29, జులై 2024, సోమవారం

గురువు త్రిమూర్తి స్వరూపుడు

 గురువు త్రిమూర్తి స్వరూపుడు

గురువు విశద పరచు కడు నిగూఢ విషయమున్ 

గురువును నమ్మిన వారికి 

నెరవేరునభీప్సితములు నిక్కము ధాత్రిన్ 


రచన :శనగల చంద్రశేఖర్

(నా గురుదేవులకు నమస్సులతో )

విధురుని పాత్ర*

 *మహాభారత యుద్ధంలో విధురుని పాత్ర* 

           🏹🏹🏹🏹


విదురుడు యుద్ధ విద్యలు నేర్చిన వాడే. పాండురాజు తన బిడ్డల బాధ్యత తన సోదరులిద్దరి మీద పెట్టి పోయాడు. పెద్ద వాడు పుత్ర మోహాంధుడై తన కర్తవ్యం విస్మరించాడు. చిన్న వాడు విదురుడు బాధ్యతతో మెలగాడు.


మాయాజూదంలో పాండవులను పద భ్రష్టులను చేసిన ఆనందం లో ఇపుడు మన పాలన ఎట్లా ఉంది? అని పట్టరాని ఆనందంలో అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి.


నిజంగా నీ శ్రేయస్సు కోరే వాళ్లు పాండు పుత్రులు. వాళ్లను పిలిపించి , ఆదేశించినపుడు నీకు కీర్తి, గౌరవం అని మంచి చెప్పాడు విదురుడు.


"నీకు వాళ్లే కనిపిస్తారు. నా బిడ్డలు ఎంత గొప్ప వాళ్లైనా నీ కంటికి ఆనరు . నీ (పాడు) మొగం చూపించక దూరంగా వెళ్లి పో —నీ కిష్టమైన చోట ఉండు"— అని బహిష్కరించాడు .


ఆయన వెళ్లి పోయాడు. మళ్ళీ ఏమనుకొన్నాడో! తనకు అప్రతిష్ఠ ఔతుంది-' అని భయపడ్డాడో ఏమో! దొంగ ఏడుపులు ఏడుస్తూ "నా తమ్ముడు నన్ను వదలి పోయాడు. పిలుచుకురా" అని సంజయుణ్ణి పాండవుల దగ్గరకు పంపాడు.


తర్వాత విదురుడు అంతంత లోనే ఉండి తన విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. రాజ్య తంత్ర నిర్వహణ ఈయన, ఆవాపం (అంటే పరరాజ్య చింత—  భీష్ముడు… నిర్వహించే శాఖలు.


తర్వాత పాండవుల పాలు వాళ్లకు ఇచ్చి వేయవలసిన రోజు వచ్చింది. [సంపద దక్కి యుండగ అశక్తులనం జను మమ్ము పిల్చి పూజింపగ అంత బేలె పతి? అంటాడు ధర్మ రాజు. అది ఆ నాటి పరిస్థితి. ] రాయబారం చేయమని పంపవలసినది విదురుణ్ణి. కానీ ఇలాంటి అయోగ్యపు పని చేయమని అడగడానికి ధృతరాష్ట్రుడికే మొగం చెల్లలేదు. తన ఆంతరంగిక మిత్రుడు సంజయుణ్ణి పంపించుకొన్నాడు.


రాయబారం వచ్చిన కృష్ణుడు స్పష్టంగా "మీ ఎల్లర అన్నంబులు అశుచులు. * విదురాన్నంబొక్కటి భోక్తవ్యంబని* నిశ్చయించితి అని చెప్పాడు. విదురుడి ఇంట ఆ 13 సంవత్సరాలు తల్లి కుంతి తలదాచుకొన్నది. విదురుడు ఇతరుల కంటే భిన్నంగా ఉంటూ ఉండిన పరిస్థితి అది. దుర్యోధనుడు విదురుణ్ణి లెక్క పెట్టడు.


ఆ పక్షంలో ఉన్నాడు గాబట్టి ఆ అధర్మం నిలపడానికే తానూ యుద్ధం లో పాల్గొనాలి. తనకు ఇష్టం లేదు. వాళ్లూ తనను నమ్ముకోలేదు. సహాయం కోరలేదు. కృష్ణుణ్ణి ఇంటికి పోయి కోరబట్టి పాల్గొన్నాడు. భీష్మ ద్రోణులనూ ప్రార్థించాడు దుర్యోధనుడు. తనకట్టి విపత్కర పరిస్థితి భగవంతుడు కలిగించలేదు. ఈ ఘోరకలి తప్పదు. నివారించవలసిన బాధ్యత గల రాజు ఉదాసీనత వహించాడు—అని


అక్కడ ఉండి ఆ విషాద వార్తలు వినలేక తీర్థయాత్రలు చేసి కాలం గడిపేశాడు విదురుడు.


తొడలు విరిగి చస్తూ * ఆ నాడే మా పినతండ్రి చెప్పాడు:— జూదపు ఆసపడం గాదు— అని. వినక పోతిని *—అని ఆ కులపాంసనుడు విదురుణ్ణి మహామతిని స్మరించుకొన్నాడు.


బలరాముడూ ఈ పనే చేశాడు. తనకు దుర్యోధనుడు అంటే ప్రీతి. పాండవులవైపు ధర్మం ఉంది. పోరాడితే కృష్ణుడికి ఎదురు నిలబడాలి… దిగితే తాడో పేడో తేల్చుకోవాలి— ఎటూ పాలుబోక ఆయనా తీర్థ యాత్ర చేశాడు. ఐనా ఉండబట్టలేక భీమ దుర్యోధనుల గదాయుద్ధం చూడడానికి హడావిడిగా పరుగులు దీస్తూ వచ్చాడు. 


విదురుడికి బంధు నాశం జరుగుతున్నదే!! అనే విషాదమే. తన అశక్తత తలపోస్తూ , పరదేశాలలో కాలం వెళ్లదీయవలసిన కష్టకాలం. అదెట్లో భరించి,, గతి లేని తన సోదరుణ్ణి అనునయించే బాధ్యత మళ్ళీ స్వీకరించి అతడికి మనశ్శాంతి కలిగించాడు.

జూలై 29, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

       🕉️ *సోమవారం*🕉️

   🌹 *జూలై 29, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : నవమి* సా 05.55 వరకు ఉపరి *దశమి*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : భరణి* ఉ 1055 వరకు ఉపరి *కృత్తిక*


*యోగం : గండ* సా 05.55 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం : తైతుల* ఉ 06.39 *గరజి* సా 05.55 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉదయం 06.00 - 07.30 & 09.30 - 10.30*

అమృత కాలం :*ఉ 06.17 - 07.50*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*


*వర్జ్యం : రా 10.39 - 12.13*

*దుర్ముహుర్తం : మ 12.40 - 01.31 & 03.14 - 04.06*

*రాహు కాలం : ఉ 07.24 - 09.01*

గుళిక కాలం :*మ 01.50 - 03.27*

యమ గండం :*ఉ 10.37 - 12.14*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.47 - 08.22*

సంగవ కాలం :*08.22 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.06*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ బహుళ నవమి*

సాయంకాలం :*సా 04.06 - 06.40*

ప్రదోష కాలం :*సా 06.40 - 08.54*

నిశీధి కాలం :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.03*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్🕉️*


సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !

పార్థప్రహారకలితోత్తమమూర్థభాగ !

యక్షేశసేవితపదాబ్జ ! విభూతిదాయిన్ !

శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

గోరుచుట్టుకు

 గోరుచుట్టుకు నేను ప్రయోగించిన రహస్య సిద్ద యోగం  - 


      చాలా మంది గోరుచుట్టు రాగానే నిమ్మకాయ కి రంధ్రము చేసి వేలికి తొడుగుతారు . మరికొంతమంది గేద పేడ వేసి కట్టడం మరియు ఉల్లిగడ్డ వేసి కడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం మరియు తీవ్రమైన బాధని కలుగచేస్తుంది . క్రమేణా రక్తం , చీము బయటకి వెలువడి శస్త్రచికిత్స కూడా అవసరం అగును. 


        ఇటీవల ఒక వ్యక్తి గోరుచుట్టు తో తీవ్రవేదనతో నన్ను కలిశాడు . అతనికి నేను చేసిన చికిత్స వివరాలు తెలియచేస్తున్నాను .


     మొదట 100 గ్రాములు గుల్లసున్నం తీసుకుని సీసాలో వేసి నీరుపోసి బాగా కలిపాను. కొంతసేపటికి సున్నం అంతా కిందికి చేరుకొని పైన తేరుకున్న నీటిని వేరొక సీసాలో పోసి ఆ నీటికి సమానంగా ఆముదం ఆ నీరు గల సీసాలో పోసి బాగా కదిపాను . 15 నిమిషముల తరువాత నీరు మరియు ఆముదం కలిసి తెల్లని రంగు గల ద్రవం ఏర్పడినది . 


                ఆ ద్రవాన్ని దూదిపైన వేసి వాపు ఉన్నంతవరకు రాసి కట్టుకట్టాను . కేవలం 3 రోజుల్లో గోరుచుట్టు కరిగిపోయింది. బాధ కూడా తగ్గిపోయింది . 


      నిమ్మకాయ సరాసరి గోరుచుట్టు ఉన్న వేలికి పెట్టరాదు . నిమ్మకాయలో సున్నం మరియు పసుపు కలిపిన పారాణి ముద్ద పెట్టిన తరువాతే నిమ్మకాయ పెట్టండి . లేదా నిమ్మకాయ లేకుండా ఆ పారాణి ముద్దని కట్టండి. 


    ఇది నా అనుభవ యోగం 

  

 

       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

లోకం తీరు-9

 లోకం తీరు-9

కందం||

ఓర్పాకానగరాదిల

వార్పాయిసుమంతరాదువండగనింటన్

వేర్పాటుకుంపటిరగులున్

మార్పాయెన్నటికివచ్చుమమతలునిండన్


భావము:--నేటికాలాన చాలామందికి సహనము అంతంతమాత్రమనే

 చెప్పాలి.వంటావార్పుకిల

ప్రాధాన్యత తగ్గి ,అన్నాదు

లపొట్లాలను రప్పించుకు

ని పూటగడుపువారెక్కువ

గుచున్నారు.ఉమ్మడికు

టుంబాలు చెదిరి చిన్నకు

టుంబాలగుచున్నాయి‌.

మమతలలోగిళ్ళ సంద

ళ్ళు ఎప్పుడు వెల్లివిరు

స్తొయో!మనసుల సంకు

చితధోరణులు నశించి

 మనుషుల మనసుల యెన్నడు నిలుచునోమరి.


దేవరకొండ రాజోలు.

మా ఊరి కృష్ణుడు

 మా ఊరి కృష్ణుడు -04


18)వేణుంకరేణమనసా పరమాదరేణ

విశ్వంగుణేనకృపయావచనామృతేన

భక్తంవరైర్బహువిధైస్సకలాత్మబుధ్యా

స్వీకృత్యశిక్షణపరైఃకృతరక్షణేన

శ్రీపాదకృష్ణభగవన్ శరణం ప్రపద్యే 


19)ప్రాతఃస్మరామి హృదయే కరుణో జ్జ్వలాంగమ్।

కృష్ణం సనాతనమతోద్ధరధర్మమూర్తిమ్।

చిత్రాతిచిత్రచరితం హృదిపుణ్డరీకమ్।

గోపాలకేశవహరిం శుభచిహ్నపాదమ్।


20)జయతు జయతు శార్ఙీ ధర్మసంస్థాప కాఖ్యః 

జయతు జయతు శంఖీ దివ్యనాద ప్రమోదః।

జయతు జయతు పూర్ణో భక్తిభావేన తుష్టః।

జయతు జయతు నిత్యం కృష్ణ నారాయ ణోసౌ ।


21)జయతు జయతు దేవో సర్వ భూతాంత రాత్మా।

జయతు జయతు చక్రీ సర్వ సృష్టే ర్విధాతా।

జయతు జయతు విశ్వం త్రాణ నైపు ణ్యవేత్తా।

జయతు జయతు నిత్యం కృష్ణ నారాయణోసౌ।


22)జయతు జయతు శౌరి ష్షడ్గుణై ర్మణ్ఢితాంగః।

జయతు జయతు విష్ణు స్సర్వభూ తాంతరాత్మా।

జయతు జయతు  విశ్వం త్రాణ నైపుణ్యకీర్తిః।

జయతు జయతు నిత్యం కృష్ణ నారాయణోసౌ।


 23)కృష్ణ రాధేశ యోగేశ లోకేశ్వర।

 కృష్ణ భూతాంతరంగ ప్రభా భాస్కర।

 కృష్ణ భూపాల కంసాది గర్వాపహా।

 కృష్ణ గోవింద మామ్ స్వీకురు స్వీకురు।


 24) కృష్ణ లావణ్యమోహప్రకాశాకృతే ।

 కృష్ణ గోపీమనో వారి జాలంకృతే।

 కృష్ణ బృందావనాధీశ పూర్ణా కృతే।

 కృష్ణ గోవింద మాం స్వీకురు స్వీకురు ।


 25)కృష్ణ చైతన్య చంద్ర ప్రభాభాసిత।

 కృష్ణ గోవర్ధనోద్ధార సమ్మోహన ।

 కృష్ణదేవేంద్రవంద్య ప్రభో వందనమ్ ।

 కృష్ణ గోవింద మాం స్వీకురు స్వీకురు।


 26)కృష్ణ పాపఘ్న లోకాని సంపాలయ।

 కృష్ణ నారాయణానంతలీలాకృతే ।

 కృష్ణ గోబ్రాహ్మణోద్ధార సంరక్షమాం।

 కృష్ణ గోవింద మాం స్వీకురు స్వీకురు।


27) కృష్ణ గోపాల మాంపాలయాలోకయ । కృష్ణమచ్చిత్తమావేశయావేశయ ।

 కృష్ణ సర్వేశ మద్బుద్ధిశుద్ధిం కురు।

 కృష్ణ గోవింద మాం స్వీకురు స్వీకురు।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️ విమల శ్రీ

నిత్యపద్య నైవేద్యం-

 నిత్యపద్య నైవేద్యం-1563 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-198. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

దినాంతే చ పిబేత్ దుగ్ధం 

నిశాంతే చ పిబేత్ పయ:l

భోజనాంతే పిబేత్ తక్రం 

కిం వైద్యస్య ప్రయోజనంll 


తేటగీతి:

రేయి నిద్రకు ముందర తీయ పాలు,

మరుసటి యుదయమందునే మంచి నీరు,

అన్నము పిదప మజ్జిగ.. నారగించ 

వైద్యు బనిలేక స్వాస్థ్యమ్ము వరలుచుండు.


భావం: రాత్రి పడుకోబోయే ముందు పాలు త్రాగాలి. ఉదయం నిద్ర లేవగానే మంచి నీరు త్రాగాలి. భోజనానంతరం మజ్జిగ త్రాగాలి. ఈ మూడు పనులు నిత్యం చేస్తూ ఉంటే వైద్యునితో పనిలేక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.

ననుగన్నారలు పెంచినార

 మ.

ననుగన్నారలు పెంచినార లెపుడున్ నవ్యానురాగమ్ముతో 

జనసంఘంబులతోడ గూడి మనుటన్ సవ్యప్రకారమ్ముగా

తనయా! విన్మని తెల్పినారు జనకుల్ తథ్యంబుగా వారలే 

మనకారాధ్యులు పూజ్యులంచు మదిలో మన్నించుమా మిత్రమా! 4.

హ.వేం.స.నా.మూర్తి.

29.07.2024

*శ్రీ గణనాథోద్భవము

 శుభోదయం!

* *శ్రీ గణనాథోద్భవము!*(మూలం: శ్రీ శివ మహాపురాణం!)

 9చం.

అమిత బలాఢ్యు బాలకునకద్రి తనూజ కుసుంభ వస్త్రముల్,

విమల సువర్ణ లోహ పరివేష్టిత సుందర రత్న భూషలున్!

కొమరుడటంచు బల్కి కడు కూరిమి తోడ నొసంగినంతనే,

హిమజకు మ్రొక్కి వేడె దనకెయ్యది చేతమటంచు భక్తితో!!


   భావము: మిక్కిలి బలశాలియైన ఆబాలునక పట్టువస్త్రములు సువర్ణ రత్నాభరణములు ఇచ్చి కుమారుని ప్రేమతో జూచినంతనే ఆబాలుడు పార్వతికి మ్రొక్కి తాను చేయవలసిన కార్యమేమని అడిగెను.

గౌరీశంకర లను స్తుతిస్తూ

 గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం


సీ. శ్రీపార్వతీవరా ! శ్రితజన మందార !

                శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

     రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

                పాలించు సతతంబు భవుని రాణి!

     వేద మంత్రాకార ! విశ్వ సంరక్ష కా !

                శివకామసుందరీ చిత్తచోర !

     అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

                ఆర్త జనోద్ధార ! యహి విభూష !

తే. రమ్ము  మముగావ పరమేశ ! రమ్యదేహ ! 

      నిన్ను  నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

      పార్వతీ నాథ ! శంకరా !పరమపురుష!

      శశిధరా ! యీశ ! గౌరీశ ! శరణు శరణు !


జయలక్ష్మి

వ్యాఘ్ర్యై* నమః..🙏🏼

 361. ఓం *వ్యాఘ్ర్యై* నమః..🙏🏼

శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 361వ నామము


నామ వివరణ. 

అమ్మ ఆడపులి.


తే.గీ.  *వ్యాఘ్రి!* దుర్గుణ మృగములు ప్రబలు చుండె

నమ్మరో నామదిన్, చంపుమమ్మ, నీవు

నన్ను రక్షించుచుండుమా మన్ననమున,

వందనంబులు చేసెదనందుకొనుము.

🙏🏼

రచన .. చింతా రామకృష్ణారావు.

గోదావరి

 గోదావరి.              

ఉ.  స్వైరవిహారదీరయగు శారదనీర తరంగ రంగ గం 


భీరము గౌతమీ నదము ప్రేంఖణ నడ్డెడి పాపికొండలన్ 


భోరున చీల్చిచి నిమ్నతల భూముల దూకెడు వేళ చూపు శృం 


గార విలాసముల్ కనగ కన్నుల పండువు గాదె యేరికిన్. 


శా .  కన్నుల్ చాలవు చూడముచ్చటలునౌకల్యాణి గోదావరీ 


పన్నీరంబులు , త్ర్యంబకేశ్వర పదోత్పన్నంబులౌ నిత్య సం 


పన్నoబుల్ , బహుళాంధ్ర ధీరవనితా ప్రాగల్భ్య సంగాతమౌ 


విన్నాణంబులు , నాట్యభOగిమలు సంవేగ ప్రతిధ్వానముల్.

1985 లోవ్రాసినవి

18 పురాణముల పేర్లను

 శ్లోకము.

మద్వయం బ్రద్వయంచైవ 

భ్రత్రయం వచతుష్టయం।

అనాపలింగకూస్కా ని

పురాణానిచ పృథక్ పృథక్॥


ఇది 18 పురాణముల పేర్లను గుర్తు పెట్టుకునేందుకు శ్లోకము.

పద్య లహరి

 *పద్య లహరి

      కై

 నా ఒకప్పటి సమస్యాపూరణ

   ===================

సమస్యాపూరణభారతి

కార్తీక శుక్రవారం పూజలు

న్యస్తాక్షరి

శు-క్ర-వా-రం          

పాదం1-7

పాదం 2-8

పాదం 3-1o

పాదం 4-13

•••••••••••••••••••• •• ••••••••••••••           

  భారత మందు నన్ *శు*భము భర్తకు 

       గల్గగ   స్త్రీలు  పాత్రులౌ

  వారిని బిల్చి పూజ *క్ర*మ పద్ధతిలో 

                    నొనరించి  దివ్యమౌ

   *వా*రము నందుచీరలిడి  వారల

                   దీవెన పొంద దు

    ర్వార శుభంబులున్ గలుగు భవ్య

              వ*రం*బుల నిచ్చు మాతయున్

    ----తంగిరాల నరసింహ కుమార్

క్రొత్తపలుకు-9

 క్రొత్తపలుకు-9 

గౌరవమ్ము నిమ్ము గౌరవమ్మును కొమ్ము 

సాటివారిలోన మేటివగుము 

తగిన ప్రతిభతోడ దర్పమ్ముజూపించి 

వందితుండ వగుము వసుధయందు

*~శ్రీశర్మద*

మనోవేదన

 ఆంధ్రభాషోపాధ్యాయుని మనోవేదన 

సీ.

భాషానురక్తితో బద్యము బోధింప 

నెంచగ రసమును నెఱుగ లేని 

శిష్యగణము జూ‌సి శిరమదెంతో నొచ్చె 

గద్య బోధను జేసి గణుతి కెక్క 

దలచగ భావపు దారిద్ర్యమది దోచె 

శబ్దసౌష్ఠవముతో శాస్త్ర బోధ 

జేతుమన్న సరిగా జెవికి నెక్కించుకో 

గల్గిన వారును గరువయితిరి 

తే.గీ.

తెలుగు భాషను బోధింప దలకు మించె 

గా నకట వింత పోకడ గాలమాయె 

గురువుల చదువులెల్లను గుంట బెట్టి 

నట్లు శిష్యోపయుక్తము నంద కుండె 


😞😢😭


✍️యస్.కె.చక్రవర్తి

Panchaag


 

బ్రాహ్మణుడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో 𝕝𝕝   *న యోనిర్నాపి సంస్కారో* 

                *న శ్రుతిర్న చ సంతతిః* | 

                *కారణాని ద్విజత్వస్య*

               *వృత్తమేవ తు  కారణమ్* ||


       తా 𝕝𝕝  పుట్టుక కానీ, సంస్కారము కానీ, పాండిత్యము కానీ, సంతతి కానీ ద్విజత్వమునకు (బ్రాహ్మణత్వమునకు) కారణములు గావు. నడవడి యొక్కటే దానికి కారణము.... *నడవడి మంచిది కానట్టయితే బ్రాహ్మణుడు కూడా శూద్రసమానుడే*....