14, సెప్టెంబర్ 2022, బుధవారం

భగందర వ్యాధి

 భగందర వ్యాధి ( Fistula ) గురించి సంపూర్ణ వివరణ  - 


   కొందరిలో ఆసనం వద్ద చిన్న గుల్ల ( కురుపు ) లేచి చీముపట్టి ఆ చీము బయటకి వెడలును . రోజులు గడుస్తున్న కొలది మలద్వారం పక్కన ఆసనం లోపలి వరకు చిన్న నాళము ఏర్పడును . ఇది కొంతకాలం తరువాత పైన మానినట్లు కనిపించినా లోపలి వైపు మానదు . వేడి చేయు పదార్ధాలు తినినప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి పుండు పగిలి రక్తం , చీము వస్తుంటుంది. ఈ దశలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది చాలా మొండి వ్యాధి . ఇది కాలం గడిస్తున్న కొలది ప్రమాదకరంగా మారును . 


               ఈ వ్యాధికి ప్రధాన కారణం మలబద్దకం , రక్త కాలుష్యము , సూక్ష్మ జీవులు . ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అల్లోపతి వైద్య విధానంలో ఈ వ్యాధికి ఔషధాలతో చికిత్స లేదు . సర్జరీ ఒక్కటే మార్గం . కాని నేను చాలా మంది రోగులలో గమనించిన విషయం సర్జరీ తరువాత కూడా కొంతకాలానికి మరలా సమస్య తిరగబెడుతుంది. బహుశా  సరైన ఆహారనియమాలు పాటించకపోవడం కూడా కారణం కావచ్చు . 


    ఆయుర్వేదం నందు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కలదు. శరీరం నందలి వ్యర్ధపదార్ధాలను బయటకి వెడలింపచేస్తూ సరైన ఔషధాలను ఇస్తూ చికిత్స చేయవలెను . ఈ వ్యాధి నందు ఔషధ సేవన ఎంత ముఖ్యమో ఆహారవిహారాదులు అంతే ముఖ్యము . ఈ సమస్య అత్యంత మొండివ్యాది. సరైన కాలంలో సరైన చికిత్స అందనిచో మలద్వారం పక్కన ఏర్పడిన కురుపు నుంచి చీము , రక్తం కూడ వచ్చును. ఇంతకు ముందు చెప్పినట్లు లొపలికి నాళంలా ఏర్పడి దాని ద్వారా కూడా మలం బయటకి వచ్చును. కావున వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయటకి రావడానికి ప్రయత్నించవలెను . 


          భగందర సమస్యతో ఇబ్బంది పడువారు నన్ను సంప్రదించగలరు.  


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                  అనువంశిక ఆయుర్వేదం 


                        9885030034