20, ఆగస్టు 2023, ఆదివారం

స్నానాంగ తర్పణము

 నిత్యాన్వేషణ:


స్నానాంగ తర్పణము అంటే ఏమిటి? దీనిని ఎవరు ఇవ్వవచ్చు? ఎవరికి ఇవ్వవచ్చు?

గంగాది పుణ్య తీర్థాలలో స్నానం చేసేటప్పుడు పితృదేవతలకు సద్గతి కలగడం కోసం చేసే విశేష స్నానాదులు తీర్థయాత్రా పరులు చేస్తారు.

(సామాన్యంగా స్నానం చేసి తీరంలో కూర్చోని నీరు, నువ్వులతో తర్పణం విడుస్తారు. ) ఇది నీటిలో ఉండి చేసేది..

ఈ వేదోక్తమైన తర్పణాదుల విధిని — స్నానాంగ తర్పణము అంటారు. స్నానానికి అంగంగా చేసేది ఇది .

.ముందు సంకల్పం చెప్పుకొని మొలబంటి లోతులో నిల్చి, స్నానం చేయాలి.

సంధ్యావందనం కంటే ముందే ఈ తర్పణ కార్యం చేయాలి.

దోసిటి నిండా ఆ తీర్థ జలం గ్రహించి, ఆవు కొమ్ముల ఎత్తుగా దోసిలి పైకి ఎత్తి,1 దేవతలకు,2.ఋషులకు 3 . పితృదేవతలకు 4 .తన సొంత పితృ, పితామహులకు దోసిలితో విడివిడిగా పేరు పేరునా జలమధ్యంలోనే నిలబడి చేసే జల తర్పణంఇది.

మామూలుగా తండ్రి ఉన్నవాళ్లు తర్పణం వదలిపెట్టరు.

ఇది తీర్థ విధి గాబట్టి తండ్రి ఉన్నవాళ్లు తన సొంత పితరులకు కాక మిగిలిన వాళ్ల కు అందరికీ ఈ తర్పణం వదలాలి.

పితృదేవతలు వేరే , సొంత పితృ పితామహులు వేరే— అని పెద్దల వల్ల విన్నాను. ఈ మంత్రంలో అది స్పష్టమైంది. **

పితృలోకం సొంత పితరులు మాత్రమే ఉండే లోకం కాదు . సొంత పితరులు కొంతకాలానికి ఆ వర్గంలో చేరుతారేమో!

అశౌచం ఏర్పడి ఉన్నపుడు గూడా ఈ స్నానాంగ తర్పణము చేయాలి అని శాస్త్రం.

** దేవాన్, ఋషీన్, పితృగణాన్, స్వ పితౄంశ్చాపి తర్పయేత్—అని బ్రహ్మ వైవర్త పురాణం.,

( హేమాద్రి లో , ఆచార రత్నము లో చెప్పిన విధులివి.)

కామెంట్‌లు లేవు: