23, ఆగస్టు 2021, సోమవారం

కేనోపనిషత్తు సారాంశము

 కేనోపనిషత్తు సారాంశము


ప్రశ్న:- కేనేషితం పతతి ప్రేషితం మనః


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను,చెవుల వెనుక ఉన్న దేవత ఎవరు?


జవాబు:


1. శ్రోతస్య శ్రోత్రం (చెవితో చూద్దాం) ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది.


ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాము. అంటే చెవితో వినగలుగుతున్నాము.


ఇదే సూత్రం మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులకు వర్తిస్తుంది.


2. న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 

3. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. కాని మనస్సు, ప్రాణం, వాక్కు కన్ను, చెవులు ఆత్మ వల్లనే పని చేస్తున్నాయి.

 4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి


ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు.


దీని అర్థం-

 ఎ) ఆత్మ తెలియబడే వస్తువు (ఆబ్జెక్టు) దు - ప్రమేయం కాదు. 

బి) ఆత్మ తెలుసుకునే నేను - ప్రమాతా అయిన నేను.


సి) ఆత్మ ప్రమాతృత్వం లేకపోయినా ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. 

5. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే -


ఆత్మ ఆబ్జెక్టు కాదు కాబట్టి, సగుణ రూపంలో కొలిచే దేవుడు ఆత్మ కాదు. సాక్షి చైతన్యమైన నేనే ఆత్మను.

ఆత్మ అనుభవం

ఆత్మ అనుభవం పొందలేము.

రుద్రం-లయం చేసేది

 *రుద్రం (శివ స్వరూపము)*


రుద్రం-లయం చేసేది/చీకట్లను నిర్మూలించేది/అజ్ఞానాన్ని తొలగించేది. 


రుద్రానికి సంబంధించి ఎన్నో కర్మకాండలను, యజుర్వేదము తన మంత్రభాగంలో వివరించడం జరిగింది. 

అవి రుద్రం, ఏకాదశ రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, , అతిరుద్రంగా విభజించడం జరిగింది.


ఇందులో కర్మ భాగము : 


యజుర్వేద మంత్రభాగంలో పేర్కొన్న పదకొండు అనువాకాలకి *“రుద్రం”* అని పేరు. దీనిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకాన్ని *“రుద్రాభిషేకము”* అంటారు. 

ఈ పదకొండు అనువాకాల రుద్రాన్ని పదకొండుసార్లు పఠిస్తూ చేసే అభిషేకానికి *“ఏకాదశ రుద్రాభిషేకము”* లేదా *“రుద్రి”* అంటారు.


రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకాన్ని *లఘురుద్రాభిషేకమని*, ఇటువంటి పదకొండు లఘురుద్రాభిషేకాలను *మహారుద్రమని*, ఈ మహారుద్రాలు పదకొండయితే *అతిరుద్రమని* చెప్పబడింది.


ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే *రుద్రాభిషేకమని*, వీటిని హోమంలో వినియోగిస్తే *రుద్రయాగమని* సూచించడం జరిగింది. 


ఈ అభిషేక తీర్థాన్ని లేదా యాగ భస్మాన్ని జీవుడు భక్తితో గ్రహించటం ద్వారా, జీవాత్మను ఆశ్రయించి వున్న సమస్త దోషాలు తొలగిపోయి, *జీవుడు పరమాత్మలో ఐక్యం* చెందుతాడని చెప్పబడింది. 


ఇందులో జ్ఞాన విభాగము : 


“నారుద్రో రుద్రమర్చయేత్” అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడని చెప్పబడింది.


ఇది అంత సులభంగా సాధ్యపడదు. ఎంతో సాధన కావాలి. సాధనతో సత్యాన్ని గ్రహించాలి. సత్యమే ఆత్మగా గ్రహించాలి. తనలోనే సచ్చిదానంద స్వరూపునిగా విరాజిల్లే పరమశివుణ్ణి సర్వకాల, సర్వావస్థలయందు అనుభూతి పొందాలి. చివరికి *“చిదానందరూపః శివోహమ్! శివోహమ్!”* అన్న స్థితికి చేరుకోవాలి. అదే బ్రహ్మైక్య స్థితి. ఆ స్థితినే ఆదిశంకరులు తమ *“ఆత్మషట్కము”* లో ఎంతో సుళువుగా అభివర్ణించారు. 


రుద్రాభిషేక ఆచరణ : మహనీయులు *“మహాన్యాసము”* అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు అందించేరు. అప్పటినుంచి ఈ మహాన్యాసము రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి ఆచారణలోకి వచ్చింది. మహాన్యాసము అంటే *భక్తుడు రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేసే అధికారం పొందుటకు, వాటికి ముందు మహిమాన్వితుడైన రుద్రుని తన ఆత్మ యందు విశిష్టముగా నిలుపుకొనుటయే "రౌద్రీకరణము"*. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, *తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును*.


రుద్రములో నమకము, చమకము ఎంతో ముఖ్యమైనవి. *“నమః”* తో అంతమయ్యే శ్లోకాలు *నమకము* గాను, *“చమే”* తో అంతమయ్యే శ్లోకాలు *చమకంగా* చెప్పబడ్డాయి. నమకము రుద్రునికి *భక్తుని ప్రార్థనగా*, చమకము భక్తునికి *రుద్రుని ఆశీర్వచనముగా* చెప్పబడ్డాయి. *ఓం నమః శివాయ*🙏

అతిగా ఆలోచించడం వలనే

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴ఇహలోక బంధాలు, వాటి వలన కలుగు సుఖములు గురించి అతిగా ఆలోచించడం వలనే మానవుడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు. మనశ్శాంతి మానవుని సహజ సంపద. అది పుట్టుకతోనే ఉంటున్నది. కానీ వయసు పెరుగుతున్న కొలది 'నేను, నాది' అనే అహంకార, మమకార, అనురాగాలు పెంచుకోవడం మూలానా అది క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా మనిషి నిరంతరం ఏదో ఓ చింతతో బాధపడుతూ ఉంటుంటాడు. కడుపు నిండినంత చాలు ఆకలి తీరడానికి. అంతకు మించి ఎక్కువైతే మనకే ప్రమాదం. బంధుమిత్రులకు  చేయగలిగినంత చేయండి. వారి బుుణబంధ విముక్తికి అవి చాలు. ఈ బంధాలు గురించి ఎంత తక్కువుగా ఆలోచిస్తే అంత మనశ్శాంతి అన్న విషయం మరువకూడదు.🌴_* 

అందరూ ఆప్తులే

 🌳విలువలతో కూడిన కథ 🌳

~~~~~~~~~~~~~


వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...

రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...

సిటీకి కొత్తగా రావడం వలన

ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...

హడావుడిగా పరుగులు తీసే జనాలు

ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.

సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.

బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ

వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు...


ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...

బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.

"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.

ఆమె రేటు చెప్పింది...

సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.

ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.

సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.

సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.

ఆరోజు మొదలు ప్రతీరోజూ

ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.

ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...

ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.

ఇంటికి వెళ్లాక

"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.

వెంకట్ చిరునవ్వు నవ్వి

"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...


వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే

వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి

" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.

వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది

"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.


నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.

ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.


అన్నీ ఉన్నా కూడా

ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ.

ముకుందమాల స్తోత్రమ్ Mukunda Mala Stotram శ్లోకం : 27

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 27      

                           SLOKAM : 27

                                                

मज्जन्मनः फलमिदं मधुकैटभारे

मत्प्रार्थनीयमदनुग्रह एष एव ।

त्वद्भृत्यभृत्यपरिचारकभृत्यभृत्य-

भृत्यस्य भृत्य इति मां स्मर लोकनाथ ॥ २७॥    


మజ్జన్మన: ఫలమిదం 

                     మధుకైటభారే  

మత్ ప్రార్థనీయ మదనుగ్రహ 

                              ఏష ఏవ I    

త్వద్భృత్య భృత్య పరిచారక 

                       భృత్య భృత్య 

భృత్యస్య భృత్య ఇతి మాం 

                      స్మర లోకనాథ ॥ 27


హే మధుకైటభ మర్దనా! 

    నేను ఎలాంటి యోగ్యతా లేనివాణ్ణి కాబట్టి నీ పాదసేవ చేయటానికి అనర్హుడనయ్యాను.   

    కానీ నీ సేవక వర్గంలో నన్ను కట్టకడపటివానిగానైనా (దాసానుదాసానుదాసాను దాసునిగా) నియమించు. 

    ఈ మాత్రం దయ చూపించు. 

    ఈ జన్మ ఎత్తినందుకు ఇదే సాఫల్యం      


O enemy of Madhu and Kaiṭabha! 

O Lord of the universe!     

    the perfection of my life and the most cherished mercy You could show me would be for You 

    to consider me the servant of the servant of the servant of the servant of the servant of the servant of Your servant.



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆశ్రమం..ఆలయం..*


1975 వ సంవత్సరం మే నెల..కొద్దిరోజుల ముందు నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసి, సెలవులకు మొగలిచెర్ల వచ్చి వున్నాను..ఆరోజుల్లో సెలవులకు ఇంటికి వస్తే..నేను గానీ మా అన్నయ్య కానీ..ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండుపూటలా మొగలిచెర్ల లోని మా ఇంటివద్దనుంచి..ఎరువు ను ఎద్దుల బండిలో మా మాగాణి పొలానికి తీసుకెళ్లి అక్కడ చల్లి రావడం ఒక పనిగా చేయాల్సి వచ్చేది..మాగాణి పొలానికి వెళ్లాలంటే..విధిగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆశ్రమం నిర్మించుకున్న ఫకీరు మాన్యం మీదుగానే వెళ్ళాలి..నేను అలా మాగాణికి ఎరువును బండిలో తీసుకెళ్లే రోజుల్లో..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారిని చూడటం కోసం..ఆశ్రమం ముందు ఎద్దుల బండి ఆపుకొని..లోపలికి వెళ్లే వాడిని..శ్రీ స్వామివారు ధ్యానం లో లేని సమయం లో..ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ వుండేవారు..కొద్దిసేపు వారి వద్ద గడిపి..మళ్లీ బండిని తీసుకొని ఇంటికి వచ్చేసేవాడిని..మే నెలలో ఆ కార్యక్రమం విధిగా ఉండేది..


ఒకరోజు ఉదయాన్నే నాన్నగారు నన్ను పిలచి.."ఒరేయ్..సుధాదేవమ్మ అక్కయ్యను తీసుకొని..ఈ నెలాఖరుకు ఢిల్లీ వెళతావా?..అక్కయ్యను మా తమ్ముడు పరమేశ్వర రావు దగ్గర వదిలి..నాలుగు రోజుల పాటు అక్కడ వుండి..తిరిగి వచ్చేసెయ్యి..మీ సెలవులు అయిపోయేనాటికి అక్కయ్య మళ్లీ తిరిగి కనిగిరి వచ్చేస్తుంది..ఆమెను ఢిల్లీ తీసుకెళ్లడానికి నువ్వు తోడుగా వెళ్ళు.." అన్నారు..ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను.. నిజమే..అప్పట్లో ఢిల్లీ ప్రయాణం అనేది నా వరకూ ఒక గొప్ప కార్యక్రమం..సరే అన్నాను సంతోషంగా..ఆ సంతోషం లోనే బండికి ఎరువు నింపుకొని..ఎద్దులు కట్టుకొని..మాగాణి పొలానికి ఉత్సాహంగా బయలుదేరాను..తిరిగి వచ్చేటప్పుడు ఉదయం పది గంటల సమయం లో..శ్రీ స్వామివారు..ఆశ్రమం బైట వైపు..దాదాపుగా మేము ప్రయాణించే దారి దగ్గర..నిలబడి వున్నారు..స్వామివారిని చూడగానే..బండి ఆపి..ప్రక్కకు పెట్టి..గబ గబా ఆయన దగ్గరకు వెళ్ళాను..


అత్యంత ప్రశాంతంగా..చిరునవ్వుతో నన్ను చూసి.."తెల్లవారక ముందే బండి కట్టుకొని మాగాణికి వెళ్ళావా?..పెందలాడే తిరిగొస్తున్నావు?.." అన్నారు..

"అవును స్వామీ.." అన్నాను..


"రా!..లోపలికి వెళదాము.." అని, ఆశ్రమం లోపలికి దారితీశారు..

వెనుకనే వెళ్ళాను..


శ్రీ స్వామివారు బావి వద్దకు వెళ్లి..నీళ్లు తోడుకొని..కాళ్ళు చేతులు కడుక్కొని..వరండా లోకి వెళ్లి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..నేనూ కాళ్ళూ చేతులు కడుక్కొని..శ్రీ స్వామివారి కి ఎదురుగ్గా కొద్దీ దూరంలో కూర్చున్నాను..


"ఏదో ఆనందం లో ఉన్నావే?..ఏమిటి విషయం?.." అన్నారు..

ఢిల్లీ కి వెళుతున్నాననీ..మొదటిసారి దేశరాజధానిని చూస్తున్నానని..చెప్పాను..


పెద్దగా నవ్వారు..నవ్వడం ఆపి.."ప్రయాణం చేయడం మంచిదే.. అనుభవం వస్తుంది.." అని పైకి లేచి నిలబడ్డారు..నేనూ లేచాను..

"నా వెనకే రా.." అంటూ..ఆశ్రమ ప్రాంగణం అంతా..ప్రదక్షిణగా తిరిగారు..నేనూ శ్రీ స్వామివారి వెనుకే వెళ్ళాను..తిరిగి మళ్లీ బావి వద్దకు వచ్చి..

"ఈ ప్రహరీ లోపల ఉన్న ప్రదేశం అంతా..సరిగ్గా చూడు..రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం ఒక దత్త క్షేత్రంగా మారినప్పుడు..ఈ ఆశ్రమం..ఆలయంగా మారుతుంది..ఇక్కడ చాలా మార్పులు వస్తాయి..నువ్వు చూస్తావు..గుర్తుపెట్టుకో.." అన్నారు..


శ్రీ స్వామివారు చెపుతున్న మాటలకు అప్పుడు అర్ధం గోచరించలేదు..రాబోయే రోజుల్లో..ఈ ఆశ్రమం..గుడి రూపం సంతరించుకుంటుందనీ..అలానే శ్రీ స్వామివారు కట్టించుకున్న ధ్యాన మందిరం తప్ప..మిగిలిన వన్నీ మారిపోతాయనీ..అందులో నా ప్రమేయం ఉంటుందనీ..నాకు అవగాహన లేదు..నన్ను అన్నీ గుర్తుపెట్టుకోమని ముందుగానే ఎందుకు చెప్పారో..ఇప్పుడు అవగతం అవుతున్నది..ఆనాటి ఆశ్రమ రూపు రేఖలు ఇప్పుడు మనసులో తప్ప వాస్తవం లో లేవు..రాబోయే రోజుల్లో నేనే ఆశ్రమ నిర్వహణ చేస్తానని శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసా?..అందుకే పదే పదే.."సరిగ్గా చూడు..!..గుర్తు పెట్టుకో..!.." అని చెప్పారా?..ఈనాడు ఆలోచించుకుంటే..అవును అనే సమాధానం చెప్పుకోవాలి..


లౌకికంగా ఆనాడు ఢిల్లీ ప్రయాణం నాకు అత్యంత ఆనందం కలిగించే విషయంగా భావించాను..కానీ ఆధ్యాత్మికంగా శ్రీ స్వామివారు చూపిన ఆశ్రమ బాధ్యత ఇంకా గొప్పది అని ఇన్నాళ్లకు తెలిసింది..ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లో ఎందరో భక్తుల అనుభవాలను తెలుసుకునే అవకాశం కలిగింది..అందుకు శ్రీ స్వామివారి పాదపద్మాలకు అనుక్షణం భక్తితో నమస్కారం చేసుకోవాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

చిలుక పలుకులు

 చిలుక పలుకులు*


ఒక రోజు వేటగాడు సంతలో తనకు దొరికిన రెండు రామచిలక పిల్లలను అమ్మకానికి పెట్టాడు. ఇవి మాట్లాడే చిలుకలు పిల్లలు రండి కొనండి ఉంటూ అరుస్తూ వున్న వాడి అరుపులకు అటుగా వచ్చిన ఒక* *బ్రాహ్మణుడు ఒక చిలక పిల్ల ఎంత అని అడిగాడు మూడు కుంచాల జొన్నలు అండి అని అన్నాడు, అలాగే బ్రాహ్మణుడు మూడు కుంచాలు జొన్నలు ఇచ్చి ఒక చిలక పిల్లని కొన్ని తీసుకెళ్లాడు.* 


 *అలాగే మరొక చిలక పిల్ల ను మాంస విక్రయదారుడు తీసుకెళ్లడం జరిగింది.* 


 *అలా ఒక చిలుక ఏమో బ్రాహ్మణుని గుడిలో మరొక చిలకేమో విక్రయశాలలు పెరగసాగాయి ఇలా కొద్ది రోజులు గడిచి పోయిన తర్వాత ఒకరోజు వేటగాడు ఏదో పని పైన సంతకు వచ్చాడు అటుగా వెళుతూ తాను ఆమ్మిన రామచిలకలు ఎలా ఉన్నాయో* *చూడాలనిపించి గుడి దాకా వెళ్ళాడు గుడి లో* *ఉన్నటువంటి రామచిలుక* 

 *వేకువ ఝాము అయినది నిద్ర నుండి లేచి స్నానము చేసిగుడిని శుభ్రపరిచి పూజకు పుష్పములను* *ఫలములను సమకూర్చుకుని అని పలుకు తున్నది.* 

 *అలాగే గుడి కి వచ్చిన వారితో రండి దయచేయండి పూజకు విచ్చేశారా రండి రండి అని* *పిలుస్తూ గురువుగారు దేవుడికి అలంకరణ చేస్తున్నారు గుడి చుట్టూ ప్రదర్శన చేసి రండి అలా చేసి వచ్చిన వారితో చెప్పండి అభిషేకమా అష్టోత్తర మా అంటూ మంచి ఫలుకులను అంటు ఉంటే వాటిని శ్రవణానందము గా విన్నాడు.* 


 *వేటగాడు ఇలాగే మరొక చిలకను కూడా* *గమనించడానికి వెళ్లడం* *జరిగింది. తెల్లవారుతున్నది లేవు రా త్వరగా, లేసీ కత్తిని తీసుకుని గొంతు కోసి చర్మం వలచి, దానిని ముక్కలు, ముక్కలు గా నరుకుము.* 


 *మాంసం కొనడానికి వచ్చిన వారితో ఏం కావాలి చెప్పండి, తల, తోడ, ఏముకల తో* *కూడిన మాంసం లేక ఏముకల లేని మాంసం ఏది కావాలి, నీవు త్వరగా నరకరా కరణ కఠోరంగా అంటు వుంటే విని అక్కడ నుండి పోతు మనస్సు లో ఇలా అనుకుంటున్నడు.* 


 *ఏమిటీ విచిత్రం రెండు చిలకలు ఒక గూటి నుంచి తెచ్చాను కానీ అవి నేడు పలుకుతున్న పలుకులు వాటి ప్రవర్తన పూర్తిగా* *మారిపోయింది. అందుకు కారణం అవి పెరిగిన ప్రదేశం కాబోలు, వేదపారాయణం* *వింటు సత్ సాంగత్యము లో పెరిగిన చిలుక పుణ్యలోకాలకుమార్గాన్ని సుగమం చేసుకుంటే,* 


 *విక్రయశాల లోని అక్రమాలను గమనిస్తూ మూర్ఖులైన వారి పాపపు మాటలను వింటూ పెరిగిన మరొక చిలుక పాపాన్ని వడగట్టుకుని తనకు* *తెలియకుండా నరక లోకానికి* 

 *పునాదులను వేసుకున్నది.జీవితంలో సరిదిద్దుకో లేని తప్పులంటే ఇవేనేమో!* 


 *అంటే దీనిని బట్టి మనకు తెలిసేదేమిటంటే మనం పలికే పలుకులను చిలక లైన మన ఇంట్లో చిన్నారులు అయినా* 

 *వాటిని గమనిస్తూ నేర్చుకుంటారు.* 


 *అందుకే వాక్ శుద్ధి తో మాట్లాడవలసిన అవసరం ఉన్నది.* 


 *మాటలు విని ఈ చిలక పాపం మూట కట్టుకుంటే మరి వాటిని అమ్మిన నాకు పాపం సంభవించ కా మానాదు, నేను ఈ వేట వృత్తిని వదిలి వేసి వేరే ఇంకో వృత్తిని ఎన్నుకోవడం చాలా మంచిది. ఇది సాధ్యమేనా?* 


 *నాడు బోయ వాడైనా వాల్మీకి కూడా ఇదే ధర్మ సందేహం కలిగింది.తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే* 

 *అని గ్రహించి మారాడు.* 


 *కావున నేను నా బ్రతుకు తెరువు కోసం చేసిన తప్పు, నా పాలిట నా శాపంగా* *మారకముందే నేను జాగ్రత్త పడటం మంచిది.* 


 *దారి దోపిడీ దారుడు అయినా బోయవాడు వాల్మీకి గా మారాగా లేనిది, ఈ చిలుకలు వ్యాపారి చితాభస్మదారుడిగా మారలేడా, సత్ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.* 


 ఓం నమశ్శివాయ ఇదే ముక్తికి మార్గం. జన్మరాహిత్యాన్ని కి ఇంతకు మించిన మరొక మార్గం ఏదీ లేదు. 🙏


🔱 ఓం నమః శివాయ🔱