16, జనవరి 2026, శుక్రవారం

Panchangam పంచాంగము


 

బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు

  బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణం లో చెప్పబడి ఉన్నది . అగ్ని దేవుని భార్య పేరు స్వాహా దేవి.. హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో "స్వాహా " అనడం జరుగుతుంది . ఈ "స్వాహా" అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు ,మంత్రాలు అన్ని దేవునికి చేరుతాయి .


అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహాదేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వధాదేవి తన పాత్ర పోషిస్తుంది.


స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది. శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ధ దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్ధము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. 


బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా , విద్యావతిగా తీర్చిదిద్ది , ఆ కన్యకు "స్వధాదేవి" అని నామకరణం చేసాడు. పితృదేవతలకు పత్నిగా స్వధా దేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు,విప్రులు ,మానవులు "స్వధాదేవి"ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

కనుమనాడు ప్రయాణం

 *"కనుమనాడు ప్రయాణం చేయకూడదంటారు. నిజమేనా?"*అను దానికి సమాధానం...


కనుమనాడు కాకి కూడా కదలదని సామెత. తెల్లవారి నిద్రలేస్తూనే ఆహారాన్ని అన్వేషించే అల్పజీవి కాకి. అటువంటి కాకికి కూడా కనుమనాడు తిండికి లోపం ఉండదు కాబట్టి, ఊరు వదిలి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.


కాకికి పితృపక్షి అని పేరు. ఆబ్ధీక సమయంలో పితృపిండాలను కాకి, గ్రద్ధలకు పెడతారు. లేదంటే నీటిలో విడిచిపెట్టి జలచరాలకు సమర్పిస్తారు. వాటిని సంతృప్తి పరిస్తే ఆ పుణ్యం పితృదేవతలకు చేరుతుందని మన వారి నమ్మకం


కనుమ ప్రత్యేకించి పెద్దలకు పెట్టుకునే పండుగ. ఆ రోజున తప్పనిసరిగా పితృదేవతలకు మన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అంటే ఇంటి వద్ద తప్పనిసరిగా ఉండాలి. అందుకే కనుమనాడు ప్రయాణం చేయవద్దన్నారు.

============================

సాహిత్యమనగానేమి

  *సాహిత్యమనగానేమి? సహితానాం భావః సాహిత్యమ్. సహితములైన వానియొక్క భావము సాహిత్యము. సహితమనగా కూడుకొని యున్న అని యర్ధము.లోకమునందు - చెప్పుచున్నారు. కాని నిజముగా హితమైన దానితో కూడి యున్నదని యర్థము. = హితమనగానేమి.? హితం మనోహారిచ దుర్లభంవచః అని భారవి వ్రాసినాడు. హితమును, మనోహరియునైన వాక్కు దుర్లభము. ఏ మాట మనోహారిగా నుండునో, మనస్సునకు - తాత్కాలికమైన యొక పొంగును తెచ్చునో, అట్టిదియు హితమైనదియునైన మాట దుర్లభము. హితమనగా నేమి. హితమనగా పథ్యము. అనగా తత్కాలమునం దయిష్టముగా నుండి అనంతర కాలమునందు మేలును సమకూర్చునది. వైద్యుడు పథ్యమును చెప్పును. అది తినుట కష్టము. కాని తిన్నచో వ్యాధి కుదురును. మొత్తముమీద సాహిత్యమనగా - తత్కాలమునందు హితముగా నుండదు. అనంతర కాలమునందు హితముగా నుండును. తరువాత మేలును సమకూర్చును. తరువాత ననగా నెప్పుడు? దానితో నీవు పరిచయము - వృద్ధి చేసికొని, దానిలోని సౌందర్యము నాస్వాదించుట కలవాటుపడి, ఆ సౌందర్యము ననుభవించుచు నానందము పొందగలిగినంత జీవలక్షణము పెంపొందించుకొని, అందులో చెప్పబడ్డ మహా విషయములే యదార్థములని తెలిసికొన్న తరువాత నది సాహిత్యమగును.*

పెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


      🍁 *శుభోదయం🐍


🌹 *నేటి పెద్దలమాట* 🌹

భగవంతుడు మెచ్చుకొనే దివ్య గుణాలలో కరుణ ఒకటి ఆయన దాయాస్వరూపుడు అందుకే ఆలక్షణం కలవారు ఆయనకీ ప్రీతిపాత్రులౌతారు.

తన చుట్టూ ఉన్న ప్రాణికోటి ఆనందం గా ఉంటేనే తానూ ఆనందించడం ఇతరులకు ఏకొద్ది*కష్టం కలిగినా సహించలేక పోవడం ఉత్తమ సంస్కార లక్షణం.


🌹 *నేటిమంచిమాట* 🌹

   

అందం విలువైనదే కానీ మంచి మనసంతా విలువైనది ఐతే మాత్రం కాదు అందం ఉన్నచోట అవసరం పెరుగుతుంది మంచి మనసు ఉన్న దగ్గర బంధం పెరుగుతుంది.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼

             

           *_నేటి విశేషం_*


           _*కనుమ పండగ ... “పశువుల పండుగ”*_

కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. 

పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు.

 సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. 

పక్షులు కూడా రైతన్ననేస్తాలే, అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.



*పశువుల పండుగ*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.  

ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. 

కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు. 

కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. 

అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. 

అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని *"ఉప్పు చెక్క''* అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. 

అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. 

అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. 

లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు.

 ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. 

మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. 

ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. 

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు.

పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. 

ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. 

దాన్ని *"చిట్లా కుప్ప"* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి.


ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. 

అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. 

పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు.

పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి.


ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. 

దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. 

ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. 

ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని *''పొలి''* అంటారు. 

ఆ *"పొలి"* ని తోటకాపరి గాని , నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో *"పొలో.... పొలి"* అని అరుస్తూ చల్లుతాడు. 

అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. 

అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.


ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. 

కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. 

దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది...


               *_🍃శుభమస్తు🍃_*

    🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

శ్రీహరి స్తుతి 37*

  *శ్రీహరి స్తుతి 37* 


*కం.నరసింహుడు కరుణించిన* 

*నరులకు సంపద కలుగును నానందమ్మున్*

*జరుగును శుభ కార్యంబులు* 

*ధరణంతయు సంతసంబు తప్పక దొరుకున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

అందరమొకటై చేయగ

 *2321*

*కం*

అందరమొకటై చేయగ

సుందరమై పండుగ యిల శోభిల్లునయా.

అందరునూ కలిసెడి యా

నందదినమె పండుగయగు ననయము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అందరూ ఒకటి గా కలిసి నిర్వహించుకుంటే పండుగ ఈ లోకంలో అందంగా ప్రకాశిస్తుంది. అందరూ కలిసి ఉండే ఆనందకరమైన దినమే ఎల్లప్పుడూ పండుగ కాగలదు.

*సందేశం&సందర్భం*:-- ఈ రోజల్లో చాలా మంది ఎవరికి వారు గా ఒంటరిగా పండుగ లు నిర్వహించుకొనుచూ సరైన సంతృప్తి ని పొందటం లేదు., అలాగే పండుగ నాడైనా స్వజనులకు దగ్గరగా వచ్చుటలేదు,అలా పండుగ సంతోషాలను పరిపూర్ణముగా ఆస్వాదించడం లేదు. కనీసం మరో సందర్భంలో అయినా అందరూ కలిస్తే ఆ రోజు నే పండుగ నిర్వహించుకొనవచ్చుననేది సందేశం, ఎందుకంటే అందరూ కలిసి ఉండే ఏ రోజైననూ పండుగ రోజు వంటి దే కదా!!

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

బసవడికి కోటి దండాలు*

 


       *బసవడికి కోటి దండాలు*

                 ➖➖➖✍️```

      కనుమ పండుగ ప్రత్యేకం


పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేకపూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే జీవులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ.


సంక్రాంతి వ్యవసాయ పండుగ! శ్రమైక జీవన సౌందర్యానికిది ప్రతీక! ఆరుగాలం శ్రమపడ్డ రైతుకు పంట ఇంటికి చేరితే నిజంగా పండుగ! సకల శుభదాయకంగా సమస్త శ్రేయస్కరంగా భావించి, ప్రాంతాలతో నిమిత్తలేకుండా పల్లె ప్రజానీకమంతా హర్షాతిరేకాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి.


ప్రకృతి మాపై కరుణ చూపాలి. సూర్యునితో సహా నవగ్రహాల దయ మాపై ఉండాలి. మబ్బులు రావాలి, ఉరుములు మెరవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, పంటలు పండాలి, గాదెలు నిండాలి, కడుపునిండా తిండి దొరకాలి, సమస్తం క్షేమంగా ఉండాలి. సకల వృద్ధి పొందాలి, అంతటా సంతోషం వెల్లివిరియాలనే భావనే సంక్రాంతి నేపథ్యంగా ఉంటుంది.```



*పశువుల పండుగ*```

భోగి, మకర సంక్రాంతి తరువాతి రోజు కనుమ పండుగ. వ్యవహారంలో కనుమ పండుగగా స్థిరపడినప్పటికీ దీని అసలు పేరు 'కనుము పులు' పండుగ. కనుము అంటే పశువు అని అర్ధం. పులు అనే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యం, అల్పమైనది, కసవు అర్ధాలున్నాయి. కసవు అంటే గడ్డి. 

కనుమ పండుగనాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఈ పండుగకు 'కనుము పులు' పర్వం అని పిలిచారు.


కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు చెల్లించుకునే పర్వంగా కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంప్రదాయం.


పరోపకారమే ధ్యేయంగా గల మూగజీవులను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సంప్రదాయం కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా భావించి, అనంతకోటి ప్రాణిపట్ల దయార్ద్ర హృదయాన్ని కలిగి ఉండాలనే భావనతో కనుమ రోజున విశిష్టంగా రైతన్నలు జరుపుకునే పండుగ ఇది. సిరిసంపదలిచ్చే గోమాతను, బవసన్నను పూజించే పండుగ. మూగజీవాల పట్ల ప్రేమను తెల్పుతూ కనుమనాడు రైతులు పశుశాలను శుభ్రపరచి పశువులను శుభ్రంగా కడుగుతారు. పశువులకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెడతారు. మెడలో గంటలు, గవ్వలు కడతారు. కొమ్ములకు వెండి తొడుగులు, కాళ్లకు గజ్జలు తొడుగుతారు. పూల మాలలు వేసి పూజిస్తారు. ఆ తర్వాత పశువులన్నింటికీ పచ్చగడ్డి, సెనగపిండి పొంగళ్లను దాణాగా తినిపిస్తారు♪. ఆ సాయంత్రం రైతులు, వ్యవసాయదారులు పశువులను మేళతాళాలతో ఊరంతా తిప్పుతారు. కనుమ నాడు గోవును పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలం పొందుతారని శాస్త్రోక్తి. సంతానానికి గోవు సంకేతం. ధర్మానికి ఎద్దు సంకేతంగా భావిస్తారు.```



*పొలి చల్లడం*```

కష్టించి పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి వచ్చిన సమయంలో రైతులు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. కొత్త ధాన్యంలో ఆవుపాలు, చక్కెర కలిపి పొంగలి తయారు చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు. పొంగలి మెతుకులు పొలమంతా చల్లుతారు. అందువల్ల పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. ఈ ఆచారానికే పొలిచల్లడం అని పేరు. 


కనుమ రోజున కాకి కూడా ప్రయాణం చేయదు అని సామెత. కాబట్టి ఈ రోజు ప్రయాణం నిషిద్ధం. మాంసాహారులు ఈ రోజు మాంసాన్ని వండుకుంటారు సాధారణంగా పందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం కనుమ పండుగలో కనపడుతుంది.```



*వరికంకుల సౌందర్యం*```

పక్షులు పంట పాడుచేయకుండా ఉండేందుకు పురుగులను తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను చెప్తారు మన రైతన్నలు. అప్పుడే నూర్చిన వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేస్తారు. ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమ నాడు గుడిలో వరికంకుల గుత్తులను కడతారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపు ముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. తమిళులు కనుమను 'మాట్టు పొంగల్' అని పిలుస్తారు. తెలుగువారు పులగం అంటారు. కొత్త బియ్యం కొత్త పెసర పప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. కొత్త బియ్యాన్ని లేగంటి ఆవు పాలలో వండి కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారు చేయటం ఈ పండుగతోనే ప్రారంభిస్తారు. ```



*ఆధ్యాత్మిక కనుమ*```

అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకెత్తి నందగోకులాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించింది కనుమ పండుగ రోజునే అని చెబుతారు. పశుపోషణ, రక్షణ మానవజాతి కర్తవ్యంగా నాటినుంచి కనుమనాడు పశువులను పూజించే ఆచారం వచ్చిందని ఒక గాథ. 


సంక్రమణ కాలంలో ప్రధానంగా పితృతర్పణలు నిర్వర్తించాలి. ఇది పెద్దలను సంస్మరించుకునే పండుగగా మనవారు నిర్దేశించారు. మినుముతో చేసిన గారెలను కనుమనాడు పితృదేవతలకు నివేదిస్తారు. గోదావరి ప్రాంతాల్లో ముత్తైదువలు సకల పిండివంటలతో వేడినైవేద్యం వండి గ్రామదేవతలకు సమర్పణగా రజకులకు అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి ఆడపడుచులు అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి అన్నల చేతుల్లో ఉంచి మంచి జరగాలని కోరుకుంటారు.```


*ముక్కనుమ*```

సంక్రాంతి నాలుగోరోజు ముక్కనుమ అంటారు. కానీ ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు కానీ, కొంత మంది కనుమ నాడు కాక ఈ రోజే మాంసాహారాన్ని తినటానికి కేటాయిస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడవారు సావిత్రి గౌరీ వ్రతాన్ని మొదలు పెడతారు. పదహారు రోజుల పాటు చేసే ఈ వ్రతాన్ని గ్రామంలో ఉన్న ఆడవారందరూ కలిసి చేసుకుంటారు. మట్టితో చేసిన గౌరీ దేవి బొమ్మని కుమ్మరి ఇంటినుంచి మేళతాళాలతో తెస్తారు. కుమ్మరికి స్వయం పాకం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. అన్ని వృత్తుల గౌరవించటం సంక్రాంతి సంప్రదాయాల పరమార్ధం.✍️```-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మహాభారతము

 


 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*622 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


అవిజాతుని సలహా

నహుషుడు " మంత్రులతో ఉన్న రాజ్యం అంతా ఇస్తానన్నాను కదా ! ఇంతకంటే నావద్ద ఇవ్వడానికి ఏముంది " అని దుఃఖించాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అవిజాతుడు అనే ముని జరుగుతున్న విషయము విని " మహారాజా ! చింతించకండి. ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను " అన్నాడు. నహుషుడు " మునీంద్రా ! అదేదో చెప్పి పుణ్యం కట్టుకుని నన్ను రక్షించండి " అని వేడుకున్నాడు నహుషుడు మంత్రులతో. అవిజాతుడు " మహారాజా ! గోవు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు రెండు జాతులుగా పుట్టించినా ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వలన పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగసంభారాలు సమకూడుతాయి. ఆ యాగము చేయతగిన వాడు బ్రాహ్మణుడు. కనుక వీరిరువురు సమానులే. సకల వేదాంగ విదుడైన బ్రాహ్మణుడికి విలువ నిర్ణయించడం ఈశ్వరుడికి కూడా శక్యము కాదు. సకలదేవతా స్వరూపమైన గోవు కూడా అంతే కనుక బ్రాహ్మణుడికి సమానంగా గోవును దానంగా ఇచ్చి చ్యవనుడిని విడిపించండి " అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి నహుషుడు " మహానుభావా ! నన్ను కరుణించండి . మీకు వెల నిర్ణయించ కలిగిన శక్తి నాకు ఉందా ! కనుక తమకు బదులుగా గోవును దానము ఇస్తాను " అని అన్నాడు. చ్యవనుడు నవ్వి " నీ నిర్ణయానికి సంతోషించాను. నహుషమహారాజా ! గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతము, యజ్ఞములో గోవు అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము దేవతలకు కూడా పూజనీయము. కనుక నాకు బదులుగా గోవును ఇవ్వండి " అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చ్యవనుడికి సమర్పించారు. చ్యవనుడు " జాలరులారా మీకు చేపలకు స్వర్గ ప్రాప్తి కలిగిస్తాను " అని వరం ప్రసాదించాడు. తరువాత చ్యవనుడు, అవిజాతుడు నహుషుడికి వరం ఇవ్వడానికి సంకల్పించి నహుషుడికి సతతము ధర్మపరత్వము, ఇంద్రుడితో సమానమైన సంపదలు ప్రసాదించారు. తరువాత నహుషుడు రాజధానికి వెళ్ళాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1359


⚜  తమిళనాడు : మైలాపూర్


⚜  శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం


💠 ఆదికేశవ పెరుమాళ్ ఆలయం మైలాపూర్ పశ్చిమ భాగంలో చితిరై కులం సమీపంలో ఉంది. 

ఆది కేశవ పెరుమాళ్ ఆలయం మరియు వేదాంత దేశిక దేవస్థానం ఒకదానికొకటి ప్రక్కనే ఉన్నాయి.


💠 ఋషులను అసురుల నుండి విడిపించడానికి కేశవుడు ఇక్కడ అవతరించాడని మరియు ఈ పెరుమాళ్ సూర్య చంద్రులకు శాప విమోచనం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.


💠 వైష్ణవ  పే ఆళ్వార్ అవతార స్థలం కూడా అయిన ఈ పురాతన ఆలయం తెంకలై వైష్ణవ సంప్రదాయానికి చెందినది.


💠 స్థలపురాణం ప్రకారం, క్షీర సాగర మథనం సమయంలో, విష్ణువు తన భార్య లక్ష్మిని భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకోవాలని ఆదేశించాడు. ఆ మహర్షి ఆడపిల్లను పొందాలని తపస్సు చేస్తూ, లక్ష్మీదేవిని స్వీకరించాడు. 


💠 ఆదికేశవుడు భృగుమహర్షి కుమార్తె అయిన భార్గవినీ  వివాహం చేసుకున్నాడని నమ్ముతారు.

భృగు మహర్షి కుమార్తెగా, ఆమెను 'భార్గవి' అని పిలుస్తారు. 

ఆమె భగవంతుని కుడి వైపున ఒక ప్రత్యేక గర్భగుడిలో ఉంటుంది. 

ప్రతి శుక్రవారం ఉదయం ప్రత్యేక హోమం చేస్తారు మరియు శ్రీసూక్తం జపించడం ద్వారా ఆమెను 'విల్వ' ఆకులతో పూజిస్తారు. 

తాయారు పూజించడానికి ఇది చాలా శుభ సమయం. 


💠 వివాహానికి ఉన్న అడ్డంకుల నుండి ఉపశమనం పొందడానికి, చదువులో వృద్ధి చెందడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి భక్తులు ఆమెను బిల్వ ఆకులతో ప్రార్థిస్తారు. 


💠 ఈ ఆలయం  6-9 శతాబ్దాల పన్నెండు ఆళ్వార్ సాధువులలో మొదటి ముగ్గురిలో ఒకరైన పెయాళ్వార్ జన్మస్థలం అని నమ్ముతారు. 


💠 ఈ ఆలయ ప్రధాన దైవం ఆదికేశవుడు తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో, ఉత్సవర్ శ్రీదేవి మరియు భూదేవి భార్యలతో ఉన్నారు.


💠 రాముడు విభీషణుడిని అభిముఖంగా చూస్తూ ఆశీర్వదించే సన్నిధి కూడా ఉంది. 

ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, తెంగలై శాఖకు చెందిన 12 మంది ఆళ్వార్లు మరియు 22 మంది ఆచార్యులు ఒకే సన్నిధిలో ఉన్నారు, దీనిని మీరు మరే ఇతర ఆలయంలోనూ చూడలేరు. 


💠 తాయార్ మయూరవల్లి తూర్పు ముఖంగా ప్రత్యేక సన్నిధిని కలిగి ఉన్నారు. 

తాయార్‌కు శుక్రవారం జరిగే ప్రత్యేక పూజ చాలా మంది భక్తులను ఆకర్షిస్తుంది.


💠 శ్రీమహావిష్ణువు ఆయుధాలలో ఒకటైన 'నందకం' ఖడ్గం, మహాలక్ష్మిని మంత్రాలను బోధించమని కోరింది.

ఆ ఖడ్గం భూమిలో జన్మించి, విష్ణువును పూజించి, ఆ తర్వాత బోధించాలనే షరతుపై మహాలక్ష్మి అంగీకరించింది. 

దీని ప్రకారం, మణి కైరవిణి తీర్ధంలో వికసించిన పువ్వులో నందకం జన్మించాడు. 


💠 అతన్ని "మహాతాహ్వాయర్" అని పిలుస్తారు. అతను ప్రతిరోజూ భగవంతునికి దండలు వేసే విధిని నిర్వర్తిస్తున్నాడు మరియు లక్ష్మి సంతోషంగా అతనికి బోధించింది. పెరుమాళ్ పట్ల ఆయనకున్న అపారమైన భక్తి కారణంగా ఆయనను 'పెయాళ్వార్' అని పిలుస్తారు.

'పే' అంటే 'వృద్ధుడు'. 

ఆయన ఆళ్వార్లలో పెద్దవాడు కాబట్టి ఆయనను అలా పిలిచారని చెబుతారు.


💠 పెరుమాళ్ గర్భగుడి ముందు మండపంలో పెయాళ్వార్ ప్రత్యేక గర్భగుడిలో, దక్షిణం వైపు కూర్చుని ఉన్నారు. 

ఇప్పటికీ మనం పెయాళ్వార్ జన్మించిన కైరవిణి బావిని, సమీపంలోని దూరంలో చూడవచ్చు. 


💠 ఆళ్వార్ పుట్టినరోజును ఐప్పసి మాసంలోని 'సదయం' నక్షత్రం రోజున జరుపుకుంటారు. 

ఆ రోజున, అరుల్మిగు పార్థసారథి పెరుమాళ్ ఆలయం నుండి పూలమాల, తులసి, పరివట్టం, చెప్పులు మరియు భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని తీసుకువచ్చి పెయాళ్వార్కు సమర్పిస్తారు. 


💠 చంద్రుడు ఈ స్వామిని శాపం నుండి విముక్తి కోసం పూజించాడు. ఇక్కడ పవిత్ర జలాలన్నీ ప్రవహించేలా చేయడం ద్వారా భగవంతుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. 

ఈ నీటిలో స్నానం చేసి చంద్రుడిని పూజించడం ద్వారా తన శాపం నుండి విముక్తి పొందాడు. 

అన్ని జలాలు ఈ ప్రదేశంలోనే ఉండాలని భగవంతుడు కోరాడు. అన్ని జలాలు ఐక్యమై ఒకే చోట ఉండటం వల్ల దీనికి 'సర్వ తీర్థం' అని పేరు వచ్చింది, మరియు చంద్రుడు తన శాపం నుండి విముక్తి పొందడం వల్ల దీనికి 'చంద్ర పుష్కరిణి' అనే పేరు కూడా వచ్చింది. 

ఇప్పుడు దీనిని 'చిత్రకులం' అని పిలుస్తారు.


💠 ప్రధాన గర్భగుడిలో, ఆది కేశవ పెరుమాళ్ నిలబడిన భంగిమలో కనిపిస్తాడు. శ్రీదేవి, భూదేవి ఆయన దగ్గర లేరు.  ప్రాకారంలో శ్రీరాముడు, చక్రతాళ్వారు, ఆండాళ్, వీర ఆంజనేయరులకు గర్భాలయాలు అందుబాటులో ఉన్నాయి. 


💠 మయూరవల్లి దేవతను బిల్వ ఆకులతో పూజిస్తారు , వీటిని శివాలయాలలో మాత్రమే ఉపయోగిస్తారు . 

మయూరవల్లి రూపంలో శివుడు, పార్వతి మరియు లక్ష్మి ఆది కేశవ పెరుమాళ్‌ను పూజించి వారి శాపాల నుండి విముక్తి పొందారని నమ్ముతారు. 


💠 ఈ ఆలయ ఊరేగింపు ఏకాదశి రోజు, తిరువోణం, పౌర్ణమి మరియు అమావాస్య సందర్భాలలో జరుగుతుంది , ఆ సమయంలో ఆదికేశవ, శ్రీదేవి మరియు భూదేవి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళతారు.


💠 ఆలయం యొక్క ప్రధాన పండుగ అయిన బ్రహ్మోత్సవం తమిళ మాసం పంగునిలో నిర్వహిస్తారు. 

10 రోజుల పండుగ సమయంలో, 12 మంది ఆళ్వార్లు మరియు 21 వైష్ణవ ఆచార్యులను ఆదికేశవ పెరుమాళ్ తో పాటు ఊరేగింపుగా తీసుకువెళతారు. తమిళ మాసం ఆదిలో తెప్పోత్సవం 5 రోజులు నిర్వహిస్తారు.


రచన 


©️ Santosh Kumar

సుభాషితమ్

  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


        శ్లో𝕝𝕝  *తృణం భుక్త్వాపి పశవః*

                *యచ్ఛన్తి మధురం పయః* l

                *కామదాః కర్షకాణాం చ*

                *పశవః మమ దేవతాః* ll


     *_𝕝𝕝ॐ𝕝𝕝  - కనుమ - గో - వృషభ పూజ 𝕝𝕝卐𝕝𝕝_*


తా𝕝𝕝 *గడ్డి తింటున్నప్పటికీ మధురమైన పాలని ఇచ్చు, రైతులకు ఆనందాన్ని కలిగించి... వారికి కామధేనువుల్లా కోరిన కోర్కెలను అనుగ్రహించే పశువులు.... దైవసమానములు*.


          🪁 *కనుమ శుభాకాంక్షలు* 🪁


✍️💐🌹🌸🙏

నక్షత్రం*_ *విశాఖ* (Vishakha)

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 16 వ రోజు*. 


*నక్షత్రం*_ *విశాఖ* (Vishakha)


*అధిపతి*_ *గురువు* (Jupiter)


*ఆరాధించాల్సిన దైవం. ఇంద్రాగ్నులు / దత్తాత్రేయ స్వామి /దక్షిణామూర్తి*


*విశాఖ నక్షత్ర జాతకులు, విద్యార్థులు మరియు వృత్తిలో ఉన్నత స్థాయిని కోరుకునే వారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.*


🙏*గురు గ్రహ పంచరత్న స్తోత్రం*🙏


*దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభమ్* ।

*బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్* ॥ 1 ॥


*వరాక్షమాలాం దండం చ కమండలధరం విభుమ్* । 

*పుష్యరాగాంకితం పీతం వరదాం భావయేత్ గురుమ్* ॥ 2 ॥


*అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితమ్* । 

*సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా* ॥ 3 ॥


*ఆంగీరసాబ్దసంజాత అంగీరస కులోద్భవః*। 

*ఇంద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః* ॥ 4 ॥


*బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః* । 

*చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్* ॥ 5 ॥


🙏 దేవగురు శ్రీ బృహస్పతయే నమః 🙏


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

శ్రీహరి స్తుతి 38*

 *శ్రీహరి స్తుతి 38*


*ఎంతో కష్టం బున్నను* 

*చింతింపక స్మరణ చేయు శ్రీహరి యంచున్* 

 *కొంతైనను శాంతి దొరకు*

*సంతోషంబును కలుగును స్వస్థత కూర్చున్* 

*శ్రీహరి స్తుతి 37* 


*కం.నరసింహుడు కరుణించిన* 

*నరులకు సంపదలు కలుగు నరకము తప్పున్*

*జరుగును శుభ కార్యంబులు* 

*ధరణంతయు సంతసంబు తప్పక దొరుకున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సమాజ ధర్మము*

 *సంస్థలు - సమాజ ధర్మము*




భగవంతుడు మనిషితో బాటు జీవులన్నిటికి శరీరము ఇచ్చినప్పటికీ, ఇతర జీవులకు లేని *వివేకము* అను గొప్ప గుణమును *మనుష్యులకు మాత్రమే* ఇచ్చాడు. 


ఏ విషయంలోనైనా *విజయం* సాధించాలంటే, మొదట చేసే ఆ పనిని *అభిమానించాలి, ప్రేమించాలి*. దీక్షగా *పరుల కోసం* చేసే పని చిన్నదైనా, పెద్దదైనా అది చేసే వారిలోని అంతః శక్తిని మేల్కొల్పుతుంది. కాని, చేసే వారిలో *నిజాయితి* ఉండాలి. 


మనం గొప్ప వాళ్ళం కాకపోయినా, మనం చేసే పనులు గొప్పవైతే అవే మనను సమాజంలో *గొప్పవాడిగా* నిలబెడతాయి. 


చిన్న సూక్తి పరిశీలిద్దాము..

*పురుషకార్య మనువర్తతే దైవమ్* అంటే దైవం పురుష ప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే విషయమేదయినా (మంచి) పురుష ప్రయత్ననం చేస్తే *దైవం కూడా దానంతట అదే* తోడ్పడతుంది. కాని, చేసేవారు *నిజాయితీగా* ఉండాలి. 


సహాయ, సహకార, సాంస్కృతిక సంస్థలన్ని *సాంఘిక, సామాజిక, నిర్మాణాత్మక, ఆధ్యాత్మిక, వేదాంతం లాంటి విశేశాంశములకు సన్నిహితంగా ఉండాలి* . తార్కిక, రాజకీయ అంశములకు దూరంగా ఉండాలి.


*పరివర్తనలేని* సమాజము ఎలా ఉంటుందంటే బ్రతికి ఉన్నన్ని రోజులు *అవసరానికి మించిన* ధన, ధాన్య, సంపదలకై పెనుగులాట, *ఆయువు తీరినాక* ఆరడుగులకై వెతుకులాట. 


*నిజాయితి అనేది వ్యక్తులు తమకు తాముగా మల్చుకున్న ఒక విలువైన, అమూల్యమైన అలవాటు*. బాధ్యతలను చిన్న చూపు చూసే వాళ్ళ వద్ద, బాధ్యతలను విస్మరించే వాళ్ళ వద్ద *నిజాయితిని* ఆశించలేము. 


మనం మంచి పనులు చేద్దాము. మనకు *అవకాశాలు, శక్తి లేనప్పుడు*, మంచి పనులు చేసే వాళ్ళను అభినందిద్దాము, అనుసరిద్దాము. 


పెద్దలు చెప్పిన మాట 

*స్తోత్రం కస్యన తుష్టయే*

పొగడ్త ఎవ్వరిని సంతోష పెట్టదు, అంటే దేవుళ్లతో సహా అందరిని సంతోష పెడ్తుంది. 


*మనస్సుకు హత్తుకునే రచనలు, సమాజము మెచ్చే కార్యాలుంటాయి*. మంచి పనులు చేసిన వారిని అభినందించుట, మెచ్చుకునుట, ప్రోత్సహించుట అనగా *భగవంతుడు మనుష్యులకిచ్చిన మాటను పునీతము చేసుకునుటయే* . ప్రశంస తోటివారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. *మనలో లేని గొప్పతనం అవతలి వారిలో ఉందని నిరాశ చెందగూడదు*. ప్రతి ఒక్కరిలో ఉండే సంస్కారము, సౌమ్యత మేళవించిన భావప్రకటనల వలన సమాజమే రంజిస్తుంది.


*నేను ఒక్కడిని ఏమిచేయగలనను నిరాశ వద్దు. సంస్థలలో చేరుదాము, సంయుక్తంగా సమాజానికి సేవ చేద్దాము*


సమాజ సేవ, ధర్మ కార్యాల లాంటి మంచి కర్మలు సదా మంచి ఫలితాలనే ఇస్తాయి. *ఆ పుణ్య కర్మల ఫలితాలు ఎల్లప్పుడూ మనిషిని వెన్నంటి ఉంటాయి, శుభాలను అందిస్తూనే ఉంటాయి*.


ధన్యవాదములు.

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 16.01.2026 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష త్రయోదశి తిథి భృగు వాసర మూల నక్షత్రం ధ్రువ యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 


  


శ్రాద్ధ తిథి: త్రయోదశి


 

నమస్కారః , శుభోదయం

మూక పంచశతి

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 07*


*ఐశ్వర్యమిందు మౌళేరైకాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతం |*

*ఐందవ కిశోరశేఖరమైదంపర్యం చకాస్తి నిగమానామ్ ||*


*భావము :*


*ఈశ్వరునికే ఐశ్వర్యప్రదాత, అద్వైతజ్ఞానమును ప్రసాదించునది, సర్వ వేదముల సారమైనది, చంద్రరేఖను శిరసున ధరించినది అయిన తల్లి కాంచీపుర మధ్యములో వెలుగుచున్నది.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః ।

వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।।

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।


ప్రతిపదార్థ:


యామ్ ఇమాం — ఇవన్నీ; పుష్పితాం — ఆకర్షణీయమైన; వాచం — మాటలు; ప్రవదంతి — అంటారు; అవిపశ్చితః — పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః — వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి — వేరేది ఏదీ లేదు; ఇతి — ఈ విధంగా; వాదినః — వాదిస్తారు; కామ-ఆత్మానః — ఇంద్రియ సుఖములపై ఆసక్తితో; స్వర్గ-పరాః — స్వర్గ లోకాలని పొంద గోరి; జన్మ-కర్మ-ఫల — ఉత్తమ జన్మ, మంచి ప్రతిఫలాలు; ప్రదాం — ఇచ్చే; క్రియా-విశేష — డాంబికమైన కర్మ కాండలు; బహులాం — చాలా; భోగ — భోగములు; ఐశ్వర్య — ఐశ్వర్యములు; గతిం — పురోగతి; ప్రతి — వైపున.


  తాత్పర్యము :


 పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.


 వివరణ:


వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: కర్మ-కాండ, జ్ఞాన-కాండ, మరియు ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం మరియు స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మ-కాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు.


దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ, స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది, ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే, అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు, వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాలకోసం పాటుపడుతారు. ఈ విధంగా వారు, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించక, జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. కాబట్టి, ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితం మన్యమానాః

జంఘన్య మానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః (1.2.8)


‘స్వర్గాది లోక భోగములను అనుభవించటం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మ కాండలు ఆచరించే వారు, తమకు తామే శాస్త్ర పండితులమనుకుంటారు, కానీ నిజానికి వారు వెఱ్రివారు. గుడ్డి వారికి గుడ్డివారు దారి చూపించేవంటి వారు.’

16-01-2026 శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

16-01-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


కొన్ని వ్యవహారాలలో  ఆత్మీయులు  సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో  అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన  శ్రమ ఫలిస్తుంది.

---------------------------------------


వృషభం


చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి.

---------------------------------------


మిధునం


ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన  సమస్యలు ఉత్పన్నమౌతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమౌతుంది.

---------------------------------------


కర్కాటకం


దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


సింహం


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగమున  ఆశించిన పురోగతి సాధిస్తారు ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది.

---------------------------------------


కన్య


నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు  తొలగుతాయి.  ఉద్యోగమున  అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


తుల


దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం  తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

---------------------------------------


వృశ్చికం


వ్యాపారమున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన  సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.

---------------------------------------


ధనస్సు


బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో  సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగమున   వివాదాలు పరిష్కారమౌతాయి తొలగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన  పరిచయాలు పెరుగుతాయి.

---------------------------------------


మకరం


ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున  స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో  చిన్నపాటి విభేదాలు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


ఆర్ధికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. విందు  వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


మీనం


బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో  ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.

---------------------------------------

ముదనష్టం

 *"ముదనష్టం": తెలుగు జాతీయాలు:*


ఉట్రవుడియంగా వచ్చిపడ్డ ఆస్తిగాని సొమ్ము గాని ముదనష్టమని వ్యవహరిస్తారు.

వివరణ: ఎవరెవరో దూర బంధువులు కన్నుమూస్తే వారసత్వంగా వారి ఆస్తిపాస్తులు సంక్రమిస్తే అవి ముదనష్టపు ఆస్తులంటారు. అసలు శబ్దం 'మృతనష్ట' మనేది. మృతులు (చనిపోయినవారు) నష్టపోగా మనకు లాభంగా దొరికింది మృతనష్టమని, మనకు అలా వచ్చిపడింది కష్టార్జితంకాదు కాబట్టి దానికి గౌరవం లేదు. దాన్ని నిలుపుకోవటం కూడా కష్టమే.. దాని విలువ ఎంతో, ఎంత శ్రమఫలితమో మనకు అనుభవపూర్వకంగా తెలియదు కాబట్టి. అది అనుకోకుండా వచ్చింది. కాబట్టి అదిపోయినా కష్టఫలితం పోయినంతగా ఎవరూ దుఃఖించరు. కాబట్టి దానిమీద గౌరవభావం ఉండదు. ఒక విధంగా అది నీచ సంపాదన కింద లెక్క. అందుకే సదరు ఆస్తినేగాక దానితోబాటు సంక్రమించే బుద్ధులను కూడా నీచంగా హీనంగా పరిగణించి 'ముదనష్టపుబుద్ధి, ముదనష్టపువాడు' వగైరా తిట్లను కూడా తెలుగువారు సిద్ధంచేసి వాడుకలో ప్రవేశపెట్టారు. చివరకు ఈ మాటకు నీచం, హీనం, దీనం, తప్పుడు - వగైరా అర్థాలు వ్యవహారంలో నిలిచాయి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*


*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - త్రయోదశి - మూల -‌‌ భృగువాసరే* (16.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

  మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం  -


      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.


                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 


             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .


         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.


       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.


 రవి  -


   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.


 చంద్రుడు  -


   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .


 కుజుడు  -


    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .


 బుధుడు  -


    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .


 గురుడు  -


     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.


  శుక్రుడు  -


     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .


  శని  -


     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .


         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034