24, జనవరి 2023, మంగళవారం

మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము

 *మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము*

*25-01-2023 బుధవారం*


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


*సుమిత్రుని_కథ*


పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగ గోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను.


 పార్వతీ..! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురు పుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురు పుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లు పలికెను. గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని.. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ! నీవు నామాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించు కొనుము.. రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.


సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగా తీరము నకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచె ప్పిన యుపదేశము ను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట నొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించ దలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి.


సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకము కల్గును. మీరు పూజించునది యే దైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో నోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. 


సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘ మాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘ మాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘ మాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను దేషించువాడు, వీరందరును పాపాత్ములే సుమా.. మేము చేయుచున్న యీ మాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవునర్చించిన వాని పుణ్యo అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫల ప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగ వివరించెను.


 సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడు దినములు మిగిలియున్నది. ఈ మూడు దినములును మాఘస్నాన మాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.


సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘ మాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము నారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణి యగు, శ్రీ హరి కృపా విశేషము నంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే గాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘ స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృ దేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠము నందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను..


ఇతి శ్రీ మాఘ పురాణే చతుర్థోధ్యాయః పారాయణం సంపూర్ణం...


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*🅰️🅿️SRINU*

*కాశీ ఖండం - 7*

 *కాశీ ఖండం - 7*


🎈🎈🎈🎈🎈🎈🎈🎈 


 యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం‘’ అనే మహాగ్రంధం నామాన్ని స్మరించేవారికి కూడా, పునర్జన్మ ఉండదు అని, విష్ణు దూతలు, శివశర్మకు చెప్పినట్లు, అగస్త్య ముని, లోపాముద్రకు, తెలియ జేశాడు. 


 అక్కడి నుండి విష్ణు దూతలు, శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి, తీసుకొని వెళ్లారు.  ఆ లోకాల వివరాలు తెలుసుకొందాం



 *అప్సరస, సూర్యలోక వర్ణన*



విష్ణు దూతలు, శివశర్మను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడవారుంటారు.  సమస్త భాషలలో వారు కోవిదులు . క్షీరసాగర మధనంలో జన్మించినవారు.  మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే.


 ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, వపుష్మతి, 

కాంతిమతి, లీలావతి, ఉత్పలావతి, అలంబుష, గుణవతి, స్థూలకేశి, కళావతి, కళానిధి, గుణనిధి, కర్పూరతిలక, ఉర్వార, అనంగతిలక, మదన మోహిని, చకోరాక్షి, చంద్రకళ, ముని మనోహర,  గవద్రావ, 

తపోద్వేష్టి, చారునాన, సుకర్ణిక, దారు సంజీవని, సుశ్రీ, క్రమ శుల్క, శుభానన, తపస్శుల్క, హిమావతి, పంచాశ్వమేదిక, రాజసూయార్ధిని, అష్టాగ్ని హోమిక, వాజపేయ శతోద్భవ, మొదలైనవారు అప్సరస గణం. వీరి సంఖ్య 6,000.  


 ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు. వీరంతా లావణ్యంతో, నిత్య యవ్వనంతో, దివ్యామ్బరాలతో ఉంటారు. వీరందరూ స్వైరుణులు, సుసంపన్నులు. కోరిక తీర్చే వ్రతాలు చేసి, ఉద్యాపనాలు చేసినవారు. అప్సరసలోకానికి చేరుకొంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు. వీరిని దేవ వేశ్యలని అంటారు. సూర్యసంక్రమణం నాడు దానం చేసిన వారు, ’’మొదాత్‘’ అనే మంత్రాన్ని అనుష్టించి, దానాలిచ్చిన వారు, ఇక్కడికి చేరుకొంటారు. 


 తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివశర్మ . సూర్యలోకము తొమ్మిది యోజనాల విస్తీర్ణం కలది. విచిత్రాలైన ఏడు గుర్రాలు, ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధిగా, సూర్యుడు, నిత్య సంచారం చేస్తూంటాడు. క్షణకాలంలోనే ఆవిర్భావ, తిరోభావాలను పొందే సూర్యుడు, ప్రత్యక్ష వేద పురుషుడు. ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ. సూర్యుని వల్లనే, సకల జీవరాశులు, ఆహారాన్ని సంపాదిoచు కొంటున్నాయి. ప్రత్యక్ష సాక్షి , కర్మసాక్షి.  గాయత్రీ మంత్రంతో సకాలంలో వదలబడిన అర్ఘ్యం నశించదు, అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మిత్ర , పుత్ర, కళత్రాలు, అష్టవిధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి. 


 ఆష్టాదశ విద్యల్లో, మీమాంస గొప్పది. దాని కంటే తర్కం, దానికంటే పురాణం గొప్పవి.  వీటికంటే ధర్మ శాస్త్రం, వాటికంటే వేదాలు, వేదం కంటే ఉపనిషత్తులు, వీటికంటే గాయత్రీమంత్రం, గొప్పవి. అది ప్రణవ సంపుటి. గాయత్రి మంత్రం కంటే అధికమైన మంత్రం, మూడు లోకాలలోనూ లేదు. గాయత్రి వేదజనని. గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక, గాయత్రి అని పేరు. సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు, గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం. 


 గాయత్రి మంత్రం చేత, రాజర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి అయాడు. గాయత్రియే, విష్ణువు, శివుడు, బ్రహ్మా. అమ్శుమాలి అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు. అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి.

 ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా. తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త. పడమర దిశలో సర్వతోముఖుడై, 

కనిపిస్తాడు. ఉత్తరాయణ, దక్షిణాయణ పుణ్యకాలాలలో, షడతీతుల్లో, విష్ణుపంచకంలో ఎవరు మహా దానం చేస్తారో, పితృక్రియలు నిర్వ హిస్తారో, వారు సూర్య సమాన తేజస్కులై , సూర్యలోకంలో  నివసిస్తారు. ఆదివారం, సూర్య గ్రహణం నాడు దానం చేస్తే, ఉత్తమ లోక ప్రాప్తి. 

హంసుడు, భానుడు, సహస్రాంశువు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు వివశ్వంతుడు, విశ్వకర్మ, విభావనుడు, విశ్వ రూపుడు, విశ్వకర్త, మార్తాండుడు, మిహిరుడు, అంశుమంతుడు, ఆదిత్యుడు, ఉష్నగుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రద్నుడు, ద్వాదశాదిత్యుడు, సప్తహయుడు, భాస్కరుడు, ఆహస్కరుడు, ఖగుడు, శూరుడు,

ప్రభాకరుడు, శ్రీమంత్రుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోక సాక్షి, తమోరి,

శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తాంషుడు, తరణి,

సుమాహారిణి, ద్యుమణి,

హరిదాశ్వుడు, అర్కుడు,

భానుమంతుడు, భయనాశనుడు, చందోశ్వుడు, వేదవేద్యుడు, భాస్వంతుడు, పూషుడు, వృషాకపి, ఏక చక్రధరుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రఘ్నుడు, దైత్యఘ్నుడు, పాపహర్త, ధర్ముడు, ధర్మప్రకాశకుడు, హీళి, చిత్రభానుడు, కలిఘ్నుడు, తార్ష్యవాహనుడు, దిక్రుతి, పద్మినీనాభుడు, కుశేషయకారుడు, హరి, ఘర్మరశ్మి, దుర్నిరీక్షుడు, చందాంశువు, కశ్యపాత్మజుడు, అనే డెబ్బదిరెండు పేర్లుసూర్యునికి ఉన్నాయి. 


 ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ఉచ్చరిస్తూ, సూర్యుని చూస్తూ నమస్కరిస్తే, సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా, నిర్మల మైన జలాన్ని నింపి, మోకాళ్ళపైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం, గరిక, అక్షతలు ఆ పాత్రలో ఉంచి సూర్యుడిని ధ్యానిస్తూ, ఫాలభాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని, స్తిరచిత్తంతో, పైన చెప్పిన 72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ, సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చేవాడెప్పుడు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు. వ్యాధులు నశిస్తాయి’’. అని శివశర్మకు, విష్ణుదూతలు వివరించారని, భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు.


 *కాశీఖండం సశేషం..*

🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*🅰️🅿️SRINU*

సృష్టి మూడు రకాలు

 🙏 *శుభోదయం* 🙏


*‌ఈ ప్రపంచంలోని సృష్టి మూడు రకాలుగా ఏకమై ఉంటుంది...*

 

*‌సృష్టి, స్థితి, లయలతో ఇది నడుప బడుతుంది*


*‌సత్వ రజస్తమో గుణాలతో నిండి ఉంటుంది...*


*‌ఇలా ఏకమై ఉన్న ఈ సృష్టి అనేకంగా కనిపిస్తూ మనిషిని భ్రమింప చేస్తుంది...*

 

*‌సృష్టిలో ఏదైనా అది పరమాత్మయే...ఈ సృష్టే పరమాత్మ...*


*‌చూసే ప్రతిదీ, వినే ప్రతిదీ, అనుభూతి చెందే ప్రతిదీ ఆ పరమాత్మ స్వరూపమే..*

 

*‌ఆ పరమాత్మనే నేను ..* 


*‌ద్రష్ట (చూసేవాడు),  దృశ్యం (చూడబడేది), దృక్కు (చూడగలిగే శక్తి) మూడూ నేనే ..*


*‌ధ్యాత (ధ్యాన శక్తి ), ధ్యాని (ధ్యానించేవాడు) ధ్యేయము (ధ్యానించే శక్తి) మూడూ నేనే ..*


*‌శ్రోత (వినే వాడు), శ్రోత్రము (వినబడేది), శ్రవణం (వినికిడి శక్తి)  మూడూ  నేనే....*

 

*‌చివరగా తెలుసుకునేది (జ్ఞానం), తెలియబడేది (జ్ఞేయము), తెలుసుకునే వాడు (జ్ఞాత) నేనే...*


*‌నన్ను  నేనే  తెలుసుకుంటున్నాను...*


*‌తెలుసుకునేది - నేనే...*

‌ *తెలియబడేది - నేనే ..*

 

*‌ఆ తెలివి కూడా నేనే...*


*ఈ ఎరుకతో ఉండటమే సాధన, సమాధి స్థితి.*

   

🙏🙏🙏🙏🙏🙏

 

తేజస్స్వరూపుడివి

 శ్లోకం:☝

*తేజోఽసి తేజో మయి దేహి*

*వీర్యమసి వీర్యం మయి దేహి*

*బలమసి బలం మయి దేహి*

*ఓజోఽసి ఓజో మయి దేహి*

*మన్యురసి మన్యుం మయి దేహి*

*సహోఽసి సహో మయి దేహి*

 - శుక్ల యజుర్వేద సంహిత 


భావం: ఓ పరమాత్మా!

నీవు అనంతమైన తేజస్స్వరూపుడివి - నన్ను తేజోవంతునిగా చేయి. 

నీవు అనంతమైన వీర్యవంతుడివి - నన్ను వీర్యవంతునిగా చేయి. 

నీవు అనంత బలసంపన్నుడివి - నాకు బలాన్ని ప్రసాదించు. 

నీవు అనంత శక్తిమంతుడివి, ఉత్సాహవంతుడివి - నాకు శక్తిని, ఉత్సాహాన్ని ప్రసాదించు. 

నీవు అనంతమైన సహనము, ధైర్యసంపన్నుడివి - నాకు ధైర్యాన్ని, సహనాన్ని ప్రసాదించు.🙏

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి

 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ స్వామివారి భజన మహత్యం*


డి.శారద, దమ్మపేట వాస్తవ్యులు స్వామి వారి భజన మహత్యాన్ని ఈ విధంగా చెప్తున్నారు


11 సం॥ వయసు గల మా పాపకి ప్రక్కటెముకల క్రింద నొప్పి వస్తుంది. డాక్టరుకు చూపిస్తే ఎక్సరే తీసాడు. మిగిలిన టెస్టులు చేసి ఏమీలేదు, గ్యాస్ నొప్పిలాగా ఉన్నది. అని బాగా పవర్ ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చాడు. పులుపు, కారం తినవద్దు అన్నాడు. మా పాప సరిగా తీపి ఇష్టపడదు. అన్నం తిందాము అని వెళ్ళి రెండు ముద్దలు తిని నొప్పి వస్తుంది అని లేచిపోయేది. ఇలాంటి పరిస్థితులలో మందులు వాడుతూ పత్యం చేస్తే నెలరోజులకు తగ్గింది. తరువాత ఒక నెలరోజులు అయ్యాక కొంచెం పులుపు తగిలేసరికి మళ్ళీ నొప్పి వచ్చేసింది. 


మరలా డాక్టరు దగ్గరకు తీసుకొని వెళదాము అనుకున్నాను. ఈలోగా మా పాప ఒకరోజు గుడికి వెళ్ళి రెండు రూపాయలు దక్షిణ వేసి స్వామి నాకు నొప్పి తగ్గించు అని ప్రార్ధించింది. ఇంటికి వచ్చాక నాతో చెబితే నేను శనివారములు వెంకయ్యస్వామి భజన *"కాపాడవయ్యా వెంకయ్యస్వామి!"* చదువు అని చెప్పాను. సరే అని శుక్రవారం చదివింది. శనివారం చదివింది అంతే ఆదివారం నుండినొప్పే లేదు... పులుపు, కారం తింటున్నా రావటం లేదు. 


ఇప్పుడు మా పాప రోజూ వెంకయ్య స్వామి భజన చదువుతుంది. స్వామి కృపవల్లనే తగ్గింది అనే విశ్వాసం నాలోనేగాక మాపాపకు కలిగించారు. ఎంత కరుణామయులో! ఏమి ఇచ్చి ఆయన ఋణం తీర్చుకోగలము. జీవితాంతం ఆయన సేవలో నిలవగలగడమే మేము ఆయనకు ఇచ్చే దక్షిణ. మా ప్రయత్నానికి స్వామి ఎప్పుడూ (ఆయన సేవలో ఉండటానికి) సాయం చేస్తూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*మనం ఆలోచించినా, ఆలోచించకున్నా... మనకు రావలసినవి వచ్చి తీరుతాయి .  మనకు ప్రాప్తం లేనివి మనం ఎంత గింజుకులాడి ప్రయత్నించినా,  మన కర్మానుసారంగా ముందే నిర్ణయము అయిన దానికంటే అధికంగా.. మన ప్రస్తుత ప్రయత్నం వల్ల, ఆలోచనల వల్ల,  మనకి ఏమీ అనుభవానికి రావు*


*మన ప్రారబ్దంలో అవసరాలు పొందేందుకు కొంత కృషి చేయాలని వ్రాసి పెట్టి ఉంటే.... మన ఆలోచనలతో నిమిత్తం లేకుండా అప్పటికప్పుడు మనమే ఆయా పనులు నిర్వర్తించి తీరుతాము.   ఈ విషయంలో మన ఆలోచనలకు తావే లేదు*


*ఆ పని చేయవలసినట్లు ఉన్న మన పూర్వకర్మే... మన చేత ఆ సమయానికి ...ఆ పని చేయించి తీరుతుంది . ఆ కర్మే,  మనలను ఆ పని చేసేందుకు ముందుకు నెట్టి  మరీ చేయిస్తుంది .  నీవు ముందుగా  , ఎంత ఆలోచించినా,  ఆలోచించకున్నా ...ఆ విధంగానే పనిచేసి తీరుతావు.  ఆలోచన అనవసరం*

*దత్త స్వరూపులు.. పూజ్య భరద్వాజ మాస్టర్ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మాఘమాసంలో వస్తున్న 5 ఆదివారములు

 ☀️☀️☀️☀️☀️🙏☀️☀️☀️☀️☀️

ఈసారి మాఘమాసంలో వస్తున్న 5 ఆదివారములు చాలా విశేషమైనవి.


 మొదటి ఆదివారము జనవరి 22వ తారీకు.


రెండవ ఆదివారం జనవరి 29వ తారీకు 


మూడవ ఆదివారము ఫిబ్రవరి 5వ తారీఖు అదే రోజున పౌర్ణమి కూడాను మాఘ పౌర్ణమి, ఆదివారం రావడం అన్నది చాలా విశేషం.


 నాలుగవ ఆదివారము ఫిబ్రవరి 12వ తారీకు ఇది మరీ విశేషము. కారణం, సప్తమి తిధితో కూడుకున్న మాఘ ఆదివారం. ఇది ఒక రకంగా మరో రథసప్తమిగా చెప్పవచ్చు.


అయిదవ ఆదివారం ఫిబ్రవరి 19వ తారీకు,  ఈ రోజున మాస శివరాత్రి ఇది మరీ విశేషం. కాబట్టి ప్రతి ఆదివారము నాడు పరమాన్నం చేసుకొని ఆదిత్య హృదయం పారాయణ చేసుకొని పరమాన్నము నైవేద్యముగా పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకోండి. 


దయచేసి ఈ ఆదివారాల్లో నాన్ వెజ్ మాత్రం తినకండి. 


ఓం నమశివాయ.

*మాఘ పురాణం* *3 వ అధ్యాయము*

 *మాఘ పురాణం* 

*3 వ అధ్యాయము*

*24-01-2023 మంగళవారం*


🎈🎈🎈🎈🎈🎈🎈🎈


*గురు పుత్రికా కథ*


మంగళదాయినీ..! సర్వమంగళా..! మాఘ మాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి.. స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నా ననగా శివుడిట్లు పలికెను... 


దేవి వినుము.., పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచార వంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు గురు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ వుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ వుండేవాడు.


ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది., పద్మాలు. వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో నున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగ నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.


గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది.. మన మిద్ధరమును పడుచు వారము, మన కలయిక సుఖప్రద మగును.. ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగా నున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని పిలిచెను. 


సుమిత్రుడు మంచిదానా..! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు.. మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను.నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదము రమ్ము, గురువు గారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.


గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖము నందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరము నొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితo అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుట కంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మధ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖముల ననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను.


తండ్రి యామెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణకిచ్చి వివాహము చేసెను. కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖముల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి..? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించు చుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి.. 'జ్ఞానస్వరూపా..! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నంది యిట్లు పలికెను. ఓయీ..! వినుము.. నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగి యుండెను. సౌందర్యవతి, యౌవనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశమున నెట్లు జన్మించినదా యని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘ మాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము నాచరించు వారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషము వలన నీమె తమ కర్మ ఫలముల యిట్ల ననుభవించుచున్నది.. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా..!


సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి.. 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట యేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము.. 


మాఘ మాసమున ప్రాతఃస్నానము చేసి ఆ నదీ తీరమున గాని, సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారము లతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో  గౌరీదేవిని సమర్పించ వలయును. ఈ విధముగ ఈమె తో ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజ చేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింప జేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘ మాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరివ్రత మాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారి యనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు..అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. 


కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలో గాని, సరస్సున గాని, కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను...


ఇతి శ్రీ మాఘ పురాణం తృతీయ అధ్యాయం పారాయణ సంపూర్ణం...


🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*🅰️🅿️SRINU*

మాఘ పురాణం – 2వ అధ్యాయం

 


మాఘ పురాణం – 2వ అధ్యాయం


దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:


దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.

దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.

దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.

అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.

ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.

“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.

“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.

ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.

దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:

దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.

ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.

దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.

అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.

మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.

అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు. 


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మాఘ స్నానం

 శ్లోకం:☝️మాఘ స్నానం

*తిస్రకోట్యోఽర్ధకోటి చ*

 *యాని లోమాని మానుషే॥*

*స్రవంతి సర్వతీర్థాని*

 *తస్మాన్ పరిపీడయేత్ ।*

*దేవాః పిబన్తి శిరసి*

 *శ్మశ్రుతః పితరస్తథా ॥*

*చక్షుషోరపి గంధర్వా*

 *అధస్తాత్సర్వజంతవః ।*

*దేవాః పితృగణాః సర్వే*

 *గంధర్వా జంతవస్తథా ॥*

*స్నానమాత్రేణ తుష్యన్తి*

 *స్నానత్పాపం న విద్యతే ।*

   పద్మపురాణం, సృష్టి ఖండం


భావం: మానవ శరీరంలోని మూడున్నర కోట్ల రోమాలు సమస్త తీర్థాలకు ప్రతీకలు. వాటిని తాకి పడే నీరు అన్ని తీర్థాలనుండి పడినట్లే. స్నానం చేసేవారి తలపై నుండి జారిన నీటిని దేవతలు తృప్తులౌతారు. మీసాలు-గడ్డాలపై నుండి జారిన నీటితో పితృదేవతలు తృప్తి చెందుతారు, గంధర్వులు కన్నుల నుండి జారిన నీటితో మరియు మిగిలిన జీవులు క్రింది భాగం నుండి జారిన నీటితో తృప్తి చెందుతారు. ఈ విధంగా దేవతలు, పితరులు, గంధర్వులు మరియు సమస్త ప్రాణులు స్నానముతో తృప్తి చెందుతారు. స్నానం చేసిన తర్వాత శరీరంలో పాపం ఉండదు.

    మాఘమాసంలో ప్రాతఃకాల స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మకరరాశిలో ఉన్న వేళ సుప్రభాత స్నానం గురించి వివిధ పురాణాలలో వర్ణించబడింది.🙏

కాశీ ఖండం - 6*

 *కాశీ ఖండం - 6*


🏮🏮🏮🏮🏮🏮🏮🏮 


 *యమపురి వర్ణనం*



 సాధ్వి లోపాముద్ర, భర్త అగస్త్య మునిని - ‘’శివశర్మ హరిద్వారం లో మరణించినా, మోక్షం పొందకుండా, విష్ణులోకానికి ఎందుకు వెళ్లాడు ?"అని ప్రశ్నించింది . దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు. అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు, దాని గురించిన వివరాలను చెప్పాడు. 


 శివశర్మ ను ముందుగా యమలోకానికి తీసుకొనివెళ్లారు,  విష్ణు దూతలు. అక్కడ 

వికృతాకారులు కన్పించారు. అది పిశాచలోకమని, పాప కర్మలు చేసినవారు, పరిశుద్ధమైన మనస్సు లేనివారు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఆ తర్వాత కొంత దూరంలో మనోహరాకారులు, శ్యామలాకారులు కనిపించారు.  అది గుహ్య లోకమని, న్యాయంగా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని, చెప్పారు. సంపాదించిన డబ్బును దాస్తారు కనుక, గుహ్యకలోకం అంటారు. వీరికి  దానధర్మాలు తెలియవు. సుఖంగా మాత్రం ఉంటారు. బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు. దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు. 


 కొంత దూరం పోయిన తర్వాత, గాంధర్వ లోకం కనిపించింది.  డబ్బున్న వారిని, సంగీతంతో సంతోషపెట్టినవారు ఇక్కడికి వస్తారు. ఈ గాంధర్వ విద్యతోనే, నారదుడు దేవర్షి అయ్యాడు.  వీరంతా శివుని సంతోషపెడతారు. హరిహరుల సమక్షంలో పాడిన వారు మోక్షం పొందుతారు. తర్వాత విద్యాధరలోకం చేరారు.  అన్ని విద్యలలో నిష్ణాతులు, ఈ లోకంలో ఉంటారు. 


 ఇంతలో యమధర్మరాజు అనుచర గణంతో అక్కడికి చేరాడు. ఆయన సౌమ్యమైన ఆకారంతో, తెల్లని వస్త్రాలతో కనిపించాడు. యముడంటే అందరు భయపడతారు కదా? ఇంత సాధువు లాగా ఉన్నాడేమిటి ? అని, శివశర్మకు సందేహం కలిగింది.  అప్పుడు విష్ణు దూతలు పాపాత్ములకు యముడు భీకరంగా,  సజ్జనులకు సౌమ్యుడుగా దర్శనమిస్తాడని, హరిద్వారం లో చనిపోవటం, ధర్మశాస్త్రాధ్యయనం చేయటం వల్ల, శివ శర్మకు మంచిగా కనిపించాడని చెప్పారు.

(ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకం లో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్య వంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భంలో ధవళ వస్త్రాలతో చాలా సౌమ్యంగా రంగ ప్రవేశం చేసి నటించారట. ఆ నాటకం అయిన తర్వాత, విశ్లేషకులు, "అలా ఎందుకుఅలా చేశారు?" అని అడిగారట. దానికి రాఘవ – నేను యమధర్మ రాజుగా సతీసావిత్రి అనే పతివ్రత దగ్గరకు వస్తున్నాను. యముడు  ధర్మాధర్మాలు తెలిసినవాడు కనుక, ధర్మరాజు అని పిలువబడుతాడు. మంచి వారికీ మంచిగా, దుష్టులకు భయంకరంగా కనిపిస్తాడని శాస్త్రాలు చెప్పాయి" అని వివరించారట. నిజంగా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు. కోపంతో అవి యెర్ర గా ఉంటాయి .అక్కడున్న వారికి, వారి పాపాలననుసరించి, శిక్షలు ప్రకటిస్తున్నాడు యమ ధర్మ రాజు.

దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు, యమధర్మ రాజు సభాసదులుగా ఉంటారు. ఉసీనరుడు, సుధాన్వుడు, వృషపర్వుడు, జయద్రధుడు, రాజసహస్ర జిత్తు, దృఢ దానవుడు, రిపుంజయుడు, యవనాశ్వుడు, దంతవక్త్రుడు, నాభాగుడు, రిపుమంగళుడు, కరంధముడు, ధర్మసేనుడు,  పరమర్ధనుడు, పరాన్తకుడు, మొదలైన నీతి మంతులైన రాజులు, ధర్మా ధర్మాలు తెలిసినవారు, సుధర్మ సభలో ఉంటారు. 


 శివ, విష్ణు నామాలను సదా జపించేవారు, యమునికి దూతలుగా పని చేస్తారు. వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగ్గరకు పోరాదని, యమ శాసనం.

  

 యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం‘’ అనే మహాగ్రంధం నామాన్ని స్మరించేవారికి కూడా, పునర్జన్మ ఉండదు అని, విష్ణు దూతలు, శివశర్మకు చెప్పినట్లు, అగస్త్య ముని, లోపాముద్రకు, తెలియ జేశాడు. 


 అక్కడి నుండి విష్ణు దూతలు, శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి, తీసుకొని వెళ్లారు. 


(రేపు ఆలోకాల వివరాలు తెలుసుకొందాం.)


 *కాశీఖండం సశేషం..*

🏮🏮🏮🏮🏮🏮🏮🏮

*🅰️🅿️SRINU*

అంతరంగమే భగవంతుడి నివాసం

 *భగవంతుడి నివాసం ఎక్కడ?*

           

*భగవంతుడు కేవలం స్థిర చిత్తం కలిగిన మనుష్యుని అంతరంగములో మాత్రమే ఉండటానికి ఇష్టపడతాడు, చంచల స్వభావం కలిగిన మనుష్యుని యందు భగవంతుని ఉనికిని కనుక్కోలేము.


*చంద్రుని ప్రతిబింబం.. పారే నదీ జలాలలో సరిగా చూడలేము, కానీ చలించని కొలను నీటిలో స్పష్టంగా చూడగలము.


*కొలనులోని నీటిలాగా మనసు నిశ్చలము చేసుకోవాలి, కోరికలు తీరిస్తే కొండలరాయుడు, కోరికలు తీరకపోతే బండలరాయుడు అనుకోవడం, సంకటమొస్తే భగవంతుడిని తలుచుకోవడం, సుఖమొస్తే భగవంతుని మర్చిపోవడం, మానవ సహజం!


*అలా కాకుండా, స్థిరచిత్తముతో స్మరణ, ధ్యానాది సాధనల ద్వారా మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిరం చేసుకోవాలి, అప్పుడు మన మనసుకు భగవత్తత్త్వం స్పష్టంగా గోచరిస్తుంది.


*అలాంటి హృదయంలో భగవంతుడు స్థిర నివాసం ఏర్పరచుకొని నిత్యం కాపాడుతుంటాడు.


*సరే మరి భగవంతుడు మన హృదయంలో స్థిరనివాసి కావాలంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి?*


*తామరాకు మీద నీటి బొట్టు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు.. ఈ జీవితం కూడా అంతే... ఎప్పుడు మృత్యువు ముంచుకొస్తుందో తెలియదు...


*అలాగే ఈ ప్రపంచంలో దేనిని చూసీ గర్వపడవద్దు,


*మనుషులకు దగ్గరకావడానికి, చూడొద్దు, భగవంతునికి ఎలా దగ్గర కావాలో ఆలోచించుకోవాలి,


*నిత్యము ఆయనపై ధ్యాసతో, ధ్యానంతో ఉండాలి.


*వివేకంతో ఉండండం మంచిది, మనం చూసుకొని గర్వపడే వస్తువులు, డబ్భు, మనుషులు, ఎప్పుడో ఒకప్పుడు విడిచిపోక తప్పదు!


*శాశ్వతమైనది భగవత్ సాన్నిధ్యం ఒక్కటే...!*


*మనలో అహంకారం దూసుకొని వస్తూ ఉంటే, ఆత్మజ్ఞానం వెనక్కి వెళుతూ ఉంటుంది.*


*ఆత్మజ్ఞానం ముందుకు వస్తూ ఉంటే, అజ్ఞానం వెనక్కి వెళుతూ ఉంటుంది.*


*ఆత్మజ్ణానాన్ని మనం పోషించుకుంటూ ఉండాలి.


*అప్పుడే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాము...!


 *పిల్లలు ఇసుకలో పిచ్చుకగూళ్ళు కడతారు, అలాగే పేక ముక్కలతో మేడ కడతారు, వాటిని ఎంతో తేలికగా పడగొట్టవచ్చు! 


*అలాగే ఈ అహంకారం నిజంకాదని తెలిస్తే దాన్ని అంత తేలికగానూ పడగొట్టవచ్చు. 


*పడిపోయిన పేక ముక్కల మేడ, కూలిపోయిన ఇసుకలోని పిచ్చుక గూడు చూసి పిల్లలు కేరింతలు కొడతారు... కానీ బాదపడరు...*


అలాగే 

*మమకారంతో మనం పెంచుకున్న, బంధాలు, అనుబంధాలు తెగిపోయినప్పుడు సంతోషించాలి కానీ కృంగి పోకూడదు...* 


*అహంకారంతో మనం పెంచుకున్న డాంబికత్వం పాలమీద పొంగు లాంటిది... అది వదిలించుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ, అందులోనే మునిగి పోకూడదు...*

 

*వర్తమానంలో జీవించాలి... మనస్సును గతానికి, భవిష్యత్తుకు బానిసను చేయకూడదు... జరిగేదంతా సాక్షిగా చూడాలి..*

 

అప్పుడు *నీ అంతరంగమే భగవంతుడి నివాసంగా మారుతుంది....*  


*ఓం తత్ సత్*

🙏🙏🙏🙏🙏

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య

 1) 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*చిన్న తప్పయిన తప్పే - శ్రీ స్వామివారి దివ్యబోధ*


మనం మహనీయులను హృదయపూర్వకంగా సేవిస్తుంటే వారు మన తప్పులనెలా సరిదిద్దుతారో తెల్పేవే శ్రీ డి.నాగేశ్వరరావు, దమ్మపేట వారి అనుభవాలు. 2005వ సంవత్సరంలో వారి స్వప్నంలో గొలగమూడి లోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో నిత్యం జరిగే సత్సంగం కనిపిస్తుంది. ' *సద్గురు కృప పొందడం అనేది మానవుని జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది*. ఉదాహరణకు దమ్మపేట డి.నాగేశ్వరరావు గారి జీవిత విధానం వల్లనే వారంతగా గురు కృప పొందగల్గారు అని అక్కడ చెపుతున్నారు. 


వెంటనే మఠం యొక్క ఒక వైపు నుండి శ్రీ బాబాగారు, మరియొక వైపునుండి శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి సెల్ ఫోన్ సైజులో ఉండే చిన్న పెట్టె అది. దానికి ఉండే చిన్న గుబ్బను త్రిప్పుతుంటే ఆ పెట్టెలోపల ఫిల్ము తిరుగుతూ బొమ్మలు కనిపిస్తాయి.. చిన్న పిల్లలు దానిలోని బొమ్మలు చూస్తుంటారు. శ్రీ స్వామివారు, శ్రీ బాబాగారు ఆ పెట్టెలో నాకు ఏడు బొమ్మలు చూపించారు. (1) చాక్పిసుల గుట్ట (2) తెల్ల కాగితాలు (3) కాకర కాయల గుట్ట (4) బిస్కెట్లు (5) కొబ్బరికాయలు (6) జున్నుపాలు (7) బియ్యము.


మెలకువ వచ్చి ఈ మహనీయులు స్వయంగా వచ్చి నాకెందుకీ ఏడు విషయాలు చూపారా అని యోచించాను. ఈ ఏడు విషయాలు. నేను చేసే తప్పులని తెలిసింది. నేను స్కూలు హెడ్మాష్టారును. (1) స్కూలు లోని చాక్ పీసులు తెచ్చి మందిరంలో నోటిస్ బోర్డు వాసేందుకు, ముగ్గులు వేసేందుకు ఇస్తుంటాను (2) స్కూలులోని తెల్లకాగితాలను నా ఇంటి అవసరాలకు వాడుతుంటాను (3) నేను హెడ్మాష్టరు నన్న అభిమానంతో ఎవరో వాళ్ళింట్లో కాచిన కాకరకాయలు ఇస్తే తీసుకున్నాను. అలాగే (4), (5), (6) బిస్కెట్లు, కొబ్బరికాయలు, జున్నుపాలు తీసుకున్నాను. (7) రేషన్ డీలరు బియ్యం తక్కువ ధరకిస్తే తీసుకున్నాను. *ఇవన్నీ చాలా స్వల్పమైనవే అయినా ఆ మహనీయుల దృష్టిలో పెద్ద తప్పులేనని ఆనాటినుండి పూర్తిగా మానేశాను.*


ఇంతలో సత్సంగం నుండి కొందరు ప్రశ్నిస్తున్నారు. వారి జీవిత విధానంలో ఇన్ని తప్పులున్నా సద్గురు కృప ఎందుకు కలుగుతుంది? అని. దాని సమాధానంగా - *వారు చేసే నిష్కామకర్మే కారణము - కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, ధార్మిక విషయాలకు ఉదారంగా ఖర్చుపెట్టడం లాంటి పనుల వల్ల పుణ్యం జమ అయి సద్గురుకృప పొందగల్గుచున్నారు,* అని చెప్పారు. తప్పులు అని నాకు తెలియని విషయాలు కూడా తెల్పి నా ప్రవర్తన సరిచేసిన ఆ సద్గురుమూర్తుల రుణం ఎలా తీర్చాలో తెలియదు. ఇదే విధంగా నన్ను అన్ని వేళలా కాపాడమని ప్రార్ధిస్తున్నాను.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

2)🙏ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాధాయ నమః"

    శ్రీ సాయి లీలామృతం,శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, నిత్య పారాయణ గ్రంథం.రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజ్

   '14 వ అధ్యాయం రెండో భాగం.'

       ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు "ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్లు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతనిని విడిపించాను". మరొకప్పు డాయనిలా అన్నారు. "సోదరులు ఇద్దరం ఒక మార్గాన పోతున్నాం. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. అయిదారుగురు వచ్చి 'నీ సోదరుడేడి' అన్నారు  జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక, వారి సున్నా వినకుండా, నా సోదరుని కోసం వెళ్లి  జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయరాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతక పోయింది .ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శరీరం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను" జ్ఞానం కావలసినవారు ముందుకు పోతారుగాని, ముందుకు పోవాలి! అని ఆరాటపడేవారు సిద్దుల కోసం ప్రాకలాడే వారని అర్థం అలాంటి సాధకులు ఎందరో సిద్దులని క్రూర మృగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించిన అసాధకుల వినలేదు!. ఇది పాలమార్థికమైన కథ.

      జన్మంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి,తప్పులు చేసి, తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. "నా తండ్రికి ధనపు రాసులు ఉండేవి. నేను వాటిలో ఒకదానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను  కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవరూపం పొందాను" అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరిసంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరల జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపురాశి మీద కూర్చోవడం అంటే అప్పుడు ధన వ్యామోహము, గర్వాల వలన సాటి వారికి ఎంతో హానికరంగా, పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మ లెత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనత లను పాముల్లాగా చిత్రించేదిoదుకే అయినా చివరకు తన తప్పు గ్రహించి, ధనాన్ని త్యాజించారు: అంటే సిరిసంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. "ఇటువంటి కథలు ఎన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు".

     సాయి భక్తులకు గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు  తమను బాబా జన్మజన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులు అవుతారు కదా! శ్రీమతి ప్రధానకు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా "ఆమె బాబుకు తల్లి" అనసాగారు ఈ 'బాబు' హరి వినాయక సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా సుప్రదర్శనమిచ్చి పిలవడం వలన అతడిల్లు విడిచి, కాలినడకన శిరిడీ చేరి, బాబాను దర్శించాడు తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతనిపై అధికారి లిమయే సాఠే కు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే, సాఠే, ఖేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా "ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి"అని అన్నారు. అప్పటినుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారుగాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్ని అతనికి పెట్టేవారు. 1910 సంవత్సరంలో ఒకసారి ఆయన "బాబు విషయంలో జాగ్రత్త తీసుకో!" అని కేల్కర్ను హెచ్చరించారు. అతనికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు ఖేల్కర్ తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా? అన్నారు బాబా. కొద్ది రోజుల్లో బాబు షిరిడీ లోనే తన 22వ ఏటా చనిపోయాడు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలచుకుంటుండేవారు.

        పై కథలో బాబా చెప్పిన 'బాబే' ఖేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరల జన్మించాడు. నాలుగు మాసాల ఆ బిడ్డని ఎత్తుకొని సాయి ఎంతో ప్రేమగా "బాబు! ఎక్కడికి వెళ్లావు? నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా" అన్నారు. ఆయన చూస్తూనే ఆ బిడ్డ కిలకిలనవాడు.    

        మొదటిసారి షిరిడి దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి "వీడిని నాకు పరిచయం చేయడమా? 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు"! అన్నారు. అలాగే తమకు రఘువీరా పురం దరేతో ఏడు శతాబ్దాల నుండి సంబంధమున్నదని చెప్పి 'నేనితనిని ఎప్పుడు మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరం ఉన్నా సరే ఇతడు లేకుండా నేనొక్క వెతకైన తినను" అన్నారు. బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా?

     14వ అధ్యాయం రెండో భాగం సంపూర్ణం.

         శుభం భవతు

             🙏🙏🙏

దేవుడు చెప్పిన దొకటి

 🙏 *శుభోదయం* 🙏

*దేవుడు చెప్పిన దొకటి - మనము చేస్తున్నది మరొకటి...*


 *"నాయనా! అడిగితే ఇస్తాను, వెతికితే చిక్కు తాను, నా తలుపు తడితే, నేను తలుపు తెరుస్తాను..."* 

*అని భగవంతుడు మానవునికి మూడు వాగ్దానాలు చేశాడు...*


*ఈనాటి మానవుడు అడుగుతున్నాడు, కాని ఎవరిని అడుగుతున్నాడు? భగవంతుడిని కాదు, ప్రకృతిని అడుగుతున్నాడు...*

*అందుచేతనే భగవంతుడు ఇవ్వటం లేదు, ఆ మంచి చెడ్డ ఫలితాలను ప్రకృతే ఇస్తోంది...*

 

*ఈనాటి మానవుడు వెతుకుతున్నాడు, కానీ దేనిని వెతుకుతున్నాడు?...*

*భగవంతుడిని కాదు భోగ భాగ్యాలను వెతుకు తున్నాడు,కాబట్టి భోగభాగ్యాలనే అందుకుంటాడు,* *అందువల్లసుఖశాంతులు కోల్పోతున్నాడు...* 


*ఇంక మోక్ష ద్వారాలను తట్టడం లేదు, అందువల్ల నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి, మోక్ష ద్వారాలు మూసుకుంటున్నాయి...*


*అందుకే మానవుడు భగవంతున్ని అడగాలి, భగవంతుని వెతకాలి, మోక్ష ద్వారాలు తట్టాలి, ( మోహాన్ని నశింపజేయాలి)*

 

*కర్తవ్యాన్ని మానవుడు నిర్వర్తించడం లేదు... అందువల్ల, బలహీనత వల్ల దైవానికి దూరమౌతున్నాడు...*


*దైవానికి దూరంగా ఉండటం అంటే, Living in death" లాంటిది... అంటే జీవితాన్ని బ్రతకడం...*


*దైవానికి దగ్గరగా ఉండటం అంటే జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం...*

 

🙏🙏💐💐🙏🙏

మాఘ పురాణం -* *1 వ అధ్యాయము*

 తేదీ 22-01-2023 ఆదివారం నుండి 20-02-2023 సోమవారం వరకు మాఘ మాసం సందర్భంగా 

*మాఘ పురాణం* రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేయడానికి వీలుగా ఒకరోజు ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది... తప్పకుండా పారాయణం చేస్తారని కోరుకుంటూ....


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


*మాఘ పురాణం -*

*1 వ అధ్యాయము*

*22-01-2023 ఆదివారం*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


*మాఘమాస మహిమ*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||


ప్రపంచ దేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశం లో హిమాలయాది  పర్వతములు, గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకు రానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి..'స్వామీ ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ, సిద్ది ప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట.., ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాస మేర్పరచుకొన్నారు. 


వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూ వుండేవారు. అలాగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము నొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూత మహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూత మహర్షి ! మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్ట వశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూత మహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి.., పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి  వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. 


అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు.

అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు.


మహర్షులారా.! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది.. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువు కొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో.."విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ_మాస మహిమను వివరింప గోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు.. "కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది.. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమి ఉండును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘ_మాసము న ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగోట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘ_మాసం లో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో గాని, సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా.. , తెలిసి కాని , తెలియక కాని , బలవంతంగా కాని మాఘ_మాసము న ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియు పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని, విష్ణువు నర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘ_మాసము ను గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపము లెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మద గర్వముచే మాఘస్నానము మానిన అధముడు, నీచజన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మల నొందుదురు సుమా.., దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘ స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , #మాఘ_మాస ప్రాతఃకాలము యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని  భయముచే గాని, బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘ స్నానము చేయలేక పోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానము గాని చేసిన స్నానఫలము నొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యము కల్గును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము.. దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘ_మాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘ మాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్త వృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘ మాస స్నానము చేయువారిని నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరుపర్వతము ఉత్తమము. కావున మాఘ మాస స్నానము అంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సు నొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు..'మహారాజా ! పరమ పవిత్రమైన మాఘ మాసము న నీ సరస్సున స్నానము చేయకుండ పోవుచున్నావేమి. మాఘ మాసమున చేయు నదీస్నానము కాని , సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పుడని కోరగానతడు... రాజా.. నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము.. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.


దిలీప మహారాజు మాఘ మాస స్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కుల గురువైన వశిష్ట మహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘ మాస స్నాన మహిమను తెలుప గోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. 

మాఘ_మాసము చాలా విశిష్టత కలిగినది.  మాఘ మాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. #మాఘ_మాసమున ప్రాతఃకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలము లనిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ, పురాణ శ్రవణాదుల వలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘ మాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి.. అట్టి వారిలో భృగు మహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశము నందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము, మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి.. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై, మనోహరమై, విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులి మొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగా నున్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యము లన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా ! ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు., నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులి మొగము నాకు బాధాకరముగ నున్నది. దీనిని పోగొట్టుకొనుట యెట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుట లేదు. దయయుంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది.. వానికి సాయపడవలయు ననుకొన్నాడు. నాయనా.. పురాకృతకర్మము యెవనిని విడువదు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను #మాఘ_మాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికము చేసినచో వచ్చు ఫలితము.., #మాఘ_మాసము లో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, సెలయేరులో గాని యే స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును యే ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభము.. కావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘ స్నానమును,  యిష్టదేవతా పూజను అచట నున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘ స్నానమును, తీరమున యిష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞడై, మునికి భార్యతో బాటు నమస్కరించెను. అతని యాశీర్వాదము నొంది తన భార్యతో బాటు తన లోకమున కెగెను. 


దిలీప మహారాజా..! మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను...


*మాఘ పురాణం 1వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*🅰️🅿️SRINU*

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల

 

 భారతదేశంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు కారణంగా మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 బరువు మరియు కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి మీ స్వంత ఇంట్లో చాలా మంది వ్యక్తులు మీకు తెలిసి ఉండాలి.

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయమని అడుగుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో స్టెంట్ అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పించాడు.

 ఈ స్టెంట్ అమెరికాలో తయారు చేయబడింది మరియు దీని ఉత్పత్తి ధర కేవలం 3 డాలర్లు (రూ.150-180).

 ఈ స్టెంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3-5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతున్నారు.

 కొలెస్ట్రాల్, బిపి లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా అడ్డుపడటం (కొలెస్ట్రాల్ మరియు కొవ్వు) పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని తర్వాత రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెప్పారు.

 నీ లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం ఇందులోనే పోతుంది.

 ●●●●●●●●●●●●●●●●●●●●

                ఇప్పుడు చదవండి

        దాని ఆయుర్వేద చికిత్స

 ●●●●●●●●●●●●●●●●●●●●

 అల్లం రసం -

 ●●●●●●●●●●●●●●●●

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●●●●●

 వెల్లుల్లి రసం

 ●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే అల్లిసిన్ మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్‌ ఓపెన్ అవుతుంది.

 ●●●●●●●●●●●●●●●●●●●●

 నిమ్మరసం

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 ●●●●●●●●●●●●●●●●●●●●

 ఆపిల్ సైడర్ వెనిగర్

 ●●●●●●●●●●●●●●●●●●●●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాలను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి మరియు అలసటను తొలగిస్తాయి.

 ●●●●●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు

        ఇలా ఉపయోగించండి

 ●●●●●●●●●●●●●●●●●●●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి;

 ●●●●●●●●●●●●●●●●●●●●

 నలుగురినీ కలపండి మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరుస్తుంది;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి

 ●●●●●●●●●●●●●●●●●●●●

 ఈ ఔషధం యొక్క 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్‌లు పోతాయి.

 ●●●●●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము నయం చేసుకునేలా ఈ సందేశాన్ని వీలైనంత వరకు వ్యాప్తి చేయవలసిందిగా నేను మీ అందరినీ ముకుళిత హస్తాలతో అభ్యర్థిస్తున్నాను; ధన్యవాదాలు!

 ●●●●●●●●●●●●●●●●●●●●

 సాయంత్రం గురించి ఆలోచించండి

 రాత్రి 7:25 అయ్యింది మరియు మీరు కూడా ఇంటికి ఒంటరిగా వెళ్తున్నారు.

 అటువంటి పరిస్థితిలో, అకస్మాత్తుగా మీ ఛాతీలో పదునైన నొప్పి ఉంది, ఇది మీ చేతుల గుండా వెళుతుంది.

 దవడలకు చేరుతుంది.

 మీరు సమీప ఆసుపత్రి నుండి మీ ఇంటికి 5 మైళ్ల దూరంలో ఉన్నారు మరియు దురదృష్టవశాత్తు మీరు అక్కడికి చేరుకోగలరో లేదో మీకు తెలియదు.

 మీరు CPRలో శిక్షణ పొందారు కానీ అక్కడ కూడా దానిని మీపై ఎలా ఉపయోగించాలో మీకు బోధించబడలేదు.

 ●●●●●●●●●●●●●●●●●●●●

      గుండెపోటును ఎలా నివారించాలి

             కోసం ఈ పరిష్కారాలు

              ●●●●●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 అది సంభవిస్తుంది. వారు మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది మరియు కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గుతాడు మరియు తనను తాను సాధారణంగా ఉంచుకోవచ్చు. ఒక నిట్టూర్పు

 ప్రతి దగ్గుకు ముందు తీసుకోవాలి

 మరియు దగ్గు చాలా బలంగా ఉంది

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చింది.

 సహాయం వచ్చే వరకు

 రెండు సెకన్ల పాటు ప్రక్రియ పునరావృతం

 తద్వారా బీట్ సాధారణంగా ఉంటుంది

 మనం చేద్దాం .

 ఊపిరితిత్తులలో బిగ్గరగా శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

 మరియు బిగ్గరగా దగ్గుకు కారణం

 దాని నుండి గుండె కుంచించుకుపోతుంది

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●●●●●

 

    ప్రాణాలను కాపాడటానికి

 ఒక స్నేహితుడు నాకు పంపాడు. 

ఇప్పుడు మీ వంతు

ప్రజా ప్రయోజనం కోసం ఫార్వర్డ్ చేయండి.