6, ఏప్రిల్ 2021, మంగళవారం

పక్షవాతం

 పక్షవాతం - వివరణ - ఔషధాలు . 


   పక్షవాతం అనగా శరీరం నందలి ఏదేని ఒక భాగం చచ్చుబడిపోవడం . సామాన్యముగా పక్షవాతంలో ఒక కాలు , ఒక చెయ్యి  కాని లేదా రెండుకాళ్లు గాని చచ్చుబడును . ఈ వ్యాధి రక్తపోటు అధికం అయినప్పుడు మెదడులోని నాడులు చచ్చుబడిపోయి మాటకూడా పడిపోవును . ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది కాని ప్రస్తుతం ఇది మానసిక ఒత్తిడుల వలన నలభై సంవత్సరాల వారికి కూడా వచ్చుచున్నది. ఒకసారి పక్షవాతం వచ్చినచో సరైన చికిత్స తీసుకున్నచో మూడు నుంచి ఆరు నెలల సమయంలో రోగి కోలుకొగలడు . 


  పక్షవాతం రావడానికి గల కారణాలు  - 


 *  రక్తపోటు .

 * మానసిక ఒత్తిడి . 

 * నాడి దౌర్బల్యము . 

 * అతి సంభోగము . 

 * అనిద్ర . 

 * అతి వ్యాయామము . బరువులు ఎత్తుట . 

 * అతిగా మాట్లాడుట . 

 * మద్యపానం , ధూమపానం . 


  పక్షవాతం లక్షణాలు  - 


 *  తల తిరగటం . 

 * కాలు , చెయ్యి  తిమ్మిర్లు . 

 * రక్తపోటు . 

 *  మెడ నరములు లాగడం . 

 *  నిద్రపట్టకపోవడం . 

 * నడవలేకపోవడం . 


  ఔషధయోగాలు  - 


 *  జాజికాయ నీటితో అరగదీసి చచ్చుబడిన అవయవానికి పట్టువేయవలెను . 


 *  కసవింద చెట్టు రసము నందు వెన్న కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయవలెను . 


 *  వెల్లుల్లి , పసుపు కలిపి నూరి మర్దించవలెను . 


 *  నువ్వులనూనెతో మిరియాల చూర్ణం కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయుచున్న పక్షవాతం తగ్గును. 


      మరిన్ని యోగాలు మరియు వ్యాధుల చికిత్సలు మరింత వివరంగా నేను రచించిన గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. వాటిని చదవగలరు . పాటించవలసిన ఆహార నియమాలు కూడా వివరణాత్మకంగా గ్రంథముల యందు లభ్యం అగును. 


    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మనమూ 🔱శంకరులమే!*

 🌹🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱🌹

🌸 *మనమూ 🔱శంకరులమే!*🌸

అవకాశం లభించాలే కాని మనం జ్ఞానులమని ఇతరులు గుర్తించాలనేలా ప్రవర్తిస్తాం. మౌలికంగా మనం తెలివి కలిగినవారమని మన నమ్మకం. ఇతరులు ఏదైనా చెబితే దాన్ని ఖండించేందుకు మాటలను అన్వేషిస్తాం. అవసరం లేని గర్వాన్ని పెంచుకుంటాం. దానితో అరిషడ్వర్గాలన్నీ మనలను ఆవహిస్తాయి. వీటితోపాటు అతిశయం అంతరంగంలోకి చేరుతుంది. ఈ ప్రపంచంలో తెలివి అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ చిన్న నిజాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలివితేటలంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని చర్వితచర్వణం చేయడమా?

అందులో మన సొంతం ఒక్కటీ ఉండదు. మన ప్రజ్ఞ ఎక్కడా ప్రస్ఫుటం కాదు. అన్నీ అరువు తెచ్చుకొన్నవే. మన సొంత జ్ఞానం ఏ పాటిదని మనం ఎందుకు విశ్లేషించుకోం? మనలో మౌలికత లేదు. క్రియాశీలత అంతంతమాత్రమే. *ఇది నా ఆలోచన, ఇది నా ప్రజ్ఞావిశేషం, ఇది నేను తెలుసుకొన్న సత్యం*- అని ఒక్కటంటే ఒక్కటి... చూపగలుగుతున్నామా? పైగా ఇతరులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ససేమిరా వినం.

సార్వత్రిక మత సమ్మేళనం అమెరికాలోని చికాగోలో జరిగినప్పుడు ఆ సభల్లో పాల్గొనడానికి భారత్‌ నుంచి వివేకానందుడు వెళ్లాడు. మహామహులందరూ అక్కడ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో తలలు పండినవాళ్లందరూ ఆ సభలో ఆసీనులయ్యారు. పేరు ప్రఖ్యాతులున్న ఆధ్యాత్మికవేత్త ఒకరు వివేకానందుడి వైపు చూసి కించిత్తు చులకన స్వరంతో 'నీకు ఏం తెలుసునని ఈ సభలకు వచ్చావ్‌. మేం చెప్పేది వినడానికా లేక నీవు మాకే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావా?' అని ప్రశ్నించాడు. వివేకానందుడు ఎంతో సౌమ్యంగా 'మహాశయా! మీరు చెప్పింది వినడానికి మాత్రమే ఉబలాట పడుతున్నాను' అన్నాడు. 'అదంత సులువు కాదు. ఈ సభలోని వక్తల మాటలు వినేందుకు అర్హత ఉండాలి. ముందు నీకేం తెలుసో మూడు నిమిషాల్లో మాకు వివరించగలవా' అని అతిశయంతో ప్రశ్నించాడు. వివేకానందుడు సరేనంటూ వేదికపైకి ఎక్కి 'నా ఆత్మీయులారా...' అంటూ ప్రారంభించిన ఉపన్యాసం గంటన్నరపాటు ధారాళంగా సాగింది. శ్రోతలందరూ సమ్మోహితులయ్యారు. సభలో అందరి కరతాళధ్వనుల మధ్య వివేకానందుడి ప్రసంగం ముగిసింది. ఆయన ఆధ్యాత్మికంగా ఆవిష్కరించుకొన్న సత్యాన్ని అలవోకగా తెలియజేశాడు. అదీ ఆయన ప్రజ్ఞావైభవం. మనిషి మానసం నిరంతర అన్వేషి. జ్ఞానం కోసం సదా వెతుకుతూనే ఉండాలి. మనసు అంటే ఏమిటి? అది పాత సామానులు నిలువచేసే గది కాదే! పుస్తకాలు చదివి పురాణాలు వినడం ద్వారా కలిగిన జ్ఞానం మన సొంతమా? కానే కాదు. ఈ జ్ఞానాన్ని మానసం అనే మూలగదిలో దాచి మన సొంతమని గర్వపడితే ఎలా? ఇదేనా మన విద్వత్తు? మన మనసులో కొత్తదనం ఉండాలి, మనలో జీవం ఉండాలి. మన హృదయాంతరాళాల్లో చైతన్యం వికసించాలి. మనసును శూన్యం చేసుకోవాలి. సరికొత్త జ్ఞానపరంపరం మనసులోకి చేరడానికి అవకాశం కలిగించాలి. గుప్పెడు మనసు అంటాం కాని, అంతులేని అలౌకిక జ్ఞానాన్ని అది తనలో ఇముడ్చుకుంటుంది. అదే స్వీయ ప్రజ్ఞ. అప్పుడే జీవి స్వతంత్రుడవుతాడు.

ఆదిశంకరాచార్యులను ఆయన శిష్యగణంలోని ఒకడైన కమలనాభుడు ఒక రోజు ప్రశ్నించాడు. 'స్వామీ! ఎందరికో ఎన్నో గొప్పగొప్ప విషయాలు చెబుతున్నారు. నాకు మాత్రం ఏదీ చెప్పడం లేదు' అని. అందుకు శ్రీ శంకర భగవత్పాదులు నవ్వుతూ 'ఎందరికో ఎన్నో చెబుతున్నానన్నావు... మరి నీవు వినడం లేదా? అంటే నీ మనసు ఖాళీగాలేదు. నిబ్బరం లేక అది ఉరకలు వేస్తున్నట్టుంది. ముందు నీ మనసును శూన్యంగా చేయి. నేను చెబుతున్నవన్నీ అందులోకి చేరుతాయి. అపుడు నీవు సైతం ప్రజ్ఞావంతుడవుతావు' అన్నారు.

జీవితం ఎన్నో సంవత్సరాల ప్రస్థానంలో అవసరమైనవీ అనవసరమైనవీ పోగుచేసుకొంటుంది. అవి కొండలుగా పేరుకుపోయి ఉన్నాయి మనలో. ఆ కొండ పేరే 'నేను' అనే మానసం. జన్మజన్మలుగా పేరుకుపోయిన అనవసరమైన చెత్త బరువు మోయలేక జీవచైతన్యం వెలవెలబోతోంది. ఆ బరువు నుంచి స్వేచ్ఛ పొందడమే మానవ జీవితానికి విముక్తి, పవిత్రత! జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరామా... *మనమూ ఆదిశంకరాచార్యులమే-*

🌹🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱🌹

శ్రీ రామ ధ్యాన శ్లోకాలు

 శ్రీ రామ ధ్యాన శ్లోకాలు 


🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱


రాబోయే శ్రీ రామ నవమి కి ప్రతి 

శ్రీ రామ భక్తుడు చదువుకోవాల్సిన 

శ్రీ రామ ధ్యాన శ్లోకాలు.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః


శ్రీరామ రామ రఘునందన రామ రామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ


శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి

శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే


మాతారామో మత్-పితా రామచంద్రః

స్వామీ రామో మత్-సఖా రామచంద్రః

సర్వస్వం మే రామచంద్రో దయాళుః

నాన్యం జానే నైవ న జానే


దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా

పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్


లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథం

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే


మనోజవం మారుత తుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శరణం ప్రపద్యే


కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం


భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం

తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్


రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే


జై శ్రీరామ్ 🙏🏻🌱🙏🏻


🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌱🌱🌱🧘‍♀️🧘‍♀️🧘‍♀️

51 పుస్తకాలు(PDF) ఒకేచోట

 *జీవిత చరిత్ర  సంబంధ 51 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

మహాపురుషుల జీవితములు-1,2,3 www.freegurukul.org/g/JeevithaCharitra-1


ఛత్రపతి శివాజీ www.freegurukul.org/g/JeevithaCharitra-2


బాబాసాహెబ్ అంబేద్కర్ www.freegurukul.org/g/JeevithaCharitra-3


ఆత్మ కథ -1,2 www.freegurukul.org/g/JeevithaCharitra-4


దివ్య పురుషులు www.freegurukul.org/g/JeevithaCharitra-5


నహుషుడు www.freegurukul.org/g/JeevithaCharitra-6


ఆదర్శ రత్నమాల www.freegurukul.org/g/JeevithaCharitra-7


ఆత్మయోగి సత్య కథ -1,2 www.freegurukul.org/g/JeevithaCharitra-8


ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-9


ప్రపంచమును మార్చిన మనుజులు www.freegurukul.org/g/JeevithaCharitra-10


చిరంజీవులు www.freegurukul.org/g/JeevithaCharitra-11


ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-12


వల్లభాయిపటేల్ www.freegurukul.org/g/JeevithaCharitra-13


రాజా రామమోహనరాయ్ జీవిత చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-14


మౌలానా అబుల్ కలాం ఆజాద్ www.freegurukul.org/g/JeevithaCharitra-15


శివాజీ చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-16


సోక్రటీస్ అమరవాణి www.freegurukul.org/g/JeevithaCharitra-17


మహనీయుల జీవితాల్లో మధుర ఘట్టాలు www.freegurukul.org/g/JeevithaCharitra-18


అల్లూరి సీతారామరాజు www.freegurukul.org/g/JeevithaCharitra-19


జాతీయనాయకులు - వీర నారీమణులు www.freegurukul.org/g/JeevithaCharitra-20


లాల్ భహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-21


గాంధీ తత్త్వం - గాంధీ దృక్పదం www.freegurukul.org/g/JeevithaCharitra-22


ఆచార్య వినోభా www.freegurukul.org/g/JeevithaCharitra-23


అరుణాచలం సారిస్  జీవితం -2 www.freegurukul.org/g/JeevithaCharitra-24


ప్రసిద్ధ విజ్ఞానులు www.freegurukul.org/g/JeevithaCharitra-25


బొమ్మల భగత్ సింగ్ www.freegurukul.org/g/JeevithaCharitra-26


నేతాజీ సుభాష్ చంద్ర బోష్ జీవిత గాధ www.freegurukul.org/g/JeevithaCharitra-27


అశోకుడు www.freegurukul.org/g/JeevithaCharitra-28


సుప్రసిద్దుల జీవిత విశేషాలు www.freegurukul.org/g/JeevithaCharitra-29


విశ్వ విఖ్యాత  భారతీయ విజ్ఞానవేత్తలు www.freegurukul.org/g/JeevithaCharitra-30


మహర్షి దయానందుని ఆదర్శ రాజము www.freegurukul.org/g/JeevithaCharitra-31


భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య www.freegurukul.org/g/JeevithaCharitra-32


మానవజీవితము గాంధీ మహాత్ముడు www.freegurukul.org/g/JeevithaCharitra-33


నా సత్యాన్వేషణము-సర్వేపల్లి రాధాకృష్ణ స్వీయ చరిత్ర www.freegurukul.org/g/JeevithaCharitra-34


సంఘ గంగోత్రి హెగ్డేవార్ www.freegurukul.org/g/JeevithaCharitra-35


ఆదర్శ భారతము www.freegurukul.org/g/JeevithaCharitra-36


మహర్షి దేవేంద్ర నాథ్ టాగోర్ www.freegurukul.org/g/JeevithaCharitra-37


గాంధీజీ తో ఒక వారం www.freegurukul.org/g/JeevithaCharitra-38


గాంధీజీ కథ www.freegurukul.org/g/JeevithaCharitra-39


మహారాణి అహల్యాబాయి www.freegurukul.org/g/JeevithaCharitra-40


గాంధీ హృదయము www.freegurukul.org/g/JeevithaCharitra-41


ఆంధ్ర వీరులు-2 www.freegurukul.org/g/JeevithaCharitra-42


ఎంపిక చేసిన మహాత్మా గాంధీ రచనలు-1 నుంచి 5 www.freegurukul.org/g/JeevithaCharitra-43


మోతీలాల్ ఘోష్ www.freegurukul.org/g/JeevithaCharitra-44


లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితము www.freegurukul.org/g/JeevithaCharitra-45


నేనెరిగిన మహాత్మ గాంధీ www.freegurukul.org/g/JeevithaCharitra-46


కులశేఖర మహీపాల చరిత్రము www.freegurukul.org/g/JeevithaCharitra-47


ఆచార్య రంగా జీవిత కథ www.freegurukul.org/g/JeevithaCharitra-48


ఈశ్వర చంద్ర విద్యా సాగర్ www.freegurukul.org/g/JeevithaCharitra-49


వీర జ్యోతి www.freegurukul.org/g/JeevithaCharitra-50


వైజ్ఞానిక రంగంలో ప్రతిభా మూర్తులు www.freegurukul.org/g/JeevithaCharitra-51


*To get this type of messages daily, join in WhatsApp group by below link*

  www.freegurukul.org/join

మొగలిచెర్ల

 *సన్నిధిలో శరణాగతి..*


"ప్రసాద్ గారూ రాబోయే శనివారం రాత్రి అన్నదానానికి దాతలు ఎవరైనా ఉన్నారా?..ఒకవేళ ఎవరూ లేకపోతే..మా కుటుంబానికి అవకాశం ఇవ్వండి.." అని దుర్గారావు గారు ఫోన్ లో అడిగారు.."వచ్చే శనివారం నాడు అన్నదానం చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారండీ..వాళ్ళది హైదరాబాద్..ఆరోజుకు వస్తామన్నారు..మీకు వీలయితే ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం రోజు అన్నదానం చేయండి.."అన్నాను..ఒక్కక్షణం ఆలోచించారు.."అలాకాదు ప్రసాద్ గారూ..శనివారం రోజు రాత్రికి ఎక్కువమంది భక్తులు వస్తారు..అందుకని అడిగాను..పోనీలేండి..ఆ పై శనివారం రాత్రికి..ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం కూడా మా తరఫునే అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాము..అందుకు అవకాశం ఇవ్వండి.." అన్నారు.."అలాగే దుర్గారావు గారు..ఆ రెండు పూటల అన్నదానం కొఱకు మీ పేరు నమోదు చేసుకుంటాను.." అన్నాను..


అనుకున్న విధంగానే దుర్గారావు గారు తమ కుటుంబం తో సహా శనివారం మధ్యాహ్నానికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజు సాయంత్రం శ్రీ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నారు..రాత్రికి అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భక్తులకు వడ్డన చేశారు..వారి కొఱకు ఒక గది ని మేము కేటాయించి ఉంచినాకూడా..పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాములు చేసిన అభిషేకము, ఇచ్చిన హారతులనూ శ్రద్ధగా చూసి..ఆ తరువాత శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చారు..కొద్దిసేపు మంటపం లో కూర్చున్నారు..

తరువాత నాదగ్గరకు వచ్చారు.."ప్రసాద్ గారూ..స్వామివారి సన్నిధిలో ఇలా అన్నదానం జరిపించాలని అనుకోవడానికి ఒక కారణం ఉన్నదండీ..మీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను.." అన్నారు.."నేనే అడగాలని అనుకుంటున్నాను..మీరే చెప్పాలని అనుకున్నారు..చెప్పండి.." అన్నాను..


"మా అమ్మాయి పోయిన సంవత్సరం మెడిసిన్ చదవడానికి ఎంసెట్ రాసిందండీ..మంచి రాంక్ వచ్చినా..ఫ్రీ సీట్ రాలేదండీ..అమ్మాయి బాగా నిరుత్సాహం చెందింది..సుమారు పది పదిహేను రోజులు ఏడుస్తూ కూర్చుంది..బాగా ఆశలు పెట్టుకున్నది..అలాంటిది ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది..అమ్మాయి అలా నిరుత్సాహం చెందేసరికి మేము బాగా బెంగ పెట్టుకున్నాము..ఏ దిక్కూ తోచలేదు..మీకు కాల్ చేసాము..మీకు గుర్తుండే వుంటుంది..అమ్మాయిని తీసుకొని ఇక్కడకు రండి..మూడురోజులు నిద్ర చేయండి..అన్నీ సర్దుకుంటాయి అని మీరు చెప్పారు..ముందు మేము సందేహించాము..స్వామివారి సన్నిధికి వచ్చినంతమాత్రాన అమ్మాయి మామూలుగా మారుతుందా అని..మళ్లీ మిమ్మల్ని ఆడిగాము..మేలు జరుగుతుంది అని మీరు అన్నారు..అయినా ఒకమూల సందేహం తోనే అమ్మాయిని తీసుకొని ఇక్కడకు వచ్చాము..బుధ, గురు, శుక్ర వారాలు ఇక్కడే ఉన్నాము..మొదటిరోజు గడిచేసరికి తనలో మార్పు కనపడింది..శనివారం నాడు మాలకొండకు వెళ్లి, మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని మా ఊరు వెళ్ళాము..స్వామివారి దయవల్ల అమ్మాయి కోలుకున్నదండీ..మామూలుగా ఉత్సాహంతో మమ్మల్ని పలకరించుకున్నది..స్వామివారి దయవల్ల మా అమ్మాయి మాకు దక్కింది అనుకున్నాము..మళ్లీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోమని మేము చెప్పాము..సరే అన్నది..ఈ సంవత్సరం కష్టపడింది..మెడిసిన్ లో సీటు వచ్చింది..తనకు ఫ్రీ సీటు వస్తే..స్వామివారి వద్ద అన్నదానం చేయిస్తామని అమ్మాయే మొక్కుకుంది..మాతో అదేమాట చెప్పింది..అందువల్ల మీతో మాట్లాడి ఈ ఏర్పాటు చేసుకున్నాము..సమస్య ఏదైనా శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి శరణాగతి చెందితే..తప్పకుండా దానిని పరిష్కరిస్తారు..ఒక్కటిమాత్రం నిజం ప్రసాద్ గారూ..స్వామివారిని నమ్మడమే కాకుండా..మన కృషి కూడా మనం చిత్తశుద్ధితో చేస్తే..ఫలితం తప్పకుండా వుంటుంది..మా విషయం లో ఋజువు అయింది..నిన్న ఇక్కడికి వచ్చాము..ఈరోజు, రేపు కూడా ఇక్కడే ఉంటాము..మళ్లీ మూడురోజులు నిద్ర చేసినట్లు అవుతుంది..మంగళవారం ఉదయం మా ఊరు వెళ్లిపోతాము.." అన్నారు..


చెప్పాలసింది అంతా దుర్గారావు గారు చెప్పేసారు..స్వామివారి కృప పొందే మార్గం కూడా ఆయన ద్వారా మాకు మళ్లీ స్వామివారు గుర్తుచేశారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).