11, డిసెంబర్ 2023, సోమవారం

ప్రత్యేకంగా పిలుస్తాం.

 శ్లో! అన్యముఖే దుర్వాదో యః ప్రియవదనే స ఏవ పరిహాసః

ఇతరేంధన జన్మా, యో ధూమః, సోగరుభవో ధూపః

—నీతి శాస్త్రం.


ఇతరుల నోటి నుంచి వచ్చిన అపశబ్దం లేక చెడ్డ మాట, మనకు కావలసిన వారి నోటి నుంచి గానీ, మన పిల్లల నోటి నుంచి గానీ వస్తే, అది పరిహాసంగా తీసుకుంటాం. ఇతర 

కట్టెల నుంచి వచ్చిన పొగను 'ధూమం' అంటాము. అదే అగరు పుల్లల నుంచి వస్తే 'ధూపం' అని, గౌరవంగా, ప్రత్యేకంగా పిలుస్తాం.

ఏ కాలమయినా, ఇది అన్వయించుకోదగ్గ శ్లోకం. పర, తన మధ్య తేడా ఎప్పటికీ వుంటుంది. మన పిల్లల అల్లరి ముద్దుగా వుంటుంది. మన పిల్లల అల్లరిలో పదవ వంతు ఇతర 

పిల్లలు చేసినా, భరించలేక పంపించేస్తాము.

మన పిల్లలు బాగా తింటే, మా వాడు మంచి 'తిండి పుష్ఠి' కలవాడు అంటాం, అదే తిండి ఇతరులు తింటే, వాడొట్టి 'తిండి పోతు' అని వెంటనే వెటకారంగా అంటాం. ఇలా ఎన్ని 

ఉదాహరణలెన్నైనా చెప్పవచ్చు. ఇది లోక రీతి, నీతి.

శంకరులవారి నిర్వాణ షట్కము*

 *శంకరులవారి నిర్వాణ షట్కము*


మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం – న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే

న చ వ్యోమభూమిః న తేజో న వాయుః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః – న వా సప్తధాతుర్న వా పంచకోశః

న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2 ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ – మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3 ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం – న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4 ||

న మృత్యుర్న శంకా న మే జాతిభేదః – పితా నైవ మే నైవ మాతా న జన్మ

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5 ||

అహం నిర్వికల్పో నిరాకారరూపో – విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్

సదా మే సమత్వం న ముక్తిర్న బంధః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 6 ||

సోమవారం, డిసెంబరు 11,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, డిసెంబరు 11,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:చతుర్దశి తె5.31 వరకు

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:విశాఖ ఉ11.38వరకు

యోగం:సుకర్మ రా9.14 వరకు

కరణం:భద్ర సా5.32 వరకు తదుపరి శకుని తె5.31 వరకు

వర్జ్యం:మ3.42 - 5.19

దుర్ముహూర్తము:మ12.15 - 12.59 & మ2.27 - 3.11

అమృతకాలం:రా1.26 - 3.04

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి : వృశ్చికం 

చంద్రరాశి : వృశ్చికం 

సూర్యోదయం:6.24

సూర్యాస్తమయం:5.23


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

⚜ శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్‌ ఆలయం.

 🕉 మన గుడి : నెం 265






⚜ గుజరాత్ : వాదనగర్.


⚜ శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్‌ ఆలయం.



💠 గుజరాత్‌లో, హత్కేశ్వర్ మహాదేవ్ వాద్‌నగర్ వెలుపల ఉన్న పురాతన మరియు చారిత్రాత్మక దేవాలయం.


💠 గుజరాతి భాషలో హటక్ బంగారాన్ని సూచిస్తున్నందున దీనిని హటకేశ్వర్ మహాదేవ్ అని పిలువబడింది.


💠 హట్కేశ్వర్ ఆలయంలోని శివలింగం స్వచ్ఛమైన బంగారంతో సృష్టించబడిందని నమ్ముతారు. 

శివలింగం బంగారంగా ఉండటానికి సంబంధించి ఒక స్థానిక కథ ఉంది. 


💠 ఒకసారి పార్వతీ దేవి తనకు రాముడిలోని ఏకపత్నీవ్రత దీక్షని పరీక్షించాలని ఉంది అని శివుడిని కోరినట్లు చెబుతారు.

అందుకు శివుడు ఒక చిరునవ్వు నవ్వి  రాముడిని పరీక్షించడానికి అనుమతి ఇస్తాడు.


💠 పార్వతీదేవి సీతాదేవి రూపాన్ని ధరించి, రాముడిని పరీక్షించడానికి వెళ్ళింది. అయినప్పటికీ, రాముడు ఆమెను గుర్తించి, అవిడకి నమస్కరించి పరమశివుని గురించి అడిగాడు. 

తత్ఫలితంగా, పార్వతీ దేవి తనకు తాను అవమానంగా భావించి, శివుని దగ్గరకు తిరిగి వచ్చింది. 


💠 శివుడు పార్వతీ దేవిని అడిగినప్పుడు, ఆమె శ్రీరాముని పరీక్షించి అతనికి ఆమె నిజస్వరూపం తెలియకుండా విజయం సాధించింది అని అబద్ధం చెప్పింది. 

అయితే, తన మూడవ కన్నుతో, శివుడు పార్వతీ దేవి యొక్క అబద్ధాన్ని పట్టుకున్నాడు. 


💠 పార్వతీ దేవి ఈ తప్పు చేసినందున, శివుడు ఆమెను కొన్ని రోజులు  విడిచిపెట్టాడు. 

తన చర్యకు పార్వతీ దేవి  ప్రాయశ్చిత్తంగా తప్పస్సుకి వెళ్ళిపోయింది.

ఈ స్థితిలో, శివుడు పార్వతీ దేవి దూరం అవడం  వల్ల  ఏకాంతాన్ని అనుభవించాడు మరియు ప్రతిచోటా సంచరించడం ప్రారంభించాడు. 


💠 సంచరిస్తున్న సమయంలో, శివుడు ఎలాంటి దుస్తులు లేకుండా చమత్‌కర్‌నగర్ (ప్రస్తుత వాద్‌నగర్) చేరుకున్నాడు. అతని శరీరం బ్రాహ్మణుల భార్యలను ఆకర్షించింది మరియు వారు శివుని వెంట తిరగడం ప్రారంభించారు. బ్రాహ్మణులు శివునిపై చాలా విసుగు చెందారు మరియు వారు అతనిపై ప్రయోగించడానికి ఒక ఆయుధాన్ని సృష్టించారు. ఆ విధంగా, శివుడు శివలింగంగా రూపాంతరం చెందాడు మరియు దాని గుండా రక్త ప్రవాహం ప్రారంభమైంది. 

ఈ పరిణామం చూసి అన్ని  లోకాలలోని ప్రజలు  మరియు దేవతలు చాలా భయపడ్డారు. 


💠 అప్పుడు, బ్రహ్మ దేవుడు తాను పూజించే బంగారు శివలింగంగా మారాలని శివుడిని కోరుకున్నాడు. తదనంతరం శివలింగం బంగారంగా మారింది మరియు బ్రహ్మ దేవుడు దానిని పూజించడం ప్రారంభించాడు.

అలా ఈ ప్రాంతంలో వెలసిన శివలింగం బంగారు వర్ణంగా వెలసింది అని స్థానిక కథనం


💠 ఈ ఆలయం అబూ పర్వతానికి నైరుతి వైపున ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివుని ఆలయం నాగర్ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం, వీరు మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ పట్టణంలో సాంప్రదాయకంగా చాలా ప్రసిద్ధ సమాజం. ప్రస్తుతం, హట్కేశ్వర్ ఆలయం లెక్కలేనన్ని మంది భక్తులచే పూజించబడుతోంది.


💠 హట్కేశ్వర్ ఆలయంలో ప్రధాన విగ్రహం శివుడు. 

ఈ ఆలయాన్ని 3 వ శతాబ్దంలో పూర్తిస్థాయిలో నిర్మించారు.


💠 పురాణాల ప్రకారం, హటకేశ్వర ఆలయాన్ని నిర్మించిన నాగరాజు బబృవాహనుడికి తాత. 

వాద్‌నగర్ నగరంలో హటకేశ్వరాలయాన్ని నిర్మించడానికి బబృవాహనుడికి తన తండ్రి అర్జునుడు కూడా సహాయం చేశాడని చాలా మంది నమ్ముతారు


💠 హత్కేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన వివిధ కథలు హిందూ మతంలోని అనేక పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. 

ఇది శివుడు,పార్వతి, వ్యాసుడు, నాగర్ బ్రాహ్మణుడు, ఇంద్రుడు మొదలైన వారితో జతచేయబడింది. 

ఇది సుమారు 1800 సంవత్సరాల నాటి ఆలయాన్ని నిర్మించిందని మరియు శ్రీ హత్కేశ్వర్ మహాదేవ్ యొక్క శివలింగం భూమి దిగువ వరకు వెళుతుందని కూడా నమ్ముతారు .

ఆలయ లోపలి గర్భగుడిలో స్వయంభువు శివలింగం ఉంది.


💠 ఆలయం వెలుపలి భాగంలో నవగ్రహాల బొమ్మలు, సంగీత విద్వాంసులు, నృత్యం చేసే అప్సరసలు, రాజప్రతినిధి దేవతలు, ప్రధాన దేవతలు, రామాయణం మరియు మహాభారతంలోని దృశ్యాలు మరియు వివిధ జంతువులు, విష్ణువు అవతారం, సముద్ర మథనం, శంఖం, ఐరావతం  మరియు పుష్పాల మూలాంశాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. 


💠 ప్రాంగణంలో పురాతన కాశీవిశ్వేశ్వర శివాలయం, స్వామినారాయణ దేవాలయం మరియు రెండు జైన దేవాలయాలు ఉన్నాయి.


💠 హత్కేశ్వర్ మహాదేవ్ మందిర్‌ను పూజల కోసం భారతదేశం నలుమూలల నుండి అనేక మంది శివ భక్తులు సందర్శిస్తారు.


💠రోడ్డు ద్వారా మెహసానా (47 కి.మీ), అహ్మదాబాద్ (111 కి.మీ). 

వాద్‌నగర్ నుండి 42 కి.మీ.

Panchaag

 


శ్రీ స్తంభేశ్వర మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 264


⚜ గుజరాత్ : కవికంబోయి, వడోదర 


⚜ శ్రీ స్తంభేశ్వర మహాదేవ్ మందిర్



💠 స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం భారతదేశంలోని గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో కవి కాంబోయ్‌లో ఉన్న శివుని ఆలయం


💠 ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల పురాతనమైనది.  ఈ ఆలయాన్ని సబ్‌మెర్జింగ్ టెంపుల్ అని కూడా అంటారు.


⚜ స్థల పురాణం ⚜


💠 ఈ ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. 

శివుని కుమారుడైన కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే!

తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు.


💠  శ్రీమహావిష్ణువు అతనిని ఓదార్చాడు- ‘అమాయకులను పీడించే  దుష్టుడిని చంపడం పాపం కాదు.  కానీ, ఇప్పటికీ, మీకు అపరాధం అనిపిస్తే, మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఉత్తమ మార్గం శివలింగాలను స్థాపించి, వాటిని లోతైన భక్తితో పూజించడం.

శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడు.


💠 అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. 

వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.


💠 అలలకు అనుగుణంగా

స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా, దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం ఓ 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు.


💠 కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం.


💠 అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది.


💠 ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది.


💠 సముద్రం మంచి పోటు మీద ఉండే అమవాస్య/ పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది.


💠 ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం కష్టం. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. 

ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం.


💠 ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిమంది ఇక్కడకు చేరుకుంటారు.


💠 శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే... ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీతెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం.

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



)

విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు.

చెయ్యి పైకెత్తి “తిష్ఠ” (ఆగు) అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు.

పునశ్చుక్రోశ భూపాలో విశ్వామిత్రేతి చాపకృత్ |

పతామి రక్ష దుఃఖార్తం స్వర్గాచ్చలితమాశుగమ్ ॥

కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూతనంగా మరొక స్వర్గలోకాన్ని

సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.

బ్రహ్మర్షీ! నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీ కోపం ఎవరిమీద? దయచేసి ఈ ప్రయత్నం

విరమించు. ఇదిగో నేనున్నాను. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. వెంటనే చేస్తాను.

చేస్తావా ? అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుణ్ణి నీతో స్వర్గానికి

తీసుకువెళ్ళు అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనక సరే

అని అంగీకరించాడు. త్రిశంకుణ్ణి దివ్యదేహ దివ్యాంబర దివ్యభూషణ విరాజితుణ్ణిచేసి తన దివ్యవిమానంలో

సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడి

మనస్సు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు.

.

ఈ విశేషాలు తెలుసుకుని హరిశ్చంద్రుడూ సంబరపడ్డాడు. ప్రసన్నచిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ

రూపయౌవనచాతుర్యవంతయుక్తయైన భార్యతో క్రీడావినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా

ఏళ్ళు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి కానీ ఎంతకూ భార్యకడుపు పండలేదు. ఇదొక

పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకువంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు. ఒక

శుభముహూర్తాన వసిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పాదాభివందనం చేసి తన దిగులు వెల్లడించాడు

Safety


 

Under water cave temple


 

Vaddana



 

రంగు కాగితం

 *ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*


*ఒక రోజు, ఆ  గుడిలో నుంచి ఒక సాధువు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు.*


 *మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా !*

*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*


*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది.  బాబు, మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.*

*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు .*

*ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*

*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు సంపాదించలేను .*

*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*


*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు.*

*"మీ కోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా? "* 


*ఆ ముసలావిడ ఇలా చెప్పింది. నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.*


*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటాడు .*


*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు .*

*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*

*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*


*ఆ ముసలావిడకు చదువు రాదు .*

*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు .*


*ఫ్రెండ్స్, ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .* 

*కానీ, మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*


*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*


*కాని, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*

*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*


*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అల్మారాలో భద్రంగా పెడుతున్నాం .*


*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం* 


*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*


*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత యథాతథం.*


*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన సంపూర్ణ శాస్త్ర గ్రంథం భగవద్గీత  .*


*ఎన్నో వ్యాధులకు మందులు రామాయణ మహా భారత భగవద్గీతలలో ఉన్నాయి*


*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత యథాతథం.*


*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత యథాతథం .*


*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథము భగవద్గీత  .*


*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత యథాతథం.*


*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత యథాతథం .*


*ఫ్రెండ్స్ ,*

 *డిసెంబర్ 23 గీతా జయంతి సందర్భంగా భగవద్గీతను మీరు చదవండి మీ పిల్లలతో చదివించండి మీ బందువులకు, మిత్రులకు వితరణ చేసి వారి జీవితాలను కూడా ఆనందమయం చేసుకోవడానికి మీరు సహకరించండి* 



*ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి పంపించి మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి*

తలతిప్పు రోగం ( vertigo )

 తలతిప్పు రోగం ( vertigo ) నివారణా యోగాలు  - 


  ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇది పూర్తిగా పైత్యసంబంధ సమస్య.  మన చుట్టూ ఉన్న భూమి తిరిగిపోతున్నట్టు బ్రాంతి కలుగుతుంది . కొంతమందికి పొద్దున్నే నిద్రలేవగానే ఈ సమస్య కలుగుతుంది . దీన్ని ఆంగ్లము నందు VERTIGO or DIZINESS అని పిలుస్తారు .


 నివారణా యోగాలు  -


 *  నిమ్మకాయ రసంలో జీలకర్ర నానబెట్టి మరలా ఎండబెట్టాలి .మరలా నానబెట్టి ఎండబెట్టాలి .ఈ విధానాన్ని ఆయుర్వేదంలో భావన చేయడం అంటారు. ఇలా 7 రోజులపాటు చేసిన తరువాత ఉదయాన్నే ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల చొప్పున తినుచున్న తలతిప్పు రోగం నశించును.


 *  చిన్న అల్లం ముక్క కి ఉప్పు కలిపి బుగ్గన పెట్టుకుని రసం మింగుచున్న ఈ సమస్య తీరును . ఉదయం పూట పరగడుపున చేయవలెను .


 *  అల్లం రసం ఒక స్పూన్ , నిమ్మరసం ఒక స్పూన్ , తేనె ఒక స్పూన్ కలిపి ఉదయాన్నే పరగడుపున ప్రతినిత్యం సేవించుచున్న తలతిప్పు రోగం నశించును.


       పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులువుగా ఉంటే దానిని పాటించండి. ముఖ్యంగా టీ , కాఫీ పూర్తిగా నిషిద్దం.


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

దామోదరుని లీలలు

 కార్తీక మాసము ముగియనున్నది ! 

మరొక్కసారి ఆ దామోదరుని లీలలు మనసారా ధ్యానించుకుందాము !🙏🙏


🌹🌹


*భక్తికె వశమౌ నీతడు ,*

*భక్తిని పోషించి పెంచు పరమాత్ముం డే-*

*శక్తికి బందీ గాడను-*

*రక్తిగ శరణాగతులకె రాశిగనందున్ !*


🌹🙏🌹


ఈ దామోదరుడు మనకు అందెడి మార్గము ఒక్కటే భక్తి , శరణాగతి !🙏🙏


ఆ బుద్ధి మనలో కలగాలన్నా ఆతని కృపయే కారణమైయున్నది !🙏🙏


🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺


*( పట్టగలమా నిన్ను ?? కట్టగలమా నిన్ను ?? )*


🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺


( దామోదరలీలలు , 🙏విన్నా చదివినా మోక్ష సాధనకు కావలసిన అంతరార్ధము గ్రహించగలమని పెద్దలు గురువులు చెప్పియున్నారు .🙏🙏

అట్టి దామోదర లీలలు నా భావములు గా కందములలో 🙏🙏) 


🌹🌹🙏🌹🌹👇



*పట్టుకునందక కృష్ణుడు ,*

*బెట్టెను గోకులమునందు , బిరబిర పరుగుల్ !*

*పట్టెద నెటులైన ననుచు ,*

*గట్టిగ మనమున యశోద , గండుగ దలచెన్ !*


🌹🌹


*పట్టుకు జిక్కని వానిన్ ,*

*బట్టితినని దల్చి తల్లి , పరవశమాయెన్ !*

*బట్టువడె తనకు తానే ,*

*పట్టుట శక్యంబుగాదు , పరమేశ్వరునిన్ !!*


🌹🌹


*పట్టిన వానినటులనే ,*

*గట్టెదనని తాడు దెచ్చె గబగబ ; వానిన్-*

*గట్టుటకున్ సాధ్య పడక ,*

*గుట్టగ దెచ్చినవి యన్ని ,కురచలె యాయెన్ !*


🌹🌹


*కట్టెదనన్న యశోదను ,*

*కట్టించుకొనగ నిలిచిన , కన్నయ నెటులన్*

*గట్టునొ ? యని కాంతామణు-*

*లట్టే గనులార్పక నదె , యరమర నుండెన్ !!*


🌹🌹


*కట్టగ వశమౌనా యీ-*

*దిట్టను ? పాశములు బట్టి ,దిరుగుచు నుండన్ ?*

*గట్టించుకొనును నతడే*

*నెట్టన పాశముగ భక్తి , నిలుపగ వలయున్ !!*


🌹🌹🙏🙏🌹🌹


( పద్యరీతి -- కందము )🙏


  ✍️ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏

Kaasilo room


 

Aratipsndu appalu


 

నవగ్రహా పురాణం

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *103వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శనిగ్రహ చరిత్ర - 3*


శనైశ్చరుడు విజయోత్సాహంతో సూర్యమందిరానికి తిరిగి వచ్చాడు. సంజ్ఞకూ , సూర్యుడికీ పాదాభివందనాలు చేశాడు.


*"యముడు ఎక్కడ ?"* అని సంజ్ఞను అడిగాడు.


*"నువ్వు తపస్సుకు వెళ్ళినపుడే సంయమనీ పట్టణానికి వెళ్ళిపోయాడు కద ! ఇప్పుడు నీ సోదరుడు దక్షిణ దిక్పాలకుడు !"* సంజ్ఞ నవ్వుతూ చెప్పింది.


*"నాన్నగారూ ! నేను ఏకకాలంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరుల గురించి తపస్సు చేశాను ! ఏక కాలంలో ముగ్గుర్నీ సాక్షాత్కరింపజేసుకున్నాను..."*


*"నిజమా ?! ఏకకాలంలో తపస్సా ?"* సూర్యుడు ఆశ్చర్యంతో అడిగాడు.


*"ముగ్గురూ ఒకేసారి సాక్షాత్కరించారు ! కోరిన వరాలు ప్రసాదించారు !"* శని గర్వంగా అన్నాడు. త్రిమూర్తుల నుండి తాను ఆర్జించిన వరాలను వివరించాడు.


సూర్యుడూ , సంజ్ఞ , సావర్డీ , తపతీ - శనైశ్చరుడిని అభినందించారు.


*"యముడు ఇద్దర్ని మెప్పించినందుకే అంతగా శ్లాఘించారే. నాన్నగారూ ! నేను ఇద్దర్ని కాదు , ముగ్గుర్ని మెప్పించాను ! ఇప్పుడేమంటారు ?"* శని నవ్వుతూ అన్నాడు.


*"మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. శనీ ! ఎందుకంటే యముడి మీద స్పర్ధతో నువ్వు శ్రమించావు , సాధించావు ! స్పర్ధ వృద్ధికి దోహదం చేస్తుంది !"* సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు.


*"యముణ్ణి చూసి తండ్రిగా గర్వించాను. నిన్ను చూసి ఇంకా అధికంగా గర్విస్తున్నాను ! ఆయుర్దాయ కారకుడుగా ఎదిగావు కద !"*


*“ఇంక మనం త్వరపడాలి. స్వామీ ! మన శనైశ్చరుడికి తగిన వధువుతో వివాహం జరిపించాలి !"* సంజ్ఞ సూర్యుడితో అంది.


*"జ్యేష్ఠమాతా ! నేను సామాన్య కన్యను స్వీకరించను ! నన్ను చూసి భయపడని ధైర్యం కలిగినదానినీ , నా కళ్ళల్లోకి సూటిగా చూడగలిగిన దానిని మాత్రమే అరాంగిగా అంగీకరిస్తాను !"* శనైశ్చరుడు నిష్కర్షగా అన్నాడు.


*“అలాగే , శనీ ! నువ్వు కోరే ధీరవనితనే ఎన్నిక చేస్తాం !"* సంజ్ఞ చిరునవ్వుతో అంది. 


*“అదే ! ఆ విషయం గుర్తుంచుకోండి , వధువును అన్వేషించేటప్పుడు !"* అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావర్జీ , యమీ , తపతీ అతని వెంట వెళ్ళారు. శని


*“కష్టతరమే !”* సూర్యుడు సంజ్ఞాదేవిని చూస్తూ సాలోచనగా అన్నాడు.


*"ఏమిటి స్వామీ ?”*


*"మన శనైశ్చరుడి దృష్టిని తట్టుకునే , అతని కళ్ళల్లోకి ధైర్యంగా చూసే స్త్రీ మూర్తి లభించడం !"* సూర్యుడు నిట్టూర్చాడు.


*************************************



ఆమె పేరు జ్యేష్ట , శరీర వర్ణం కారునలుపు. నేత్రాలు నిప్పుకణికలు , ముఖం కారం ! ఒక లిప్త పాటు ఎవ్వరూ చూడలేని , భయానక , బీభత్స 'సౌందర్యం !'


ఆమెను చూడగానే బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ రోతపుట్టి , తలలు తిప్పేసుకున్నారు. చతుర్ముఖుడు ఆమెను చూడకుండా ఉండే ప్రయత్నంలో చాలా అవస్థపడిపోయాడు. ఎటు తిరిగినా ఏదో ఒక తల ఆమె వైపు తిరిగి ఉంటుంది.


ఆయన అదృష్టం కొద్దీ శ్రీమహావిష్ణువు ఆమెను అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని. ఆజ్ఞాపించాడు. ఆమె వెళ్ళిపోయింది.


ఆనాటి నుండీ తనను చేపట్టే పురుషుడి కోసం జ్యేష్ఠ నిర్విరామంగా అన్వేషిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో సంచరించని ఊర్ధ్వలోకాలు లేవు !


సాక్షాత్తూ దేవేంద్రుడు ఆమె సమీపించగానే నందనవనంలోంచి పారిపోయాడు !


గంధర్వ యువకులు , కిన్నర యువకులు , కింపురుషులు - ఒక్కరేమిటి దేవగణాలన్నింటికీ చెందిన పురుషులు ఆమె వైపు చూడడానికే వణికి పోయారు. కొందరు పారిపోయారు. కొందరు పారిపోలేక మూర్ఛతో కూలిపోయారు !


చివరికి లోకభీకరాకారులైన రాక్షసులు కూడా ఆమె భయానక రూపాన్ని దర్శించలేక కకావికలైపోయారు ! దిక్పాలకులు తమ తమ దిక్కులు వదిలి దిక్కుతోచని వాళ్ళలాగా పరుగులు పెట్టారు. సిద్ధులూ , చారణులూ అందరిదీ ఒకటే స్పందన - పరుగు !


విసిగి , వేసారి పోయిన జ్యేష్ఠ అరణ్య మార్గాన నడుస్తూ , తన భవితవ్యం గురించి తీవ్రంగా ఆలోచించుకుంటోంది. ఈ సృష్టి ఇంత అసంపూర్ణంగా ఉందా ? తనను తేరిపార చూసే పురుషుడే లేడా ఈ సృష్టిలో ! జ్యేష్ఠ తటాలున ఆగి , చెవులు రిక్కించింది. ఏదో లయబద్ధమైన ధ్వని ; ఎవరో వస్తున్న అలికిడి , జ్యేష్ఠ వెంటనే చెట్టు చాటుకు తప్పుకుంది.


కాలాన్నీ , స్థలాన్నీ మరిచిపోయి నారాయణనామ సంకీర్తన చేస్తూ వస్తున్న నారదుడు ఉలిక్కిపడి ఆగాడు. వీణ తీగల మీద నర్తిస్తున్న వేళ్ళు కొయ్యబారిపోయాయి. ఎదురుగా , దగ్గరగా , తనదారికి అడ్డుగా భీకరాకారం ! నారదుడు ఆమెను చూడలేక గిరుక్కున వెనుదిరిగి పరుగుపెట్టే ప్రయత్నం చేశాడు.


*"ఆగు !"* జ్యేష్ఠ కంఠం గర్జించింది.


నారదుడు కొయ్యబారి నిలిచిపోయాడు.


*"నువ్వెవరో నాకు తెలుసు ! ఇటు తిరుగు నారదా !"* జ్యేష్ఠ నవ్వింది.


*"అమ్మో... నీ వైపు.. చు.. చు... చూడను !".*


*"ఏం ? ఎందుకు చూడవు ?"* ఎందుకో తెలిసి కూడా అడిగింది జ్యేష్ఠ.


*"నేను చూస్తే... దిష్టి తాకుతుంది నీకు !"* నారదుడు అమాయకత్వం నటిస్తూ అన్నాడు..


జ్యేష్ఠ నవ్వు నారదుడి శరీరాన్ని ఒక్కసారి జలదరింపచేసింది. *"అందుకే నువ్వంటే ఇష్టం ! అందరూ నన్ను భయంతో చూడ్డం లేదు. నువ్వేమో పాపం... నాకు దిష్టి తాకుతుందన్న ప్రేమతో చూడ్డం లేదు ! నేనంటే నీకు ఇష్టమని అర్థమైపోయిందిలే , నారదా ! నన్ను... ఎవ్వరూ వివాహం చేసుకోవడం లేదు ! నువ్వు చేసుకో నారదా !"* జ్యేష్ఠ నారదుడి వీపునే చూస్తూ అంది.


నారదుడు ఉలిక్కిపడ్డాడు. అతని వేళ్ళు అడ్డదిడ్డంగా సోకి వీణతీగలు 'గుయ్' మన్నాయి. *"నేను.. నేను... చేసుకోకూడదు !"*


*"నువ్వు చేసుకోవాల్సిందే ! నాకు ఎంతో నచ్చావు !”*


*“నారాయణ ! నేను ఆజన్మ బ్రహ్మచారిని తల్లీ ! వివాహం చేసుకోకూడదు ! నిన్నే కాదు , ఎవ్వర్నీ చేసుకోను !"*


*"ఎన్ని కారణాలు చెప్పినా , నిన్ను వదలను !"* అంటూ జ్యేష్ఠ నారదుడి భుజం మీద చెయ్యి వేసింది.


నారదుడి శరీరం ఒక్కసారి వణికింది. మెల్లగా నోరు పెకలించుకున్నాడు. *"జ్యేష్ఠా ! నా మాట విను ! నిన్ను భార్యగా స్వీకరించబోయే పురుషుడు నీలాగే ధైర్యసాహసాలు కలిగి ఉండాలి ! నీ ముఖంలోకి చూడలేని నాలాంటి భీరువులు నీకు భర్త కాలేరు !"*


జ్యేష్ఠ చెయ్యి నారదుడి భుజం మీద నుంచి జారింది. *"అంటే , నన్ను చూడాలంటే నీకూ భయమేనా , నారదా ?"*


*"నిజం చెప్పాలంటే భయమే ! దిష్టి తాకుతుందంటూ ఊరికే , హాస్యానికన్నాను ! నా మాట విను ! నీకు తగిన ధైర్యశాలిని పట్టు !"*


*"లోకాలన్నీ గాలించాను. అలాంటి వాడు లేడు ! నా ముఖంలోకి ధైర్యంగా చూసే పురుషుడు లేడు !"* జ్యేష్ఠ విచారంగా అంది.


*"ఎందుకు లేడమ్మా ! ఉన్నాడు. నీ ముఖారవిందంలోకి తదేకంగా ఎలా చూడలేమో , ఆయన ముఖారవిందంలోకి అలాగే తదేకంగా చూడలేం ! ఆ పురుషపుంగవుడు ఎలా ఉంటాడో వర్ణిస్తాను విను. కాటుక ముద్దలాంటి శరీరం ! ఎరుపూ , పసుపూ రంగులు కలిసినట్టుండే మిడిగ్రుడ్లు తేరిపార చూడలేని భీకరాకారం..."*


*"ఆహా ! నిజంగా... అలాంటి... స్ఫురద్రూపం కలిగిన పురుషుడున్నాడా , నారదా ? ఎక్కడ ? ఎక్కడున్నాడు ?"* జ్యేష్ఠ ఉత్సాహంగా అడిగింది.


*"నువ్వు ఏనాడైనా సూర్య మందిరం వైపు వెళ్ళావా ?"* నారదుడు ప్రశ్నించాడు.


*"లేదు...”*


*“వెంటనే అటువైపు సాగిపో ! నీకు తగిన పురుషపుంగవుడు - నీ సమ ఉజ్జీ అక్కడ నీకు తారసిల్లుతాడు !"* 


*"ఎవరతడు ? ఎవరో చెప్పు నారదా ?”* జ్యేష్ఠ మారాం చేస్తున్నట్టు అడిగింది.


*“ఆనవాలు చెప్తాను విను ! అతను నిన్ను చూడగానే వెనుదిరగడు ! పారిపోడు ! నువ్వు చూసినట్టే , తదేకంగా , నిర్భయంగా నీ విశాల , ఉన్నత నేత్రాలలోకి అదేపనిగా , తదేకంగా చూస్తాడు ! అతగాడే , నీ జతగాడు ! వెళ్తావా ?”*


ఎంతసేపటికీ జ్యేష్ఠ నుండి సమాధానం రాకపోయేసరికి నారదుడు మెల్లగా తలతిప్పి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో , పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి జ్యేష్ఠ త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంది !


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

.           ప్రథమ సంపుటము

 

.             *ఉపోద్ఘాతము -1*         

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీమహావిష్ణువునుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహాపురాణము" అనే పేరు వచ్చినది. 


అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది. 


శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును. 


383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.


ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి. 


ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.


వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది. 


అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది. 


అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలుకూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలు కూడా ఉండడం చేత ఇది 'తామస పురాణం' అని అంటూ, పద్మపురాణంలో దీనినింద కనబడుతుంది. 


అందుచేత దీని రచన శైవ వైష్ణవాల మధ్య అంతగా విరోధభావం ఏర్పడడానికి ముందుగానే, వైష్ణవ మతంలో రాధాకృష్ణ సంప్రదాయం ఆవిర్భవించడానికి కూడా ముందుగానే జరిగి ఉంటుందని ఆధునిక విమర్శకుల ఊహ.


ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:


అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 


16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.


21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 


21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 


39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమ గ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

సశేషం....

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

              🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్ధశి  - విశాఖ -‌ ఇందు వాసరే* *(11-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/u4P4oGOlrGw?si=0ngKHXWCdh04c9w6


🙏🙏

Panchaag


 

పంచాంగం 11.12.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 11.12.2023   Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: త్రయోదశి తదుపరి చతుర్థశి  తిధి ఇందు వాసర: విశాఖ నక్షత్రం సుకర్మ  యోగ: వణిజ తదుపరి భద్ర తదుపరి శకుని కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి  ఉదయం 07:08 వరకు తదుపరి చతుర్థశి రా.తె 06:23 వరకు . 

విశాఖ మధ్యాహ్నం 12:09 వరకు. 

సూర్యోదయం : 06:40

సూర్యాస్తమయం : 05:38

వర్జ్యం : సాయంత్రం 04:06 నుండి 05:41 వరకు.

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:31 నుండి 01:15 వరకు తిరిగి మధ్యాహ్నం 02:43 నుండి 03:26 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


శుభోదయ:, నమస్కార:

రాశి ఫలితాలు

 రాశి ఫలితాలు

11-12-2023

సోమవారం (ఇంధు వాసరః)

XXXXXXX


మేషం 

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన  పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------

వృషభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు  ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బంది పడతారు. సంతానం విద్య ఉద్యోగ  యత్నాలు మందగిస్తాయి. 

---------------------------------------

మిధునం

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు.

---------------------------------------

కర్కాటకం

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

---------------------------------------

సింహం

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో  ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున ఊహించని సమస్యలు  ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

---------------------------------------

కన్య

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.  చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల 

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు విస్తృతమవుతాయి.  సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం

వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి.  ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమౌతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

ధనస్సు

వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

--------------------------------------

మకరం

 మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యయ ప్రయాసలతో కానీ  పనులు పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

కుంభం

ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.

---------------------------------------

మీనం

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందువినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.

---------------------------------------

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

***********

సంధ్యా వందన

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.11.12.2023

సోమ వారం (ఇందు వాసరే) 

**********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  కృష్ణ పక్షే 

చతుర్దశ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.23

సూ.అ.5.22

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

కృష్ణ పక్షం చతుర్దశి రా.తె.5.50 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం విశాఖ ఉ.11.39 వరకు. 

అమృతం రా.1.35 ల 3.13 వరకు. 

దుర్ముహూర్తం మ.12.15 ల 12.59 వరకు. 

వర్జ్యం సా.3.45 ల 5.23 వరకు. 

యోగం సుకన్య రా.9.25 వరకు.

కరణం విష్ఠి సా.5.48 వరకు.  

కరణం రా.తె.భద్ర 5.50 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం మ.10.30 ల 12.00 వరకు. 

************

పుణ్యతిధి కార్తీక బ.చతుర్దశి.

.**************

పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,C

Vanasthalipuram, Hyderabad

500 070.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

తెనాలి వారి ప్రాగల్భ్యం!!

 శు భో ద యం🙏




ప్రబంధ కవుల ప్రతిభ!! తెనాలి వారి ప్రాగల్భ్యం!!

ఉ: " సారధి ఛాదసుండు; బడి సాగదు చక్రయుగంబు ;ప్రాఁత సం

చారపు గుఱ్ఱముల్ ; రధియు శౌర్యమునందరమాని ;సాత్మవి

స్తారము ఖండ ఖండములు ; తానట మాసరి! యంచుఁదత్పురిన్

దేరులు నవ్వు శంకరుని తేరిని , కేతన కింకిణీ ధ్వనిన్ 

పాండురంగ మాహత్మ్యము-ప్రథమా శ్వాసము-115 పద్యము; తెనాలి రామకృష్ణ కవి;

పాండురంగ మాహాత్మ్యము చక్కని ప్రౌఢ ప్రబంధం. పాండురంగ విభుని పదగుంభనమునకు నిలయము. 

ఈప్రబంధం కాశీపుర వర్ణనతో ప్రారంభమౌతోంది. అక్కడ చాలా పెద్దపెద్ద రథాలు ఉన్నాయట. అవి పరమేశ్వరుని రథాన్ని చూచి

గణగణ మని నవ్వుతున్నాయట. (వెక్కిరిస్తున్నాయని భావం) ఎందుకూ నవ్వటం? మీరు మాకు సరిగారు అని;

ఇంతకూ శివుని రథానికున్న లోపాలేమిటీ? ఒకటా రెండా ? అన్నీ లోపాలేనట!

సారధి చూద్దామా పరమ ఛాందసుడు. లోకంలో ఈఛాందసుడు అనేపదం వట్టి చాదస్తం కలవాడు అనే యర్ధంలో 

వాడబడుతోంది. అంటే ఒకరిమాటవినడు తనకు తోచిందే చేస్తాడని యర్ధం. ఇక ఛాందసుడు అనేపదానికి వేదవిదుడు అనే అర్ధంకూడా ఉంది. శివుని రథ సారధి బ్రహ్మగారు. చతుర్వేదములు ఆయన ముఖతః పుట్టాయి.కాబట్టి ఆయన ఛాందసుఁడయ్యాడు.

ప్రస్తుతం మనమిక్కడ చాదస్తం కలవాడనే అనుకోవాలి.

బడి సాగదు చక్రయుగంబు- చక్రాలా ఒకేలా నడిచేవికావు. శివుని రధానికి చక్రాలు సూర్య చంద్రులు,సూర్యుడు పగలు,చంద్రుడు రాత్రి ,మాత్రమే ఉంటారు. ఒకసారి యిద్దరూ ఉండరు.అందువల్ల చక్రాలు సమంగా సాగవు.

ప్రాఁత సంచారపు గుర్రముల్: గుర్రాలు తిరిగి తిరిగి ముసలివైపోయాయి. ఇకవాటికి శక్తిలేదు.ఇంతకీ గుర్రాలు యేవి? వేదాలే

చతుర్వేదాలూ శివుని రథానికి గుర్రాలు. వేదాలు చాలా ప్రాచీనమైనవే! అందుచేత ముసలి గుర్రాలట!

రథియు శౌర్యమునం దరమానిసి"- ఇంక ఆరథమెక్కి తిరిగే ఆయన ఆడో మగో తెలియనివాడు. (పరాక్రమంలో సగంమనిషి!) అర్ధనారీశ్వరుడుగదా!

ఆత్మ విస్తారము ఖండఖండములు "- దాని పొడవు వెడల్పులు చుద్దామా ?ముక్కలూ చెక్కలు. శివుని రథం

భూమి. భూవలయం నవఖండ మండితమైనది. అంటే తొమ్మిది ముక్కలుగా ఉంటుంది. విరిగిన చెక్కముక్కలతో చేసిన రథం.దానికి

బలమెక్కడిది? అనియీసడింపుతో ఆవూరి రథాలు తమ జండాలకు కట్టిన చిరుగంటల మ్రోతలతో శివుని రథాన్ని చూసి నవ్వుతాయట!

ఆహా కవిదెంత గొప్పయూహ! దానికి శ్లేషను జోడించి , చక్కని పద్యాన్ని ప్రకల్పన చేశాడు!

ఇందులో నిందా స్తుతి గర్భితమైన శ్లిష్టోత్ప్రేక్షాలంకారం చోటుచేసికొన్నది!


                                              స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నాయనార్ల చరిత్ర - 26*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 26*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*నమి నంది అడగళు నాయనారు*


ప్రసిద్ధ శైవ క్షేత్రమైన తిరువారూరు సమీపంలో పాడి పంటలతో కళ

కళలాడుతున్న అందమైన గ్రామం ఒకటుంది. దాని పేరు ఏమప్పేరూరు.


ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో నమినంది అనే

శివభక్తుడు జన్మించాడు. నమినంది రోజూ తిరువారూరు వెళ్లి అక్కడ వెలసిన

వల్మీక నాధుని దర్శించి, భక్తితో అర్చించి తరువాత పక్కనే ఉన్న అరనెరి

అనే గ్రామంలోని శివాలయానికి వెళ్లేవాడు. 


అతని హృదయంలో

దేవాలయంలో అసంఖ్యాకములైన దీపాలు వెలిగించాలనే కోరిక కలిగింది.

అది సూర్యాస్తమయ సమయం కావడం వలన ఇంటికి వెళ్లి నెయ్యి

తీసుకురావడానికి అవకాశం లేక పోయింది. అందువలన తిరువారూరులోని

ఒక ఇంటికికెళ్లి శివాలయంలో దీపం వెలిగించడానికి నెయ్యి కావాలని

అడిగాడు. 


ఆ ఇంట్లోనున్న వ్యక్తి జైన మతస్తుడు కావడం వలన “చేతిలో

అగ్నిహోత్రుని దాల్చిన శివునికి దీపాలు ఎందుకు? మీరు దీపాలు వెలిగించ

దలుచుకుంటే నీళ్లుపోసి దీపాలను వెలిగించండి" అని పరిహాసంగా పలికాడు.


 శివునిమీద అచంచల భక్తి ప్రపత్తులు కలిగిన నమినంది.

చింతాక్రాంతుడై తిరువారూరు దేవాలయానికి వెళ్లాడు. అక్కడి పరమేశ్వరునికి

సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 


దీపాలు వెలిగించడానికి నాకు అవకాశం లేకపోయిందని బాధపడ్డాడు. ఆ సమయంలో అతనికి అశరీరవాణి

వినిపించింది. "ఓ భక్తుడా! నీ హృదయంలో గూడు కట్టుకోనున్న శోకాన్ని

తొలగించుకో. ఈ దేవాలయం సమీపంలో ఒక కొలను ఉంది. అక్కడికి

వెళ్లి ఆ కొలని నీటితో దీపాలను వెలిగించు" అనే మాటలు అతని చెవులలో

ప్రతిధ్వనించాయి. 


నమినంది అత్యంత సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు.

తరువాత పరిగెత్తుకుంటూ వెళ్లి కొలనునుండి నీటిని తీసుకు వచ్చి దానితో

దీపాలను వెలిగించాడు. ఆ దీపాలు ప్రజ్వరిల్లుతూ దశదిశలా

ప్రకాశవంతంగా వెలుగులను విరజిమ్మాయి. 


నమినంది మరింత

సంతోషంతో దేవాలయమంతటా దీపాలను వెలిగించాడు.

దీపం వెలిగించడానికి నెయ్యి ఇవ్వమని నిరాకరించిన జైనులకు

బుద్ధివచ్చేలా నమినంది నీటితో దీపాలను వెలిగించి పరమేశ్వరుని

కృపాకటాక్షాలను వాళ్లకు తెలియజేశాడు.


పరమభక్తుడైన తిరునావుక్కరుసుచే ప్రశంసింపబడి నమినంది

జీవితాంతం పరమేశ్వరుని పాదపద్మాలనే ధ్యానిస్తూ మరణానంతరం శివ

సాయుజ్యాన్ని పొందాడు.


*ఇరవై ఆరవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*కార్తిక పురాణము

 *కార్తిక పురాణము - 29*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై తొమ్మిదవ అధ్యాయము*


రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానము పొందెను.సుదర్శన చక్రము అంతర్థానము పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి, బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను.గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము.నీవు నాయందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి.మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి.నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని.నాకు పరలోకము సిద్ధించును. త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవని విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో,


రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. నీచేత నాప్రాణములు రక్షించబడినవి. నాకు తండ్రివి నీవే.నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు.తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. నీకు నమస్కారమును చేయను.బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని.దానికి ఫలమును అనుభవించితిని.చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి.


రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై తన ఆశ్రమమునకు వెళ్ళెను. కార్తీకకమాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును.


కార్తీకమాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును.


మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును.కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము.కనుక దానిని ఎంతమాత్రము విడువరాదు.కార్తీకక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము.


ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు.


ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!

శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్‌ ఆలయం.

 🕉 మన గుడి : నెం 265





⚜ గుజరాత్ : వాదనగర్.


⚜ శ్రీ హట్కేశ్వర్ మహాదేవ్‌ ఆలయం.



💠 గుజరాత్‌లో, హత్కేశ్వర్ మహాదేవ్ వాద్‌నగర్ వెలుపల ఉన్న పురాతన మరియు చారిత్రాత్మక దేవాలయం.


💠 గుజరాతి భాషలో హటక్ బంగారాన్ని సూచిస్తున్నందున దీనిని హటకేశ్వర్ మహాదేవ్ అని పిలువబడింది.


💠 హట్కేశ్వర్ ఆలయంలోని శివలింగం స్వచ్ఛమైన బంగారంతో సృష్టించబడిందని నమ్ముతారు. 

శివలింగం బంగారంగా ఉండటానికి సంబంధించి ఒక స్థానిక కథ ఉంది. 


💠 ఒకసారి పార్వతీ దేవి తనకు రాముడిలోని ఏకపత్నీవ్రత దీక్షని పరీక్షించాలని ఉంది అని శివుడిని కోరినట్లు చెబుతారు.

అందుకు శివుడు ఒక చిరునవ్వు నవ్వి  రాముడిని పరీక్షించడానికి అనుమతి ఇస్తాడు.


💠 పార్వతీదేవి సీతాదేవి రూపాన్ని ధరించి, రాముడిని పరీక్షించడానికి వెళ్ళింది. అయినప్పటికీ, రాముడు ఆమెను గుర్తించి, అవిడకి నమస్కరించి పరమశివుని గురించి అడిగాడు. 

తత్ఫలితంగా, పార్వతీ దేవి తనకు తాను అవమానంగా భావించి, శివుని దగ్గరకు తిరిగి వచ్చింది. 


💠 శివుడు పార్వతీ దేవిని అడిగినప్పుడు, ఆమె శ్రీరాముని పరీక్షించి అతనికి ఆమె నిజస్వరూపం తెలియకుండా విజయం సాధించింది అని అబద్ధం చెప్పింది. 

అయితే, తన మూడవ కన్నుతో, శివుడు పార్వతీ దేవి యొక్క అబద్ధాన్ని పట్టుకున్నాడు. 


💠 పార్వతీ దేవి ఈ తప్పు చేసినందున, శివుడు ఆమెను కొన్ని రోజులు  విడిచిపెట్టాడు. 

తన చర్యకు పార్వతీ దేవి  ప్రాయశ్చిత్తంగా తప్పస్సుకి వెళ్ళిపోయింది.

ఈ స్థితిలో, శివుడు పార్వతీ దేవి దూరం అవడం  వల్ల  ఏకాంతాన్ని అనుభవించాడు మరియు ప్రతిచోటా సంచరించడం ప్రారంభించాడు. 


💠 సంచరిస్తున్న సమయంలో, శివుడు ఎలాంటి దుస్తులు లేకుండా చమత్‌కర్‌నగర్ (ప్రస్తుత వాద్‌నగర్) చేరుకున్నాడు. అతని శరీరం బ్రాహ్మణుల భార్యలను ఆకర్షించింది మరియు వారు శివుని వెంట తిరగడం ప్రారంభించారు. బ్రాహ్మణులు శివునిపై చాలా విసుగు చెందారు మరియు వారు అతనిపై ప్రయోగించడానికి ఒక ఆయుధాన్ని సృష్టించారు. ఆ విధంగా, శివుడు శివలింగంగా రూపాంతరం చెందాడు మరియు దాని గుండా రక్త ప్రవాహం ప్రారంభమైంది. 

ఈ పరిణామం చూసి అన్ని  లోకాలలోని ప్రజలు  మరియు దేవతలు చాలా భయపడ్డారు. 


💠 అప్పుడు, బ్రహ్మ దేవుడు తాను పూజించే బంగారు శివలింగంగా మారాలని శివుడిని కోరుకున్నాడు. తదనంతరం శివలింగం బంగారంగా మారింది మరియు బ్రహ్మ దేవుడు దానిని పూజించడం ప్రారంభించాడు.

అలా ఈ ప్రాంతంలో వెలసిన శివలింగం బంగారు వర్ణంగా వెలసింది అని స్థానిక కథనం


💠 ఈ ఆలయం అబూ పర్వతానికి నైరుతి వైపున ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివుని ఆలయం నాగర్ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం, వీరు మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ పట్టణంలో సాంప్రదాయకంగా చాలా ప్రసిద్ధ సమాజం. ప్రస్తుతం, హట్కేశ్వర్ ఆలయం లెక్కలేనన్ని మంది భక్తులచే పూజించబడుతోంది.


💠 హట్కేశ్వర్ ఆలయంలో ప్రధాన విగ్రహం శివుడు. 

ఈ ఆలయాన్ని 3 వ శతాబ్దంలో పూర్తిస్థాయిలో నిర్మించారు.


💠 పురాణాల ప్రకారం, హటకేశ్వర ఆలయాన్ని నిర్మించిన నాగరాజు బబృవాహనుడికి తాత. 

వాద్‌నగర్ నగరంలో హటకేశ్వరాలయాన్ని నిర్మించడానికి బబృవాహనుడికి తన తండ్రి అర్జునుడు కూడా సహాయం చేశాడని చాలా మంది నమ్ముతారు


💠 హత్కేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన వివిధ కథలు హిందూ మతంలోని అనేక పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. 

ఇది శివుడు,పార్వతి, వ్యాసుడు, నాగర్ బ్రాహ్మణుడు, ఇంద్రుడు మొదలైన వారితో జతచేయబడింది. 

ఇది సుమారు 1800 సంవత్సరాల నాటి ఆలయాన్ని నిర్మించిందని మరియు శ్రీ హత్కేశ్వర్ మహాదేవ్ యొక్క శివలింగం భూమి దిగువ వరకు వెళుతుందని కూడా నమ్ముతారు .

ఆలయ లోపలి గర్భగుడిలో స్వయంభువు శివలింగం ఉంది.


💠 ఆలయం వెలుపలి భాగంలో నవగ్రహాల బొమ్మలు, సంగీత విద్వాంసులు, నృత్యం చేసే అప్సరసలు, రాజప్రతినిధి దేవతలు, ప్రధాన దేవతలు, రామాయణం మరియు మహాభారతంలోని దృశ్యాలు మరియు వివిధ జంతువులు, విష్ణువు అవతారం, సముద్ర మథనం, శంఖం, ఐరావతం  మరియు పుష్పాల మూలాంశాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. 


💠 ప్రాంగణంలో పురాతన కాశీవిశ్వేశ్వర శివాలయం, స్వామినారాయణ దేవాలయం మరియు రెండు జైన దేవాలయాలు ఉన్నాయి.


💠 హత్కేశ్వర్ మహాదేవ్ మందిర్‌ను పూజల కోసం భారతదేశం నలుమూలల నుండి అనేక మంది శివ భక్తులు సందర్శిస్తారు.


💠రోడ్డు ద్వారా మెహసానా (47 కి.మీ), అహ్మదాబాద్ (111 కి.మీ). 

వాద్‌నగర్ నుండి 42 కి.మీ.

నమస్కారం

 *"నమస్కారం మన సంస్కారం"*


హిందూ మతంలో నమస్కారానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 


నమస్సు, నమస్కారం, ప్రణతి, వందనం... ఇవన్నీ ఒకటే. రెండు చేతులూ జోడించి నమస్కరించడం మన సంప్రదాయం. నమస్కారం లేకపోతే అసలు పూజ అనేదే లేదు. పూజలో మొదట, చివర కూడా నమస్కారం ఉండటం వల్ల దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. 


అలాగే నిత్యజీవితంలో కూడా మనం అనేకమందికి నమస్కారం చేస్తూ వుంటాం.


*సభాయాం, యజ్ఞశాలయాం దేవతాయతనే గురౌ*

*ప్రత్యేకం చ నమస్కారం హన్తి పుణ్యం పురాకృతం* 


అని సూర్యపురాణంలో వుంది. దీనికి అర్థమేమిటంటే సభలో ప్రవేశించినపుడు, దేవతలున్న స్థలంలో, అనేకమంది గురువులున్న చోట, యజ్ఞశాలలో, అందరికీ కలిపి ఒకే నమస్కారం చేయాలి. విడి విడిగా నమస్కారం చేయకూడదు. అలా చేస్తే మనం చేసిన పుణ్యంలో కొంత భాగం నశిస్తుంది. 


అందుకే సభలో ప్రవేశించినప్పుడు *"సభాయై నమః"* అని మొత్తం సభకు, సభాదులందరికీ ఒకేసారి నమస్కరించడం మన సంప్రదాయం. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. అలా చేస్తే ఒక సంవత్సర కాలంలో మనం చేసిన పుణ్యం హరిస్తుంది అన్నారు మన ఋషులు.

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ*

*మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్* |

*వామేతరేణ వరదాభయహస్తముద్రాం*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 18_* _


*తా*: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత్త చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను

కాపాడుము. *లక్ష్మీదేవితో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.