9, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఎవరు గొప్ప,

 ""ఎవరు గొప్ప,

సర్వేజనా సుఖినోభవంతు ""



*🙏సూర్యుడు చెప్పిన మంచి మాటలు (కథ)...!!*



🌸 ఒకసారి వరుణ దేవుడికి, వాయు దేవుడికి తగాదా వచ్చింది. ‘నేను గొప్ప’ అంటే ‘నేను గొప్ప’ అనుకున్నారు. ఇద్దరిలో ఎవరైతే ప్రజల్ని బాగా ఏడిపిస్తారో వాళ్ళే గొప్ప అని రెండోవారు అంగీకరించాలని నిర్ణయించుకున్నారు.   


🌿తరువాత రోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పు వచ్చింది. జల్లులుగా మొదలైన వాన ధారలుగా మారి, కుంభవృష్టి కురిసింది. ఏకంగా వారం రోజులు వానలే వానలు. 

భూమ్మీద పండిన పంటలన్నీ నీట మునిగాయి.  


🌸ఏడాది కష్టం గంగపాలయ్యేసరికి రైతులు ఏడ్చారు. పేదల గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి. గోడలు కూలిపోయి మట్టిపెళ్లల క్రింద నలిగి కొందరు చనిపోయారు. పశువులు, జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. 


🌿పక్షులు చలికి వణికిపోయి బిక్కుబిక్కుమన్నాయి. నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు నిండుకుండను తలపించాయి. రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. 


🌸 సూర్యుడి వెలుగు కనబడి వారమయ్యేసరికి అల్లాడిపోయారు ప్రజలు. వానలను ఆపమని వాన దేవుడిని ఎన్నో విధాలుగా వేడుకున్నారు ప్రజలు. ప్రజల మొర ఆలకించిన వానదేవుడు నెమ్మదించాడు.  


🌿వెంటనే వాయు దేవుడిని కలుసుకుని “నా ప్రతాపం చూసావు కదా. ఇప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా?” అనడిగాడు.  


🌸వాయు దేవుడు “నువ్వు వారం రోజులు కురిస్తే ప్రజలు నిన్ను వేడుకున్నారు. నా ప్రతాపం చూసాక మాట్లాడు“ అని జవాబిచ్చాడు. సరే అన్నాడు వరుణ దేవుడు.  


🌿 మరుక్షణం నుండి భూమి మీద విపరీతమైన సుడిగాలి వీచింది. దుమ్ము ధూళి గాలిలో కలసిపోయి ఏమీ కనబడలేదు. పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆరుబయటున్న వస్తువులు గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడ్డాయి. మనుషుల్ని కూడా అంతెత్తుకు ఈడ్చుకుపోయి క్రింద పడేయడంతో చాలామంది చనిపోయారు. చెట్లెన్నో విరిగి పడ్డాయి. జంతువులు కూడా బెదురుతూ పరుగులు తీశాయి. 


🌸దొడ్లో కట్టిన పశువులు కూడా మెడకు కట్టిన తాళ్లను తెంపుకుని ఎటో వెళ్లిపోయాయి . లోకమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. 

 జనం ఎంతగానో భయపడ్డారు. వాయు దేవుడిని శాంతించమని ప్రార్ధించారు. వాయు దేవుడు సంతోషించి ఉపశమించాడు.


🌿తరువాత వరుణ దేవుడిని కలుసుకుని “ ఒక్కరోజు నేను చూపించిన ప్రతాపానికే దిక్కు తోచక అల్లాడిపోయారు భూలోకవాసులు. ఇంకా ఎక్కువ రోజులైతే ఏం జరిగేదో వూహించు” అన్నాడు గర్వంగా. 


🌸“నిజమే! నువ్వే గొప్ప” అని వాన దేవుడు అంటుండగా “కాదు” అని వినిపించింది. ఆకాశ మార్గంలో మాట్లాడుతున్న తమకి అడ్డు చెబుతున్నది ఎవరా అని చూసారు ఇద్దరూ. ఎదురుగా సూర్యభగవానుడు కనిపించాడు. 


🌿 “అంటే నా గొప్పతనం అంగీకరించడం లేదా?” అని వాయు దేవుడు అడిగాడు. సూర్యుడు “ఇందులో గొప్పతనం చెప్పడానికి ఏముంది? నేను విపరీతమైన తేజస్సుతో రోజంతా ప్రకాశిస్తే నాకూ భయపడతారు మానవులు. 


🌸మనమున్నది ప్రజలకు మేలు చేయడానికి. ఆ విషయం మరచిపోయి మీరు చేసిందేమిటి? ప్రజల ఉసురు పోసుకున్నారు. ఒకరేమో వారం రోజలు వరుసగా కుంభవృష్టి కురిపిస్తే ,


🌿 మరొకరు తీవ్రగాలులతో భయపెట్టారు. ఇది మీకు తగునా? “ అనడిగాడు సూర్యుడు. 

“మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి అలా చేసాము“ అన్నాడు వరుణ దేవుడు. 


🌸“మీలో ఎవరు గొప్పో తెలచడానికి ఇంద్రుడినో, ఋషులనో అడగాలి కానీ ప్రజలను బాధపెట్టవచ్చా?” అని అడిగాడు సూర్యుడు.  

“అది తప్పెలా అవుతుంది?” ఎదురు ప్రశ్నించారు ఇద్దరూ. 


🌿“ముమ్మాటికీ తప్పే. మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు చేసారు. వారికి దిక్కుతోచక మిమ్మల్ని ప్రార్ధించారు. అలా కాకుండా మన మీద భక్తితో , గౌరవంతో పూజించేలా పరిపాలించాలి” అన్నాడు సూర్యుడు. 


🌸“అదెలాగో వివరించు సూర్యదేవా?”అని వరుణ దేవుడు, వాయు దేవుడు అడగడంతో సూర్యుడు ఇలా చెప్పాడు.  


🌿“వర్షాకాలంలో సమృద్ధిగా వానలను కురిపించాలి వరుణ దేవుడు. నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా అవసరమైన చోటల్లా వానలు కురవాలి. అప్పుడే ప్రజలకు దేవుడిలా కనబడతాడు వరుణ దేవుడుని . మనస్ఫూర్తిగా మొక్కుతారు మానవులు. 


🌸 ఇక వాయు దేవుడి విషయానికి వస్తే ఎండలు పెరిగి వేడి ఎక్కువైనప్పుడు చల్లని గాలిని పంచాలి. అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఉక్కపోత నుండి రక్షించాలి. వేసవి కాలంలో ప్రజలకు దగ్గరగా మెలుగుతూ, శీతాకాలంలో అంటీముట్టనట్టు, వర్షాకాలంలో అవసరమైన చోటుకి మేఘాలను మోసుకువెళుతూ ప్రజల మెప్పు పొందాలి.  


🌿అప్పుడే వాయు దేవుడిని భక్తితో కొలుస్తారు. మీరిద్దరూ భూమాతని ఆదర్శంగా తీసుకుని మీ విధులు నిర్వర్తించండి. ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు” అన్నాడు. 


🌸“మీ మాటలతో ఏకీభవిస్తున్నాము. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము” అని చెప్పి వెళ్లిపోయారు వరుణ దేవుడు, వాయు దేవుడు... 

🕉️🕉️🕉️

మానవ స్వభావం విచిత్రంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటూ అసూయతో మనిషి కుంగిపోతాడు. దురాశతో లోభిగా మారి వ్యధ చెందుతాడు. అహంకారంతో ఆత్మీయులతో విరోధం పెంచుకుని చివరి దశలో ఒంటరివాడై విలపిస్తాడు. అసత్యాలతో విజయం సాధిద్దామనుకుని భంగపడతాడు. సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలు సృష్టించుకుంటాడు. సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుని తన గొయ్యి తానే తవ్వుకుంటాడు. పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు, సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుడి కృపతో కష్టాల కడలిని దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేటికాలంలో అందుకు భిన్నంగా అధర్మవర్తనులైనవారు సమస్యల వలయంలో చిక్కుకుని కాలగర్భంలో కలిసిపోతున్నారు.🙏

జ్ఞానదాయియని సరస్వతి!!

 జ్ఞానదాయియని సరస్వతి!!


సీ:చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే

       సిందూరతిలకంబుచెమ్మగిల్ల,

అవతంస కుసుమంబునందున్నయెలదేటి

     ఋతికించిదంచిత శ్రుతులనీన,

ఘనమైనరారాపు చనుదోయిరాయిడి

  తుంబీఫలంబు తుందుడుకులీన,

తరుణాంగుళిఛ్ఛాయ దంతపుసరికట్టు

      లింగిలీకపు వింత రంగులీన,

గీ: ఉపనిషత్తులుబోటులైయోలగింప

    పుండరీకాసనమునగూర్చుండిమదికి

   నించువేడుకవీణవాయించు చెలువ

   నలువరాణి! మదాత్మలో నిలచుగాక!

     -అల్లసాని పెద్దన-మనుచరిత్రము.

వేణుగానం

 శు భో ద యం 🙏


వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మత్తకోకిల మనోహరరావాలు!!

 శు  భో  ద  యం 🙏



మత్తకోకిల మనోహరరావాలు!!

     నన్నెచోడుని కుమారసంభవమొక అద్భుత కావ్యం!వర్ణనా ప్రియుడైన నన్నెచోడుడు

మనోహరమైనవసంతశోభనువివరిస్తూ ,మత్తకోకిలను వర్ణించారు మక్తకోకిలలోనే

దానిసొగసులు చమత్కారాలు ఉపద్రష్టవారి మాటల్లో విందాం.


        నమస్సులాచార్యా! 🕉🙏🌹అందంగా ఆకృతినొందిన అక్షరప్రసూనాలివి. 

ఆసక్తి ఉన్న వేదిక మిత్రులకు ఓ రెండు ముక్కలు: 


ఈ వృత్తాన్ని నన్నెచోడుడు తన కుమారసంభవములో *ముద్రాలంకారముతో* వాడిన సందర్భం ఒకటి గుర్తుకొస్తోంది: ఇదిగో ఆ పద్యము –


"మెత్త మెత్తన క్రాలు దీవు స-మీరణుండ, మనోభవుం

డెత్తకుండఁగ వేగకూడఁగ – నెత్తు, మెత్తక తక్కినన్

జత్తు సుమ్ము వసంతుచే నని – చాటునట్లు చెలంగె నా

మత్తకోకిల లారమిం గడు – మాసరంబగు నామనిన్"


అందమైన ఆమనివేళట! ఆ వేళ ఆ తోటలోనున్న మత్తకోకిలలు “ఓ సమీరమా! నీవేమో మెత్తమెత్తగా (మెల్లమెల్లగా) వీస్తున్నావు. మారుడు నీమీద దండయాత్ర చేయకముందే, నువ్వే త్వరగా వాడిమీద దండెత్తు, అలా చేయకపోతే వసంతుని చేత చస్తావు. జాగ్రత్త సుమా” అని హెచ్చరిక చేసినట్లుగా ధ్వనులు చేశాయిట. 


సంస్కృతములో ఈ వృత్తములో వ్రాయబడిన పద్యాలలో ఒకటి బాగా ప్రసిద్ధి చెంది, మన నాలుకలమీద నిత్యం నాట్యం చేసే  చంద్రశేఖరాష్టకం. అందులో ఒకటి: 


"రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం

శింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం

క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం

చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమ

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం"


అలాగే - మహానుభావుడు లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతము నుండి మత్తకోకిల వృత్తంలో ఒక చక్కని ఉదాహరణ: 


"పల్లవారుణ పాణిపంకజ – సంగి వేణురవాకులం

ఫుల్ల పాటల పాటలలీ పరి-వాది పాద సరోరుహం

ఉల్లసన్మధురాధరద్యుతి – మంజరీ సరసాననం

వల్లవీ కుచకుంభ కుంకుమ – పంకిలం ప్రభు మాశ్రయే"


ఈ అందమైన వృత్తం ఎందరు మహానుభావుల్ని ప్రభావితం చేసిందో!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పోతనగారి అక్షరచిత్రం!

 పోతనగారి అక్షరచిత్రం!


అటగాంచెన్ గరిణీవిభుండు

నవఫుల్లాంభోజకల్హారమున్,

నటదిందీవరవారమున్ గమఠమీనగ్రాహ

దుర్వారమున్

వటహింతాల రసాలసాలసుమనోవల్లీ

కుటీతీరమున్

చటులోధ్ధూత మరాళచక్రబక

సంచారంబుఁ గాసారమున్.

 -పోతనకవీంద్రుడు-గజేంద్రమోక్షము.

     దప్పిఁగొన్నగజేంద్రుడు నిజపరివారముతో  నీటివసతికై అడవిలో వెదకుచు తుదకొక చక్కని

సరోవరమును గాంచినాడు.

           

ఇదీ అసలు విషయము.


దీనిని మనకళ్ళకు గట్టింప మనోహరమైన వర్ణచిత్రమును చిత్రించుచున్నాడు.పోతన.

    

ఈపద్యమున నించుక నతిశయోక్తిని

జోడించి సరోవర స్వరూపమును స్వభావోక్తి సుందరముగా తీర్చిదిద్దినాడు.

కవులు స్వర్ణకారులు (సు+వర్ణ-వర్ణమనగా అక్షరము)వారిలో లోపనితనమెరిగిన సువర్ణచిత్రకారుడు పోతన.

      అటగాంచెన్కరణీవిభుండు,అను పద్యమును క్రియాపద,సహిత కర్తృపదముతో

ప్రారంభించి పిదపవరువసగా విశేషణములనుజోడించుచు,చినరకు

కాసారమున్ అని విషయమును ముగించినాడు.

   ఈవర్ణనమున కాసార భౌతిక సుందర

స్వరూప సందర్శనమును గావించినతీరు మెచ్చదగియున్నది.

      1నవఫుల్లాంభోజకల్హారము,-అప్పుడేవికసించిన పద్మములు ,ఎఱ్ఱకలువలు కలది.

2నటదిందీవరవారమున్-విరిసిన ఆజలజములపై ముసరుతున్నతుమ్మెదలబారులు.

3కమఠమీనగ్రాహదుర్వారమున్-తాబేళ్ళు,సొఱచేపలు,మొసళ్ళు మొదలగువానినలన ప్రవేసింపనలవిగానిది .

4 వట హింతాలతమాలతాల సుమనోవల్లీ కుటీతీరమున్-మఱ్ఱి,మద్దీ,మామిడీ,తాపించములు, మొన్నగువృక్షములకు పెనవేసికొనిన పూలతీవెల పొదలుకలిగినది.

5.చటులుధ్ధూత మరాళ చక్ర బక సంచారంబు-చయ్సన నొక్కపెట్టున

నెగురుచున్న,హంస, చక్రవాక,బకాది పక్షిసముదాయముగలది.

  

 దిదృక్షారతులకు ముందుగా గానవచ్చునది పద్మశోభ.పిదప తుమ్మెదలరొద,తరువాత ఆలోచింపజేయునది దాని ప్రవేశార్హత.

ఆపైదానిపరిసరములయందము.

చినరిగా పక్షుల అలజడి.


         ఈతీరున సుమనో మనోహరముగా  వర్ణనలను నిర్వహించుట అపురూపము.

ఈసుందర దృశ్యమును బమ్మెరవారు ఆలోచనాలోచనాలతో

తొలుతతాముదర్శించి పిదపభావుకులైన పాఠకులకు ప్రదర్శనమొనరించినారు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మాఘ పురాణం - 11 వ*_

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷ఆదివారం 9 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 11 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


  *భీముని ఏకాదశివ్రతము*


☘☘☘☘☘☘☘☘☘


సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని , నదిలేనిచోట తటాకమందుగాని , తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు , తపశ్శాలురు , దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.


అతడు చిన్నతనములో గడుసరి , పెంకివాడు , అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను , తనకున్న ధనమును తాను తినడు , ఇతరులకు పెట్టడు , ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. *"అయ్యో ! నేనెంతటి పాత్ముడనైతిని ధనము , శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా"* అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా ! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ , బంగారమూ యెత్తుకొని పోయిరి.


అనంతుడు నిద్రనుండి లేచి చూడగా , అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ *'నారాయణా'* అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను , అని వశిష్టుడు తెలియజేసెను.


పాండవులలో ద్వితీయుడు భీముడు.  అతడు మహాబలుడు , భోజనప్రియుడు , ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా ! *"ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా ! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా ! అని విచారించి , తన పురోహితుని కడకు బోయి , ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి"* , అని భీముడు అడిగెను.


అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు *"అవును భీమసేనా ! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక , అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును"* అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని , *"విప్రోత్తమా ! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా ! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను , కనుక , ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున , ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము"* , అని భీముడు పలికెను.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి *"రాజా ! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు , కాన , నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది , దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు ఇరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన , ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన , ఓ భీమ సేనా ! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము , దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు , నియమము తప్పకూడదు"* అని వివరించెను.


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని *"భీమ ఏకాదశి"* అని పిలుతురు. అంతియేగాక , ఓ దిలీప మహారాజా ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో , అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా , శివచతుర్దశి. దీనినే *'శివరాత్రీ యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే "మహాశివరాత్రి"* అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని , తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి , అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ , అవన్నియు వెంటనే హరించిపోయి , కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక , అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.


మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట , జంతువులను చంపి , వానిని కాల్చి , తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు. క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి , అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ , పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట , తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.


జరామరణములకు హెచ్చుతగ్గులుగాని , శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే , మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు - పార్వతి , గణపతి , కుమారస్వామి , తుంబుర , నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి , ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు , *"మహేశా ! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా , ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి , క్రూరుడు , దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని , చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా"* అని యముడు విన్నవించుకున్నాడు. *"యమధర్మరాజా ! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న ఈ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక , ఈ బోయవాడు పాపాత్ముడైనను , ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది"* అని పరమేశ్వరుడు వివరించెను.


*మాఘపురాణం పదకొండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఆదివారం🌞* *🌹09, ఫిబ్రవరి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

       *🌞ఆదివారం🌞*

*🌹09, ఫిబ్రవరి, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*            


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - శుక్లపక్షం*


*తిథి       : ద్వాదశి* రా 07.25 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 05.53 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం  : విష్కుంబ* మ 12.07 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : బవ* ఉ 07.47 *బాలువ* రా 07.25 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 12.00 మ 02.30 - 04.30*

అమృత కాలం  : *ఉ 07.58  - 09.34*

అభిజిత్ కాలం  :  *ప 11.59 - 12.45*

*వర్జ్యం              : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : సా 04.35 - 05.22*

*రాహు కాలం   : సా 04.41 - 06.08*

గుళికకాళం       : *మ 03.15 - 04.41*

యమగండం    : *మ 12.22 - 01.48*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.36* 

సూర్యాస్తమయం *సా 06.08*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.36 - 08.54*

సంగవ కాలం         :      *08.54 - 11.13*

మధ్యాహ్న కాలం    :      *11.13 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.49*

*ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.49 - 06.08*

ప్రదోష కాలం         :  *సా 06.08 - 08.37*

రాత్రి కాలం            :  *రా 08.37 - 11.57*

నిశీధి కాలం          :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.56 - 05.46*

_________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      *🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*


*ఆర్యాః సాంబపురే సప్త ఆకాశాత్పతితా భువి*

*యస్య కంఠే గృహే వాపి న స లక్ష్మ్యా వియుజ్యతే*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

 _*🔱మాఘ పురాణం🌄 - 11 వ అధ్యాయము*_


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*భీముని ఏకాదశివ్రతము*


*🌅🛕📚TVBC📚🛕🌅*

***************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని , నదిలేనిచోట తటాకమందుగాని , తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు , తపశ్శాలురు , దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.


అతడు చిన్నతనములో గడుసరి , పెంకివాడు , అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను , తనకున్న ధనమును తాను తినడు , ఇతరులకు పెట్టడు , ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. *"అయ్యో ! నేనెంతటి పాత్ముడనైతిని ధనము , శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా"* అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా ! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ , బంగారమూ యెత్తుకొని పోయిరి.


అనంతుడు నిద్రనుండి లేచి చూడగా , అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ *'నారాయణా'* అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను , అని వశిష్టుడు తెలియజేసెను.


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🪀📖courtesy by📲🙏*.

•••••••••••••••••••••••••••••

*🛕卐ॐ•TVBC•ॐ卐🪔*


పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు , భోజనప్రియుడు , ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా ! *"ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా ! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా ! అని విచారించి , తన పురోహితుని కడకు బోయి , ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి"* , అని భీముడు అడిగెను.


అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు *"అవును భీమసేనా ! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక , అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును"* అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని , *"విప్రోత్తమా ! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా ! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను , కనుక , ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున , ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము"* , అని భీముడు పలికెను.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి *"రాజా ! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు , కాన , నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది , దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు ఇరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన , ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన , ఓ భీమ సేనా ! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము , దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు , నియమము తప్పకూడదు"* అని వివరించెను.


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని *"భీమ ఏకాదశి"* అని పిలుతురు. అంతియేగాక , ఓ దిలీప మహారాజా ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో , అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా , శివచతుర్దశి. దీనినే *'శివరాత్రీ యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే "మహాశివరాత్రి"* అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని , తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి , అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ , అవన్నియు వెంటనే హరించిపోయి , కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక , అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.


*⛳🛕ॐ•TVBC•卐🛕⛳*

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట , జంతువులను చంపి , వానిని కాల్చి , తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి , అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ , పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట , తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.


జరామరణములకు హెచ్చుతగ్గులుగాని , శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే , మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు - పార్వతి , గణపతి , కుమారస్వామి , తుంబుర , నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి , ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు , *"మహేశా ! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా , ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి , క్రూరుడు , దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని , చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా"* అని యముడు విన్నవించుకున్నాడు. *"యమధర్మరాజా ! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న ఈ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక , ఈ బోయవాడు పాపాత్ముడైనను , ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది"* అని పరమేశ్వరుదు వివరించెను.

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*


*🌈స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః*

     *🌎గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం *🪐లోకాఃసమస్తాఃసుఖినోభవంతు*||*

🕉️🌎🕉️🌎🕉️🌎🕉️

*🌈సర్వేజనాః సుఖినోభవంతు*

🙏🌼🙏🌼🙏🌼🙏

*శుభమ్ భూయాత్*

కేరళ : అలువా, ఎర్నాకులం

 🕉 మన గుడి : నెం 1015


⚜ కేరళ  : అలువా, ఎర్నాకులం 


⚜ తిరువలూరు మహాదేవ ఆలయం



💠 తిరువళ్లూరు మహాదేవ ఆలయం ఎర్నాకులంలోని అలంగాడ్ గ్రామంలో ఉంది.


💠 తిరువళ్లూరు మహాదేవ ఆలయంలోని విగ్రహం అగ్నిప్రతిష్ట అని నమ్ముతారు, అంటే శివుని మూడవ కన్ను ద్వారా ఏర్పడింది. 

శివుడు తన భార్య పార్వతి లేకుండా తూర్పు ముఖంగా రౌద్ర భవంలో ఉన్నాడు. 


💠 ఆలయంలోని ప్రతిష్ట అగ్నిత్వ శివలింగం కాబట్టి ఆలయంలో అభిషేకం  ఉండదు. ఆలయంలో పార్వతీ దేవి ఉగ్రరూపంలో పూజలందుకుంటుంది.


💠 ఆలయానికి తూర్పున శ్రీకోవిల్‌లో విగ్రహానికి అనుగుణంగా ఒక చెరువు ఉంది. విగ్రహం నుండి వెలువడే అగ్ని ప్రజలకు హాని కలిగిస్తుందని నమ్ముతారు. 

దీని ప్రభావం తగ్గేందుకు చెరువును నిర్మించారు

 శివుని మూడవ కన్ను నుండి వెలువడే అగ్ని ప్రభావాన్ని చెరువు నీరు చల్లబరుస్తుందని నమ్ముతారు. 

చెరువు శ్రీకోవిల్‌కు అనుగుణంగా ఉంది.


💠 ఆలయంలో పూజించబడే ఇతర విగ్రహం గణపతి. విష్ణువు, భగవతి, నాగుల విగ్రహాలు ఉన్నాయి. రుద్రాక్షలతో నిండిన రుద్రాక్ష చెట్టు ఉంది.


💠 ఇక్కడి ఆలయంలో  సాయంత్రం దీపారాధన, దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.



🔆 స్థల పురాణం 


💠 తిరువళ్లూరు మహాదేవ ఆలయంలో సాయంత్రం పూజ మరియు దర్శనం (దీపారాధన) చేయకపోతే 14 వ రోజున చనిపోతాడని ప్రసిద్ధ తాంత్రికుడైన సూర్యకళాడి భట్టతిరిపాడ్ ఒక యక్షి మరియు గంధర్వులచే శపించబడ్డాడని పురాణాలు చెబుతున్నాయి .


💠 తిరువళ్లూరు మహాదేవ ఆలయంలో 14 వ రోజు సాయంత్రం దీపారాధన సమయంలో సూర్యకళాడి భట్టతిరిపాడు దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు .

కానీ 13 వ రోజు తిరువళ్లూరు మహాదేవ దేవాలయం శ్రీకోవిల్ నుండి ఒక స్వరం వినిపించింది. 

ఉష పూజ తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి, ఆ రోజు మందిరాన్ని తెరవవద్దని పూజారిని ఆ గొంతు కోరింది.


💠 సూర్యకళాడి భట్టతిరిపాడు ఆలయానికి పూజ కోసం రాగానే గర్భాలయాన్ని మూసివేశారు. ఆలయాన్ని తెరవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. 

అతను దూకి ఆలయం యొక్క చెక్క పైకప్పును కొరికినట్లు చెబుతారు. ఇప్పటికీ ఆలయంలో దంతాల గుర్తులు మరియు అతని అడుగుజాడలు కనిపిస్తాయి.


💠 ఆలయానికి సంబంధించిన మరో పురాణం రామాయణంతో ముడిపడి ఉంది. సీతను లంకకు తీసుకెళ్తున్న రావణుడిని అడ్డుకునే ప్రయత్నంలో జటాయువు తోక ఇక్కడ పడిపోయిందని చెబుతారు


💠 ఆలయానికి ఏడు ఎకరాల భూమి ఉంది, అందులో నాలుగు ఎకరాలు ఆలయ సముదాయం.  

ఉప మందిరం, నమస్కార మండపం, అగ్ర మండపంతో కూడిన చుట్టంబళం, వలియ-బాలిక్కల్, ధ్వజం, అనకొత్తిల్,  గోపురం, ఊట్టుపుర, బావి మరియు చెరువుతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి.



💠 కొచ్చి నుండి 20 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumar

13-21-గీతా మకరందము

 13-21-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ప్రకృతి పురుషులను గురించి ఇంకను వివరముగ తెలుపుచున్నారు– 


కార్యకారణకర్తృత్వే* 

హేతుః ప్రకృతిరుచ్యతే

పురుషస్సుఖదుఃఖానాం 

భోక్తృత్వే హేతురుచ్యతే


తాత్పర్యము:- కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- కార్యమనగా శరీరము. కారణమనగా ఇంద్రియ మనోబుద్ధ్యహంకారములు, పంచభూతములు, శబ్లాదివిషయములు - వీనియన్నింటిని గలుగజేయునది (హేతువు) ప్రకృతి. ప్రకృతి జడమైనది. కావున సుఖదుఃఖముల ననుభవింపలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు. కావున ఆతనికి సుఖదుఃఖభోక్తృత్వము యుండజాలదు. అయినను ప్రకృతియొక్క సంయోగముచే ఆయా సుఖదు:ఖాదులను పురుషుడు(ఆత్మ) అనుభవించునట్లు తోచుచున్నాడు. అంతియేకాని వాస్తవముగ నతనికి కర్తృత్వభోక్తృత్వాదులు ఏవియునులేవు.

~~~~

* కార్యకరణకర్తృత్వే - పాఠాంతరము

తిరుమల సర్వస్వం -144*

 *తిరుమల సర్వస్వం -144*


 *అలిపిరి మార్గం-15*


 *శ్రీవారి మెట్లు* 


 మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం తిరుమలకు కాలి నడకన చేరుకోడానికి రెండే మార్గాలున్నాయి. రెండింటిలో, అలిపిరిమార్గం నందు గల విశేషాలన్నింటిని గత కొద్దిరోజులుగా చెప్పుకున్నాం. మరో నడకదారి *"శ్రీవారిమెట్లు'* గురించి ఈరోజు తెలుసుకుందాం


 *మెట్లెన్ని?* 


 తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురానికి కొద్ది దూరం నుండి మొదలయ్యే ఈ మార్గం 2388 మెట్లతో, సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలిపిరిమార్గంతో పోలిస్తే ఈ మార్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి: 


 సుమారు 1100 మెట్లు తక్కువ. దూరం కూడా ఆరేడు కిలోమీటర్లు తక్కువే! కేవలం రెండు గంటల కన్నా తక్కువ సమయంలోనే కొండపైకి చేరుకోవచ్చు. కొండపైన, మెట్లమార్గం పూర్తయిన ప్రదేశం నుండి దేవాలయం అతి సమీపంలో ఉంటుంది. అలిపిరి మార్గంలో అయితే కొండపైకి చేరుకున్న తరువాత కూడా, మరో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాక గానీ ఆలయాన్ని సమీపించలేము. ఈ మార్గం కూడా దారి పొడవునా పైకప్పుతో ఉండి ఎండావానల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం, శౌచాలయాలు, సామాను, పాదరక్షలు పైకి చేర్చే వెసులుబాటు, ప్రథమచికిత్సా కేంద్రం కూడా ఉన్నాయి. ప్రకృతిసోయగం, వృక్ష, జంతుజాతుల సందడి కూడా దాదాపుగా అలిపిరితో సమానంగానే ఉంటుంది. ఈ మార్గంలో మెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటాయని, నడివయసు వారు ఎక్కలేక ఇబ్బంది పడతారని కొందరు చెప్పే మాటలు ఊహాజనితాలే! అలిపిరిమార్గం గుండా నడవగలిగే వారందరూ, ఈ మెట్లను కూడా అంతే సులభంగా అధిరోహించగలరు.


 ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తెరచి ఉండే ఈ మార్గంలో, రోజుకు పరిమితంగా – ప్రస్తుతం ఆరువేల మందిని మాత్రమే - అనుమతిస్తారు.


 *అలిపిరే అనుకూలమా?* 


 అలిపిరి మార్గంతో పోల్చితే శ్రీవారిమెట్ల మార్గంలో ప్రతికూలాంశాలు కూడా కొన్ని లేకపోలేదు. ఈ మార్గం తిరుపతి పట్టణం నుంచి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవస్థానం వారి "ధర్మరథం" (ఉచిత బస్సులు), అతికొద్ది ప్రైవేటు బస్సులు, త్రిచక్రవాహనాలు తప్ప, తిరుపతి పట్టణం నుంచి రవాణాసౌకర్యం అంతంత మాత్రమే! చాలామంది స్వంత వాహనాల్లోనో లేదా ప్రైవేటు టాక్సీల్లోనో వెళతారు. అలిపిరి మార్గంలో ఉన్నట్లుగా శ్రీవారిమెట్ల మార్గంలో చెప్పుకోదగ్గ చారిత్రక, పౌరాణిక విశేషాలు లేవు. ఈమార్గంలో నడకదారి దాదాపుగా లేకపోవడం వల్ల, ప్రయాణం కొద్దిగా శ్రమతో కూడుకున్నట్లనిపిస్తుంది. మధ్యలో జింకలపార్కు, ఉద్యానవనం వంటి ఉల్లాసభరిత ప్రదేశాలు లేకపోవడం వల్ల, కొంతమంది స్వల్ప అసహనానికి కూడా లోనవుతారు. మార్గమధ్యలో ఘాట్ రోడ్డు ఏమాత్రం తగలదు. మార్గమధ్యంలో హోటళ్ళు, చిరుతిళ్ళు కూడా అంతగా లేవు కానీ, కనీస సౌకర్యాలకు కొదవలేదు. యాత్రికుల సందడి కూడా తక్కువగానే ఉంటుంది.


 కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, తరచూ నడక ద్వారా తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు, సమయాభావం ఉన్నవారికి, శీఘ్రంగా చేరుకోగలిగే ఈ మార్గం ఎంతో అనువైనది. ఇద్దరు ముగ్గురితో కలిసి మెట్లెక్కతూ, గోవిందనామాలు బిగ్గరగా ఉచ్ఛరిస్తుంటే అలసట తెలియదు. మధ్యమధ్యలో కొద్దిగా ఆగుతూ, పచ్చని ప్రకృతిలో మమేకమవుతూ ప్రయాణం కొనసాగిస్తే; చూస్తూ చూస్తూ ఉండగానే కొండపైకి చేరుకుంటాం!


‌ శ్రీనివాసమంగాపురం నందున్న కళ్యాణవేంకటేశ్వరుని ఆలయం నుంచి కొద్దిదూరం మైదాన మార్గంలో ప్రయాణించిన తరువాత ఈ మెట్లమార్గం మొదలవుతుంది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*283 వ రోజు*


*ద్రోణుడి విజృంభణ*


అది చూసి ద్రోణుడు " సారధీ ! చూసావా ! మనసేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మజుని ముఖం గర్వంతో వెలిగి పోతుంది. నేను పాండవుల మీద విజృంభించకపోతే సేనలను ఆపలేము. ధర్మజుడు, భీముడు, ద్రుపదుడు, విరాటుడు వారి కుమారులు, నా ముందు నిలువలేరు అర్జునునికి విద్య నేర్పింది నేనే నీ చాతుర్యము చూపించి రధము నడుపుము నా చేతుల దురద తీరేవరకు ఒళ్ళు దాచుకొనక యుద్ధం చేస్తాను " అన్నాడు. ఆ మాటలకు పొంగిపోయిన ద్రోణుని సారథి చిత్రవిచిత్ర రీతుల రథం నడుపుతుండగా ద్రోణుడు పాండవసేనలో ప్రవేశించి చీల్చి చెండాడసాగాడు. పొంగుతున్న సముద్రంలా విజృంభించిన ద్రోణుని ధర్మనందనుని చక్రరక్షకుడు సుకుమారుడు చెలియలి కట్టలా అడ్డుకున్నారు. ద్రోణుడు ఒకే బాణంతో సుకుమారుని తల తెగనరికాడు. అది చూసిన పాండవ యోధులంతా ద్రోణుని చుట్టుముట్టారు. ద్రోణుడు అయిదు బాణములతో నకులుని, అయిదు బాణములతో సహదేవుని తిమ్మిది బాణములతో విరాటుని, ఏడు బాణములతో సాత్యకిని, మూడేసి బాణములతో ద్రౌపదీ సుతులను ఇరవై బాణములతో విశంతిని, పన్నెండు బాణాలతో ధర్మజును శిఖండిని కట్టడి చేసాడు. ఎదురు వచ్చిన రథికులు ఎవ్వరూ ప్రాణాలతో పోలేదు. యుగంధరుడు ధర్మరాజు ద్రోణులకు మధ్యకు వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు కోపించి ఒకే బాణంతో యుగంధరుని చంపాడు. అది చూసి కేకయరాజులు, ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు, మొదలైన యోధులు ద్రోణునిపై తలపడ్డారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు ద్రోణునిపై అస్త్రశస్త్రములు ప్రయోగించాడు. వారిపై కన్నెర్ర చేసిన ద్రోణుడు వారిపై రెండు వాడి అయిన అమ్ములు వేసి వారి శిరస్సులు ఖండించాడు. ఇది చూసిన మిగిలిన రథికులు పక్కకు తొలిగారు. ద్రోణుడు సింహనాదం చేసాడు. ఈ అలజడి చూసిన పాండవ సేనలో కలకలం రేగింది వారు " ద్రోణుడు ధర్మరాజును పట్టుకుని సుయోధనుని సముఖముకు తీసుకు వెళుతున్నాడు " అని ఆక్రోశించారు. అది కార్చిచ్చులా వ్యాపించి పాండవసేనలు కంపించాయి. ఇది విని అర్జునుడు ద్రోణునుని ముందుకు రథం పోనిచ్చాడు. అది చూసిన కౌరవ సేనలు ద్రోణునికి అండగా నిలిచాయి. అర్జునుడు తన గాండీవం సంధించి కౌరవ సేనలపై శరవర్షం కురిపించాడు. కౌరవ సేనలు తలలు తెగిపడుతున్నాయి రక్తం ఏరులై ప్రవహిస్తుంది. మొండెములు నేలకూలుతున్నాయి. అర్జునిని ధాటికి కౌరవ సేనలు తట్టుకోలేక పారిపోసాగాయి. ఇంతలో సూర్యుడు అస్తమించగానే ఆ రోజు యుద్ధం ముగించారు.


*ద్రోణుని సారధ్యంలో రెండవ రోజు యుద్ధం*

ద్రోణ సారథ్యంలో రెండవ రోజు యుద్ధానికి కౌరవ సైన్యం సిద్ధం అయింది. ద్రోణుడు సుయోధనునితో " సుయోధనా ! నిన్నటి రోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోనలేక పోయాను. అర్జునుడు ధర్మజుని ఒక్కక్షణం కూడా విడువ లేదు. ఆఖరిక్షణంలో కూడా మన సేనలను తనుమాడాడు. అర్జునుడిని దూరంగా తీసుకు వెళ్ళకుండా ధర్మజుని పట్టుట సాధ్యం కాదు. అర్జునుడు లేకున్న ధర్మజుడు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు నేను వెన్నంటి ధర్మజుని పట్టగలను " అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ " ఆ మాటలువిన్న సుశర్మ " సుయోధనా ! అర్జునుడు ఎప్పుడూ మమ్ము అవమానిస్తుంటాడు. మాకు అతడి మీద కోపంగా ఉంది. ఈ రోజు అర్జునుడైనా ఉండాలి లేక సుశర్మ అయినా ఉండాలి. అర్జునుడికి మేము ఏవిధంగా తీసిపోము " అని ప్రగల్భములు పలికి సుశర్మ తన తమ్ములను తీసుకుని అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సుశుశర్మతో అతడి తమ్ములు సత్యవర్ముడు, సత్యవ్రతుడు, సత్యకర్ముడు చేరగా కేరళ, మాళవ, శిలీంద్ర, మగధాధీసులు చేరగా పదిహేను మంది యోధులను తీసుకుని జయజయ ధ్వానములు చేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. అది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. వారు స్నానాధికములు చేసి అగ్ని రగిల్చి అగ్ని సాక్షిగా " మేమంతా ఈ రోజు రణరంగమున అర్జునుడిని చంపుతాము. లేని ఎడల మేము గోవధ, స్త్రీ వధ, బ్రాహ్మణవధ, బ్రాహ్మణ ధనం దోచుకొనుట, ఇతరుల ధనం అపహరించుట, గురువుకు అపకారం చేయుట, శరణు వేడిన వారిని రక్షించక పోవడం, అబద్ధం పలుకుట, మద్యపానం చేయుట, దేహీ అన్నవారికి లేదనుట, గృహదహనం చేయుట, ఇతరుల భార్యలతో వ్యభిచరించుట మొదలైన పాపములు చేసిన వారు ఏలోకాలకు వెళతారో ఆ లోకాలు మాకు సంప్రాప్తిస్తాయి మేము అర్జునుడి చేతిలో మరణించిన మాకు మాకు వీరస్వర్గం లభించగలదు " అని ప్రమాణాలు చేసి రణరంగ ప్రవాశం చేసారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పారాయణం తో పరివర్తన..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*పారాయణం తో పరివర్తన..*


"నువ్వు నీ చాదస్తం తో నన్ను కాల్చుకు తినొద్దు..నన్ను నీకు తోడుగా రమ్మన్నావు..నీతో పాటు వచ్చాను..నువ్వు పారాయణమే చేసుకుంటావో..పొర్లుదండాలు పెడతావో..నీ ఇష్టం..అవన్నీ చేయమని నన్ను బలవంతం చేయకు.." అని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది..అలా మాట్లాడుతున్న కూతురుని చూసి మౌనంగా తలూపింది ఆ పిల్ల తల్లి..ఆ అమ్మాయి వయసు పాతికేళ్ల లోపే..తల్లికి సుమారు నలభైఐదేళ్ల వయసు ఉన్నది..ఆమె పేరు రాజేశ్వరి గారు..ఆ అమ్మాయి పేరు కల్యాణి.


ఆ తల్లీకూతుళ్ళు ఆరోజు ఉదయమే శ్రీ స్వామివారి మందిరానికి బస్సులో వచ్చారు..బస్సు దిగగానే..రాజేశ్వరి గారు నేరుగా బావి వద్దకు వెళ్లి తన కాళ్ళూ చేతులూ కడుక్కొని..కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకుని..కూతురి నెత్తిమీద కూడా చల్లింది.. అప్పుడే ఆ అమ్మాయి చిరాగ్గా ముఖం పెట్టుకున్నది..ఆ అమ్మాయికి దైవం  మీద పెద్దగా విశ్వాసం లేదు..పైగా భక్తి, విశ్వాసాలు కలిగిన వారిని చూస్తే చిరాకు కూడా..శ్రీ స్వామివారి మందిరానికి కూడా కేవలం తన తల్లి తోడుగా రమ్మని బలవంతం చేస్తే వచ్చింది..వచ్చే ముందు కూడా తల్లితో తనను నమస్కారం పెట్టమని బలవంతం చేయొద్దని చెప్పింది....సరే అని చెప్పి బైలుదేరింది ఆవిడ..


శ్రీ స్వామివారి మందిరం లోపలికి వచ్చి..శ్రీ స్వామివారి ప్రధాన మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..అర్చన చేయించుకొని..ముందున్న మంటపం లో కూర్చున్నారు రాజేశ్వరి గారు.. ఆరోజు ఆదివారం..భక్తులు ఎక్కువగానే వచ్చారు..శ్రీ స్వామివారి మందిరం కోలాహలంగా ఉన్నది..కొందరు జుట్టు విరబోసుకొని..మందిరం చుట్టూ కేకలు పెడుతూ పరిగెడుతున్నారు..మరికొందరు మంటపం లో పడుకొని వున్నారు..ఇంకొందరు "దత్తాత్రేయా మమ్ములను చల్లంగా చూడు.." అని గట్టిగా ప్రార్ధిస్తున్నారు..మందిరానికి బైట వైపు..భజన జరుగుతున్నది..పరిసరాలు మరచిపోయి భజన చేస్తున్నారు కొందరు..ఇంత సేపూ ఆ అమ్మాయి  మంటపం లో కూర్చుని అందరినీ గమనిస్తోంది..


ఏ మహత్తూ లేకపోతే.. ఇంతమంది..ఇంత విశ్వాసం తో ఇక్కడికి ఎందుకొస్తారు?..అని మొదటిసారిగా ఆ అమ్మాయి మనసులో సందేహం మొదలైంది..మెల్లిగా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి.."అమ్మా..ఇందాకటి నుంచి గమనిస్తున్నాను..ఇక్కడ సిద్ధిపొందిన ఈ స్వామివారి మీద అందరికీ ఇంతటి భక్తి విశ్వాసాలున్నాయి..ఏమిటీ మహాత్యం?.."అని అడిగింది..అలా అడిగిన కూతురి వైపు ఆశ్చర్యంగా చూసిన ఆ తల్లి..తాను పారాయణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవిత చరిత్రను చదవమని ఆ అమ్మాయికి ఇచ్చింది..


"పారాయణమే చేస్తావో..పొర్లుదండాలే పెడతావో..నీ ఇష్టం.." అని చెప్పిన ఆ పిల్ల..కేవలం రెండుగంటల సేపు శ్రీ స్వామివారి మందిరం లో గడిపి..మనసులో ఏర్పడిన కుతూహలం కారణంగా శ్రీ స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టింది..సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవడం పూర్తిచేసింది..తన తల్లి దగ్గరకు వచ్చి.."అమ్మా..స్వామివారి సమాధిని దర్శించుకుంటాను.." అన్నది..అనడమే కాదు..తల్లిని వెంటబెట్టుకొని..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన కూడా చేయించుకున్నది..మంటపం లో ఉన్న శ్రీ స్వామివారి చిత్రపటానికి తల ఆనించి కొద్దిసేపు నిలబడింది..ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ల నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి..స్వామివారి మీద భక్తి వల్లనా.. లేక పశ్చాత్తాపం వల్లనా అనేది ఆ దైవానికే తెలియాలి..


అంతవరకూ ఆ అమ్మాయిలో ఉన్న మొండితనం..దైవం పట్ల ఉన్న నిరసన భావం ఎటుపోయాయో తెలీదు..ఆ నిమిషం వరకూ..కల్యాణి అని పిలువబడే ఆ అమ్మాయి..మొగలిచెర్ల గ్రామం వద్ద సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తురాలు కల్యాణి గా మారిపోయింది..మరెప్పుడూ దైవం పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు..ప్రస్తుతం వివాహం చేసుకొని సాఫ్టువేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్యాణి ..ప్రతి సంవత్సరం రెండుసార్లు భర్త తో సహా  శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శిస్తున్నది...ఒకప్పుడు "ఏమిటీ మహాత్యం?.." అని తన తల్లిని ప్రశ్నించిన కల్యాణి..తన లో వచ్చిన మార్పే ఆ మహాత్యం అని గ్రహించింది..శ్రీ స్వామివారిని దర్శించడానికి భర్తతో కలిసి మందిరానికి వచ్చిన ప్రతిసారీ..భక్తులకు అన్నదానం చేసి..తిరిగి వెళ్లడం కల్యాణి కి ఆనవాయితీగా మారిపోయింది..కల్యాణి ఈ విధంగా మారిపోవడానికి శ్రీ స్వామివారి చల్లని కరుణ కాక మరేమిటి?..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114.. సెల్..94402 66380 & 99089 73699).