15, ఆగస్టు 2023, మంగళవారం

Panchang


 

U


 

ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి

 తస్కరస్య వధో దండో.          దాస దండస్తు ముండనమ్!    భార్యాదండం పృథక్ శయ్యా.                                మిత్రదండమ్ అభాషణమ్!!                       దొంగకు హింసించడం శిక్ష. సేవకునికి తలగొరిగించడం శిక్ష. భార్యను పడకగదిలో దూరంగా ఉంచడం శిక్ష. స్నేహితునితో మాట్లాడకుండా దూరంగా ఉంచడమే సరియగు శిక్ష.       చమత్కార శ్లోకం;----             ప్రజాగుప్త శరీరస్య-- కిం కరిష్యంతి సంహతాః?           హస్త న్య స్తాత పత్రస్య-- వారి ధారా ఇవారయః!!         ప్రజాభిమానం ఉన్నదే అది గొడుగు వంటిది. చేతిలో గొడుగు ఉన్నవాణ్ణి వర్షం ఏమీ చేయలేనట్లు , ప్రజాదరణ ఉన్న పాలకుణ్ణి, ఏ శత్రువులు ఏమీ చేయలేరని కవి భావం. ( భోజ చరితం నుండి గ్రహీతము)                           తేది 13--8--2023, ఆదివారం, శుభోదయం.

పరుల కోసమే

 ంంంం ఆలోచనాలోచనాలు ంంంం సంస్కృత సూక్తి సుధ ంంంం.                      కోకిలానాం స్వరో రూపమ్.      పాతివ్రత్యస్తు యోషితామ్!    విద్యా రూపం విరూపిణాం క్షమారూపం తపస్వినామ్!! కోకిలలకు సుస్వరమే అందము. స్త్రీలకు పాతివ్రత్యమే అందము.అందవిహీనునకు మంచి విద్యయే అందము. తపస్సు చేసుకొనే ఋషిపుంగవులకు ఓర్పే నిజమైన అందము.               దైవాధీనం జగత్సర్వం.          సత్యాధీనంతు దైవతమ్!       తత్సత్యముత్తమాధీనం        ఉత్తమో మమ దేవతా!!        ఈ జగత్తు యావత్తు భగవంతుని అధీనంలో ఉన్నది. ఆ దైవం సత్యం అధీనంలో నిలచివున్నాడు. ఆ సత్యం ఉత్తమముల అధీనమై ఉంది. మరి, అట్టి ఉత్తములే దైవసమానులని భగవంతుని వాక్కు.              అభ్యాసానుసరీ విద్యా.         బుద్ధిః కర్మానుసారిణీ!            ఉద్యోగానుసరీ లక్ష్మీ.              ఫలం భాగ్యానుసారిణీ!!        అభ్యాసాన్ని బట్టి విద్య వంటబట్టుతుంది. మనకర్మను అనుసరించి మనకు బుద్ధి పుడుతుంది. మనం చేసే వృత్తి లేదా ఉద్యోగాన్ని బట్టి ధనం లభిస్తుంది. మరి ఫలితం ఉన్నదే మన అదృష్టాన్ని బట్టే మనకు లభిస్తుంది.       పిబంతి నద్యః స్వయమేవ నాభః.                                   ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షాః!                                 పయోధరాస్సస్య మదంతి నైవ.                                        పరోపకారాయ నతాం విభూతయః!!                       నదులనిండా నీళ్ళున్నా ఆ నీళ్ళను నదులు తాము త్రాగవు. చెట్లనిండా మధురమైన ఫలాలు ఉంటాయి. అయినా ఆ పండ్లను చెట్లు తినవు. మేఘాల నిండా నీరే ఉంటుంది, కానీ ఆ నీటిని మేఘాలు త్రాగవు. లోకంలో ధర్మాత్ములైనవారు తాము సంపాదించిన ధనాన్ని తాము ఉపయోగించుకోకుండా పరుల కోసమే ఉపయోగిస్తారు.                     అర్థా గృహే నివర్తంతే.             శ్మశానే మిత్ర బాంధవాః !       సుకృతం దుష్కృతం చైవ       గచ్ఛంత మనుగచ్ఛతి!!          మానవుడు చనిపోయిన తరువాత ఆతని భార్య ఇంటివద్దే ఆగిపోతుంది. స్నేహితులు, బంధువులు వల్లకాటిదాకా వచ్చి వీడ్కోలు పలుకుతారు. మనుష్యులు దాటిపోయిన తర్వాత వెంట వచ్చేవి ఆ జీవి చేసుకొన్న పాప, పుణ్యఫలితాలే. కాబట్టి జీవితం అంతా పుణ్యకార్యాలే చేసుకొంటూపోవాలి.

రామాయణమ్ 291

 రామాయణమ్ 291

...

రాముడికి ఇతర దృష్టిలేదనీ నిత్యము శోకముతో ఉన్నాడనీ నీవు చెప్పిన మాటలు విషము కలిపిన అమృతమువలే  ఉన్నవి.

.

దైవము మనిషిని ఐశ్వర్యము వైపునకు గానీ అతిభయంకర దుఃఖదారిద్ర్యములొనికి గానీ మనుజుని తాడు కట్టుకొని లాగుకొని పోవును.మనుష్యుడు నిమిత్తమాత్రుడు. 

.

ఓ హనుమా!దైవమును దాటగల శక్తి ఎవ్వరికున్నది ? మేము మువ్వురమూ ఇంత దుఃఖసాగరములో మునిగితి మన్న అది దైవప్రేరితము గాక మరేమిటి ? మా శోకమునకు ఎప్పుడో అంతము?

.

నాకు ఆ దుష్ట రాక్షసుడు ఒక సంవత్సరము మాత్రము గడువొసగినాడు .అందులో పది నెలలు గడచిపోయినవి .ఈ బొందిలో ఇక ప్రాణము నిలుచునది రెండు నెలలే ! ఆ లోపుగనే రాముడు ససైన్యముగా ఇచటికి ఏతెంచి రావణుని సంహరించి నా చెర విడిపించవలే !

.

విభీషణుడు ! రావణుని తమ్ముడు ! చెవినిల్లు కట్టుకొని పోరుచున్నాడు ! నన్ను తిరిగి రాముని వద్దకు చేర్చమని ! కానీ రావణుడు ఆ హితమును పెడచెవిని పెట్టుచున్నాడు.

.

వాడు కాలానికి లొంగి‌నాడు ,

కాలునికి అతిథిగా వెళ్ళవలెనని ఉవ్విళ్ళూరుచున్నాడు.తెగఆరాట పడుచున్నాడు.

పోగాలము దాపురించినవాడికి మంచివిషయము తలకెక్కుతుందా?

.

ఈ సంగతులు నాకు విభీషణుడి పెద్దకూతురు " నల " తన తల్లి పంపగా నా వద్దకు వచ్చి తెలిపినది .

.

శచీదేవికి దేవేంద్రుని గురించి తెలిసినట్లు నాకు నా రాముని గురించి బాగుగా తెలియును ..రామునిలో ఉత్సాహము,పురుషప్రయత్నము,

బలము ,క్రూరత్వములేకుండుట,

కృతజ్ఞత్వము, పరాక్రమము మొదలైన గుణములు పుష్కలముగా యున్నవి .

.

రామ కోదండ ధనుష్ఠంకారమే శత్రుశిబిరములో హాహాకారములు పుట్టించును. 

.

హనుమంతుడా ! నా రాముడు ఒంటరిగా యుద్ధము చేసి జ‌స్థానములో పదునాల్గువేలమంది రాక్షసులను యమసదనమునకు పంపవేసినాడు.

.

ఓయి హనుమంతుడా!

నా రాముడు శత్రుభయంకరుడు

నా రాముడు సకల గుణాభిరాముడు

నా రాముడు సర్వలోక మనోహరుడు

నా రాముడు పోతపోసిన ధర్మము

నా రాముడు నా మనోవీధులలో నిత్యసంచారి !

.

వూటుకూరు జానకిరామారావు 

.

నాదేశ ఔన్నత్యం!



               *నాదేశ ఔన్నత్యం!

                  ➖➖➖✍️


ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. 


ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. 


*కనీసం 20 సంవత్సరాలు  సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది.


*అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు….


*విలేకరి: 

ఇప్పటికీ అర్ధంకాని

విషయమేమిటంటే,

అమెరికాని ఓడించి యుద్దంలో

ఎలా గెలిచారు.


ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి

సమాధానం విని మనం 

చాలా గర్వంగ ఫీల్ అవుతాం.

అన్నీ దేశాలలోకెల్ల 

శక్తిశాలి అయిన అమెరికాని

ఓడించడానికి 

నేను మహామహుడు ,

శ్రేష్టమైన దేశభక్తిగల 

భారతీయ రాజు చరిత్రను

చదివాను.

అతని జీవనంనుండి 

ప్రేరణపొంది యుద్దనీతి ,

ఇతరత్రా ప్రయోగాలతో 

మేము యుద్దంలో గెలిచాము.


విలేకరి అడిగాడు: 

ఎవరా భారతీయ మహారాజు?


వియత్నాం అద్యక్షుడు 

నిలబడి గర్వంతో 

ఇలా సమాధానం చెప్పాడు.


”అతడే రాజస్తాన్లోని 

మేవాడ్ మహారాజు 

రాణా ప్రతాప్ సింహ్”

మహారాణా ప్రతాప్ సింహ్ 

పేరు చెప్పెటప్పుడు అతని

కళ్ళలో వీరత్వం నిండి 

వెలుగు ఉన్నది.


అలాగే ఇలా అన్నాడు


“ఒకవేళ అలాంటి రాజు 

మా దేశంలో జన్మించి ఉంటే

మేము ఈ ప్రపంచాన్నే

జయించేవారం.” 


కొన్ని రోజుల తరువాత

వియత్నాం అధ్యక్షుడు

చనిపోయాడు అయితే 

అతని సమాధి మీద 

ఇలా రాశి ఉంది 

“ఇది మహారాణా ప్రతాప్ 

యొక్క శిష్యుడిది” 

అని రాసి పెట్టారు.


కాలాంతరంలో 

వియత్నాం విదేశాంగమంత్రి

భారత పర్యటనకి

వచ్చాడు.

మహామహుల శ్రద్ధాంజలి

ఘటించడానికి 

మొదట గాంధీ సమాధి 

అతనికి చూపించారు. 

ఆ తరువాత ఎర్రకోట,

ఇంకా,ఇంకా ఇలా చూపించారు.

ఇవన్నీ చూపించేటప్పుడు 

ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు. 

“ మహారాణా ప్రతాప్ 

సమాధి ఎక్కడ?”.

ఇవన్నీ చూపిస్తున్న 

భారత అధికారి 

అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి

ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు.

విదేశాంగమంత్రి అక్కడనుండి

ఉదయ్ పూర్ వెళ్ళి 

సమాధిని దర్శించి అక్కడనుండి

పిడికెడు మట్టిని తీసుకొని 

అతని బ్యాగ్ లో

పెట్టుకున్నాడు.

ఇది చూసిన భారత అధికారి

మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి

కారణం అడిగాడు....

”ఇదే మట్టి దేశభక్తులైన

వీరపుత్రులను కన్నది, 

ఈ మట్టిని తీసుకెళ్లి 

మాదేశం మట్టిలో కలుపుతా. 

మా దేశంలో కూడా ఇలాంటి 

రాజు ప్రేరణతో దేశభక్తులు

జన్మిస్తారు. 

మహారాణా ఈ దేశమే కాదు

ప్రపంచమే గర్వించదగ్గ రాజు”

అని అన్నాడు. 


మహారాణా ప్రతాప్ సింహ్

గురించిన సమాచారం... 


పేరు-కుంవర్ ప్రతాప్ జి

(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)

జన్మదినం-9 మే,1540

జన్మభూమి-రాజస్థాన్ 

కుంబల్ ఘడ్

పుణ్యతిది-29 జనవరి,1597

తండ్రి – మహారాణా 

ఉదయ్ సింహ్ జి

తల్లి-రాణి జీవత్ కాంవర్ జి

రాజ్య సీమ-మేవాడ్

శాసన కాలం -1568-1597

(29 సంవత్సరాలు)

వంశం –సూర్యవంశం

రాజవంశం-సిసోడియ

రాజపుత్రులు

ధార్మికం-హిందూధర్మం

ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్

యుద్దం

రాజధాని-ఉదయ్ పూర్


ఇంకా తెలుసుకోవాల్సినవి- 

శ్రీ మహారాణా ప్రతాప్ దగ్గర

అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది.

దాని పేరు “చేతక్”.


అబ్రహాం లింకన్ భారతపర్యటన

నిమిత్తం భారత్ కి వచ్చేటప్పుడు

తన తల్లిని భారత్ నుండి ఏమి

తీసుకొనిరావాలి అని అడిగాడట.

దానికి అతని తల్లి 

“రాజస్థాన్లోని మేవాడ్ నుండి

పిడికెడు మట్టి తీసుకొనిరా ,

అక్కడి రాజు ఎంత విశ్వసపాత్రుడగా ఉండేవాడు

అంటే సగం భారత్ ను ఇస్తా 

అని ప్రలోభపెట్టినా 

తన రాజ్య సుఖ శాంతి

ప్రయోజనాలనే కోరుకొని తన

మాతృభూమినే కోరుకున్నాడు”

అని చెప్పిందట.

కానీ కొన్ని కారణాల రీత్యా 

అతని పర్యటన రద్దు అయ్యింది.

ఈ విషయాలు 

“బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ”లో చదువొచ్చు. 


*మహారాణా ప్రతాప సింహ్

యొక్క ఈటె 80 కిలోలు

ఉంటుంది.

చేతి కవచం,శరీర కవచం కలిసి

మరొక 80 కిలోలు ఉంటాయి.

అతని చేతిలోని కత్తితో కలిపి

మొత్తం 207 కిలోలు ఉంటాయి.

ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్

రాజవంశస్తుల

సంగ్రహణాలయంలో ఉన్నాయి.


డిల్లీ బాద్షాహ్ అయినటువంటి

అక్బర్ మహారాణా ప్రతాప్ ని

ఒకసారి తల దించి 

నా కాళ్ళ మీద పడితే సగం

హిందూస్థాన్కి రాజుని చేస్తా 

అని ప్రలోభపెట్టాడు 

కానీ మహారాణా ప్రతాప్ 

దాన్ని తుచ్ఛమైనదిగా

తిరస్కరించాడు.


*హల్దిఘాట్ యుద్దంలో

 మేవాడ్ సైన్యం 

20000 సైనికులతో ఉంటే 

అక్బర్ సైన్యం 85000 సైనికులతో

సమీకరించబడాయి. 


* మహారాణా ప్రతాప్ ఇష్టమైన

గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా

ఒక గుడిని కూడా కట్టారు ,

ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా

ఉంది.


* మహారాణా యుద్దంలో 

తన అభేద్యమైన దుర్గం లను

వదులుకున్నప్పటినుండి 

కంసాలి వాళ్ళు 

వేల సంఖ్యలో 

వాళ్ళ ఇళ్లను వదిలి 

రాణా కోసం ఆయుధాలు

తయారు చేసేవారు.

వాళ్ల దేశ భక్తికి తల వంచి

ప్రణమిల్లుదాం.


* హల్ది ఘాట్ యుద్దం జరిగిన 

300 సంవత్సరాల తరువాత

కూడా అక్కడి నేలలో 

కత్తులు లభించాయి. 

చివరి సారిగా 1985 లో 

ఒక ఆయుధం దొరికింది.


* మహారాణా ప్రతాప్ సింహ్ దగ్గర

యుద్ద శిక్షణ శ్రీ జైమల్ 

మేడతీయ ఇచ్చేవాడు. 

8000 మంది రాజపుత్రుల

వీరులతో కలిసి 60000 మంది

మొఘలులతో యుద్దం చేశారు.

ఆ ఆయుద్దంలో 48000 మంది

చనిపోయారు.

ఇందులో 8000 మంది

రాజపుత్రులు 

40000 మంది మొఘలులు. 


* మహారాణా 

ప్రతాప్ సింహ్

చనిపోయాక అక్బర్ కూడా

కన్నీళ్లు పెట్టుకున్నాడట.


* హల్ది ఘాట్ యుద్దంలో 

మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు

వారి యొక్క అభేద్యమైన

బాణాలతో మొఘలులతో

పోరాడారు .

వాళ్ళు మహారాణాను 

వారి పుత్రుడిగా

భావించేవారు.

మహారాణా కూడా వారిపట్ల

భేదభావం చూపించేవారు కాదు.

ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో

ఒకపక్క రాజపూత్ 

మరొక పక్క భీల్ ఉంటారు.


* రాణా గుర్రం అయిన చేతక్

మహారాణాను 26 అడుగుల

కందకాన్ని దుమికి దాటించి 

అది దాటిన

తరువాత చనిపోయింది.

అంతకంటే ముందే దానికి

ముందరి ఒక కాలు విరిగి

ఉన్నప్పటికి ఆ కందకాన్ని

దుమికింది.

అది ఎక్కడైయతే చనిపోయిందో

అక్కడే ఒక చింత చెట్టు

పెరిగింది.

అదే ప్రదేశంలో దాని 

గౌరవార్దం చేతక్ మందిరం

కట్టారు.


*చేతక్ ఎంత బలమైనదంటే

ఎదుట ఏనుగుమీద ఉన్న

సైనికుణ్ణి అందుకోవటానికి 

అంత ఎత్తులో గాలిలో

ఎగిరేది. అది కూడా 

మహారాణాతో పాటుగా. 


*మహారాణా చనిపోవడానికి

ముందు తాను కోల్పోయిన

వాటిలో 85% 

తిరిగి గెల్చుకున్నాడు.


*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క

బరువు 110 కిలోలు 

మరియు 

అతని పొడవు 7’5’’. 

ఇరువైపుల దారు ఉన్నటువంటి

కత్తి, 80 కిలోల ఈటె 

తనతో ఉంచుకునే వాడు.


*మిత్రులారా మహారాణా

ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు , 

అతనికి ఒక ఏనుగు కూడా

ఉండేది.

దాని పేరు రాంప్రసాద్.


*అల్ బదౌని అనే రచయిత

రాంప్రసాద్ ఏనుగు గురించి 

తన గ్రంధంలో రాసుకున్నాడు.


* అక్బర్ బాద్షాహ్ 

మేవాడ్ మీద

యుద్దం చేసేటప్పుడు 

తన సైన్యానికి ఏమని

ఆదేశించాడంటే.

మహారాణా ప్రతాప్ తోపాటుగా

రాంప్రసాద్ ఏనుగుని కూడా

బందీగా పట్టుకుంటే 

సరిపోద్ది అని చెప్పాడట.


* రాంప్రసాద్ ఎంత బలం

కలిగినదంటే ఒక్కత్తే 

మొఘలుల 13 ఏనుగులని

చంపిందట.

అలాగే దాన్ని పట్టుకోవడానికి 

7 పెద్ద ఏనుగులమీద 

14 మంది నైపుణ్యం కలిగిన

మావటిలు కూర్చుని 

ఒక చక్రవ్యూహం ప్రకారంగా 

దాన్ని బందీ చేశారట 

అని అల్ బదౌని 

తన రచనల్లో పేర్కొన్నాడు.


*బందీని చేసిన 

రాంప్రసాద్ ని

అక్బర్ ముందు నిలబెట్టగ 

దానికి పీర్ ప్రసాద్ అని

నామకరణం చేశాడు.

ఆ ఏనుగు ఎంత 

స్వామి భక్తి కలదంటే 

18 రోజులవరకు దాణా

తినకుండా,నీళ్ళు తాగకుండా 

తన ప్రాణాలు కోల్పోయింది.

తరువాత ఈ దృశ్యాన్ని చూసిన

అక్బర్ నేను ముందు 

ఈ ఏనుగునే వంచలేకపోయాను. మహారాణాను 

ఎలా వంచగలుగుతా 

అని అన్నాడట.


* మన దేశంలో 

మహారాణా ప్రతాప్ లాంటి

మహావీరులే కాదు

ఇలాంటి దేశభక్త

చేతక్,రాంప్రసాద్ లాంటి

జంతువులు కూడా

ఉన్నాయి.


నా భారతదేశం లో  పుడితే గుర్రం అయినా ఏనుగు అయినా చివరికి చీమైనా పవిత్రమైనదే......✍️

జై హింద్

జై భారత్

వందేమాతరం

🙏🙏🙏🙏🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

944065 2774.

లింక్ పంపుతాము.🙏

సీతారామాంజనేయ సంవాదము.* *ప్రథమాధ్యాయము* *భాగము - 9*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸





*శ్రీ రామచన్ద పరబ్రహ్మణే నమః*


*సీతారామాంజనేయ సంవాదము.*


*ప్రథమాధ్యాయము*


*భాగము - 9*



క.దివ్యము భవ్య మ్మగు మ

త్కావ్యము సంతతము మోక్షకాములచే శ్రో. తవ్యము వక్తవ్యము మం తవ్యము భావ్యమును గీర్తితవ్యముఁ గాదే.


తాత్పర్యము. 


జగత్కల్యాణ కాంక్షతో రచియింపదలబెట్టిన 

నా కావ్యం వినేవారికి వీనులవిందు, ఆనందమూర్తులకు ఆనందం, 


భక్తజనులకు ఆ పరమాత్మ దివ్యానుగ్రహము, సర్వ శుభములు చేకూర్చ "నా" పరబ్రహ్మను ప్రార్థిస్తున్నాను.



శా. సత్తామాత్రుఁడు నిర్వి శేషుఁడు తమా; సర్వేంద్రియప్రాణహృ చిత్తాహంకృతిధీ ప్రకావకుఁడు స; చ్చిత్తోషకాయుండు ని ద్వత్తాపాంధతమః ప్రదీపమయుఁ డా; త్మస్వామి భాసిల్లె శ్రీ దత్తాత్రేయ గురుం డనంగజగదం; తర్యామియై మున్నిలన్.


తాత్పర్యము. 


దత్తాత్రేయాదేశికానాం ప్రధమం పరికీర్తితః" అన్న వచనం ప్రకారం, శ్రీ దత్తులు గురువులకే గురువు విశ్వగురువు, లోక గురువు వారి కరుణను సదా నేను కోరుతున్నాను. 


అలాగే "నిత్య, సత్య, శాశ్వతుడు, సదానందుడు, చిదానందుడు లోక కల్యాణ కారకుడు, భక్తానుగ్రహాభీష్టుడు, 


తలచిన వారిని తలచిన క్షణమును కరుణించు కామ్యక ప్రదాత, సర్వగామి లోక రక్షణకై వెలసిన ఆ "అత్ర్యనసూయ పుత్రుడు - దత్తుడు, భక్తాభీష్టము లెల్ల నెరవేర్చుగాక!



*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

బసవ పురాణం - 4 వ భాగము

 🔱🐂 బసవ పురాణం - 4 వ భాగము 🐂🔱


🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏


👉 ఇలా క్రమముగా ఆమెకు తొమ్మిది నెలలూ నిండాయి.

అయితే లోపలనున్న నందీశ్వరుడు మాదాంబ గర్భ కుహరంలో సమాధిస్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోయాడు. *‘ఇదేమిటీ ఎంతకూ గర్భశిశువు భూమీదికి రావడంలేదు? ఆలాంటిది పూర్వం ఎన్నడన్నా కన్నామా? విన్నామా?* అని మిత్రులూ శత్రువులూ అంతా భయపడి పారిపోసాగారు. అయితే శిశువు మాత్రం కుండలీయోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాలు మాతృగర్భంలోనే ఉన్నాడు.

అప్పుడు మాదాంబ గర్భశిశువును మోయలేక దిగులుతో మళ్లీ నందికేశుని గుడికిపోయి *‘‘లోకంలో ఎవరైనా తొమ్మిది నెలలకే నీళ్ళాడుతారు. కానీ స్వామి మూడేళ్ళయింది దుర్భరమైన ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా వుంది. చాలు చాలు నీ వరాలు నాకిక గర్భమూవద్దు ఏమీ వద్దు’’* అని విన్నవించుకుంది.

మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకొనగా ఆమెకొక కలవచ్చింది. అందులో నందీశ్వరుడు జంగమ లింగవేషము ధరించి కన్పడి *‘‘మాదాంబా! నీ గర్భస్థశిశువు సామాన్యుడనుకున్నావా? పరమశివుని ఆజ్ఞ పై భూలోకానికి వస్తున్న 🐂నందికేశుడు. అది వృషభము, శిలాదుని పుత్రుడు, భక్తహితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు. ఇక దిగులు చెందకు. పుట్టిన వెంటనే శివువుకు 🙏🐂‘బసవ’డనే🙏 పేరు పెట్టు’’* అని చెప్పి అంతర్థానమైనాడు.

మాదాంబ మేలుకొని వచ్చిన కలను తలచుకొని *‘‘ఆహా సాక్షాత్తు నందికేశుడు స్వప్నంలో ప్రత్యక్షమైనాడు. నా జన్మ ధన్యమైంది’’* అని పరమానందపడింది. బంధు మిత్రులంతా ఇది విని ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువు నుద్దేశించి *"ఏమి నందికేశా వచ్చినపని మరచి లోపలే వున్నావు?’* అనగానే పద్మాసనస్థుడైన శిశువు పరమేశ్వరునికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయించాడు.

శిశువు పుడుతున్న సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్యరూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేశాడు. ఇలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధు మిత్రాదులంతా శిశువును చూస్తున్నారు. అప్పుడు భస్మరుద్రాక్షలు ధరించి రాగికుండలాలతో త్రిపుండరేఖలతో ఒక చేత యోగదండమూ మరొక చేత గొడుగు ధరించి పరమశివుడు తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదించాడు.

*‘‘ఎవరు స్వామీ తమరు?’’* అని అక్కడివారు ప్రశ్నింపగా *‘‘మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో వుంది. నా పేరు కూలి సంగమేశ్వరుడు, వెనకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు. లోకహితార్థమై నీకు జన్మించాడు. అందుకని చూడవచ్చాను. ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును. మాదాంబా ఈ బిడ్డకు లింగార్పితం కాని ప్రసాదం ఎన్నడూ తినిపించకు. ఇదే నా ఆజ్ఞ!* అని చెప్పి తాపసి అదృశ్యుడైనాడు.

అప్పుడు పురిటిగది వేయి సూర్యులు వెలిగినట్లు వెలిగింది. పొత్తిళ్ళలోని శిశువు దివ్య తేజస్సుతో ధగధగ వెలుగసాగాడు. అజ్ఞానమనే అంధకారం విజ్ఞానవంతుడైన ఈ శిశువువనే సూర్యునివల్ల పారద్రోలబడుతున్నదా అన్నట్లుగా ఆ కాంతి ప్రభలు గోచరించాయి. మాదాంబ, మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదోదకములతో పూజించి విభూతి విడెములిచ్చి అర్పించారు. అప్పుడు పంచమహావాద్యములు మ్రోగుతుండగా పుణ్యాత్ముడైన ఆ శిశువుకు *🐂‘బసవ’డని* పేరు పెట్టారు.

బసవన్న క్రమంగా పెరుగుతున్నాడు. వెనుక చీకటి వుంటే తనకేమి? అన్నట్లు తేజోమూర్తి బసవన్న పాపగా వున్నపుడు దీపాన్ని చూచి నవ్వేవాడు. లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లు తల్లి స్తన్యాన్ని స్వీకరించేవాడు. శివ సుఖామృతమును రెండు చేతులతో జుర్రుకుంటున్నట్లు పసిపాపడై చేతులు నాకుతూ వుండేవాడు. శివ పద ధ్యాన నిశేచష్టితావస్థలో ఉన్నట్లు దిగ్భ్రాంతుడై ఉండేవాడు. గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోలి విజృంభించినట్లు చేతులాడించసాగాడు. మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానీయనట్లు కాలు ఆడించేవాడు. తాను చేయవచ్చిన పనులకు ఆలస్యమయినట్లు ఉలిక్కిపడేవాడు. శివానందమగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారుస్తున్నట్లు కళ్ళ వెంట నీరు కార్చేవాడు.

జన్మదుఃఖంతో రోదించే జీవుల మొరలు వింటున్నాడా అన్నట్లు ఏదో వినేవాడు. శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడాన్నట్లు భూమిపై బోర్లాపడేవాడు. భూమిపై తగ్గిన నిర్మల శివభక్తి మళ్లీ తలెత్తుతున్నదా అన్నట్లు తల పైకెత్తేవాడు. పద్మాసన విధానం అభ్యిసిస్తున్నాడా అన్నట్లు కూర్చోవడం మొదలుపెట్టాడు. తానే ద్వితీయ శంభుండనని అనిపించేటట్లు నందివలె ఊగడం మొదలుపెట్టాడు. వీర మహేశ్వరాచారమంతా ఒక చోట మూర్త్భీవించినట్లు లేచి నిలబడ్డాడు.

సనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మీరకుండా నడుస్తున్నట్లు అడుగులు వేయడం శివనామం చెప్పినంతనే గద్గద స్వరంతో మాట్లాడేటట్లు త్రొక్కు పలుకులు పలుకసాగాడు, శివచిత్తులే శ్రేష్టులు అని చాటి చెప్పుతున్నట్లు పరుగెత్తుతూ ఆడడం నేర్చుకున్నాడు.


- ఇంకా ఉంది🙏🔱


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

అజనాభము

 *卐ॐ _-|¦¦|సుభాషితమ్|¦¦|-_ ॐ卐* 


🇮🇳 *ॐ _స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు_ 卐* 🇮🇳


శ్లో𝕝𝕝 పురా౭జనాభనామ్నాయం మహాన్ దేశః సువిశ్రుతః।

భరతైః పాలితః పశ్చాద్భవద్భారతాభిదః॥


*--- _కౌండిన్యస్మృతిః_ ---*


తా𝕝𝕝 గొప్పదైన ఈ దేశం పూర్వం *అజనాభము* అనే పేరుతో ప్రసిద్ధమైయుండేది. దీనిని భరతవంశీయులు పాలించడం చేత కాలంతరంలో దీనికి భారతదేశం అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది.....


*మనదేశానికి భారతదేశము అను పేరు రాకముందు _""అజనాభము""_ అను పేరు ఉండేది.*

భయపడవద్దు

 శ్లోకం:☝️

*న భేతవ్యం న బోద్ధవ్యం*

  *న శ్రావ్యం వాదినో వచః |*

*ఝటితి ప్రతివక్తవ్యం*

  *సభాసు విజిగీషుభిః ||*

- కలివిడంబనం (నీలకంఠ దీక్షితులు)


అన్వయం: *న బిభ్యతు న ధ్యాయన్తు న శృణ్వన్తు వాదినః వాక్యాని ఝటితి ఏవ ఉత్తరం ప్రదాతవ్యం యః సభాయాం జిగీషతి (జేతుమ్ ఇచ్ఛతి) |*


భావం: భయపడవద్దు, పట్టించుకోవద్దు మరియు వాది యొక్క (వాదించేవాడి) మాటలు వినవద్దు. సభలో గెలవాలని కోరుకునేవారు (ప్రతివాదులు) వెంటనే ప్రత్యుత్తరం ఇస్తారు.

పంచాంగం 15.08.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 15.08.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: చాతుర్దశి తిధి భౌమ వాసర: పుష్యమీ నక్షత్రం వ్యతీపాత యోగ:  శకుని తదుపరి చతుష్పాత్ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


చతుర్దశి పగలు 12:43 వరకు.

పుష్యమి మధ్యాహ్నం 01:58 వరకు.

సూర్యోదయం : 06:02

సూర్యాస్తమయం : 06:39

వర్జ్యం : రేపు తెల్లవారుఝామున 04:21 నుండి సూర్యోదయం వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:24 వరకు తిరిగి రాత్రి  11:12నుండి 11:58 వరకు. 


రాహుకాలం : మద్యాహ్నము  03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

బానిస రాజవంశం

 Forwarded : 


**🇳🇪 *బానిస రాజవంశం*

 1 = 1193 *ముహమ్మద్ ఘోరి*

 2 = 1206 *కుతుబుద్దీన్ ఐబాక్*

 3 = 1210 *అరామ్ షా*

 4 = 1211 *ఇల్టుట్మిష్*

 5 = 1236 *రుక్నుద్దీన్ ఫిరోజ్ షా*

 6 = 1236 *రజియా సుల్తాన్*

 7 = 1240 *ముయిజుద్దీన్ బహ్రమ్ షా*

 8 =1242 *అల్లావుద్దీన్ మసూద్ షా*

 9 = 1246 *నాసిరుద్దీన్ మెహమూద్*

 10 = 1266 *గియాసుడిన్ బల్బన్*

 11 = 1286 *కై ఖుష్రో*

 12 = 1287 *ముయిజుద్దీన్ కైకుబాద్*

 13 = 1290 *షాముద్దీన్ కామర్స్*

        1290 *బానిస రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)


 *ఖిల్జీ రాజవంశం*

 1 = 1290 జలాలుద్దీన్ *ఫిరోజ్ ఖిల్జీ*

 2 = 1296 *అల్లాదీన్ ఖిల్జీ*

 4 = 1316 *సహబుద్దీన్ ఒమర్ షా*

 5 = 1316 *కుతుబుద్దీన్ ముబారక్ షా*

 6 = 1320 *నాసిరుదిన్ ఖుస్రో షా*

 7 = 1320 *ఖిల్జీ* *రాజవంశం ముగిసింది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)


 *తుగ్లక్ రాజవంశం*

 1 = 1320 *గయాసుద్దీన్ తుగ్లక్ I*

 2 = 1325 *ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ*

 3 = 1351 *ఫిరోజ్ షా తుగ్లక్*

 4 = 1388 *గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ*

 5 = 1389 *అబూబకర్ షా*

 6 = 1389 *ముహమ్మద్ తుగ్లక్ మూడవ*

 7 = 1394 *సికందర్ షా మొదటి*

 8 = 1394 *నాసిరుదిన్ షా దుస్రా*

 9 = 1395 *నస్రత్ షా*

 10 = 1399 *నాసిరుద్దీన్ మహమ్మద్ షా*

వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 *డోలత్ షా*

 1414 *తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)


 *సయ్యిద్ రాజవంశం*

 1 = 1414 *ఖిజ్ర్ ఖాన్*

 2 = 1421 *ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ*

 3 = 1434 *ముహమ్మద్ షా నాల్గవ*

 4 = 1445 *అల్లావుద్దీన్ ఆలం షా*

 1451 *సయీద్* *రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)


 *అలోడి రాజవంశం*

 1 = 1451 *బహ్లోల్ లోడి*

 2 = 1489 *అలెగ్జాండర్ లోడి రెండవది*

 3 = 1517 *ఇబ్రహీం లోడి*

 1526 *లోడి రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)


 *మొఘల్ రాజవంశం*

 1 = 1526 *జహ్రుదిన్ బాబర్*

 2 = 1530 *హుమయూన్*

 1539 *మొఘల్ రాజవంశం సమయం ముగిసింది*


 *సూరి రాజవంశం*

 1 = 1539 *షేర్ షా సూరి*

 2 = 1545 *ఇస్లాం షా సూరి*

 3 = 1552 *మహమూద్ షా సూరి*

 4 = 1553 *ఇబ్రహీం సూరి*

 5 = 1554 *ఫిరుజ్ షా సూరి*

 6 = 1554 *ముబారక్ ఖాన్ సూరి*

 7 = 1555 *అలెగ్జాండర్ సూరి*

 *సూరి రాజవంశం ముగుస్తుంది,*

(పాలన -16 సంవత్సరాలు సుమారు)


 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*

 1 = 1555 *హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన* 

 2 = 1556 *జలాలుద్దీన్ అక్బర్*

 3 = 1605 *జహంగీర్ సలీం*

 4 = 1628 *షాజహాన్*

 5 = 1659 u *రంగజేబు*

 6 = 1707 *షా ఆలం మొదట*

 7 = 1712 *జహదర్ షా*

 8 = 1713 *ఫరూఖ్సియార్*

 9 = 1719 *రైఫుడు రజత్*

 10 = 1719 *రైఫుడ్ దౌలా*

 11 = 1719 *నెకుషియార్*

 12 = 1719 *మహమూద్ షా*

 13 = 1748 *అహ్మద్ షా*

 14 = 1754 *అలమ్‌గీర్*

 15 = 1759 *షా ఆలం*

 16 = 1806 *అక్బర్ షా*

 17 = 1837 *బహదూర్ షా జాఫర్*

 1857 *మొఘల్ రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)


 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*

 1 = 1858 *లార్డ్ క్యానింగ్*

 2 = 1862 *లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్*

 3 = 1864 *లార్డ్ జాహోన్ లోరెన్ష్*

 4 = 1869 *లార్డ్ రిచర్డ్ మాయో*

 5 = 1872 *లార్డ్ నార్త్‌బుక్*

 6 = 1876 *లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్*

 7 = 1880 *లార్డ్ జార్జ్ రిపోన్*

 8 = 1884 *లార్డ్ డఫెరిన్*

 9 = 1888 *లార్డ్ హన్నీ లాన్స్‌డన్*

 10 = 1894 *లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్*

 11 = 1899 *లార్డ్ జార్జ్ కర్జన్*

 12 = 1905 *లార్డ్ టివి గిల్బర్ట్ మింటో*

 13 = 1910 *లార్డ్ చార్లెస్ హార్డింగ్*

 14 = 1916 *లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్*

 15 = 1921 *లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్*

 16 = 1926 *లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్*

 17 = 1931 *లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్*

 18 = 1936 *లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో*

 19 = 1943 *లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్*

 20 = 1947 *లార్డ్ మౌంట్ బాటన్*


*బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.*


 *ఆజాద్ ఇండియా, ప్రధాని*

 1 = 1947 *జవహర్‌లాల్ నెహ్రూ*

 2 = 1964 *గుల్జారిలాల్ నందా*

 3 = 1964 *లాల్ బహదూర్ శాస్త్రి*

 4 = 1966 *గుల్జారిలాల్ నందా*

 5 = 1966 *ఇందిరా గాంధీ*

 6 = 1977 *మొరార్జీ దేశాయ్*

 7 = 1979 *చరణ్ సింగ్*

 8 = 1980 *ఇందిరా గాంధీ*

 9 = 1984 *రాజీవ్ గాంధీ*

 10 = 1989 *విశ్వనాథ్ ప్రతాప్సింగ్*

 11 = 1990 *చంద్రశేఖర్*

 12 = 1991 *పివి నరసింహారావు*

 13 = *అటల్ బిహారీ వాజ్‌పేయి*

 14 = 1996 *H.D. దేవగౌడ*

 15 = 1997 *ఐకె గుజ్రాల్*

 16 = 1998 AB *వాజ్‌పేయి*

 17 =2004 Dr. *మన్మోహన్ సింగ్*

*18 = 2014 నుండి నరేంద్ర మోడీ*

*764 సంవత్సరాల తరువాత,పరదేశీ మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.*


*సుమారు "800" సంవత్సరాలు భారతదశాన్ని మహమ్మదీయలు పరిపాలించారు.*

 

*ఇప్పుడు చెప్పండి ఎవరు మైనారిటీలు ?.*


*ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి...*


*మనం "1000" సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా దేశంగా మనుగడలో ఉన్నది.*

*మన భారతీయ సంస్కృతిని,ధర్మాన్ని అనుసరించి, కాపాడుకోవాలి, స్థిరంగా, దృఢంగా అభివృద్ధి సాధించాలి.*

 *చదువుకోండి చరిత్ర కోసం మరో పదిమందికి షేర్ చెయ్యండి,మిత్రులారా ఇది సేకరించి పంపించిన మహానుభావుడికి ఎంత సమయం పట్టిందో,ఆయన శ్రమ వృధా కాకూడదు.*

🙏🙏

నీలకంఠేశ్వరా

 నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం: యమకము:

Panchang