25, మార్చి 2025, మంగళవారం

ఫాల్గున కృష్ణ ఏకాదశీ -

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 25/03/2025 - ఫాల్గున కృష్ణ ఏకాదశీ - పాపవిమోచని ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*


ఫాల్గున బహుళ ఏకాదశిని “పాప విమోచని ఏకాదశి” లేక “సౌమ్య ఏకాదశి” అని అంటారు.


పాపవిమోచని ఏకాదశి అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. దీని వెనక ఒక కథ ఉంది. అదేమిటంటే…


కుబేరునికి చైత్ర రథమనే పేరుగల ఒక వనం ఉండేది. ఆ వనంలో గంధర్వ కన్యలు, కిన్నరులతో విహరించేవాడు. అక్కడ ఎల్లప్పుడూ వసంత ఋతువు నిలయంగా ఉండేది. ఆ వనంలో రక రకాల పుష్పాలు పుష్పించి మనోహరంగా కనిపిస్తూ ఉండేవి. ఋషీశ్వరులు తపస్సు చేస్తూ ఉండేవారు. ఇంద్రుడు కూడా స్వయంగా చైత్ర, వైశాఖ మాసాల్లో దేవతా సమూహంతో కలిసి ఈ వనంలోకి విచ్చేసి క్రీడిస్తూ ఉండేవారు. ఆ వనం ఇంద్రునికి క్రీడాస్థలంగా ఉండేది. 


అక్కడికి దగ్గరలో చ్యవన మహర్షి పుత్రుడు మేధావి అనే పేరుగల ఒక ఋషీశ్వరుడు తపస్సులో లీనమై ఉన్నాడు. ఇంద్రుడి ఆదేశిస్తే మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందంట. 


మంజుఘోష తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆమెకు రాక్షస రూపం కలుగు గాక అని మేధావి శపించారట. ఆమె రాక్షసి అయిపోయిందట. ఆయన తిరిగి తపస్సులో మునిగి పోయాడట. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గున మాసంలో కృష్ణ పక్షంలో ఏకాదశి తిధినాడు ఉపవాసం చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షసరూపం పోయి తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాపాంతాన్ని అనుగ్రహించారట.


మంజుఘోష ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ రూపాన్ని పొందిందిట. కనక చేసిన పాపాలు ఏవైనా వుంటే వాటిని తొలగించే ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక పాపాంకుశ ఏకాదశి అనేది ఏర్పడింది. ఈ రోజు ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుంది అని పెద్దలు అంటారు.


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జై శ్రీమన్నారాయణ 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


🚩 *_శుభమస్తు_* 🚩

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(86వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

        *చిన్ని కృష్ణుని లీలలు*

*ఏలినవాని నోట ఏడేడులోకాలు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*రామకృష్ణులూ, గోపబాలకులూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు బోర్లాపడ్డాడు. అప్పుడతని పెదవులకు మన్ను అంటింది. అంటిన మన్నును చప్పరించి చూశాడతను. బాగుంది. తియ్యగా ఉంది. మన్నును గుప్పెడు తీసుకున్నాడు. తినసాగాడు. రాముడది చూశాడు. వద్దని చెప్పాడు. వినలేదు కృష్ణుడు. గోపబాలకులు కూడా కల్పించుకుని వద్దన్నారు. వింటేనా? పైగా మరో గుప్పెడు అందుకున్నాడు కృష్ణుడు.*


*తల్లిని సమీపించాడు రాముడు. గోపబాలకులు కూడా అతన్ని అనుసరించారు.*


*‘‘అమ్మా, అమ్మా! తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడే!’’ ‘‘అవునమ్మా! గుప్పెళ్ళకొద్దీ తీసుకుని తింటున్నాడు. వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు.’’ అన్నారు గోపబాలకులు.*


*‘‘కృష్ణుడెక్కడ?’’ కోపగించుకుంది యశోద. ‘‘అక్కడ’’ అంటూ అటుగా చూపించారు. అక్కడకి పరుగుదీసింది యశోద. మన్ను తినడం అనారోగ్యం. తినవద్దని చెబుతున్నా వినడం లేదు కృష్ణుడు. దండించాల్సిందేననుకున్నది యశోద. ‘‘కృష్ణా’’ గట్టిగా అరచింది. చేతిలోని మన్నుని విసిరేసి, చేతిని దులుపుకుని అమాయకంగా చూశాడు కృష్ణుడు.*


*‘‘మన్ను తినకూడదని, తింటే అనారోగ్యం అని నీకెన్నిసార్లు చెప్పాన్రా? విన్నావా? ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకెలా చెప్పాలో నాకు తెలుసు, పద చెబుతాను.’’*


*కృష్ణుణ్ణి రెక్కపట్టి లాగింది యశోద ‘‘నిన్ను...నిన్నేం చేస్తానో చూడు.’’ బెదిరించింది.*


*‘‘మన్ను తినలేదమ్మా’’ ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు.‘‘అబద్ధాలాడుతున్నావు.’’*


*‘‘లేదమ్మా! నేను నిజమే చెబుతున్నాను.’’*


*‘‘నమ్మను. నువ్వు మన్ను తిన్నావు. తినకపోతే నీ మీద చాడీలు చెప్పడం వాళ్ళకు సరదానా?’’*


*‘‘నా మాట నమ్మట్లేదుకదా, సరే, నా నోరు చూడు, నీకే తెలుస్తుంది.’’ అన్నాడు కృష్ణుడు*


*‘ఏదీ చూపించు.’’ అడిగింది యశోద.*


**ఏలినవాని నోట ఏడేడులోకాలు*


*ముందు సన్నసన్నగా తెరచి, తర్వాత ఓ గుహలా బాగా విప్పార్చి నోరు చూపించాడు కృష్ణుడు. ఆ నోటిలోకి యశోద తొంగి చూసి విస్తుపోయింది.*


*భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్ర గ్రహనక్షత్ర తారకాగణాలు, సకల చరాచర భూత జాలం, స్వర్లోక పాతాళాదిలోకాలు సహా తనూ, తను నివసిస్తున్న గోకులం కూడా కృష్ణుని నోటిలో కనిపించాయి యశోదకు. దిగ్ర్భాంతి చెందింది. నోట మాటలేదు.*


*ఏమిటిదంతా? చిన్నికృష్ణుని నోటిలో సమస్తలోకాలూ కనిపించడం ఏమిటి? ఇది కలా? నిజమా? అంతుచిక్కని ఒకానొకదశలో కళ్ళు మూసుకుంది యశోద. మాయకు లోనయింది. అప్పుడు ఆమెకు సర్వేశ్వరుడు తన ఉనికిని అంతా విడమరచి చెప్పినట్టుగా వినవచ్చింది. అన్నిటా అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినవస్తోంటే యశోద రెండు చేతులూ జోడించి, కృష్ణునికి నమస్కరించింది. సమస్తానికీ ఆధారభూతుడయిన శ్రీమన్నారాయణుని శరణువేడింది. శరణువేడిన మరుక్షణం మాయ వీడిపోయింది.*


*విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు. నోరు మూసేశాడు. మామూలు పిల్లాడయిపోయాడు. ఏడుపు నటించాడు. యశోద తల్లిహృదయం తల్లడిల్లింది. కృష్ణుణ్ణి దగ్గరగా తీసుకున్నదామె. లాలించింది. ముద్దు చేసింది.‘‘ఏడవకు నాన్నా! ఏడవకు! నువ్వు ఏడిస్తే నేను చూడలేను.’’ అన్నది. కన్నీరు పెట్టుకుంది. తల్లి కన్నీరు పెట్టుకోవడాన్ని చూసి, జాలి చెందాడు కృష్ణుడు. గొలుసు గొలుసులుగా నవ్వసాగాడు. చిన్నికృష్ణుని నవ్వు తొలకరిలా అనిపించింది యశోదకు. అందులో తనివితీరా తడిసిపోయిందామె.*


*మద్దిచెట్లు: సిద్ధపురుషులు*


*యశోద చల్ల చేస్తున్నది. కవ్వం తాళ్ళు పట్టుకుని కుండలో పెరుగు చిలుకుతున్నది. కృష్ణుడు వచ్చాడప్పుడు. పాలిమ్మని ఏడుపు అందుకున్నాడు.‘‘చల్లయిపోనీ, పాలిస్తాను.’’ అన్నది యశోద.*


*వినడే! తల్లి చీరకొంగు లాగసాగాడు కృష్ణుడు.‘‘ఉండురా నాన్నా’’ బతిమలాడుకున్నది యశోద. ఫలితం లేదు. పాలిమ్మని కృష్ణుడు ఒకటే ఏడుపు. తప్పదనుకున్నది యశోద. కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని పాలివ్వసాగింది. అంతలో పొయ్యి మీద పాలు పొంగిపోతూ కనిపించాయి. కృష్ణుణ్ణి తొలగించి, పరుగుదీసిందక్కడకి. తనకి పాలివ్వకుండా తల్లి అలా పరిగెత్తి పోవడాన్ని కృష్ణుడు సహించలేకపోయాడు. కోపం వచ్చిందతనికి. కళ్ళెర్రజేశాడు. పెదవులు కొరికాడు. దగ్గరలో ఉన్న రాయి అందుకున్నాడు. పెరుగుకుండ మీదకి విసిరాడు దాన్ని. ‘ఫెడేళ్‌’మని పెరుగుకుండ పగిలిపోయింది. చల్ల అంతా కాలువలుగట్టి ప్రవహించసాగింది. ప్రవాహంలో తేలివస్తున్న వెన్నముద్దలు చేజిక్కించుకుని అక్కణ్ణుంచి పారిపోయాడు కృష్ణుడు. పొయ్యి మీది పాలు పొంగకుండా చేసుకుని, చల్లకుండ దగ్గరకి చరాచరా వచ్చింది యశోద. అక్కడి దృశ్యాన్ని చూసి కోపం తెచ్చుకుంది. నిండుకుండను పగలగొట్టి పారిపోతావా? ఉండు, నీ పని చెబుతాను అనుకుంటూ కృష్ణుని కోసం వెదకసాగింది. కృష్ణుణ్ణి కొట్టేందుకు చేతికర్ర కూడా అందుకుంది. అటు వెదకి, ఇటు వెదకి. వేసారిపోయింది. ఎక్కడున్నావు కృష్ణయ్యా అంటే ఇదిగో ఇక్కడ ఉన్నానన్నట్టుగా పెరటిలో పూలచెట్టునీడలో రోలు మీద కూర్చుని కనిపించాడు కృష్ణుడు. తిన్నంతగా వెన్న తిన్నాడు. మిగిలినది తన దగ్గర కూర్చున్న కోతికి పెడుతూ కనిపించాడు. వెల్ల వేసినట్టుగా ఒంటినిండా వెన్నే! కృష్ణుణ్ణి చూడగానే కోపం మరింత రెట్టింపయి, అతన్ని పట్టుకునేందుకు పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ రాసాగింది యశోద.*


*అమ్మకి కోపం వచ్చింది. అమ్మ చేతిలో కర్ర కూడా ఉంది. కొడుతుంది. చిక్కకూడదనుకున్నాడు కృష్ణుడు. పరుగుదీశాడు. కాలిగజ్జెలు ఘళ్‌ఘళ్‌మంటూ కృష్ణుడు పరుగుదీస్తోంటే, అతన్ని పట్టుకునేందుకు యశోద ఆపసోపాలుపడ్డది. ఆఖరికి కృష్ణుణ్ణి అందిపుచ్చుకున్నది. చేతికర్ర ఎత్తి కొట్టబోయింది. కన్నీటితో చూశాడు కృష్ణుడు. కరగిపోయింది యశోద. కర్రను వదలి, కృష్ణుణ్ణి కౌగిలించుకుంది.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

పూజను ముగించే ముందు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *పూజను ముగించే ముందు*       

          *క్షమాయాచన*

     *శ్లోకాలు వాటి అర్థాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్లోకం (1)*


*మంత్రహీనం క్రియాహీనం*

*భక్తిహీనం జనార్దన |*

*యత్పూజితం మయాదేవ*

*పరిపూర్ణం తదస్తుతే ||*


*భావము:~*


*ఓ పురుషోత్తమా! ఈ పూజ మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము. అట్టి ఈ పూజ నీ పరిపూర్ణ అనుగ్రహముచే పరిపూర్ణమగును గాక! అనగా నేను పఠించిన మంత్రాలలో, నా పూజావిధానంలో, నా భక్తిలో లోపాలు వుండివుండవచ్చు, ఆ లోపాలను మన్నించి వాటిని పరిపూర్ణముగా వున్నట్లు భావించమని భక్తుడు భగవంతుని కోరుతున్నాడు.*


*శ్లోకం (2)*


*యదక్షర పరభ్రష్టం*

*మాత్రాహీనంతు యద్భవేత్ |*

*తత్సర్వం క్షమ్యతాం దేవ*

*నారాయణ నమోస్తుతే ||*


*భావము:~*


*నే పలికిన పలుకులలో అక్షర దోషములున్న వాటిని క్షమించమని నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను.*


*శ్లోకం (3)*


*ఆవాహనం న జానామి*

*న జానామి విసర్జనం |*

*పూజావిధిం న జానామి*

*క్షమస్వ పరమేశ్వర ||*


*భావము:~*


*పూజ చేయునపుడు ఆహ్వానించుట తెలియదు. పూజ అనంతరము ఉద్వాసన చేయుట తెలియదు. పూజ పద్దతులు తెలియవు. అందుచేత ఓ పరమేశ్వర ! క్షమించమని ప్రార్ధిస్తున్నాను.*


*శ్లోకం (4)*


*కాయేనవాచా మనసేంద్రియైర్వా,*

*బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ |*

*కరోమి యద్యత్ సకలం పరస్మై,*

*నారాయణాయేతి సమర్పయామి||*


*భావము:~*


*మనో వాక్కాయ కర్మలచేగాని బుద్ధీంద్రియాదులచేగాని, ప్రాకృతిక స్వభావంచేగాని, నాచే ఆచరించబడే సమస్తమైన కర్మలనూ పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తున్నాను.*


*శ్లోకం (5)*


*అన్యథా శరణం నాస్తి*

*త్వమేవ శరణం మమ।*

*తస్మాత్ కారుణ్యభావేన*

*క్షమస్వ పరమేశ్వర.॥*


*భావము:~*


*ఓ శివ శంభు, భ్రాంతికరమైన సంసారం నుండి నన్ను రక్షించడానికి నీవు తప్ప మరెవరూ లేరు, నీవు దయా సాగరమని తెలుసు కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను మయూరీ మయూరములుగా  నిరూపించి శంకరులు ప్రార్థించారు.*


*శ్లోకము - 54*


*సంధ్యా ఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక*

            

*ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్ఠిచ్ఛటా చంచలా*

            

*భక్తానాం పరితోష బాష్ప వితతిః వృష్టిర్మయూరీ  శివా*

            

*యస్మి న్నుజ్జ్వల  తాండవం  విజయతే  తం నీలకంఠం భజే !!*


*పదవిభాగం :~*


*సంధ్యా  = సాయంకాలము*

*ఘర్మ దినాత్యయః = వర్షారంభకాలముగను*

*హరికరాఘాత = విష్ణువు యొక్క హస్తముల వాయింపు చేత*

*ప్రభూత ఆనక ధ్వానః  = పుట్టిన మద్దెల యొక్క ధ్వని*

*వారిద గర్జితం = ఉరుముగను*

*దివిషదాం దృష్టిచ్ఛటా  = దేవతల యొక్క చూపులో పరంపర*

*చంచలా = మెరుపుగను*

*భక్తానాం పరితోష బాష్ప వితతిః = భక్తుల యొక్క ఆనందాశ్రుధార*

*వృష్టిః = వర్షముగను*

*మయూరీ = ఆడనెమలిఖను*

*శివా = పార్వతీదేవి*

*యస్మిన్ = ఏ నీలకంఠుడను నెమలియందు*

*ఉజ్జ్వల = ప్రకాశమానమైన*

*తాండవం విజయతే = తాండవమను నృత్యము సర్వోత్కృష్టముగా ఉన్నదో*

*తం నీలకంఠం భజే = ఆ శివుని కొలచుచున్నాను.*


*తాత్పర్యము :~*


*మహేశ్వరా ! సంధ్యాకాలమే, వర్షారంభ సమయము. విష్ణువు సంతోషంతో వాయించే మద్దెల నాదమే, ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో ఆటూ ఇటూ తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు. భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబువులే, వర్షం.   అమ్మవారు మయూరి, ఈ పరిస్థితులలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుని భజిస్తాను.*


*గమనిక :~*


*నెమలి వర్షాకాలం ప్రారంభం కాగానే ఆడు నెమలితో కలసి నృత్యం చేస్తుంది. శివుడు సంధ్యా కాలంలో పార్వతితో కలసి నాట్యం చేస్తాడు.( అలంకారం = రూపకం ).*


*ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో  మనం ధ్యానించాలని శంకరుల వారి అభిప్రాయంగా గ్రహించాలి.*


*వివరణ:~*


*స్కాందపురాణములో దేవతలు ప్రదోష కాలంలో ఈశ్వరుని సేవిస్తారని ఇలా తెలిపారు.*


*కైలాస పర్వతభవనంలో  ముల్లోకాలకూ తల్లియైన పార్వతిని సువర్ణ పీఠములో ఉంచి, ఈశ్వరుడు నాట్యం చేయాలని కోరుకుంటాడు. ప్రదోష కాలంలో దేవతలు ఈశ్వరుని సేవిస్తారు.*


*శివుడు నృత్యం చేసే సమయంలో సరస్వతీ దేవి వీణను వాయిస్తుంది. ఇంద్రుడు వేణునాదం వాయిస్తాడు. బ్రహ్మ తాళం వాయిస్తాడు. లక్ష్మీదేవి పాట పాడుతుంది. విష్ణుమూర్తి మద్దెల వాయిస్తాడు. దేవతలంతా చుట్టూ నిలచి ఆ ప్రదోష సమయంలో పార్వతీ పతియైన ఈశ్వరుని సేవిస్తూ ఉంటారు.*


*పైన పేర్కొన్న విధంగా ఈశ్వరుని ప్రదోషకాలంలో సర్వదేవతలూ పూజిస్తారని తెలుస్తుంది. మనం కూడా సంధ్యా సమయంలో ఈశ్వర స్తోత్రం చేయాలని శంకరులు ఈ శ్లోకము ద్వారా సూచించారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

వివాహ సమాచార సంస్థ

 *గత 25 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవలో.*....


*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ* 

వారి వార్షిక పరిచయ వేదిక 

*పరిచయం - పరిణయం*

11/05/2025{ఆదివారం }రోజు 

వేదిక :శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం, హిల్ కోలనీ, గురుద్వారా పక్కన, వనస్థలిపురం,భాగ్య నగరం (హైదరాబాద్.)

నిర్వాహకులు : :

*ప్రభల విశ్వనాధం*,801-956-6579


*రిజిస్ట్రేషన్ లు ప్రారంభమైనవి*. 

*రిజిస్ట్రేషన్ చివరి తేదీ :30-4-2025*


పరిచయ వేదిక పుస్తకం లో వధూ /వర..వివరాలు ప్రచురించుటకు 100/-,

వివరాలు ప్రచురించిన పుస్తకం. కావాలి అంటే 300/- కొరియర్ ₹100/-. 

Spot రిజిస్ట్రేషన్ బుక్ కూడా కావాలి అంటే 200/-.. పరిచయ వేదికకు వెళ్ళలేకపోతే 

1st, 2nd బుక్ కొరియర్ లో తెప్పించుకోవాలి అంటే 500/- చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాల కై దిగువ ఇవ్వబడిన మా సమాచార కేంద్రాల నిర్వకులను సంప్రదించండి.

 చరవాణి నెంబర్ లు { మొబైల్ నెంబర్ }


ప్రభల విశ్వనాథం వనస్థలిపురం. 

 801-956-6579.

చెప్పదలచుకున్న అంశం

 పి.వి  నరసింహారావు గారు పి.ఏం  గా  ఉన్నప్పుడు అటల్ బిహారి వాజపేయి గారిని India representative గా UNO కి పంపడం జరిగింది. UNO లో కాశ్మీర్  issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నాయి . వాజపేయి  గారు తన ఉపన్యాసం ఇలా ప్రారంభించారు . 

నా అభిప్రాయలు చెప్పడానికి ముందు మీకు చిన్న స్టోరీ చెప్తాను అన్నారు.  చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint)ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత kashmir కి ఆ పేరు వచ్చింది.  కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన  సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు.


ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి objection  raise చేశాడు.  ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  అలాంటప్పుడు పాకిస్తానీ, ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు అని చెప్పి  వాజపేయి మీద  కేకలు వేసాడు.  అపుడు వాజపేయి  నవ్వుతూ "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది. అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు, మరి ఇప్పుడు kashmir,  pakistan కి చెందినది  అంటున్నారు" అని అన్నారు.  సభలో వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు.

సహాయం చేయగలరాని

 నమస్తే అంది నా పేరు ఆదిలక్ష్మి, మా ఆయనా పేరు జయకృష్ణ శర్మ, పురోహితం చేసే వారు, ఆయనాకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది ఆపరేషన్ కూడా చేయించము అయిన చనిపోయారు, కీమ్మో మరియు రేడియేషన్ కూడా చేయించాను, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. మాకు ఇద్దరు పిల్లలు బాబు పాప 6త్ అండ్ 5త్ చదువుతున్నారు, ప్రజెంట్ ఇళ్లు గడవటం చాలా కష్టం గా ఉంది, మీకు తోచినంత సహాయం చేయగలరాని ఆశిస్తున్నాను.


ఫోన్ పే అండ్ గూగల్ పే 9347532933

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః 

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే (21)


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన 

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి (22)


పార్థా..

ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిదికాని, కావలసింది కాని ఏమీ లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వర్తిస్తూనే వున్నాను.

శివానందలహరి

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం*


*శివానందలహరి – శ్లోకం – 64 *


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మారసంమర్దనం*

*భూభృత్పర్యటనం నమస్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।*

*కర్మేదం మృదులస్య తావకపదద్వన్ద్వస్య గౌరీపతే*

*మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాఙ్గీకురు ॥64॥*


గతశ్లోకములలో‌ భక్తి అనగా మనస్సు శివపాదపద్మములను వదలక పట్టుకొనుట అన్న శంకరులు, ఆ పాదపద్మములు తన మనస్సులో‌ ఉంచమని శంభుని కోరుకుంటున్నారు.


పార్వతీ‌వల్లభా! యమునిఱొమ్ము తన్నవలెను. అతికఠోర అపస్మార అసురుని అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నీకు నమస్కరించుచున్న దేవతల కిరీటముల రాపిడి ఓర్చుకోవలెను. నీ పాదములు అతి కోమలములు (అవి ఈ కఠినకార్యములు ఎలా చెయ్యగలవు ? ). శంభో! ఎల్లప్పుడూ నా చిత్తమనే మణిపాదుకలను నీపాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపుము.


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో* 𝕝𝕝 *ఔరసం కృతసమ్బన్ధం తథా వంశక్రమాగతమ్* l

          *రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం ఙ్ఞేయం చతుర్విధమ్* ll


                                *... _నీతిసారః_…*


తా𝕝𝕝 *"రక్తసంబంధీకుడు, చిన్ననాటినుండి పరిచితుడైనవాడు,0 వంశక్రమంగా కుటుంబ సంబంధాలు కలవాడు, కష్టాలనుండి రక్షించుటవల్ల సన్నిహితుడైనవాడు - ఇట్లు మిత్రులు నాలుగువిధాలుగా ఉందురు"*


 ✍️🌹💐🪷🙏

ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః

 ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః

🙏🙏🙏

తేదీ 25/03/2025 మంగళవారం ధర్మపురి శేషప్ప (కాకుస్థం శేషాచలదాసు) విరచితం నరసింహ శతకంలోని 79వ పద్యం పారాయణం చేద్దాం.


సీ. హరిదాసులను నింద లాడకుండినఁజాలు   

సకల గ్రంథమ్ములు చదివినట్లు 

భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁజాలు 

జేయెత్తిదానంబు చేసినట్లు 

మించిసజ్జనుల వంచించ కుండినఁజాలు  

నింపుగా బహుమాన మిచ్చినట్లు 

దేవాగ్రహారముల్ దీయకుండినఁజాలు  

కనకంపు గుళ్లను గట్టినట్లు 

తే. ఒకరివర్షాశనము ముంచ కున్నఁజాలు  

బేర్మికీర్తిగ సత్రాలు బెట్టినట్లు 

భూషణవికాస! శ్రీధర్మపురనివాస! 

దుష్టసంహార! నరసింహ! దురితదూర!

మోక్షజ్ఞానము మాత్రమే

 ఆ.వె.

ధర్మమార్గమెంచి దానాల జీవించి 

యజ్ఞయాగతతుల నాచరించ 

జ్ఞానమింత లేమి సాధ్యమ్ము కాదయ 

మోక్షపదము భువిని పురుషులకును 

------------------------

మోక్షజ్ఞానము మాత్రమే జ్ఞానము అనబడుతుంది.

------------------------

తే.గీ.

అర్థకామమ్ము లీ లోక మందు జెల్లు 

ధర్మమిచ్చిన స్వర్గమ్ము తాను దొలగు 

జన్మరాహిత్యపథమైన సత్యపదము 

శాశ్వతమ్మగు గాన నాశ్వాసమిచ్చు 

*~శ్రీశర్మద*

మజ్జిగకి

 *మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి*


*తక్రం*  నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది  *తక్రం*


*ఉదశ్విత్తు*  సగం నీళ్లు పోసి తయారుచేసేది *ఉదశ్విత్తు*


*మధితం*   అసలే నీరు పోయకుండా చిలికినది *మధితం*  ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.


ఈ మూడింటిలోకి  *తక్రం*  ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.


