలగించుకోవాలి అనుకున్నా మనం అంత కాలం బ్రతకలేం. మరి ఈ పాపాలు ఎట్లా తొలగాలి, ఇవన్నీ తొలగితే మనం మంచి స్తితిని పోందవచ్చు.*
*మరి ఇప్పుడే తొలగించుకోవాలి అంటే ఎట్లా*
*దానికి సాధనం ఒకటి కావాలి. మన మనస్సుకు పట్టిన ఈ పాపాలు అనే మళినాలను తొలగించే సాధనం నేను చెబుతాను రండి అని నమ్మాళ్వార్ అన్నారు. అదిగో కొండపై కూర్చున్నాడే ఆయనను 'వేంగడ తురైవార్కు నమః' అంటే వేంకటేశాయనమః అని అనమన్నాడు. ఎందుకాపేరు అంటే, ద్రవిడంలో 'కటంగల్' అంటే ఋణములన్నింటినీ 'వేం' కాల్చివేయును అని అర్థం. అలా మనపై ఉండే పాపాలని కాల్చివేయడాన్ని 'వేంకట' అని అంటారు. మరి కాల్చటం అంటే నిప్పు కూడా కాల్చగలదు కదా! కానీ అది కొంత మేరకే కాల్చగలదు. నిప్పుచే కూడా కాల్చబడని వాటిని కూడా కాల్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయన కాల్చువాటి కన్నింటికీ నియంత. నియంత అంటే 'ఈశ్వర' అని అంటారు. అందుకే ఆయన పేరు 'వేంకటేశ్వర'. అందుకే ఈ ఋణాలను కాల్చడంలో తనని మించినవారు లేరు కాబట్టి ఆయన పేరు వెంకటేశ్వర అయ్యింది.*
*అలా పరమాత్మ వేంకటేశునిగా ఉన్నాడంటే కారణం ఏమి*
*ఆనాడు నమ్మాళ్వార్ పాడారు కాబట్టి భగవంతుడు అక్కడ నిలిచాడు. భక్తుల ఆదేశానికి కట్టుబడి పరమాత్మ అక్కడ ఉంటాడు. కేవలం ఇక్కడే కాదు, నైమిశారణ్యంలో, భద్రికాశ్రమం లో 'హే భగవన్! నీవు ఇక్కడ ఇలా ఉండు'అని వేద వ్యాసుడు చెబితే అక్కడ స్వామి నిలిచాడు. కొన్ని దక్షిణ భారత దేశ దేవాలయాల్లో ఋషులు ప్రార్థన చేస్తే ఉన్నాడని, కొన్ని చోట్ల బ్రహ్మ ప్రార్థన చేస్తే ఉన్నాడని చెబుతుంటారు. కేవలం భగవంతుడు ఉంటే అది ఒక క్షేత్రం అని అనలేం, ఎక్కడైతే భగవత్ భక్తుడు అదివసించి ఉంటాడో దాన్ని క్షేత్రం అని చెప్పవచ్చు. అందుకే భగవంతుడిని కాదు పట్టుకోవాల్సింది, భగవత్ భక్తులని పట్టుకోవాలి అని చెబుతారు. భక్తులని వదలలేక భగవంతుడు ఉంటాడు కాబట్టి ఇద్దరూ లభిస్తారు. భగవత్ భక్తులలో కూడా అగ్రేసరులు ఉన్నారు, వారికి ఆళ్వారులు అని పేరు. వారి పాటలై తానున్నాడు. ఆ ఆళ్వారులకు అన్నో శక్తులుండేవి, కానీ అన్ని శక్తులని తమ కోసం వాడుకోలేదు. తమకున్న యోగ్యతలన్నీ భగవంతుడికి అని అనుకున్నారు. ఆళ్వారుల హృదయాల్లో భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. వారి ద్వారా వెళ్తే భగవంతుడు మనకు మరింత భాగా ప్రసన్నుడు అవుతాడు.*
*\!/ ఓం నమో నారాయణాయ \!/*
🪷🪷🪷 🙏🕉️🙏 🪷🪷🪷
పౌరోహిత్యాన్ని
*పౌరోహిత్యాన్ని “కుల వృత్తి”గా గుర్తించడం అనేది ప్రభుత్వాలకు అసలు సాధ్యమేనా…???*
https://youtu.be/xE80MqqkmnI
ప్రస్తుత సమాజంలో ఏ కులం వారు ఏ వృత్తి చేయాలో రాజ్యాగం కానీ, చట్టం కానీ అస్సల్ ఎప్పటికి కూడా నిర్ధారించదు. ప్రభుత్వం అంతకన్నా నిర్ధారించదు. పౌరోహిత్యం అనేది అసలు వృత్తినే కాదు… యుగయుగాలుగా పుర హితాన్ని కోరే విధానం. అది గొప్ప ధర్మ కార్యం. పౌరోహిత్యం చేస్తే చేయించుకున్న యజమానుల ఇష్టప్రకారం ఇచ్చేదాన్ని కూలి అనరు… దాన్ని గౌరవంగా సంభావన/పాంతు అనే అంటారు. మిగిలిన వృత్తులలో దాన్ని కూలి అంటారు.
*సభ్య సమాజంలో పౌరోహిత్యం నిర్వహించే పురోహితులుగా ఒక్క బ్రాహ్మణ జాతి వారు మాత్రమే కార్యక్రమాలు చేయించట్లేదు. ఈ పౌరోహిత్యాన్ని సమాజంలో బ్రాహ్మణులతో పాటుగా శివార్చక( శైవులు, వీర శైవులు) విశ్వబ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, కాపు, రజక, యాదవ, గౌడ, పద్మశాలి, బలిజ, మాల, మాదిగ, చాత్తాద శ్రీవైష్ణవులు, జంగాలు, బుడబుక్కల, దమ్మరి, ఎరుకల, యనాది,ఆది జాంబవంత తదితర oc, sc, st, bc కులాల్లో వున్న మిగిలిన వారుకూడా ఈ పురోహిత వృత్తిలో శుభ,అశుభ కార్యక్రమాలు 2 చేయిస్తున్నారు. ఇప్పటికిని వారి యజమానులు వారికి వున్నారు.*
ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ జాతి ఒక్కరికే ఎలా పౌరోహిత్యంను ప్రభుత్వం కుల వృత్తిగా గుర్తిస్తారు. అలా అని బ్రాహ్మణ జాతిలో వున్న అన్ని శాఖలు వారు పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించలేదు. వివిధ వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండిపోయారు. మిగిలిన కులాల వారు కూడా వారి కులాల్లో ఈ పౌరోహిత్యం చేసే వాళ్ళని కూడా తమని కూడా బ్రాహ్మణులతో పాటు సమానంగా గుర్తించమని హడావుడి, ఉద్యమం చేస్తే మన బ్రాహ్మణ పురోహితులు పరిస్థితి ఏంటి ఈ సమాజంలో ఆలోచించండి…!!! వాళ్ళల్లో ఎవరైనా హైకోర్టు కి వెళితే బ్రాహ్మణ జాతి పరువు ఏమవుతుంది. దేవాదాయ,ధర్మాదాయ శాఖలోని దేవాలయాల్లో వంశ పారంపర్య అర్చకులుగా, నియమింపబడ్డ అర్చకులుగా అన్ని కులాలు వారు ఆయా ప్రాంతాల దేవాలయాల్లో పనిచేస్తున్నారు. దేవాలయ చట్టాలు,భారత రాజ్యాంగం పై పూర్తిగా అవగాహన వున్న లాయర్లను మీ ప్రాంతాల్లో పూర్తిగా విచారణ చేసుకోగలరు.
*భారత రాజ్యాంగంలో “ఆర్టికల్ 15” ఏమి చెపుతుందో సవివరంగా చదువుకోగలరు,తెలుసుకోగలరు.*
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హైకోర్టు వారు బ్రాహ్మణ వ్యతిరేక తీర్పులను మర్చిపోయారా…!! 1818 నుండి ఇవే విషయాలపై బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చాలా కోర్టు తీర్పులు ఉన్నాయి. అప్పట్లోనే విశ్వ బ్రాహ్మణులకు అనుకూలంగా కోర్టు తీర్పులు వచ్ఛివున్నవి. విచారణ చేసుకోగలరు. బ్రాహ్మణులు, సంఘాల వారు ఎవరూ ఈ దేశ చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. సమాజంలో గతంలో మాదిరి చేతకాని వారిగా పరువు తీసుకోకూడదు, నవ్వులు పాలు కాకూడదు.
*బ్రాహ్మణ పురోహితులకు పౌరోహిత్యం ను వృత్తిగా గుర్తించకపోతే మన వారు పురోహితులు కాలేరా, ఇప్పటివరకు పురోహితులుగా వీరెవరికి గుర్తింపు రాలేదా…??? పురోహితుడు అనే గుర్తింపు ఎవరిస్తారు…?? ఆ గుర్తింపు ఎవరి వల్ల వస్తుంది…?? తాము చదువుకున్న స్మార్త,వేద విద్య వల్ల, తమ మంత్ర పాఠం, తమ తమ వాగ్ధాటితో మాత్రమే సమాజంలో గుర్తింపు వస్తుంది. ఈ భూమి మీద భూత,భవిష్యత్, వర్తమాన కాలాల్లో యజమాని ఆదేశం మేరకు తనకు తానుగా చేయించే కార్యక్రమాలు వల్ల మాత్రమే బ్రాహ్మణ పురోహితుడుగా గుర్తింపు పొందుతూనే వున్నాడు…!! అపుడు,ఇపుడు, ఎప్పుడూ బ్రాహ్మణ పురోహితునిగానే వారి,వారి యజమానుల వద్ద తరతరాలుగా ఎప్పటికీ బ్రాహ్మణ పురోహితునిగానే కొనసాగుతూనే వుంటారు. మంచి పురోహితుడుగా గుర్తింపు వచ్చేది కేవలం వారు చదువుకున్న విద్య మరియు వారి,వారి యజమానులు, బంధు, మిత్రుల నోటి ప్రచారం ద్వారా మాత్రమే కదా. దాన్ని ప్రభుత్వాలు గుర్తించేది ఏంటి…?? ప్రభుత్వం గుర్తిస్తే ఈ వృత్తిలో నిర్వహించే కార్యక్రమాలకు వసూళ్లు చేయాల్సిన రేట్లు పుష్కరాల్లో మాదిరి వీటిని కూడా ప్రభుత్వమే ప్రకటిస్తే….?? ఆ తరువాత ఆధార్ తో లింక్ చేసి పురోహిత వృత్తి పన్ను కట్టేందుకు సిద్ధపడాలి. ఈ పౌరోహిత్యంలో మనకి ఇవన్నీ అవసరమా…!! ఇవన్నీ మనకి జరిగే పనేనా..??*
రాజకీయ బ్రాహ్మణ నిరుద్యోగులు కొంతమంది వాళ్ళ నామినేటెడ్ పదవుల కోసం లేదా ఎన్నికల సమయాల్లోనూ ఈ వివాదస్పద మాయా అంశాన్ని వాళ్ళ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే తెరపైకి తెస్తుంటారు…
*దయచేసి పురోహిత సోదరులేవరూ ఈ రాజకీయ నిరుద్యోగుల స్వార్ధ మాయలో పడిపోయి వారిని నమ్మి మోసపోవద్దు.*
కుల వృత్తిని నిర్ణయించు కోవల్సింది ఆ కులంలో ఆ వృత్తిని నమ్ముకొని చేసే వారు మాత్రమే…!! ప్రస్తుత సమాజంలో వివిధ కుల వృత్తులను అన్ని కులాలు,జాతులు,మతాల వారు కూడా నిర్వహిస్తున్నారు.
*భారతదేశంలో వుండే ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానాలు కానీ మన రాజ్యాగంలో పొందుపరిచిన ఆర్టికిల్స్,చట్టాలకు లోబడి మాత్రమే పనిచేస్తాయి.*
*మొన్నీమధ్య తిరుపతిలో జరిగిన నకిలీ పురోహిత,అర్చక పరీక్షలు, పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమంలో చట్ట సభల్లో వున్న వ్యక్తి, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు కూడా తన ప్రసంగంలో పౌరోహిత్యంను వృత్తిగా ఎలా ప్రభుత్వం గుర్తిస్తుంది, భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఈ అంశం అసలు సాధ్యపడదు అనే విషయాన్ని నర్మగర్బంగా కూడా అక్కడే విష్ణు గారు తెలియజేసారు. అయినాసరే దేవాదాయ శాఖ సలహాదారుగా వున్న వ్యక్తి, తన పదవి పిచ్చితో హైకోర్టు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేయించిన వ్యక్తి ప్రభుత్వం ద్వారా,చట్టం,రాజ్యాంగం ప్రకారం సాధ్యంకానీ ఈ అంశాన్ని "తాను తగుదునమ్మా" అని ఇతని పేరు ప్రచార ఆర్భాటం కోసం ఈ అనంతపురం ప్రచార పకోడీ "జగన్ గారి ప్రభుత్వంను" మళ్ళీ ఇంకోసారి నవ్వులు పాలు చేసేవిదంగా పత్రికా ప్రకటనలు ఇవ్వడాన్ని చూస్తుంటే ఓటర్లకు, ప్రజలకు ఈ ఎన్నికల కాలంలో జగన్ గారి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి...!!??*
*"బ్రాహ్మణ పురోహిత సోదరులారా"...!!* ఇది ఎప్పటికీ అమలు జరగనిపని. భీమవరం, తదితర ప్రాంతాల్లో వున్న రాజకీయ నిరుద్యోగుల కోసం మీ అమూల్యమైన మేధో సమయాన్ని, ధనాన్ని దయచేసి వృధా చేసుకోకండి.
🙏🙏🙏🙏🙏🙏
మల్లాది విష్ణు గారి ఈ విడియో లింక్ లో నొక్కి చూడండి..🙏
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
🔥BACF🔥
ఆధ్యాత్మిక పురోగతి
`💐కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం.”💐
భగవంతునికి దగ్గర కావాలన్నా , భగ్వద్ అనుగ్రహం పొందాలన్నా - మనోనిగ్రహం కావాలన్నా అది ఎలా సాధ్యం???
పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు, అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి.
“కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం.”
శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు...
“ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము...”
ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే.
“కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం.”
నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి.
ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు.
నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, “ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా?” అని చెప్పాడు,
ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది...
ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి...
వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి.
“కాబట్టి సంయమనం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొ౦టే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి.”
ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి.
కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి.
రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలోని అనుభవం గూర్చి ఇలా వివరించారు...
“ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి.
ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను.
నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు...
అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది.”
ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి.
వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..
రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...
“ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి.!
హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు...
'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు
నా మనస్సులోనికి రానీయకుండా చూడు!’ అని ప్రార్థించు."
ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు.`
తస్మాత్ జాగ్రతః!
తస్మాత్ జాగ్రతః!
కో ధావతి తం చ ధావతి ఫణీ సర్పం శిఖీ ధావతి వ్యాఘ్రా ధావతి కేకినం విధివశాద్వ్యాధో ఒపి తం ధావతి స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనా వ్యాకులాః కాల స్తిష్ఠతి పృష్ఠతః కచధరః కేనాపి నో దృశ్యతే.
పురుగును తినుటకు వెనుక నుండి కప్ప పరు గెత్తుకొని వచ్చుచున్నది. ఆ కప్పను తినుటకు దాని వెనుక నుండి పాము పరుగెత్తుకొనివచ్చు చున్నది. ఆ పామును తినుటకు నెమలి పరుగెత్తుకొనివచ్చుచున్నది. ఆ నెమలిని తినుటకు పెద్ద పులి దాని వెనుక చంపుటకు పరు గెత్తుకొనివచ్చుచున్నది. ఆ పెద్దపులిని బోయవాడు పరు గెత్తుకొనివచ్చుచున్నాడు. ఈ ప్రకారముగ జీవరాసులన్నియు వాని వాని ఎదుటనున్న ఆహార విహార సాధనవస్తువులను సంపాదించు ప్రయత్నమందు నిమగ్నములై యున్నవే కాని, వెనుక తట్టు జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిపోవుటకు సిద్ధముగ నున్న యమధర్మ రాజును మాత్రము అవి చూచుట లేదు. ఆహా! ఎట్టి విచిత్రము !
(కావున జనులు తమవెనుక కాచుకొనియున్న మృత్యువును గమ నించి, అమృత్యువును జయించి అమరత్వ పదవి నొందుటకు వలసిన ఆత్మ జ్ఞానాది సాధనలను శీఘ్రముగ ఈ జన్మయందే సంపాదించుకొనవలెను )
పతంజలి మహార్షి
🕉పతంజలి మహార్షి.🕉️
యోగేన చిత్తస్య పాదేన వాచాం
మలం శరీరస్య చ వైద్యకేన
యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం
పంతంజలిం ప్రాంజలిరానతోఽస్మి
ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం
సహస్ర శీరసం శ్వేతం ప్రణమామి పతంజలిం
యోగం ద్వారా మనస్సును, వ్యాకరణం ద్వారా మాటను, వైద్యం ద్వారా దేహాన్ని పరిశుద్దం చేసి పరిరక్షించిన మునిశ్రేష్ఠుడు పతంజలికి కైమోడ్పులు అర్పిస్తిన్నాను.
బాహుపర్యంతం మానవాకారం కలిగి, విష్ణుస్వరూపుడను చెప్పేవిధంగా శంఖచక్రాలను ధరించి వేయి శిరములతో శ్వేతవర్ణంలో విరాజిల్లుతున్న ఆదిశేషుని అంశావతారుడైన పతంజలికి నమస్కరిస్తున్నాను.
భర్తృహరి - వాక్యపదీయం.
పతంజలిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు.
పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయికి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయికి కూడా భాష్యం రాసాడు.
ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా ప్రపంచంలో భారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ) రాజయోగం బహుళ ప్రచారంలోకి వచ్చింది.
చరిత్ర
*****
క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.
యోగ సూత్రములు
**************
పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి క్రమముగ:సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు.కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట.కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటులు కనబడదు.
ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.
సమాధి పాదము
*************
సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.
మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.
అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.
సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకువంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవుసరమైన ప్రశాంతత పొందవచ్చు.
చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.
వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.
సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.
ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.
పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.
తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.
సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.
సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.
ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.
ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించారు.
సాధన పాదము
*************
ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనసును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.
ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.
ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలూ, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.సత్వ తమో రజో గుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.
ధారణ, ధ్యానం, సమాధి అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.
విభూతి పాదము
*************
సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.
కైవల్య పాదము
************
ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో
ఈ పాదము ముగుస్తుంది.
పతంజలి యోగ సూత్రములు
(అష్టాంగ యోగము)
@@@@@@@@@
యమము :
*********
అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
నియమము :
**********
శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
ఆసనం:
*****
ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆ
త్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
ప్రాణాయామం:
************
శరీర స్పందన లన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
ప్రత్యాహారం :
*********
ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము
ధారణ:
******
ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.
ధ్యానము :
*********
ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
సమాధి :
******
నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.
భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.
🚩⚜🚩⚜🚩⚜🚩
🚩యోగం🚩
💫💫🌏🌙🌞💫
యోగ శబ్దం ‘యుజ్ ’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టిందని అందరికి తెలిసినవిషయమే. ఆ ధాతువుకు కలిసికొనుట, ఏకమగుట, సమన్వయించుట మొదలైన అర్ధా లున్నాయి. జీవాత్మ పరమాత్మ లో సంయోగం చెందటమే యోగ పరమార్ధం. ‘ నయమాత్మాబలహీనేన లభ్యతే ’ అని ముండకోపనిషతు చెపుతోంది. అంటే బలహీనులు ఆత్మను తెలుసుకోలేరు, పొందలేరు అని భావం కాబట్టి ఆత్మ జ్ఞానానికి శక్తిమంతమైన శరీరము , సమాహితమైన బుధ్ధి అత్య అవసర మన్నమాట. దీని వల్ల క్రమంగా శరీరారోగ్యం సమాహితమైన చిత్తం ఏర్పడి ఆత్మను పరమాత్మతో సంయోగం చెందింప జేసే శక్తి సాధకుని కేర్పడుతుంది.
యోగ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేవి ప్రధానంగా యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు. వాటిలో యోగతత్వోపనిషతు, మండల బ్రాహ్మాణోపనిషతు, యోగకుండల్యోపనిషతు ప్రధానంగా పేర్కొన దగినవి. ఇవే గాక పతంజలి యోగసూత్రాలు , భగవద్గీత , యోగ వాసిష్ఠం యోగజ్ఞానానికి ప్రమాణ గ్రంధాలు. పతంజలి యోగ సూత్రాలకు స్వామి వివేకానందులు ఆంగ్లంలో చేసిన అనువాదం అందరు చదువదగింది. పై గ్రంధాలన్నిట్లోనూ యోగం భారత దేశాంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి అధ్యయన అభ్యాసాలలో ఉన్నట్లు చెప్పబడి ఉంది.
యోగోపనిషత్తులలో యోగం నాలుగు విధాలుగా చెప్పబడింది. అవి , హఠయోగం , లయయోగం , మంత్రయోగం , రాజయోగం. అయితే, ఇప్పుడు యోగమంటే హఠ రాజాయోగాల సమ్మేళనం గా భావింప బడుతున్నది. దీనికే అష్టాంగయోగమని ప్రసిధ్ధి. అష్టాంగ యోగమంటే ఎనమిది అంగాలతో కూడిన యోగమని అర్ధం. యమ, నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ,ధ్యాన,సమాధులు అష్టాంగాలు.
1.యమ :- యమానికి పదిలక్షణా లున్నాయి. అవి,
1.అహింస - అపకారికి సైతం ప్రత్యపకారం చేయకపోవటం అహింస.
2. సత్యం -సర్వకాల సర్వావస్థలయందు నిజమేమాట్లాడటం సత్యం
3. అస్తేయం - దొంగతనం చేయక పోవటం అస్తేయం.
4. బ్రహ్మచర్యం- బ్రహ్మచర్యదీక్ష గాని, శాస్త్రోక్తవిధి ననుసరించి గార్హస్థ్య ధర్మ నిర్వహణంగాని బ్రహ్మచర్యం
5. క్షమ- సర్వావస్థల యందును ఓర్పు కలిగి ఉండటం క్షమ
6. ధృతి -దైర్యం
7. దయ - సర్వభూత దయ
8. అర్జవం - శత్రు మిత్రులయందు సమభావం కలిగి ఉండటం ఆర్జవం
9. మితాహారం - మితంగా భుజించటం మితహరం
10. శౌచం. -ఆంతర్భహి శ్శుధ్ధి శౌచం
అహింసా పుష్పం:
పూజకు సిద్ధమై పోయారా? మరి పూజకు పూలు తెచ్చారా, తేలేదా? మరైతే పదండి మీ తోటకి వెళ్లి పూలు తెద్దాం.... అన్నట్టు భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....
అష్టపుష్ప మానస పూజ☜
శ్లోకం.!!
అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ||
శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ
సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్ ||
*నీలకంఠ తవ పాద సేవనం - సంభవంతు మమ జన్మజన్మని।।*
1. అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం...
2. ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం....
3. దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.....
ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
4. క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ....
ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
5. ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.....
ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
6. తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు....
ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
7. జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం...
ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
8. సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం...
ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి... త్వరలోనే మిగతా పూలు పూయించండి...
భగవత్ కృప
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🙏🕉 *భగవత్ కృప*🌺
రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటిదగ్గర మందు లేదు. నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. నేను ఒక్కడినే ఉండిపోయాను. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్లిపోయాడు. వర్షాకాలం కనుక బయట కొద్దిగా వాన పడుతున్నది. మందు దుకాణం ఎక్కువ దూరం లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళగలను. కానీ వాన పడుతున్నది కనుక నేను రిక్షా చేసుకోవడం సరైన పని అనుకున్నాను.
పక్కనే రాముని గుడి కడుతున్నారు. ఒక రిక్షా అతడు భగవంతుడిని ప్రార్థిస్తున్నా డు. నేను అతడిని వస్తావా అని అడిగాను. అతను వస్తాను అని తల ఊపంగానే నేను ఎక్కేసాను. రిక్షా అతను చాలా అనారోగ్యంగా అనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. “ఏమైంది నాయనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒంట్లో బాగోలేదులా ఉంది.” అని నేను అడిగాను. “వర్షం వల్ల మూడు రోజుల నుండి ఎవరూ దొరకలేదు. ఆకలిగా ఉంది. ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంది. ఇప్పుడే భగవంతుని ప్రార్థిస్తున్నాను. ‘భోజనం పంపించు నాయనా’ అని.” అని అతడు చెప్పాడు.
నేను ఏమీ మాట్లాడకుండా రిక్షా ఆపించుకుని, మందు దుకాణానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆలోచిస్తూ ఉన్నాను. ‘భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా? ఎందుకంటే ఇదే ఎలర్జీ అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపేవాడిని. రాత్రి బయటకు పోవటం నాకు అవసరం ఉండేది కాదు. నేను కూడా వెళ్ళాలనుకునే వాడిని కాదు.’ భగవంతుని అడిగేసాను- నన్ను ఈ రిక్షా అతడి సహాయార్థం పంపావు కదా? అని. జవాబు ‘అవును’ అని వచ్చింది.
నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని, నా మందుతో పాటు రిక్షావాడి కోసం కూడా మందు తీసుకొన్నాను. పక్కనే ఒక చిన్న రెస్టారెంటులో ఛోలే భటూరే కొని, ప్యాక్ చేయించి, వచ్చి రిక్షా ఎక్కి కూర్చున్నాను. ఏ గుడి ముందర రిక్షా ఎక్కానో అక్కడికే వచ్చి ఆపించుకుని, దిగాను. అతడి చేతిలో 30 రూపాయలు పెట్టి, వేడి వేడి ఛోలే భటూరే, మందులు ఇచ్చి, ఇట్లా చెప్పాను- “ఈ ఆహారం తిని మందు వేసుకో. ఒక్కొక్క మాతర- ఇవి ఇవాళ, ఇవి రేపు పొద్దున టిఫిన్ తిన్న తర్వాత. ఆ తర్వాత నాకు వచ్చి చూపించుకుని వెళ్ళు.”
అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు- “నేను భగవంతుడిని రెండు రొట్టెలు అడిగాను. ఆయన నాకు ఛోలే భటూరే పెట్టాడు. చాలా నెలల ముందు నాకు ఇవి తినాలి అని కోరిక కలిగింది. ఈరోజు భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. భగవంతుని మందిరం దగ్గర ఆయన భక్తుడిని నా సహాయం కోసం పంపించాడు.”
అట్లా ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. నేను స్తబ్ధంగా ఉండి వింటూ ఉండిపోయాను. ఇంటికి వచ్చి ఆలోచించాను- ఆ రెస్టారెంట్ లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఏదైనా కొనగలిగేవాడిని. సమోసా, లేదా భోజనం కానీ.. నేను చోలే బటూరే మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడు.
మనము ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు చేరితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని దాని అర్థం. మనను తనకు ప్రతినిధిగా పంపాడు అని అర్థము.
ఓ భగవంతుడా ఎప్పుడూ నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రీ!💐🙏
ఎవరికి ఎలాంటి సహాయంకావాలో,ఎవరిచేత చేయించాలో అన్నీ ఆ పరమాత్మ కే తెలుసు.
🙏🙏🙏
[వాట్సాప్ లో వచ్చిన ఓ హిందీ మెసేజ్ కు తెలుగు అనువాదం]
సేకరణ: శ్రీ సంగమేశ్వరరావు గారి వాట్సాప్ పోస్ట్.
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 16*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 16*
సాహిత్యంలో కూడా నరేంద్రుడు ఎంతో ఆసక్తి చూపారు. సంస్కృతం, బెంగాలి, ఆంగ్లాలలోని కావ్యాలను చదివాడు. బెంగాలీ రామాయణ మహాభారతలు అతడికి కరతలామలకం. పండితులు తడబడిన అనేక సందర్భాలలో నరేంద్రుడు వారికి చేయూతనిచ్చాడు.
ఆంగ్లంలో షేక్స్పియర్ మిల్టన్ బైరన్ వర్డ్సవర్త్ ప్రభృతులను అతడు మరీ ఇష్టపడి చదివాడు. షేక్స్పియర్ Romeo and juliet,midsummar night's dream లాంటి నాటకాల నుండి ఆయన కాలాంతరంలో తన ప్రసంగాలలో పలు ఉదాహరణలు ఉటంకించారు. మిల్టన్ Paradise Lost నరేంద్రుణ్ణి బాగా ఆకట్టుకొన్న కావ్యం. "ఉన్న పాపం ఒక్కటే - దౌర్బల్యమే అది.
నేను బాల్యంలో మిల్టన్ రచించిన 'ప్యారడైజ్ లాస్ట్' కావ్యం చదివాను. అందులో నా పూజ్యభా
వాన్ని చూరగొన్న సత్పురుషుడు సైతాను. దౌర్బల్యానికి వశుడు కాక, దేనినైనా ఎదుర్కొంటూ చివరిదాక పట్టువిడవని వ్యక్తే మహాత్ముడని కాలాంతరంలో తన గీతోపన్యాసాలలో ఆయన ఉదాహరించడం చూడవచ్చు.
ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి స్వల్పకాలంలో చదివి ఉండడం సాధ్యమా అనే సంశయం రాకపోదు. కాని నరేంద్రుని చదివే విధమే చిత్రమైనదనే సంగతి మనం మరచిపోకూడదు. తాను చదివే తీరును ఆయనే ఇలా వివరించి ఉన్నారు: 'ప్రతి పంక్తిని చదవకుండా పేరాలోని మొదటి, చివరి పంక్తులు మాత్రమే చదవగానే సారాంశం అంతా నేను అవగతం చేసుకోగలుగుతాను. ఈ ప్రతిభ ఇనుమడించే కొద్దీ పేరాలు చదివే శ్రమ కూడా లేకపోయింది.
పుటలోని మొదటి, చివరి పంక్తి చదివినంత మాత్రానే సారాంశాన్నంతా గ్రహించగలిగేవాణ్ణి, ఉపాధ్యా యుడు ఏదైనా క్రొత్త భావనను పరిచయం చేస్తున్నప్పుడు దానిని నాలుగైదు పుటలలో విపులీకరించేవాడు. దాన్లోనూ మొదటి కొన్ని పంక్తులు చదవగానే అంతా అర్థం చేసుకోగలిగేవాణ్ణి" ఈ రీతిలో చదవడం కారణంగానే ఆయన స్వల్పకాలంలో అన్ని పుస్తకాలు చదవగలిగాడు🙏
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
రాశి ఫలాలు ఆదివారం, ఆగస్టు 20, 2023*
. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*ఆదివారం, ఆగస్టు 20, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*
*తిధి* : *చవితి రా8.51* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
*వృషభం*
వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
---------------------------------------
*మిధునం*
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
---------------------------------------
*కర్కాటకం*
బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.
---------------------------------------
*సింహం*
చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
---------------------------------------
*కన్య*
చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
---------------------------------------
*తుల*
దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
---------------------------------------
*వృశ్చికం*
కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
---------------------------------------
*ధనస్సు*
స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
---------------------------------------
*మకరం*
బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
---------------------------------------
*కుంభం*
ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.
---------------------------------------
*మీనం*
మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
స్నానాంగ తర్పణము
నిత్యాన్వేషణ:
స్నానాంగ తర్పణము అంటే ఏమిటి? దీనిని ఎవరు ఇవ్వవచ్చు? ఎవరికి ఇవ్వవచ్చు?
గంగాది పుణ్య తీర్థాలలో స్నానం చేసేటప్పుడు పితృదేవతలకు సద్గతి కలగడం కోసం చేసే విశేష స్నానాదులు తీర్థయాత్రా పరులు చేస్తారు.
(సామాన్యంగా స్నానం చేసి తీరంలో కూర్చోని నీరు, నువ్వులతో తర్పణం విడుస్తారు. ) ఇది నీటిలో ఉండి చేసేది..
ఈ వేదోక్తమైన తర్పణాదుల విధిని — స్నానాంగ తర్పణము అంటారు. స్నానానికి అంగంగా చేసేది ఇది .
.ముందు సంకల్పం చెప్పుకొని మొలబంటి లోతులో నిల్చి, స్నానం చేయాలి.
సంధ్యావందనం కంటే ముందే ఈ తర్పణ కార్యం చేయాలి.
దోసిటి నిండా ఆ తీర్థ జలం గ్రహించి, ఆవు కొమ్ముల ఎత్తుగా దోసిలి పైకి ఎత్తి,1 దేవతలకు,2.ఋషులకు 3 . పితృదేవతలకు 4 .తన సొంత పితృ, పితామహులకు దోసిలితో విడివిడిగా పేరు పేరునా జలమధ్యంలోనే నిలబడి చేసే జల తర్పణంఇది.
మామూలుగా తండ్రి ఉన్నవాళ్లు తర్పణం వదలిపెట్టరు.
ఇది తీర్థ విధి గాబట్టి తండ్రి ఉన్నవాళ్లు తన సొంత పితరులకు కాక మిగిలిన వాళ్ల కు అందరికీ ఈ తర్పణం వదలాలి.
పితృదేవతలు వేరే , సొంత పితృ పితామహులు వేరే— అని పెద్దల వల్ల విన్నాను. ఈ మంత్రంలో అది స్పష్టమైంది. **
పితృలోకం సొంత పితరులు మాత్రమే ఉండే లోకం కాదు . సొంత పితరులు కొంతకాలానికి ఆ వర్గంలో చేరుతారేమో!
అశౌచం ఏర్పడి ఉన్నపుడు గూడా ఈ స్నానాంగ తర్పణము చేయాలి అని శాస్త్రం.
** దేవాన్, ఋషీన్, పితృగణాన్, స్వ పితౄంశ్చాపి తర్పయేత్—అని బ్రహ్మ వైవర్త పురాణం.,
( హేమాద్రి లో , ఆచార రత్నము లో చెప్పిన విధులివి.)
మన బంధువులే
🪷 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷
*సుభాషితమ్*
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*నిత్యమన్యోన్య సంహృష్ట*
*వ్యసనేష్వాతతాయినః |*
*ప్రచ్ఛన్న హృదయా ఘోరా*
*జ్ఞాతయస్తు భయావహాః ||*
𝕝𝕝తా𝕝𝕝
మనం ఎదుగుతుంటే ఈర్ష్య పడేవారు, మన గురించి ఎప్పుడూ చెడు చెప్పేవారు, బైటకు ప్రేమగా లోపల కుటిల ఆలోచనలతో ఉండేవారు, ఎదిగినప్పుడు దగ్గర చేరి కష్టాలలో దూరంగా ఉండే భయంకరమైన వ్యక్తులు కొంతమంది మన బంధువులే.
__________________________
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*అహో ఖలభుజంగస్య*
*విచిత్రోయం వధక్రమః*
*అన్యస్య దశతి శ్రోత్ర*
*మన్యః ప్రాణైర్విముచ్యతే॥*
𝕝𝕝తా𝕝𝕝
చాడీలు చెప్పేవారు విషనాగు పాములకంటే భయంకరమైనవారు. పాము ఎవరినైతే చంపాలనుకుంటుందో వారినే కాటేస్తుంది. కానీ చాడీలు వేరొకరి మృత్యువుకి దారి తీస్తాయి.
నవగ్రహ పురాణం - 30 వ అధ్యాయం
_*నవగ్రహ పురాణం - 30 వ అధ్యాయం*_
*గురుగ్రహ జననం - 1*
అంగిరసుడు ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని కొడుకు ఉతథ్యుడికి వేదం. నేర్పుతున్నాడు. ఉతథ్యుడు శ్రద్ధాసక్తులతో పాఠం నేర్చుకుంటున్నాడు. తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు ఉతథ్యుడు ఆలోచించి , సమాధానాలు చెపుతున్నాడు. సమయానికి నారద మహర్షి వచ్చాడు , 'నారాయణ' నామ స్మరణం చేస్తూ.
అంగిరసుడు తన మానస సహోదరుడైన నారదుణ్ణి సాదరంగా దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. పాఠం ముగించి , ఉతథ్యుడు వెళ్ళాడు.
*"విద్యలో తండ్రిని మించిపోయేలా ఉన్నాడే , ఉతథ్యుడు !"* అన్నాడు నారదుడు.
*"లేదు. నారదా ! ఉతథ్యుడు తెలివైన వాడే. మాటల్లోనూ , నడతలోనూ , నడకలోనూ బాగా నెమ్మదిగా ఉంటాడు. కుశాగ్ర బుద్ధీ. మహా మేధావీ అయిన ఆదర్శ పుత్రుణ్ణి పొందాలని ఉంది నాకు"* అంగిరసుడు నవ్వుతూ అన్నాడు.
*“అగ్నిశిఖ లాంటి తీక్షణమైన , చురుకైన బుద్ధి కలిగిన పుత్రుడు మీకు తప్పక కలుగుతాడు ! అగ్నిభట్టారకుణ్ణి ఆరాధించండి !"* నారదుడు అన్నాడు.
*“అగ్ని దేవుడా"* అంగిరసుడు ఆశ్చర్యంగా అన్నాడు.
*"ఔను ! అగ్నిదేవుడే ! మీరంటే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం. ప్రత్యేకమైన అభిమానం ఉన్నాయి. మరిచి పోయారా ? అగ్ని అలిగి వెళ్ళి అరణ్యాల్లో తపస్సులో మునిగినప్పుడు ఆయన విధుల్ని నిర్వహించి , మీరు లోకాలకు ఉపకారం చేశారు గదా !"* గతాన్ని గుర్తు చేశాడు నారదుడు.
*"ఎందుకు గుర్తు లేదు , నారదా ! తన పదవిని శాశ్వతంగా స్వీకరించమన్నాడు. ఆనాడు అగ్నిహోత్రుడు. సవినయంగా నిరాకరించాను. నన్ను తన జ్యేష్ఠ పుత్రుడిగా భావించమన్నాను"* అంగిరసుడు చిరునవ్వుతో అన్నాడు.
*"ఇంకేం ! మేథావి అయిన కుమారుడికి - మహామేధావి అయిన కుమారుణ్ని అనుగ్రహిచి , ఆశీర్వదించడానికి అగ్నిహోత్రుల వారు సందేహించరు ! శుభస్య శీఘ్రం ! వెంటనే అగ్నిభట్టారకుడు అభిమానించే హోమకార్యం ప్రారంభించండి !"* అంటూ లేచాడు నారదుడు.
అంగిరసుడు నారదుడి సూచనను అనుసరించి , అగ్నిదేవుడికి ప్రీతి కలిగించే 'అగ్నికార్యం' ప్రారంభించాడు. ధర్మపత్నిని పక్కన ఉంచుకొని భక్తి ప్రపత్తులతో శాస్త్ర సమ్మతంగా ఆయన చేసిన యాగం సత్వరమే సత్ఫలితాన్ని కలిగించింది.
అగ్నికుండంలో ప్రజ్వరిల్లుతున్న కీలలలో ధగధగ వెలిగిపోతున్న అగ్నిభట్టారకుడు ప్రత్యక్షమయ్యాడు. అంగిరసుడూ , శ్రద్ధా భయభక్తులతో చేతులెత్తి నమస్కరించారు.
*"అంగిరసా ! నువ్వు నన్ను ఎప్పుడు వరం కోరుతావా అని ఆతృతగా చూస్తున్నాను. సుమా ! కోరుకో ! ఏం కావాలి ?"* ఆశ్రమ ప్రాంగణంలో అగ్నిదేవుడి కంఠం గంభీరంగా ప్రతిధ్వనించింది.
*"కుశాగ్రబుద్ధీ , మహామేధావీ అయిన ఆదర్శ పుత్రుణ్ణి ప్రసాదించు , తండ్రీ !"* అంగిరసుడు అర్ధించాడు.
*"పుత్రుడు కోరితే పుత్రుణ్ని ఇవ్వకుండా ఉండగలనా ?"* అగ్నిదేవుడు నవ్వుతూ అన్నాడు. *"సునిశిత బుద్ధీ , అద్వితీయమైన వాక్చాతుర్యం , మహత్తరమైన మేథోసంపదా కలిగిన పుత్రుడు నీ సతీమణి శ్రద్ధ ద్వారా నీకు కలుగుతాడు. లోకాలన్నీ భవిష్యత్తులో అతని పేరునే బుద్ధికుశలతకు పర్యాయపదంగా ఉపయోగిస్తాయి. తల్లిదండ్రులైన మీ చరిత్రనూ , కీర్తినీ ఆ కుమారుడు శాశ్వతం చేస్తాడు"* అగ్నిదేవుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.
*"ధన్యోస్మి !"* అంగిరసుడు శిరస్సు వంచి నమస్కరించాడు. *"శుభం భూయాత్ !"* అంటూ అగ్ని జ్వాలలో కలిసిపోయాడు.
అగ్నిదేవుడి వరం ఫలించింది. సకాలంలో 'శ్రద్ధ గర్భవతి అయింది. తను ఎంతగానో కోరిన మహామేధావి అయిన పుత్రుణ్ణి గర్భంలో మోస్తున్న ధర్మపత్నిని అంగిరసుడు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. ఆశ్రమంలో నెమ్మదిగా తిరుగాడుతున్నది. శ్రద్ధాదేవికీ నవమాసాలూ నిండాయి.
అది ఒక శుభదినం. శ్రద్ధాదేవి ఒక బాలునికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే పరిమళం వెదజల్లే పుష్పంలా బాలకుడి ముద్దు మొహంలో ఏదో జ్ఞానతేజం ప్రతిఫలిస్తోంది. ఆ విశాల నేత్రాలలో ఏదో వెలుగు !
అంగిరస మహర్షి పుత్ర జననాన్ని పురస్కరించుకొని , శాస్త్రం విధించిన అగ్నికార్యాలు నిర్వర్తించాడు. ఇతర మానస పుత్రులు సకుటుంబంగా నామకరణమహోత్సవానికి విచ్చేశారు.
అంగీరసుడు పుత్రుడికి 'బృహస్పతి' అని నామకరణం చేశాడు. త్రిమూర్తుల ప్రతినిధిగా ఆ శుభకార్యంలో పాల్గొన్న నారద మహర్షి శ్రద్ధా అంగిరసులను అభినందించి , ఇలా అన్నాడు....
*"మీ చిన్ని శిశువు మహాజ్ఞాన సంపన్నుడుగా మాత్రమే కాదు , భావి కాలంలో నవగ్రహాలలో ఒక ప్రముఖ దేవతగా అభిషిక్తుడవుతాడు. త్రిమూర్తులు ఈ సందేశాన్ని మీకు అందజేయమన్నారు”*
పంచాంగం 20.08.2023 Sunday,
ఈ రోజు పంచాంగం 20.08.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి భాను వాసర: హస్త నక్షత్రం సాధ్య యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.
చవితి రాత్రి 12:20 వరకు.
హస్త రా. తె 04:20 వరకు.
సూర్యోదయం : 06:03
సూర్యాస్తమయం : 06:36
వర్జ్యం : పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:50 వరకు.
దుర్ముహూర్తం: సాయంత్రం 04:56 నుండి 05:46 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
రామాయణమ్ 298
రామాయణమ్ 298
...
ఓ రామా ! నాకు ఒక చిన్నగాయము అయినందుకే అంతకోపించి కాకిమీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించినావు కదా ! ఏల ఇపుడు నన్ను అపహరించుకుపోయిన వాని మీద అంత దయ !ఇప్పటికే నీవు వచ్చి వానిని కడతేర్చినన్ను తీసుకొని పోవలసినది కాదా ?
.
సర్వలోక నాధుడవైన నీవు నా ప్రాణనాధుడవయి ఉండి కూడా అనాధలాగ అయిపోతినికదా !
.
సర్వశ్రేష్ఠ ధనుర్ధారివే!
సకలశస్త్రాస్త్ర పారంగతుడవే!
భండన భీముడవే !
ఏల ఈ ఉపేక్ష !
రాక్షసులమీద ఇంత దయ?
.
నీ అస్త్రములు సకల దుష్టరాక్షస సంహార కారకములు
నీ ధనుష్ఠంకారమే వారి గుండెలు బద్దలు చేయునుకదా !
.
ఏల రావు ? నీవేల రావు?
.
ఆ రామానుజుడైనా అన్నగారి ఆజ్ఞతీసుకొని నన్ను రక్షించుటకు రాడేమి?
.
లేదు,లేదు నేనే ఏదో పాపము చేసియున్నాను ,సందేహము లేదు.
.
సీతమ్మ కన్నీరు కాల్వలై ప్రవహిస్తూ దీనముగా మాట్లాడటము చూసిన హనుమ ,....
.
అమ్మా! రాముని స్థితి నీ స్థితి ఒకటేనమ్మా! సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను రాముడు ఏ భోగము అనుభవించుటలేదు !
ఎప్పుడూ ఆయనకు
నీపైనే ధ్యాస !
నీ పేరే ఆయన శ్వాస!
.
ఆయన హృదయము కరిగి కన్నీరై ఏరులై పారుచూ కడు దయనీయమైన స్థితిలో నిన్నేపలవరించుచున్నాడు.ఆయన పరిస్థితి చూసి లక్ష్మణస్వామికూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడమ్మా!
.
ఓ అమ్మా ! దోషరహితా ! నా భాగ్య వశమున నీవు నా కంట బడితివి .ఇక విలపించవలదమ్మా .అన్ని కష్టములు అతి త్వరలో కడ తేరగలవు.....
.
వూటుకూరు జానకిరామారావు
రాష్ట్రం...?_* *_ఏమై పోతుంది...._*
🌹🌹🌹💥💥💥
*_ఎక్కడికెలు తుంది రాష్ట్రం...?_*
*_ఏమై పోతుంది...._*
*_ఒక వైపు అప్పులు_*
*_మరో వైపు భూముల అమ్మకాలు_*
*_ఉచిత పథకాల కింద దాగిన_*
*_పంది కొక్కులు ఊసర వెళ్లులు_*
*_రాబందులు రాక్షాసులు_*
*_రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు_*
*_అప్పులు ఎలా తీర్చుతారో చెప్ప మనండి,_*
*_పథకాలు ఎలా కొనసాగిస్తారో తెలప మనండి_*
*_ఇలాంటి పాలకుడు అవసరమా?_*
*_తన అధికారం నిలుపు కోవడమే లక్ష్యం,ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలు పప్పు బెల్లాలు లాగ పైసలు పంచడం, భూములు అమ్మితే తప్ప ఉచిత పథకాలకు పైసలు ఉండవు,తాపకు ఇన్ని భూములు అమ్మడం ఎందుకు? ఒకే సారి రాష్ట్రాన్ని వేలం వేసి అమ్మెస్తే సరి పోతుంది_*
*_ఒక ఇంటి యేజమాని ఆస్తులు అమ్ము చుండు అంటే ఆ ఇల్లు బాగున్నట్టా?_*
*_నష్ట పోతున్నట్లా?_*
*_రాష్ట్రానికి ముఖ్య మంత్రి ఏమైనా యెజమాని కూడా కాదు కదా?_*
*_పైసలు ఇస్తేనే ప్రజలు ఓటు వేస్తారు అని ఇట్లా ప్రజల సొమ్మును అమ్మి ప్రజలకు పంచడం ఏమిటి?_*
*_ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇండ్లలో ఉన్నాయి, వాటిని ప్రభుత్వ భూములలో కట్టండి_*
*_నలబై కోట్లకు ఎకరం వంద కోట్లకు ఎకరం అమ్మి సంబర పడటం కాదు రేపు ప్రజావసరాలకు భూములను ఎట్లా కొంటారు? చెప్పండి..._*
*_ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే, ఇంటి పన్ను పెరిగేది నిజం కాదా?_*
*_కరెంటు బిల్లు పెరగ నున్నదిగా_*
*_నల్లా బిల్లు పెరుగుతుంది తప్పకుండా_*
*_రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇంటి పర్మిషన్ చార్జీలు పెరగవని ప్రజలకు ఏమైనా రాసిస్తారా?_*
*_అక్రమ సంపాదకులు మాత్రమే ఎన్నికలలో పైసలు పంచుతారు,_*
*_ఎన్నికలు అయిపోతే చాలు ప్రజల వైపు ఎవ్వరు తొంగి చూడరు రూపాయి కూడా ఇవ్వరు_*
*_ఎన్నికలప్పుడు పైసలు పంచే వాడు గాడిద..వాడు పంది కొక్కు, పైసలు పంచి ఎన్నికలలో గెలవాలనే కుట్ర దాగి ఉంటది తరువాత ప్రజల సొమ్ము దోచు కోవడమే వాడి లక్ష్యం, పైసలు పంచే వాడికి ఓటు వేయడం మంచిది కాదు_*
*_ఉచితాలు ఇచ్చే వాడు మంచి పాలకుడు కాడు,_*
*_తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత రాజకీయ నాయకుల ఆస్తులు విపరీతంగా పెరిగినవి,_*
*_తెలంగాణ లో అన్ని వ్యాపారాలలో ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని కూడా రాజకీయ నాయకులవి వారి బినామీలవి రాజకీయ నాయకులు భాగస్వాములుగా ఉన్న కార్పొరేట్ వ్యాపార సంస్థలవి, ఆంద్రవ బడా రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఉంటారు_*
*_తెలంగాణ ప్రజలకు వ్యాపారాలు లేకుండా పోయినవి,చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నా అవి సరిగా నడవటం లేదు_* *_కిరాయి కూడా యెళ్ళదు ఎంత మంది సామాన్య_* *_తెలంగాణ కుటుంబాలు లక్షలు కోట్లు_* *_నెలకు కిరాయిలు_*
*_పొందుతున్నరా?_*
*_విద్యా సంస్థలు,వైద్య సంస్థలు కూడా వారివే ,_* *_అందుకే ఇప్పుడు ఉన్న రాజకీయ_* *_నాయకులు_* *_ప్రజాసేవకులు కాదు_* *_99%దోపిడీ దొంగలలే_*
*_వారికి_*
*_ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో ఆలోచించండి_*
*_వారికి అభిమానులుగా చెప్పుకునే మనం అజ్ఞానం లో లేమా?_*
*_సమర్థుడు అయిన పాలకుడు విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేస్తాడు ప్రతీ ఒక్కరు ఆలోచించాలని నా విజ్ఞప్తి._*
🙏🙏🙏🙏
గోపబాలునిగా కృష్ణయ్య
గోపబాలునిగా కృష్ణయ్య
మ: "శ్రవణోదంచిత కర్ణికారములతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకి పింఛకముతో నంభోజదామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా ! మాధవుఁ డాలవెంట నవమందొప్పారెడిం జూచితే.
భాగవతము:దశ:స్కం- 769 పద్యము: బమ్మెర పాతన !
సాహిత్య పిపాస గల భావుకులను తన్మయ పరచే సన్నివేశాలు భాగవతంలో కోకొల్లలు. అందులో నొకటి
బాలగోపాలుని బృందావిహారం. గోపాలునిగా మోహన వంశీధరునిగా విలసిల్లే గోపాలకృష్ణుని ముగ్ధమనోహర రూపం ఈపద్యంలో
పోతన కవితాచిత్రంగా చిత్రించి మనకళ్ళకు కట్టించాడు.
.
కర్ణికారమంటే కొండగోగు పూవు . చెవిలో కొండగోగుపూవు నలంకరించుకున్నాడట. అప్పటి షోకది. ఇప్పుడైతే అది వెక్కిరింపు. బంగరుచేలం ధరించాడట.కలవారిబిడ్డ .యెంత డాబుగా ఉంటాడో అంతగానూ ఉన్నాడు. శిరస్సు పైన తురాయిగా
నెమలి పిఛాన్ని ధరించాడట. మెడలో తామరపూలమాల. చేతిలో మోహన మురళి . దాన్ని పెదవులకాన్చి వేణుగానం చేయుచున్నాడట. ఆవులు తన్మయంతో వింటూ మోరలెత్తి చూస్తున్నాయట.
చూడవే చూడు. కిష్ఠయ్య యెంత అందంగా ఉన్నాడో! అంటూ గోపికలు ఆనందాశ్చర్యములతో
బాలగోపాలుని చూచి ముచ్చట పడుచున్నారట. వింటున్న మనకే యెంతో ముచ్చటగా ఉంటే మరివారు ముచ్చట
పడటంలో వింతేముంది?
లీలా శుకులవారు శ్రీకృష్ణకర్ణామృతంలో ఈఘట్టాన్ని చాలామనోహరంగా వర్ణించారు. అదికూడా విందాం.
శ్లో: మన్దం మన్దం మధుర నినదైః వేణు మాపూరయంతం /
బృందం బృందావనభువి గవాం చారయంతం చరతం /
ఛందోభాగే శతమఖ మఖ ధ్వంసినాం దానవాణాం /
హంతారమ్ తం కథయ రసనే! గోపకన్యా భుజంగం//
మెల్ల మెల్లగా వేణువు నూదుతూ మంద మందలుగానున్న గోవులను ముందుకు తోలుతూ తాను వాటివెనుక అడుగులు వేయుచు (యజ్ఙభాగాలు సరిపోక )దేవతల యజ్ఙాలను నష్టపరచు,రాక్షసుల సంహారి మురారి యెంత మనోహరంగా ఉన్నాడో! వర్ణించరాదటే ఓనాలుకా! ఆగోపకన్యావిటుని యందాన్ని వర్ణించు, అంటున్నాడు కవి.
ఇంత మనోహరమైన యీదృశ్యాన్ని అక్షరాలలో చదివిన మీరు కనులు మూసి తలపుల తలుపులు తీసి
మరోసారి దర్శించటానికి ప్రయత్నంచేయండి. అదే రసానందం!!!
స్వస్తి!🙏🙏🌷
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శ్లోకం:52/150
అగ్నిజ్వాలో మహాజ్వాలో
హ్యతిధూమ్రో హుతో హవిః I
వృషభ శ్శంకరో నిత్యం
వర్చస్వీ ధూమకేతనః ॥ 52 ॥
* అగ్నిజ్వాలః = అగ్నియొక్క జ్వాలయే తానైనవాడు,
* మహాజ్వాలః = గొప్ప జ్వాల (మంట) ఆకారమైనవాడు,
* అతిధూమ్రః = మిక్కిల ధూమ్రవర్ణం (నలుపు ఎఱుపు కలిసియున్న పొగ వర్ణము)లో ఉన్నవాడు,
* హుతః .= అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానే అయినవాడు,
* హవిః = హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానే అయినవాడు,
* వృషభః = వాహనమగు ఎద్దు రూపములో నున్నవాడు,
* శంకరః = (ఐహిక) సుఖమును కలుగజేయువాడు,
* నిత్యంవర్చస్వీ = ఎల్లప్పుడు వర్చస్సు కలవాడు,
* ధూమకేతనః = ధూమ వర్ణంగల జెండా కలవాడు.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం