25, అక్టోబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*471వ నామ మంత్రము* 24.10.2021


*ఓం సిద్ధేశ్వర్యై నమః*


గోరక్షకాది సిద్ధులకు ఈశ్వరి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సిద్ధేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సిద్ధేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సకలార్థసిద్ధిని అనుగ్రహించును.


దేవతలలో గోరక్షకులను సిద్ధులందురు. కాశీ క్షేత్రమునందు సిద్ధేశ్వరియను ఈశ్వరి ఉన్నది. అమ్మవారు అట్టి సిద్ధేశ్వరీ స్వరూపిణి గనుక, ఆ పరమేశ్వరి *సిద్ధేశ్వరీ* యని అనబడినది. 


అష్టసిద్ధులు అను ఎనిమది సిద్ధులుగలవు. శ్రీచక్రమునందు భూపురం ప్రథమరేఖలో ఈ అష్టసిద్ధులు గలవు.


*అణిమ* శరీరమును అతి చిన్నదిగా చేయుట


*మహిమ:* శరీరమును అతి పెద్దదిగా చేయుట


*గరిమ:* శరీరము బరువు విపరీతముగా పెంచుట


*లఘిమ:* శరీరమును అతి తేలికగా చేయుట


*ప్రాప్తి:* కావలసిన వస్తువులు పొందుట


*ప్రాకామ్యం:* కావలసిన భోగము అనుభవించుట


*ఈశత్వం:* ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట


*వశీత్వం*: అన్ని భూతములను లోబరచుకొనుట


ఈ అష్టసిద్ధులను శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా స్తుతించడం జరుగుతుంది. 


అష్టసిద్ధులను అర్చించడంద్వారా ఆయా ఫలితాలు సంప్తాప్తించును. 


సిద్ధులన్నిటికి ఈశ్వరి అయిన పరమేశ్వరి *సిద్ధేశ్వరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సిద్ధేశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: