ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, అక్టోబర్ 2022, మంగళవారం
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-9
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-9
*మహర్నవమి*
17.
నిష్క్రోధాం నిరవద్యశీలలలనాం నిర్భేదినీం శాంతిదామ్
మాణిక్యాయతనాం మహాఘదమనీం ప్రేతాసనావిగ్రహామ్
లాక్షారక్తిమపాదపద్మలసితాం వింధ్యాచలావాసినీమ్
శుంభత్ప్రౌఢపరాక్రమాదికుశలాం వందే శుభాం శాంకరీమ్
18. సుభద్ర
భక్తానాం శుభవాంఛితార్థఫలదాం భద్రాత్మికాం భద్రదామ్
దాసీదాసవివృద్ధభాగ్యవరదాం దాస్యాంతకీం సౌఖ్యదామ్
సౌభాగ్యాదిసుశీలసౌమ్యగుణదాం ధాన్యాదిసంపత్ప్రదామ్
భోగాఽభోగవిచారశక్తికరణీం వందే సుభద్రాంచితామ్
*~శ్రీశర్మద*
మనిషి చేరలేనిచోటు
మనిషి చేరలేనిచోటు..!?
🔹🔸🔹🔸🔹🔸
స్వామి....నాకు అర్జెంట్ గా వుద్యోగం కావాలి
స్వామి.... నాకు అర్జెంట్ గా వివాహం కావాలి
స్వామి.... నాకు అర్జెంట్ గా పిల్లలు కావాలి
స్వామి.... నా పిల్లలు తొందరగా సెటిల్ కావాలి
స్వామి.... నాకు ఆరోగ్యం; ఆయువు కావాలి
స్వామి.... ఇవన్ని లేకుంటే నిన్ను ఎపుడూ, ఎలా
తలుచుకోగలను చెప్పు ప్రశాంతంగా !?
దేవుడికి తన ప్రశాంతత గురించి గుర్తు వచ్చింది
ఆ కాలంలో దేవుడు మనిషి కలిసే జీవించేవారు
ఆయన సలహాదారులు సూచించారు..
త్వరగా మనుషుల నుండి దూరంగా దేవుడు
పారిపోకపోతే...దేవుడుకి శాంతి లేనేలేదని.
@ ఎవరెస్టుకి వెళ్ళిపొండి స్వామీ అన్నారు.
భవిషత్తు తెలిసిన దేవుడు అన్నాడు..
# లాభం లేదు. త్వరలో ఒకడు అక్కడికీ
వస్తున్నాడు.
@ పోనీ చంద్రమండలమో..అన్నారు.
# అది లాభం లేదు. మనిషి అక్కడకి
రాబోతున్నాడు.
ఎవ్వరికి ఏమి చెప్పాలో తోచలేదు.
చివరికి వారిలో ఓ పెద్దాయన అన్నాడు.
@ మనిషి చేరలేనిచోటు నాకు తెలుసును దేవా.
# అవునా! చెప్పుచెప్పు అన్నాడు దేవుడు ఆత్రంగా.
@ మనిషి అన్ని చేరగలడు. ఒక్క తన అంతరంగం
తప్ప.. అన్నాడు పెద్దాయన.
వెంటనే దేవుడికి ఆ సలహా నచ్చేసింది.
ఆరోజు నుండి ఆయన నివాసం అదే
అయిపొయింది.
వేలాది ఏళ్లుగా ఏ
కొద్దిమందో తప్ప ఎవరూ తమ లోలోనే
వున్న ఆయనని దర్సించలేకపోయారు.
కనుక దేవుడక్కడ హాయిగా వున్నాడు
జై శ్రీమన్నారాయణ🙏🏻
🔹🔸🔹🔸🔹🔸🔹🔸
విశ్వనాధునిపట్టుకుని విశ్వంలో తిరుగు
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న భగవాన్! మౌనం దాల్చి కూర్చుంటే, సాధకుడి నిత్యవ్యవహారం గతి ఏమి?
మహర్షి
నీరు నింపిన కడవలను నెత్తిన పెట్టుకొని స్త్రీలు తమలో తాము మాట్లాడుకుంటూ నడుస్తారు. కాని వారి ధ్యానం కడవలపైనే నిలిచి ఉంటుంది.
అదేవిధంగా కర్మల్లో నిమగ్నుడైన నిజమైన సాధకుడిని కర్మలు బాధించవు. వారి మనస్సు ఆత్మయందే నిలచి ఉంటుంది.
83) మన శరీరం ఉన్న శక్తి కన్నా ఏ సమస్య గొప్పది కాదు
[84)మనిషికి ఏదైనా సమస్య వస్తే నేను గెలవాలి సమస్య ఓడిపోవాలి ఆ విధంగా మనం సాధన చేయాలి సమస్యకి భయం పుట్టాలి
[85)మొదటి దేహశుద్ధి రెండోది భావ శుద్ధి మూడోది ఆత్మ శుద్ధి అవుతుంది అప్పుడు లక్ష్యానికి వెళ్తారు ఇది సత్యం
[86)దేవుని ఫలితాలు అడిగేది భోగి దేవుని అడిగేది యోగి
87)-ప్రపంచాన్ని పట్టుకుని వేలాడుతున్న కానీ విశ్వనాధుని పట్టుకుని విశ్వంలో తిరుగు
expectations
All of us have certain expectations in our lives – it can be for what we want out of our relationships or for our careers and who we wish to become.
One of the most important aspects of living a happy life depends upon the management of our expectations with respect to various circumstances and people.
There are two ways to lead a happy life: Either by lowering your expectations or by improving your reality.
When you have no expectations from other people, you can never be disappointed. Having expectations will make you feel miserable. Hence lowering the same will make you much happier. You should stop expecting that people around you will always behave in the way you wish them to behave.
Each and every individual has a unique perspective and nature. You must never dislike someone for not agreeing with your thought process.
నవదుర్గలు
శ్లోకం:☝️నవదుర్గలు
*ప్రథమా శైలపుత్రీ చ*
*ద్వితీయా బ్రహ్మచారిణీ*
*తృతీయా చంద్రఘంటేతి*
*కూష్మాండేతి చతుర్థికీ |*
*పంచమా స్కందమాతేతి*
*షష్ఠా కాత్యాయనేతి చ*
*సప్తమా కాళరాత్రీ చ*
*అష్టమాచేతి భైరవీ*
*నవమా సర్వసిద్ధిశ్చాత్*
*నవదుర్గా ప్రకీర్తితా ||*
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.
1. ఆశ్వయుజ శు.పాడ్యమి
శైలపుత్రీ : బాలా త్రిపురసుందరి
నైవేద్యం : కట్టు (కట్టె) పొంగలి
2. ఆశ్వయుజ శు.విదియ
బ్రహ్మ చారిణి : గాయత్రి
నైవేద్యం : పులిహోర
3. ఆశ్వయుజ శు.తదియ
చంద్రఘంట : అన్నపూర్ణ
నైవేద్యం : కొబ్బరి అన్నము
4. ఆశ్వయుజ శు.చవితి
కూష్మాండ : కామాక్షి
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
5. ఆశ్వయుజ శు.పంచమి
స్కందమాత : లలిత
నైవేద్యం : పెరుగు అన్నం
6. ఆశ్వయుజ శు.షష్టి
కాత్యాయని : లక్ష్మి
నైవేద్యం : రవ్వ కేసరి
7. ఆశ్వయుజ శు.సప్తమి
కాళరాత్రి : సరస్వతి
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నం
8. ఆశ్వయుజ శు.అష్టమి
మహాగౌరి : దుర్గ
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
9. ఆశ్వయుజ శు.నవమి
సిద్ధిధాత్రి : మహిషాసుర మర్దిని
నైవేద్యం : పాయసాన్నం
10.ఆశ్వయుజ శు.దశమి
రాజ రాజేశ్వరి
నైవేద్యం : పాయసాన్నం