: SRI SIVA MAHAPURANAM - 27 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu
ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ, విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. “అమ్మా! నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. ఆయనకు శంకరుని మాట ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగీ అంతే. మన మాట వినేవాడు ఒకడు ఉంటే బాగుంటుంది.నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వినే వాడిని తయారు చేస్తే అతడు అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది.
నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది.వాడు లేచి కూర్చున్నాడు.వానితో, ‘నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అన్నది. ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు.ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు.ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది.ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరకు వచ్చి, “అమ్మా ! పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు.నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసిందని చెపితే అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. బ్రహ్మ, విష్ణువు కూడా యుద్ధానికి వచ్చారు.ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు.శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు.త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది.ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు”.
శంకరుడు లోపలికి వెళ్ళాడు.భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది.శివుడు ఆ పిల్లవానిని త్రిశూలము చేత చంపేశాను అన్నాడు. పార్వతీదేవి, ‘ఆ పిల్లాడిని నేనే సృష్టించాను.మీరు చంపేసారా!” అని దుఃఖమును పొందింది.ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు.తన బిడ్డను మరల బ్రతికించమని ఆవిడ శంకరుని అడిగింది.ఆయన తన అనుచరులను పిలిచి, “మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి.ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను” అన్నాడు.వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది.వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు.దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు.ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు.వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేసాడు.వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది.ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.
ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది.విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధి, బుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు.ఇద్దరూ బయలుదేరారు.గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు.సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు.పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను’ అని చెప్పి సిద్ధి, బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు.
సుబ్రహ్మణ్య స్వామి వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.
ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉన్నది.ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని.పార్వతీ దేవి అనగా పరమ ప్రకృతి.పరమశివుడనగా పరమ పురుషుడు.పరమ ప్రకృతి అంటే పంచ భూతములు.
పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు.అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. లోపల చైతన్యం శివుడు. శివ సంబంధమయిన ఎరుక లేదు.లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు.పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉన్నది.ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము.అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము.ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు.ఈ తలకు ప్రకృతి తెలుసు, శివుడు తెలియదు.లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడని తెలియదు.ఆయన దానితోనే పోరాటం చేశాడు.శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేసాడు.
త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు.ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం.ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఎందులోకి వెళుతున్నాడో తెలిసింది.శివసంబంధం వచ్చేసింది.శివుడు తెలిసిపోయాడు.తెలిసిపోవడం గజముఖం.అందుకని శంకరుడికి నమస్కారం చేసాడు.
ఇది చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది.బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి.రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు.
ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు.ఆయనను ఉపాసన చేస్తే ఆయన అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు.ఆయన విఘ్నములకు నాయకుడు.విఘ్నమును తీసేసి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.
గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు.ఈయనకు సిద్ధి, బుద్ధి భార్యలు.బుద్ధిని ఉపయోగిస్తే వారు సిద్ధిని పొందగలరు.బుద్ధనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉన్నది.గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకి సిద్ధి, బుద్ధి భార్యలు అయి ఉండడం.
ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. అది నమలడానికి పనికిరాదు.ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు.మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి.భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగములపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుందని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేసాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు.ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు.
శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు.ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు.కొద్దిగా సింధూరమును గండయుగ్మమునకు రాస్తే చాలు పొంగిపోతాడు.ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము.చివరకు కలలోకి ఏనుగు వచ్చినా మంగళప్రదమే.
గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది.మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది.మన బ్రతుకూ అంతే.విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే ఆయన మనకు ఒక విధమైన దొంగ బ్రతుకును ఇస్తాడు. అది ఎటువంటి దొంగబ్రతుకు? పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు అనగా అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. అలా వహించి పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించడానికే ఎలుకను వాహనముగా పెట్టుకున్నాడు.
గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే సారం వైపుకి నడిపించి పరమభక్తిని ఇస్తాడు.ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.
చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి.ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా విన్నా , చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు.పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు.విద్యార్థికి విద్య వస్తుంది.ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది.కన్యార్థికి కన్య దొరుకుతుంది.పుత్రార్థికి పుత్రుడు పుడతాడు.భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి.మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది.ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది.ఋణభారంతో ఉన్నవారికి ఋణం తొలగుతుంది.ఇక్కట్లలో ఉన్న వారికి ఇక్కట్లు తొలగిపోతాయి.గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడము చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు.ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[22/11, 7:04 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 81 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
శ్రీకృష్ణుని రాసలీల:
రాసలీల ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలయిన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.
శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునానదీ సైకతమునందు ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవము వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా! మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?’ అని అడిగారు.
ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. శుకబ్రహ్మ ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు.
రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాలస్వరూపమయి ఉన్నాడు. యమున కాలప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావనయందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయనయందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, ఏవి నిరంతరము కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో ఉండదు. కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా? వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినదని చెప్పారు. అనంగవర్ధనమనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేసారు. కృష్ణుడు వేయలేదు ఆయన వేశారు. అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినదన్నది బాహ్యార్థము. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది.
ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.
పతిం విశ్వశ్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం’
వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. ఇపుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. వారికి అనంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధురభక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట. రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు.
గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. ‘ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది’ అన్నారు. కృష్ణ పరమాత్మ – ‘అలా మీరు రానూ కూడదు. నన్ను అడుగనూ కూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి’ అన్నారు. వాళ్ళు ‘ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా! నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది’ అని అన్నారు.
వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.
అంగనామంగనామంతరే మాధవో మాధవమ్
మాధవం మాధవం చాంతరే నాంగనా
ఇత్థ మాకల్పితే మండలేమధగః
సంజగౌ వేణునా దేవకీ నందనః
గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపలున్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాదియందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధిస్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.
యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. ‘నేను ఆత్మ దర్శనమును పొందాను’ అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ ‘నేను ఎక్కడి నుండి వచ్చింది’ ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరల జారుడు మెట్లు ఎక్కినట్లే లెక్క. వారందూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.
నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ?
వీళ్ళందరూ మల్లెపొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇస్తున్నాడు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీలని పిలుస్తారు.
రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. శుకుడు ‘ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినే ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అలా భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది?’ అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను. రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది’ అని చెప్పాడు. ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/
[23/11, 5:12 am] +91 94405 46282: ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:
తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా....
అయ్యా......
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.
క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.
పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం.
గురువంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?
కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు!
6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగినజీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్థితి.
దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమికాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.
ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు.
పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.
కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తదా?
భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.
స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు, ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్?
మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?
మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.
🆎👉తల్లిదండ్రులకు నా మనవి... పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో... ఒకటో అరో... ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 99శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.
మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు.
ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి. తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్ పై ఆలోచించండి..
పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % , కానీ 90% మాత్రం తల్లిదండ్రులే..!
పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.
ఇప్పుటి తరం 70% పిల్లలు..
🆎👉తల్లిదండ్రులు తమ కారు, బండి తుడవమంటే తుడవరు..
🆎👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
🆎👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..
🆎👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.
🆎👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...
🆎👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..
🆎👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..
🆎👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
🆎👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
🆎👉అతిథులు వస్తే కనీసం గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..
🆎👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..
🆎👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి..
🆎👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..
🆎👉వారిస్తే వెర్రి పనులు..
🆎👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది
కష్టం గురించి తెలిసేలా పెంచండి
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్,(హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పబ్ లో ఏంజరిగిందో చూశారుగా) దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..
అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..
🆎👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట
[23/11, 5:59 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 82 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
అకౄరుడు బృందావనముకు ఏతెంచుట
అక్కడ కంసుడు కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడోనని చాలా ఆందోళనలో ఉన్నాడు. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న నారదుడు వచ్చి ‘కంసా! ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు? నిన్ను చంపేవాడు వసుదేవుని కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారము తలుపులు తెరుచుకుంటే కృష్ణుని యమునానదిని దాటించి నందవ్రజంలో నందుని దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమ గర్భంలో పుట్టాడు’ అని చెప్పాడు. అనగానే ‘ముందు ఆ వసుదేవుని చంపేస్తాను అని కత్తి తీశాడు కంసుడు. నారదుడు ‘ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోదు. ఎందుకు దేవకీ వసుదేవులను చంపడం’ అన్నాడు. కంసుడు దేవకీ వసుదేవులను తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. వారిద్దరినీ తీసుకువచ్చి చెరసాలలో బంధించారు. నారదుడు ఒకమాట చెప్పాడు ‘నీవు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మరహస్యం చెప్తాను విను’ అన్నాడు.
ఈవిషయమును మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ‘మావంశంలో ఒక మహా పురుషుడు పుట్టాలండీ’ అంటూ ఉంటారు. అలా అనుకున్నవారు కావలసిన రీతిలో నడవడిని కలిగి ఉండాలి. నారదుడు ఈ రహస్యమును కంసుడితో చెప్తున్నాడు. నీవారు నీకు శత్రువులు. ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటికయందు విహరిస్తోంది. ఆవిడకి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రవిళుడు అనబడే గంధర్వుడు ఇతరుల మనస్సులను కనిపెట్ట గలిగిన వాడు ఆ సమయంలో అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. వానికి ఇతరుల మనస్సు తెలుసు. నీతల్లి మనస్సును గ్రహించాడు. ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడు. ఆ వచ్చిన వాడు తన భర్త కాడేమోనని ఆవిడకి అనుమానం వచ్చింది. ఉత్తరక్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. ఆవిడ ఆగ్రహించింది. వాడు ‘ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుడను, నీవు మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్య కాంతలతో సుఖము అనుభవించవచ్చు. దానివలన చాలా తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమము కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడయిన కుమారుడు జన్మిస్తాడు’ అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఆవిడ ‘పరమ దుర్మార్గుడా నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్తరూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నాకు కొడుకును ఇస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వెయ్యి మంది సుపుత్రులు కలిగే కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమయిన పని చేశావు కనుక’ అని అంటూ ద్రవిళుడిని శపించబోయింది. తనని శపిస్తుందేమోనని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. ఆమె ‘నీ వలన నాకు పుట్టబోవు కొడుకు దుర్మార్గుడు అగుగాక! ఋషులను ద్వేషించుగాక! పరమ కిరాతకుడు అగుగాక! వానిని పదికాలముల పాటు రాక్షసునిగా చెప్పుకొనెదరు గాక’ అన్నది. ద్రవిళుడు తానుకూడా శాపిస్తేనే ఆవిడ సంతోష పడుతుందని ‘అతడు తనవారి చేత తాను ద్వేషింపబడుగాక’ అని అన్నాడు. నీవారి చేత నీవు ద్వేషింపబడతావు. నీతల్లి నీవు పుట్టగానే వరం ఇస్తూనే శపించింది. ద్రవిళుడు కూడా శపించాడు. అందుకే నీ బ్రతుకు ఇలా అయిపోయింది. అందుకే నీవారు అన్నవారు నిన్ను ద్వేషిస్తారు’ అన్నాడు.
నారదుడు అలా అనగానే కంసుడు తన బంధువులనందరినీ తెచ్చి కారాగారంలో పడేశాడు. ‘వీళ్ళందరూ నన్ను చంపేవాళ్ళే, వీళ్ళని నేను చంపేస్తాను’ అని అకౄరుని పిలిచి ‘అకౄరా! నీకు తెలుసు నేను బ్రతకాలి అనుకుంటున్నాను. కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. నీవు వెంటనే బృందావనం వెళ్ళి నీ మేనమామ కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. చూడడానికి నీవు బయల్దేరి రావలసింది అని ఆహ్వానించి కృష్ణుని తీసుకునిరా. ధనుర్యాగం మిష పెట్టి ఆ పిల్లవాడు మధురా నగరంలోకి రాగానే ఏదోరకంగా చంపేస్తాను. మన దగ్గర కువలయాపీడము అనే ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులనే ఇద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్లయుద్ధం పెట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేను చంపేస్తాను. ఎలాగయినా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా’ అన్నాడు. అక్రూరుడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతున్నాడు.
మదురానగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అకౄరుడికి కృష్ణుడి మీద ఇంత భక్తి ఎలా ఏర్పడింది? అక్రూరుని తల్లిదండ్రులు గాందిని, శ్వఫల్కుడు. గాందిని తండ్రిగారికి ఒక కోరిక ఉండేది. తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునే వాడు. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో మూడువందల అరవై అయిదురోజులు ‘ప్రతిరోజూ నేను ఒక ఆవును దానం చేస్తాను’ అని మూడువందల అరవై అయిదు రోజులు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజూ ఒక ఆవు చోపున సంవత్సరం పాటు దానం చేశాడు. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాందినికి అకౄరుడు జన్మించాడు. ఈ అకౄరుడు జన్మతః విశేషముగా కృష్ణ భక్తి కలిగినవాడు. ముందుతరం కాక ఆ ముందుతరం వాళ్ళు చేసిన గోదాన ఫలితం నుండి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. అకౄరుని వంటి మహాపురుషుని వలన ఆ వంశం తరిస్తోంది. పుట్టుకచేత ఇంతభక్తి గతంలో చేసిన పుణ్యము వలన వచ్చింది. ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యమును చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడని అక్రూరుని జీవితం తెలియజేస్తుంది.
అకౄరుడు ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ బలరామకృష్ణులను తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకే నమస్కారమునకు అకౄరుని చెపుతారు. అలా వెళ్తూ ఒకసారి భూమిమీదకి చూశాడు. అక్కడ దివ్యరేఖలతో కూడిన చిన్నిచిన్ని పాదముద్రలు కనిపించాయి. అనగా ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడని భావించాడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా! అనుకుని ఒక్కసారి రథమును ఆపాడు. ఒళ్ళంతా ఆనందముతో పొంగిపోయింది. కన్నులవెంట భాష్పధారలు కారుతుండగా స్వర్ణదండము రథము నుండి కిందపడిపోతే ఎలా పడిపోతుందో అలా రథమునుండి క్రిందపడిపోయాడు. తన స్వామి నడిచిన చోట తాను క్రింద పడ్డాను అనుకుని దొర్లేశాడు. ఆ ధూళి అంతా ఒంటిమీద పోసేసుకుని నందుడు ఉండే ఇంటి దగ్గరకు వెళ్ళాడు.
ఆవులమందలో ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని అంతటా వ్యాప్తి చెందినా నారాయణ తత్త్వము నందుని ఇంట్లో పాలు పితుకుతోంది. ‘రాశీభూతమైన పరబ్రహ్మమును నా మాంసనేత్రములతో చూస్తున్నాను. నా జన్మ ధన్యమయిపోయింది’ అనుకుని వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించి మానవ జన్మ ఎత్తినందుకు మీ యిద్దరిని చూసి ధన్యత చెందాను’ అన్నాడు. బలరాముడు అకౄరుడిని గబగబా తీసుకువెళ్ళి ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తనపై చల్లుకున్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవును దానం చేశాడు, తాంబూలం ఇచ్చాడు. బలరామకృష్ణులు వచ్చి అకౄరుని ప్రక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంతో వశుడు అవుతాడు. అకౄరా! మధురలో అందరు కుశలమా అని అడగబుద్ధి వేయలేదు. ప్రభువు ధూర్తుడయిన చోట క్షేమం ఎక్కడ ఉంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు? ఏ పనిమీద మీరు ఇంత దూరము వచ్చారో చెప్పవలసినది’ అన్నారు.
అకౄరుడు ‘మహానుభావా! మీకు తెలియని విషయం కాదు. కంసుడు ధనుర్యాగమనే మిషతో మల్లయుద్ధములను ఏర్పాటు చేశాడు. మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అంతరమునందు కోర్కె వేరు. మీ యిద్దరిని చంపడం కోసం మధుర పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీమీద పడిన మిడతలు కాలిపోతాయి. ఈ రీతిగా నయినా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను’ అన్నాడు. వెంటనే కృష్ణపరమాత్మ అక్కడ ఉన్న పెద్దలను పిలిచి ‘మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలయిన భాండములను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అకౄరుడితో మధురా నగరమునకు వెడతాము. కంసమామ మమ్మల్ని యాగమునకు పిలిచాడు’ అన్నారు. ఈవార్త బృందావనంలో గుప్పుమంది. కృష్ణునితో గోపకాంతలు విపరీతమయిన అనుబంధం పెంచుకున్నారు. వారందరి కోపం అకౄరుడి మీదకు మళ్ళింది. ఇతని పేరు అకౄరుడా! ఇతని పేరు కౄరుడని కృష్ణుని రథమునకు ఆడ్డుపడ్డారు. దామోదరా! గోవిందా! కేశవా! నువ్వు వెళ్ళడానికి వీలులేదు. నిన్ను మేము విడిచిపెట్టి ఉండలేము. నీవు వెళ్ళిపోతే ప్రాణములు లేని శరీరముల వలె పడిపోతాము’ అన్నారు.
పరమాత్మ వాళ్ళతో మాట్లాడలేదు. ‘వాళ్ళని ప్రక్కకి తొలగమనండి ఇది నా ఆజ్ఞ. నేను మధురకు బయల్దేరుతున్నాను’ అన్నాడు. పక్కకి తొలిగారు. రథము వెళ్ళిపోతోంది. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. కంసుని వలన ఏ ప్రమాదము వస్తుందోనని ఆమె బెంగపెట్టుకున్నది. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనిపించినంతసేపు ఉండి తిరిగి ఇళ్ళకు వచ్చేశారు. వెళుతుండగా అక్రూరుడు ఒక చిత్రమయిన పని చేశాడు. రథమును యమునానది ఒడ్డున ఆపి ‘ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను కృష్ణా!’ అన్నాడు. చేసుకురమ్మన్నారు. ఆయన నీటి దగ్గరకు వెళ్ళి ప్రణవమును జపించి ఒకసారి ఆ యమునానది వంక కళ్ళు విప్పి చూశాడు. యమునానది నీటిమీద బలరామ కృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటి? రథం మీద నుండి దిగి నీటిమీద నిలబడ్డారని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. అలా కనపడడం ఈశ్వరుని దివ్యశక్తి అనుకుని యమునానదీ స్నానం చేద్దామని మునకవేశాడు. ఎవ్వరికీ ఇవ్వని దర్శనము పరమాత్మ అకౄరునికి యిచ్చాడు. అంతేకాకుండా అకౄరుడు యమునలో మునిగేటప్పటికి సనక సనందనాది మహర్షులు మొదలగువారు అందరూ స్తోత్రం చేస్తుండగా క్షీరసాగరము నందు ఆదిశేషుని మీద అలవోకగా పవళించిన ఆదితత్త్వమయిన ఆదినారాయణుని దర్శనమును పొందాడు. అకౄరుడు పరమాత్మను అద్భుతమయిన స్తోత్రం చేశాడు.
మనం అటువంటిమూర్తినే తిరుపతిలోని గోవింద రాజస్వామి వారి ఆలయంలో దర్శనం చేస్తాము. గోవిందరాజస్వామి పెద్ద పాముచుట్ట మీద తలవెనుక పెద్ద సొల పెట్టుకొని పడుకుని ఉంటాడు. నాభికమలము నందు చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి, మధుకైటభులనే రాక్షసులతో సహా మనకి దర్శనం ఇస్తారు. ఆయన పొట్టమీద అడ్డంగా తులసిమాలలు వ్రేలాడదీయబడి ఉండగా కన్నులు మూసుకుని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం ఇస్తాడు. మనము అకౄరుని మనసులో తలుచుకుని అకౄరుడు దర్శించిన శ్రీమన్నారాయణ తత్త్వము ఇక్కడ కనపడుతోందని గోవిందరాజస్వామిని దర్శించవచ్చు. అటువంటి దర్శనమును పొంది అకౄరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురా నగరమును చేరుకున్నాడు. కృష్ణుడిని తన ఇంటికి వచ్చి ఆనాటి రాత్రి విడిది చేయవలసినదని కోరాడు. కృష్ణుడు నేను ఇప్పుడు రాను రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుని సంహరించిన తరువాత యోగ్యమయిన కాలమునందు వచ్చి నీయింట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను’ అని మాట ఇచ్చి బలరామకృష్ణులు ఊరిబయట పడుకున్నారు. మరునాటి ఉదయం మధురా నగర ప్రవేశం చేసారు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/
[24/11, 6:12 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 83 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
బలరామకృష్ణులు చేసిన గొప్ప చేష్టితములను తెలిసికొన్న వారైన మధురా నగర వాసులు మేడలమీద నిలబడి వారిని చూస్తున్నారు. ఎంతో ఆనందముగా బలరామ కృష్ణులు మధురా నగరం రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికే చాకలి వాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తలమీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు అతనిని పిలిచి ‘మేము నంద మహారాజుగారి బిడ్డలము. మాకు కూడా ఒక పట్టుపంచె ఇవ్వు. కట్టుకుంటాము’ అన్నాడు. చాకలి కృష్ణుడుతో చాలా పొగరుతనంతో మాట్లాడాడు. ‘ఈవిషయం మా కంసమహారాజు గారికే తెలిస్తే ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు, నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది. ఇవి సాక్షాత్తు కంసమహారాజు గారు కట్టుకొనే పంచెలు. ఇవి మీకు కావలసి వచ్చాయా! వెర్రి మాటలు మాట్లాడకండి’ అన్నాడు. వాని మాటలు విని కృష్ణుడు బలరాముని వంక చూసి ‘అన్నయ్యా ఇంక ఈ పుర్రె మారదు’ అని పిడికిలి బిగించి ఆ చాకలి వాని నెత్తిమీద ఒక గుద్దు గుద్దాడు. వాడు తలబద్దలై చచ్చిపోయాడు.
కృష్ణుడు రజకుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి. చాకలి వాని పుర్రె ఇప్పటిది కాదు. అది త్రేతాయుగం నాటి పుర్రె. సీతాదేవి మీద నిందవేశాడు. ఆ పుర్రె సీతా పరిత్యాగమునకు కారణమయిన పుర్రె. ఎప్పటికయినా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనయినా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూసాడు. ఒక్కొక్కడు అవకాశం వచ్చినా అహంకారముతో నాశనం అయిపోతాడు. ఎక్కడ అలా మాట్లాడాలో తెలియక నోటిమాట వలన చెడిపోతాడు. పొగరుగా మాట్లాడాడు. చచ్చి ఊరుకున్నాడు. ఈశ్వరుని క్షమా గుణమును, మనిషి తెంపరితనమును ఈ రజకుని మరణము ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు.
మరోచోట వృద్ధుడయిన సాలెవాడు ఒకడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురువచ్చి తీసుకు వెళ్ళి ‘ఇవి నేను కంసుని కోసం నేస్తున్న మెత్తటి పంచెలు. మహానుభావా! మీరీపంచె కట్టుకుని కనపడితే ఎంతో బావుంటారు. ఈ పంచె కట్టుకోవలసింది’ అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ పంచె కట్టుకొని సాలెవానికి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి అంత్యమునందు అతనికి సారూప్యము ఇచ్చి తన దగ్గర కూర్చోపెట్టుకొనగలిన ఐశ్వర్యమును కటాక్షించాడు.
సుధాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ ఉంటాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురువచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అర్ఘ్య పాద్యాదులను ఇచ్చాడు ‘కృష్ణా! నా జన్మ ధన్యమయింది. ఏమి అదృష్టం! మీరిద్దరూ ఇవాళ నా దగ్గరకు వచ్చారు. దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పమాలను తీసుకుని అలంకారం చేసుకొనవలసింది’ అని పుష్పమాలలు ఇచ్చాడు. పరమాత్మ పొంగిపోయి నీకు ఏమి కావాలో అడుగు ఇచ్చేస్తాను’ అన్నాడు. ఆనాడు మాలాకారుడు మనం అందరం పూజలో చెప్పవలసిన దానిని అడిగాడు.
నీ పాదకమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపారభూత దయయును, తాపస మందార! నాకు దయసేయ గదే!
కేవలం బ్రతికేయడం కాదు తండ్రీ! ప్రతిక్షణం నీ పాదకమలముల సేవ నేను చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములు పట్టి పూజచేసే మహాభక్తులు ఉన్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. ఏ పదార్థము చూసినా అది ఈశ్వరుడే అని నేను భావించి ప్రేమించగలగాలి దానికి ఎల్లలేదు. పూర్ణమై ఉండాలి. ఈశ్వరా! నాకు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది’ అని అడిగాడు. కృష్ణుడు పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యమునిచ్చాడు.
తదనంతరము ఆ ప్రదేశమును దాటి ముందుకు వెడుతుంటే ఒక కుబ్జ ఎదురువచ్చింది. ఇవి అన్నీ దశమస్కంధములో గొప్ప రహస్యములు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టములు. ఎదురువచ్చిన కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో మూడు వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుచూస్తోంది. కృష్ణ పరమాత్మ ఆవిడ వంకచూశారు. కుబ్జ అందంగా ఉండదు కదా! ఆవిడ కృష్ణుని వంక చూసి
అయ్యా! నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్రని పిలుస్తారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపుచెక్కల మీద గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యములు సిద్ధం చేస్తాను. వాటిని కంస మహారాజుకి పట్టుకు వెడతాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధమును రాసుకుంటే ఈ గంధమునకు అందం వస్తుంది. ఈశ్వరా! కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా!’ అన్నది. కుబ్జ కొద్దిపాటి గంధము ఇచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకనని విచిత్రమయిన సౌఖ్యమును ఇచ్చాడు. కుబ్జ పాదమును తన కుడిపాదముతో తొక్కాడు. తన చేతి రెండువేళ్ళను కుబ్జ గడ్డం క్రింద పెట్టి పైకి ఎత్తేసరికి కుబ్జ మూడు వంకరలు పోయాయి. ఆమె అందమయిన సౌందర్యరాశి అయింది.
ఇళ్ళు లేని వాళ్ళని పూర్వం పాంథులు అనేవారు. అలాంటి వారందరూ పూర్వం సైరంధ్రి యింట్లో ఉండేవారు. సైరంధ్రి పురుషులు అడగడమే తడవు వారికి కావలసిన సౌఖ్యమును కూడా కటాక్షిస్తుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే ‘నేను సైరంధ్రిని, నాకు ఇంత సౌందర్యమును ఇచ్చావు. నీవు ఒకసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే ఆనందమును అనుభవించమని ఆయన మీద ఉన్న ఉత్తరీయమును పట్టుకొని లాగింది. కృష్ణ పరమాత్మ తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారమయిన తరువాత వస్తాను’ అన్నాడు. ఇది మనకు చిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిన తరువాత ఆయన పాదంతో తొక్కాక కూడా ఆమెలో ఇటువంటి వాంఛ ఉన్నదా అనిపిస్తుంది. భాగవతమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రివక్రం అంటే మనసులో ఒకమాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. మూడింటియందు మూడువంకర్లు. ఈ మూడువంకర్లు తీసివేయడమే కుబ్జతనమును తీసివేయడం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వరస్పర్శ కలిగిన వాడు ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని అడుగుతాడు. ఆ సేవకి వేళాపాళా ఉండదు. త్రివక్రకు తన వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుని కైంర్యము అడుగుతున్నది. అందుకు తన యింటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరువాత వస్తానంటున్నాడు. అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అప్పుడు వస్తానని మాట ఇచ్చాడు. తప్ప ఆమెయందు మీరు దోషమును పట్టకూడదు. ఆయన ఒక చిత్రమయిన మాట అన్నాడు ‘నేను పాంథుడను’ అన్నాడు. పాంథుడు అనగా ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాడు. ధనుర్యాగం జరిగే చోటును అడిగి తెలుసుకున్నాడు. ఆయాగం జరిగేచోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉన్నది. కృష్ణపరమాత్మ ఆ ధనుస్సును తీసుకొని సంధించారు. అది రెండుగా విరిగిపోయింది. ఆ ధనుస్సు రెండుముక్కలను బలరామ కృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్న కంసుని సైన్యమునంతటినీ సంహారంచేసి ముందుకు వెడుతుంటే కంసుని గుండెలు అదిరిపోయాయి. కృష్ణుడు తనను చంపివేస్తాడని భావించాడు. కువలయా పీడమనే పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉన్నది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి తోలించాడు. కృష్ణుడు మరణించేలా దాన్ని కృష్ణుని మీదకి తోలవలసిందని మావటివానికి చెప్పాడు. అక్కడ ఉన్న ద్వారపాలకుడు మావటి కలిసి కృష్ణుని మీదికి ఆ ఏనుగును నడిపించారు. ఆ ఏనుగు వచ్చి ఆయనను గట్టిగా చుట్టుచుట్టింది. కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి నాలుగు కాళ్ళ మధ్యలో దూరాడు. అది తన రెండు కాళ్ళ మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుకుతోంది. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యనుండి బయటకు వచ్చి దాని తోక పట్టుకొని దానిని నూరు ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేశారు. సమస్త బ్రహ్మాండములను తన బొజ్జయందు ఉంచుకున్న వాడికి దిక్కుమాలిన ఏనుగును లాగడం పెద్ద కష్టమా! గిరగిర త్రిప్పి విసిరేశాడు. మావటి వాడు పరుగెత్తుకు వెళ్ళి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు.
యుద్ధంలో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయినది ఏనుగు. గుఱ్ఱము తనమీద కూర్చున్న వీరుడిని తీసుకుని పరుగెడుతుంది. యుద్ధమునకు తీసుకు వెళ్లేముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికింకా అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రుసంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతూ దానికి అడ్డు వచ్చిన వాళ్ళని తొండముతో లాగి కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే, తొండము పెట్టి కొడితే, దంతము పెట్టి పొడిస్తే, ఎవడి మీదయినా పడితే చచ్చిపోతారు. ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును కృష్ణుని మీదికి పురిగొల్పాడు. అది చిన్నికృష్ణుని మీదికి పరుగెత్తుకు వస్తున్నది. కృష్ణుడు ఒక్కసారి తనకాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో అని ఘీంకరిస్తూ వంగింది. అలా వంగేసరికి కృష్ణుడు దాని రెండు దంతములు ఊడబెరికేశాడు. అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ కింద పడిపోయింది. అది కింద పడిపోయిన తరువాత దాని దంతములను పెట్టి అక్కడ ఉన్న ఇతర వీరులను మావాటిని సంహరించాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఏనుగు దంతములు రెండింటిని భుజముల మీద వేసుకున్నాడు.
మార్గశీర్ష మాసంలో మనవాళ్ళు తిరుప్పావైని చదువుతుంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసిన దంతముల తోటే ఆయన ఆవిడకు మంచమును చేయించాడు. ఏనుగుకు కువలయా పీడము అనే పేరు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ‘కు’ అంటే భూమి. ‘వలయము’ అంటే భూమండలము. కువలయా పీడము అనగా భూమండలమును పీడించునదని అర్థము. పృథివీ వికారమయిన మనము పూజ చేద్దామని భూమి మీద ఉండి కూర్చుందామని అనుకుంటే ముందు మనలని దేహాత్మాభిమానము అడ్డుతుంది. ఈ శరీర అహంకారమే మనలను పాడుచేేస్తుంది. ‘అమ్మో! ఈవేళ అంతసేపు కూర్చోవాలా’ అంటుంది. కువలయా పీడమనేది దేహమునకు సంబంధించిన అహంకారము. శాస్త్రములో దీనిని ‘అన్న వికారము’ అని పిలుస్తారు. అన్న వికారము అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు. వాటినన్నిటిని తినడం వలన ఇంత శరీరం తయారయింది. ఈ అన్న వికారమయిన శరీరం ఏమవుతుంది? ఇందులో ఉన్న రక్తము భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో వున్న మాంసము కాలిపోతుంది. లేదా పురుగులు తినేస్తాయి. శరీరం పృథివిలో కలిసిపోతుంది. వెంట్రుకలు మాత్రం వెళ్ళి చెట్ల మొదళ్ళను పట్టుకుంటాయి. ఈపాటి శరీరమును చూసుకుని ఎంతో పొగరుతో రెచ్చిపోతూ అహంకారంతో ప్రవర్తించి లేనిపోని పాపములను మూట కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన భ్రాంతి! దీనిని భాగవతంలో కువలయా పీడము అంటారు. జ్ఞానము లేనివాడికి ఇది వాడిని వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది. పాపం బాగా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక మహా పురుషునికి ఇది పుణ్యం చేయించడానికి, వినయముతో నమస్కారం చేయడానికి ఈశ్వరుని ఆరాధించడానికి తాను ఇక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా సంతోషంగా ఉండి గట్టెక్కడానికి పనికివస్తుంది. కంసునియందు ఉన్న కువలయాపీడము పాడుచేయడానికి పనికివస్తుంది. దానికి లోపల ఆ జ్ఞానము ఉంది. ఈ కువలయాపీడమును కృష్ణుడు సంహరించాలి. కువలయాపీడమును ఆయన సంహరించాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/
[25/11, 12:40 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 84 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
వారు మరికొంత లోపలికి వెళ్ళగా చాణూర ముష్టికులు ఉన్నారు. మనలో ఉన్న కామక్రోధములే చాణూరముష్టికులు. వాళ్ళు మల్లయుద్ధం చేస్తారు. వాళ్ళు పట్టుకు పట్టుకు మనలను పడగొడతారు. కంసుడు చాణూర ముష్టికులను ప్రయోగించాడు. అజ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చాణూరుని వేదికమీద మల్లయుద్ధం చేయమన్నాడు. వారిద్దరూ భయంకరమయిన మల్లులు. బలరామకృష్ణులు చిన్నపిల్లలు. వాళ్ళతో ఈ చిన్నపిల్లలకు యుద్ధం ఏమిటని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. వాళ్లకి వచ్చినవాడు పరాత్పరుడని తెలుస్తున్నది. వాళ్ళు – ‘ఇదేమీ వైకుంఠ పురం కాదు కంసుని సభ. ఇది సంసారమును వదిలి పెట్టేసిన వారి సభ కాదు. ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు. ఇది కాలదండము లాంటి నా పిడిగుద్దు. లక్ష్మీదేవితో పరాచికములు ఆడడం కాదు. మాతోటి యుద్ధం చేస్తావా? నీవు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెలు లేవు – సాగి నీవు నడవడానికి వేదాంత వీధి కాదు. రా! నిన్ను మట్టు పెడతాము’ అన్నారు. చాణూరుడితో కృష్ణుడు, ముష్టికునితో బలరాముడు కలియబడ్డారు. బ్రహ్మాండమయిన మల్లయుద్ధం జరిగింది. గరుడుడు పాములను పట్టుకుని ఎగరేసుకు పోయినట్లుగా వాళ్ళిద్దరూ చాణూర ముష్టికులను ఇద్దరినీ సంహరించారు. వాళ్ళిద్దరూ మరణించగానే కంసుని గుండె అదిరిపోయింది. సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు వెంటనే కత్తితీసి భటులను పిలిచి ‘వసుదేవుని సంహరించండి – ఉగ్రసేనుని సంహరించండి – ఈ గోపాల బాలురను మట్టుబెట్టండి’ అని ఉన్మాదంతో కేకలు వేస్తున్నాడు.
కృష్ణుడు సింహాసనం మీదకి ఒక్క దూకు దూకి కంసుని జుట్టు పట్టుకున్నాడు. అంతే కంసుడు పంచత్వమును పొంది చచ్చిపోయాడు. కంసుని మీదకి కత్తి విసరలేదు. యుద్ధం చెయ్యలేదు. ఉగ్రసేనుడికి పట్టాభిషేకము చేసి దేవకీ వసుదేవులను విడుదల చేసి యజ్ఞోపవీతములు వేసుకుని ఉపనయన సంస్కారము పొందారు.
జరాసంధుడు – కాలయవనుడు – ముచుకుందుడు
తరువాత ఒక ముఖ్యమయిన ఘట్టం జరిగింది. జరాసంధుడు యుద్ధమునకు వచ్చాడు. కంసునికి యిద్దరు భార్యలు. వారు జరాసంధుని కుమార్తెలు. వీళ్ళు వెళ్ళి ‘కృష్ణుడు మా భర్తను సంహరించాడు మాకు వైధవ్యం వచ్చింది’ అని జరాసంధుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. జరాసంధుడికి కోపం వచ్చి ఇరువది మూడు అక్షౌహిణుల సైన్యమును తెసుకొని శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా పదిహేడు మార్లు వచ్చాడు. పదేహేడుమార్లు అనేక అక్షౌహిణుల సైన్యమును కృష్ణుడు చంపాడు. పదునెనిమిదవ మాటు మరల జరాసంధుడు వస్తున్నాడు. కృష్ణుడు ఒక చిత్రమయిన పని చేశాడు. జరాసంధుడు మధురానగరమును ముట్టడిస్తే అమాయకులమయిన గోపాలబాలురు మరణిస్తారని తనకి కొంత చోటును ఇస్తే అందులో జలదుర్గము కట్టుకుంటానని సముద్రుడిని చోటు అడిగాడు. సముద్రుడు చోటు ఇచ్చాడు. ఆనాడు విశ్వకర్మను అడిగి సముద్రగర్భంలో ద్వారకానగర నిర్మాణం చేసాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమసత్యమని ఈనాడు బయటపడిన అవశేషాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ ద్వారకా నగరునకు తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకు చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు.
కాలయవనుడని ఒకాయన ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉన్నది. యాదవులు ఎవరూ కూడా ఆయనను చంపలేరు. ఆయన దగ్గరకు వెళ్ళి నారదుడు ఒకమాట చెప్పాడు ‘ నీవు అందరి మీదికి యుద్ధమునకు వెడుతుంటావు. అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, ఒకడు ఉన్నాడు. అతనిని కృష్ణుడని అంటారు. మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. కాలయవనుడు అతని యవన సైన్యమునంతటినీ తీసుకొని వచ్చాడు. కృష్ణుడితో యుద్ధమునకు శత్రు సైన్యమంతా కోటబయట విడిది చేసింది. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం బయటకు వస్తుందని వారు ఎదురు చూస్తున్నారు. కానీ లోపల సైన్యం ఎవరయినా ఉంటే కదా! లోపల బలరామ కృష్ణులు మాత్రమే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా రెండు చేతులు వెనక్కు పెట్టుకొని నెమ్మదిగా కాలయవనుడి దగ్గరకు వస్తున్నాడు. అలా వస్తున్న వానిని చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడిని గుర్తు పట్టి కృష్ణా, నీకోసమే వచ్చాను ఆగు’ అన్నాడు. కృష్ణుడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పారిపోతున్నాడని భావించి కాలయవనుడు గుర్రం మీద కృష్ణుని వెంబడించాడు. కృష్ణుడు కాలయవనుడికి దొరకకుండా పరుగెత్తి పరుగెత్తి ఒక కొండగుహ లోనికి దూరిపోయాడు. గుర్రమును వదిలివేసి కాలయవనుడు కూడా ఆ కొండగుహలోనికి ప్రవేశించాడు. కొండగుహలో దుప్పటి ముసుగు పెట్టుకొని ఒకాయన పడుకుని వున్నాడు. కాలయవనుడు అక్కడ కృష్ణుడే దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నవాడిలా నటిస్తున్నాడని భావించి అతనిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ‘ఎవడురా నన్ను నిద్రలేపిన వాడు’ అని ఆ ముసుగులో పడుకున్న ఆయన లేచాడు. లేచి ఆయన తీవ్రంగా చూసేసరికి కాలయవనుడు కిందపడిపోయి బూడిదయిపోయాడు. పరీక్షిత్తు ఆ దుప్పటి కప్పుకుని పడుకున్నవాడు ఎవరు?” అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు దానికి జవాబు చెప్పాడు.
త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు ముచుకుందుడనేవాడు ఒకడు ఉండేవాడు. అతను మహా తేజోసంపన్నుడు గొప్ప భక్తుడు. రాక్షససంహారమునకు ఒకసారి దేవేంద్రుడు సహాయం అడిగితే వెళ్ళాడు. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు రాత్రింబగళ్ళు యుద్ధం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. కుమారస్వామికి దేవసేనాధిపత్యం ఇచ్చాక దేవతలు ఇతనిని ఏమి కావాలో కోరుకొనమని అడిగితే ఆయన ‘నాకు నిద్రపోవాలని ఉన్నది. నన్ను ఎవరూ నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలో చెప్పండి’ అన్నాడు. వాళ్ళు ఈ గుహ చూపించి అందులో పడుకోమన్నారు. ‘నీకు ఎవరయినా నిద్రాభంగం చేస్తే నీవు వాడికేసి చూసిన తక్షణం వాడు బూడిద అయిపోతాడు’ అని చెప్పారు. కృష్ణుడికి ఈ రహస్యం తెలుసు. అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించడు కదా! ఈవిధంగా ముచుకుందుడి వలన కాలయవనుడు మరణించాడు.
ఇపుడు పదునెనిమిదవ సారి జరాసంధుడు వచ్చాడు. బలరామ కృష్ణులిద్దరూ కోటలోనుండి బయటకు వచ్చి మరల పరుగు మొదలుపెట్టారు. జరాసంధుడు వారివెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతమనే పెద్ద పర్వతమును ఎక్కి బలరామకృష్ణులు అక్కడి పొదలలోకి దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షములను ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్లకి బలరామకృష్ణులు కనపడలేదు. జరాసంధుడు ఆ పర్వతము నంతటినీ తగల పెట్టెయ్యమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు మొత్తం పర్వతమంతా తగులపెట్టేశారు. అగ్నిహోత్రుని కాంతులు ఆకాశమునకు అంటుకున్నాయి. బలరామకృష్ణులిద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మీదనుండి సముద్రంలోనికి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ మరణించి ఉంటారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణబలరాములు మాత్రం క్షేమంగా ఉన్నారు.
ఇందులో తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఉన్నది. ‘సంధి’ అనగా సగము సంధికాలము వచ్చింది. యుగ సంధి వచ్చింది అంటారు. ఎవరినయినా ఆశీర్వచనం చేస్తే ‘శతమానం భవతి శతాయు పురుషశ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతీ’ అంటూ నూరు సంవత్సరములు జీవించు అంటాము. నూరు సంవత్సరములలో సగము ఏభై. మీరు ఈశ్వరారాధన ఈ ఏభై లోపల చెయ్యాలి. ఏభై తరువాత చేసే ఆరాధన మానసికమయినది. ఏభై తరువాత అంత కలివిడిగా శరీరముతో ఈశ్వర సేవ చేయడం కష్టం. మనం చేసే పెద్ద పెద్ద యాత్రలన్నీ ఏబది సంవత్సరముల వయసు లోపల పూర్తి అవాలి. జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే కాలయవనుడు తరుముతాడు. మృత్యువు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు గుహలోకి దూరిపోయాడు. అనగా హృదయగుహలోకి వెళ్ళిపోయాడు. ముచుకుందుడు నిద్రలేచాడు. హృదయంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితి గతుడయిపోయిన వాడికి మరణం ఉండదు. కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఉండదు. జరాసంధుని తప్పుకోవడానికి ప్రవర్షణ పర్వతమును ఎక్కాడు. అలా చేయడం అనగా నిరంతరము భక్తితో ఉండడం. పరమభక్తితో ఉంటే మృత్యువు మిమ్ములను ఏమీ చేయలేదు. యమధర్మరాజు గారు, యమదూతలు దాపులకు రారు . పరమభక్తుడయిన వాడిని తీసుకు వెళ్ళడానికి నారాయణుని పార్షదులు వస్తారు. శివుని పార్షదులు వస్తారు. ప్రవర్షణ పర్వతం అంతా కాలిపోయింది. సముద్రాంతర్గతమయిన ద్వారకను అనగా ఈశ్వర స్థానమునకు చేరుకున్నాడు. ఈవిధంగా లోకమున కంతటికీ జీవయాత్రను ఈశ్వరుడు ఇలా బ్రతకడం నేర్చుకో అని నిరూపించి చూపించాడు.
రుక్మిణీ కళ్యాణం:
భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు. ఈ దశమ స్కంధమును పూర్వోత్తర భాగాములని మరల రెండుగా విభజించారు. పూర్వభాగమును రుక్మిణీకళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందు వలన, చూసినందు వలన, వినినందు వలన, చదివినందు వలన కలిగే ఫలితం చెప్పడానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడయిన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీకళ్యాణ ఘట్టమును ప్రారంభం చేస్తూ పోతనగారు
వినుము విదర్భదేశమున వీరుడు కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గల; డాతని కేవురు పుత్రు లగ్రజుం
డనయుఁడు రుక్మినా బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణి నా బ్రసిద్ధయై.
విదర్భ దేశమును భీష్మకుడు అనే దొడ్డ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అయిదుగురు కుమారులు. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్టచివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. అయిదుగురి చెల్లెలయిన రుక్మిణి పెరిగి పెద్దది అవుతోంది.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెన గూళులు గొమరొప్ప వండించి చెలులకు బెట్టించు జెలువు మెఱసి;
రమణీయ మందిరారామదేశంబుల బువ్వు దీగెలకును బ్రాది వెట్టు
సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు
బాలికలతోడ జెలరేగి బంతు లాడ శారికా కీర పంక్తికి జదువు సెప్పు
బర్హి సంఘములకు మురిపములు గఱపు, మదమరాళంబులకు జూపు మందగతులు.
ఆ తల్లి చిన్నప్పటినుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీ దేవి అంతఃపురమునుండి డోలు, సన్నాయి వినబడుతూనే ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపుకుంకుమలు నిలబడతాయి. ఆవిడ గుజ్జనగూళ్ళను ఒండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్ళు చేసే పనులు పరమ సౌకుమార్యంతో ఉంటాయి. ఆవిడ లతలకు, తీగలకు చక్కగా పందిరి వేసేది. ఊయలలు ఊగుతూ ఉండేది చిలుకలకు పలుకులు నేర్పుతుండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నది.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/
[27/11, 11:20 am] +91 81055 36091: సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు....
స్కందోత్పత్తి – కుమారసంభవం
మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా ! నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.
ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగానరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ ముక్కలుగా నరికేశాడు. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది.
ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ ‘నాయనా! నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి, వరాంగికి పెళ్ళిచేశారు.
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగితే వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ! వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా! ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.
తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారీ ! శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివతేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరు కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వరా! మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా! దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను? అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు,దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.
ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.
ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేసారు. ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనకే ‘గుహా’ అనే పేరు ఉంది. పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[27/11, 6:28 pm] +91 81055 36091: Srimadhandhra Bhagavatham -- 86 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అగ్నిద్యోతనుడు అన్నాడు ‘ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. భగవంతుని చూపించేవాడు గురువు. ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ ఇద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడనే ఒక ధైర్యం నిలబడాలి. కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటాడు. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు.
బలరాముడు ‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?’ అని అడిగాడు. ‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షసవివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు.
కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడు! మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.
ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతు డై చిక్కెనో?
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుగదో? నా భాగ్య మెట్లున్నదో?
‘అగినిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’ అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు
తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై
మగడౌ గావుత జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్.
‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో ! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని ఇచ్చేస్తాము. మా పుణ్యఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది.
అమ్మవారు అన్న మాటలో ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట ఉన్నది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.
బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే!
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చే త్యాది రూపం దధౌ
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యా త్పూజ్యతర స్స ఏవహి నచే త్కోవా? తదన్యోధికః ||
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయిన వాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.
అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు. రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగలుగుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెఱకుకర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ము బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయు మమ్మ! నిన్
నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ యీశ్వరీ !
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు ఇద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా! నీవు తరగని అయిదవతనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ! నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అన్నది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది.
రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందరో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావ ల
గ్ను నవాంభోజదళాక్షుజారుతరవక్షున్ మేఘ సంకాశ దే
హు నగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాం బరున్
ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్.
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది.
ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు
బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగెనేని భార్య కలదు
బ్రతికితీవు; భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు.
శిశుపాలా! నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి
మా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెఱుగు?
మానహీనుడ వీవు? మర్యాద లెఱుగవు; మాయ గైకొని కానీ మలయ రావు;
నిజరూపమున శత్రు నివహంబుపై బోవు; వసుధేశుడవు గావు వావి లేదు;
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు.
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా! నిన్ను ఇప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.
కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నింద చేస్తున్నాడు. అది స్తుతిపాఠం అయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు.
అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతో
గనుదోయిన్ జడిగొన్న బాష్పములతో గన్యాలలామంబు మ్రొ
క్కిన రుక్మిం దెగవ్రేయబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై.
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా! నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకున్నది. కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల, గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు.
తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.
ధ్రువకీర్తిన్ హరి పెండ్లి యాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినదయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.
అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి
పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతి లగుచు ముక్త భీతు లగుచు.
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/