25, జూన్ 2021, శుక్రవారం

శ్రీ సంజీవరాయస్వామి* ఆలయం..#వెల్లాల

 🌹🌷🍃🍁🍁🍃🌷🌹


*మహిమాన్విత శ్రీ సంజీవరాయస్వామి* ఆలయం..#వెల్లాల


15 శతాబ్దం లో 3 అడుగు ల ఉన్న విగ్రహం దినా దినబివృద్ది  పెరుగుతూ ఇప్పటికీ 16 అడుగులకు(సుమారుగా) చేరింది..


*శ్రీ ఆంజనేయ స్వామి* వారు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ‘#వెల్లాల’ ఒకటి. 


 ఇక్కడ హనుమంతుడు ‘#సంజీవ #రాయుడు’ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. 

స్థలపురాణం:-


రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు.. 🙏🙏🙏


 ఆ  సమయంలో సాయంత్రం అయ్యేసెరికి స్వామి వారు సంద్యా వందనం కోసం ఇక్కడ కుందూ నది  దగ్గరా అగారు.

 అక్కడ నది దగ్గరలో   ఉన్న మహర్షులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని  ..ఆ అంజనేయ స్వామి వారిని మీరు  కాసేపు ఇక్కడ వుండమనగా,ఆ స్వామి వారు నేను  ‘వెళ్లాలి .. వెళ్లాలి’ అంటూ హనుమంతుడు ఆతృతను కనబరిచారు. అందువలన ఈ గ్రామానికి ‘#వెల్లాల’ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు చెబుతుంటారు. 

మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో #కడప రాజ్యాన్ని పాలించిన  ‘హనుమంత మల్లు’ అనే రాజు  ఒకసారి వేటకు కుందూ నది సమీపంలో వెళ్ళారు.. వేట కు  వచ్చిన రాజు కు.. ఆరోగ్యం సహకరించదు..


ఆరోగ్యం  బాగాలేక కొన్ని రోజులు ఈ అడవిలోనే కుందూ నది పరిసర ప్రాంతంలోనే నివాసం ఉన్నారు..


ఆ రాజుకి   శ్రీ ఆంజనేయ స్వామి వారు కలలో కనపడి ..నేను ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నాను...నాకు ఒక ఆలయం కట్టించి అని చెప్పారు...దానికి ఆ రాజు అడవి అంత గాలించారు..చివరికి ఒక 3 అడుగుల స్వామి వారి రూపం దొరిగింది..స్వామి వారి రూపం దొరకగానే ఆ రాజు ఆరోగ్యం బాగైంది..దాంతో

రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. 


అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఆ రూపం పెరుగుతూ వచ్చింది.. 🙏


ఇక్కడి #హనుమంతుడిని దర్శించుకోవడం వలన, వ్యాధులు .. బాధలు దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు, ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తుంటారు.


ఈ ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ భీమలింగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలు ఉన్నవి. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులు కొలువుదీరినా సంజీవరాయునికున్న వైభవం చాలా గొప్పది.


ప్రొద్దుటూరు నుండి 24 km కడప నుండి 75km , అళ్ళగడ్డ నుండి 28 km మైదుకూరు నుండి 40,km


🌹🌷🍁 *సేకరణ*🍁🌷🌹


*లక్ష్మీ నరసింహా రావు*

      *న్యాయపతి*

స్పూర్తి - వాస్తవాలు

 #స్పూర్తి


ఆర్మీ అధికారికి  ఓ వ్యక్తి దగ్గర  నుండి  లేఖ వచ్చింది 

అందులో విషయం


అయ్యా!n

      నా పేరు  సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా  పని చేస్తూ  రిటైర్ అయ్యాను .

నా కొడుకు ఆర్మీ లో  ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం  లో వీరమరణం  పొందాడు  .

ఈ ఏడాది అతను  ప్రాణాలు విడిచిన  చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి  చూస్తున్నాము  .

అనుమతి ఇస్తే సంతోషము  అలా కుదరదు  మీ ఉద్యోగాలకు  ఇబ్బంది కలుగుతుంది  అనుకుంటే  వద్దు  అని ముగించారు  


ఆ ఉత్తరం  చదివాక  ఆ అధికారి కళ్ళు  తడిచాయి  వెంటనే  వారిని  ప్రభుత్వ  ఖర్చులతో  పిలిపించండి  అలా ఒకవేళ  ప్రభుత్వం ఖర్చు  పెట్టకపోయినా  సొంతంగా  నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు  


ఆ వృద్ధ  దంపతులను  అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా  వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు 


ఎందుకు బాబు నువ్వు మాత్రం  ఇలా నువ్వు ఎంత  పెద్ద  అధికారివి  అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు  


అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన  వారు నేను మీ అబ్బాయితో  కలిసి పని చేసాను 

అని ఒక నిమిషం  మాటలురాక నిలబడిపోయాడు  

పర్లేదు బాబు ఏ విషయమైనా  ధైర్యంగా  చెప్పు నేను ఏడవను అని చెప్పాడు 

మీరు కాదు నేను ఏడవకుండా  ఉండాలి  కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం  మొదలుపెట్టాడు  


ఆనాడు పాకిస్థానీలతో  యుద్ధం జరుగుతున్నది  మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు  వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి 

నీకు పిచ్చా నీకు పెళ్ళై  ఇద్దరు పిల్లలు ఉన్నారు 

నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను  అని ముందుకు వెళ్లి  ఆ తూటాలను  తన శరీరంలో తీసుకున్నాడు  

శత్రువులను 13 మందిని చంపి  ఇక్కడే మరణించాడు 


అతడిని మొదటగా పట్టుకున్నది  నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు  పోయింది  శరీరం  లో 42 తూటాలు  ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు  

అక్కడ వింటున్న  తల్లి తన చీర  కొంగును అడ్డుపెట్టుకుని  ఏడ్చేసింది  


ఆరోజు  నేనే శవాన్ని  తీసుకురావలసింది  దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది  కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు  అతడి కాళ్లపై వేయాల్సిన  ఈ పూలు ఇలా వేసి  నా ఋణం  తీర్చుకుంటున్నాను  అని అన్నాడు


బాబు నా కొడుకు పుట్టినరోజుకు  వస్తాడని  బట్టలు కొనిపెట్టాము  కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ  వదిలి  పెట్టాలని తెచ్చాము  కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని  అర్థం అవుతున్నది 

నీకు అభ్యన్తరం  లేకపోతే  తీసుకో బాబు  అని అతనికి  ఇచ్చి  ఎంతో  గర్వంతో  వెనుకకు  తిరిగారు  ఆ తల్లితండ్రులు  


ఇలాంటి కథలు  వాస్తవాలు  ఇంకెన్నో  

ఇవేవి మనకు తెలియవు  మనం ఆలోచించను  లేము  

రాజకీయనాయకుడికి పాలాభిషేకం  చేసుకుంటూ  

నటించే హీరోలకు  భారీగా  కట్  అవుట్  లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని  మన సమయాన్ని మన విలువని  పోగొట్టుకుంటున్నాము  


ఇలాంటి వీరజవాన్ల  ఎంతో మంది  మనం బాగుండాలని  వారి ప్రాణాలను  త్యాగం చేస్తున్నారు 

కనీసం మనం గుర్తించలేక  పోతున్నాం ..😢😢😢😢

అద్భుతం గమనించండి

 *అద్భుతం గమనించండి*.. 


మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది. 

రెండవ శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటీ శ్లోకం వస్తుంది. 


1) "తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ :||౧||


2) శ్రీ : యాదవం భవ్యభతోయ దేవం... 

సంహారదాముక్తిముతాసుభూతం ll౨ll


* మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.. 

* రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.. 

ఇతరులకు సాధ్యం కాని, 

ఒక్క భారతీయులకే సాధ్యమయ్యే  విద్య...

రోలు-రోకలు వివరణ

 రోలు-రోకలు వివరణ 

మనం మిక్స్, గ్రైండర్, వెట్ గ్రైండరుకి అలవాటు పడి పూర్వపు వంట ఇంటి సాధనలనే మరచి పోతున్నాము. అందుకే ఇది వ్రాస్తున్నాము. పూర్వము పూర్తిగా మానవ శ్రమ మీదనే అన్ని పనులు చేసుకునే వారు. కొన్ని ఇండ్లలో కరంటు ఉండేది కూడా కాదు. 

రోలు గుండ్రంగా వున్న రాతి దిమ్మకు ఒక గుంతలాగా తొలచి చేసింది. దానికి తోడు ఒక గుండ్రటి సొరకాయ ఆకారంలో చేసిన రాయిని పొత్రము అంటారు. కాగా ఒక కర్ర తుంగని అడుగు అర్ధ గోళాకారంలో చెక్కిన దానిని రోకలి అని రోకలి బండ అని అంటారు. రోలులో వేయించిన ఆకుకూరలు వేసి రోకలితో నురుతారు ఆ విధంగా పచ్చడి చేస్తారు.  అటువంటి పచ్చడిని రోటి పచ్చడి, బండ పచ్చడి అనికూడా అంటారు.  ఒక్క సారి వెనకటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇక ధాన్యాన్ని దంచే రోకలి ఈ రోకలి 5 అడుగుల పొడవు వున్న మాను మొద్దు కాకపొతే దీనికి అడుగున ఒక ఇనుప రింగు తోడికి ఉంటుంది. దీనిని ధాన్యం దంచటానికి, ఎండు మిరప కాయలని దంచటానికి వాడతారు. 

రోలు పొత్రంతో ఇడ్లిల పిండి, అట్ల పిండి, వడియాల పిండి మొదలైన పిండ్లు రుబ్బటానికి వాడతారు. 

మిత్రుల ప్రేరణతో ఈ వివరణ ఇస్తున్నాను. 



జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..

 జప / ధ్యానాలు ఎందుకు గొప్పవి..


మానవునకు రోగం కలిగించేది 'పాపం' 

మానవునకు భోగం కలిగించేది 'పుణ్యం' . 

మానవుని భవిష్యత్తు నిర్ణయించేది 'కర్మ' 


మానవునకు లాభం కలిగించేది 'సేవ' .

మానవునకు సంపాదన  నిలిపేది 'పొదుపు'

 మానవుని విలువ పెంచేది 'దానం' 


మానవునకు నష్టం కలిగించేది 'హింస' 

మానవునకు అశాంతి కలిగించేది 'ఆశ' 

మానవునకు శాంతి కలిగించేది 'తృప్తి' 

 

మానవునకు దుఃఖం కలిగించేది 'కామం' . మానవుని పతనం చేసేది 'అహంకారం' 

మానవునకు అందరిని దగ్గర చేసేది 'ప్రేమ' 


మానవునకు అందరినీ దూరం చేసేది 'అసూయ'

మానవుని స్థితిని సూచించేది 'గుణం' 

మానవుని దైవంగా మార్చేది 'దయ'


మానవుని ఆత్మస్థితి తెలిపేది 'వాక్కు'

మానవునకు విజయం చేకూర్చేది 'ధర్మం' 

మానవుని గొప్పవాడిగా చేసేది 'జ్ఞానం' 


మానవునకు 'ముక్తి' ని ఇచ్చేది  'సత్యం' 

మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది 'జపం / ధ్యానం' 


*అందుకే జపం / ధ్యానం అన్నింటికంటే గొప్పవి.*

మోక్ష మార్గాలు.. (మూడవ భాగం)*

 *మోక్ష మార్గాలు.. (మూడవ భాగం)*


 *కర్మ మార్గము...*


కర్మ మార్గము అంటే యజ్ఞయాగాదులు, జపతపాలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు, దానధర్మాలు, నిత్య నైమిత్తిక కర్మలు, దానాలు ఇవన్నీ శాస్త్రబద్ధంగా జరపాలి. *కర్మ మార్గంలో ప్రయాణిద్దాము అనుకుంటే యజ్ఞాలు యాగాలు ఈ కాలంలో అసలు వీలు పడవు. అపార్ట్ మెంట్ల లో లిక్కి లిక్కి ఇండ్లలో మడులు ఆచారాలు వీలు కావు. షుగరు బి పీ లు పెట్టుకొని ఉపవాసాలు వీలు పడవు.  దేవుడి పూజ లోనే పూలకు బదులు అక్షతాన్ సమర్పయామి అనే పరిస్థితి.  అప్పుడు ఇక శాస్త్రాలలో చెప్పినట్టు గోదానాలు హిరణ్యం తో దక్షిణలు ఎక్కడిస్తాము.  పంచాంగమూ తిధులూ చూసుకుంటూ రోజూ  నియమాలతో నిష్టలతో  కర్మ మార్గంలో  ప్రయాణించడం ఇప్పుడు సాధ్యం కాదు.*


అర్థ కామాలను ధర్మానికి లోబడి అనుభ వించాలనీ, సాత్వికంగా నూ ధర్మ బద్ధం గాను జీవితం నడుపు కోవాలనీ, అన్నంతవరకు కర్మ మార్గం యొక్క ఉద్దేశ్యం మంచిదే. దాన్ని అమలు చేయడం మామూలుగానే  కష్టం. 


పైగా కర్మ మార్గము జనన మరణ బంధం నుంచి రక్షించలేదు. శుభ కర్మలకు పుణ్యము పాప కర్మలకు పాపము ఫలితంగా వస్తాయి. వాటిని అనుభవించడానికి మళ్లీ మళ్ళీ జన్మలు ఎత్తాలి. అలా ఎప్పటికీ ఆ జన్మల చక్రంలోతిరుగుతూ ఉండాలి. అంతం ఉండదు. 


జన్మల చక్రం నుండి తప్పించుకో వాలంటే కర్మలను కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి. లేదా ఈశ్వ రార్పణం గా చెయ్యాలి. రెండూ కష్టమే. మన అవసరాల కోసం మన లాభాల కోసం పనులు చేసేటప్పుడు కూడా, చాలాసార్లు నిర్లక్ష్యం గానూ  ఆలస్యంగానూ, తెలివి తక్కువగానూ పనులు చేస్తుంటాము. అట్లాంటిది కర్తృత్వ భావన లేకుండా ఈశ్వ రార్పణం గా పనులు చేద్దా మంటే పనులు చెయ్య దానికి పూనిక ఉత్సాహం ఉండవు. ఫలితం మనది కానప్పుడు ఏ పని అయినా కష్టపడి ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. కర్మ మార్గం గాడి తప్పు తుంది.  నేను పనులు చేస్తున్నాను అనుకు న్నంత వరకూ ఆ జన్మల చక్రం నెత్తి మీద తిరుగుతూనే ఉంటుంది. ఇదే కర్మ మార్గంలో పెద్ద లోపము.

 


*పవని నాగ ప్రదీప్*

సమయానుకూలంగా వెళ్లితీరాలి

 *సమయానుకూలంగా వెళ్లితీరాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?*

```1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..```

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

*కారణం ???*

ఓకేఒక్కటి UPDATE.

```they DIDN'T UPGRADE```

 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…* పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


*Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.*


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


*2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.*


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


*మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..


 *కాలక్రమేణా మార్పు సహజం*

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలితే విజయం సాధించడమ్, లేకపోతే కనుమరుగైపోవడం.

*8.అంగిరో మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*8.అంగిరో మహర్షి* 

మనం ఇప్పుడు ' అంగిరస ' మహర్షి గురించి తెలుసుకుంటున్నాము . ఈ మహర్షి ఎలా పుట్టాడో తెలుసా ! బ్రహ్మదేవుడు ముఖం నుంచి . బ్రహ్మ మానసపుత్రులు అంటూంటారు మీరెప్పుడైనా విన్నారా .... అందులో మూడవవాడు ఈ అంగిరస మహర్షి అంగిరస మహర్షి వేదమంత్రాలు నేర్చుకుని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు . కర్దమ , ప్రజాపతి అనే ఆయన పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తొమ్మిది మంది కూతుళ్ళని పొందాడు . అందులో శ్రద్ధ అనే పేరు గల అమ్మాయిని అంగిరస మహర్షికిచ్చి పెళ్ళి చేశాడు . బ్రహ్మదేవుడు అంగిరస మహర్షిని సృష్టి చెయ్యడంలో సాయం చెయ్యమని అడిగాడు కదా ... అందుకే అంగిరస మహర్షి శ్రద్ధా దేవికి ఏడుగురు కూతుళ్ళని , ఏడుగురు కొడుకుల్ని అనుగ్రహించాడు . వాళ్లకి మళ్ళీ పిల్లలు , ఆ పిల్లలకు మళ్లీ పిల్లలు అలా వంశం వృద్ధి పొందింది . ఆయన ఇలా ఒక వంశానికి మూలపురుషుడయ్యాడు . ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు . 


దేవతలు యజ్ఞాలు చేస్తుంటే అగ్నిదేవుడు లేడు కదా ? ఏం చెయ్యాలి ? ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు కల్పించుకొని , అంతకంటే గొప్పవాడు అంగిరసుడు వున్నాడు కదా ! ఆయన్నే అగ్నిదేవుడుగా అనుకొని యజ్ఞం పూర్తిచేసుకోండి అన్నాడు . ఇది విని నిజం అగ్నిదేవుడు అమ్మో ! నా పదవి అంగిరసుడికి ఇచ్చేస్తున్నారని కోపం అక్కడే వదిలేసి పరిగెత్తుకొని వచ్చేశాడు . అప్పటి నుంచి అంగిరసుడు రెండో అగ్నిదేవుడయ్యాడు . 


శూరసేన దేశాన్ని చిత్రకేతుడు అనే రాజు పరిపాలించే వాడు . అతనికి చాలా సంపద , కోటిమంది అందమయిన భార్యలు ఉన్నారు . కానీ , అతనికి పిల్లలు లేరు . అంగిరస మహర్షిని ప్రార్థించాడు . కృతద్యుతి అనే పేరుగల భార్య యందు ఒక కొడుకు పుట్టాడు . మిగిలిన భార్యలు ఆ అబ్బాయికి విషం పెట్టి చంపేశారు . మహారాజు దుఃఖంతో మూర్ఛపోయాడు . అంగిరస మహర్షికి ఈ విషయం తెలిసి చిత్రకేతుడి దగ్గరికి వెళ్ళి లోకంలో చావు పుట్టుకలు తప్పవు . ఇపుడు నీకు కొడుకయినా పూర్వజన్మలో వాడు ఏమిటో నీకు తెలుసా .


ప్రతిజీవుడు చస్తూనే ఉంటాడు ఇంత బాధపడవద్దని నారద మహర్షి సాయంతో చచ్చిపోయిన కొడుకిని బతికించి చూపించి నువ్వు తెలుసేమో అడుగు అతనికి అన్నారు . చిత్రకేతుడు “ నాయనా ! ” అని పిలుస్తే ఆ కొడుకేమో నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు . ఈ విధంగా అంగిరసుడు , చిత్రకేతుడికి భార్య పిల్లలు , సంపదలు , భోగభాగ్యాలు ఇవన్నీ ఋణంతో కూడుకున్నవే . కానీ , భగవంతుడు మాత్రం సత్యం అని ఉపదేశం చేశాడు . తర్వాత అంగిరస మహర్షి తీర్థయాత్రలకి బయలుదేరి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పుణ్యనదులున్నాయో అన్నింటిలోను స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు . ఒకసారి గౌతమ మహర్షి అంగిరసుడిని ఇన్ని తీర్థాల్లో స్నానం చేశారు కదా ... వాటి గురించి కొంచెం చెప్పండని అడిగాడు . మనం కూడా కొన్నింటి గురించైనా తెలుసుకుంటే బాగుంటుందేమో ! పోనీ తెలుసుకుందాం . మనం కూడ ఎవరకయినా చెప్పచ్చు కదా ! చంద్రభాగ అనే తీర్థంలో వరుసగా ఏడురోజులు స్నానం చేస్తే చాలా సంపదలు , ముక్తి కలుగుతాయి . పుష్కర తీర్థ , ప్రభాస , నైమిష , దేవిక , ఇంద్రమార్గ , స్వర్ణబిందు అనే తీర్థాల్లో స్నానం చేస్తే స్వర్గలోకం చేరుతారు . 


కుశేశయ , దేవాంతము , ఇంద్రతోయ , కరతోయ , కన్యాకూపసుందరికాహ్రద , వైమానిక , విపాశ , కాళికాశ్రమం , కృత్తికాశ్రమం , దేవదారువనం , ద్రోణశర్మపదము ఇలా ఎన్నెన్నో తీర్థాలు , పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి . అలాగే గంగా యమునల సంగమం , ప్రయాగ మొదలయిన వాటి గురించి కూడ అంగిరస మహర్షి గౌతముడికి చెప్పాడు . ఒకసారి అగ్నిదేవుడు ఋషుల భార్యలని చూసి ఇష్టపడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముని వేషం వేసుకుని ఆ భార్యతో గడపటం మొదలు పెట్టాడు . అంగిరస మహర్షికి కోపం వచ్చి ఋషుల భార్యల్ని భూలోకంలో పుట్టండి అని శపించాడు . పాపం వాళ్ళు తమ దగ్గరకు వచ్చింది . భర్త అనుకున్నారే గానీ , అగ్నిదేవుడే అలా చేస్తాడని తెలియదు కదా ! భూలోకంలో బ్రాహ్మణులకు భార్యలుగా పుట్టి శ్రీకృష్ణుడి సేవ చేసుకున్నారు . 

పోన్లే భగవంతుణ్ణి సేవించుకున్నారు హాయిగా కదా ..... శాపం ఇస్తే ఇచ్చాడు కానీ మంచే జరిగింది . శౌనక మహర్షి అంగిరస మహర్షి దగ్గరకు వచ్చి బ్రహ్మవిద్యని గురించి చెప్పమన్నాడు . అప్పడు అంగిరస మహర్షి ఇలా చెప్పాడు. 


విద్యలు రెండు రకాలు . ఒకటి పరవిద్య- రెండవది అపరవిద్య . అపరవిద్య అంటే వేదాలు , శిక్ష , వ్యాకరణము , కల్పము , నిరుక్తము , జ్యోతిషము , ఛందస్సు మొదలయినవి . అపరవిద్య అంటే భగవంతుడ్ని గురించిన జ్ఞానము . ముక్తి పొందడానికి రెండు మార్గాలున్నాయి . ఒకటి కర్మ మార్గం . రెండవది జ్ఞానమార్గం . యజ్ఞాలు , యాగాలు చెయ్యడం , మనస్సు మంచిగ ఉంచుకోవడం , భగవంతుడికోసం పూజలు , వ్రతాలు చెయ్యడం మొదలయినవి కర్మమార్గం . తపస్సు చెయ్యడం గురువు ద్వారా జ్ఞానం పొందడం గురువు చెప్పన విధంగా నడుచుకొని భగవంతుణ్ణి చూడడం ఇది జ్ఞానమార్గం .  భగవంతుడు ఎక్కడయినా ఉంటాడు అని ఎందుకు చెప్తారో తెలుసా ! అంగిరస మహర్షి కూడా శౌనక మహర్షికి ఇదే చెప్పాడు . భగవంతుడు సర్వవ్యాపి అంటారు కదా . ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు కదా .... అది ఏమిటో తెలుసుకుందాం ఏం ? భగవంతుడికి తల అగ్ని , కళ్ళు సూర్యచంద్రులు , చెవులు దిక్కులు , మాట వేదము , ప్రాణము వాయువు , హృదయం ప్రపంచం , భూమి పాదాలు . ఇంక ఆయన లేనిదెక్కడ ? ఆ అలుక సర్వవ్యాపి , అర్ధమయిందా ? 

అంగిరస మహర్షి మహాతపశ్శాలి , మహాభక్తుడు , మహావిజ్ఞాని , బ్రహ్మానిష్టాగరిష్టుడు అని చదువుకున్నాం కదా . ఆయన ' అంగిరస్కృృతి ' అనే ధర్మశాస్త్రం కూడా రాశాడు . దీంట్లో వరిషత్తు అంటే ఉత్తములయిన నూట ఇరవయి ఒక్కమంది వేదవిదులుండాలనీ మనిషి శాస్త్ర ప్రకారమే కర్మలు చెయ్యాలనీ , పశుపక్షి సంతతిని చంపకూడదనీ , మాంసాహారం మానాలనీ , బ్రాహ్మణుడైనా మహాదోషాలు చేస్తే క్షమించకూడదనీ , తప్పులు చేసినప్పుడు దానికి తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలనీ ఇలాగే చాలా విషయాల గురించి వున్నాయి . అంగిరస మహర్షి వంశంలో పుట్టిన వాళ్ళందరూ బ్రహ్మదేవుడి సృష్టిలో మొట్టమొదటి వాళ్లన్నమాట . అశ్వమేధయాగం చేసేటప్పుడు చదివే అధర్వణవేదాన్ని అంగిరసులు చదివేవాళ్ళు . అందుకే దానికి అంగిరోవేదం అని కూడ పేరుంది . మహారాజులకి అంగిరసులు పురోహితులుగా , బ్రహ్మవిద్యను బోధించేవారుగా కూడా ఉండేవాళ్ళు . మీకు తెలుసా ? గౌతమ బుద్ధుడికి అంగిరసుడు అని కూడ పేరుంది . అంగిరస మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుడికి సృష్టికార్యంలో సహాయపడి గొప్ప జ్ఞానుల్ని తపస్సంపన్నుల్ని , విద్యాధికుల్ని తయారు చేశాడన్న మాట .

                               *8.అంగిరో మహర్షి* 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భూతము..వైద్యము..*


శ్రీ స్వామివారి వద్దకు ఆరోజు ఉదయం తొమ్మిది గంటల లోపే వెళ్ళిపోయాను..నేను వెళ్ళేసరికే అక్కడ, ఆశ్రమనిర్మాణానికి సహాయం చేస్తున్న శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు వారి శ్రీమతి గారు వచ్చి శ్రీ స్వామివారి కెదురుగా కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారు నన్ను చూసి పలకరింపుగా నవ్వి, నా చేతిలోని స్టీల్ డబ్బా తీసుకొని ఓ ప్రక్కగా పెట్టారు..


మీరాశెట్టి గారికి నన్ను చూపిస్తూ.."ప్రసాద్ అని శ్రీధరరావు గారి రెండవ అబ్బాయి మీరాశెట్టీ.." అన్నారు..మీరాశెట్టి గారు, "నాకు తెలుసు స్వామీ..ఇంతకుముందు రెండు మూడు సార్లు మొగలిచెర్ల లో ఇంటి వద్ద చూసాను.." అన్నారు..మీరాశెట్టి గారు నాతో అమ్మానాన్న గార్ల గురించి అడుగుతూ వున్నారు..ఇంతలో సుమారు యాభై ఏళ్ళ పైబడిన దంపతులిద్దరు వచ్చి పాక బైట నిలబడ్డారు..


మీరాశెట్టి గారు వాళ్ళను చూసి.. "ఎవరు మీరు?..ఏం పని మీద ఇక్కడకు వచ్చారు?.." అన్నారు..


"అయ్యా! మాది తిమ్మారెడ్డిపల్లె..వ్యవసాయం చేసుకుంటూ వున్నాము..ఇదిగో ఈమె కు రెండు నెలల నుంచీ బాగాలేదు..ఇక్కడొక స్వామి వున్నాడని తెలిసి..చూపించుకుందామని వచ్చాము.." అన్నాడు..


అప్పటిదాకా అంతా వింటున్న శ్రీ స్వామివారు తాను కూర్చున్న చోటునుంచి లేచి, పాక బైటకు వచ్చి..

"ఏమయ్యా..నేను వైద్యుడి లాగా కనిపిస్తున్నానా?..నేనేదో తపస్సు చేసుకుంటున్నాను.. " అంటూ..ఆ ఆడమనిషి వైపు తిరిగి.."ఎన్నాళ్ల నుంచి ఈ విధంగా బాధపెడుతున్నావు?.." అన్నారు పరమ శాంతంగా చూస్తూ..


శ్రీ స్వామివారు అడిగిన ప్రశ్నకు ఆమె ఎటువంటి సమాధానం చెప్పకపోగా..ఉన్నట్టుండి వెఱ్ఱికేక పెట్టి ..నేలమీద కూలబడి పోయింది..చూస్తున్న నాకు భయమేసింది..గబుక్కున మీరాశెట్టి గారి ప్రక్కకెళ్లి నిలుచున్నాను..


శ్రీ స్వామివారు చిరునవ్వుతో చూస్తూ.."ఇదిగో పెద్దాయనా.. మీ ఇంటి పెరట్లో పెద్ద మునగ చెట్టు వున్నదా?.."అన్నారు..


"ఉంది స్వామీ.." అన్నాడు..


"ఇంటికెళ్లి, తక్షణమే ఆ చెట్టును మొదలు కూడా లేకుండా తీసివేయించు.. అన్నీ సర్దుకుంటాయి.." అన్నారు..


"అలాగే స్వామీ.." అన్నాడు వచ్చినతను.. కొద్దిసేపటికే అతని భార్య కోలుకుని లేచి నిలబడింది..


"వెళ్ళిరండి..శుభం జరుగుతుంది.." అన్నారు శ్రీ స్వామివారు..వాళ్లిద్దరూ శ్రీ స్వామివారికి నమస్కరించి వెళ్లిపోయారు..


"మీరాశెట్టీ..వాళ్ళింట్లో ఉన్న మునగచెట్టు ను ఆశ్రయించుకొని కొన్ని దుష్ట శక్తులున్నాయి.. ఆ ఇల్లాలిని కూడా బాధపెడుతున్నాయి..అందుకే ఆవిధంగా చెప్పాల్సి వచ్చింది.." అన్నారు శ్రీ స్వామివారు..


వాళ్ళ ఇంటిలో ఫలానా చెట్టును ఆశ్రయించుకొని దుష్ట శక్తులు ఉన్నాయని శ్రీ స్వామివారికెలా తెలిసింది?..


మీరాశెట్టి దంపతులు కూడా నాతోబాటు మొగలిచెర్ల కు వస్తామని బయలుదేరారు..అందరమూ శ్రీ స్వామివారి దగ్గర శెలవు తీసుకొని వచ్చేసాము..ఇంటికి వచ్చిన తరువాత జరిగిందంతా అమ్మ నాన్న గార్లకు చెప్పాను.."ఆ ఆడమనిషి కేకలు పెట్టేసారికి అబ్బాయి భయపడ్డాడు.." అని మీరాశెట్టి గారు నాన్నతో చెప్పారు..నాన్నగారు నవ్వి ఊరుకున్నారు..


సంక్రాంతి పండుగ కాగానే నేను తిరిగి కనిగిరి కి వెళ్ళిపోయాను..మళ్లీ వేసవి సెలవుల్లోనే నేను మొగలిచెర్ల రావడం జరిగింది..ఆసరికి ఆశ్రమ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది..


మరో అనుభవం..రేపటి భాగంలో..


పాఠకులకు విజ్ఞప్తి..శ్రీ స్వామివారి తో పరిచయం ఏర్పడ్డ నాటి నుంచి..శ్రీ స్వామివారు సిద్ధిపొందే వరకూ..ఆపై శ్రీ స్వామివారి సమాధి మందిర నిర్వహణా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటివరకూ నేను స్వయంగా పొందిన అనుభవాలూ..మరియు ఎందరో భక్తుల అనుభవాలను పాఠకులకు ఈ మాధ్యమం ద్వారా అందించే ప్రయత్నం ఇది..ఆదరిస్తారని ఆశిస్తున్నాను..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీదత్తాత్రేయస్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సామెతలతో కథ*

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*అరవై సామెతలతో అందమైన కథ*  

                🌷🌷🌷


*కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది* ..

 అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి.." ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..

      " ఏం చెప్పమంటారు.. *చిలక్కి చెప్పినట్లు చెప్పాను*  మీకు.. విన్నారా.. మీ అక్కగారి *నోట్లో నువ్వు గింజ దాగదు*  అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందేగా  *తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోదని*  మనమ్మాయికి కుజ దోషం వుందని  ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం..  *మన బంగారం మంచిదవాలి* కానీ  ఇక దీనికి పెళ్లి అయినట్టే.." అంది సుమతి. 

     " ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..  *అనుమానం.. పెను భూతం*  అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.

     " *ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు*  ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు. *ఆడలేక మద్దెల ఓడిందన్నట్టు* లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.

         " *ముంజేతి కంకణానికి అద్దమేల* .. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా..  *చెవిలో జోరీగ లాగా* నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.

      " ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ *కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం*  నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అని గానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి  నిష్ఠూరంగా..

  " ఓసి, పిచ్చిదానా.. *కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే* ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..

   " అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా *తల ప్రాణం తోకకివస్తోంది*  *చెవినిల్లు కట్టుకుని పోరినా*  వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి  *గుండెల మీద కుంపటి* దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి. " అంది సుమతి.

      " వాడినా?.. వాడు *ఉపకారం అంటే ఊళ్ళోంచి పారి పోయేరకం* వాడినుంచి నేను సహాయం ఆశించడం  *ఇసుకలో నూనె పిండినంత* .. అయినా వాడు *అయినవాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ* పెట్టే రకం. 

  " అయ్యో.. అలా అనుకుంటే ఎలా అండీ.. *వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు  పట్టుకున్నాడు* ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన *నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది* మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత *అందితే జుట్టు అందకపోతే కాళ్ళు*  పట్టుకుందాం." అంది సుమతి.

    " వాడి గురించి  *అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు*  చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే.. *తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే* నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా.. హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు... మేనరికమా... లేదన్నయ్యా! నీకు తెలీనిదేముందీ..  *పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు*  అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... *మొక్కై వంగనిది మానై వంగునా* వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనేవుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. *అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు*  వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..."  అన్నాడు కాంతారావు..

    ఆ ఫోను లో ఆ అన్నగారి  మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..

    " ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య? " అంది సుమతి.

    " నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి.  *మంచోడు మంచోడు అంటే మంచం కింద దూరాడంట*,  *కడుపు నిండిన బేరాలూ  కడుపు నిండిన మాటలూ* వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని  *గంతకి తగిన బొంతని* వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు.

    *ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు* అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను " అన్నాడు కాంతారావు కోపంగా..

      " అయ్యో.. అంతమాటన్నారా.. అయినా.. *జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి* పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... *తలని తన్నేవాడొకడుంటే తాడిని తన్నేవాడొకడుంటాడు* ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. " *ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు* ..  మీరేం బాధ పడకండి..  *మనసుంటే మార్గముంటుంది*. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి  వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో...  *విత్తం కొద్దీ  వైభోగం*  పైగా మన దురదృష్టం  *గోరు చుట్టు మీద రోకలి పోటు* లాగా  పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.. " అంది సుమతి.

   మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.

  " ఏంటోయ్..  *గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ* ... కొంపతీసి ఉదయం నేను  *నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను* .. అన్నాడు చమత్కారంగా..

     " పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. *ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి* అంది. *'ముద్దొచ్చినపుడే చంకనెక్కాలి'* అన్నది సుమతి.

        బుద్ధిగా చేతులుకట్టుకుని.." ఆ.. ఇప్పుడు చెప్పు " అన్నాడు కాంతారావు.

      " నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా..  మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన  బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన  వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా  *చిదిమి దీపం  పెట్టుకునేలా వుంది* అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. *అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది* అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... *వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు* అనిపించింది. *ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో* మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.

    " నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం. " అన్నాడు కాంతారావు.

      రేపటిదాకా ఎందుకూ.. *శుభస్య శీఘ్రం* ...  *తలుచుకున్నపుడే తాత ప్రయాణం* అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను. *మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది* .. లేవండి.. లేవండి.." అంది సుమతి.

    *లేడికి లేచిందే పరుగు* .. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.

*గంతకి తగిన బొంత* అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి  *కుక్క కాటుకి చెప్పు దెబ్బ*  అనిపించాలి. *ఇనుము విరిగినా అతకవచ్చుకానీ మనసు విరిగితే అతకలేము* అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు. " అన్నాడు కాంతారావు.

       " పోన్లెండి..  *ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి* వదిలేయండి.. ఆయనని.. *గురివింద గింజ తనకింద నలుపెరగదట* మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.

       వెళ్లే దారిలో..." ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషంతో.. నానా మాటలు అన్నారు.. *ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి* . ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయి సంబంధాలకి పోతున్నారూ..  *కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది*  అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ.  *శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు ఏది ?*  అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు " అంది సుమతి.

        " పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.. *గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు*  పట్టించుకోకు...  *గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం*  తప్ప దానికి వేరే పనీపాటా లేదు.  *పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు* అది అలా వాగుతూనే వుంటుంది.  వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.. " అంటూ భార్య ని ఓదార్చాడు.

          పెళ్లి  చూపులు అయిపోవడం..  పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. *ఆకాశమత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద* కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.

      పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ. " *అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా*  ఈ జాతకాలు కుదరడం  లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.

       ఇంతలో ఫోన్ మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ...  కాంతారావు పెదనాన్న కొడుకు.... " ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట..   సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.. " అన్నాడు.. 


    " ఆ.. అన్నయ్యా... *దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట*  .. అర్ధమయిందనుకుంటాను.. " అంటూ ఫోన్ పెట్టేసాడు.

కనుక్కోటానికి ప్రయత్నించండి

ఈ క్రింది పదాలని కనుక్కోటానికి ప్రయత్నించండి. ప్రతి పదం చివర "లి" అనే అక్షరంతో అంతమవుతుంది 

1. వంట ఇంట్లో పచ్చడి నూరే పురాతన సాధనం: 

2. పూర్వం గింజలను  పిండి చేయటానికి దీనిని వాడే వారు. 

3. చంద్రుడు 

4.  భార్య 

5. ప్రియురాలు 

6. శ్రీ రాముడు వధించిన బలశాలి 

7. ఆలింగనము 

8/ముఖములో భాగము. 

9. నోట్లో నీరు నింపుకొని చేసేది. 

10. భోజనం చేయటానికి ఇది ఉండాలి. 

11. ఇంటి ముందు 

జవాబులు. 

1/రోకలి 

2తిరుగలి 

3. జాబిలి 

4ఆలి 

5నెచ్చెలి 

6వాలి  

7కౌగిలి 

8చెక్కిలి 

9పుక్కిలి 

10ఆకలి 

11వాకిలి