ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
31, మే 2026, ఆదివారం
క్షేత్రసంకల్పాం
(ప్రతాప వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన ఋగ్వేద శ్రాద్ధప్రయోగమునుండి
క్షేత్రసంకల్పాం
కాశీ క్షేత్రే :
అద్య బ్రహ్మణః మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తికదేశే అవిముక్తవారాణసీక్షేత్రే అసివరుణయోర్మధ్యే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటకవిరాజితే భాగీరధ్యాః పశ్చిమేతీరే ఉత్తరవాహిన్యాః బ్రహ్మనాళే మహామణికర్ణికాక్షేత్రే విశ్వేశ్వరాది త్రయస్త్రింశత్కోటి దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ విక్రమశకీ బౌద్ధావతారీ బార్హస్పత్యమానేన నామసంవత్సర సౌరచాంద్రమానాభ్యాం ఋతౌ నామ సంవత్సరే అయనే మాసే పక్షే తిథా వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం ।
ప్రయాగే :
అద్య బ్రహ్మణః.. . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత బ్రహ్మావర్తైకదేశే విష్ణు ప్రజాపతి క్షేత్రే షట్కూలమధ్యే అంతర్వేద్యాం భాగీరధ్యాః పశ్చిమేతీరీ కాళింద్యాః ఉత్తరీతీరే వటస్యపూర్వదిగ్భాగే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకీ ।
శ్లో ॥ త్రివేణీం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం | వందే అక్షయ వటం శేషం ప్రయాగం తీర్ధనాయకం ॥
గయాక్షేత్రే :
అద్య బ్రహ్మణః . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత మగధదేశే జంపకారణ్యే మధువనే కోలాహలపర్వతే గయాగదాధర క్షేత్రే ఉత్తరవాహిన్యాం ఫల్గున్యాః పశ్చిమేతీరే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహరగురు చరణసన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకీ
హరిద్వారే :
అద్య బ్రహ్మణః.. . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత హిమాలయదేశే కేదారఖండే మాయామండలే దక్షప్రజాపతి క్షేత్రే దక్షిణవాహిన్యాం భాగీరధ్యాః పశ్చిమేతీరే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకే
సోమవారం*🕉️ *🌹01, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹01, జూన్, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*అధిక జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం*
*తిథి : పాడ్యమి* సా 04.37 వరకు ఉపరి *విదియ*
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* రా 07.08 వరకు ఉపరి *మూల*
*యోగం : సిద్ధ* ఉ 06.19 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : కౌలువ* సా 04.37 ఉపరి *తైతుల* పూర్తిగా రాత్రంతా
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*
అమృత కాలం : *ఉ 09.16 - 11.03*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.31*
*వర్జ్యం :రా.తె04.08-05.55 వరకు*
*దుర్ముహూర్తం : మ 12.31 - 01.24 & 03.08 - 04.00*
*రాహు కాలం :ఉ07.12 - 08.50*
గుళికకాళం : *మ 01.43 - 03.21*
యమగండం : *ఉ 10.27 - 12.05*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*
సూర్యోదయం :*ఉ 05.41*
సూర్యాస్తమయం :*సా 06.47*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.34 - 08.10*
సంగవ కాలం :*08.10 - 10.47*
మధ్యాహ్న కాలం :*10.47 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 04.00*
*ఆబ్ధికం తిధి : అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి*
సాయంకాలం :*సా 04.00- 06.36*
ప్రదోష కాలం :*సా 06.36 - 08.48*
రాత్రి కాలం :*రా 08.48 - 11.43*
నిశీధి కాలం :*రా 11.43 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*
■■■■■■■■■■■■■■■■■■■■
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🔱రుద్ర స్తుతి🔱*
*శంభవే స్థాణవే నిత్యం*
*శివాయ పరిమాత్మనే*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
అష్టాదశ ప్రజలు
- అష్టాదశ ప్రజలు - కరండం - ఉగ్రాణం.
..........................................
(అ) ముఖ్యాగ్రహారమనేది అత్యున్నత స్థాయిలోవున్న అగ్రహారం.రాజులు సామంతులు మొ॥వారు హిందూశాస్త్రా
లలో విశేష పాండిత్యం కలిగిన బ్రాహ్మణులకు గ్రామాలను దానంగా ఇచ్చేవారు. అలాంటి దానగ్రామాలను అగ్రహారాలు అంటారు. వాటిలో అన్ని హక్కులు ప్రత్యేకాధికారాలు కలిగిన అగ్రహారాన్ని ముఖ్యాగ్రహారమని పిలిచేవారు. వారికి
భోగాష్టకములు అంటేఎనిమిది భోగాధికారాలుండేవి. (1)పౌరోవాత్యం – పురోహిత వృత్తి నిర్వహించే హక్కు (2) యాజకత్వం – యజ్ఞయాగాదులు నిర్వహించే అధికారం (3) ప్రభుత్వం – గ్రామ పరిపాలన లేదా స్థానిక అధికార హక్కు (4) జ్యోతిస్సారం – జ్యోతిష్య సేవలు అందించే హక్కు (5) హేమముద్రా పరీక్షా – బంగారు నాణేలు లేదా ధన ప్రమాణాల పరిశీలన హక్కు (6) సాముద్రికం – శరీర లక్షణాల ఆధారంగా ఫలితాలు చెప్పే విద్య అంటే సాముద్రిక శాస్త్రం. (7) లేఖకనం – పత్రాలు, శాసనాలు, లెక్కలు వ్రాసే అధికారం (8) యాజమానము – నిర్వహణ పర్యవేక్షణ నాయకత్వహక్కు. ఈ భోగాష్టకములతో పాటుగా
అష్టతేజస్వామ్యములు అగ్రహారానికి సంబంధించిన సంపదలు. ఈ అష్టతేజస్వామ్యముల వనరులపై వారికి హక్కులు ఉండేవి.(1) నిధి – భూమిలో దొరికే నిధులు (treasure trove) (2) నిక్షేప – భద్రపరచిన ధనం లేదా దాచిన వస్తువులు (3) జల – నీటి వనరులపై హక్కు (4) పాషాణ/ఆళ్మసార – రాళ్లు, ఖనిజాలు లేదా భూసంపదలపై హక్కు (5) అక్షీణ – ప్రస్తుతం ఉన్న స్థిర ఆదాయాలపై హక్కు (6) ఆగామి – భవిష్యత్తులో వచ్చే ఆదాయాలపై హక్కు (7) సిద్ధ – ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆస్తులు, ఫలసాయం (8) సాధ్య – భవిష్యత్తులో అభివృద్ధి చేయగల సంపదలపై హక్కు.ముఖ్యాగ్రహారం అనేది కేవలం భూమి దానం కాదు. గ్రామంలోని ఆదాయాలు నీటి వనరులు, నిధులు పరిపాలనా అధికారాలు పురోహిత హక్కులు విద్యా సంబంధిత అధికారాలు మొదలైన సమగ్ర హక్కులతో కూడిన గ్రామదానం. ఇలాంటి అగ్రహారాలను రాజులు వేదవేదాంగాలలో, శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగిన సద్బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చేవారు.
(ఆ) మంగలమంటే బ్రాహ్మణ అగ్రహారాలకు సంబంధించిన పేరు.
మంగలమనేది గ్రామ నామాల చివర వచ్చే ఒక ప్రత్యేక అంత్యపదం
ఉదాహరణకు
చతుర్వేది మంగలం
బ్రహ్మదేయ మంగలం
ఉత్తరమేరూరు మంగలం బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన గ్రామం. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో నివసించే గ్రామాన్ని సూచిస్తుంది.శాసనాలలోని నిర్వచనం ప్రకారం
ఏబదియెనిమిది (58) బ్రాహ్మణ కుటుంబాలు కలిసి నివసించే గ్రామాన్ని మంగలము అంటారు.
అంటే ఒక గ్రామంలో కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు స్థిరనివాసం ఏర్పరచుకొని వేదాధ్యయనం యజ్ఞయాగాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ గ్రామం మంగలముగా పరిగణించబడేది.
చతుర్వేది మంగలమంటే నాలుగు వేదాలను అధ్యయనం చేసిన బోధించే బ్రాహ్మణులున్న చోటు.దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చోళ పాండ్య విజయనగర కాలపు శాసనాల్లో చతుర్వేదిమంగలమనే పేరు చాలా సాధారణంగా కనిపిస్తుంది.
మంగలం అగ్రహారం బ్రహ్మదేయం మధ్య సంబంధమేమిటో చూద్దాం.బ్రహ్మదేయమంటే బ్రాహ్మణులకు దానం చేసిన భూమి లేదా గ్రామం.అగ్రహారమంటే బ్రాహ్మణ నివాస కేంద్రంగా ఏర్పడిన గ్రామం.మంగలమంటే నిర్దిష్ట సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామం.చోళుల కాలం ACE 9–13వ శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో అనేక గ్రామాల పేర్లకు మంగలమనే ప్రత్యయం జతచేయబడింది. ఇది ఆ గ్రామం బ్రాహ్మణ దానగ్రామం లేదా విద్యా కేంద్రం అని సూచిస్తుంది.
కనుక మంగలము కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామమే మంగలం.
(ఇ) కరండబేదకుడు అంటే కరండమనే వాయిద్యాన్ని వాయించువాడు.కరండమంటే 18 వాయిద్యాలలో ఒకటి.
అష్టాదశ (పదునెనిమిది) వాద్యాలేమిటో గమనిద్దాం.
(1) భేరి (2) మృదంగం (3) పటహం (4) దుందుభి (5) మద్దెల (6) తిమిల (7) ఇడక్క (8) ఉడుక్కు (9) కాహళం (10) శంఖం (11) కొమ్ము (12) వేణువు (13) సన్నాయి (14) తాళం (15) ఘంట (16) చెంగిలగాంగ్వాయిద్యం (17) కరడిక / కరండం (18) డమరు.ఈ
కరండం అష్టాదశ వాద్యాలలో ఒకటిగా కొన్ని శాసనాలలో ప్రస్తావించబడింది. అయితే నేటికి కరండం వాడుకలో లేకపోవడం వల్ల దాని నిర్మాణ విశేషాలు పూర్తిగా తెలియదు.
మధ్యయుగ దేవాలయాల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు రథయాత్రలు నిత్యసేవల సమయంలో అనేక వాద్యకారులు నియమించబడేవారు. అలా దేవాలయ సంప్రదాయంలో కరండవాదకుడు దేవాలయంలో, ఉత్సవంలో సంగీత బృందంలో కరండం అనే ప్రాచీన వాద్యాన్ని వాయించే కళాకారుడు అని అర్థం.
(ఈ) ఉగ్రాణము అనగా ధాన్యము ఇతర ఆహార నిల్వలు సరుకులను భద్రపరచే గిడ్డంగి.ఆంగ్లంలో దీనిని Granary అంటారు.గ్రామాలలో రైతులు పండించిన వరి, జొన్న, సజ్జ, గోధుమ, కొర్ర,సాములు, అరికెలు, అపరాలు వంటి ధాన్యాలను సంవత్సరమంతా నిల్వ ఉంచడానికి ప్రత్యేకంగా నిర్మించిన గృహాన్నే ఉగ్రాణము అని పిలిచేవారు.గరిసె అనేది ఉగ్రాణానికి తెలుగు పర్యాయపదం.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గరిసెలో ధాన్యం పోశారు. గరిసె నిండిపోయింది వంటి వాడుకలు కనిపిస్తాయి.ఉగ్రాణము అనే పదం సంస్కృతంలోని ఉగ్రాణ (Ugrāṇa) నుండి వచ్చింది.ధాన్యాగారం భాండాగారమనే అర్థాలు ఉన్నాయి.రాజ్యపాలనలో దేవాలయాలలో అగ్రహారాలలో ఉగ్రాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది.దేవాలయాలకు వచ్చిన ధాన్య దానాలు ఉగ్రాణాలలో నిల్వ చేసేవారు.రాజులు భూమిశిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని రాజఉగ్రాణాలలో భద్రపరచేవారు.
కరువు కాలాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి ఉగ్రాణాలు ఉపయోగపడేవి.అందుకే కొన్ని శాసనాలలో ఉగ్రాణాధికారి (Granary officer) ఉగ్రాణపాలకుడు,ధాన్యాగారాధికారి వంటి పదాలు కనబడుతాయి.
(ఉ) అష్టాదశప్రజలు = గ్రామములోని 18 ప్రధాన సామాజిక (వృత్తి) వర్గాలకు చెందిన జనులను అష్టాదశ ప్రజలు అని పిలిచేవారు.
(1) బ్రహ్మ = బ్రాహ్మణులు (2) క్షత్రియ = పాలకులు యోధులు (3) వైశ్య = వ్యాపారులు (4) శూద్ర = వ్యవసాయ, సేవావర్గాలు (5) వ్యావహారిక = వర్తకులు, లావాదేవీలు నిర్వహించేవారు (6) గోరక్షక = పశుపోషకులు
(7) శిల్పక = శిల్పులు చేతివృత్తి నిపుణులు
(8) పంచాణ = విశ్వకర్మ వర్గానికి చెందిన ఐదు శిల్పకుల సముదాయం
(9) కుంభకార = కుమ్మరులు
(10) తంతువాయి = నేతలు (సాలెలు)
(11) క్షౌరక = మంగళ్లు (క్షురకులు)
(12) రజక = చాకళ్లు
(13) వస్త్రచ్ఛేదక – బట్టలు కుట్టేవారు (దర్జీలు)
(14) చర్మకార – చెప్పుల తయారీ, తోలు పనివారు
(15) తిలఘాతుక – గానుగలతో నువ్వులు ఇతర గింజలు ఆడించి నూనె తీసేవారు.(16) లబ్ధక – వేటగాళ్లు లేదా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు (17) చండాల = గ్రామానికి చెందిన సమాచారాన్ని వార్తలను కొమ్ము లేదా తప్పెట ద్వారా చాటింపు వేయువారు.(18) మాతంగ – మాతంగ సమాజానికి చెందినవారు. వీరంతా కలసికట్టుగా స్థాయి భేదము లేకుండా గ్రామాభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి పాటుపడేవారు.
॥సేకరణII
................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
శ్రీమహావిష్ణుపురాణం
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 31 మే 2026*
*శ్రీమహావిష్ణుపురాణం*
*105వ భాగం*
*శ్రీకృష్ణావతారము -8*
*ధేనుకాసుర, ప్రలంబాసుర వత్సా సుర, బకాసుర సంహారం*```
కాళింది మడుగు నీళ్ళు కృష్ణ స్పర్శతో స్వచ్ఛమై పక్షులు, జంతువులు, మానవులు త్రాగడానికి అనుకూలంగా మారాయి. కాళింది మడుగు పరిసరాలు సందడి సందడిగా మారాయి. కృష్ణుడి వెంట ఉండే గోపబాలురు, వారి తల్లిదండ్రులు కృష్ణుడు దివ్యత్వం కలిగినవాడు అని తెలుసుకున్నారు. తమను ఎటువంటి ఆపద నుండి అయినా రక్షిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగింది. నిర్భయంగా గోపాలురు, బలరామకృష్ణుల వెంట వనాలలో గోవులను కాస్తూ తిరగసాగారు.
గోకులం నుంచి మాయమైన బలరామ కృష్ణులు,గోకులవాసులు,కాళింది మడుగు సమీపాన బృందావనంలో నివసిస్తున్నారు అన్న సంగతి "కాళీయమర్ధన"విశేషాలు విన్న కంసుడికి తెలిసింది.
తన సేవకులైన రాక్షసులనందరిని కృష్ణుని అంతం చేయమని ఆదేశించి బృందావనానికి పంపాడు.
బృందావనానికి అలా మొదట వచ్చిన రాక్షసుడు వత్సాసురుడు. ఆవుదూడ రూపం దాల్చి గోవుల మందలో చేరిపోయాడు. కృష్ణుని సమీపంలోనే ఉంటూ చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
మందలో ఉండే గోవులు, గోవత్సాలు (లేగలు) కృష్ణుడికి తెలుసు. ప్రతి దానికి పేరు పెట్టి, ఆ పేరుతో పిలిచేవాడు.
ఈ గోవత్సము కొత్తగా చేరింది. గోవుల సమీపంలో గోవత్సాలు
ఉంటాయి. ఈగోవత్సము మాత్రం కృష్ణుని వద్దనే ఉండేది. ‘వీడెవడో రాక్షసుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు’ అని అర్ధమైంది.
ఒకరోజు గోపబాలురు గోవులను, గోవత్సాలను కృష్ణుడికి దూరంగా మేతకు తీసుకెళ్లారు. వత్సాసురుడు వెళ్లినట్టే వెళ్లి తిరిగి కృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడు చూసి ఆ రోజు వాడికి మోక్షం కలిగించాలని అనుకున్నాడు. బలరామునికి కొద్దిదూరానికి వెళ్లి ఉండమని సైగ చేసాడు. బలరాముడు కొద్ది దూరం వెళ్లి చెట్టు చాటునుండి చూడసాగాడు.
ఎవరూ కృష్ణుడి పక్కన లేకపోవడం చూసి వత్సాసురుడు తన గిట్టలతో కుమ్మి చంపాలని వేగంగా కృష్ణుడి మీదకు రాసాగాడు. కృష్ణుడు వాణ్ణి దగ్గర వరకు రానిచ్చి చటుక్కున మెడను రెండు చేతులతో పట్టుకుని గాలిలో గిరగిరా వేగంగా తిప్పి తిప్పి విసిరివేసాడు. గడ్డిపోచలా ఆకాశంలో ఎత్తుకి ఎగిరిన రాక్షసుడు భూమి మీద పడి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చి పోయాడు.
మరణించేటప్పుడు రాక్షసుని అరుపులు విని, రాక్షసుడి భారీ కాయము చూసి గోపబాలురు ఏమి భయపడలేదు. మరొక రాక్షసుడి పీడ మా కన్నయ్య వదిలించాడు అని సంబరపడ్డారు. బలరామ కృష్ణులు గోప బాలురను తల్లి తండ్రులకు, గ్రామంలోని వారికి ఏమి చెప్పవద్దని ఆదేశించారు. అందరు కలసి ఆ రాక్షసుడి దేహము దహనం చేశారు.
*తరువాత వచ్చినవాడు బకాసురుడు. పేరుకు తగ్గట్టే భయకర కొంగ రూపం దాల్చి గోపాలురు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నీరు త్రాగే సరస్సువద్ద నిలిచాడు. గోపాలురు రోజూలాగానే మధ్యాహ్నభోజనం చేసి నీరుత్రాగుతున్నారు. పర్వతాకారంలో ఉన్న కొంగ వారిని తినాలని పరిగెత్తు కుంటూ వచ్చింది. గోపబాలురు ‘కృష్ణా కృష్ణా’అంటూ అరవసాగారు.
కృష్ణుడు పరుగున వచ్చి కొంగ ముందు నిలిచాడు. బకాసురుడు కృష్ణుని పట్టుకుని మింగటానికి ప్రయత్నించాడు.
కృష్ణుడు నోటికి అడ్డంగా నిలిచాడు. తన ఆకారం పెంచాడు. బకాసురుడు మింగాలేక కక్కాలేక ఇబ్బంది పడుతు న్నాడు. కృష్ణుడు కిందభాగం నొక్కిపెట్టి పైభాగాన్ని చేతులతో పట్టుకుని చీల్చివేశాడు. బకాసురుడు అరుస్తూ తన రాక్షస రూపం దాల్చి చచ్చి పోయాడు.
*తరువాత కృష్ణుడి చేతిలో మరణించింది ధేనుకాసురుడు. బృందావనం సమీపంలో గల తాటివనం ఆక్రమించి తన సేవకులతో ఉంటూ ఎవరినీ రాకుండా చంపేసేవాడు. తాటి వనంలో తాటిఫలాలు మహారుచిగా ఉంటాయని గోపబాలురు చెప్పడంతో కృష్ణబలరాములు తాటివనంలో ప్రవేశించారు. అడ్డువచ్చిన వారిని కొట్టివనంలో తాటిచెట్లు ఎక్కి పళ్లు కోసి గోప బాలురకి ఇవ్వసాగారు.
దెబ్బలు తిని పారిపోయిన కాపాలావాళ్ళు ధేనుకాసురుడికి చెప్పారు. ధేనుకాసురుడు, తన తోటి రాక్షసులు గార్ధభ రూపం దాల్చి గోపబాలురని తరుముతూ బలరాముడు,కృష్ణుడి వద్దకు వచ్చారు. బలరాముడు మిగిలిన రాక్షసుల పని పట్టగా, కృష్ణుడు ధేనుకాసురుడి ముందు రెండు కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు.
వాడు రాక్షస రూపం దాల్చి భూమి మీద పడి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ధేనుకాసురుని తాటివనం అందరిది అయ్యింది.
*ధేనుకాసురుడి మరణవార్త విని కంసుడు ప్రలంబాసురుడు అనే మరో రాక్షసుని పంపాడు. వాడు ఒక గోపబాలుని రూపం ధరించి గోపబాలురిలో కలసి బలరామ కృష్ణుల వెంట వనాలలో తిరుగసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అదృశ్యమై వనంలో ఉండేవాడు.
ప్రలంబాసురుడు గోపబాలునిగా బాగా కలసి పోయి ఆటలు ఆడుతుండంతో గోపబాలురు అతనెవరో పట్టించు కోలేదు. కాని బలరామ కృష్ణులు గ్రహంచారు. సమయం చూసి భరతం పడదామని ఉన్నారు.
బలరాముడు కృష్ణుని ఈసారి రాక్షసుని చంపే అవకాశం తనకి ఇవ్వమని కోరాడు.
ఆ రోజు బల రామ కృష్ణులు తమ రూపాలు మార్చుకున్నారు. బలరాముడు కృష్ణుడయ్యాడు. కృష్ణుడు బల రాముడయ్యాడు. ప్రలంబాసురుడు గోపబాలురతో గోపబాలుడిగా ఆడుతూ, ఆటలో ఓడిపోయిన వారు, గెలిచిన వారిని భుజాలపై ఎత్తుకుని వనం చివరన ఉన్న వృక్షము దాకా వెళ్లివెనక్కురావాలి అని నియమం పెట్టాడు.
ఆటలో ప్రలంబుడు కావాలనే కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. అది చూసి బలరాముడు కూడా ఒక గోపబాలుడి చేతిలో ఓడి పోయాడు. ఆట నియమం ప్రకారం ప్రలంబుడు కృష్ణుని భుజాలపైకి ఎత్తుకుని వేగంగా వెళ్ళ సాగాడు. బలరాముడు గోపబాలుని ఎక్కించుకుని ప్రలంబుడి వెంట వెళ్ళసాగాడు. దూరంగా వనం చివరకు తీసుకెళ్లి రాక్షసరూపందాల్చి కృష్ణుని చంపేయాలని అనేది ప్రలంబుడి పన్నాగం.
కానీ ఆ రాక్షసుడికి తెలియనది బలరామ కృష్ణులు తమ ఆకారాలు మార్చుకుని ఉన్నారన్న సంగతి.
గోపబాలురకు కనపడకుండా దూరంగా వేగంగా వెళ్ళుతున్న ప్రలంబుడినిచూసి బలరాముడి రూపంలోని కృష్ణుడు చూసి "అన్నా! బలరామ! ప్రలంబాసురుని చంపేయి" అని వినపడేంత గట్టిగా అరిచి ఆగిపోయాడు.
ప్రలంబుడు "నేనుఎక్కించుకుంది కృష్ణుని కదా! బలరామా అని బలరాముని పిలుస్తాడేమిటి!" అని ఆశ్చర్యంగా పరిగెడుతునే తలెత్తి చూశాడు.
పైన కృష్ణుడి మాటలతో కృష్ణ రూపం వదలిన బలరాముడు కనిపించాడు. కృష్ణుడి మాటలు విని బలరాముడు ప్రలంబాసురుడు మెడలు విరిచి తలపై చావు దెబ్బ కొట్టి సంహరించాడు.
చనిపోయిన రాక్షసుడి దేహాన్ని గోపబాలురు కాల్చివేశారు.
బలరామ కృష్ణులు ఊరిలో చెప్పవద్దన్నా వత్సాసుర, బకాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర సంహారాలు నంద యశోదలతో పాటు గ్రామంలోని వారందరికి తెలిసాయి. బలరామ కృష్ణుల బలపరాక్రములు నంద గ్రామంలో అందరికి తెలుసు కాబట్టి ఎవరు భయపడలేదు. బృందావనం రాక్షసుల పీడ నుంచి విముక్తి చెందినందుకు సంబరాలు చేసుకున్నారు.
కానీ కంసుడిలో అసహనం పెరిగి పోతోంది. చివరగా మిగిలిన తృణావర్త, అజగర, కేసి నామ రాక్షసులను కృష్ణుని అంతమొందిం చటానికి పంపాడు.
*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారిసౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
భక్తి
_*భక్తి*_
ఈశ్వరుని కృప పొందడానికి ఉత్తమ మార్గం నిస్వార్థ , నిర్మలమైన భక్తి.
