25, అక్టోబర్ 2021, సోమవారం

 



ఈ ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి. నిశితంగా గమనించండి. మీకేమనిపిస్తోందీ? ఆయనొక బ్రాహ్మణుడు వేదాలు చదివిన పండితుడు లేదా పూజలు చేయించే బ్రహ్మ గారు లాగ అగుపిస్తున్నారు కదూ! కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదుకాదు. 


ఆయన ఒక పేరుమోసిన డాక్టరు. ఆంకాలజిస్టు. కాన్సర్ స్పెషలిస్టు. కేరళలో మొట్టమొదటి ఆంకాలజిస్టు ఆయనే. కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్ మెంటు గానూ, తరువాత కొట్టాయం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గాను పనిచేశారు. ఆయన 60సం: వయసులో రిటైరు అయిన తరువాత ఒక ఫ్లయింగ్ డాక్టరుగా పేరుతెచ్చుకున్నాడు. అంటే 50దేశాలకు ఆయన విజిటింగ్ ప్రొఫెసరుగా వెళ్ళి ఆంకాలజీ మీద లెక్చర్లు, పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవారు. 


ఆయన ఎదురుగా కూర్చున్న వ్యక్తిపేరు ‘ బ్రహ్మశ్రీ సూర్యన్ సుబ్రమనియన్ భట్టాత్తిరి’ సిద్ధ వైద్యుడు. 


అంతపెద్దవయసులో మన ఆంకాలజీ స్పెషలిస్టు గారికి తను చదివింది చదువుకాదు, తనవైద్యం ఒకలెక్కలోనిది కాదు అవన్నీ వ్యర్ధం అనిపించింది. మళయాళంలో “అ లాడా వైద్యన్ “ అంటే ఒక గిరిజన వైద్యుడన్నమాట. అలాంటి సిద్ధవైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. పట్టుదలతో సిద్ధవైద్యం నేర్చుకున్నాడు. ఈగొప్పవైద్యుడు సిద్ధవైద్యంతో అనేకమంది రోగులను కాపాడాడు. అమెరికాలోని ప్రఖ్యాత ‘మాయ క్లినిక్’ తిరస్కరించిన రోగులను కూడ ఈయన తన సిద్ధవైద్యంతో బ్రతికించాడు. 


ఆయన వైద్యంతోబాటుగా , వేదాలు ఉపనిషత్తులను భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాడు. అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకి ప్రఖ్యాతిగాంచిన ‘సూర్యకాలాది మాన’ అనుసరించి “ ఉపనయన సంస్కారం పొంది” మెడలో జంధ్యం, రుద్రాక్ష మాల ధరించారు. ఆయన జీవితమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాచార్యుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు. ఆయన 92 సంవత్సరాల వయసులో పరమపదించారు 

20 అక్టోబరు 2021 తేదీన. ఏ ఒక్కమీడియాసంస్థా ఆయనగురించి రాయలేదు. కమ్యూనిస్టు జిహాదీ కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన లోని విద్యా సరస్వతికి చేతులెత్తి నమస్కరించుతున్నాను. 

మీకు ఉత్కంఠగా ఉందికదూ ! ఆయన పేరేమిటో తెలుసుకోవాలనీ, ఆయన నేపధ్యం ఏమిటో తెలుసుకోవాలనీ ఆతృతగా ఉంది కదూ! ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందిన ఒక క్రిస్టియన్! అవునండీ ఆయన ఒక క్రిస్టియన్! ఆయన పేరు సి పి మాథ్యూ.. సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మమంటే అది మతం కాదు ఒక జీవన విధానమనీ, అది సైన్సు ఆధారితమనీ మూఢత్వం కాదనీ తెలుసుకుని, ఆచరించి, బోధించి స్వర్గస్తుడయ్యారు. అతిముఖ్యమైన విషయం, ఆయన జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా ఆయన జ్ఞానంచేత బ్రాహ్మణుడై, ఉపనయన సంస్కారం పొంది, బ్రాహ్మణుడిగా జీవించిన సి పి మాథ్యూ గారు ధన్యుడు! ఆయన జీవితం సనాతన ధర్మాన్నీ, కులాలను విమర్శించే వారికి కనువిప్పు కలిగించగలదు!!

సంస్కృత మహాభాగవతం*

 *25.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అలబ్ధ్వా న విషీదేత కాలే కాలేఽశనం క్వచిత్|*


*లబ్ధ్వా న హృష్యేద్ధృతిమానుభయం దైవతంత్రితమ్॥12945॥*


ఎప్పుడైనను ఆహారము లభింపకున్నను సన్న్యాసి దుఃఖపడరాదు. అట్లే నిత్యము భిక్షలభించుచున్నను పొంగిపోరాదు. భిక్షప్రాప్తించుట, ప్రాప్తించకుండుట అను రెండును దైవికములు. కావున అన్ని పరిస్థితులలో ధైర్యముగా (తొణకక) ఉండవలెను.


*18.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఆహారార్థం సమీహేత యుక్తం తత్ప్రాణధారణమ్|*


*తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే॥12946॥*


సన్న్యాసి ప్రాణరక్షణకై ఆహారముకొరకు (భిక్షకొఱకు) శ్రమపడియైనను యత్నింపవలెను. తత్త్వజ్ఞాన సముపార్జనకొఱకు ప్రాణములు ఉండితీరవలెను. తత్త్వజ్ఞానమువలన మోక్షము లభించును.


*18.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*యదృచ్ఛయోపపన్నాన్నమద్యాచ్ఛ్రేష్ఠముతాపరమ్|*


*తథా వాసస్తథా శయ్యాం ప్రాప్తం ప్రాప్తం భజేన్మునిః॥12947॥*


సన్న్యాసి దైవికముగా లభించిన భిక్షాన్నము శ్రేష్ఠమైనదియైనను, కాకున్నను దానినే భుజించి తృప్తిపడవలెను. అట్లే వస్త్రముగాని, శయ్యగాని దొరకినదానితో తృప్తి చెందవలెను. అవి శ్రేష్ఠములైనను, తదితరములైనను పట్టించుకొనరాదు. 


*18.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*శౌచమాచమనం స్నానం న తు చోదనయా చరేత్|*


*అన్యాంశ్చ నియమాంజ్ఞానీ యథాహం లీలయేశ్వరః॥12948॥*


జ్ఞాని *శౌచ-ఆచమన-స్నానాది కర్మలను* ఇవి విధ్యుక్తములు - అను భావనతోగాక సహజముగా చేయవలెను. ఇతర నియమములనుగూడ విధివచనములకు అధీనుడుగాక నావలె లీలగా ఆచరింపవలెను.


*18.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*న హి తస్య వికల్పాఖ్యా యా చ మద్వీక్షయా హతా|*


*ఆదేహాంతాత్క్వచిత్ఖ్యాతిస్తతః సంపద్యతే మయా॥12949॥*


జ్ఞాని పరమాత్ముడనైన నన్నే సర్వత్ర దర్శించుచుండును. కనుక అతనిలో వైకల్పికమగు నానాత్వభ్రమకు తావేలేదు. ఒకవేళ దేహావసాన సమయమునందు శారీరక క్లేశముల కారణముగా అట్టి ప్రతీతి కలిగినను నా సాక్షాత్కారము కలిగినందున దేహము నశించినప్పుడు అతడు నన్నే చేరును.


*18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*దుఃఖోదర్కేషు కామేషు జాతనిర్వేద ఆత్మవాన్|*


*అజిజ్ఞాసితమద్ధర్మో గురుం మునిముపవ్రజేత్॥12950॥*


*18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*తావత్పరిచరేద్భక్తః శ్రద్ధావాననసూయకః|*


*యావద్బ్రహ్మ విజానీయాన్మామేవ గురుమాదృతః॥12951॥*


ఉద్ధవా! జితేంద్రియుడు 'సాంసారిక భోగములయొక్క పర్వవసాన ఫలములు అన్నియును దుఃఖకారకములే' అని నిశ్చయించుకొని విరక్తుడగును. కానీ, వాటినుండి బయటపడి, నన్ను చేరెడి ఉపాయము అతనికి తెలియనప్పుడు, మనన శీలుడు, బ్రహ్మనిష్ఠాపరుడు ఐన గురువును ఆశ్రయింపవలెను. అతడు గురువునెడ దృఢమైన భక్తిశ్రద్ధలు, విశ్వాసము కలిగియుండవలెను. ఆయనలో ఎట్టిదోషములనూ ఎన్నరాదు.అనగా మానవ సహజమైన దోషదృష్టితో ఆయనను చూడరాదు. బ్రహ్మజ్ఞానము కలుగునంతవరకును ఆయనను నన్నుగా (దైవముగా) భావించి, సాదరముగా సేవింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*474వ నామ మంత్రము* 25.10.2021


*ఓం యశస్విన్యై నమః*


అఖండమైన కీర్తిగలిగి భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యశస్వినీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం యశస్విన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే వారి వారి వ్యాపారవృత్తి రంగములలో రాణిస్తూ, కీర్తిప్రతిష్టలను పొందినవారగుదురు.


అమ్మవారు సిద్ధులకు ఈశ్వరి. పంచదశి మంత్రము వంటి మంత్రములకు సిద్ధవిద్యాస్వరూపిణి. మంత్రసిద్ధిపొందిన సిద్ధులకు, సనకసనందనాదులకు తల్లివంటిదై *సిద్ధమాతా* యని అనబడుచూ గొప్ప కీర్తిని గలిగియున్నదగుటచే *యశస్వినీ* యని అనబడుచున్నది.


సహస్రారంలో ఉండే దేవతపేరు యశస్విని. అమ్మవారు యశస్వినీస్వరూపిణియగుటచే *యశస్వినీ* యను నామ ప్రసిద్ధినందినది.


భండాసురాది రాక్షససంహారంలో శక్తిసేనలను ఉపయోగించుకొని, విశేషమైన రణతంత్ర వ్యూహ ప్రతిభాపాటవములతో దేవకార్యములను చక్కబెట్టి *దేవకార్యసముద్యతా* యని యశస్సును పొందినదగుటచే, అమ్మవారు *యశస్వినీ* యని అనబడినది.


సహస్రారంలో ఉండే దేవత పేరు యశస్విని. అమ్మవారు యశస్వినీ స్వరూపిణియై *యశస్వినీ* యను నామంతో కీర్తింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం యశస్విన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*473వ నామ మంత్రము* 25.10.2021


*ఓం సిద్ధమాత్రే నమః*


మంత్రసిద్ధి గలవారిని తల్లివలె రక్షించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సిద్ధమాతా* యను నాలుగక్షరముల నామమును *ఓం సిద్ధమాత్రే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులను ఆ తల్లి వారిని ఆపదలనుండి రక్షించును, సకలకార్యార్థసిద్ధిని అనుగ్రహించును.


సనత్కుమారులు లేదా సనకసనందాదులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు. ధర్మప్రజాపతి పుత్రులు. సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు. సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సుచేస్తూ కాలంగడిపారు.బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు. వీరు (సనకసనందనాదులు) పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలను పొందిన సిద్ధులు. అటువంటి వీరికి పరమేశ్వరి తల్లి వంటిది యగుటచే అమ్మవారు *సిద్ధమాతా* యని అనబడినది.


అనంతకోటి జీవరాశులకు అమ్మవారు తల్లి వంటిది. వారిని సర్వదా కాపాడుటకు సిద్ధముగా ఉంటుంది గనుక, ఆ తల్లి *సిద్ధమాతా* యని అనబడినది.


ఆజ్ఞాచక్రమునకు అధిష్ఠానదేవత సిద్ధమాత. పరమేశ్వరి ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవతా స్వరూపిణియైన సిద్ధమాతాస్వరూపిణి గనుక, ఆ తల్లి *సిద్ధమాతా* యని అనబడినది.


పరమేశ్వరి తన భక్తుల తాపత్రయముల (తాపత్రయములు అనగా *మూడు తాపములు* అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము) నుండి పరమేశ్వరి కాపాడుటకు సదా సిద్ధముగా ఉంటుంది గనుక జగన్మాత *సిద్ధమాతా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునప్పుడు *ఓం సిద్ధమాత్రే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *24.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*వానప్రస్థాశ్రమపదేష్వభీక్ష్ణం భైక్ష్యమాచరేత్|*


*సంసిధ్యత్యాశ్వసమ్మోహః శుద్ధసత్త్వః శిలాంధసా॥12937॥*


వానప్రస్థులు ఉంఛవృత్తితోడను, వనములలో లభించెడి కందమూలఫలాదులను స్వీకరించుచు జీవించుచుందురు. సన్న్యాసి తఱచుగా వానప్రస్థుల ఆశ్రమములయందే భిక్షను స్వీకరించుచుండవలెను. తత్ప్రభావమున (ఆ సాత్త్వికాహార ప్రభావముచే) సత్త్వ శుద్ధి ఏర్పడును. జిహ్వచాపల్యాది మోహము నశించును.


*18.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*నైతద్వస్తుతయా పశ్యేద్దృశ్యమానం వినశ్యతి|*


*అసక్తచిత్తో విరమేదిహాముత్ర చికీర్షితాత్॥12938॥*


శబ్దాది విషయములతో గూడిన ఈ దృశ్యమాన జగత్తు అంతయు నశించునదియే గావున, దానిని సత్యమని భావింపరాదు. అందువలన సన్న్యాసి దానిపై ఆసక్తిని కలిగియుండరాదు. లౌకిక పారలౌకిక, కామ్యకర్మల నుండియు వైదొలగి విరక్తుడై యుండవలెను.


*18.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*యదేతదాత్మని జగన్మనోవాక్ప్రాణసంహతమ్|*


*సర్వం మాయేతి తర్కేణ స్వస్థస్త్యక్త్వా న తత్స్మరేత్॥12939॥*


వాక్కు మొదలగు కర్మేంద్రియములతోను, మనస్సుతో గూడిన జ్ఞానేంద్రియములతోను, పంచమహాభూతములతో ఒప్పెడి ప్రాణేంద్రియములతో గూడిన ఈ శరీరము మాయయే అని (ప్రకృతి పరిణామాత్మకమే అని) భావించి శరీరమునందు ఆత్మాభిమానమును త్యజింపవలెను. పిమ్మట 'ఆత్మయొక్క నిజస్వరూపము బ్రహ్మాత్మకము' అను భావముతో శాంతుడై యుండవలెను.


*18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*జ్ఞాననిష్ఠో విరక్తో వా మద్భక్తో వానపేక్షకః|*


*సలింగానాశ్రమాంస్త్యక్త్వా చరేదవిధిగోచరః॥12940॥*


జ్ఞాననిష్ఠుడై, విరక్తుడై, దేనియందును అపేక్షలేని నా భక్తునకు సన్న్యాస చిహ్నములైన దండము మొదలగు వానితో పనిలేదు. అతనికి ఎట్టి విధినిషేధములును ఉండవు. దైవభక్తిప్రపూర్ణుడై యుండుటయే ముఖ్యము.


*18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*బుధో బాలకవత్క్రీడేత్కుశలో జడవచ్చరేత్|*


*వదేదున్మత్తవద్విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్॥12941॥*


దేహాత్మాభిమానరహితుడైన నా భక్తుడు వివేకియైనను బాలునివలె మానావమానరహితుడై చరింపవలెను. నిపుణుడైనను జడునివలెను, విద్వాంసుడైనను ఉన్మత్తునివలెను, వేదార్థ నిష్ఠుడైనను అజ్ఞునివలెను ప్రవర్తింపవలెను.


*18.30 (ముప్పదియవ శ్లోకము)*


*వేదవాదరతో న స్యాన్న పాఖండీ న హైతుకః|*


*శుష్కవాదవివాదే న కంచిత్పక్షం సమాశ్రయేత్॥12942॥*


నా ఈ భక్తుడు వేదపూర్వ భాగము నందలి కర్మకాండయందు రక్తుడు కారాదు. పాషండుడు (వేదవిరుద్ధమైన ప్రవర్తనగలవాడు) కారాదు. కుతర్కములకు దూరముగా ఉండవలెను. శుష్కములైన వాదవివాదములు జరుగుచున్నప్పుడు ఏ పక్షమునూ వహింపరాదు.


*18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*నోద్విజేత జనాద్ధీరో జనం చోద్వేజయేన్న తు|*


*అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కంచన|*


*దేహముద్దిశ్య పశువద్వైరం కుర్యాన్న కేనచిత్॥12943॥*


భక్తుడు జనులను (ఎవ్వరినీ) ఉద్వేగపరచరాదు, ఎవరివలనను ఉద్వేజితుడు కారాదు. దురుక్తములను (ఎవ్వరైనను నిందించినను) సహింపవలెను. ఎవ్వరినీ అవమానింపరాదు. తన శరీరసుఖముకొరకు ఇతరులపై అసూయపడరాదు. దేహాభిమానముతో పశువువలె ఎవరినీ ద్వేషింపకూడదు. అనగా అందరిపట్ల భగవద్ బుద్ధిని కలిగియుండవలెను.


*18.32 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఏక ఏవ పరో హ్యాత్మా భూతేష్వాత్మన్యవస్థితః|*


*యథేందురుదపాత్రేషు భూతాన్యేకాత్మకాని చ॥12944॥*


చంద్రుని బింబము వివిధ పాత్రలలో వేర్వేరుగా కనబడుచున్నను చంద్రుడు ఒక్కడే. అట్లే పంచభూతాత్మకములైన వివిధ శరీరములలోను ఆత్మస్వరూపమున వెలుగొందుచున్న పరమాత్మ ఒక్కడే. కనుక ఇతరులను ఎవ్వరిని ద్వేషించిననూ తనను తానే ద్వేషించినట్లగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

 *24.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.17 (పదిహేడవ శ్లోకము)*


*మౌనానీహానిలాయామా దండా వాగ్దేహచేతసామ్|*


*న హ్యేతే యస్య సంత్యంగ వేణుభిర్న భవేద్యతిః॥12929॥*


ఉద్ధవా! మౌనము వాక్కునకు సంబంధించిన దండము, కామన (కోర్కెల) దేహమునకు సంబంధించిన దండము. ప్రాణాయామము మనస్సునకు సంబంధించిన దండము. ఈ మూడుదండములును లేకుండా కేవలము వెదురు కర్రలను ధరించినవాడు యతి కాజాలడు.


*18.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*భిక్షాం చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్ వర్జయంశ్చరేత్|*


*సప్తాగారానసంకౢప్తాంస్తుష్యేల్లబ్ధేన తావతా॥12930॥*


సన్న్యాసి నిందితులను, పతితులను వర్జించి (స్వవర్ణములనుండి పతనమైనవారిని, గోఘాతకులను వర్జింపవలెను), నాలుగు వర్ణములవారి గృహములనుండియు భిక్షను స్వీకరింపవచ్చును. 


*'పూర్వవర్ణేషు భిక్షాయాః అలాభే ఉత్తరోత్తర వర్ణానుమతిః' ఇతి కేచిత్ వ్యాచక్షతే - ప్రాణాత్యయదశాయమేవ వర్ణాంతర భిక్షానుమతిః ఇతియుక్తమ్* (వీరరాఘవీయ వ్యాఖ్య)


ఏడు గృహముల నుండియే భిక్షను గైకొనవలెను. ఆ ఏడు గృహములును ముందుగా నిర్దేశింపబడకూడదు. భిక్షతో లభించినదానితోడనే సంతృప్తి చెందవలెను.


*18.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః|*


*విభజ్య పావితం శేషం భుంజీతాశేషమాహృతమ్॥12931॥*


పిమ్మట సన్న్యాసి గ్రామమునకు వెలుపలగల జలాశయము కడకు వెళ్ళి, కాళ్ళను, చేతులను కడుగుకొని ఆచమించి, భిక్షాన్నములను జలముతో ప్రోక్షించి, మౌనముగా దానిని విభజించి, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలకు సమర్పించిన పిదప, మిగిలినదానిని (రాత్రిపూట కొఱకు మిగల్చక) పూర్తిగా భుజించవలెను.


*18.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఏకశ్చరేన్మహీమేతాం నిఃసంగః సంయతేంద్రియః|*


*ఆత్మక్రీడ ఆత్మరత ఆత్మవాన్ సమదర్శనః॥12932॥*


సన్న్యాసి దేనియందును ఆసక్తి లేనివాడై, జితేంద్రియుడై ఒంటరిగా సంచరింపవలెను. ఆత్మానందరతుడై, ఎట్టి పరిస్థితులలోను తొణకక సమదర్శనుడై యుండవలెను. అనగా అంతటను పరమాత్మనే దర్శించుచు ఉండవలెను.


*18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*వివిక్తక్షేమశరణో మామద్భావవిమలాశయః|*


*ఆత్మానం చింతయేదేకమభేదేన మయా మునిః॥12933॥*


అతడు నిర్జనమైన నిర్భయ (క్రూరమృగములవలన ప్రమాదము లేనట్టి) పవిత్ర ప్రదేశమున నివసింపవలెను. అతని హృదయము నిర్మలమై, నా భావముతో (భగవద్భావనతో) నిండియుండలెను. తన ఆత్మను నాకంటె వేరుగాగాక అభేదభావముతో ధ్యానించు చుండవలెను.


*18.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*అన్వీక్షేతాత్మనో బంధం మోక్షం చ జ్ఞాననిష్ఠయా|*


*బంధ ఇంద్రియవిక్షేపో మోక్ష ఏషాం చ సంయమః॥12934॥*


'ఇంద్రియములకు వశమై యుండుట బంధహేతువు, సంయమనమే మోక్షదాయకము' అను తత్త్వవిచారముచేసి, సన్న్యాసి బంధములకు అతీతమైన మోక్షము కొరకు చింతించుచుండవలెను.


*18.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తస్మాన్నియమ్య షడ్వర్గం మద్భావేన చరేన్మునిః|*


*విరక్తః క్షుద్రకామేభ్యో లబ్ధ్వాఽఽత్మని సుఖం మహత్॥12935॥*


అందువలన అతడు మనస్సును, పంచజ్ఞానేంద్రియములను (షడ్వర్గమును) అదుపులో నుంచుకొనవలయును. విరక్తుడై క్షుద్రభోగములకు దూరముగా ఉండవలయును. ఆత్మానందమును అనుభవించుచు నా భావముతో (మనస్సులో నన్నే ధ్యానించుచు) చరించుచుండవలెను.


*18.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*పురగ్రామవ్రజాన్ సార్థాన్ భిక్షార్థం ప్రవిశంశ్చరేత్|*


*పుణ్యదేశసరిచ్ఛైలవనాశ్రమవతీం మహీమ్॥12936॥*


నదులు, పర్వతములు, వనములు, ఆశ్రమములుగల పవిత్ర ప్రదేశములలో సంచరించుచుండ వలయును. కేవలము భిక్షకొఱకు మాత్రమే నగరములయందును, గ్రామములయందును, గోష్ఠములుగల ప్రదేశములయందును, సాత్త్వికజనులు నివసించు స్థానములయందును ప్రవేశింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*471వ నామ మంత్రము* 24.10.2021


*ఓం సిద్ధేశ్వర్యై నమః*


గోరక్షకాది సిద్ధులకు ఈశ్వరి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సిద్ధేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సిద్ధేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలార్థసిద్ధిని అనుగ్రహించును.


దేవతలలో గోరక్షకులను సిద్ధులందురు. కాశీ క్షేత్రమునందు సిద్ధేశ్వరియను ఈశ్వరి ఉన్నది. అమ్మవారు అట్టి సిద్ధేశ్వరీ స్వరూపిణి గనుక, ఆ పరమేశ్వరి *సిద్ధేశ్వరీ* యని అనబడినది. 


అష్టసిద్ధులు అను ఎనిమది సిద్ధులుగలవు. శ్రీచక్రమునందు భూపురం ప్రథమరేఖలో ఈ అష్టసిద్ధులు గలవు.


*అణిమ* శరీరమును అతి చిన్నదిగా చేయుట


*మహిమ:* శరీరమును అతి పెద్దదిగా చేయుట


*గరిమ:* శరీరము బరువు విపరీతముగా పెంచుట


*లఘిమ:* శరీరమును అతి తేలికగా చేయుట


*ప్రాప్తి:* కావలసిన వస్తువులు పొందుట


*ప్రాకామ్యం:* కావలసిన భోగము అనుభవించుట


*ఈశత్వం:* ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట


*వశీత్వం*: అన్ని భూతములను లోబరచుకొనుట


ఈ అష్టసిద్ధులను శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా స్తుతించడం జరుగుతుంది. 


అష్టసిద్ధులను అర్చించడంద్వారా ఆయా ఫలితాలు సంప్తాప్తించును. 


సిద్ధులన్నిటికి ఈశ్వరి అయిన పరమేశ్వరి *సిద్ధేశ్వరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సిద్ధేశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కుప్పింట చెట్టుతో వైద్యం -

 కుప్పింట చెట్టుతో వైద్యం -


         ఇది వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో బాగా పెరిగే చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఇవి రెండూ సమాన గుణాలు కలిగి ఉండును.


    దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను.


  * దీని ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును


  * దీని ఆకు , వేరు కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోల్లికి తీసుకున్న మొలలు నివారణ అగును.


  * ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును.


  * దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.


  * దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును.


  * దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును.


  * అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.


  * దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును.


  * దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును .


  * తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును.


  * గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును .


  * పుప్పిపంటికి దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.


  * పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును .


  * దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.


 

ఎలాంటి భోజనాన్ని చేయాలి

 *ఎలాంటి భోజనాన్ని చేయాలి?‌ ఎలాంటి భోజనం చేయరాదు? నియమాలు ఏమిటి?*


• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. 

• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు. 

• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు. 

• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 

• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.

• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం. 

• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 

• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.

• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది. 


• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.

• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.           

• రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది.

• భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.

• తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.  

• పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి. 

• ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.

• ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. 

• మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.

• భోజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.

• తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.🙏

(సేకరణ)

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను

 *ఆహా ఏమి రాశావయ్యా!!!!! ఏమి స్వామి నీ మహిమ?*

      (అక్షరాంక గద్య )

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో 

చూడండి. పాల్కురికి సోమన్న అద్భుతంగా వ్రాశారు. 

'అ'ఖిల లోకాధార 

'ఆ'నంద పూర

'ఇ'న చంద్ర శిఖి నేత్ర  

'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప

'ఊ'ర్జితా జలచాప

'ఌ'లిత తాండవకాండ 

'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ 

'ఐ'క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ   

'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ 

'ఖ'ల జలంధర హరణ

'గ'ల నాయక విధేయ 

'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర

'చ'రిత త్రిశూల ధర

'ఛ'ర్మ యాధ్వస్త 

'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర 

'ఠ' ప్రభావాకార

'డ'మరుకాది విహార 

'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార 

'త'త్త్వ జోనేత

'థ'వి దూర జవ పక్ష 

'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ 

'నంది కేశారూఢ

'ప'ర్వతీశ్వర లింగ 

'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన 

'మం'త్రస్తుతోధార 

'య'క్ష రుద్రాకార

'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస 

'ళ'మా విదవ్రంశ 

'వ'రద శైల విహార 

'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత  

'స'కల సురముని వినుత

'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 

శ్రీ పర్వత లింగ 

నమస్తే నమస్తే నమస్తే👌

శ్రీమద్వాల్మీకి రామాయణం


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


        4. ఆర్థిక,వాణిజ్య విషయాలు 


    ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ గుండెకాయ వంటిది. 

    సుఖసంతోషాలతో కూడిన ప్రజాజీవనం అనేది ఆ దేశ 

  - భౌతిక వనరుల లభ్యతా, వాటిని ఉపయోగించుకొనే తీరుపైనా, 

  - ఆర్థిక విధానాలమీదా ఆధారపడి ఉంటుంది. 


రామాయణం - ఆర్ధిక, వాణిజ్య సంబంధాలు 


    శ్రీమద్రామాయణంలో ఈ విషయానికి సంబంధించి, 

  - ప్రధానంగా అయోధ్య భూ సంపద వినియోగం, 

  - నిల్వలు, 

  - పశుసంపద, 

  - వివిధ ప్రాంతాలమధ్య పంపిణీకి చెందిన వ్యాపార వ్యవస్థ వంటి విషయాలపై సరియైన దృష్టి, 

  - విదేశీ వాణిజ్య ఆదాయమూ,

  - ప్రజల సుఖసంపదలకి దారితీస్తుందని చూపుతూ,

        ఆదర్శ ఆర్థిక సమాజాన్ని అందిస్తుంది. 


అ) సహజ వనరులు 

    అయోధ్య 

  - నదీ జలాల సౌకర్యంతో, 

  - కేవలం వర్షంమీద మాత్రమే ఆధారపడనిదీ/పంటలు పండించేదీ/ చక్కగా దున్నిన భూములు గలదీ, 

  - సస్య శ్యామలమూ, 

  - వివిధ ఖనిజ సంపదలకు కాణాచీ, 

  - బావులలో నీరు చెఱకు రసంవలే ఉండేదీ అయోధ్య. 


ఆ) వనరుల వినియోగ ఫలం 


    అయోధ్య 

  - పశు సమృద్ధి కలదీ, 

  - చక్కని నివాసాలు ఏర్పరచుకున్న జనులతో నిండినదీ, 

  - సర్వసమృద్ధమై ఆనందిస్తున్నదీ, 

  - హింసలేనిదైన రాజ్యం. 

  - ప్రతీ ఇంటా ధాన్య సమృద్ధి కలిగినదీ, 


ఇ) నిల్వలు 


    దుర్గాలు అన్నిటా ధనధాన్యాలు వగైరా కావలసినంత నిల్వలు ఉండేవి - అనే విషయం ద్వారా పాలకుల "ముందుచూపు" కనబడుతుంది. 


ఈ) వ్యవసాయం - వ్యాపారం - సంపద 


    జనులందరూ కృషి గోరక్షణాలపై ఆధారపడియుంటారు. 

    క్రయ విక్రయాది వ్యాపారాలవృద్ధి వలననే దేశం సుఖసంతోషాలతో వర్ధిల్లింది. 

     వ్యాపారులకెదురైన ఆపదలని నివారించి రాజులు రక్షించేవారని పేర్కొనబడింది. 

    అటువంటి సమయంలో వ్యవసాయ, పశుపాలన, వాణిజ్యం మొదలైన వృత్తులతో జీవించే వ్యాపారులు - రాజుకు అనుకూలురై, ప్రీతిపాత్రులై యుండేవారట. 

    అయోధ్యలో రాజూ, వ్యాపారులూ ధర్మబద్ధులని చెప్పడం ద్వారా, దోపిడీవ్వవస్థ లేదని తెలుస్తుంది. 


ఉ) ఆదాయ - వ్యయాలు 


    రాజ్యాదాయం పుష్కలంగా ఉండాలి. 

    ప్రజలనుంచీ వారి ఆదాయంలో ఆరవవంతు పన్నుగా వసూలుచేసి, ప్రజలను రక్షించాలి. 

    కోశానికి చెందిన ధనమూ, ఆదాయానికి లోబడి పరిమిత వ్యయమూ చేయాలి. 

    ఖజానా చేరిన ధనం అపాత్రులకై వినియోగించకూడదు. 

    కోశాగారమందలి ధనం సక్రమంగా వినియోగించాలని విశదపరచబడింది. 


ఊ) విదేశీ వ్యాపారం 

      

    క్రయవిక్రయాదులకై ఏతెంచెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అయోధ్య క్రిక్కిరిసి ఉండేదనే విషయం - విదేశీ వాణిజ్యం గూర్చి తెలుపుతుంది. 


ఋ) నిర్మూలించబడిన పేదరికం  


    ఆకలితో అలమటించేవారు ఒక్కరుకూడాలేక, 

    అందఱూ తనివితీరా భుజించేవారై, 

    అతిథి అభ్యాగతులను ఆదరిస్తూండేవారట. 


ఋూ) వ్యక్తిగత సంపద 


     గృహస్థులలో ఏ ఒక్కరూ సంపన్నుడుకానివాడుకానీ, 

గో - అశ్వ - ధన - ధాన్య సమృద్ధి లేనివాడుగానీ, 

    తన సంపదకు తగినట్లుగా భాగములను అనుభవింపనివాడుగానీ, లేనేలేరట. 

    

    భూమి నుంచీ పంటనీ, ఖనిజాలనీ, 

    పశు సంపద నుంచీ పాడినీ, 

    వాణిజ్యం, పన్నుల వసూలు నుంచీ దేశాభివృద్ధినీ కలిగి, 

    సక్రమ పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని ప్రజలు సుఖసంతోషాలతో, ధర్మబద్ధంగా అనుభవించే 

    - ఆదర్శ ఆర్థిక వాణిజ్య విధానం అయోధ్యలో ఉండేదని తెలుస్తుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం