17, ఆగస్టు 2021, మంగళవారం

తెలుగు భాష!

 *తెలుగు భాష.. తెలుగు వంటకములు, తెలుగు తీపి,* ....


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!


మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!


పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల 

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు   

సాటి తెలుగు భాష మేటి భాష


స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన 

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు     

ఆవ కాయ కొఱకు నంగలార్చి.


కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ 

కారమింగువలను తగిలించి తిను వాడు 

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని


ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము !! 


తెలుగు భాష.. తెలుగు వంటకములు, తెలుగు తీపి, ....

👏👏👏👏👏

*శ్రీ సూక్తము..* *( ఆరవ భాగము.)*

 *శ్రీ సూక్తము..* *( ఆరవ భాగము.)*


*మూడవ ఋక్కు* ::  


*అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీం శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీర్జు॑షతాం ॥*


సర్వ సౌభాగ్య దాయిని అనే లక్ష్మీస్వరూపాన్ని ఈ మూడవ ఋక్కులో ధ్యానిస్తున్నాము. 


అ॒శ్వ॒పూ॒ర్వాం, ర॑థమ॒ధ్యాం, హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీం, శ్రియం, దే॒వీమ్, మా, అనే 7 కొత్త మాటలు ఇందులో వచ్చాయి.


దేవీభాగవతంలో దేవసేనలకు నాయకత్వం వహిస్తూ వెళ్తున్న సేనాపతి రూపంలో ఉన్న అమ్మవారిని ఇక్కడ ధ్యానించడం జరుగుతుంది. ఇందులో మొదటి మూడు మాటలకు గుర్రాలు ముందు వెళుతుంటే రధం మధ్యలో కూర్చుని తన వెనక ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తుంటే కదిలి వెళ్తున్న అమ్మవారి వర్ణ న కనిపిస్తుంది.


 అశ్వాలు రథము అనే మాటలకు ఇంతకు ముందు అర్థాలు చెప్పుకున్నాము. యోగ శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని శరీరం మధ్యలో ఉన్న కుండలినీ శక్తిని ఓంకారంతో ప్రేరేపించడం అనే భావం ఈ ఋక్కులో అంతర్లీనంగా ఉంటుంది.


శ్రియం అంటే అందరికీ ఆశ్రయం ఇచ్చేది శ్రేయస్సును కలిగించేది. 


దేవి అనే పదానికి ప్రకాశించేది కాంతి తో కూడినది అనేది ఒక అర్థము. క్రీడించేది అనేది రెండవ అర్థము. ఆమె స్వయంగా ప్రకాశ రూపిణి. ఆవిడ చేసే పనులన్నీ లీలలు.


మా అనే మాటకు తల్లి, లక్ష్మీదేవి అని రెండర్థాలు.


ఉపాహ్వాయే జూషతాం అనే రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకు ముందు రెండు ఋక్కులలో అమ్మవారిని ఆవాహన చేయడం స్థిరాసనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు మంది మార్బలంతో కలిసి రావడాన్ని ఈ ఋక్కులో మొదటి పాదంలో సూచించారు. ఆ రావడం కూడా చాలా దర్జాగా దర్పంతో వచ్చినట్టుగా చూపించారు. ఇప్పుడింక సాధకుడు ఉపాహ్వాయే అంటే నా దగ్గర గా ఉండేటట్టు అమ్మవారిని ఆహ్వానించు అని ప్రార్థిస్తాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన పక్కన ఉండాలన్నమాట.


 మనుషులకు కోరుకున్నది దొరికినా తృప్తి ఉండదు. ఇంకాస్త కావాలనుకుంటారు. శ్రీ సూక్తం లో సాధకుడు కూడా ముందుగా అమ్మవారు మా ఇంటికి రావాలి అనుకోవడం. తర్వాత ఇంకెక్కడికి పోకుండా తన ఇంట్లోనే ఉండాలి అనుకోవడం. దాని తర్వాత తన పక్కనే కూర్చుని ఉండాలి అనుకోవడం. అక్కడితో కూడా ఆగడం లేదు.


జూషతాం అంటే ప్రీతి పెంచుకుని సేవ చేయడం. అమ్మవారు తన పక్కన కూర్చొని తన మీద ఇష్టం పెంచుకొని తన అవసరాలు కనిపెట్టి అవన్నీ తీరుస్తూ ఉండాలని కోరుకోవడం. జుషతాం అనే మాటకు ప్రీతి కలిగి ఉండడం సేవించడం మొదలైన అర్థాలున్నాయి. అమ్మవారిని మనం సేవించడమా?? అమ్మవారు మనలను సేవిస్తుందా?? ఇక్కడ సాధకుడి కోరిక ఆవిడ మన మీద ప్రేమ పెంచుకొని మన కోరిక తీర్చాలి అని స్పష్టంగా ఉంది. ఆ కోరిక తీరడానికి సాధకుడు లక్ష్మీ దేవితో చుట్టరికం పెట్టుకున్నాడు. మా = అమ్మ అని సంభోదించాడు. తల్లి బిడ్డ మీద ప్రేమ పెంచుకొని బిడ్డకు ఎలా సేవ చేస్తుందో బిడ్డ కోరికలు ఎలా తీరుస్తుందో అలాగ లక్ష్మీదేవి తన మీద ప్రేమ పెంచుకొని తన కోరికలు తీర్చాలని సాధకుడి కోరిక.


మహారాణి లాగ గుర్రాలు ఏనుగులు రథాల తో కూడి వచ్చిన లక్ష్మీదేవి ఎల్లవేళలా నాకు దగ్గరగా ఉండి నన్ను కుమారుని గా భావించి ప్రేమతో నా కోరికలన్నీ తీర్చి గాక. అనేది భావము.


*నాలుగవ ఋక్కు* ::  


*కాం॒సో᳚స్మి॒ తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీం ।*

*ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥*


ఈ ఋక్కులో మహాలక్ష్మి స్వరూపాన్ని పరాశక్తి రూపంలో ధ్యానించడం జరుగుతుంది.


కాం॒, సో᳚స్మి॒,తాం, ఆర్ద్రాం, పూర్తిగా కొత్త పదాలు. మిగతా పదాలు పరవాలేదు.


*కాం* :: క అనే అక్షరానికి పరబ్రహ్మ, నీరు, శిరస్సు, సుఖము అని అర్థాలున్నాయి. ఇవి కాక కః అంటే ఎవడో అని కా అంటే ఎవతేనో అని అర్థం. కాం అంటే ఎవతో ఒకావిడను ఒకానొక అమ్మాయిని అని సంస్కృత భాషలో అర్థము. చందన చర్చిత పాటలో శ్లిష్యతి కామపి చుంబతి కామపి పశ్యతి కామపి అని వస్తుంది. ఆ కామపి కామపి అన్న మాటలు కాం+అపి. ఆ పాటలో ఎవరో ఒక అమ్మాయిని కృష్ణుడు ఇలా చేశాడు ఎవరో ఒక అమ్మాయిని కృష్ణ డలా చేశాడు అని వర్ణిస్తారు. ఇన్ని విశేషణాలు ఇన్ని వర్ణనలను చేసి అమ్మవారెవరో తెలియనట్లు కాం అనే పదం ఎందుకు వాడినట్లు. బ్రహ్మ పదార్థాన్ని పరాశక్తిని వేదాంత పరిభాషలో స్పష్టంగా నిర్వచించలేము. మనసు వాక్కు వాళ్లను వర్ణించ లేక ఏం చెప్పాలో తెలీక అంటే calm (కాం) అయిపోతాయి. అందువల్ల లింగ వచన విభక్తులు లేని శుద్ధబ్రహ్మన్ని క్వచిత్ అని పిలుస్తారు. రావణ కృత శివతాండవ స్తోత్రం లో క్వచిద్దిగంబర అనే పదం వస్తుంది. అందులో క్వచిత్ అందమైన ప్రయోగము. అలాగే శివమహిమ్నస్తోత్రం లో కూడా క్వచిత్ పదం వస్తుంది. నిర్గుణ బ్రహ్మ అనే అర్థంలో ఈ పదాన్ని వాడతారు. ఒక స్థాయి ఉన్న వాళ్లు తప్ప ఈ పదాన్ని అందరూ సులభంగా ప్రయోగించలేరు. ఈ పదానికి పుంలింగం కశ్చిత్ స్త్రీ లింగం లో కాచిత్ అవుతుంది. కా అనేదానికి ద్వితీయ విభక్తి కాం. ఇది అది అని వాక్కు ద్వారా వర్ణించడానికి వీలులేని పరాశక్తి అనే అర్థంలో కాం శబ్దాన్ని ఇక్కడ వాడారు. 


బ్రహ్మీ శక్తి అంటే సరస్వతీ దేవిని ఈ అక్షరం సూచిస్తుంది. సుఖ స్వరూపిణీ అంటే ఆనంద రూపిణీ ఆనంద దాయినీ అని అర్థాలు వస్తాయి. పైగా కామ్ బీజాక్షరం కూడా. లలిత అమ్మవారి పంచదశి మంత్ర అక్షరాలలో ప్రధానమైనది క కారము. ఈ అక్షరంతో మొదలయ్యే మంత్రాన్ని కాది విద్య అని పిలుస్తారు. ఆ అక్షర రూపంలో ఉన్న దేవత అని కూడా అర్థం వస్తుంది.


ఇంకా వుంది......


*పవని నాగ ప్రదీప్.*

ప్రతిరోజూ నడవండి*

 *వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!*

       

 మీ పాదాలు చురుకుగా, బలం గా ఉంచండి !!


  మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా & బలంగా ఉండాలి.


 మనం నిరంతరం వృద్ధాప్యం / వృద్ధాప్యం చెందుతున్నందున, మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం గురించి మనం భయపడకూడదు.


 * *దీర్ఘాయువు *సంకేతాల మధ్య, ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ "ప్రివెన్షన్" ద్వారా సంగ్రహించినట్లుగా, సుదీర్ఘమైన ఫిట్ లైఫ్, బలమైన కాళ్ల కండరాల పైన *అత్యంత ముఖ్యమైనవి & అవసరమైనవిగా జాబితా చేయబడ్డాయి. *


 దయచేసి ప్రతిరోజూ నడవండి.


 మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదపకపోతే, మీ నిజమైన కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది.


 *కేవలం నడవండి*


  డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు & యువకులు, రెండు వారాల పాటు *నిష్క్రియాత్మకత *, వల్ల 


 కాళ్ల కండరాల బలం *మూడవ వంతు బలహీనపడవచ్చు, ఇది 20-30 సంవత్సరాల వృద్ధాప్యానికి సమానం !!


 *కాబట్టి నడవండి*


 మన కాలి కండరాలు బలహీనపడటం వలన, మనం తరువాత పునరావాసం & వ్యాయామాలు చేసినప్పటికీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.


 *కాబట్టి నడవండి*.


 అందువల్ల, *నడక వంటి రెగ్యులర్ వ్యాయామం చాలా ముఖ్యం *.


 మొత్తం శరీర బరువు/ లోడ్ అలాగే ఉండి కాళ్లపై విశ్రాంతి తీసుకుంటుంది.


  *పాదాలు ఒక రకమైన స్తంభాలు *, మానవ శరీరం యొక్క మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి.


 *రోజూ నడవండి.*


  ఆసక్తికరంగా, ఒక వ్యక్తి యొక్క ఎముకలలో 50% & కండరాలలో 50%, రెండు కాళ్లలో ఉంటాయి.


 **రోజూ నడవండి.**


 మానవ శరీరంలోని అతి పెద్ద & బలమైన కీళ్ళు & ఎముకలు కూడా కాళ్లలో ఉన్నాయి.


 రోజు *10 వేల అడుగులు నడవండి *


  బలమైన ఎముకలు, బలమైన కండరాలు మరియు సౌకర్యవంతమైన కీళ్ళు *ఐరన్ ట్రయాంగిల్ *ను ఏర్పరుస్తాయి, 


ఇవి అత్యంత ముఖ్యమైన భారాన్ని కలిగి ఉంటాయి, 


 ▪️70% మానవ కార్యకలాపాలు మరియు ఒకరి జీవితంలో శక్తి దహనం (burning of calories) రెండు పాదాల ద్వారా జరుగుతుంది.


 ఇది నీకు తెలుసా?  


ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ ఆమె *తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి! *


 * *పాదము శరీర లోకోమోషన్ *.


 కాళ్లు రెండూ కలిపి మానవ శరీరంలోని 50% నరాలను, 50% రక్తనాళాలను మరియు 50% రక్తం వాటి ద్వారా ప్రవహిస్తున్నాయి.


 ఇది శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్‌వర్క్.


 *కాబట్టి రోజూ నడవండి.*


 *ఒకవేళ * పాదాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, 


కనుక బలమైన కాలు కండరాలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బలమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ..


* కాబట్టి రోజూ నడవండి.*.


 ▪️వయస్సు పాదాల నుండి పైకి మొదలవుతుంది


 ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పటి కంటే వయస్సు పెరిగే కొద్దీ, మెదడు మరియు కాళ్ల మధ్య సూచనల ప్రసార ఖచ్చితత్వం & వేగం తగ్గుతుంది, 


. కాబట్టి *దయచేసి నడవండి *


  అదనంగా, బోన్ ఫెర్టిలైజర్ కాల్షియం అని పిలవబడేది కాలక్రమేణా త్వరగా తగ్గి పోతుంది, ఇది వృద్ధులను ఎముక పగుళ్లకు గురి చేస్తుంది.  


* కాబట్టి రోజూ నడవండి.*..*


 వృద్ధులలో ఎముక పగుళ్లు, ముఖ్యంగా మెదడు త్రోంబోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను సులభంగా ప్రేరేపిస్తాయి.


  తొడ ఎముక విరిగిన సంవత్సరంలోపు 15% మంది వృద్ధ రోగులు సాధారణంగా చనిపోతారని మీకు తెలుసా.  


 *ప్రతిరోజూ తప్పకుండా నడవండి*


 ▪️ *కాళ్లు వ్యాయామం చేయడం, 60 ఏళ్లు దాటినప్పటికీ, చాలా ఆలస్యం కాదు. *


కాలంతోపాటు మన పాదాలు/ కాళ్లు క్రమంగా వయస్సు మీద పడుతున్నప్పటికీ, మన పాదాలకు/ కాళ్లకు వ్యాయామం చేయడం అనేది జీవితకాల పని.


 *10,000 అడుగులు నడవండి*


 కాళ్లను క్రమం తప్పకుండా బలోపేతం చేయడం ద్వారా, ఒకరు మరింత వృద్ధాప్యాన్ని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. 


 *365 రోజులు నడవండి*


  దయచేసి మీ కాళ్లకు తగినంత వ్యాయామం అందేలా మరియు మీ కాలి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి 


రోజూ కనీసం 30-40 నిమిషాలు నడవండి.


 *ప్రతిఒక్కరూ రోజూ వృద్ధాప్యంలో ఉన్నందున మీరు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ 40+ స్నేహితులు & కుటుంబ సభ్యులతో పంచుకోవాలి*



 ‍♀️🚶🏻‍♂️🚶🏻‍♂️🚶🏻‍♂️🚶🏻‍♀️🚶🏻‍♀️🚶🏻

బాల్యం

 జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు


అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు


ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు


 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు


 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె


ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు


కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు


బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు


కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు


డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు


కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె


గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె


గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు


ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు


కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు


బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె


కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె


అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె


దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె


బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు


మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు


ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు


ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే


రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.


మన బాల్యం పై ఒక మిత్రుడు పంపిన కవిత..

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

విజయం కావాలన్నా

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*ఇలా చేసి చూడండి*.....🙏


ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి ?  

   

శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సులువుగా తీరిపోతుంది. మనం చేసే పని విజయవంతం కావాలన్న, కార్యం లో ఉన్న ఆటంకాలు తొలగాలన్నా ఆంజనేయ స్వామి వారిని ఒక క్రమ పద్దతిలో ఆరాధించాలి. ఉద్యోగం,వ్యాపారం, ఆరోగ్యం,ధనం మొదలగు యే కోరికైనా మారుతిని ఆరాధిస్తే నెరవేరుతుంది. అందుకు ఈ క్రింది విధంగా చేయాలి...


* ప్రతి రోజు శ్రీ హనుమాన్ చాలీసా ని 11 సార్లు ఒకే ఆసనం మీద కూర్చొని మధ్యలో లేవకుండా చదవాలి. అంటే 11 సార్లు వరుసగా చదవాలి. ప్రారంభం లో 1 గంట పడుతుంది. అలవాటు అయ్యాక 40 నిముషాల్లో పూర్తవుతుంది.


* 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఒక సారి "శ్రీ రామ రక్షా స్తోత్రం" చదవాలి


మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి అన్ని నియమాలు పాటించాలి.


*మంగళవారం రోజు కొబ్బరికాయను స్వామి వారికి సమర్పించాలి. వీలుంటే నెలకు ఒక మంగళ వారం రోజు ఆకుపూజ ను స్వామి వారికి చేయించాలి.


*ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సమస్యలు ఎంత జటిలమైనవి అయినా క్రమంగా తొలిగిపోతాయి. స్వామి వారి పై పూర్తి విశ్వాసం తప్పనిసరి


*జై శ్రీరామ్*

*జై హనుమాన్*


🌹🍁🍁 *సేకరణ*🍁🍁🌹

               *న్యాయపతి*

            *నరసింహారావు*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము* *388వ నామ మంత్రము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*388వ నామ మంత్రము*17.8.2021


*ఓం నిత్యక్లిన్నాయై నమః*


సదా దయాస్వరూపురాలుగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యక్లిన్నా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యక్లిన్నాయై నమః* అని అత్యంత భక్తిశ్రద్నలతో స్మరించు భక్తులను ఆ తల్లి తన దయార్ధ్ర హృదయంతో సకలాభీష్టసిద్ధిని కలుగజేయును.


పరమేశ్వరి తిథినిత్యలలో మూడవ నిత్య అయిన నిత్యక్లిన్నా స్వరూపురాలు. శుక్ల పక్షమునందు తదియతిథి నాటి నిత్యాదేవత *నిత్యక్లిన్న* అలాగే బహుళపక్షంలో చతుర్దశి తిథినాటి నిత్యాదేవత *నిత్యక్లిన్న* అమ్మవారు అటువంటి నిత్యక్లిన్నా స్వరూపురాలు గసుక ఆ తల్లి *నిత్యక్లిన్న* యనిఅనబడినది.


చంద్రకళలను సూచించే తిథులకు - అమ్మవారి కళలకు సమన్వయం ఉన్నది. శుక్లపక్షమి చంద్రుడు, పాడ్యమి నుండి క్రమంగా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడౌతాడు. చంద్రునియొక్క పదహారు కళలు శ్రీవిద్యలో *నిత్య* లని అంటారు. రెండు పక్షాలలోని తిథులకు నిత్యలని సమన్వయం చేయడమైనది🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻శుక్ల పక్షము


  1. పాడ్యమి - కామేశ్వరి

  2. విదియ - భగమాలిని

  3. తదియ - *నిత్యక్లిన్నా*

  4. చవితి - భేరుండా

  5. పంచమి - వహ్నివాసినీ

  6. షష్టి - మహావజ్రేశ్వరీ

  7. సప్తమి - శివదూతీ

  8. అష్టమి - త్వరతా

  9. నవమి - కులసుందరీ

10. దశమి - నిత్యా

11. ఏకాదశి - నీలపతాకా

12. ద్వాదశి - విజయ

13. త్రయోదశి-సర్వమంగళా

14. చతుర్దశి - జ్వాలామాలిని

15. పూర్ణిమ - చిత్రా


కృష్ణ పక్షము


  1. పాడ్యమి - చిత్రా

  2. విదియ - జ్వాలామాలిని

  3. తదియ - సర్వమంగళా

  4. చవితి - విజయా 

  5. పంచమి - నీలపతాకా

  6. షష్టి - నిత్యా

  7. సప్తమి - కులసుందరీ

  8. అష్టమి - త్వరితా

  9. నవమి - శివదూతీ

10. దశమి - మహావజ్రేశ్వరి

11. ఏకాదశి - వహ్నివాసిని

12. ద్వాదశి - భేరుండా

13. త్రయోదశి-నిత్యక్లిన్నా

14. చతుర్దశి - భగమాలిని

15. అమావాస్య - కామేశ్వరీ


ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రాగా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత చిత్రాతో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి నిత్యాదేవత కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము నందు *అష్టమి* నాటి నిత్యాదేవత *త్వరితా* అగును. అంటే *అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా* అను నామ మంత్రములో వశిన్యాది దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!🌹🌹🌹ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను మహానిత్యయని అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.


జగన్మాత నిత్యము దయార్ద్రస్వరూపిణి. భోగమోక్షములను ప్రసాదించునది. అందుచే జగన్మాత *నిత్యక్లిన్నా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యక్లిన్నాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 .*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*971వ నామ మంత్రము* 17.8.2021


*ఓం సువాసిన్యర్చన ప్రీతాయై నమః*


సువాసినలయొక్క అర్చనలచే సంతసమొందు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సువాసిన్యర్చన ప్రీతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే శాంతిసౌఖ్యములకు, భోగభాగ్యములకు, ధనధాన్యములకు లోటులేకుండా ఉండును.


సువాసిని అనగా ఐదవ తనము గల స్త్రీ లేదా ముత్తైదువ. పసుపుకుంకుమలు, గాజులు, మట్టెలు, మంగళసూత్రములు, నల్లపూసలు అను సౌభాగ్యాభరణములను ధరించు స్త్రీలు. అటువంటి సువాసినులను శ్రీచక్రార్చనచేసిన తరువాత అర్చించుట మన హైందవ సాంప్రదాయము. పరమేశ్వరి సువాసినీ (ముత్తైదువ) స్త్రీల అర్చనలను ఇష్టపడునది గనుక *సువాసిన్యర్చనప్రీతా* యని అనబడినది. సువాసినీ స్త్రీలనగా సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపము. అందుకే ముత్తైదువులను సాక్షాత్తు అమ్మవారిగా భావించి అర్చించడం ఒక సాంప్రదాయము.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*89.10 (పదియవ శ్లోకము)*


*అతీవ కోమలౌ తాత చరణౌ తే మహామునే|*


*ఇత్యుక్త్వా విప్రచరణౌ మర్దయన్ స్వేన పాణినా॥12060॥*


*89.11 (పదకొండవ శ్లోకము)*


*పునీహి సహ లోకం మాం లోకపాలాంశ్చ మద్గతాన్|*


*పాదోదకేన భవతస్తీర్థానాం తీర్థకారిణా॥12061॥*


*89.12 (పండ్రెండవ శ్లోకము)*


*అద్యాహం భగవంల్లక్ష్మ్యా ఆసమేకాంతభాజనమ్|*


*వత్స్యత్యురసి మే భూతిర్భవత్పాదహతాంహసః॥12062॥*


మహామునీ! 'నీ పాదములు మిగుల సున్నితమైనవి' అని పలికి, స్వయముగా (తన చేతులతో) ఆ మహర్షి పాదములను సేవించుచు ఇట్లనెను- "మహర్షీ! నీ పాదస్పర్శతో తీర్థములు అన్నియును పవిత్రములగును. అట్టి నీ పాదజలముతో, నన్ను, నా వైకుంఠలోకమును, నాలో చేరియున్న లోకపాలురను పునీతమొనర్ఫుము. ఇప్పుడు లక్ష్మీదేవికి నేను పరమాశ్రయుడను. నీ పాదస్పర్శతో నా పాపములన్నియును ప్రక్షాళితములైనవి. అట్టి నా వక్షస్థలమునందు లక్ష్మీదేవి నిత్యనపాయినియై వర్ధిల్లుచుండును".


*శ్రీశుక ఉవాచ*


*89.13 (పదమూడవ శ్లోకము)*


*ఏవం బ్రువాణే వైకుంఠే భృగుస్తన్మంద్రయా గిరా|*


*నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కంఠోఽశ్రులోచనః॥12063॥*


*శ్రీశుకుడు పలికెను* శ్రీమహావిష్ణువు ఇట్లు గంభీర వచనములను మృదుమధురముగా పలుకగా భృగుమహర్షి పరమానందభరితుడయ్యెను. భక్తిపారవశ్యమున ఆయనయొక్క కంఠము మూగవోయెను. కన్నులలో ఆనందాశ్రువులు నిండెను.


*89.14 (పదునాలుగవ శ్లోకము)*


*పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినామ్|*


*స్వానుభూతమశేషేణ రాజన్ భృగురవర్ణయత్॥12064॥*


పరీక్షిన్మహారాజా! పిదప ఆ మహాముని బ్రహ్మవేత్తలైన మునీశ్వరుల యాగసభకు విచ్చేసెను. త్రిమూర్తులతో తాను పొందిన అనుభవములను వారికి సాకల్యముగా వివరించెను.


*89.15 (పదిహేనవ శ్లోకము)*


*తన్నిశమ్యాథ మునయో విస్మితా ముక్తసంశయాః|*


*భూయాంసం శ్రద్దధుర్విష్ణుం యతః శాంతిర్యతోఽభయమ్॥12065॥*


*89.16 (పదహారవ శ్లోకము)*


*ధర్మః సాక్షాద్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితమ్|*


*ఐశ్వర్యం చాష్టధా యస్మాద్యశశ్చాత్మమలాపహమ్॥12060॥*


భృగుమహర్షియొక్క అనుభవవచనములను విన్నపిమ్మట అచటి మహామునులు అందఱును మిగుల ఆశ్చర్యమునకు లోనైరి. వారి సందేహములు పూర్తిగా తొలగిపోయెను. వైకుంఠపతియైన శ్రీమన్నారాయణుడు తనను సేవించిన వారికి శాంతిని, ముక్తిని ప్రసాదించుననియు, అందువలననే త్రిమూర్తులలో ఆ పరమపురుషుడే సర్వశ్రేష్ఠుడనియు వారు విశ్వసించిరి. ఆ పురుషోత్తముని ఉపాసించిన వారికి ధర్మనిరతి, బ్రహ్మజ్ఞానము, విషయసుఖములయెడ విరక్తి, అణిమాది అష్టవిధ ఐశ్వర్యములు, మనోమాలిన్యములను రూపుమాపునట్టి యశస్సు అబ్బును.


*89.17 (పదిహేడవ శ్లోకము)*


*మునీనాం న్యస్తదండానాం శాంతానాం సమచేతసామ్|*


*అకించనానాం సాధూనాం యమాహుః పరమాం గతిమ్॥12067॥*


సకలప్రాణులకును హితకారులు (భూతద్రోహరహితులు), శాంతచిత్తులు, సమస్తజీవులయెడ సమత్వబుద్ధి గలవారు, ప్రతిఫలాపేక్షారహితులు (పరోపకార పరాయణులు), సాధుస్వభావులు, ఐన మునీశ్వరులకు ఆ శ్రీహరియే పరమగతియని, వేదములు, శాస్త్రములు నొక్కి వక్కాణించుచున్నవి.


*89.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సత్త్వం యస్య ప్రియా మూర్తిర్బ్రాహ్మణాస్త్విష్టదేవతాః|*


*భజంత్యనాశిషః శాంతా యం వా నిపుణబుద్ధయః॥12068॥*


ఆ సర్వేశ్వరుడు శుద్ధసత్త్వస్వరూపుడు. అతడు బ్రహ్మజ్ఞాన సంపన్నులగు బ్రాహ్మణులయెడ అత్యంత ప్రియభావమును కలిగియుండును (భక్తపరాధీనుడు). నిష్కామకర్మయోగులు, జితేంద్రియులు, ఆత్మానాత్మ వివేకసంపన్నులు ఆ దేవదేవుని భక్తిశ్రద్ధలతో సేవించుచుందురు.


*89.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*త్రివిధాకృతయస్తస్య రాక్షసా అసురాః సురాః|*


*గుణిన్యా మాయయా సృష్టాః సత్త్వం తత్తీర్థసాధనమ్॥12069॥*


ఆ శ్రీహరియొక్క త్రిగుణాత్మకమైన మాయయే - రాక్షసులు, అసురులు, దేవతలు అను మూడు వర్గములవారిని సృష్టించెను. శుద్ధసత్త్వమయమైన ఆ భగవన్మూర్తి ఎల్లరకును ఉపాసింపదగినది.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

దేవరియా బాబా చరిత్ర 5 వ భాగం

 🌸🌳🌸🌳🌸🌳🌸🌳🌸🌳🌸

_"శ్రీపాద రాజం  శరణం ప్రపద్యే"_

*బ్రహ్మర్షి దేవరియా బాబా చరిత్ర 5 వ భాగం*


_*"బహు నామధేయుడు దేవరియా బాబా... (III)"*_


దేవరాహా బాబా ఒకసారి తన శిష్యులతో మాట్లాడుతూ "నాయనలారా చాలాకాలం  కిందట భారతదేశపు ఎల్లలు ఇరాన్ ను తాకుతూ ఉండేవి. ఆ సమయంలో పంజాబ్లో నన్ను *"సచ్చిదానంద స్వామి"* గా ప్రజలు సంబోధిస్తూ ఉండేవారు." అని పలికారు.


అమృతసర్,  ఫరుఖాబాద్ జిల్లాలో సుమారు 250 సంవత్సరములకు పూర్వము ఒక  బాబా వేపపుల్లను నేల నాటాడు. అది  చింత 🌳 చెట్టు  గా అంకురించి మహావృక్షంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. నేటికీ అది ఆశ్రమానికి 225 కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున గోచరమవుతూ ఉండటం గమనార్హం. ఆ బాబా  మరెవరో కాదు _*దేవర హా బాబాయే*_  


ఎన్నో నామాలతో పిలువబడుతూ ఉన్నా, చివరకు ఈనాడు *దేవరాహా బాబా* గా భక్తులకు చేరువ కావడం ఎంతో ఆనందదాయకము. శాస్త్రములలో అనేక చోట్ల ఈ నామము 🐵 _*"హనుమంతునికి"*_ అన్వయించడమైనది. అనేకమంది భక్తులు దేవరాహా బాబా ను హనుమదవతారముగా భావించి ఆరాధించేవారు.


*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

🌹🐵🌹🐵🌹🐵🌹🐵🌹🐵🌹

ముకుందమాల స్తోత్రమ్ Mukunda Mala Stotram శ్లోకం : 21 n

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 21      

                           SLOKAM : 21

                                                 

हे गोपालक हे कृपाजलनिधे हे 

                             सिन्धुकन्यापते

हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीण 

                                     हे माधव ।

हे रामानुज हे जगत्त्रयगुरो हे 

                            पुण्डरीकाक्ष मां

हे गोपीजननाथ पालय परं जानामि 

                        न त्वां विना ॥ २१ ॥


హే గోపాలక హే కృపాజలనిధే హే 

                          సింధుకన్యాపతే 

హే కంసాంతక హే గజేంద్ర 

           కరుణాపారీణ హే మాధవ I    

హే రామానుజ హే జగత్త్రయగురో    

                    హే పుండరీకాక్ష మాం 

హే గోపీజననాథ పాలయ పరం  

        జానామి న త్వాం వినా ॥21॥ 


* ఈ శ్లోకాన్ని మా నాన్నగారు వారి ప్రతి ఉపన్యాసంలో 

   ప్రార్థనా శ్లోకాలలో ఒకటిగా రాగయుక్తంగా చదివేవారు. 

  - This is one of the prayer slokas by my father (composed with a beautiful raaga) before he was delivering every discourse.    


ఓ గోపాలా! 

దయాసాగరా! 

లక్ష్మీపతే! 

కంసుని హతమార్చి న స్వామీ! 

గజేంద్రుని సంరక్షించిన మహాప్రభో! మాధవా!  

రామానుజా! 

త్రిలోకపూజిత గురువరేణ్యా!    

పద్మనేత్రుడా! 

గోపీజన వల్లభా! నన్ను రక్షించు.  

    నిన్ను వినా నేను మరెవ్వరినీ ఎరుగను.  


O young cowherd boy! 

O ocean of mercy! 

O husband of Lakṣmī, the ocean’s daughter! 

O killer of Kaṁsa! 

O merciful benefactor of Gajendra! 

O Mādhava! 

O younger brother of Rāma! 

O spiritual master of the three worlds! 

O lotus-eyed Lord of the gopīs! 

    I know no one greater than You. Please protect me.                  

                                        


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఐదువారాల నిద్ర..*


"నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను..దిక్కు తోచడం లేదు..నువ్వు కొద్దిగా డబ్బు సర్దుబాటు చేస్తే..మళ్లీ నేను కోలుకున్నాక నీ డబ్బు నీకు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తా..కాదనకు.. ఇవి చేతులు కావు, కాళ్లనుకో.." అంటూ ఆ వ్యక్తి శ్రీ మీరాశెట్టి గారి వద్ద ప్రాధేయపడసాగాడు..మీరాశెట్టి గారు అతనిని అనునయించాలని చూస్తున్నారు గానీ వీలు కుదరటం లేదు..ఇప్పటికిప్పుడు ఎంతో కొంత డబ్బు అతని చేతిలో పెడితేగానీ వదిలేటట్లు కనిపించడం లేదు..


ఆ వచ్చిన వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు..మీరాశెట్టి గారికి బాగా తెలిసిన వాడే..వ్యాపారం చేసి అందులో నష్టపోయాడు.. అప్పులపాలయ్యాడు..నిజానికి అతను వ్యాపారం మొదలుపెట్టిన నాడు ఏ ఇబ్బందీ లేదు..ఉన్నంతలో సర్దుకొని అలానే కొనసాగించి వుంటే..ఈ పరిస్థితి దాపురించేది కాదు..అత్యాశకు పోయి..అప్పులు తెచ్చి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసాడు..తాను పెట్టిన పెట్టుబడి కి, రాబడికి వ్యత్యాసం పెరిగిపోయి..అప్పుల్లో పడ్డాడు..ఇక దిక్కుతోచక మీరాశెట్టి గారి వద్దకు వచ్చాడు..


"నువ్వంతగా బాధ పడుతున్నావు కాబట్టి..నేను నీకు పదివేల రూపాయలు సహాయం చేస్తాను..అదికూడా నువ్వొక మాట ఇస్తేనే.." అన్నారు మీరాశెట్టి గారు..ఏమిటో చెప్పామన్నాడు వెంకటేశ్వర్లు..ఐదు వారాల పాటు, వారానికి ఒకరోజు లెక్కన.. భార్యతో కలిసి..మొగలిచెర్ల గ్రామం వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద నిద్ర చేయాలని..తన సమస్యలు తీరిన తరువాత..శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని..షరతులు పెట్టారు మీరాశెట్టి గారు..సరే అన్నాడు వెంకటేశ్వర్లు..


అనుకున్న ప్రకారం..వెంకటేశ్వర్లు కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసారు మీరాశెట్టి గారు..(1980 ప్రాంతంలో పల్లెటూరులో..పదివేల రూపాయాలంటే పెద్ద మొత్తం క్రిందే లెఖ్ఖ!). వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు..ముందుగా మీరాశెట్టి గారికి మాట ఇచ్చిన ప్రకారం..ఆరోజు సాయంత్రమే బయలుదేరి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు..ఆరోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరం లో నిద్ర చేశారు వెంకటేశ్వర్లు దంపతులు..తెల్లవారి లేచి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని..తిరిగి తన ఊరికి వచ్చేశాడు..మీరాశెట్టి గారిని కలిసి, తాను మొగలిచెర్ల వెళ్లొచ్చిన సంగతి చెప్పాడు..


మరో వారం గడిచేసరికి మీరాశెట్టి గారు వెంకటేశ్వర్లు సంగతి దాదాపుగా మర్చిపోయారు..అతని బాధ అతను పడుతున్నాడు..పదే పదే అతని వెంటపడటం ఎందుకని మీరాశెట్టి గారి భావన..పైగా వెంకటేశ్వర్లు సమస్యను ను మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కి అప్పచెప్పాము కదా..ఆ స్వామే అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం మీరాశెట్టి గారిది..


మరో రెండువారాలు గడిచాయి..మొత్తం మూడువారాలు వెంకటేశ్వర్లు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి మందిరం లో నిద్ర చేసి వచ్చాడు..అతని ఆర్ధిక పరిస్థితి లో మార్పు రాసాగింది..అప్పుల వాళ్ల వత్తిళ్ళు కొద్దిగా తగ్గడమే కాదు, తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవడం జరిగింది..మీరాశెట్టి గారి వద్ద తీసుకున్న పదివేల రూపాయల లో ఏమీ ఖర్చు కాలేదు..అలానే ఉండిపోయింది..వెంకటేశ్వర్లు కు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడింది..నాలుగో వారం కూడా మొగలిచెర్ల వెళ్లి, నిద్ర చేసి వచ్చాడు..ఐదు వారాలు పూర్తయ్యే సరికి..వెంకటేశ్వర్లు లో మునుపటి నైరాశ్యం లేదు..ఉత్సాహంగా వున్నాడు..ఇంకో రెండు నెలల కల్లా..వ్యాపారం గాడిలో పడింది..అనవసరపు ఆర్భాటాలు తగ్గించుకున్నాడు..ఉన్నంతలో వ్యాపారం చేసుకోసాగాడు..చిత్రమేమిటంటే..ఐదు వారాల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు..ప్రతి వారం మొగలిచెర్ల వచ్చి, మందిరం వద్ద నిద్ర చేసి వెళ్లసాగాడు..


మీరాశెట్టి గారి వద్ద తాను అప్పుగా తెచ్చిన పదివేల రూపాయలను తిరిగి ఇవ్వడానికి ఆయన వద్దకు వెళ్లి.."నువ్వు ఇచ్చిన ఈ డబ్బు ఖర్చు పెట్టలేదు..ఇంట్లోనే ఉంచుకున్నాను..తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చుపెట్టాలని అనుకున్నాను..కానీ ఈలోపలే ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల నా ఇబ్బందులు తొలిగాయి..చిన్న చిన్న సమస్యలను నేను పరిష్కరించుకోగలను..నువ్వు ఆరోజు మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద నిద్ర చేయాలని నాచేత ప్రమాణం చేయించుకున్నావు..నువ్వు చెప్పినట్లే చేసాను..ఆ స్వామి కరుణించాడు.. ఇంకెప్పుడూ అత్యాశకు పోను..ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటాను..ఇదిగో నువ్విచ్చిన డబ్బు..వడ్డీ తో కలిపి తెచ్చాను.." అన్నాడు..


మీరాశెట్టి గారు వడ్డీ తీసుకోకుండా తానిచ్చిన పదివేల రూపాయలు మాత్రం తీసుకున్నారు..మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి పాదాలను నమ్ముకోమని..వాటిని విడవకుండా పట్టుకోమని..వెంకటేశ్వర్లు కు మళ్లీ సలహా ఇచ్చారు..


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మీరాశెట్టి గారిదే మరో అనుభవం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).