3, మార్చి 2022, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 44 జవాబులు

 

 ప్రశ్న పత్రం సంఖ్య: 44 జవాబులు

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) క్రిందిది పంచభూతాలలో లేదు

i ) నీరు 

ii ) గాలి 

iii ) పొగ 

v ) అగ్ని 

2) చందమామ రావే జాబిల్లి రావే వ్రాసింది

i ) దాశరధి రంగాచార్య

 ii ) త్యాగరాజు 

iii ) పెద్దన 

iv ) శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్య

3) భగవత్గీత వీటి సారం అంటారు 

i )పురాణాల 

 ii ) ఉపనిషతుల

 iii ) వేదాల   

iv ) సాంప్రదాయాల

4)  ఇంట గెలిచి ___ ;గెలవాలి అంటారు

i ) గచ్

ఛ ii ) ఊళ్ళో

 iii ) రచ్చ  

iv ) రచ్చబండ 

5) కావ్యేషు ---------  రమ్యం

i ) బూటకం 

ii ) ప్రబంధం  

iii )నవల  

iv ) నాటకం 

6)  180 డిగ్రీలు వున్నదానికే ________ అని పేరు

i ) లంబరేఖ 

ii ) సరళరేఖ 

iii ) ముళరేఖ 

|iv ) ఈ మూడు 

7) మనదేశంలో గృహావసరాలకు సరఫరా చేసె విద్యుత్

i )110V  ఉంటుంది 

ii ) 220V  ఉంటుంది 

 iii ) 250V  ఉంటుంది 

iv ) 300V  ఉంటుంది

8) ఇది పురాణం కాదు

i ) మార్కండేయ పురాణం 

ii ) అగ్నిపురాణం

 iii ) వరుణ పురాణం 

iv ) వాయు పురాణం 

9) అన్నదమ్ముల ఆస్తి పంపకాల వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 

i ) సివిల్ కోర్టు ,  

 ii ) క్రిమినల్ కోర్టు 

.iii ) కన్స్యూమర్ కోర్ట్ ,

iv ) ఫామిలీ కోర్టు 

10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి

i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 

11) సహధర్మచారిణి అంటే

i ) ధర్మ,అర్ధ,కామాలనే మూడు ధర్మాలను సమంగా పంచుకునేదని 

 ii ) ధర్మ,అర్ధ,కామ మోక్షాలనే  ధర్మాలను సమంగా పంచుకునేదని

iii ) అధర్మ కార్యాలను పాలుపంచుకునేది అని 

 iv ) ఆస్తిలో వాటా కోరునది అని

 12) పాలపుంత అనునది

i ) గ్రామాలలో పాల కుండను వుంచు ఉట్టి 

 ii ) గ్రామాలలో పాల కుండను వుంచు గూడు

 iii ) నక్షత్ర మండలము

iv ) రాసి చక్రము 

13) వటపత్ర సాయి అనగా

i ) మర్రి ఆకుమీద పవళించిన వాడు 

ii ) తమలపాకు మీద పవళించిన వాడు

iii ) తామర ఆకుమీద పవళించిన వాడు

iv ) జామ ఆకుమీద పవళించిన వాడు

14) జనక మహారాజు ఒక 

i ) ఆత్మవేరు పరమాత్మ వేరని నమ్మిన వాడు 

 ii ) స్థితప్రజ్ఞుడు 

 iii ) మనుషులంతా ఒకటేనని నమ్మినవాడు 

iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని తెలుసుకున్నవాడు 

15) జాతక చక్రంలో _____గదులు ఉంటాయి 

i ) తొమ్మిది 

 ii )  పది 

 iii ) పన్నెండు 

 iv ) పదహారు

16) తమలపాకులు వీటికోసం వాడరు

i ) తాంబూలంలో

 ii ) పూజలలో   

 iii ) తోరణాలలో

 iv ) పేరంటంలో

17) "దేహశుద్ది" అనునది దీనికి ఉపయోగిస్తాము   

i ) ఇతరులను కొట్టటం 

 ii ) మంచినీటితో దేహాన్నిశుద్ధి చేయటం  

 iii ) పన్నీరుతో స్నానం చేయటం

 iv ) చెరువులో స్నానం చేయటం 

18) పూర్వాకాలంలో ఇలా అనేవారు  "  కాశీకి పోయినవారు _____పోయినట్లే"

i ) కాటికి 

 ii ) ఏటికి  

iii ) హిమాలయాలకు 

iv ) ద్రాక్షారామానికి 

19)" సరళీ స్వరాలు" అనునవి

i ) సరళ పాడే స్వరాలూ 

 ii ) సంగీతంకు సంబందించినది 

 iii ) సాహిత్యానికి సంబందించినది 

 iv )  సంగీతము ఇష్టమైనది మరియు స్పష్టమైనది 

20)  లాయర్లకు మరియు డాక్టర్లకు వత్యాసం 

i ) కోటురంగు ii ) బూటు రంగు iii ) చొక్కారంగు iv ) అన్నీకూడా

 

 

శాస్త్రములకు అంతము లేదు

 శ్లోకం:☝️

*అనంతశాస్త్రం*

      *బహు వేదితవ్యం*

*స్వల్పశ్చ కాలో*

      *బహవశ్చ విఘ్నాః |*

*యత్సారభూతం*

      *తదుపాసితవ్యం*

*హంసో యథా*

      *క్షీరమివాంబుమిశ్రం ||*


భావం: శాస్త్రములకు అంతము లేదు. అంతా చదువుటకు కాలం చాలదు. జీవితము స్వల్పము, అందులో అనేక ప్రతిబంధములు. కావున, క్షీరనీరములు కలిసియుండినను నీరమును విడిచి క్షీరమును మాత్రమే గ్రహించు హంస వలే, సారమైన విషయమును మహాత్ములనుండి గ్రహించి అనుష్టించుట శ్రేష్టము.🙏

లక్షల కాపీలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*లక్షల కాపీలు అమ్ముడుపోయిన "The Sky Gets Dark Slowly" అన్న పుస్తకం గురించి యండమూరి వీరేంద్రనాథ్ వివరణ.* 

                  🌷🌷🌷

ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) "ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు" లో 'వృద్ధాప్యం లో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను.

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొక ఒకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.

అమెరికా నుంచి నీ కొడుకు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తుంది. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. వాడు చా….లా బిజీ. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు. ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.

మరేం చెయ్యాలి?

THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే. పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు. “ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.

ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు.

ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.

ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో, దుర్గంధ పూరితoగానో మారుతుంది. ఎలా మారుతుందనేది హుందాతనాల / నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.

పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు, సిగరెట్లు తగ్గించు. ఆంధ్ర తెలంగాణాల్లో లక్షకి ఐదువేల మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని అంచనా.

వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు.

ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.

“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తకంలో రచయిత. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది.

                 🌷🌷🌷

ఆయుర్వేదం - విభాగాలు .

 ఆయుర్వేదం - విభాగాలు .


  ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 


       మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన                  "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది. 


     వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని ౮ విభాగాలుగా విభజించాడు.   అవి 


 *  శల్యతంత్రము .


 *  శాలాఖ్య తంత్రము .


 *  కాయచికిత్స . 


 *  భూతవిద్య .


 *  కౌమారభృత్యము .


 *  అగధాతంత్రము .


 *  రసాయన తంత్రము.


 *  వాజీకరణ తంత్రము .


      ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.


 * శల్య తంత్రము - 


     మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .


 *  శాలాఖ్య తంత్రము  - 


    కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము. 


 *  కాయచికిత్స - 


     సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.


 *  కౌమారభృత్యము - 


     శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".


 *  అగధ తంత్రము - 


     పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.


 *  రసాయన తంత్రము - 


     యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .


 *  వాజీకరణ తంత్రము - 


      క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము . 


    

    ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను . 


     

     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034