ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
14, ఫిబ్రవరి 2026, శనివారం
సరదా మాటలు
🌀💠💠💠🌀💠💠💠🌀
*సరదా మాటలు - *
*పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు :*
🌀💠💠🌀💠🌀💠💠🌀
తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ….. అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.
*‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’* అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ (అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన (అంటే కొడుకు).
*‘నీ కొడుక్కేంట్రా ఇరవై తొమ్మిది. గొప్పింటి సంబంధాలు వస్తాయి’* అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’
*‘వాడికోసారి నలభై జరిగినా తెలిసి రాలేదు’* అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘పరాభవ’
*‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ముప్పయి, ముప్పై మూడు కదా! ‘* అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’
*‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’* 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’
*‘వాడితో వాదనెందుకురా వాడో యాభై అయిదు* . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’
*‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ నలభై ఒకటి లే'* అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’
*‘వాడసలే ముప్పై ఎనిమిది జాగ్రత్తగా మాట్లాడు.* అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు ‘క్రోధి’
🤣😂🤣
🌀🌀🌀💠💠💠🌀🌀🌀
ప్రాణామాయం_
*_#ప్రాణామాయం_*
*వివిధ జంతువుల శ్వాసల సంఖ్య (నిమిషానికి) మరియు వాటి సగటు జీవనకాలం — సులభంగా అర్థమయ్యేలా ఒక పట్టికగా ఇస్తున్నాను*
*గమనిక: ఇవి సగటు అంచనాలు (approximate values). ప్రకృతి, పరిమాణం, జీవక్రియ (metabolism) మీద ఆధారపడి మారుతాయి.*
🐾 *జంతువులు – శ్వాసలు – జీవితం (పట్టిక)*
*జంతువు*
*నిమిషానికి శ్వాసలు*
*సగటు జీవితం*
*_🐭 ఎలుక (Mouse)_*
*_90 – 160_*
*2 – 3 సంవత్సరాలు*
*_🐰 కుందేలు (Rabbit)_*
*30 – 60*
*_8 – 12 సంవత్సరాలు_*
*🐶 కుక్క (Dog)*
*15 – 35*
*_10 – 15 సంవత్సరాలు_*
*🐱 పిల్లి (Cat)*
*20 – 30*
*_12 – 18 సంవత్సరాలు_*
*🐐 మేక (Goat)*
*15 – 30*
*_15 – 18 సంవత్సరాలు_*
*🐄 ఆవు (Cow)*
*10 – 30*
*_18 – 25 సంవత్సరాలు_*
*🐎 గుర్రం (Horse)*
*8 – 16*
*_25 – 30 సంవత్సరాలు_*
*🦁 సింహం (Lion)*
*10 – 20*
*_12 – 16 సంవత్సరాలు_*
*🐘 ఏనుగు (Elephant)*
*4 – 6*
*_60 – 70 సంవత్సరాలు_*
*🐢 తాబేలు (Tortoise)*
*1 – 4*
*_100 – 150+ సంవత్సరాలు_*
*🐋 తిమింగలం (Whale)*
*2 – 6*
*_70 – 100 సంవత్సరాలు_*
*🧑 మనిషి (Human)*
*12 – 20*
*_70 – 85 సంవత్సరాలు_*
*🧘♂️ యోగి (Resting)*
*4 – 8*
*_90+ (సాధారణంగా ఎక్కువ)_*
*🧠 ఈ పట్టిక చెప్పే ముఖ్యమైన విషయం*
*🔹 వేగమైన శ్వాస* → *ఎక్కువ desgaste → తక్కువ జీవితం*
*_నెమ్మదైన శ్వాస → తక్కువ stress → ఎక్కువ జీవితం_*
*_అందుకే:_*
*చిన్న జంతువులు → వేగంగా శ్వాస → తక్కువ ఆయుష్షు*
*_పెద్ద జంతువులు → నెమ్మదిగా శ్వాస → ఎక్కువ ఆయుష్షు_*
*_🧘 మనకు నేర్చుకోవాల్సింది ఏమిటి?_*
*మన పరిమాణం మార్చలేం*
*కానీ శ్వాస విధానాన్ని మార్చుకోవచ్చు*
*_✔️ లోతైన శ్వాస_*
*_✔️ నెమ్మదైన శ్వాస_*
*_✔️ రోజూ 10 నిమిషాల ప్రాణాయామం_*
పాపం తొలగిపోవాలంటే...*
*ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే...*
ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే ఆ ఒక్క పువ్వు చాలు. ఒకే ఒక పువ్వును ఆయన ముందు ఉంచితే సమస్త దోషాలన్నీ హరిస్తాడట. కైలాసవాసుడికి ఎంతో ఇష్టమైన పువ్వే ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వును శివుని దగ్గర ఉంచి వేడుకుంటే భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి. ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ పూలతో శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయి. ప్రదోష సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారు ఆ సమయంలో శివునిని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. అప్పుడే దోషాలు తొలగిపోతాయి.. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి.🕉️🚩🕉️
