15, జనవరి 2025, బుధవారం

గ్రహాల ప్రభావం

 మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం  -


      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.


                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 


             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .


         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.


       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.


 రవి  -


   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.


 చంద్రుడు  -


   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .


 కుజుడు  -


    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .


 బుధుడు  -


    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .


 గురుడు  -


     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.


  శుక్రుడు  -


     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .


  శని  -


     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .


         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

రుచులు శరీరముకు కలుగు ఉపయోగాలు

ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 


    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 


  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .


        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి మీకు వివరిస్తాను.  మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.


           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 


          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  


     ఇప్పుడు మీకు రుచులు వాటి యొక్క గుణాలు తెలియచేస్తాను .


  మధురరస గుణములు  - 


 *  తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.


 *  చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.


 *  శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.


 *  శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.


 *  కంఠస్వరం పెరుగును .


 *  బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.


 *  ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .


 *  వాత, పిత్త, విషాలను హరించును . 


  గమనిక  - 


          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.


 ఆమ్లరసం గుణములు  - 


 *  ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.


 *  హృదయముకు బలమునిచ్చును.


 *  ఆహారాన్ని అరిగించును.


 *  రుచిని పుట్టించును . 


 *  శరీరం నందు వేడి కలుగచేయును .


 *  మలాన్ని విడిపించును.


 *  తేలికగా జీర్ణం అగును.


 *  కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.


  గమనిక  - 


        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 


 

  లవణ రస గుణాలు  - 


 *  ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును . 


 *  జఠరాగ్ని పెంచును.


 *  చమురు కలది.


 *  చెమట పుట్టించును . 


 *  తీక్షణమైనది , రుచిని పుట్టించును . 


 *  వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .


 *  శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 


  గమనిక  - 


           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .


 

  తిక్త ( చేదు ) రస గుణాలు  - 


 *  ఇది అరుచిని హరించును .


 *  శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును . 


 *  మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .


 *  శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .


 *  తేలికగా జీర్ణం అగును.


 *  బుద్దిని పెంచును.


 *  చమురు హరించును .


 *  స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.


  గమనిక  - 


          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .


 

  కటు ( కారం ) రసం గుణాలు  - 


 *  ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .


 *  వ్రణములు తగ్గించును 


 *  శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును . 


 *  జఠరాగ్ని పెంచును.


 *  అన్నమును జీర్ణింపచేయును .


 *  రుచిని పుట్టించును .


 *  సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .


 *  నవరంధ్రాలు ను తెరిపించును.


 *  కఫాన్ని హరించును .


 

 గమనిక  - 


        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .


  కషాయ ( వగరు ) రస గుణములు  - 


 *  వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .


 *  రక్తాన్ని శుద్దిచేయును .


 *  నొప్పిని కలిగించును.


 *  వ్రణాలను మాన్చును.


 *  శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .


 *  ఆమమును స్తంభింపచేయును .


 *  మలాన్ని గట్టిపరుచును.


 *  చర్మాన్ని నిర్మలంగా చేయును .


 

  గమనిక  - 


       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.


       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.  



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034




        

బుధవారం🪷* *🌷15, జనవరి, 2025🌷* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🪷బుధవారం🪷*

*🌷15, జనవరి, 2025🌷*   

     *ధృగ్గణిత పంచాంగం*


         *ఈనాటి పర్వం* 

 *🎋కనుము పండుగ🎋* 


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*


*తిథి : విదియ* రా 03.23 తె వరకు ఉపరి *తదియ*  

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : పుష్యమి* ఉ 10.28 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం  : ప్రీతి* రా 01.47 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : తైతుల* సా 03.17 *గరజి* రా 03.23 తె ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

          *ఉ 06.30 - 10.00  సా 03.30 - 05.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*


*వర్జ్యం  :  రా 11.42 - 01.21*

*దుర్ముహూర్తం : ప 11.54 - 12.39*

*రాహు కాలం : మ 12.17 - 01.41*

గుళికకాళం : *ఉ 10.53 - 12.17*

యమగండం : *ఉ 08.04 - 09.28*

సూర్యరాశి : *మకరం*  చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం:*ఉ 06.39*

సూర్యాస్తమయం:*సా 05.55*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

 *వైదిక విషయాలు* 

ప్రాతః కాలం :  *ఉ 06.39 - 08.54*

సంగవ కాలం : *08.54 - 11.09*

మధ్యాహ్నకాలం  :*11.09 - 01.24*

అపరాహ్న కాలం : *మ 01.24 - 03.40*

*ఆబ్ధికం తిధి  : పుష్య బహుళ విదియ*

సాయంకాలం  :  *సా 03.40 - 05.55*

ప్రదోష కాలం :  *సా 05.55 - 08.28*

రాత్రి కాలం :  *రా 08.28 - 11.52*

నిశీధి కాలం :*రా 11.52 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.48*

____________________________

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*      

      *(అగస్త్య కృతం)*


*సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |*

*ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ*


     *🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

సంక్రాంతిపండుగ

  సంక్రాంతిపండుగ శుభాకాంక్షలతో...


సీ॥

మకరాన పదమూని మాన్యతేజోమూర్తి 

కాశ్యపేయుడు వెల్గ ఖ్యాతితోడ 

ఉత్తరాయణకాల ముప్పతిల్లెననుట 

శాస్త్రసమ్మతమయ్యె సన్నుతించ 

పితృదేవతలగూర్చి పిండప్రదానముల్ 

తిలలుదకమ్ములు తీర్చిగూర్చ 

కూష్మాండములదెచ్చి కూరగాయలతోడ 

పప్పుసంబారముల్ బ్రాహ్మణునకు 

గీ॥ పోషణాదికద్రవ్యాల పొత్తరీయ 

పుణ్యదినమయ్యె వెలలేని పుణ్యమమరె 

భావితరములకాదర్శపథమునయ్యె 

ఠీవి సంక్రాంతిపర్వమ్ము ఠేవనలరె 


సీ॥

ఆరుగాలముపడ్డ హాలికుకష్టమ్ము 

ఫలితమిచ్చెను నేడు పంటయౌచు 

హలము లాగినయెడ్లు ఫలముజూచుకదృప్తి 

శ్రాంతిబొందెను నేడు సంతసించి 

క్రొత్తపంటలతోడ కోరివంటలజేయ 

క్రొత్తయల్లుళ్ళతో కూతులలరె 

బావలు మరదళ్ళు బంధుసందోహాల 

సరసభాషలతోడ సందడించ 

గీ॥ పొంగె హృదయాలు క్షీరమ్ము పొంగినట్లు 

చెంగుచెంగున గోవత్స చెలగినట్లు 

వానకాలాన చాతకపక్షులట్లు 

నిండుపండువ సంక్రాంతి నృత్యమాడె 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - పుష్యమి -‌‌ సౌమ్య వాసరే* (15.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

బుధగ్రహస్తుతి

 🌹బుధవారం - బుధగ్రహస్తుతి🌹


//శార్దూలం//

తారాచంద్రకుమారకం మరకతేశ్రద్ధాన్వితం బుద్ధిదంl

సౌమ్యం సోమరిపుం సుపీతవసనం బాణాసనం సింహగమ్ll

రాజత్పుస్తకహస్తపద్మయుగళం విజ్ఞానవారాంనిధింl

శుక్రాదిత్యసఖం చ ముద్గముదితం వందేహమార్యం బుధమ్ll

~మల్లిభాగవతః...!


*భావం:-*

బృహస్పతిభార్యయైన తారాదేవికి చంద్రుని మూలాన జన్మించినవాడు, మరకతమణి పై మోజుగలవాడు,బుద్ధినొసగువాడు, సౌమ్యగుణోపేతుడు, చంద్రుణ్ణి ద్వేషించువాడు,పీతాంబరధారియై బాణాకారమండలోపాసీనుడు, సింహవాహనుండు,

ఇరుచేతులందు పుస్తకమును పట్టిన జ్ఞానసాగరుడు, రవిశుక్రులందు మైత్రిఁగలవాడు, ముద్గధాన్యము(పెసలు)పై ప్రీతిగలవాడు, వైశ్యుడూ ఐనట్టి బుధునికి ప్రణమిల్లుచున్నాను. 🙏

Youtube లో ఎలాంటి ఛానల్స్

 Youtube లో ఎలాంటి ఛానల్స్ చూడాలి,subscribe చేసుకోవాలి ????..నిత్యం ఈ క్రింది ఛానల్స్ చూడటం వల్ల మన చరిత్ర,మన నాగరికత, మన సంస్కృతి, మన జీవనవిధానం, మన ఆరోగ్యం, మన కట్టుబాట్లు,ప్రస్తుత సమాజం లో ఎలా ఉండాలి.ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ఛానల్స్ చూడండి.(subscribe తప్పనిసరి )

1) Nationalist hub (నేషనలిస్ట్ హబ్)

2) Rakalokam (రాకలోకం)

3) Prem talks (ప్రేమ్ టాక్స్)

4) Bharatavarsha( భారత వర్ష)

5)news akhanda(న్యూస్ అఖండ )

6) the chitragupta (ద చిత్రాగుప్తా)

7) Reflection (రిఫ్లక్షన్ )

8) Hindu jana shakti (హిందు జన శక్తి)

9) Shiva shakti (శివ శక్తి)

10) Govinda seva(గోవింద సేవ)

11) Krishna dharma rakshana( కృష్ణ ధర్మ రక్షణ)

12) Gopi sanathana sena( గోపి సనాతన సేన)

13) Ram talk ( రామ్ టాక్)

14) journalist sai ( జర్నలిస్ట్ సాయి )

15) mounika sunkara (మౌనిక సుంకర )

16) RJ kiran (ఆర్ జె కిరణ్ )

17)venkata chaganti (వెంకట చాగంటి )

18) surya akondi ( సూర్య అకోండి)

19)Mvr shastry( mvr శాస్త్రి )

20) string telugu (స్ట్రింగ్ తెలుగు)

21) Narada news telugu (నారద న్యూస్ తెలుగు)

22) sadhguru telugu (సద్గురు తెలుగు )

23) Haindava sakti (హైందవ శక్తి)

24)Hamara prasad(హమారా ప్రసాద్ )

25) Radha manohara Das(రాధ మనోహర్ దాస్)

26) ugra bhargava sena ( ఉగ్ర భార్గవ సేన)

27) rashtriya vanara sena (రాష్ట్రీయ వానర సేన

28) India in details (ఇండియా ఇన్ డీటెయిల్స్ )

29)mathonmadampai ramabanam (మతోన్మాదం పై రామ బాణం )

30)Rtv andhrapradesh

31) Hindu dharma kshetram( హిందూ ధర్మ క్షేత్రం)

32) Sreepeetam (శ్రీ పీఠం)

33)praveen mohan telugu (ప్రవీణ్ మోహన్ తెలుగు)

 34) haindava sainyam (హైందవ సైన్యం)

35) The Garuda ( ద గరుడ)

36) Signature studios (సిగ్నెచర్ స్టూడియో)

37) Bhaskar killi (భాస్కర్ కిల్లి )

38) Janaki Ram Cosmic Tube(జానకి రామ్ కాస్మిక్ ట్యూబ్)

39) Prashanth Facts (ప్రశాంత్ ఫాక్ట్స్ )

40) Nanduri srinivas (నండూరి శ్రీనివాస్ )

41) Bharath Today(భారత్ టుడే )

42) VBM news Telugu

43) dharma galam the voice of hindu 

44) Hindu janajagruti samiti (హిందు జన జాగృతి సమితి )

45) nb show telugu 

46)NH tv 

47) nanduri hemamalini (నండూరి హేమమాలిని )

48)Jagriti tv (జాగృతి టీవీ )

49) madan gupta (మదన్ గుప్తా)

50) ajagava (అజగవ)

51) Dharma poratam phani rajesh(ధర్మ పోరాటం ఫణి రాజేష్ )

52)abhimanya sena (అభిమాన్య సేన )

53) Telugu Hindu forum (తెలుగు హిందు ఫోరమ్)

54) Veda bharat (వేద భరత్ )

55) Bhakti one(భక్తి వన్ )

56) VMYF vande matra 

57)T Mixture 

58) Anati Chandamama Kathalu(ఆనాటి చందమామ కధలు )

59) HD Channel (Historical Dimensions)

60) Thirukshethrala Rakshana Samithi(తిరుక్షేత్రాల రక్షణ సమితి )

61) Saffron Blood 

62)satyabhama(సత్యభామ )

63) fit tuber telugu 

64)duvvada siva prasad (దువ్వాడ శివ ప్రసాద్ )

65) neti ramabanam (నేటి రామాబాణము )

--------------------------------- ---

మీ స్నేహితులకు share చెయ్యండి.వీటిని youtube లో subscribe చేసుకొని నిత్యం చూడండి.

గమనిక : మీ దగ్గరకు వచ్చే వారికి వారి youtube ఓపెన్ చేసి ఈ చానాల్స్ లొ subscribe మరియు bel ఐకాన్ క్లిక్ చెయ్యండి. ఇది కూడా పెద్ద దేశ సేవ అవుతుంది. నేను ఇప్పటికి 500 మందికి ఇలా చేసాను. మీ హిందూ ధర్మ.........

.................................................. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏

సుఖాలలో పొంగిపోరు,

 5.20

*న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ ।*

*స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ।। 20 ।।*

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् |

स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थित: || 20||


న, ప్రహృష్యేత్ — పొంగిపోరు; ప్రియం — ప్రియమైనది; ప్రాప్య — పొందినప్పుడు; న, ఉద్విజేత్ — కలత నొందరు; ప్రాప్య — పొందినప్పుడు; చ — మరియు; అప్రియం — అప్రియమైనది; స్థిర-బుద్ధిః — నిశ్చలమైన బుద్ధి; అసమ్మూఢాః — ధృఢంగా ఉండి (భ్రమకు లోనుకాక); బ్రహ్మ-విత్ — దివ్య జ్ఞానము పై గట్టి అవగాహన తో; బ్రహ్మణి — భగవంతుని యందు; స్థితః — స్థితులై.


*BG 5.20 : భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే/లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు.*


*వ్యాఖ్యానం*


ఈ శ్లోకంలో ఉన్న ఈ భాగం - సుఖాలలో పొంగిపోరు, దుఃఖాలకు క్రుంగిపోరు - అనేది బౌద్ధ మతంలో ఉన్న 'విపాసన' ధ్యాన ఆచారంలో ఉన్న అత్యున్నత ఆదర్శం. ఈ రకమైన స్పష్టత మరియు ఖచ్చితత్వం కలిగిన స్థితికి చేరుకోవటానికి కఠినమైన శిక్షణ తీసుకుంటారు; ఇది అంతిమంగా, సమత్వ భావన స్థితికి చేర్చి, అహంకారాన్ని అంతం చేస్తుంది. కానీ, భక్తిలో, మన చిత్తమును శరణాగతిగా భగవత్ అర్పితము చేసినప్పుడు, ఇదే స్థితిని సహజంగానే చేరుకుంటాము. 5.17వ శ్లోకం ప్రకారం, మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు, సంతోషాన్ని, బాధని భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. 

 ఒక చక్కటి కథ ఈ వైఖరిని విశదీకరిస్తుంది.  

  ఒకసారి ఓ అడవి గుర్రం ఒక రైతు పొలంలోకి వచ్చింది. ఆ ఊరి జనులు ఆ రైతుని అభినందించారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’ 

  కొద్ది రోజులయిన తరువాత, ఆ గుర్రం మళ్లీ అడవిలోకి పారిపోయింది. చుట్టుపక్కల వాళ్లు అతని దురదృష్టానికి జాలి పడ్డారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’  

  మరికొద్ది రోజులు గడిచాయి, ఒకరోజు ఆ గుర్రం తనతో పాటు ఇంకా ఇరవై గుర్రాలను తీస్కొని వచ్చింది. మళ్లీ ఊరి జనులు అతని అదృష్టానికి అబ్బురపడి అభినందించారు, అతను వివేకముతో అనుకున్నాడు ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? ఇదంతా ఆ భగవంతుని సంకల్పం.’ 

  కొన్ని రోజుల తరువాత ఆ రైతు కొడుకు ఒక గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడి కాలు విరగగొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు తమ సానుభూతి చెప్పటానికి వచ్చారు. తెలివైన రైతు ఇలా చెప్పాడు, ‘మంచో, చెడో - ఇది భగవత్ సంకల్పమే.’ 

  మరి కొన్ని రోజులు గడిచాయి, రాజుగారి సైనికులు వచ్చి, అప్పుడే మొదలైన యుద్ధం కోసం, ఆ ఊరిలో ఉన్న యువకులందరినీ సైన్యంలో చేర్చుకోవటానికి తీసుకెళ్ళిపొయారు. ఊరిలో ఉన్న యువకులందరినీ తీసుకెళ్ళారు కానీ, ఆ రైతు కొడుకుని మాత్రం, వాడి కాలు విరిగిందని వదిలేసి వెళ్ళిపోయారు. 

  ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగించే అవగాహన ఎమిటంటే, భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే మన స్వీయ-ప్రయోజనం ఉంది అని. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది, ఎప్పుడైతే మన స్వీయ-చిత్తం, భగవంతుని చిత్తముతో ఏకమైపోతుందో, అప్పుడు, సంతోషాలని, దుఃఖాలని కూడా ఈశ్వర అనుగ్రహంలా ప్రశాంతంగా స్వీకరించే సమత్వబుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవాని లక్షణం.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org//chapter/5/verse/20

మాల్యాద్రి" శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం..

 🎻🌹🙏" మాల్యాద్రి" శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.. మాలకొండ....!! 


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం  పండగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతా మూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాము.  


🌿కానీ వారానికొక్క రోజు మాత్రమే భక్తులమీద వరాల జల్లు కురిపించే దైవం ఉంటారా?  ఆయనే ప్రకాశం జిల్లా మాలకొండపై వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి.  


🌸అంతేకాదు, అలిగిన చెలి అలక తీర్చి దేవేరితో సహా కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.  

మరి ఈ స్వామి గురించి విశేషాలు తెలుసుకుందామా?


🌹🙏 స్థలపురాణం 🙏🌹


🌿 ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు ముచ్చటించుకుంటున్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరిక వుంటే చెప్పమని అడుగుతాడు. 


🌸 దానికి ఆ జగజ్జనని సాక్షాత్తూ లోకారాధ్యుడినే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయనీ, కానీ కలియుగంలో భూలోకంలో  వున్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలు వ్యయ ప్రయాసలకోర్వ లేకుండా వున్నారని, అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందటానికి ఒక దివ్య క్షేత్రం సృష్టించమని కోరుతుంది.


🌿 లోకపావని కోరిక మన్నించిన 

 శ్రీ మహావిష్ణువు భూలోకంలో తమ నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వన దేవతకి చెబుతాడు. వన దేవత పుష్ప మాల ఆకృతిలో సృష్టించింది గనుక ఈ కొండని మాలాద్రి అని కొందరంటారు.


🌸ఈ కొండకి పడమర దిక్కున అహోబిలం, వాయవ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో శింగరాయకొండ .. ఇవ్వన్ని మాల ఆకారంలో అమరి వుండటంతో ఈ కొండని మాలాద్రి అని ఇంకొందరంటారు.  వనమాల  ఆ జగజ్జననీ జనకుల పాద స్పర్శకోసం తానే కొండగా మారిందనీ, అందుకే మాలాద్రి అంటారనీ ఇంకొక కధ.  


🌿 అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి, ఈ పుణ్య క్షేత్రం తన తపస్సుకు అనువైనదని, ఇక్కడకొచ్చి, స్వామికోసం కఠోర తపస్సు చేశాడు. 


🌸 ఆయనకి ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో,  స్వామి సాక్షాత్కరించాడు.  

అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడు గనుకు ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది.


🌿అగస్త్య మహర్షి అక్కడే జ్వాలా నరసింహరూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు.  

అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు...


🌸తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరావారికి స్వామి దర్శనం లభించటంకోసం వారంలో ఒక్క రోజు, శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శనంభాగం లభిస్తుందనీ, ఇటు మానవులుకూడా స్వామిని సేవించి తరిస్తారనీ వేడుకున్నాడు.


🌿 భక్తుని కోరికను మన్నించిన

 శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు.  

అప్పటినుంచీ యుగ యుగాలుగా కోట్లాది భక్తులు  ఆ కొండ ఎక్కి ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు.  మిగతా ఆరు రోజులూ ఇక్కడ స్వామిని సేవించటానికి దేవ, మునిగణాలు వస్తాయని అంటారు.


🙏🌹 శ్రీ మహలక్ష్మీ ఆలయం 🌹🙏


🌸 దేవతలకు కూడా అలకలూ, ఈర్ష్యాసూయలూ వుంటాయా?  ఏమో! వున్నాయని చెప్పే కధలు మాత్రం అక్కడక్కడా వున్నాయి. పూర్వం స్వామితో వున్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. 


🌿 వెళ్ళేదోవలో పెద్ద బండరాయి అడ్డుగా వున్నది.  దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి, పెద్ద చీలికలా ఏర్పడి, అమ్మవారు కొండమీదకి వెళ్ళటానికి త్రోవ ఇచ్చిందిట.  ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి  దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే.  బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవగనుక కొంత ఇరుకుగా వుంటుంది. 


 🌸ఆ త్రోవను చూస్తే స్ధూలకాయులు వెళ్ళలేరనిపిస్తుందిగానీ, వారుకూడా ఏ ఇబ్బందీ లేకుండా తేలికగా నడచి వెళ్ళగలిగే విధముగా ఉంటుంది. ఇది  భక్తులకు అద్భుతంగా తోస్తుంటుంది. 


🌿 మాల్యాద్రిలో ఏడు తీర్థాలు ఉన్నాయి. నరసింహ, వరుణ తీర్దమ్,  కపిల తీర్దమ్,  అగస్త్య తీర్దమ్,  శంకర తీర్దమ్,  జోతి తీర్దమ్,  ఇంద్ర తీర్దమ్.


🌸నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. 


🌿ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.


🌸 ప్రతిసంవత్సరం  వైశాఖ శుద్ధ చతుర్దసి నాడు  నరసింహజయంతి, కార్తీకమాసం, శ్రావణ మాసములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు

 వారంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతి శనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పురాణ కథ...

 🙏పురాణ కథ....!!




🌹ఈ రోజున ప్రాచీనకాలంలో ముగ్గురు భూలోకానికి వచ్చి రెైతులను అనుగ్రహించారు. 🌹


*అందులో ఒక ఆయన ధన్వంతరి* 


*రెండవ ఆయన సాక్షాత్తూ బలరాముడు. ఈ బలరాముడు పూర్వం ఆదిశేషుడు. రెైతులు అంటే ఇష్టం కలగినవాడు ఆదిశేషుడు.* 


*మూడవ వారు శాకంభరి అనే పేరుతో అమ్మవారు*


 భూలోకానికి వస్తుంది. పూర్వం  దుర్గముడు అనేటువంటి పాపాత్ముడి కారణం వల్ల ప్రజలందరికి కరువు వచ్చింది. 


🌸కరువును తొలగించి, రకరకాల కూరగాయలతో అన్నం పెట్టి, వారిని అమ్మవారు రక్షించింది. అప్పటినుండి అమ్మవారిని శాకంభరి అని పిలిచారు. ఆ శాకంభరీ దేవి కనుమ నాడు భూమి మీదకు వస్తుంది. 


🌿ఈ విధంగా ఆయుర్వేద వైద్యుడైన  ధన్వంతరి, వ్యవసాయానికి సాయం చేసే ఆదిశేషుడు,


🌸విత్తనాలు మొదలైనటు వంటివి ఇచ్చే శాకంభరీదేవి ఈ ముగ్గురు కనుమ నాడు భూలోకమునకు వచ్చి ప్రజల్ని అనుగ్రహిస్తారు. 


🌿వారి అనుగ్రహం  పొందితే ఏటికేడాది మనకు పంటలు బాగా ఉంటాయి, తిండికి ఎప్పుడూ కటకట ఉండదు, తిండి సమృద్ధిగా లభిస్తుంది‌.


🙏ఆచరించవలసిన విధి విధానాలు – సత్ఫలితాలు🌹🙏


🌸 కనుమనాడు కూడా తెల్లవారుఝామున లేవాలి, స్నానం చేయాలి, ఈరోజు గో పూజ చేయాలి.

ఎద్దులను కూడా పూజించాలి. 


🌿గోపూజ ను మించిన పూజ మరొకటి లేదు. సమస్తదేవతలు గోవు లో ఉన్నారు. 


🌸 ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, 


🌿కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రంచెబుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది...

కంజిరమట్టం శ్రీ మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 990


⚜ కేరళ  : ఇడుక్కి


⚜ కంజిరమట్టం శ్రీ మహాదేవ ఆలయం



💠 కంజిరమట్టం శ్రీ మహాదేవ ఆలయం , ఇడుక్కి జిల్లాలోని తొడుపుజా తాలూకాలోని కంజిరమట్టం కారా వద్ద తొడుపుజా నది ఒడ్డున ఉన్న పురాతన హిందూ దేవాలయం . 


💠 ఈ ఆలయం తొడుపుజ KSRTC బస్ స్టాండ్‌కు ఆగ్నేయంగా 1.5 కిమీ దూరంలో ఉంది. కేరళలోని 108 శివాలయాలలో కంజిరమట్టం శ్రీమహాదేవ దేవాలయం ఒకటి అని నమ్ముతారు మరియు ఇది శివునికి అంకితం చేయబడిన ఋషి పరశురామచే స్థాపించబడింది. ఆలయంలోని ప్రధాన దేవత తన భార్య పార్వతితో కలిసి కల్పవృక్షం క్రింద ధ్యానం చేస్తున్నట్లుగా చిత్రీకరించబడింది. 


💠 కంజిరమట్టం శ్రీ మహాదేవ ఆలయం, కంజిరమట్టం కారా వద్ద తొడుపుజా నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం.

పార్వతితో ప్రయాణంలో మహాదేవుడు మభ్యపెట్టి నది ఒడ్డుకు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. 

శివుడు మరియు పార్వతి నదిలో స్నానం చేసిన తర్వాత కొండ (శైలం) సమీపంలో పార్వతి కోసం వేచి ఉన్నారు. పార్వతి స్నానం చేసి మహాదేవుని శైలంలో చేరింది.

 ఒక భక్తుడు విరాళంగా ఇచ్చిన నంది విగ్రహం ఇప్పుడు కంజిరమట్టంలోని మహాదేవ ఆలయంలో ఇటీవల ఉంచబడింది.

 కానీ కరికోడ్ దేవి ఆలయంలో కనిపించే అందమైన నంది దానిలోని పై సత్యాన్ని ధృవీకరిస్తుంది. 

కరికోడ్‌లో తప్ప కేరళలోని మరే దేవి ఆలయాల్లోనూ నంది కనిపించదని గమనించవచ్చు.


💠 వడక్కుం కూర్ రాజవంశం తొడుపుజా నది ఒడ్డున ఒక దేవి ఆలయాన్ని మరియు కరికోడ్‌లోని వారి ప్యాలెస్‌లో మహాదేవ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది.  నిర్మాణం పురోగతిలో ఉంది మరియు కరికోడ్ వద్ద ఒక  శ్రీకోవిల్ పూర్తయింది మరియు నందికేశన్‌ను ఆ ఆలయ ప్రాంగణంలో ఉంచారు. 

 కానీ వడక్కుంకూర్ రాజవంశం యొక్క కుటుంబ దేవత అయిన దేవి రాజభవనం సమీపంలోని కరికోడ్‌లోని ఆ ఆలయంలో నివసించింది. 

 తోడుపుజా నదికి సమీపంలోని కంజిరమట్టం ఆలయంలో శివలింగ ప్రతిష్ట (ఉమామహేశ్వరుడు) చేసిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.


💠 రోజువారీ అభిషేకం లేత కొబ్బరికాయలు, పనీర్, నూనె, పాలు, తేనె మరియు శంఖాభిషేకం కూడా భక్తుల కోరికపై నిర్వహిస్తారు.  

ప్రత్యేక శ్రీ రుద్రధార కూడా డిమాండ్‌పై నిర్వహించబడుతుంది. 


💠 "కంజిరామతోమ్ శ్రీ మహాదేవ ఆలయం"లోని శివ లింగం పశ్చిమం వైపు ఉంటుంది.  

శివుడు, తన నాలుగు చేతులలో ఒక చేతులతో పార్వతీ దేవిని పట్టుకుని, మరొక చేతిలో చెక్క గొడ్డలిని, మరొక చేతిలో పవిత్రమైన "త్రిశూలం & ఉడుక్కు" పట్టుకుని, ముందు చేతితో మొత్తం ప్రపంచాన్ని (భక్తులను) ఆశీర్వదిస్తున్న చిత్రం.  


💠 మహా శివరాత్రి అనేది ప్రతి సంవత్సరం కృష్ణ పక్షం (క్షీణిస్తున్న చంద్రుడు)లో 13వ రాత్రి/14వ రోజు జరుపుకునే హిందూ పండుగ.  

హిందూ క్యాలెండర్‌లో మాఘ మాసం (శాలివాహన లేదా గుజరాతీ విక్రమ ప్రకారం) లేదా ఫాల్గుణ (విక్రమ ప్రకారం) (అంటే, అమావాస్య ముందు మరియు రోజు).  


💠 ఈ పండుగ ప్రధానంగా శివునికి బిల్వ ఆకులను సమర్పించడం, రోజంతా ఉపవాసం మరియు రాత్రంతా జాగరణ చేయడం ద్వారా జరుపుకుంటారు.


💠 ఈ ఆలయం కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని ఉప దేవతలు దుర్గ, అమృతకలశశాస్త, గణపతి, వనదుర్గ, నాగదేవతలు, శ్రీ మూకాంబికా దేవి


💠 ఎలా చేరుకోవాలి : 

కంజిరమట్టం శ్రీ మహాదేవ దేవాలయం MC రోడ్ మరియు అలప్పుజా - మదురై మీదుగా 39.8 కిమీ దూరంలో ఉంది.  


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 119-*

 *తిరుమల సర్వస్వం 119-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 7*


 *రచనాశైలి* 


 అన్నమయ్య లెక్కకు మిక్కిలిగా రచించి, గానం చేసిన సంకీర్తనల లోని పదాలను పరిశీలిస్తే - స్వచ్ఛమైన, సంస్కృతంతో మిళితం కాని, రాయలసీమ యాసలోని తెలుగుభాష కానవస్తుంది. ఆ ప్రాంత ప్రజల్లో ఆనాడు వాడుకలో ఉన్న సామెతలు, జాతీయాలు, పలుకుబడులు, ఊతపదాలు, నుడికారాలు - వీటన్నింటిని గమనించి వాటిని తన రచనల్లో ఒద్దికగా పొందుపరిచాడు. 


 అన్నమయ్య తన కృతుల్లో తరచూ వాడిన కొన్ని పదాలను వర్గీకరించి విశ్లేషించుదాం :


 తిండి పదార్థాలు - కంచం, కూడు, అంబలి, గంజి, చింతకాయ పచ్చడి, ఆవకాయ, కారం, పెరుగు, చద్ది, నూనెలు, వెన్న, ఉప్పు, అన్నం, చద్దన్నం వంటి పదాలను ఉపయోగించి ఆనాటి రాయలసీమ లోని గ్రామీణ జీవితానికి అద్దం పట్టాడు.


 ఆర్థిక, సామాజిక స్థితిగతులను – ఇల్లు, కొట్టం, చావిడి, మేడ, గుడిసె, వంటగది, చెంబు, గొడుగు, రోలు, రోకలీ, గడ్డపార - వంటి పదాలను ఉపయోగించడం ద్వారా తేటతెల్లం చేశాడు.


 వివాహవ్యవస్థ - బొమ్మలపెళ్లిళ్లు, పెండ్లికొడుకు, పెండ్లికూతురు, విడిదిఇల్లు, బాసికం, తాళిబొట్టు, పెళ్లిపీటలు, మంగళసూత్రం, తలంబ్రాలు, అక్షింతలు, హారతులు, కొంగుముడి; - నిశితంగా గమనిస్తే, నాడు అన్నమయ్య గ్రంథస్థం చేసిన వివాహ ఆచార వ్యవహారాలు; ఆరువందల సంవత్సరాల తరువాత ఈనాడు కూడా, అతికొద్ది మార్పులతో సజీవంగా ఉన్నాయి.


 కుటుంబవ్యవస్థ - మగువ-మగడు, భార్య-భర్త, అత్తా-కోడలు, బావ-మరదలు, తల్లిదండ్రులు, కొడుకు - కూతురు; ఇలా, - ఈనాడు ఎన్నెతే బంధుత్వాలను మనం కలిగివుంటామో, ఆనాడు కూడా అవే చుట్టరికాలు అంతకుమించి ఆప్యాయతాభిమానాలు వ్యక్తం చేయబడ్డాయి.


 మూగజీవాలు - గుర్రం, ఆవు, చిలుక, నెమలి, హంస, చీమ, తేలు, జింక, ఎద్దు - వంటి వన్యప్రాణులను తరచూ ఉటంకిస్తూ తన జంతు ప్రేమను తేటతెల్లం చేశాడు అన్నమయ్య.


 జానపదాలు - ఉయ్యాల, నలుగు, జోల, కోలాటం, గుజ్జనగూళ్ళు, తందనాలు, లాలిపాటలు, చందమామ, వెన్నెల, అలా అన్నమయ్య తన రచనల్లో ఆనాటి రాయలసీమ పల్లెటూరి సొగసులను ఒద్దికగా పొందుపరిచాడు.


 అన్నమయ్య - పామరులకు సైతం సరళంగా ఆకళింపు అయ్యే సాధారణ భాషతో కూడుకున్న రచనలనే కాకుండా, విద్వాంసుల కోసం ఛందోబద్ధ, వ్యాకరణ సహిత, క్లిష్టతరమైన పెక్కు గ్రంథాలను సైతం అలవోకగా రచించి తన పాండిత్య ప్రకర్షను చాటుకున్నాడు. వారి సంకీర్తనలతో పాటుగా ద్విపదలు, శతకాలు, దండకాలు, రగడలు, భజనలు, గీతాలు, వ్యాఖ్యానాలు; ఎన్నో, మరెన్నో కూడా ఉన్నాయి. అయితే భాష ఎటువంటిదైనా, ఏ పదం ఉపయోగించినా, స్థూలంగా దాని అర్థం ఏమైనా అంతర్లీనంగా ఉన్న ఇతివృత్తం మాత్రం శ్రీవేంకటేశ్వరుడే!


 ఇలా తన సాహిత్యసంపద నంతా ఆ శ్రీనివాసుణ్ణి వేనోళ్ళ కీర్తించడానికే వినియోగించాడు.


 1424వ సంవత్సరంలో ప్రారంభించి, 1503వ సంవత్సరం వరకు 80 సంవత్సరాల కాలం కొనసాగిన సాహితీప్రస్థానం ముగిసేనాటికి అన్నమయ్య 96 సంవత్సరాల వయోవృద్ధుడు. ఆ సుదీర్ఘకాలంలో సగటున ప్రతిరోజు - రెండు లేదా మూడు సంకీర్తనలను గానం చేశాడు. ఆయన చేసిన సాహితీసేవలను గుర్తించి ఆనాటి రాజాస్థానాలు, పౌరసంఘాలు ఆయనను – *సంకీర్తనాచార్య, ద్రావిడ ఆగమ సార్వభౌమ, పంచాగమచక్రవర్తి* - వంటి బిరుదులతో సత్కరించాయి. 


*నా నాలికపై నుండి నానా సంకీర్తనలు* 

*పూని నాచే నిన్ను పొగడించితివి* 

*వేనామాల విన్నుడా వినుతెంచ నెంతవాడ* 

*కానిమ్మని నీకే పుణ్యము గట్టితి వింతేయయ్యా!*


 అంటూ, తన పాండిత్యమంతా శ్రీనివాసుని కృపయే తప్ప తన స్వంతం కాదని వినమ్రంగా, కవితాధోరణిలో చాటిచెప్పాడు.



*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన* 

*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*



 *అన్నమాచార్యుని లోని సంఘ సంస్కర్త* 


 అన్నమాచార్యుని పేరు లేదా వారి కీర్తన వినగానే మనకు మొట్టమొదటగా స్ఫురణకు వచ్చేది శ్రీవేంకటేశ్వరుని పట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తి తత్పరతలు! అయితే అన్నమయ్య తన అసంఖ్యాకమైన కృతులలో స్వామివారిని అచంచలమైన భక్తితో కీర్తించడము సామాజిక స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించడమే గాకుండా; ఆనాడు సమాజంలో ప్రబలి ఉన్న సాంఘిక దురాచారాలను, అంధవిశ్వాసాలను, కులమత బేధాలను, జంతుబలులను, అంటరానితనాన్ని, స్త్రీ-పురుష వ్యత్యాసాలను, మూఢనమ్మకాలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. శ్రీవేంకటేశ్వరుడు తన ఖడ్గంతో అసురులను దునుమాడి నట్లుగానే; వారి నందకఖడ్గ అంశతో జన్మించిన అన్నమాచార్యుడు, నాడు జనబాహుళ్యంలో వ్రేళ్ళూనుకుని ఉన్న సామాజిక రుగ్మతలను తన సమకాలీన స్పృహతో కూడిన సాహితీ ప్రకర్ష అనే పదునైన ఖడ్గంతో నిష్కర్షగా ఖండించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

12-03,04-గీతా మకరందము

 12-03,04-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ|| నిర్గుణోపాసకులను గుఱించి ఒకింత చెప్పుచున్నారు - 

 

యే త్వక్షరమనిర్దేశ్యం

అవ్యక్తం పర్యుపాసతే | 

సర్వత్రగమచిన్త్యం చ 

కూటస్థమచలం ధ్రువమ్ || 

 

సంనియమ్యేన్ద్రియగ్రామం 

సర్వత్ర సమబుద్ధయః | 

తే ప్రాప్నువన్తి మామేవ 

సర్వభూతహితే రతాః || 

 

తా:- ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీనపఱచుకొని) ఎల్లెడల సమభావముగలవారై, సమస్తప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తిగలవారై, ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరముకానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు. 


వ్యాఖ్య:- ఒకే పరమాత్మ సాకారముగను, నిరాకారముగను ఉండుటవలన, సగుణధ్యానమునకుగాని, నిర్గుణధ్యానమునకుగాని లక్ష్యము ఒకటియే అయియున్నది.  శ్రద్ధతోను, నిర్మలభక్తితోను ఏ ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు. ఈ రెండు శ్లోకములందును నిర్గుణపరబ్రహ్మమును  ధ్యానించువారిని గుఱించి చెప్పబడినది. ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చిన విశేషణములున్ను, రెండవ శ్లోకమున బ్రహ్మప్రాప్తికి వలసిన  శీలసంపత్తియు తెలుపబడినది. సాధకుడు సాధ్యవస్తువగు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికిని, హృదయశుద్ధిలేనిచో, ఇంద్రియనిగ్రహము గల్గియుండనిచో, ప్రాణికోట్ల యెడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి  బ్రహ్మానుభూతి కలుగుట దుస్తరము. ఆతని ఉపాసన కళాయిలేని పాత్రలోవండిన పప్పుపులుసువలె నుండును. వస్తువులన్నియు మంచివి అయినను పాత్ర శుద్ధముగా లేనిచో ఆ పులుసెట్లు చిలుమెక్కిపోయి నిరుపయోగమగునో, అట్లే హృదయశుద్ధి, ఇంద్రియనిగ్రహము, భూతదయ మున్నగు పవిత్రగుణములులేక భగవంతుని నిరాకారముగగాని, సాకారముగగాని యెట్లు ఉపాసించినను పూర్ణఫలితము కలుగదు. కనుకనే గీతాచార్యులు ధ్యానశీలురను హెచ్చరించుటకు కాబోలు, ధ్యాతకు వలసిన మూడు గొప్ప సుగుణములను ఇచట నిర్గుణబ్రహ్మోపాసనాఘట్టమున పేర్కొనిరి. అవి ఏవియనిన - 

  (1) ఇంద్రియ సమూహమును లెస్సగ అరికట్టుట (సంనియమ్యేన్ద్రియగ్రామం)

  (2) ఎల్లెడల సమభావము గలిగియుండుట (సర్వత్రసమబుద్ధయః)

  (3) సమస్తప్రాణులకు హితమునాచరించుట (సర్వభూతహితేరతాః)

