21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

గ్రేటర్ గుంటూరు

 *గ్రేటర్ గుంటూరు?* 


 *గ్రేటర్ గుంటూరులో కలిసే గ్రామాలు ఇవే..* 


మేడికొండూరు: పేరేచర్ల, డోకిపర్రు..


ఫిరంగిపురం: అమీనాబాద్..


చేబ్రోలు: నారాకోడూరు, గొడవర్రు, గుండవరం..


ప్రత్తిపాడు: చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదుల పాలెం..


తాడికొండ: లాం, కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు..


వట్టిచెరుకూరు: పుల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల..


పెద్దకాకాని: రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకట కృష్ణాపురం..


గుంటూరు: చిన్న పలకలూరు, మల్లవరం, గోర్లవారిపాలెం, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకావారిపాలెం, లాల్ పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు నాయుడుపాలెం..


"గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు అవుతుంది.. 


ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరు గా రూపాంతరం చెందనున్నది..


ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్ లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలను విలీనం అవ్వనున్నాయి..


గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది..


ఈ మేరకు సీఎం చంద్రబాబు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది..


ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలుపుతారు..


ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.."


*కార్పొరేషన్ పరిధిలో 39 గ్రామాలు*


*8 మండలాలు గుంటూరు పరిధిలోకి*


*రద్దు అవనున్న రూరల్ మండలం*


*గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు*


*విజయవాడతో పాటు గుంటూరు పై దృష్టి*


            _*జంట నగరాలు*_

నవ్యాంధ్ర రాజధానిలో గుంటూరు - విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి..


ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలకు కేంద్రం రూ:2 వేల కోట్లు మంజూరు చేసింది..


హైదరాబాద్ కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..

..శ్రీ దుర్గమ్మ

 మా అమ్మ ...శ్రీ దుర్గమ్మ........!!

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!


ఈ శ్లోకం కవితనో పద్యమో అనుకోకండి.

ఈ శ్లోకానికి దుర్గమ్మ పొంగిపోతుంది.

చాలా శక్తివంతమైనది. 

ప్రతి రోజు మూడుపూట్లా  పఠించిన శతృ ప్రయోగాలు కష్టాలు నాశనం..

ఇది నా అనుభవం...కూడా..!!


అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది.

దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం యిది. పోతన గారు తన యసమాన ప్రతిభతో అమ్మ అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన అమూల్య వర ప్రసాదం. భక్తుడికీ, భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన. ఇలా "దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా, ప్రేమగా పిలుచుకునే భావన్ని, భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే. ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు. నిత్యపూజలో కాని ఏ శుభారంభంలో కాని ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా “అమ్మ” పూజ మొదలెట్ట దగ్గది ఈ తియ్యటి పిలుపు లాంటి ఈ మహామంత్రం. సర్వ శుభాలని సకల విజయాలు సమకూరతాయి.


ఆవిడ అమ్మల గన్న యమ్మ ముగు రమ్మల మూలపు టమ్మ – అవును అసలు స్త్రీ దేవత లంతా దుర్గనుండే పుట్టిన వారే. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టిన వారే. అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింప దగ్గది. పురుష లక్షణం గల దేవత లందఱు విష్ణువునుండి గాని, శివుడినుండి గాని పుట్టినట్లు చెప్తారు. కాని కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలు; వారాహి, చండీ, బగళా మొదలైన మాతలు; రేణుక ఇత్యాది శక్తులు; చివరకు గ్రామదేవతలు అంతా శ్రీమహాదుర్గా దేవతాంశ సంభూతులు గానే చెప్పబడతారు.


ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీ శరీరదాత్రి. ఈ కార్యకారణ సంఘాత మంతా పంచభూతాలనుండి పుడుతుంది. చేతన రూప మైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. అంతా ఒక ముద్ద. ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహార మై, పంచేంద్రియ లక్షణ భూత మై పుడుతోంది. (పంచభూతాలు = భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. (పంచేంద్రియాలు = చూసే కళ్ళు, వాసనలు పీల్చే ముక్కు, రుచినీ తెలిపే నాలుక, శబ్దాలని వినిపించే చెవులు, స్పర్శని తెలియ జేసే చర్మం) ఈ ఐదిటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి. కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటుంది. అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది. బహుజీవులుగా పుడుతుంది, చస్తుంది, మళ్ళా జన్మిస్తుంది. కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒక్కటే శక్తి. రూపాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులని బట్టీ భిన్న మౌతుంది, కాని చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మని బట్టి మారదు. అదే మహాశక్తి. ఆమే దుర్గ. మాతృత్వ గుణానికి కారణ భూతురాలు.


ఆవిడ చాల పెద్దమ్మ. ఆమె సనాతని. ఇప్పటిది అని చెప్పలేము. ఎప్పటిదో కూడా చెప్పలేము. ఈ సృష్టి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఆమె ఉంది.


ఆవిడ సురారు లమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ. ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి. కలిపి చదివితే. (అ) రాక్షసులు (సురారులు దేవతల = శత్రువులు). వారి తల్లి దితి. వాళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు, బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపాఱడి తీర్చింది అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ. (ఆఱడి = గాయం, బాధ), (పుచ్చుట = మాన్పటం) ; (ఆ) విడదీసి చదివితే సురారు లమ్మ ఆ తల్లి దేవతలకే కాదు, రాక్షసులకి కూడా తల్లే మరి. మంచివాళ్ళకీ, చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా. కడుపు ఆఱడి పుచ్చిన యమ్మ మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట మొచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చ గలది, తీర్చేది ఆ అమ్మె (కడు = మిక్కలి).


ఆవిడ తన్ను లోనమ్మిన వేల్పు టమ్మల మనంబుల నుండెడి యమ్మ . తనని లోనుగా తలచెడి వారు (లోనమ్మిన) వేల్పు టమ్మలు = సర్వ దేవతా మూర్తుల యందు నిలిచి ఉండెడి మాతృతత్వం. సకల జీవులలోను ఉండే సహజ దయాస్వభావం. మాతృ దేవతలు. ఆ తత్వాన్ని వారి మనసులలో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి ఆమె.


కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి అమ్మవు, మా యమ్మవు నీవు మాకు సర్వ సంపదల్నీ (మహత్వం కీర్తి ధనం, విద్య కవితా శక్తి, పటుత్వం శక్తి సామర్థ్యాలు = సంపదలు అన్నీ) సముద్ర మంత కృపతో ప్రసాదించు తల్లీ.అమ్మల గన్న యమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవత ఆంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతత్వాన్ని సర్వామోదాన్ని అందుకుంది. మాతృత్వం అంత మధుర్యాన్ని అందుకుంది.

ఏకాకి అయిపోతున్నాడు

 ఏకాకి అయిపోతున్నాడు మనిషి😔🙆🏼‍♂️😴

తల్లడిల్లిపోనున్నాడు


ముందుముందు ఏదో ఒక రోజున...

ఉదయమే మేల్కొల్పడానికి 

అమ్మ అక్కర్లేదు😔

-Alaram app ఉంది!👍


నడక వ్యాయామానికి 

మిత్రుడి తోడక్కర్లేదు. 😔

-Step counter ఉంది!👍


వండి పెట్టడానికి అమ్మ అక్కర్లేదు😔

Zomoto, Swiggy apps ఉన్నాయి!👍


ప్రయాణం చేయడానికి బస్సు అక్కర్లేదు😔

-Uber, ola apps ఉన్నాయి!👍


అడ్రెస్ కనుక్కోవడానికి

టీ కొట్టోడో, ఆటో డ్రైవరో అక్కర్లేదు😔

 - Google map ఉంది!👍


పచారీ సామాన్లు కొనడానికి

ఇంతకాలం అందుబాటులో

ఉన్న కిరాణా దుకాణంతో పని లేదు. 😔

- Online Store ఉంది!👍


బట్టలు కొనుక్కోవడానికి

దుకాణానికి వెళ్ళక్కర్లేదు. 😔

-Amazon, flipkart apps ఉన్నాయి!👍


వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి

నవ్వుకుంటూ మాట్లాడుకోవడానికి

మిత్రుడక్కర్లేదు. 😔

-Whatsapp, facebook వంటివి ఉండనే ఉన్నాయి!👍


అప్పిమ్మని అడగడానికి

సన్నిహితుడో దగ్గరి బంధువో

ఉండక్కర్లేదు. 😔

-Paytm / Loan app ఉంది!👍


మరిన్నో తెలియని విషయాలు

తెలుసుకోవడానికి

-Google app ఉండనే ఉంది!👍


ఇలా ఏకాకిగా బతకడానికి అన్నిరకాల వసతులూ ఉన్నాయి Mobile apps అనే భూతం రూపంలో😔


చిక్కుకుపోతున్నాం

apps వలలో

ఇవతలకు రాలేనంతగా🙆🏼‍♂️


అందుకని కనీసం అప్పుడప్పుడైనా

సన్నిహితులను కలవడానికీ, కబుర్లాడడానికీ

మనసారా నవ్వుకోవడానికీ

వీధులోకొద్దాం...👍


ఈ apps రాకాసి గుప్పెట్లో నుంచి

ఇవతలకొచ్చి కాస్సేపైనా నలుగురి మధ్యా సరదా సరదాగా గడుపుదాం ఏమంటారూ🤗👍

తిలక ధారణ

 🙏తిలక ధారణ 🙏

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటారు పెద్దలు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,

ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..

రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు.

కుంకుమ ఎఱుపు రంగు. రంగులలో ఎఱుపునకు అత్యంత ప్రాధాన్యత. ఎఱుపు కరుణకు (దయ) గుర్తు. శక్తిని సూచిస్తుంది. అరుణాం కరుణాం....... అమ్మవారి ధ్యాన శ్లోకం. అలాగే .అమ్మ వారికి కుంకుమ రాగ శోణే అనే ప్రార్ధన ఉంది కదా..

స్త్రీలు కుంకుమ ధరిచడం వేద కాలము నాటి ఆచారం. పురాణతనమైనది..

వివాహిత స్త్రీ పాపిట (రెండుగా విభజించిన తల కేశములు మొదలు ) నుదిటి మధ్య కుంకుమ ధరించుట సంప్రదాయం గా వస్తున్న పరంపర.

స్త్రీకి నుదిటి కుంకుమ ఒక శోభను ,నిండుతనమును కలుగచేస్తుంది.

మహిళలకు పెళ్లయింది అని గుర్తుకోసం పాపిట బొట్టు పెట్టుకోవడం, పక్క పాపిడి కాకుండా మధ్య పాపిడి తీసుకోవడం, పరికిణీ కాకుండా చీర కట్టుకొని ముఖాన పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకోవడం, మెడలో నల్లపూసలు , మంగళ సూత్రాలు వేసుకోవడం, కాలికి మట్టెలు పెట్టుకోడం చేస్తారు. . కనీసం అవన్నీ చూసి అయినా, పరాయి మగవారు ఈవిడకి పెళ్లయింది ఈవిడ జోలికి పోవద్దు అనుకుంటారు . ఇవన్నీ చాలా పాత ఆచారాలు. స్త్రీలని అందరూ గౌరవంగా చూడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ఆచారాలు. పాతకాలం నించీ ఇప్పటికీ ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని గుర్తులు ఉన్నా ఎగబడే కీచకులు రావణాసురులు ఉన్నారు . మగవారికి పెళ్లయింది అని గుర్తుగా ఏమీ లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అని వీటిని వ్యతిరేకించే మహిళలు కూడా ఉన్నారు.  

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సు అయినా గాని నిష్ఫలము అవుతాయి. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు.

ఇంచు మించుగా చాలామంది భౄమధ్యంలో లేక కాస్త పైన బొట్టు పెట్టుకుంటారు .స్త్రీలు మాత్రమే కాదు పురుషులూకూడా.

ఎందుకూ అంటే అక్కడ ఆఙ్ఞా చక్రం ఉంటుంది . అక్కడే ధ్యానం చేసేటప్పుడు దృష్టి పెట్టాలని చెబుతారు అలా చేస్తే మంచి ప్రశాంతత లభిస్తుంది .

ఏముంటుంది ఆఙ్ఞాచక్రం మీద ?

నమ్మకం ఏమిటంటే సహస్రారంలో మహా కామేశ్వరాంక స్థిత యైన జగజ్జనని ఉంటుంది .వారిపాదాలు ఆఙ్ఞా చక్రం లో ఉంటాయి

బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీమాతకు కుంకుమార్చన చేసినట్లే కదా .

అసలు ఆభావన లో ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆనందతన్మయత్వం కలుగుతుంది.ఆ ఆనందతన్మయత్వంలో కన్నీరు వస్తుంది.

 కళ్ళలో నీళ్ళు ఏంటి ఎందుకొచ్చాయీ .ఓహో గంగమ్మ పుట్టింటికొచ్చిందా ఆవిడ నా కళ్ళ లోంచి బయటకొచ్చిందా

ఇలా మధుర మధురభావాల పుట్టినిల్లు ఆ బొట్టు కదా

ఉదయిస్తున్న భాను బింబం చూస్తే జగన్మాత నుదిటి సింధూరం లా ఉండదూ .పరుచుకున్న ఎరుపు కాంతులు అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పడం లేదూ

స్పందించే మనసుంటె అన్నీ అనుభూతులౌతాయి

బొట్టు పెట్టుకున్న ముఖం ఎంత కళగా ఉంటుంది.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పదప్రయోగాలు

 _*💫 పదప్రయోగాలు ⚜️*_

➖➖➖➖➖➖✍️

*_ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. మనం చేసే చాలా పదప్రయోగాలు, పుస్తకాలు_* *_చదివినవే మర్చిపోతున్నాం. ఇన్ని జంట పదాలకూ మీకు వాడుక తెలుసు. తెలుసు కదా !?_* 👇


1.కలకల. 

2.కిలకిల.

3.గలగల. 

4.విలవిల. 

5.వలవల. 

6.మలమల. 

7.వెలవెల. 

8.తళతళ. 

9.గణగణ. 

10.గునగున 

11.ధనధన. 

12.ఝణఝణ. 

13.కణకణ. 

14.గడగడ. 

15.గుడగుడ. 

16.దడదడ. 

17.కిటకిట. 

18.గటగట. 

19.కటకట. 

20.పటపట. 

21.కితకిత

22.గిలిగిలి. 

23.కిచకిచ. 

24.జిబజిబ. 

25.చకచక. 

26.పక పక. 

27.మెకమెక 

28.బెకబెక. 

29.నకనక. 

30.చురచుర. 

31.చిరచిర. 

32.బిరబిర. 

33.బురబుర. 

34.పరపర. 

35.జరజర. 

36.కరకర.  

37.బరబర. 

38.చరచర. 

39.గజగజ. 

40.తపతప. 

41.టపటప. 

42.పదపద. 

43.గబగబ. 

44.గుసగుస. 

45.కువకువ.

46.ఠవఠవ. 

47.చిమచిమ. 

48.గురగుర. 

49.కొరకొర. 

50.భుగభుగ. 

51.భగభగ. 

52.ఘుమఘుమ. 

53.ఢమఢమ. 

54.దబదబ. 

55.కుహుకుహు. 


*_అందుకే దేశ భాషలందు తెలుగులెస్స._*


*_తెలుగును బ్రతికించుకుందాం !తెలుగులోనే మాట్లాడుకుందాం !*

💐💐💐💐💐💐💐

అతివయె మూలమౌను

 *అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువి లోన నెప్పుడున్*

ఈ సమస్యకు నా పూరణ. 


మొదటి వ్యక్తి. 

గతములు వర్తమానములు గర్హితమై విభజించి చూడరే


అతివయె మూలమౌను గలహమ్ములకున్ భువి లోన నెప్పుడున్


రెండవ వ్యక్తి

మతి చెడి మాటలాడెదవె? మానినులెల్లరు నింటి దీపమై


ప్రతి పని యందు నిల్చెదరు పట్టును వీడరు ప్రాజ్ఞులై తగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

మనం తెలుగులో

 


శ్రీభారత్ వీక్షకులకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు 🌹మనందరం తెలుగు వాళ్లమే. కానీ మనం తెలుగులో బతుకుతున్నామా? మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం అలవాటయింది కానీ తెలుగులో బతకడం మాత్రం ఇంకా అలవాటు కాలేదేమో! అనే అనిపిస్తుంది. మన పక్కనే కన్నడిగులు, తమిళులు, మలయాళీలు వారి మాతృ భాషల్లో బతుకుతున్నపుడు మనమెందుకు బతకలేం అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. తెలుగు ఎంత గొప్పదో తెలుసుకోవడం ఆరంభిస్తే దానిలోనే బతుకుతారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మంత్రశక్తి

 మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి .


       మన ప్రాచీన భారతీయ వేదాలలో మరియు అనేక రహస్య గ్రంథాలు అన్ని మంత్రాలతో కూడుకుని ఉన్నాయి . ఈరోజు మీకు మన ప్రాచీన మంత్రశాస్త్రం గురించి మీకు వివరిస్తాను. 


              ఈ సకల చరాచర సృష్టి మూడింటిపైనా అధారపడి ఉంటుంది. అవే  తంత్రం , మంత్రం , యంత్రం. చాలా మంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని వెటకారంగా ప్రశ్నిస్తూ ఉంటారు . సరైన మంత్రవేత్త ఉంటే చింతకాయలు రాల్చడమే కాదు తన మంత్రశక్తితో చింతచెట్టునే సృష్టించగలడు. ఇప్పుడు నేను మీకు వివరిస్తున్న ఈ మంత్రశాస్త్రం గురించి పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మిగిలిన తంత్ర , యంత్రశాస్త్రం గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. మొదటగా తంత్రశాస్త్రం గురించి చెబుతాను.


                  తంత్రశాస్త్రం అనగా ఉన్నది లేనట్టు , లేనిది ఉన్నట్టు చూపించగల కనికట్టు విద్యలు అన్నియు ఈ విభాగములోనికే వస్తాయి. అంతే కాదు గ్రహసంబంధ దోషాలకు కూడా ఈ తంత్రశాస్త్రము నందు సులభ మార్గాలు ఉంటాయి . ఉదాహరణకు మీకు రాహుగ్రహ దోషం ఉన్నది అనుకొండి మంత్రశాస్త్రము నందు దోషనివారణార్థం జపాలు , హోమాలు ఉంటాయి. అదే తంత్రశాస్త్రవేత్త మాత్రం coffeebyte చాకోలెట్లు పంచమని చెప్తాడు. రాహుగ్రహానికి సంబంధించిన బ్రౌన్ రంగుతో ఆ చాకోలెట్స్ ఉంటాయి. అదేవిధముగా శనికి బొగ్గులు , ఎండుమిర్చి , ఇనుప మేకులు , సారాయి కలిపి పారే నీటిలో విడిచిపెట్టి వెనుకకి తిరిగి చూడకుండా రమ్మని చెబుతాడు. ఇలా సులభ మార్గాలు ఎన్నో తంత్రశాస్త్రము నందు ఉన్నాయి. క్రమేణా తంత్రశాస్త్రం తెలిసినవారు అతితక్కువ మంది ఉన్నారు . ప్రస్తుతం అస్సాం లోని గౌహతి , రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వతాల ప్రాంతాలలో మిగిలి ఉంది. 


                యంత్రం గురించి చెప్పాలి అంటే ఒక బలమైన శక్తిని రాగి రేకుపై  కొన్ని గడులను లిఖించి జపాలు , హొమాలు గావించి ఆ గడుల యందు ఆ శక్తిని నిలుపుతారు. ఆ యంత్రం యొక్క బలమును బట్టి ఆ శక్తి ఆ ప్రదేశాన్ని ఆవరించుకొని ఉంటుంది. నిత్యం జరిగే పూజలు , అభిషేకాల వలన ఆ యంత్రము మరింత బలోపేతం అవుతుంది. ఈ యంత్రాన్ని స్థాపించే సమయమున జపాలు , హోమాలు చేసి ఆ శక్తిని ఆ యంత్రానికి ధారపోస్తారు. ఈ ప్రక్రియ చాలా నియమనిష్టలతో కూడుకుని సద్బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిపిస్తారు.


                మంత్రం గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను . ఒక గదిలో ఒక యాభైమంది వ్యక్తులు ఉన్నారనుకోండి. ఆ యాభైమందిలో ఇంటిపేరుతో సహా ఒక వ్యక్తిని మనం పిలిస్తే అతనుమాత్రమే పలుకుతాడు. అదేవిధముగా ఈ సకల చరాచర సృష్టిలో కోటానుకోట్ల అదృశ్యశక్తులు ఉంటాయి. ప్రతిశక్తికి ఒక ప్రత్యేకమైన నామం ఉంటుంది. ఆ నామాన్ని ఒక నిర్దిష్టమైన సంఖ్యలో జపిస్తున్నప్పుడు ఆ శక్తి ఉత్తేజితం అవుతుంది. ఆ నామమే "మంత్రం" . ఈ మంత్రశాస్త్రం అన్నది క్లిష్టమైనది. పూర్తిగా మనస్సును లగ్నం చేయగలిగిన వారు మాత్రమే నేర్చుకోగలరు.


            మంత్రశాస్త్రం అనగా ఒకటి కాదు. ఈ శాస్త్రంలో అనేక బేధాలు కలవు. అవి 

 పురుషవిద్య , శ్రీవిద్య , కామవిద్య, గోరవిద్య అను నాలుగు విధములు అగు ఉపాసనలు కలవు.  మంత్రశాస్త్రం నేర్చుకున్నటువంటి వ్యక్తి తన శక్తిని ధర్మసంబంధమైన కార్యాలకొరకు మాత్రమే ఉపయోగించవలెను . ధర్మవిరుద్ధములు అగు కార్యక్రమాలకు ఉపయోగించరాదు .


          మంత్రోపాసన చేయు వ్యక్తి పైన చెప్పినట్టుగా సృష్టి యందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యశక్తిని ఆవాహము చేసి అనగా పిలిచి తన స్వాధీనము చేసుకుని ఆ శక్తిని బీజాక్షరాలలో ప్రవేశపెట్టి తద్వారా మంత్రసిద్ది పొందుతున్నాడు. ఈ విధానం గొప్ప యోగులకు మాత్రమే సాధ్యం . అలాగే ఎటువంటి యోగశక్తి లేనివారు కూడా ఈ మంత్రశక్తి సాధించవచ్చు. దీనికొక ఉపాయం కలదు. మంత్రసిద్ధి సాధించిన యోగి అనుగ్రహముతో అతని ఉపదేశముతో కూడా ఈ మంత్రసిద్ధిని పొందవచ్చు.  దీనిని "శక్తిపాతం" అని మంత్రశాస్త్రంలో పిలుస్తారు . కొంతమంది యోగులు తమ బొటనవేలిని రెండు కనుబొమ్మల మధ్యభాగము నందు ఉంచి కూడా శక్తిని మనశరీరము నందు ప్రసరింపచేస్తారు. ఇలా శక్తిపాతం చేయునప్పుడు సాధకునకు యోగి కొన్ని నియమాలు తప్పక పెడతారు . అవి 


 *  సాధకుడు శుచిగా , శుభ్రముగా ఉన్నప్పుడు మాత్రమే యోగి అనుగ్రహించిన మంత్రమును ఉచ్చారణ చేయవలెను .


 *  పర్వదినముల యందు ముఖ్యముగా గ్రహణ సమయముల యందు , అమావాస్య మొదలగు తిథుల యందు గురువు యొక్క ఆజ్ఞని అనుసరించి కొన్నివేల పర్యాయములు మంత్రమును జపించవలెను.


 *  సిద్ధించిన మంత్రశక్తిని పరుల ఉపయోగార్థం ఉపయోగించునప్పుడు ప్రతిఫలం ఆశించకూడదు.


 *  ఆయోగ్యులకు మంత్రం తెలుపరాదు.


 *  భూతతృప్తి కొరకై కొన్ని అర్చనలు , దానాలు , దేవతారాధనలు , సంతర్పణలు మొదలైనవి చేయించుచుండవలెను.


          పైనచెప్పిన నియమములను పాటించుచున్నంత వరకు మంత్రము చక్కగా పనిచేయును . మంత్రశక్తి ఉపదేశకుని వాక్సుద్ధిని బట్టి ఉండును. వాక్సుద్ధి అనగా చెప్పినమాట తప్పక జరిగితీరును. వారు ఆశీర్వదించినను , శపించినను తప్పక జరిగితీరును.


              చరక , శుశ్రుతాది గ్రంథముల యందు త్రివిధ చికిత్సలలో "దైవవ్యపాశ్రయ చికిత్స" ఒకటిగా వివరించబడినది.  చరకసంహిత సూత్రస్థానము నందలి పదకొండోవ అధ్యాయము నందు బలి , మంత్రాది చికిత్సలు ఉదహరింపబడినవి. శుశ్రుతము నందు గ్రహచికిత్సల యందు మరియు శస్త్రచికిత్స చేయుటకు పూర్వం కొన్ని రక్షోమంత్రాలు తెలుపబడి ఉన్నాయి. ప్రాచీనకాలం నందు మంత్రవేత్తలకు ఆయుర్వేదం పైన పట్టు ఉండేది. అదేవిధముగా ఆయుర్వేద వైద్యులు కూడా మంత్రశాస్త్రం , జ్యోతిష్యం పైన పట్టు ఉండేది. ఇప్పటి కాలములో కూడా ఆయుర్వేద వైద్యం తెలిసిన వారు , వైద్యం చేయువారు కొంత అయిన మంత్ర, జ్యోతిష్య శాస్త్రాలపై అవగాహన ఏర్పరుచుకొనవలెను. ఇలా తెలుసుకోవాలి అనుకునేవారు  భాస్కర రాయులు విరచితం అయిన లలితా సహస్రనామ భాష్యము , వరివస్యా రహస్యము , కామకళా రహస్యము వంటి గ్రంథాలు చదువుట ఉత్తమము.


 

  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి

 🙏🙏🙏ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి వ్యాసం🙏


"ఇచ్చాశక్తి - జ్ఞానశక్తి --క్రియా శక్తి స్వరూపిణి "

అని లలితా సహస్రంలో వాగ్దేవతలు చెప్పారు..


యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపము.ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి


1) ఇచ్ఛాశక్తి


2) జ్ఞానశక్తి


3) క్రియాశక్తి.


ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపుటయే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.


. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని త్రికోణంలో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే..


 మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది


సదాశివశక్తుల యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి పార్వతి, సరస్వతి, లక్ష్మి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్న ఏకత్వ లక్షణముల గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ – ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెపుతోంది..

ప్రపంచంలో ఉన్న చైతన్యం వెనుక శక్తి నిబిడీకృతమై వుంటుంది. అంటే భౌతికమైనది మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకే చైతన్యశక్తి- ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మూడు రకాలుగా ఉటుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చేయాలనే కోరిక (ఇచ్ఛ) పుట్టాలి. అదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగాక ఆ పని ఎలా చేయాలో జ్ఞానం కలగాలి. అదే జ్ఞానశక్తి. ఇచ్ఛ, జ్ఞానం రెండూ కలిగిన తరువాత పని జరగాలి. అదే క్రియాశక్తి.

ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావిస్తే దీన్ని సృష్టించేది సృష్టికర్త. ఆయన ‘సృష్టి’ స్పందనను పొందాలంటే ఈ మూడు శక్తుల కలయిక తప్పనిసరి. అంటే సృష్టి మొత్తం కూడా ఈ మూడు శక్తుల విపరిణామం. మనకు కనిపించేదంతా క్రియాశక్తి రూపాంతరం. దీనివెనుక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులున్నాయి. ఈ మూడూ కలిసిన సంపూర్ణశక్తే పరాశక్తి. ఈ జగత్తు మొత్తానికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తు జన్మనిచ్చేది తల్లి. తండ్రికాదు. అందుకే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు.

అందువల్లనే శంకరాచార్యులవారు ”శివశ్శ్యక్త్యాయుక్తోయది భవతి శక్త: ప్రభవితుం”’ అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు.

బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే, ఆ ముగ్గురూ కూడా ఆ శక్తిమాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాము. అయితే, మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేము. ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత వివిధ దేవీరూపాలను స్వీకరించి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగ త్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుతున్నది.

పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత. శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శివుని త్రిశూలం మూడు శక్తులకు ప్రతీక.అల్లాగే సుబ్రహ్మణ్య స్వామి (జ్ఞాన శక్తి). భూమి మీద పుట్టిన భార్య వల్లీదేవి (ఇచ్ఛా శక్తి) మరియు అతని దైవిక( దేవతా సంబంధమైన) భార్య దేవసేన (క్రియా శక్తి)తో కలిసి జ్ఞానాన్ని (సుబ్రహ్మణ్య స్వామి ) సృష్టించడానికి ఇచ్చా మరియు క్రియల కలయికను సూచిస్తారు.ఇది సుబ్రహ్మణ్య తత్త్వముగా చెప్పబడింది.

 కృష్ణుడు (జ్ఞాన శక్తి) కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపిణి అయిన రాధా దేవి (ఇచ్ఛా శక్తి), మరియు ఆయన భార్య, రుక్మిణి దేవి (క్రియా శక్తి)అని కృష్ణ తత్త్వముగా చెప్పబడింది. తత్వశాస్త్రంలో, ఇడా నాడి (ఇచ్ఛా శక్తి) మరియు పింగళ నాడి (క్రియా శక్తి) సమతుల్యతలో ఉన్నప్పుడు సుష్మ నాడి (జ్ఞాన శక్తి)లోకి శక్తిని ప్రవహించటానికి అనుమతిస్తాయి

సారాంశం మళ్ళీ చెబుతున్నాను 

దేవతాశక్తి యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.

అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే

 సాధ్యం.

శ్రీచక్రంలో బిందువు ఇచ్చాశక్తి, త్రికోణం జ్ఞానశక్తి

మిగిలిన చక్రాలు క్రియాశక్తి అని గ్రహించాలి.


సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సీనియర్* *సిటిజెన్స్

 *55 ఏళ్ళ పైబడిన సీనియర్* *సిటిజెన్స్ కు* *శుభాకాంక్షలు!* 


 *ఇంక చాలు తగ్గించండి* *(MINIMIZE):* 


1. ఉప్పు


2. చక్కెర


3. పిండి పదార్థాలు (బ్లీచ్డ్ ఫ్లోర్)


4. పాలు మరియు పాడి ఉత్పత్తులు


5. ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్


 *మీరు తినదగ్గ ఆహార పదార్థాలు (FOOD NEEDED):* 


1. కూరగాయలు


2. పప్పులు


3. బీన్స్


4. గింజలు (నట్స్)


5. గుడ్లు


6. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ (ఒలివ్, కొబ్బరి తదితరాలు)


7. పండ్లు


 *మరిచిపోవలసిన 3 విషయాలు (THINGS TO FORGET):* 


1. మీ వయస్సు


2. మీ గతం


3. మీ గొప్పలు


  4. మీ సమస్యలు


5. మీ వితండవాదాలు 


 *మరువకూడని ముఖ్య విషయాలు (ESSENTIAL THINGS TO CHERISH):* 


1. మీ కుటుంబం


2. మీ స్నేహితులు


3. మీ సానుకూల ఆలోచనలు


4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇంటిని కలిగి ఉండండి


 *అభ్యసించాల్సిన 3 ముఖ్యమైన అలవాట్లు (THINGS TO ADOPT):* 


1. ఎప్పుడూ నవ్వండి / ఆనందంగా ఉండండి


2. మీకు తగ్గట్టుగా నిత్య శారీరక వ్యాయామం చేయండి


3. మీ బరువును నియంత్రించండి


 *చర్చించాల్సిన 6 జీవనశైలులు (LIFESTYLES TO PRACTICE):* 


1. దాహం వేసే వరకు నీళ్లు త్రాగడానికి వేచి ఉండకండి


2. అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి


3. అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షలు చేయించుకోడానికి వేచి ఉండకండి


4. మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి


5. మీ మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి


6. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మరియు మరింత మెరుగైన రేపటి కోసం ఆశపడండి


మీకు 55 - 90 సంవత్సరాల వయసులో ఉన్న స్నేహితులు ఉంటే, ఈ సందేశాన్ని వారికి పంపండి.

 *ధన్యవాదాలు 🙏*

మాఘ పురాణం - 24 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం - 24 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*🌿శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసీ మహాత్త్యము☘️*


*🌅🛕📚TVBC📚🛕🌅*

**************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.


నీలమేఘమువలె నల్లనిచాయతో , నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో , విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా , సూర్యకాంతినిమించు కిరీటముతో , హారకేయూరాది విభూషణములతో , పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి *'నాయనా ! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.*


అప్పుడు సత్యజిత్తు *'స్వామి ! ఇంద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును , నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను ఇట్లనెను. ఓయీ ! యీ ఏకాదశి తిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని , కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు , పవిత్రము , వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని నకిమ్ము , నీకు శుభము కలుగును , మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదుల కిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.*


*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

•••••••••••••••••••••••••••••

శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశీ తిథి సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును , జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను , సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన యీ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి , పుష్టికలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి భోజనమును మాని , ఏకాదశినాడు రెండు పూటల భోజనమును మాని , ద్వాదశి నాటి మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసినవానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు , సన్యాసి , వానప్రస్తుడు , స్త్రీబాలవృద్ధులు అందరును ఏకాదశినాడు భుజింపరాదు , ఏకాదశినాడు స్త్రీ సుఖము , నిద్ర , అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును , శుక్ల కృష్ణ పక్షములు రెండిటను వచ్చు ఏకాదశులన్నియు నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము ఏకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా , మునులారా , నా భక్తులారా మెరెవ్వరును యీ ఏకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని జహ్నుమునికి వివరించెను.


*🪀📖courtesy by📲🙏*.

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*•••••••••••••••••••••••••••


గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి ఇంద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాతవృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి ! నీవు నాకిటురాలవు. నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలోనైక్యమగుదురు. నిన్ను తమ ఇంటి యందు గాని తోటలయందు గాని పెంచువారికి యే పాపములును అంటవు. ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.


*యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః*

*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*


అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి ! నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన తులసి మరింత కాంతిని పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఏడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.


అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి *'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు '* అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి , బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తనలోకమునకు పోయెను. నాయనాజహ్నుముని ! ఇది ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోను మాఘమాసమునందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశినాడు ఉపవాసము ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధాశక్తిగ గోదానము , భూదానము , వస్త్రదానము , సువర్ణదానము , సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు /బ్రాహ్మణులకు ఇవ్వవలెను. అట్టివారు ఇహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.


*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*


*🌈స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః*

     *🌎గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం *🪐లోకాఃసమస్తాఃసుఖినోభవంతు*||*

🕉️🌎🕉️🌎🕉️🌎🕉️

*🌈సర్వేజనాః సుఖినోభవంతు*

🙏🌼🙏🌼🙏🌼🙏

*శుభమ్ భూయాత్*

మన గుడి : నెం 1027

 🕉 మన గుడి : నెం 1027


⚜ కేరళ  : కొట్టాయం


⚜ నీందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం



💠 నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , కొట్టాయం జిల్లా నీందూర్‌లో ఉన్న ఒక పురాతన మురుగన్ ఆలయం. 

నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒక చారిత్రక ప్రదేశం, ఇది స్థానిక ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది.


💠 ఈ ఆలయంలో పాండవులు , వ్యాస మహర్షి పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి . 

ఆలయ దైవం మురుగన్. నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆరాట్టు ఉత్సవాన్ని నిర్వహిస్తుంది, 

ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో మేడషస్తి రోజున పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

 ఒట్టనరంగమల సమర్పణం ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాలలో ఒకటి.


💠 ఆలయంలో మురుగన్ ఉగ్రరూపాన్ని పూజిస్తారు. వెల్ క్రిందికి చూపబడింది. మురుగన్ ఇక్కడ దేవసేనాపతి రూపంలో పూజించబడతాడు , పవిత్ర శక్తులకు అత్యున్నత సేనాపతి. "తారకాసుర నిగ్రహ భవం" అని పిలువబడే ఘర్షణలో తారకాసురన్‌తో పోరాడినందున దేవత కోపంతో ఉన్నట్లు చెబుతారు . 


💠 చాలా దేవాలయాలలో కనిపించే విధంగా తూర్పు ముఖంగా ఉంటాడు. మహాగణపతి, దక్షిణామూర్తి ( శివుడు ), తూనిన్మేల్ భగవతి ( భద్రకాళి ), దుర్గ , నాగరాజు మరియు భహ్మరాక్షులు కూడా ఆలయంలో అధీన దేవతలుగా పూజింపబడతారు. మురుగన్ ఆరాధనకు సంబంధించి ఆలయానికి మంగళవారం ముఖ్యమైన రోజు.


💠నీందూర్ అనేక దేవాలయాలతో కూడిన పవిత్ర ప్రదేశం. చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మురుగుడిని ప్రార్థిస్తారు. ఆలయంలో బ్రాహ్మణ పూజారులు పూజలు నిర్వహిస్తారు . ఆలయ ప్రధాన పండుగ ఏప్రిల్ లేదా మే నెలలో 6 రోజుల పాటు జరుగుతుంది.


💠 నీందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మేడశస్తి రోజున ఆరట్టు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. తైపూయం ఆలయంలో నిర్వహించబడే మరొక ముఖ్యమైన పండుగ.


💠 ద్రావిడ ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలలో సుబ్రహ్మణ్యుడిని కార్తికేయ అని కూడా పిలుస్తారు. కేరళలో సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అతని ఇతర పేర్లు మయిల్ వాహనన్, మురుగన్, సెంథిల్, వేలన్, కందన్, కదంబన్, ఆరుముగం, దేవసేనాపతి మరియు షణ్ముగం. 

అతను దేవ సైన్యం మరియు విజయానికి చిహ్నంగా పూజించబడ్డాడు. 

అతని పక్షి నెమలి మరియు అతని ఆయుధాన్ని వేల్ అని పిలుస్తారు.


💠 చాలా మంది భక్తులు తమ కొత్త పనులు విజయవంతం కావాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థనలు మరియు పూజలు చేయడానికి ఆలయానికి వస్తారు. 


💠 ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, మరియు అతను వేల్ అనే ఆయుధంతో గర్భగుడిలో నిలబడి ఉన్నాడు.


🔆 చరిత్ర


💠 ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎట్టుమనూరు మహాదేవ దేవాలయం మరియు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నిర్మాణం ఏకకాలంలో జరిగింది. 

ఆలయంలోని రాతి విగ్రహం తారకాసురుడిని ఓడించినట్లు వర్ణిస్తుంది, 

ఎట్టుమనూరప్పన్ మరియు అతని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి ఒకే దిశలో ఒకరికొకరు ఎదురుగా ఉంచబడ్డారని నమ్ముతారు. 


💠 ఈ ఆలయంలో దక్షిణామూర్తి, గణపతి, అయ్యప్పన్, దుర్గ, భద్రకాళి (స్తంభంపై భగవతి), సర్ప దేవతలు మరియు బ్రహ్మరాక్షసులు వంటి వివిధ దేవతలకు నిలయం.

అదనంగా, నైరుతి మూలలో ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో శాస్తా మరియు వాయువ్య మూలలో ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో శ్రీదుర్గాదేవి కొలువై ఉంటారు. 

సర్ప దేవతలు మరియు రాక్షసులు వంటి ఉప దేవతలు ఈశాన్యంలో వారి అసలు స్థానాల్లో ప్రతిష్టించబడ్డారు. 


💠 ఆలయం మూడు రోజువారీ పూజలను నిర్వహిస్తుంది, ఉదయం 5 గంటలకు తెరవబడుతుంది, రోజు విగ్రహానికి అభిషేకంతో ప్రారంభమవుతుంది, తరువాత అలంకరణ మరియు పుష్ప సమర్పణ ఉంటుంది. 

ఎజుమణి సమర్పణ మరియు ఉష పూజ నిర్వహిస్తారు, తరువాత నాద అటాచు పూజ చేస్తారు. 


💠 కడుంపాయస ప్రధాన నైవేద్యం, మధ్యాహ్నం పూజ తరువాత జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరవడానికి ముందు ఆలయం క్లుప్తంగా మూసివేయబడుతుంది,


💠 ఇక్కడ సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు సూర్యాస్తమయం వద్ద జరుగుతాయి, తరువాత రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం, కడుమ్ పాయసం మరియు వెల్ల నివేద్యం వంటి నైవేద్యాలతో నిర్వహిస్తారు


💠 ఆలయం మళ్లీ రాత్రి 7:30 గంటలకు మూసివేయబడుతుంది మరియు మంగళవారం, భక్తులు ఒక్క నిమ్మకాయ హారాన్ని సమర్పిస్తారు. 

ఈ రోజుల్లో ప్రధాన నైవేద్యాలలో ఉరియరిప్పయాసం, ఈడిచుపిజినుపాయసం, పాల్పాయసం మరియు పంచామృతం ఉన్నాయి. 


💠 నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తిరువూత్సవం మే నెలలో ఆరు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, కళా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలతో సాగుతుంది.

 ఆలయంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలలో తైపూయం, స్కందషష్టి, నవరాత్రి, మండలవృత్తం, మకరవిళక్కు-రథ ఘోషయాత్ర

ఉన్నాయి.



💠 ఎట్టుమానూరు నుండి 60 కి.మీ దూరం, కొట్టాయం నుండి 14 కి.మీ.


రచన

©️ Santosh Kumar

13-33-గీతా మకరందము

 13-33-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యథా సర్వగతం సౌక్ష్మ్యాత్

ఆకాశం నోపలిప్యతే | 

సర్వత్రావస్థితో దేహే 

తథాఽ౽త్మా నోపలిప్యతే || 


తాత్పర్యము:- సర్వత్రవ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారముగ (ధూళిమున్నగువానిచే) అంటబడదో, ఆ ప్రకారమే శరీరమందంతటను (లేక, సకలశరీరములందును) వెలయుచున్న పరమాత్మ (శరీర గుణదోషములచే) అంటబడకనున్నాడు.


వ్యాఖ్య:- దృశ్య ప్రపంచములో అతిసూక్ష్మమైనవస్తువు ఆకాశము. కావున దానిని దృష్టాంతముగ తీసికొని ఆత్మయొక్క నిర్లేపత్వ, సర్వవ్యాపకత్వ, సూక్ష్మత్వ, నిర్మలత్వములు బోధింపబడినవి. చిన్నచిన్న ఉపమానములద్వారా గొప్పగొప్ప బోధలను తెలియజెప్పుట గీతయొక్క ఒకానొక విశిష్టత. ఆకాశము అని చెప్పినందువలన ఆత్మ ఆకాశమని యెవరును భావింపరాదు. ఆకాశమువలె అతిసూక్ష్మమైనదని మాత్రమే ఎఱుంగవలయును. ఆకాశము బురద మొదలగువానియందు వ్యాపించియున్నను, వానిగుణదోషములచే అంటబడనట్లు, ఆత్మయు దేహమందంతటను వ్యాపించియున్నప్పటికిని, దాని సుఖదుఃఖాదులచేగాని, జననమరణాదులచేగాని ఏ మాత్రము అంటబడదు. మఱియు మేఘమునందు ఎన్ని మెఱుపులు, పిడుగులు, నీరు, వడగండ్లు, నలుపుదనము, శీతలత్వము మొదలైనవియున్నను, ఆకాశమునకు ఆ గుణదోషములు ఏవియు అంటనట్లు ఆత్మకున్ను శరీరసంబంధ, మనస్సంబంధ, సుఖదుఃఖాదులు ఏమాత్రమున్ను అంటనేరవని చక్కగ భావనజేసి గంభీరాత్మస్వరూపుడుగ సాధకుడు స్థితుడై యుండవలెను. తాను వాస్తవముగ ఆత్మస్వరూపుడే కావున తనను దేహమునకు సాక్షిగాను, దేహాతీతుడుగాను చింతన జేయుచు దేహసంబంధబంధముగాని, సుఖదుఃఖాదులుగాని తనకు లేవని తలంచి గంభీరముగ, నిర్భయముగ, ఆనందముగ నుండవలెను.

"సర్వత్రావస్థితో దేహే" - అని చెప్పినందువలన, (వెనుకటి శ్లోకమునందు తెలుపబడిన విధముగ) భగవంతుడు అతిసమీపమున - శరీరముననే - వర్తించుచున్నాడు. కావున పవిత్రాచరణచే వారిని హృదయమందే సాక్షాత్కరించుకొనవలయును. శరీరము దేవనిలయము, దేవసన్నిధి యని భావించి దుష్కృత్యములను, పాపకార్యములను, పాపసంకల్పములను దరికి జేర్చరాదు. మఱియు ఏజాతివారైనను, ఏమతమువారైనను, స్త్రీయెనను, పురుషుడైనను తనశరీరమున దేవదేవుడగు జగన్నాథుడు నివసించుచున్నాడని నిశ్చయించి ధైర్యోపేతులై వారిని సాక్షాత్కరించుకొనుటకు శీఘ్రముగ యత్నించవలెను. అతడు దేహమున ఎక్కడున్నాడోయని పంచకోశములను వెతకి వెతకి, మనస్సును శోధించి తుదకు అతనిని కనుగొనుటలో విజయముగాంచవలెను. ప్రయత్నశీలునకు అతడు దొరికియేతీరును.


ప్రశ్న:- పరమాత్మయొక్క స్వభావమేమి?

ఉత్తరము:- ఆతడు శరీరమందున్నను ఆకాశమువలె నిర్లేపుడై, దేహసంబంధ సుఖదుఃఖాదులచే ఏ మాత్రము అంటబడకనుండును.

తిరుమల సర్వస్వం -156*

 *తిరుమల సర్వస్వం -156*

*స్వామి పుష్కరిణి -3*



 *సరస్వతి దేవియే స్వామిపుష్కరిణి* 


 *గంగ-యమున-సరస్వతి నదుల సంగమాన్ని త్రివేణి సంగమం* గా వ్యవహరిస్తారు. ప్రయాగ పుణ్యక్షేత్రం వద్ద గంగాయమున సంగమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు గానీ, అంతర్వాహినిగా ప్రవహిస్తుండటం వల్ల సరస్వతీ నదిని మనం దర్శించుకోలేము. 


 తాను కూడా గంగానది వలె బహిర్గతమై, భక్తుల పాపాలను నశింపజేయాలనే ప్రగాఢమైన కోరిక గలిగిన సరస్వతి తన వాంఛను సిద్ధింపచేసుకోవడం కోసం నదీ రూపంలోనే వేంకటాచలానికి విచ్చేసి ఘోర తపస్సు నాచరించింది. సరస్వతిదేవి ధ్యానమగ్నయై ఉన్న తరుణంలో బ్రహ్మమానస పుత్రుడు, రావణుని తాత యైన పులస్త్యబ్రహ్మ కూడా వేంకటాచలానికి యేతెంచుతాడు. ధ్యానంలో ఉన్న సరస్వతిదేవి పులస్త్యుని రాకను గమనించక పోవడంతో, పులస్త్యుడు కృద్ధుడై, అహంభావంతో, సరస్వతి దేవి ఏ కార్యసిద్ధి కోసం తపస్సు చేస్తోందో అది నెరవేరదనీ, ఎన్నటికీ సరస్వతీనది గంగానదితో సమానురాలు కాలేదని శపిస్తాడు. 


 దానికి ప్రతిగా, సరస్వతీనది, పులస్త్యుడు బ్రహ్మదేవుని సతీమణి అయిన తనకు వరుసకు పుత్రుడని, తనయుని గౌరవ మర్యాదలతో ఆదరించవలసిన అగత్యాన్ని శాస్త్రం తల్లికి ఆపాదించలేదని తర్కపూరితంగా సమాధానమిస్తుంది. అంతే గాకుండా, తపోనిష్ఠలో ఉన్న మాతృమూర్తికి తమోగుణంతో శాపమిచ్చి, రాక్షసునిలా ప్రవర్తించి నందువల్ల పులస్త్యుని వంశం రాక్షసులతో అంతమవుతుందని కూడా తిరుగు శాపమిచ్చింది. శాపభయంతో అహంకారాన్ని విడనాడిన పులస్త్యుడు, మాతృమూర్తి యైన సరస్వతి దేవి పాదాలకు ప్రణమిల్లి ప్రాధేయ పడగా, పులస్త్యుని వంశము నందు తరువాతి తరంలో జన్మించిన ముగ్గురు రాక్షసులలో ఇద్దరు హరిద్వేషులైన పాపాత్ములుగా మారినప్పటికీ, ఒక్కరు మాత్రం శ్రీమహావిష్ణువుకు చేరువవుతారని శాపాంతరం చెబుతుంది. 


‌ సరస్వతీదేవి పులస్త్యుని కిచ్చిన శాపము-వరము ఫలితంగా, పులస్త్యునికి రావణ కుంభకర్ణులతో బాటు విభీషణుడు కూడా జన్మించి, శ్రీరామచంద్రునికి ఆప్తుడు, పరమభక్తునిగా మారి లంకారాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. 


 పులస్త్యుని శాపం కారణంగా బహిర్గతమై భక్తులను ఉద్ధరించాలన్న తన సంకల్పం నెరవేరక పోవడంతో తీవ్రమైన అసంతృప్తికి గురియైన సరస్వతి దేవికి విష్ణుమూర్తి వరమిస్తాడు. ఆ వరమహిమతో సరస్వతీ నది త్రివేణీ సంగమంలో ప్రకటితమవ్వ లేక పోయినప్పటికీ; ఆనాడు సరస్వతిదేవి వేంకటాచలం పై ఏ ప్రదేశంలో తపస్సు నాచరించిందో, ఆ ప్రదేశంలోనే స్వామిపుష్కరిణిగా ఆవిర్భవించింది. అంతే గాకుండా, గంగానది ఈ పర్వతం మీదకు రాదని కూడా విష్ణుమూర్తి అభయమిస్తాడు. వారి ఆదేశానుసారం, భక్తులు స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన తరువాతనే శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలి. అప్పుడే తిరుమలయాత్ర సంపూర్ణ ఫలాన్నిస్తుంది. అంతే కాకుండా, సరస్వతీ తీర్థంలో స్నానమాడితే మహా పాపాలు సైతం నశిస్తాయి.


 సరస్వతిదేవి స్వామి పుష్కరిణిగా ప్రకటితమైన ప్రదేశంలోనే సాళువ నరసింహరాయలు *నీరాళి మంటపాన్ని* నిర్మించాడు. స్వామిపుష్కరిణికి మధ్యభాగంలో ముగ్ధమనోహరంగా విలసిల్లుతున్న ఈ మండపం లోనే శ్రీవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. 


 ఆదివరాహుని అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు ఆనతి మేరకు, వారి వాహనమైన గరుత్మంతుడు వైకుంఠం నందలి క్రీడాద్రి పైనున్న *"క్రీడావాపి"* అనే జలాశయాన్ని క్రీడాద్రితో పాటుగా భూలోకానికి తోడ్కొనివచ్చి వెంకటాచలం పై స్థాపించాడు. సుదీర్ఘకాలంపాటు వేంకటాద్రి శిఖరాంతర్భాగంలో నిక్షిప్తమై ఉన్న క్రీడావాపి, సరస్వతి దేవికి శ్రీమహావిష్ణువు ఒసగిన వరప్రభావం చేత, అదే ప్రదేశంలో బహిర్గతమై స్వామిపుష్కరిణి గా అవతరించింది. శ్రీనివాసుడు దేవేరులతో కలిసి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడినందువల్ల అది గంగానది కంటే అత్యంత పవిత్రమైనదిగా పేరుగాంచింది. ఈ పుష్కరిణి దర్శనమాత్రం చేతనే జన్మజన్మల పాపాలు నశించి సమస్త భోగభాగ్యాలు ఒనగూడుతాయి.


*స్వామిపుష్కరిణి స్నానం సద్గురోః పాదసేవనమ్* 

*ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభమ్* 

*దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనమ్* 

*స్వామిపుష్కరిణీ స్నానం త్రయ మత్యంత దుర్లభమ్*


 అనగా - *స్వామిపుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం ఈ మూడు సత్కార్యాలు మానవజన్మలో లభ్యం కావడం అత్యంత దుర్లభం. అలాగే మానవజన్మ లభించడం, మానవునిగా మనుగడ సాగించడం, ఆ మానవజీవితంలో స్వామిపుష్కరిణి యందు స్నానమాచరించడం అనే కార్యాలు కూడా దుర్లభాలని వరాహపురాణం చాటుతోంది. దీనిని బట్టి స్వామిపుష్కరిణిలో పవిత్రస్నాన మాచరించడం ఎంతటి మహత్తరమైన పుణ్యకార్యమో తేటతెల్ల మవుతుంది.*


[ రేపటి భాగంలో... *చరిత్ర పుటల్లో స్వామి పుష్కరిణి* గురించిన విషయాలు తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*295 వ రోజు*


*పాండవులను జయద్రధుడు ఎదుర్కొనుట*


ధృతరాష్ట్రునికి సమాధానంగా సంజయుడు ఇలా చెప్పసాగాడు " మహారాజా ! పాండవ ప్రముఖులు అభిమన్యునికి సాయంగా పద్మవ్యూహంలో ప్రవేశించి కురుసేనను నిర్మూలించడం మొదలు పెట్టారు. అది చూసిన కౌరవ యోధులు నిశ్చేష్టులు అయ్యారు. పాంచాల, మత్స్య, యాదవ, కేకయ ప్రముఖులు ధర్మరాజుకు తోడుగా నిలిచి పోరాడుతున్నారు. అప్పుడు సైంధవుడు పాండవులను ఎదుర్కొన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు " అదేమిటి సైంధవుడు మహావీరుడే అయినా అతడు పాండవులను ఎదుర్కొనడమేమిటి. అంతటి శక్తి రావడానికి అతడు చేసిన తపస్సేమిటి " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో " మహారాజా ! పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒక రోజు సైంధవుడు భీముని చేతిలో ద్రౌపది కారణంగా భంగపడ్డాడు కదా ! ఆ అవమానం భరించ లేక ఈశ్వరుని గురించి తపస్సు చేసి ప్రసన్నుని చేసుకుని పాండవులను జయించు వరం కోరాడు. అందుకు శివుడు " అర్జునుడిని తప్ప మిగిలిన వారిని ఒక్క రోజు మాత్రం నివారించ గలవు " అని వరం ప్రసాదించాడు. ఆ వర ప్రభావంతో సైంధవుడు పాండవులను అడ్డగించగలిగాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించగానే సైంధవుడు వర ప్రభావం కారణంగా వారిని అడ్డుకుని మూడు బాణములతో సాత్యకిని, ఎనిమిది బాణములతో ధృష్టద్యుమ్నుని, ఇరవై బాణములతో, విరాటుని, పది బాణములతో శిఖండిని, ఏడు బాణములతో పాంచాల భూపతిని, పదిహేను బాణములతో దరుపదీ సుతులను, ఇరవై అయిదు బాణములతో క్వేకయరాజులను, డెబ్బై అయిదు బాణములతో ధర్మరాజుని కొట్టాడు. ధర్మరాజు సైంధవిని విల్లు విరిచి అతడిపై అతి క్రూర బాణములు గుప్పించాడు. సైంధవుడు మరొక విల్లు అందుకుని మంటలు విరజిమ్మే బాణములను ధర్మజుని పైన అతడి అనుచరముల పైన వేసాడు. భీమసేనుడు సైంధవుని ఎదుర్కొని మూడు బాణములతో అతడి విల్లును, కేతనమును, ఛత్రమును విరిచాడు. నీ అల్లుడు మరొక బాణమును చేతబట్టి భీముని ఛత్రమును, కేతనమును, కేతరుగకొట్టానమును, రథమును విడు. రథము విరిగిన భీముడుపక్కనే ఉన్న సాత్యకి రథము ఎక్కి సైంధవునిపై అనేక అస్త్రములు వేసాడు. సైంధవుడు వాటిన్నటిని మధ్యలోనే త్రుంచి పాండవ సేన మీద అతికౄర నారాచములు వేసాడు. సైంధవుని అస్త్ర ధాటికి తట్టుకోలేని పాండవసేన పారిపోయింది. ఈ ప్రకారం సైంధవుడు పాండవ సేనను పద్మవ్యూహములో ముందుకు పోకుండా అడ్డుకున్నాడు. పాండవులకు సైంధవునకు సమరం ఘోరంగా సాగుతుంది.


*అభిమన్యుని శౌర్యం*


ద్రోణుని ప్రోత్సాహంతో వెనుతిరిగిన కౌరవ సైన్యం తిరిగి వచ్చి అభిమన్యుని చుట్టుముట్టి అతడి మీద బాణములు గుప్పించారు. అభిమన్యుడు వారిని అందరిని సంహరించి సింహఘర్జన చేసి కౌరవ సేనలో భయోత్పాతాలు సృష్టించాడు. వృషసేనుడు తన సైన్యంతో అభిమన్యుని ఎదుర్కొని క్రూరనారాచములు ప్రయోగించాడు. అభిమన్యుడు కోపంతో వృషసేనుని కేతనము విరిచి, అశ్వములను గాయపరిచాడు. వృషసేనుడి శరీరం అంతా పదునైన బాణములు దింపి మూర్చిల్ల చేసాడు. అతడి రథమును ఈడ్చుకుంటూ రథాశ్వములు ఎటో తీసుకు వెళ్ళాయి. ఇంతలో శౌర్యధనుడైన వసాపతి భూపతి ఆరు బాణములతో అభిమన్యుని కొట్టాడు. అభిమన్యుడు ఒకే బాణంతో వసాపతి భూపతిని కొట్టాడు. అతడి చావు చూసిన కురుప్రముఖులు తమ సైన్యాలతో అభిమన్యునిపై లంఘించి అభిమన్యుని క్రోధాగ్నిలో కార్చిచ్చులో పడిన మిడుతల వలె మాడి పోయారు. కురుసేన అభిమన్యుని ధాటికి ఆగలేక మిగిలిన పారిపోయారు. అది చూసిన కురు వీరులు యోధులు నానాదేశ రాజులు అందరూ ఆలోచించుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీదకు ఉరికారు. అభిమన్యుడు లేళ్ళ గుంపు మీదకు ఉరికిన పులి వలె వారి మీదకు లంఘించి వారందరిని మట్టుబెట్టాడు. తెగి పడిన అంగములు, మాంస ఖండములు, ఏనుగులు, హయములు, కళేబరములు రణరంగం అంతా చెదిరి పడ్డాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో𝕝𝕝 *అతీతాననుసన్ధానం*

        *భవిష్యదవిచారణమ్*।

        *ఔదాసీనస్యమపి ప్రాప్తే*

        *జీవన్ముక్తస్య లక్షణమ్*॥


తా𝕝𝕝 "*గతించినదానిని స్మరించకుండుట, రాబోవుదానినిగూర్చి ఆలోచించకపోవుట, ప్రాప్తమైనదానియందు ఉదాసీనత అనునవి జీవన్ముక్తుని లక్షణములు*."

------------------

గతే శోకో నకర్తవ్యం

 భవిష్యం నైవచింతయేత్

వర్తమానేషు కార్యేషు 

వర్తయన్తి విచక్షణాః


 ✍️🪷🌹💐🙏

🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏 🌹*శుభోదయం🌹 ------------------- 🏵️ *మహనీయుని మాట*🏵️ ------------------------- "డబ్బుతో కొనే వస్తువు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు." -------------------------- 🌹 *నేటి మంచి మాట* 🌹 --------------------------- "నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వం అదుపులో ఉంటుంది.మాట తీరు భద్రం లేకపోతే బతుకు ఛిద్రం మౌతుంది." 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌺పంచాంగం🌺 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 21 - 02 - 2025, వారం .. భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, బహుళ పక్షం, తిథి : *అష్టమి* ఉ8.20 వరకు, నక్షత్రం : *అనూరాధ* మ12.46 వరకు యోగం : *వ్యాఘాతం* ఉ9.22 వరకు, కరణం : *కౌలువ* ఉ8.20 వరకు, తదుపరి *తైతుల* రా11.00 వరకు, వర్జ్యం : *సా6.46 - 8.29* దుర్ముహూర్తము : *ఉ8.46 - 9.32* మరల *మ12.36 - 1.22* అమృతకాలం : *తె5.04నుండి,* రాహుకాలం : *ఉ10.30 - 12.00,* యమగండం : *మ3.00 - 4.30,* సూర్యరాశి : కుంభం, చంద్రరాశి : వృశ్చికం, సూర్యోదయం : 6.28, సూర్యాస్తమయం: 5.59, *_నేటి మాట_* *భక్తిలో - పరిపూర్ణత ఎలా...!!* మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం. ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు. అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది... నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది. ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి. ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే.. మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు... *_🌺శుభమస్తు🌺_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

 🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌹*శుభోదయం🌹

    -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"డబ్బుతో కొనే వస్తువు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వం అదుపులో ఉంటుంది.మాట తీరు భద్రం లేకపోతే బతుకు ఛిద్రం మౌతుంది."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌹*శుభోదయం🌹

    -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"డబ్బుతో కొనే వస్తువు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వం అదుపులో ఉంటుంది.మాట తీరు భద్రం లేకపోతే బతుకు ఛిద్రం మౌతుంది."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 21 - 02 - 2025,

వారం .. భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

మాఘ మాసం,

బహుళ పక్షం,


తిథి     :  *అష్టమి* ఉ8.20 వరకు,

నక్షత్రం :  *అనూరాధ* మ12.46 వరకు

యోగం :  *వ్యాఘాతం* ఉ9.22 వరకు,

కరణం  :  *కౌలువ* ఉ8.20 వరకు,

                 తదుపరి *తైతుల* రా11.00 వరకు,


వర్జ్యం                :  *సా6.46 - 8.29*

దుర్ముహూర్తము :  *ఉ8.46 - 9.32*  

                             మరల *మ12.36 - 1.22*

అమృతకాలం     :  *తె5.04నుండి,*

రాహుకాలం        :  *ఉ10.30 - 12.00,*

యమగండం       :  *మ3.00 - 4.30,*

సూర్యరాశి          :  కుంభం,

చంద్రరాశి            :  వృశ్చికం,

సూర్యోదయం     :  6.28,

సూర్యాస్తమయం:  5.59,


               *_నేటి మాట_*


 *భక్తిలో - పరిపూర్ణత ఎలా...!!*

   మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.

ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం. 

ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు. 


అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. 

అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది... నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది. 

ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.


ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి. 

ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. 


నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..


మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు...


              *_🌺శుభమస్తు🌺_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 21 - 02 - 2025,

వారం .. భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

మాఘ మాసం,

బహుళ పక్షం,


తిథి : *అష్టమి* ఉ8.20 వరకు,

నక్షత్రం : *అనూరాధ* మ12.46 వరకు

యోగం : *వ్యాఘాతం* ఉ9.22 వరకు,

కరణం : *కౌలువ* ఉ8.20 వరకు,

                 తదుపరి *తైతుల* రా11.00 వరకు,


వర్జ్యం : *సా6.46 - 8.29*

దుర్ముహూర్తము : *ఉ8.46 - 9.32*  

                             మరల *మ12.36 - 1.22*

అమృతకాలం : *తె5.04నుండి,*

రాహుకాలం : *ఉ10.30 - 12.00,*

యమగండం : *మ3.00 - 4.30,*

సూర్యరాశి : కుంభం,

చంద్రరాశి : వృశ్చికం,

సూర్యోదయం : 6.28,

సూర్యాస్తమయం: 5.59,


               *_నేటి మాట_*


 *భక్తిలో - పరిపూర్ణత ఎలా...!!*

   మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి.

ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖమని అంటున్నాం. 

ఈ రెంటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మిక, ప్రకృతిలో మార్పు సహజం, ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. బాహ్యజీవనం సాగించక తప్పదు. 


అందుకే జీవనమంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. 

అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది... నిద్రపోయినప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకొని ఉంటుంది. 

ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది.


ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదిలి ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యాన సమాధి. 

ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కాబట్టి మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. 


నామజపం, యోగసాధన, భజన, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించటానికే..


మహర్షులు నిరంతర జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు, నిరంతర దైవస్మరణతో ఉంటే మన నిత్య జీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు...


              *_🌺శుభమస్తు🌺_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

కలుషిత వర్తనమ్ములు

 చ.కలుషిత వర్తనమ్ములు వికారపు చేష్టలఁ బెంపు జేయు నా

కలతల కారణమ్మున నగమ్యములౌ సహ జీవనమ్ములున్ 

విలసిత రాగ బంధములె పేర్మిని గూర్చి వికాస మొందు నా

కలిమి నెఱుంగలేనపుడగాధమె జీవనమెన్న భారతీ!౹౹ 59


ఉ.సోదర సోదరీ మణుల సుందరమౌ అనుబంధమెన్నగా

నాదరణీయమౌను వినయమ్మును వీడక బాల్య సంగతుల్

మోదము గూర్చు సంస్మృతి సమూహము మానసమందు నిల్పుచున్ 

వేదనలందు నొక్కటిగ పేర్మిఁ దలంచి చరింప భారతీ!౹౹ 60