15, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 50 నారద మహర్షి

 మన మహర్షులు- 50


నారద మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి, అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.


ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -


రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.


మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. 


తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.


ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు


మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.


నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. 


 మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతేకాదు, నారదుడు ఒక గొప్ప సంగీతకారుడు.


రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది.


 వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో “ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా?”  అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. 


అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.


ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్, యజుర్, సామ, అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. 


ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలి యుగంలో ప్రజలకు దైవభక్తి, సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.


ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం, మహాభారతం, భాగవతాలను గ్రంధస్థం చేయడంలో, వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.


అలాగే వాల్మీకి, ధ్రువుడు, చిత్రకేతు, ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. 

ఇటు ధర్మరాజుకి రాజధర్మం, ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు.పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు, ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.


 ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ, సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు.


నారదుడు రచించిన స్మృతిని  నారద స్మృతి’ అంటారు.  నారదుని “నారద శిక్ష” అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము, దాని విశిష్టత, దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి.

నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  


ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.


నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం

వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

దేవుడు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

 *దేవుడు ఉన్నాడా,లేడా?* 

               🌷🌷🌷

ఒక గృహస్తుకు ఒకరోజు ఒక కోరిక కలిగింది, నిజానికి దేవుడున్నాడా లేడా తెలుసుకోవాలి అని, వెంటనే ఒక గురువును కలిసి తన కోరికను తెలియచెప్పి తన సందేహాన్ని తీర్చుమని అడిగాడు.


దానికి గురువు ఇప్పుడే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, నీవు సిద్దమేనా?" అని అడిగాడు.


దానికా వ్యక్తి " ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను.  ఇక మీరు ప్రారంభిచండి" అని వినయంగా చెప్పాడు.


వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు.  ఇపుడు గురువు, వచ్చిన వ్యక్తికి మధ్య  సంభాషణ ఇలా జరిగింది. 


*గు: ఈ గ్లాసులో ఏముంది?* 

*శి: మంచి నీరు.* 


గు: సరిగా చూసి చెప్పు కేవలం మంచి నీరేనా?


శి : అవును గురువు గారు కేవలం మంచి నీరే.


గు: అయితే ఒకసారి త్రాగి చెప్పు.


శిష్యుడు నీటిని త్రాగాక,

గు: ఇప్పుడు చెప్పు అది ఏ నీరు?


శి : గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు.


గు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?


శి : ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను.  కానీ ఇపుడు నీటిని త్రాగాను. నీటియందలి పంచదార రుచి  అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.


గు: అంటే అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపొేయావ్ అంతేనా?


శి: అవును.


గు : సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు.  అయితే ఆ నీటీలొ పంచదార చూపించు.


శి : అసాధ్యం గురువు గారూ.


గు : ఏం ఎందుకని?


శి: పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది.  దానిని వేరు చేసి చూపించలేం.


గు: అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో.


శిష్యుడు సరైన సమాధానాలే ఇచ్చాడు, కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు.  గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాధానాలు చెప్తూపోయాడు.

విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు.  అపుడు గురువు "చూడు నాయనా, నీవు నీటిని చూసి రుచి చూడకయే  ఏవిధంగానైతే కేవలం మంచినీరే అని పొర పాటు పడ్డావో, అదేవిధంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు.  కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు.


అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది.


 పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.   దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది.


 అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది.  మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు.


ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే , నీవు ఏ విధంగానైతే నీరంతా కరిగి పోయి, నీటితో కలసి పోయి ఉన్న పంచదారను  నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విధంగా ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపించలేం.

సృష్టిలోఉండే ప్రతీదీ భగవత్సరూపమే. 


జీవుని రూపంలో ఉండేది, ఆ భగవంతుడే.  రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు.  నీవు, నేను ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే.  కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ, విశ్వాసాలు కలిగి ఉండు.  వాడే నిన్ను ఉద్దరిస్తాడు." అని చెప్పగా శిష్యుడి ఆనందం అంబరాన్ని తాకింది.  తన సందేహం పటాపంచలై పోయింది. 


గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విధంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు. 


ఇది కథలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.


సైన్స్  అనేది కూడా ఒక విధమైన దైవిక సిద్ధాంతమే. శక్తిని సృష్టించలేం, నశింప జేయలేం అని సైన్స్ చెప్తుంది.


మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది?  ఇంకా మీరు సందేహిస్తే మీ ఇష్టం.

సేకరణ: వాట్సాప్.

రుణాల బాధ తొలగిపో వడానికి

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355 


*రుణాల బాధ తొలగిపో వడానికి ఒక చిన్న సాధన*.

 

స్వగృహంలో వివిధ రకాల వత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే వత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినవై ఉంటాయి. వివిధ రకాల వత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన వత్తులతో దీపారాధన చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం. 


అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగ గలదు,  అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది .జిల్లేడు నార వత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది . పసుపురంగు వస్త్రంతో దీపారాధన చేయడం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. అలాగే, తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు.. రుణాల బాధ తొలగిపోతుంది.


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.  

 *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

_plz forward the message_🌹

కన్నతల్లి

 కన్నతల్లి కడుపులోంచి బయటపడి, 

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, 

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు 

ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం పేరే 'నేను'

ఈ' నేను' ప్రాణశక్తి అయిన 

"ఊపిరి"కి మారుపేరు. 

ఊపిరి ఉన్నంతదాకా 'నేను' అనే భావన 

కొనసాగుతూనే ఉంటుంది. 

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో 

ఈ 'నేను'ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ 'నేను'లోంచే 'నాది'అనే భావన పుడుతుంది! 

ఈ 'నాది'లోంచి  

నావాళ్ళు, 

నాభార్య, 

నాపిల్లలు, 

నాకుటుంబం, 

నాఆస్తి, 

నాప్రతిభ, 

నాప్రజ్ఞ, 

నాగొప్ప... 

అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ 'నేను'అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, 

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, 

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి 'అహం'గా ప్రజ్వరిల్లుతుంది.

'అహం'అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో 

ఈ 'నేను' నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. 

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

పంతాలతో, పట్టింపులతో, 

పగలతో, ప్రతీకారాలతో 

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

బాల్య,కౌమార,యౌవన, వార్ధక్య దశలదాకా 

విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన 'నేను'అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం 

కట్టెలా మిగులుతుంది.

మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా 

పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన 'నేను' చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, 

మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

'నేనే 'శాసన కర్తను, 

'నేనే 'ఈ భూమండలానికి అధిపతిని, 

'నేనే'జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన 'నేను' లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.🙏

ఫ్రెండ్స్ ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన 'నేను' కథ 

అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే 

'నేను'గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది 'శ్మశానవైరాగ్యం' మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.  

'నేను' గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

'వైరాగ్యం 'అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.🙏

స్వర్గనరకాలు ఎక్కడో లేవు. 

మనలోనే ఉన్నాయి.

మనిషికి, ఆత్మదృష్టి నశించి 

బాహ్యదృష్టితో జీవించడమే నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం. 

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

నిజాయతీగా, నిస్వార్థంగా, 

సద్వర్తనతో, సచ్ఛీలతతో 

భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి

అంటే 'అన్నీ నేనే 'అనే స్థితి నుంచి 

'త్వమేవాహమ్‌'అంటే, 'నువ్వేనేను' అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత మరియు ఆ తండ్రి పరమాత్మ పాదాలచెంత కాసింత చోటికి మార్గం