Important phone numbers
*ప్రతి వ్యక్తికి ముఖ్యమైన నంబర్ల జాబితా, అన్ని నంబర్లు టోల్ ఫ్రీ...*
_________________________
CM ఫిర్యాదు పోర్టల్👉181
విద్యుత్ సేవ👉1912
జంతు సేవ👉1962
పోలీస్ సేవ👉112,100
అగ్నిమాపక సేవ👉101
అంబులెన్స్ సేవ👉102
ట్రాఫిక్ పోలీస్👉103
విపత్తు నిర్వహణ👉108
చైల్డ్ లైన్👉1098
రైల్వే విచారణ👉139
అవినీతి నిరోధకం👉1031
రైలు ప్రమాదం👉1072
రోడ్డు ప్రమాదం👉1073
CM హెల్ప్‌లైన్👉1076
క్రైమ్ వ్యంగ్యం👉1090
మహిళల హెల్ప్‌లైన్👉1091
భూకంపం👉1092
పిల్లల దుర్వినియోగ సహాయం👉1098
రైతు కాల్ సెంటర్👉1551
పౌర కాల్ సెంటర్👉155300
బ్లడ్ బ్యాంకు👉9480044444
సైబర్ క్రైమ్👉1930
*దయచేసి దీన్ని అన్ని గ్రూపులకు పంపండి, ధన్యవాదాలు!!*
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 30*
*కుతుకజుషి కాంచిదేశే కుముదతపోరాశిపాకశేఖరితే।*
*కురుతే మనోవిహారం కులగిరిపరిబృఢకులైక మణిదీపే॥*
*భావము :*
*పర్వతరాజైన హిమవంతుని ఇంట జనించి, ఆయన వంశమును ఉద్దరించి, కలువపూవులరేడైన చంద్రరేఖను శిరసున ధరించి, కాంచీపురములో విహరిస్తున్న తల్లి ఒడిలో నేను శిశువుగా ఇమిడిపోతాను.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
-------------------- భగవద్గీత. -------------------
ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ।। 67 ।।
ప్రతిపదార్థ:
ఇంద్రియాణాం — ఇంద్రియముల యొక్క; హి — నిజముగా; చరతాం — తిరగటం; యత్ — ఏదేని; మనః — మనస్సు; అనువిధీయతే — ఎల్లపుడూ నిమగ్నమై ఉండునో; తత్ — అది; అస్య — వాని; హరతి — హరించును; ప్రజ్ఞాం — బుద్ధిని; వాయుః — వీచేగాలి; నావం — నావ; ఇవ — ఎలాగైతే; అంభసి — నీటిలో.
తాత్పర్యము :
ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.
వివరణ:
కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది - భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారుచేసాడు. ‘పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః ’ (2.1.1). కాబట్టి, అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమౌతాయి, మరియు వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమయినా, దానికి మనస్సుని తప్పు త్రోవ పట్టించే శక్తి ఉంది.
కురంగ మాతంగ పతంగ భృంగ
మీనాఃహతాః పంచభిరేవ పంచ
ఏకః ప్రమాదీ స కథం న హన్యతే
యః సేవతే పంచభి రేవ పంచ (సూక్తి సుధాకరం)
‘జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి, వాటిని సంహరిస్తాడు. తేనెటీగలకు సుగంధంపై మమకారం; అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు, పుష్పము మూసుకొనిపోయి, అవి దానిలో చిక్కుకుపోతాయి. చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బేస్తవారి ఎరని మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి. పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి; అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి. ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం. వేటగాడు దీనిని ఆసరాచేసుకుని ఆడ ఏనుగుని ఎర లాగా వాడి, మగ ఏనుగుని గుంతలోనికి వచ్చేటట్టు చేస్తాడు. ఆడ ఏనుగుని స్పర్శించటం కోసం గుంతలోనికి వెళ్ళిన మగ ఏనుగు ఇక బయటికి రాలేదు, మరియు అది వేటగానిచే సంహరింపబడుతుంది. ఈ ప్రాణులన్ని, ఏదో ఒక ఇంద్రియం వలన, తమ మృత్యువు వైపు లాగబడుతాయి. మరి ఇక అన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమౌను?’ ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, మనస్సుని తప్పు ద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు.
14-02-2026 శనివారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
14-02-2026 శనివారం రాశి ఫలితాలు
మేషం
చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.
---------------------------------------
వృషభం
కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.
---------------------------------------
మిధునం
నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
---------------------------------------
కర్కాటకం
దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
---------------------------------------
సింహం
దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
---------------------------------------
కన్య
సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.
---------------------------------------
తుల
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
---------------------------------------
వృశ్చికం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.
---------------------------------------
ధనస్సు
ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.
---------------------------------------
మకరం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.
---------------------------------------
కుంభం
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
---------------------------------------
మీనం
వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.
---------------------------------------
14ఫిబ్రవరి2026* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁 శనివారం🍁*
*14ఫిబ్రవరి2026*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - బహుళపక్షం*
*తిథి : ద్వాదశి* సా 04.01 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* సా 04.12 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : సిద్ధి* రా 03.18 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : తైతుల* సా 04.01 *గరజి* రా 04.37 తె ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు;*
*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *మ 01.03 - 02.47*
అభిజిత్ కాలం : *ప 11.58 - 12.45*
*వర్జ్యం : రా 02.47 - 04.29*
*దుర్ముహూర్తం: ఉ06.34- 08.07*
*రాహు కాలం :ఉ09.28 - 10.55*
గుళికకాళం : *ఉ 06.34 - 08.01*
యమగండం : *మ 01.49 - 03.16*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *ధనుస్సు/మకరం*
సూర్యోదయం :*ఉ 06.43*
సూర్యాస్తమయం :*సా 06.17*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.34- 08.53*
సంగవ కాలం :*08.53 - 11.12*
మధ్యాహ్న కాలం :*11.12 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31- 03.50*
*ఆబ్ధికం తిధి :మాఘ బహుళ ద్వాదశి*
సాయంకాలం :*సా 03.50- 06.10*
ప్రదోష కాలం :*సా 06.10 - 08.38*
రాత్రి కాలం : *రా 08.38- 11.57*
నిశీధి కాలం :*రా 11.57- 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.54 - 05.44*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*
*అతివేలతయా తవ*
*దుర్విషహైరనువేల*
*కృతైరపరాధశతైః*
*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*శ్రీరామరామ ఇతి*
*జాపకృతాత్మశక్తే!*
*శ్రీరామదూత సతతం*
*హనుమన్ నమస్తే*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
మాఘ పురాణం - 27వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷శనివారం 14 ఫిబ్రవరి 2026🌷*
_*మాఘ పురాణం - 27వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14వ తేదీ శనివారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్నుమునితో ఇలా అన్నాడు: “జన్మ సంసారమనే సముద్రాన్ని దాటడానికి సాధనం మాఘమాస వ్రతం. దాని ప్రశస్తిని వెల్లడించే మరో కథను విను…
```
పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పాలించే సులక్షణ రాజు ఉండేవాడు. అతను సూర్యవంశంలో జన్మించినవాడు. బలపరాక్రమాలు కలిగినవాడు, ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. అతనికి నూరుగురు భార్యలున్నా సంతానం మాత్రం లేదు. రాజులు అందరూ అతనికి సామంతములై కప్పములు చెల్లించుచున్నా, సంతానం లేదనే విచారం మాత్రం రాజుకు తప్పలేదు. ‘నేనేమి చేసిన కులవర్ధనుడు అనే పుత్రుడు జన్మించును?’ పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతఘ్నునకు, వేద హీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమములకు వెళ్లి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారు ఏమైనా ఉపాయం చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను’అని నిశ్చయించుకున్నాడు.
అనేక మంది మహర్షులు కల నైమిశారణ్యం వెళ్లడమే మంచిదని నైమిశారణ్యానికి వెళ్లాడు.
అక్కడ మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించాడు.
అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లన్నారు: ‘రాజా! వినుము నీవు పూర్వ జన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసంలో రధ సప్తమి నాడు కూష్మాండ దానం చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలుగలేదు. ఇందువలననే ఇంత మంది భార్యలున్నా నీకు సంతానం కలుగలేదు’ అని చెప్పారు.
అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పుడని వారిని ప్రార్థించాడు.
అప్పుడా మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చిరి. ‘దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని’ చెప్పారు.
సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి తమ ఇంటికి వచ్చాడు.
రాణులు సంతోషంతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతం చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహంలో ఉంచాడు. స్నానం మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్లాడు. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగలించి తాను ఒక్కతే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలం కనపడలేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి.
తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను.
రాజు ఏమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకు ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను.
ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని ఒడలు తెలియక పడియుండెను.
గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను.
అప్పుడే పుట్టిన పసిబిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచు ఉండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినవి. తేనె, పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ హంసలు అతనిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్సు తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానను లేని గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను.
అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు.
వనమున, జలమున, గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను.
బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒక నాడు ఆ గృహస్థు ఇంటియందు లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుడిని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.
అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన బాలునకా వనమున యెట్టి ఆపదయు రాలేదు.
శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో కల ప్రాణులు, మృగములు, పక్షులు అచ్చటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వము లోపించినది.
సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అటుల వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండ రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో అతని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి.
బాలుడు తులసి పాదులో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవ అనుగ్రహము అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ అతని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ వల్ల శక్తి కలిగినది. అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవ అనుగ్రహము కలిగి మరెన్నియో ఇహ పరలోక సుఖములను పొందవచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.```
*రాజకుమారుని పూజ – శ్రీహరి అనుగ్రహము*```
సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు యిట్టి బంధువుల నెరుగడ. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను.
రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.
మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నా భక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను.
బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను.
శ్రీహరి “బాలకా! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమ”ని పలికెను.
అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పి సపరివారముగ అంతర్దానమందెను.
సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.
సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యా బుద్ధులను పొంది పెద్ద వాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువుగా చేసెను.
వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను.
వాని భార్యలును సమాగమము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి.
సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.”
జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినిన వాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రియుడై ఇహ పరలోక సుఖముల నంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.```
*మాఘపురాణం ఇరవై ఏడవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
శ్రీరామ స్తుతి
🌸శ్రీరామ స్తుతి🙏
సీ. భండన భీముండు పరమాత్మ రాముండు
కరుణాంత రంగుండు కడలిసముడు
భరతాగ్రజా ! నిన్ను భజియించు వారికి
భయమేల కల్గును భక్త వరద !
సంతాపముల మాన్పి సంతసమ్ముల నిచ్చు
సాకేతపురవాస ! సత్త్వ తేజ !
నిరతమ్ము నినుమది నీమమ్ముతో నెంచ
భవబంధ మోహముల్ బాసి పోవు
తే.శరణు వేడిన వారిని కరుణ తోడ
కూర్మి రక్షించి కాపాడు కోసలేంద్ర !
భక్తి నర్పింతు నతులను ముక్తి గోరి
ధశరథాత్మజ ! శ్రీరామ ! ధర్మపురుష !
జయలక్ష్మి
బ్రహ్మాస్త్రవర్ణనము
*బ్రహ్మాస్త్రవర్ణనము*
వాయువునకు వలే వేగమైనది. అగ్ని మరియు సూర్యుని వలే తేజము కలది. ఆకాశము వలే విశాలమైనది. ఎక్కడికైనను చొచ్చుకొని పోగలదు.మేరు మందర గిరులవలే బరువైనది. బంగారముతో నిర్మితమైనది. బలమగు రెక్కలు కలది. ఉజ్జ్వలమగు కాంతులు కలది. సకల భూతముల సారములను గ్రహించి నిర్మింపబడినది. పొగలతో కూడి ప్రళయ కాలాగ్నివలె భయంకరమైనది. మహాసర్పము వలె మెరయుచుండునది. అతివేగముతో శత్రువుల యొక్క గజాశ్వ సమూహములను ఛేదించునది. అరివీరుల పుర ద్వారములను పరిఘలను పర్వతములను ముక్కలు ముక్కలుగా చేయునది. అరివీరుల రక్తముతో తడిసినది. క్రొవ్వుతో కూడియున్నది. మిక్కిలి దారుణమైనది. వజ్రమువలే దృఢమగునది. వేగముగా వెళ్ళునప్పుడు భయంకరమగు ధ్వనులు కలది. కపట యుద్ధమును ఛేదించునది. అందరనూ భీతిల్ల చేయునది. రాబందులకు గ్రద్దలకు ఇతరములగు పక్షులకు రాక్షసులకు నిత్యమునూ ఆహారమొసగునది. యముని రూపము వలె మిక్కిలి భయమును కలిగించునది. వానరోత్తములకు ఆనందమునూ రాక్షసులకు వినాశమునూ కలిగించినది. సుందరములును చిత్రవర్ణములును అగు గరుత్మంతుని పక్షములు కట్టినది. సమస్త లోకములలో గల శరములలో ఉత్తమమైనది. ఇక్ష్వాకు వంశజులకు శత్రుభయమును పోగొట్టునది. శత్రువుల కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునది.
గడియల్ రెంటికొ, మూటికో
శ్రీరాము (82)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
ధూర్జటి మహాకవి ఇలా అంటున్నారు:
మ// గడియల్ రెంటికొ, మూటికో, గడియకో, కాదేని నేడెల్లియో/
కడ నేడాదికొ, ఎన్నడో ఎఱుగ మీ కాయంబు లీ భూమిపై/
బడగా నున్నవి,ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్/
చెడుగుల్ నీ పద భక్తియున్ దెలియరో ! శ్రీకాళహస్తీశ్వరా !
(స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! మా ప్రాణాలు ఎప్పుడు పోవునో మాకు తెలియదు.
రెండు గడియలకే పోవచ్చు.
మూడు గడియలకు పోవచ్చు.
లేకపోతే ఇంకొక్క గడియకే పోవచ్చు.
ఈ రోజు కానీ, రేపు గానీ పోవచ్చు.
లేదా ఒక యేడాది లో పోవచ్చు.
ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదుగానీ, మొత్తానికి ప్రాణాలు పోయి ఈ శరీరము భూమిపై పడటము తప్పదు.
ఈ మానవులు, ప్రాణం ఉన్నప్పుడే ధర్మ కార్యాలు చేసి సమస్త సుఖములు ప్రసాదించే పుణ్యం సంపాదించుకోవడం లేదు.
మోక్షాన్ని ప్రసాదించే నీ మీద భక్తినైనా, ఈ చెడుగులు, అలవరచుకోవడం లేదు.
అయ్యో! అతి దుర్లభమైన మానవ జన్మను, వ్యర్థ కాలక్షేపాలతో పాడు చేసుకుంటున్నారు గదా! )
జనన మరణ వార్ధక్య వియోగ దుఃఖాలతో కూడిన సంసారసాగరం తరించడానికి భగవంతుని మీద భక్తిగాని, వేదం ఉపదేశించిన సత్యం, అహింస, మొదలైన ధర్మములను ఆచరించడంగాని, ముఖ్యోపాయాలు.
అయ్యో! ఆ రెంటిని విస్మరించి మానవ జీవితం వ్యర్థం చేసుకుంటున్నాముగదా ! అని శ్రీ భర్తృహరి మహాయోగి కూడా ఇలా అంటున్నారు.
" న ధ్యాతం పద మీశ్వరస్య విధివత్ సంసార విచ్ఛిత్తయే "
( సంసారచక్రంనుండి బయట పడేందుకు
యథవిధిగా భగవంతుని పాదపద్మములను ధ్యానించ లేదు )
" స్వర్గద్వార కవాట పాటన పటుః ధర్మోపి నోపార్జితః "
(స్వర్గద్వారములు తెరిపించి సమస్త సుఖములను ప్రసాదించే శక్తిగల, "ధర్మము" నైనా సంపాదించ లేదు)
కాబట్టి మన శ్రేయోభిలాషులైన మహాత్ముల ఉపదేశములను గ్రహించి, మన కర్తవ్యం తెలుసుకొన్నవారలమై, తదాచరణకు శాయశక్తులా కృషి చేద్దాం.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
14-2-'26
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - ఏకాదశి - మూల - భృగు వాసరే* (13.02.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
వాట్సాప్ గ్రూప్ గురించి
వాట్సాప్ గ్రూప్ గురించి
ఒక మిత్రుడు ఫోన్ నెంబరు బ్లాగులో పెడితే అందరికీ విధితం అవుతుంది కాబట్టి అది మంచి ఆలోచన కాదని సలహా ఇచ్చారు
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు పెట్టే కామెంట్ నుంచి మీ ఫోన్ నెంబర్ని మాత్రమే స్వీకరిస్తాము. మీ ఫోన్ నెంబరు, మీ కామెంట్ ఏ మాత్రం బ్లాగులో ప్రచురితం కాదు.
అది రహస్యంగా ఉంచబడుతుంది గ్రూపులో చేరిన వాళ్ళకి మాత్రమే మీ నెంబరు తెలుస్తుంది అది విషయం
