27, ఫిబ్రవరి 2021, శనివారం

సంస్కారం

 🌷🌹*సంస్కారం*🌹🌷


 నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు, అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందేశక్తి వుంది.


 మార్కండేయుడు పదహారేళ్ళకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు నారదుడ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్ళు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్ధించాడు. అందుకు ఆయన "కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడుతో పాదాభివందనం చేయించా"లన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతడ్ని వారందరూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీశ్శులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.


      ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ బిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి "ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?" అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు. 


తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు.

      వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషితలను తీసుకెళ్ళేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు "మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?" అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.


 యోగశాస్త్రంలో "నమస్కారాసనం" ప్రసక్తి వుంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.


  రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెకు స్మరించి నమస్కరించాడు.


 "ఎదిగేకొద్దీ ఒదగాలి" అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.



      ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్ళు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.


 శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలచాడు.  వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. 


ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని పాదాభివందనంలోని పరమార్ధాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు. అందుకే అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్య రహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, పకృతిలో శాంతి వర్ధిల్లాలి. ఇలా ప్రార్ధించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏


(ఫేస్ బుక్ నుండి సేకరణ)

రామాయణం

 *ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.* 


 *"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య.... "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు* 


 *ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే* *నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.* 


 *"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. .  బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో* *నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.* 

 *"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు..... అలాగే పది రోజులు* *రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు.* 

 *నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.* 


 *అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....*  *అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.* 


 *భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !* 


 **నవ విధ భక్తి మార్గాల్లో #శ్రవణం ఒకటి... విన్నా చాలు!* 


🎊💦🌹🦚🌈💥🦜

మాసానాం మార్గశీర్షోహం..

 మాసానాం మార్గశీర్షోహం.... కాలము ప్రకృతి పరంగా నడచుట. యిది జీవ చైతన్యలక్షణమునకు  సంబంధమైనది. దీనికి భూమి కారణం. భూచలనమునకు రాహు కేతు మాగ్నెట్ లక్షణం. రాహుకేతు శక్తి లక్షణము పార్వతీ పరమేశ్వర తత్వం. క్షీర సాగరమధనం మాఘ మాసంలో జరుపబడిన మూలంగా మాఘమాసము సృష్టికి జీవజాలమునకు పూర్ణ లక్షణము. ప్రకృతికి సంబంధించిన దంతయు సముద్రమధనం నుండే ఆవిర్భవించి సకల కళలు అనగా షోడశ కళల రూపము మరియు దానిని నాలుగు సంఖ్యతో విశ్లేషణ అనగా 16xనాలుగు 64 కళల పూర్ణమైన లలితమ్మగా రూపుదాల్చింది. చతుషష్ట్యపరాధ్యై చతుషష్టి కళామయి. యివి అన్ని మాఘా నక్షత్ర కేతు తత్వమని మహా మాఘియని సంభోధన. మాఘమాసము నకే మహా మాఘియని వేరే మాసమునకు మహా సంబోధన లేదు. యిది కేతు తత్వం సింహరాశి ప్రారంభంలో కలదు. దీని కేతు తత్వం సింహ వాహినీ యైన అమ్మ సంబంధం. కేతు తత్వం అమ్మ యని రాహు తత్వం శతభిషం శివ తత్వ సంబంధమని దీని ని సమ సప్తకమే జ్యోతి ఉష శాస్త్ర కళత్ర స్థాన ఫలము తెలుపు స్త్రీ పురుష తత్వం తెలియును. సృష్టి కి సంబంధించిన సమస్తం యీ మాసము నుండే ప్రారంభం. సప్తమి శక్తి రూపమైన సూర్యజయంతి ప్రారంభం లయకారకత్వమైన శివరాత్రితో  లయమని తెలియుచున్నది. గ్రహచలనమే సృష్టి మానవ గమనము సృష్టికి మూలం. మఘలో పుట్టి పుబ్బ లో పోవుట యనగా కేతువు నుండి జీవశక్తి మనుగడ ప్రారంభమై పుబ్బానక్షత్రముతో శుక్రునితో పరిపూర్ణమై 120 పూర్తి గ్రహ దశలు సంచరించు కకాలముతో అనగా 120 సంవత్సరములు పూర్తిగా జీవించి ముక్తిని పొందుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *దంపతుల పై దయ..*


"ఈరోజు బుధవారం కదండీ..ఈరోజు నుంచీ వచ్చే సోమవారం ఉదయం వరకూ స్వామివారి సన్నిధి లో ఉండాలని వచ్చామండీ..ఇద్దరమూ పెద్దవాళ్ళం..మా కొఱకు వసతి చూపించండి..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి నిద్ర చేసి వద్దాము..అని ఈవిడ ఐదారు నెలల నుంచీ నాతో చెపుతోంది..ఈరోజుకు మాకు కుదిరింది..ఇక్కడకు వచ్చాము..ఏదైనా ఒక రూమ్ ఇప్పించండి.." అని ఆ దంపతులు ప్రాధేయపూర్వకంగా మా సిబ్బందిని అడిగారు..మా సిబ్బంది కూడా వెంటనే వాళ్లకు ఒక గది కేటాయిస్తూ.."మీకు కేటాయించిన గది ని శనివారం నాటికి వేరేవాళ్లకోసం అట్టే పెట్టాము..ప్రస్తుతానికి మీరు అందులో వుండండి..శనివారం రోజు మీకు మరో చోట వసతి చూపిస్తాము.." అని చెప్పారు.."అలాగే..సర్దుకుంటాము.." అని చెప్పారు..


ఆరోజు సాయంత్రం నేను మందిరానికి వచ్చేసరికి..ఈ దంపతులు వచ్చిన వైనం మా వాళ్ళు నాకు తెలిపారు..ఈలోపల ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."మీరేనా ఈ మందిరానికి ధర్మకర్త? మీ పేరు ప్రసాద్ కదా? " అని అడిగారు..అవును అని సమాధానం ఇచ్చి.."మీరెక్కడినుండి వస్తున్నారు..?" అని అడిగాను.."మాది కడప జిల్లా..నాపేరు ఈశ్వర రావు..ఈమె సరస్వతి..గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాము..నేను రెవెన్యు లో ఈమె టీచర్ గా పనిచేసేవాళ్ళము..కొన్ని సమస్యలతో బాగా మనస్తాపం చెందాము..మా జీవనానికి ఏలోటూ లేదు..జరిగిపోతుంది..ఇద్దరికీ పెన్షన్ వస్తుంది..సమస్య ఆర్ధికంగా కాదు..మాకు ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ అబ్బాయిలే..పెద్దవాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్లు..రెండో వాడికి ఇరవై తొమ్మిది..రెండోవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో వాడికి ఉద్యోగం..మంచి జీతం వస్తుంది..మా దిగులంతా పెద్దవాడి గురించే..డిగ్రీ చదివే నాటి నుంచే చెడు అలవాట్లకు లోనయ్యాడు..సిగరెట్లు..తాగుడు..వాడితో నరకం పడుతున్నాము..చదువు అబ్బలేదు..నాకున్న పలుకుబడితో రెండు మూడు చోట్ల..ఏవో చిన్న ఉద్యోగాలలో చేర్పించాను..ఆరు నెలలు తిరక్కముందే..అక్కడి అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగం మానేసి వచ్చేవాడు..వీడి ప్రవర్తన తో విసిగి పోయాము..అందరి దేవుళ్లకూ మొక్కుకున్నాము..మేమూ రిటైర్మెంట్ అయిన తరువాత..చిన్నవాడి వద్ద కొన్నాళ్ళు ఉన్నాము..వాడికి వివాహం చేసుకోవాలని ఉన్నది..కానీ పెద్దవాడి పరిస్థితి చూస్తే..ఇలా ఉన్నది..పెద్దవాడి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వాడికి అమ్మాయిని ఇవ్వరు..రెండోవాడికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాము..ఈలోపల ఈ స్వామివారి గురించి విని ఒక్కసారి ఈ స్వామికి కూడా మొక్కుకొని వెళదామని వచ్చాము.." అన్నారు..అలా చెప్పేటప్పుడు ఆ దంపతుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..నిజమే..పెద్దకొడుకు ఎందుకూ పనికిరాని అప్రయోజకుడు అయితే..ఆ తల్లిదండ్రులకు మనస్తాపం సహజమే కదా..


ఆ దంపతులిద్దరూ మొత్తం ఐదు రోజులు వున్నారు..రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు..శనివారం పల్లకీసేవ లో తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..శని, ఆదివారాల్లో మందిరం వద్ద జరుగుతున్న కార్యక్రమాలు, అన్నదానం అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి వద్ద తమ సమస్యలు తీరిపోయిన కొందరు భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు..సోమవారం ఉదయం తిరిగి తమ ఊరు వెళ్ళిపోతూ.."ప్రసాద్ గారూ..ఇక్కడ చాలా ప్రశాంతంగా వుందండీ..మా అబ్బాయి సమస్య అంతా స్వామివారి మీదే పెట్టాము..ఇక నీటముంచినా..పాలముంచినా..ఆయనదే భారం..మా మనసులో ఏదో ఆశ పుట్టింది..చూద్దాం..మా ప్రాప్తం యెట్లున్నదో.." అని చెప్పారు..


ఆరేడు నెలల తరువాత..ఆ దంపతులు మళ్లీ వచ్చారు..ఈసారి వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు, కోడలు ను కూడా వెంటబెట్టుకు వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..వీడు మా రెండో అబ్బాయి..వీడికి రెండు నెలల క్రితం వివాహం చేసాము..మేము ఇక్కడినుంచి వెళ్లిన నెల తరువాత..మా పెద్దవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు..ఒక నెల వాడి జాడ తెలియలేదు..బాగా బాధపడ్డాము..ఒక రకంగా మేము పడుతున్న వేదనకు దేవుడు ఇలా పరిష్కారం చూపించాడేమో అని సమాధాన పడ్డాము..ఈలోపల వీడికి సంబంధాలు వచ్చాయి..ఇక ఆలస్యం చేయకుండా వివాహం చేసాము..చిత్రంగా మా పెద్దవాడు పోయిన నెలలో వచ్చాడు..ఎవరో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడట..తాగుడు మానేసాడట..ముందు మేము నమ్మలేదు..ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడించాడు..తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు..ప్రస్తుతం మాతో రోజు మార్చి రోజు మాట్లాడుతున్నాడు..వాడు బాగుపడ్డాడనే నమ్మకం కుదిరింది..స్వామిదయవల్ల వాడి బతుకు వాడు బతికితే అదే చాలు..మాకు పెద్ద కోరికలు లేవు..ఆరోజు స్వామిని వాడి గురించే మొక్కుకున్నాము..స్వామివారు దయ చూపారు..కాబట్టే..ఈనాడు వాడి స్థితి కి తగ్గ జీవనోపాధి దొరికింది..ముఖ్యంగా తాగుడు మానేశాడు..స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము.." అని చెప్పారు..చెప్పేటప్పుడు ఇద్దరి కళ్ళలో నీళ్లు ఉన్నాయి..కానీ అవి వేదనతో వచ్చినవి కాదు..సంతృప్తి తో వచ్చిన కన్నీళ్లు..


జీవిత చరమాంకం లో ఆ దంపతులకు మనోవేదన దూరం చేసి..తృప్తిని ఇచ్చారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వాస్తవం

 వాస్తవం

                                 ***

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  

అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

.                              

ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.

"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...

:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...

"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...

"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..

ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....

కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...

'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...

పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...

కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...

కరుణాకర్ గారి విషయం...

ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...

ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..

కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...

చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...

ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...

నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...

మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...

ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...

పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...

దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...

ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...

మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....

ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...

మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...

అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...

వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...

ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...

అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...

ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...

మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..

రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...

మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....

మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...

దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...

మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...

అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...

ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...

ఇంకా పండగ మాకు...

కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...

మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...

మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...

వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో

మేము రిటైర్ అయిపోయాం....

మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...

రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...

ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...

తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...

కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....

కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...

పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...

మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...

ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...

నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...

నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...

మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...

మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...

అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...

వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...

ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...

మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...

అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...

ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...

మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...

ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...

మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...

ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...

మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...

మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....

వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...

కామన్ హాల్ లో పెద్ద టీవీ....

ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....

ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....

అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...

ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...

కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...

US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...

దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...

కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..

.

వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....

                          ***

(రచన: ఉమాబాల

మాఘ పౌర్ణమి*

 *_నేడు మాఘ పూర్ణిమ ,  మాఘ పూర్ణిమ ప్రత్యేకత_* 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ పౌర్ణమి*


హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.


*మాఘ పౌర్ణమికి శుభసమయం..*


ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది.


ఉదయ తిథి ఫిబ్రవరి 27న ఉంది పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున , నదులలో స్నానం చేయడం మెరిట్ ఇస్తుంది. పౌర్ణమిని ఉపవాసం పాటించేవారు. 2021 ఫిబ్రవరి 26న సత్య నారాయణ వత్రం చేయించాలి. అయితే పౌర్ణమి రోజు ఫిబ్రవరి 27న స్నానం చేయాలి.


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.

కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.

మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.

*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.


*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*


*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*


*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.


అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.


*☘మాఘం అమోఘం :☘*


మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.


*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*


*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.


త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .

 

*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*


మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 


*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*


మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 


*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*


 *"నదీనాం సాగరో గతి:''*


సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 

అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.


సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.


సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 


*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*


1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*


3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*


9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*


ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*

    *"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*


*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*


*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*


*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 


అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం. 

ఆ తరువాత ...

*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   


*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*


నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.

శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.

మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -


*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*


*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -


*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*


*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*


అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


*☘చివరగా ఓ మాట☘*


మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 

జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.


*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*


పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.


ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.