2, జూన్ 2021, బుధవారం

మహాభక్తురాలు

 #మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు. 


ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది.


నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమయిపోయేది. 


ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది. అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.


క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు.. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు.


అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని, ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు.


ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి కి నచ్చలేదు. ఒక మడీ, ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే స్వామికి నివేదన చేసి, అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు.


ఆ బైరాగి కర్మాబాయి కి ఆచారవ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు.


అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లూ తప్పు చేసాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది.


మరునాడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి , ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది, ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు.


కర్మాబాయి కి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకూడా చేసుకోని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది.


తాను ఇంట్లో చేసిన కిచిడీ, ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక, ఆ కిచిడీ ఆ సాధువు కి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలీ తీరుతుంది, ఆ ప్రాణాలూ నిలబడతాయి అని అనుకుంది.


ఆ సాధువు కి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ వడ్డించింది. అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.


ఆ తరువాత మడి కట్టుకుని, గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానె తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు, నిన్న తనకు ఆచారవ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు.


ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామి కి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి, తెర తొలిగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.


స్వామి నోటికంతా కిచిడీ అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి మొఖం అంత అందంగా ఉంది.


ఆ మహిమ కు అందరూ ఆశ్చర్యపోయినా, అలా స్వామి నోటికి ఆహారపదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు. ఆ బైరాగి ని అడిగారు. స్వామి నీవు అడిగితె పలుకుతారు కదా, అసలేమయ్యిందో కనుక్కోండి అని అడిగారు.


సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపునుండి అదృశ్యవాణి వినిపించసాగింది.


బైరాగీ, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్దగా వినండి. కేవలం భక్తిశ్రద్దలతో పరిశుద్దంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ, నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్దలతో బాటు ఆచారాలు, వ్యవహారాలూ ఇవీ అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించనవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది. భయపడ్డది. దుఃఖించింది. 


తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది.


దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. నేనా ఆలస్యం తో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్లి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది.


ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాలప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు.


కర్మాబాయి మాత్రం స్వామి వారు తన పై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్దాత్మురాలికి ఆచారవ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే, తాను పాటిస్తున్న అచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. 


వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ అచారాలన్నీ అవసరమే. కానీ, ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో, వాళ్లకు ఆచారవ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని.


బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయి కి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. 


ఆ నాడే కాదు, ఈ నాడు కూడా, ఇప్పటికీ కూడా, కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లెంలో ఉంచి భోగం జరుపుతారు. 


ఎంత పావనమైన విషయం కదా...


మనం త్రికరణశుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే, స్వామి స్వీకరిస్తాడు.


గమనిక:- దయచేసి ఈ వృత్తాంతం చదివి ఆచారాలు అవసరం లేదు అనుకోవద్దు. నిర్మలమైన, సర్వద్య శరణాగతి లేని భక్తికి ఆచార వ్యవహారాలు అవసరమే...🙏🙏

ఉచితంగా ఏదీ తీసుకోరు.

 ఎక్కడో ఆఫ్రికాలో లో ఉన్న మనసు  ' పెద్ద ..'ఆర్ధికంగా ' చిన్న ' దేశం కెన్యా..

ప్రధాన తెగ ' మసాయి ' ఎవరిదగ్గరా ఉచితంగా ఏదీ తీసుకోరు..ప్రపంచంలో ఏదన్నా విషాద సంఘటన వాళ్ళదృష్టికి వస్తే వాళ్ళ ఆచారం ప్రకారం ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు..

2001 సెప్టెంబర్ 11 న 1స్లామిక్ ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చివేసినప్పుడు ఈ మసాయి తెగ నాయకుడు తాము అమూల్యంగా భావించే 14 ఆవులను అమెరికా ఎంబసీ కి తీసుకెళ్లి ఈ కష్టకాలంలో మీకు మేము తోడు వీటిని స్వీకరించండి అని భరోసా ఇచ్చారు..

అమెరికా కు 14 ఆవులు తీసుకోడం నామోషీ అనిపించలేదు..

కెన్యాలోని అమెరికా రాయబారి కెన్యా వారి అమాయక ఔదార్యానికి కరిగిపోయాడు..ఆనందంగా స్వీకరించారు..

ఇప్పుడు మనం ఇచ్చిన వాక్సిన్ కు ప్రతిగా 12 టన్నుల టీ పొడి కాఫీ పొడి శనక్కాయలు చైనా వైరస్ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించమని భారత రెడ్ క్రాస్ కు బహుమతిగా పంపారు..

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక గొప్ప మానవీయ తెగ మసాయి ల గురించి మనం తెలుసుకోగలడం ఒక ఆనందమైతే ఇక్కడ భారత ప్రభుత్వం నుంచి ఉచితంగా వాక్సిన్ పొంది అదే భారత ప్రభుత్వం మీద విషం కక్కుతున్న కట్లపాములు కోట్లలో బయటపడ్డాయి..

ఎవరు నాగరికులు??

కృతజ్ఞతతో మనకు టీ పోడి పంపిన మసాయి సోదరులా??

ఉచితంగా ఎగబడి వాక్సిన్ వేయించుకుని మోదీజీ ని కాటు వేయడానికి కాచుక్కూర్చున్న కమ్మీ..లిబరల్.. రంగురంగుల బట్టకాయిలా??

అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 .

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 3 . 


      ఈ పోస్టు నందు మీకు నాడుల పేర్లు మరియు వాటి స్థానముల గురించి వివరిస్తాను . 


         నాభికందము నందు ఉండు నాడి "సుషుమ్న" 

ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించివుండును. మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్నియు కలిసి    3 1/2 కోట్లు ఇవి అన్నియు మొదట నాభిమర్మమునందు నుండి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించి ఉండును. 


        సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు " ఇళ " , " పింగళ"  

నాడులచే తృప్తి కలుగును. వీటికి సరస్సులు అనే పేరు కలదు . శరీరము నందలి త్రిదోషములు ఎట్లు ప్రధానములో అట్లే ఈ నాడులు కూడా ప్రధానమైనవి  . 


        సుషమ్న , ఇళ , పింగళ వేణి  బంధము వలే కలిసి మెలిసి లలాటము నందు త్రివేణి సంగమం పేరుతో కలిసి ఉండును. మన ఉచ్చ్వాస , నిచ్ఛ్వాసమునకు "హంసయసి " అని పేరు కలదు . నాడి యందలి హంసగతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులను గమనించవలెను . 



           సుషమ్న నాడి వెన్నపూస నుండి మెడ మార్గమున బ్రహ్మరంధ్రము చేరును . వెన్నపూసను బ్రహ్మదండం అని పిలుస్తారు . అందులో ఉండు సుషమ్న నాడిని బ్రహ్మనాడి అందురు. బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతున్న ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును. 


         ఇళ నాడి నాభి కుర్మము నుండి హృదయము వద్దకి వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకి వచ్చును.  అదేవిధముగా పింగళ నాడి కుడిముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును. 


    మన నాడి వ్యవస్థ గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చు . నాకు తెలిసినంత వరకు అత్యంత ముఖ్యమైన విషయాలను మీకు తెలియచేశాను . మరింత విలువైన సమాచారం మీకు నేను రాసిన గ్రంథముల యందు లభ్యం అగును. 

 

      తరవాతి పోస్టు నందు అష్టమస్థాన పరీక్ష యందలి మిగతావిషయాల గురించి వివరిస్తాను . 


       గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

శ్రీమద్భాగవతము

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 6.కాలసూత్రము: ఎర్రగా కాలునట్లు వేడెక్కిన ప్రదేశమునందు పరుగెత్తించుట. అనగా దుష్కర్మ వశమున ఎండలో తిరుగవలసి వచ్చుట; కాళ్ళు తల దేహము మండిపోవుచున్నట్లు అనిపించు వ్యాధులు. 


7.అసి పత్ర వనము: కత్తులే ఆకులుగా గల చెట్ల అడవి. దేహమునందు కత్తులతో పొడిచినట్లు నొప్పులు. 


8.సూకర ముఖము: అడవి పంది ముఖమని అర్థము. భయంకరమైన చిత్త భ్రమలు మున్నగు వ్యాధులతో కూడి ఉండును. 


9.అంధకూపము: చీకటి బావిలో పడత్రోయుట. అనగా పరిస్థితులు దిక్కుతోచకుండా చిక్కులలో పడుట. 


10.క్రిమి భోజనము:పురుగులకు ఆహారముగా పెట్టుట‌. ఇది అనేక విధములైన సూక్ష్మజీవుల వ్యాధులను తెలియజేయును. 


11.సందంశనము: కొన్ని జీవులు కలిసి పీకుచుండుట. వ్రణములు మున్నగువాని దుర్భర బాధలని అర్థము. 


12.తప్తోర్మి: అనగా కళపెళలాడుచున్న అలలు కలది. అట్టి అలల యందు దుష్కర్మలు చేసిన వానిని ముంచెత్తుదురు. పూర్వదుష్కర్మ ఫలితముగా అగ్ని ప్రమాదములు మున్నగు వానికి గురి అగుట..........✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-136

ఆలు మగల సంవాదం!*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

(నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు)

             🌷🌷🌷

*కొంచం సేపు హాయిగా నవ్వుకోండి* 🤣🤣🤣

  *ఆలు మగల సంవాదం!* 




      'ఇంక  నీతో నావల్ల కాదు .. నీకు విడాకులు ఇచ్చేద్దామని ఆలోచిస్తున్నాను'


'అయ్యో ..నేనేం చేసేనండీ ?'


'ఏం చెయ్యలేదో అడుగు '


'పోనీలెండి .. నేను ఏవేం చెయ్యలేదండీ ?'


'ఉదయాన్నే నా పరువు తీసేసేవు '


'ఉదయాన్నే మీరు కింద పడుకున్న పరుపు తీసి మడతెట్టేను .. అంతేగానీ .. మీ పరువెప్పుడు తీసేను ?'


'మా ఫ్రెండు గోపాల్ గాడొస్తే నేను లేనని చెప్పమన్నానా ?'


'నేను అదే చెప్పేను కదండీ '


'నీ మొహం చెప్పేవు .. ఆ గోపాల్ గాడు 'సరే అయితే .. వాడు ఎప్పుడొస్తాడు ?' అని అడిగితే , లోపలికి తొంగి చూసి , 'ఏవండీ మీరు మళ్ళీ ఎప్పుడొస్తారని అడుగుతున్నారీయన .. ఏవని చెప్పమంటారు ' అని అడగడం ఒకటి .. ఆ వెధవ పడీ పడీ నవ్వుకుంటూ వెళ్ళిపోయేడు .. ఇవాళ్టి నుంచీ మా ఆఫీసులో తలెత్తుకోలేను .. హోల్సేలు గా నా పరువు తీసిపడేసేవు '


'మరి అతనా ప్రశ్న అడుగుతాడని నేనూహించలేదు కదండీ .. '


'నువ్వెక్కడ ఊహిస్తావు ? ఏమీ ఊహించవు .. మన పెళ్ళైన కొత్తలో ఇద్దరం గుడికెళ్తే ఏం చేసేవు ?'


'గుడికెళ్తే దణ్ణం పెట్టుకునుంటాను .. అంతకు మించి ఏం చేస్తాను ? ప్రసాదం ఇద్దరికీ సమానంగానే పెట్టేను కదా '


'వెధవ సొద ..నీకు బుర్ర లేదో లేక లేనట్టు నటిస్తావో అర్ధం కాదు .. నేను అంటున్నది ప్రసాదం గురించో తీర్థం గురించో కాదు .. పంతులు గారు గోత్రం చెప్పమ్మా అంటే 'శాండిల్యస' అని మీ పుట్టింటి గోత్రం చెప్పేవు .. నేను కాదు హరితస అని చెప్పబోతూంటే , కాదండీ అంటూ నాతో వాదించడం ఒకటి '


'మరి పెళ్ళైన వెంటనే గోత్రం మారిపోతుందని  నాకెలా తెలుస్తుందండీ ?'


'అంటే .. నేనో నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నానేంటి .. నాకు తెలియడానికి '


'నేనలా ఎప్పుడన్నానండి ?'


'నువ్వనక్కర్లేదు .. నువ్వేమీ అనవు కూడా .. నా దరిద్రం ఏమిటో అన్నీ నాకలా అర్ధమవుతాయి మరి ..ఎప్పుడు చేసుకున్న ఖర్మో ఇదంతా .. మన శోభనం రోజున మీ పుట్టింటాళ్ళ ముందు నన్ను వెర్రాడిని చేసేసేవు '


'ఓహో .. ఆ లైటు సంగతా .. మీకింకా గుర్తుందాండీ ?'


'మర్చిపోయేదా మరి ? .. ఏదో సిగ్గుపడతావేమోనని .. వెళ్లి లైటు తీసి రా అంటే వెంటనే వెళ్లి ఆ ట్యూబ్ లైటు పీకి నా చేతిలో పెట్టేవు .. ఆ వేడికి కయ్యిమని నేనరుస్తే , మీవాళ్లు నువ్వేదో చేసేసేవేమోనని బయట్నుంచి లోపలికి వినపడేలా ఒకటే నవ్వు '


'మరి .. మా అమ్మా వాళ్ళు "ఇప్పుడు నీకు పెళ్లైంది .. నీ మొగుడు ఎలా చెబితే అలా చెయ్యాలి .. ఎదురు ప్రశ్నలడక్కూడదు " అని చెప్పేరండి .. అందుకే మీరు లైటు తీసి రా అంటే , ఆ ట్యూబ్ లైటు పీకమంటున్నారేమో అనుకున్నా '


'ఓహో .. అలా వచ్చేవా .. అయితే నేను వెళ్లి ఆ లైటార్పు అంటే ఏం చేసేదానివో ? ఉఫు ఉఫు అంటూ ఆ లైటు దగ్గిర ఊదేదానివా ?'


'లైటార్పు అంటే ఆపమనే కదండీ .. అందుకోసం స్విచ్చి ఉందిగా .. మళ్ళీ ఉఫు ఉఫు అంటూ ఊదడం ఎందుకు ?'


'అమ్మో ..  .. నీ సంగతి నాకు తెలుసే .. నంగిలా ఉంటావు కానీ చావు తెలివితేటలు నీవి .. అందికే మా అమ్మతో కూడా ఆడుకున్నావు '


'మీ అమ్మ తో.. అదే అత్తయ్యగారితో నేనెప్పుడు ఆడుకున్నానండీ ?.. అయినా ఆవిడ ఆడే ఆటలేముంటాయి ?'


'ఆవిడ ఆడే ఆటలు ఏముంటాయా .. ఏముందీ .. నీలాంటి కోడల్ని తెచ్చుకుని ఖర్మ కాల్చుకోడం లాంటి ఆటలు ఆడుతూంటుంది .. ఏదో కొత్త కోడలివి కదా అని నీకు ఫోన్ చేసి 'ఏవమ్మా .. వంట ఏం చేసేవు అని అడిగితే తినేసేమని చెబుతావా ?.. అంటే మా అమ్మకి వంట ఏం చేసుకుంటారో కూడా తెలీదనే కదా నీ అభిప్రాయం ?'


'అయయ్యో .. ఆవిడకి తెలీదని కాదండి .. నాకు తెలుసో లేదోనని పరీక్ష పెడుతున్నారనుకున్నాను '


'ఆ పరీక్ష పెట్టడానికి మా అమ్మో పేద్ద టీచరు .. నువ్వావిడ స్టూడెంటూ మరి '


'అత్తయ్యగారు నాకు దేవుడితో సమానమండి .. గురువు దేవుడితో సమానం కదండీ .. అంటే అత్తయ్యగారు నాకు గురువు తో సమానమే కదండీ '


'ఈ వెధవ లెక్కల్లో ఎమ్మెస్సీ  చెయ్యడం కాదు కానీ ప్రతీదానికీ ఓ ఈక్వేషన్ లాగుతావు .. మరి ఇంత గొప్ప తెలివైనదానివీ నిన్న సాయంత్రం మా ఫ్రెండ్సందరినీ అలా హడలగొట్టి పంపేవేం ?'


'నేనెక్కడ పంపేసేనండీ ? వాళ్ళే ఇంక వెళ్ళొస్తామని వెళ్ళిపోయేరు కదండీ '


'వాళ్ళందరూ ఏదో సరదాగా మనకి కొత్తగా పెళ్లైంది కదా .. మనింట్లో భోజనం చేద్దామని వచ్చేరు .. వస్తే అలా హడలగొట్టడమేనా ?'


'వాళ్ళు చెప్పాపెట్టకుండా కుటుంబాలతో సహా వచ్చేసేరు కదండీ .. ఇంట్లో సరుకులేవీ లేవు .. మిమ్మల్నడిగితే ఏదో ఒకటి వండేయ్ అన్నారు .. '


'మరి ఇంట్లో ఏవీ లేకపోతే లేవని చెప్పేడవొచ్చుగా .. '


'అందరిముందూ ఇంట్లో ఏవీ లేవని చెబితే బాగుండదు కదండీ '


'అందుకోసమని .. ఇంట్లో ఉన్న మ్యాగీ నూడుల్స్ తో పాయసం వండేస్తావా ? ఇద్దరు ముగ్గురైతే రోడ్డు మీదికెళ్లి డోక్కున్నారు కూడా .. వాళ్ళ ముందు నాకేడుపొచ్చినంత పనయ్యింది'


'మరి మీ గురించి వాళ్ళు తప్పుగా అనుకోకుండా  వాళ్లందరినీ ఇంట్లోంచి పంపేయడానికి నాకు వేరే ఏమీ తోచలేదండి .. నాకు వంట రాదు అనుకున్నా పర్వాలేదండి '


'ఖర్మ .. ఇంకేముందీ .. వీడి పెళ్ళానికి బుర్ర లేదు , వంట రాదు అని అందరూ ఇంక నన్ను చూసి నవ్వుకుంటారు '


'అయ్యో .. నాకు తెలీకుండానే మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను ..అయితే నాకు విడాకులిచ్చేస్తారాండీ ?'


'వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళూ వేసాను కదా .. నా ఖర్మ అని సరిపెట్టుకుంటాను .. ఇంక మీ ఆఫీసుకి బయల్దేరు .. అసలే ఇవాళ మీకు జీతాలిచ్చే రోజు కూడా ..నీ డెబిట్ కార్డు నాకు ఇచ్చెళ్ళిపో'

🙄😂🙄😂🙄😘

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

_సెకండ్ వేవ్...థర్డ్ వేవ్

 🫑🍎🍋🍇🍓

*_సెకండ్ వేవ్...థర్డ్ వేవ్ అంటూ ఆందోళన చెందకుండా..._*


*_పిల్లల ని రోజూ గంటైనా ఎండలో ఆడుకోనివండి._*

*_తిరగనివండి._*


*_నువ్వులు...బెల్లం ఉండలు...వేరుశనగ చిక్కీలు...రోజూ పెట్టండి._*


*_మొలకలు... పండ్లు...మజ్జిగ...రాగిజావ... అరటిపండ్లు బాగా అలవాటు చేయండి._*


*_జంక్ ఫుడ్...ఆయిల్ ఫుడ్ పెట్టకండి._*


*_ఆకుకూరలు... కూరగాయలు ఎక్కువగా తినిపించండి. వేడన్నం లో నెయ్యేసి పెట్టండి._*


*_ఫ్రిజ్ లో పదార్థాలు పెట్టకండి._*


*_సెల్ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళని ఒక్క గంటైనా ప్రశాంతంగా పలకరించండి._*


*_ఇవన్నీ వాళ్ళలో రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి._*


*_ఏడాది గా ఇంట్లో మగ్గడం వల్ల వాళ్ళ ఇమ్యునిటీ తగ్గకుండా చూసుకోవడమే మార్గం._*


*_కోవిడ్ ని ఎదుర్కోవడానికి... మానసికంగా చురుగ్గా ఉండటానికి సూర్యరశ్మి... వాకింగ్... ప్రాణాయామం, యోగ,సూర్యనమస్కారం, ఎంతో దోహదపడతాయి._*


*_భయంతో నాలుగు గోడల మధ్య బందీలను చేస్తే...పరిస్థితి మరింత కష్టమౌతుంది._*


*_వీలైతే మీ సొంతూరు లేదా ఏదైనా పల్లెటూరు తీసుకెళ్లి పదిరోజులు మట్టి లో బాగా ఆడేలా చూడండి. ఇమ్యునిటీ దానంతటదే పెరుగుతుంది మంచి వాతావరణం ఉంటే !_*


*_నీళ్ళ బిందెలో నాలుగు తులసి...పుదీనా ఆకులు వేసి అవి తాగిస్తే ఎంతో బావుంటుంది._*


*_అప్పుడప్పుడు నిమ్మరసం తాగించండి. నేల ఉసిరి కాయలు తినిపించండి._*


*_పుచ్చకాయ గింజల్లో జింక్ ఉంటుంది తినిపించండి._*


*_మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ లు వస్తుంటాయి. సహజ సిద్ధమైన ఆహారం ఎంతో మంచిది._*


*_వారానికో సారి పొద్దున్నే నాలుగు వేపాకులు తినిపించండి._*


*_రోజంతా బాగా నీళ్లు తాగేలా చూడండి._*


*_రోజూ కొంచెం వేడి నీళ్లలో తేనె,వేసి ఉదయాన్నే. తగిపించండి_*


*_బాదం, ఖర్జుర, ఎండుద్రాక్ష, పండ్లు శరీరానికి కావలసిన శక్తిని ఇస్తావి_*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽

వెల్లుల్లిఖ రెమ్మల వాసన ..కరోన

 ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లిఖ రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయట పడ్డాను దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.


పచ్చి వెల్లుల్లి లో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్  లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె కాంపోడ్సు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ లవల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది, వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది ఆశ్చర్యం ఎమిటి అంటె 1968 లో వచ్చిన influenza నుండి కాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఇ పచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే బయటపడటం.


*పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు..*


1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోన నుండి కూడా కేవలం నాల్గు గంటల నుండి రెండు రోజులలో కచ్చితంగా కోలుకుంటారు.


2) ఎడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాల్లలో నాల్గు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు సంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాల్లు గంటల‌ నుండి రెండు రోజులలో కరోన నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు. మానవ పాదాల అరికాళ్లలో రంద్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది మీరు పాదాల అరికాళ్లలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరె గమనించవచ్చు.


కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇదీ ఒక సమాధానం.


సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం కచ్చితంగా నాల్గు గంటల నుండి రెండు రోజుల్లో కరోన నుండి కోలుకుంటారు

మీకు ఇంకా ఆధారాలు కావాలి అంటే ఇ ఆర్టికల్ చదవండి


దయచేసి ఇ అమూల్యమైన మెసేజ్ ను అందరికీ చేరేల సేరు చెయ్యండి కరోన నుండి దేశాన్ని కాపాడుకుందం.

                                       ఇట్లు 

                                         మీ

                        అవధానుల శ్రీనివాస శాస్త్రి

Vedas

 *_All Vedas and Slokas in all languages in one link. Please save this for your permanent reference._*


🔰🔰🔰🔰🔰🔰🔰

           👇👇


https://vignanam.org/mobile/


          🍃🔔🌺

పేదలకు దానం చేసిన #మహానుభావుడు !

 36 ఏళ్లపాటు జీతం డబ్బులు విరాళం! రూ. 30 కోట్లు పేదలకు దానం చేసిన #మహానుభావుడు !

ఎవరైనా తనకు ఉన్నదాంట్లో కొంత దానం చేస్తారు! కానీ ఉన్నదంతా దానం చేసేవాళ్లు ఎంతమంది వుంటారు చెప్పండి?! అలాంటి ఉత్తమోత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు. #కల్యాణ_సుందరం జీవితం అలాంటిదే! అతని గొప్పతనం గురించి వింటే నిజంగా వళ్లు పులకరిస్తుంది! అతనలా నడిచొస్తుంటే మూర్తీభవించిన మానవత్వం ఖద్దరు చొక్కా వేసుకుని ఎదురుపడ్డట్టే ఉంటుంది. అతని గురించి తెలుసుకున్నా కొద్దీ ఇంకా వినాలనే తపన పుడుతుంది. అర్జెంటుగా కలుసుకోవాలనిపిస్తుంది.


నేను నిలబడటమే కాదు.. పక్కవాడు కూడా నిలబడాలి! ఇంత గొప్ప ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కల్యాణ సుందరం! తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఊహ తెలియకముందే తండ్రి కన్నుమూశాడు. అమ్మ లాలన తప్ప, తండ్రి ప్రేమ తెలియదు. ఉన్నదాంట్లో సాయం చేయాలనే తల్లి గుణమే సుందరానికి అబ్బింది. కష్టపడి చదివాడు. లిటరేచర్‌ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్టు. లైబ్రేరియన్ గా జీవితం మొదలుపెట్టాడు. మొదటి నెల నుంచే విరాళాల పరంపర కొనసాగింది. లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే, ఒక హోటల్లో సర్వర్‌ గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేశాడు. జీతంలో ప్రతీ పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశాడు. చివరికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు.

కల్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు అమెరికా ‘మ్యాన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్ధ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఆయనను 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది.ఇంకో విషయం ఏంటంటే కల్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే,  పెళ్లయితే అప్పుడు ప్రాధాన్యతలు మారిపోతాయి. రిలేషన్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అవుతాయి. ఇదంతా కల్యాణ సుందరం ముందే ఊహించాడు. అందుకే జీవిత పుస్తకంలో పెళ్లి అనే పేజీని తొలగించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులేవో సమాజానికి పెడతానంటాడు. పెళ్లి చేసుకోవా అని సన్నిహితులు ఎవరైనా అడిగితే.. పేరులో కల్యాణం ఉంది కదా ఇంకెందుకు అని జోక్ చేస్తాడు.


ఇంతటి పేరు ప్రఖ్యాతులున్నా కల్యాణ సుందరం చాలా సాదాసీదాగా ఉంటారు. ఆడంబరం నచ్చదు. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయనిది డబ్బొక్కటే అంటాడు. అందుకే దాన్ని నలుగురికీ పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నాడు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం. ఏదీ తన ఆస్తి అనుకోలేదు కాబట్టే చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే సంపాదించిన ప్రతి రూపాయినీ దానం చేయగలిగాడు. స్వార్ధం రాజ్యమేలే ఈ సమాజంలో నిస్వార్ధంగా బతుకుతూ, నాలుగు డబ్బులు సంపాదించడం కాదు..చస్తే మోయడానికి నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి అని చాటిచెప్పిన కల్యాణ సుందరం నిజంగా స్ఫూర్తి ప్రదాత.

తమిళనాడు దానం కల్యాణ సుందరం లైబ్రేరియన్,  ఉత్తమవ్యక్తి

_*వైశాఖ పురాణం - 23

 _*వైశాఖ పురాణం - 23 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*కిరాతుని పూర్వజన్మ*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖకిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను.


కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు , సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా ! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి ? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను , పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ! ఉత్తముడా ! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా ! సమచిత్తులు , భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు , ఉత్తముడు , తనవాడు , పరుడు అనుభేదముండదు కదా ! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను , దుష్టులైనను చెప్పుదురు కదా !


గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింప జేయు స్వభావము కలవారు కదా ! దయాశాలీ ! సజ్జనుడా ! నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది , నీకు విధేయుడనగుటవలన , నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను.


శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది యంతయును వైశాఖమహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను.


కిరాతుడా ! నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖధర్మములనాచరింపుము. ఈయెండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు , నీడలేవు. నేనిచటనుండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖమహిమను , నేను చూచిన దానిని , విన్న దానిని నీకు వివరింతును అని పలికెను.


అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామీ ! ఇచటకు కొలది దూరమున స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు యెన్నియో యున్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగనుండును. అచటకు పోవుదము రమ్మని శంఖుని అచటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో గలసి వెళ్ళి యచట మనోహరమగు సరస్సును జూచెను. ఆ సరస్సు కొంగలు , హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురుచెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము లెక్కువగానుండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు , చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు , తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై యుండెను. వివిధములగు పక్షులచటవ్రాలి మధురముగ కిలకిలారావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు , నీడనిచ్చు చెట్లు పుష్కలముగ నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగ మనోహరములైయుండెను. అడవి జంతువులును అచట స్వేచ్చగ తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైనసరస్సును జూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు నా సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగ కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల జూచి ఇట్లనెను.


నాయనా ! కిరాతా ! ధర్మతత్పరా ! నీకేధర్మమును చెప్పవలెను ? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశసాధ్యములుగ నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వాని నాచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు , ఆయుష్మికములునగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలయునో అడుగుమని పలికెను.


అప్పుడు కిరాతుడు స్వామీ ! అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మనాకేల కలిగెను ? ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని యడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై యుండి ఇట్లనెను.


ఓయీ ! నీవు పూర్వము శాకలనగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు. శ్రీవత్ససగోత్రుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు  కాంతిమతి. ఆమె సుందరి , ఉత్తమురాలు , పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రునివలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది.


ఆమె నీకును నీవుంచుకున్న వేశ్యకును అనేకవిధములగు సేవలను ఓర్పుగా శాంతముగ చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును , భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగ చాల కాలము గడచినది.


ఓయీ కిరాతా ! ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించునాహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదెపెరుగు ముల్లంగిదుంపలు , నువ్వులు , అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారమువలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితోబోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవచేయుచుండెడిది. నీవును పశ్చాత్తపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు పదిజన్మలు నపుంసకుడై పుట్టును సుమా ! నీవంటి పతివ్రత నవమానించిన నేను పెక్కు నీచ జన్మలనందుదును. అని యనేక విధములుగ నామెతో బలికితివి. ఆమెయు *'నాధా ! నీవు దైన్యము వహింపకుము. చేసినదానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగ బాధించును. వానిని సహించినవారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలమిదియని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువులనుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగ భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్దలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరిని ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదెపెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. పది శనివారములుపవాసమును చేయుదును. మధురాహారమును , నేతిని , అలంకారములను , తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగ చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను.*


ఒకనాడు దేవలుడను ముని సాయంసమయమున నామె ఇంటికి వచ్చెను. అప్పుడామె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిధిని పూజించినచో నీకు మంచి కలుగునని యామె తలచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవుటచే నామె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీచేత నామె పానకము నిప్పించెను. నీయనుజ్ఞతో దానును ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్యవ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్భుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను.


నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకమునిచ్చుటవలన దేవలుని పాదములను కడుగుట వలన నామెకు శ్రీహరిసాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములడుగ వలెనను మంచిబుద్ది కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లు కొనుటచే నీకు నాతో నీవిధముగ సాంగత్యము చేయు నవకాశము కలిగినది. కిరాతా ! నీ పూర్వజన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలిసికొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖవ్రత నాచరించుట వలన కలిగినది. నీకింకను యేమి తెలిసికొనవలయునని యున్నదో దానినడుగుము చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను.

రామదాసు

 *రామదాసు*


అశోక వన ధ్వంసం తరవాత, రాక్షసులతో యుద్ధ మప్పుడు, అంతవరకూ, సుగ్రీవుడి సచివుడినని, రామ దూతను,  అని చెప్పుకున్న హనుమ తనంత తానుగా  *"దాసోహం కోసలేంద్రస్య"* అని తాను *"రామ దాసును"* అని గట్టిగా వినపడేటట్లు అరిచి చెబుతాడు.


 సీతాన్వేషణ సీతా దర్శనం వరకూ, రామ దూత. సీతతో సంభాషణా, అంగుళీయాక ప్రదానం, చూడామణి ప్రదానం  అయ్యాక రామ దాసు. ఈ మార్పు కు కారణ మేమిటి? కిష్కింధ కాండ లో ఆంజనేయుడికి  రాముడు పరిచయ మవగానే  దాసత్వం అంగీకరించి తనకు తాను రామదాసును అని అనుకోవచ్చు కదా. సుందరాకాండ ముందు ఈమాట ఎక్కడా ఎందుకు అనలేదు. 


మాయారూపిణి అయిన అమ్మవారు విక్షేపణ, ఆవరణ, వివేక శక్తి రూపాలగా ఉంటుంది. విక్షేప శక్తి తామస మైంది. చరాచర ప్రకృతి రూపంలో జీవుడిని తికమక పెడుతుంది. ఆవరణ శక్తి రాజస మైనది పరమాత్మకు జీవుడికి అడ్డుగా వుంటుంది. వివేక శక్తి సాత్విక మైంది పరమాత్మ తత్త్వాన్ని జీవుడు తెలుసుకోడానికి సహాయ పడుతుంది. 


సీత పరాశక్తి. ఆమె జగన్మాత జగన్మాయ కూడా. మాయాశక్తి అనుగ్రహం లేనిదే పరమాత్మ ను పట్టుకోలేము. సీతా దర్శనం కాగానే హనుమ మానసికం గా రాముడినే తల్చుకుంటారు.  సీత కోరికను అనుసరించి రామ లక్ష్మణులను వర్ణిస్తాడు.  సీతా దర్శనమైన తరవాత ఆమె అనుగ్రహం వల్ల, హనుమకు రామ తత్వం అప్పుడు, (రాముడిని వర్ణన చేసినప్పుడు), పూర్తిగా అర్థమౌతుంది. ఆ తత్వం తెలిశాక ఈయన దాసత్వం స్వీకరిస్తారు.


దాసత్వం అనేది నవవిధ భక్తి మార్గాల లో ఒకటి. ఏమి చెయ్య మంటారు అనడానికి సంస్కృతం లో "కిం కరోమి" అంటారు. అలా అనేవాడిని "కింకరః" అంటారు. తెలుగులో కింకరుడు అంటారు. వాడి గుణము లేదా ప్రవృత్తిని "కైంకర్యం" అంటారు. దాసత్వం చాలా కష్టమైన వ్రతం. ముందుగా అహంకార మమ కారాలు విడిచిపెట్టాలి. సర్వం భగవంతుడికి ఒప్పచెప్పాలి. గోదా దేవి తండ్రి విష్ణు చిత్తుల వారు కూడా జీవిత మంతా స్వామి కైంకర్యం లోనే గడిపారు.  త్యాగరాజు బంటు రీతి కొలు వియ్యవయ్య రామా అన్నా మీరాబాయి చాకర్ రాఖోజి అన్నా వాళ్ళు కోరుకున్నది ఈ విధమైన సేవ చేసే అవకాశమే.   హనుమ ఆదర్శ ప్రాయుడైన రామ బంటు.


హనుమ పేర్లన్నీ పరిశీలించి చూడండి. ఒక్కొక్క పేరూ ఒక్కో సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చినవి. రామదాసు లేదా దాసాంజనేయ అన్న పేరు ఆయనకు ఆయనే ఇష్టపడి తగిలించు కుంటారు.  అది ఆయన కోరుకున్న పేరు. ఏ దేవత కైనా ఆయన కిష్టమైన పేరుతో పిలిస్తే నే సులభంగా అనుగ్రహిస్తాడు కదా.  దాసాంజనేయ మూర్తి పూజలో ఇంకో విశేషం. ఈ మూర్తి  (రాముడిని ధ్యానిస్తున్న అంజనేయుడి) కి చేసే పూజ రాముడికి కూడా చెందుతుంది. వీరాంజనేయ, పంచముఖి ఆంజనేయులు ఉగ్ర మూర్తులు. అభయాంజనేయ దాసాంజనేయులు భద్ర మూర్తులు. అందులో కూడా అభయాంజనేయ మూర్తి లో రాజసం ఉంటుంది. దాసాంజనేయులు శుద్ధ సాత్విక రూపం. అందువల్ల దాసాంజనేయ మూర్తి పూజ అధిక ఫలాన్ని ఇస్తుంది. 



*పవని నాగ ప్రదీప్*

గమన శక్తిని

 మానవ మనుగడకు మూలమైన గమన శక్తిని వ్యాప్తపూర్వకంగా ప్రకృతి నుండి మాత్రమే గ్రహించవలెను. దాని సూత్రము ఉత్తరఆయణమని, దక్షిణ ఆయణమని రెండు రకాలుగా భూగమన శక్తని నిర్ణయించినది  వేదము. దాని శక్తి లక్షణమును పంచభూతాత్మక పదార్ధరూపముగామారి వ్యాప్తమై యున్నదని మంత్రపుష్పం.అది ఆయణమని అణువు ఆయతనములో తత్ ఎన్ గా మారినదని ఆయణ లక్షణము పదార్ధ లక్షణమే ఆయతనమని అనగా వ్యాప్తమని

పదార్ధముగా లక్షణముగా మార్పు చెందును.దాని లక్షణమునకు మూలమైన అణి మార్పు చెందుటను తెలియదు. పదార్ధ లక్షణముగా మార్పు చెందినగాని. ఉత్తరాయణ దక్షిణాన గమన కాంతి లక్షణము వేరు వేరు స్వభావములు ప్రాకృతికంగా కలిగి యున్నది. దాని ఆధారము ప్రకృతి

ఉత్తరాయణము లో శక్తి దాని అగ్ని తత్వం వ్యాప్తం అమితంగా యుండి దానిని భూమి రీచార్జి చేసుకొని మితంగా, అనగా ప్రకృతికి అనుకూలంగా దక్షిణాయనంలో ఫలవంతమైన మగుచువ్నది. అది వర్షం ద్వారా నీటి రూపంలో. మనం సాంకేతికంగా ఎంత అభివృధ్ది సాధించిననూ భూమి భూమిపైగల సమస్త జీవశక్తికి అవసరమైన నీటిని సృష్టించలేము. అది ప్రకృతి వలననే సంభవం. అనవసర ప్రయాసచేత కాలం వృధా చేసి ఎండమావులు చూసి నీళ్ళు అనే బ్రమలో పడి సత్యాన్ని తెలుసుకోలేక పదిమంది చెప్పిన అసత్యమే సత్యమని అనుకోవడం అఙ్ఞానము.సత్యమునువఎవరికి వారే తెలుసుకొనుట ఙ్ఞానం.యివాలిటి బ్రమయనే అసత్యము తాత్కాలికంగా సత్యమని అది రేపటికి అసత్యమౌను.ఎందుకనగా మార్పు కలుగుట వలన. మార్పు కలగనది సత్యం. ఎందుకనగా అందరూ ఎళ్ళవేలలా దాని అనుభవించుచున్న ప్రకృతి. ఒకవేళ మార్పు కలిగినను ఎప్పటికీ సత్యము సూర్యుని, మిగిలిన గ్రహరూప కాంతిలక్షణమే సత్యం. ఆరోజు కాంతి లక్షణము  మరొక రోజు లక్షణమునకు సరిపోదు. యిటులనే ప్రతీ సంవత్సరం మార్పు చెందుతూనే యున్నది

ఋతుధర్మం కూడా యిదే.వకే ఋతు ధర్మం ప్రతీ సంవత్సరం వకే లాగ యుండదు అది కూడా మన మార్పులాగనే సూక్ష్మంగా కొంత మార్పు కలిగుటను దాని లక్షణమునకు ద్వారానే  మార్పు చెందుతూనే యుండును. దానివలననే మానవ ఆలోచనలు ప్రతీ జీవిలో వకే లాగ యుండదు.దీనినే మనిషి ప్రవృత్తియని, దానిని మనం గుణములు యని, గుణములుకూడా మార్పు వలన అసత్యములే.యీరోజు గుణం రేపటికి మార్పు చెందుతున్నది.అనగా అసత్యమే. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూ నేవుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*నేలమాళిగ..నిరంతర సాధన...*


*(నలభై ఆరవ రోజు)*


మొగలిచెర్ల ఫకీరు మాన్యం లో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావొచ్చింది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటూనే..మరోవైపు తన అవసరాల కనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు..తూర్పు ముఖంగా ఒక గది..ముందు వరండా..వరండాలో ఆగ్నేయం వైపు ఒక చిన్న వంటగది..ఈశాన్యం లో బావి..చుట్టూరా ప్రహరీ గోడ..ప్రహరీ లో తూర్పు వైపు ద్వారం..ఇలా ఉండేది..


తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే..ముందుగా బావి వద్దకు వెళ్లి..తలారా స్నానం చేసేవారు..ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా..నింపాదిగా..శ్రద్ధగా చేసేవారు..ఆరడుగుల పైనే పొడవున్న తెల్లని మేనిఛాయతో..బావి వద్ద నిలబడి రెండుచేతులతో బక్కెట్ పైకెత్తి పట్టుకొని..అందులోని నీటిని ధారగా తలమీద పోసుకునే వారు..పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే!..


ఆ తరువాత ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతూ వుండేవారు..ఫకీరు మాన్యం లోకి పశువులను మేపుకొనడానికి వచ్చిన పశువుల కాపరులు..ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి..ప్రహరీ మీదుగా లోపలికి చూసేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు..వీళ్ళను చూసి పలకరింపుగా నవ్వేవారు..బాగా ఉత్సాహంగా ఉన్నరోజు.. ఆ పశువుల కాపరుల తో మాట్లాడేవారు కూడా..వారి యోగక్షేమాలు విచారించేవారు..ఆ సమయంలో శ్రీ స్వామివారిని కలిసిన వారితో ..ఏ కల్మషమూ లేకుండా..నవ్వుతూ..హాయిగా మాట్లాడేవారు..


ఒక్కొక్కసారి శ్రీధరరావు దంపతులు అలాంటి సమయంలో రావడం జరిగితే..వారిని కూర్చోబెట్టి..అనర్గళంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమరిచి చెప్పేవారు..ఆ చెప్పడంలో కూడా ఖంగు మనే కంఠస్వరంతో..ఎంతో వేదాంతాన్ని రంగరించి..వినసొంపుగా చెప్పేవారు..పట్టుమని ముప్పై యేళ్ళు కూడా లేని ఆ యువకుడిలో అంత జ్ఞానం ఎలా వచ్చిందీ అని వినే వారికి అనిపించేది..మహా మహా యోగులు..మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్ధం తో సహా వివరించేవారు..ఆ ధారణాపటిమ దైవదత్తమే కానీ..మరేదీ కాదని ప్రభావతి గారు అనేవారు తమ పిల్లల తో..


శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజూ శ్రీధరరావు గారింటి నుంచే వచ్చేది..ఆయన ధ్యానం లో ఉన్నప్పుడు గది ముందు తలుపుదగ్గర పెట్టి వెళ్లే వాళ్ళు..తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బా ను తీసుకెళ్లే వాళ్ళు..ఒక్కొక్కసారి ఆ డబ్బా లో ఉన్న ఆహారం అలానే ఉండేది..అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపలికి రాలేదని అర్ధం..మరోసారి వరుసగా రెండు మూడు రోజులపాటు అలానే జరిగేది..శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానం లోనే ఉండిపోయేవారు..ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో..శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్ధమయ్యేది..ముఖం లో ఒకవిధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది..దృష్టి కూడా దిగంతాలకు అవతలివైపు చూస్తున్నట్లు గోచరించేది..పద్మాసనం వేసుకొని హఠయోగంలో అలా నిటారుగా..కూర్చుని ఉండేవారేమో..రెండు తొడల మీదా పాదములు పెట్టుకున్నందువల్ల..కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి..ఇవేవీ ఆయన మనసుకు తోచేవి కాదు..ధ్యానం..సమాధి స్థితి..అంతే!..అదే ధ్యాస!..తానొచ్చిన కార్యం పూర్తి కావాలంటే..తాను ఇంత సాధనా చేయాల్సిందే అన్నట్లుగా వుండేవారు..ఎవరితోనూ సంభాషించేవారు కాదు..ఒకవేళ శ్రీధరరావు దంపతులు రాదల్చుకున్నా..ఓ నాలుగైదు రోజులపాటు రావొద్దని చెప్పి పంపేవారు..ఎవరైనా వచ్చినా.. ప్రహరీ కున్న ద్వారం వద్దే వేచి చూసి..తిరిగి వెళ్లవలసిందే..


ఆశ్రమం లోని ప్రధాన గది లో నిర్మించుకున్న  నేలమాళిగ లోనే ధ్యానానికి కూర్చుని..ఆ పైన ఒక చెక్క పలకను వేసుకునే వారు..అంటే..పూర్తిగా చీకటి గుహ లాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు..ఆ లోపల కూర్చుని ధ్యానం చేయడం మానవమాత్రులకు సాధ్యం కాదు..ఈవిషయంలో శ్రీధరరావు దంపతులకు ఒక భయం పట్టుకుంది..ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా?..అని..ఆ దంపతులు తల్లడిల్లిపోయారు..ఆ సందేహాన్ని శ్రీ స్వామివారు ఎంత చాకచక్యంగా వాళ్లకు అర్ధమయ్యేలా నివృత్తి చేసారో.. రేపటి భాగంలో చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శయన నియమాలు

*🤘 శయన నియమాలు - సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం 🤘* 

*🔹పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:- 🔹*

*🔸1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు దేవాలయం మరియు స్మశాన వాటికలో కూడా పడుకోకూడదు (మను స్మృతి)*

*🔸 2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. (విష్ణు స్మృతి)*

*🔸3. విద్యార్థి, నౌకరి మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొలపవచ్చును.(చాణక్య నీతి)*

*🔸4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.(పద్మ పురాణము)*

*🔸5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి). విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. (మహాభారతం)*

*🔸6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.(గౌతమ ధర్మ సూత్రం)*

*🔸7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. (ఆచార మయూఖ్)*

*🔸8. పగటి పూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)*

*🔸9. పగటి పూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. (బ్రహ్మా వైవర్త పురాణం*)*

*🔸 10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి*

*🔸11. ఎడమ వైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.*

*🔸12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు. యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.*

*🔸13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.*

*🔸14.పడక మీద త్రాగడం - తినడం చేయకూడదు.*

*🔸15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)*

*👍 ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు. 👍*