ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
01-01-2025
కాల నైజము
నూతన ఆంగ్లవత్సరము నూత్న ఫలప్రద సిద్ధినొంద సం
ప్రీతి నొసంగు చుండుత వరించుచు నెప్డు శుభార్థ సంపదల్
భీతిని గూర్చి దుర్జనుల పీచమడంచుచు దుర్మదాంధులే
రీతుల వృద్ధినొందని పరీక్షల సల్పి నశింప జేయుచున్
ధర్మనిబద్ధ పాలనపు తత్పరతన్ మన పాలకాళియున్
మర్మములెంచి యోచనల మార్గము లెన్నగ గల్గుచున్న స
త్కర్మల యందు సంతతము కల్మిని గూర్చగ నుంద్రు గావుతన్
ధర్ముడు కాల రూపమున తా గమనించుచు నుండు నెప్పుడున్
కాలమునకు ఆంగ్లము తెలు
గేలాగుననుండ దెపుడు హితమతు లగుచున్
పాలకులును సుమతి దలప
పాలితులును సంతసమున వర్ధిల్లుదురౌ
పాడి పంటలలర వర్ధిల్ల గన నెంచి
క్రొత్త వత్సరమును కోరువారి
కనుము కాల పురుష కల్మిచేకూర్చుమా
గతము మరచి నిన్ను స్తుతులొనర్తు
సమూహసభ్యులూ మిత్రులందరికీ 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో
💐💐💐💐💐
డా.రఘుపతి శాస్త్రుల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి