14, నవంబర్ 2024, గురువారం

Kartika Puranam - 14

 Kartika Puranam - 14


కార్తిక పురాణము -పదునాల్గవ అధ్యాయము


కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.

ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. కపాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు

శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!

అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!

అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 13

 Kartika Puranam - 13


*కార్తీక పురాణము - పదమూడవ అధ్యాయము*


వశిష్టుడిట్లు చెప్పెను.జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రియైన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి.అవన్నియు చేయదగినవి. చేయనియెడల పాపము సంభవించును.ఇది నిజము.సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను.కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు.


కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును.తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును.


గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు, నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు.


కార్తీకమాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును చేయించవలయును.సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి.ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను.అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును చెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని ఎవ్వనికి సామర్ధ్యము లేదు.పరద్రవ్యము వలన తీర్థయాత్రయు, దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన యెడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును.


కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును.తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడగును.


ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ ఒకటి గలదు, ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము.


ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు.మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు.అతడు దురాత్ముడు.ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై 'అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ' అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను.


ఆ అరణ్యమందు రాజును, భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి.అట్లుండగా భార్య గర్భవతియాయెను.నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను.ఆ పర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను.తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను, లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను.


ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది.మనస్సుకు బహురమ్యముగా ఉన్నది.ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా! నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను.


ఆమాటవిని రాజు "మునికుమారా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను" అనెను.


ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో, "ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను.దానితో నీవు సుఖములను బొందగలవు" అని మునికుమారుడు చెప్పెను.


ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను అనెను.తరువాత మునికుమారుడు ఆ నర్మదాతీరమందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను.రాజు ఆ ధనమంతయు గ్రహించి, ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.


ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను.రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి.రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును,దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను.


రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతురుని జూచెను.కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, "ఓయీ! నీవెవ్వడవు?ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు?చెప్పము" అని అడిగెను.


"దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు.దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను.ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది.ఆ చిన్నదానిని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను.ఇంక ఏమి వినగోరితివో చెప్పుము".


ఇట్లు రాజు వాక్యమును విని యతి, "రాజా! ఎంత పనిచేసితివి?మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి.కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. న్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడియుండలేదు.కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము.కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడి ఫలమును పొందును".


ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో, నీచుడై ధనాశతో, "బ్రాహ్మణుడా !ఇదియేమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి?నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను.నీకెందుకు నీ దారిని నీవుపొమ్ము" అనెను.


ఆ మాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను.తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి.


అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును, రాజు పితరులను గూడ పడవేయించెను.అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము.


ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను.స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను.ఈ శ్రుతకీర్తి, సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు ఒకనాడు, 'ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని' విచారించుకుని ధైర్యముతో యమునితో, "సర్వమును తెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము.ఎంతమాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది?" అని శ్రుతకీర్తి చెప్పిన మాటలను విని యముడు పల్కెను.


"శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గానీ,నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు.ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందు ఉన్నారు.తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు.శ్రుతకీర్తీ! సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది.నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది.దానికింకను వివాహము కాలేదు.కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చట ఉన్న మునులతో ఈమాటను చెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము.కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము.అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడల ధనదాతయును, లోకాధిపతియు అగును.కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును పొందును. నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము.దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు" అని పలికెను.


శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.


ఆ పుణ్యమహిమచేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను.తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను.దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పోయిరి.తానును యథాగతముగా స్వర్గమును చేరెను.


కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును.ఇందుకు సందేహములేదు.కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు అంతములేదు.కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుజ్యమును పొందును.ఇది నిజము. నామాట నమ్ముము.


ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదురు.


*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయసమాప్తః*

మధుమేహం గురించి

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 *  సహజము  - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 *   అపథ్య నిమిత్తజము  - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు  - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు  - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు.  అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర  వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను.  శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


             * సంపూర్ణం * 


  

     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వంచనాత్ముల సహింపగ రాదు

 ఉ.ఇమ్మహి వంచనాత్ముల సహింపగ రాదు విపత్తు లొప్పు సం

ద్రమ్మెదురైన, నెత్తఱిఁ గృతఘ్నుల నమ్మ వినాశనమ్మె, దై

వమ్మును నమ్మి భక్తిఁ గొలువం దయఁ జూపుచు చేరఁ దీసి స

ర్వమ్ము హితమ్మొనర్చు ,ధృతి వైరుల నుక్కడగించి మేల్మితో! ౹౹ 17


ఉ. ఇమ్ముగ శాత్రవాధముల కెన్నగ మేలు ఘటింప జేయ మో

సమ్మగు శక్తి యుక్తులను సర్వము దోచి కృతఘ్నతాగ్ని ప

క్షమ్ముల జిమ్మ జీవన మశాంతియుతమ్మగు గాన వాని స్వ

ప్నమ్మున గూడ నెంచఁ దలపం దగ దెన్నడు నిష్ఫలంబగున్ ! ౹౹ 18

75. " మహాదర్శనము

 75. " మహాదర్శనము " --డెబ్భై ఐదవ భాగము--రాజ సభలో


75. డెబ్భై ఐదవ భాగము -- రాజ సభలో



         మరుదినము ప్రాతఃకాలములో చేయవలసిన కార్యములన్నీ చేసి , భగవానులు , తాము వెనుక ఉంటుండిన గుడిసెకు చేరినారు. కాత్యాయని అల్పాహారమునూ , పాలనూ తీసుకొని అక్కడికి వెళ్ళింది. 


          భగవానులు ఆమె ఇచ్చినవి తీసుకొని, " కాత్యాయనీ , ఈ దినము ఇంకేమీ అవసరము లేదు, కాబట్టి ఏకాంతముగా ఉండాలనుకుంటున్నాను. " అన్నారు. కాత్యాయని , " దేవా , అది తమరి ఇఛ్చ , అయితే , తమరే చెప్పునట్లు పరేఛ్చా ప్రారబ్ధమేమున్నదో ఎవరికి తెలుసు ? " అన్నది. 


" అట్లయితే , ఈ దినము మేము చేయవలసినది ఏమైనా ఉందా ? " 


" నాకేమి తెలుసు ? "


" మరి , అలాగంటివి ? "


          " తమరు అనే మాట గుర్తొచ్చింది , చెప్పినాను. ఈ దినము యే గార్గి వస్తుందో, అథవా రాజే దర్శనార్థియై వస్తాడో, అథవా తమరి తండ్రిగారే దయ చేస్తారో, ఎవరికి తెలుసు ? చూడగా , తమరి తండ్రిగారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. కానీ నేను వారిని ఏమిటా ఆలోచన అని ఎలా అడగగలను ? "


         " సరే , అయ్యేది కానీలే , నేను మాత్రము ఏకాంతముగా ఉండవలె ననుకున్నాను. కానీ నువ్వు చెప్పినది నిజము. శరీరధారి యైనవాడు సుఖ దుఃఖములను తప్పించుకోలేడు. మన ఇఛ్చ ప్రకారము అయితే సుఖము, ఇంకోలాగ అయితే దుఃఖము. అంతే కదా ? "


        " తమరికి సుఖ దుఃఖాలు కూడా ఉంటాయా ? నాటకము లాడు వారి వలె తమరు కూడా ఇతరుల కోసము సుఖ దుఃఖములను చూపిస్తారు , అంతే! "


          " ఛీ , పాడు దానా ! కనిపెట్టినావు. కాత్యాయనీ , నిజము. అయితే దీనిని గుట్టుగా ఉంచు. గుర్తుంచుకో. మాకు సుఖదుఃఖములు లేకున్ననూ సుఖముగా ఉన్న వాడిని సూచి సుఖించవలెను , దుఃఖముగా ఉన్న వాడిని చూచి దుఃఖించవలెను. లేకుంటే, ఈ క్షర పురుషుడు, ఈ దేహము శాపము నిచ్చును. " 


" అట్లేమి ? "


         వీరు ఇలాగ మాట్లాడు చుండగనే ఆలంబిని, ’ ఏం చేస్తున్నావయ్యా ? " అని వచ్చింది. కాత్యాయని ఆమెను చూచి లేచి నిలబడింది. అలాగ లేచి నిలుచున్న కోడలిని చూచి, ’ నువ్వు వెళ్ళిపోవద్దమ్మా , ఈ ఎద్దును కట్టడానికి నువ్వే సరియైన పగ్గము! " అని కొడుకు వైపుకు తిరిగింది. కొడుకు కూడా లేచి నిలుచున్నాడు. " ఏమిటమ్మా ? ’ అని వినయముతో అడిగినాడు. 


          తల్లి అన్నది : " నువ్వు సర్వజ్ఞుడవు! నీకు తెలియనివీ ఉంటాయా ? అయినా చెపుతాను. మీ తండ్రిగారు కబురు పంపినారు. రాజ పురుషులు నిన్ను రాజభవనానికి పిలుచుకొని వెళ్ళుటకు వస్తున్నారంట ! " 


          కొడుకు నవ్వినాడు , " చూడమ్మా, ఈ దినము ఏకాంతములో ఉండవలెనని నేను సంకల్పించుకొని ఇక్కడికి వచ్చినాను. అదే సంగతి ఈమెకూ చెప్పుచున్నాను. చివరికి నువ్వొచ్చినావు. రాజ భవనమునకు ఇలాగ వెళ్ళకూడదేమో ? "


          " చూడయ్యా , నిన్ననే సర్వజ్ఞాభిషేకమును చేయించుకున్నావు. కాబట్టి , ఆ కిరీటమునూ , అప్పుడు ఇచ్చిన వస్త్రాభరణములనూ ధరించి , కట్టుకొని, పెట్టుకొని వెళితే చందము. నాకైతే , నిజంగా చెపుతాను , నిన్ను ఆ వేషములో ఎంత చూసిననూ తృప్తి లేదు. " 


          " అట్లేమి ? నీ తృప్తికై ఏమి కావాలన్నా చేస్తాను , లేవమ్మా ! నువ్వు సంతోష పడుతానంటే ఈ నగరములో ఉండే వరకూ ఆ బట్టలనే కట్టుకొని తిరిగితే సరి. దానికేమి ? కాత్యాయినీ , వెళ్ళి అవన్నీ తీసుకొనిరా. " 


కాత్యాయని సరేనని వెళ్ళింది.


ఆలంబిని " ఇంకొకటి , " అంది


" చెప్పు "


" మీ తండ్రిగారు కూడా నీతో రాజ సభకు రావలె ననుకొనుచున్నారు. పిలుచుకొని వెళతావా ? "


         "ఇదింకా బాగుంది , ఇది , మీరు తల్లిదండ్రులు ఇచ్చిన దేహము. దీనికి కలుగు వైభవమంతా మీవలన. కాబట్టి , వారొక్కరే కాదు , నువ్వూ రా. అయితే ఒక మాట. మీరిద్దరూ పల్లకిలో ఒకే వైపు కూర్చోండి , నేను మీ ఎదురుగా కూర్చుంటాను. " 


          అంతలోపల కాత్యాయని సర్వజ్ఞ వస్త్రభూషణములను తెచ్చిచ్చి , " రాజ పురుషుడు వచ్చినట్లుంది " అన్నది. భగవానులు వస్త్ర భూషణములను ధరించు వేళకు స్వయం దేవరాతుడే రాజపురుషుని పిలుచుకొచ్చినాడు. 


         రాజ పురుషుడు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి , మహారాజులు ఇతర దేశాధిపతులతోనూ , విద్వాంసులతోనూ సర్వజ్ఞులను ప్రతీక్షించుచున్నారు. రెండు పల్లకీలు వస్తున్నాయి. " అని విన్నవించినాడు. 


" సరే , అమ్మా , నువ్వూ నీ కోడళ్ళూ సిద్ధము కండి. కాత్యాయనీ , కణ్వుడినీ , మాధ్యందినుడినీ సిద్ధము కమ్మని చెప్పు. 


          మహారాజూ , ఇతర దేశాధిపతులూ సవిద్వాంసులై సర్వజ్ఞులను గజద్వారములో ఎదుర్కొని , పిలుచుకొని వెళ్ళినారు. సర్వజ్ఞులకు సలుపవలసిన మర్యాదలన్నీ సలిపి , అందరినీ స్వస్థానములలో కూర్చోబెట్టి , మహారాజు చేతులు జోడించి , వినీతుడై, " ఏదైనా అనుజ్ఞ కావలెను. మేమంతా విని కృతార్థులగుటకు వేచియున్నాము. " అని తెలియజేసినాడు. 


          భగవానులు నవ్వుచూ అన్నారు , " ఈ దినము మేము వృత్తిని తిరోధానము చేసి ( మరుగు పరచి ) ఏకాంతములో ఉండవలెనని యున్నాము. మహారాజుల ఆజ్ఞను మీరలేక ఇక్కడికి వచ్చినాము. తమందరి దర్శనమై మనసు ఇంకా సంతుష్టమైనది. కాబట్టి , తమరు ఏదైనా అడగండి , దానికి ఉత్తరముగా మాకు తెలిసినది చెప్పెదము " 

          భగవానులు జలతారు వస్త్రములను కట్టుకున్నారు. జలతారు ఉత్తరీయమును తమ కృష్ణాజినపు ఉత్తరీయము పైన కప్పుకున్నారు. తలపైన రత్నమయమైన పాండిత్య కిరీటము శోభిస్తున్నది. ముంజేతికి రత్నమయమైన కడియముంది. వేళ్ళకు మూడు మూడు అనర్ఘ్యమైన( వెలలేని ) ఉంగరములు. జలతారు వస్త్రము పైన రత్నమయమైన శృంఖల. కాలికి రత్నమయమైన పెండేరము. పాదములకు రత్నమయమైన పాదుకలు. చూడగా , ఆ రత్నముల కాంతితో వారి ముఖము దేదీప్యమానమైనట్లుంది. అయితే , నిజంగా చూస్తే , వారి తేజస్సు వలన ఆ సర్వమూ వ్యాప్యమైనట్లుది. వేష భూషణములకు కొత్త కాంతి వచ్చినట్లుంది. అందరికీ ఆశ్చర్యమేమంటే , మహానది మహాపూరములో ( ప్రవాహములో ) వచ్చి సముద్రమును చేరిననూ, సముద్రము తనపాటికి తాను ఉండునట్లు , సర్వజ్ఞాభిషేకము భగవానులలో లేశమైనా వ్యత్యాసము కలిగించలేదు. 


    అందరూ గార్గిని ఏమైనా అడగవలెనని సూచించినారు. ఆమె వినయముతో , " మా ఆటోపమంతా ముగిసింది. ఇంకేమున్ననూ వినుట , అంతే! మన మహారాజులు ఇతరులవలె కాదు. వేదోపనిషత్తులను సాంగముగా తెలిసినవారు. వారు అడుగుటా , భగవానులు చెప్పుటా బాగుండును. "


సర్వానుమతితో మహారాజులే లేచినారు. అన్నారు: " భగవానులు ప్రసన్నులై మా ప్రశ్నకు ఉత్తరము చెప్పవలెను. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? "


" ప్రశ్న బాగున్నది. మనుష్యుడు యే జ్యోతి వలన తన కార్యములను చేయును ? రాజా , మనుష్యుడే యేమి , ప్రాణ జాతులన్నీ కూడా ఆదిత్యుడను తేజస్సు వలన ప్రచోదితమై తమ తమ కార్యము లన్నిటినీ చేయును. ఆదిత్యుడు తన కిరణముల ద్వారా సర్వమునూ సృజించును. సర్వమునూ స్థితిలో కాపాడును. సర్వమునూ లయము చేసి తనలో ఉపసంహారము చేసుకొనును. సుఖ నిద్రలో పరుండిన పురుషుని జాగృత్తుకు తెచ్చునది ఆతని కిరణము. ఆదిత్యుడు పురుషుని హృదయమును ప్రవేశించి , నానా విధములైన వ్యాపారములకు కారణమగును. ఒక రూపముతో తపనము చేసి , ఇంకొక రూపముతో వర్షమును వర్షించి , అన్న కారణమగు వాడూ వాడే! అన్నాదుడై దేహములో కూర్చొని అన్నిటినీ జీర్ణించువాడూ వాడే! కాబట్టి , సృష్టికి వచ్చిన భూతజాలమంతా తన సర్వకార్యములకూ ఆదిత్యునికి ఋణి. ఆదిత్యుడు లేకపోతే ఎవరికైనా ఏమి చేయుటకు అవుతుంది ? "


" రాత్రి పూట ఆదిత్యుడుండడు కదా ? "


" ఔను , ఆతడు అప్పుడు దేశాంతరములో ఉండును అని శృతి చెప్పుచున్నది. ఆతడు కంటికి కనబడకున్ననూ , ఆతని కిరణములు ఉండనే ఉంటాయి. లేకుంటే ఉక్కపోయుట ఎలా జరుగును ? కాబట్టి ఆదిత్యుడు ఎల్లపుడూ ఉండనే ఉంటాడు. అయినా ఆతడు రాత్రిపూట ఉండడని లోక ప్రసిద్ధి. అప్పుడు చంద్రుడు జ్యోతియై అందరిచేతా పనులు చేయించును. "


" చంద్రుడు లేనపుడు , జ్యోతి యేది ,భగవాన్ ? "


" చంద్రుడు ప్రతిరాత్రీ ఉండనే ఉంటాడు. శుక్ల పక్షములో సూర్యుడి నుండీ దూరముగా పోతూ పోతూ ఆతని కళాభివృద్ధియగును. కృష్ణ పక్షములో ఆతను తన కళలను ఒక్కొక్క దినమునకు ఒక్కొక్కటిగా దేవతలకు ఇచ్చి, ఇంకొక్క కళ మాత్రమే మిగిలి యున్నది అన్నపుడు సూర్యుడిని ప్రవేశించును. అతడి నుండీ తన కళలన్నీ పొంది , దినమున కొకటిగా పెంచుకుంటూ పోవును. అయినా అతడు లేని కాలము ఉంది యని లోకప్రసిద్ది ఉంది కదా ? అప్పుడు , సూర్యుడూ చంద్రుడూ ఇద్దరూ లేనపుడు అగ్నియే జ్యోతి. " 


" వీరు ముగ్గురూ లేనపుడు జ్యోతి యేది , దేవా ? "


" వీరు ముగ్గురూ బాహ్య జ్యోతులు. వీరు ఎవరూ లేనపుడు పురుషుడు తన కరణములనే జ్యోతిగా చేసుకొనును. చీకటిలో వాణి ఇతనికి జ్యోతియగును. వాణి వినిపించిన చోటికి వెళ్ళును. వాణిని పట్టుకొని అన్ని వ్యాపారములూ చేయును. కాబట్టి అప్పుడు వాణియే జ్యోతి. "


" ఆ వాణికూడా లేనపుడో , దేవా ? "


" వాణి అనేది కరణము. కరణము జడమైనది. కరణమును జ్యోతియనునది ఔపచారమునకే. బ్రాహ్మణ దంపతుల కొడుకు బ్రహ్మ కర్మ చేయకున్ననూ వాడిని ఔపచారమునకు బ్రాహ్మణుడని పిలుచుట లేదా ? అలాగే ఇదీ ! జాగృత్తులో అయితే ఇది ( కరణము ) ఇంకొక జ్యోతి యొక్క ప్రకాశముతో వెలుగును. ఆ ఇంకొక ప్రకాశమున్ననూ , స్వప్నములో అయితే ఇది ( వాణి యనే కరణము ) వెలుగకుండా ఉండును . ఇలాగ జాగృత్తు లో కరణములను ప్రకాశింప జేయుచూ తాను లేనట్టున్న ఆ జ్యోతి స్వప్నములో అంతా తానేయగును. అప్పుడు అది కరణము కన్నా ప్రత్యేకమైనది అని బాగా తెలియును. ఆ జ్యోతి యేదో తెలుసా ? అదే , మీలోనూ , నాలోనూ ఎల్లపుడూ ఉండు ఆత్మ జ్యోతి. అది కార్యమగు శరీరము , కరణమగు వాణి-ఈ రెండింటికన్నా విలక్షణమైనది. ప్రత్యేకమైనది. ఆ ఆత్మను తెలిసినవారు అతడిని అసంగుడు అంటారు. నీటిలో వేసిన పాదరసము వేరుగా ఉండునట్లే , పాలలో వేసిన మరకతమణి తన ప్రభావము చేత పాలను పచ్చగా చేసిననూ , పాల వలన ప్రభావితము కాకుండా వేరుగా ఉండునట్లు , ఈ శరీరపు హృదయములో జ్యోతియై ఉన్ననూ ఈ శరీరము , కరణముల వలన ఏమీ ప్రభావితము కాకుండుట చేత అతడిని అసంగుడు అన్నారు. శృతి చెపుతుంది , ’ వాడిని చూడవలెనంటే స్వప్నములోనే! ’ అని. ఎందుకంటే , జాగృత్తులో బహిర్ముఖమై లేచి ఆడుతున్నట్టు ఆడుతున్న ఈ కరణముల వ్యాపారములో ఆత్ముడు మబ్బుల చాటున నున్న సూర్యుని వలె మాటుగా నుండును. సుషుప్తిలో అక్కడ అంతా తానై నిండి యుండిననూ , తెలివికి సాధనమైన బుద్ధి నిర్లిప్తముగా తూష్ణీభావముతో ఉండుట చేత , అప్పుడు అతడిని తెలుసనుట ఎలాగ ? తెలియలేదనుట ఎలాగ ? కాబట్టి , శృతి , అతడిని చూడవలెనంటే సంధి స్థానమైన స్వప్నమే సరి అన్నది. ఆ ఆత్ముడు , జ్యోతికే జ్యోతి. బయటి ఆదిత్యాదుల లోనూ ప్రకాశమై ఉండువాడు అతడే. ఇలాగ లోపలా , బయటా అంతటా నిండియున్న ఆతడిని తెలిసినవాడే కృతార్థుడు. " 


రాజు ఇంకా ఏదో అడగబోయినాడు. భగవానులు దానిని నివారించి , " అప్పుడే మధ్యాహ్నమగుచున్నది. కర్మఠులకు కర్మచేయు ఆత్రము. ఈ దేశాధిపతులు , తీవ్రమగుచున్న వైశ్వానరుడి ఉపాసన సకాలములో నిర్వహించనీ. నేటికి ఇక్కడికే చాలిద్దాము " అన్నారు. 

 అందరూ గబగబా లేచినారు. రాజు చేతులు జోడించి , ఇంకొక ఘడియ కూర్చోమని ప్రార్థించి , కోశాధికారిని పిలచి ఏమో అడిగినారు. అతడు నివేదిక చదివినట్లు ఏదో చెప్పిన తరువాత , రాజు మరలా భగవానులకు చేతులు జోడించి , " నిన్నటి దినము వచ్చిన కానుక పన్నెండు లక్షలకు దగ్గర దగ్గరగా ఉంది. అనుజ్ఞ అయితే దానిని ఆశ్రమమునకు పంపించెదను ? " అన్నారు. 


భగవానులు నవ్వినారు. " ఇప్పుడే , నా నోటి నుండే వచ్చింది ,’ లోపలా బయటా అంతటా నిండియున్న వాడు ఆత్మ ’ దానిని ఇంత త్వరగా ఎందుకు అబద్ధము చేయవలెను ? దీనిని ఇచ్చినవారు దేవతలు. వారు అందరి శరీరములలోనూ ఉన్నారు. కాబట్టి , ఇచ్చినవారికి తృప్తి కానీయని, వారికి దానిని ఈ విద్వాంసుల ద్వారా అర్పించండి. ఆశ్రమవాసులకు కావలెనన్నచో , వారికిచ్చుటకు దేవతలు సిద్ధముగా ఉన్నారు. ఆశ్రమవాసులు అందరూ కాకున్నా, కొందరైనా ఈ అంతటా నిండిన ఆత్మ దర్శనములో , విచారములో, మననములో , ఆసక్తి కలవారు కానీ" అని చెప్పి లేచినారు. 


అందరూ భగవానులను పంపించుటకు వాకిలి వరకూ వచ్చినారు. అక్కడ పల్లకీ నెక్కునపుడు భగవానులు రాజును పిలచి , " చూడండి , మనము పశువుకు గడ్డి వేసేది అది పాలిస్తున్నదనో , ఇచ్చుననో కదా ? అలాగే దూర ప్రయాణమునకు బయలు దేరినవాడే కదా శకటము మొదలైన సంభారముల నన్నిటినీ సిద్ధము చేసుకొనును. తమరు ఇప్పుడు విద్వత్సమూహమును కట్టుకొని , వారినందరినీ పోషిస్తూ వారినుండీ వేదోపనిషత్తుల నన్నిటినీ సంగ్రహించు చున్నారు. ఇదెందుకు ? ఆలోచించండి , ఎందుకీ ఆడంబరములన్నీ అనుదానిని గూర్చి చింతించండి " అని , అందరినీ వీడ్కొని వెడలివచ్చినారు.   


Janardhana Sharma

కార్తీక పౌర్ణమి

 *కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?* 


ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.

అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.

దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.

అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

కల నిజమనుకోకు

 శు  భో  ద యం🙏


కల నిజమనుకోకు !


అంతామిధ్య తలంచిచూచిన, నరుండట్లౌటెరింగిన్ సదా/

కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతింజెంది చరించుఁగాని,పరమార్ధంబైన నీయందు తా/

చింతాకంతయు చింతనిల్పడుగదా!శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకం-ధూర్జటి మహాకవి;


లోకంలో మనం చూచేదంతా మిధ్యే.(లేనిదిఉన్నట్లు భ్రమ)

ఏదీ శాశ్వతంకాదు.అయినా అదేమిటో మానవుడు నిరంతరం మోహ సముద్రంలో మునిగితేలుతూ, నా

భార్య,పిల్లలు,శరీరము,సంపద,ఇవన్నీ శాశ్వత మైనవని భ్రమిస్తూ ఉంటాడు.ఈమాయకు అంతంలేదుకదా!

ఇలా గుంటే ముక్తి యెలామరి? అనిదీనిభావం.

విశేషాంశములు:- కల నిజంకాదు.కన్నులుతెరిస్తే కలమాయం.జీవితం కూడా అంతే.ఎప్పుడు దీనికి తెఱపడుతుందో చెప్పలేం.అయినా బ్పతికినంతకాలం ఇదిశాళ్వతమనుకోవటం అవివేకం.భార్యా,పిల్లలు,వగైరా జీవననాటకంలోని అవాంతపాత్రలు.వారిపట్ల మమకారమే మోహం.ఆమోహ క్షయమయ్యేంతవరకూ మోక్షంరాదు.బ్రతుకంతా అదేయావా?చింతాకంతైనా భగవచ్చింతనవలదా?

అని కవి ప్రశ్న.సమాధానము చెప్పవలసినది యెవరికి వారే!!!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻🌷🌷🌷🌷

కార్తీక పురాణం -14

 _*కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


☘☘☘☘☘☘☘☘☘


మరల వశిష్ఠులవారు , జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.


ఓ రాజా ! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట , శివలింగ సాలగ్రామములను దానముచేయుట , ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.


వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక , దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు , సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు , తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన , సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి , అమావాస్య , సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు , విధవ వండినది తినరాదు. ఏకాదశీ , ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన    కల్లుతో సమానమని  బ్రహ్మదేవుడు చెప్పెను. కావున , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ , గోదావరి , సరస్వతి , యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని , చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.


*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*

*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం , హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.


*కార్తీకమాస శివపూజాకల్పము*


ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి

ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి

ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి

ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి

ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి

ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము , వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన , తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల , వారికీ , వారివంశీయులకు , పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క , కుక్క , పంది , పిల్లి , ఎలుక   మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను , పురాణము చదివినను , విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.


*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.*

🙏💐🌻🌺🌸🌼🦜🦚🌞🌝

కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 499*


⚜ *కేరళ  : పాలక్కాడ్‌*


⚜ *కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయం*



💠 కిల్లిక్కురుస్సి మంగళాన్ని లక్కిడి అని కూడా అంటారు. 

నీలా (భారతపూజ) నది లక్కిడి దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. 


💠 కేరళలోని పాలక్కాడ్‌లోని పచ్చని కొండల మధ్య ఉన్న లక్కిడి ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం మాత్రమే కాదు. 

ఈ సుందరమైన పట్టణంలో కిల్లిక్కురిస్సి మహాదేవ దేవాలయం అని పిలువబడే వాస్తు అద్భుతం కూడా ఉన్నది.

సందర్శించే వారందరి నుండి ప్రశంసలను పొందుతున్న దాని అద్భుతమైన చెక్క నిర్మాణాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.శివునికి అంకితం చేయబడింది.


💠 శ్రీ పరశురాముడు  కేరళలో 108 శివాలయాలు, 108 భగవతి దేవాలయాలు మరియు 108 ధర్మ శాస్తా దేవాలయాలను స్థాపించాడు.

ఈ మహాదేవ ఆలయం అందులో ఒకటి..


💠 గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం- శ్రీ కిల్లిక్కురుస్సి మహాదేవ క్షేత్రం నుండి ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు దీనిని శ్రీ శుక బ్రహ్మ ఋషి స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి.


💠 ఆలయ ప్రధాన గర్భగుడి, పశ్చిమం వైపు ఉంది, ఋషి శుక మహర్షిచే ప్రతిష్టించబడిందని నమ్ముతున్న శివలింగం ఉంది. 

ముఖ్యంగా, ఆలయంలోని నంది విగ్రహం ఈశాన్యం వైపు వంగి, దాని ఆధ్యాత్మిక శోభను పెంచుతుంది. గర్భగుడి ప్రక్కనే, ఎడమ మూలలో ఒక గణపతి మూర్తి ఉంటుంది, పార్వతి దేవి, గురువాయూరప్పన్, వనదుర్గ మరియు నాగం వంటి ఇతర ఉప దేవతలు కూడా ఇక్కడ పూజించబడ్డారు.


💠 విశేషమేమిటంటే, ఈ ఆలయం ఉత్సవాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది, ఎందుకంటే శివుడు స్వయంగా దాని ఆవరణలో తపస్సులో నిమగ్నమై ఉన్నాడని నమ్ముతారు.


💠 ఆలయం సాధారణంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. 


🔆 పండుగలు:


💠 శివుడికి అంకితం చేయబడిన వార్షిక పండుగ శివరాత్రి, కిల్లిక్కురిస్సి మహాదేవ ఆలయంలో అత్యంత గొప్ప వేడుక. 


💠 గ్రానైట్ లేదా రాతితో నిర్మించిన అనేక దక్షిణ భారత దేవాలయాల మాదిరిగా కాకుండా, కిల్లిక్కురిస్సి మహాదేవ ఒక ప్రత్యేకమైన చెక్క నిర్మాణాన్ని కలిగి ఉంది. క్లిష్టమైన శిల్పాలు గత యుగాల హస్తకళను ప్రదర్శిస్తాయి.


💠 ఈ గ్రామం ప్రసిద్ధ మలయాళ వ్యంగ్య కవి మరియు ఒట్టంతుల్లాల్ కళారూపాన్ని స్థాపించిన కుంచన్ నంబియార్ (రామ పనివాడ) జన్మస్థలం. 

కుంచన్ నంబియార్ జన్మించిన ఇల్లు- కలక్కతు భవనం ఇప్పుడు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. 

ఇక్కడ కుంచన్ నంబియార్ జ్ఞాపకార్థం కుంచన్ స్మారక వాయనశాల- కుంచన్ మెమోరియల్ లైబ్రరీ అనే గ్రంథాలయం కూడా ఉంది. 


💠 పురాణ కూడయాట్టం మరియు చాక్యార్ కూతు కళాకారుడు మరియు ప్రఖ్యాత నాట్యశాస్త్ర పండితుడు నాట్యాచార్య విదుషకరత్నం పద్మశ్రీ గురు మణి మాధవ చాక్యార్ కూడా ఇక్కడ నివసించారు, వీరు అభినయ (నటన) అధికారి.

అతని ఇల్లు కిల్లిక్కురుస్సి మహాదేవ ఆలయానికి సమీపంలో ఉంది. 

ఇది చాక్యార్ యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరైన గురు కేలు నాయర్ స్వస్థలం.

ప్రసిద్ధ సంస్కృత పండితుడు కొప్పట్టు అచ్యుత పోతువల్ కూడా ఈ ఆలయానికి సమీపంలో నివసించారు.


💠 పాలక్కాడ్ నుండి 70 కి.మీ.ల దూరంలో ఉంది

కార్తీక పురాణం -12

 _*కార్తీక పురాణం -12 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ద్వాదశి ప్రశంస*

*సాలగ్రామ దానమహిమ*


☘☘☘☘☘☘☘☘☘


*"మహారాజా ! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి , సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"* మని వశిష్ట మహాముని ఈవిధముగా తెలియచేసిరి.


కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలది బ్రహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి , సాయంకాలము శివాలయమునకు గాని , విష్ణ్వాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి , నక్షత్ర దర్శనము చేసికొని పిమ్మట భుజింపవలయును. ఈవిధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక , మోక్షము కూడా పొందుదురు.


కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నా వత్రమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున , పూర్ణోపవాసముండి ఆ రాత్రి  విష్ణ్వాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి , శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన , కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈవిధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానముచేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయుణుడు శేషపానుపు నుండి లేచును గనుక , కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు యిష్టము. అరోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి , ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రహ్మణునకు దానమిచ్చిన యెడల ఆయావు శరీర ముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్ర లోకములో స్వర్గ సుఖములందుదురు. కార్తీకశుద్ధ పాడ్యమి రోజున , కార్తిక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టునుగాని , సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్దగా అలకింపుము.


*సాలగ్రామ దానమహిమ*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడా బెట్టుచు , తాననుభవించక , యితరులకు బెట్టక , బీదలకు దానధర్మములు చేయక , ఏల్లప్పుడు పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవిగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక *"పరులద్రవ్యము నెటుల అపహరింతునా !"* యను తలంపుతో కుత్సిత బుద్ది కలిగి కాలము గడుపుచుండెను.


అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుయిచ్చెను. మరి కొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మనిని అడుగగా ఆ విప్రుడు *"అయ్యా ! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీ యింట యేజంతువుగానో పుట్టి అయినా , మీ ఋణము తీర్చుకోగలను"* అని సవినయముగా వేడుకోనెను. ఆ మాటలకు కోమటి మండిపడి *"అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీ కంఠమును నరికి వేయుదును"* అని ఆవేశం కొలదీ వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కొసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి , అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసీ తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక , అప్పటి నుండి అ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరి కొనాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకోనిపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి.


ఆ  వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానదర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు , నీడకొరకై చెట్లు నాటించుచు , నూతులు , చెరవులు త్రవ్వించుచు , సకల జనులను సంతోషపెట్టుచు మంచికీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోకసంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి , త్రోవలో ధర్మవీరుని యింటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి , విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి , చేతులు జోడించి *"మహానుభావా ! నాపుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నాజన్మ తరించినది. నాయిల్లు పావనమైనది. శక్తి కొలదీ   నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశధీకరింపుడు"* అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి *"ఓ ధర్మవిరా ! నేను నీకోక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీమహావిష్ణువునకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రితికరమైన దినము. అరోజున స్నాన , దాన , జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా , జారుడైనా , చోరుడైన , పతివ్రతమైనా , వ్యభిచారిణియైనా కార్తీకశుద్ద ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి , సాలగ్రామదానములు చేసిన యెడల వెనుకటి జన్మలందూ , ఈ జన్మమందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకమనుభవించుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లుచేసి నీతండ్రి ఋణం తిర్చుకోనుము"* అని చెప్పెను.  అంతట దర్మవిరుడు *" నారద మునివర్యా ! నేను గోదానము , భూదానము , హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని , అటువంటి దానములు చేయగా నాతండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా   యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా ! దాహంగొన్న వానికి దాహం తీరునా ? కాక , యెందులకీ దానము చేయవలయును ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"* నని నిష్కర్షగా పలికెను.


ధర్మవీరుని అవివేకమునకు విచారించి *"వైశ్యుడా ! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తని గావింప నెంచితివేని , యీ దానముతప్ప మరొక మార్గము లేదు"* అని చెప్పి నారదుడు వెడలిపోయాను.


ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు , దానసామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితభోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర మేడు జన్మలయందు పులియై పుట్టి , మరి మూడు జన్మలందు వానరమై పుట్టి , ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి , పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి , పదిజన్మలు పందిగా జన్మించి యుండెను. అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టి  ఆమెకు యౌవనకాలము రాగా ఆపేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.


చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాల దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యెందువలన కలిగేనా యని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామదానము చేయించి *"నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక"* యని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయి  ఒచెను. ఆరోజు కార్తీక సోమవారమగుట వలన అ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవిం , జన్మాంతరమున స్వర్గమున కెగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.


కావున , ఓ జనకా ! కార్తీకశుద్ద ద్వాదశిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ద్వాదశాధ్యాయము -* *పన్నెండోవ రోజు పారాయణము సమాప్తము.*


🙏💐🌺🌸🌼🌻🦜🦚🌞🌝