24, జనవరి 2021, ఆదివారం

జగత్తుని తెలుసుకుంటున్నాము

 మనకు కనపడుతున్న ఈ ప్రపంచాన్ని అంటే ఈ జగత్తుని మనం పంచేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాము. అంటే కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. అదేవిధంగా మిగిలిన ఇంద్రియాలు కూడా మనకు సహకరిస్తున్నాయి. ఇంద్రియాలతో తెలుసుకొని విషయాన్నీ మనం ఈ భూమిమీద లేక ఈ జగత్తులో వున్నా కూడా మనం గుర్తించలేము. నిజానికి మనం మన ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకోలేక పోయినా ఈ జగత్తులో వున్నవి వున్నవి. మన కళ్ళు కొంత వరకు మాత్రమే చూడ గలుగుతాయి. ఒక చిన్న చీమను మనం చూడగలము కానీ చీమ కాలిని మనం చూడ లేము.  కానీ ఒక దుర్భిణితో చీమ కాలు కూడా చూడగలం. మన కంటికి చీమ కాలు కనపడనంత మాత్రాన చీమకు కాలు లేదు అనటం మూర్ఖత్వమే అవుతుంది. 

మనకు ద్రుష్టి జ్ఞానాన్ని ప్రసాదించే దానిని కాంతి అని అన్నము.  ఈ కంటి 7 రంగుల మిశ్రమం అని మనకు తెలుసు.  బహుశా దీనిని సూచించటానికి కావచ్చు మన మహర్షులు కాంతిని ప్రసాదించే సూర్య భగవానుకు 7 గుర్రాల రధాన్ని అధిరోహిస్తాడు అని చెప్పి ఉండవచ్చు. కాంతి ఉంటే మాత్రమే మనకు ఈ ప్రపంచం కనపడుతుంది.  కాంతి లేనప్పుడు మన కళ్ళు తెరుచుకున్న మనకు ఏమి కనపడదు. మనం చూడ లేనంత మాత్రాన ప్రపంచం లేదని చెప్పలేముకదా. కాంతి ఉంటే చూస్తున్నాము కాబట్టి కాంతి లేనప్పుడు కూడా ప్రపంచం వున్నదని మన భావన చెపుతుంది. కొన్ని సందర్భాలలో కాంతి వున్నా కూడా కొన్ని చూడలేము. 

మీరు ఒక చీకటి గదిలో వున్నారనుకోండి. గదిలో ఏ వస్తువు కూడా మీకు కనపడదు. బైట వెన్నెలలోంచి ఒక మనిషి గదిలోకి ప్రవేశించాడనుకోండి అప్పుడు మీకు ఆ కొద్ధి కాంతిలో లీలగా ఒక మనిషి లోనికి వచ్చినట్లు తెలుస్తుంది.  కానీ ఆ మనిషి కట్టుకున్న దుస్తులు ఏ రంగులో ఉన్నవో చెప్పలేరు ఎందుకంటె అక్కడ రంగులను గుర్తించే అంత కాంతి లేదు. మీరు గదిలో ఒక దీపాన్ని వెలిగించారనుకోండి అప్పుడు స్పష్టంగా మీరు చూసిన మనిషి రూపురేఖలు, వారు ధరించిన దుస్తుల రంగుని స్పష్టంగా వర్ణించగలరు. కాంతి తీవ్రత పెరుగుతున్నకొద్దీ మనకు మన ముందర వున్న వస్తువుల వివరాలు తెలుసుకోగలుగుతున్నాము. మీ పిల్లలకి ఎవరికైనా ముల్లు గుచ్చుకొని ఇంట్లో వున్న నీదగ్గరికి వస్తే బైట ఎండలోకి పోదాం నాకు ఇక్కడ సరిగా కనపడటం లేదని మీరు మీ బాలుడ్ని ఎండలోకి తీసుకొని పోయే వాని కాలికి గుచ్చుకున్న ముల్లు తీయటం చేస్తారు. అంటే మీకు ఇంట్లో వెలుతురులో బాలుడి కాలిని, వేలుని మాత్రం చూడ గలుగుతున్నారు కానీ వాని కాలిలోని చిన్న ముల్లుని ఎక్కువ వెలుతురులో మాత్రమే చూడ గలుగుతున్నారు. 

మన మహర్షులు జ్ఞానాన్ని ప్రకాశము అని అభివర్ణించారు. ఎప్పుడైతే మీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానం దూరం అవుతుంది. 


ఎవరి వల్ల

 ఎవరి వల్ల 

నీవు  ఒక హోటల్కి వెళ్లావనుకో అక్కడ నీవు భోజనం చేస్తే నీకు ఆ భోజనంలో వడ్డించిన పదార్ధాలు అన్ని చాల రుచికరంగా వున్నాయి నీవు తృప్తిగా భుజిం చావనుకో అప్పుడు నీకు ఒక అభిప్రాయం కలిగింది అదేమిటంటే ఇంత రుచిగా వంటచేసిన ఆ వంట వాడు ఎవరు. అతనిని చూసి అభినందించాలి అని నీకు అనిపించి మేనేజర్ దగ్గరకు వెళ్లి భోజన వంటకాలు చేసింది ఎవరు అని విచారిస్తే ఫలానా రామా రావు అని చెప్పి ఆతను ఇప్పుడు ఇక్కడ ఉండడు  పొద్దున్నే వండి వెళతాడు అన్నాడు . అప్పుడు నీకు ఆ రామా రావుని చూడాలని బాగా అనిపిస్తుంది. తరువాత కూడా నీవు ఆక్కడ భోజనం చేసి సదరు రామా రావుని చూడాలని అనుకుంటావు.  కానీ చూడలేకపోతావు.  . 

ఇప్పుడు నీకు ఒక విషయం జోతకం అయ్యింది అంత రుచిగా వండిన వంటవాడు రామా రావు అని.  కానీ నీవు ఆ రామా రావుని ఇంత వరకు చూడలేదు.  ఐనప్పటికి ఆ రామారావు యొక్క ఉనికి అతని పనితనాన్ని నీవు గుర్తించావు. . మనకు కనపడుతున్న పనితనాన్ని కార్యం అని సదరు పనితనానికి కారణం అయిన దానిని కారణం అని మన మహర్షులు తెలిపారు. 

మహా మేధావులైన మన మహర్షులు ఈ జగత్తుని చూసి విశ్లేషణ చేశారు. ఈ జగత్తుకు మూలా కారణం ఎవరు అనే పరిశోధన చేశారు.  ఆ పరిశోధనల  ఫలితమే మన ఉపనిషత్తులు  అందులో ఒకటి  " కేనోపనిషత్" కేనా అనే సంస్కృత పదానికి అర్ధం ఎవరివల్ల ఆ సరళిలో ఈ ఉపనిషత్తు పయనిస్తుంది. ఈ ఉపనిషత్తుతో మన మహర్షులు మనకు ఈ సృష్టి రహస్యాన్ని ఛేదించే క్రమంలో కృషి చేశారు. మోక్షార్ధులైన ప్రతి వారు చదవ వలసిన ఉపనిషత్తులలో ఈ కేనోపనిషత్ ఒకటి. 

ప్రతి ఉపనిషత్తు ఒక శాంతి మంత్రంతో మొదలు అవుతుంది.  ఈ ఉపనిషత్తు శాంతి మంత్రాన్ని ఇప్పుడు చూద్దాము. 

శాంతిమంత్రి :

ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు: 

శ్రోతమథో బలమింద్రియాణిచ సర్వాణి !

సర్వం బ్రహ్మౌపనిషదం మాఁహం బ్రహ్మనిరాకుర్యాం 

మామా బ్రహ్మి నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మేఁ స్తు !

తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసస్తు తేజమయిసస్తు !!

ఓం శాంతి: శాంతి: శాంతి: 

మమ = నా; అంగాని = అవయవాలు; అప్యాయన్తు = శక్తివంతములగు గాక; ఆథో = ఇంకనూ; వాక్ = వాక్కు; ప్రాణ: = ప్రాణం; చక్షు: = కన్ను; శ్రోత్రమ్ = చెవి; బలమ్ = శక్తి; సర్వాణి = అన్ని; ఇంద్రియాణి = ఇంద్రియాలు; చ = కూడా; ఔపనిషదం = ఉపనిషత్తులో చెప్పబడిన; బ్రహ్మ = బ్రహ్మం; సర్వం = సమస్తం; అహం = నేను; బ్రహ్మ = బ్రహ్మాని; మానిరాకుర్యాం = నిరాకరింపకుందును గాక; బ్రహ్మ = బ్రహ్మం; మా = నన్ను; మాని రాకరోత్ = నిరాకరింపకుండుగాక; అనిరాకరణం = నిరాకరించుకుండటం; మే = నాయెడల; అస్తు = ఉండుగాక; ఉపనిషత్తు = ఉపనిషత్తులతో; యే = ఏఏ; ధర్మా: = ఉత్తమ గుణాలు (ఉన్నవో); తే = అవన్నీ; తదాత్మనివిరతే = ఆ ఆత్మలో శ్రద్ధగల; మయి = నాయందు; సన్తు = ఉండుగాక. 

నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక (అనగా నేను ఆ బ్రహ్మమే కదా!). నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాకరణం కనీసం నాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకలధర్మములు నెలకొనుగాక!

 ఓం శాంతి: శాంతి: శాంతి:

మన హిందూ ధర్మంలో మన మహర్షులు మనకు అన్నీ ధనాత్మకపు (పాజిటివ్ థింకింగ్ ) ఆలోచనలనే మనకు ఉపదేశించారు. రుణాత్మకత (నెగెటివ్ థింకింగ్) కు ఏమాత్రము చోటు లేదు. మనం ఎల్లప్పుడు ఆశా వాదులుగానే మన విద్యను అభ్యసించాలన్నది మన మహర్షుల అభిమతం. 

ఇప్పుడు మొదటి మంత్రాన్ని చూద్దాము. 

1. కేనేషితం పతతి ప్రేషితం మన: 

కేనప్రాణ: ప్రథమ: ప్రైతియుక్త: !

కేనేషితాం వాచమిమాం వదన్తి

చక్షు: శ్రోత్రం క ఉ దేవోయునక్తి !!

మన: = మనస్సు; కేన = దేనిచేత; ప్రేషితం = పంపబడి; పతతి = తన పనులుచేయ దుముకుచున్నది; కేన = ఎవనిచేత; యుక్త: = నియోగింపబడి; ప్రథమ: = ముఖ్యమైన; ప్రాణ: = ప్రాణం; ప్రైతి = తన పనులపై సంచరిస్తుంది; కేన = దేనిచేత; ఇషితామ్ = ఇష్టాన్ని అనుసరించి; ఇమామ్ = ఈ; వాచమ్ = మాటలు; వదన్తి = మానవులు పలుకుతారు; చక్షు: = కన్ను; శ్రోత్రం = చెవి; ఉ = నిజానికి; క: = ఏ; దేవ: = తేజోవంతుడు; యునక్తి = నియమించుతాడు..

శిష్యుడు : మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగింపబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతారు? నిజంగా ఏ బుద్ధి కళ్లను, చెవులను నియమిస్తుంది? 

యెంత అద్భుతమైన ఆలోచనో చుడండి. మన కళ్ళు  చూస్తున్నాయి,మన చెవులు వింటున్నాయి ఈ విషయాలు ప్రతి వారికి తెలుసు.  కానీ కళ్ళు  చూడటానికి,చెవులు వినటానికి కారణం ఎవరు??? 

2. శ్రోత్తస్య శ్రోత్రం మనసో మనో యద్ 

వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణ: !

చక్షుషశ్చక్షురతి ముచ్యధీరా: 

ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి !!

యత్ = ఏదైతే; శ్రోత్రస్య = చెవియొక్క; శ్రోత్రమ్ = చెవియో; మనస: = మనస్సుయొక్క; మన: = మనస్సో; వాచ: = వాక్కుయొక్క; హ = నిజంగా; వాచమ్ = వాక్కు; స: = అదే; ఉ = మరియు; ప్రాణస్య = ప్రాణంయొక్క; ప్రాణ: = ప్రాణమో; చక్షుష: = కన్నుయొక్క; చక్షు: = కన్నో(ఈ విధంగా తెలుసుకుని ఆత్మ ఈ ఇంద్రియాలూ మొదలైనవే అన్న భ్రాంతి); అతి ముచ్య = వదిలించుకుని; ధీరా: = బుద్ధిమంతులు; అస్మాత్ = ఈ; లోకాత్ = ఇంద్రియ జీవనం నుండి; ప్రేత్య = తప్పుకొని; అమృతా: = అమరులు; భవన్తి = అవుతారు. 

ఆచార్యుడు : ఆత్మ శక్తి వలననే చెవి వుంటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. బుద్దిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. 

 

3. నతత్ర చక్షుర్గచ్చి నవాగ్ గచ్చతి నోమున: !

న విద్మో న విజానీమో యథైత దనుశిష్వాత్ !!

తత్ర = ఆ బ్రహ్మ విషయములో; చక్షు: = కన్ను; నగచ్చతి = పోజాలదు; నవాక్ = మాటలు (పోజాలవు); న ఉ మన: = మనస్సుకూడా (పోజాలదు); తత్ = అది; న విద్య: = మాకు తెలియదు; యథా = ఎలాగ; ఏతత్ = దీనిని; అనుశిష్యాత్ = నేర్పించవచ్చునో; తత్ = అదికూడా; న విజానీమ: = మాకు తెలియదు. 

ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు... మాటలుగాని, మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏవిధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు. 

మన మహర్షుల గొప్పతనం, నిరాడంబరత ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం కాంతితో ప్రపంచాన్ని చూస్తాము కాంతిని మాత్రము చూడలేము. కాంతి లేకుండా చూడలేము. అదేవిధంగా మనం ఆత్మకలిగి ఉన్నందున అన్ని తెలుసుకోగలం.  కానీ ఆత్మను మాత్రము తెలుసుకోలేము.  ఎందుకంటె తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నది ఒకటే కనుక. మీకు ఇంకా స్పష్టంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. మనం కళ్ళతో చూస్తున్నాము కానీ మన కళ్ళను మన కళ్ళు చూడలేవు.  కానీ కళ్ళు ఉన్నాయని మనకు తెలుసు. అదే ఆత్మకు కూడా అనువర్తిస్తుంది. 

 

4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి !

ఇది శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే !!

తత్ = అది; విదితాత్ = తెలిసిన దానికంటే; ఏవ = నిశ్చయంగా; అన్యత్ = భిన్నమైనది; అథో = ఆపైన; అవిదితాత్ = తెలియని దానికంటే; అధి = అతీతమైనది; యే = ఎవరైతే; స: = మాకు; వ్యాచచక్షిరే = వివరించారో; పూర్వేషాం = పూర్వీకులనుండి; ఇతి = ఇలా; శుశ్రుమ = మేం విన్నాం....

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. ఆ తరువాత అది తెలియనిదానికంటే అతీతమైంది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం. 

 

5. యత్ వాచా సభ్యుదితం యేన వాగభ్యుద్యతే !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = ఏదైతే; వాచా = మాటలచేత; అనభ్యుదితమ్ = ప్రకటింపబడదో; యేన = దేనిచేత; వాక్ = మాటలు; అభ్యుద్యతే = ప్రకటింపబడుతాయో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

మాటలు దేన్ని ప్రకటించలేవో మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో. 

 

6. యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్ !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = ఏది (ఏ ప్రత్యగాత్మ చైతన్యము); మనసా = మనస్సుచే; న మనుతే = గ్రహించబడదో; యేన = దేనిచేత (ఏ ప్రత్యగాత్మ చైతన్యము చేత); మన: = మనస్సు; మతమ్ (ఇతి) = సంకల్పాదులలో ప్రసరించును (అని); ఆహు: = చెప్పుదురో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో. 

 

7. యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనినైతే; చక్షుషా = కన్నులచేత; న పశ్యతి = (మానవుడు) చూడడో; యేన = దేనిచేత; చక్షూంషి = కన్నులను; పశ్యతి = చూస్తాడో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

కన్నులు చూడజాలనిది కాని దృష్టిని చూచేది - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజింజేది కాదనీ తెలుసుకో. 

 

8. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనిని; శ్రోత్రేణి = చెవిద్వారా; నశృణోతి = మానవుడు వినజాలడో; యేన = దేనిచేత; ఇదం = ఈ; శ్రోత్రం = వినికిడి; శ్రుతం = వినబడుతుందో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు. 

మానవుడు చెవి ద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుతున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో. 

 

9. యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణ: ప్రణీయతే !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనినైతే; ప్రాణేన = ఊపిరిచేత; నప్రాణిత = వాసన చూడజాలడో; యేన = దేనిచేత; ప్రాణ: = ఊపిరి; ప్రణీయతే = శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు. 

మానవుడు ఊపిరి చేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మ అనీ ఈ జనులు ఇక్కడ పూజించే ఇది కాదనీ తెలుసుకో. 

రెండవ భాగం ;

1. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి 

నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ !

యదస్యత్వం యదస్య దేవేష్యథను 

మీ మాంస్యం మేవతే మన్యే విదితమ్ !

ఆచార్యుడు : ‘‘నేను బ్రహ్మతత్వం గురించి బాగానే తెలుసుకున్నాను’’ అని ఒకవేళ అనుకున్నట్లయితే.. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మ రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకోవలసి వుంది. 

శిష్యుడు : (మళ్లీ చింతనచేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను. 

 

2. నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ!

యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతి వేద చ!!

నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా! నా తోటివిద్యార్థులలో అది తెలియంది కాదు అని, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు. 

 

3. యస్యామతం తస్య మతం మతం యస్య న వేద స:!

అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతమ్!!

ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకోలేడు. బ్రహ్మవేత్తలు రెండుతెగలు. అందులో ఒకరు బ్రహ్మం తెలుసునని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలియదని కాదు కాని రెండవతెగవారు బ్రహ్మం తెలియదని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలుసు. 

 

4. ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విన్దతే!

ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతేఁ మృతమ్!!

మనస్సు చెందే వికారాన్ని స్పూర్తిగోచరం ద్వారా తెలుసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారా నిజమైన బలాన్ని, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు. 

 

5. ఇహ చేద వేదీ దథ సత్యమస్తి 

న చేదిహావేదీ న్మహతీ వినష్టి: !

భూతేషు భూతేషు విచిత్య ధీరా:

ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి !!

ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే.. ఆపైన నిజమైన జీవితం వుంది. అలా సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షిచుకుంటూ.. ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు. 

మూడవ భాగం : 

1. బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే, తస్యహ 

బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త !

త ఐక్షన్తాస్మాకమేవాయం విజయోఁ

స్మాకమేవాయం మహిమేతి!!

ఆచార్యుడు : బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు రాక్షసులపైన విజయం సంపాదించిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా.. దానివల్ల దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం.. మాదే ఈ ఘనత అని దేవతలు తలపోశారు. 

 

2. తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ 

తన్న వ్యజానత కిమిదం యక్షమితి 

ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మం.. దేవతల ముందుకు దివ్యతేజంతో సాక్షాత్కరించింది. కానీ ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు. 

 

3. తేఁగ్ని మబ్రువన్, జాతవేద; ఏతద్ 

విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!

దేవతలు అగ్నిదేవునితో ‘‘ఓ సర్వజ్ఞుడా.. ఈ శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు. 

 

4. తదభ్యద్రవత్, తమభ్యవదత్ కోఁసీతి, అగ్నిర్వా 

అహమస్మీత్య బ్రవీజ్జాతవేదా వా అహమస్మీతి !!

అగ్ని ఆ దివ్యశక్తి దగ్గరకు వేగంగా వెళ్లాడు. అప్పుడా శక్తి.. ‘‘నువ్వెవరివి’’ అని అగ్నిదేవుడ్ని ప్రశ్నించింది. ‘‘నేను అగ్నిని.. సర్వజ్ఞణ్ణి’’  అని బదులిచ్చాడు. 

 

5. తస్మిం స్త్వయి కింవీర్య మిత్యపీదం సర్వం 

దహేయం యదిదం పృథి వ్యామితి!!

‘‘అయితే నీలో ఏం శక్తి వుంది’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న అంతటిని నేను దహించివేయగలను’’ అని అగ్నిదేవుడు అన్నాడు. 

 

6. తస్మైతృణం నిదధావేతద్ దహేతి

తదుపప్రేయాయ సర్వజవేన తన్న 

శశాకదగ్ధుం స తత ఏవ నివవృతే నైత 

దశకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!

అప్పుడా దివ్యశక్తి అతని ముందు ఒక గడ్డిపోచును పెట్టి కాల్చు అని అంది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు దేవతల వద్దకు మళ్లీ తిరిగిపోయి ‘‘ఆ దివ్యశక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను’’ అని అన్నాడు. 

 

7. అథవాయు మబృవన్, వాయువేతద్ 

విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!

అప్పుడు దేవతలు వాయుదేవునితో.. ‘‘ఓ వాయుదేవా, ఈ అసాధారణమైన శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అతడు అందుకు అంగీకరించాడు. 

 

8. తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోఁసీతి!

వాయుర్వా అహ మస్మీత్యబ్రవీన్మాతరిశ్వా వా అహమస్మీతి!!

వాయువు ఈ అసాధారణమైన శక్తి దగ్గరకు వెళ్లాడు. ఆ శక్తి ‘‘నువ్వెవరివి’’ అని ఇతణ్ణి అడిగింది. ‘‘నేను వాయువును, గాలిని ప్రభువును’’ అని సమాధానం చెప్పాడు. 

 

9. తస్మి స్త్వయి కిం వీర్యమిత్యపీదం 

సర్వమాదదీయ యదిదం పృథివ్యామితి!!

‘‘అయితే నీలో ఏం శక్తి వుంది?’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న దేన్నైనా నేను ఎగురగొట్టగలను’’ అన్నాడు వాయుదేవుడు. 

 

10. తస్మైతృణం నిదధాతే తదాదత్స్వే తి

తదుపప్రేయాయ సర్వజవేన, తన్న శశా

కాదాతుం, స తత ఏవ నివవృతే! నై తద 

శకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!

ఆ దివ్యశక్తి వాయుదేవుడి ముందు ఒక గడ్డిపోచను వుంచి, దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు తన పూర్తిశక్తిని ప్రయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచ కదల్లేదు. దీంతో వాయుదేవుడు తిరిగి వెళ్లి ‘‘ఆ శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాను’’ అని దేవతలతో అన్నాడు. 

 

11. అథేంద్రమబ్రువన్, మఘవన్నే 

తద్విజానీహి, కిమేతద్

యక్షమితి; తథేతి; తదభ్య 

ద్రవత్; తస్మాత్ తిరోదధే!!

అప్పుడు దేవతలు ఇంద్రుడితో.. ‘‘ఓ దేవేంద్రా! ఈ అపురూపమైన శక్తి ఏంటో తెలుసుకో’’ అన్నాడు. ఇంద్రుడు సరేనన్నాడు. ఆ శక్తి వద్దకు త్వరగా చేరుకున్నాడు. కాని ఆ దివ్యశక్తి అతని ఎదుటనుండి మాయమైపోయింది. 

 

12. స తస్మిన్నే వాకేశే స్త్రియ 

మాజగామ బహుశోభమానాముమాం 

హైమవతీం; తాం హోవాచ 

కిమేతద్ యక్షమితి!!

ఆకాశంలో అత్యంత అద్భుతంగా, సౌందర్యవంతంగా వున్న ఒక యువతిని, హిమవంతుని కుమార్తెను చూశాడు ఇంద్రుడు. అప్పుడామెను ‘‘ఈ అపురూపమైన దివ్య శక్తి ఏమిటి’’ అని అడిగాడు. 

( ఇది మూడవ భాగం

నాలుగవ భాగం : 

సా బ్రహ్మేతి హోవాచ!!

బ్రహ్మణో వా ఏతద్ విజయే 

మహియధ్వమితి; తతో హైవ 

విదాఞ్చకార బ్రహ్మేతి!!

‘‘అది బ్రహ్మం అని.. బ్రహ్మం వల్ల కదా మీరు విజయం సాధించి, ఘనత పొందారు’’ అని ఉమాదేవి అంది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు. 

 

2. తస్మాద్ వా ఏతే దేవా అతితరా 

మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా 

యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే 

హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!

అందువల్లే కదా ఈ దేవతలు అంటే.. అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించారు. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్లారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు. 

 

3. తస్మాద్ వా ఇంద్రోఁతితరా

మివాన్యాన్ దేవాన్; సహ్యేనన్నే 

దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్ 

ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!

ఇంద్రుడు ఈ బ్రహ్మంను సమీపంలో స్పృశించాడు. అందువల్లే ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించాడు. అతడే ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు. 

 

4. తస్యైష ఆదేశ: యదేతద్ విద్యుతో వ్యద్యుతదా 

ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్!!

బ్రహ్మం వర్ణన ఇది : అహో! మిరుమిట్లుగొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే. మనిషిని రెప్పలు ఆర్చేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది. 

 

5. అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ 

మనోఁ నేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్ప: 

ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుండి దాని వర్ణనను గురించి, ఆ బ్రహ్మంవల్లే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం వుంచుకుంటుంది, వస్తువులను ఊహించుకుంటుంది. 

 

6. తద్ధ తద్వనం నామ 

తద్వనమిత్యుపాసితవ్యం ; 

సమ ఏతదేవం వేదాభిహైనం 

సర్వాణి భూతాని సంవాచ్ఛంతి !!

బ్రహ్మం తద్వనం అని అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధించదగిందని ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి. 

 

7. ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్ 

బ్రాహ్మీం వావ త ఉపనిషదబ్రూమేతి !!

శిష్యుడు : ఆచార్యవర్యా.. నాకు ఉపనిషత్ ను ఉపదేశించండి. 

ఆచార్యుడు : నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గురించి ఉపనిషత్తు నీకు ఉపదేశించాం. 

 

8. తస్యై తపోదమ: కర్మేతి ప్రతిష్ఠా

వేదా: సర్వాంగాని సత్య మాయతనమ్ !!

తపస్సు, నిగ్రహం, నిష్టా పూర్వకమైన కర్మ. ఇవి ఉపనిషత్తులని బ్రహ్మ జ్ఞానానికి మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం. 

 

9. యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన 

మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి !

నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతం మహోన్నతం, ఆనందమయం అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును.. అందులో ప్రతిష్టితుడౌతాడు

కారణభూతుడు బ్రహ్మ అని ఆ బ్రహ్మఐక్యతే మోక్షమని ఈ ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది. సాధకులు కేవలము ఒకసారి ఒక నవల చదివినట్లుగా చదివితే ఉపనిషత్తులు బోధపడవు.  వాటిని ఏకాగ్ర చిత్తంతో పలుమారులు చదివితే కానీ వాటి అర్ధం అంతరార్ధము సాధకులకు అర్ధం కాదు. నిష్ఠతో ఉపనిషత్తులు చదవాలని నా సూచన 


ఈ విధంగా సాగిన పరిశోధనే ఈ కేనోపనిషత్తు 

కేనోపనిషత్తు ఆసాంతం చదివి ముక్తి పదం వైపు అందరు పయనింతురుగాక. 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 






మహానుభావులు

 అక్షర పరబ్రహ్మ తత్వ శక్తి యే మెూక్షమని ఎందరో మహానుభావులు దారిని చూపించి జీవోధ్ధరణకు సంకల్పిచిరి. అక్షర పరబ్రహ్మ మనగా ఓం కారమా,శ్రీ కారమా, 

రామ శబ్దమా,ఏది.రామ శబ్దం పదార్ధ నిరూపణ. శ్రీ అనే శబ్దం మూడు సులక్షణమైన శక్తుల కలయిక. ఓం కారం మూడు శక్తుల శక్తికి మూల శక్తి. ఓం కారం శక్తి యెుక్క వ్యాప్త ధర్మమును తెలుపును. శక్తికి మూలం ఆత్మ లేక అణువు. సూక్మమైన విశిష్టమైన వర్ణింప కొలుచుట గుర్తించుటకు వీలులేని శక్తి వ్యాపిచెంది పదార్ధ రూపం దాల్చి లక్షణ గుణము కలిగి ప్రకృతిపరంగా జీవ లక్షణముగా తెలియుట యే రామ శబ్ద మని దాని తత్వ మని అది శబ్ద రూపం అక్షర పరబ్రహ్మ మని ఓం శ్రీ ,రామ తత్వ మని ప్రత్యక్షముగా తెలిసినది. పరాశక్తి అనగా దానిని గుర్తించుట కష్టము. పరాశక్తి దుర్గమును దానిని తెలియుట యే చరితము. కష్టం. అది రూపం చెందిన తెలియును. గతి సమాంతరంగా సూత్ర పరంగా నుండవలెనని. దానిని దుర్గ అనే శక్తి మాత్రమే ఓం పూర్ణముగా అమ్మ తత్వ లక్షణము తో సౌ కలిసి ఓం సౌ మహా దుర్గా శక్తిగా తెలియుచున్నది. అది తెలియని యెడల భ్రమ యని కుతర్కించుట అఙ్ఞానము. దానిని వీడు టకు రామ తారక అక్షర పరబ్రహ్మ సాధన యే గతి.దుర్గతినుండి విమెూచనం. సద్గతికి దారి. యిది తప్ప వేరు మార్గం సూన్యం.తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *భక్తి తో దర్శనం..*


ఆరోజు గురువారం..ఉదయం తొమ్మిదిన్నర గంటల వేళ ఒక  పెద్దాయన చేతిలో ఒక బట్టల సంచీ పట్టుకొని మందిరం లోకి వచ్చారు..రావడమే నేరుగా నేను కూర్చున్న స్థలానికి వచ్చి.."ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ అంటే ఎవరు? అని నన్నే అడిగారు.."నేనే" అన్నాను..కూర్చోమని కుర్చీ చూపించాను..కూర్చున్నారు..సుమారు అరవై ఏళ్ల పై బడిన వ్యక్తి లాగా అనిపించారు..


"నాపేరు యదునందన రావు..నేను చాలా దత్తక్షేత్రాలు చూశానండీ..పిఠాపురం మొదలుకొని గిరినార్ దాకా అన్ని క్షేత్రాలూ చూసే భాగ్యాన్ని ఆ దత్తుడు కలిగించాడు..ఇన్నాళ్లకు ఈ మొగలిచెర్ల కు కూడా రప్పించాడు నన్ను..ఈ స్వామివారి గురించి విన్నాను..సుమారు రెండు సంవత్సరాలనుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూ వున్నాను..అదేమిటో అలా అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చేది..ఆగిపోయేవాడిని..ఎలాగైతేనేమి..ఈరోజు రాగలిగాను..ఈరాత్రికి ఈ మంటపం లోనే నిద్ర చేస్తాను...ప్రత్యేకంగా నాకు వసతి ఏర్పాట్లేమీ వద్దు.." అని కూడా చెప్పారు..ఎంతో పరిచయం ఉన్నవారిలాగా మాట్లాడుతున్నారు.."మంటపం లో ఉండవచ్చు..మధ్యాహ్నం భోజనం ఉన్నది.."అని చెప్పాను..స్నానాదికాలకు ఉన్న ఏర్పాట్లు చెప్పాను..సరే అన్నారు..తన సంచీ లోంచి గురుచరిత్ర పుస్తకం తీసుకొని..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చుని పారాయణం చేసుకుంటానని చెప్పారు..అలాగే అన్నాను..స్వామివారి సమాధిని దూరం నుంచే చూసి..నమస్కారం చేసుకొని మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు శుక్రవారం నాడు మా అర్చకస్వాములు వచ్చి స్వామివారి మందిరం తలుపులు తెరిచే లోపలే..మంటపం లో కూర్చుని వున్నారు..అక్కడినుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..శనివారం ఉదయం కూడా అదే పరిస్థితి..ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా స్వామివారి సమాధి వద్దకు వెళ్ళలేదు..దూరం నుంచి నమస్కారం మాత్రం చెయ్యడం..గురుచరిత్ర కానీ..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ పారాయణం చేస్తూ కాలం గడుపుతున్నారు..శనివారం సాయంత్రం జరిగే పల్లకీసేవ ను ఆసక్తిగా తిలకించారు..పల్లకీ తో పాటు మూడు ప్రదక్షిణాలు భక్తిగా..భజన చేస్తూ తిరిగారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా స్వామివారి సమాధికి అర్చకస్వాములు చేసిన అభిషేకము..ఇచ్చిన హారతులు అన్నీ చూసారు..


ఆదివారం మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం హారతి అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..నేను శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వస్తాను.." అన్నారు.."వెళ్ళిరండి.." అన్నాను..లోపలికి వెళ్లి స్వామివారి సమాధి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి..పాదుకులకు నమస్కారం చేసుకొని..స్వామివారి సమాధి కి కూడా నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..


"దాదాపు నాలుగు రోజుల నుంచీ వున్నారు కదా..ఈరోజు దాకా స్వామివారి సమాధి దర్శనం ఎందుకు చేసుకోలేదు..?" అని కుతూహలం ఆపుకోలేక అడిగాను..


"నేను ప్రయత్నం చేసాను బాబూ..స్వామివారు నన్ను అక్కడికి మూడురోజుల పాటు రానివ్వలేదు..నిజం..నేనేదో కల్పించి చెప్పటం లేదు..రోజూ ఉదయం ఇక్కడికి రాగానే..స్వామివారి సమాధి దర్శనం చేసుకోవాలి అని అనుకునేవాణ్ణి..ఇంతలో..ఎందుకనో..కొంచెం సేపు ఆగి పోదాము అనే ఆలోచన వచ్చేది..అదొక నిర్లిప్తత ఆవరించేది..వచ్చిన రోజు గురుచరిత్ర పారాయణ చేసాను..శుక్రవారం ఉదయం నుంచీ ఈ స్వామివారి చరిత్ర పారాయణం మొదలుపెట్టి ఆరోజే పూర్తి చేసాను..శనివారం కూడా అదే పారాయణం చేసాను..ఈరోజు కూడా మూడోసారి పారాయణం పూర్తి అయిన తరువాతే నాలోని నిర్లిప్తత త పోయింది..స్వామివారి సమాధిని దర్శనం చేసుకోగలిగాను..ఎన్నో దత్తక్షేత్రాలు చూశాననే అహం నాలో ఉండేది..అది పూర్తిగా అణిగిపోయిన తరువాతే..స్వామివారి సమాధి వద్దకు వెళ్లగలిగాను..ఎన్ని క్షేత్రాలు చూసాను అనేది లెక్క కాదు..ఎంత భక్తితో దర్శించాను అనేదే దైవం వద్ద లెక్క..ఆ జ్ఞానం ఇక్కడే కలిగింది..ఇకనుంచి ఏ క్షేత్రానికి వెళ్లినా లెక్క కోసం కాకుండా..భక్తి తో వెళతాను.." అన్నారు..


ఈ నాలుగురోజుల నుంచీ ఆయనలో ఇంత అంతర్మధనం ఉన్నదా అని ఆ నిమిషం దాకా నాకు తెలీదు..వారిలో ఏ మూలో దాగున్న అహంకారాన్ని  స్వామివారుపూర్తిగా నిర్మూలించారని ఆయన పూర్తిగా విశ్వసించారు..యదునందనరావు గారు మరో మూడురోజులపాటు వున్నారు..కానీ ఆ మూడురోజులూ ఆయన రోజుకు రెండుసార్లు స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..తిరిగి వెళ్లబోయేముందు నా దగ్గరికి వచ్చి.."స్వామివారు అనుమతి ఇచ్చారు..నేను వెళ్ళొస్తాను..నా జీవితం లో గొప్ప అనుభూతి పొందాను..దత్తుడి దగ్గరకు భక్తి తో వెళ్ళాలి..అన్ని దత్తక్షేత్రాలు మరొక్కసారి భక్తిగా దర్శనం చేసుకుంటాను.." అని చెప్పారు..


ఎవరిలో ఏ మార్పు ఎలా తీసుకొస్తారో సమాధి లో కూర్చున్న స్వామివారికే తెలుసు..దర్శనానికి వచ్చే వారి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అని నాకు అర్ధమయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

నేను ఎవరు

 _*🧘నేను ఎవరు ?🧘‍♂*_

🕉🌞🌎🌙🌟🚩


*_అరవై నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్.._*



*_అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది. ఈ దేహం నేనే అంటాం._*



*_కానీ ఎలా ? నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది ? ఏ భాగము వినదు. వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి._*



*_ఈ దేహం నీదే కదా !ఎందుకు మొరాయిస్తుంది ? ఈ దేహం నీదేకదా ! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు ? ఈదేహం నీదేకదా ! ఎందుకు నీమాట వినడంలేదు ?ఈదేహం నీదేకదా ! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్ ?_*



*_ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆపరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే. ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో._*



*_రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి. రూపానికి ముందు నువ్వున్నావు. రూపంలో నువ్వున్నావ్. రూపం వదిలేశాకా నువ్వుంటావు !_*



*_ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు. ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి._*



*_కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు._*


🕉🌞🌎🌙🌟🚩

ఆదిత్య

 ఆదిత్య ఎందుకు యీ పేరు. యత్ తత్ ఆదిః. ఆదినుండి వున్న తత్వము అనగా శక్తి. ఆది వకే రీతిలో గలదా! మార్పు చెందినది. అది ఇప్పుడు కూడా మార్పు చెందుతూనే నున్నదా? మార్పు ఎందుకు చెందాలి. దానివలననే సృష్టికి కావలసిన సమస్తం చైతన్య రూపంలో గల కిరణములశక్తి రూపంలో ధర్మములు. కిరణధర్మములే సృష్టి. అది ప్రకాశవంతమై తెలియుచున్నది. అందులో భాగమే చంద్ర రూపంలో వున్న ప్రకృతి. సూర్య శక్తి పరమేశ్వర తత్వం. అమ్మ చంద్ర తత్వం. చంద్ర తత్వం ప్రకృతి రూపంగా మార్పు చెందుతున్న విషయమును పరమేశ్వరశక్తి తెలియుట.అనగా దానిని గ్రహించినట్లే సృష్టి జీవ లక్షణమునకు మూల శక్తి యని తెలియుట ఙ్ఞానం. వీటి శక్తి లేనిది శూన్యము. ప్రత్యక్షంగా నేను అని తెలియుచున్నది. తెలియ లేకపోవుట అనగా దానిని  గురించి సాధన చేయక అజ్ఞానంలో వుండుట. దానినుండి విడివడుటయే జ్ఞానం. అదే సత్ యత్ తత్ ఆదిః. యిదే సర్వ ఉపనిషత్సారం.తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

ఋణము

 ఓం నమశ్శివాయ🙏


ఋణము వుంటేనే తప్ప ఏవీ  కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న రుణం బట్టి  భార్య కాని, భర్త కాని వివాహబంధంతో  ఏకమవుతారు.


అలాగే  పిల్లలు పుట్టాలన్న వారి ఋణము  మనకు వుండాలి. ఇక ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మనకు దక్కవు.


అంతెందుకు ఋణము వుంటేనే ఎవరితోనైనా స్నేహాలు. బాంధవ్యాలు కలుస్తాయి.

మనకు ఎవరైనా ఎదురుపడినా. లేక మాట కలిపినా కూడా  అది కూడా  ఋనానుబంధమే.....


ఋణమనేది లేకుంటే ఎవరిని. కలలో కూడా మనం చూడలేము ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు.


ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి....


ఋణం కేవలం ధనం మాత్రమే కాదు. బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వలి. "మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో  ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. "...


ఫ్రెండ్స్ ఋణం లేనిదే త్రుణం కూడా ముట్టదు.  అని మన పెద్దలు చెప్పారు ఇది నిజం.

మనం ఎంత యత్నించినా కూడా రుణం లేకపోతే ఏది జరగదు ఏ బంధం నిలువదు

 ఏ బంధమైనా వదిలేసినా  ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి

 ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి  దూరంగా ఉన్నా మన వాళ్లేగా

ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా వాళ్ల సంతోషం కోరుకోండి


 బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ శివయ్యే

మొగలిచెర్ల

 *నమ్మకమైన రక్షణ..*


"గత నలభై రోజులుగా ప్రతిరోజూ నూటఎనిమిది ప్రదక్షిణాలు చేసాను..ఒక్క నిమిషం కూడా స్వామివారి నామం మరువకుండా మనసులో చెప్పుకున్నాను..అదేమి ప్రారబ్ధమో నా కష్టాలు తీరకపోగా..ఇంకా ఎక్కువయ్యాయి..స్వామివారికి నా మీద కనికరం కలిగినట్లు లేదు..ఏమి చేసేది?.."అంటూ ఆ మధ్యవయస్కుడు నా దగ్గరకు వచ్చి వాపోయాడు..


అతనిని మేమూ గత నెలరోజులుగా గమనిస్తున్నాము..నిజమే..ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి..తలారా స్నానం చేసి..మందిరం లోకి వచ్చి..మంటపం లోనుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..ప్రదక్షిణాలు మొదలుపెట్టేవాడు..నూటఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి కాగానే..మళ్లీ మంటపం లోకి వచ్చి..అక్కడినుంచి నమస్కారం చేసుకొని వెళ్లిపోయేవాడు..మధ్యాహ్నం హారతి తీసుకొని..మళ్లీ సాయంత్రం హారతి వచ్చి, కళ్లకద్దుకొని వెళ్ళేవాడు..రాత్రికి మంటపం లోనే నిద్ర చేసేవాడు..


"మీదేవూరు..మీకున్న సమస్య ఏమిటి..? " అని అతనిని నేను అడిగాను..కొద్దిగా తటపటాయించి.."మాది గుంటూరు జిల్లా..సత్తెనెపల్లి దగ్గర ఉంటాను..చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానండీ..వాటిలోంచి బైట పడే మార్గాలన్నీ మూసుకుపోయాయి..అప్పులపాలయ్యాను..బంధువులు సైతం నన్ను దూరంగా పెట్టారు..ఎవ్వరూ నాకు సహాయం చేయడం లేదు..ఆ సమయం లో నా మిత్రుడు ఈ మందిరానికి వెళ్లి ప్రార్ధన చెయ్యి..నీ కష్టాలు తీరుతాయి అని చెప్పాడండీ..నమ్మి ఇక్కడకు వచ్చాను..కానీ నాకు ఏమీ వెసులుబాటు కలగలేదు.." అన్నాడు..


"మరి మీ సంసారం మాటేమిటి?..వాళ్ళు ఎలా వున్నారు?.." అని అడిగాను.."నేను ఇక్కడికు వచ్చే విషయం వాళ్లకు తెలీదండీ..మూడురోజుల తరువాత నేనే వాళ్లకు ఫోన్ చేసి త్వరలో వస్తానని చెప్పానే కానీ..ఇక్కడ ఉన్నానని చెప్పలేదు..అప్పుడప్పుడూ ఫోన్ చేస్తున్నాను.." అన్నాడు.."ముందు మీరు మీ ఊరెళ్లి..మీ వాళ్ళను కలవండి..వాళ్ళు కంగారులో వుంటారు..ఇలా ఎవ్వరికీ చెప్పకుండా అజ్ఞాతంగా వుండకండి..మీ రాత బాగుంటే..అన్నీ సర్దుకుంటాయి.." అని చెప్పాను.."అంతేనంటారా?.." అన్నాడు..అంతే అని చెప్పాను..ప్రక్కరోజు ఉదయం వెళ్ళిపోయాడు..


ఆరు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం మధ్యాహ్నం అతను వచ్చాడు..ఈసారి అతనితో పాటు అతని భార్యా పిల్లలు కూడా కలిసే వచ్చారు..నేరుగా నా వద్దకు వచ్చి.."నేను గుర్తున్నానా?..ఇక్కడ నలభై రోజులు వుండి వెళ్ళాను.."అన్నాడు..గుర్తున్నారు..అన్నాను.."ఎలా వున్నారు?." అని అడిగాను.."ఇప్పుడు బాగానే ఉన్నసనండీ..నాకున్న అప్పులు పూర్తిగా తీరలేదు..కానీ నాకు కొద్దిగా వెసులుబాటు వచ్చింది..ఇక్కడినుండి వెళ్లిన తరువాత..మా వాళ్ళను కలిశాను..అందరం కలిసి కూర్చుని..మాకున్న అప్పులు, మా ఆస్తులు లెక్కగట్టుకున్నాము..నా అప్పుల వాళ్ళను పిలిచి..కొద్ది సమయం ఇస్తే..ఆస్తులు అమ్మి తీరుస్తానని నచ్చచెప్పుకున్నాను..నేను పారిపోలేదని కూడా చెప్పాను..అందరూ ఒప్పుకున్నారు..మెల్లిగా తీర్చుకుంటున్నాను..ఈలోపల మా అబ్బాయికి, అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది..ఇద్దరూ వెళ్లిపోయారు..ఒకరకంగా నాకు కొంత ఆసరాగా వుంటారు..మనసుకు ప్రశాంతత వచ్చింది..ఇప్పుడు ధైర్యం కూడా వచ్చింది..స్వామివారు నా ప్రయత్నం లేకుండా నా కష్టాలు తీరవు అని పాఠం చెప్పారని అనిపించింది..ఈరోజు ఇక్కడ నిద్ర చేసి..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళతాము..ఏది ఏమైనా స్వామివారినే నమ్ముకున్నాను..ఇంతకుముందు కన్నా ఇప్పుడు నా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది..ఇలానే నన్ను బైట పడేస్తాడు స్వామివారు అని నా నలభై రోజుల ప్రదక్షిణాల వల్ల నమ్మకం కలిగింది.." అన్నాడు..


అతని లో మార్పు వచ్చింది..ఆ మార్పుకు కారణం స్వామివారే అని అతని నమ్మకం..అతని నమ్మకమే అతని కి రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

ఆలోచనా సరళి

 ఒకాయన రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై  అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చడావసాగింది.. నిశ్శబ్దంగా!


"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...


"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది. 


"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.


"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.


"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"


చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.


కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.


ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.


"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి కి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.


"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి.  సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.


"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా శివైక్యం పొందారు.


"ఈ ఏడాదిలోనే దేవుడు నా కొడుకుకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.


"దేవుడా! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"


అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....

ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటు సంతృప్తిగా నిట్టూర్చాడు.

☀️☀️☀️

మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే కదా ఆనందమయమైన జీవితం.

ధింక్ పాజిటివ్ ...


కాపీ పేస్ట్

*నిద్ర సంబందిత రోగాల కు

 *నిద్ర సంబందిత రోగాల కు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-sleeping-well.html


*షుగర్ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-diabetes-in-telugu.html


*థైరాయిడ్ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-thyroid-control.html


*నడుము నొప్పి  సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-back-pain.html


*క్షయ సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-tuberculosis.html


*ఒత్తిడిని ఎలా అధిగమించాలి*

https://www.megamindsindia.in/2019/06/stress-management-skills.html


*రక్త పోటు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-blood-pressure-bp.html


*సూర్యనమస్కారాలు ఎలా చేయాలి మరియు ఎన్ని చేయాలి*

https://www.megamindsindia.in/2019/05/21-about-surya-namaskar-in-telugu.html  


*జీర్ణశయం సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/05/june-21-yoga-day-asanas-for-gastric.html 


*కీళ్ళనొప్పుల సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/05/yoga-asanas-for-joint-pains.html


*యోగా ప్రాణాయామం ఎలా చేయాలి?*

https://www.megamindsindia.in/2019/05/pranayam-and-asanaas.html


*ఆస్థమా సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/05/yoga-asanaas-for-asthama-cure.html


*గుండె జబ్బులకు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/05/yoga-for-heart-disease.html


*అధిక బరువు సబందిత రోగాలకు ఏ అసనాలు వేయాలి?*

https://www.megamindsindia.in/2019/06/yoga-for-weight-loss.html


*మిత్రులారా మీరు మాత్రమే కాదు మీకు తెలుసిన ప్రతి ఒక్కరికీ పంపండి ఎంతో కొంత ఉపయోగపడవచ్చు.

Technical information

 What does each of following messengers app collect.


Signal

———

None. (The only personal data. Signal stores is your phone number)


Telegram

—————

Contact Info

Contacts

User ID


WhatsApp

—————-

Device ID

User ID

Advertising Data

Purchase History

Coarse Location

Phone Number

Email Address

Contacts

Product Interaction

Crash Data

Performance Data

Other Diagnostic Data

Payment Info

Customer Support

Product Interaction

Other User Content


Facebook Messenger

———————————

Purchase History

Other Financial Info

Precise Location

Coarse Location

Physical Address

Email Address

Name

Phone Number

Other User Contact Info

Contacts

Photos or Videos

Gameplay Content

Other User Content

Search History

Browsing History

User ID

Device ID

Product Interaction

Advertising Data

Other Usage Data

Crash Data

Performance Data

Other Diagnostic Data

Other Data Types

Browsing History

Health

Fitness

Payment Info

Photos or Videos

Audio Data

Gameplay Content

Customer Support

Other User Content

Search History

Sensitive Info

iMessage

Email address

Phone number Search history

Device ID


The above is an analysis of all data each of these apps track n store. 


As u will note signal followed by telegram are the best options to migrate to today....


When you install and use the Truecaller Apps, Truecaller will collect, process and retain personal information from You and any devices

You may use in Your interaction with their Services. 


This information may include the following: 


Geo-location, Your IP address, device ID or unique identifier, device manufacturer and type, device and hardware settings, ID for advertising, ad data, operating system, operator, IMSI, connection information, screen resolution, usage statistics, device log and event information, incoming and outgoing calls and messages, times and date of calls, duration of calls, version of the Truecaller Apps You use and other information based on Your interaction with our Services.

శుక్ర_గురు_మౌడ్యమి

 జనవరి 17 నుండి ఎప్రియల్ 30 వరకు #శుక్ర_గురు_మౌడ్యమి

ఏ కార్యాలు చెయ్యాలి? ఏ కార్యాలు చేయరాదు?


జనవరి 17 నుండి ఎప్రియల్ 30 వరకు శుక్ర,గురు మౌడ్యమి

వుంది కనుక, గృహప్రవేశము, వివాహము, ఉపనయనము, దేవాలయప్రతిష్ఠ, దేవాలయ శంకుస్థాపన, గృహ శంకుస్థాపన, బోరువేయుట, బావులుతవ్వుట, చెరువులు,కొనేరులు తవ్వుట, నూతన వాహనాలు కొనుట చేయరాదు. సుమారు 104రోజుల పైన, శుభకార్యములకు ముహూర్తాలు లేవు.


మూఢమైనా ఈ క్రింది కార్యములు చేసుకోవచ్చును👇

1. నవగ్రహశాంతులు

2. రుద్రాభిషేకం

3. అన్నీరకాల హోమాలు

4. నవగ్రహ జపాలు

5. ఉత్పాతాది దోషములకు శాంతులు

6. దేవాలయంలో సంభవించే అగ్నిప్రమాదాలకు, కొన్నినెలలుగా నిత్య నైవేద్యాలు పెట్టకపోయినా తగిన ప్రాయచిత్తశాంతులు, సంప్రోక్షణలు చేయవచ్చు.

7. సీమంతము, జాతాకర్మ, నామకరణ, అన్న ప్రాశనాది, ఊయలో బిడ్డను ఉంచుటకు, కార్యములు నియత కాలంలో వచ్చును గనుక శుక్ర,గురు 

మూఢమి వచ్చినా చేసుకోవచ్చు.

8. ఇంటి పైకప్పులు, ఇంటిపై స్లాబులు వేసుకోవచ్చు.

9. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలుగాని, గృహాలుగాని మరమ్మత్తులు చేసుకోవచ్చు. 

10. చండీహోమలు, నవవిధ శాంతులు చేసుకోవచ్చు.

11. పెళ్లిచూపులు చూడవచ్చు.

12. నూతన వ్యాపారం ప్రారంభం చెయ్యవచ్చు.

13. స్థలాలు కొనవచ్చు, రిజిస్టేషన్ చేసుకోవచ్చు.

మహాశక్తి

 E ఈ అనే మహాశక్తి M మరియు ౦ పూర్ణ పదార్ధ రూపందాల్చి 3 మూడు గుణములు కల్గి త్రిగుణాత్మకమై W డబల్ యు  UU  మహా యెూనిత్వము మహా యవనిగా అనగా మహా క్షేత్ర భూమి గా మారి జీవ సృష్టిని నడిపించు చున్నది, ప్రకృతి రూపంలో. అందువలన మహా శక్తి సృష్టి లక్షణము కలిగియున్నదని సత్యం నిరూపణ అనునది. మహాశక్తియే లలక్షమీ, సరస్వతీ, పార్వతీ రూపంలో సత్వ, రజస్సు,తమెూ గుణ రూపంలో గల ప్రకృతి రూప సృష్టి కి మూలం. దీని సూత్రము E = MC square  అని నిరూపణ. యిదియే గాయత్రీ మంత్ర రహస్యం. మంత్ర లక్షణము సృష్టి మాత్రమే వేరు కాదు. దీనినే బ్రహ్మ సత్యం. జగత్తు మిధ్యఅని శంకరాచార్యులవారు వివరణ. యిదియే ఆత్మ అనాత్మ వివేకము. Atom ,anotomy కూడా యిదియే సూత్రం యీ సూత్ర ప్రకారమే ఆత్మ అనాత్మ  వివేకము గా వివరించిరి. తెలుసుకుంటూ నేను వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *మార్పు తెచ్చిన మహనీయుడు..*


"ప్రసాద్ గారూ..సబ్ కలెక్టర్ గారు దత్తాత్రేయ స్వామి మందిరానికి దర్శనానికి వస్తారట..వారితో పాటు మండల తహసీల్దారు గారు కూడా వస్తారు..రెవెన్యు సిబ్బంది వుంటారు..సబ్ కలెక్టర్ గారికి చక్కగా దర్శనానికి ఏర్పాట్లు చేయండి.." అంటూ మండల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది..సరే అన్నాను..ఆరోజు బుధవారం..భక్తుల తాకిడి అసలు ఉండదు..కనుక ఆ వచ్చే సబ్ కలెక్టరు గారికి దర్శనం ఇబ్బందిలేదు అనుకున్నాము..ఆలయ మర్యాదలతో ఏర్పాట్లు చేసాము..


మరో రెండుగంటల తరువాత సబ్ కలెక్టర్ గారు మందిరానికి వచ్చారు..నన్ను నేను పరిచయం చేసుకున్నాను..శ్రీ స్వామివారి గురించి, తపోసాధన తరువాత కపాలమోక్షం పొందడం వరకూ శ్రద్ధగా విన్నారు..భక్తి పూర్వకంగా స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఆ తరువాత మండల తహసీల్దారు గారు కూడా దర్శనం చేసుకొని ఇవతలకు వచ్చారు..దాదాపుగా రెవెన్యూ సిబ్బంది అందరూ దర్శించుకున్నారు కానీ..ఒక వ్యక్తి మాత్రం..దూరంగా ఉండిపోయాడు..అతను విడిగా ఉండటం చూసి.."మీరు కూడా వెళ్లి స్వామివారి సమాధిని దర్శించండి.." అన్నాను..అతను నా దగ్గరకు వచ్చి.."నేను మతం మార్చుకున్నాను..అందువలన ఆలయాలకు వెళ్లను..ఇప్పుడు అందరితో పాటు ఇక్కడిదాకా రావాలి కాబట్టి వచ్చాను..లేకుంటే వెలుపలే ఉండేవాడిని..నన్ను బలవంతం చేయొద్దు.." అన్నాడు..ఇక నేనేమీ మాట్లాడలేదు..


సబ్ కలెక్టర్ గారు మరి కొద్దిసేపు మందిరం లోనే గడిపి..స్వామివారి జీవిత విశేషాలు మళ్లీ అడిగి తెలుసుకొని.."చాలా ప్రశాంతంగా వుందండీ ఇక్కడ..ఈసారి దంపతులము వస్తాము.." అని చెప్పి..ప్రసాదం తీసుకొని..వెళ్లిపోయారు..ఆ హడావుడి అంతా ముగిసిన తరువాత..మతం మార్చుకున్నాను అని చెప్పిన వ్యక్తి గురించి కొద్దిసేపు ఆలోచించాను..సరే..అతని నమ్మకం అతనిది అని సరిపెట్టుకున్నాను..దాదాపుగా అతని గురించి మర్చిపోయాను..


మరో రెండు రోజులు గడిచిపోయాయి..ఆ ప్రక్క శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ..ఒకవ్యక్తి.."ప్రసాద్ గారూ..నా పేరు ప్రభాకర రావు..ఈరోజు స్వామివారి దర్శనానికి వస్తున్నాము..సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొని..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తిరిగి వెళతాము..నేనూ నా భార్యా పిల్లలిద్దరూ..కలిసి వస్తున్నాము..మాకు రాత్రికి ఉండటానికి ఒక రూమ్ ఇవ్వగలరా..? " అని ఫోన్ లో అత్యంత ప్రాధేయపూర్వకంగా అడిగాడు..రిజిస్టర్ చూస్తే ఒకే ఒక రూమ్ ఖాళీ ఉంది..వారిని రమ్మనమని చెప్పాను..మరో రెండు గంటల్లో వస్తామని చెప్పి ఫోన్ పెట్టేసాడు..


సాయంత్రం ఐదున్నర సమయం లో ఆరోజు సబ్ కలెక్టర్ గారితో వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకోను అని చెప్పిన వ్యక్తి..నేరుగా నా దగ్గరకు వచ్చి.."మధ్యాహ్నం ఫోన్ చేసింది నేనే ప్రసాద్ గారూ..నా పేరే ప్రభాకరరావు..మొన్న మీతో మతం మార్చుకున్నాను అని చెప్పింది కూడా నేనే.."అన్నాడు..నేను ఆశ్చర్యం గా చూసాను..రెండురోజుల క్రితం..తాను మందిరం లోపలికి రావడమే మహా అపరాధం చేసాను అన్నట్లు భావించిన వ్యక్తి..ఏకంగా స్వామివారి పల్లకీసేవ లో పాల్గొనాలని..సమాధి దర్శనం చేసుకోవాలని అనుకోవడం ఏమిటని..ఈ మార్పు ఎలా సాధ్యం అని అర్ధం కాలేదు..


"ఈమె నా భార్య రాజేశ్వరి..మొన్న బుధవారం నాడు ఇక్కడ దాకా వచ్చి..మీరు పిలిచినా కూడా వినకుండా..స్వామివారి దర్శనం చేసుకోకుండా వెళ్ళాను..ఇంటికి వెళ్లి ఈమెటోవా విషయం చెప్పానండీ..నా భార్య చాలా కోప్పడింది.."నిన్ను ఏ మతం అని వాళ్ళు అడిగారా?..నువ్వు తప్పు చేసావు..ఆ స్వామివారు చాలా మహిమ ఉన్న వారు..మన పెళ్లి కాకముందు..నాకు కడుపు లో నొప్పి వచ్చి అల్లాడి పోయాను..మందులు వాడినా ఫలితం దక్కలేదు..మా అమ్మానాన్న నన్ను మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి మందిరానికి  తీసుకొచ్చి పదకొండు రోజులపాటు ఉంచారు..స్వామివారి తీర్ధం తీసుకున్నాను..మరే మందులూ వాడలేదు..నాకు నొప్పి తగ్గిపోయింది..మళ్లీ ఇప్పటికి నాకు ఆ నొప్పి రాలేదు..ఇద్దరు పిల్లలు పుట్టారు..అంతా ఆ స్వామిదయ..నువ్వు అక్కడిదాకా వెళ్లి..నీ మూర్ఖత్వం తో స్వామిని చూడకుండా వచ్చావు.."అని బాగా ఆవేదన తో చెప్పిందండీ..అప్పటికీ నేను సంశయం తోనే వున్నాను..నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత నా ఆఫీస్ బ్యాగు లో కాగితాల కోసం చూస్తుంటే..అందులో మొన్న మీరు మా వాళ్లకు ఇచ్చిన విభూతి గంధంతో పాటు స్వామివారి ఫోటో ఉన్న  పాకెట్ ఉన్నది..నేను తీసుకోలేదు కదా..ఇందులోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటే..నాతో పనిచేసే నా సహచరుడు తనకిచ్చిన పాకెట్..నా బ్యాగులో పెట్టాడట..మా ఆవిడ మాటలు..ఆ వెంటనే స్వామివారి విభూతి, ఫోటో..మా ఇంటికి రావడం..ఎందుకనో నాకు స్వామి నన్ను పిలిచినట్లు అనిపించింది..నాలో ఉన్న సందేహం మొత్తం తీరిపోయింది..ఆ మాటే ఆమెతో చెపితే...సంతోషం గా ఈరోజు వెళదామని చెప్పింది..మొత్తానికి నన్ను స్వామివారే రప్పించుకున్నారు.." అన్నాడు..


"మా వారిలో మార్పు వచ్చింది..అదే చాలు మాకు..ఆయన ఏ దేవుణ్ణి కొలిచినా నేను బాధపడ లేదు కానీ..ఇక్కడిదాకా వచ్చి..దర్శనం చేసుకోలేకపోయాడు అంటే..చాలా బాధపడ్డానండీ..మనసులోనే స్వామిని క్షమించమని వేడుకున్నాను..నా మొర స్వామివారు విన్నారు.." అని అతని భార్య రాజేశ్వరి గారు ఉద్వేగం తో చెప్పారు..


ఆ తరువాత ఆ ప్రభాకర రావు స్వామివారికి అత్యంత భక్తుడిగా మారిపోయాడని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

భగవత్గీత

 భగవత్గీత ఎందుకు చదవాలి. 


ఇప్పుడు మనం ఒక అంధకారమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము అని అనటానికి నేను చాలా బాధ పడుతున్నాను. పూర్వము మన దేశంలో పెద్దలు, గురువులు, మహర్షులు చెప్పిన విధి విధానాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తూచా తప్పకుండా ఆచరించారు వారు ఎంతో ప్రశాంతమైన, ఆరోగ్యమైన జీవితాన్ని కలిగి వుండే వారు. 


ఇప్పుడు రోజు రోజుకి మన సమాజంలో తల్లిదండ్రుల మీద భక్తి, గౌరవములు సన్నగిల్లి తల్లిదండ్రులను ప్రశ్నించటం, పెద్దలను గౌరవించక పోవటం, నాకే అన్ని తెలుసు అనే భావన కలిగి ఎదుటి వారిని ఎంతవారైనా కూడా  విమర్శించటం, చులకనగా చూడటము, మన ఆచార వ్యవహారాలను అవహేళన చేయటం మొదలైన విపరీత భావనలు పెరిగి పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మన సనాతన ధర్మా వ్యవస్థకు  గ్లాని కలిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే మన జాతిని సరైన మార్గంలో ఉంచటానికి ప్రతి మనిషి మనస్సు ప్రశాంతతతో ఉండటానికి మనకు వున్న ఒకే ఒక మార్గం భగవద్గీత పఠనము. పూర్వము మన ఇళ్లల్లో భగవద్గీత పారాయణం చేసే వారు అని మనం వినే వాళ్ళము. మనం పారాయణం చేయలేక పోయినా కనీసం ఇతర పుస్తకాల వలె  పఠనం అయినా చేసిన మనం పతనము కాకుండా ఉండగలం. . 


భగవద్గీత ఏమి చెప్పుతుంది. భగవద్గీత ఒక మతగ్రంధము అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. మిత్రులారా భగవద్గీత మతగ్రంధము కాదు అది ప్రతి మానవుడు, వయస్సు, లింగ భేదం లేకుండా చదవ వలసిన ఒక అపూర్వ గ్రంధము. నీవు భగవద్గీత చదివితే నీ జీవితము ఒక చక్కటి క్రమశిక్షణతో, ఒక మంచి ఆదర్శంతో, ప్రశాంతతతో, సాత్వికతతో సాగటం తథ్యం.  


మనం ఏదైనా సామాను అంటే ఒక కారు, ఒక మోటారు సైకిలు ఒక కుట్టుమిషను కొన్నామనుకోండి అప్పుడు మనకు సదరు కంపెనీవారు ఆ సామానుతోపాటు ఒక చిన్న పుస్తకాన్ని మనకు అందచేస్తాడు, దానిని యూసర్ మనువల్ అని మనం అంటాము.  ఆ సమానుని ఉపయోగించే ముందు మనం క్షుణంగా ఆ పుస్తకాన్ని చదివి సదరు సామానుని వాడటం చేస్తాము. దానివల్ల మనకు సులువుగా ఆ సామాను వాడటం తెలుస్తుంది. 


ప్రతి మనిషి చూడలేనిది ఒకటి అందరిలో వున్నది దానిని మనం మనస్సు అని అంటాము. నన్ను విసికించకు నా మనస్సు బాగోలేదు. అబ్బా నా మనస్సు ఇప్పుడు ఎంతో హాయిగా వుంది. అనే మాటలు మనం తరచుగా అంటుంటాము, వింటుంటాము. నిజానికి ఆ మనస్సు అంటే ఏమిటి అది ఎక్కడ వున్నది అని అడిగితె మనం ఎవ్వరం చెప్పలేము. డాక్టర్లు మీరు ఉద్రేకతకు లోను కాకండి లేకపోతె మీకు బీపీ పెరుగుతుంది, అది హార్ట్ అట్టాక్ కి దారితీయ వచ్చు, లేదా పెరాలిసిస్ రావచ్చు అందుకే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి అని అంటారు. కానీ అది ఎట్లాగో మాత్రం ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు కొత్తగా మీరు యోగ చేయండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నరు. అందుకే చాలామంది యోగ కేంద్రాలకు, యోగ గురువుల దగ్గరికి వెళతారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ డాక్టర్లకు ఆ యోగ అనేది భగవద్గీత నుండి ఉద్భవించిందని  మీరు భగవద్గీత చదవండి అందులో కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆచరించండి అని మాత్రము చెప్పరు. నిజానికి ప్రజలంతా భగవద్గీత ప్రతి రోజు చదువుతూ గీతాచార్యుడిని పూర్తిగా అనుసరిస్తే ప్రపంచంలో చాలా మటుకు బీపీలు, గుండె జబ్బులు, పక్ష వాటాలు తగ్గుతాయి.  అంతే కాదు మన సమాజంలో ఒకరికి ఇంకొకరికి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చక్కటి ప్రేమభావం కలుగుతుంది.  అందుకు ఏమాత్రం సందేహం లేదు. 


మనిషి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పే యూసర్ మాన్యువలె ఈశ్రీమద్ భగవద్గీత . 


భగవద్గీత గూర్చిన విషయాలు. 


మన పురాణ ఇతిహాసాలు దుఃఖానికి, శోకానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఒక మహర్షి శోకం నుండి ఉద్బవించినది శ్లోకం, ఆ శ్లోకం శ్రీమద్రామాయణంగా రూపుదిద్దుకున్నట్లు ఆ వాల్మీకి మనకు ఆది కవిగా ప్రసిద్ధి చెందినట్లు మనకు తెలుసు. 


ఇక అర్జనుని విషాదము శ్రీ కృష్ణ భగవానుని నుంచి భగవత్గీత అనే అపూర్వ బోధ ఈ ప్రపంచానికి అందింది. అర్జనునిలోని నిరాశ, నిస్పృహ, వైరాగ్యానికి శ్రీ కృష్ణ భగవానుడు చేసిన బోధ అర్జనుని కార్యోన్ముఖుని చేసింది. అదే సామాన్యులమైన మనందరిలో నిరాశ, నిస్పృహలు, జీవితం మీద కలిగే విరక్తిని పూర్తిగా నివారించి అందరిని ఒక మంచి దారిలో నడిపేది శ్రీమద్ భగవద్గీత 


భగవద్గీత గూర్చి కొన్ని విషయాలు. 


గీతలో 18 అధ్యయాలు వున్నాయి. . ఇందులోని ప్రతి అధ్యాయానికి యోగం అనే పదంతో కూడిన పేరు ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానులు తనని నమ్ముకున్న వారి యోగ క్షేమాలు చూస్తానన్నారు. మనం యోగం, క్షేమం అంటే ఏమిటో తెలుసుకుందాము. 


యోగము అంటే మనకు లేనిది మనకు కలవటం. ఉదా. నీవు ఒక క్రొత్త కారు కొనుక్కున్నావనుకో అది వాహన యోగం. అంటే నీకు ఇంతకు ముందు లేని వాహనం ఇప్పుడు నీకు లభించింది. నీకు వివాహమైనదనుకో దానిని కళత్ర యోగం అంటారు. అంటే ఇంతకు ముందు నీ జీవితంలో లేని భార్య నీకు లభించింది అని అర్ధం. నీవు ఒక క్రొత్త ఇల్లు కొనుక్కొన్నావనుకో దానిని గృహ యోగం అని అంటారు. ఈ విధంగా నీకు లేనిది నీకు లభించటం అన్న మాట. 


క్షేమం అంటే నీకు లభించినది నీ తోటే ఉండటం. అంటే నీవు కొన్న ఇల్లు నీ తోటే ఉండటం. అదే విధంగా నీకు యోగించిన అన్ని నీతోటే ఉండటాన్ని క్షేమం అని అంటారు. నీవు ఆరోగ్యంగా వున్నా వనుకో అంటే నీవు క్షేమంగా వున్నావన్నమాట. 


మన జీవితంలో మనకు కలిగే అన్ని యోగాలకు, వాటికి కావలసిన క్షేమాన్ని మనకు ఇస్తానని శ్రీ కృష్ణ భగవానులు మనకు చెప్పారు.  కాబట్టి నిష్కల్మషమైనా భక్తితో ఎల్లప్పుడూ మనం భగవంతుడిని శరణు చొచ్చాలి. 


భగవద్గీత  ఎవరు, ఎప్పుడు, ఎలా చదవాలి. 


గీతను ప్రతి మానవుడు చదవ వచ్చు. కావలసినది ఒక్కటే శ్రీ కృష్ణ భగవానుని మీద అచంచలమైన భక్తి, భగవత్ గీత మీద అనంతమైన శ్రార్ధ. ఈ రెండు ముందుగా అలవరచుకొని పరిశుద్ధ మనస్కులై భగవద్గీత చదవటానికి ఉద్యుక్తులు కండి. 


గీతలో 18 అధ్యాయాలు వున్నాయి అని మనం తెలుసుకున్నాము. మొట్టమొదటి అధ్యాయానికి " అర్జున విషాద యోగం" అని పేరు. ఈ అధ్యాయంలో అర్జనుల వారికి కలిగిన విషాదాన్ని గూర్చి తెలియచేస్తుంది. నేను మొట్ట మొదటిగా గీతను చదవ దలుచుకున్న వారికి ముందుగా మొదటి అధ్యాయం నుంచి కాకుండా మీరు  14వ  అధ్యాయానికివెళ్ళమని చెపుతాను. దానికి కారణము ఈ  అధ్యాయం పేరు "గుణ త్రయ విభాగ యోగము" అని అంటారు. అంటే మనుషులు తమ తమ మానసిక స్థితులను పట్టి మూడు రకాలుగా వుంటారాని  అవి. 1. సత్వ, 2 రాజో, 3 తమో గుణములు. అవి శ్రీ కృష్ణ భగవానులు తెలియచేసారు. ఈ అధ్యయానిని చదివిన తరువాత చదివిన మీరు ఈ మూడు గుణములలో ఏ గుణానికి చెందుతారో మీకు తెలుస్తుంది.   అప్పుడు మీరు వున్నా స్థితి మీకు అర్ధం అవుతుందికాబట్టి మీరు వున్న స్థితి కన్నా ఇంకా మెరుగైన స్థితికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అప్పుడు తమో గుణ వంతుడు ముందుగా రజోగుణ వంతుడిగా తరువాత ఉత్తమ గుణమైన సత్వ గుణానికి మారుతాడు. ఎప్పుడైతే మనిషి సత్వ గుణ వంతుడు అవుతాడో అప్పుడు గీత పూర్తిగా చదివే శక్తి తరువాత శ్రార్ధ వస్తాయి. అప్పుడు మొదటినుండి అంటే అర్జున విషాద యోగం నుండి చదువ గలుగుతారు.  భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నా కొద్దీ చదువరుడు తానూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాడు. తన మానసిక స్థయిర్యం కలుగుతుంది. తత్వారా పరి పూర్ణమైన ఉత్తమ మైన మనిషిగా తన్ను తాను తీర్చుకో గలుగుతాడు.  గీతను చదివి అర్ధం చేసుకొని ఆకళించుకొని తన జీవితానికి ఆపాదించుకున్న ప్రతి మనిషికి శాంత స్వభావం, పరిస్థితులను అర్ధం చేసుకునే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించగల శక్తి. ఇతరులను నొప్పించకుండా తన పని తాను చేసుకునే విధంగా తయారు అవుతారు. కాబట్టి మిత్రులారా మీరంతా నేను సూచించిన విధంగా గీత పఠనం చేయండి మీ జీవితాలను బాగు పరుచుకోండి. 


గమనిక: ఈ వ్యాసం ఒక్కరి మనస్సు నయినా మార్చిన ఈ వ్యాస రచన సార్ధకమైనట్లే. 


మీ 


సి. భార్గవ శర్మ 


జై శ్రీకృష్ణ 


ఓం శాంతి శాంతి శాంతిహి 


సర్వే జన సుఖినోభవంతు.

కార్యకారణ

 *కార్యకారణ.....*


కుండకు కారణం మట్టి. కుండలో నుండి మట్టిని తీసేస్తే కుండ ఉండదు. నగలకు కారణం బంగారం. నగలలో నుండి బంగారాన్ని తీసేస్తే నగ ఉండదు. అలాగే సంసారానికి కారణం అజ్ఞానం. కనుక అజ్ఞానాన్ని తొలగిస్తే ఇక సంసారం ఉండదు.


అజ్ఞానాన్ని తీసేయాలంటే జ్ఞానం కావాలి. చీకటిని పారద్రోలాలంటే వెలుగు కావాలి. అలాగే అజ్ఞానాన్ని పారద్రోలాలంటే ఆత్మజ్ఞానం కావాలి. తత్త్వజ్ఞానం కావాలి.


ఈ కార్యకారణ సంబంధాన్నే ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ శ్లోకలలో...


వయసిగతేకః కామవికారః...


వయస్సు అంటే యౌవనం. యౌవనంలో శరీరం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. నరములలో పటుత్వం ఉంటుంది, చర్మం బిగువుగా ఉంటుంది, కండలు కఠినంగా ఉంటాయి, రక్తం ఉప్పొంగుతుంది. అప్పుడు కళ్ళు మూసుకుపోయేంత కామోద్రేకం కలుగుతుంది. దానితో వికార చేష్టలు చేస్తారు.


అయితే ఆ వయస్సు కాస్తా జారిపోతే ఈ ఉద్రేకాలు చల్లబడతాయి. చర్మంలో బిగువు సడలిపోతుంది. నరములలో పటుత్వం తగ్గుతుంది. రక్తం యొక్క వేగం తగ్గుతుంది. శరీరం ముడతలుపడి అందహీనంగా కనిపిస్తుంది. కనుక కామ వికారాలకు కారణమైన యవ్వనం పోతే కామ వికారాలు కూడా పోతాయి.


క్షీణే విత్తే కః పరివారః...


ఎవడి దగ్గరైనా డబ్బుంటే చాలు ఆశ్రితులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ చేరుతారు. డబ్బున్నది గనుక పనులు చేసి పెట్టటానికి సేవకులు వస్తారు. అయితే సొమ్ము పోతేనో, ధన హీనుడైతేనో అతడు ఇక సేవకులను ఏ మాత్రం పోషించే స్థితిలో ఉండడు. అప్పుడు వారంతట వారే తొలగిపోతారు. 


ఈ విధంగా కారణం తొలగితే కార్యం తొలగిపోతుందనే విషయాన్ని ఉపమానాల ద్వారా తెలియజేసి, ఈ సంసారం తొలగాలంటే దీనికి కారణమైన అజ్ఞానం తొలగాలని, అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలని, కనుక జ్ఞానం ద్వారా సంసారాన్ని తొలగించుకోమని చెబుతున్నారు...

హిందూ మతము"

 తమళ భాషలో #కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. 


"అర్థవంతమైన హిందూ మతము"


*నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు👇👍


1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.


2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.  


5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 


6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.


7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.


👉 వృక్షాలు దైవ స్వరూపాలే.

👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.

👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.

👉 గాలి కూడా దైవ స్వరూపమే.

👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.

👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.

👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.


8. నువ్వూ దైవ స్వరూపమే.

     నేనూ దైవ స్వరూపమే. 

     చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)

     దైవ స్వరూపాలే.    


9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, హిందూధర్మం. 


మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.


కర్మల గురించి తెలియాలంటే ......

👉 వేదాలు చదవాలి.


సమస్త జ్ఞానం పొందాలంటే ......

👉 ఉపనిషత్తులు చదవాలి.


పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......

👉 రామాయణం చదవాలి.


రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......

👉 మహాభారతం చదవాలి.


భగవంతుని తత్త్వం తెలియాలంటే ......

👉 భాగవతం చదవాలి.


చక్కటి పరిపాలన అందించాలంటే ......

👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.


అన్యోన్య దాంపత్యానికి ......

👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.


చక్కటి ఆరోగ్యానికి ......

👉 ఆయుర్వేదం చదవాలి.


మేథస్సుకు ......

👉 వేద గణితం చదవాలి.


శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......

👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.


భవన నిర్మాణాలకు ......

👉 వాస్తుశాస్త్రం చదవాలి.


గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......

👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.


11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.


12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)


13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.


14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.


15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.


16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.


హిందువుగా జన్మించాం.

హిందువుగా జీవిద్దాం.

హిందువుగా మరణిద్దాం.


జై శ్రీరామ్. జై హింద్.


భారత్ మాతా కీ జై. 

తమిళం నుండి అనువాదం

Limitation Period

 Limitation Period



1. The time for filing first appeal in civil cases is 30 days.


2. The time for filing second appeal in civil cases is 60 days.


3. The time for filing civil revision is 90 days.


4. Limitation period of appeal in capital punishment, 7 days.


5. Limitation period of appeal From Magistrate to Sessions Court, 30 days.


6. Limitation period of appeal From Sessions Court to High Court, 60 days.


7. Limitation period of appeal From High Court to Supreme Court, 30 days.


8. Limitation period of appeal From High Court to Supreme Court in special Leave to 

Appeal, 30 days.


9. Limitation period of appeal From Magistrate to High Court in acquittal in Challan 

Case is 30 days and in Complaint Case 60 days.


10. Limitation period of appeal From Sessions Court to High Court in acquittal in Challan 

Case is 30 days and in Complaint Case 60 days.


11. Limitation period of appeal From High Court when case decide by it in its original 

jurisdiction and to Division Bench than 20 days in acquittal or conviction as the case 

may.


12. Plaintiff has a time of 6 years to file execution.


13. Limitation in civil suits is 3 years from the cause of action.


14. Article 150. Appeal from death sentence to High Court-7 days.


15. Article 151. High Court order on original side-appeal-20 days.


16. Article 154. Appeal to any Court other than High Court-30 days.


17. Article 155. Criminal appeal to High Court-60 days.


18. Article 157. Appeal from acquittal by State-6 months.(Thanks to Adv Nupur)