12, ఆగస్టు 2024, సోమవారం

అన్వేషణ

 *


       *జీవితము* నాలుగు *అక్షరాలే* కానీ అందులో *ప్రయాణం* అంతు చిక్కని *అన్వేషణ* ప్రతి మనిషి చూడడానికి బాగానే కనిపించినా *మనసులో* ఎన్నో *బాధలు* కావాలన్నది *దొరకదు* దొరికినది మనతో *ఉండదు* ఒక్క సారి ఎవరికైనా మన *హృదయంలో* స్థానం ఇచ్చామంటే *మన గుండె* చప్పుడు *ఆగే* వరకు ఆ *స్థానం* వారికి మాత్రమే *సొంతం* .


    ప్రతి క్షణం *సంతోషంగా* ఉండాలని *తపనే* కానీ సంతోషం *మనిషి* జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే *కష్టానికి* అలవాటు పడిన వారికి *ప్రతి క్షణం* సంతోషమే కాబట్టి ఉన్నదానితో *సంతృప్తి* పడటమే *జీవితము* .


      మనం ఎంత *ఎత్తుకు* ఎదిగినా *గడిపిన* సాధారణ *జీవితాన్ని* మరిచిపోకూడదు గతంలో మనతో కలిసి *బతికిన* వారిని మనకు *సహాయం* చేసిన వారిని మనకు *తోడుగా* ఉన్న వారిని ఎన్నడు *మరచిపోకూడదు* 


      సృష్టిలో అన్ని *సంపదల* కన్నా ఆరోగ్యంగా *జీవించడమే* అసలైన *సంపద* ఆర్థికంగా మనం ఎంత ఉన్నత *స్థితిలో* ఉన్నా *ఆరోగ్యం* సరిగా లేనప్పుడు ఆ *సంపద* ఉన్నా లేనట్లే ఉన్నవారికి లేనివారికి కావాల్సిన ఏకైక *సంపద* మంచి *ఆరోగ్యం* అందువలన *ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం* చేయకూడదు ఎందుకంటే *ఆరోగ్యమే మహాభాగ్యం* 


   మనకు ఎన్నో *పండుగలు* వస్తుంటాయి పోతుంటాయి కానీ *మనసుకు* నచ్చిన వారు *మనసారా* మాట్లాడితే *ప్రతిరోజు పండుగలాగే* ఉంటుంది  .


      *మీ ... గోల్కొండ యదయ్య*

ఇతిహాసం

 🔔 *ఇతిహాసం* 🔔


శ్రీరాములవారు వారి అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు ఆయనను తమ అవతారం ఉపసంహరింపమని కోరడానికి కాలపురుషుని రాముని వద్దకు పంపుతాడు.


శ్రీరాముడు కూడా తాను చెప్పిన “దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని” 11,000 సంవత్సరాల రాజ్యపాలన పూర్తిచేసి తన అవతార కార్యం పూర్తవ్వడంతో తన స్వధామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం చూస్తూ వుంటారు.


కాలపురుషుడు అయోధ్యలోకి ప్రవేశించాలంటే అందుకు ఆ నగరానికి కాపలాగా వున్న హనుమంతుల వారిని దాటి రావాలి. హనుమంతుడు కావలి ఉన్నంతసేపు యముడు లోనికి రాలేడు. 


అందుకు శ్రీరాముడు తన అంగుళీయం తన భవనంలో ఉన్న నేల పైన చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు.


హనుమంతుడు కామరూపం ధరించి చిన్న కీటకం ప్రమాణంలో ఆ బిలంలోకి వెళ్తారు.


వెళ్ళగా వెళ్ళగా పాతాళబిలం వద్దకు చేరుకుంటాడు.


అక్కడ వాసుకి ఆయనను గుర్తించి ఆయనను గౌరవించి వచ్చిన కార్యం గురించి అడుగుతాడు.


శ్రీరాములవారి అంగుళీయం గురించి చెప్పి ఆచోటు చూపమని అభ్యర్దిస్తాడు.


అప్పుడు వాసుకి ఆయనను ఒక గుట్టలా ఉన్న ఉంగరాలున్న చోటు చూపించి అందులో రాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు. 


శ్రీరాముని ప్రార్ధించి తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు.


వాసుకి “మరొకటి చూడు” అని చెప్పగా, అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరంలానే వుంటుంది.


అలా అక్కడ గుట్టగా ఉన్న అన్ని ఉంగరాలు కూడా శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతునికి చెబుతాడు వాసుకి...

”ఏమిటి ఈ మాయ స్వామీ వివరించండి” అని ప్రార్ధించగా.. వాసుకి చెబుతాడు...


”ఇవన్నీ కూడా శ్రీరాముని ఉంగరాలే. ఇవన్నీ ప్రతీ కల్పంలో శ్రీరాముడు అవతార స్వీకారం చేస్తారు, ఆయన అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం వచ్చి పడుతుంది, దానిని వెతుక్కుంటూ ఒక మర్కటం వస్తుంది, ఇదే ప్రశ్న అడుగుతుందని, ఇప్పటికి ఎన్నో కల్పాలనుండి ఇదే.. జరిగే తతంగం అని, రాబోయే రాముల ఉంగరాలు ఉంచే స్థలం కూడా వుందని చెబుతాడు వాసుకి.


శ్రీరాముడు అనంతుడు, అలా ప్రతీ కల్పంలోనూ ఇలా వస్తూ వుంటారు, వెళ్తుంటారు అని, ఇప్పుడు కాలుని ఆపడం, తద్వారా శ్రీరామ అవతార సమాప్తి ఆపే శక్తి హనుమంతునికి లేదని చెబుతాడు.


కాలం అనంతం. అనాది నుండి ఈ కాలప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చాయి పోయాయి, వస్తాయి..పోతాయి.. కూడా.


కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రమే శాశ్వతం. ఆయన లీలలు అనంతం. ఈ అనంతప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి గిడతాయి,మళ్ళీ పుడుతూ ఉంటాయి.


పుట్టిన ప్రతీది కాలగర్భంలో కలవకమానదు, చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైనా.


ఈ కాల స్వరూపమే పరబ్రహ్మ, చివరకు అన్నీ ఆయనలోనే లీనమౌతాయి.


ఇటువంటి  విషయం కేవలం మన సనాతనధర్మం మాత్రమే చెప్పింది.


ఈ నాటకం నిరంతరం జరుగుతూ వుంటుంది. ఈ నాటకం   రక్తి కట్టించడానికి స్వామీ కూడా ఒక పాత్ర ధరిస్తాడు, రంజింపచేస్తాడు, ధర్మాన్ని నిలుపుతాడు.


జగన్నాటక సూత్రధారిని నమ్మి ఆయనను పట్టుకున్నవాడు హనుమంతుడిలా చిరంజీవిగా నిలబడతాడు.


ఈ కాలప్రవాహాన్ని దాటగల నావ కేవలం ఆయన మీద భక్తి, ఆయనకు శరణాగతి చెయ్యడం.


అందుకే కాలుడు ఆయన నామాన్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్ళలేడు.


అటువంటి హనుమంతుని త్రికరణశుద్ధిగా పట్టుకున్న భక్తులను అకాలమృత్యువు పట్టదు.


అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించ గలిగినవాడు.


అన్నమయ్య చెప్పినట్టు..                         “ఈ ఆదిమూలమే మనకు అంగరక్ష, ఆ శ్రీదేవుడే మనకు జీవ రక్ష,                             ఆ భూదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిరక్షా, జలధిశాయి అయిన ఆయనే మనకు జలరక్ష,

అగ్నిలో ఉన్న యజ్ఞమూర్తి మనకు అగ్నిరక్ష, వాయుసుతుని ఏలినట్టి వనజనాభుడు మనకు వాయురక్ష,  పాదము ఆకాశమునకు చాచిన ఆ విష్ణువే మనకు ఆకాశరక్ష,                          ఈ వెంకటాద్రి పైన ఉన్న ..                              ఈ సర్వేశ్వరుడే మనకు సర్వ రక్ష.


https://youtu.be/bhwHfiKPUnc


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔


🚩 కలియుగంలో జరిగబోయే సంఘటనలు ముందుగా తెలిపిన కలిపురుషుడు 🚩* 


⚜️🚩పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూసారు. అరెరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని ఎంత దరకైన కొనాలి ఆనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు.


⚜️🚩గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు.


⚜️🚩దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు.


⚜️🚩మెదటి ప్రశ్న:

ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు. మరల

గుర్రం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు.


⚜️🚩సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమి లేక అక్కడే ఉండి పోయాడు. కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడు ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నారు.


⚜️🚩సహదేవుడు ని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుని పోయునావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడు కి వివరంగా చెప్పారు. ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ , సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది. ఎలగైన సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్లాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటిప్రశ్నలయున నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడు కి బహుమతి గా ఇస్తాను అని చెప్పారు.


⚜️🚩గుర్రం యొక్క యజమాని సరే నీవైన జాగ్రత్త గా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పు అని రెండోవ ప్రశ్నను అడిగారు .


⚜️🚩రెండోవ ప్రశ్న

మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.


⚜️🚩ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండి పోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయే సరికి కంగారుగా ధర్మరాజు భీముడు ను పిలిచి తమ్ముళ్ళిద్దరు ను వెతుక్కుని ఎక్కడఉన్న రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు.



⚜️🚩అన్నగారు మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు.

చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి

తమ్ముళ్ళిద్దరను ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు. వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్లదాము అనగానే తమ్ముళ్ళిద్దరను అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు.


⚜️🚩అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ తమ్ముళ్ళిద్దరు ఓడిపోయారు. కావున నీవు బాగా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు.


⚜️🚩మూడవ ప్రశ్న

ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరను రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని అన్న ధర్మరాజు గారు కి వివరంగా చెప్పారు.


⚜️🚩అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నయ్య ధర్మరాజు గారు లో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటి అన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను బయటపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.


⚜️🚩మెదటి ప్రశ్నకు సమాధానం. పెద్ద బావి అనేది తల్లి తండ్రులు. ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు.

కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.


⚜️🚩రెండో వ ప్రశ్నకి సమాధానం . ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.

ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా ఇరుక్కు పోతారు.


⚜️🚩మూడవ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పారు.


ఇది సృష్టి లోని అందరికి తెలియాల్సిన సమాచారం...


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

పోలీస్ శాఖ వారి హెచ్చరిక.*

 🙋‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♀️🙋‍♂️


*🎤 విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక.* 

 👩‍👩‍👧👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👧‍👦  


*🙋‍♂️ 1. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తర్వాత విద్యార్థులను బయట తిరగనీయరాదు.*


*🙋‍♀️2. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసులు నమోదు, వాహనాలు సీజ్ చేయబడతాయి.*


*🙋‍♂️3. పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అటువంటి కంప్లైంట్స్ స్కూల్ యాజాన్యం నుండి వచ్చిన యెడల టీ.సీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు. మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకొని విధంగా చర్యలు తీసుకోబడతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతటివారైనా అందరికీ ఒకే విధంగా చర్యలు తీసుకోబడతాయి.*


*🙋‍♀️ 4. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, దుర్వ్యసనాలకు పాల్పడుతున్నారా అనే విషయాలపై పూర్తి స్పృహ కలిగి ఉండాలి, ఎప్పటికప్పుడు వారి కదలికలపై దృష్టి సారిస్తూ ఉండాలి.*


*🙋‍♂️5. పిల్లలకు ఫోన్ లు ఇవ్వడం, పర్సనల్ కంప్యూటర్లు ఇవ్వడం చేయరాదు. ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే వాటి వినియోగం పై పూర్తి నిఘా ఉంచాలి. పిల్లలు ధరించే దుస్తులు హెయిర్ కటింగ్ పై శ్రద్ధవహించాలి. పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉంచాలి.*


*🙋‍♀️6. పిల్లలు చేస్తున్న స్నేహాలపై మరియు స్నేహితుల అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.*


*🙋‍♂️7. శారీరకశ్రమ అందించే క్రీడలకు ప్రోత్సహించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.*


*🙋‍♀️8. మీ పిల్లలు చెడు వ్యసనాలకు (తాగుడు, మత్తు మందులు ఇతరత్రా...) అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే... జాగ్రత్తలు వహించండి... మీ పిల్లలను ఒక కంట కనిపెట్టండి.*

                         

*🙋‍♂️9. పిల్లలను ప్రేమగా చూసుకోవడం మంచిదే కానీ అతి ప్రేమతో వారిని మొండి వారిగా తయారు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి,. మొక్కై వంగనిది మానై వంగదని తల్లిదండ్రులు గమనించాలి...*


🙋‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♀️🙋‍♂️

 *🗣️ A. P. పోలీసు శాఖ* 

🙋‍♀️🙋‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♀️🙋‍♂️🙋‍♀️


*👉 ఈ సమాచారం వీలైనంత మందికి తెలియజేయండి. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్ధాం....*


*✍️✍️*

మధుమేహం గురించి

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 * సహజము - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 * అపథ్య నిమిత్తజము - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


                       * సంపూర్ణం *

  

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు . 


   

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ప్రణయ రాయబారం !

 


ప్రణయ రాయబారం  !

--------------------------------

కావ్యరచన ఒక శిల్పం. తిక్కనకూడా ఇదేమాట యన్నాడు." అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునన్ బారగుడన్ అన్నాడు. (చూ: భారతం విరాటపర్వం అవతారిక) అనల్పరచనా విన్యాసమే శిల్పం. అట్టిరచనతో రసజ్ఙులను మెప్పించిన కవులరుదు. అట్టివారిలో ప్రథమ గణ్యుడు శ్రీనాధుఁడు.


అతని రచన లనువాదములే ! అయిన నేమి ?స్వతంత్ర రచనలను దలపింపఁజేయును. నిజమారసినచో అనువాదము బహు కష్టమైనపని. మూలాను సరణము చేయక తప్పదు. ఇక యనువాదకుని ప్రతిభ కనఁడునవకాశములెవ్వి? అయినను శ్రీనాధరచనలు అనువాదములే యైనను స్వతంత్రగ్రంధముల వలెభాసించు చున్నవి.దానికాతని ప్రతిభా వ్యుత్పత్తులే కారణమనక తప్పదు.


ఆంధ్ర సాహిత్యమున కొన్ని వింతలున్నవి. అట్టివానిలో తిర్యక్కులైన పక్షులొనర్ఛిన ప్రణయ రాయభారములు. పేర్కొన దగినవి .శృంగార నైషథములోని హంస రాయభారము మొదటిది.కాగా పింగళిసూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నములోని శుచిముఖియను చిలుక రాయభారము రెండవది. మనమిప్పుడు హంసరాయభారమును తెలిసికొందము.


నైషధమున హంస ప్రణయ రాయభార ఘట్టము రసజ్ఙుల మన్ననల నందుకొన్నది. అదిమామూలు పక్షికాదు.మాటలు నేర్చిన పక్షి! మనుజుల హృదయాలలో మరులు నింపఁగల దిట్ట. నిషధ రాజు ఉద్యావమున నతనిచే బట్టువడి యతవినిని మాటలతో మెప్పించి యాయందగానికి తగిన యందగత్తె కుండిన పురాధీశుని కుమార్తె దమయంతియేనని యామెసౌందర్యమును బొగడి నలున కామెపై ప్రేమరగిల్చి, వారిరువురకు పెండ్లి గూర్చెద నని నమ్మబలికినది. తోడనే పెండ్లిండ్ల పేరయ్యవలె కార్యాచరణమున కుపక్రమించినది.


నిషధ లోనెగిరి , విదర్భలో దమయంతి యంతః పురమున వ్రాలినది. రమణీయమైన దానినడకలకు ముచ్చట పడి దమయంతి చెలికత్తెలచే దానిని  తెప్పించినది. ఇక నక్కడితో దాని చాతుర్యము ప్రారంభమైనది. "ఏమమ్మో! దమయంతీ! నేను చతుర్ముఖుని వాహనమగు హంసను. మంచివారితో స్నేహమే నానైజము. నీకు మహదుపకారమొనర్ప కుతూహల మగుచున్నది. నాసామర్ధ్యమును తక్కువగా నెంచకుము.


మ: స్మర వాత్స్యాయన కూచిమార కృత శాస్త్ర గ్రంధ సందర్భముల్ 

పరిశీలించిన వాఁడ; దంపతుల కుత్పాదింతు సారస్యముల్ ;

మురి పంబొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పుదున్ మేదినీ

శ్వర శుధ్ధాంత నితంబినీ జనులకున్ ; సంపూర్ణ చంద్రాననా!


శృం: నైషధము 2 ఆశ్వా 56 పద్యం ; శ్రీనాధమహాకవి;


నాకు మన్మధశాస్త్రృసంబంధమైన విషయాలన్నీ తెలుసు. ఆలుమగల మధ్య యనురాగ మును పెంపుజేయు సామర్ధ్యము గలవాఁడను. అంతఃపుర కాంతలకు మంద గమనంబులను నేర్పు సామర్ధ్యము గలవాడను. నన్ను తక్కువగా నెంచబోకుమీ? అవును నీకు ఉపకారమేదైన చేయవలె ననుకొంటిని గదా!


కన్నియలకు ప్రియమైనదేమైయుండును? వేరేమి యందాల మగడే గదా!'కన్యావరయతేరూపం'. ఆహాఁ! గుర్తువచ్చినది. అందాల రాకుమారీ! నీకొఱకొక యందాల రాకుమారుని వెదకి యుంచితి నమ్మా! నిషధ నేలు నలుఁడే నీకు తగిన భర్త. ఆయందము. ఆవైభవము నింతింతని యనజాలము.నీభాగ్యము పండినదిలెమ్ము. 


నలుని వరించి తరింపుము. బ్రహ్మకు సరూప ఘటన చేయజాలని వాడను నపనింద గలదు.దానిని తొలగింప గోరి యతడేమీ యిరువురకు సంగతిని కూర్చుటకు నిర్ణయించినాడమ్మా ! నామాట నమ్ముము. నేడోరేపో ప్రకటింపగలఁడు.


చ: అడిగితి నొక్కనాడు ,కమలాసను తేరికి వాహనంబ నై

నడచుచు , నుర్విలో నిషధ నాధున కెవ్వతె యొక్కొ భార్యయ

య్యెడునని , చక్ర ఘోషమున నించుక యించుక గాని, యంత యే

ర్పడ విన నైతి ' నీవ యను చందము తోచెడి నమ్మ భామినీ!


శృం; నైష : 2ఆశ్వా 58 పద్యం -శ్రీనాధుఁడు;


హంస యెంత చమత్కారం చేసిందో చూడండి. " మేంప్రయాణంలో ఉండగా విరించిని స్వయంగా నేనడిగానమ్మా ఈధరలో నలునకు భార్యగా నెవరిని సృష్టించితిరని. మాయదారిమోత రథచక్రాలు నీవేనని చెప్పినట్లు గుర్తు.


ఉ: నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి ; నెల్లి నేటిలోఁ

దూర్ణము సేయఁగా గలఁడు తోయజ సూతి ; తదన్యధా వృధా

దుర్ణయ వృత్తికిన్ మనసు దూర్చిన యేని ,జగజ్జనాపవా

దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది తెప్ప చెప్పుమా?


నీకు , నలునికీ బ్రహ్మముడి పడిపోయింది. తప్పించుకోవాలని జూచావో మధ్యలో బ్రహ్మగారి పరువు పోతుంది. బ్రహ్మ వ్రాతకు తిరుగు లేదు అనేమాట వట్టిదే నని ప్రజలు నిందిస్తే, ఆ అపవాద సముద్రమును దాటేందుకు బ్రహ్మకు తెప్పేది?దారేముంటుంది. అందువల్ల నలుని పెండ్లాడి బ్రహ్మ మాట నిలబెట్టవమ్మా! "- అంటోంది రాయభారి హంస!


మాటలతోనే సరిపెట్టక " నలుని మాత్రమే పెండ్లాడెద నని"- యామెచేత ప్రమాణమునుగూడ చేయించి తనమాటను నెగ్గించుకొన్నది హంస!

                     స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷🌷🌷💐🌷💐💐💐🌷🌷🌷🌷🌷

మత్స్యావతార చరితము

 మత్స్యావతార చరితము 


శ్రీభాగవతమును చెవులార వినుచు 

నాధ్యాత్మికానంద మనుభవించేటి 

శౌనికాదిగగల్గు సంయమివరులు 

పలికిరీరీతిగా ప్రార్థించిసూతు 


"విమలాత్మ ! వినమాకు వేడుకయయ్యె 

వింతగా పరమాత్మవిష్ణుండు దొల్లి 

మత్స్యరూపము దాల్చె మహిమాన్వితముగ. 

కర్మబద్ధునిభంగి ఘనుడీశ్వరుండు 

నిఖిలనిందిత తమోనిలయమైనట్టి 

మీనరూపమునేల మేలనిదాల్చె ?

ఎక్కడ వర్తించె ? నేమియున్ జేసె ?

ఆద్యమై వెలయు నయ్యవతారమునకు 

కారణంబెయ్యది ? కార్యంశమేమి ?

నీవేను కర్తవు నిఖిలంబుదెలుప 

దేవాదిదేవు డాదివ్యుని చరిత 

వివరించి దెల్పుడీ వీనులుపండ "


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మారడానికి మీరు ప్రయత్నం చేయండి.

 జై శ్రీ రామ్ 


*ధనవంతులుగా నటించడం కన్నా, ధనవంతులుగా మారడానికి మీరు ప్రయత్నం చేయండి*


ధనం లేకున్నా ధనవంతులమని ప్రపంచాన్ని మోసం చేయాలనే ఆలోచన ఎంత వరకూ సమంజసం? అలాంటి ఆలోచన వల్ల నిజంగానే పేదవారిగా మారిపోతారు.


ధనవంతులెప్పుడూ వాళ్లని పది మంది డబ్బున్న వాళ్లుగా గుర్తించాలి అనుకోరు. చెప్పాలంటే అందరితో కలిసిపోయేలా సాదాసీదాగా ఉంటారు. కానీ వాళ్ల విలువ తెలియడం వల్ల మనలో వాళ్లు డబ్బున్న వాళ్లనే భావన దానికదే వచ్చేస్తుంది. డబ్బు ఉన్నట్లు వాళ్ల ఆహార్యం ఉండకపోయినా సరే మనకు వాళ్లు అలాగే కనిపిస్తారు. కొంత మంది మాత్రం డబ్బు లేకపోయినా పది మంది తమని బాగా ఉన్నవాళ్లు అనుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఈ తప్పుడు ఆలోచన వల్ల వాళ్ల స్తోమతకు మించిన బట్టలు, వస్తువులు, కార్లు .. ఇలా ఇంకేవో కొంటుంటారు. అందరి నోటా డబ్బున్నవాళ్లమనే తప్పుడు భావనను సృష్టించాలనుకుంటారు. ప్రపంచాన్ని మోసం చేయాలనే ఈ ఆలోచన ఎంతవరకూ సమంజసం?


ఉన్నవాడిగా నటిస్తే ఉన్న డబ్బు పోతుంది..

స్తోమతకు తగ్గట్లు నడుచుకుని దానికి తగ్గ ఖర్చులే పెట్టుకుంటే ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. అలా కాకుండా ధనవంతులుగా కనిపించాలని విచ్చలవిడి ఖర్చులు పెడితే పేదరికం లూబిలో తప్పకుండా ఏదో ఒక రోజు కూరుకుపోతారు. ధనం సంపాదించడం మీద దృష్టి పెట్టొచ్చు కానీ, ధనం ఉన్నట్లు కల్పిత ప్రపంచం సృష్టించడం మీద కాదు. భారీ పట్టు చీరలు, ఖరీదైన నగలు, జల్సాలు, తిరుగుళ్లు.. ఇవన్నీ మీ ధనాన్ని నశింపజేస్తాయి.మీరు సృష్టించాలనుకుంటున్న ఊహా ప్రపంచం కోసం అవసరం లేని ఖర్చులు పెడతారు. క్రమంగా పేదవారిగా మారి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టిముట్టేస్తాయి.


నిజంగా ప్రపంచం మోసపోతుందా?

మీరెంత ప్రయత్నించినా, ఎన్ని డాబులు ప్రదర్శించినా మీ చుట్టూ జనాలకు మీ తాహతు గురించి ఒక అవగాహన ఉంటుంది. మీరు ధనవంతులమనే మాయచేసి వాళ్లని మోసం చేయలేరు. మీ మనసులో మీకు వాళ్లు మీరు ధనవంతులని అనుకుంటున్నారు అనే భావన ఉంటుంది అంతే. కానీ జనాలకు మీమీద అభిప్రాయం ఎన్ని బడాయిలకు పోయినా మారదు. ఉదాహరణకు మీరు మధ్య స్థాయి మనుషులు అయ్యుండి నిజంగానే బాగా ఖర్చు పెట్టి వజ్రాల నగలు వేసుకున్నారు అనుకోండి.. జనాలు దాన్ని గిల్టు నగ అనుకుంటారు తప్ప.. మీరు చెప్పినా నమ్మరు. మీముందు నటిస్తారంతే. కాబట్టి మీ విలువ మీరెంత మోసం చేయాలనుకున్నా పెరగదు.


ఇలా ఎందుకు ఆలోచిస్తారు?

అలా ధనవంతులుగా నటించడంతో కొందరికి ఆనందం దొరుకుతుందట. ఖరీదైన వస్తువు కొన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ వాళ్లకన్నా ఖరీదు వస్తువులు కొనగలిగే వాళ్లున్నారనే విషయం అర్థం చేసుకోరు. అలాంటి వాళ్లని చూసిన ప్రతిసారీ నిరాశకు లోనవుతారు కూడా. దాంతో డబ్బులు వృథా చేయడం మొదలుపెడతారు. చూసేవాళ్లు మన గురించి గొప్పగా అనుకోవాలని అవసరం లేని ఖర్చులు చేయడం మొదలుపెడతారు.


ధనవంతులు ఎలా ఖర్చుపెడతారు?

డబ్బున్న వాళ్లు ఎవ్వరూ వాళ్ల సంపాదనను మించి ఖర్చు పెట్టరు. అలా ఖర్చు చేసేవాళ్లెవరు ధనవంతులుగా మిగలరు. *సంపాదన ధనవంతుడిగా, ఖర్చులు పేదవాడిగా ఉండాలి*. అప్పుడే సంపదకు విలువ. ఉదాహరణకు మీకు అవసరం లేకున్నా డాబు కోసం క్రెడిట్ కార్డు వాడటం మొదలుపెడితే, అనవసరమైన ఖర్చులు మీకు తెలీకుండానే పెరిగిపోతాయి. వాటి నుంచి బయటపడటానికి లోన్లు, అప్పులు చేయడం మొదలుపెడతారు. క్రమంగా ఆర్థికంగా నష్టపోతారు.


కాబట్టి ధనవంతులుగా నటించడం కన్నా, ధనవంతులుగా మారడానికి మీరు ప్రయత్నం చేయండి.


జై శ్రీ రామ్ 

 కంచర్ల వెంకట రమణ

12.08.2024. సోమవారం

 Jai Sriram 🚩🚩..Good Morning 🌄 


12.08.2024. సోమవారం


సుప్రభాతం.....


*శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం, వర్ష ఋతువు*


 ఈరోజు శ్రావణ మాస శుక్ల పక్ష *సప్తమి* తిథి ఉ.07.55 వరకూ తదుపరి అష్టమి తిథి, *స్వాతీ* నక్షత్రం ఉ.08.33 వరకూ తదుపరి *విశాఖ* నక్షత్రం, *శుక్ల* యోగం సా.04.26 వరకూ తదుపరి *బ్రహ్మ* యోగం,*వణిజ* కరణం ఉ.07.55 వరకూ తదుపరి *భద్ర(విష్టీ)* కరణం రా.08.48 ఉంటాయి.

*సూర్య రాశి* : కర్కాటకం (ఆశ్లేష నక్షత్రం లో)

*చంద్ర రాశి* : తులా రాశిలో రా.04.15 వరకూ తదుపరి వృశ్చిక రాశిలో.

*నక్షత్ర వర్జ్యం*: మ.02.40 నుండి సా.04.24 వరకూ

*అమృత కాలం*: రా.01.08 నుండి రా.02.53 వరకూ

 

( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.58

*సూర్యాస్తమయం*: సా.06.44

*చంద్రోదయం* : మ.12.07

*చంద్రాస్తమయం*: రా.11.34

*అభిజిత్ ముహూర్తం*: ప.11.56 నుండి మ.12.47 వరకూ

*దుర్ముహూర్తం*: మ.12.47 నుండి మ.01.38 వరకూ మరలా మ.03.20 నుండి సా.04.11 వరకూ

*రాహు కాలం*: ఉ.07.34 నుండి ఉ.09.10 వరకూ

*గుళిక కాలం*: మ.01.57 నుండి మ.03.32 వరకూ

*యమగండం*: ఉ.10.45 నుండి మ.12.21 వరకూ.


ఈరోజు *రెండవ శ్రావణ సోమవార వ్రతం మరియూ శివముష్టి వ్రతం* ఈరోజు శైవ భక్తులు పగటి పూట ఉపవాసం ఉండి, అవసరమైతే కేవలం మంచినీరు త్రాగుతూ,నక్త కాలంలో(సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ,లేదా నక్షత్ర దర్శనం అయిన తరువాత కానీ) పారణ చేస్తారు. శివ ముష్టి వ్రతాన్ని క్రొత్తగా పెండ్లియిన స్త్రీలు,వివాహం అయిన మొదటి అయిదు సంవత్సరాలు, శ్రావణమాసం లో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటి పూట భోజనం చేస్తూ, శివలింగాన్ని పూజిస్తారు. ఇలా చేయడం వలన తమ వైవాహిక, దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది అని నమ్మకం. *రెండవ శివముష్టి వ్రతంలో తెల్లనూవులను నివేదిస్తారు*.


 నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్ : 6281604881.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *𝕝𝕝శార్ధూలము𝕝𝕝* 


    *నీతో యుద్ధముఁ జేయనోప, గవితా నిర్మాణశక్తిన్నినుం*

    *బ్రీతుం జేయఁగ లేను, నీకొఱకుఁ దండ్రిం జంపఁగాఁజాల నా*

    *చేత న్రోఁకట నిన్ను మొత్త వెఱతుం జీకాకు నాభక్తియే*

    *రీతి న్నా కిఁక నిన్నుఁ జూడఁగలుగున్ శ్రీకాళహస్తీశ్వరా!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 08*


*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! అర్జునుని మాదిరి నీతో యుద్ధము చేయలేను, నత్కీరుడు తదితర కవుల మాదిరి నిన్ను నా కవితా శక్తితో సంప్రీతున్ని చేయలేను, ఒకానొక శివభక్తునివలె తండ్రిని జంపలేను; మరొక్క శివభక్తురాలి వలె నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తియే నాకు అడ్డమై నీ దయను పొందనీయకున్నది... నిన్ను జూచెడి అవకాశమింక నాకెట్లు కలుగును* ?

      

✍️💐🌷🌹🙏

సప్త ఋషులు

 🌴🤘🕉️ మాతృదేవోభవ 🙏🏽

🍇  *"సప్త ఋషులు"*  ??


ఈరోజుల్లో  *"సప్త ఋషులు"*  మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే .. అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.*


👉 *ఎక్కడ ఉంటారు?* *ఎలా ఉంటారు?* *అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.*

*సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.*


👉 *ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..*


*కశ్యప అత్రి భరద్వాజ*

*విశ్వామిత్రోథ గౌతమః!*

*వశిష్టో జమదగ్నిశ్చ*

*సప్తైతే ఋషయః స్మృతాః!!*


*భారతీయ పురాణ కథనాల ప్రకారం - ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.*

*ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.*


1. *కశ్యపుడు,*

2. *అత్రి,*

3. *భరద్వాజుడు,*

4. *విశ్వామిత్రుడు,*

5. *గౌతముడు,*

6. *జమదగ్ని,*

7. *వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులే.*


*రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు  "వ్యాసుని"  రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.*


👉🏻 *'వ్యాసుడు'  నాలుగు తలలు లేని బ్రహ్మ,  రెండు బాహువులు గల విష్ణువు,  మూడో కన్ను లేని శివుడని అంటారు.*


⭐ 1. *కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతాత్పణ జాతులు, సింహ, మృగ,  పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.*


⭐ 2. *అత్రి మహర్షి:-*

 *సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.*


⭐ 3. *భరద్వాజ మహర్షి:-*

*భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.*


⭐ 4. *విశ్వామిత్ర మహర్షి*:- 

*విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.*


⭐ 5. *గౌతమ మహర్షి:-*

*తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.*


⭐ 6. *వశిష్ఠ మహర్షి:-*

*ఇతని భార్య అరుంధతి.* *వసిష్ఠుడు బ్రహ్మమానస* *పుత్రుల్లో ఒకడు. వైవస్వత* *మన్వంతరాన సప్తర్షుల్లో* *ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు* *గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు,* *గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.*


⭐ 7. *జమదగ్ని మహర్షి:-*

*జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.*


👉 *మరణం ఆసన్నమైన వారికి అరుంధతీ దర్శనం, సప్తర్షి మండల దర్శనం కాదట.*


👉🏻 *సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.*


👉 *మీరంతా  వీలున్న సాయంత్రపు వేళ  "సప్తర్షి మండల దర్శనం"  చేసుకుంటారు కదూ...*


🍇 *సప్తర్షి మండల దర్శన ఫల ప్రాప్తిరస్తు*   🌻🌻


శుభమస్తు 💐

ఆడదె మన బతుకు మొదలు

 *2045*

*కం*

ఆడదె మన బతుకు మొదలు

నాడదె సకలంపు సిరుల కాధారంబౌ.

ఆడదె సంతోషకరము

నాడదె సంతాపమయ్యు ననయము సుజనా.

*భావం*:--- ఓ సుజనా! ఆడదే మన బతుకు కు ప్రారంభం, ఆడదే అన్ని సిరులకు ఆధారము అగును. ఆడదే సంతోషకరము సంతాపకరము కాగలదు.

*సందేశం*:-- ఆది నుండి అంతంవరకూ అన్నిటికీ ఆధారమైన స్త్రీలను గౌరవించడం, సమస్యలలో ఉన్నప్పుడు సంరక్షణ చేయడం అందరికీ బాధ్యత.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

దుఃఖానికి కారణం

 *మానవుని దుఃఖానికి కారణం ఏమిటి???*


"అపోహయే దుఃఖ హేతువు" అని శాస్త్ర వచనం...!!


ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొఱ్ఱెలు మేపు వారికి దొరికింది...

వారు దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా, కొంచెం అది పెద్దదైంది. 

అది గొఱ్ఱెలలో తాను ఒక గొఱ్ఱెను అనే అనుకునేది...అలాగే ప్రవర్తించేది...

ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈమందపై పడింది...


గొఱ్ఱెలన్నీ పారిపోయాయి, సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది. 


అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది.

"చిన్న గొఱ్ఱె ను నన్ను చంపకయ్యా"అంది వణికిపోతూ సింహం పిల్ల...


అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను చూపింది. 

మూతి పై మీసాలు చూపింది, పిల్ల సింహం గొఱ్ఱె ను కానని తెలుసుకుంది. 

తాను కూడా సింహమేనని, తలచి సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది...


ఐతే ఇక్కడ సింహా నికి కొత్తగా వచ్చినది, స్వరూప జ్ఞానమేకాని, స్వరూపం కాదు..ఆదిత్యయోగీ.


అందుకే మానవుని, దైవ స్వరూపులుగా భావిస్తారు, సంబోధిస్తారు, 

కాని మనం ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మనలో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము...


జీవుడు,దేవుడు ఒకటే , మన స్వస్వరూపం , ఆత్మయే... అని తెలుసుకోవాలి ...

ఏదీ శాశ్వతం కాదు, అన్నీ నిమిత్త మాత్రమే అని భావించాలి, అశాశ్వతమైన వాటిపై ఆశ వదలాలి ... 

.


*"కష్టాలనేవి భగవంతుని వరాలు. వాటిలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. కష్టాలను అనుభవించడం ద్వారా అంతరంగంలో అనేక అనుభూతులను పొందవచ్చు"* *"జెరిమీ టేలర్"* అనే మహాశయుని అభిప్రాయం ప్రకారం. మతంలో దాగి ఉన్న అనేక నిగూఢ రహస్యాలు, అనుభవపూర్వకంగానే తప్ప, అవగాహనకు రావు. ఏదైనా గొప్ప ఆపద సంభవించినప్పుడే అవి అనుభవంలోకి వస్తాయి. *"మిలేట్"* అభిప్రాయం ప్రకారం. విపత్తు అనగా ఓరిమి, *చక్కని వినమ్ర భావము, స్థిమితమైన స్థైర్యము, ప్రతిష్ట - ఇవన్నీ లోతుగా వేళ్ళూనుకుని దృఢంగా వర్ధిల్లడానికి సహాయపడే సారవంతమైన నేల వంటిది.*

.

హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు.


ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లిపోవడమంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు.అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే... రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం– గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. 


ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి. 


లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం – అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే.


 హనుమ జీవితం ఒకసారి గమనించండి. 


ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు.ఆదిత్యయోగీ.


 అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు.


నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు.


అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి...

.

మానవ రక్తం లోనే ఉంది దేవుడు భావం .తరాల వారసత్వం తిరుగులేని బానిసత్వం తిరుగులేని అలసత్వం సత్యేమే భ్రమతత్వం .


  ఆత్మగా దేవుడు అన్ని జీవులలో ఉంటే - సాధమా మనిషికి - దుష్కర్మలు చేయ ? తనవారూ - పరవారూ తగునా దేవునికి ?.


  ప్రేమికులు ఎందరో - ప్రేమ కొందరికే - ధనవంతులు ఎందరో - ధర్మాత్ములు కొందరే , మానవులు ఎందరో - మానవత కొందరికే .ఆదిత్యయోగీ.


  అసాధ్యతను ఆలోచన చేయకు ; సాధ్యతను అన్వేషించు మనసు మించిన ' ఇంత్యుసన్ ' , మనిషిలో ఉంది .


  మానవత్వం మనిషి తత్వం అయితే - మానవ జాతి మాననీయమవుతుంది - మహనీయమవుతుంది మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది"..

.

*నా మీద మనసు లగ్నం చేసినవారు భౌతికంగాగాని, ఆధ్యాత్మికంగా గాని భయపడనక్కరలేదు. నన్ను మాత్రమే చూస్తూ నా గూర్చి మాత్రమే వింటూ, నన్నే ఆరాధించేవానికి తప్పకుండా శుద్ధచైతన్య (భగవంతుని) దర్శనభాగ్యం కలుగుతుంది. ఎవరైతే నన్ను నిత్యునిగ శుద్ధునిగ, బుద్ధునిగా ఆరాధిస్తారో వారు నన్ను పొందుతారు....*

.