1, జనవరి 2025, బుధవారం

ఏకాంతం-ఓ అద్భుత సాధనం

 🔱 ఏకాంతం-ఓ అద్భుత సాధనం🔱


🍁సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరితెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ, నిరాశానిస్పృహలు ఉండవు. ఓ ఆనందం, ఒక సింహావలోకనం ఉంటాయి. పునరాలోచన, అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు అంతర్వాహినులవుతాయి.


🍁యోగులకు, సాధకులకు ఈ ఏకాంతం ఎంతో అవసరమైంది, ముఖ్యమైంది. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలకి తాము చూడగలిగే యత్నం చేస్తారు. అప్పుడా స్థితిలో వారికి నిశ్చలత్వం, ఏకాగ్రచిత్తం, స్థితప్రజ్ఞత వస్తాయి. ఇదే సమాధిస్థితి అని పండితుల భావన. జీవితపు లోతుల్లోకి వెళ్లి దాని తత్వాన్ని, సత్యాలను చూసే, ప్రేమభావనను తెలుసుకునే దృష్టి ఏర్పడుతుంది.


🍁ఈ ఏకాంతం జీవిత అర్థ, పరమార్థాలను తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ఆదిశంకరులు బోధించిన 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనను అనుభవంలోకి తెచ్చేందుకు సహకరిస్తుంది. సత్వ సాధనకు, సత్యశోధనకు ఇది సుగమమైన మార్గం.


🍁ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాద ఎవరూ లేకుండా ఒక్కరూ ఉండటమే ఈ రెండింటిలో సామ్యం. అంతే. ఒంటరితనంలో చింత, ఏకాంతంలో చింతన. ఏకాంతమంటే లోచూపు. చేసిన పనులను, వాటి మంచి, చెడులను విశ్లేషించుకోవటం. నడకను, నడతను డేగచూపుతో పరిశీలించటం. అంతవరకు సాగిన జీవితాన్ని ఒక మదింపు వేసుకునే సందర్భం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశమిచ్చి, అందుకు మనల్ని సమాయత్తం చేస్తుంది.


🍁రచయిత కలం నుంచి వెలువడిన ఒక సృజనాత్మక రచన పాఠకులను అక్షరజగత్తులో విహరింపచేస్తుంది. కానీ ఆ అద్భుత సృష్టి జరిగే వేళ ఆ రచయిత ఒంటరే. ఒక ఏకాంత సమయంలో ఎంతో అంతర్మథనానంతరమే రచన పుడుతుంది. ఈ ఒంటరితనం రచయిత కావాలనుకున్నదే. ప్రజల బాహ్యదృష్టిలో ఒంటరిగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. కానీ అతడు తన ఆలోచనలతో, తన ఊహల సమూహంలో ఉంటాడు.


🍁ఏకాంతమంటే ప్రకృతిలో విహారం, నచ్చిన సంగీతాన్ని వినటం, పుస్తక పఠనం, ధ్యానం ఇలా ఎన్నెన్నో భావనలు. అది ఒంటరితనమే కానక్కరలేదు. సామూహికం కావచ్చు. జీవితపు ఉరుకుల, పరుగులలో తన కుటుంబసభ్యులతో, ఆత్మీయులతో, సంభావ సమయమే చిక్కదు. అప్పుడు వారితో మాత్రమే గడపటం కూడా ఏకాంతమే. ఏకాంతం కలత చెందిన మనసులను తేట పరుస్తుంది.


🍁భగవంతుణ్ని ప్రార్ధించే వేళ ఈ ఏకాంతం భక్తుల దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మనో నైర్మల్యాన్నిస్తుంది. సర్వోపగతుడైన ఆయనను మనోసీమలలో దర్శించేందుకు ఏకాంతం అద్భుత సాధనం. అంతర్ముఖచిత్తులమై ఆ దేవదేవుని చింతనకు, సృష్టిలోని అణువణువున ఆయన రూపాన్ని కాంచటానికి ఏకాంతం ఎంతగానో తోడ్పడుతుంది. మౌనస్థితిలో లౌకికానందాలను వీడుతూ, అ విశ్వరూప భావనను అవగతం చేసుకుంటాం. అసలైన ప్రేమ అనుభవైకవేద్యమవుతుంది. అది గొప్ప ఆనందయోగం. అదే బ్రహ్మానందస్థితి. అదే దైవం. ఏకాంతానికున్న శక్తి అటువంటిది.🙏

⚜️⚜️🌷🌷🌷🌷🌷🌷⚜️⚜️

శ్రీ రామ జయ రామ జయజయ రామ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Panchang

 


మొగిలిచెర్ల అవధూత

 శ్రీ దత్త ప్రసాదం - 18 – మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయా స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్న వ్యాసాశ్రమంలో శ్రీ స్వామివారి సహాధ్యాయి


2004 వసంవత్సరం మహాశివరాత్రి మరో పదిరోజులు ఉన్నదనగా...నేనూ మా సిబ్బంది మహాశివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఉన్నాము..మధ్యాహ్నం నైవేద్యం హారతి కాగానే అర్చకస్వాములు మందిరం తలుపులు మూసేసి భోజనానికి వెళ్లిపోయారు..నేనొక్కడినే మందిరం లో కూర్చుని వున్నాను..ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకరు లోపలికి వచ్చారు..

బావి వద్దకు వెళ్లి, బకెట్ తో నీళ్లు తోడుకొని..కొన్ని నీళ్లు దోసిలి లోకి తీసుకొని నెత్తిన చల్లుకున్నారు..మరికొన్ని నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు..అక్కడినుంచి నేరుగా ప్రధాన మంటపం లోకి వచ్చి, శ్రీ స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిలుచున్నారు..వారిని గమనిస్తూ ఉన్న నేను..వారి వద్దకు వెళ్లి..

"స్వామీ..ఇలా తిరిగి రండి..ఈ గర్భాలయపు మంటపం లో కూర్చోండి..అర్చకులను పిలిపిస్తాను..శ్రీ స్వామివారి మందిరం తలుపులు తీస్తారు..మీరు స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అన్నాను..


నా వైపు సాలోచనగా చూసి..తలవూపి..నా వెనుకే వచ్చి..సమాధి మందిరపు మంటపం లో నిలుచున్నారు..అర్చకస్వామి ని పిలువమని మనిషి చేత చెప్పి పంపించి.."స్వామీ మీరెక్కడినుంచి వస్తున్నారు.."? అని అడిగాను.."హృషీకేష్ నుంచి"..అన్నారు..ఆయన వాలకం చూస్తుంటే ముభావంగా వున్నారు..ఏ ప్రశ్న అడిగినా ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నారు..చివరగా "భోజనం చేసారా..ఇక్కడ ఏర్పాటు చేయమంటారా?.." అన్నాను.."ఈరోజు మేము ఆహారం తీసుకోము..మీ భాషలో చెప్పాలంటే..ఉపవాసం.." అన్నారు..ఇక నేను ప్రశ్నలు వేయదల్చుకోలేదు..కొద్దిసేపటికే పూజారి గారు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి మందిరపు తలుపులు తీశారు."మీరు వెళ్లి సమాధి దర్శనం చేసుకోండి.." అన్నాను..


దానికి అంగీకారంగా తలవూపి..సమాధి మందిరం గడప ఇవతల నిలబడి నమస్కారం చేసుకున్నారు..ముందుకు వంగి ఆ గడపకూ నమస్కారం చేశారు..మెల్లిగా కుడిపాదం లోపలికి పెట్టి..సమాధి వద్దకు వెళ్లారు..నేను ప్రక్కకు వచ్చేసాను..సమాధి వద్ద సుమారు పదిహేను నిమిషాల పాటు వున్నారు..



సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చి..మళ్లీ గడప దగ్గర నిలబడి మరొక్కసారి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి..ప్రక్కనే ఉన్న చాపమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..కొద్దిగా అవతల వైపు నేను కూర్చున్నాను..నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.."నువ్వూ...?" అంటూ సందేహంగా అడిగారు..

నా పేరు చెప్పి..నేను శ్రీధరరావు ప్రభావతి గార్ల కుమారుడిని..అని చెప్పాను..ప్రస్తుతం ఈ మందిరం నిర్వహణ చూస్తున్నాను అనికూడా చెప్పాను..


అలాగా అన్నట్లు తలవూపి..నా దగ్గరగా జరిగి, నా ప్రక్కనే కూర్చుని.."ఈ స్వామివారు, నేనూ వ్యాసాశ్రమం లో ఒకే సమయం లో ఉన్నాము..సాధనా పద్ధతుల గురించి..మోక్షప్రాప్తి గురించి..అక్కడ మాకు బోధ జరిగేది..ఈయన చాలా చురుకుగా ఉండేవారు..గురువుగారు చేసిన బోధ లోని మర్మాలను ఇట్టే పసికట్టేవాడు..మళ్లీ మాకందరికీ విపులంగా చెప్పేవాడు..చక్కటి కంఠస్వరం..మా కందరికీ ఆశ్చర్యం గా ఉండేది..ఎటువంటి విషయమైనా ఒక్కసారి వింటే చాలు..తిరిగి యధాతధంగా అప్పచెప్పేవాడు..ఒకానొక సందర్భం లో ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా నియమిస్తే బాగుండునని మేమందరమూ తలపోసాము..ఆ మాటే చెప్పాము కూడా..ససేమిరా వద్దన్నాడు.."నేను ఆశ్రమ నిర్వహణ చేయను..చేయలేను..నాకు అతి త్వరగా మోక్షం కావాలి..నా సాధన అంతా అందుకొరకే"..అని తేల్చి చెప్పేసాడు..మహానుభావుడు..తన లక్ష్యం ఏమిటో చక్కగా తెలిసిన వాడు..అందుకనుగుణంగా తన జీవితాన్ని మలచుకున్నాడు.." అన్నారు..


"స్వామీ మీ పేరేమిటి..? ప్రస్తుతం మీరెక్కడ వుంటున్నారు..? స్వామివారి గురించి మరింత వివరంగా చెప్పగలరా..? " అన్నాను.."నేను ప్రస్తుతం హృషీకేశ్ లో ఒక ఆశ్రమం లో ఉంటున్నాను..వ్యాసాశ్రమం లో ఈ స్వామివారు గడిపింది చాలా కొద్దికాలమే..బహుశా రెండేళ్ల కాలం కాబోలు..మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో ఒకటి రెండుసార్లు కలిశాను..సిద్ధిపొందిన తరువాత ఒక్కసారి వచ్చి వెళ్ళాను..మళ్లీ ఇదే రావడం..ఈ స్వామివారికి కొంతకాలం సహాధ్యాయిగా ఉన్నానని ఒక తృప్తి ఉంది..మాలాంటి వారికి మార్గదర్శనం చేసాడు..సాధకుడి నడవడిక ఎలా ఉండాలో ఆచరించి చూపాడు..మళ్లీ ప్రాప్తం ఉంటే..మరోసారి వస్తాను..సాయంత్రం దాకా ఇక్కడ ధ్యానం చేసుకొని..రాత్రికి ఇక్కడే బస చేసి..రేపుదయం బయలుదేరి వెళ్లిపోతాను.." అన్నారు..వారికి అవసరమైన ఏర్పాట్లు చేసాను..తెల్లవారి మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్లిపోయారు..


స్వామివారి గురించి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి..


సర్వం..

దత్తకృప! 

రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్


(మందిర వివరముల కొరకు :

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


----

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 



-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :




---

మేష రాశి నుండి మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు 2025*

 *మేష రాశి నుండి మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు 2025* 💐

🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼🌷🪷🌼                                 

 *ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు....*                                    

*ఆంగ్ల సంవత్సర రాశిఫలాలు - 2025*





*మేషరాశి:-*


ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కలుగును. ఏలినాటి శనీశ్వర దోష ప్రభావము తృతీయ స్థానములో గురు ప్రభావం వలన సోదరులు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయము కలుగును. చేపట్టిన పనులలో కార్యా ఆటంకములు కష్టం మీద వివాహ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు ధన నష్టము తప్పదు. ఋణ బాధలు కొంత బాదించును. విద్యార్థులకు మరింత కష్టపడాలి. స్త్రీలకు సామాన్య ఫలితములు కలుగును. ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును. విమర్శలు, అవమానాలు పెరుగును. గొడవలకు దూరంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగించును. భక్తి కార్యక్రమాలలో పాల్గొందురు. అవసరానికి ఒక్కొక్క సమయంలో ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా పొందుదురు. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి కష్ట సమయం. సినీ, మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు తప్పవు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు, మానసిక ఆందోళనలు కలుగును.


జనవరి :-ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబములో వివాదములు. సంతానం విషయంలో సమస్యలు. లాభము ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగా ఉండును. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన మార్పులు ఉంటాయి. మీ సలహాలు ఇతరులకు పని చేస్తాయి. కళాత్రమునకు అనారోగ్య సమస్యలు.


ఫిబ్రవరి :-ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. దేవాలయ దర్శనం వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే. 


మార్చి :-ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ప్రయాణ సూచనలు. వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూల ఫలితాలు. శత్రువుల నుండి కొంత ఒత్తిడి ఉన్న బయటకు రాగలుగుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభకార్యములకు ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొనుట మంచిది. 


ఏప్రిల్ :-ఈ మాసము అంత అనుకూలంగా లేదు. కుటుంబ పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఆ బడి పై దృష్టి సారించాలి.


మే :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కలసి వచ్చును. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.


జూన్:- ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కొంత కలిసి వస్తాయి. అతి కష్టం మీద గాని కొన్ని పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.


జూలై:-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఊహించని ప్రమోషన్లు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులకు నూతన వ్యాపార విషయాలలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.


ఆగస్టు:- ఈ మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనపరంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది.


సెప్టెంబర్ :-ఈ మాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం ఉంది. కొన్ని విషయాలలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.


అక్టోబర్ :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. పట్టిన పనులలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.


నవంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు చేదాడుతాయి. శత్రు సమస్యలు. జ్వరాది అనారోగ్య సమస్యలు. వ్యాపార పరంగా గందరగోళ పరిస్థితి. భాగస్వామ్య వ్యాపారాలలో కలహ సూచనలు.


డిసెంబర్ :-ఈ మాసం అంత అనుకూలంగా లేదు. స్త్రీ మూలక కలహములు వ్యాపారమూలకంగా ధన నష్టములు. కొన్ని వ్యవహారాలలో సోదర సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రు సమస్యలు. ప్రయాణమునందు జాగ్రత్త అవసరం.


*పరిహారం:- శనీశ్వర స్వామికి తైలాభిషేకము నల్ల నువ్వులు 1 ¼ kg దానము. గురువారం 1 ¼ kg శనగలు దానం. గురువారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి.*


*వృషభ రాశి :-*


ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కలుగును.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. విమర్శలు ఉన్నప్పటికీ అదిగమించి ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహ లాభము, వస్తు లాభము కలుగును. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నవి. స్త్రీలకు విశేషమైన ధనలాభము, వస్తులాభము కలుగును. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ తొందరగా ఉపశమనం పొందుతారు. విదేశీ ప్రయాణములు కలశసి వస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారస్తులు విశేషమైన లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలం. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కలసి వచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. వ్యవసాయాలు విశేషంగా లాభదాయకంగా ఉండును. 


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన పనులు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఖర్చులు అధికం. కొన్ని వ్యవహారలలో మిత్రుల సహకారముంటుంది. దైవదర్శనములు చేస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు కలసివస్తాయి.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనం. సంతాన ఆరోగ్యపరంగా సమస్యలు. మాసం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యములు మూలక ధన వ్యయం, వ్యాపారపరంగా ధననష్టములు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలహములు ఉంటాయి. ఇతరులతో జాగ్రత్త అవసరం. కోపం వలన సమస్యలు వస్తాయి.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమముగా ఉన్నది. చేసే ప్రతి పనియందు కలసివచ్చును. విదేశీ ప్రయాణం ప్రయత్నములు ఫలించును. మాటవిషయంలో తొందరపాటు వివాద సూచనలున్నాయి. కొన్ని వ్యవహారములు స్వయంగా చూసుకొనుట మంచిది. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. 


మే :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. నూతన వ్యాపారములలో విశేష లాభాలు పొందుతారు. మానసిక ఆనందము విలువైన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. స్త్రీమూలక ధన వ్యయం.నూతన రుణాలు చేస్తారు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాసం చివరన చేపట్టిన పనులు కలసిరావు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. 


జూలై :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులందు జాప్యం తప్పదు. దూర ప్రయాణాలయందు ఆటంకములు. ఇతరులతో ఆచితూచి మాట్లాడటం మంచిది. ధన వ్యవహారములు కలసివచ్చును. వృత్తి వ్యాపారాలలో ప్రత్యర్థుల వలన సమస్యలు వస్తాయి.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనియందు అధిక శ్రమ ఉన్నపటికీ పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారములు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యముండును. గృహమున మార్పులు ఉంటాయి.


సెప్టెంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. పాత మిత్రులను కలుస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణములలో స్వల్ప మార్పులు వస్తాయి. బందు మిత్రుల నుండి ఆహ్వానాలు ఆనంద పరుస్తాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. మిత్రుల నుండి శుభవార్త వింటారు. ధన సౌఖ్యం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణములు కలసివస్తాయి. కొన్ని విషయాలలో ఆచి తూచి వ్యవహారించాలి. కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు.


నవంబర్ :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణములు వాయిదా పడుతాయి. ఉద్యోగ పరంగా గుర్తింపు తగ్గును. వ్యాపారస్తులకు సామాన్యం ఫలితాలుంటాయి. పెద్దలతో ఆచితూచి మాట్లాడాలి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులు త్వరిత గతిన పూర్తి చేస్తారు. ధనము, గౌరవము పెరుగును. విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలసివస్తాయి.


*పరిహారం:-ఈ రాశి వారు నిత్యం లక్ష్మి ఆరాధనా చెయ్యాలి. కనకదారాస్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.సంవత్సరం ప్రారంభంలో గురువారం రుద్రాభిషేకం శనగలు గురువారం దానంగా ఇవ్వాలి.*


*మిథున రాశి*


జన్మగురుని ప్రభావంచేత పనుల యందు ఆటంకములు, సమస్యలు పెరుగును. వృత్తి ఉద్యోగమున స్థానచలనములు, వ్యాపారమునందు ఒత్తిళ్ళు అధికము. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది. ఇష్ట దేవతరాధన చెయ్యడం మంచిది. ఇంట బయట కలహములు అధికమగును. రాహు కేతువుల ప్రభావంచేత కుటుంబమునందు కలహములు ఏర్పడును. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును.


విద్యార్థులకు అధిక ఒత్తిడి తప్పదు . స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. వ్యవసాయమున కష్టమునకు తగిన ఫలితం ఉండదు. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు ఒత్తిడి పెరుగును. రుణభారము అధికమగును. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలీ. కోర్టు కేసు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. జన్మ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. 


జనవరి:ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, కొన్ని వ్యవహారముల నందు భయం. నూతన పరిచయల వలన లాభము. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకత తప్పదు. మాసం చివరలో అనుకూలత. స్త్రీమూలక ధనవ్యయము.


ఫిబ్రవరి :ఈ మాసం మీకు మిశ్రమముగా ఉన్నది. బంధువర్గంతో వివాదములు ఉంటాయి. శుభకార్యాలు మూలక ధనవ్యయము. పాత మిత్రుల సహాయము వలన కొంత ఊరట. విదేశీ ప్రయాణ ప్రయత్నం లాభము. ఆర్థికముగా కొంత అనుకూలము.


మార్చి :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించును. ఖర్చులు చేదాటుతాయి. మాసం చివరన శుభవార్తలు వింటారు. బందు మిత్ర సమాగం ఆనందం కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేస్తారు.


ఏప్రిల్ :ఈ మాసంలో అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సంఘములో పెద్దలతో పరిచయాలుంటాయి. నూతన గృహ ప్రయత్నములు కలసివస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకం ఉంటాయి. 


మే :ఈ మాసం అనుకూలంగా లేదు. జ్వరాది అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ వివాదాలతో మానసిక ఆందోళనలు తప్పవు. భార్య వలన సౌఖ్యం గృహమున శుభ కార్యములు చేయుదురు. ఆలయ దర్శనం చేస్తారు. ఆకారణంగా వివాదాలు తప్పవు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. నూతన పరిచయాలు వలన సమస్యలు అతి కష్టం మీద కాని పనులు పూర్తికావు. వృత్తిపరంగా చిక్కులు ఉంటాయి. కోర్టు వ్యవహారములు వాయిదాలుపడతాయి. ఉద్యోగ స్థాన మార్పులు కలుగుతాయి.


జూలై :ఈ మాసం మిశ్రమ ఫలితములు ఉన్నవి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అగును. ఇతరులకు సహాయపడతారు. విపరీతమైన ఖర్చులు ఉంటాయి.


ఆగస్టు :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ గౌరవం పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తగును. ధనయోగం ఉన్నది.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులందు కార్యములు ఫలించును. చిన్నపాటి కలహములు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు వలన నష్టములు తప్పవు. నూతన రుణాలు చెయ్యవలసి రావచ్చు.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. అధిక ధన వ్యయము కలుగును. బందు మిత్రులతో విరోధములు, ఉద్యోగమున అపవాదులు అధికం. ఇతరుల వ్యవహారములలో కలగచేసుకొని ఇబ్బదులు పడతారు. నూతన వ్యాపారం గూర్చి ఆలోచనలు చేస్తారు.


నవంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సఖ్యత. నూతన వస్త్ర లాభముంటుంది. భూ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారముంటుంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి. గృహ నిర్మాణమునకు ఆటంకములు కలుగుతాయి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్య ఆటంకములు కలుగును. స్నేహితులతో కలహాములు కలుగుతాయి, దూర ప్రయాణములు వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.


*పరిహారం:-దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యాలి. గురువారం శివాలయంలో అభిషేకం చేయించాలి ప్రతి నెల శనగలను ఆవుకు గురువారం దాణాగా పెట్టాలి.*


*కర్కాటక రాశి*

ఈ రాశి వారికి అష్టమ స్థానం శని వలన ఖర్చులు అధికమగును. వ్యక్తిగత కుటుంబ కలహాములు దూరప్రయాణ మూలక ఖర్చులు. కొన్ని వ్యవహారములలో తొందరపాటు నిర్ణయాలు, గొడవలు అధికమగును. ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనుల యందు చికాకులు అధికమగును. ఇంట బయట శాంతముగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు మిశ్రమ ఫలితములున్నవి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద కలసివచ్చును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు పెరుగును. వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు. అన్ని రంగాల వారికి కష్టం మీద కానీ పనులు పూర్తి కావు. రాజకీయ నాయకులకు కష్టకాలం. కోర్టు వ్యవహారాలయందు జాగ్రత్త అవసరం. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. 


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిలిచిన పనులు అప్రయత్నంగా పూర్తగును. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. గృహమున శుభకార్య ఆటంకములు కలుగును. నూతన పరిచయములు, ఉద్యోగమున అధికారులతో విరోధాలు, పని ఒత్తిడి పెరుగును. 


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కొన్ని వ్యవహారములో ఊహించని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయం ఫలించును. నూతన వాహన లాభం కలుగును. కొన్ని వ్యవహారములు కష్టం మీద ఫలించును. 


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పరిచయములు పెరుగుతాయి. గృహమున శుభాకార్యములు. కొన్ని వివాదములు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్య అనుకూలత కలుగును. కుటుంబ సభ్యులతో కలసి వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. సంతానం గూర్చి ఆలోచనలు కొంత చికాకు పరుస్తాయి. మానసిక సమస్యలు భాదిస్తాయి.


మే :-ఈ మాసం అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు బందు వర్గంతో స్వల్ప సమస్యలు. ధన ఋణ భయము కలుగును. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న ఆటంకాలు ఏర్పడును. కుటుంబ కలహాములు వ్యాపార వ్యవహారములలో నష్టములు కలుగును. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అధికముగా నష్టములు తప్పవు.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభాకార్యములు వలన ధనము ఖర్చు చేయుదురు. కోర్టు వ్యవహారములు కలసివచ్చును. వృత్తి వ్యాపారమున ప్రయత్నించిన కార్యములు ఫలించును. మాసం చివరన బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు వచ్చును. అనారోగ్య సమస్యలుంటాయి.


ఆగస్టు :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలు తప్పవు. వ్యాపారస్తులకు కష్టం అధికం లాభం తక్కువ. దేవాలయ సందర్శన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణమున జాగ్రత్త అవసరం. 


సెప్టెంబర్ :ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధన లాభం ఉండును. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాలలో కలసివచ్చును మాసం చివరన మానసిక ఆందోళనలు. ధన వ్యయము కలుగును.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపారములో నష్ట సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరుగును. కుటుంబ సభ్యులతో వైరములు ఉండును. ఉద్యోగమున అధికారుల వలన స్థానమార్పులు. చేపట్టిన పనులలో ఆటంకములు ఏర్పడును. మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి.


నవంబర్ :ఈ మాసంలో అనుకూలంగా లేదు. నూతన వ్యాపార ప్రారంభ మూలక నష్టములు కలుగును. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని వ్యవహారములలో మధ్యవర్తిత్వము వ్యవహరించుట మంచిది కాదు. కోర్టు విషయములలో జాప్యం కలుగును. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. 


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన భూమి, గృహ క్రయ లాభం. నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార మూలక లాభం వస్తుంది. మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.


*పరిహారం:-శనిశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. ప్రతి మంగళవారం వినాయకునికి సిందూరం గరికి గడ్డి సమర్పించాలి.*


*సింహ రాశి*


జన్మ స్థాన కేతు, అష్టమ శని దోషం వలన ఈ సంవత్సరం కష్ట కాలంగా ఉంటుంది. కానీ లాభం స్థానం గురుని వలన సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యహరించడం మంచిది. రాజకీయ నాయకులకు తొందరపాటు నిర్ణయాలు వలన నష్టం తప్పదు. కోర్టు వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యవసాయా రంగం వారికి కష్టం తప్ప లాభం ఉండదు. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రాహు కేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమగును. కీలక వ్యవహారముల నందు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. 


జనవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు. వ్యాపార మూలక ధన నష్టాలు ఉంటాయి. వృధా ప్రయాణ ఖర్చులు. నూతన ఋణ ప్రయత్నములు చేస్తారు. కుటుంబ కలహాములు కలవు. స్థానమార్పులు ఉంటాయి.


ఫిబ్రవరి:ఈ మాసం అనుకూలంగా లేదు. బంధు వర్గంతో వివాదములు. మనో ధైర్యంతో కొన్ని పనులు. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనములు చేస్తారు. కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆదాయం అంతగా ఉండదు.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు కొంత కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. మానశికానందము లభిస్తుంది. 


మే :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. గృహమున శుభకార్యాల నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభములు ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన సౌఖ్యం. ఉద్యోగమున అధికారులతో ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు చేదాటుతాయి.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు అధికష్టం మీద గాని పూర్తి అవుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి.


జూలై :ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. ఇతరుల నుండి ఊహించిన విమర్శలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. శుభకార్య ఆటంకములు కలుగుతాయి. 


ఆగస్టు :ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన పరిచయాలు కలసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. చిన్నపాటి వివాదాలు తప్పవు. 


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నూతన వ్యాపార ప్రయత్నాలు కొంత లాభసాటుగా సాగుతాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధు వర్గం నుండి విమర్శలు పలితాలు ఉంటాయి. అకారణ ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. క్రయ విక్రయ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు సామాన్యంగా సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ కలహములు. శుభకార్య ఆటంకాలు వస్తాయి. బంధు వర్గ వివాదములు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో ఊహించని నష్టాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలలో జాప్యం తప్పదు.


*పరిహారం:-శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించాలి. నల్ల నువ్వులు 1 ¼ kg దానంగా ఇవ్వాలి. నిత్యం గణపతి స్తోత్రం, అర్జున దుర్గా స్తోత్రం పారాయణం చేయ్యాలి.*


*కన్యా రాశి*


 ఈ రాశివారికి ఉద్యోగస్తులకు ఉన్నతి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఆదాయ వృద్ధి. గృహమున శుభకార్యమూలక లాభము. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఋణ బాధలు నివృత్తి పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాలవారికి కలసివచ్చును. వ్యాపారస్తులకు విశేషమైన లాభములు కలుగును. వ్యవసాయ రంగం వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రు సమస్యలు కొంత సర్దుమణుగుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము ఆరోగ్య లాభము కలుగుతుంది. క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాట్టుగా సాగుతాయి. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి. గృహ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభసటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవసాయ సంబంధిత పనులలో అనుకోని లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.


ఏప్రిల్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమయానికి నిద్రాహారాలు ఉండకపోవచ్చు. వ్యాపారాలలో నష్టాలు తప్పవు.


మే :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ధనమును ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయాలలో జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


జూలై:- ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో బేదాభిప్రాయాలు కలుగుతాయి. ధన రుణ సమస్యలు బాధిస్తాయి 


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. పనులందు కార్యాటంకములు. కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.


అక్టోబర్ :ఈ మాసంలో అనుకూలంగా లేదు. ఇతరులతో అకారణ విభేదాలు. శుభకార్య మూలక ఆటంకములు జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు వర్గ వివాదములు ఉంటాయి. దూర ప్రయాణంలో జాగ్రత్త అవసరం.


నవంబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. స్త్రీ మూలక ధన వ్యయము. ఇంట బయట విమర్శలు తప్పవు. ఉద్యోగ వ్యాపార మూలక నష్టములు కలవు. వృధా ప్రయాణములు జ్వరాది అనారోగ్యములు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.


డిసెంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు. వ్యాపార మూలక నష్టములు ఉంటాయి. అనారోగ్య సమస్యలు స్థానచలనములు ఉన్నాయి. ధన నష్టములు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


*పరిహారం:-ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం.ఆదివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి.నిత్యం గృహమున లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.*


*తుల రాశి ఆదాయం*


 బాగుంటుంది ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. ఆరోగ్య లాభము కుటుంబమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభములు చేస్తరు. పెట్టుబడులు కలిసి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ వర్గాల వారు పదోన్నతులు పొందుతారు.


జనవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. ధన వ్యయము కుటుంబ కలహములు. కోర్టు వ్యవహారాలలో జాప్యము. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వస్త్రభరణాలు కొనుగోలు చేస్తారు.


మార్చి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అధికారులు సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వాహన ప్రయాణమును జాగ్రత్త అవసరం.


ఏప్రిల్ :ఈమాసం అనుకూలంగా లేదు. ఉద్యోగము స్థానచలనములు. వృధా ఖర్చులు. క్రయ విక్రయాల విషయంలో తొందరపాటు మంచిది కాదు. దూరపు బంధాల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.


మే :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు చక్కగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.


జూన్ :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. సంతాన విద్య విషయాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. స్వల్పన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.


జూలై :ఈ మాసంలో మిశ్రమంగా ఉన్నది. పాత మిత్రులతో ఆనందముగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయమునకు మించిన ఖర్చులు పెరుగుతాయి. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు.


ఆగస్టు :ఈ మాసం అన్ని విధాలుగా కలసివచ్చును. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు కలసి వస్తాయి. శుభకార్య మూలక లాభములు పొందుతారు.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్వల్పన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఉంటా బయట వివాదాలు చికాకు పరుస్తాయి. అధికారుల వలన ఉద్యోగం ఉన్న స్థానచలానాలు కలుగుతాయి. పాత మిత్రుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. సోదరులతో అకారణం కలహములు జ్వరాది అనారోగ్యములు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది.


*పరిహారం:-నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి. గురువారం 1 ¼ kg శనగలు దానంగా ఇవ్వాలి.*


*వృశ్చిక రాశి*


వృధా ఖర్చులు అధికమగును. వృశ్చిక రాశికి పంచమ స్థానములో. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మానసిక సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కాని పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిడి ఉన్న అధికమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉన్నది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు లావు సాటిగా ఉన్నప్పటికీ నూతన పెట్టుబదుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గురుబలం తక్కువగా ఉండటం వల్ల అన్ని వ్యవహారలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.


జనవరి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం సమానంగా ఉన్నాయి. పాత మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది.


ఫిబ్రవరి :ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారములలో జాగ్రత్త అవసరం. శుభకార్యాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన ఉద్యోగం అవకాశములు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభమున్నది. విలువైన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కీలక విషయాలలో కుటుంబ పెద్దలతో సంప్రదింపులు చేయుట ఉత్తమం.


ఏప్రిల్ : ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు అధికామౌతాయి. మైఖ్యమైన పనులందు కార్య ఆటంకములు కలుగును. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.


మే :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. భూ క్రయ విక్రయాలు కలసివస్తాయి. పనులందు కార్య లాభం. ప్రయాణాలు కలసివచ్చును. చేపట్టిన వ్యవహారములు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు పనులు అనుకూలించును. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


జూన్ : ఈ మాసం అంత అనుకూలంగా లేదు. చిన్ననాటి మిత్రులతో విరోధములు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. శత్రు సమస్యలు బాధిస్తాయి. పనులలో ఆటంకములు నిరుత్సాహపరుస్తాయి. క్రయ విక్రయాలు వాయిదా వెయ్యడం మంచిది.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలసుకుంటారు. శుభాకార్య విషయమై చర్చలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యం పెద్దవారితో సంప్రదింపులు కలసివస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకములు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారపరంగా ఆటంకాలు. ధన నష్టములు, విమర్శలు. స్థానమార్పులు జ్వరాది అనారోగ్యములు. స్త్రీ మూలక కలహాములు స్నేహితుల సహాయ సహకారములతో చాలా పనులు పూర్తి చేస్తారు.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులందు కార్యజయములు. ఉద్యోగమున అధికార మూలక లాభములు కలుగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వ్యవహారలలో అందరి సహకారం ఉంటుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.


అక్టోబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. చిన్నపాటి శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంనందు తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. విద్యార్థులు మరింత కష్టపడాలి. కోర్టు వ్యవహారములు మందగిస్తాయి.


నవంబర్ : ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. శత్రుభయము. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగమున పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు.


డిసెంబర్:ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు వేదిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వృథా ప్రయాణాలు తప్పవు. కోర్టు వ్యవహార సమస్యలు బాధిస్తాయి. వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. అనారోగ్య సూచనలున్నవి.


*పరిహారం:-శనివారం 1 ¼ kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యాలి.*


*ధనుస్సు రాశి* 


నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. స్త్రీలకు కుటుంబములో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఉండవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితములు ఉండును కుటుంబ సంబంధమైన చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. అన్ని రంగాల వారికి ఒత్తిళ్ళు అధికము. వ్యవసాయ రంగం వారికి శుభ ఫలితాలు ఉండును.


జనవరి :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వచ్చును. బంధుమిత్రులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది.


ఫిబ్రవరి:-ఈ మాసం అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదల విషయంలో లోటుపాట్లు ఉంటాయి.జ్వరాది అనారోగ్య సమస్యలు కొంత భాగిస్తాయి. కొన్ని వ్యవహారాలు మానసిక ఆందోళనలు కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.


మార్చి :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు చేదాటుతాయి. గృహమున ఆకస్మిక మార్పులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో ఊహించని కలహ సూచనలు ఉన్నవి. 


ఏప్రిల్ :-ఈ మాసం అంత అనుకూలంగా లేదు. సంతాన విద్య విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.


మే :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. దైవారాధన చేయటం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.


జూన్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో జాప్యం తప్పదు. మానసిక ఆందోళనలు కొంత బాధిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. శుభకార్య సంబంధిత ఖర్చులు పెరుగుతాయి.


జూలై :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. రాస్తే కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు వస్తాయి. గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.


ఆగస్టు :-ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. శత్రు సంబంధ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి.


సెప్టెంబర్ :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో అకారణ కలహములు. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. మాసం చివరన ధనాధాయం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు.


అక్టోబర్ :-ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంతో అన్ని పనులను పూర్తిచేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. నూతన పరిచయాలు కొంత కలసి వస్తాయి. కుటుంబ పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు.


నవంబర్ :-ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం వృద్ధి అగును. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తు ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధికం.


డిసెంబర్ :-ఈ మాసం అనుకూలంగా లేదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు వలన వివాదాలు తప్పవు. గౌరవ మర్యాదలు కొంత క్షీనత కలుగుతుంది. సంతాన విద్య విషయాలలో మరింత జాగ్రత్త వహించాలి.


*పరిహారం:-శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యాలి. 1 ¼ kg నల్ల నువ్వులను దానం ఇవ్వండి. గురు శివాలయంలో ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించాలి. నిత్యం పంచాంక్షారీ జపం చెయ్యాలి.*


*మకరరాశి*


ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు అధిక ప్రయత్నం మీద పదోన్నతలు పొందుతారు. అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన మార్పులు చేస్తారు. శత్రు సమస్యలు మరింత బాధిస్తాయి. అయినప్పటికీ కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధన సంబంధిత వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సి రావచ్చు. స్త్రీలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. రాజకీయ వర్గం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయపరంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వస్తాయి. విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంట బయట మీ మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


ఫిబ్రవరి :ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇతరులు మాటను నమ్మి మోసపోవడం జరగవచ్చు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. నూతన రుణ ప్రయత్నాలు చేసి విసుగు చెందుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. జ్వరాది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


మార్చి :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.


ఏప్రిల్ :- ఈ మాసం అనుకూలంగా లేదు. ఉంటా బయట ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి, ఉద్యోగాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలను నిరుత్సాహపరుస్తాయి.


మే :ఈ మాసం అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.


జూన్ :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.


జూలై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు పలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు సంబంధమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


ఆగస్టు :ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవారాధన చేయటం మంచిది.


సెప్టెంబర్ :ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. ధనధాన్య నష్టములు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ కలహ సూచనలు. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.


అక్టోబర్ :ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనాలు. ముఖ్యమైన పనులు మరింత కష్టపడితే గాని పూర్తిగావు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన పరిచయాలు కొంత అనుకూల ఫలితాలు ఇస్తాయి.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల మధ్య అకారణ కలహాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది. 


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి . రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ధనధాన్య నష్ట సూచనలు. మానసిక ఒత్తిడిలు పెరుగుతాయి . సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరూత్సాహపరుస్తాయి.


*పరిహారం:-నిత్యం అర్జునకృత దుర్గాస్తోత్రం, గణపతి అష్టకం పారాయణం చెయ్యాలి. శనివారం 1 1/4 kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి.*


*కుంభరాశి*


ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట బయట సమస్యలు అధికముగా ఉండును. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము నందు ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు. రాజకీయ రంగం వారికి ఒత్తిడి అధికం. విద్యార్థుల ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలున్నాయి. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది. వ్యవసాయ రంగం వారికి అధిక కష్టం అల్ప ఫలితం పొందుతారు.


జనవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. నూతన వ్యాపారములు కలసివచ్చును. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. నూతన రుణాలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.


ఫిబ్రవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆదాయం పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగమున అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు.


మార్చి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన పరిచయములు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారముల లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారలలో విజయం సాధిస్తారు.


ఏప్రిల్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగకాశములు పెరుగుతాయి. గృహమున దైవకార్యములు చేస్తారు. కీలక సమయంలో స్నేహితుల సహాయ సహకారములు అందిస్తారు. దూర ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలు వాయిదా వెయ్యడం మంచిది.


మే :ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున స్థానమార్పులు ఉంటాయి.


జూన్ :ఈ మాసం అనుకూలత లేదు. మానసిక ఆందోళనలనుగా ఉంటుంది. స్త్రీ మూలక కలహాములు. పనులందు ఆటంకములు కలుగును. ధన వ్యయము శుభాకార్య ఆటంకములు ఉండును. ఇతరుల వలన సమస్యలు తప్పవు. వృత్తి ఉద్యోగములలో ఆందోళనలు కలుగుతాయి.


జులై :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలనాలు ఉన్నయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారపరంగా మందకోడిగా సాగుతాయి.


సెప్టెంబర్ : ఈ మాసం అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనుసమస్యలు ఉన్నాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆందోళనలు చికాకు పరుస్తాయి.


అక్టోబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారపరంగా కలసివచ్చును. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులున్నప్పటికి అదిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


నవంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. క్రయ విక్రయాలకు ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేయుదురు. విద్యార్థులకు మరింత శ్రద్ద అవసరం. ఉద్యోగమున స్థాన మార్పులు. అకారణ కలహములు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడి అధికమగును.


డిసెంబర్ :ఈ మాసం అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన పరిచయాల వలన సమస్యలు తప్పవు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు.


*పరిహారం:-నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. శనివారం 1 1/4 kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి.గురువారం శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి.*


*మీన రాశి*


ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన వ్యవహారములందు సమస్యలు తప్పవు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆకస్మిక ధన వ్యయము. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలున్నవి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. విద్యా విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతో వివాదాలు బాధిస్తాయి. అన్ని విషయాలలో ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగం ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు నూతన పెట్టుబదుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కోర్టు వ్యవహారాలు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. శత్రు సంభంద సమస్యలు కొంత బాధిస్తాయి.


జనవరి :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వాహన యోగం ఉన్నది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సోదరులతో చిన్నపాటి కలహా సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. 


ఫిబ్రవరి :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. వృధా ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.


మార్చి :ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో వివాదములు కలుగుతాయి. వ్యాపార పరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ధన వ్యయ సూచనలున్నవి ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకములు కలుగుతాయి.


ఏప్రిల్ :ఈ మాసం అనుకూలంగా లేదు. ధన వ్యయము, శారీరక అనారోగ్యములు. పనులందు ఆలస్యము కలుగును. వ్యవసాయ మూలక నష్టములు. అకారణ కలహాములు కలుగును. కుటుంబ కలహాములు బాదించును. 


మే :ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు, బందు మూలక సమస్యలు. ఇంట బయట మాట పట్టింపులు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలలో శ్రద్ద వహించాలి. ఉద్యోగమున స్థాన చలనములు ఉన్నాయి.


జూన్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. గృహమున బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు. ధనాదాయము బాగుండును. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. 


జూలై :ఈ మాసం అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార వ్యవహారముల నష్టములు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం.


ఆగస్టు :ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబం సభ్యులతో వివాదములు, శుభాకార్యములకు ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం.


సెప్టెంబర్ :ఈ మాసం అనుకూలంగా ఉన్నది. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉండటం మంచిది.


అక్టోబర్ :ఈ మాసం మీకు మిశ్రమంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణములు వాయిదా వెయ్యడం మంచిది . అధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి.


నవంబర్ :ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. వృధా ఖర్చులు పెరుగుతాయి . ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.


డిసెంబర్ :- ఈ మాసం అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారములు అందుతాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.


*పరిహారం:-దశరథప్రోక్త శని స్తోత్రం నిత్యం పారాయణం చెయ్యాలి, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. 1 ¼ kg నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి.*

బుధవారం, జనవరి 1, 2025*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*బుధవారం, జనవరి 1, 2025*

         *శ్రీ క్రోధి నామ సంవత్సరం*      

  *దక్షిణాయనం - హేమంత ఋతువు*

          *పుష్య మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి :  *విదియ* తె3.20 వరకు

🔯వారం   : *బుధవారం*  (సౌమ్యవాసరే)

⭐నక్షత్రం  : *ఉత్తరాషాఢ* రా1.07 వరకు

✳️యోగం : *వ్యాఘాతం* సా6.47 వరకు

🖐️కరణం  : *బాలువ* మ3.38 వరకు

        తదుపరి *కౌలువ* తె3.20 వరకు

😈వర్జ్యం   : *ఉ9.05 - 10.41*

               మరల *తె5.03నుండి*

💀దుర్ముహూర్తము : *ఉ11.41 - 12.24* 

🥛అమృతకాలం    : *సా6.42 - 8.18*

👽రాహుకాలం       : *మ12.00 - 1.30*

👺యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00*

🌞సూర్యరాశి: *ధనుస్సు* || 

🌝చంద్రరాశి: *ధనుస్సు*

🌄సూర్యోదయం: *6.34* || 

🌅సూర్యాస్తమయం:   *5.32*    ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు*

సర్వేజనా సుఖినో భవంతు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

కొత్త మలుపు

 


శ్రీభారత్ వీక్షకులకు 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు 🌹 కొత్త కేలండర్ లో మొదటి పేజీ మొదలయింది. ఉత్తమ సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలతో వీక్షకుల ఆదరణ పొందుతూ ముందుకు సాగుతున్న శ్రీభారత్ ఛానల్ అదే ఒరవడిని ఈ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగిస్తుంది. శ్రీభారత్ కు మీ ఆదరణ మెరుగైన సమాజానికి కొత్త మలుపు. శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి ఆలపించిన ప్రసిద్ధ అన్నమాచార్య కీర్తన కొలని దోపరికి గొబ్బిళ్లు..తో కొత్త సంవత్సర ప్రయాణం ఆరంభిద్దాం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

భూమి నుండి నీరు ఇచ్చింది

 భూమి నుండి నీరు ఇచ్చింది నీరు సృష్టించింది భగవంతుడు.

గాలి, అగ్ని, ఆకాశము ఇచ్చింది భగవంతుడు 

లక్షల విలువైన శరీరాన్ని శరీరంలోని అవయవాలను ఇచ్చింది భగవంతుడు

ఆహారము కొరకు పండ్లు, ఆకులు, కూరగాయలు ఇచ్చింది భగవంతుడు.

అందమైన చెట్టు చేమలు పక్షులు కీటకాలు జంతువులు ఇచ్చింది భగవంతుడు.


మానవుడు అన్ని నేనే సృష్టిస్తున్నాను అనే అహంకారములో జీవిస్తున్నారు.


మానవుడు పరిశ్రమలు నెలకొల్పి మానవుడి శరీరాలను పాడు చేసుకుంటున్నాడు.

పంటల కొరకు ఎరువులు సృష్టించి పంటలను నాశనం చేసి, తినే ఆహారాలను పాడు చేసుకున్నది మానవుడు. 

కొత్త టెక్నాలజని LED బల్బులను సృష్టించి కళ్ళను పాడు చేసుకున్నాడు

టెక్నాలజీతో అరచేతిలో అన్ని చూస్తున్నారు, సమయమే లేకుండా పోయింది, బంధాలు బంధుత్వాలు దూరమవుతున్నాయి.

ఇంటి దగ్గరికి వస్తువులని, సోమరిగా మారిపోయాడు.

కొండలు తవ్వి, పంట పొలాలనమ్మి  ప్రకృతిని లేకుండా చేస్తున్నారు.

Corporate Hospital, International School అనే నామముతో జీవితాలు ఆటలయ్యాయి.

అందమైన చెట్టు చేమలను లేకుండా చేసి కృత్రిమంగా సృష్టించబడుతున్నాయి. పక్షులు కీటకాలు జంతువులు ఆహారంగా మారి అంతమవుతున్నాయి.



డబ్బు అనేది మాయ, అంధకారం.

డబ్బు మన అవసరములు, మంచి పనులు తీర్చేదిగా ఉండాలి కానీ, మించి సంపాదించాలనుకుంటే అది అంధకారమే అవుతుంది. సమయం వృధా అవుతుంది.

మనం ఆనందంగా మనకొఱకు, ఆత్మ ఎదుగుదలకు బతకాలి గాని డబ్బు మోహములోపడి అనారోగ్యంగా బతకడము, అది మూర్ఖత్వమే అవుతుంది

మందుబాబులంత చిందులెయ్యll

 #ఆ. వె.#

చిగురు వేయ లేదు చెట్టుచేమలిలను

గొంతు విప్పలేదు కోకిలమ్మl

కొత్తదనము లేని కొత్త ఏడాదొచ్చె

మందుబాబులంత చిందులెయ్యll

~మల్లిభాగవతః...!

తిరుమల సర్వస్వం -105 *అంకురార్పణ మంటపం*

 తిరుమల సర్వస్వం -105

*అంకురార్పణ మంటపం* 

"పోటు" ను దర్శించుకుని ఎత్తైన అరుగు మీద ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు ముందుగా వచ్చేది *"అంకురార్పణ మంటపం".* బ్రహ్మోత్సవాలకు ముందు రోజున ఈ మంటపంలో, సేకరించుకొచ్చిన పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేయడం వల్ల ఈ మంటపానికి *"అంకురార్పణ మంటపం"* అనే పేరు వచ్చింది. అంకురార్పణపర్వం గురించి "శ్రీవారి బ్రహ్మోత్సవాలు" లో వివరంగా తెలుసుకున్నాం.

ఒకప్పుడు దేవాలయ అంతర్భాగం నందున్న రాములవారిమేడలో కొలువుండే రామపరివార దేవతలైన ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుని విగ్రహాలు; అలాగే, *"నిత్యశూరులు"* అనబడే శ్రీమహావిష్ణువు పరివారదేవతలైన విష్వక్సేనుడు, ఆదిశేషువు, గరుత్మంతుడు విగ్రహాలను – ప్రస్తుతం ఈ మండపంలో దర్శించుకోవచ్చు. శ్రీవారి దర్శనానంతరం తీర్థం, శెఠారిని ఈ మంటపం ఎదురుగానే భక్తులకు ప్రసాదిస్తారు. రాత్రివేళల్లో స్వామివారి ఏకాంతసేవ పూర్తయి, ఆలయ ద్వారాలు మూసిన తరువాత, బ్రహ్మాది దేవతలు విచ్చేసి స్వామిని కొలుస్తారని ఓ గట్టి నమ్మకం. వారు అర్చించుకోవడం కోసం, ప్రతిరోజు ఆలయద్వారాలు మూసేటప్పుడు ఐదు బంగారు గిన్నెలలో ఆకాశగంగ తీర్థం నింపి ఉంచుతారు. ఉదయం సుప్రభాతం తర్వాత విశ్వరూపసందర్శనం కోసం విచ్చేసే భక్తులకు అంకురార్పణమండపంలో ఇచ్చేది ఈ తీర్థమే!! దీన్నే *"బ్రహ్మతీర్థం"* గా పిలుస్తారు

బ్రహ్మ కడిగిన విష్ణు పాదోదకం గనుక, ఈ తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. *యాగశాల* ‌ అంకురార్పణ మండపానికి ఆనుకుని ఉన్న "యాగశాల" లో పూర్వం హోమాలు, యజ్ఞయాగాదులు వంటి వైదికక్రతువు లన్ని జరుగుతుండేవి. కానీ ప్రస్తుతం స్థలాభావం, భక్తులరద్దీ చేత ఈ క్రతువుల్లో చాలావరకూ సంపంగిప్రాకారం లోని "కళ్యాణమండపం" లో జరుప బడుతున్నాయి. బుధవారం నాడు జరిగే సహస్రకలశాభిషేకం సమయంలో మాత్రం, బంగారువాకిలి వద్ద ఏర్పాటు చేయబడిన తాత్కాలిక యజ్ఞగుండంలో యాగం నిర్వహింపబడుతుంది. 

[ రేపటి భాగంలో.. *కళ్యాణమండపం, నోట్ల పరకామణి, చందనపు అర, ఆనందనిలయ విమానం, విమాన వేంకటేశ్వరుడు* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]

* *"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* *వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"* 

*కళ్యాణమండపం* 

సంపంగిప్రాకార కుడ్యానికి లోపలివైపున అనుసంధానింపబడి, యాగశాలకు ఆనుకొని దానికి పడమరగా, విమానప్రదక్షిణ మార్గంలో ఉన్న విశాలమైన మంటపాన్ని *"కళ్యాణ మండపం"* అంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం ఈ మంటపం లోనే జరుగుతూ ఉండేది. శ్రీవారి మహాభక్తుడు తాళ్ళపాక అన్నమయ్య, తదనంతర కాలంలో వారి వంశీయులు ఈ మంటపంలోనే శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవాలు జరిపేవారు. ‌ 1586వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిథియైన అయిన చెన్నప్ప అనే అధికారి ఈ మండపాన్ని నిర్మించారు. పూర్తిగా విజయనగరశైలిలో నిర్మింపబడ్డ ఈ మండపం రమణీయమైన శిల్పకళా చాతుర్యంతో కనువిందు చేస్తుంది. ఈ మంటప అంతర్భాగంలో వున్నటువంటి, నాలుగు స్తంభాలతోనున్న *"మధ్యమండపం"* విజయనగరశిల్పుల కళాకౌశల్యానికి మచ్చుతునక. ఈ నాలుగు స్తంభాలు, ఒక్కొక్కటి మరో నాలుగు స్తంభాల సముదాయం ఒక లావాటి స్తంభం మరియు దానికి బాహ్యంగా మరో మూడు సన్నటి స్తంభాలు - ఒకే రాతిలో చెక్కబడి ఉంటాయి. అత్యంత నునుపైన నల్లటి గ్రానైట్ వంటి రాతిపై అందమైన కళాకృతులు అత్యద్భుతంగా మలచ బడ్డాయి. ఈ మధ్యమంటపం లోనే, కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామి వారిని వేంచేపు చేసేవారు. 

కళ్యాణమంటపం లోని శిలాస్తంభాల మీదా, కుడ్యాల యందు అనేక ఆకృతులు హృద్యంగా చెక్కబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి యోగముద్ర లోనున్న నరశింహస్వామి, హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న ఉగ్రనరశింహుడు, సింహవాహనంపై ఆసీనుడై ఉన్న నరశింహుడు, త్రివిక్రమావతారంలో ఉన్న విష్ణుమూర్తి, గరుడవాహనంపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు, ఆదిశేషునిపై శయనించిన శేషసాయి, పదహారు చేతులతో కరందమకుటం ధరించి శిరస్సు చుట్టూ అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తున్న అత్యంత అరుదైన సుదర్శనుని ప్రతిమ – మున్నగునవి. 




*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

॥ ఓం - గీతా మకరందము [11-39]॥

 11-38,39-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


త్వమాదిదేవః పురుషః పురాణ 

స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ | 

వేత్తాఽసి వేద్యం చ పరం చ ధామ 

త్వయా తతం విశ్వమనన్తరూప || 


తా:- అనంతరూపుడగు ఓ కృష్ణా! నీవు ఆదిదేవుడు, సనాతనపురుషుడు, ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను, సమస్తమును తెలిసికొనినవాడును, తెలియదగినవాడును, సర్వోత్తమస్థానమును అయియున్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడియున్నది. 

 

ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టి లక్షణములు కలవాడు? 

ఉ:- (1) ఆదిదేవుడు (2) ప్రాచీనపురుషుడు (3) ప్రపంచమునకు ఆధారభూతుడు (4) సమస్తము తెలిసినవాడు (5) తెలియదగినవాడు (6) సర్వోత్తమస్థానము (7) ప్రపంచమంతటను వ్యాపించియున్నవాడు (8) అనంతరూపుడు. 

 -------------------------------------

॥ ఓం - గీతా మకరందము [11-39]॥

వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః 

ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ | 

నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః 

పునశ్చ భూయోఽపి నమో నమస్తే || 

 

తా:- వాయువును, యముడును, అగ్నియు, వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవుడును, బ్రహ్మదేవునకు తండ్రియును మీరే అయియున్నారు. మీకనేకవేల నమస్కారములు ! మఱల మఱల మీకు నమస్కారము. 

  

వ్యాఖ్య:- అర్జునునకు భగవానునియెడల కలిగిన అట్టి అపరిమితభక్తి సాధకునకు అత్యంతావశ్యకమైయున్నది.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*243 వ రోజు*


*మసేనుని భీకర యుద్ధం*


సుయోధనుని సైగను గ్రహించిన కళింగ రాజు తన సైన్యంతో భీముని మీదకు వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని పైన, ద్రుపదుని పైన బాణములు సంధించాడు. ధర్మరాజు ఇంతలో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఛేది, కురుదేశాల రాజులు భీమునికి అడ్డుగా నిలిచాడు. కేతుమంతుడు భీముని మీదకు ఉరికాడు. కేతుమంతునికి ధాటికి పాండవ సైన్యాలు మంటలలో పడిన పురుగులులా భస్మం అయ్యారు. మిగిలి వారు పారి పోయారు. కేతుమంతుడు విజయోత్సాహంతో భీమునిపై ముందు వెనుకలు చూడక బాణవృష్టి కురిపించాడు. కేతుమంతుడు భీముని హయములు చంపగా భీముడు కుపితుడై గదను తీసుకుని వాడి పైన విసరగానే ఆ గదాఘాతానికి వాడి రథం విరిగి, కేతనం విరగటమే కాక నిముషాలలో కేతుమంతుని స్వర్గలోకానికి పంపింది. భీముడు తన కత్తిని తీసుకుని వీరవిహారం చేసాడు. అది చూసిన కళింగ రాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు వచ్చి కరకు బాణాలతో భీమసేనుని రథాశ్వాలను వధించి భీముని శరీరమంతా బాణములతో కొట్టగా భీమసేనుడు బెదరక ఒక్క గదా ఘాతంతో శక్రదేవుని సంహరించాడు. కుమారుని చావు చూసి కుపితుడైన కళింగరాజు భీమునిపై పదునాలుగు తోమరములు విసిరాడు. భీమసేనుడు వాటిన అన్నిటినీ తన కరవాలంతో తుత్తునియలు చేసాడు. కళింగ రాజు సోదరుడు భానుమంతుడు తన గజబలంతో భీముని ఎదుర్కొని భీమునిపై శరవర్షం కురిపించాడు. ఒక ఏనుగును భీమునిపై నడిపించాడు. భీమసేనుడు చేసిన సింహనాదానికి దిక్కులు దద్దరిల్లాయి. భీముడు ఆ ఏనుగును పట్టుకుని దంతములు, తొండము నరికి భానుమంతుని నరికి వేసి అతని ఏనుగును నరికాడు. అది చూసిన కళింగరాజు ఒక్క సారిగా భీమసేనుని పైన పడమని తన గజ సన్యాలను పురికొల్పాడు. ఒంటరిగా నేలపై ఉన్న భీముడు కత్తితో ఏనుగుల తోడములు నరక సాగాడు. రథికులను, సారధులను, రథములకు కట్టిన అశ్వములను నరక సాగాడు. ఇంతలో భీముని సారథి భీముని రథాన్ని తీసుకు వచ్చి అతని ముందు నిలుపగా భీమసేనుడు అతడిని శ్లాఘిస్తూ రథం ఎక్కి విల్లు తీసుకున్నాడు. కళింగుని అయిదు బాణాలతో కొట్టగా అతడు మూర్చిల్లాడు. కళింగుని చక్రరక్షకులు అయిన సత్యుడు, సత్యదేవులను చంపాడు. కౌరవ సేన కకావికలై పోయింది. కళింగుని సారథి అతడిని పక్కకు తీసుకు వెళ్ళాడు. భీమసేనుడు తన శంఖమును పూరించాడు. అది విన్న భీష్ముడు తిరిగి శంఖాన్ని పూరించి కౌరవ సైన్యాలను ఉత్సాహపరిచాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథానికి కట్టిన హయములను చంపగా భీముడు కోపించి రథం దిగి భీష్మునిపై ఉరికాడు. సాత్యకి భీమునికి భీష్మునికి మధ్యగా నిలిచి భీష్ముని రథసారథిని చంపాడు. రథాశ్వాలు సారథి లేని రథాన్ని భీష్ముని పక్కకు తీసుకు వెళ్ళాయి. అదను చూసి భీముడు కౌరవ సేనను దనుమాడాడు. భీముని ధాటికి తాళలేని కౌరవ సేనలు పలాయనం చిత్తగించాయి. ధృష్టద్యుమ్నుడు వచ్చి భీమసేనుని తన రథం పైకి ఎక్కించాడు. ఇంతలో సాత్యకి రథంపై వచ్చి భీమసేనా " ఒంటరిగా కళింగుని బలం అణిచావు. అతని పుత్రులను సోదరులను, ఆప్తులను ఒంటరిగా దునుమాడావు " అని భీమసేనుని ప్రశంసించాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శాంతి మంత్రం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శాంతి మంత్రం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం*

*న్యాయేన మార్గేణ మహీం మహీశాః।*


*గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం*

*లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.॥*


*ప్రజలందరికీ శుభాలు కలుగుగాక. దేశాధినేతలు న్యాయమైన మార్గములో పరిపాలన చేసెదరు గాక. గోవులకు బ్రాహ్మణులకు శుభమగు గాక. లోకములో ఉన్న అందరూ సుఖముగా ఉండెదరు గాక.*


*కాలే వర్షతు పర్జన్యః*

*పృథివీ సస్యశాలినీ।*


*దేశో యం క్షోభరహితో*

*బ్రాహ్మణా స్సంతు నిర్భయాః।*


*అపుత్రాః పుత్రిణ స్సంతు*

*పుత్రిణ స్సంతు పౌత్రిణః।*


*అధనాః సధనాస్సంతు*

*జీవన్తు శరదాం శతం*


*సకాలములో వర్షం కురియు గాక. భూమి సస్యశ్యామలమగుగాక. దేశంలో ఏ క్షోభ లేకుండా గాక. బ్రాహ్మణులు నిర్భయముగా జీవించెదరు గాక. పుత్రులు లేని వారికి సంతానము కలుగును గాక. పుత్రులు ఉన్నవారికి మనవలు కలుగుదురుగాక . పేదవారు ధనవంతులయ్యెదరుగాక. అందరూ నిండు నూరేళ్ళు జీవించెదరు గాక.*


*ఓం శాంతిః శాంతిః శాంతిః।*

*సర్వే జనాః సుఖినోభవంతు॥*

*ఓం తత్సత్॥*

*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు:*

*ఓం నమఃశివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (6)*


*అప్రమేయో హృషీకేశః*

*పద్మనాభోఽమరప్రభుః ।*


*విశ్వకర్మా మనుస్త్వష్టా*

 *స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥*


*ప్రతిపదార్థం :~*


*46) అప్రమేయః -- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకు అందనివాడు*


*47) హృషీకేశః - ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి;*


*48) పద్మనాభః -- నాభియందు పద్మము గలవాడు, భగవంతుడు.*


*49) అమరప్రభుః --‌ దేవతలకు ప్రభువైనవాడు*


*50) విశ్వకర్మా --- విశ్వమును సృష్టించిన వాడు*


*51) మనుః - మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.*


*52) త్వష్టా --- ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.*


*53) స్థవిష్ఠః -- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి;*


*54) స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు*


*55) ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు*


*స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు.*


*తాత్పర్యము:~*


*ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడును; ఎటువంటి కొలతలకు అందనివాడును, ఇంద్రియములకు అధిపతియును, నాభియందు పద్మము గలవాడును, దేవతలకు ప్రభువైనవాడును, విశ్వమును సృష్టించిన వాడును, మననము చేయు మహిమాన్వితుడును; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడును, ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడును, బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకున్న బృహద్రూప మూర్తియును, సదా ఉండెడివాడును, అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకాన్ని కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: భరణి నక్షత్రం రెండవ పాదం జాతకులు పై 6వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(ఏడవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కలిప్రవేశంతో ధర్మదేవత, భూదేవత పొందుతున్న దుఃఖాన్ని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అబ్రాహ్మణులే ముందు ముందు రాజ్యాలు ఏలుతారని తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. అంతలోనే తేరుకుని, ధర్మదేవతకూ, భూదేవతకూ అభయాన్నిచ్చాడు. ఓదార్చాడు వారిని. ఆలస్యం చేయదలచలేదు, అసత్యానికీ, అధర్మానికీ నిలయమయిన కలిని కడతేర్చేందుకు ఖడ్గాన్ని ఎత్తాడు పరీక్షిత్తు.*


*వేటు తప్పదనుకున్న కలిపురుషుడు గడగడ వణకిపోయాడప్పుడు. దిక్కుతోచలేదతనికి. చేతులెత్తి నమస్కరించి, శరణంటూ పరీక్షిత్తు పాదాలను ఆశ్రయించాడు.*


*‘‘శరణన్న వారిని చేయెత్తి కొట్టడం కూడా మహాపాపం. అందుకని నేను నిన్ను చంపకుండా వదలి పెడుతున్నాను. పో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు పరీక్షిత్తు.*


*దిక్కులు చూశాడు కలిపురుషుడు. ఎక్కడకి వెళ్ళాలన్నదీ అంతు చిక్కలేదతనికి.‘‘నువ్వు ఉన్న చోట అధర్మం, అసత్యం, అలక్ష్మి, స్వధర్మత్యాగం, చౌర్యం, లోభం, కపటం, కలహం, డంభం అన్నీ తాండవిస్తాయి. పరమ పవిత్రమయిన, ధర్మానికి నిలయమయిన యజ్ఞభూమి లాంటి ఈ బ్రహ్మవర్తదేశంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ కాలు మోపితే నేనొప్పుకోను, ఖండిస్తాను. తక్షణం తప్పుకో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు మళ్ళీ పరీక్షిత్తు.*


*సమాధానంగా మళ్ళీ చేతులు జోడించాడు కలిపురుషుడు. దీనంగా ప్రార్థించాడిలా.*


*‘‘మహారాజా! నిన్ను శరణు కోరాను. ప్రసాదించావు. ధన్యుణ్ణయ్యాను. అయితే నన్ను పొమ్మనడం నీకు భావ్యం కాదు. తప్పదు, నిష్క్రమించాల్సిందే అంటే నేనెక్కడుండాలో, ఏ చోటున నివసించాలో నువ్వే చెప్పు. ఎక్కడికి వెళ్దామన్నా, ఎటు చూద్దామన్నా ఆగ్రహోదగ్రంగా ఖడ్గాన్ని ఎత్తి పట్టుకుని ఎల్లెడలా నువ్వే కనిపిస్తున్నావు. భయం వేస్తోంది. దయచేసి అన్యధా భావించక చెప్పు మహారాజా, నేనెక్కడుండాలో నువ్వే చెప్పు. అక్కడే నా నెలవు ఏర్పరుచుకుంటాను.’’ అన్నాడు కలిపురుషుడు.కన్నీరు పెట్టుకున్నాడు.*


*ఆలోచనలో పడ్డాడు పరీక్షిత్తు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

భజగోవిందం (మోహముద్గరః)

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 6*


*యావత్పవనో నివసతి దేహే*

*తావత్పృచ్ఛతి కుశలం గేహే|*


*గతవతి వాయౌ దేహాపాయే*

*భార్యా బిభ్యతి తస్మిన్కాయే||*


*శ్లోకం అర్ధం : ~*


*శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.*


*వివరణ : ~*


*శరీరంలో ఈ హంస సాగిన వరకే బంధువులు, మిత్రులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాస నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరుటకు భయపడును. నీవారందరూ నీ శరీరమును తాకుటకు కూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొన్ని క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో, రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగానే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదిలించుకొందామా అని అందరూ భావింతురు. పంచ భూతములతో నిర్మితమైన ఈ దేహం, చివరకు ఈ పంచ భూతములలోనే కలిసి పోవలె. అట్టి ఈ హీన శరీరం పై మమతలు ఏల?*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

అద్భుతమయిన

 👇👇👇👇👇👇

*అద్భుతమయిన*

*కళాత్మకమయిన* *కళారూపలావణ్యాలు* *కనువిందుజేస్తోంది*

*ఎక్కడో సమాచారం అయితే* 

*లేదు...!*

*అందలేదు*!! 

*కళలు సృష్టిలో* 

*ఒకొక్క చోట*

*ఒక్కో వింత...*

🙏🙏

*2024తో*

"*నువ్వే ముందు ..*

*నీ తర్వాతే నేను*...

అంది 2025 .

ఆ మాటకి..

ఉప్పొంగిపోయింది 2024 

పాపం దానికి తెలియదు.

*ఇక తిరిగి ఎప్పటికీ రానని....*

🔆

 *వెళ్లిపోతున్న*

*2024 గొప్పది*

🔆

*రానున్న*

*2025 మరింత గొప్పది*!!


🔆🔆🔆🌹🌹🌹🔆🔆🔆

💕

అందుకే.... 

 ఈ నూతన సంవత్సరం 2025..

మరిన్ని విజయాలను 

మీరు సొంతం చేసుకోవాలని..

*మనసా.. .*. 

*వాచా ....*.

*కర్మణా.. .*..

ఆకాంక్షిస్తూ...!

ఈ సందర్భంగా...

మీకు ..

*శుభాకాంక్షలు*

*శుభాభినందనలు* 

*శుభం భూయాత్*

*జైశ్రీరామ్*

🤝🤝🤝🤝🤝

మీ... 

*మన్నవ సుధాకర్*

 విజయవాడ

🙏🙏🙏🙏

రామో విగ్రహవాన్ ధర్మః*

 *రామో విగ్రహవాన్ ధర్మః*


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే ఆచరణయోగ్యమైన ధర్మం ఆకారం దాల్చి శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.

ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో రామావతారం పూర్ణావతారము.


రామస్య ఆయనం - రామాయణం

ఆయనం అంటే గమనం లేదా కదలిక. రామాయణం అంటే రామగమనం అదే ధర్మం యొక్క కదలిక.


రాముడిని కొలవటం అంటే ధర్మాచరణ చెయ్యటమే.


రాముల వారు తిరిగి వారి జన్మభూమికి సపరివారం గా ఈ సంవత్సరం విచ్చేశారు, అంతకన్నా పెద్ద పండగ మనకి ఏముంటుంది.


*కోదండపాణి: కులదైవతం నః*


అయోధ్య లో  రామాలయం ఆవిష్కరణ కి మన తరం అందరం సాక్షీభూతులయ్యాం. ఒకరోజు  *కొన్ని గంటలు చేసుకునే వేడుకతో సంబంధం ఏముంది, మనకి నిత్యం పండగనే, వేడుకనే* 


వందల సంవత్సరాల నందీశ్వరుడి తన స్వామి రాక కై చూస్తున్న ఎదురుచూపులకి సమాధానం, బాలకృష్ణుడి పునరాగమానికి మార్గం త్వరలో సుగమం కావాలని సంకల్పం చేద్దాం.


రాములవారు సూచించిన మార్గం లో అందరం నడిచేలా ఆయన్నే శక్తి ఇమ్మని కోరుకుందాం.


ఇష్టం మనిషాణ| అముం మనిషాణ| సర్వం మనిషాణ|

భూమిని మీకు తెలువకుండా

 మీ భూమిని మీకు తెలువకుండా ఇతరుల పేరు మీదికి మారుస్తే విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు.

తప్పుచేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు.

*రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు విషయంలో ఒక్కరి భూమి మరొక్కరి 1బి ఆడంగల్ మంజూరు చేస్తే ఆడంగల్ మరియు 1బి కరెక్షన్ కోసం రైతులు ROR చట్టం కింద రెవిన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్పీల్ గాని, జాయింట్ కలెక్టర్ దగ్గరకు గాని అప్పీల్ వెళ్ళవలసిన అవసరం లేదు. సంబంధిత తహసిల్దార్ గారికి అర్జీ పెట్టుకోవాలి (మీ భూమి పత్రాలు చూపించి ఆ అర్జీకి జిరాక్స్ జతపరచాలి) మీతో విచారణ చేయకుండా మీ భూమిని ఇతరులకు ఆన్లైన్ నందు 1బి, ఆడంగల్, పట్టాదారు పసుపుస్తకం మంజూరు చేసినందుకు గాను విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు వీరి మీద చర్యలు తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు పై అధికారులు చర్యలు తీసుకొనకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమిల్ అప్పీల్ నెం 1837/2019 కింద శిక్ష అర్హులు.*

******

*తప్పుచేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు పై అధికారుల అనుమతి అవసరం ఈ తీర్పు ప్రతి ప్రభుత్వ అధికారికి వర్తిస్తుంది.*

మీ భూమి ఇతరుల పేరు మీదికి మారిందని.

ఎ ఒక్కరు 

టెంక్షన్ పడకూడదనే

01.01.2025

 🕉️ 🌓 01.01.2025


🪔 శ్రీలక్ష్మినారాయణయనమః 🪔


కలియుగం: 5126


విక్రమ సంవత్సరం: 2081 పింగళ


శక సంవత్సరం: 1946 క్రోధి


ఆయనం: దక్షిణాయణం


ఋతువు: హేమంత


మాసం: పుష్య 


🎋 ఆరోగ్య ద్వితీయ 🎋


🪷 శ్రీ మధుసూదన పూజారంభం🪷


🚩 శ్రీ నృసింహ సరస్వతి 

స్వామి జయన్తీ 🚩


🏳️ శ్రీ జగన్నాథతీర్థ‌ పుణ్యతిథి 🏳️


🚩 శ్రీ సుయమీంద్రతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩


🌙 చంద్రదర్శనం 🌙


🎊 హేమగిరి మల్లికార్జున స్వామి 

జాతర‌ - రథోత్సవం 🎊


🪄శ్రీ మైలారలింగ ఉత్సవం

 మైలాపూర్ 🪄


🎉 ఆంగ్ల సంవత్సరాది 🎉


🌿శ్రీరంగం రంగనాథ పెరూమాళ్‌

 మధ్యాహ్నం ఉత్సవసేవ 🌿


🇮🇳 సంపూర్ణానంద జయంతి 🇮🇳


🔯

కళ్ళెము వేయ దుర్మతుల

 ఉ.కళ్ళెము వేయ దుర్మతుల ఘాతుకముల్ నశియింపవెప్పుడున్

గుళ్ళను గోపురమ్ములను కోరికతో చరియింప పాపముల్

త్రెళ్ళునె కర్మజాలములు? తీవ్రములౌ ఫలమీయ కున్న నా

కుళ్ళు నశింపజాల దిల క్రూరపు మత్త కృతఘ్నతాళికిన్౹౹ 109


ఉ.కావుము కావు కావుమని కాలునికిన్ మొర పెట్టుకున్నచో 

పోవునె పాపకర్మముల పూర్ణ ఫలమ్ములు జీవితమ్మునం

దేవిధి జేసినన్ ఫలము లెప్పుడు ధర్ముఁడె నిర్ణయించెడున్

గావున విజ్ఞతన్ మదిని గల్గి చరించిన మేల్మి నొందనౌ! ౹౹ 110

కాల నైజము

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యోనమః

01-01-2025

కాల నైజము


నూతన ఆంగ్లవత్సరము నూత్న ఫలప్రద సిద్ధినొంద సం

ప్రీతి నొసంగు చుండుత వరించుచు నెప్డు శుభార్థ సంపదల్

భీతిని గూర్చి దుర్జనుల పీచమడంచుచు దుర్మదాంధులే

రీతుల వృద్ధినొందని పరీక్షల సల్పి నశింప జేయుచున్


ధర్మనిబద్ధ పాలనపు తత్పరతన్ మన పాలకాళియున్

మర్మములెంచి యోచనల మార్గము లెన్నగ గల్గుచున్న స

త్కర్మల యందు సంతతము కల్మిని గూర్చగ నుంద్రు గావుతన్

ధర్ముడు కాల రూపమున తా గమనించుచు నుండు నెప్పుడున్


కాలమునకు ఆంగ్లము తెలు

గేలాగుననుండ దెపుడు హితమతు లగుచున్

పాలకులును సుమతి దలప

పాలితులును సంతసమున వర్ధిల్లుదురౌ


పాడి పంటలలర వర్ధిల్ల గన నెంచి

క్రొత్త వత్సరమును కోరువారి

కనుము కాల పురుష కల్మిచేకూర్చుమా

గతము మరచి నిన్ను స్తుతులొనర్తు


సమూహసభ్యులూ మిత్రులందరికీ  2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో

💐💐💐💐💐

డా.రఘుపతి శాస్త్రుల

పదిహేడు సూత్రాలు:-*

 జై శ్రీ రామ్ 

*పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు:-*


1. 🦋 *విలువ లేని చోట మాట్లాడకు...*


2. 🦋 *గౌరవం లేని చోట నిలబడకు...*


3. 🦋 *ప్రేమ లేని చోట ఆశ పడకు...*


4. 🦋 *నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు...*


5. 🦋 *నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు...*


6. 🦋 *నిర్లక్ష్యం వున్న చోట ఎదురు చూడకు...*


7. 🦋 *అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు...*


8. *😎 వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు...*


9. 🦋 *ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు...*


10. 🦋 *చులకనగా చూసే చోట చొరవ చూపకు...*


11. 🦋 *జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు...*


12. 🦋 *భారం అనుకునే చోట భావాలు పంచుకోకు...*


13. 🦋 *దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు...*


14. 🦋 *నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు...*


15. 🦋 *ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు...*


16. 🦋 *ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు...*


17. 🦋 *నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు...*


          *అధ్యాత్మికం ఆనందం*జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం  - ద్వితీయ - ఉత్తరాషాడ -‌‌ సౌమ్య వాసరే* (01.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మొగలిచెర్ల అవధూ

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*శరీర త్యాగానికి సన్నద్ధం..*


*(యాభై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి చెందడం మీదే ఉన్నది..పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం..వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది..కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒకమాట స్పష్టం చేయసాగారు..సజీవ సమాధి జరిగినా జరుగకపోయినా.. తన అంత్యకాలం సమీపించిందనీ..తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని..


శ్రీధరరావు గారు శ్రీ చెక్కా కేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు.. వారు మొగలిచెర్ల కు  చేరుకున్న తరువాత..శ్రీధరరావు దంపతులు..తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియచేసి..ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు..వాళ్లిద్దరూ కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని..తాము శ్రీ స్వామివారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు..శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడు బండి సిద్ధం చేయించి..కేశవులు గారిని, మీరాశెట్టి గారినీ శ్రీ స్వామివారి వద్దకు పంపారు..


శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి..తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు..కేశవులు గారు కొద్దిగా అసహనంతో.."స్వామీ!..మీరు ఇలా మంకు పట్టు పడితే ఎలా?..మీలాటి వారు ఉండబట్టే మాలాటి వాళ్లకు ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి..మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మల్లె..మా ఇంటివద్ద  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..విజయవాడ వచ్చి కొద్దిరోజుల పాటు వుండండి.. మాలాంటి వారికి బోధ చేయండి..మీకూ మార్పు ఉంటుంది.." అని ఎంతో దూరం చెప్పారు..మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చచెప్పబోయారు..


శ్రీ స్వామివారు ఇద్దరి మాటలూ శ్రద్ధగా విన్నారు..వింటున్నంత సేపూ ప్రశాంతంగా వున్నారు..వాళ్ళు చెప్పడం ఆపైన తరువాత..ఆశ్రమ వరండా లో పద్మాసనం వేసుక్కూర్చుని..


"ఇద్దరూ వినండి..నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు..మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తి తో సహకరించారు..నానుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు..నిజానికి ఈ మీరాశెట్టి కి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా..తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధి గా చేసాడు..కేశవులు గారూ మీరూ అంతే!..ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు..మీకూ తెలుసు..కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాట వేస్తున్నారు..అది నా ఆయుర్దాయం గురించి..నాకు ఆయుష్షు కొద్దికాలమే ఉన్నది..అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి..అది విధి నిర్ణయం..మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని..అది నిజం కాదు..దైవం నాకు నిర్దేశించిన గడువులోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి..ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు.."


"ఇక బోధల గురించి...శరీరం తోనే బోధ చేయాలనే నియమేమీ లేదు..అలా అనుకుంటే..కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికీ శరీరధారులై ఉండాలి..నేను సమాధి చెందిన తరువాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది..ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది..ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ..సంతానహీనులు సంతానాన్ని పొందుతారు..మానసిక రుగ్మతలు తొలగిపోతాయి..దుష్టగ్రహపీడలు నశిస్తాయి.."


"మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధి కి ఇష్టపడకపోతే..నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను..దైవ ధిక్కారం చేయను..చేయలేను.." అన్నారు నిర్వికారంగా చూస్తూ..


శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గార్లు..ఇక చేసేదేమీ లేక..సెలవు తీసుకొని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు..శ్రీధరరావు ప్రభావతి గార్లతో తమ సంభాషణ అంతా చెప్పారు..తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు..తాము ఒప్పుకోలేదు కనుక, శ్రీ స్వామివారు సజీవ సమాధి  ఆలోచనను మానుకొని..తపస్సు చేసుకుంటూ వుంటారులే !..అనే భ్రమలో వున్నారు..


సోదరుడు పద్మయ్య నాయుడు కి సూచనలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

పుష్యమాసం ప్రాధాన్యం

 🌹 *పుష్యమాసం ప్రాధాన్యం*


శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. 

అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్య మాసం శనికి ప్రీతికర మాసంగా పేరొందింది.

 ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తా డని పురాణాలు తెలుపుతున్నాయి. 

గరుడపురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు.

పుష్యమి చాలా అద్భుత మైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించే సూర్య కాంతి అద్భుత మైన యోగచైతన్యాన్ని ప్రసరిస్తుంది. 

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణదిశ నుంచి ఉత్తరదిశగా పయనిస్తాడు. 

ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేక మైన తేజస్సు ఉంటుంది.

 ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేసి, మనస్సు లోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరిస్తుంది. బుద్ధి బలం, ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం.

*పుష్య* అనే మాటకు పోషణశక్తి కలిగినది అని అర్థం. 

పుష్యమాసం  శీతకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠ మైన మాస మిది. 

పితృదేవతలను పూజించి అందరు దోషరహితు లయ్యే పుణ్యమాసం పుష్యం. 

పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్ట మైన దని చెబుతారు. 

శ్రావణపౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు  వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అను వైన సమయం. 

ఈ మాసం రైతులకు

పంట  చేతికి వచ్చే కాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సమేతంగా పూజిస్తారు.

పంచాయతన పూజావిధానంలో గణపతిని భాద్రపద మాసంలో, అంబికా అమ్మవారిని ఆశ్వయుజ మాసంలో, 

శివుణ్ని కార్తీక మాసంలో, 

విష్ణువును మార్గశిర మాసంలో, సూర్యనారాయణుణ్ని పుష్యమాసంలో విశేషంగా కొలుస్తారు.

గోపికలు *కాత్యాయనీ వ్రతం* చేసి శ్రీకృష్ణుణ్ని వివాహం చేసుకుంది పుష్య మాసంలోనే. పెళ్లి కాని ఆడపిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయనీవ్రతాన్ని ఆచరిస్తారు.

పుష్యమాసానికి అధిపతి అయిన శని, నక్షత్రాధిపతి అయిన గురువును పూజించడం వలన విశేషఫలితం లభిస్తుంది. పుష్య మాసం శనైశ్చరుడికి ప్రీతికర మైన మాసం. పుష్యమాసంలో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శనిబాధా నివృత్తి జరుగుతుంది. వీటితో పాటు వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వలన శనిదోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. శనైశ్చరునికి ప్రీతికర మైన నువ్వులు, బెల్లం ఆహారంలో తీసుకోవడం మంచి ఫలితాల నిస్తుంది, ఇదే అంశాన్ని శాస్త్రీయకోణంలో పరిశీలిస్తే

ఈ రెండు పదార్థాలు ఒంట్లో వేడిని కలిగించి చలి నుండి రక్షణ కలిగిస్తాయి. పుష్య పౌర్ణమి రోజున నదీస్నానం చేయడం వలన సకలపాపాలు తొలగుతాయి.‌‌ ఈ రోజు చేసే దానాల వలన పుణ్యఫలితం అధికంగా ఉంటుంది.

ఈ మాసంలో వస్తద్రానం విశేష ఫలితాల నిస్తుం దని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశ్యం.

పుష్యశుక్ల విదియ నుంచి పంచమి దాకా శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుం దని ఒక నమ్మకం. 

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాల తోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ని జిల్లేడు పూల తోనూ అర్చిస్తారు. 

శుక్లపక్ష షష్ఠినాడు అయ్యర్ తమిళులు కుమారస్వామిని పూజిస్తారు.

ఇక, శుక్లపక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని *పుత్రదా ఏకాదశి* అంటారు. ఈ రోజున ఏకాదశీ వ్రతం ఆచరిస్తే పుత్రసంతానం కలుగుతుం దని విశ్వాసం.

తెలుగువారి పెద్ద  పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసం లోనే, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

ఈ మాసంలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, శంకుస్థాపనల వంటి   శుభకార్యాలు  చేయడానికి వీలు లేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలను స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకూ విశేషమాసంగా చెప్పవచ్చు.

విష్ణువుకు ఇష్ట మైన మాసం మార్గశిరం. 

శివునికి కార్తికం. 

అలాగే పుష్యమాసం శనైశ్చరునికి పరమ ప్రీతికరం. 

ఎందు కంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. 

ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తా డని పురాణాలు తెలుపుతున్నాయి. 

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనైశ్చరుణ్ని భక్తితో ప్రార్థిస్తారు. 

పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దాన మిస్తారు. ఆయనకు ఇష్ట మైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. 

దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే.

మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమనిష్ఠలు పాటించి నట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని ఉంది. ఎప్పుడు శరీరం లోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్య మంతటికీ శని ప్రభావమే కారణం అని మనం గ్రహంచాలి. 

*పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాది ఆచారం.


విశేష మేమంటే దక్షిణాయనం పుష్య మాసంతో ముగుస్తుంది. ఉత్తరాయణం కూడా పుష్య మాసంలోనే ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. 

సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. 

చీకటి తోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు.  దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో   గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువుగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించే దినమే మకరసంక్రాంతి.

పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించు సూర్య కాంతి అద్భుత మైన యోగచైతన్యాన్ని ప్రసాదిస్తుంది. 

పుష్యమి చాలా అద్భుత మైన నక్షత్రం. 

ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరదిశగా పయనం సాగిస్తాడు. 

అనగా ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం.

మనలోని ప్రాణశక్తి బలాన్ని సమకూర్చుకొనే సమయం. సూర్యకిరణాలలో ఒక ప్రత్యేక మైన హిరణ్మయ మైన కాంతి ఉంటుంది. ఇది మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావం లోని అశుభాలను ఆ కాంతి హరిస్తుంది. బుద్ధిబలం, ప్రాణబలం పుష్టిగా లభించే మాసం పుష్యమాసం. 

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. 

గోదావరి ఏడు పాయలలో ఒక టైన *తుల్యభాగ* తూర్పుగోదావరి లోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది.

 ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేషపుణ్యఫలం లభిస్తుం దని భక్తుల విశ్వాసం.


*(సేకరణ)*


          🌹🌹🌹🌹🌹

పదిహేడవ రోజు పాశురము*_

 _*రేపటి తిరుప్పావై  పదిహేడవ రోజు పాశురము*_ 

 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 



*🌴పాశురము🌴*



 *అమ్బరమే తణ్ణీరే ! శోఱే ! అఱమ్ శెయ్యుమ్* 

    *ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా ! ఎళిందిరాయ్* 

    *కొంబనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే* 

    *ఎమ్బెరు మాట్టి యశోదాయ్ ! అఱివుఱాయ్* 

    *అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద*

    *ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్* 

    *శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా , బలదేవా* 

    *ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్*




*🌳భావం :🌳*



ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న , వస్త్ర , తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను *'స్వామి ! మేలుకొను'* మని ప్రార్ధించారు. తరువాత *'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును , తీగవలె ముఖ్యమైనదానా ! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా ! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా ! లేమ్మా !'* అని వేడుకొనిరి. *'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా ! ఇక నిద్ర చాలునయ్యా ! మేలుకో !'* అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి , బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి *'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా ! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును , నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు !'* అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. 

 


*☘️అవతారిక :☘️*



ద్వారపాలకుని వేడి , అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను , శ్రీ యశోదమ్మను , శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటును గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా ! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.        




*🌹17. వ మాలిక🌹*




*(ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)*


ప..     లేవయ్యా మా స్వామి ! నందగోపాలా !

    లేవయ్యా స్వామి ! మా సర్వప్రదాతా !


అ..ప..    లేవమ్మ మాయమ్మా ! లే యశోదమ్మా!

    లేవె ! స్త్రీ జాతి కంతకును తలమానికమ !


చ..    ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ !

    మేలుకో ! నిత్య సూరుల స్వామి !

    శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ !

    ఇంక నిదురింపకుమ ! లెమ్ము ! కృష్ణుని తోడ !

    లేవయ్య మా స్వామి ! నందగోపాలా !

    లేవయ్య స్వామి మా సర్వప్రదాతా !