ఆ భక్తి కనక ఉన్నట్లయితే వేరే అర్హతలు ఏమీ అవసరం లేదు, వనంలోని నిషాదుడు కూడా అందరి గౌరవాన్ని పొందే స్థాయికి ఎదుగుతాడు.
మనం అందరం కన్నప్పగురించి విన్నాము.
అతడికి చదువు,ఆచారం, సంపత్తు ఏమీ లేదు, కానీ అతడి భక్తి అనన్యసామాన్యమైనది...
కన్నప్ప అడవిలో ఎవరూ అర్చించని శివలింగాన్ని చూశాడు, దాన్ని పూజించాలని నిశ్చయించుకున్నాడు.
శివలింగం పైన దుమ్మును దేనితో శుభ్రం చెయ్యాలో తెలియక తన పాదరక్షలను ఉపయోగించాడు, నదినుండి నీటిని పుక్కిలి పట్టి నోటితో తెచ్చి అభిషేకిమ్చాడు, అంతకుముందు తాను వేటాడిన మృగమాంసం నివేదించాడు, కన్నప్పలాగ మనం కూడా ఆచారం లేకుండా పూజ చేయ్యగలము అనుకునే వారికి కొంచెం హెచ్చరించాలి.
శివుని కన్నులనుండి నీళ్ళు కారటం చూసి తన కన్నులు పేరకి అక్కడ పెట్టాడు.
అతడి శ్రద్ధాభక్తి అలాంటిది, అందుకే శివుడు మోక్షమిచ్చాడు, మనకు అటువంటి భక్తి ఉన్నదా అటువంటి సేవ చేస్తే సరిపోతుందని అనుకోవడానికి?
భక్తి అందరికీ ముఖ్యమే.
శాస్త్రాలు నవవిధభక్తుల గురించి చెబుతాయి, కొంతమందికి భగవంతుని మీద ప్రవచనం వినడంలో సంతోషం లభిస్తుంది, కొందరికి నిరంతర భగవన్నామ పారాయణ ఇష్టం.
గోపికాస్త్రీలకు శ్రీకృష్ణ భగవానుడంటే విపరీతమైన భక్తి, ఓక గోపిక తాము తీసిన పాలు, పెరుగులు అమ్ముతూ పాలు, పెరుగు అని అరవడం బదులు “గోవిందా, దామోదరా, మాధవా...” అంటూ అరుస్తోందిట.
అందరూ ఆవిడకు పిచ్చెక్కిందా అనుకున్నారట, కానీ ఆ గోపస్త్రీ మనస్సు పూర్తిగా భగవంతుని యందు నిమగ్నమైవున్నది,
మహాత్ముడైన శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు గొప్ప జీవన్ముక్తులు, వారి ప్రవర్తన పరికించిన వ్యక్తులు ఆయనకు మతి చలించిందని భావించి వారి గురువు గారిదగ్గరకు వెళ్లి విన్నవించారట. దానికి గురువుగారు విచారంగా “మా శిష్యుడికి పిచ్చేక్కిన్దంటున్నారు.
ఆ పిచ్చి నాకేక్కలేదే అని నాకు బాధగా వుంది.
నన్ను నేను గురువు అని చెప్పుకుంటున్నా, ఆ దశకు ఇంకా చేరుకోలేదు.
ఆయన మహాత్ముడు” అని చెప్పారట.
ఏ పని చేసినా భగవంతుని ధ్యానిస్తూ చెయ్యడం కూడా ఒక గొప్ప భక్తియే.
కొంతమందికి భగవంతుని పూజలో సమయం గడపడం చాలా ఇష్టం.
ఎటువంటి ఆటంకం లేకుండా పూజగదిలో గడపడానికి వారు సంతోషపడతారు.
వీళ్ళకు విరుద్ధంగా కొంతమంది పట్టుమని పది నిముషాలు గడపడానికి ఎంతో అసహనం ప్రదర్శిస్తారు.
వాళ్ళు తమ పురోహితుడిని సహస్రనామం బదులు శతనామం, లేదా ఇంకా లఘువుగా ముగించమని తొందర చేస్తుంటారు.
పూజా సమయంలో కూడా వాళ్ళు ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటారు.
శ్రద్ధ గలిగిన వాడు పూజలో కూర్చున్నప్పుడు సమయం గడచిపోవదాన్ని గుర్తించడు,
పూజించడం ఒక విధమైన భక్తి,
ఆంజనేయుని వంటి భక్తులకు స్వామి సేవయే పరమావధి.
ఆత్మనివేదన విషయంలో అన్నీ అర్పించిన బలి చక్రవర్తి మనకు స్ఫూర్తి.
*నవవిధ భక్తులు:*
1. భగవంతుని గురించి వినడం ( శ్రవణం )*
2. భగవంతుని స్తుతించడం (కీర్తనం)
౩. భగవంతుని మనస్సునందు నిలుపుకోవడం ( స్మరణం)
4. భగవంతుని పాద సేవనం
5. భగవంతునిరూపాన్ని పూజించడం ( అర్చనం )
6. భగవంతుని ముందు సాష్టాంగ ప్రణామం (వందనం)
7. భగవంతుని ముందు దాసుని వలె సేవించడం ( దాస్యం)
8. భగవంతుని స్నేహితునిగా భావించడం ( సఖ్యం)
9. భగవంతుని సర్వదా శరణు చొచ్చటం(ఆత్మ నివేదనం )
వీనిలో ఏ భక్తి మార్గాన్ని ఆశ్రయించినా మనకు శ్రేయస్సు లభిస్తుంది.
*_శుభమస్తు_*
🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా....✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏
సామాజిక స్పృహ
*సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 10*
ఆసేతు హిమాచలం విభిన్న సంస్కృతుల, మతాల కులాల , వర్గాల సంప్రదాయాల సమాహారమే మన భారత దేశం. వివిధ సిద్ధాంతాల ననుసరించి భారతీయ సమాజ నిర్మాణంపై ప్రజలలో విరుద్ధ భావాలున్నవి. చక్కని శ్రమ విభజనతో, పరస్పర గౌరవం లభించేలా వివిధ జీవన విధానాలను ఏర్పరచిన మన వర్ణ వ్యవస్థను, అసహనంతో వికృతంగా వక్రీకరించి *కులవివక్షగా* చిత్రించడం చాలా దారుణం, దురదృష్టకరమే గాక *అనాగరికం కూడా*.
చాలా మంది సభ్యులు ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, అవును నిజమే. ఈ దురాగతాలన్నీ అరికట్టాలని ఉన్నది. *నిశ్చయంగా ఈ నిర్ణయం నాగరికత లక్షణమే*. కాని వెంటనే *నా ఒక్కరి వల్ల ఏమవుతుంది అని* కూడా తలపోస్తూ ఉంటారు కూడా. ఈ దేశంలో అధిక సంఖ్యాకుల స్తబ్ధత, నిర్లిప్త ధోరణి, స్వార్థాలు, అన్నిటికంటే మించి *స్వప్రయోజనాలు మాత్రమే* అను ధోరణి *అనాగరికానికి హేతువు*
*The mountain is you* అను పుస్తకంలో మహిళా రచయిత్రి (అమెరికన్) *BRIANNA WEIST* ఒక చోట ఇలా అంటారు There is nothing *holding* you *back* in life *more* than *you". ఇది ముమ్మాటికీ వాస్తవము. మన వెనుకబాటుకు మనమే కారణము*.
ఈ రచయితనే ఇంకొక మాట గూడా చెబుతారు *Transform self SABOTAGE into self MASTERY*. మన *తప్పిదాలను* మన *విజయాలుగా* మార్చుకుందాము. మన పెద్దలు గూడా చెబుతూ ఉంటారు *ఒక అడుగు ముందుకు మైళ్ళు మైళ్ళు దాటగలవు* అని.
రెండు విషయాలు మనం జ్ఞాపకముంచుకుందాము.
1) *సాధనాథ్ సాధ్యతే సర్వం*
2) *షడ్భాగంతు మనుష్యానామ్ సప్తమం దైవ చింతనమ్*
సమాజ శ్రేయస్సు విషయమై ముందుకు వచ్చే సభ్యులందరికి మా అందరి అభినందనలు. *పూర్ణ నాగరికతా చైతన్య లక్ష్య* సాధనలో
*మీ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మా అందరి ఆకాంక్ష*.
విజ్ఞులైన సభ్యులకు ఇంతకంటే అధికముగా వివరించుట దుస్సాహసమే అవుతుందని భావిస్తున్నాను. నా మనోగతం తో సెలవు.
*శుద్ధము మనస్సును, పరిశుద్ధము ప్రవర్తనమును, ప్రణాళికాబద్ధము అహర్నిశమును, సుతిబద్ధము నా వచోవిధానమును, సంసిద్ధుడను దేనికైనను*
ధన్యవాదములు.
*(స్వస్తి)*
🙏🙏🙏
సంపూర్ణ మహాభారతము*
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*ఆదివారం 31 మే 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
2️⃣4️⃣2️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*242 వ రోజు*
*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*```
విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు ఏభై బాణాలతో అర్జునిని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రధాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారధులను హయములను తెగ నరికాడు. అర్జునిని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు "అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు అతడిని ఎదుర్కొన గలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరూ ఇలా చూస్తూ ఊరు కోవడం ఏమన్నా బాగా ఉందా" అన్నాడు.
భీష్ముడు "నా శాయ శక్తులా యుద్ధంచేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి" అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్ళించి వికర్ణుడు, అశ్వధ్ధామ వెంట రాగా అర్జునిపై ఒక్క సారిగా లంఘించి బాణ వర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునినికి గాంగేయునకు మధ్య పోరు లోకభీకరంగా జరిగింది.
భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేసాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు.
ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది.```
*పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం*``
మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు.
ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి, తరువాత నాలుగు బాణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణునిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు ద్రోణుడు దానిని పొడి చేసాడు. ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజృంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు. ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
మూక పంచశతి*
*మూక పంచశతి*
*ఉపోద్ఘాతము*
*ఆయన మూకశంకరేంద్ర సరస్వతీ స్వామి. ఆయనే (మూగవాడైన ) మూకశంకరులు. కామాక్షీమాత దివ్యానుగ్రహంతో మాటలు వచ్చి మహాకవియై ఆశువుగా 500 శ్లోకాలను అమ్మవారిపై అనర్గళంగా చెప్పి “మూక పంచశతి” అనే స్తుతి కావ్యానికి తెరదీసిన యోగీశ్వరుడు. కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా పనిచేసి, అమ్మవారిలో ఐక్యత నొందిన దివ్యపురుషుడు మూకశంకరులు.*
*మనకున్న శక్తిపీఠాలలో ప్రసిద్ధమైంది కాంచీపురం. ఇక్కడ శక్తిపీఠం ఇతర శక్తిపీఠాలకు శక్తి, దీప్తి, స్పూర్తులను సదా అందిస్తోందని ప్రతీతి. కాంచీపురం మోక్షపురిగా ప్రసిద్ది. ఇక్కడున్న మహాశక్తి అమ్మవారు కామాక్షీ మాత. స్వామి ఏకామ్రేశ్వరుడు. కామేశ్వరునే కనులలో దాచుకున్న తల్లి కామాక్షి. సకల కామితాలకు సాక్షియై అనుగ్రహించే తల్లి కామాక్షి. త్రిమూర్తులే త్రినయనాలుగా కల్గిన తల్లి కామాక్షీ మాత అని అంటారు. కామునకు పునర్జన్మనిచ్చి, అనంగునిగా మార్చి, రతీదేవికి సంతృప్తిని కల్గించిన తల్లి కామాక్షి అనికూడా పండితులు సెలవిస్తున్నారు. ఆ కామకోటి పీఠానికి గురుపరంపరలో 20వ పీఠాధిపతి మూకశంకర సరస్వతీస్వామి పుంభావ వాగ్దేవీ మాత. క్రీ.శ. 398 నుండి క్రీ.శ 437 వరకు 39 సం||లు కంచిపీఠమును నిర్వహించిన మహాయోగి మూకశంకరులు.*
*ఖగోళ శాస్త్ర పండితులైన శ్రీ విద్యాపతికి జన్మించినవారు మూకశంకరులు. పుట్టుకతో మూగతనం, చెవుడు ఉన్నాయి. అయినా ఆదినుండి అమ్మవారి ధ్యానంతో పెరిగాడు. ఒకమారు తన మిత్రునితో కంచికి పోయి, అమ్మవారి ఎదుట ధ్యానంలో మూకశంకరులు నిమగ్నమైనారు. ఇంతలో కాంచీపుర పీఠ శిఖాధిరూఢయైన ఆదిమశక్తి కామాక్షీమాత సామాన్యకాంతగా, పండు ముత్తైదువగా ఆలయంలోనికి వచ్చి మూకశంకరులను సమీపించింది. తాను నములుతున్న తాంబూలం ఎంగిలి పిడచను నోటినుండి తీసి ఎదురుగా ఉన్న శంకరుల మిత్రునకివ్వబోయింది. అమ్మవారిని గుర్తించలేని ఆ సాధకుడు, ఆ ముత్తైదువ ఎంగిలిని తిరస్కరించాడు. అప్పుడు ఆ తల్లి ప్రక్కన ఉన్న మూకశంకరులకిచ్చింది. మూకశంకరులు భక్తితో తీసుకుని, కళ్ళకద్దుకుని, ఎదురుగా ఉన్న అమ్మకు (పండు ముత్తైదువకు ) నమస్కరించి నోటిలో వేసుకొని నమిలినాడు. అంతే శంకరుల మూగతనం మాయమైంది. మాటల ప్రవాహం పెల్లుబికి వచ్చాయి. కనులు వర్షించాయి. ఒళ్ళు పులకరించింది. భావావేశం, సాహిత్యాభినివేశం, భక్త్యార్ద్రతలు సమ్మిళితమై అతని నోట ఆశువుగా ఛందోబద్దమైన శ్లోకాల జలపాతం ప్రారంభమైంది. 500 శ్లోకాలు ఆలపిస్తే గాని మూకశంకరుల భావావేశం శాంతించలేదు. ఇంతలో అమ్మ “నాయనా! ఏమైనా వరం కోరుకో. అనుగ్రహిస్తా”నంది. అప్పుడు మూకశంకరులు “అమ్మా! నీ నామ మహిమ, నీ పాద మహిమ, నీ కటాక్ష వైభవం, నీ మందస్మితం, నీ దివ్యత్వాలను సంస్తుతించిన నోటితో లౌకికాలు మాట్లాడలేను. కనుక అమ్మా! తిరిగి నాకు మూగతనాన్ని అనుగ్రహించ”మని కోరినాడు. అమ్మ “తథాస్తు" అంది. పారలౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు. ఇది తెలిసి కంచిపీఠం స్వామి శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి, మూకశంకరులను పిలిపించి, ఆయన తల్లితండ్రుల అనుమతితో సన్యాసదీక్ష, ఉత్తరాధికారిగా చేయడం, అనంతరం మూకశంకరులు కంచిపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.మూక పంచశతి గురించి ఎందరో పెద్దలు వివరించారు, ఐతే ముఖ్యంగా మూక శంకరుల పరంపరనుంచీ ఎందరో పెద్దలు చెప్పే విషయం ఒకటున్నది. మూక పంచశతి వైభవం అంతలా ఎందుకున్నదో ప్రతిపాదిస్తూ పండితులు ఉపాసకులు చెప్పే మాట అది. శివానందలహరి పారాయణ చేస్తే (బయటికి కానీ లోపల కానీ) ప్రత్యక్షంగా శంకరులే శబ్దరూపంలో ఎదురునిలుస్తారు అని అంటారు. అలాగే సౌందర్యలహరి పారాయణ చేస్తే జగదంబ శబ్దరూపంలో ప్రకటితమౌతుందనీ అంటారు. అందుకే తగిన శౌచం, కనీసం అంతశ్శౌచంలేకుండా ఈ పారాయణ చేయరు. పెద్దలైనవారు బాగా చదవడం వచ్చినవారి దగ్గరే చదవడం నేర్చుకోమని చెప్పడానికి కారణం అదే. దీనిలో ఆదిశంకరులు మంత్ర శాస్త్ర రహస్యాలను కథారూపంలో దాచేయడం వల్ల వీటికీ యంత్రాలు అధిదైవతం ఉపాసన ఉపదేశాలున్నాయి.*
*అలాగే "మూక పంచశతి" విషయంలో, మూకమహాశయుడు అంతకు పూర్వం పండితుడూ, విద్వత్తున్నవాడూ అని చెప్పడం క్లిష్టం. ఒకవేళ అలా అయ్యుంటే మూక మహాశయులు దీనికన్నా ముందే స్తోత్రాలో గ్రంథాలో రచించి ఉండేవారు,అవి లభ్యంలోనూ ఉండేవి. చరిత్రలోనూ అలా లేదు.*
*మూకమహాకవి అమ్మవారి వైభవాన్ని కొలుస్తు 'ఆర్యా శతకం', పాదాలను దర్శించి 'పాదారవింద శతకం', అమ్మప్రేమను పొందిన ఆనందంలో అమ్మవారి హృదయంలోని కరుణను తలుస్తూ 'స్తుతి శతకం', అమ్మవారి క్రీగంటి చూపు మహిమను తెలిపే 'కటాక్ష శతకం', అమ్మవారి సన్నని తెల్లని నవ్వును చూసి చెప్పిన 'మందస్మిత శతకం' అనే ఐదు స్తుతి ఝరులు ప్రవహించాయి.*
*ఈ ఐదు శతకాలూ అమ్మ వలననే, అమ్మ నోటి తాంబూలపు పిడచ మహిమ వలననే ప్రకటించబడ్డాయి కాబట్టి, ఈ స్తోత్రాలు ఎక్కడ చదివినా, విన్నా, ఆ గ్రంథం ఏ ఇంట ఉన్నా శాబ్దిక స్వరూపంలో కామాక్షి ప్రత్యక్షమైనట్టే అని పెద్దల ప్రతిపాదన.*
🙏🙏🙏
సేకరణ
విష్ణు సహస్రనామం* *..ఎలా వచ్చింది!!!*
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
*విష్ణు సహస్రనామం*
*..ఎలా వచ్చింది!!!*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు.
కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు.
మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?
అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి,
*"ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది?"*
అని అడిగారు.
ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు.
మళ్ళీ స్వామివారు,
*"విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"*
అని అడిగారు
ఒకరన్నారు,
"భీష్ముడందించారన్నారు"
స్వామివారు, *"భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"*
మళ్ళీ నిశబ్దం.
స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు.
భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.
అప్పుడు యుధిష్టురుడన్నాడు,
*"ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా"* అని.
"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.
శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.
"అదెలా" అని అందరూ అడిగారు.
శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే *సూత స్పటికం* వేసుకున్నాడు.
ఈ స్పటికం మహేశ్వర స్వరూపం.
దీని ప్రత్యేకతేంటంటే...
వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది.
సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.
శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.
ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూధానం ||
హరిం నరహరరిం రామం గోవిందం దధివామనం ||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వడదెబ్బతో చనిపోతే
*వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*
తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd
*పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*
*1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*
- *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.
- *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.
- *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. a0e3
*2. పోస్టుమార్టం తప్పనిసరి*
వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3
*3. కావాల్సిన డాక్యుమెంట్లు*
1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి
2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి
3. పోలీస్ FIR కాపీ
4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్
5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం
6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక
7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్
*4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*
అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. a4bd
*ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*
నిబంధన వివరణ
**వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.
**టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.
**ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.
**మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.
**ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.
*పరిహారం రాకపోవడానికి కారణాలు*
1. పోస్టుమార్టం చేయించకపోవడం
2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం
3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం
4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం
*మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
మీ బుర్ర నర్సయ్య గౌడ్
వివేకచూడామణి
*వివేకచూడామణి*
*శ్రీఆదిశంకరాచార్య విరచితము*
*66. తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే*
*స్వేనేవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితైః*
*పదవిభజన :*
*తస్మాత్ + సర్వప్రయత్నేన - భవబంధవిముక్తయే - స్వేన + ఏవ - యత్నః - కర్తవ్యః +* *రోగాదేః + ఇవ -*
*పండితైః*
*భావము :*
*రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగవిముక్తి పొందినట్లు, సంసారబంధ నివృత్తి కోరే వివేకి అయిన సాధకుడు, శ్రవణమననాది సకలోపాయాల సహాయంతో, సర్వవిధాలా స్వప్రయత్నం చేసి, ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకోవాలి.*
*వివరణ* :
*స్వేన + ఏవ= స్వేనైవ =* *స్వయముగానే*;
*తన బంధము ఇతరులచే* *తొలగింప శక్యము*
*కానిదవటం వలన,* *సాధనచతుష్టయ*
*సంపన్నుడైన తాను కూడా గురువును చేరి, అతని ముఖము నుండి వేదాంతములను విని వాటి అర్థాలను మననం చేసి, నిదిధ్యాసనం చేసి, నిర్వికల్పక నిష్టచే బ్రహ్మతత్త్వాన్ని స్పష్టంగా తెలుసుకొని మోక్షాన్ని పొందవలెనే గాని, వేరే విధంగా పొందలేడు.*
🙏🙏🙏
గర్భస్రావం
తరచుగా గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు -
కొంత మంది స్త్రీలకు తరచుగా గర్భస్రావం అవుతూ ఉంటుంది . అటువంటి స్త్రీలకు రావిచెట్టు బెరడు చూర్ణం రెండున్నర గ్రాముల మోతాదుగా వెన్న, పంచదార కలిపి రోజుకు నాలుగయిదు సార్లు ఇస్తుంటే గర్భస్రావం కాకుండా ఆగిపోతుంది...
కొద్ది కొద్దిగా విరేచనాలు అవుతున్నప్పుడు -
అల్లం, బెల్లం సమబాగాలుగా కలిపి దంచి పూటకు పిల్లలకు రెండున్నర గ్రాములు , పెద్దలకు అయిదు గ్రాముల మొతాదుగా తినిపిస్తుంటే మాటిమాటికి అయ్యే విరేచనాల భాద తగ్గిపోతుంది అదేవిదంగా అరిచేతులు , అరికాళ్లు లొ పొరలు ఊడటం కూడా హరించి పోతుంది.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
మోక్షవేత్తలు
విదురుడు చెప్తున్నాడు. “రాజా! మోక్షవేత్తలు ఉదాహరించిన పోలిక ఇది. దీనిని గ్రహించటం వలన, మానవుడు పరలోకంలో సుకృత ఫలాన్ని పొందగలడు. ఆ అడవి అన్నది మహాసంసారమే. దుర్గమవన మన్నది సంసారం యొక్క నిగూఢ (క్లిష్ట) స్వరూపం. పాము లని చెప్పినవన్నీ రోగాలు. పెద్దశరీరంతో అక్కడ నిలిచిఉన్న స్త్రీ అంటే వార్ధక్యమే. అది రూపాన్నీ, రంగునూ నాశనం చేస్తుంది. రాజా! అక్కడ బావి అని చెప్పినది జీవి శరీరమే. అక్కడ బావిలో క్రింద ఉన్న ఆ మహాసర్పం కాలమే. అది సర్వప్రాణులనూ అంతం చేసేది. దేహధారుల సర్వస్వాన్నీ అపహరించేది. బావి మధ్యలో పెరిగిన తీగ దేహధారులకు గల జీవితాశ. దానిలో చిక్కుకొనే గదా ఆ మానవుడు వ్రేలాడుతున్నది. రాజా! ఆ బావిపై గట్టు దగ్గర ఆ చెట్టును సమీపిస్తున్న ఆరు ముఖాల ఏనుగు సంవత్సరం. దానిముఖాలు ఆరు ఋతువులు. పాదాలు పన్నెండు నెలలు. ఎప్పుడూ ఉద్యమిస్తూ, ఆ వృక్షాన్ని కొరుకుతున్న ఎలుకలు రాత్రింబవళ్ళు. ప్రాణివిచారణ చేసే పండితులు అలా చెప్పారు. అక్కడున్న తేనెటీగలు కోరికలుగా చెప్పబడుతున్నాయి. విరివిగా తేనె ధారలను స్రవిస్తున్న ఆ ధారలు, కామరసాలు అని గ్రహించాలి. మానవులు వాటిలోనే మునిగిపోతారు. పండితులు సంసార చక్ర గమనాన్ని ఈ విధంగా గ్రహిస్తారు. అందుకే ఆ బుధులు (వైరాగ్యంతో) సంసారచక్ర బంధాలను ఛేదిస్తారు.”
సుబ్రహ్మణ్యస్వామి దగ్గర
సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు....!!
🌿సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది.
మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు.
🌸ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!
🌿దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు.
🌸 ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు.
🌿 తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది.
🌸ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు.
🌿కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.
🌸శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు.
🌿 కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.
🌸ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు.
🌿అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది.
🌸కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు.
🌿కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.
శూపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు.
🌸కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి.
🌿 నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు.
