28, మే 2023, ఆదివారం

ఆచార్య సద్బోధన:*

 


              *ఆచార్య సద్బోధన:*

                  ➖➖➖✍️


*మెరుపు లేకుండా పిడుగు రాదు... విత్తనం లేకుండా వృక్షం రాదు...  నిప్పు లేకుండా పొగ రాదు...*


*కారణం లేకుండా ఎవ్వరూ కూడా మీ జీవితంలోకి ప్రవేశించ లేరు...*


*ఈ అనాది సృష్టి చక్రంలో కొందరు లెక్క వేయడానికి, మరికొందరు లెక్క తీర్చడానికి వస్తుంటారు...*


*ఒకరు బాధ పెడతారు. మరొకరు బోధ చేస్తారు. ఒకరు ఆనందింప చేస్తారు. మరొకరు అవమాన పరుస్తారు...*


*ముంచేవారైనా, మురిపించే వారైనా, గతంలో మీరు చేసిన కర్మల ఫలితాన్ని ఇవ్వడానికే వస్తారు...*


*పరమాత్ముడు వినిపిస్తున్న కర్మల రహస్యాన్ని వింటే మనసు తేలిక అవుతుంది...*


*మనుగడ సాధ్యమవుతుంది..*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀


           *ఒత్తిడికి దివ్యౌషధం*

                ➖➖➖✍️


*ఒత్తిడికి దివ్యౌషధం.. ఏంటో తెలుసా?*


            

*ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి జీవనం యాంత్రికం అయిపోయింది. ఈ యాంత్రిక జీవితంలో వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరిగిపోతోంది.*


*ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. ఈ దశలో ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడం చాలా ముఖ్యం.*


*ఒత్తిడిని తగ్గించే చిట్కాలేమిటో తెలుసుకుని వాటిని ఆచరిస్తే సరిపోతుంది... ఆ చిట్కాలు మీకోసం..*

 

**ఒత్తిడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేసేది నవ్వు.*


*ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే 80శాతం ఒత్తిడి మటుమాయమైపోతుంది.*


*అంతేకాదు, నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు వెలువడతాయి.*

 

**పెద్ద పెద్ద శబ్దాలు వినడం వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అటువంటి శబ్దాలకు దూరంగా ఉండాలి.*

 

**ప్రకృతిలోని పక్షుల కిలకిలారావాలు, శ్రావ్యమైన సంగీతం వినడం, నీటి ప్రవాహం, సముద్ర కెరటాలను చూస్తూ ఉండటం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు.*

 

**మనస్సులో ఎటువంటి ఆలోచనలు రానీయకుండా అన్నీ పక్కనపెట్టి శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, వేకువజామునే వాకింగ్ చేయడం ద్వారా మానసిక దృఢత్వాన్ని పొందవచ్చు.*

 

**క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో లాభం చేకూరుతుంది, వ్యాయామం చేయడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు కృంగి పోకుండా వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన మానసిక స్థైర్యం వస్తుంది.*

 

**కండరాలు, శరీర అవయవాలు బిగదీసి ఉండకుండా ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఒత్తిడి లేకుండా మనసు ఆహ్లాదంగా మారుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀



*“అహో ఇమం పశ్యత మే వినాశం”*

                ➖➖➖✍️



పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదం లో పేర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు.


సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.


ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని      ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు.


మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు…  "ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు!" అని. 


ఆ రాజు కి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, ముని అతనిని శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమర్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడ.., "ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది". రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు.


సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళినప్పుడు , ఆ యాభై మందీ రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.


ఇప్పుడు, తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమోనని ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. 


ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. 


ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు:


“అహో ఇమం పశ్యత మే వినాశం” (భాగవతం 9.6.50)


"ఓ మానవులారా! భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లాలారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీ లతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు."


భగవద్గీత, భాగవతము చదవండి, సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి.

కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి.

వైకుంఠలోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి.

సదా జపించండి…

హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే!

హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!

సంతోషంగా ఉండండి!✍️


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏





         *మూడు బొమ్మల రహస్యం*

                  ➖➖➖✍️



*ఒక వ్యక్తి అన్నిచోట్లా తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. ఒక రోజు, అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు, అక్కడ రాజుకు కొత్తవి, ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు.*


*రాజభవనంకు వెళ్లి, ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్లి, "మహానుభావా, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను" అని చెప్పాడు.*


*రాజు అతని బొమ్మలను ఆస్థానంలో  ప్రదర్శించడానికి అనుమతించాడు.*


*బొమ్మలు అమ్మేవాడు తన పెట్టెలోంచి మూడు బొమ్మలు తీశాడు.*


*రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, "ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి. చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి." అని చెప్పాడు.*


*బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, "మొదటి బొమ్మ వెయ్యి బంగారు నాణేలు, రెండవది వంద బంగారు నాణేలు, మూడవది ఒక్క బంగారు నాణెం మాత్రమే" అన్నాడు.*


*రాజు ఆ మూడు బొమ్మలను చాలా జాగ్రత్తగా చూసాడు, కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు, మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆశ్చర్యపోయాడు!*


*తానేమీ కనుగొనలేక, రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు.*


*మంత్రులు అన్ని వైపుల నుండి ఆ బొమ్మలను చూశారు కాని వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు.*


*రాజు అప్పుడు రాజ పురోహితుడిని {రాజగురువుని} చూడమని అడిగాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మలను పరిశీలించి మూడు గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు.*


*గడ్డి పరకలు తీసుకురాగానే, రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు.*

 

*అందరూ చూస్తూండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత, ఆ బొమ్మ పెదవులు కదిలి, ఆపై మూసుకుపోయాయి.*


*తరువాత, ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు, ఈసారి మరొక చెవి నుండి గడ్డిపరక బయటకు వచ్చింది తప్ప మరే కదలిక లేదు.*


*ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తరవాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.*


*ఇప్పుడు ఆయన మూడవ బొమ్మ చెవిలో గడ్డిపరకని దూర్చాడు, దాని నోరు ఒక్కసారిగా తెరుచుకుని  ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కదులుతూ ఉంది.*


*ఇది చూసిన రాజు, "ఇదంతా ఏమిటి? ఈ బొమ్మల ధరలో ఎందుకు అంత తేడా ఉంది?" అని రాజ పురోహితుడిని అడిగాడు.*


*పురోహితుడు ఇలా సమాధానమిచ్చాడు, "సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు, దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం.*


*ఇది మొదటి బొమ్మ నుండి మనకు లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ వెయ్యి బంగారు నాణేలు.”*


*కొంతమంది ఎప్పుడూ తమలో తాము నిమగ్నమై ఉండి, మిగిలినవేవీ పట్టించుకోరు. వారు ఇతరుల నుండి ఎటువంటి ఆసక్తి లేదా ప్రశంసలను కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికీ హాని చేయరు.*


*రెండవ బొమ్మ నుండి మనం నేర్చుకునేది ఇదే, దాని విలువ వంద బంగారు నాణేలు అవడానికి కారణం ఇదే.*


*కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి, నోరు వదులుగా ఉంటుంది. 

ఏదైనా విన్న వెంటనే, అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పి, సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు.*

*అందుకే దాని విలువ ఒక్క బంగారు నాణెం మాత్రమే."


♾️♾♾♾♾♾♾♾♾


*స్పృహలో ఉండి చేసే పనులలో,  మనం వల్ల జరిగే అన్ని తప్పులు ఎక్కువగా మనం ఏమి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటాయి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



           *భగవన్నామ స్మరణ!*

                 ➖➖➖✍️


*ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు.    అవి ఏమిటి అంటే…ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి!*


*ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు. ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.*


*అవి సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు!*


*అవునా ఎలా అంటారా..?*


*మీకు నచ్చిన వంశపారపర్యంగా వచ్చిన ఆ తండ్రి పరమాత్మ నామ స్మరణ చేస్తే చాలు!*

*ఆ వెలకట్టలేని రెండు సంపదలు ఇస్తాడు.*


*నిజం!      దైవ నామ స్మరణ!!*

*ఇందులో మాధుర్యము, గొప్పతనము నేను అనుభవించి మీకు చెప్తున్నాను.*


*ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే,  తరంగాలు మొదలవుతాయి.*

*అవి మన మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో, ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి.*


*నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం!*


*బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు. అలాగే, తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు.*


*బెల్లాన్ని కొరికి తినాలి.  తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి!*


*అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.*


*దైవనామం, దైవం వేరు కాదు.  ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.*


*అది నిజం అని భగవదనుభూతిపరులు తెలియజేశారు. ఉపనిషత్తుల్లో భగవన్నామ స్మరణ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి. పిలిస్తే పలికే భగవంతుడని ఎందరో భక్తులు ఋజువు చేశారు.*


*సరే, నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది.*

*మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి.  ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని చాలామందికి సందేహం.*


*అందుకే కొంతకాలం నామం చెప్పి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.*


*అక్కడే మనం నిలబడాలి.*

*దైవం ఒక అనుభవం.*

*ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.*


*ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది.*


*అందులో వేడి కనిపించకపోవచ్చు. ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.*


*నామస్మరణతో  మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారుతుంది.*


*కొన్నాళ్లకు మనసే మారిపోతుంది. పుట్టుక నుంచి వచ్చిన చెడ్డ గుణాలు ఒక్కొక్కటిగా మనల్ని వదిలిపోయి,  వాటి స్థానే ప్రేమ వచ్చి చేరుతూ ఉంటుంది.*


*నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. పరవశించి దివ్య తన్మయత్వంతో చేసే పరమశివుడి పంచాక్షరి అవుతుంది.*


*భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం గొప్పతనాన్ని విశ్వానికి చాటారు.*


*పురాణాల్లో శాస్త్రాల్లో చదివేము ఆ మహానుభావులు గురించి కానీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను  నామస్మరణం వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను, మీ అందరి అభిమానం పొందుతున్నాను నా తండ్రి శివయ్య నాతోనే నా పక్కన ఉన్నాడు అన్న చక్కని అనుభూతి పొందుతున్నాను.*


*పూజ నిమిత్తం సామగ్రి కొనాలి. నియమాలు పాటించాలి. ధనం ఉండాలి. వ్రతాలకు, నోములకు కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి. అందుకే, కలియుగంలో నామస్మరణను మించింది లేదని ప్రతిపాదించారు పెద్దలు.*


*ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే, ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ ఈశ్వరార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*


*ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు?*

*తప్పక ఉంటుంది. *

*భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో....  పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి.*

*దైవం ఎప్పుడూ కలవడానికి తొందరగా ఉంటాడు.*

*మన నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే అతడు మనకు చేరువవుతాడు. సందేహం లేదు. ఇది ఋషుల మాట. మన ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట. ఆ తండ్రి పరమాత్మ పాదాలు దగ్గర చోటు సంపాదించుకోవడానికి చేరుకోవటానికి చక్కని మార్గం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


తెలివితేటలకు ఉండే శక్తి

 *"తెలివితేటలు"*


శరీర బలం ఉన్నవాని కంటే తెలివితేటలు ఉన్నవాడు బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దాని మీదకు ఎక్కగలడు. 


కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండి బలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతి మంతులు కూడా ఉంటారు. అయితే వీరి శరీరం దృఢంగా ఉండక పోవచ్చు. 


కానీ వారికున్న తెలివితేటలతో దేహ బలం ఉన్నవారి కంటే బలవంతులుగా ఉంటారు. ఏనుగు కొండంత ఉంటుంది. జంతువులన్నిటిలోకీ శరీరబలం ఉన్నది ఏనుగు మాత్రమే. మరే ప్రాణికీ అంత బలం లేదు. 


మావటివాడు ఏనుగు పరిమాణంలో పదోవంతు కూడా ఉండడు. అయినప్పటికీ కొండంత ఉన్న ఏనుగును మావటి తన దగ్గరుండే అంకుశంతో లొంగదీసుకుని దాని మీద ఎక్కి కూర్చోగలుగుతున్నాడు. దీనికి కారణం అతనికి ఉన్న తెలివితేటలు. 


తెలివితేటలకు ఉండే శక్తి అమేయమైనది.

వితరణ గుణం!!!

 


విశ్వనాధ వితరణ గుణం!


" నకర్మణా నప్రజయా నధనేన

       త్యాగేనైకేనానమృతత్వ మానసుః'-

(దానమొక్కిటే మానవునిఅమరునొనర్చుననితాత్పర్యం)

అన్నవేదవాక్యానికి చక్కని నిదర్శనం

విశ్వనాధజీవితం.తనకున్నా లేకువ్నా

గుప్తదానాలుచేయటం వారిస్వభావం.

లెక్చరర్ గాపనిచేస్తూ, పేదవిద్యార్ధులకు

ఫీజులువగైరాలు కట్టటం సరేసరి. తనపరిసరాలలో ఉండేవారిని అవసరానికి ఆదుకోవటం ఆయనకు అలవాటు. ఆఅలవాటు రానురాను బలపడిందేతప్ప ఏమాత్రం తగ్గలేదు.

ఉందా లేదా అనే ఆలోచనయేలేదు.చేతికి వచ్చింది వెంటనే యిచ్చెయ్యటమే!

చిటిపొట్టి దానాలను చెప్పుకోవలసినపనేలేదు.

         వారి మహనీయమైన దాతృత్వానికి అద్దంపట్టిన రెండు సంఘటనలను మీముందుంచుతాను.

1  విశ్వనాథ కొంతకాలం కరీంనగర్ కాలేజీకి ప్రిన్సుపాలుగా పనిచేశారు.

ఆరోజులలో చొక్కారావుగారువగైరా

జగిత్యాలలో వారికి ఘన సన్మానం చేసి

10వేలరూపాయల పర్సుయిచ్చారు.

కవిసామ్రాట్ తిరుగుప్రయాణంలో ధర్మపురి లక్మీనరసింహస్వామి దర్శనానకి వచ్చారు.గుడిప్రాకారందాటి

ముఖమండపంవైపు అడుగులేశారు.అంతే మంత్రముగ్ధునివలె చేతులు జోడించి

అరమోడ్పుకనులతో శ్రధ్ధగా వినసాగారు. అక్కడ వేదవిదులైనబ్రాహ్మణులు సుస్వరంగా

వేదపారాయణచేస్తున్నారు.ఆపారాయణ పూర్తిఅయ్యేవరకూ పారవస్యంతో అక్కడే నిలబడి.

పారాయణ ముగియగానే తనజేబులో నున్న 10వేలరూపాయలకట్టను ఆబ్రాహ్మణుల ముందుంచి నిర్వికారంగా 

వెనుదిరిగి కారెక్కారు.అచ్చెరువందటం చూచినవారి వంతైంది.

         అదీ వారి దానశీలత!

2  ఇప్పుడు నేచెప్పబోయే రెండవది.ఇది

వారి ఔదార్యానికి,పరాకాష్ఠ. రామాయణకల్పవృక్ష తపః పలంగా వారికి జ్ఞానపీఠం అవార్డు దక్కింది.అవార్డుద్వారా.లక్షరూపాయలపారితోషికంగూడా లభించింది.

        రోజులు గడుస్తున్నాయి.ఒకనాడు

అనుకోని అతిథియై తనచిన్ననాటి మిత్రుడు కొల్లిపర సూరయ్యగారి కుమారుడు విశ్వనాధయింటికి వచ్చాడు.అతిథిమర్యాదలు,కుశలప్రశ్నాదికాలు అయినవి. "నీవెందుకొచ్చావురా?"-అన్నారు విశ్వనాథ. ఆకుర్రాడు సిగ్గుపడుతూ, కొంచెసంకోచిస్తూ, ఒక కాగితం విశ్వనాథకు అందించాడు.అదిప్రోనోటు.

50వేలరూపాయలకు వ్రాయబడింది.అదిచూడగానే విశ్వనాథబిత్తరపోయారు. ఇదెందుకురా? అన్నారు.పాపం కుర్రాడు

భయపడుతూ, "బాబయ్యగారూ!మాచెల్లికి పెళ్ళిసంబంధంకుదిరింది. మిమ్మల్నడిగి అప్పుగా 50వేలు తెమ్మని నాన్నపంపాడు.ఇన్నాడు"-అంతే విశ్వనాథ భగ్గుమన్నారు.

          "ఏరా!మీనాన్న ఏమనుకుంటున్నాడు?.నేనిక్కడ వడ్డీవ్యాపారంచేస్తున్నా ననుకుంటున్నాడా?ప్రో నోటుఅందుకా?

పోరా! పో! నాదగ్గరడబ్బులేదు.ఉన్నా ఇవ్వను. ఈమాట మీనాన్నతోచెప్పు.

ఇంక నడువ్!"-అంటూ అతిదారుణంగా

ఆపిల్లవాణ్ణి మందలించి పంపేశారు.

గుడ్లనీరు నించుతూ ఆపిల్లవాడు మెల్లగా అక్కడనుండి జారుకొన్నాడు.

           మరికొంత సేపటి విశ్వనాధతేరుకున్నారు.చొక్కాతొడుకుకొని భుజంమీద ఉత్తరీయం అలంకరించుకొని చెక్ పుస్తకం జేబులో పెట్టుకొని తిన్నగా బ్యాంకుకి వెళ్ళి 50వేలు డ్రాచేసి చేతిసంచీలో పెట్టుకొని

జట్కాయెక్కి సరాసరి కొల్లిపర సూరయ్య యింటిముందుదిగారు.

            అప్పటి కక్కడివాతావరణం

చాలావేడివేడిగా ఉంది.కొడుకుచెప్పినమాటలు విని సూరయ్య"బాబయ్యగారి కోపంతాటాకులమంటరా!అదిక్షణ కాలమే! నీకుతెలియదులే వారితత్వం.

వారిహృదయం వెన్నముద్దరా?పోనీలే మనకు ప్రాప్తంలేదు.నీవేమీబాధపడకు.

అంటూ వీధిఅరుగుమీదకూర్చుని కొడుకును సముదాయిస్తున్నారు.

అంతలో నవ్వుతూవిశ్వనాధ అక్కడప్రత్యక్షం!

బాబయ్యగారొచ్చారు,బాబయ్యగారొచ్చారని ఆడ మగ సంభ్రమపడుతూ వారికి స్వాగతం పలికారు.

           విశ్వనాధపాదప్రక్షాళనంచేసి అరుగు మీద సూరయ్యగారికి దగ్గరగా జరిగి కూర్చుని సూరయ్యవీపునిమురుతూ కుశలాదికములడిగి, "ఎన్నో ఆడపిల్లరా?

ఆపెళ్ళికూతురు?ఏదీ ఇటురమ్మను"-

అన్నారు .పెళ్ళికూతురు వినయంగావచ్చి విశ్వనాధపాదాలకు నమస్కరించింది.కాబోయేపెళ్ళికూతుర్ని 

పైకిలేపి ఆశీర్వదిస్తూ, చేతిసంచీలోని 50వేలరూపాయలు ఆపిల్లచేతిలో ఉంచి

జట్కాయెక్కారు.

         "  సూరయ్యా!నీకూ నాకూ మధ్యరుణమేమిటిరా?నీకూతురిపెళ్ళికిది నాచదివింపు.రుణపత్రంపంపావని కోపం వచ్చిన మాటనిజమే దాన్ని మరచిపో!"-అని నిర్లిప్తంగా యింటికి మరలారు.

            ఇక అవార్డుశేషం 50 వేలతో తమస్వగ్రామంలోని శిధిలమౌతున్న శివాలయాన్ని జీర్ణోధ్ధారంగావించారు.

              ఇంతకీ సూరయ్యగారెవరు?

వారికీ వీరికీ గలసంబంధం ఏమిటి అనిగదూ మీసందేహం.అయితేవినండి

          సూరయ్యగారూవీరూ చిన్ననాటి స్నేహితులు .ఒకేగ్రామం.వీధిబడిలోకలిసి చదువుకున్నారు. నాడు

కలిమికివారసుడైన సూరయ్య తరువాత సంపదపోయి కష్టాలలోపడ్డాడు.అయినా చిన్ననాడు వారింటతాననుభవించిన సుఖభోగాలను విశ్వనాధమరువలేదు.సమయానికి స్నేహితుని ఆదుకొని స్నేహం విలువయేదో నిరూపించారు.


       ఇదీ వారి వితరణ గుణం!!!


                               స్వస్తి!!

విశ్వనాథలోని "నేను"*

 మిత్రులకు శుభోదయం🙏



విశ్వనాధనిర్లిప్తత!


              *శ్రీ  విశ్వనాథలోని "నేను"*


                               *శ్రీ పేరాల భరతశర్మ*


ఆయన రాబడి మొదటి నుంచీ జాగ్రత్తపడితే కొన్ని లక్షలు మిగలవలసిందట. క్లాసులో ఎవడో ప్రక్కవాడితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే ఒకనాడు “ఒరేయ్! ఏమిటీ

దవడలాడిస్తున్నావ్. ఇంకోసారి మాట వినిపిస్తే ఆ దవడలు నీవి కావు” అని “చదువుకోండోయ్ ఉద్యోగాలు రావద్దా ఊళ్ళేలవద్దా.   నేనూ మొన్నటిదాకా ఒళ్ళూ పాయా

తెలియకుండా తిరిగినవాణ్ణి ఒక ఏడాదిక్రితం నాకొక ఆలోచన వచ్చింది. మన జీవితంలో మిగిల్చింది ఏమిటి? ఇంత మహాకవినీ ఇప్పుడు పోతే నా భార్యకు పిల్లలకు తిండి కూడా కష్టమైపోతుంది. ఆ స్థితి ఊహిస్తే నాకు జాగ్రత్త పడాలన్న జ్ఞానోదయమైంది.

అప్పటి నుంచీ కొంచెం వెనకవేస్తున్నాను. జీవితంలో నాకు ఆలస్యంగా మొదలైంది

మిమ్మల్ని చిన్నప్పుడే జాగ్రత్తపడమని కోప్పడుతా” అని చమత్కారంగా చెప్పారు.


ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏ మాత్రం గర్వం లేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియో స్టేషనుకు కార్లో

పోతున్నాము. అప్పుడు మాస్టారు -- "ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూ వున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో

ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమి

మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా!

ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడి నుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయ మానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీద కాపురానికి అటువంటి సృష్టి చేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికి

ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి

వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన

కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటి

మీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి

మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుః

ఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది?

(అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు

తక్కువ కాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనే వుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలామంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవం లేదు. ఇప్పుడింత మహాకవిని.

అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె.  “ఈ మాటలాయన కళ్ళల్లో

చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!


“వట్టి నీరసబుద్ది నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

.... ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి"


“నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు”

అని చెప్పారు.


 శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయసులో ఆ భార్యా వియోగమహాదుఃఖం

సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం

చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.


“నీవఖిలోహమార్గముల నిండిన జానకిపై రఘూద్వహుం

గా వెలయించి నావునను, గట్టిగ ముప్పదియాఱు వత్సరా

లీవల భూమి గర్భమున నెప్పుడు చొచ్చితివో మఱప్పుడే

నా వెలయింపు లూర్మిపృతనా రభసాతిక్రమణంబులన్ జెడెన్”


అన్నారు వరలక్ష్మీ త్రిశతిలో,


తనను భారతప్రభుత్వం "పద్మభూషణ” అన్న రోజున ఆయన ఏదో యాదృచ్ఛికంగా

మా యింటికి వచ్చి నాతో కూర్చున్నారు. “ఇదేమిటి! మాష్టారూ! జనమంతా మిమ్మల్ని అభినందించడానికి మీ యింటికి వస్తుంటే మీరిక్కడికి వచ్చి కూర్చున్నారేమిటి?” అన్నాను.

“ఏమిటి నాయనా! నాలో మార్పు? నిన్నటికంటె యివ్వాళ నాలో పెరిగిన గొప్పయేమిటి?”

అని ఆయన అంటుండగానే రేడియోవారి కారు ఆయన కోసం మా యింటి దగ్గరకు

వచ్చింది. అప్పుడాయన యింటికిపోయి రేడియో వారికి, పత్రికలవారికి సందేశాలిచ్చారు.

ఎందుకు చెప్తానంటే ఆయనకు మనుష్యులపై ప్రేమ, ఆదరము, ఆర్ద్రత యివి పట్టినంతగా

యీ గొప్పతనాల పైన తన అంతస్థును అధికంగా భావించుకునే తత్వమే లేదు.


అంతటి మహాకవే కదా! ఎంతటి అల్పకవి అయినా సరే తన దగ్గరకు వినయంగా

వస్తే ఎంతో ఆదరించేవారు. ఎందరో ఆయన దగ్గరకు వచ్చేవారు. వారు తనంత మేధావులు కారు. ప్రసిద్ధులు కారు. కవితారసికులు కూడా కాకపోవచ్చు. అతి సామాన్యులు కావచ్చు.

వారిని చులకన చేసే వారు కాదు. కొందరు అంతంతమాత్రపు కవిత్వం వ్రాసేవారు. పట్టరానంత గర్వంతో ఎదరవాడు తన కవిత్వాన్ని ఆస్వాదించగల సమర్థుడు కాడన్నట్లుగా

ప్రవర్తిస్తారు.


           రసజ్ఙ భారతి సౌజన్యంతో-

, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే

 హృదయార్పణం అంటే !! ఎలా??? 


మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. 

పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు. 

ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో గానీ.. అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా...


ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు... భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి...

అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు...


పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. 

అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. 

పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు... 


"పరమేశ్వరా... నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి..


అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి..


నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు..


పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా..


నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి..


ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి..


గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా..


ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి..


నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు..


మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా..


నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా..


జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా..


నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు..


విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా..


అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి..


అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి..


వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి.."


...ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు, భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే...

వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది...

నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు...


ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు, భక్తితో స్మరిస్తే చాలునంటాడు, కానీ మనిషి మనసు చంచలం, చపలం. 

స్థిరంగా ఒకచోట ఉండదు, లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే... శంకరభగవత్పాదులు...


ఓ పరమేశ్వరా... నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది...

భార్యా పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది...

క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది, అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను, దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు...


సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది...


ఓ పరమేశ్వరా... బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది, అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు...

కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి, షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. 

సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది. 

కనుక నీకు నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను..


అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. 

అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. 

అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు, హృదయార్పణమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి, అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు... ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 73*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 73*


తనింకా రాజు కూడా కాకుండానే తనకి సార్వభౌమోచిత లాంఛనాలతో స్వాగతం పలుకుతుంటే విస్తుబోయిన చంద్రుడు ఆశ్చర్యంగా చాణక్యుని వైపు చూశాడు. చాణక్యుడు మందహాసం చేసి 'అప్పుడే ఏమైంది... ముందు ముందు ఇంకెన్నో విచిత్రాలు చూస్తావు' అన్నట్లు తల తాటించాడు. 


స్వాగత సత్కార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత పురుషోత్తముడు ఏకాంతంగా చాణక్యునితో సమావేశమై వారి రాకకు కారణం అడిగాడు. 


చాణుక్యుడు సైనిక సహాయాన్ని అర్ధిస్తూ, "మగధలోని ముఖ్యమైన రాజ్యాధికారులంతా చంద్రునికి తమ మద్దతు ప్రకటిస్తూ ఒక లేఖపై సంతకాలు చేశారు. ఇదే ఆ లేఖ చూడండి" అంటూ మురాదేవి రహస్యసమావేశంలో ప్రముఖులతో సంతకాలు చేయించిన లేఖను చూపించాడు. 


"మౌర్య చంద్రగుప్తుడే మహానందుల వారి అసలైన వారసుడని మేము గుర్తించాము. చంద్రగుప్తుని అభిమతము తీర్చడం మాకు సర్వసమ్మతము" అని రాయబడ్డ ఆ లేఖలో మగధ మంత్రులు, సేనానులైన భద్రభటుడు, బలగుప్తుడు, పురుషదత్తుడు, సింహబలుడు, చంద్రభానుడు, బాగురాయణుడు, నక్రనాసుడు, వీరసేనుడు తదితరుల సంతకములున్నాయి. అంతమంది మద్దతు కూడగట్టుకున్న చంద్రుని విజయమూ, నందులకు నాశనమూ తప్పదని నిశ్చయించుకున్నాడు పురుషోత్తముడు. 


"కుమార చంద్రగుప్తునికి బాసటగా మా సైనిక సమూహాలన్నింటిని అందిస్తాం. అతడు మగధ సింహాసనాన్ని అధిష్టించడానికి మా వంతు సహాయం చేస్తాం ఆర్యా... అలాగే తమరూ మాకొక సహాయం చెయ్యాలి" అన్నాడు పురుషోత్తముడు. 


చాణక్యుడు తలపంకించి "సహాయం కాదు ఆజ్ఞాపించండి" అన్నాడు. 


పురుషోత్తముడు నొచ్చుకుంటూ "తమరు పెద్దలు. అంతమాటనకండి. మరేం లేదు. మా బావమరిది సింహపురాదీశుడు విజయవర్మ ఏకైక పుత్రిక శాంతవతి మా వద్దనే పెరుగుతున్నది. మాకు సంతానం లేనందున మా మేనకోడలిని మా కన్నబిడ్డగా చూసుకుంటున్నాం. యుక్త వయస్కురాలైన మా కన్యను కుమార చంద్రగుప్తునికి కన్యాదానం చేసి తమతో బాంధవ్యం కలుపుకోవాలని మా ఆశ ..." అన్నాడు. 


"శుభం..." అన్నాడు చాణక్యుడు చిరునవ్వుతో. 

'ఈ వివాహంతో చంద్రుడు రెండు బలమైన రాజ్యాలకు అధిపతి అవుతాడు. రెండు రాజ్యాలకి రాజైన వానికి సాటి రాజులు సంకొచించకుండా సహాయ సహాకారాలందిస్తారు. ఈ పరిస్థితిలో చంద్రునికి ఇంతకన్నా ఇంకేం కావాలి ?' 


చాణక్యుడు కొద్దిగా బింకాన్ని ప్రదర్శిస్తూ 

"మగధ సింహాసనాన్ని అధిష్టించిన అనంతరమే వివాహం చేసుకోవాలని ఆలోచనలో నున్నాడే... మా చంద్రుడు..." అన్నాడు. 


పురుషోత్తముడు ఆ సంబంధం ఎక్కడ జారిపోతుందోనన్న భయంతో "రాజ్యాభిషేకమే ముందు జరగాలని చంద్రుడు అభిలాషిస్తే... వివాహము, సింహపురి పట్టాభిషేకమూ ఒకే ముహూర్తానికి జరిపిస్తాం. కాదనకండి" అన్నాడు. 


చాణక్యుడు ఆశించిన వాగ్దానం రాగానే మందహాసం చేస్తూ "శుభస్యశీఘ్రం... ముహూర్తాలు పెట్టించండి. చంద్రుడిని ఒప్పించే బాధ్యత మాది. ఏమైనా తమరు చాలా అదృష్టవంతులు భావిసార్వభౌముని అల్లుడిని చేసేసుకుంటున్నారు" అనేశాడు. 


పురుషోత్తముడికి తానే సార్వభౌముడైనంత సంతోషం కలిగింది. అతడు కృతజ్ఞతతో ఆర్యునికి నమస్కరిస్తూ "అంతా తమ దయ..." అన్నాడు వినయంగా. 


ఇక్కడీ సంభాషణ జరుగుతుండగానే పురుషోత్తముని ఆజ్ఞననుసరించి అతని భార్య స్వర్ణమయి అతిథి సత్కారమను మిషతో మేనకోడలు శాంతవతి ద్వారా చంద్రునికి ఫలహార పానీయములు ఏర్పాటు చేయించింది. వధూవరులిరువులూ అప్రయత్నముగా ఒకరినొకరు చూసుకుని ఒకరిపై మరొకరు మక్కువ పెంచుకున్నారు. అది తెరచాటు నుంచి గమనించిన స్వర్ణమయి తమ గుండెల మీదనుంచి పెద్ద బరువు తీరిపోయినట్లు తృప్తిగా నిట్టూర్చింది.


కాబోయే అల్లుడు, రాజు అయిన చంద్రగుప్త చాణక్యులకు రాజభవనంలో అన్ని హంగులతో కూడిన వసతి భవనంలో విడదీ ఏర్పాటు చెయ్యబడింది. అక్కడికి చేరాక చాణక్యుడు తాను పురుషోత్తమునకిచ్చిన మాట గురించి చెప్పాడు. 


చంద్రుడు విస్తుబోతూ "ఈ పరిస్థితిలో మా వివాహమా ?" అన్నాడు. 


చాణక్యుడు నవ్వి "ఇల్లు చూసి 'ఇల్లాలిని' చూడమన్నారు నీకు ఆ రెండూ కలిసొచ్చాయి. నీకు శుభం జరుగుతుందనే మేము పురుషోత్తమునికి మాటిచ్చాం" అన్నాడు. 


చంద్రుడు అంజలి ఘటిస్తూ "ఆర్యుల ఆజ్ఞ మాకు శిరోధార్యం..." చెప్పాడు నిస్సంకోచంగా. 


సరిగ్గా అప్పుడే ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి చాణక్యుని ముందు వ్రాలింది. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మాయం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

           *🌷మాయం🌷*                

🌺 గుమస్తాలు మాయం, 

కూలీలు మాయం 

💝కోడళ్ళ పనితనం మాయం

🌸అత్తమామల మాటసాయం మాయం 

🌹అల్లుళ్ళ గౌరవ హోదా మాయం 

☀️పోస్టుమాన్ మాయం 

🌺ఆసాంతం వినే వైద్యుడు మాయం 

🤦చీర--రవిక మాయం 

🙁పుస్తక పఠనం మాయం 

🌸రేడియోకి శ్రోతలు మాయం 

🌸పెరడు బావి మాయం 

🌹సైకిలు మాయం 

🌺ఎండావకాయ మాయం 

🌹కుంపటిపై దిబ్బరొట్టి మాయం 

🌸మట్టి వాసన మాయం 

💐పిడతకింద పప్పు బండి మాయం 

🌹వందరోజులాడే సినిమాలు మాయం 

☺️అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం 

🌸ఉపాధ్యాయుడు మాయం 

🌹కుంకుడుకాయ సీకాకాయ మాయం 

🌹వాకిట పూలమొక్కలు మాయం 

🌸పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం 

🌹సత్తుగిన్నె చారు మాయం 

💐స్కూల్లో మైదానం మాయం 

🌸సంఘంలో నిదానం మాయం

💐తరవాణి,దబ్బాకు,వాము, పప్పునూనె, మాయం 

☀️వానపాము మాయం 

🌹చెరువుల్లో ఆటలు మాయం 

💐కోతికొమ్మచ్చి కబడ్డీ మాయం 

😄అవ్వ.....!!  గోచీ కూడా మాయం 

🌹థూళి లేని గాలి మాయం 

🌸పాళీ ఉన్న పెన్ను మాయం

💐ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం 

🌹నిలకడగా కురిసే వాన మాయం

🌺నిర్మానుష్యమైన ఏకాంతం మాయం 

💐కంటికి నిద్ర మాయం

💖వెన్నెల చూడాలనే కన్నులు మాయం

💐పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం 

🌹హారన్ కూత లేని వీధి మాయం 

💐దోమలు లేని పార్కులు మాయం 

🌸తోటమాలి కొలువే మాయం 

🌹దాచుకుందామంటే వడ్డీరేటు మాయం 

🌸 *'ఒక అల్లం పెసరె'* అని కేక వేసే పాక హోటల్ మాయం

☀️సగం సగం పంచుకునే తేనీరు మాయం 

☺️నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం 

😄ప్రేమ ప్రకటించే పొందిక ప్రేమ లేఖలు మాయం  

😩సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని తెల్లచీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం

😫 ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌సంతానం మాయం

😩ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం

😫ఎంతసేపు జొమేటో ప్రత్యక్షం

😪ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం 

☹️అంతా సాంకేతిక *మయం*


*చివరకి నాణ్యమైన విభూది కూడా మాయం*


*అంతా అయోమయం.*

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

చెలిమితోడ మెలగు

 173వ రోజు: (భాను వారము) 28-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


చెలిమితోడ మెలగు స్నేహితుండుండిన 

బాధలన్ని తొలగు  పరువు పెరుగు 

కష్ట సమయ మందు కాచువాడెహితుడు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


స్నేహితులతో మంచిచెడులు, కష్టనష్టములు వ్యక్తపరచిన ఎడల మన మనస్సు తేలిక పడి తదుపరి చేయు పనులందు ఏకాగ్రత పెరుగును. అంతేగాక కష్టసమయమందు ఆదుకుని తగు సూచనలు సలహాలు అందించిన వాడు మాత్రమే అసలైన హితుడు (మిత్రుడు).

హితుడు = హితమును (మేలు) కోరు వాడు.


ఈ రోజు పదము. 

ఏనుగు గున్న (Small  Elephant): ఎత్తుగున్న, కలభము, కారుజము, గున్నేనుగు, దిక్కము, శిశునాగము, వాసంతము.

గోవులంటే

 *గోవులంటే దేవుడికి చాలా ఇష్టం.*

గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటే 

1) అక్కడ ధర్మం ఉంటుంది

2) అక్కడ సంపద ఉంటుంది

3) అక్కడ వర్షాలు బాగా పడతాయి

4) అక్కడ పంటలు బాగా పండుతాయి

5) అక్కడ సుఖం /సంతోషం ఉంటుంది

6) అక్కడ మంచి సంతానం ఉంటుంది

7) అక్కడ సంస్కృతి /సాంప్రదాయం ఉంటుంది

8) అక్కడ శాంతి ఉంటుంది

9) అక్కడ శివుడి అనుగ్రహం బాగా ఉంటుంది

10) అక్కడ మనస్సు నిలబడుతుంది

11) అక్కడ భక్తి ఉంటుంది

12) అక్కడ ఆకలి చావులు ఉండవు

13) అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఉండవు

14) అక్కడ క్షామము /కరువు ఉండవు

15) అక్కడ డబ్బు సమస్యలు ఉండవు

అంత గొప్పది ఆవు

ఆవుకు అంత శక్తి ఉంది.

దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !

 వేదం భారతీయుల సంపద

 "తెలుగువారి గొప్పతనం"

 *శ్రీ బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!* 


జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు " శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి".


ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.

ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. *అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!* 


రాజమహేంద్రవరంలో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన- 


ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.


తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. 


ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.


దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. 


ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!


బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు. 


తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.


దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! 


అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం. 


దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.


ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..


అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ

స్క్రాప్ అంతా మనదేశంలో.. 

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు

మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము.. 

మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే

ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది. 


సేకరణ..

ములుగు విశ్వనాథశర్మ గారి సౌజన్యంతో-

పృథ్విని పరిపాలించ లేడు

 *న దైవాంశో దదాత్యన్నం*|

*నా రుద్ర: రుద్ర మర్చతి*|

*నా నృషి: కురుతే కావ్యం*|

*నా విష్ణు: పృథివీ పతి*:!!||


*తాత్పర్యము*:- దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు, రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు, ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు, విష్ణువు అంశలేని వాడు పృథ్విని పరిపాలించ లేడు (భూసంపద పొందలేడు) ...!!


సేకరణ

అనుభవాలు

 దర్శన అనుభవాలు


నా వంటి సామాన్యునికి అనుగ్రహం


కంచిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న సర్వతీర్థం పశ్చిమ గట్టున ఒకసారి పరమాచార్య స్వామివారు పూజ చేస్తున్నారు. తామర ఆకులపై గంధం ముద్దలను శివ పంచాయతనంగా ఉంచి విస్తారంగా చేస్తున్న పూజ అది. దానిని చూస్తూ చుట్టూ ఒక యాభై అరవై మందిమి కూర్చుని ఉన్నాము. ఆ పూజ ఒక పందిరి క్రింద జరుగుతోంది.


ఆ భక్తుల గుంపులో కూర్చున్న నేను , నా భార్య చిన్న స్వరంతో లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాము. పూజ ముగిసిన తరువాత మా పారాయణ పూర్తయ్యే దాకా ఎటువంటి ఆటంకమూ కలగకూడదని కారున్యంతో ఎంతో ఓపికగా వేచియుండి, ధూప-దీప-నైవేదయాలు సమర్పించి హరతిచ్చారు స్వామివారు.

ఈ సంఘటన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయం జరిగిన కొంత కాలం తరువాత మాకు శ్రీవిద్య ఉపదేశం లభించింది.


రామనామ మహిమ


పరమాచార్య స్వామివారు తెనంబాక్కంలో ఉన్నప్పుడు నేను నా భార్య అక్కడకు వెళ్ళాము. అప్పుడు నా పని, భక్తులు వ్రాసిన రామనామ ప్రతులని సేకరించి ‘ఐసిఎఫ్ కామకోటి సేవా సమితి’ అన్న సంస్థ ద్వారా జంషెడ్ పూర్ లో ‘రామకోటి’ అన్న మండపం నిర్మాణం చేస్తున్న ఒక భక్తునికి పంపడం. “ఎన్ని నామాలు పంపావు నువ్వు?” అని స్వామివారు అడుగగా, నేను చెప్పాను. వెంటనే స్వామివారు లోపలి గదిలోకి వెళ్లి, దాదాపు పన్నెండు కేజీలు ఉన్న రామనామం వ్రాసిన పుస్తకాలు ఉన్న ఒక పెద్ద పెట్టెను తీసుకుని వచ్చి, మమ్మల్ని పిలిచి, “ఇది నీకోసం తీసుకో” అన్నారు. శ్రీకంఠన్ వాటిని అందుకుని మాకు ఇవ్వడానికి ముందుకురాగా, స్వామివారే మాకు వాటిని ఇచ్చారు. మేము ఇద్దరమూ కలిసి వాటిని తీసుకున్నాము.


ఇది మహాస్వామి వారు మాకు ఇచ్చిన రామనామ ఉపదేశంగా భావించాము. దాన్ని మా పూజ గదిలో ఉంచుకుని కాపాడుకుంటున్నాము. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత ఈ విషయం గురించి జయేంద్ర సరస్వతి స్వామికి తెలుపగా, వెంటనే స్వామివారు, రామనామాలతో చిత్రించిన ‘సీతా-లక్ష్మణ-హనుమత్ సామెత శ్రీ రామచంద్ర మూర్తి’ ని ఇచ్చి, “ఇది కూడా ఉంచుకో” అని మమ్మల్ని అనుగ్తహించారు.


నేను కోరుకున్నట్టుగా


జనవరి 1976లో మా పెద్దమ్మాయి అఖిలాండేశ్వరి వివాహ నిశ్చితార్థం అయిన తరువాత, ఆశీస్సుల కోసం కలవైలో ఉన్న మహాస్వామివారిని కలవగా, “నీ కుమార్తె వివాహం కామాక్షి అమ్మవారి ఆలయంలోనే జరిపించు; కామాక్షి సన్నిధిలో మాంగల్యధారణం, జపం వంటి పూర్వాంగములు; సంతర్పణ దగ్గరలోని కొల్ల చత్రంలో; బంధువుల వసతి రాజవీధి చత్రం మరియు శ్రీమఠంలో; ఇలా నాలుగు స్థలాలలో. మంచిగా నిర్వహించు. నేను కోరుకున్నానని పుదు పెరియవా దగ్గర నుండి అనుమతి తీసుకో” అని చెప్పారు.


జయేంద్ర సరస్వతి స్వామివారికి మహాస్వామి వారు గురువైనా, అప్పుడు పుదు పెరియవానే పీఠాధిపతి కావున యుక్తంగా ఆలోచించి, వారి నుండి అనుమతి తీసుకొమ్మని తెలిపారు, స్వామివారు కోరుకున్నట్టుగా అని తెలిపి. స్వామివారి ఔదార్యము మరియు సరళత్వము నాకు తెలిసాయి.


పెళ్ళికి వచ్చిన బంధువులు కొందరు స్వామివారి దర్శనార్థం కలవై వెళ్ళగా, పెళ్ళి విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారని నాకు తెలవడంతో, స్వామివారికి మాపైగల ప్రేమ, కరుణను తలచుకుని ఆశ్చర్యపోయాము.


భిక్షావందనానికి ఏర్పాటు చెయ్యండి


పరమాచార్య స్వామివారు ఒరిక్కైలో ఉన్నప్పుడు, నేను కుటుంబంతో సహా స్వామివారి దర్శనం చేసుకున్నాను. అప్పుడు స్వామివారు దగ్గరే ఉన్న సేవకులు కుమరేశన్ కు ఎదో చెప్పారు. తరువాత నన్ను కుమరేశన్ పిలిచి, “చోళియులు అందరూ కలిసి భిక్షావందనం చెయ్యమని చెబుతున్నారు స్వామివారు” అని తెలిపాడు. ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తానని తెలిపాను. అంతేకాక ప్రతి చాతుర్మాస్యంలో తప్పకుండా చోళియుల భిక్షావందనం జరగాలని స్వామివారు కోరారు. 


దీని విషయమై ఒక వారం తరువాత, పరమాచార్య స్వామి వారి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాము. చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్, నేను, సుందరం అయ్యర్ మరియు అతని తమ్ముడు, కుమరేశన్ మరి కొంతమంది సమావేశంలో ఉన్నాము. ‘చోళదేశీయ ఊర్ధ్వశిఖా బ్రహ్మణాళ్ భిక్ష’ అన్న పేరును స్వామివారే సూచించారు. “మీలో ప్రముఖుడు కృష్ణప్రేమి. అతణ్ణి పోషకుడిగా ఉంచి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం మీ శాఖ తరుపున భిక్ష ఏర్పాటు చెయ్యండి” అని తెలిపారు. దాని ప్రకారమే ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం భిక్షావందనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ భిక్షావందనం పరమాచార్య స్వామివారి ఆదేశం వల్ల జరుగుతున్నది కావున, దాన్ని ఎంతో భక్తీ శ్రద్ధలతో చేస్తున్నాము మేమందరం.


‘గురురత్నమాలా’ అనే గ్రంథంలో శ్రీ కామకోటి పీఠం ఆచార్యులందరి గురించిన విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో కొందరు పీఠాధిపతుల గురించి చెబుతూ, వారు ‘ద్రావిడ బ్రాహ్మణ’ శాఖకు చెందినవారుగా ఉంటుంది. అంటే, ఈ పీఠాన్ని అధిష్టించిన ఎందఱో ఆచార్యులు ద్రావిడ బ్రాహ్మణులు. ఊర్ధ్వశిఖ బ్రాహ్మణులు మాత్రమే ద్రావిడ బ్రాహ్మణులు కదా అన్న అనుమానం కలుగుతుంది. బహుశా అందుకే పరమాచార్య స్వామివారు చోళియుల భిక్షావందనం ఏర్పాటు చెయ్యమని తెలిపారేమో. 


హగరిలో అప్పర్ గురించి


నది ఒడ్డున ఉన్న హగరి(నిజానికి అది ‘అఖ హరి’ - అంటే పాపనాశిని. అఖ అంటే పాపం, హరి అంటే నాశనం చెయ్యడం) అనే ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఒక దేవాలయం ప్రాంగణంలో పరమాచార్య స్వామివారు కొద్దికాలం బస చేశారు.

అప్పుడు స్వామివారు తమ శిష్యుడైన డన్ లాప్ కృష్ణన్ ను తేవారం చదవమని చెప్పి, స్వామివారు వినేవారు. ‘మూవర్ తేవారం’ - ముగ్గురు మహాత్ములు(అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరర్) రచించిన తేవారం చాలా పెద్దది, చదవడానికి కొన్ని రోజులు పడుతుంది. అక్కడే ఉండి డన్ లాప్ కృష్ణన్ పరమాచార్య స్వామి వారి కోసం చదువుతుండేవాడు.


అప్పర్ చైత్ర మాసంలో శతభిష నక్షత్రం రోజున ముక్తి పొందారు. వారు తిరుప్పుగళూర్ అనే ఊరిలో ముక్తి పొందారు.


దీని గురించి స్వామివారు ఇలా చెప్పారు, “నీకు తెలుసు కదా? అప్పర్ ముక్తి పొందినది తిరుప్పుగళూర్ లో. అప్పర్ గర్భగృహం లోపలకు వెళ్ళాడు. అంతే! మరి తిరిగి రాలేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాని ఒక్క విషయం ఎవరికీ తెలియదు. శివుడు సింహంలా వచ్చాడు. ముక్కలుగా కొరికి తినేశాడు. అప్పర్ ఆన్నాడు, “తండ్రీ ఇది నాకు చాలా బాధగా ఉంది”. అందుకు స్వామి, “అప్పనే! నువ్వు నాకు చాలా తీయగా ఉన్నావు”. (గర్భగృహంలో శివలింగం వెనకాతల ఈ విషయాన్ని తెలిపే ఇత్తడి ఫలకం ఉండేది, ఇటీవల దాని తొలగించారు). తిరుప్పుగళూర్ పత్తికంలో అప్పర్, స్వామివారిని ‘సింగమే’ అని వర్ణిస్తాడు. దీనికి ఆధారం ఈ రెండు విషయాలే”.


ఈ విషయం నేను ఇప్పటిదాకా ఎక్కడా వినలేదు, చదవలేదు. ఈ రెండు ఆధారాలతో పాటుగా మనకు లభించైన మూడవ ఆధారం పరమాచార్య స్వామివారి వాక్కు.


సంబంధర్ తేవారం చదివినప్పుడు, అతను కౌండిన్య గోత్రానికి చెందినవాడుగా తెలిసింది. మహాస్వామి వారు నావైపు చూసి, “మీది ఏ గోత్రం?” అని అడిగారు. “కాశ్యప గోత్రం” అని చెప్పాను నేను.


ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడిగారు అని అనుకున్నాను. నేను ఊర్ధ్వశిఖ కుటుంబానికి చెందినవాణ్ణి. ఈనాడు చోళియులుగా పిలువబడే బ్రాహ్మణ శాఖ.


మహాగావ్ లో మాక్స్ ముల్లర్ గురించి


మహాగావ్ అనే పల్లె కర్ణాటక రాష్ట్రంలో ఉంది. గుల్బర్గా నుండి బస్సులో అక్కడకు వెళ్ళాలి. పరమాచార్య స్వామివారు అక్కడ ఉన్నాపుడు నేను ఒకసారి వెళ్లి దర్శనం చేసుకున్నాను. నాకు గుర్తున్నతవరకు 1982 లేదా 1983 అనుకుంటా.

నేను అక్కడకు వెళ్ళినప్పుడు మహాస్వామివారు విద్యారణ్యుల గురించి చెబుతున్నారు.


“శ్రీ విద్యారణ్యులు నాలుగు వేదాలకు భాష్యం వ్రాశారు. మాక్స్ ముల్లర్ అనే ఒక జర్మనీ దేశీయుడు కూడా భాష్యం వ్రాశాడు. తరువాత ఎంతోమంది పాశ్యాత్య మేధావులు, వాళ్ళ పుస్తకాల్లో వేదాల గురించి వ్రాశారు. వేదము శబ్ధ ప్రధానమైనది; అర్థ ప్రధానమైనది కాదు. ఇది ఆ పాశ్యాత్య మేధావులకు తెలిసే అవకాశమే లేదు. కాని, వారు ఎంతో శ్రద్ధతో, వేదాలను చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అందుకోసం సంస్కృత భాషా జ్ఞానాన్ని, ఈ దేశ సంస్కృతిని తెలుసుకుని పుస్తకాల్లో వ్రాసుకున్నారు. ఇలాంటివి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వారి యొక్క దేశ సంస్కృతి దృష్ట్యా వారు మన వేదాలను, వాటి మార్గాలను అర్థం చేసుకుని పుస్తకాలలో వ్రాసుకున్న విషయాలలో తేడాలు ఉన్నాయి”.

“విద్యారణ్యుల భాష్యంలోనూ ఈ పడమటి మేధావులు వ్రాసిన పుస్తకాలలోనూ ఎక్కువ భేదాలు ఉండడం వల్ల శ్రీ విద్యారణ్యుల వేద భాష్యంలోని వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోవడానికి తగిన పరిశోధన చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తే మనవారికి చాలా ఉపయోగ పడుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు పండితులను ఈ పని కోసమే నియమించవలసి ఉన్నది”


దీనికనుగుణంగా మహాస్వామివారు, ‘వేదరక్షణ నిధి ట్రస్ట్’ ఎగ్సిగ్యూటివ్ ట్రస్టీ అయిన శ్రీ అన్నాదురై అయ్యంగార్, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి అయిన శ్రీ సి.ఆర్ స్వామినాథన్ మరికొందరితో చర్చిస్తున్నారు. స్వామివారు సి.ఆర్ స్వామినాథన్ ను “ఇటువంటి పరిశోధనకి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో దీనికి ఏమైనా అవకాశం ఉందా?” అని అడిగారు.

అందుకు స్వామినాథన్, “అవును ఉంది. ప్రస్తుతం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఇటువంటి ఆర్ధిక సహాయం ఇస్తున్నాము” అని తెలిపారు.


ఈ సంబాషణ వల్లనే ‘విద్యారణ్య ట్రస్ట్’ ఏర్పాటు అయ్యింటుంది అన్నది తెలిసిన విషయం.


--- ఆర్. చిదంబరేసన్, చెన్నై - 40. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాదాకా మేలుకో -2 పడగనీడలో

సాదాకా మేలుకో -2

 పడగనీడలో 

ఒక కప్పు ఎండలో అటు ఇటు తిరుగుతూ వున్నదట దానికి ఎక్కడ కూడా ఏమాత్రం నీడ దొరకటం లేదు కాళ్ళు కాలిపోతున్నాయి, శరీరం అంతా చెమటలతో మునిగిపోతుంది, నోరు ఎండిపోతున్నది, ఇంకనేను బ్రతకలేనేమో అని భావిస్తుండగా కొంత దూరంలో కొద్దిగా నీడ కనిపించింది.  బతుకు జీవుడా అని ఆ కప్పు ఆ నీడలో తన శరీరాన్ని దాచుకోవటానికి వేగంగా వెళ్ళింది.  అక్కడకు వెళ్ళగానే ప్రాణానికి కొంత ఊరట లభించింది. అమ్మయ్య నాకు ఈ నీడ చాలా హాయిగా వుంది అని అనుకొన్నది. కొంత ఊరట చెందినతరువాత నీళ్లు ఎక్కడైనా లభిస్తాయా అని అటు ఇటు చూడటం మొదలు పెట్టింది.  ఆ వెతుకులాటలో తన మీద ఉన్న నీడ అటు ఇటు కదలటం గమనించింది.  ఏమిటి ఈ నీడ ఇలా కదులుతున్నది అని ఒక్కసారి పైకి చూసింది.  పైకి చూసిన తన ఫై ప్రాణాలు పీకే పోయాయి ఎందుకంటె ఆ నీడ మరెవరిదో కాదు కప్పలను విందారగించే ఒక పెద్ద పాముది నా అదృష్టం కొద్ది దాని ద్రుష్టి నా మీద పడలేదు కానీ పడితే ఆ భావనతోటె ప్రాణం పోయినంత పామునైయింది. కప్పు రక్షింపబడ్డదా లేక భక్షింపపడ్డాదా అనేది పాఠకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.  

ఇక విషయానికి వస్తే సాధకులారా మీ సాధన నిత్యం కొనసాగించండి.  రోజు సాధనను నిర్విరామంగా చేస్తేనే కానీ మనకు ఈ జన్మలో మోక్షం లభించదు జాప్యం అస్సలు  చేయవలదు. మనం ఏ పనినైనా వాయిదా వేయవచ్చు కానీ దేవదేవుడైన పరమేశ్వరుని ధ్యానాన్ని అస్సలు వాయిదా వేయకూడదు.  మనకు లభించిన ఈ జన్మ కేవలం పడగనీడలో వున్న కప్ప జీవిత కాలమంతే మన వెనుక పెద్ద పడగ వున్నది దానిపేరు కాలుడు. అందుకే మన ఆదిశంకరులు చెప్పారు "నిత్యం సన్నిహితే మృత్యువు"  మానవ జీవనం కూడా పాము పడగక్రింద వున్న కప్పలాంటిదే ఆ పాము (మృత్యువు) ఏ క్షణంలో నయినా కాటు వేసీ ప్రాణాన్ని అపహరించగలదు.  కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగరూకులం అయి ఉండాలి.

కాబట్టి సాధక నీ జీవితంలో ప్రతి నిముషం విలువైనదని తెలుసుకో నీ జీవితాన్ని పూర్తిగా జన్మ రావాహిత్యానికై అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించు.  మనం నిత్యం అనుభవించే సుఖాలు, భోగాలు నిత్యమైనవి కావు కేవలము తాత్కాలికమైనవి ఈ సంగతి ప్రతి సాధకుడు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. 

ఈ రోజుల్లో మనకు అనేకమంది తమ వాక్చాతుర్యంతో భక్తి మార్గాన్ని ప్రభోదిస్తున్నామని చెపుతున్నారు.  నిజానికి వారు వారి జీవితాలను యెంత మోతాదులో ఉద్దరించుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్నర్ధకమే. ఎంతమంది దేహ వ్యామోహం లేకుండా వున్నారు. చాలా వరకు దేహవ్యామోహం  ఉన్నట్లు ప్రస్ఫుటంగా బాహ్యంగా కనిపిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. మరి తమను తామే ఉద్దరించుకోలేని స్థితిలో ఉంటే వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు ఆలోచించండి. 

నిజమైన సాధకుడు దేహవ్యామోహాన్ని వదిలి ఉండి ఈ దేహం కేవలం మోక్షాన్ని పొందటానికి ఉపయోగ పడే ఒక సాధనగా మాత్రమే తలుస్తాడు. ఏ మాత్రము దూషణ, భూషణాదులకు లొంగడు, అరిషడ్వార్గాన్ని నియంత్రించుకొని ఉంటాడు, ఎప్పుడు మృదు భాషణలు చేస్తాడు, రాజసం అస్సలు ఉండదు, ధనాపేక్ష, కీర్తి కాండూతి ఉండదు. తన జీవితాన్ని ఎలా తరించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాడు. అటువంటి సాధకుడు మాత్రమే సద్గురువుగా పేర్కొన వచ్చు. అటువంటి సద్గురువులు తారసపడితే వారి సాన్నిధ్యంలో మన సందేహ నివృత్తి చేసుకొని నిత్యం సాధన చేస్తే తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

భార్గవ శర్మ

 


సత్పురుషులు

 .

          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కీర్తి కాంక్షా ధనేచ్ఛాచ*

*మనుష్యేషు ప్రవర్ధతే |*

*ద్వయంయేన పరిత్యక్తం* 

*ససాధుః సద్భిరుచ్యతే ||*


తా𝕝𝕝

ప్రస్తుత కాలంలో మనుష్యులకు ఎలాగైనాసరే కీర్తి ప్రతిష్ఠలను పొందాలనే తాపత్రయము, మంచి చెడులతో సంబంధం లేకుండా ధనమును సంపాదించాలి అనే కోరిక, ఈ రెండు పెరిగిపోతున్నాయి ఎవరైతే వీటికి దూరముగా ఉంటారో వారే  సత్పురుషులు " అని పెద్దల చేత చెప్పబడుచున్నది.