11, అక్టోబర్ 2020, ఆదివారం

తేడా ఏమిటి

 *ఒక సాధారణ దొంగకూ, రాజకీయ దొంగకూ మధ్య ఉండే తేడా ఏమిటి?*


*1.* సాధారణ దొంగ మన డబ్బు దోచుకుంటాడు; 

పర్సు, చేతి గడియారం, బంగారు గొలుసు మొదలైనవి దోచుకుంటాడు.

కానీ..

 రాజకీయ దొంగ మన భవిష్యత్తునూ, మన జీవితాన్నీ, విద్యారోగ్యాలనూ, వ్యాపారాన్నీ దోచుకుంటాడు.


*2.* చిత్రమేమిటంటే -

సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు.

కానీ...

 మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మనమే ఎంచుకుంటాం.


*3.* సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు.

కానీ...

 రాజకీయ దొంగకు ఏ హాని కలుగకుండా పోలీసులే కాపాడుతుంటారు.

మన సమాజం ఉన్న విచిత్ర పరిస్థితి ఇది.

కానీ...

 మేం గుడ్డివాళ్ళం కాదని మనం గుడ్డిగా అంటాం.


*4.* ఈ వ్యవహారం 

అంతటిలోనూ మహా మూర్ఖపు విషయం ఏమిటంటే –

మనం సాధారణ దొంగను అసహ్యించుకుంటాం, చావగొడతాం.

కానీ...

*రాజకీయ దొంగను ప్రేమిస్తాం; వాడి కోసం మనం పరస్పరం కొట్టుకుచస్తాం.*


సేకరణ

 ఒడిబియ్యం అంటే ఏమిటి?-–---–-----------------------------ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు.ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. This is nothing but alerting Mahalakshmi inside the girl. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.ఇది అత్తవారు కూడ చేయవచ్చు. అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి... -------------- అలాగే మన సనాతన హైందవ ధర్మము లోని జీవహింస లేని మంచి (సదా ) ఆచరణలను ఆచరించాలి వాటి విధానం, లాభాలు తెలుసుకోవాలి , తెలియని వారికి చెప్పాలి .  


( Recd. From other Group)


 🙏🙏🙏ksnm 🙏🙏🙏

తండ్రంటే

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**_👌


         _**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_


       _**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_


     _**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_


       _**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_


      _**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_


       _**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_

 

       _**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_


       _**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_


       _**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_


        _**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_


       _**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_


       _**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_


         _**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_


        _**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_


     _**సర్వే జనా సుఖినోభవంతు.**_


   _*-రామభక్త గురూజీ, ప్రొద్దుటూరు.**_

*నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది

 *నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది..*


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం. 


 మహాభారతం

ముల్లంగితో వైద్యం -

 ముల్లంగితో వైద్యం - 


 

      ముల్లంగిలో చాలా అద్భుతమైన ఔషద గుణాలు ఉన్నాయి . ఇది అంత రుచిగా ఉండదని చాలమంది తినరు. దీనిలో దుంప కన్నా ఆకుల్లో కాల్షియం , ఫాస్పరస్ , ఐరన్ , C విటమిన్ లు ఎక్కువగా ఉన్నాయి . దుంపలతో పాటు ఆకులను కూడా వండుకుని తింటే చాలా మంచిది. 


 * ముల్లంగిని జ్యూస్ గా తీసుకుని తాగుతూ ఉంటే లివర్ లో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. 


 * ముల్లంగి ఆకులని , దుంప ని ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని ఒక చెంచా చొప్పున తేనెలో కలిపి తీసుకుంటూ ఉంటే ఏ అవయవంలో వాపు ఉన్నా నివారణ అవుతుంది.


 * పచ్చి ముల్లంగి దుంపలు , ఆకుల రసాన్ని తీసి తాగుతూ ఉంటే సాఫీగా విరేచనం అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతూ అకలిని కూడా వృద్ది చేస్తుంది . లివర్ వ్యాధులని తగ్గిస్తుంది . 


 * ముల్లంగి విత్తనాల్ని ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజు కొంచం అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే స్త్రీలలో ఋతుస్రావ దోషాలు నివారించబడును.


 * ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొంచం ముల్లంగి రసాన్ని త్రాగితే వెంటనే తగ్గిపోతాయి . 


 * విపరీతం అయిన జలుబు , దగ్గు , ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే త్వరగా దోషాలు అన్ని నివారించబడును.


 * మూత్రపిండాలు లొ ఎర్పడిన రాళ్లు కరిగించడానికి ముల్లంగి ఎంతో మంచిది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటే ఈ సమస్య నివారణ అగును.


 * ముల్లంగి రసం తీసి దానిలో నాలుగోవంతు నూనె వేసి నూనె మాత్రమే మిగిలేలా కాచి ఆ నూనెని భద్రపరచుకొని ఆ నూనెని వడకట్టాలి. చెవిపోటు , చెవిలొ హోరు మొదలయిన బాధలు ఉన్నవారు చెవిలో ఒక 4 చుక్కలు వేసుకొంటే వెంటనే ఉపశమనం కలుగును. 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

సార్ధకత*

 *సార్ధకత*  


ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది. మర్రిపండుని నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం ప్రక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది. 

రెండు రోజుల తరువాత మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి. 

మర్రి గింజలు వాటిలో అవిమాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా “మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము అంది.  

 మరో గింజ “నిజమే. 

పక్షి కడుపులోకి వెళ్ళి చనిపోయే వాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.  

మరో రెండు రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది.  

 ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి మీరంతా చూడండి. నాకు మొలక వచ్చింది అని చూపించింది.  

మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగి పడెయ్యి. మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది. భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు. ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడాలి. కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు. 

మరికొన్ని సార్లు పశువులు తొక్కి చంపుతాయి. లేదా నమిలి మింగుతాయి. ఇవన్నీ దాటుకుని మొక్కగా పెరిగాలి. ఒకవేళ ఎదిగావనుకో, కావలసినంత నీరు అందాలి. అలా నీరు దొరకకపోయినా ఎండిపోయి చస్తావు. అన్ని కష్టాలు పడలేవు కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో. మనమంతా హాయిగా కలసి గడుపుదాం అన్నాయి. 

 మిగతా గింజల మాటలు ఆలకించింది కానీ మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు. తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు ప్రక్కలకు పెరిగాయి. ఎన్నో ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది.  

ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో, వర్షం కురిసినప్పుడు చెట్టు క్రింద తల దాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది. 

అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి  

మర్రి బెరడు, 

పాలు , 

ఆకులు, 

మొగ్గలు కోసుకుపోయే వారు. 

వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు.  

మైదానానికి ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయల ఊగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రిచెట్టు సంతోషించేది.  

అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.   

ఒక రోజు భయంకరమైన తుపాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిసాయి. తుపాను ధాటికి ఎన్నో వృక్షాలు నేలకొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకు ఒరిగింది. మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రిచెట్టు కొమ్మల మీద నివసించే పక్షులు , 

జంతువులు మూగగా రోదించాయి.    

మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు గొడ్డళ్లతో నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గ్రుహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళుతున్న వారు బ్రతికినప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడిందని చెప్పుకున్నారు.  

స్వార్ధంతో గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరో వైపు సిగ్గుపడ్డాయి.

వాటిలో ఒక గింజ మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేసాము. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము. ఎవరికీ "ఉపకారం" చేయలేకపోయాము. మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేకపోయాము. పుట్టిన ప్రతి జన్మకూ సార్ధకత ఉండాలి. మన జన్మ మాత్రం వృధా అయింది. పక్షి నోటి నుండి జారిపడి నందుకు మనం గొప్ప "అవకాశం" పొందినప్పటికీ వృధా చేసుకున్నాము . మన సోదరుడు మాత్రం మంచి పని చేసాడు. మరణించి కూడా జనం గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. జీవితమంటే మన సోదరుడిదే అంది. 

అది విన్న మరొక మర్రి గింజ కొందరు పిరికితనంతో బ్రతుకుతారు. ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు. ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు. ప్రక్కవారికి చేసే సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకుని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది” అంది. 

జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేము కాబట్టి ఇతరులకు సహాయపడినప్పుడే ఈ జన్మ కు సార్థకత...

పూజ మధ్యలో మాట్లాడితే

 1. పూజ మధ్యలో మాట్లాడితే, ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి మన పూజ ఫలితం వెళ్తుంది అని శాస్త్ర వాక్కు. 

2. జపం చేసేటప్పుడు జపమాల మిస్టేక్ గా కూడా కింద పడకూడదు.. 

3. అగ్ని ఎక్కడ ఉన్న అది పవిత్రమైన భగవంతుడి శక్తి దాన్ని నోటితో ఊదడం, పవిత్రమైనవి అందులో వేయడం దోషం. 

4. మన శరీరం లో ఒక్కో అంగానికి ఒక్కో దేవత ఉంటారు. అవయవాల్ని తిట్టుకోవడం, కొట్టుకోవడం దోషం. అలాగే పంచభూతాల్లో వేటిని కూడా తిట్టడం కానీ కోపంగా తన్నడం కానీ దాటడం కానీ చేయకూడదు. 

5. అరుణాచలం పుణ్యక్షేత్రం లో గిరి ప్రదక్షిణం రోడ్ కి ఎడమవైపు నుండే నడవాలి. కుడి వైపు ఎప్పుడూ దేవతలు ప్రదక్షిణ చేస్తారు. 

6. జున్ను పాలు తినరాదు. ఆవు ఈనిన 11 days లోపు ఆవు దగ్గరి పాలు తీసకోకూడదు. 

7. పడుకునేప్పుడు దైవ నామస్మరణ చేస్తూ పడుకుని లేచేప్పుడు అదే నామం చెప్తిలో లేస్తే పడుకున్న సేపు కూడా దైవనామ స్మరణ ఫలితం వస్తుంది. 

8. వినాయకుడికి తులసి, సూర్యనారాయణ స్వామి కి మారేడు వేయకూడదు. 

ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి తులసి ని తుంచరాదు. పూజకి, దేవుడి పూజకి వేర్వేరుగా తులసి ని పెంచుకోవాలి. 

9. మన చుట్టూ ఎన్నో సూక్ష్మ శరీరాలుంటాయ్ అవి అన్నం లోని సారాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి. అందుకే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినడం , అన్నం ప్లేట్ లో పెట్టాక చాలా సేపటికి తినడం, ప్లేట్ పెట్టి గట్టిగా అన్నం పెట్టాను రమ్మని పిలవడం, మూతలు పెట్టకుండా ఉంచడం, ఎండిపోయినవి తినడం నిషిద్ధం. అయితే ఏమౌతుంది అవి కూడా జీవులే కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అవి అన్నం లోని సారమంతా తీసుకున్నాక మనము తింటే శక్తి రాదు, మనసు పై ప్రభావం పడి పాపపు ఆలోచనలో లేక, మానసిక ఒత్తిడి కో దారి తీయొచ్చు. అందుకే ఎప్పుడూ అన్నం భగవత్ నైవేద్యం చేసి కాకి కి పెట్టి తినడం వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.  

10. తడి కాళ్లతో పడుకోకూడదు. అన్నం తినే ముందు తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి.

ఇంకా ధర్మం

  రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.  

 

రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే! 

'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను. 

 

'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.   

అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది. 

 

చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.

 

"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.

ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు. 

"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను. 

"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది. 

"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి. పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!" 

అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.

"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది. 

నేనేం మాట్లాడలేదు. 

"అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి. 

రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది. 

మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.

మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం! 

మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది. 

 

"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను. 

ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.

నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.

అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు. 'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు. 

రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.

 

"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను.  జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు. 

ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది. 

"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!" నిజాయితీగా అన్నాను.

"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?" మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.

"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"

"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు. 

"నువ్వూ..."

"వాళ్ళబ్బాయినండీ!'

ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..

"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి.‌ తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి. అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"

ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది. 

నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది. 

"చదువుకుంటున్నావా?" అడిగాను.

"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"

ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.

"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.

నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.

"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.

"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"

ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను. 

" అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను. 

"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి ఆ అబ్బాయికి ఫోన్ తిరిగిచ్చేసాను.

 

ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.  

 

 ‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!

*****

*ధార్మికగీత - 44*

      *ధార్మికగీత - 44*

      *శ్లో:- సతాం సాప్తపదీ మైత్రీ ౹*

              *సత్సతాం త్రిపదీ మతా ౹*

              *సత్సతా మపి యే సన్తి ౹*

              *తేషాం మైత్రీ పదే పదే ౹౹*

                            *****

 *భా:- "సంబంధం సాప్తపదీనమ్" అని ప్రసిద్ధి. ఏడడుగులతో ఎలాంటి బంధమైనా ఏర్పడుతుందని అర్థము. సజ్జనులతో ఏడడుగులు నడిచినా, ఏడు మాటలు అన్నా, విన్నా , కన్నా ఇట్టే మైత్రీభావం ఏర్పడుతుంది. అదే సజ్జన శ్రేష్ఠులతో నైతే కేవలం మూడు అడుగులు గాని, మూడు మాటలు గాని సరిపోతాయి. వెనువెంటనే గాఢమైన స్నేహ భావం స్థిరపడుతుంది. ఇక సజ్జనశ్రేష్ఠులలో అగ్రేసరులతో నైతే స్నేహబంధం అడుగడుగునా ఏర్పడుతుంది. ఒక అడుగులో, ఒక మాటలోనే ఏర్పడి చిరకాలం కొన సాగుతుంది. ఇదే దుర్జన స్నేహబంధం శరత్ కాల మేఘము వలె త్వరగా ఏర్పడినా, క్షణంలో తేలిపోతుంది. కాన సజ్జన దర్శనము, స్పర్శనము, భాషణము మన సకల పాపాలను, తాపాలను, దైన్యాన్ని బాపగల సామర్ధ్యము కలిగినవి. నారదుని సత్సంగం వల్ల ఒక కీటకము పావురముగాను, లేగదూడగాను, రాజన్యునిగాను జన్మాంతరాలను పొంది జన్మ సార్ధక్యత పొందగలిగింది. నేటికి వివాహ ప్రక్రియలో "సప్తపది" పేరిట మూడుముళ్లు, ఏడడుగులు, మూడుప్రమాణాలతో స్త్రీ పురుషులు అన్యోన్యప్రేమ, అవినాభావసాహచర్యములో నూరేండ్ల పంట పండించుకోవడం సనాతన సంప్రదాయంగా వస్తున్నదే. సజ్జన సాంగత్యం చిరకాలం కొనసాగించాలనేదే మానవ జీవితానికి అర్థము. పరమార్థము*. 

                                 *****

                   *సమర్పణ : పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*🚩పసుపుకుంకుమ*🚩

 


మన సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. చాలామంది వాటిని చాదస్తం అని కొట్టిపారేస్తుంటారు. కాని వాటి వెనుక సైన్స్‌ దాగి వ్ఞందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆచారాలలో మనం ఎప్పటికి మరువలేనివి నిత్యం ఉపయోగించేవి పసుపు, కుంకుమ. ముందుగా కుంకుమ స్త్రీలు నుదుట కంకుమని దిద్దుకుంటారు. ఇంట్లో పూజ చేసినప్పుడు గుడికి వెళ్లి దేవ్ఞడ్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా చేసే నియమం. ఈ కుంకాన్ని ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూమతస్తులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం వ్ఞండేది. ముఖ్యంగా శైవవైష్టవ మతస్తులు అందరూ నొసట కుంకుమ పెట్టుకోవడం గొప్పగా భావిస్తారు. కుంకమనే కాకుండా మంచి గంధాన్ని, విభూదిని కూడా దిద్దుకునేవారు.


రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ దిద్దటం వల్ల మనిషికి దృష్టిదోషం తగలదని ఒక నమ్మకం. ఎర్రని కుంకమ, మనిషి నిగ్రహశక్తిని, కాక త్యాగనిరతిని, పరోపకార గుణాన్ని కల్గిస్తాయని మరో నమ్మకం. కుంకుమ స్త్రీల ఐదవ తనానికీ, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతం అని చెప్పవచ్చు. పూర్వ భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికి అందంగా కనిపించకూడదు అన్న భావనతో కుంకుమను పెట్టుకొనేవారు కాదు. కుంకుమ సంస్కృతికి చెరగని ముద్ర. ఇది హైందవ సంప్రదాయం. మనవేదాలు, శాస్త్రాలు, పురాణాలు కూడా కుంకమ దాని విశిష్టత గురించి చెబుతున్నాయి. ఇక పసుపు, కుంకుమ జతకలపి చేసే కార్యక్రమాలు ఎన్నో. ఇంటి గడపకు, పసుపురాని, కుంకమబొట్టు పెడతారు. సంక్రాంతి ముగ్గుల్లో మరి గొబ్బెమ్మలకు ఎక్కువగా పసుపు, కుంకుమనే వాడతారు. శుభకార్యాలకు పిలిచేటప్పుడు కుంకుమను ఆ ఇంట్లో వ్ఞన్న స్త్రీల నుదుట పెట్టి, పెరంటానికి, శుభకార్యాలకు పిలుస్తారు.


పెళ్లికి ముందు నిశ్చయతాంబులాలో ఎక్కువగా, పసుపు, కుంకుమనే ఉపయోగిస్తారు. గృహప్రవేశాలకు, జన్మదిన, పెళ్లిశుభలేఖలకు పసుపు రాసి కుంకుమ బొట్టుపెట్టి పిలుస్తారు. గృహప్రవేశ సమయంలో గుమ్మడి కాయలను గడపముందు కొట్టి వాటిమీద ఎర్రటి కుంకమ చల్లుతారు. దసరా పండుగ సందర్భంగా ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహిస్తారు. పిమ్మట ఆ కుంకుమను ముతైదువులకు పంచుతారు. ఇక దేవతలకే కాక దేవ్ఞడికి కూడా కుంకమ ఇష్టమని చెప్పవచ్చు.


ఆ దేవుడు ఎవరో కాదు సీతమ్మ, రామయ్యకు ఇష్టమైనవాడు హనుమంతుడు. హనుమాన్‌ దేవాలయాల్లో హనుమాన్‌ విగ్రహాలన్నీ నారింజ రంగులో ఉంటాయి. దానికి కారణం ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకోవడం చూసిన హనుమాన్‌ అది ఎందుకు తల్లి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి రాముని ఆయుష్యు కోసం అంది.


వెంటనే రామభక్తుడైన హనుమాన్‌ ఒళ్లంతా సింధురాన్ని దిద్దుకున్నాడంటా. ఇంతటి విశిష్టత కల్గిన కుంకమను ఇటీవల కాలంలో స్త్రీలు, ఫ్యాషన్‌ పేరుతో దూరం చేస్తున్నారనే చెప్పాలి. అలాకాకుండా మన సంస్కృతిలో భాగమైన పసుపు, కుంకుమలను నిత్యం ఉపయోగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం.

🙏🙏🌸🙏🙏🌸🙏🙏🌸🙏🙏

సమయం రావాలి

 


*జననానికి మరణానికి ఒక* *సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక* *సమయం రాసి పెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత* *ఆరాటపడినా* *ప్రయోజనం* *ఉండదు*

*ప్రాణమైనా నమ్మకమైనా గౌరవమైనా ఒకసారి పోతే మళ్లీ తిరిగిరావు మనం బతకడం* *గొప్ప కాదు నిజాయితీగా* *బతకడం గొప్ప*

     🌹🙏🌹🙏🌹🙏

మంచిమాట

 


*_నెమలి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది,_*

*_కానీ ఆ నెమలి స్వరం బాగుండదు.!_*

*_అలాగే, కోకిల చూడటానికి అంద వికారంగా ఉంటుంది'_*

*_కానీ కోకిల స్వరం వినసొంపుగా ఉంటుంది..._*

*_అందుకే...మనం చూసే దాన్ని బట్టి,,_*

*_ఎదుటి వారి గుణగణాలను,_*

*_ఎన్నడూ అంచనా వేయకండి.._*


*_కొన్ని కొన్ని సార్లు,_*

*_కొంత మందికి సమాధానాలు ఇవ్వాలంటే,_*

*_హద్దులు దాటాల్సి వస్తుందేమో...?_*

*_అలా ఉన్నాయి పరిస్థితులు.!_*

*_నేను ఎవరితో పోటీ పడటం లేదు...?_*

*_కానీ, ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను,_*

*_నా జీవితంలోని ప్రతి అంశంలో..._*

*_పూర్తి వేగంతో ముందుకెళ్తున్నాను.._*


*_☘శుభోదయం🌹🦚_*

*_✡సర్వేజనాః సుఖినోభవంతు_*

*_🕉లోకా:సమస్తా: సుఖినోభవంతు_*   

*_☸శుభమ్ భూయాత్_* 

*_శుభమస్తు_*.          

🌻🌻🌻🌻🌻

*_....✍️ మీ chandrasekharrallabhandhi

వామ్మో ఇన్ని శాఖలా

  

  ..ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..

వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం..


ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ ద్రావిడ

2) ద్రావిడ

3) పేరూరు ద్రావిడ

4) పెద్ద ద్రావిడ

5) దిమిలి ద్రావిడ

6) ఆరామ ద్రావిడ

7) పుదూరు ద్రావిడ

8) కోనసీమ ద్రావిడ

9) ద్రావిడ వైష్ణవులు

10) తుమ్మగంటి ద్రావిడ

11) తుమ్మ ద్రావిడ


వైదీక బ్రాహ్మణ శాఖలు..


1) వెలనాటి వైదీక

2) వెలనాట్లు

3) వెలనాటి పూజారులు

4) వెలనాటి అర్చకులు

5)కాసలనాటి వైదీక

6)కాసలనాట్లు

7)ములకినాట్లు

8) ములకినాటి వైదీక

9) తెలగాణ్యులు

10) వేగనాట్లు

11) వేగనాటి వైదీక

12) ప్రధమ శాఖ వైదీక

13) కరణకమ్మ వైదీక


నియోగి బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ నియోగి

2) ఆరువేల నియోగి

3) నందవరీక నియోగి

4)లింగధారి నియోగి

5)ఉంత్కఖ గౌడ నియోగి

6)ఆరాధ్య నియోగి

7) అద్వైత నియోగి

8) నియోగి వైష్ణవులు

9)పాకనాటి నియోగి

10) ప్రాజ్ఞాటి నియోగి

11) పొంగినాడు నియోగి

12) నియోగి ఆది శైవులు

13) యజ్ఞవల్క్య నియోగి

14) ఆరాధ్యులు

15) వేమనారాధ్యులు

16) తెలగాణ్యు నియోగి

17) కరణకమ్మ నియోగి

18) బడగల కరణకమ్మ నియోగి

19) కరణాలు

20) శిష్ట కరణాలు


వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..


1) శ్రీవైష్ణవులు

2) నంబులు

3)గోల్కొండ వ్యాపారులు

4)ఆచార్యులు 

5)మర్ధ్యులు

6) వ్యాపారులు

7) కరణకమ్మ వ్యాపారులు

8)బడగల కరణకమ్మ

9)మెలిజేటి కరణకమ్మ

10)దారుకులు

11) యజ్ఞవల్క్యులు

12)యజుశ్యాఖీయులు

13) బడగ కన్నడలు

14) నంబూద్రి బ్రాహ్మలు

15) వైఖానసులు

16) మధ్వలు

17) కాణ్వులు

18)కాణ్వేయులు


శివార్చక బ్రాహ్మణ శాఖలు..


1)మహారాష్ట్ర చిత్సవనులు

2) లింగార్చకులు

3) ఆది శైవులు

4) శివార్చకులు

5)వీర శైవులు

6)మోనభార్గవ శైవులు

7)కాశ్యప శైవులు

8) శైవులు

9) ప్రధమ శాఖ శైవులు

10)రుద్ర శైవులు

11) పరమ శైవులు

12) శివ పూజారులు

13) శైవ స్మార్తులు


మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.. మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి..🌸

కదంబమంజరీక్లుప్తకర్ణ పూరమనోహరా

  Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 22 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘’ కదంబమంజరీక్లుప్తకర్ణ పూరమనోహరా


  లోకములో చాలా పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి. అందులో మొదటిది కదంబవృక్షము. అది లోకమంతా ఎండచేత శోషింపబడిన తరవాత వాన పడితే పువ్వు పూస్తుంది. అవి ఎరుపు పసుపు, ఎరుపు రంగులలో మూడేసి పువ్వులు గుత్తులుగా పూస్తుంది. మంజరి అంటే గుత్తి. అందుకే మంజరి అన్న శబ్దము వేసారు. కదంబవనములో తిరుగుతున్న అమ్మవారు కడిమి పూలగుత్తులను ఆభరణముగా చెవిలో పెట్టుకుంటుంది. వీరపత్నులు చెవిలో పెట్టుకునేప్పుడు తొడిమ వెనకకు, పువ్వులు ముందుకి ఉండేట్లుగా పెట్టుకుంటారు. మహావీరుడైన వ్యక్తి వీరకాంతయిన తన భార్యను కౌగలించుకున్నప్పుడు ఉత్తరక్షణములో సేదతీరడానికి ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛము పెట్టుకుని అలంకారము చేసుకుంటుంది. 

శివుడు కూడా గజాసురసంహారము, వ్యాఘ్రాసురసంహారము, త్రిపురాసురసంహారము యుద్ధములు చేసాడు. మన్మధుని కాల్చాడు. ఆయన చేసిన సంహారములు, యుద్ధములు సామాన్యమైనవి కావు. అది చూసి మహాపురుషులైన వాళ్ళు నిలబడి స్తోత్రము చేసారు. అంత యుద్ధము చేసి ఇంటికి వచ్చి పార్వతీదేవిని కౌగలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్న మంజరి సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతాడు. ఆవిడ ఏ పువ్వులు పడితే ఆ పువ్వులు పెట్టుకోదు. 


అమ్మవారి పక్కన ఎప్పుడూ అయ్యవారు ఉంటారు. పెద్ద పువ్వులు ఉన్న ఒక తీగ చెట్టుకు అల్లుకుంటే ఆ పువ్వులు బలమైన చెట్టు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా అయ్యవారికి అమ్మవారి స్తనములు నొక్కుకుని ఉండగా చూసి దర్శనము అమ్మవారి అనుగ్రహము ఉత్తరక్షణములో కలుగుతుంది. తల్లి తండ్రులుగా వారిద్దరినీ చూసి దర్శనము చేయించడానికి ఈ నామము హేతువై ఉన్నది. 


కదంబవృక్షమునకు సంస్కృతములో ‘నీప’ అనిపేరు. ‘నయతి ప్రాణినం సుఖం నీపః’-సమస్త ప్రాణులకు సుఖమును ఇచ్చేదానిని నీప అంటారు. సమస్త ప్రాణుల సుఖము నీటిలో ఉంటుంది. నీరు లేకపోతే ప్రాణం లేదు. ధర్మము లుప్తమై పోతుంది. లింగపురాణములో ఒక మాట చెపుతారు. ఈ లోకములన్నీ నీటి చేత రక్షించే ఈశ్వరుడి పేరు ‘భవ’ వానలుపడితే సంతోషించిన నీప లతలా కదంబవృక్షములా, పుష్పములా, లోకానికి శాంతి కల్పించడము కోసము రాక్షససంహారము చేసే శివుడు, ఆయనకు సంతోషము ఇవ్వగలిగిన అమ్మవారు సుఖములు ఇవ్వడము కొరకు ఉన్నారు. ఈ భావనతో వారికి నమస్కారము చెయ్యడము అలవాటు చేసుకోవాలి. శత్రుసంహారము చేసి వచ్చిన వీరుడైన పరమశివునికి ఆలింగనము చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకరించుకున్న కదంబ పుష్పమంజరులనుంచి వస్తున్న సువాసనలు ఆఘ్రాణించి ఉపశాంతి పొందిన శివపార్వతుల పాదద్వందములు చూసి నమస్కరిస్తే సుఖములకు హేతువవుతున్నది. 


అమ్మవారి చెవి పెద్దదిగా, స్థిరత్వముతోకూడి, చక్కటి అమరికతో ఉన్నది కనక అంత పెద్ద కదంబమంజరి పూలగుత్తిని చెవిలో పెట్టుకోగలుగుతున్నది. ఆవిడ ఎక్కడ కూర్చున్నా వినే శక్తి గలిగిన చెవులు. మూకశంకరులకి అమ్మవారు ఎదురుగా నిలబడితే ఆవిడ చెవిలో పువ్వులు ఆయన చూసారు.  ‘అమ్మా! అని నిన్ను పిలిచిన వారి పిలుపులు వినగలిగిన చెవులు నీవి’ అన్నారు.  అమ్మ చెవిలో పువ్వులను ఊహించిన మాత్రము చేత చేసిన తప్పులను కటాక్షముతో క్షమించి దగ్గరకు తీసుకుంటుంది. పైకి నామముల వలె కనపడినా ఎంత అందముగా అమ్మవారి పాదములు పట్టుకుని రక్షణ పొందవచ్చునో ఉపదేశము చేసే అద్భుతమైన అమృతభాండములు.  


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

రామాయణమ్ 126

 అగస్త్య మహాముని వారిని తన ఆశ్రమములోనే ఉండమని కోరాడు .కానీ రాముడు తమకు చక్కటి వాసయోగ్యమైన ప్రదేశం ఒకటి చూపమని మహర్షిని కోరాడు.

. రాముని ఆంతర్యం గ్రహించినవాడై అగస్త్యుడు, రామా ! ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ఫలపుష్ప భరితమైన సుందర ప్రదేశం ఉన్నది.అక్కడ మీరు మిగిలినఅరణ్యవాసకాలముపూర్తిచేసుకోవచ్చు .

అందుకు అది అనువైన ప్రదేశము 

దాశరదీ !తపః ప్రభావమువలన నాకు అంతా తెలిసినది..

.

మీకు శుభము కలుగుతుంది వెళ్లి రండి.

 నీవు అరణ్యవాసము పూర్తిచేసుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళగలవాడవు. సుఖంగా వెళ్ళండి అనిపలుకగా మహర్షికి నమస్కరించి పంచవటి వైపుగా సాగిపోయారు సీతా రామలక్ష్మణులు.

..

.మార్గమధ్యములో మహాకాయముతో ఉన్న ఒక పెద్ద గ్రద్దను రాముడు చూశాడు ,అది ఎవరో మాయావి అయిన రాక్షసుడు అనితలచి, నీవు ఎవరు ?అని గద్దించాడు.

.

అప్పుడు ఆ పక్షి చాలా సౌమ్యముగా ,మృదువుగా రామా! నేను నీ తండ్రి స్నేహితుడను. నన్ను జటాయువు అంటారు ,నా అన్న సంపాతి,మా తండ్రి పేరు అరుణుడు ,నీకు ఇష్టమైన ఎడల వనవాసకాలములో నీకు సహాయకారిగా ఉంటాను అని పలికాడు.

.

తండ్రి స్నేహితుడు అని తెలుపగానే చాలా ఆనందించి కౌగలించుకొని వారిరువురి స్నేహం గురించి మరల మరల ప్రశ్నించాడు రాముడు.

.

జటాయువుతో కూడా కలిసి పంచవటిలో ప్రవేశించాడు రాముడు.

.

అక్కడ లక్ష్మణుని చేతిలో చెయ్యివేసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగి పర్ణశాల నిర్మించడానికి అనువైన ప్రదేశం నిర్ణయించుకున్నాడు రాముడు.

.

రామాయణమ్ 127

......................

పంచవటి చాలా మనోహరంగా ఉన్నది .

చుట్టూ పర్వతాలు అందమైన దాతువులచేత ప్రకాశిస్తూ వివిధ వర్ణ శోభితమై రమణీయంగా కనపడుతున్నాయి 

ఎటుచూసినా ఎత్తైన చెట్లు. సాల,తాళ,తమాల,పనస,ఆమ్ర,నివార,తిమిస,పున్నాగ,చందన,స్పందన,నీప,పార్ణాస,లికుచ,ధవ,అశ్వకర్ణ,ఖాదిర,సామీ,కిమ్సుక,పాటల వృక్షాలు కనపడుతూ ఉన్నాయి.

.

అందంగా మెలికలు తిరుగుతూ చక్రవాక పక్షులచేత శోభితమై ఉన్న గోదావరీ నదిని చూడగానే రాముడి మదిలో ఉత్సాహం ఉరకలేసింది.

.

ఒక చక్కని ఎత్తైన ప్రదేశం ఎంచుకుని లక్ష్మణా ఈ ప్రదేశం చాలా బాగున్నది ఇక్కడ పర్ణశాల నిర్మించుకొందాం అని పలికాడు.

.

వెంటనే లక్ష్మణుడు ఆ ప్రాంతములో మట్టిని బాగా ఎత్తుగా చేశాడు,మంచి దృఢమైన స్తంభాలు తీసుకొచ్చి నిలిపాడు,పొడవైన వెదుళ్లతో వెన్నుబద్ద ఏర్పాటు చేశాడు ,జమ్మికొమ్మలు తెచ్చి పరచి చాలా గట్టిగా కట్లుకట్టాడు.దానిమీద రెల్లుగడ్డి,దర్భలు,ఆకులు వేసి కప్పేసాడు ,లోపటి నేలను చదునుచేసాడు. 

.

ఆ పర్ణశాల చూడటానికి అందంగా ,విశాలంగా ఉంది .రాముడికోసం చాలా అందంగా తీర్చిదిద్దాడు లక్ష్మణుడు .అక్కడ దేవతా పూజలుచేసి నివసించటానికి సిద్ధమైన పర్ణశాల రాముడికి చూపాడు .

.

ఆ పర్ణశాల చూడగానే ఆనంద భరితుడై గట్టిగా తమ్ముని కౌగలించుకొని లక్ష్మణా నాన్న లేని లోటు నీవు తీరుస్తున్నావు ,నా తండ్రి నీ రూపంలో మరల కనబడుతున్నాడు నాకు. 

.

ఆ పర్ణశాలలో సీతా సమేతుడై లక్ష్మణుడు సేవ చేస్తూ ఉండగా స్వర్గంలో దేవేంద్రుడు నివసించినట్లు కొంతకాలం నివసించాడు రామచంద్రుడు.


*************************

రామాయణం 126 మరియు 127 భాగాములు👆

*************************


ఈమె సీత నా సుత

.

ఈమె సీత నా సుత 

నీకు సహధర్మచారిణి

ఈమెను నీవు స్వీకరింపుము

నీకు మంగళమగుగాక

ఈమె చేయిని నీ చేతితో గ్రహింపుము

ఈమె పతిని సేవించుటయే వ్రతముగాకలది!

గొప్ప స్వభావము కలది

నీడలా నిన్ను అనుసరించిఉంటుంది ఎల్లప్పుడూ !

.

ఇదీ సీతమ్మ తండ్రి అయిన జనకమహారాజు రామచంద్రుడిని తన అల్లుడుగా చేసుకొనేటప్పుడు తన కుమార్తె గురించి చెపుతూ అన్నమాటలు !

.

ఇదుగో రామా! ఈమె సీత!

 ఆసౌందర్యము,సౌకుమార్యము,లావణ్యము ఒక్కసారి చూడము! 

.

....కేవలం రూపమే అనుకున్నావా ! 

నా కుమార్తె ఈమె ,మేము జనకులము, రాజర్షుల ఇంట్లో పెంచబడ్డ పిల్ల‌ ఈ తల్లి !

.

ఇంకొక మాట నువ్వు తల్లిగర్భవాసం చేసి పుట్టావు ,కానీ మాతల్లి అలా కాదు అయోనిజ ! పుట్టుకలో కూడా నీ కంటే ఒక మెట్టు ఎక్కువే !

.

ఈమెను నేను ఇవ్వడంలేదు ! నీవే స్వీకరించు ఆమె నీసొత్తు !....

.

ఏనాం ప్రతీచ్ఛ ! ఏనా అంటే అ + ఇనా ....అ అంటే విష్ణువు, ఇన అంటే స్వామిగా కలిగినటువంటిది అనగా 

లక్ష్మీ దేవి !

.

అనగా ఆమె ఎప్పటినుండో నీ సొత్తు ! ఎప్పటినుండి అంటే ? ఎప్పటినుండో ఎవరికీ తెలియదు ! ....ఈ నీ సొత్తు కొంతకాలమునుండి మాత్రమే నా వద్ద ఉన్నది !

.

లక్ష్మీదేవి విష్ణువును ఎన్నడూ వీడనిది ! 

.

ఆమెను ఇవ్వటానికి నాకేమి అధికారమున్నది? నీవేస్వీకరింపుమయ్యా !

.

చూసేవారి దృష్టి తగులకూడదని "భద్రంతే" ! అని కూడా అన్నాడు ఆ తండ్రి !

.

 నీకుభద్రము !

.

ధర్మాచరణము కోసము స్వీకరింపుము అని చెప్పాడాయన.

 అందుకే అరచేతిలో అరచేయి ఉంచినది ! 

.

ఇది శారీరిక వాంఛలు తీర్చుకొనుటకు జరిగిన కళ్యాణము కాదు ధర్మాచరణకోసము జరిగిన వివాహము !

.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ 

ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా !

.

(శ్రీభాష్యం అప్పలాచార్యులవారు తెలిపిన రహస్యమది )


*************************


రాముడు ఎవరు???

.

ఎందుకు పూజిస్తున్నాం! ఆయనను !

మనలాగే మానవ జన్మెత్తాడుకదా!

.

 ఏమిటి speciality!...

.

ఈ రామాయణాన్ని వ్రాసిన మహర్షి వాల్మీకి ( నేటిలెక్కలలో ఒక గిరిజనుడు)...

.

రాముడికి సహాయం చేసిన వారు గిరిజనులు (వానరులు)

.

రాముడు ఎంగిలి తిన్నది ఒక గిరిజన స్త్రీది (శబరి)...

.

రాముడికి అన్యాయం చేసినది వేదవేదాంగవేత్త అయిఉండి కూడా రాక్షసప్రవృత్తికలిగిన ఒక బ్రాహ్మణుడు (రావణుడు)...


...

పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే ఘోరరాక్షసి తాటక ప్రాణాలను వైతరిణి దాటించాడు!

.

శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు! 

.

భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం! 

.

ఎప్పటికీ వారే!

.

అర్ధరూపాయి ఆస్థికోసం కన్నతండ్రిని అడ్డంగా నరికే అధములున్న ఈ సృష్టిలో.....

ఇంకాసేపట్లో పట్టాభిషేకము, 

చక్రవర్తి కాబోతున్నాడు! 

అంతలోనే తండ్రి ఆదేశము అడవులకు పొమ్మనమని!

.

ఏ మాత్రం తొణకలేదు !బెణకలేదు !

తండ్రి పట్ల రవ్వంత ధిక్కారమూలేదు! 

.

అడవికి ప్రియసతితో,అనుంగుసోదరుడితో పయనమయ్యాడు!

.

తన ప్రియమిత్రుడు,ఆత్మసమోసఖా! ఆత్మసఖుడయిన గుహుడిని ఆప్యాయంగా కౌగలించుకొని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు!....ఈ గుహుడు ఒక నిషాదుడు ...రాముడి ఆత్మ!

.

అన్నా!నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది! నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్దించినా! పూవులలోపెట్టి రాజ్యాన్ని తిరిగి అప్పగించినా ,తండ్రికి అనృతదోషము అంటకూడదని భరతుడి ప్రార్దన తిరస్కరించాడు!.

.

అన్నదమ్ముల అనురాగానికి ఈ నాటికీ ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు అన్నదమ్ములు!


భార్య అపహరింపబడ్డ తరువాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు దహన సంస్కారాలు చేసి పశు పక్ష్యాదులు కూడ మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశమిచ్చాడు!

.

పోతే పోయిందిలే !

ఆడవాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు!

 నాకేంటి మహారాజును !అని అనుకున్నాడా!...లేదు !

.

ఆవిడ దొరికేంత వరకు ప్రాణంలేని కట్టెలాగ బ్రతికాడు తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూసికూడా ఎరుగడు!...

..

మనుషులను క్రమ పద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు సాధించారు!..కానీ..

చంచల స్వభావులయిన కోతులను ఒక్కతాటిమీదకు తెచ్చి విజయం సాధించాడు .

.

బలమయిన శత్రువును జయించడానికి ఎంత

Organisational skills కావాలి!

 ఎంత patience ఉండాలి! 

ఎంత స్పష్టదృష్టి (clear vision)ఉండాలి!

.

రావణలంక స్వర్ణలంక ! అది వశమయిన తరువాత కూడా అయోధ్య కు తిరిగి వెళ్ళాడు తప్ప , లంకానగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో పడేయలేదు!

...

బలము,

వీర్యము,

తేజస్సు,

పితృవాక్పాలన, ఏకపత్నీవ్రతము,

సోదరప్రేమ,

ధర్మవర్తనం, గొప్పనాయకత్వం,

స్నేహధర్మం

.

 ఇంతేనా!... 

.

ఆయన సర్వభూతమనోహరుడు! 

.

ఏదిలేదు ఆయనదగ్గర!

.

ఒక్కొక్కలక్షణము ఒక్కొక్క ఎవరెస్టు శిఖరమే ...

ఆయన తరువాతనే ఎవరయినా!

.

Take any parameter he is the best..ultimate!

.

ఏకాలంలో అయినా అత్యుత్తమ మానవుడు ఆయనే!

...

అత్యుత్తమమైనవన్నీ నేనే! అని కదా కృష్ణపరమాత్మ చెప్పినది!

.

రుద్రులలో..శంకరుడు

వేదాలలో ..సామవేదము

పక్షులలో ..గరుత్మంతుడు

చెట్లలో ...రావిచెట్టు

మృగాలలో..సింహము

శస్త్రధారులలో.....శ్రీ రాముడు

.

....ఈవిధంగా 

.

అంతేనా!

Negative ultimate 

వంచకులలో..జూదముకూడా ఆయనే!

(Negative,positive మనకు! There is nothing like positive or negative ...situation makes it..)

... విభూతియుక్తము

,ఐశ్వర్యయుక్తము,

కాంతియుక్తము,

శక్తియుక్తము,

అయినవి ఏదయినా ఆయనే! 

ఆయన అంశే!

...

యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీ మదూర్జితమేవ వా

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్!

...

మరి శ్రీ రాముడు ఈ నిర్వచనం ప్రకారం  

రామ "బ్రహ్మమే"కదా!

.

..శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

ఆదిపర్వము – 44

  

ఖాండవప్రస్థం-ధర్మరాజు పట్టాభిషేకం


స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టినది అర్జునుడని, వారు పాండవులని, దుర్యొధనుడు వేగుల వలన తెలుసుకున్నాడు. పాండవులు లక్క ఇంటిలో తగబడకుండా బతికి బయతపడ్డందుకు దుర్యోధనుడు ఎంతో చింతించాడు.


విదురుడికి పాండవుల విషయం తెలిసి ఎంతో ఆనందించాడు.

ధృతరాష్ట్రుడికి ఈ విష్యం చెప్పాడు. ద్రుపదుని కుమార్తె అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవడం వల్ల పాండవులు ఎంతో మిత్రలాభం పొందారు అని అనుకున్నాడు ధృతరాష్టుడు.

ఒకరోజు కర్ణ దుర్యోధనులు, విదురుడు దగ్గరలేని సమయంలో, ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు.


“తంద్రీ! పాండవులు బతికే ఉన్నారు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల మేలు కోరేవాడు అని తెలిసి కూడా మీరు అతని మాటకు విలువ ఇస్తున్నారు. అది మా దురదృష్టము” అని నిర్వేదంగా అన్నాడు దుర్యోధనుడు.

“నాయనా దుర్యోధనా! నేను పైకి పాండవులు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు ఉంటాను కాని ఆ విషయం విదురునికి తెలియనీయను. ఒక విషయం మాత్రం మీరు మరువద్దు. పాండవులకు దైవబలం ఉన్నది. వారిని మనం ఏమి చెయ్యలేము” అని అన్నాడు ధృతరాష్ట్రుడు.


“తండ్రీ! పాండవులు ఇప్పుడు ద్రుపద రాజపూరంలో ఉన్నారు. వారికి పాంచాల రాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవ రాజులు, వృష్ణి, భోజ, అంధక రాజులు తోడుగా ఉన్నారు. అప్పుడు వారిని ఎవ్వరూ జయించలేరు. కాబట్టి వాఇని పాంచాల రాజు నుండి వేరు చెయ్యాలి. ఇది ఒక మార్గము.


ఇంక రెండవది. కుంతీ పుత్రులకు, మాద్రీ పుత్రులకు మధ్య విభేధాలు పుట్టించి వారిని వేరు చెయ్యాలి. మూడవది, అత్యంత అందగత్తెలైన స్త్రీలను పాండవుల మీద ప్రయోగించి, వారికి, ద్రౌపదికి మధ్య విభేధం కైగించాలి. ఇంక నాలుగవది, మరల మంత్ర తంత్రములతో కుటిలోపాయములతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులను చెయ్యడం. వీటిలో ఏది ఉత్తమ మార్గం ఆలోచించండి” అని తన మనసులో విషయం బయటపెట్టాడు దుర్యోధనుడు.


కర్ణుడు దీనికి ఒప్పుకోలేదు. “సుయొధనా! అసలు, ద్రుపదుడు సజ్జనులు అయిన సత్ప్రవర్తనులు అయిన పాండవులను ఎందుకు వదలివేస్తాడు. అది అసంభవము. పాండవులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వారిలో విభేధాలు ఎందుకు వస్తాయి. పైగా, ద్రౌపది వారిని కోరి వివాహం చేసుకుంది. కాబట్టి ఆమెకు వారిమీద ఎందుకు ద్వేషం పుడుతుంది. కాబట్టి ఇవన్ని ఏవి పని చెయ్యవు.


పైగా ఇప్పటిదాకా మీరు భీముని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఏముంది? భీముని ఏమీ చెయ్యలేకపోయారు. కాబట్టి అదికూడా ప్రయోజనం లేదు. ఇంక ఒక్కటే మార్గము. దండోపాయము. మనము మన సేనలతో ద్రుపద మహారాజు మీదికి యుధ్ధానికి వెళ్లి, ద్రుపదుని ఓడించి, పాండవులను తీసుకొని వద్దాము” అని అన్నాడు.


ఇది అంతా విని, ధృతరాష్ట్రుడు “పెద్దలతో ఆలొచించి రేపు నిర్ణయం తీసుకుందాము” అని అన్నాడు.

మరునాడు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని సమావేశపరిచి, విషయం అంతా వివరించాడు. అప్పుడు, కురు వృద్దుడు భీష్ముడు, దుర్యోధనుని చూసి ఇలా అన్నాడు.


“సుయోధనా! నాకు మీ మీద కాని, పాండవుల మీద కాని భేధభావము లేదు. అందరూ నాకు సమానమే. కాని, పాండవులతో యుధ్ధం చెయ్యడానికి నేను అంగీకరించను. మీవలెనే, పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి వారసులు. అందుచేత, పాండవులకు చెందవలసిన అర్థ రాజ్యాన్ని వారికి పంచి ఇవ్వు. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడవు గా!” అని అన్నాడు భీష్ముడు.

ద్రోణుడు కూడా “నాయనా సుయోధనా! తాతగారి మాట పాటించుము. నీవు ఈ కర్ణుని మాటలు విని, యుధ్ధము మాట తలపవద్దు. ద్రుపదునికి తగిన కానుకలు ఇచ్చి, పాండవులను ఇక్కడకు తీసుకొని రావడానికి నీ తమ్ములను పంపు” అని హితభోధ చేసాడు.


ఈ మాటలకు కర్ణునికి కోపం వచ్చింది. “సుయోధనా! వీరంతా నీకు కీడు చెయ్యడానికి తలపెడుతున్నారు. నీ సంపదను అపహరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మాట నమ్మకు” అని అన్నాడు.


ఏమి మేము కీడు తలపెట్టు వారమా! నీవేనా హితము చెప్పువాడివి. నీవలననే కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది” అని అన్నాడు.

వారిద్దరిని వారించి ధృతరాష్టునితో విదురుడు ఇలా అన్నాడు.


“మహారాజా! భీష్మ, ద్రోణులు వయసులు పెద్దవారు. వారు చెప్పినది చెయ్యడం ధర్మం. అదీ కాక, పాండవులు స్వతహాగా అజేయులు. ఇప్పుడు, వారికి మహా బలవంతుడైన ద్రుపద మహారాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వారికి మిత్రులు. కాబట్టి వారిని జయించడం సులభం కాదు.లక్క ఇంటిలో వారిని తగలపెట్టినా వారు బతికారు. పురోచనుని వలన కలిగిన అపకీర్తి పోగొట్టుకో. వెంటనే వారిని పిలిపించి అర్థ రాజ్యం ఇమ్ము. అది అందరికీ శ్రేయస్కరము” అని అన్నాడు విదురుడు.


చేసేది లేక ధృతరాష్ట్రుడు దానికి అంగీకరించాడు. పాండవులను తీసుకురావడానికి విదురుని ద్రుపదపురానికి పంపాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు. విదురుడు ద్రుపద మహారాజుకు తగిన కానుకలు సమర్పించాడు. ద్రుపదుని ఎదుట, శ్రీకృష్ణుని ఎదుట పాండవులతో ఇలా అన్నాడు.


“ద్రుపద మహారాజా! మా పాండవులకు మీతో బంధుత్వము కలిసినందుకు భీష్మునికి, ద్రోణునికి, కృపాచార్యునికి నాకూ చాలా ఆనందంగానున్నది. కుంతీదేవి, పాండవులు తమ వద్దలేనందుకు ధృతరాష్ట్రుడు మిక్కిలి చింతించుచున్నాడు. పాండవులను, తమ కొడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడవలేనని ఎంతో ఆతురతతో ఉన్నారు. నీవు అనుమతిస్తే పాండవులు హస్తినకు రాగలరు. అందువలన మీరు పాండవులను పంపమని కోరుతున్నాను” అని అన్నాడు విదురుడు.


“మహాశయా! ధృతరాష్ట్రుడు పంపగా వచ్చావు నీవు. భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు, పాండవుల శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుతుంటారు. మీరు ఏమి చేసినా అది పాండవులకు క్షేమకరం అవుతుంది” అని అన్నాడు ద్రుపదుడు.

“విదురుడు ఎల్లప్పుడూ పాండవుల క్షేమం కోరుతుంటాడు. మనం అతిగా ఆలొచించవద్దు. పాండవులు కోరుకున్నది సిధ్ధిస్తుంది” అని అన్నాడు శ్రీకృష్ణుడు.

అందరు చెప్పినది శ్రధ్ధగా విన్న ధర్మరాజు చేతులు జోడించి “భీష్ముడు, ద్రోణుదు, విదురుడు మాకు పెద్దలు. మా క్షేమం కోరుతుంటాఉ. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి, వారి మాట నాకు శిరోధార్యము” అని అన్నాడు.

ద్రుపదుని అనుమతితో తల్లి కుంతీ, భార్య ద్రౌపది, తమ్ములతో సహా హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడు, పాండవులను, ద్రౌపదిని, కుంతిని తన వెంట తీసుకొని వస్తున్నాడు. శ్రీకృష్ణుడు, ధృష్ట్ద్యుమ్నుడు, అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వికర్ణుడు, చితసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులకు ఎదురుపోయి వారికి స్వాగతం పలికారు.


పాండవులని చూసి హస్తినాపుర ప్రజలు “ఈ పాండవులకు దైవబలం, మానవ బలం ఎక్కూవగానున్నది. అందువలననే, అన్ని ఆపదలు తొలగిపోయాయి. ఇంక ధర్మరాజు హస్తినాపురంలో ఉండి మనలను పరిపాలించుగాక” అని అనుకున్నారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, దృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా అయిదు సంవత్సరాలు గడిచాయి.


ఒక రోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోదనాదులు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో దృతరాష్ట్రుడు పాండవులతో ” ధర్మరాజా పెద్దల ఎదుట శ్రీ కృష్ణుని సాక్షిగా మీకు అర్ధ రాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకిస్తున్నాను స్వీకరించండి. ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని పాలించుకోండి ” అని చెప్పి ధర్మరాజుని అర్ధ రాజ్యాభిషిక్తుని చేసాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించారు. పాండవులు తల్లిని, భార్యని, తమ్ములను తీసుకుని ఖాండవప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు. ఇంద్రుడు దేవశిల్పి విష్వకర్మ సహాయంతో విలాస వంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుడు, వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేసారు. ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.

ప్రహ్లాదుడు

  🌺 *ఓం నమో నారాయణాయ* 🌺

*12. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁ డై; యొక్కఁడు నేడుచు నొక్కచోట; నశ్రాంత హరిభావనారూఢచిత్తుడ; యుద్ధతుఁ డై పాడు నొక్కచోట; విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని; యొత్తిలి నగుచుండు నొక్కచోట; నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని; యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ; బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ బ్రణయహర్ష జనిత బాష్పసలిల మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై యొక్కచోట నిలిచి యూరకుండు.*


భావము:- పరీక్షిన్మహారాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి "విష్ణుధ్యానములో విరామం కలిగిం" దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి "విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే" దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట "నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా" అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ "పరమేశ్వరా! కేశవా!" అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు

*13. ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం బైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబున విస్తరించుచు నప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేయుచు నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణ గరిష్ఠుండును, పరమభాగవత శ్రేష్ఠుండును, కర్మబంధ లతా లవిత్రుండును, పవిత్రుండును నైన పుత్రుని యందు విరోధించి సురవిరోధి యనుకంపలేక చంపం బంపె" నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె.*



భావము:- ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాద భక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికి, దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విజ్ఞులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వ సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు. కర్మబంధలన్నీ వదుల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు” అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు.

15-18-గీతా మకరందము

  పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - పరమాత్మ పురుషోత్తముడని యేల చెప్పబడెనో తెలియజేయుచున్నారు - 


యస్మాత్ క్షర మతీతోఽహం

అక్షరాదపి చోత్తమః | 

అతోఽస్మి లోకే వేదే చ 

ప్రథితః పురుషోత్తమః || 


తాత్పర్యము:- నేను క్షరస్వరూపునికంటె మించినవాడును, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందువలన ప్రపంచమునందును, వేదమునందును "పురుషోత్తముడ”ని ప్రసిద్ధికెక్కియున్నాను. 


వ్యాఖ్య:- క్షర, అక్షరపురుషులు ఇరువురికంటెను అతీతుడై యుండుటవలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను. జీవుడున్ను తన పురుషత్వము (జీవత్వము)తో తృప్తి పడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అపుడే యతడు కృతార్థుడగుచు భవబంధవిముక్తుడై సాక్షాత్ భగవానునివలె లోకమున కీర్తింపబడగలడు.

ప్రశ్న:- భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను?

ఉత్తరము:- ఆతడు క్షర, అక్షరపురుషులిరువురికంటెను అతీతుడుగనుక.

*ఆధ్యాత్మిక ఆదర్శం*

 ప్రతి మనిషికీ ఒక జీవిత ఆదర్శం ఉండితీరాలి. ఆదర్శం అంటే జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకునే ఆలోచన, ఆచరణ. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే, సునాయాసంగా అభివృద్ధి సోపానాలు అధిరోహించవచ్చు. తల్లిదండ్రుల పోరు పడలేక చదవాల్సి వస్తోంది అనుకుంటూ మొక్కుబడిగా చదివితే, ముక్కునపట్టిన విద్య తుమ్మగానే జారిపోతుంది.


విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే చదువు కాదు. అక్షరంలోనే అనంతజ్ఞానం, అద్భుతశక్తి దాగి ఉన్నాయి. అక్షర తపస్సు చేసినప్పుడే శక్తి లభించి, జ్ఞానఫలాలు దక్కుతాయి. మహామంత్రాలన్నీ బీజాక్షర సంపుటాలే.

తెలుగులో ఉండేవి యాభైఆరు అక్షరాలే. కానీ, అవి వివిధ మేళవింపుల్లో కథలు, కావ్యాలు, గీతాలు, సంగీతాలుగా మారిపోతాయి. ఆ విధంగా వాటిని రూపకల్పన చేయగల నైపుణ్యం కోసమే అక్షరాన్ని ఆత్మగా చేసుకుని అధ్యయనం చెయ్యాలి.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే ఓంకారమని వేదాలు చెబుతున్నాయి. ఇటీవల సూర్య దేవుడి నుంచి వెలువడే ధ్వనితరంగాలు ‘ఓం’కార శబ్దంగా పరిశోధనలు వెల్లడించాయి. మనిషి అజ్ఞానం ఎలా ఉంటుందంటే- తనకు తెలిసిందే జ్ఞానం, తెలియనివన్నీ శూన్యం అనుకుంటాడు. మన నేత్రాలు చూడలేనివి ఎన్నో ఉన్నాయి. మన మేధకు అందనివీ మరెన్నో ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం కానంతవరకూ మనమే ఘనులమనే భ్రమలో బతుకుతుంటాం.

చక్రవర్తి తనను తాను భగవంతుడితో సమం అనుకుంటాడు. మేధావి తానే మహాజ్ఞాని అనుకుంటాడు. మహాధనికుడు తానే అపర కుబేరుడిననుకుంటాడు. సౌందర్యవతి తానే అప్సరసను అనుకుంటుంది. ఇలా ఎవరికి వారు తామే అధికులమని విర్రవీగుతుంటారు.

వారి అహంకారాన్ని కాలం అనాయాసంగా తుడిచిపెట్టేస్తుంది. వారి పరిమితులు ఆయువు తీరేవరకేనని తేటతెల్లం చేస్తుంది.

దైవం ఉన్నాడా లేడా, స్వర్గ నరకాలు నిజమా అబద్ధమా, పాపపుణ్యాలను నమ్మాలా వద్దా... ఇలాంటి తర్క వితర్కాల మద్య జీవితం చివరి మజిలీకి చేరువైపోతుంది. అప్పుడు నోరు తెరుచుకుని కొండచిలువలా మనకోసం ఎదురు చూస్తున్న మృత్యువుకు ఆహారం కాక తప్పదు.

ప్రాపంచిక ఆదర్శాలన్నీ ధనకనక వస్తు వాహనాల ఆర్జన, హోదా, అధికారం, సుఖసౌఖ్యాలకు సంబంధించినవే. ఇందుకు పూర్తి భిన్నమైనది ఆధ్యాత్మిక ఆదర్శం. దీంట్లో పెట్టుబడి స్వల్పం. ఫలితం అనంతం.

శ్రద్ధ, భక్తి- వీటితో పోల్చదగిన ఆధ్యాత్మిక ఆదర్శం మరొకటి లేదు. విశ్వాసం ఈ రెండింటికీ ఇరుసు. భక్తుడు-భగవంతుడు మధ్య అవిశ్వాసం, అతి బద్ధకం, అత్యాశల వంటి అడ్డుగోడలుంటాయి. వీటిని నిర్మలభక్తితో అధిగమించాలి.

మనం నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆప్యాయంగా ఆయన చేతులుచాచి మనల్ని తనవైపు లాక్కుంటాడు. మన ఆలోచనకు శబ్దం ఉండదు. కానీ, అది అంతర్యామికి ఆ క్షణంలోనే అర్థమైపోతుంది. మన ఆచరణకు సాక్షులు ఉండకపోవచ్చు. కానీ, ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ ఎరుక మనకు ఉండి తీరాలి. అది లేనంత వరకు మనకు అంతర్యామి అర్థం కాడు. ఎంత ప్రయత్నించినా అగుపించడు. ఆధ్యాత్మిక ఆదర్శం అంటే- భక్తి నటించకపోవడం, భగవంతుడికి పరీక్షలు పెట్టకపోవడం, మన సర్వశక్తులు ఏకీకృతం చేసి అంతర్యామిని అర్చించడమే!

(ఈనాడు అంతర్యామి)

✍🏻కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

శూర్పణఖ

  

పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము మంచి పని చేస్తున్నామన్న తృప్తి భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. 


గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు “ భగవద్గీ “తీసి , అందులో ఏదొక శ్లోకం చదివేవాడినని, ఆ శ్లోక సారాంశం తనకు పరిష్కారం తోపింపచేసేదని, ముందుకు నడిపించేదని , మనశ్శాంతి కలిగించేదని వ్రాసుకున్నారు. నిజానికి ఆ ఉద్గ్రంధం చాలా మందిని అలాగే చెయ్యి పట్టుకు నడిపించింది , నడిపిస్తోంది .


మన జీవితాలలో పెనవేసుకు పోయిన గ్రంధాలలో రామాయణం మొట్టమొదటిది ముఖ్యమైనది అనిపిస్తుంది నాకు. “ రామ “ అనే రెండక్షరాలు హరియించును పాతకములు అని నమ్ముతాము , ఇక ‘ రాముడు నడిచిన దారి’ నే నడవాలని అనుకుంటూ ఉంటాము. ఆ రామాయణం “ రాముడి ప్రయాణం “ అంటే అందరకీ ఎంతో మక్కువే. చెప్పక్కరలేదు కాని , “ రామ” లో దాగున్న ఆ “రమ” కథ కూడా అదే ఆ రామాయణం . “సీత ప్రయాణించిన దారి “.


పండితులు ,పెద్దలు, మేధావులు , జ్ఞానవంతులు , కవులు ఉన్నతవర్గం వారెందరెందరో .. వ్యాఖ్యానాలు అర్ధాలు అనువాదాలు నానార్ధాలు వర్ణనలు అందులోని మర్మములు ఎన్నో ఎలాగో రక రకాలుగా విశదీకరించారు ఆ రమణీయ కావ్యం రామాయణంని.


కాని ఒక సాధారణ స్థాయిగా ఆలోచించగల స్త్రీ గా నన్ను, రామాయణంలోని ఒక స్త్రీ నిల వేస్తుంటుంది. 


కథనే మలుపు తిప్పిన స్త్రీ. ఆమెను తలచుకుంటూనే మనకు కోపం కలిగించే స్త్రీ, చిరాకు కలిగించే స్త్రీ. ఆడజాతికే అవమానం కలిగించే రాక్షసి కదా అనుకుంటాము మనము ఆమెను తలచుకొని.


రామాయణంలోని ఆ స్త్రీ యే శూర్పణఖ. రావాణాసురుడి చెల్లెలు. పంచవటిలో భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ వనవాసముంటున్న రామచంద్రుని, నీలివెన్నెల వంటి అతని సొగసు చూసి వలచింది. పొందాలనుకుంది. ఆమె కామవాంఛ ఎంతలా ఉందంటే అన్న కాకుంటే తమ్ముడు లక్ష్మణుడైనా సిద్ధమనేటంత. సీతను తనకు అడ్డుగా ఉన్న సాధారణ ఆడదానిగా తలచి చంపి వేయాలనుకునేటంత కక్ష కల రక్కసి.


అసూయ కోపము ద్వేషము పరపురుషులపట్ల మోహభావము జారతనము జాణతనము , తన పంతం చెల్లించుకోవడానికి తోటి స్త్రీని చంపి వేయమని కూడా చెప్పగల తెంపరితనం ఇన్ని లక్షణాల రాశి ఆమె, ఆ రావణుడి చెల్లెలు. ఏఏ లక్షణాలు స్త్రీలో , రాక్షసజాతి స్త్రీలలో కూడా ఉండకూడదనుకుంటామో అటువంటి లక్షణాలు కల స్త్రీ. 


ముక్కు చెవులు కోసి తగిన శాస్తి చేయబడినా, తిరిగి పగ తీర్చుకోవడానికి కుట్రలు పన్నినది, రాముని కుటుంబానికి అన్నగారి చేత తగిన శాస్తి చేయించాలని పధకాలు రచించిన కుటిలురాలు. 


అంతమాత్రమే రామాయణంలో ఆమె పాత్ర , కాని గడగడలాడించే ఆమె దుష్ట స్వభావానికి మనం హడిలిపోతాము. సుకుమారియైనా ధీరత్వం కలిగి మానవత్వం మాతృత్వ భావన కరుణ క్షమ శీలసంపద కలిగిన సీతమ్మ వంటి స్త్రీరత్నం సరసన శూర్పణఖను తలచుకుని చింతపడతాము. 


కాని, నేటి సమాజంలో దురదృష్టవశాత్తూ శూర్పణఖలూ బయలుదేరుతున్నారు. ఆదర్శమైన రామాయణ గ్రంథంలో , అనుసరించ తగ్గ ఆదరించతగ్గ పాత్ర కానేకాని శూర్పణఖ వంటి వారు తలెత్తుతున్నారు. 


పరపురుష వ్యామోహం కాపురాలను భగ్నం చేసుకోవడం ఆకర్షణలు ఉన్మాదాల వలలో చిక్కుకోవడం , దానివల్ల కుటుంబాలు వ్యక్తుల జీవితాలు నాశనమవడం వింటున్నాము. 


ఇల్లాటి వాటి పర్యవసానంగా పసిపిల్లలు అనాధలు కావడం , బాలలు చెడుదారులు త్రొక్కడం , నేరవాతావరణానికి మళ్ళడం ఇవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపుతాయి.


దుష్టస్వభావం ని సంబాళించుకోలేక, వక్రమార్గాల దారి పడితే పర్యవసానం ఎంతకైనా దారితీయవచ్చు. శూర్పణఖ కు జరిగిన అవమానాల వంటివే , ఇంకా అంతకు మించి జరగవచ్చు . ఒక తప్పు ను కప్పి పుచ్చుకోవడానికి


మరియొక తప్పులాగ , చివరకు ప్రాణాలు తీసుకునే ఆత్మహత్యల లాగ , ప్రాణాలు తీసే హత్యల కింద పరణమించవచ్చు..


మనకు పరంపరగా అందించబడిన ఉత్తమ గ్రంధాలలోని విషయాలూ మనుషులూ , మనకు మన జీవితానికి ఉపయోగపడే విధంగానూ , మనలనూ సమాజాన్ని తీర్చిదిద్దుకోవడం కోసమూనూ. వాటిలోని కొన్ని పాత్రలుమనం ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో చెపితే, శూర్పణఖ లాటి స్త్రీలు ఎలా ఉండకూడదో చెప్పేందుకు ఉదాహరణలు. 


రామాయణం వంటి గ్రంధాన్ని ఆదర్శంగా తీసుకుని జీవిత ప్రయాణాన్ని కొనసాగించుతూ ఉంటే శూర్పణఖ లక్షణాలు మాత్రంఅలవరచుకోకూడదు. మనకు ఎప్పుడూ అటువంటి


అభినవ శూర్పణఖలు తారసపడకూడదు.  


మన నవ సమాజం శూర్పణఖలు లేని రామాయణం కావాలని కోరుకుందాము. 

“ నెచ్చెలి” పత్రిక

*ధ్యానానికి* *మించిన* *తీర్ధయాత్ర* *లేదు* !!

 *ధ్యానానికి* *మించిన* *తీర్ధయాత్ర* *లేదు* !!


వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపు వాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలు పెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.


మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. 


పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.' అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.


అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.


'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.


దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.


ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.


మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు. అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. *తపస్సు* *అంటేనే* *ధ్యానం* . ధ్యానం ద్వారానే జ్ఞానసిద్ధిని పొందారు.

👆👌🌹🙏


*అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!*

 పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  

 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.


*పురాణగాథ*

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.


*ఏం చేయాలి..?*

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.


ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.


చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  


బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  


బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

తెలంగిణలో ఆన్‌లైన్‌ చేసుకోవడానికి

  *వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌పై ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు.. వాటికి సమాధానాలు.*

*🤔 ఆన్‌లైన్‌ చేసుకోవడానికి*

       *ఎవరిని సంప్రదించాలి?ఎంత ఫీజు* *కట్టాలి?*

       _*ఇంటిని ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది.*_

*🤔 ఆన్‌లైన్‌ కోసం ఎలాంటి*

       *డాక్యుమెంట్లు కావాలి.*

       *వాటిని చూపిస్తే సరిపోతుందా?*

       _*ఇంటిని ఆన్‌లైన్‌ చేయడానికి  అధికారి వచ్చినప్పుడు యాజమాని ఆధార్‌కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఇంటినంబర్‌/ పట్టాదారు పాసుబుక్‌ వివరాలు యాప్‌లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్‌ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు ఆధార్‌కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు/ రేషన్‌ కార్డు/ పెన్షన్‌ కార్డు/ జీరో అకౌంట్‌లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు.*_

*🤔 ఇంటిని కొలిచేటప్పుడు*

       *యజమాని తప్పని సరిగా*

       *ఉండాలా?*

       _*యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదుచేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. కచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్నవారి సహాయంతో వివరాలు అందజేయాలి.*_

*🤔 ఇల్లు లేకుండా స్థలం మాత్రమే*

       *ఉంటే దాన్ని ఆన్‌లైన్‌*

       *చేస్తారా? దానికోసం ఎలాంటి*

       *డాక్యుమెంట్లు కావాలి?*

       _*ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్‌ చేయరు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోకి ఎక్కించి పాస్‌బుక్‌ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్‌, వ్యవసాయ భూమిలో ప్లాట్‌ కొంటే దాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్‌ చేస్తున్నారు.*_

*🤔 యాజమాని చనిపోయి ఉంటే*

       *వారసులందరి పేర్లు నమోదు*

       *చేసుకుంటారా? వారిలో*

       *ఒక్కరే గ్రామంలో ఉంటూ*

       *మిగిలిన వారు వేరే ప్రాంతాల్లో*

       *ఉంటే ఎలా?*

       _*రికార్డుల్లోఉన్న ఇంటి యాజమాని మరణిస్తే అతడి భార్య లేదా పిల్లల పేరుమీద ఆన్‌లైన్‌ చేస్తారు. వారసులు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని అందరికీ జాయింట్‌ ఓనర్‌షిప్‌ ఇస్తారు. వారసుడు ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకున్నాకే ఆన్‌లైన్‌ చేస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్తిని ఒక్కరి పేరు మీదే రాయాలని డిక్లరేషన్‌ ఇస్తే ఆ ఒక్కరి పేరుమీద చేస్తారు. వారసులం అని నిరూపించుకోవడానికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.*_

*🤔 ఆస్తులను ఎందుకు ఆన్‌లైన్‌*

       *చేస్తున్నారు. కార్యక్రమం*

       *ముఖ్య ఉద్దేశం ఏమిటి?*

       _*వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నట్టే.. వ్యవసాయేతర ఆస్తులకూ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతోపాటు, ఇతర ఖాళీస్థలాలపై యాజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించడంతోపాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. పంచాయతీ/ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది? ఎవరి నుంచి ఎవరికొచ్చింది? తర్వాత వారసులెవరు? తదితర వివరాలను ఆన్‌లైన్‌చేసి.. వాటిని మెరూన్‌ రంగు పాస్‌బుక్‌లో ము ద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్‌ పడటంతోపాటు, భవిష్యత్తులో క్రయవిక్రయాలు సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి.*_

*🤔 అధికారులు ఇంటికి రాకపోతే..?*

       _*పంచాయతీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఒకవేళ ఎవరూ రాలేదని భావిస్తే.. పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపాలిటీ ఆఫీస్‌కు వెళ్లి విషయాన్ని వివరించాలి. సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తారు.*_

*🤔 కుటుంబసభ్యుల వివరాలు*

       *చెబితే చాలా? వారికి*

       *సంబంధించిన డాక్యుమెంట్లు*

       *ఏమైనా ఇవ్వాలా?* 

       _*పదేండ్ల వయస్సు పైబడిన కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయించడానికి ఆధార్‌నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని అధికారులు యాప్‌లో పొందుపరుస్తారు. పదేండ్లలోపు వారికి మినహాయింపు ఉంటుంది. యాజమాని కోరితే పిల్లల వివరాలు సైతం నమోదుచేస్తారు.*_

*🤔 ఇంటితోపాటు ఇంటిముందు,*

       *వెనకాల ఉన్న స్థలాన్ని*

       *కూడా ఆన్‌లైన్‌ చేస్తారా?*

       *పెరడు ఒకదగ్గర ఇల్లు*

       *మరో దగ్గర ఉంటే ఏంచేయాలి?*

       _*ఇంటితోపాటు ఇంటిముందు, వెనకాల ఉన్న స్థలాలను సైతం ఆన్‌లైన్‌ చేస్తారు. పంచాయతీ రికార్డుల్లో గతంలోనే ఈ వివరాలు  ఉంటాయి. మొత్తం ఖాళీస్థలం (ప్లాట్‌ ఏరియా), అందులో ఉన్న ఇంటి స్థలం (ప్లింత్‌/ బిల్డప్‌ ఏరియా) అని నమోదు చేస్తారు. గత రికార్డుల్లో ప్లాట్‌ ఏరియా (పెరడు)కు సంబంధించిన వివరాలు లేకపోతే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకొని ఇంటిస్థలంతోపాటు ఆ స్థలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కిస్తారు. పెరడు ఒకదగ్గర ఇల్లు మరో దగ్గర ఉన్నా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ అవసరం. ఒకవేళ ఆ పెరడులో పశువుల కొట్టం, రేకుల షెడ్డు లేదా ఏదైనా నిర్మాణం ఉంటే దానికి ఇంటి నంబర్‌ కేటాయించి.. ఆన్‌లైన్‌ చేస్తారు.*_

*🤔 ఖాళీ స్థలంతోపాటు ఇంటి*

       *వివరాలు తీసుకున్నప్పడు*

       *రెండింటిమీద పన్ను వసూలు*

       *చేస్తారా?*

       _*పంచాయతీల్లో గతంనుంచీ ఈ రెండింటికీ కలిపి ఒక్కటే పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వసూలు చేసేదేమీ ఉండదు. ఒకవేళ రికార్డుల్లో లేని భూమిని సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో ఇంటి స్థలంలో కలిపి ఆన్‌లైన్‌ చేసుకున్నట్లయితే అదనంగా కలిసిన భూమికి అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండింటినీ కలిపితే పన్ను పెరిగిపోతుందనేది ఆపోహ మాత్రమే.*_

*🤔ఎలాంటి డాక్యుమెంట్లులేని*

       *ఇండ్లను ఆన్‌లైన్‌ ఎలా*

       *చేస్తారు? కొత్తగా నిర్మించుకున్న వారి* *పరిస్థితి ఏమిటి?*

       _*వాస్తవంగా ప్రతి ఇల్లూ రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు. రెండుమూడ్రోజుల్లో ఇంటి నంబర్‌ కేటాయించి యాజమాని వివరాలను ఈ- పంచాయతీ/ సీడీఎంఏ వెబ్‌సైట్‌లోకి ఎక్కించి తరువాత యాప్‌లో ఆన్‌లైన్‌ చేస్తారు. కొత్తగా నిర్మించిన, నిర్మాణంలోఉన్న ఇండ్లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.*_

*🤔 ప్రభుత్వ భూమిలో ఇండ్లు*

       *కట్టుకొని ఉంటున్నవారి*

       *వివరాలను సేకరిస్తారా?*

       _*సర్కారు జాగాను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నట్టు తేలితే ప్రభుత్వభూమిగా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇప్పటికే 58, 59 జీవో కింద కొన్ని ఇండ్లను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. మరోసారి రెగ్యులరైజేషన్‌కు అవకాశమిచ్చేందుకు సిద్ధమవుతున్నది. అప్పటికీ వినియోగించుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.*_

*🤔 ఇల్లు కట్టుకొని రికార్డుల్లో*

       *నమోదు చేసుకోకుండా*

       *ఉంటే పరిస్థితేమిటి?*

       _*గుర్తింపులేని ఇండ్లు/ భవనాలు ఏవైనా ఉంటే వెంటనే మున్సిపల్‌/ పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తారు. రెండుమూడ్రోజుల్లోగా పీటీఐఎన్‌ లేదా అసెస్‌మెంట్‌ నంబర్‌ ఇస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ చేస్తారు.*_

*🤔 గతంలో నివాసానికి వాడుకున్న*

       *ఇంటిని ఇప్పుడు కమర్షియల్‌గా*

       *మారిస్తే పన్ను స్లాబ్‌*

       *మారుతుందా?*

       _*ఇల్లు లేదా ప్లాటు ఏ ప్రాంతంలో ఉంది? ఎంత విస్తీర్ణంలో ఉన్నది? బిల్డప్‌ ఏరియా ఎంత? దానినెలా ఉపయోగిస్తున్నారు? వంటి అంశాలపై ఆ పన్ను ఆధారపడి ఉంటుంది. ప్రధాన కూడళ్లు, రద్దీప్రాంతాల్లో ఉండే భవనాలలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. మరికొందరు గతంలో బిల్డప్‌ ఏరియాను తక్కువగా చూపించుకున్నారు. ఇలాంటివన్నీ తాజా సర్వేతో బయటపడుతాయి. వారికి పన్ను పెరిగే అవకాశం ఉంటుంది.*_

*🤔 అనుమతి లేకుండా*

       *పైఅంతస్తులు కట్టుకున్నవారిపై*

       *చర్యలు ఉంటాయా?*

       _*ఇంటి అనుమతులు తీసుకునే సమయంలో ఇచ్చిన ప్లాన్‌కు మించి కట్టినట్టు తేలితే.. జరిమానాగా 50శాతం అదనంగా పన్ను విధిస్తారు. అనుమతుల్లేకుండా పైఅంతస్తులు కట్టినట్టు తేలితే జరిమానాగా పన్నును రెట్టింపు చేస్తారు. జీవితాంతం ఈ జరిమానా కట్టాల్సి ఉంటుంది. యజమాని ఇంటి కొలతలను తప్పుగా చెప్పినా.. అసెస్‌మెంట్‌లో తేలిపోతుంది.*_

*🤔 మా ఇంటికి పన్ను మారుతుందా?*

       _*వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వద్దే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువను నమోదు చేయాలని ధరణి పోర్టల్‌లో తాజాగా ఆదేశించింది. సర్వేనంబర్‌, ఇంటి నంబర్ల వారీగా మార్కెట్‌ విలువను నిర్ధారిస్తారు. మొదట రోడ్లు, ఇతర వాణిజ్య స్థలాలకు దగ్గరగా ఉండే ఆస్తులను హయ్యర్‌ వాల్యూగా.. మిగతావాటిని లోయర్‌ వాల్యూగా నిర్ధారిస్తారు. వీటికి తాజాగా ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ధరల ఆధారంగా మార్కెట్‌ వాల్యూ మారుతుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, పన్నులపై వీటి ప్రభావం ఉంటుంది.*_

*🤔 ఇల్లు కొనుగోలు చేశాక కూడా*

       *రికార్డుల్లో పాత యాజమాని*

       *పేరు ఉంటే?*

       _*అలాంటివారిని వెంటనే మున్సిపల్‌/ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం మార్పిడి జరిగిన తర్వాత ఆన్‌లైన్‌ చేస్తారు.*_

*🤔 కూలిపోయిన ఇండ్లకు*

       *అసెస్‌మెంట్‌ చేస్తారా?*

       _*కూలిపోయిన ఇండ్లకు    ఇప్పటికే ఇంటి నంబర్‌/ పీటీఐఎన్‌ నంబర్‌ ఉంటుంది. కాబట్టి ఆ ఇంటిని అసెస్‌మెంట్‌ చేస్తారు. నిర్మాణం సగంలో ఆగిపోయిన ఇండ్లకు ఇంటి నంబర్‌ మంజూరుకాదు కాబట్టి ఆన్‌లైన్‌ చేయరు.*_

*🤔 బావుల వద్ద, వ్యవసాయ*

       *భూమిలో ఇల్లు కట్టుకుంటే*

       *ఎలా?*

       _*వ్యవసాయ భూముల్లో కట్టుకున్న ఇండ్లను ఆన్‌లైన్‌ చేసేప్పుడు అది పట్టాల్యాండ్‌లో ఉంది అని ధ్రువీకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు.*_

*🤔 వ్యక్తిగత వివరాలు ఇస్తే*

       *గోప్యంగా ఉంటాయా?*

       _*భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వలక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాపు క్లియర్‌గా ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్‌గా ఉండాలనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఇంటియాజమానితోపాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్‌ పాస్‌బుక్‌లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.*_

*🤔 ఇంటిని ఇద్దరు వారసులు*

       *పంచుకుంటే దానిని ఎవరి*

       *పేరుమీద నమోదు చేస్తారు?*

       *ఒకరు కాస్తులో, మరొకరు*

       *పట్టాలో ఉంటే?*

       _*ఒకే ఇంటిని వారసులు పంచుకుంటే వేర్వేరు నంబర్లు కేటాయించి.. ఎవరిది వారికే ఆన్‌లైన్‌ చే స్తారు. పంచుకున్నాక కూడా కాస్తులో ఒకరు పట్టాలో ఒకరు ఉంటే ఆ ఆస్తి ఎవరికి చెందిందో ఆ ఇద్దరు కలిసి ఇచ్చే డిక్లరేషన్‌ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు.*_

*🤔 మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో*

       *ఇంటి వివరాలను ఎలా*

       *సేకరిస్తున్నారు? పట్టాలు లేని*

       *ఇండ్లను కూడా నమోదు*

       *చేస్తారా?*

       _*మురికివాడల్లోని ఇండ్లకు పీటీఐఎన్‌ నంబర్‌ ఆధారంగా అసెస్‌మెంట్‌ చేస్తున్నారు. వాటి విస్తీర్ణం వివరాలు ఇప్పటికే నమోదయ్యాయి. అదనంగా కుటుంబసభ్యుల వివరాలు, నల్లా, ఇంటి కనెక్షన్‌ వంటివి మాత్రమే సేకరిస్తారు.*_

*🤔 పీటీఐఎన్‌ నంబర్‌లేని*

       *ఇండ్లను ఎలా నమోదు*_

       *చేస్తారు? కొత్తగా పీటీఐఎన్‌*

       *నంబర్‌ ఇస్తారా?*

       _*పీటీఐఎన్‌ నంబర్‌లేని ఆస్తుల వివరాలు సైతం నమోదుచేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, వివరాలతోవారు పీటీఐఎన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్‌ వచ్చాక కుటుంబసభ్యుల వివరాలు అప్‌లోడ్‌ చేయవచ్చు.*_

*🤔 బినామీ ఆస్తులు*

       *బయటపడుతాయా?*

       _*నిబంధనల ప్రకారం ఇల్లు ఎవరి పేరుమీద ఉన్నదో వారికే శాశ్వత హక్కులు కలుగుతాయి. తాజా సర్వేతో తర్వాతితరం వివరాలు కూడా నమోదవుతాయి. ఒకవేళ ఎవరికైనా బినామీ ఆస్తులు ఉంటే.. వాటిని తరతరాలుగా వేరేవ్యక్తులకు అప్పగించరు. కాబట్టి బినామీలకు ఆస్కారం ఉండదు. ఆస్తిని అమ్మితే వెంటనే లావాదేవీల వివరాలు ప్రభుత్వానికి తెలిసిపోతాయి. అనుమానం వస్తే విచారణ జరుగుతుంది.*_

*🤔 నమోదు సమయంలో యాజమాని*

       *కచ్చితంగా ఉండాలా? దూరంగా*

       *ఉన్న, వలస వెళ్లినవారి పరిస్థితి*

       *ఏంటి?*

       _*యాజమాని ఊర్లో లేకుంటే.. ఫోన్‌లో వివరాలు తెలిపినా ఆన్‌లైన్‌ చేస్తారు. వలసవెళ్లిన వారికి ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే ప్రతి ఆస్తికి సంబంధించి యజమాని ఫోన్‌ నంబర్లు పంచాయతీ/ మున్సిపాలిటీల వద్ద ఉన్నాయి. లేనివారి వివరాలు సేకరించి వారికి సమాచారమిస్తారు. అపార్ట్‌మెంట్లు/ గేటెడ్‌ కమ్యూనిటీ అయితే సమాచారమిచ్చే బాధ్యతను అసోసియేషన్‌ కూడా పంచుకుంటుంది. ఒకవేళ యాజమానికి సమాచారమే లేదు. ఆన్‌లైన్‌ చేసుకునేందుకు రాలేదు. అంటే వారికి మరో అవకాశం ఉంటుందా అనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు.*_

*🤔 కులం వివరాలు ఎందుకంటే?*

       _*గ్రామంలో ప్రజల సాంఘిక స్థితిగతులు ప్రభుత్వానికి తెలుస్తాయి. కులాలవారీ జనాభా, వారి ఆర్థికస్థితిగతులపై మరింత స్పష్టత వస్తుంది. తద్వారా కరెంటు, నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్నులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు నేరుగా అర్హులకు అందే అవకాశం ఉంటుంది.*_

*🤔 జీహెచ్‌ఎంసీ పరిధిలో*

       *ఆన్‌లైన్‌ ఎలా చేస్తున్నారు?*

       *ఏమేం డాక్యుమెంట్లు అవసరం?*

       _*జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్నిఇండ్ల వివరాలు సీడీఎంఏ పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. వారందరికీ పీటీఐఎన్‌ (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునేవారికోసం యజమాని ఫోన్‌నంబర్‌కు ప్రత్యేకంగా వెబ్‌ లింక్‌ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్‌లో వివరాలను సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయొచ్చు. చివరగా ఇంటి యజమాని ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సొంతంగా వివరాలు అప్‌లోడ్‌ చేసుకునేందుకు <https://ts.meeseva.telangana.gov.in/>TSPortaleef/UserInterface/Citizen/ RevenueServices/SMSSendOTP.aspx లింక్‌ను సందర్శించవచ్చు.*_

*🤔 కరెంటు, నల్లా కనెక్షన్‌*

       *వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు?*

       _*ఇంటికి కనీస అవసరాలైన కరెంటు, నల్లా కనెక్షన్లు లేవని తేలితే వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో/మున్సిపాలిటీలో కరెంటు, నీటి వినియోగంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లుచేసేందుకు వీలు కలుగుతుంది.*_

*🤔 ఆన్‌లైన్‌ చేయకపోతే*

       *ఏమవుతుంది?*

       _*ఆన్‌లైన్‌ చేయకపోతే ఆ ఆస్తి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కావు. అంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. భవిష్యత్తులో మార్పిడులు, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.*_

*🤔 అన్ని వివరాలను ధరణిలో*

       *అప్‌లోడ్‌ చేస్తారా?*

       _*వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్‌కు అనుసంధానమవుతాయి. తద్వారా భవిష్యత్‌లో క్రయవిక్రయాలు సులభంగా జరుగుతాయి.*_

*🤨 ఆన్‌లైన్‌లో ఆస్తి నమోదుకు*

       *కావాల్సిన వివరాలు*

★ _*యాజమాని పేరు*_

★ _*తండ్రి/భర్త పేరు*_

★ _*వయసు*_

★ _*జెండర్‌ (లింగం)*_

★ _*ఫోన్‌ నంబరు*_

★ _*పట్టాదారు పాసుబుక్‌ ఉందా*_

     _*లేదా*_

★ _*పాస్‌బుక్‌ లేని పక్షంలో ఇతర*_

     _*గుర్తింపు కార్డులు*_

★ _*ఆధార్‌నంబరు*_

★ _*యాజమాని ఫొటో*_

★ _*ఆస్తికి జాయింట్‌ ఓనర్లు ఉన్నారా*_

★ _*జాయింట్‌ ఓనర్‌ పేరు /*_

     _*ఆధార్‌ నంబరు/ మొబైల్‌ నంబరు*_

★ _*ఆస్తికి సంబంధించిన వివరాలు*_

★ _*టీపీఐఎన్‌*_

★ _*ఇంటి నంబరు*_

★ _*ప్రాంతం*_

★ _*ఏ రకమైన ఆస్తి, ఎలా*_

     _*సంక్రమించింది..(వారసత్వం/*_

     _*కొనుగోలు/ దానం/ పంపకం)*_

★ _*ప్లాట్‌ మొత్తం ఎన్ని స్వేర్‌*_

     _*యార్డులు*_

★ _*అందులో నిర్మాణంఉన్న స్వేర్‌*_

     _*యార్డులు*_

★ _*అన్‌ డివైడెడ్‌ ఏరియా ఎంత*_

★ _*నిర్మాణం దేనికి వాడుతున్నారు*_

     _*(ఇండిపెండెంట్‌ హౌజ్‌/*_

     _*అపార్ట్‌మెంట్‌/ కమర్షియల్‌*_

     _*భవనం)*_ 

★ _*భూమి ఏ రకం.. ప్రైవేటు*_

     _*భూమి/ ప్రభుత్వ భూమి/*_

     _*ఆబాదీ (గ్రామ కంఠం) /అసైన్డ్‌*_

★ _*సర్వే నంబరు*_

★ _*రెవెన్యూ విలేజ్‌*_

★ _*విద్యుత్‌ కనెక్షన్‌ నంబరు*_

★ _*నీటి సరఫరా నంబరు*_

★ _*చిరునామా*_

★ _*కుటుంబ సభ్యుల వివరాలు,*_

     _*వారి ఆధార్‌ నంబర్‌*_

*🤗 మున్సిపాలిటీల్లో అదనంగా*

       *సేకరించే వివరాలు*

★ _*శాశ్వత చిరునామా*_

★ _*పస్తుత చిరునామా*_

★ _*నిషేధిత ఆస్తిలో ఉన్నదా? లేదా?*_

★ _*మెయిల్‌ ఐడీ*_

*😌 ఆన్‌లైన్‌తో లాభాలివీ*

★ _*వ్యవసాయేతర ఆస్తులు, కుటుంబం*_

     _*వివరాలన్నీ ప్రభుత్వం వద్ద*_

     _*ఉంటే పంపకాల సమయంలో*_

     _*గొడవలకు ఆస్కారం ఉండదు.*_

     _*కుటుంబం ఇచ్చే డిక్లరేషన్‌తో*_

     _*పంపకాలు సులువుగా*_

     _*జరుగుతాయి. తద్వారా*_

     _*ఆ ఆస్తికి ప్రభుత్వం రక్షణగా*_

     _*ఉంటుంది.*_

★ _*రికార్డులన్నీ డిజిటలైజ్‌ కావడంతో*_

     _*తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే*_

     _*అవకాశం ఉండదు.*_

★ _*కులం వివరాలు సేకరించడం*_

     _*ద్వారా సామాజిక, ఆర్థిక*_

     _*పరిస్థితులపై ప్రభుత్వానికి*_

     _*స్పష్టత ఉంటుంది.*_

★ _*సబ్సిడీలు వంటివి ఏ ఇంటికి*_

     _*చేరుతున్నాయో తెలుస్తుంది.*_

★ _*కరెంటు, నల్లా కనెక్షన్ల*_

     _*వివరాలు తెలుసుకోవడం ద్వారా*_

     _*కనెక్షన్లు లేనివారికి వాటినందించే*_

     _*వీలుంటుంది.*_

★ _*గృహ అవసరాల కోసం*_

     _*అనుమతి తీసుకొని కమర్షియల్‌గా*_

     _*వాడటం, నిబంధనలకు*_

     _*విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు*_

     _*బయటపడుతాయి.*_

★ _*ఏ గ్రామం/పట్టణంలో అవసరాలు*_

     _*ఎంత? భవిష్యత్తులో ఎంత*_

     _*అవసరం పడొచ్చు వంటి*_

     _*వివరాలపై ఓ అంచనా*_

     _*వస్తుంది. దానికి అనుగుణంగా*_

     _*వసతుల కల్పన జరుగుతుంది.*_

అలిపిరి మెట్లదారి రిపేరు లో వుంది

 

కర్మ సిద్ధాంతం


 

చిన్న కథగా

 ఎవరు రాశారో తెలిస్తే బాగుండేది.

చదవండి. భలే ఉంది. 

తెలుగు 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పినారు ఎవరో కవి.


        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు

        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,

        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే

        (ఈ)లల గోలల మోతలతో, 

        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో

        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.

        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక

        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,

        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల

        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,

        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా

        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,

        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,

        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా

        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా

        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.


        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా

        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,

        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన

        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను

        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.


మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........


        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత

        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 

        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి

        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి

        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 


        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు

        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,

        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు

        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,

        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...


        (త)లుపులు తోసేసుకుంటూ,

        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,

        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ

        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 

        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,


        (ప)రుగు పరుగున కొందరు,

        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 

        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,

        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,

        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,


        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,

        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,

        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,

        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే

        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,

        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,

        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో

        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-

        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ

        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-

        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.


ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 

అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.


అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.