*మజ్జిగ - మహా పానీయం*


మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరం లో ఉన్నది.


*దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట*


వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.


తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది.  పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. 


ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 


చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.


వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.


వేసవి కోసం ప్రత్యేకం  *కూర్చిక పానీయం*    


*ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని  కూర్చిక అంటారు*


ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది  వాటిని కలపండి. 


*ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి* 


కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని  ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని  *రసాల పానీయం*  ఇది.


ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. 


ఎండలోకి వెళ్లబోయే ముందు  *మజ్జిగను*  ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.


చక్కగా చిలికిన  మజ్జిగ ఒక గ్లాసునిండా తీసుకోండి. 

అందులో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు 

(సైంధవ లవణం), పంచదార, చిటికెడంత తినేసోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. 


మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకోసారి త్రాగండి. 


ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి, మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.

అత్త మామలను

 *అత్త మామలను కూడా తప్పించుకోలేరు..!*


కోడలైనా  లేక అల్లుడైనా 

పుత్రులు లేని పెద్దల కర్మ కాండ - ఆడ బిడ్డ, అల్లుడి విధి


పితృదేవతారాధనా రహస్యాలు-

మా మామగారి ఆబ్దికం వస్తోంది. 

ఆయనకు మగపిల్లలు లేరు. 

అత్తమామల కోసం మేము ఏం చేయాలి?‘‘


ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. 

కుటుంబనియంత్రణ కారణంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అనుకోవడం వల్ల 

ఈ సమస్య వస్తోంది. 

అయితే ఇది నేడు క్రొత్తగా వచ్చింది కాదు. 

పూర్వం కూడా కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండే వారు. వారిని అభ్రాతృకా (సోదరుడు లేనిది) అనేవారు. 

ఆమెను వివాహం చేసుకొనేవారు కాదు. 


దీనికి అనేక కారణాలు ఉండేవి. 

ప్రధాన కారణం మాత్రం అత్తమామల తిథుల సమస్య. 

అంతేకాక అన్నో తమ్ముడో ఉంటే వారితో కలసి పెరిగిన అమ్మాయికీ, 

సోదరులు లేకుండా పెరిగిన యువతికీ తేడా ఉంటుందని కొందరి భావన. 

ఇవి అలా ఉంచితే నేడు ఒక వికృత ప్రవృత్తి తయారైంది. తన కూతురుని ఇచ్చేటప్పుడు ఆడపడుచులు లేని సంబంధాలు కావాలని వెదకి మరీ చేసుకుంటున్నారు. ఫలితంగా వీరే తమ కుమారుడికి సంబంధం వెతకడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. 

మరికొందరు  బావమరుదులు లేని ఆస్తిపరుల సంబంధాలు వెదకి మరీ చేసుకుంటున్నారు.


నేడు సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు ప్రధాన కారణం సనాతన ధర్మాన్ని మరచి పోవడమే. 

ఆస్తికోసం ఆశపడిన అభ్రాతృకను పెళ్ళాడిన వారిది 

ఒక సమస్య అయితే, 

ఆస్తి లేకుండా అభ్రాతృకను పెళ్ళాడినవారిది మరొక సమస్య. 

అయితే ఇద్దరూ పెద్దలను అర్చించడం మాత్రం మానివేశారు. 


దీని వల్ల భయంకరమైన పితృదోషాలు ఆ కుటుంబాలకు చుట్టుకుంటున్నాయి. 

పిల్లనిచ్చిన అత్తమామలు తిలోదకాలు లేకుండా అలమటించడం వల్ల ఆ కుటుంబాలకు ఈ విధమైన దోషాలు తగులుతున్నాయి. 

పోనీ వారికి పిండప్రదానాలు చేద్దామా అంటే ..

ఆస్తి తీసుకున్నాడు కదా? 

చేయకుండా ఉంటాడా? 

ఎవరికోసం చేస్తాడు?‘‘ 

అనే ఈసడింపులు వారిని అవమానిస్తున్నాయి. 

ఆస్తి తీసుకోని వారిని ..ఏమిచ్చాడని మీ మామకు చెయ్యాలి?‘‘ అని ప్రశ్నించేవారు మరికొందరు.


వీరందరికీ తెలియని రహస్యాలు హిందూధర్మంలో ఉన్నాయి.


వివాహం చేసే కన్యాదానంలో అమ్మాయిని కేవలం ధర్మఅర్థకామాల్లో సహచరిగా ఇస్తూ ఈ మూడింటిలో ఆమెను అత్రిక్రమించను అని మాట ఇచ్చిన తరువాతే పెళ్ళి జరుగుతుంది. 

మోక్షం కోసం భార్యను విడిచి సన్యాసం స్వీకరించవచ్చు. 

సన్యాసానికి భార్య అనుమతి అవసరంలేదు. 

తండ్రి అనుమతి అవసరం లేదు. 

కానీ తల్లి అనుమతి మాత్రం తప్పని సరిగా ఉండాలి. 

ఇది మొదటి రహస్యం.


కన్యాదానంలో అమ్మాయిని పూర్తిగా ధారాదత్తం చేయరు. ‘‘ఇదం తుభ్యం‘‘ అని మాత్రమే అంటారు. 

మిగిలిన అన్ని దానాల్లో ‘‘ఇది నీకు ఇస్తున్నాను. 

ఇక ఇది నాది కాదు‘‘ అని అంటారు. 

కానీ కన్యాదానంలో ఇది నీకు ఇస్తున్నాను అనిమాత్రమే అంటారు. 

న మమా (నాది కాదు) అని అనరు. 


అంటే కన్యను దానం ఇచ్చినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికి ఉంటుంది. 


ఆ అధికారం ఎంత వరకూ ఉంటుంది అంటే ఆమెకు పుట్టే సంతానం మీద మొదటి హక్కు మామగారికి ఉంటుంది. 


అంటే కుమార్తెకు పుట్టే మగసంతానం మామగారి హక్కు. కుమార్తెకు పుట్టే మగపిల్లలను దౌహిత్రుడు అంటారు. మగసంతానం లేదు కనుక ఈ దౌహిత్రుడు పుట్టింటి వారి హక్కు అవుతాడు. 

అతడిని దత్తత తీసుకునే హక్కు వారికి ఉంటుంది. అంతేకాక, మగపిల్లలు లేని అత్తమామలకు సంస్కారాలు చేసే బాధ్యత ఈ దౌహిత్రులకు ఉంటుంది. 

వారు పిండప్రదానాలు చేసి తీరాలి. 

అల్లుడు చేయడం చేయకపోవడం అతని ఇష్టం. 

కానీ శాస్త్రం ప్రకారం అల్లుడికి కూడా ఈ బాధ్యత తప్పించుకోలేనిది.

 దీన్నే ఈ విధంగా శాస్త్రంలో చెప్పారు.


త్రీణి శ్రాద్ధే పవిత్రాణి  దౌహిత్రః కుతపస్తిలాః  |

రజతస్య తథా దానం కథాసంకీర్తనాదికమ్  |  |


పితృయజ్ఞాలలో కుమార్తెకు పుట్టిన కుమారుడు, 

నువ్వులు, మధ్యాహ్న కాలాలు మహాప్రీతిపాత్రమైనవి అని  విష్ణుపురాణం చెబుతోంది.

కనుక దౌహిత్రుడుకు అల్లుడి కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది.


ఇవన్నీ ఇలా ఉంచి మా అత్తమామల తిథుల వరకూ 

వెళ్ళే ముందు వారికర్మలు ఎవరు చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. 

అప్పుడు ఎవరు కర్తృత్వంవహించారు అనేది ప్రధాన ప్రశ్న. 

కర్తృత్వం వహించి వారికి క్రియలు చేసినవారే ఉత్తర క్రియలు కూడా చేయడం సాధారణ మర్యాద. 

అయితే ఇక్కడ ఒక విచిత్రమైన అంశం గమనించాలి.


ఒక గృహిణి ఆరునెలల గర్భవతిగా ఉండగా 

ఆమె భర్త మరణించాడు. 

ఆ భర్తకు క్రియలు చేయడానికి ఆమె గర్భంలో ఉన్న పిండం మీద కర్తృత్వం వేసి కర్మకాండను బ్రాహ్మణుని నియోగించి జరిపించారు. 

అయితే ప్రసవానంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టింది. 

ఈ విధంగా కడుపులోనే ఆమె కర్తృత్వం వహించింది కనుక ఆమెను చేసుకున్న అల్లుడు వారికి పిండప్రదానాలు చేసే బాధ్యత వస్తుంది. 

పెళ్ళి అయ్యే వరకూ ఆమె ఆ తిథులను తాను కర్తగా ఉండి బ్రాహ్మణులను నియోగించి చేయించాల్సి ఉంటుంది.


ఇవన్నీ పితృయజ్ఞాల్లోని సూక్ష్మాలు.  

సామాజిక మాధ్యమాల చర్చలకు చాలా భారమైనవే అయినా కొందరు అడిగిన మీదట చెబుతున్నాము. అంతేకాక, నేడు నెలకొన్న అభ్రాతృక సమస్యల వలన 

ఇది చాలా అతిముఖ్య సమాచారం.


అన్నిటికీ మించి అత్తమామల తిథులు నిర్వహించడం కూడా అదృష్టంగా భావించాలి. 

వారిని ఆరాధించడం కనీస బాధ్యత మాత్రమే కాదు. 

వారి అపార కరుణ పొందడానికి చాలా ముఖ్యమైన మార్గం. 

దేవపూజలు కన్నా పితృదేవతల అర్చన చేయడం మహాఫలాలను ఇస్తుంది.


ఈ విధంగా పిండప్రదానాలు లేని అమ్ముమ్మతాతలను (అత్తమామలను) అర్చించడం దౌహితృలకు (అల్లునికి) సకలసంపదలూ ఇస్తుంది. 

వారు తిలోదకాలు లేకుండా ఈసురోమంటూ ఉంటే 

వీరి వంశం ఏమాత్రం ముందుకు వెళుతుందో 

ఒకసారి ఆలోచించడం మంచిది.


మరొక ప్రశ్న కూడా పరిశీలించండి.

మా అత్తగారికీ నాకు పడదు. 

చనిపోయేటప్పుడు కూడా నా నీడ పడడానికి కూడా 

ఆమె ఇష్టపడలేదు. 

మేము ఆమె తిథులు పెట్టాలా?‘‘ 


ఇది చాలా ముఖ్యమైన మరో ప్రశ్న. 

నేటి అస్తవ్యస్త కుటుంబవ్యవస్థలో సఖ్యత ఉన్న అత్తాకోడళ్ళ సంఖ్య సంతృప్తిగా లేదు. 

కొన్ని సందర్భాలలో ఇది సంపూర్తిగా ప్రతిలోమంగా ఉంది. కనుక ఇటువంటి అనుమానం వస్తోంది. 

దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి. 


ఆడపిల్ల వివాహం అయిన తరువాత అత్తారింట్లో 

అతి ముఖ్యమైన స్థానం పొందుతుంది. 

అదే వర్గత్రయంలో స్థానం. 

అంటే తాను, తన అత్తగారు, తన అత్తగారి అత్తగారు అనే పరంపరలో స్థానం పొందడం. 

ఇది మన ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉండదు. 

ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెకు ముందుగా తిలోదకాలు ఇవ్వకుంటే తనకు చెందవని గమనించాలి. 

అందరూ ఉండి అనాథప్రేతంగా అలమటించాల్సి వస్తుంది.


ఇదిలా ఉండగా మరొకటి తెలుసుకోవాలి.

బ్రతికి ఉన్నప్పటి రాగద్వేషాలు మృతులకు అంటగట్టాల్సిన అవసరం లేదు. 

ఎందుకంటే వారు పితృదేవతలు అవుతారని గమనించాలి. 

సామాన్యంగా ఉన్న మానవుల రాగద్వేషాలకు వారు అతీతులు. 

శరీరంతో వచ్చిన కోపతాపాలు శరీరంతోనే పోతాయి. అన్నింటికీ మించి మానవులకు అనేక శరీరాలు ఉంటాయి. అవి భౌతిక శరీరం అనే మనకు కనిపించే శరీరాలు. 

ఈ శరీరం అగ్నికి ప్రీతిపాత్రం అవుతుంది.  

కారణశరీరం అనేది మరొకటి వాసనల రూపంలో ఉంటుంది.  

ఇదే జనన మరణాలకు ప్రారబ్ధాలకు కారణం. 

మరొకటి యాతనా శరీరం. 

ఈ యాతనా శరీరమే స్వర్గనరకాలకు పోయి యాతనలు పడుతుంది. 

ఈ విధంగా శరీరాలు విభజన పొంది పవిత్రమైన దేవతలుగా పితరులు మిగులుతారు. 

వారినే మనం అర్చించేది. 

ఇది అందరూ తెలుసుకోవాలి. 


కనుక దేహంలో పొందిన రాగద్వేషాలు దేహంతోనే పోతాయి. 

వాటిని తెలియనితనంతో కొనసాగించి అత్తను అశ్రద్ధ చేయడం వలన పితృదోషాలు కలుగుతాయి. 

సంతానం వృద్ధిలోకి రాదు. 

పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ధననష్టాలు సంభవించడం వంటివి కలుగుతాయి. 

అత్తకు పిండప్రదానాలు చేయించడం వలన ఇహమే కాక పరంలో కూడా ఫలం ఉంటుంది. 

ఆమెను తృణీకరిస్తే ఆమె తరువాత స్థానం పొందాల్సిన కోడలికి వర్గత్రయంలో స్థానం దక్కదు. 

అంతేకాక బ్రతికి ఉన్నంత కాలంకూడా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


పై ప్రశ్నలు రెండూ అతి ముఖ్యమైనవి. 

అనేక కారణాల వలన పితృయజ్ఞాలు మానివేస్తున్నారు. వీటిని మాని వేయడం వలన నానా బాధలూ పడుతున్నారు. 

ఇన్నాళ్ళూ చేసిన తప్పులు సరిచేసుకోవడం అత్యంత తేలిక.

సరదాగా

 సరదాగా కాసేపు నవ్వుకుందాం 


మన తెలుగు భాష పై చమత్కారం తో కూడిన మాటలు


 నెలవంక ఉంటుంది గానీ

 "వారం వంక" ఉండదు అదేంటో!!!


 "పాలపుంత" ఉంటుంది గానీ

 "పెరుగుపుంత" ఉండదు.


 "పలకరింపు" ఉంటుంది గానీ

 "పుస్తకంరింపు" ఉండ దెందుకు?


 "పిల్లకాలవ" ఉంటుంది గానీ

 "పిల్లోడి కాలవ" ఉండదు. ఎందువల్లనో?

 

 "పామాయిల్" ఉంటుంది గానీ

 "తేలు ఆయిలు" ఉండదండి.


 "కారు మబ్బులు" ఉంటాయి గానీ

 "బస్సు మబ్బులు" ఉండ వేమిటో!


 "ట్యూబ్ లైటు" ఉంది గానీ

 "టైర్ లైటు" ఉండదు.


 "ట్రాఫిక్ జామ్" ఉంటుంది గానీ

 "ట్రాఫిక్ బ్రెడ్" ఉండదు.


 "వడదెబ్బ" ఉంటుంది గానీ

 "ఇడ్లీ దెబ్బ" ఉండదండి.


 "నిద్రగన్నేరు చెట్టు" ఉంటుంది గానీ

 "మెలకువ గన్నేరు చెట్టు" ఉండదండి.


 "ఆకురాయి" ఉంటుంది గానీ

 "కొమ్మరాయి" ఉండదండి.


 "పాలపిట్ట" ఉన్నది గానీ

 "పెరుగు పిట్ట", గానీ, "మజ్జిగ పిట్ట" గానీ ఉంటే ఒట్టు.


 "వడ్రంగి పిట్ట" ఉంది గానీ

 "ఇంకో వృత్తి పిట్ట" లేదు ఎందుకనో 


చుట్టరికాలు మాత్రమే ఉంటాయి గానీ

 "సిగరెట్టరికాలు" ".బీడీరికాలూ" ఉండ వేమిటో.


 "రంగులరాట్నం" ఉంటుంది గానీ

 "బ్లాక్ అండ్ వైట్ రాట్నం" ఉండ దెందుకని?


 "ఫైర్ స్టేషన్" లో ఫైర్ ఉండదండి.


"పులిహారలో" పులి ఉండదండి.


 "నేతి బీరకాయ" లో నెయ్యి ఉండదు.


 "మైసూర్ పాక్" లో మైసూర్ ఉండనే ఉండదు.

మైసూర్ బజ్జి లో మైసూర్ వుండదండి.


 "గాలిపటంలో" గాలి ఉండదండి.


 "గల్లాపెట్టిలో" గల్లా ఉండదండి.


చివరాఖరుగా

 "ఫేసు బుక్కులో" పుస్తకం వుండదండి.

"యూ ట్యూబులో" గొట్టం ఉండదండి. !


హాస్యం మనస్సును ప్రశాంతత చేస్తుంది..!

యోగ్యత

 యోగ్యత!


ద్రోణుడు విచక్షణాజ్ఞానం కలవాడు. వివేకవంతుడు. ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారమంటే- అశ్వత్థామ మరణించాడన్న గాలివార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత! అంతటి ప్రేమానురాగాలుండీ, అస్త్రవిద్యా బోధనలో ఆ ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు. శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు-సొంత కొడుక్కి నేర్పించనేలేదు. ఆ విచక్షణకు మూలం- అర్జునుడిది సంయమనం... అశ్వత్థామది తెంపరితనం! తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగం అయితే భూమ్మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని ద్రోణుడికి బాగా తెలుసు. కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు పెద్దపీట వేశాడు.


అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి అశ్వత్థామ ద్వారక వెళ్లాడు. గురుపుత్రుడన్న గౌరవంతో కృష్ణుడు సాదరంగా ఆహ్వా నించాడు. యాదవ ప్రముఖులు మర్యా దలు చేశారు. అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి-'కృష్ణా! నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చే యరాదా!' అని అడిగాడు. అనుచితమైన ఆ కోరిక యాదవులనే కాదు, శ్రీకృష్ణుణ్ని సైతం విస్మయానికి గురిచేసింది. 'మా అన్న బలరాముడుగాని, కుమారుడు ప్రద్యుమ్నుడుగాని, చివరకు నా ఆప్తమి త్రుడు అర్జునుడు సైతం ఏనాడూ ఆశించ నిదాన్ని నువ్వు కోరావు. అయినా సరే, అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను తీసుకో' అన్నాడు కృష్ణుడు. 'నిజం చెప్పు... దాన్ని ఎవరిమీద ప్రయోగించాలనుకొంటున్నావు' అని ప్రశ్నించాడు. అశ్వత్థామ వెంటనే జంకుగొంకు లేకుండా 'నీ మీదనే' అని బదులిచ్చాడు. అదీ... అశ్వత్థామ అసలు నైజం! ఇంతకూ ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా, చేతులతో ఎత్తనేలేకపోయాడు. సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయాడు.

బ్రహ్మశిరోనామకాస్త్రం విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరివిధాల వేధిం చాడు. ఆ హింసను భరించలేక చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే, దాన్ని కొడుక్కి ఉపదేశించాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన ఆ భీకర అస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మహాభారతం వివరించింది. కురు క్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక, కృపాచార్యుడు ఎంతగా వారిం చినా వినకుండా, బహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు. దాని తీవ్ర తకు లోకం కంపించిపోయింది. ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు. చివరికి వ్యాస నారద మహర్షులు, శ్రీకృష్ణ పరమాత్మ తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని ఆ మహా విపత్తునుంచి కాపాడారు.


ఈ కాలంలోని శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు, విలువైన సిరిసంపదలు, విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం- పదునైన ఆయుధాలుగానే మనం పరిగణించాలి. అవి యోగ్యులైనవారి చేతుల్లో పడిన ప్పుడే సద్వినియోగం అవుతాయని గుర్తించాలి.


ఎర్రాప్రగడ రామకృష్ణ

చరవాణి స్తోత్రమ్*

 🤔🤔🤔👌👌👌👍👍👍


*ఈ Cell phone గురించి ఎవర్రాశారో గానీ చాలా సరదాగా ఉంది. సరళ సంస్కృతంలో ఉండటం వల్ల* *తెలుగు మాతృభాషలో అందరికీ సులభంగా అర్థమవుతుంది. పోతే రాసిన కవి ఎవరో తెలియదు కానీ ఆ అజ్ఞాత మనిషికి ఈ రూపకంగా శతాధిక అభినందనలు తెలుపుకుంటున్నా..* 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

         

        *చరవాణి స్తోత్రమ్*


ప్రథమం వాయుభాషణం| 

ద్వితీయం యంత్ర గణనం|

తృతీయం ఛాయాచిత్రాణి |

చతుర్థం క్రయ విక్రయం |

పంచమం అంతర్జాలిన్యాం |

షష్టమం క్రీడా విలాసిని |

సప్తమం చిత్ర దర్శిని |

అష్టమం ఖండాతర దర్శినీ |

నవమం సర్వప్రాంత విహారిణీ |

దశమం మార్గదర్శిని |

ఏకాదశం ముఖపుస్తకే |

ద్వాదశం వ్యర్థ సందేశః |

ఇతి ద్వాదశ నామానీ |

చరవాణీ నమోస్తుతే||


చరవాణీ నమస్తుభ్యం | 

సర్వ వార్తా సమన్వితః|

చరాచర స్వరూపేణ | 

విద్యుత్ గ్రాస భక్షిణీ||1||


చిత్రగ్రహణ రూపేణ| 

యంత్ర గణన రూపిణీ |

క్రయ విక్రయ సర్వాణీ |

గృహ ప్రాంగణ దర్శిని||2||


సర్వ స్తోత్రాణి గానాని |

కర్ణాంతరాళ శ్రావణి |

దూర ప్రాంతేషుమార్గాణి | 

అంతర్జాల సందర్శిని ||3||


మధ్యమాంగుళ తర్జన్యా|

స్పర్ళ మాత్రేణ శోభినీ |

సర్వ మానవ హస్తేన |

అలంకారేణ దర్శనం॥|4॥


సర్వక్రీడా సముత్పన్న | 

సర్వ వస్తు విలక్షణ| 

దూరభారాణి విచ్ఛేద |  

వాయుమార్గ సంచారిణీ ॥5॥


ఖండాంతర నివాసిన్యాం|

భాషణేషు సమీపతః |

వాయు సంకేత గ్రాహేణ|

సమీపేన సందర్శిని ॥6॥


వినా మానవ హస్తేన |

క్షణక్షణ విచారిణః |

చరవాణి సభా మధ్యే | 

సంభాషణే విశేషతః ॥7॥


కార్య కారణ సంబంధ |

మధ్యే వాయు విహారిణీ |

సందేశాని సంకేతాణి |

పురోగతి నిరోదకః ॥8॥


వయో విత్తం జ్ఞాన శూన్యం|

లింగ భేదాన్యేవచ |

చరవాణీ వినాహస్తే |

పశు రూపేణ గణ్యతే ॥9॥


జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|

గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |

యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 

దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥


వాగ్భూషణం చరభాషణం|

చరవాణీ హస్త భూషణం|

కర్ణే వార్తాయాం శ్రవణం |

చరవాణీ నమోనమః ॥11॥


కంపనం ఆగమనేన |

సూక్ష్మ ప్రాణి వినాశనం |

సంభాషణేన సర్వాణీ | 

వాయు మార్గేన గమ్యతే ॥12॥ 


సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |

సంఖ్యా ధీనేన వర్తినీ| 

  వ్యర్థేన కాలక్షేపాయ | 

కుర్వంతి వ్యర్థ భాషణం ॥13॥


జ్ఞప్తి పత్రాణి సంయుక్త |

నామ పత్ర సమన్విత | 

ఇదం పత్ర వినాశేన | 

సర్వ సంబంధ నాశనం ॥14॥


             *ఫలశృతి* 

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

ప్రయాణే భాషణేనస్య |

ప్రమాదానిచ లభ్యతే |

వైద్యశాలాయాం గచ్చంతీ |

పరలోకం చ లభ్యతే ॥


చరవాణీ యో జానాతి | 

అనారోగ్యంచ లభ్యతే|

నిత్య ప్రయోగ మాత్రేన| 

మృత్యు మార్గం చ గమ్యతే||

🙏🙏🙏🙏🙏🙏

మంగళవారం🍁* *🌹25, మార్చి, 2025🍁* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

*🌹25, మార్చి, 2025🍁*       

    *దృగ్గణిత పంచాంగం*                


             *ఈనాటి పర్వం*

*సౌమ్య/పాప విమోచిన్యైకాదశి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం/ కృష్ణపక్షం*

*తిథి       : ఏకాదశి* రా 03.45 వరకు ఉపరి *ద్వాదశి*


*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : శ్రవణం* రా 03.49 వరకు ఉపరి *ధనిష్ఠ*


*యోగం  : శివ* మ 02.53 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం   : బవ* సా 04.30 *బాలువ* రా 03.45 ఉపరి *కౌలువ*


 *సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 10.00 - 11.00 సా 04.00  - 06.00*

అమృత కాలం  : *సా 05.41 - 07.15*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.38*


*వర్జ్యం           : ఉ 08.20 - 09.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.34 - 09.23 రా 11.02 - 11.49*

*రాహు కాలం   : మ 03.16 - 04.48*

గుళికకాళం      : *మ 12.13 - 01.45*

యమగండం    : *ఉ 09.11 - 10.42*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.08* 

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.08 - 08.34*

సంగవ కాలం         :      *08.34 - 11.00*

మధ్యాహ్న కాలం    :      *11.00 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.19*

ప్రదోష కాలం         :  *సా 06.19 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.37*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.33 - 05.20*

________________________________

        *🌷ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం🙏*


*బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క వారైద్విభావ్య॥*

*భక్తార్తి భంజన దయాకర రామదాస॥*

*సంసార ఘోర గహనే చరతోజితారే:॥*

*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