    కాబట్టి ముముక్షువులు ధ్యానాదులను సల్పుచు ఈ సుగుణత్రయమును బాగుగ అలవఱచుకొనవలెను.   ఇచట ‘నియమ్య’ అని చెప్పక ‘సంనియమ్య’ అని చెప్పుటవలన ఇంద్రియములను ఒకింత నిగ్రహించిన చాలదనియు,  లెస్సగ నిగ్రహించవలెననియు, ‘సర్వత్ర’ అని పేర్కొనుటవలన సమస్తప్రాణులందును, లేక  ఎల్లకాలమందును సమభావము గలిగియుండవలెననియు, ‘సర్వభూతహితేరతాః’ అని చెప్పుటచే ఏ ఒకానొక ప్రాణియెడల దయగలిగియుండుట చాలదనియు, సమస్త ప్రాణికోట్లయెడల ప్రేమ, దయ, ఉపకారబుద్ధి గలిగియుండవలెననియు స్పష్టమగుచున్నది. ఈ ప్రకారములగు సుగుణములుగల్గి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను జేరగలరని ‘తే ప్రాప్నువన్తి’ అను వాక్యముచే భగవానుడు నిశ్చయపూర్వకముగ తెలుపుచు సర్వులకును అభయమొసంగుచున్నారు. కావున భగవద్ధ్యానపరుడు పైమూడు సుగుణములలు తనయందున్నవా, లేవా యని పరీక్షించుకొనవలయును.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*257 వ రోజు*

*దుర్యోధన ధృష్టద్యుమ్నుల పోరు*

ధృష్టద్యుమ్నుడు సుయోధనునిపై శరవర్షం కురిపించాడు. సుయోధనుడు వాటినిమధ్యలోనే త్రుంచి ధృష్టద్యుమ్నునిపై అతి క్రూరమైన బాణప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు కోపించి సుయోధనుని విల్లు విరిచాడు అతడు మరొక విల్లు తీసుకునే లోపే దానిని కూడా త్రుంచి వేసి అతడి రథాశ్వములను చంపి, రథం విరుగ కొట్టాడు. సుయోధనుడు తన కరవాలము తీసుకుని నేలపై దుముకి ధృష్టద్యుమ్నిపై దూకాడు. అంతలో శకుని వచ్చి సుయోధనుని తన రథం పై ఎక్కించుకుని వెళ్ళాడు. సాత్యకి అలంబసునిపై అతి క్రూర బాణ ప్రయోగం చేసాడు. అలంబసుడు సాత్యకిపై అర్ధ చంద్రాకార బాణ ప్రయోగం చేసి సాత్యకి విల్లు విరిచి, అతడి శరీరాన్ని శరములతో తూట్లు చేసాడు. అప్పుడు సాత్యకి ఇంద్రాస్త్రం ప్రయోగించి అలంబసుని మాయలు మటుమాయం చేసి అలంబసుని ముప్పతిప్పలు పెట్టి సింహ నాదం చేసాడు. అలంబసుడు అక్కడి నుండి పారి పోయాడు. సాత్యకి కురు సేనలపై విరుచుకు పడ్డాడు. కృతవర్మ భీమసేనునితో పోరు సల్ప సాగాడు. భీముడు కృతవర్మ రథాశ్వములను చంపి, సారథిని చంపి, రథమును విరుగకొట్టి కృతవర్మ శరీరమంతా బాణములతో ముంచెత్తాడు. కృతవర్మ వృషకుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళాడు. భీమసేనుడు కృతవర్మను వదిలి కురు సేలపై విరుచుకుబడ్డాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నువ్వు ఎప్పుడూ కౌరవ సేనల రధములు విరిగాయి, కౌరవులు చచ్చారు అని మన వారి వినాశనం గురించి చెప్తావు పాండవ సేనలో వినాశనం జరగ లేదా ? ఎప్పుడూ వారి విజయులైనట్లు చెబుతావేమి ఇదేమి మాయ " అని వాపోయాడు. సంజయుడు " మహారాజా ! కౌరవ సేనలు కూడా వారి శక్తివంచన లేకుండా పోరుతున్నాయి. కాని సముద్రంలో కలసిన నదుల వలె దాని స్వరూపం మారి పోతుంది పాండవ బలమునకు తాళ లేక పోతున్నారు. అది వారి తప్పు కాదు నువ్వు నీ కుమారుడు చేసిన తప్పుకు వారిని నిందించి ప్రయోజనం లేదు " అన్నాడు. అవంతీ దేశాధీసులగు విందాను విందులను యుధామన్యుడు శరపరంపరతో కప్పేసాడు. అనువిందుడు విందుని రథం ఎక్కాడు. యుధామన్యుడు అనువిందుని రథ సారథిని చంపాడు. రథాశ్వములు చెదిరి పోగా వారి సైన్యాలు కకావికలు అయ్యాయి. మరొక చోట భగదత్తుని ధాటికి పాండవ సేనలు చెదిరి పోగా ఘటోత్కచుడు అడ్డుకుని సేనలకు ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. ఘతోత్కచుడు భగదత్తునిపై శరవర్షం కురిపించాడు. భగదత్తుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేసి పదు నాలుగు బాణములను ఘతోత్కచునిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధమును ప్రయోగించగా భగదత్తుడు దానిని మధ్యలోనే త్రుంచి ఘతోత్కచునిపై బాణపరంపరతో నొపించాడు. భగదత్తుని ధాటికి ఆగలేని ఘతోత్కచుడు పారిపోగా భగదత్తుడు పాండవ సేనపై విరుచుకు పడ్డాడు. శల్యునిపై నకులసహదేవులు శరములు గుప్పించారు. శల్యుడు బెదరక నకులుని రథం విరిచాడు. నకులుడు సహదేవుని రథం ఎక్కి శల్యునిపై ఒక క్రూర బాణం వేసి అతడిని మూర్చిల్ల చేసాడు. శల్యుడు రథంపై పడి పోగానే సారథి రథాన్ని పక్కకు తీసుకు వెళ్ళాడు. నకుల సహదేవులు సింహనాదం చేసి శంఖనాదం చేసారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

Yedu taraalu


 

పంచాంగం 15.01.2025 Wednesday,

 ఈ రోజు పంచాంగం 15.01.2025 Wednesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష ద్వితీయ తిథి సౌమ్య వాసర పుష్యమి నక్షత్రం ప్రీతి యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00  వరకు.



శుభోదయ:, నమస్కార: