6, జూన్ 2026, శనివారం

AI, రోబోలు అన్నీ చేసుకుపోతే

 AI, రోబోలు అన్నీ చేసుకుపోతే 2060 నాటికి మన పరిస్థితి ఏమిటి?


నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి JCB వచ్చింది.


అది చూసిన ముసలాళ్ళు అన్నారు — "ఒక్క JCB పది మంది చేసే పని చేస్తుందట. ఇక మనకు పని లేదు. అందరం చచ్చిపోవటమే." నేను అప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ JCB భయం నాకూ వచ్చింది నిజానికి.


కానీ తర్వాత ఏమైంది?


ఆ JCB ని operate చేయడానికి ఒకడు కావాలి. repair చేయడానికి మరొకడు కావాలి. oil తేవడానికి ఇంకొకడు కావాలి. రోడ్డు design చేయడానికి engineer కావాలి. రోడ్డు వేసిన తర్వాత దాని మీద vehicles పెరిగాయి. Vehicles పెరిగితే petrol bunks వచ్చాయి. Mechanics వచ్చారు. Dhabas వచ్చాయి. ఒక JCB వచ్చి పది పనులు పోగొట్టి యాభై కొత్త పనులు తెచ్చింది.


అదే తర్వాత computers విషయంలో జరిగింది.


తర్వాత computers వచ్చాయి. Typists అందరూ భయపడ్డారు. "ఇక మన ఉద్యోగాలు పోతాయి" అని నినాదాలు చేశారు. కానీ ఏమైంది? Computer operator వచ్చాడు. Hardware engineer వచ్చాడు. Software రాసే వాళ్ళు వచ్చారు. Printer repair చేసే వాళ్ళు వచ్చారు. Network connection ఇచ్చే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత భారత్ IT రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది. Typing పోయి Coding వచ్చింది.


ఇప్పుడు AI వచ్చింది. అదే భయం మళ్ళీ వచ్చింది.


కానీ చరిత్ర ఒక పాఠం నేర్పింది — technology మారిన ప్రతిసారి పని రూపం మారింది. పని పోలేదు.


రిక్షా పోయింది. Auto వచ్చింది. Auto పోతే Bike taxi వచ్చింది. మీ దగ్గర scooter ఉంటే సాయంత్రం 6 నుండి 10 గంటలు Ola, Rapido చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు వస్తాయి. హాయిగా కుటుంబం పోషించవచ్చు. ఇది AI యుగంలో కొత్త పని.


ఇప్పుడు AI గురించి నిజం చెప్తాను.


AI తెలివైనది. కానీ అది మనిషి కాదు. 99% సరైన సమాధానం ఇస్తుంది — కానీ 99% అంటే 100% కాదు. ఆ 1% తేడా కనిపెట్టడానికి మనిషి కావాలి. AI data చూస్తుంది. కానీ data వెనక మనిషి బాధ చూడలేదు. Doctor AI చెప్పిన రోగాన్ని diagnose చేస్తుంది — కానీ patient చేయి పట్టుకుని "బాగవుతావు" అని చెప్పడానికి మనిషి కావాలి.


మరి 2060 నాటికి ఏమవుతుందంటే —


AI చేయలేనివి మనిషి చేస్తాడు. అవి ఏమిటంటే — సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు. Machines ఇవి చేయలేవు. ఎందుకంటే ఇవి పుస్తకాల నుండి నేర్చుకున్నవి కాదు — జీవితం నుండి నేర్చుకున్నవి.


భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు —


"న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" — జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఇంకొకటి లేదు అని. AI information ఇస్తుంది. జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది — అనుభవం ద్వారా.


వేమన అన్నాడు —


"చదువు కొంచెమైన చాలును వివేక


మదను వానికెల్ల నభ్యుదయము


విశ్వదాభిరామ వినురవేమ"


కొంచెం చదువు, వివేకం ఉంటే చాలు — అభ్యుదయం కలుగుతుంది. AI వాడుకోవడం నేర్చుకున్న వాడికి AI శత్రువు కాదు — సహాయకుడు.


ఇప్పుడు Economics ఏమంటుందంటే —


World Economic Forum 2023 report చెప్పింది — AI వల్ల 85 million ఉద్యోగాలు పోతాయి. కానీ అదే సమయంలో 97 million కొత్త ఉద్యోగాలు వస్తాయి. Net gain — 12 million jobs. భయపడినంత కాదు.


కానీ ఒక condition ఉంది — adapt చేసుకున్న వాడికి gain. Adapt చేసుకోని వాడికి pain.


మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని తొందరగా accept చేయదు. అది JCB దగ్గర జరిగింది. Computer దగ్గర జరిగింది. AI దగ్గర మళ్ళీ జరుగుతోంది. కానీ చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది.


చివరగా ఒక్క మాట.


భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పనిచేస్తున్నాడు. పని రూపం మారింది — పని పోలేదు. 


AI ని చూసి భయపడకండి. అది నేర్చుకోండి. వాడుకోండి. మీ పని కోసం 2060 లో కూడా ఉద్యోగం ఉంటుంది — AI ఉన్నా, రోబో ఉన్నా... ✍️

పంచాంగం 06.06.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 06.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష షష్ఠి తిథి స్థిర వాసర శ్రవణం నక్షత్రం ఇంద్ర యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: షష్ఠి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।। 37 ।।



ప్రతిపదార్థ:



యథా — ఎలాగైతే; ఏధాంసి — కట్టెలను సమిధ్ధః — జ్వాలలతో; అగ్నిః — అగ్ని; భస్మ-సాత్ — భస్మముగా; కురుతే — చేయునో; అర్జున — అర్జునా; జ్ఞాన-అగ్నిః — జ్ఞానమనే అగ్ని; సర్వ-కర్మాణి — భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను; భస్మ-సాత్ — భస్మముగా; కురుతే — చేయును; తథా — అదే విధముగా.

 


 తాత్పర్యము : 



 ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.



వివరణ:


ఒక చిన్న నిప్పు తునక కూడా మహా జ్వాలగా మారి, ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేయవచ్చు. 1666 వ సంవత్సరంలో లండన్ మహానగరంలో వ్యాపించిన మంటలు (the Great Fire of London), ఒక బేకరీలో చిన్న జ్వాలగా మొదలయ్యింది, కానీ అది పెరుగుతూ, చివరికి 13,200 ఇండ్లు, 87 చర్చిలు మరియు చాలమటుకు నగరంలోని కార్యాలయాలను కాల్చివేసింది.


మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య,పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు, అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధము తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీస్కువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 03*


*మరాళీనాం యానాభ్యసనకలనామూలగురవే*

*దరిద్రాణాం త్రాణవ్యతికరసురోద్యానతరవే।* 

*తమస్కాండప్రౌఢిప్రకటనతిరస్కారపటవే* 

*జనోయం కామాక్ష్యాశ్చరణనలినాయ స్పృహయతే||*


*భావము :*


*జగన్మాతా! నీ పాదములు ఆడు నెమళ్లకు నడకలు నేర్పిన గురువులు. దీనులకు కల్పతరువులు నీ పాదములు. తిమిరాంధకారమును తరిమివేయగలవి నీ పాదములు. ఆ పాద పద్మములను గూర్చి నాకు ఎరుక పరచవా తల్లీ!*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

06-06-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.  

---------------------------------------


వృషభం


నూతన ఋణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మండకొడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. 

---------------------------------------


మిధునం


ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

---------------------------------------


కర్కాటకం


దాయాదులతో భూ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. 

---------------------------------------


సింహం


ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.

---------------------------------------


కన్య


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు.

---------------------------------------


తుల


సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు.  

---------------------------------------


వృశ్చికం


నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


ధనస్సు


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------


మకరం


ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కుంభం


ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి. 

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

---------------------------------------

చెవి పోటు cB

 చెవి పోటు


 మనము అప్పుడప్పుడు చెవిపోటుతో బాధపడుతూ ఉండటం సర్వసాధారణం.


ముఖ్యంగా చిన్నపిల్లలకి చెవిపోటు రావడం సర్వసాధారణం

ఇంకా విశేషాలు ఏంటంటే కొన్నిసార్లు రాత్రిపూట చెవిపోటుతో బాధపడుతుంటారు.


ఆ సమయంలో హాస్పటల్ కు తీసుకుని పోవటం కూడా చాలా కష్టం అవుతుంది.


 చెవి పోవుటకు ఇంట్లో దొరికే చిన్న చిట్కా చెప్తాను.


ముందుగా ఒక చిన్న గిన్నెలో మూడు నాలుగు చెంచాల నూనె, పల్లీ నూనె కానీ లేక నువ్వుల కానీ తీసుకోండి.


దానిలో ఒక రెండు మూడు వెల్లిపాయ రెబ్బలు దంచి కాగ పెట్టండి.


వెల్లిపాయలోనే తేమ మొత్తం ఇంకిపోయి ఎర్ర పడ్డదాకా ఉంచి, చిటపటలాడంగానే తీసి చల్లార్చండి.


చల్లార్చిన తర్వాత వడగట్టి ఆ నునేను ఒక చిన్న సీసాలో భద్రపరచుకోండి.


 చెవి పోటు ఉన్న చెవిలో ఒకటి రెండు చుక్కలు వేయండి.


చెవి పోటు మాయం.


ఒక్కొక్కప్పుడు సన్న దోమ లాంటివి కూడా చెవిలో దూరి బాధ పెడుతూ ఉంటాయి.


 వాటికి కూడా ఈ నూనెను వాడవచ్చు.


ఇంకా మనకు ఎక్కడైనా నొప్పులు ఉంటే అక్కడ ఇ ను నేను మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి.


మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం 


మీ 


చేరువేల భార్గవ శర్మ