చ.కలుషిత వర్తనమ్ములు వికారపు చేష్టలఁ బెంపు జేయు నా
కలతల కారణమ్మున నగమ్యములౌ సహ జీవనమ్ములున్
విలసిత రాగ బంధములె పేర్మిని గూర్చి వికాస మొందు నా
కలిమి నెఱుంగలేనపుడగాధమె జీవనమెన్న భారతీ!౹౹ 59
ఉ.సోదర సోదరీ మణుల సుందరమౌ అనుబంధమెన్నగా
నాదరణీయమౌను వినయమ్మును వీడక బాల్య సంగతుల్
మోదము గూర్చు సంస్మృతి సమూహము మానసమందు నిల్పుచున్
వేదనలందు నొక్కటిగ పేర్మిఁ దలంచి చరింప భారతీ!౹౹ 60
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి