17, జనవరి 2021, ఆదివారం

కౌపీనము —— ప్రాశస్థ్యం

 కౌపీనము   ——   ప్రాశస్థ్యం KOWPEENAMU___PRASHASTYAM.


____________________________


“కౌపీనధారీ  ఖలు  భాగ్యవంతా’ .


____________________________


కౌపీనధారులు  అనగా యుగయుగాలలో  అనాదిగా ఋషి సంప్రదాయంలో వస్తున్న సదాచారము. యోగులు , మునులు,  ఋషులు, తపస్సులు, యతులు, ఉపద్రష్టులు, లాంటి మహానుభావులంతా ఈ కౌపీనము యొక్క విశిష్టత తెలుసుకొని. జపతపాదులు ఆచరించేవారు.


ఆ ఋషి సంప్రదాయంలో  వస్తున్న మనం ఆ కౌపీనము యెక్క విలువను తెలుసుకొని నడుచుకోవాలి.


ఈ కౌపీనాదారుల యొక్క భావము సదా వేదాంత విషయములనే స్మరించుచు , బిక్షాటనతో వచ్చినదానితో తృప్తి చెంది , శోకము లేని అంతకరణచే , చెట్టు నీడనే ఆశ్రయించుకొని ,  రెండు చేతులనే భోజనపాత్ర గా చేసుకొని, ధనధాన్యాదుల యెడల విముఖత చూపిస్తు, జితేంద్రియులై  ఆత్మానందమును పొంది, అహర్నిశములు బ్రహ్మానందమును పొందుతూ,  ఈ స్థూల దేహాత్మ  భావమును తొలగించుకొని బయట లోపల, సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరున్ని వీక్షించుచూ, పవిత్రమైన ఓంకారమును సదా స్మరించుచు,  (ఓం క్రతో స్మర కృతం  స్మర క్రతో స్మర కృతం ..) సదా గతాగతిలో  వుండి, అహం బ్రహ్మాస్మీ యై ఆ సదాశివుణ్ణి స్మరించుచు నలుదిశలు  తిరిగి , ఆ పరాత్పరునియొక్క లీలలు చవిచూస్తూ  లోక కళ్యాణార్థమయి కృషిచేసేవారు.


అలాంటి విలువైన  కౌపీనధారులు మీరు , జప తపాదులలో సరియైన పద్దతులలో జపాలు చేస్తూ కౌపీనమునకు వున్న విలువను కాపాడాలని కోరుకుంటున్నాము.


ఇది తన ఆకారానికి సరిపడు గుడ్డను తీసుకొని నీకు ఉపదేశం ఇచ్చు సందర్భములో చెప్పబడిన తీరుగా ధరించి జపమాచరించాలి.అంతేకాకుండా, scientifical  గా జపసంధర్భము గా  ఉష్ణము అధికముగా ఉత్పత్తి అయ్యి, ఆ ఊష్ణమే విధ్యుత్తు గా మారి   మన శరీరములోని వీర్యకణాలను భస్మముచేసి ఓజస్సు గాను, ఆ  ఓజస్సును   తేజస్సుగాను మార్చడానికి ఉపయోగ పడుతుంది. ఈ మహాత్తరమైన  ప్రక్రియ కౌపీన ధారణ ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది .


కౌపీనము నడుముకు చుట్టి ఎడమ తొడసంధి (mid ingunal point) వద్ధ  ”  బ్రహ్మముడి  ” వెయ్యాలి. ఈ ముడి సరిగ్గా టెస్టిస్( testis) లో నుంచి వీర్యము పెన్నీసుకు వెళ్ళే నాళము మీద వచ్చేటట్టుగా వెయ్యాలి . జపములో పుట్టిన ఉష్ణము వల్ల వీర్యము బొట్టు బొట్టు గా  నాళ్ళము ద్వారా వెల్లుచు అది భస్మము చేయబడుతుంది. ఈ విధముగా కట్టడములో  హెర్నియా  వ్యాధిని కూడా అరికట్టవచ్చు. రెండవ గుడ్డను బిగుతుగా వెనుకకు తీసుకొనవలెను. దీనినే కౌపీనము , బ్రహ్మముడి అందురు.


వేదాన్త వాక్యేషు సదా రమన్తో

బిక్షాన్న మాత్రేన చ తుష్ఠిమన్త :


అశోక మన్త: కరణే చరన్త :


కౌపీన వన్త ఖలు  భాగ్యవన్త :


భావము  :  సదా  వేదాంత వాక్యములను స్మరించుచు , బిక్షాటన వలన లభించినదానితో. తృప్తి చెందేవారు,  శోకము లేని అంత: కరణముతో చరించే కోపీనాధారులు (అదృష్టవంతులు) చాలా భాగ్యవంతులు.


మూలం తరో కేవల మాశ్రయన్త:

ఫాణిద్వయం భోక్తు                    మమన్త్ర యన్త:


కన్థామినా  శ్రీ మపి కుత్సయన్త:


కౌపీనవన్త ఖలు భాగ్యవన్త:


భావము  :  చెట్టునీడయే ఆశ్రయంగా చేసుకో్ని,   రెండు చేతులను  భోజన పాత్రగా చేసుకో్ని ఐశ్వర్యమనిన విముఖతతో ఉండే కౌపీనధారులు చాలా భాగ్యవంతులు.


స్వానన్ధ భావే పరితుష్ఠమన్త:

సుశాన్త సర్వేన్ధ్రియ  వ్రుత్తిమన్త:


అహర్నిశం బ్రహ్మసుఖే రమన్త:


కౌపీనవన్త  ఖలు  భాగ్యవన్త :


భావము :  ఆత్మానందం పొందిన పరితృప్తులు, జితేంద్రియులు, అహర్నిశము బ్రహ్మానందమున క్రీడించే కౌపీనధారులు చాల భాగ్యవంతులు.


దే హాది భావం పరివర్తయన్త :

స్వాత్మాన మాత్మ న్యవలోకయన్త:


నాన్తం న మద్యం న బహి: స్మరన్త :


కౌపీనవన్త ఖలు  భాగ్యవన్త:


భావము :  దేహాత్మ భావము తొలగించువారు,  ఆత్మను వీక్షించు వారు, బయట, లోపల, మధ్య గల  వస్తువుల ధ్యాస లేని కౌపీనాదారులు చాలా భాగ్యవంతులు.


బ్రహ్మక్షరం పావన ముచ్చరన్తో

బ్రహా హం స్మీతి  విభావ యన్త:


(పంచాక్షరం పావన ముచ్చరన్తో పతిం పశూనాం వ్రుది భావయన్త:)


భీక్షాశినో దిక్షు పరిభ్ర మన్త:


కౌపీన వన్త ఖలు  భాగ్యవన్త:


భావము:  పవిత్రమైన ఒంకార శబ్దమును ఉచ్చరించేవారు , అహం బ్రహ్మాస్మీ , అని భోదించువారు, పశుపతి నాధుణ్ణి సదా శివుణ్ణి ధ్యాన్నించేవారు, బిక్షాన్నము తినుచు నలు దిశలు  చరించే కౌపీనాధరులు అగు యతులే చాలా      భాగ్యవంతులు.


ఇప్పుడు మీరు కౌపీనము విలువలు ఎంతో  ఉత్త మమైనవని తెలిసి ఉంటుంది ఇది జప తీవ్రతతో అంతర్ముఖుడైనప్పుడు  బ్రహ్మ ముడిని విప్పినప్పుడు అతని మనసు స్థూలనికి రాగలదని మన ఆశ్రమ గురువులు తెలిపినారు.


NOTE:  ఈ విషయములన్ని ఆశ్రమ సాహిత్యములోను , మీ అనుభవాలలో మీ అందరికి  తెలుసు . మాకు తెలిసినంత వరకు తెలుపుతున్నాము.  ఇందులో        ఏమైన పొరపాట్లు వున్నచో తెలుపుతారని మనవి చేయుచున్నాము.

అరుదైన సంభాషణ

 *శ్రీ రామకృష్ణ పరమహంస & శ్రీ  స్వామి వివేకానంద మధ్య జరిగిన అరుదైన సంభాషణ*

🕉🌞🌎🌙🌟🚩


 *1. స్వామి వివేకానంద: - నా జీవితం చాలా తీవ్రతరమైపోతోంది, అసలు ఖాళీ సమయము దొరకడము లేదు !*


 *రామకృష్ణ పరమహంస: - పనుల కార్యాచరణలో మీకు బిజీగా ఉంటుంది. కానీ మీ ఉత్పాదకత పెరుగుతుంది !*


 

*2. స్వామి వివేకానంద: -  నా జీవితం ఎందుకు ఇంత క్లిష్టంగా మారింది?*


 *రామకృష్ణ పరమహంస: - మీరు మీ జీవితాన్ని జీవించండి ... విశ్లేషించడం మానేయండి .. అదే జీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది.*

 

 

*3. స్వామి వివేకానంద: -  మనం ఎందుకు నిరంతరం అసంతృప్తితో ఉంటున్నాము?*


 *రామకృష్ణ పరమహంస: - ఎపుడూ ఏదో ఒక కారణముతో విషయము గురించి చింతించడం మీకు అలవాటుగా మారింది.  అందుకే మీరు అసంతృప్తి తో (సంతోషంగా లేరు) ఉంటున్నారు !*

 

 

*4. స్వామి వివేకానంద: -  ఎందుకు మంచి వ్యక్తులే ఎప్పుడూ బాధలకు లోనవుతూ ఉంటారు ?*


 *రామకృష్ణ పరమహంస: -  వ్యక్తులందరూ పరీక్షలకు గురిఅవుతూనే ఉంటారు, తద్వారా వారి వ్యక్తిత్వ ఔన్నత్యం మెరుగవుతూ ఉంటుంది.  ఘర్షణ లేకుండా వజ్రాన్ని సాన పెట్టలేము.  అగ్ని లేకుండా బంగారాన్ని శుద్ధి చేయలేము. ఆ పరీక్షలు బాధలు కాదు; వారి జీవితంను మెరుగు పర్చేవే గానీ చేదు అనుభవాలు కావు !*


 

 *5. స్వామి వివేకానంద: - అలాంటి అనుభవాలు  ఉపయోగకరంగా ఉంటాయని  మీరనుకుంటారా?*


 *రామకృష్ణ పరమహంస: -    అవును ...  ప్రతి పరీక్ష  ఒక స్వీయ అనుభవం మరియూ ఒక గురువు.  అది మొదట కఠినమైనదిగా అనిపించినా తరువాత పాఠాలను ఇస్తుంది.*



 *6. స్వామి వివేకానంద: - చాలా సమస్యలు ఉన్నందున, మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియడము లేదు …*


 *రామకృష్ణ పరమహంస: - బహిర్గత దృష్టితో చూస్తే మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలియదు.  లోపలకి చూడండి.  మీ కళ్ళు సరి అయిన దృష్టిని అందిస్తాయి, గుండె మార్గం అందిస్తుంది.*



 *7. స్వామి వివేకానంద: - సరైన దిశలో వెళ్ళడం కంటే వైఫల్యం ఎక్కువ బాధ కలిగిస్తుందా?*


*రామకృష్ణ పరమహంస:- "విజయం" అనేది ఇతరులు మీగురించి నిర్ణయించే ఒక కొలమానం.  సంతృప్తి అనేది మీకు మీరు నిర్ణయించుకునే కొలబద్ద.*



 *8. స్వామి వివేకానంద: - కఠినమైన సమయాల్లో, మీరు ఎలా ప్రేరేపించ బడతారు?*


 *రామకృష్ణ పరమహంస: - మీరు ఎంత దూరం వెళ్ళాలో కాకుండా మీరు ఎంత దూరం ముందుకు వచ్చారో ఎల్లప్పుడూ సరిచూసికోండి.  మీరు పొందిన ఆశీస్సులను ఎల్లప్పుడూ లెక్కించండి, మీరు పోగొట్టుకున్నవి కాదు.*



 *9. స్వామి వివేకానంద: - ప్రజల గురించి మీకు ఆశ్చర్యం ఏమిటి?*


*రామకృష్ణ పరమహంస: - వారు బాధపడుతున్నప్పుడు వారు “ఎందుకు నేనే ...?” అని అడుగుతారు.  వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు “నేనే ఎందుకు?” అని ఎప్పుడూ అడగరు.*


 

*10. స్వామి వివేకానంద: - నేను జీవితంలో ఉత్తమమైనదాన్ని ఎలా పొందగలను?*


*రామకృష్ణ పరమహంస: - మీ గతాన్ని విచారం లేకుండా ఎదుర్కోండి.  మీ వర్తమానాన్ని విశ్వాసంతో నిర్వహించండి.  భయం లేకుండా భవిష్యత్తు కోసం సిద్ధ పడండి.*



 *11. స్వామి వివేకానంద: - చివరి ప్రశ్న.  కొన్నిసార్లు నా ప్రార్థనలకు సమాధానం లభించదని నేను భావిస్తున్నాను.*


*రామకృష్ణ పరమహంస:- జవాబు లేని ప్రార్థనలు ఏవీ లేవు.  జీవితం పరిష్కరించడానికి ఒక రహస్యం, పరిష్కరించడానికి సమస్య కాదు.* 



*విశ్వాసం కలిగి ఉండి భయాన్ని వదలండి. నన్ను నమ్మండి.  ఎలా జీవించాలో తెలిస్తే జీవితం అద్భుతమైనది.*


🕉🌞🌎🌙🌟🚩

మనసు రహస్యం

 _*🧘‍♂️మనసు రహస్యం🧘‍♀️*_

🕉️🌞🌏🌙🌟🚩


*_✨ఆలోచనలను జయించి మనసును గెలవడమే నేటి అశ్వమేధం⚡_*



*_✨వైద్య పరీక్షలకు అందనిది, మనిషికి అత్యంత విలువైనది- మనసు.⚡_*



*_జీవరాశులన్నింటిలో మనిషికి ప్రత్యేక ప్రాముఖ్యం కలిగించింది మనసే. శారీరక ధర్మాలన్నీ సృష్టిలోని జీవరాశులన్నింటికీ సమానమే. మానసిక స్థితి మనిషికే సొంతం.⚡_*



*_✨కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు... ఇరవై తత్వాలను నడిపించే శక్తికారకం మనసు.⚡_*

 


*_✨అంతఃకరణాలు నాలుగు- మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసే మిగిలిన మూడింటినీ శాసిస్తుంది. దయ, జాలి, కరుణ, ప్రేమ వంటి సాత్విక గుణాలతో ప్రవర్తించే మనిషిని మనసున్న మనిషి అంటారు. పశుభావాలు కలిగిన వారిని రెండుకాళ్ల జంతువుగా, రాక్షసగుణాలు ప్రస్ఫుటమయ్యే వారిని రాక్షసులుగా గుర్తిస్తారు. పశుగుణాలు వీడి పశుపతి కావడమే మానవత్వ లక్షణం.⚡_*



*_✨మనసు చాలా సున్నితమైంది. పరిస్థితులు విషమిస్తే అదే కఠిన శిలలా మారుతుంది. ప్రతి చిన్న విషయానికీ స్పందించే గుణం మనసుదే. మానసిక స్థితిని అనుసరించే శారీరక ఆరోగ్యం ఉంటుంది. మనసు, మాట, క్రియ- ఒక్కటిగా ఉంటే... మహాత్ముడిగా కీర్తిస్తారు. వేరువేరుగా మారితే దురాత్ముడిగా పేర్కొంటారు._⚡*



*_✨మనసు ఆలోచనల సమూహం. పడుగు పేకలాగా నిలువూ అడ్డంగా అల్లుకొనిపోయి అశాంతికి గురిచేస్తాయి ఆలోచనలు. వాటి హద్దు మీరితే మనిషి భయానికి, ఆందోళనకు గురిఅవుతాడు.⚡_*



*_✨మనసును నిర్మలంగా ప్రశాంతంగా నిలుపుకొనే ప్రయత్నమే లలితకళల అభ్యాసం. మంచి సంగీతం, ఆహ్లాదపరచే ప్రకృతి దృశ్యాలు, ఉత్తేజపరచే సద్గ్రంథాలు, నాట్యం, శిల్పం... ఎన్నోరీతుల కళలు మనసుకు పరవశాన్ని కలిగిస్తాయి.⚡_*



*_✨పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, విహారయాత్రల లక్ష్యం- మనసుకు ప్రశాంతత కలిగించడమే. వనవాస దీక్షలో సీతారాములు దండకారణ్యంలో మునుల సాంగత్యంతో, గోదావరీ తట విహారాలతో అయోధ్యనే మరిచిపోయారు.⚡_*

 


*_✨నిత్యజీవితంలోని కష్టాలు, బాధలు, యాంత్రిక జీవనం... కలవరపరచి మనసును కుంగదీస్తాయి. పురాణగ్రంథాల పఠనం, ఆధ్యాత్మిక ప్రవచనాల శ్రవణం, ఆహ్లాదపరచే చిత్రాలు, హాస్యకథనాలు... మనసుకు ఊరటనిస్తాయి.⚡_*



*_✨పూర్వం రాజులు అశ్వమేధయాగాలు చేసి తోటి రాజులను అందరినీ జయించేవారు. మనసును గుర్రంతో పోలుస్తారు. క్షణకాలమైనా తన శరీరాన్ని కదిలించకుండా ఉండలేదు గుర్రం. అదేవిధంగా ఆలోచన లేకుండా నిమిషమైనా గడపలేదు మనసు. ఆలోచనలను జయించి మనసును గెలవడమే నేటి అశ్వమేధం.⚡_*



*_✨వెన్నెలవంటి హృదయం, వెన్న వంటి మనసును ఎవరైనా కోరుకుంటారు. వెన్నెలవంటి చల్లదనం, తెల్లదనం ఇచ్చే చంద్రుడితో మనసును పోలుస్తారు. క్షీరసాగరం నుంచి పుట్టిన చంద్రుడు శివుడి శిరస్సుపై నిలిచాడు. కష్టాల కడలినుంచి బయటపడే నిర్మల హృదయుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. మనసు అద్దంలాంటిది. బింబాన్ని బట్టే ప్రతిబింబం. మనిషి తన గుణాలను మనసు ద్వారా ప్రతిబింబిస్తాడు. వాటి ఫలితమే శారీరక కర్మలు.⚡_*



*_✨ఉత్తమ మానసిక స్థితి మనిషిని ఉన్నతుడిగా మలుస్తుంది. చరిత్రలో శాశ్వతస్థానం కలిగిస్తుంది. ధ్యానం, యోగక్రియలు మనసును జయించగల సాధనాలు. మనసు రహస్యం తెలుసుకున్న మనిషి దైవత్వస్థితి పొందుతాడు !⚡_*


🕉️🌞🌏🌙🌟🚩

ఉత్తరాయణ

 *ఉత్తరాయణ పుణ్యకాలం*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️





*"సరతి చరతీతి సూర్యః"*  అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. *"ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత"*  అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. *"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం.* సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. *జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం"సంక్రాంతి"ని* ఇలా నిర్వచించింది. *"తత్ర మేషాదిషు ద్వాదశ*

*రాశి క్రమణేషు* *సంచరితఃసూర్యస్య పూర్వన్మాద్రాశేఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"* మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది. *"రవి సంక్రమణే ప్రాపే నన్నా యాద్యన్తు మానవఃసప్త జన్మసు రోగీ స్యానిర్దేనశే్చన జాయతే"* అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే , రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా , దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి , దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ , ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు..  ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ , ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ , సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ , ముఖ్యం గా  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ , ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.


సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని , వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని , ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

 

ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా , ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం , ఫలాలు , విసనకర్ర, వస్త్రం , కాయగూరలు , దుంపలు , నువ్వులు , చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.


*"సంక్రాంతి వైభవం"*



సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని *"ఉత్తరాయణ పుణ్యకాలం"గా* పరిగణించిన సనాతన సిద్ధాంతంలో..  ప్రకృతి పరిశీలన , దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి , కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన , శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి , సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

*"తిల సంక్రాంతి"గా* కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి , పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని , మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను , ఆనందాన్ని కుటుంబంతో , సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు , మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 


రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా , చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం , దానం , పితృతర్పణం , జపతపాలు , దేవతార్చనలు - సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు , తల్లిదండ్రులు , సాటి మనుషులు , ప్రకృతి పట్ల కృతజ్ఞతను , ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి , ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా - మంచి వృష్టిని , ఆరోగ్యాన్ని , సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం , నువ్వుల నూనె దీపం , బియ్యం కలిపిన తిలలతో పూజ , తిలలతో కూడిన పదార్థాల నివేదన - శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక - ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా - యమునా - సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.


ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో , స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం , శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా ; శోభను , శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక , పంటల శోభ , సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు , సంప్రదాయసిద్ధమైన కళలు , ఉత్సాహాల ఉత్సవాలు , బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు !

భోగి పండ్లు గూర్చి

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*భోగి పండ్లు గూర్చి వివరణ తెలుసుకుందాం*

☘☘☘☘☘☘☘☘

*రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.! అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు భోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*భోగిపళ్ళు: భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కనుమ పండగ

 *🚩కనుమ పండగ ... “పశువుల పండుగ”🚩*_


🕉🐂🕉🐂🕉🐂🕉🐂🕉🐂🕉


కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


*పశువుల పండుగ*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.  ఆ ప్రత్యేకత ఏమిటంటే? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషద మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దుష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే ... మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని "ఉప్పు చెక్క'' అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులొ ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు, వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి, చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలొ వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని ''పొలి''అంటారు. ఆ "పొలి"ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ప్రతి ఫలం*

 *ప్రతి ఫలం*


తండ్రీ కొడుకులు కలసి వ్యవసాయం చేసేవారు.

అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు. అర్ద రాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే, బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు.

తండ్రి పద్దతులు కొడుకు సూరికి నచ్చేవి కావు.

"ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడతావు? మనకు అవసరం  పడితే ఒక్కడూ ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడూ బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారికోసం పాటుబడటం శుద్ధ దండగ" అని కోపగించుకునేవాడు.


కొడుకు మాటలకు నొచ్చుకుంటూ "ప్రతిఫలం ఆశించి చేసేది సహాయం అనిపించుకోదు." అని సర్ది చెప్పేవాడు.


ఓరోజు సూరి పొలం వెళ్ళే సరికి, ఎవరివో పశువులు తమ పొలం లో పడి మేస్తున్నాయి.

పక్కపొలం  సుబ్బయ్య చూచీ చూడనట్టు వున్నాడు. వళ్ళు మండి తనే తరుము కున్నాడు .


నాలుగు రోజుల తరువాత పంపు విరిగి సుబ్బయ్య పండిన చేలోకి నీరు పోసాగాయి.

అది చూసిన తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు.


మొన్న జరిగింది చెప్పాడు.

"ఎవడి పాపాన వాడు పోతాడు. కోత కొచ్చిన పంట తడిచిపోతే ,పాడయిపోతుంది చూస్తూ వుంటే వాడికి మనకు తేడా ఏముంది?" కోపంగా అన్నాడు.


తండ్రి చెప్పినట్టే చేశాడు.

ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి , ఇంటికి చేర్చాడు సూరి.

ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు.

ఎద్దుల గంగ డోలు నిమురుతూ"నాన్నా! ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే, రెండు చక్రాలు గుంటలో ఇరుక్కు పోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాడి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. తనకలాడు తున్నాయి. నేనొక్కడినే ఉన్నాను ఏం చేయాలో పాలుపోలేదు.

అంతలో ఆ దారిన పోతున్న పెళ్ళి బృందం, గబగబా వచ్చి,ఎద్దులను పట్టుకుని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈ రోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి.


"చూశావా!భగవంతుడు ఎంత సహాయం చేశాడో! నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువు ఎవరికి మంచి చేసినా, దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్ళి వారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతి ఫలం ఆశించక పదిమందికి సాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది."

ఇంతకాలం మొండిగా వాదించి నందుకు  తండ్రి ని మన్నించమని కోరాడు మన సూరి.

జంజం కోదండ రామయ్య

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*సుమిత్ర*


 

సుమిత్ర రామాయణంలో దశరథుని భార్య. కాశీరాజ్యపు రాకుమారి. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈమె కుమారుడైనందున లక్ష్మణుని "సౌమిత్రి" అంటారు.


రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కనిపిస్తాయి. వనవాసానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమెవద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో - "నాయనా, నువ్వు అడవులలో ఉండడానికే పుట్టావు. అన్నా వదినలకు ఏమీ ఆపద కలుగకుండా కాపాడుకో. వారే నీ తల్లిదండ్రులు. సుఖంగా వెళ్ళిరా " అని ఆశీర్వదించి పంపింది.


బిడ్డల వనవాసగమనం వల్ల దుఃఖిస్తున్న కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. తండ్రిని సత్యవాదిని చేయడానికే రాముడు అడవులకు వెళ్ళాడని. ముల్లోకాలలోనూ గొప్పవాడైన రాముడు తప్పక తిరిగి వచ్చి తల్లి పాదాలు సేవిస్తాడని అనునయించింది.

తెలివిగల పావురాలు

 *✍🏼 నేటి కథ ✍🏼*



*🐦🐦తెలివిగల పావురాలు🦅*



ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ అవి ఐకమత్యంగా ఉండేవికావు. అవి ఒక్కొక్కటీ వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది.

రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు, భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి.

"మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం" అంది ఒక పావురం.

ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కూడా కష్టమైంది.

ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. "నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. మీతో స్నేహం చేయడానికి వచ్చ్హాను" అంది.


ముందు పావురాలు నమ్మకపోయినా, రెండు రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. మూడవ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, "మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. కాని మీకో నాయకుదు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉండవచ్చు" అంది.


పావురాలలో ఎవరు నాయకుడుగా ఉండాలో వాటికి అర్ధం కాలేదు. అంతలో గ్రద్ద, "మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను" అంది. "అలాగే" అన్నాయి పావురాలు. "అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మేరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి" అంది గ్రద్ద.


పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్ధమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

తామరాకు మీద నీటిబొట్టు

 *తామరాకు మీద నీటిబొట్టు*


భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడితో ‘కర్మను చేయడంలోనే నీకు అధికారం... ఫలంపై లేదు. కర్మఫలానికి నువ్వు కారణం కారాదు. అలాగని కర్మల్ని చేయడం మానవద్దు’ అని బోధిస్తాడు.


అందుకే మన పెద్దలు తామరాకు మీద నీటిబొట్టులా మనిషి మసలుకోవాలని, కర్మకు బద్ధుడు కాకూడదని హితవు చెబుతారు. తామరాకుపై నీటిబొట్టు తామరాకును అంటుకోదు, పట్టుకోదు. అలాగే మనిషీ నిష్కామ బుద్ధితో, నిస్వార్థ బుద్ధితో కర్మలు నిర్వర్తించాలి.


కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యత ఉండాలి తప్ప బంధం, ఆశ పనికిరావు. బాధ్యతతో సక్రమంగా కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు ఆ పరిపూర్ణత తప్పక తృప్తినిస్తుంది. కర్మఫలాలపై మనకెలాంటి అధికారం లేదు. కాబట్టి వాటిని భక్తితో, వినయంగా పరమాత్మకు అర్పించాలి.


కర్మబంధం వదిలించుకోవడానికి కర్మాచరణను మాననవసరం లేదు, ఫలాపేక్షను వదిలి నిస్సంగంగా విధ్యుక్త కర్మను ఆచరించు- అని గీతాచార్యుడు బోధిస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి బోధనలు విన్న అర్జునుడు కర్మను వదిలేయలేదు. ఉత్సాహంగా గాండీవాన్ని చేపట్టాడు. విజయుడయ్యాడు.


‘గృహస్థుగా కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకు మీద నీటిబొట్టులా, నీటిమీద పయనిస్తున్న నావలా మసలుకునే వ్యక్తికి సంసారమనే బురద అంటదు. ఆ వ్యక్తి జీవన్ముక్తుడే’ అంటారు సద్గురువులు. దేహాభిమానం వదిలేసి వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవడం వల్లే జనకుడు, నిష్కామ కర్మ ద్వారా అంబరీషుడు... ముక్తిని పొందారు.


మనం ఆచరించే సత్కర్మలు సత్ఫలితాన్ని, దుష్కర్మలు దుష్ఫలితాల్నీ ఇస్తాయి. అవి ఎప్పుడు ఎలా అందాలని ఆ భగవంతుడు నిర్దేశిస్తాడో అలాగే అందుతాయి. వాటికై ఎదురుచూడకూడదు. ఫలాపేక్ష విషయంలో ఎంత విరక్తి చూపగలిగితే కర్మను అంత సమర్థంగా, ప్రశాంతంగా ఆచరించగలుగుతాం.


తామరాకు మీద నీటి బిందువులెన్ని పడినా ఆకు తడవదు. అలాగే కష్టాలు ఎన్ని వచ్చినా మనిషి చలించరాదని పెద్దల మాట. ఇది చెప్పినంత తేలిక కాదు కదా అనిపిస్తుంది.  పురాణ పురుషులే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. శ్రీరాముడు సతీవియోగాన్ని తట్టుకోలేకపోయాడు. వేదవ్యాసుడు పుత్రశోకాన్ని భరించలేకపోయాడు. రావణబ్రహ్మ తన కుమారుల మరణానికి ఎంతగానో కుంగిపోయాడు. కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం అనివార్యం. కాని దుఃఖ వివశత్వంతో మనల్ని మనం కోల్పోకూడదు. సుఖం ప్రతి ఒక్కరికీ సంతోషదాయకమే. కాని అది శాశ్వతమనే భ్రమలో పడకూడదు. ఈ సుఖదుఃఖాలకు అతీతంగా ఉండాలంటే మనిషి నిశ్చల మనస్కుడు కావాలి.


నిశ్చల మనస్తత్వం కలిగిన మనిషి నిందలకు భయపడడు. పొగడ్తలకు పొంగిపోకుండా అన్నింటినీ సమభావనతో చూస్తాడు. ఆ మనిషికి శోకం, సంతోషం ఉండవు. ఏ విపత్తు సంభవించబోతున్నదోనన్న భయం బాధించదు. ఆ మనిషి ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంతో ఎదుర్కొంటాడు. ఆత్మతత్త్వం అలవరచుకుని ఆత్మజ్ఞానిలా ప్రకాశిస్తాడు. ఎల్లప్పుడూ తన మనసును, బుద్ధిని అంతర్యామిపై లగ్నం చేస్తాడు. సత్యనిష్ఠతో ముందుకు సాగి జీవితాన్ని తపస్సులా మార్చుకుంటాడు!

- విశ్వనాథ రమ

కాకి పిండం

 కాకి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ..

ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.


"పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?" ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు.


"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం" అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు...చెప్పారు పంతులుగారు.


"లేదు కాకి వచ్చిముడుతేనే  ఆత్మశాంతి కలిగినట్లు!

అప్పటివరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు. వేచి చూడవలసిందే!!" ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ.

ఆమె చనిపోయిన వ్యక్తి తరుపున వచ్చిన ఏకైక బంధువు.అతని పెద్దమ్మ కూతురు.


మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరుపు బంధువులు


"ఇంకెక్కడి కాకులు! కాకులు కనిపిస్తున్నాయా అసలు!! కాకులన్నీ లోకులై పుడుతేనూ!!" జోక్ చేశారు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు  నవ్వారు.


సమయం కానీ సమయంలో జోక్ చేసిన వాళ్ళ వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ.


"అబ్బా! ఈ ముసలాడు బతికి ఉన్నన్నినాళ్ళు సాధించాడు..చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు" అన్నాడు కర్మకాండ చేస్తున్నవ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ.


"అవును" అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు.. తన మామ అన్న మాటలకు..


ఈ మమాఅల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడకి బాగా కోపమొచ్చింది..


చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం.పేదరికంలో పుట్టినా కష్టపడి పైకివచ్చాడు. కొడుకు 10వతరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లిచేసుకోలేదు.కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల ..కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు.కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు.3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తనదగ్గరే ఉంచుకున్నాడు కొడుకు.


కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు.

తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తివచ్చింది.

తిరిగివచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డకుడు(తోడల్లుడు).


"లేదు!ఇలా మంచంమీదనే ఉండేవాళ్ళని తీసుకోరు! అదీగాక, ఇతరుల దృష్టిలో కూడా బావుండదు! "అంది భార్య.


చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒకరూంకు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజులవరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కు బయలుదేరారు.


ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని, అదే రోజు రాత్రి తెల్లరేటప్పుడు గుండెపోటుతో మరణించాడు. 


టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది.అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు.అంత్యక్రియలకు ఊరుఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు.


"బతికిఉన్నన్నినాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా??మీ నాన్నా!!" అడిగింది పెద్దావిడ.


"నీకేం తెలుసే అత్తమ్మా! 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో!!


ఈ ఆరునెలల నుండి మరీనూ!! అన్నీ మంచం మీదే!!

వాటికోసం పెద్దజీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది.

వాడు రాత్రికి ఉండడు కదా!..రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది!" అన్నాడు కొడుకు సమాధానంగా...


"అదొక్కటేనా!!!!

చాలా రాత్రివరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు..తొందరగా వదిలిపెట్టేవాడు కాదు!!" చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్ గా!!


" ఓహో అంతేనా!

నీకు చిన్నప్పుడు రెండు  సంవత్సరాల పాటు ఆల్బమినో..గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫీట్స్ వస్తుంటే..సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవచేస్తూనే ఉన్నాడే!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిచోసుకోరా!! అంటూ మేమెంత పోరినా "వచ్చేదేలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడౌతాడే!! "అంటూ నీ కోసం తనసుఖాలన్నీ వదులుకున్నాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


"నేను దరిద్రంలో పుట్టి పెరిగాను..నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి జాగలు.. భూములు.. నగా నట్రా అన్నీ జమచేసి ఇచ్చాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే...


నువ్వెప్పుడు బిజీగా ఉంటావు..ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనుకాముందయ్యేవాడు..

నీతో మాట్లాడుదామనుకున్న మాటలన్ని ఒక డైరీలో రాసేవాడు.. మీ నాన్నమీద ప్రేముంటే ఇంట్లో వెతికి చదువురా దాన్ని!!


పగలనకా రాత్రనకా కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవచేసినోడికి మూడేండ్ల సేవ చేయడం "సాధించడం " క్రిందకైంది కదూ!!నీకు!


అయినా ఎలా తెలుస్తుందిలే!!మీ నాన్న విలువా!!ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నాడివాయే!! తండ్రి కష్టం..విలువా..బంధం చూస్తేనే కదా తెలిసేది!!

చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది!!


పెద్దసంబంధం!! సుఖపడతావని.. పెళ్లిచేసాడు..


ఎవరో మహాకవి అన్నాట్టా!!


" సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామనే ఆశతో వెళ్ళాను! చివరకు ఆ సముద్రమే మింగివైచినది!!"అని.


అలా అయింది మీ నాన్న పరిస్థితి.


ఏమయ్యా పెద్దమనిషి !నువ్వైనా చెప్పొద్దూ!!

ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కిచ్చుకున్నాడో!!!....


ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం "పుత్రపరిష్వంగమేనయ్యా"!!! ..పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయావిషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా!!


ఆ వయస్సులో భార్య..ప్రియురాలు.. ఎవరి స్పర్శ సుఖమనిపించదు.. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా!!


ఇదికూడా తెలియక పేద్ద.. చెప్పొచ్చావ్!!


తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా!! వాడు కాళ్ళు నొక్కించుకున్నది!!


నీకూ వయసొస్తుంది! అప్పుడర్థమైతుందయ్యా ఇదంతా!!""


తల్లిలేదు! తండ్రిలేడు!!

ప్రేమలేదు!బంధం లేదు!!

కాలమా!! ఎలా అయిపోతివే!!!""


అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ !!!!!


అప్పుడేడ్చాడు కొడుకు 

నిజంగా..

గుండె పగిలేలా..మనుసునిండా..

తండ్రి గుర్తొచ్చి..

తండ్రిప్రేమ గుర్తొచ్చి..

తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి..

తన జీవితమంతా కళ్ళముందు కదిలి.. 

...పశ్చాత్తాపంతో


అతన్ని చూసి కోడలూ..వియ్యంకుడు.. బంధువులు.. ఇలా అందరూ ఏడవసాగారు.


కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా!..

మరికొందరికి తమ తండ్రితనం..పిల్లలకోసం పడిన కష్టం గుర్తుకురాగా!!

 ఇంకా కొందరికి ఆ పెద్దావిడ"కాలమా!! ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతోందో అనే వేదన కలగడం వల్ల.....


పుత్రధర్మాన్ని కావుమంటూ(రక్షించుమంటూ)

అప్పుడొచ్చాయి ఒక్కసారిగా!

కావు.. కావు మంటూ!!

అంతవరకు ఎక్కడాలేని కాకులు

"కాకిపిండాన్ని " తినడానికి


దయచేసి ఏ బందాన్ని అపహాస్యం చెయ్యకండి.🙏

వృద్ధాప్యం

 *వృద్ధాప్యం ఒక మజిలీ.*


ప్రతీ వ్యక్తీ కోరుకున్నా, కోరుకోక పోయినా తప్పని సరిగా చేరుకునే మజిలీ. 


వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి,

అలసి పోయిన అనుభవాలనీ,

ఆరిపోయిన అనుభూతులనూ

నెమరు వేసుకునే చలివేంద్రం. 


వృద్ధాప్యం ఒక అవకాశం. 


వెనక్కి తిరిగి చూసుకుని, 

చేసిన తప్పిదాలకు నవ్వుకుని,

దాటిన అడ్డంకులను పరామర్శించి, 


ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.


ముసిలితనం కొడుకుకంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. 


మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. 


జీవితమంతా కొరుకుడు పడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. 


పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. 


ఒక జీవిత కాలాన్ని 'తెలీని తనానికి తాకట్టు' పెట్టిన కొడుకుని చూసి నవ్వు కుంటుంది. 


తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వ పడుతుంది. 


అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. 


ఏ విమర్శా అవమానం అనిపించదు.

ఏ నిందకీ కోపం రాదు.

వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. 


నీ జీవితకాలంలోని సాధనల్ని పక్కనపెట్టి, కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. 


అదొక అంతస్థు. 


అతని హితవుని నలుగురూ వింటారు, నీ ఆలోచనని గౌరవిస్తారు. 


దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. 


వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.


''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. 


''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. 


తన గురించి తన పెద్దలూ అలనాడు.. అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.


వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. 


చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, 

శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. 


తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయి పోతోందని అర్థమవుతూంటుంది. 


దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. 


''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. 


అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగువేస్తుంది. 


దానికి ఊతం వృద్ధాప్యం.


జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. 


ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. 


ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? 


ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? 


ఏమయినా తనకేం బాధలేదు. 

ఆ సమయంలో తను ఉండడు. 


ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

ఎలా వుంటాడు? 


మృత్యువు తరువాత ఏమవుతుంది? 


సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. 


చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. 


చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. 

చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది.


ఎప్పటిలాగే తెల్లారి, 

వృద్ధులతో కలిసి నడిచి, 

రెండుముద్దల అన్నం తిని,

అరగంట సేదతీరి, 

వేడి టీ తాగి, 

సాయంకాలం పార్కు బెంచీ దగ్గర 'ఈ దేశం తగలడి పోతోంద'ని తిట్టుకుని, 

శాంతపడి,

కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, 

రాని నిద్రనీ, 

నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం - వృద్ధాప్యం వ్యసనం.


ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. 


వెళ్లిపోయిన హితులూ, 

సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. 


ముగింపు భయపెట్టదు. 

ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. 


అన్నిటినుంచీ, అందరినుంచీ 

తనని కుదించుకుని - మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.


ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. 


చేసిన తప్పిదాలు,

మాటతప్పిన కప్పదాట్లూ, 

మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ - 

అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. 


ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. 


వినినట్టు నటిస్తారు. 

నటిస్తున్నారని తనకీ తెలుసు. 

విన్న తృప్తిని తానూ నటిస్తాడు. 


వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. 


కాని వృద్ధాప్యం 

ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. 


వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. 


జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. 


ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.


'చమకం' 

ఏ రుషి, 

ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో,


ఎంత ముందుచూపు, 

ఎంత వినయసంపద, 

జీవుని నిస్సహాయత, 

నిర్వేదం - అందులో ఎంత నిక్షిప్తమయి వుందో,


ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి - 

తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' 

తనని ఆవరించుకుని ఉంటుంది.


ఈ దేశపు వేదసంపద, సాంస్కృతిక వైభవం, 

జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం. 


చమకంలో 

'వృద్ధం చమే' 

అనే ఒక్క కోరికా 

ఈ జాతినీ, 

మతాన్నీ, 

ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ.. వరం. 


*భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం.*


*అదీ వృద్ధాప్యం.*

వృద్ధులెందుకు

 *వృద్ధులెందుకు?*

***************


                       ❓❓❓❓❓❓❓


టీ కప్పు హాండిల్ విరిగింది. దానిని ఏ బడ్స్ దాయటానికో, పిన్నీసులు పెట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాము!


దుప్పటి చిరిగిపోయింది. దానిని నాలుగు మడతలు వేసి కాళ్ళు తుడుచుకునే పట్టా క్రింద వాడుతున్నాం!


కుండ చిల్లిపడింది! దానిని పూలకుండీలా  వాడుతున్నాం!


మరి సంపాదించే శక్తి ఉడిగిపోయిందంటూ వృద్ధులను వృద్ధాశ్రమాలలో ఎందుకు పెడుతున్నాం?


కండరాల శక్తి వలననే ఉపయోగమా?


వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోలేక పోతున్నాం?


పైగా, వృద్ధాశ్రమాలలో పండ్లు పంచిపెట్టడం చేసి వారి మీద సానుభూతి చూపి, ఏదో దైవకార్యం చేసినట్లు ఫోజులిస్తున్నాం!


మన దేశంలో వృద్ధులపట్ల ఒక ఉదాసీన భావం బాగా ప్రబలిపోయింది!


అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల వయస్సు చూస్తే 79 ఒకాయనకు, 75 ఒకాయనకు! 

                                                                                                                                                                                           వారు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించగలిగే కీలక పదవికి పోటీదారులు! 

                                                                                                                                                                                       నోబెల్ ప్రైజు గెలుచుకున్న వారి వయస్సు ఒకసారి అందరిదీ పరిశీలించండి. అందరూ వృద్ధులే దాదాపుగా!


మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం కోల్పోతూ ఉన్నామో.


*ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది.*


*ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు. ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది.*


*ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి!*


అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి!


వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది!!


వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే, వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు. పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది!


అసలు వారే దేశ సంపద! వారి అనుభవం, విజ్ఞత; దేశానికి, సమాజానికి, కుటుంబాలకు ఉపయోగపడవద్దా? 


                        *అసలు వృద్ధులెందుకు?*


                              ఆలోచించండి!


                           👨‍🦯👩‍🦯👨‍🦯🚶‍♀️👩‍🦯        

                      

                   *లోకాసమస్తా సుఖినోభవన్తు!*

వయసులో

 శుభ నమస్కారం 🙏🏻

*నలభై ఏళ్ల వయసులో..*

ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. 

*సంపాదనలో ఎదుgగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.*


*యాభై ఏళ్ల వయస్సులో..*

అందమైన దేహం.. అందవిహీనం..

మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. 

*ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*


*అరవై ఏళ్ల వయసులో..*

ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. 

*పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.*


*డెబ్బై ఏళ్లవయస్సులో..*

విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...

*కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*


*ఎనభైఏళ్ల వయస్సులో..*

ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. 

*ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*


*తొంభైఏళ్ల వయస్సులో..*

నిద్ర మెలుకువ రెండూ ఒకటే. 

*సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*


అందంతో వచ్చే మిడిసిపాటు...

ఆస్తులతోవచ్చే అహంకారం...

పదవులతో గౌరవాన్ని ఆశించటం...

కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.


*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*


అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ...

అనుబంధాలను  పదిలపరుచుకుంటూ...

జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!


నాకు చాలా బాగా నచ్చింది. మీతో పంచుకో వలనిపించి పంపిస్తున్న... ఇది జీవత సత్యo 


*🚩🚩హైందవ సమాచార భక్తినిధి*

🚩🚩🚩 *మామిళ్ళపల్లి జగన్ మోహన్ శర్మ* *9182440553*

దాడులకు శృంగేరీ జగద్గురువుల ఆవేదన

 ఆలయాలపై జరుగుతున్న దాడులకు శృంగేరీ జగద్గురువుల ఆవేదన. బాధ్యులపై కఠిన చర్యలకు స్వామివారి సూచన


ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడులపై దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రాలైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా దాడులు జరుగుతుండడం తీవ్రమైన వేదనను కలిగిస్తోందని, ఇటువంటి దాడులు రాజ్యాంగవిరుద్ధమని, వీటివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగమేర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.


ఇలాంటి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇలాంటివి పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు.


శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి సందేశం పూర్తిపాఠం:


శృంగేరి 09.01.2021


సనాతనహిందూధర్మము ఈ ప్రపంచములో అన్ని ధర్మములకంటెను అత్యంత ప్రాచీనమైనదను విషయము సర్వవిదితము. మనుష్యునకు ఇహపరలోకములలో శ్రేయోదాయకమయిన ఈ ధర్మమును స్వయముగా భగవంతుడే ప్రతియొక్క యుగమునందవతరించి ఉద్దరింతునని భగవద్గీతయందు శెలవిచ్చియున్నాడు. అట్టి ఈ ధర్మమునకు మూలములైన వేద శాస్త్రములలో సకలమానవుల శ్రేయస్సు కొరకు భగవదుపాసన చెప్పబడియున్నది. మన పవిత్ర భారతదేశంలో విలసిల్లుచున్న అనేక పుణ్యక్షేత్రములలో మరియు ప్రాచీన దేవాలయములలో అనేకరూపములలో అనేకనామములతో భగవదుపాసన అనాదికాలముగ విశేషముగా ఆచరింపబడుచున్నది. ప్రస్తుతము ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రములైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా అవిరతముగా దాడులు జరుగుచుండుట వీటికి కారకులైన వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్షను విధింపకుండుట మా మనస్సుకు అత్యంత దుఃఖమును కలిగించినవి. ఇది అత్యంత ఖండనీయమైన విషయము. భగవంతుని విషయమున జరిగిన ఇట్టి అక్షమ్యమైన అపరాధములు వాటినొనర్చినవారిని జన్మ జన్మలకు ఎెంటాడి అపరిమితమైన దుఃఖమును కలిగించును. దాడులు మహాపాపములే కాక రాజ్యాంగమునకు కూడా అత్యంత విరుద్ధములు. వీటవలన దేశ ప్రజల సామరస్యమునకు భంగమేర్పడుటయే కాక అనేకవిధములైన అనిష్టములను ఎదుర్కొనవలసిన దుస్థితి కూడా రాగలదు. ఇట్టి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇవి పునరావృత్తము కాకుండుటకు కఠినమైన చర్యలను తీసుకొనవలసిన బాధ్యత ప్రభుత్వమునకున్నది. హిందూధర్మములో అనేక సంప్రదాయ భేదములు ఉన్నప్పటికీ అవి ధర్మసంరక్షణకు విఘాతకములు కాకూడదను విషయమును చక్కగా ఆకళింపు చేసికొని ఆస్తికులందరూ ఇట్టి సందర్భమున ఐకమత్యమును ప్రదర్శించి ధర్మమును కాపాడి భగవదనుగ్రహపాత్రులై కృతార్థులగుదురుగాకయని మేమాశించుచున్నాము.

12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?

 సేకరణ:- తెలిసిన వారు మెసేజ్ చేశారు. 


అతితక్కువ ఖర్చు తో సొంతంగా 12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా? 


 క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చు తో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది.


ప్లాను లో వున్న రైళ్లు

ప్రతి రోజు నడిచేవి.


మీ అవసరాన్ని బట్టి మీకు కావలిసిన ఊరిలో మీరు  విశ్రమించ వొచ్చు.


అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి.


ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి.


 శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు.

Note: రైల్వే స్టేషన్ కోడ్ ని () లోపల వ్రాసి ఉన్నది.

I

🌺1వ రోజు:

బేగంపేట్ లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 (ఔరంగాబాడ్ పాసెంజర్) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ రైల్వే స్టేషన్ లో దిగండి.


 OR


మీరు విజయవాడ నుంచి యాత్ర ప్రారం భిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి  లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న 10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు).


🌺2వ రోజు:

పర్లీ రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs  దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును.


ఉదయం

🌺బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం.


 చేసుకున్న పిమ్మట

బస్సు లో పర్భానీ () (67KMs)

రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని

ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి .

లేదా

ట్రైన్# 17618

తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి.

ఔరంగాబాద్ () రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి

30 కిలోమీటర్ల దూరం లో వున్న


🌺గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని (2)దర్శించండి.


గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ 1KM దూరం లో వుంది, ఏ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది) గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.


🌺3 వ రోజు:

ఔరంగాబాద్ బస్సు స్టాండు లో

నాశిక్ బస్సు ఎక్కండి.

నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు)

ప్రయాణ సమయం 5 గంటలు.

నాశిక్ బస్సు  స్టాండ్ లో

త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి

(దూరం 30 కిలోమీటర్లు)


🌺 త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి.


 (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి  ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి.

గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.


🌺4 వ రోజు:

పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి.


07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి.

 (దూరం 150 KMs).


మంచర్ బస్టాండ్ లో

భీమా శంకర్ బస్సు ఎక్కి

భీమశంకర్ (61KMs, 2hours) లో


 🌺భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4]

 దర్శించుకొండి.


 (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది).

మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో

పూణే  బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి .

(110 KMs, 3 hours).

రాత్రి 7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.


ఒక వేళారోజు

గురువారం ఐతే డైరెక్ట్

సోమనాథ్ ట్రైన్

రాత్రి 7:50 PM ట్రైన్# 11088

పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.


🌺5 వ రోజు:

అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:45AM కి దిగి

ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి

లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AM

ఎక్కి వెరావల్ (VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:35PM కి లేదా 7:30PM కి దిగండి.


అక్కడ

బల్క తీర్థ్ దర్శించి,

ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి


🌺సోమనాథ్ జ్యోతిర్లింగ[5]


దర్శనం  చేసుకుని 

ట్రైన్# 19251 సోమనాథ్ ఒక  ఎక్ష్ప్రెస్స్ వెరావల్  లో

రాత్రి 11:10 కి ఎక్కండి.


🌺6 వ రోజు:

ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి,

ద్వారకాధీశ్ దర్శనం,


🌺నాగేశ్వర  జ్యోతిర్లింగ [6] దర్శనం.


 చేసుకుని

ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి 

ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. { (optional) లేదా

ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి,

ఆది శంకరాచార్య మఠం,

భేట ద్వారకా,

భద్కేశ్వర్ మహాదేవ్ గుడి,

గోపి తలాబ్,

గోమతి నది దర్శించండి.}


🌺7 వ రోజు:

వడోదర (BRC) రైల్వే స్టేషన్ లో

రాత్రి 12:48 AM కి దిగి,

ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి.

లేదా

వడో


దర లో రూమ్ తీస్కొ


ని రెస్ట్ తీస్కోండి.


🌺{8 వ రోజు:

వడోదర రైల్వే స్టేషన్ నుంచి

61KMs దూరం లో సముద్రం లో వున్న స్తంభేశ్వర్ మహాదేవ్ గుడికి వేళ్ళగలరు. రాత్రి

9:50 PM కి

ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.}


🌺9 వ రోజు:

ఉజ్జయిని (UJN)

రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:20 AM లేదా 4:00 AM కి

దిగి శిప్రా నది లో స్నానం చేసి


🌺 మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం


చేసుకున్న

తరువాత లోకల్ సైట్ సీఇంగ్ బస్సు ఎక్కండి.


అక్కడ వున్న అమ్మ వారి శక్తిపీఠాన్ని దర్శించు కొండి.

తరువాత

ఓంకారేశ్వర  (135 kms)

బస్సు ఎక్కి,


🌺ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి.


పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి.


🌺10 వ రోజు:

పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి,

 ఖండ్వా (70KMs) బస్సు

ఎక్కి

ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి.


అక్కడ

ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా

ట్రైన్# 12167 లోకమాన్య తిలక్  టెర్మినస్

వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్

ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.


🌺11 వ రోజు:

వారణాసి (కాశి) (BSB)

రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి.


కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ అప్ ఐ


 🌺కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి,


తరువాత 

కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి,

తరువాత

తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి .


 (ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే),


 కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది

మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి.


 ఆ సమయం లో స్నానం చేస్తే  లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం).


 రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు.


సాయంత్రం 5:00 PM కి

సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు

ట్రైన్# 12792 సికింద్రాబాద్  ఎక్ష్ప్రెస్స్ వారణాసి

రైల్వే స్టేషన్ ఎక్కండి  .

లేదా 

విజయవాడ  వెళ్ళుటకు 

ట్రైన్# 12296 సంఘ మిత్ర  ఎక్ష్ప్రెస్స్ ముఘల్  సారాయి (MGS)

రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27PM కి ఎక్కండి.


మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం  3:30 గంటలు).


 ముందుగా

వేరే రైలు లో చేరుకొని

అలాహాబాద్ (MGS) రైల్వే స్టేషన్ (ALD)

(ప్రయాగ) లో స్నానం చేసి

రాత్రి 8:40 కి

హైదరాబాద్  వెళ్లే train#12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్

అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కగలరు.


🌺12 వ రోజు:

సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి .

లేదా

విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.

వివేకానంద జయంతి :

 స్వామి వివేకానంద జయంతి : ఆయన గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

  దుర్లభమగు మానవ శరీరమును దాల్చి శాశ్వతానందప్రదమగు మోక్షమును బొందుటకై సాధనయొనర్చనివాని జీవితము నిరర్థకము. నిత్యానిత్యవస్తు వివేకముచే సర్వసంగపరిత్యాగ మొనర్చి,సత్యసందర్శనైక వాంఛచే బ్రహ్మచర్య వ్రతము దాల్చి,సంసారసాగరమునుండి తాము తరించుటయే కాక పరులను తరింపజేయుటకై తమ జీవితసర్వస్వములను సమర్పించునట్టి భగవదంశసంభూతులగు మహాత్ములు సర్వజనులకును మార్గదర్శకులై వెలయుచుందురు. స్వామి వివేకానందకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా దేశం ఆయన్ను మరోసారి స్మరించుకుంటోంది.

పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి

భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందనే కావడం విశేషం. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుతోంది.

వివేకానంద జీవిత వివరాలు

స్వామివివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. బాల్యం నుంచే ఆటలలోనూ, చదువులోనూ చురుగ్గా ఉండేవాడు. ఏకసంథాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై.. ఆ తర్వాత తత్వశాస్త్రం,పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించాడు. ఇదే క్రమంలో సత్యాన్వేషణ కోసం తన సందేహాలను అనేకమంది పండితుల ముందు పెట్టాడు. అయితే ఎవరి సమాధానాలు ఆయనకు సంతృప్తినివ్వలేదు.

సత్యాన్వేషణ కోసం

సత్యాన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్‌లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లాడు. అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్దగా ఆలకించాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడిపై పడింది. నరేంద్రుడిని చూసి పరమహంస తెలియని తాద్యాత్మతకు లోనయ్యాడు. ఆ తర్వాతి కాలంలో పరమహంస శిశ్యుడిగా మారిపోయిన నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా.. వివేకానందుడిగా మారిపోయాడు. ఆయన బోధనలు దేశంలో ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

స్ఫూర్తినిచ్చే సూక్తులు

'ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం', 'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా భారతీయులు ఆయన్ను మరోసారి స్మరించుకుంటున్నారు.

మరిన్ని స్వామి వివేకానంద 



వివేకానంద స్వామి

పంచముఖ హనుమాన్

 పంచముఖ హనుమాన్


మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని చేధించుకుని అందరి కళ్లుగప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకు పోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. 


మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకొంటాడు. దాని కోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.


పంచ అంటే అయిదు. ఐదు అనే సంఖ్య పంచ భూతాలకు సంకేతం. మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచ ముఖాల్లో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి.