4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

గృహవైద్య రహస్యాలు -

 గృహవైద్య రహస్యాలు  - 


    ప్రియమితృలకు నమస్కారం , 


      ఇంటిలో మరియు ఇంటి చుట్టుపక్కల్లో ఉండే కొన్ని పదార్థాలు మరియు కొన్ని మూలికలతో అద్భుతంగా ఆరోగ్యసమస్యలని పరిష్కరించవచ్చు. వీటిగురించి ప్రతిఒక్కరు తెలుసుకొనవలెను అను సదుద్దేశంతో చాలా కష్టపడి అనేక గ్రంథాలు తిరగవేసి మరియు కొన్ని నేను ప్రయోగించిన మూలికల యొక్క సమాచారాన్ని మీకు వివరిస్తున్నాను. 


         ఈ పోస్టులో వివరించిన మూలికల సమాచారాన్ని జాగ్రత్తపరుచుకొని ఉంచుకోగలరు.


 * పిడకల బూడిద  - 


     చేతులు గాని , కాళ్లు గాని వాచినచో ఆ వాపు పైన పిడకల బూడిద మర్దన చేసినచో వాపులు తగ్గిపోవును . ఆవుపిడకల బూడిద చాలా శ్రేష్టం .


 * కట్టెలు కాల్చిన బొగ్గు  - 


     ప్రతినిత్యము బొగ్గు చూర్ణముతో పళ్లు తోముకొనుచుండిన యెడల పళ్లనొప్పులు , చిగుళ్ల వాపులు , చీముకారుట , దంతములు కదులుట మొదలైన దంతవ్యాధులు హరించి పళ్లు తెల్లగా ప్రకాశించును.


 * నిప్పు  - 


     వాతము వలన గాని , శ్లేష్మము వలన గాని తల లేక కడుపు మొదలయిన అవయవములు యందు నొప్పి వచ్చిన యెడల ఔషధ ప్రయోగముల కంటే ముందు నిప్పుసెగ చూపించి కాచినయెడల నొప్పులు వెంటనే శాంతించును.


 * ఇసుక - 


     శరీరములో యే భాగం అయినా వాచిన గాని , నొప్పిగా గాని ఉన్న యెడల ఇసుకని వేయించి గుడ్డలో మూటకట్టి ఆ ఇసుక మూటతో కాపడం పెట్టిన యెడల నొప్పులు వెంటనే శాంతించును. 


 * రాళ్లు  -


     కొత్తగా లేచిన సెగ గడ్డలు అణుగుట కొరకు రాళ్ళని వెచ్చచేసి కాపడం పెట్టవలెను . 


 * కాలిన పొగాకు మసి - 


     చుట్ట కాల్చిన తరువాత మిగిలిన మసితో ప్రతినిత్యం పళ్లు తోముకున్నచున్న యెడల దంతములు నందు క్రిములు హరించి పళ్లు ముత్యముల వలే తెల్లగా ప్రకాశించుచుండును . 


 * మన్ను - 


      తల, చేతులు కడుపు మంటలకు , గోరుచుట్టులకు నీటిలో నుంచి తీసిన ఒండ్రుమట్టి పట్టించిన యెడల మంటలు వెంటనే తగ్గిపోవును . 


 * వండుకొనే పొయ్యిలోని మట్టి - 


      కలరా మొదలయిన విషవ్యాదులు వలన శరీరం అతిగా చెమట బట్టి వళ్ళు చల్లబడుతున్న సమయంలో వండుకునే పొయ్యిలోని మట్టి తీసుకొచ్చి శరీరం పైన మర్దించవలెను . మరియు అదే మట్టిని రెండు చిటికెలు తీసుకుని నీటిలో కలిపి త్రాగించవలెను . 


 * ఆవుపేడ  - 


     నాటు ఆవుపేడ తాజాది తీసుకుని ఒక గుడ్డలో వేసి పిండి ఆ రసముని కండ్లలో వేయుచుండిన పదిరోజుల్లో రెజీకటి మానును 


 *  గోమూత్రము  - 


      నాటు ఆవు యొక్క గోమూత్రము ఉబ్బు వ్యాధి గలవారికి ప్రతినిత్యం 15ml త్రాగించుచూ అదే గోమూత్రంతో శరీరం మర్దన చేయుచుండవలెను . ఈ విధంగా 40 దినములు చేయుచున్నచో శరీరం ఆరోగ్యవంతంగా ఉండును. 


 * పాతపత్తి  - 


     నోటి నుంచి ఎక్కువుగా శ్లేష్మం పడుచూ రొమ్ము నొప్పిగా ఉన్నయెడల పాతదూది వెచ్చచేసి రొమ్ముపైన కట్టిన యెడల రొమ్ము నొప్పి కఫ వ్యాధి తగ్గిపోవును . 


 * గుర్రపు లద్దె  - 


     గుర్రపు లద్దె ఎండించి చూర్ణం కావించి ఆ చూర్ణంని ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీ యొక్క యోనికి ధూపంవేసిన యెడల వెంటనే సుఖంగా ప్రసవించును. 


 * తలవెంట్రుకలు - 


     తలవెంట్రుకలను కాల్చి భస్మం చేసి పన్నీరులో కలిపి ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీకి తలపైన మర్దన చేసిన యెడల ఆ స్త్రీ సుఖముగా ప్రసవించును. ఇంటి యందు ఉన్న ఎలుక కన్నముల యందు తలవెంట్రుకలు ను ఉంచిన ఆ కన్నముల గుండా ఇంట్లోకి పాములు రావు . 


 * నల్ల సిరా - 


      నిప్పుల వలన కాలిన స్థలము పైన నల్ల సిరా రాసినచో బొబ్బలు ఎక్కకుండా మంటలు తగ్గిపోవును . 


 *  ఇనుపముక్క  - 


     ఏ ఉపాయం చేత కూడా అతిదాహం అనగా విపరీతంగా నీరు తాగటం తగ్గనప్పుడు ఎర్రగా కాల్చిన ఇనుపముక్కని మంచినీటిలో మంచి ఆ నీటిని వడకట్టి త్రాగించిన యెడల బాధలేకుండా పండ్లు తొందరగా వచ్చును. 


 * రాగి - 


     సన్నటి రాగికడ్డిని కంటెము వలే చేసి చిన్నపిల్లల మెడలో వేసిన యెడల బాధ లేకుండా పండ్లు తొందరంగా వచ్చును.


 * గవ్వలు - 


    గవ్వలను బాగా కాల్చి నూరి వస్త్రగాలితం చేసి ఆ మెత్తటి చూర్ణంని చీము కారుచున్న చెవిలో కొంచం కొంచం రోజుకి నాలుగైదుసార్లు వేయుచుండిన యెడల మూడురోజుల్లో చీముకారుట తగ్గును .


  * ఆముదం - 


     చంటిపిల్లలకు విరేచనం కాక కడుపులో నొప్పి కలిగిన యెడల కడుపు పైన ఆముదం రాసి కాపడం పెట్టిన యెడల వెంటనే బాధ తగ్గి విరేచనం అగును.


        శిరస్సు పైన ఆముదం ని మర్దన చేసుకొన్న యెడల రెండుమూడు వారములలో రేచీకటి వ్యాధి తగ్గును. 


 * తాటాకు విసినికర్ర - 


      నీళ్లు చల్లిన విసినకర్ర తో విసిరిన యెడల మూర్చ వచ్చినవారు త్వరగా లేచి కూర్చుండెదరు . వడదెబ్బ తగిలినవారికి , వేసవితాపం భరించలేనివారికి , నీళ్లు చల్లిన తాటాకు విసినకర్రతో విసురుచుండిన యెడల సుఖకరంగా ఉండును.


 * దర్భలు - 


      దర్భలని నీళ్లతో నూరి వడకట్టి రసమును త్రాగించుచున్న యెడల వాంతులు తగ్గిపోవును .


 * బంగారము -


      నీళ్లతో నిండిన ఒక మట్టికుండ యందు ఏదైనా ఒక బంగారు వస్తువు వేసి రెండు గంటలు నిలువ యుంచి ఆ ఉదకము చేత స్నానము చేయుచున్న యెడల పిల్లలకు మరియు పెద్దలకు వచ్చు ఎండు జబ్బు అనగా బక్కగా అవుతూ కండరాలు క్షీణించే వ్యాధి నివారణ అగును. అదేవిధంగా ఆ నీటిని ప్రతిరోజు కొంచంకొంచం తాగుచుండవలెను.


 * గంగసింధురం -


       గాయములపైన  గంగసింధూరం అద్దిన యెడల రక్తము కారుట మాని గాయములు తొందరగా మానును .


 * మంచి గంధం - 


       సానపైన అరగదీసి మంచిగంధం శిరస్సు పైన పట్టువేసిన యెడల వేడివలన వచ్చు తలనొప్పి వెంటనే తగ్గిపోవును . 


 * దేవదారు చెక్క - 


       15 గ్రాముల దేవదారు చెక్క చూర్ణమును అర్ధసేరు నీళ్లలో వేసి కాచి అర్ధపావు మిగులునట్టు దించి చల్లారిన తరువాత అందు ఒక తులము తేనే కలిపి త్రాగుచుండిన స్త్రీల కుసుమ వ్యాదులు , శుక్లనష్టం , సూతికా జ్వరం హరించును .


 * తేనెమైనం  - 


      50 గ్రాముల తేనెమైనం కరిగించి అందు జేబురుమాలు తడిపి ఉంచవలెను అవసరం అయినపుడు ఆ రుమాలును కొంచం వెచ్చచేసి వాచిన అండకోశములు పైన వేసి కట్టిన బాధ తగ్గును. ఇట్లు కొన్ని దినములు కట్టుచున్న యెడల వరిబీజం నిర్మూలన అగును.


 * తులసి  - 


       జలుబు చేసిన వారికి రోజుకి ముప్పయి నుంచి నలభై తులసి దళములను తినిపించుచున్న యెడల మూడు రోజుల్లో పడిసం తగ్గును. జ్వరం రానియ్యదు. ఏడు మిరియపు గింజలను ,ఏడు తులసి దళములను కలిపి నమిలి మింగుచున్న యెడల మలేరియా జ్వరము మూడు రోజుల్లో తగ్గును.


       కృష్ణ తులసి లేక నల్లతులసి చెట్టు యెక్క వేరు ముక్కను తాంబూలము నందు ఉంచి భక్షించిన యెడల సంభోగం నందు ఆనందం కలుగును.


      తులసిచెట్టు యొక్క వేరు అరగదీసి ఆ గంధం తేలు కరిచినచోట అంటించిన యెడల విషము దిగిపోవును .


 * రుద్రాక్ష  - 


   రుద్రాక్షని పాలతో సాన పైన అరగదీసి గంధముని అరగదీసి ఆ గంధముని గర్భిణి స్త్రీ చేత తాగించు చున్న యెడల గర్భస్రావం జరగకుండా కాపాడును. 


* కుంకుడుపప్పు -


    కుంకుడుగింజలోని పప్పును నీళ్లతో నూరి త్రాగించున్న యెడల నీళ్ల విరేచనములు , కలరా విరేచనములు తగ్గును. తమలపాకులో కుంకుడుపప్పు పెట్టి మూడుపూటలా తినిపించిన సర్ఫవిషం హరించును .


 * సున్నము -


     సున్నపు తేట నీరుని 5ml నుంచి 10ml వరకు మోతాదు చొప్పున చిన్నపిల్లలకు ఇచ్చుచుండిన యెడల ఆకుపచ్చరంగు విరేచనాలు , కడుపులో బల్లలు హరించును 


       5 లీటర్ల నీటి యందు ఒక పావు కిలో సున్నముని కలపవలెను రాతి సున్నము మాత్రమే వాడవలెను. 5 గంటల తరువాత పైన తేరుకున్న నీరును, కిందకు దిగిన సున్నము ఏ మాత్రం రాకుండా వంచుకొని సీసాలో భద్రపరచుకొనవలెను. ఇదియే సున్నపు తేట తీయుక్రమము . 


 * కాచు -


   కాచు చిన్న ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మ్రింగుచుండిన యెడల మూడురోజుల్లో నోటిపూత తగ్గిపోవును . ప్రతిరోజు రెండున్నర గ్రాములు కాచు చూర్ణముని తినుచుండిన యెడల కొద్దిరోజుల్లొనే రక్తం శుద్ది అగును.


 * తమలపాకులు - 


    మానని మొండి వ్రణముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల త్వరగా పుళ్లు మానిపోవును. స్త్రీల స్థనముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల పాలు తగ్గిపోవును .


 * పోకచెక్కలు  - 


    పోకచెక్కలు కాల్చిన భస్మముని తామర పైన అంటించుచుండిన యెడల కొద్దిరోజుల్లో తామర వ్యాధి సమూలంగా పోవును .


 * తేనే  - 


     కాలినచోట తేనే రాసిన యెడల బొబ్బలు లేవకుండా బాధ తగ్గి త్వరగా మానును . కాలిన పుండు మానిన తరువాత మచ్చ గల ప్రదేశములో తేనెలో దూది వేసి తడిపి ఆ పత్తిని వేసి కట్టి దానిపైన మరలా దూది వేసి కట్టుచుండిన యెడల కొన్ని రోజుల్లోనే మచ్చపోయి శరీరం రంగులో కలిసిపోవును.


 *  నెయ్యి - 


      తెగుట వలన కాని , దెబ్బ వలన కాని వాతము వలన ఎదైనా అవయవం బలహీనం అయ్యి ఎండిపోవుచున్న యెడల నెయ్యితో ఆ అవయమును మర్దించుచున్న యెడల ఆ అవయవం బాగుపడును .


    40 గ్రాముల ఆవునెయ్యి లో 30 మిరియపు గింజల చూర్ణముని వేసుకొని కలిపి తినుచుండిన యెడల మెదడు కు బలం కలిగి కండ్లు యెక్క దృష్టి ఎక్కువ అగును.


 గమనిక  -


     నాటు ఆవు యెక్క స్వచ్ఛమైన నెయ్యి వాడినప్పుడు మాత్రమే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి.


 * వెన్న  - 


     ప్రతిరోజు ఉదయన్నే ముఖం కడుగుకున్న వెంటనే 40 గ్రాముల వెన్నని తినుచుండిన యెడల తలతిప్పుట , మలబద్దకం , గొంతు ఎండిపోవుట, ముక్కు వెంట రక్తం పడుట , మెదడు యెక్క బలహీనత పోవును . శిరస్సుకు కూడా కొంచం వెన్నని మర్దన చేయవలెను .


 * ఆవుపాలు  -


     ఆవుపాలని రాత్రిపూట ముఖమునకు మర్దన చేసుకొనుచూ ఉండిన యెడల ముఖం కాంతివంతముగా ప్రకాశించును. ప్రతిరోజు రాత్రి నిద్ర పొయే ముందు అరకప్పు ఆవుపాలు ని సేవించుచుండిన మంచి నిద్ర పట్టును . 


 *  ఆవుపెరుగు  - 


       ఆవుపెరుగు ని వంటికి మర్దించుకొని స్నానం చేయుచుండిన యెడల వళ్ళు దురదలు , చర్మం ఎండిపోవుట మొదలయిన చర్మ సమస్యలు హరించి చర్మం నిగనిగలాడును.


      ఆవుపెరుగు పైన ఉండు మీగడని గోరుచుట్టు పైన వేసి కట్టుకట్టుచుండిన యెడల బాధ తగ్గి గోరుచుట్టు పగిలి మానిపోవును . 


   చిన్నపిల్లలకు తిన్నది తిన్నట్టు విరేచనాలు అవుతున్న సమయంలో రోజుకి రెండుసార్లు మజ్జిగ తాగించుచుండిన యెడల జఠరకోశం బాగుపడి వ్యాధి తగ్గిపోవును .


    పెద్దవారికి నీళ్ల విరేచనములు అవుచుండిన యెడల మరియు కడుపునొప్పితో బాధపడుచున్న సమయంలో మజ్జిగలో సైన్ధవ లవణం కలిపి తాగించవలెను .


 * బెల్లం -


     అన్నం అతిగా తినుటవలన అయ్యే దాహంనకు బెల్లం పానకం చేసి ఇచ్చిన యెడల తగ్గిపోవును . ప్రసవించిన స్త్రీలకు మరియు ప్రసవించిన ఆవులకు బెల్లం ముక్కలు ప్రతిదినం పెట్టుట వలన తొందరగా శరీరపుష్టి చేకూరును.


 * నువ్వుల నూనె  - 


     అరికాళ్లకు , అరచేతులకు నువ్వులనూనె రాసుకొనుచుండిన యెడల కాళ్లు , చేతులు మంటలు తగ్గి నిద్రపట్టును. దంతధావనం అనంతరం నువ్వులనూనె ని పండ్లకు చిగుళ్లకు పట్టించుచుండిన యెడల పండ్ల నుంచి చీము కారుట , పండ్ల యందలి క్రిములు హరించి దంతములు గట్టిపడి అందముగా ఉండును.


 *  కొబ్బరినూనె  - 


      వళ్ళంతా విపరీతముగా దురదలు పెట్టుచున్న ప్రతినిత్యము కొబ్బరినూనెని ఒంటికి పట్టించుకొని స్నానం చేయుచున్న యెడల దురదలు తగ్గును. మరియు ఒళ్ళు మంటలు కూడా తగ్గును. 


 *  అన్నం -


      కళ్లు ఎర్రబడి , నొప్పిగా ఉన్నయెడల వేడిఅన్నము గుడ్డలో ఉంచి మూట కట్టి ఆ మూటతో పైన కాపడం పెట్టుచున్న యెడల మూడుపూటలలో తగ్గిపోవును . 


 *  బఠాణీలు - 


       బఠాణీలు పిండితో ముఖమునకు నలుగు పెట్టుకొనుచుండిన యెడల ముఖం మీద మంగు , శోభి మచ్చలు హరించిపోవును .


 *  నువ్వులు -


      నువ్వులను నీళ్లతో నూరి పుండ్లు పైన వేసి కట్టు కట్టుచుండిన యెడల పుండ్లు పరిశుభ్రపడి త్వరగా మానిపోవును .


 * శనగలు - 


     50 గ్రాముల శనగలు సాయంత్ర సమయంలో నీళ్లలో నానవేసి ఉదయం వడకట్టిన నీళ్లలో కొంచం పంచదార కలిపి పిచ్చి వ్యాధి గలవారి కి తాగించుచున్న యెడల 40 రోజుల్లో ఉన్మాద వ్యాధి హరించును . ఉన్మాదవ్యాధి అనగా పిచ్చి పట్టడం .


 *  ఉలవలు  - 


       ప్రసవానంతరం మైల రక్తం జారీ అగుటకు గర్భాశయం లోని పోటు తగ్గుటకు ఉలవలు కషాయం తాగించవలెను. 


      ప్రతినిత్యం ఉలవలు ఉడకబెట్టి ఆ నీరు తాగి గుగ్గిళ్ళు గా చేసుకుని తినుచుండిన శరీరంలో కొవ్వు కరుగును. 


 * జీలకర్ర  - 


      ఒక గుప్పెడు జీలకర్ర ని ప్రతినిత్యము నమిలి రసము మింగుచుండిన యెడల స్త్రీల యెక్క తెల్లబట్ట, ఎర్రబట్ట, బహిష్టు వ్యాదులు యోనిలో నొప్పి , యోనిలో దురద కొన్ని రోజుల్లొ హరించిపోవును . 


     జీలకర్ర ఒక స్పూన్ + వాము ఒక స్పూన్ కలిపి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుతూ చివరికి ఆ పిప్పిని మింగివేసి నీరు తాగవలెను . ఉదయం మరియు సాయంత్రం చేయవలెను . దీనివలన యోనిసమస్యలు తీరును . ఈ సిద్ద యోగాన్ని నేను చాలమంది పెషెంట్స్ కి చెప్పాను . చాలా తక్కువ సమయంలో అద్బుత ఫలితాలు వచ్చాయి. 


 * పసుపు - 


      రెండున్నర గ్రాముల పసుపును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు తేనెతో కలిపి తినుచుండిన యెడల కొన్ని రోజులలోనే మేహవ్యాథులు, రక్తదోషాలు నివారణ అగును. ఉప్పు ఎక్కువుగా తినటం వలన నోరు ఎండిపోయి అతిదాహాం వలన కలిగిన యెడల పసుపు కలిపిన నీళ్లను తాగించవలెను .


 * అల్లం  - 


      వాతవ్యాధుల వలన , మూర్చ వ్యాధుల వలన , సృహతప్పి పడిపోయి నోరు బిగదీసుకొని పోయిన యెడల 6 చుక్కలు అల్లం రసముని ముక్కు రంధ్రములలో వేసి తెలివి వచ్చి నోరు తెరుచుకొనును .అప్పుడు తులమున్నర గొరువెచ్చని అల్లపురసముని లొపలికి తాగించిన యెడల రోగి చక్కగా మాట్లాడును.


 * పెద్ద యాలక్కాయలు  - 


     రెండున్నర గ్రాములు యాలుక్కాయల గింజల చూర్ణమును వెన్నతో తినుచుండిన యెడల కడుపులో నొప్పి , మాటిమాటికి విరేచనం అగుట , జిగట విరేచనములు తగ్గిపోవును .


 * మెంతులు - 


      నిప్పు వలన కాలినచోట మెంతులు నూరి ముద్ద వలే చేసి ఆ ముద్దని కాలినచోట వేసి కట్టిన యెడల బాధ శాంతించి బొబ్బలెక్కకుండా మానిపోవును . 


 * ఆకుపత్రి ( బిర్యాని ఆకు ) - 


      ఆకుపత్రిని నీళ్లతో నూరి ఆ పేస్ట్ ని తలకి పట్టువేసిన అన్నిరకాల తలనొప్పులు హరించును . 


 * ధనియాలు -


      ధనియాల కషాయం ప్రతినిత్యం సేవించుచున్న ముక్కువెంట , నోటివెంట , మూత్రద్వారం నుంచి మరియు మలద్వారం నుంచి పడు రక్తం కట్టును . అతిగా దాహం అయ్యే వ్యాధి తగ్గును.


 *  ఇంగువ - 


      గోరువెచ్చని నీటితో బఠాణి గింజ అంత ఇంగువ మింగిన యెడల కడుపునొప్పి,నీళ్ళవిరేచనములు, ఎక్కిళ్లు , వాంతులు తగ్గిపోవును .


 * వాము  - 


     వాముని ఆవనూనెలో వేసి తైలమును తీసి శరీరముకి పట్టించి మర్దన చేసిన యెడల వళ్లునొప్పులు , దురదలు, వళ్ళు చల్లబడుట తగ్గి ఆరోగ్యముగా ఉండును.


 * సోంపు - 


     పది గ్రాములు పచ్చి సోంపు గింజలు , పది గ్రాములు వేయించిన సోంపు గింజలు ఈ రెండింటిని కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం మంచినీటితో కలిపి తాగవలెను. ఈ విధముగా సేవించుట వలన జిగట, రక్త విరేచనాలు కడుపుబ్బరం హరించిపోయి ఆరోగ్యముగా ఉండును. 


 * జాపత్రి  - 


     వేయించిన జాపత్రి చూర్ణము రెండున్నర గ్రాముల మోతాదుగా గొరువెచ్చటి నీటితో కలిపి గంటగంటకు లొపలికి ఇచ్చుచున్న కలరా వ్యాది హరించును .


 * లవంగములు  - 


     లవంగాల చూర్ణమును పిప్పిపన్ను పైన ఉంచిన యెడల పురుగులు పడిపోయి భాధ తగ్గును. నాలుగు లవంగాలు వేయించి మరియు నాలుగు పచ్చి లవంగాలు కలిపి నములుచూ రసం మింగుతున్న తీవ్రమైన దగ్గు , కంఠము నందు అడ్డుపడుచున్న శ్లేష్మము హరించిపోవును .


 * దాల్చిన చెక్క - 


     దాల్చిన చెక్క చూర్ణముని 5 గ్రాములు మంచినీటితొ కలుపుకుని తాగుచున్న యెడల జిగట విరేచనాలు , ప్రేగులయందలి క్రిములు , కడుపునొప్పులు హరించును . 


 గమనిక - 


    ఈ యోగాన్ని రాత్రిపూట మాత్రమే ఆచరించవలెను .


 * చింతకాయ  - 


     పండిన చింతకాయలు ను నీళ్లతో నూరి అందు పంచదార కలిపి త్రాగించుచున్న యెడల వడదెబ్బ తగిలిన వారి ప్రాణం నిలబడును. ఎండాకాలం చింతకాయ పానకం తాగుచున్న వారికి ఆరోగ్యం చెడకుండా ఉండును. 


 * బూడిద గుమ్మడి  - 


     బూడిద గుమ్మడికాయ రసము నందు పంచదార కలిపి తాగుచుండిన యెడల రక్తపైత్యము హరించును . బూడిద గుమ్మడికాయ గుజ్జుని తలకు పట్టించుచున్న శిరస్సులో వేడితగ్గి , ముక్కువెంట రక్తం పడుట తగ్గిపోవును .


 * కర్బూజ  - 


     కర్బూజ కాయ పై చెక్కులు ఎండబెట్టి కాల్చి ఆ భస్మముని పావు స్పూన్ తేనెతో కలిపి తినుచుండిన యెడల కడుపులో పెరిగే బల్ల ( spleen enlargement) వ్యాధులు ,నొప్పులు , కడుపునొప్పులు హరించిపోవును .


 * ముల్లంగి  - 


     ముల్లంగి దుంపల రసము నందు కొంచము ఉప్పు కలిపి తాగించుచుండిన  యెడల కడుపుబ్బరం, మూత్రబంధం అనగా మూత్రం బయటకి రాకుండా bladder ఉబ్బి నొప్పి రావటం తగ్గి తేపులు వచ్చును. 


         ముల్లంగి దుంపలను సన్నగా తరిగి ఎండించి కాల్చి ఆ భస్మమును పావుస్పూన్ ఒక చిన్న గ్లాసు నీటితో కలిపి తీసుకున్న బల్ల వ్యాదులు, కడుపునొప్పులు , కిడ్నీ లలో రాళ్లు హరించిపోవును . 


 * బెండచెట్టు - 


     పచ్ఛిబెండ కాయ తినుచుండిన గాని , బెండచెట్టు వేరు పైన బెరడుచూర్ణముని రెండున్నర గ్రాముల మోతాదుగా ప్రాతఃకాలం నందు మంచినీటి అనుపానంతో సేవించుచున్న యెడల స్త్రీలలో కలిగే ఎర్రబట్ట, తెల్లబట్ట వ్యాధులు హరించును . 


 * చిక్కుడు  - 


     చిక్కుడు తీగ, ఆకుల రసమును ముఖమునకు మర్దన చేయుచున్న యెడల ముఖం పైన ఉండు అన్నిరకాల మచ్చలు హరించిపోవును . 


       చిక్కుడు కూర తినుటవలన శరీరంలో జీవశక్తి అధికం అయ్యి ఒంటికి పుష్టి చేకూరును .


  * తెల్ల గలిజేరు  - 


     తెల్ల గలిజేరు కూరను వండుకుని తినుచుండిన యెడల ఉబ్బువ్యాధి తగ్గిపోవును . 


      ఈ గలిజేరు ఆకు గ్రామాల్లో పొలాల వెంట విపరీతంగా పెరుగును . గ్రామస్తులందరికి దీనిపైన అవగాహన ఉంటుంది. 


 * వేప  - 


      5 నుంచి 10 చుక్కల వరకు పరిశుద్ధమైన వేపనూనె ను తాంబూలంలో ఉంచి భక్షించుచున్న యెడల ఉబ్బసం మూడు వారాలలో హరించును .


 * రావిచెట్టు  - 


      రావిచెట్టు పైన బెరడు ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణం గాయాల పైన వేస్తూ ఉన్నచో ఆ గాయాలు మానిపోవును .


 * మర్రిచెట్టు  - 


      మర్రి ఊడలతో ప్రతినిత్యం పండ్లు తోముకున్నచో బుద్ది వృద్ది చెందును. ఆయుర్దాయం ఎక్కువ అగును.


 * పనస - 


       పనస ఆకులను ముద్దగా నూరి సెగగడ్డల పై కట్టుచున్న యెడల త్వరగా పగిలి మానిపోవును . పనస చెట్టు వేరు తొక్క కషాయం కాచి ఆ కషాయం 5 నుంచి 6 చుక్కలు ముక్కు రంధ్రములలో వేయుచున్న యెడల భయంకరమైన తలపోటు తగ్గిపోవును .


 * ములగ - 


      ములగవేరు చెక్క రసమును నాలుగు నుంచి అయిదు చుక్కల రసం ముక్కులో వేయుచుండిన మూర్చవ్యాధి హరించును .


          ములగచెట్టు ఆకులు కూరగా వండుకుని తినుచుండిన యెడల అగ్నిమాంద్యం హరించి అధికంగా ఆకలి అగును.


 * మారేడు  - 


      ఏ ఔషదాలు ఉపయోగించినను పుండ్లు మానకుండా ఉన్న యెడల మారెడు ఆకు కషాయం నందు తేనె కలిపి ఇస్తూ పుండ్ల పైన లేత మారేడు ఆకులను నూరి ముద్ద కట్టుచుండవలెను.


 * దానిమ్మ  - 


        దానిమ్మ చెట్టు బెరడు చూర్ణమును గాని , దానిమ్మ కాయ పై పెచ్చుల చూర్ణం కాని తీసుకుని అందు రెండు తులముల సైన్ధవ లవణం చూర్ణం కలిపి పూటకు రెండున్నర తులముల చూర్ణమును గోరువెచ్చటి నీటి అనుపానముగా తీసుకొన్న యెడల అన్నిరకములు అయిన దగ్గులు , నీళ్ల విరేచనములు హరించును .


 * నిమ్మచెట్టు -


      నిమ్మచెట్టు బెరడు చూర్ణమును ఇంట్లో ధూపం వేసిన యెడల ఆ ఇంట్లో ఉన్నవారికి కలరా వ్యాధి సోకదు. 


 * పెద్ద ఉసిరికాయలు - 


      15 గ్రాముల ఉసిరికాయలు యొక్క రసం నందు కొంచం తేనె కలిపి ప్రతినిత్యం సేవించుచున్న యెడల వాతగుల్మములు,  నీరసం , అతిదాహం , ముక్కు నుంచి నోటినుంచి రక్తం పడుట తగ్గును .


 * అరటిచెట్టు  - 


       అరటిచెట్టు వ్రేళ్ళు కషాయము తాగుచుండిన యెడల ప్రేగుల్లో క్రిములు హరించును . అరటిచెట్టు రసమును తాగుచుండిన యెడల ఆగిపోయిన బహిష్టు మరలా వచ్చును.


 * సంపెంగ చెట్టు - 


     సంపెంగచెట్టు పై బెరడు కషాయమును 30ml చొప్పున తాగించుచున్న యెడల పిల్లలు పక్కలో మూత్రము పోవు వ్యాధి తగ్గును. 


         సంపెంగచెట్టు బెరడు, మిరియాలు కలిపినూరి శనగల వలే మాత్రలు చేసి పూటకొక మాత్ర చొప్పున ఇచ్చుచుండిన యెడల మలేరియా జ్వరం మూడుపూటల్లో హరించును .


 * అవిసె చెట్టు -

 

     అవిశె పువ్వుల కూర కాని , అవిశె కాయల కూర కాని తినుచుండిన యెడల రేజీకటివ్యాధి మూడువారాలలో కుదురును.


 * బంతిచెట్టు  - 


     బంతి ఆకులను రసము పిండి కొంచం వెచ్చచేసి చెవులలో పోయుచున్న యెడల చెవిపోటు , చెవిలొ నుంచి చీము కారుట , చెవిలోని కురుపులు హరించిపోవును . 


        శరీరం తెగి రక్తము కారుచున్న యెడల గాయము పైన బంతిచెట్టు ఆకు రసమును పూసిన యెడల రక్తము కారుట వెంటనే నిలిచిపోవును. 


 * సన్నజాజి  - 


     సన్నజాజి ఆకులు ని నూరి ముద్ద చేసి తేనె కలిపి నాలుకకు పట్టించుచున్న యెడల నోటిపూత మూడురోజుల్లొ పోవును .


 * గులాబి - 


      గులాబి పువ్వుల కషాయంలో తేనె కలిపి తాగుచున్న మలబద్దకం హరించును . 


         ఈ కషాయాన్ని సేవించుట వలన కండ్లమంటలు , గొంతు , ముక్కు ఎండిపొవుట తగ్గును.


 * గానుగ చెట్టు  - 


      గానుగ గింజలలో పప్పు, మిరియాలు సమభాగాలుగా కలిపి నూరి మాత్రలుగా చేసి పూటకు ఒక మాత్ర చొప్పున ఇచ్చుచున్న యెడల మలేరియా జ్వరం హరించును . 


        గానుగ గింజల పప్పు నీళ్లతో నూరి తలకు రుద్దుకొనిన యెడల తలయందలి మురికి , తలలో పేలు , కురుపులు పోవును .


 * ఖర్జురము - 


      ఖర్జురపు గింజను పోకచెక్క మాదిరి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుచున్న కడుపు ఉబ్బరం , కడుపులో బంధించిన వాయువు హరించును .


 * మేడిచెట్టు - 


     మేడిపాలు గాయము పైన నాలుగైదు చుక్కలు వేసిన యెడల గాయములు మానిపోవును . 


       మేడిపండ్లు ఎండబెట్టి చూర్ణము గావించి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు అరతులం చూర్ణం ను తిని అరకప్పు మంచినీరు తాగుచున్న యెడల స్తీలకు కలుగు తెల్లబట్ట వ్యాధి మరియు యోని దోషాలు నివారణ అగును.


 * మోదుగచెట్టు - 


      నీళ్ల విరేచనాలు , జ్వరముతో వచ్చిన విరేచనాలు కట్టుటకు మోదుగాకుల రసం 15ml తాగించుచున్న యెడల మూడు రోజుల్లో పైన చెప్పిన సమస్యలు నివారణ అగును. 


 * బూరుగచెట్టు  - 


       బూరుగు పువ్వుల రసం 40ml , ఆవుపాలు లేక మేకపాలు 40ml , పంచదార 20 గ్రాములు కలుపుకుని ప్రతినిత్యం తాగుచున్న స్త్రీలయొక్క తెల్లబట్ట , ఎర్రబట్ట వ్యాధులు హరించును .


 * తిప్పతీగ - 


       తిప్పతీగ రసము , నువ్వులనూనె సమాన బాగాలుగా తీసుకుని కాచి ఆ తైలమును వెంట్రుకలకు పట్టిస్తున్న యెడల తెల్లవెంట్రుకలు నల్లబడును. 


         శిరస్సుకి చలువచేయును .ఈ నూనెని వొళ్ళంతా మర్దించుకున్న యెడల వొంటి దురదలు తగ్గును. 


 * కుసుమచెట్టు - 


      కుసుమచెట్టు పువ్వులను చూర్ణం గావించి పూటకు రెండున్నర గ్రాముల చూర్ణము చొప్పున మంచినీటి అనుపానంతో ఇచ్చుచుండిన యెడల కామెర్ల వ్యాధి మూడువారాల్లో కుదురును .


                          సమాప్తం 


    మరోక అద్భుతమైన పోస్టుతో మళ్ళీ కలుస్తాను ..


    

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల  - 350 రూపాయలు .


      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384    పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు  కొరియర్ చార్జీలు కలుపుకొని 


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

 ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు  - 


 

 *  ఆయుర్వేద ప్రశస్తి .  - 1986 . 


 *  ఆంగ్ల - ఆంధ్ర వైద్య నిఘంటువు  -  1965 . 


 *  లివర్ మరియు స్ప్లీన్ వ్యాధులు  - 1941 . 

 

 *  అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రం .


 *  శల్యతంత్రము . 


 *  కౌమారభృత్య తంత్రము  - 1960 . 


 * చరక సంహిత  - ఇంద్రియ స్థానం  - 1930 . 


 * పరిశోధిత ఆయుర్వేద ఔషధ యోగావళి  . 


 * పులిప్పాణి వైద్య శాస్త్రం. 


 * త్రిదోష విఙ్ఞానం . 


 *  చికిత్సాసార తంత్రము . 


 *  గ్రామవైద్య పరీక్షా సంగ్రహం . 


 * సిద్ధమూలికా రహస్యం . 


 * సనారీ విశ్వేశ్వర సంవాదం . 


 *  రోగవిజ్ఞానం  - వికృతి విఙ్ఞానం . 


 *  వైద్యుడు లేనిచోట . 


 *  తంత్రకల్ప తరువు . 


 *  భారతీయ వైద్య విఙ్ఞానం . 


 * శార్గధర సంహిత . 


 *  అష్టాంగ సంగ్రహం. 


 *  ఇంగ్లిష్ - తెలుగు వైద్య నిఘంటువు . 


 *  హరమేఖలా . 


 *  అష్టాంగ సంగ్రహం -సూత్రస్థానం . 


 *  గిరిజన వైద్యమృతం . 


 *  పుష్పాయుర్వేదం . 


 *  అనుపాన పథ్య మంజరి . 


 *  ఆయుర్వేద ఇతిహాసము . 


 *  ఆంధ్ర భైష్యజ రత్నావళి. 


 *  వస్తుగుణ దీపము . 


 *  ఔషధ శబ్దములు .


 *  మాధవనిదానము . 


 * బసవరాజీయము .


 * శుశ్రుత సంహిత . 


 *  వైద్య చింతామణి  - 1 . 


 *  వైద్య చింతామణి  - 2 . 


 *  వస్తుగుణ దీపిక . 


 *  వస్తుగుణ ప్రకాశిక . 


 *  అష్టాంగ హృదయం - చికిత్స  - కల్ప స్థానాలు .


 *  యోగ రత్నాకరం  - 1 .


 *  యోగ రత్నాకరం  - 2 . 


 *   వైద్యయోగ రత్నావళి . 


 *  అష్టాంగ హృదయం - సూత్ర స్థానం . 


 *  చరకస్థాన షట్కమ్ . 


 *  చరక సంహిత . 


 *  ఆయుర్వేదాంగ  శరీర సంగ్రహము. 


 *  శరీర సంగ్రహము . 


 *  వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము . 


 *  రసరత్న సముచ్చయం . 


 *  వైద్య విఙ్ఞానం . 


 *  అష్టాంగ సంగ్రహం - సూత్ర స్థానం . 


 *  క్రిమిదోషాలు  - 1 . 

 

 *  క్రిమిదోషాలు  - 2 . 


 *  అగధ తంత్రము . 


 *  రస తంత్రము . 


 *  పశు విజ్ఞాన శాస్త్రం .


 *  రస ప్రయోగ రత్నాకరం. 


 *  వైదిక చికిత్స పద్దతి.

 

 *  ఔషధ కాండ - 1 . 


 *  ఔషధ కాండ  - 2 . 


 *  సిద్ధమూలికా చికిత్స రత్నాకరం . 


 *  తంత్రం - వైద్యం . 


 *  అనుభవ బాలవైద్య శిక్ష . 


 *  గోసాయి చిట్కాలు . 


 *  లోలంబ రాజీయం . 


 *  వైద్య రహస్య చింతామణి  - 1 . 


 *  వైద్య రహస్య చింతామణి  - 2 .


 *  సహదేవ పశువైద్య శాస్త్రం . 


 *  ధన్వంతరి వైద్య చికిత్స సారం . 


 *  వైద్యక శారీర శబ్దకోశం . 


 *  శుశ్రుత సంహిత  - చికిత్స స్థానం . 


 *  రోగ విఙ్ఞాన శాస్త్రం . 


 *  సతిపతి రహస్యములు . 


 *  వాత్సాయన కామసూత్రాలు . 


 *  వైద్యక ప్రయోగ విఙ్ఞానం . 


 *  ఆయుర్వేద శిక్ష . 


 *  ప్రకృతి చికిత్సర్ణవం . 


 *  ప్రకృతి చికిత్సాలయం . 


 *  ఎనిమా పద్దతి. 


 *  ఔషధ కాండ  - 3 . 


 *  ఆహార చికిత్స శాస్త్రం . 


 *  అశ్వక  వైద్య శాస్త్రం . 


 *  ఆయుర్వేద సింధు . 


 *  ఏకమూలికా ప్రయోగ రత్నావళి . 


 *  అర్కప్రకాశిక  . 


 *  నేత్ర సర్వస్వం . 


 *  ద్రవ్యగుణ మౌలిక సిద్ధాంతం . 


 *  త్రిధాతు సర్వస్వం . 


 *  ఆరోగ్య తత్వం . 


 *  ఆయుర్వేద ఔషధ రత్నాకరం . 


 *  సిద్ధ యోగ సంగ్రహం . 


 *  సిద్దనాగార్జున తంత్రం . 


 *  శతరోగ నివారిణి. 


 *  ప్రసూతి స్త్రీ విజ్ఞాన శాస్త్రం . 


 *  ఆయుర్వేద యోగ సింధు . 


 *  భిషక్సు థార్ణవం . 


 *  రస నిఘంటువు. 


 *  రసోపనిషత్తు. 


 *  దత్తాత్రేయ తంత్రం . 


 *  రస కౌముది. 


 *  రాజవల్లభ నిఘంటువు. 


 *  కాసీసం  - వైద్య యోగాలు . 


 *  నారీకేళ సంగ్రహం . 


 *  భల్లాతకామృతం . 


 *  రసహృదయ తంత్రం . 


 *  త్రిదోష విఙ్ఞాన శాస్త్రం . 


 *  రసవాద సర్వస్వము . 


 *  సిద్ధసార నిఘంటువు. 


 *  వైద్యమృతం అను కాలజ్ఞానం . 


 *  కరదీపిక . 


 *  రసౌషధ విఙ్ఞానం  - 1 , 2 , 3 , 4 భాగాలు . 


 *  రాజ మార్తాండం . 


 *  ఔషధ విఙ్ఞానం .  


 *  ఆరోగ్య విజ్ఞానం .  


 *  విష విజ్ఞానం . 


 *  రోగకాండ - దేహస్థితి . 


 *  ధన్వంతరి నిఘంటువు . 


 *  ఆయుర్వేద వైద్య చికిత్సలు . 


 *  పరీక్షా కాండ . 


 *  సర్వరోగ సూక్ష్మ వైద్యం . 


 *  4 రకాల వైద్య విధానాలు . 


 *  5 వైద్య విధానాలు . 


 *  దీర్ఘ జీవిత విజ్ఞానం . 


 *  ఆధునిక చికిత్స - 1 , 2 భాగాలు . 


 *  ధన్వంతరి . 


 *  వశిష్ఠప్రోక్త వైద్య శాస్త్రము . 


 *  ఖనిజ భస్మరాజము . 


 *  భస్మప్రదీపిక  - 1 , 2  భాగములు . 


 *  చికిత్సా రత్నము . 


 *  అనుభవ అగస్త్య వనమూలికా మర్మశాస్త్రము. 


 *  అనుభవ గృహవైద్య దీపిక . 


 *  బైరాగి చిట్కాలు . 


 *  అనుభవ చికిత్సా దర్పణం. 


 *  ధన్వంతరి  - 2 వ భాగం . 


 *  గోసాయి చిట్కాలు . 


 *  రస ప్రదీపిక . 


 *  అనుభవ వైద్య బాలశిక్ష . 


 *  శరభోజి వైద్య యోగాలు . 


 *  వైద్య వల్లభం . 


 *  గృహవైద్య చికిత్సా సారం  - 1 , 2  భాగాలు . 


 *  అష్టాంగ సంగ్రహ వాఖ్యానం . 


 *  త్రిదోష తత్వము. 


 *  నాడీవిజ్ఞాన సర్వస్వము . 


 *  గృహవైద్యం  - 1 , 2 , 3  భాగాలు . 


 *  ఆహారం - ఆరోగ్యం . 


 *  శరీరతత్వ విజ్ఞానం . 


 *  వైద్య కల్పతరువు. 


 *  వైద్య నిఘంటిక పద పారిజాతం . 


 *  ఆయుర్వేద చికిత్సా సారము . 


 *  రసరత్న సముచ్చయం . 


 *  ఆయుర్వేద శిక్ష - చికిత్సా పద్దతులు . 


 *  రసాయన వాజీకరణ తంత్రం . 


 *  స్త్రీజన కల్పవల్లి  - 1 , 2 భాగములు . 


 *  గద నిగ్రహం  . 


 *  దాంపత్య రహస్యాలు . 


 *  ఆయుర్వేద వైద్య చికిత్సలు . 


 *  గృహవైద్యం  - 4 భాగాలు , బాలరాజు మహర్షి . 


 *  వైద్య చింతామణి . 


 *  కాయచికిత్స  - జ్వరాది వ్యాధులు . 


 *  శాలాఖ్య తంత్రం  - 1 , 2 భాగములు . 


 *  ద్రవ్యగుణ ప్రయోగ విజ్ఞానం . 


 * బిడ్డల సంరక్షణ - వ్యాధులు  - చికిత్స . 


 *  వైద్య వసంతం . వస్తుగుణ మకరందం . 


 *  అశ్విక్ . 


 *  ధన్వంతరి వైద్య చికిత్సా సారము . 


 *  స్త్రీ బాల వైద్య సుధాబ్ధి. 


 *  అనుభవ గృహవైద్యము . 


 * శతాభస్మ యోగములు . 


 *  అష్టోత్తర శత లేహ్య పాకావళి . 


 *  రోగవిజ్ఞానం  - 1 , 2  భాగాలు . 


 *  అంటువ్యాధులు . 


 *  అనుభవ పశువైద్య చింతామణి. 


 *  పశుపోషణ . 


 *  పరిశోధిత ఆయుర్వేద యోగావళి . 


 *  ఆవులు - ఎడ్లు - సుళ్ళు . 


 *  మూలికా ప్రపంచం - తాంత్రిక క్రియలు . 


 *  లక్ష్మణ జల చికిత్స . 


 *  వైద్య చింతామణి  - 1 , 2 , 3 భాగములు . 


 *  వెంకటాద్రియం .


 *  సతీపతి కుతూహల రహస్యములు. 


 *  అభినవ చికిత్సా రత్నాకరం. 


 *  కలరా . 


 *  ప్రౌఢ ప్రభాకరము . 


 *  రోగమేల కలుగును. 


 *  నేత్రరోగ నిదానం . 


 *  లశున సర్వస్వము.


 *  రసయోగ రత్నాకరం. 


 *  మూలికా వైద్యము . 


 *  అనుభవ ఆయుర్వేద శాస్త్రం . 


 *  నపుంసక సంజీవనము . 


 *  వైద్యశిరోమణి . 


 *  రహస్య సిద్ధవైద్య సారము . 


 *  కొక్కోకము . 


 *  వైద్య విజ్ఞానం . 


 *  ఆహారవైద్యము . 


 *  ఇలాజుల్ గుర్భా - యునాని .


 *  తిబ్బే అక్బర్  - యునాని. 


 *  చక్రదత్త . 


 *  వైద్య యోగ రత్నావళి . 


 *  చరకసంహిత - చికిత్సా స్థానం . 


 *  దశభస్మ యోగాలు  . 


 *  చరక సంహిత  - సూత్రస్థానం . 


 *  మానవశరీర నిర్మాణ శాస్త్రం . 


 *  ఆరోగ్య భగవద్గీత. 


 *  వైద్యక పరిభాష. 


 *  వైద్య విద్యార్థి. 


 *  ఆయుర్వేదం - ఆధునిక శాస్త్ర వికాసం. 


 *  గిరిజన వైద్య సర్వస్వము . 


 *  రసేంద్ర మంగళం . 


 *  రసేంద్ర చింతామణి . 


 *  సకల వస్తుగుణ ప్రకాశిక . 


 *  వస్తుగుణ మహోదధి. 


 *  వస్తుగుణ చంద్రిక . 


 *  శుశ్రుత సంహిత  - నిదాన స్థానం . 


 *  శుశ్రుత సంహిత  - కల్ప స్థానం . 


 *  శుశ్రుత సంహిత  - శారీర స్థానం . 


 *  శుశృత సంహిత  - ఉత్తర స్థానం . 


 *  స్వర చింతామణి. 


 *  యాకృత్ప్లీహ తంత్రము . 


 *  రసాయన వాజీకరణ తంత్రములు . 


 *  వస్తుగుణ ప్రదర్శిని . 


 *  మన్కిమిన్కు . 


 *  ద్రవ్య విజ్ఞానము . 


 *  దివ్య మూలికా విజ్ఞాన దీపిక . 


 *  ఆయుర్విజ్ఞానం . 


 *  రావణ కుమార తంత్రము . 


 *  ధాతురత్నాకర శేషః . 


 *  రోగ నామావళి . 


 *  ఆయుర్వేద విజ్ఞానము . 


 *  విరేచనబద్ధములు . 


 *  ఆయుర్వేద చరిత్ర  - 1 , 2 భాగములు . 


 *  సర్వరోగ సులభ చికిత్సా గ్రంథము . 


 *  అన్నవిజ్ఞానము . 


 *  ఆయుర్వేద స్వస్థవృత్తము . 


 *  సరళ గృహవైద్యము . 


 *  గృహవైద్య ప్రకరణలు . 


 *  జంబీర చికిత్స . 


 *  శుష్క పశువైద్య తమో భాస్కరం . 


 *  కర్షక కామధేనువు. 


 *  ప్రసవ శాస్త్రము . 


 *  వ్రణ చికిత్స . 


 *  విషవైద్య చింతామణి. 


 *  బసవరాజీయము . 


 *  మూలికలు వాటి ప్రాధన్యత . 


 *  అనుపాన రత్నాకరం . 


 *  ఆరోగ్య మార్గ భోధిని. 


 *  దంతశోధిని . 


 *  గర్భిణి హితచర్య . 


 *  నాడి విజ్ఞానం . 


 *  సర్పవిషయ సంగ్రహం. 


 *  అష్టాంగ యోగ సారము . 


 *  ఆయుర్వేద వైద్య సారామృతం . 


 *  బృహత్ వైద్యం . 


 *  నాడి ప్రజననము . 


 *  ఋతు చక్రము . 


 *  ఉపవాస చికిత్స . 


 *  వైద్య నిఘంటువు . 


 *  అజీర్ణ మంజరి . 


 *  నాడి విజ్ఞానం . 


 *  పశు పరీక్ష . 


 *  సర్వ ఔషధ నిఘంటువు.


 *  బృహత్ వైద్య రత్నాకరం . 


 *  ఆరోగ్య దీపిక . 


 *  ఆరోగ్య కామేశ్వరి . 


 *  ప్రసూతి తంత్రము . 


 *  ప్రసూతి చికిత్సా తంత్రము . 


 *  పథ్యములు . 


 *  పథ్య - అపథ్యములు . 


 *  సంతాన దీపిక . 


 *  తులసి పూజా విధానం . 


 *  గృహవైద్య రహస్యాలు . 


 *  వస్తుగుణ రత్నము . 


                            సమాప్తం 


 

        పైన మీకు వివరించిన గ్రంథాలు అపూర్వమైనవి మరియు అమూల్యమైనవి. మీరు సేకరించాలి అనుకుంటే పాత ముద్రణలు మాత్రమే సేకరించగలరు. ఇవి సంపూర్ణంగా అర్థం చేసికొనిన చాలు . మీకు ఆయుర్వేదం మీద మంచి నైపుణ్యం వస్తుంది. అదే విధముగా కొంతమంది అనుభవ వైద్యులు తమ అనుభవాలని కూడ గ్రంథస్తం చేసి ఉన్నారు . వారి సలహాలు కూడా చాలా విలువైనవి. 


           సంపూర్ణమైన వివరణల కొరకు మరియు మరెన్నో అమూల్యమైన విషయాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

పాల ఉబ్బసం వ్యాధి

 పిల్లల పాల ఉబ్బసం వ్యాధి నివారణ కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం - 


    పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది . 


 

       సంపూర్ణమైన వివరణల కొరకు మరియు మరెన్నో అమూల్యమైన విషయాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

గురుపుత్రికా కథ

 _*మాఘమాసం*_

_*ఫిబ్రవరి 4వ తేది 2022*_


🌴🎋🌾🌹🌹🌾🎋🌴


_*🚩మాఘ పురాణం - 3 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*గురుపుత్రికాకథ*


☘☘☘☘☘☘☘☘


మంగళదాయినీ ! సర్వమంగళా ! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నొందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి ! మాఘస్నానమున పాపవిముక్తి నొందిన విధానమేమి ?  వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము , పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు , వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు , గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో , చక్కని ముఖంతో , చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.


ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు , ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది , పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద , అనేకవర్ణములలోనున్న కలువలు , జలసంచారము చేయు జలప్రాణుల విహారము , మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.


గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ ! మనుష్య సంచారము లేని , యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము , మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము , నా శరీరము దూదికంటే మెత్తగానున్నది , నీకు మరింత సుఖమిచ్చును , రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము , రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా ! నీవిట్లనకుము , నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము , నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము , గురువుగారు మనకై ఎదురు చూచు చుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు , దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.


గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ ! కన్యారత్నము , సువర్ణము. విద్యాదేవత , అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు , మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.


తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో ! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి ? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి *'జ్ఞానస్వరూపా ! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును , భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను , ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా !*


సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య , ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి *'తండ్రీ ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును ? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును ? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.'* అప్పుడా యోగి  *'ఓయీ విద్వాంసుడా ! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు , ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ  నీయమముచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర , రవికలగుడ్డ , ఫలపుష్పాదులు , పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు , మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుగ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును , గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను , భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని , సరస్సునగాని , కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు , సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనొంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

కొత్త అల్లుడు

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

 సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.* 

                 🌷🌷🌷

కొత్త అల్లుడు

                            *****                  


అల్లుడు తో ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్ చేశాకా ఒక్క క్షణం ఏమీ అర్థం కాక, నిశ్శబ్దంగా అక్కడున్న కుర్చీలో కూర్చుండి పోయారు ఆనందమూర్తి గారు నిశ్శబ్దంగా..


అంతలోకి అక్కడికే కూరలు, కత్తి పీట తెచ్చుకుని కింద కూర్చున్న  విశాలాక్షి గారు అడిగారు ఆయన్ని..

ఏమన్నాడoడీ అల్లుడు...ఎప్పుడు వస్తారట అని..


'రారట.మనల్ని రమ్మంటున్నాడు'  అల్లుడు..

అదేంటో..పెళ్లి అయ్యాకా వచ్చిన పెద్ద పండుగ ఈసంక్రాంతి..

మనింటికి వస్తే, ఉన్న ఊరు కాబట్టి   ఏదో తంటాలు పడి అన్ని ముచ్చటలు తీరుద్దాం అనుకున్నా..


ఇక్కడైతే  మన ఊరు, అందరూ తెలిసున్న వాళ్ళు..

మనకి అరువు దొరుకుతుంది అన్ని షాపుల్లో, బట్టలు కూడా వాళ్ళని తీసుకెళ్లి నచ్చినవి కొని పెట్టొచ్చు అనుకున్నా..


వాళ్ళ దగ్గరికి వెడితే అక్కడ ఆ సిటీ లో నేనెక్కడ కొనగలను..

పైగా పెద్ద అమ్మాయిని అల్లుడుని కూడా అక్కడికే రమ్మన్నాడట..

చాలా బతిమాలాను.. 

సంప్రదాయం బాబూ  పండక్కి మా ఇంటికి రావడం అని.  వినలేదు అతను..


పైగా పదకొండో తారీఖు కి మనిద్దరికీ రైలు టికెట్ లు కొన్నాడట..

బయలు దేరి వచ్చేయండి అంటాడు..

ఈ ప్రయాణ చార్జీలు అతనికి ఇవ్వాలి కదా..

ఏంటో ఎలాగో అని నిట్టూర్చారాయన..


ఆనందమూర్తి గారికి ఇద్దరు ఆడపిల్లలు..

పెద్దమ్మాయికి ఆయన సర్వీస్ లో ఉండగానే పెళ్లి చేశారు..

పెద్దమ్మాయి డిగ్రీ చదివించారు..

మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసేసారు..


రెండో అమ్మాయికి రిటైర్ అయ్యాకా వచ్చిన డబ్బుతో పెళ్లి చేశారు ..

రెండో అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది..

క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం కూడా వచ్చింది.

చేస్తూ ఉండగానే వాళ్ళ ఆఫీస్ లో పని చేసే అతనే

అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని 

ఇంటికొచ్చి ఆయన్నే పద్ధతిగా అడగడం తో

నచ్చి, ఉన్నంతలో బాగానే పెళ్లి చేశారు..


పెళ్లి అయ్యాకా ఈ సంక్రాంతి మొదటి పండగ..

పిలిస్తే, మీరే రండి మా ఇంటికి అని మొండికేసాడు కొత్త అల్లుడు..అదీ సమస్య..

ఆయనకొచ్చే పెన్షన్ వాళ్ళకి ఆధారం..ఇల్లు గడవాలి, వాళ్ళ మందుల ఖర్చు..పెళ్ళైన ఆడపిల్లలకి పెట్టుపోతలు అన్నీ అందులోనే..


అయ్యో, మరి ఏం చేద్దాం అంది ఆవిడ...

ఇంకోసారి చెప్పి చూస్తాను..కాదంటే వెళ్లడమే..

నా దగ్గర అయిదు వేలున్నాయి, ఇంకో ఐదో పదో అప్పు చేయాలి..అన్నారాయన...


ఆయన అనుకున్నట్టే వాళ్ళకి వెళ్ళక తప్పలేదు 

కూతురింటికి..


రైలు దిగగానే అల్లుడు స్టేషనికి  వచ్చి రిసీవ్ చేసుకున్నాడు..

అయ్యో..మీరెందుకొచ్చారండీ, మేమే వచ్చేవాళ్ళం కదా అన్నా, 

అల్లుడు  నవ్వుతూ ఆయన చేతిలో బాగ్ తీసుకుని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు..


ఇంటికెళ్లగానే కూతురు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్లింది...

కాఫీలు తాగాక, విశాలాక్షి గారు లేచి నేను స్నానం చేసి టిఫిన్ చేస్తాను అన్నారు...


వెంటనే అల్లుడు అన్నాడు..మీరు ఫ్రెష్ అవ్వండి అత్తయ్య గారూ కానీ  టిఫిన్ మీరు చేయక్కరలేదు ఇంకో పది నిమిషాల్లో వంట మనిషి వస్తుంది...

ఆవిడే అన్నీ చేస్తుంది...

మీరున్న నాలుగు రోజులూ మాట్లాడాను..

మీరు మీ కూతురితో కబుర్లు చెప్పండి చాలు అన్నాడు అల్లుడు..


వెంటనే ఆవిడ ఆశ్చర్యంగా కూతురి వైపు చూస్తే, కూతురు ఆనందంగా 'అవునంటూ' తలూపింది...


వెంటనే ఆనందమూర్తి గారన్నారు.."అదేంటి అల్లుడూ..మీ అత్తయ్య చేస్తుంది కదా.. ఎందుకు అనవసర  ఖర్చు అని'.

అత్తయ్యగారు చేయలేరు అని కాదు...

ఆవిడ వంట అద్భుతమనీ తెలుసు..

ఆవిడ అలా వంటింట్లో మగ్గిపోతూ మనందరికీ అన్నీ వండి వడ్డిస్తుంటే, మనం మాత్రం హాయిగా కూర్చుని తింటూ ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పండి..

మనం ఈ పండగకి అందరం కలిసి సరదాగా గడపాలని మా ఉద్దేశ్యం అంతే అన్నాడు..


ఈ లోపు వంటమనిషి వచ్జి పెసరపప్పు రుబ్బి పెసరట్లేసి, ఉప్మా తో అందరికీ వడ్డించింది...


భోజనాల టైం కి పెద్ద అల్లుడు కూతురు పిల్లలతో దిగారు...

ఇల్లంతా సందడి..సందడి...

ఈలోపు ఆనందమూర్తి గారు అల్లుళ్ళ చేతిలో చెరో ఐదువేలు పెట్టి, ఈరోజు వెళ్లి బట్టలు కొనుక్కోండి బాబూ అన్నారు..

వెంటనే, మీ దగ్గరుంచండి మామయ్యా..రేపు తీసుకుంటాం కదా అని వెనక్కి ఇచ్చేసారు ఇద్దరూ..


మర్నాడు భోగి..అంతా పొద్దున్నే లేచి స్నానాలు అవీ చేశాక, చిన్న అల్లుడు కూతురు అందరినీ కూర్చోపెట్టి అందరికీ బట్టలు పెట్టి కాళ్ళకి దణ్ణం పెట్టారు...

ఆనంద మూర్తి గారు విశాలాక్షి లబ లబ లాడారు... 

అయ్యో ఇదేంటి బాబూ, మొదటి పండుగ..మీ అందరికీ మేము బట్టలు పెట్టాలి..

మీకు డబ్బులిచ్చి మిమ్మల్ని అందరినీ కొనుక్కోమని మేము చెప్తే మీరు మాకు బట్టలు పెట్టడం  ఏంటి అని..


అత్తయ్య గారూ, మామయ్యగారూ...

ఈ సారి పద్ధతి మేము మారుద్దాం అనుకున్నాం..

మీకు బట్టలు పెట్టి మీ ఆశీర్వాదాలు తీసుకుందామని మా స్వార్ధం...

మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు నాకు తెలుసు మామయ్యా...

ఎందుకంటే నాకూ ఇద్దరు అక్కలు...

మా అమ్మా నాన్నగారూ వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఎన్ని అవస్థలు పడేవారో అన్ని విధాలా...


ఆడపిల్లల తల్లితండ్రుల బాధ్యత వాళ్ళకి పెళ్లిచేయడంతో తీరిపోదు..

వాళ్ళకి పురుళ్ళనీ పుణ్యాలనీ, బారసాలలనీ

పండగలనీ, పబ్బాలనీ...అన్నీ చేస్తూనే ఉండాలి..

వాటికి అంతముండదు..


ఎంతకాలం ఇలా అల్లుళ్ళకి అగ్గగ్గలాడుతూ, మర్యాదలు చేయడం...

ఎప్పటి ఆచారాలో అలా పాటిస్తూనే ఉండాలా..

అప్పులు చేసి, వడ్డీలు కట్టుకుంటూ..


మేమూ బాగానే  సంపాదించుకుంటున్నాం...

నేను అలా ఉండకూడదు అని, నేను మా అత్తామామలకి భారం కాకూడదు అని, నాకు పెళ్లికానప్పుడే నిర్ణయించుకున్నాను..

"జామాతా దశమగ్రహ"  అనే నానుడిని కనీసం నా విషయంలో  పూర్తిగా తుడిచేయాలి అనేదే నా ధ్యేయం...

ఇలా ఆచరణలో పెట్టాను అంతే..


పండగ అనేది నలుగురూ కలిసి సంతోషంగా జరుపుకోవాలి..అంతేగానీ మీ లాంటి తల్లిదండ్రులని శారీరకంగా, ఆర్ధికంగా కష్ట పెట్టి కాదు.


మీ ఊరిలో జరిగే సంబరాలు, ముచ్చట్లు ఇక్కడ ఉండక పోవచ్చు..

కానీ మనం అందరూ ఇలా సంతోషంగా ఉంటే అదే సంబరం కాదా..


మా అమ్మా నాన్నగారు తీర్ధ యాత్రలకి వెళ్లారు..

వాళ్ళు లేని లోటు మీరు ఈ పండక్కి మా ఇంట్లో ఉండి తీర్చారు..


అనగానే పెద్ద వాళ్ళిద్దరి కళ్లు ఆనందంతో నీళ్ళ తో నిండిపోయాయి...


వెంటనే పెద్దల్లుడు ప్రశాంత్ అన్నాడు..మరి మాకెందుకు ఈ బట్టలు వంశీ అని..?


మిమ్మల్ని మేము పండగకి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం..

స్నేహ భావంతో ఇచ్చినవి ఇవి..కాదని అనొద్దు

అన్నాడు వంశీ.

.

 "అవును మామయ్యా తమ్ముడు వంశీ చెప్పింది నిజం..

నేను ఆచరించలేకపోయాను...

అయినా పరవాలేదు..

తరువాత పండగకి మా ఇంట్లో కలుసుకుందాం"

నేను ఇంతకింత మర్యాదలు చేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు నవ్వుతూ..

అతను అన్న విధానానికి అందరూ హాయిగా నవ్వారు..


కనుమ రోజు మాత్రం విశాలాక్షి గారు ఊరుకోలేదు..ఈ రోజు గారెలు, ఆవడలు నేనే చేసి పెడతానని పట్టు బట్టి చేశారు..

వాళ్ళకీ కూతుళ్లు అల్లుళ్లు మనవలతో ఇంత

ఆహ్లాదంగా గడపడం ఎంతో సంతోషంగా అనిపించింది...


విశాలాక్షి గారి జీవితంలో వీసమెత్తు పని చేయకుండా ఖాళీగా కూర్చుని, ఎవరో రుచిగా వండి పెడితే తినడం ఇదే మొదటిసారి...

కోడలిగా,  భార్యగా, తల్లిగా, అత్తగారిగా ఆవిడ ఇన్నేళ్లు

చాకిరీ చేసి చేసి అలసిపోయి ఉన్నారు..

ఇంత విశ్రాంతి ఆవిడ ఏనాడూ తీసుకోలేదు..

అసలు ఆవిడకి ఎంతో ఆశ్చర్యంగా ఉంది...

ఇలా కూడా ఉంటారా అల్లుళ్లు అని..


మర్నాడు పెద్దల్లుడు వాళ్ళు వెళ్లిపోయారు..


తరువాత రోజు రాత్రి విశాలాక్షి గారూ ఆనందమూర్తి గారూ బయలుదేరారు...

ఆనందమూర్తి గారు ప్రయాణ చార్జీలు ఇవ్వబోయినా అల్లుడు తీసుకోలేదు...


అల్లుడిని ఆలింగనం చేసుకుని, "బాబూ నీ ఆప్యాయత, సంస్కారానికి  మాకు చాలా సంతోషం గా ఉంది...

ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం గా కూడా ఉంది..

 నిన్ను భర్తగా పొందడం మా అమ్మాయి అదృష్టమే

 కాదు..

నిన్ను అల్లుడుగా పొందడం మా అదృష్టం కూడా..


మాకూ కొడుకున్నాడు అని అనిపిస్తోంది బాబూ నిన్ను చూస్తే" అన్నారు..ఆనందమూర్తి గారు..


అనిపించడమేంటి మామయ్యా...నేను మీ కొడుకునే అన్నాడు వంశీ ఆప్యాయంగా...


                            *****

*ఉమాబాల చుండూరు*

రసజ్ఞభారతి సౌజన్యంతో-

   🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