31, మే 2026, ఆదివారం

వివేకచూడామణి

 *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*66. తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే*

*స్వేనేవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితైః*


*పదవిభజన :*

*తస్మాత్ + సర్వప్రయత్నేన - భవబంధవిముక్తయే - స్వేన + ఏవ - యత్నః - కర్తవ్యః +* *రోగాదేః + ఇవ -*

*పండితైః*


*భావము :*

*రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగవిముక్తి పొందినట్లు, సంసారబంధ నివృత్తి కోరే వివేకి అయిన సాధకుడు, శ్రవణమననాది సకలోపాయాల సహాయంతో, సర్వవిధాలా స్వప్రయత్నం చేసి, ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకోవాలి.*


*వివరణ* :

 *స్వేన + ఏవ= స్వేనైవ =* *స్వయముగానే*;


*తన బంధము ఇతరులచే* *తొలగింప శక్యము* 

*కానిదవటం వలన,* *సాధనచతుష్టయ*

*సంపన్నుడైన తాను కూడా గురువును చేరి, అతని ముఖము నుండి వేదాంతములను విని వాటి అర్థాలను మననం చేసి, నిదిధ్యాసనం చేసి, నిర్వికల్పక నిష్టచే బ్రహ్మతత్త్వాన్ని స్పష్టంగా తెలుసుకొని మోక్షాన్ని పొందవలెనే గాని, వేరే విధంగా పొందలేడు.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: