ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, జనవరి 2024, సోమవారం
గుహుని రామభక్తి!
గుహుని రామభక్తి!
చ: "సుడిఁగొని రామపాదములు సోకిన ధూళివహించి రాయి యే
ర్పడ నొక భామ యయ్యెనట!::,పన్నుగ నీతని పాదరేణువి
య్యడ వడిసోఁక నిది యేమగునో యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామ పదకంజయుగంబు భయంబు పెంపునన్.
మొల్లరామాయణము--- కుమారి మొల్ల కవయిత్రి;
సరళతరమైన మనోజ్ఙమైన రామాయణ రచనగా ఆంధ్ర సాహిత్యంలో మొల్లరామాయణానికి విశిష్టమైన
స్థానం ఉంది. చదువరులకు విసుగు జనించనిరీతి నాసాంతము నొప్పారెడు యీగ్రంధము.మన సాహిత్య సంపదకు వెలలేని యలం
కారము.
రాముడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యమునకు బోవునపుడు గంగను దాటు సందర్భమున నీపద్యము చోటుచేసికొన్నది. గుహుడు నావను నడపి జీవించువాడు. పామరుడే కాని గుండెలనిండుగా రామభక్తి కలవాడు.
నదీతరణమొనరింప రాముడు నావ నెక్కునపుడు గుహుడాతని పదపద్మములను ప్రక్షాళనమొనరించెనట! దానికొక హేతువు
నీకవయిత్రి కమనీయముగా సూచించుచున్నది.
ఆటవికుడు పామరుడును అయిన గుహునకు సందేహముకలిగినదట. ఏమని? వెనుక గౌతమాశ్రమ సందర్శన
సమయమున రాముని పాదరజము సోకి ఒక రాయి వనితామణియైనదని విన్నాడు. మరి రామపాద మహిమచే తన నావ గూడ
నట్లయినచో తనగతియేమి? జీవికయా పోవును. సవతి పోరు ప్రారంభమగును. ఇదీ వాని సందేహము.
తత్పరిహారముగా రాముని పద పద్మములను గుహుడు కడిగినాడు అని మొల్ల సమర్ధనము.
దీనివలన
రామపాద ప్రక్షాళణ పలమూ వానికి దక్కినది. సందేహమూ తీరినది. ఎంత చక్కటి కల్పనము!
స్వస్తి!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
జానపద కళారూపాలు*
. *జానపద కళారూపాలు*
--------------------
ఒకానొకప్పుడు పల్లెలు కళారూపాల ప్రదర్శనకు ఆలవాలాలుగా వుండేవి. సంవత్సరంలో అనేకరోజులలో అనేకరకాలవారలైన కళాకారుల ప్రదర్శనలవారితో సందడి సందడిగా వుండేవి.
వారంతా ఆ ఆ గ్రామాలవారే కానక్కరలేదు, వివిధ ప్రాంతాలనుండి వచ్చి , ప్రజాకర్షణీయమైన వివిధరకాలైన కళలను ప్రదర్శించేవారు. అలా ప్రదర్శించినవారిలో, కొందరు ధనరూపేణా, మరికొందరు ధాన్యరూపేణా గ్రామాలలోని వివిధవర్గాల ప్రజలనుండి బహుమతులుగా అందుకొని, అలావచ్చిన వాటితో ఏడందంతా జీవనోపాధిగా మలుచుకొని, పిల్లాపాపలతో ఉఖంగా కాలంగడిపేవారు..అలాటి కళారూపాలను ప్రదర్శించేవారిలో కొందరు కళాకారులనుగూర్చి తెలుసుకొందాం.
మాచిన్నప్పుడు మా రౌతులపూడికి రకరకాల కళాకారులు బ్రతుకు తెరువుకోసం వచ్చేవారు. పంటలు ఇంటికొచ్చే సమయంలో అయితే మరీ ఎక్కువమంది వచ్చేవారు. వాళ్ళలో పగటి వేషగాళ్ళు, పిట్టలదొరలు, దొమ్మరాటలవాళ్ళు, విప్రవినోదులు, జంగందేవరలు, కొండచెంచులు, తోలుబొమ్మలాటలవాళ్ళు ,బుడలుడక్కలవాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు, ఇలా రకరకాలవావాళ్ళు వచ్చేవారు. వీరిలోకొంతమది డబ్బులు ఇచ్చినా తీసుకొనేవారుకాదు. రైతుల కళ్ళాలలోకెళ్ళి ధాన్యంమాత్రమే వారిచ్చినంతమేరకు సంతోషంగా పట్టికెళ్ళేవారు. కొంతమందిమటుకు కొత్తబట్టలు పెట్టమని అడిగేవారు కానీ, కొత్తబట్టలతోపాటుగా పాతబట్టలు శుభ్రమైనవి ఇచ్చినా పట్టికెళ్ళేవారు.
అలామాఊరు వచ్చిన కళాకారుల్లో పగటి వేషగాళ్ళు, పిట్టల దొరలు, దొమ్మరాట వాళ్ళూ, కొమ్మదాసరులు, పిల్లలను బాగా ఆకర్షించేవారు. వారు ఎక్కడ ప్రదర్శనలిస్తే అక్కడికి పొలోమని పిల్లలంతా వారిని కూడావెంటబడి పోయేవారు. తాటకి వేషం వేసిన వేషగాళ్ళని చూస్తే, పిల్లలకి ఒకరకంగా ఆసక్తిగా, మరోరకంగా భయంగా వుండేది. పెద్ద ఎత్తైన శరీరం, నల్లటి నలుపు, పెట్టుకొన్న రాక్షస కోరలు. జడలుకట్టిన జులపాలవంటి జుట్టూ, మొలకి వేపాకులు చుట్టుకొని, ఎత్తెత్తు వెనుకభాగంతో, బారకో అడుగు, మూరకో
అడుగు వేస్తూ డప్పుల లయకు శరీరాన్ని ఊపుతూ, నల్లటి కొండలా కదిలి వెళుతున్నట్లు తాటకి వేషదారి వెళుతుంటే, పిల్లలు భయపడుతూనే, వెంటబడి వెళ్ళేవారు. ఆ తాటకి పిల్లలను తమాషాగా భయపెట్టడానికి, వున్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసేసరికి,
పిల్లలు భయంతో పెద్దగా అరుస్తూ వెనక్కి పరుగుదీసేవారు. అలా అని ఆగిపోతారా, అంటే అలాగాగిపోరు మళ్ళీ తాటకి వెంటపడతారు. అదో తమాషావారికి.
పగటి వేషగాళ్ళు రాముడూ సీతా, లక్ష్మీ విష్ణుమూర్తి, ఆంజనెేయుడూ, గరుక్మంతుడూ, రాధా కృష్ణులు మొదలైన పురాణాలలో వేషాలు వేసేవారు. అవే కాకుండా, నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్ మేదలైన దేశభక్తుల వేషాలూ వేసేవారు. అయితే, మొఖంలో సగభాగం శివుడిగా, సగభాగం పార్వతిగా, సగభాగం పులితోలూ, సగభాగం చీరకట్టుతోనిపించే అర్థనారీశ్వర వేషం చాలాబాగుండేది. అలా క్షణంలో ఎలా శివుడిగా, పార్వతిగా ఎలామారిపోతారో అని అప్పట్లో చాలా ఆశ్చర్యంగా వుండేది. తలమీదనుండి కప్పుకున్న గుడ్డను ముక్కుమీద సగభాగానికి వచ్చేలా కప్పుకొని, మొఖానికి ఒకపక్క శివునిగా, మరోపక్కన పార్వతిగా రంగులువేస్తారన్న విషయం,ఆగుడ్డను ఒకసారి శీవునివైపు, మరొకసారి పార్వతివైపుకు మారుస్తూ, శివపార్వతుల డైలాగులను చెపుతారన్నవిషయం అప్పట్లోమాకు అస్సలు తెలియదు.
కొమ్మదాసరి ముచ్చట్లు చెప్పనేలేము. దగ్గరలోవున్న చెట్టును చటుక్కున ఎక్కేసి,"ఓ సూరమ్మప్పయ్యో,! ఓ రామమ్మప్పయ్యో! ఓ పేరమ్మప్పయ్యో!
ఓ పచ్చచీర ట్టుకొన్నప్పయ్యో! ఓ ఎర్రచీర కట్టుకొన్నప్పయ్యో! ఉరికేస్తున్నా! ఉరికేస్తున్నానప్పయ్యో!పప్పుదాకలోకురికేస్తున్నానప్పయో!ఉప్పుదాకలోకురికేస్తున్నానప్పయ్యో!" అంటూ చేతిలో ఆచెట్టుకొమ్మ నొకటి విరిచి పట్టుకొని లయబద్దంగా పాడుతూ అతడు చేసే హడావిడి పిల్లలనూ, పెద్దలనూకూడా నవ్వుల్లో ముంచెత్తేది.
అలాగే పిట్టలదొర. "దొరలమొచ్చేము.పిట్టలదొరలమొచ్చేము" అంటూ కర్రతుపాకీ పట్టుకువచ్చి చేసేహడావిడి అంతా ఇంతా కాదు. "హడావిడిగావుంది-హడావిడిగావుంది. మీ ఎత్తైన అరుగులు పల్లంచేయమంటారా? ఇంటింకీ కుళాయిలు,ఇంట్లో ఒక కుళాయి, పొయ్యమీదొక కూళాయి, పొయ్యిక్రిందోకుళాయి" అంటూ చెప్పేకబుర్లకు పొట్టలుపట్టుకు నవ్వవలసిందే జనాలందరూ.
ఇక దొమ్మరాట చిన్న చిన్న పిల్లలను ఎత్తైన గడపైకి
ఎక్కించి, బొడ్డును బేస్ గా చేసుకొని, డప్పుల ధ్వనికణుగుణంగా గిర్రుమని గుండ్రం తిప్పటం, రెండు గడలను దూరం దూరంగాపాతి, వాటికి సన్నని తాడుకట్టి, చేతితో ఒక పొడవైన గడకర్ర గుడ్రంగా తిప్పుతూ, ఆతాడుపైన యువతులు బేలన్స్ గా నడుస్తుంటే, కళ్ళు ఆర్పకుండా, నోళ్ళు తెరచి చూసేవారు.
మరో కళాకారుడు నెత్తిమీద నూనె మూకుడు పెట్టి, మూకుడులో పకోడీలువండి పంచి పెట్టే ఛూ..మంతరకాళీ వాళ్ళను చూస్తుంటే భయంతో కూడిన ఆకర్షణగావుండేది.అయితే,చాలామంది పిల్లలు ఝడుసుకొని జ్వరంకూడా తెచ్చుకొనేవారు.
అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి, తలపైన పేకాటలో కింగ్ నెత్తిపైన వుండే కిరీటంలాంటి టోపీ పెట్టుకొని, డమరుకం మ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.
తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద భజన తప్పెట్లు పట్టుకొని,గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు "హరిహరీ నారాయణా-ఆదినారాయణా- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. "అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ భళ్ళు భళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ, ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళాజాతర, చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.ఆ భజనతప్పెట్ల శబ్దాలు మనగుండెల్లో మ్రోగినట్లుండేవి..
అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి డమరుకంమ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.
తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద భజన తప్పెట్లు పట్టుకొని, గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు హరిహరీ నారాయణాదినారాయణ- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ, బళ్ళు బళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళారూపం చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.
ఇక తోలుబొమ్మలాట వాళ్ళఆట వినోదం చూసితీరవలసిందే!కెెేతిగాడు, గుర్రాలక్కల హాస్యం వినితీరవలసినదే.ఈ తోలుబొబ్బలాట ఇప్పటికీ, అక్కడక్కడా కనిపిస్తోంది. వాళ్ళు తమకళను అదునాతనంగా మలచుకొని, నిలదొక్కుకోవడానికీ విశ్వప్రయత్నం చేస్తున్నారు.
బ్రహ్మాల ఇళ్ళవాళ్ళు గౌరమ్మను తీసేమని, పెద్ద గౌరీదేవి ఆకారంలోని కర్రబొమ్మని నెత్తికెక్కించుకొని చేసే సంబరం కూడా చూడవలసినదే. హరికథలు భక్తిని ప్రభోదిస్తే, బుర్రకథలు వీర రసం, శోకరసం వొలికిస్తూ, శ్రుతిలయ భధ్ధంగా అడుగులేస్తూ, పాటపాడుతూ ముగ్గురు మనుషులు కథ చెపుతుంటే, వీరరసం తో గుండెలు ఉప్పొంగిస్తూ, శోకరసంతో గుండెలు పిండేస్తూంటే వంతగాడు హాస్యం చెపుతుంటే మనలో ఆఆ రసాలు ఉత్తేజితులను చేస్తాయి.
అలాగే హరికథలు. భక్తిరసంతోకూడిన హరికథలను, చూడవచ్చిన జనంలో భక్తినిండి, పరవళ్ళుత్రొక్కేలా గానం చేసేవారు. మధ్యమధ్యలో హరిదాసు చమత్కారంతో, హాస్యంతో నిండిన పిట్టకథలను చెపుతుంటే , వినేవారి ఆనందమేవేరు. ఎక్కడ హరికథలను చెపున్నారని తెలిసినా జనం ఆలకించడానికి పరుగులు తీసేవారు.
ఇక నాటకాల సంగతి చెప్పేదేముంది. వాటిగురించి చెప్పలేనిదేముంది?ఎన్నెన్ని నాటకాలు? పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు,పద్యనాటకాలు, గద్యనాటకాలు. మొదటి రెండవతరం సీనీమావాళ్ళంతా నాటకాలలో నటన నేర్చుకొని, అధ్భుతంగా ప్రదర్శనలిచ్చి, ఆ తరువాత తరువాత సినీమాలలో అధ్భుతంగా రాణించారు. ఎనలేని కీర్తిని మూట కట్టుకొన్న వారెందరెందరో.
మరొక కళారూపం విప్రవినోదం. విప్రవినోదులు బహుశా బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారై వుండివుంటారు.అందువలనే ఆ కళకు విప్రవినోదం అనే పేరు వచ్చివుండవచ్చు.
వీరి వస్త్రధారణ,భాష కూడా తమాషాగా వుంటుంది. పంచకట్టు, చొక్కాపైన కోటు, తలకు కాబూలీవాలాలాంటి రంగురంగులగుడ్డతో తలపాగా, భుజానికి ఒక పెద్దసంచీ, చేతిలో వెండిపిడి కలిగిన లాఠీతో హుందాగా నడచుకొంటూ వస్తారు.
వీరి విప్రవినోదకళ పిల్లల్ని పెద్దల్నికుడా బాగా ఆకర్షిస్తుంది. అందుకనే వీరి ప్రదర్శనదగ్గర జనం గుంపుగూడతారు.
ఈ విప్రవినోదం అనేకళ, ఒకరకంగా ఇంద్రజాలం అనిచేప్పవచ్చు. అందుకనే ఇతగాడు మాటకీ మాటకీ మధ్యన, "ఇంద్రజాల-మహేంద్రజాల, జలయక్షిణీ మహేద్రజాల యక్షిణీ, రా.."అంటూ, తన భుజంనుంచి క్రిందకు దింపిన సంచీ పైభాగానికి, తన వెండిపొన్నులాఠీని తాకిస్తూ, తన నుదుటికి తాకించు కొంటుంటాడు.
"జలయక్షిణీ-మహేంద్రజాలయక్షిణీ " అంటూ మంత్రంలా చదువుతూ, సంచిలోంచి గెచ్చకాయయతీసి, గుప్పిటిలో మూసి, ఆగుప్పిటపై లాఠీని తాకించి, ఆ గెచ్చకాయను శరీరం లేకుండా, తలమాత్రమే కల చిలుక పిట్టను చేస్తాడు. ఆ చిలుకపిట్టతో అతడు చేసే సంభాషణ భలే తమషాగావుంటుంది.
"అయితే చిలకమ్మా! అమ్మగారు నీకు పప్పన్నం పేడతారు తింటావటే?" అంటాడు. అది "తింటా-తింటా-తింటా"అంటుంది.
"అయితే నెయ్య వేసుకుంటావా, వద్దా" అంటాడు.
అది వేసుకొంటా, నెయ్యి వేసుకొంటా!" అంటుంది.
"అయితే చిలకమ్మా!ఆవునెయ్యి వేసుకొంటివా?గేదనెయ్యా?" అంటాడు.
అది, ఆవునెయ్యే!ఆవునెయ్యే, ఆవునెయ్యే !" అంటుంది.
"మరిగేద నెయ్యి ఎందుకువెసుకోవే ?" అంటాడు.
"హమ్మో!జలుబుచేస్తుంది-జలుబు చేస్తుంది-జలుబు చేస్తుంది." అనగానే, అక్కడ గుమిగూడిన జనమంతా ఘొల్లున నవ్వుతారు.
అలాగే విప్రవినోది సంచీలోంచి ఇసుకను తీసి, పసుపుకుంకుమలుగా చేసి అందరికీ కుంకుమ బొట్లుపెడతాడు. గెచ్చకాయను సంచీలోంచి తీసి, దానికి "జలయక్షిణీ అంటూ మంత్రంచదివి, గెచ్చకాయను రూపాయకాసును చేసి, దగ్గరగా వున్న వాళ్ళ చెవిలోకి పంపించి, మంత్రంచదువుత, లాఠీని ముక్కుకు తాకించి, ముక్కులోంచి రూపాయి కాసును రప్పిస్తాడు.
అలాగే, గెచ్చకాయను సంచీలోంచి తీసి, జలయక్షిణీ అంటూ మంత్రం చదివి, లాఠీ తిటించి, పొడపాము పిల్లను చేయడం చూస్తుంటే, మనశరీరం భయంతో గగుర్పొడుస్తుంది.
ఇలాంటివే మరెన్నెన్నో ప్రదర్శిస్తాడు విప్రవినోది. మనని మంచిమాటలతో కనికట్టుచేసి, బియ్యం, డబ్బులూ, బట్టలూ మొదలైనవి దండిగా తీసుకెళతాడు.పొలాలోకి వెళ్ళి, రైతులదగ్గర మంచిమాటలు చెప్పి ధాన్యం
తీసికెళతాడు.
కవితకు కాదేది అనర్హంది అన్నట్లు గానే, ఈ జానపదకళలలో ఏదిమంచీ, ఏది చెడ్డా? ఏదిబావుంటుంది ?ఏదిబాగుండదు ? అంటే అన్నీ బాగుండేవే జానపదకళలూ-కళారూపాలు.
నేడు జానపదకళలకు ఆదరణ కొరవడి, చాలామటుకు మరుగున పడిపోయాయి. ఇంకా ఒకటో అరావున్నా, అవికూడా మరుగునపడిపోయే చరమాంక దశలలో వున్నాయి. ఇప్పటి తరంవారికే చాలామటుకు ఈ కళల గురించి తెలియదు. రాబోయేతరాలకు తెలుసుకోవడానికి కూడా ఇవేవీ మిగిలివుండవు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*హరి పరమాత్ము నచ్యుతు ననంతుని చిత్తములం దలంచి సు*
*స్థిరత విశోకసౌఖ్యముల చెందిన ధీనిధు లన్యకృత్యముల్*
*మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడుం*
*బరువడి నుయ్యి ద్రవ్వునె పిపాసితుడై సలిలాభిలాషితన్*
ఆయన హరి. సర్వాన్నీ తనలోనికి తీసుకొనే స్వభావం కలవాడు. పరమాత్మ. అంతయూ తానే అయి అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయన అనంతుడు. ఎక్కడనో అయిపోవటం అనే లక్షణం లేనివాడు. అట్టి మహాప్రభువును మనస్సులలో భావించి ఎప్పటికీ నశించినవీ, దుఃఖం అణువంతకూడా లేనివీ అయిన సుఖాలను పొందే బుద్ధిమంతులు ఇతరములైన పనులను, మరచికూడా, చేయటానికి ఇష్టపడరు. ఆలోచిస్తే అది అటువంటిదే. దేవేంద్రుడంతటివాడైనా దప్పిక కలిగినప్పుడు పారా, పలుగూ పట్టుకొని గబగబా నుయ్యి త్రవ్వుతాడా!
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
చరితామృతం
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*
. *భాగం - 21*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*
. *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*
70 సంవత్సరములు వయస్సు గల తిరుమలదాసు అనే చాకలి వాడు శంకరభట్టును నులక మంచం మీద కూర్చుండబెట్టి ప్రసాదమిచ్చి తినమని చెప్పినప్పుడు బ్రాహ్మణ జన్మంహకారము నశించుటవలన,ఏ జాతి వాడైనా గురు బంధువు గా భావించడం వలన తిరుమలదాసు చెప్పినది
విన సాగేడు.
ఈరోజు ఎంతో సుకృతము శ్రీపాదులవారి కృపా కటాక్షాలతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైందని అతి శ్రద్ధగా స్వామివారి పీఠికాపుర విశేషాలు గురించి చెప్పిన ప్రతీ అంశము గుర్తుపెట్టుకొని గ్రంధస్థం చేసి చరితాద్రుడవు కావలసినదిగా చెప్పెను. తాను పూర్వజన్మలో వేద పండితుడునని తాను అవసాన దశలో దైవ స్మరణ చేయకుండా సంసారబంధములలో చిక్కుకుని పాతగుడ్డలను తినుచున్న గోవత్సవమును నివారించమని పిల్లలకు చెప్తూ శరీరంవదలడం వలన నాకు ఈ చాకలి జన్మ వచ్చినదని,
నా పూర్వజన్మ పుణ్యంకొలదీ గర్తపురి(గుంటూరు) మండలమున మాల్యాద్రి పురము (మల్లాది) అను గ్రామమున జన్మించితిని అని చెప్పెను.ఆ గ్రామమున మల్లాది అను గృహనామంతో రెండు కుటుంబాలు కలవు.ఒకరు మల్లాది బాపన్నావదానులు హరితస గొత్రీయులు అయిన మహామహా పండితులు,ఇంకొక కుటుంబమువారు శ్రీధర్ అవధానులు కౌశికస గొత్రీయులయిన మహా పండితులు వుండేవారు. శ్రీధర్ అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నవధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి.
శ్రీ బాపన్నావధులవారు
శ్రీధర అవధానులు వారు బావబావమరుదులు అయినారు. ఈ బావా బావమరుదులు
ఏ మహా యాగమైనా
కలిసి నిర్వహించేవారు.
ఒకసారి గోదావరీ తీరమున అయినవిల్లి అను గ్రామమున స్వర్ణగణపతి మహా యజ్ఞం నకు విచ్చేసిరి. వీరిద్దరూ ఒకరికి మించిన పండితులు ఇంకొకరు. పూర్ణాహుతి రోజున స్వయంగా గణపతి స్వర్ణకాంతులతో విచ్చేసి తోండం తో యజ్ఞ ప్రసాదంను అందుకొనునని ఈ బావా బావమరుదులు చెప్పి యజ్ఞం ప్రారంబించిరి.తామిద్దరూ అతి శ్రద్ధాభక్తులతో మంత్రోక్తముగా చేసిన యాగానికి నిజంగానే గణేశుడు ప్రత్యక్షం అయి యజ్ఞ ప్రసాదాన్ని స్వికరించి అనతికాలములో వారు గణేశ చతుర్ధి నాడు సర్వకళలతో శ్రీపాద వల్లభ రూపమున అవతరించెదనని ఆనతి ఇచ్చిరి. ఆ యజ్ఞానికి విచ్చేసిన వారందరూ ఆశ్చర్యచకితులయిరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులు ఇది కనికట్టేగాని నిజంగా జరగలేదు అని వాదించిరి. ఈ ముగ్గురే మరు జన్మలో గుడ్డి,చెవిటి,మూగలుగా జన్మించెదరని వినాయకుడు వీరి యజ్జ కుండం లో భస్మం నుండి ప్రత్యక్షం అయి శాపమిచ్చెను. అంత వారు వేడుకొనగా ఈ ముగ్గురు మూగ,గుడ్డి,చెవిటి అన్నదమ్ములై పుట్టి భగవంతుని వాక్కును ఉనికిని అపహాస్యంచేయుటవలన పండితులను విమర్శించడం వలన కష్టాలు అనుభవించి స్వయంభవమూర్తి దర్శనమైన తరువాత శాపవిమోచనం కలుగునని సెలవిచ్చిరి. మరియూ తాను సర్వ శక్తులతో సకలదేవీ దేవతా స్వరూపంతో దత్తాత్రేయుని అవతారం గా కలియుగంలో పీఠికాపురమున జన్మించుదునని చెప్పి అంతర్ధానంచెందిరి.
ఆవిధంగా ఆ ముగ్గురూ ఒక కాణీతో భూమిని కొని సాగుచేయుచండగా దిగుడు బావిలో స్వయంభువ వినాయకుని దర్శనమై శాపవిముక్తులైరి.
ఆ స్వయంభువు వినాయకుని ప్రతిష్ట చేయుటకు ఈ బావా బావమరుదులు విచ్చేసి వరసిధ్ధవినాయుకుడుని కాణిపాకం నందు ప్రతిష్ట చేసిరి.
కాలక్రమమున వీరిరువురే శ్రీశైలముల నందు కళలు పునరిద్దించుటకు శక్తిపాతం చెయ్యమని స్వామివారు చెప్పినారు. ఇంకా స్వామివారు చెప్పిన విషయాలతో రేపటి 22బాగం లో తెలుసుకుందాం.
(ఈ భాగం నుంచి అతి శ్రద్ధగా చదవవలెను. )🙏
*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 34-35*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*ఆచార్యాః పితరః*
*పుత్రాస్తథైవ చ పితామహాః ।*
*మాతులాః శ్వశురాః పౌత్రాః*
*శ్యాలాః సంబంధినస్తథా ।।*
*ఏతాన్న హంతుమిఛ్చామి*
*ఘ్నఽతోపి మధుసూదన ।*
*అపి త్రైలోక్య రాజ్యస్య*
*హేతోః కిం ను మహీకృతే ।।*
ఆచార్యాః — గురువులు;
పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు);
పుత్రా: — కుమారులు;
తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ
పితామహాః — తాతలు;
మాతులాః — మేనమామలు;
శ్వశురాః — పిల్లనిచ్చిన మామలు;
పౌత్రాః — మనుమలు;
శ్యాలాః — బావ-బావమరుదులు;
సంబంధినాః — బంధువులు;
తథా — కూడా; ఏతాన్ — వీరు;
న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు;
ఘ్నతః — చంపబడి;అపి — అయినప్పటికీ;
మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా;
ఆపి — అయినప్పటికీ;
త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకముల పై అధిపత్యం ;
హేతోః — కొరకు;
కిం ను — ఎం చెప్పాలి?
మహీ-కృతే — భూమండలము కొరకు.;
*భావము:*
గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు ఇంకా ఇతర బంధువులు, ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద దాడి చేసిననూ నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి, ముల్లోకముల పై ఆధిపత్యం సాధించినా, ఏం తృప్తి ఉంటుంది మనకు, ఇక ఈ భూ-మండలము కోసమైతే ఏమి చెప్పను?
*వివరణ:*
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు ఇంకా శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. అర్జునుడు ఈ వివిధములైన బంధువులని పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం) అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, “నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్ను ఎందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని చంపాలనుకోవటం ఎందుకు?
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
దేవతలకు పగలు ప్రారంభమైన సమయం
ॐ ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి శుభాకాంక్షలు.
దేవతలకు పగలు ప్రారంభమైన సమయం.
I. మన సంవత్సరం - దేవతల రోజు
మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.
సూర్యుడు
- మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణ పుణ్యకాలంతో దేవతల పగలు ప్రారంభం.
- కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయన పుణ్యకాలంతో దేవతల రాత్రి ప్రారంభం.
- మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము.
నాలుగు ఏకాదశులు
1. దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. దానిని "శయన ఏకాదశీ" అంటారు.
స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు.
(12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో, మూడవవంతు అయిన నాలుగు నెలలు వారి నిద్రాకాలం. ఆ పద్ధతిలోనే, మన 24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తాము)
2. మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు ఆయన అటువాడు ఇటు తిరిగి పడుకుంటాడు. దాన్ని "పరివర్తన ఏకాదశీ" అంటారు.
3. మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని "ఉత్థాన ఏకాదశీ" అంటారు.
4. సౌరమానంతో చూసే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశీ నాడు, స్వామి వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుండీ దేవతలకి దర్శనమిస్తాడు.
దానిని "వైకుంఠ ఏకాదశీ" అని, "ముక్కోటి ఏకాదశీ" అనీ పిలుస్తారు.
ఆ ఉత్తరద్వారంలో స్వామిని అందరమూ దర్శనం చేసుకుంటాం.
మన సంవత్సరం దేవతలకి రోజు అని చెప్పుకున్నాం కదా! ఆవిధంగా, వారు ప్రతీరోజూ వారి తెల్లవారుఝామున వైకుంఠద్వారం నుండీ స్వామిని దర్శించుకుంటారు.
అన్వయం
II. సూర్యుడు
సూర్యుడు రెండు రకాల వెలుగులను ప్రసాదిస్తాడు. అందులో
- మొదటిది, కాంతి రూపంలో భౌతికంగా చూడగలిగేది, వేడిరూపంలో పొందగలిగేది. దీనిని దీపాలరూపంలోనూ, సౌరశక్తితో నడిచే కుక్కర్ల వంటివాటి రూపాలలోనూ చూస్తాం.
ఈ విషయాలు సూర్యునికి భూమి దగ్గరవుతూండడం మొదలై, ఉష్ణాంశం పెరిగే కాలం ప్రారంభం అనే దాన్ని ఉత్తరాయణంగా సూచిస్తుంది.
- రెండవది, ఆలోచనకి సంబంధించి జ్ఞానరూప వెలుగు. సౌరశక్తితో పనిచేసే Solar Calculators వంటి యంత్రాలే దీనికి నిదర్శనం.
III. దైవ సంపద
మనలోని దైవశక్తులను చైతన్యవంతం చేసికొనే కాలంగా సాధనా పరంగా మరొక కోణంలో దేవతల పగలు ప్రారంభం అని చూపిస్తుంది.
ఈ విషయాలలో భగవద్గీతలో తెలిపిన "దివ్యగుణ సంపద" అనేదాన్ని పరిశీలిద్దాం.
దివ్యగుణ సంపద:
1. భయము లేకుండుట - అభయమ్,
2. తనలోని అన్వయ వ్యతిరేక శక్తుల (positive & negative) నడుమ సామ్యము చెడిపోకుండుట - సత్త్వ సంశుద్ధి,
3. క్రమ పద్ధతిలో జ్ఞానమాచరించి, అది తనయందు యోగము చెందునట్లు చూచుకొనుట - జ్ఞానయోగవ్యవస్థితి,
4. ఉన్నంతలో ప్రేమపూర్వకంగా సమర్పించ గలుగుట - దానము,
5. తనపై బాహ్యవిషయ ప్రభావం లేకుండా చూచుట - దమము,
6. ఫలితం నశించకుండా చేసే మంచి పని - యజ్ఞము,
7. శాస్త్రగ్రంథాల మననం, వాటి వెలుగులో జీవనం మలచుకొనుట - స్వాధ్యాయము,
8. తనలోని జ్ఞాన, ప్రాణ, దక్షిణాగ్నులు మూడిటిని ప్రజ్వలింపజేసి, వానిని సద్వినియోగం చేయుట - తపస్సు,
9. కపటం లేకుండడం - ఋజుత్వం,
10. మనోవాక్కాయ కర్మలచే ఏ జీవిని బాధింపకుండటం - అహింస,
11. సత్యము అవసరము కొఱకుగాక, తన స్వభావంగా ఉండుట - సత్యము,
12. కోపము తనలో నిలువకయుండడం - అక్రోధము,
13. తనది తనకావశ్యకమైనా, మంచి పనికి సమర్పణ చేయగలుగుట - త్యాగము,
14. ఏ పరిస్థితిలోనూ చికాకు పడకుండడం - శాంతి,
15. ఎవరియెడల దుర్బుద్ధి లేకుండడం, కొండెములు చెప్పకుండడం - అపైశునమ్,
16. సర్వజీవులయందు దయ కలిగియుండడం - దయ,
17. ఏ విషయమందైనా ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట - అలోలత్వం,
18. మృదువుగా ప్రవర్తించుట - మార్దవము,
19. తనయందెంత స్వల్పదోషమున్నా సిగ్గపడకుండడం, ఒదిగి ప్రవర్తించడం - ఉచిత లజ్జ - హ్రీః,
20. అనవసరమైన కుతూహలం లేకుండడం - అచాపలం,
21. తన చుట్టు ఉన్నవారిని ఆకర్షించి, వారికి సుఖశాంతులను ప్రసాదించే తన తేజస్సు,
22. ఓరిమి కలిగియుండడం, సహనం - క్షమ,
23. తనయందు తాను నిలబడుట - ధైర్యము - ధృతి,
24. మానసిక శుభ్రత - శౌచము,
25. మేలు జరిగినచోట కీడు తలపెట్టకుండడం - అద్రోహము,
26. దురభిమానం లేకుండడం - నాతిమానితా.
- భగవద్గీత 16 - 1,2,3
IV. భగవంతుడు - దేవుడు
ఇప్పుడు "భగవంతుడు" అంటే నిర్వచనం చూద్దాం.
భగవంతుడు
మొదటి నిర్వచనం
భగములు ఆరు. అవి
1. ఐశ్వర్యము,
2. వీర్యము,
3. యశస్సు,
4. సంపద,
5. జ్ఞానము,
6. వైరాగ్యము.
"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I
వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"
ఈ ఆరు గుణాలు కలవాడు "భగవంతుడు".
రెండవ నిర్వచనం
1. భూతముల పుట్టుకను,
2. నాశమును,
3. రాబోయెడి సంపత్తును,
4. రాబోయెడి ఆపత్తును,
5. అజ్ఞానమును,
6. జ్ఞానమును ఎఱుంగువాడు.
"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I
వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥"
ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన "భగవంతుడు" అనబడతాడు.
ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.
దేవుడు
"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.
1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.
అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,
ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,
ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.
"యో దీవ్యతి క్రీడతి స దేవః"
2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.
అందరినీ జయించేవాడు, అనగా అతనిని ఎవరూ జయించలేరు.
"విజగీషతే స దేవః"
3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు
న్యాయాన్యాయ రూప వ్యవహారమూలను తెలియువాడు.
"వ్యవహారయతి స దేవః"
4.స్వయం ప్రకాశ స్వరూపుడు,
అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.
"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"
5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.
.నిందింప దగనివాడు.
"య స్త్యూయతే స దేవః"
6.తాను స్వయమానంద స్వరూపుడు.
ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.
"యో మోదయతి స దేవః"
7.మదోన్మత్తులను తాడించేవాడు.
సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులను హర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.
"యో మాద్యతి స దేవః"
8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.
.ప్రలయసమయమున అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.
"యః స్వాపయతి స దేవః"
9.కామించుటకు యోగ్యుడు.
సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.
"యః కామయతే కామ్యతే వా స దేవః"
10.జ్ఞాన స్వరూపుడు.
అన్నిటియందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.
"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"
దేవః - అనే శబ్దం "దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు" అనే ధాతువునుండి సిధ్ధమవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు.
VI. ముగింపు
మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం
ఈ సమయంలో, దేవతల పగలుగా - మనలోని దైవీ శక్తులను గుర్తించి, వాటిని చైతన్యపరచుకుంటూ, దైవానుభూతి కలిగి, మనం "దైవమే" అనే అద్వైతసిద్ధి పొందుదాం.
సాధనలో పూర్ణత్వానికి చేరుకొని,దక్షిణాయనం అనే దేవతల "విశ్రాంతి" కాలానికి పునాది వేసుకుందాం.
విశేష అనుబంధం
దీనితోపాటు ఇతర మతస్థుడైన ఒక మిత్రుడు ఈ పండగ మతాతీతమైనదనీ, విజ్ఞాన శాస్త్ర పరంగా గొప్పదనీ, ఆంగ్లంలో నాకు పంపిన విషయం కూడా దీనితో జతపరుచబడింది.
Makara Sankranti is not only a Hindu festival but actually a universal phenomenon because it is purely based on the science of astronomy & crop cycle which is not limited to any particular religion.
Basically, it is a celebration of the “revival” of sunlight (solar energy & positivity) into our lives and it coincides with the harvest season as well.
The zodiac phases of the Sun from July to December witness decreasing sunlight, and after that, the subsequent zodiac phases witness increase in sunlight.
It looks like the Sun is on a downward journey between July to December and this downward journey suddenly changes to upward journey or northward movement in late December & early January.
Since "Uttara" means "Northward" & "Aayana" means "Movement" in Sanskrit, this phenomenon of phase reversal from Southward movement to Northward movement of the Sun is called “Uttara Ayana” or “Uttarayan” in short.
We have 12 Zodiacs in an year, there will be 12 Sankrantis each year.
But as we saw how Makara is significant due to the revival of sunlight, the “Sankranti of Makara” (or transmigration of Sun into Makara) is celebrated as “Makara Sankranti”.
Wish you and your family happy Makara Sankranti.🌹💐🌺
=x=x=x=
-- రామాయణం శర్మ
భద్రాచలం
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - పంచమి - శతభిషం & పూర్వాభాద్ర - ఇఃదు వాసరే* (15.12.2023)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/3XcElvkyIVQ?si=TLmCStNQ_zTdeveP
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
అన్నదానం..ఆశీర్వాదం..
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*అన్నదానం..ఆశీర్వాదం..*
"రాబోయే ఆదివారం నాడు మేము అన్నదానానికి సరుకులు తెస్తాము..మా పేరుతో అన్నదానం చేయండి.."అన్నారా దంపతులు..వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా సార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు..అసలు వాళ్లు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచీ..అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది..
"పదేళ్ల క్రిందట మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము..అప్పటినుండి ప్రతి ఏడూ రెండుసార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్లడం అలవాటుగా మారింది..నాకు పెళ్ళైన ఆరేళ్ల దాకా పిల్లలు పుట్టలేదు..మా ఆయన నేనూ ఇక్కడికి వచ్చాము..ఆ స్వామికి మ్రొక్కుకున్నాము..ఇదిగో ఈ ఇద్దరూ స్వామి దయవల్ల పుట్టారు.." అని తన తొమ్మిదేళ్ల వయసున్న కూతురిని, ఏడేళ్ల కుమారుడిని చూపించింది సుశీలమ్మ..వాళ్ళది కనిగిరి దగ్గర పల్లెటూరు..
"వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకొస్తాము..ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాము కదా..ఈసారికూడా అన్నదానం చేయిస్తాము.." అని మళ్లీ గుర్తు చేస్తున్నట్లు చెప్పింది..సరే అన్నాను..
మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తువున్నాయి..సంతానం కోసం ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు..మందిరం లోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు..అప్పుడు నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఇక్కడ ఒక శనివారం కానీ ఆదివారం నాడు కానీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందీ.." అని అడిగారు..ఒక్కొక్కపూటకు సుమారు మూడు నాలుగు వందల మందికి సరిపడా అన్నదానం చేయాలంటే (ఇది పదేళ్ల క్రిందటి లెక్క..ఇప్పుడు ఒక్క శనివారం రాత్రికే సుమారు వెయ్యిమందికి తయారు చేయాలి) ఎంత అవుతుందో వివరంగా చెప్పాను..సరే నని తలవూపి వెళ్లారు..
ఆ తరువాత ఒక గంట గడిచింది..సుశీలమ్మ భర్త వచ్చి.."వచ్చే వారమే మేము అన్నదానం చేస్తాము..మీరు సరుకుల లెక్క ఇవ్వండి.." అన్నాడు..సహజంగా ఎవరైనా తాము కోరిన కోర్కె తీరిన తరువాత తమ మ్రొక్కు చెల్లించుకుంటారు..ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేస్తామని చెపుతున్నారు..నా మనసులో మాట గ్రహించారో ఏమో.."అయ్యా..నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను..కానీ తాను మాత్రం ఇప్పుడే చేయాలని పట్టు బడుతున్నది.." అన్నాడు..
"ఆదివారం మధ్యాహ్నం కనీసం మూడు నాలుగు వందల మందికి మనం ఆహారం అందిస్తే..ఆకలి తీరిన అంతమందిలో ఎవరో ఒక్కరన్నా మనలను తృప్తిగా దీవిస్తారు కదా..ఆ దీవెనలు..శ్రీ స్వామివారి ఆశీస్సులు.. ఫలించి మా కోరిక త్వరగా తీరుతుందేమోనని ఆశ!..మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితం అని చాలామంది ఇక్కడ అనుకోవడం విన్నాను..అందుకోసం వచ్చే వారం అన్నదానం చేద్దామని అనుకున్నాను.." అన్నది సుశీలమ్మ..
నిజమే అనిపించింది..ఎవరి ఆశీర్వాదం లో ఎంత బలమున్నదో ఎవరికి తెలుసు?..ఈ ఆలోచనకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడు..అనుకున్న విధంగానే ఆ పై వారం ఆ దంపతులు అన్నదానం చేశారు..
మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..ఇంకో రెండేళ్లకు కుమారుడు కలిగాడు..ఆ దంపతులు మాత్రం ప్రతిసారీ అన్నదానం చేయడం మర్చిపోలేదు..ఎప్పుడన్నా తమకు వీలులేకపోతే..ఒకటి రెండు వారాలు ముందుగానే వచ్చి..తాము అనుకున్న రోజుకు అన్నదానం జరపమని మాకు చెప్పుకొని వెళుతుంటారు..ఏనాడూ కూడా తాము అన్నదానం చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు..తాము పేరు కోసం చేయటం లేదనీ..తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామనీ చెప్పుకుంటారు..ఇలాటి ఆలోచన గల వాళ్ళు తక్కువ మంది ఉంటారు..
మందిరం వద్దకు వచ్చే అందరు భక్తులూ ఒక లాగా వుండరు..ఒక్కొక్కరివి ఒక్కక్క విధమైన ఆలోచనలు..అందరి కోర్కెలు తీర్చి..వాళ్ళ వాళ్ళ తాహతును బట్టి..ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్లకు అప్పచెప్పి..మధ్యలో మమ్మల్ని కర్తలుగా నిర్ణయించి..ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపిస్తుంటారు శ్రీ స్వామివారు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
రాశి ఫలితాలు
శుభోదయం
16.2291923113
*****
15-01-2024
ఇందు వాసరః (సోమవారం)
రాశి ఫలితాలు
XXXXXXX
మేషం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొటీపరీక్షలో విజయం సాధిస్తారు.
---------------------------------------
వృషభం
వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు రావడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
మిధునం
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
---------------------------------------
కర్కాటకం
ఉద్యోగులకు నూతన హోదాలు దక్కుతాయి. సంతానం వివాహ యత్నాలు సాగిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
---------------------------------------
సింహం
వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
---------------------------------------
కన్య
ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
---------------------------------------
తుల
సంతాన ఉద్యోగ వివాహయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. జీవిత బాగస్వామి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దిర్ఘకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.
---------------------------------------
వృశ్చికం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.
---------------------------------------
ధనస్సు
నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో అరుదైన లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
--------------------------------------
మకరం
మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.
---------------------------------------
కుంభం
స్థిరాస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల సహాయంతో నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు.
---------------------------------------
మీనం
చేపట్టిన పనులలో శ్రమఅధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు అందుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు.
---------------------------------------
XXXXX
పంచాంగం 15.01.2024
ఈ రోజు పంచాంగం 15.01.2024
Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: పంచమి తిధి ఇందు వాసర: శతభిషా తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం వరీయాన్ యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
పంచమి రాత్రి 02:18 వరకు.
శతభిషం పగలు 08:07 వరకు తదుపరి పూర్వాభాద్ర రా.తె 06:10 వరకు.
సూర్యోదయం : 06:53
సూర్యాస్తమయం : 05:58
వర్జ్యం : మధ్యాహ్నం 02:00 నుండి 03:28 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:48 నుండి 01:32 వరకు తిరిగి మధ్యాహ్నం 03:01 నుండి 03:45 వరకు.
అమృత ఘడియలు : రాత్రి 10:49 నుండి 12:17 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
మకరసంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలము
శుభోదయ:, నమస్కార: