19, జనవరి 2026, సోమవారం

20జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

 🌹*20జనవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*                 

   

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్లపక్షం*


*తిథి  : విదియ* ‌రా 02.42 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : శ్రవణం* మ 01.06 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : సిద్ధి* రా 08.01 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : బాలువ* మ 02.31 *కౌలువ* రా 02.42 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 11.00 మ 12.00 - 01.00*

అమృత కాలం  : *రా 03.12 - 04.51*

అభిజిత్ కాలం  : *ప 11.56 - 12.41*

*వర్జ్యం    : సా 05.15 - 06.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.40 రా 11.02 - 11.53*

*రాహు కాలం   : మ 03.08 - 04.33*

గుళికకాళం      : *ప 12.18 - 01.43*

యమగండం    : *ఉ 09.29 - 10.54*

సూర్యరాశి : *మకరం*                  

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 06.50*

సూర్యాస్తమయం :*సా 06.05*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :    *11.11 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.42*


*ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.42 - 05.57*

ప్రదోష కాలం         :  *సా 05.57 - 08.30*

రాత్రి కాలం           :   *రా 08.30 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


*హనుమాన్ శ్రీప్రదో* 

*వాయుపుత్త్రో రుద్రో నఘో జరః*

*అమృత్యుర్వీర వీరశ్చ* 

*గ్రామవాసో జనాశ్రయః !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 2 వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷మంగళవారం 20 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 2 వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

``

  *20వ తేదీ మంగళవారం* 

        *వేకువఝామున* 

       *చదువుకొనుటకు*

``                                 

*దిలీప మహారాజు వేటకు బయలుదేరుట*

```

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.


దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.


దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.


అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.


ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.


“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.


“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.


ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.```


*దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట*``` 


దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.


ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.


దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.


అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు. మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.


అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.```


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*మాఘపురాణం రెండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

శ్రీహరిస్తుతి 56*

  *శ్రీహరిస్తుతి 56* 


*గగనమ్మున విహరించగ*

*ఖగ వాహన విష్ణుమూర్తి గమనం బయ్యెన్*

*జగమంత తిరుగుచుండెను* 

*నగణితమగు శక్తి చూపి యసురుల జం*శ్రీ హరి స్తుతి 57*


*హరి నామము సంకీర్తన*

 *నిరతముగా చేయ మనసు నిర్మల మయ్యెన్*

*మరిపించును కష్టంబుల*

*స్థిరమగు సౌఖ్యంబుగల్గు దేవుని దయతో*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*పెన్*

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - ఉత్తరాషాఢ -‌‌ ఇందువాసరే* (19.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/5Lz5pks5vvM?si=CGD6V6l6VljO8Yqd


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శరీరం గురించి శివుడు

  మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు -

 

* స్వరం ఒకటి మూడు రూపములుగాను , అయిదు రూపములుగాను అగును. ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును. మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.

 * శరీరం నందు స్వరం పుట్టును . స్వరము నందు నాడిపుట్టును. స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.

 * శరీరం పిండం అనబడును. ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును. శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.

 * ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును. అయిదు దినములకు బుడగ వలే అగును. పది దినములకు నెత్తురు అగును. పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.

 * ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.

 * మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండొవ నెల యందు మేథస్సు కలుగును. మూడోవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగోవ మాసము నందు అవయవములు జనించును.

 * అయిదోవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును. ఆరొవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును .

 * ఎడొవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.

 * ఎనిమిదోవ మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు . తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును . కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.

 * తొమ్మిదోవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదోవ మాసమున గాని పదోవ మాసమున గాని ప్రాణములతో పుట్టును .

 * స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము , బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.

 * పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను. స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును .

 * ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు , దరిద్రుడు అగును. గర్బం అయిదోవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును. ఆరొవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.

 * ఎడొవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు , ఎనిమిదొవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు , తొమ్మిదోవ దినమున పతివ్రత అగు కూతురు , పదొవ దినమున మంచి కుమారుడు పుట్టును . ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.

 * ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును. నెత్తురు , రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.

 * రోమములు , చర్మము , ఎముకలు , మాంసము ఇవి పృథ్వి అంశములు , శుక్లము, పురీషము , మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు .

 * ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు , ముడుచుకొనుట , చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు. కోపం , సిగ్గు , భయం , మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు .

 * నాలిక , చర్మము , చెవులు , ముక్కు , కన్నులు ఈ అయిదు జ్ఞానేంద్రియములు , ఉపస్థము , ఆసనం , వాక్కు , హస్తములు , పాదములు ఇవి కర్మేంద్రియాలు .

 * మూలాధారం నందు నాలుగు దళముల పద్మము , యోని నందు ఆరు దళముల పద్మము , నాభి యందు పది దళముల పద్మము , హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.

 * కంఠము నందు పదహారు దళముల పద్మము , కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము , బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము ఉండును.

 * ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును. ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.

 * సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.

 * నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.

 * అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.

 * నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.

 * సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది . అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.

 * ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి. వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద అనునవి కలవు. వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు వహించి ఉండును. 

 * సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును. పూషలము , భూషితము అను నాడులు నేత్రముల యందు ఉండును.

 * గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును. కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.

 * మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును.

 * పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును. నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు , హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .

 * అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను , గుదము , లింగము , నాభి , వృషణము , తొడలు , మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును .

 * వ్యాన వాయవు కన్నులు , చెవులు , కాలి మడములు , పిరుదు , ముక్కు , ఈ స్థానముల యందు ఉండును. ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును .

 * సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును. భుజించబడిన , తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును .

 * ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు , కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.

 * ధనుంజయ వాయవు వలన ఘోషము , మాటలాడుట నాగము వలన , ఆవులింత దేవదత్తం వలనను , తుమ్ము కృకరము వలనను , కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును. మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం. 

         మరిన్ని మానవ శరీరానికి సంబంధించిన పరమ రహస్యాలగు యోగ కారక విషయాలు తరవాతి పోస్టులలో తెలియచేస్తాను.

 

  

  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

సహస్రారాంబుజా రూఢా🌹

  🌹సహస్రారాంబుజా రూఢా🌹


ఆజ్ఞ పైన సహస్రార కమలమని చెప్పుకున్నాం కదా. ఈ పద్మానికి వెయ్యి రేకలు.  

ఇదిగో, ఇక్కడ, ఆ లలితా పరమేశ్వరి సహస్రార కమలంపై కూర్చుని ఉన్నది. 

తల మధ్యలో వున్న మాడు వద్ద వున్న ప్రాంతం ఈ సహస్రార స్థానం. 

మాడు పుట్టినప్పుడు తెరచుకుని ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మాయ కమ్మి మూసుకుపోతుంది. 

దీనికి పైన బ్రహ్మ రంధ్రమున్నది. జపతపాలతో ఆ బ్రహ్మ రంధ్రాన్ని తెరచుకుని జీవుడు 

స్వేచ్చని పొందాలి. అప్పుడే జీవుడికి తానే దేవుడు అన్న భావన స్థిరపడుతుంది. 

ఆ స్థితిని పొందితే జీవుడు ఆ సహస్రార పద్మంలో, వెలిగిపోతున్న లలితా పరమేశ్వరిని దర్శించి, 

బ్రహ్మానంద భరితుడవుతాడు. ఒక్క విషయం శ్రద్ధాభక్తులతో గమనించండి.  

ఈ మొత్తం సాధనా క్రమంలో, ప్రతి దశలోనూ అమ్మ జీవుడితోనే వున్నది. 

తల్లి పిల్లలను ఎంత భద్రంగా, పక్కనే వుండి నడిపిస్తుందో, ఈ లలితమ్మ కూడా 

తన రక్షణ కోరి వచ్చిన అందరినీ, కాపు కాచుకుంటూ తన మార్గంలో నడిపిస్తున్నది. 

సహస్రార కమలంలో ఉంటూ మనలను ఎంతో అవ్యాజానురాగంతో, ప్రేమతో, 

కరుణిస్తున్న, ఆ సహస్రారాంబుజారూఢ కు వందనం. 🌹


.🌹 సుధాసారాభి వర్షిణీ🌹


ఆ సహస్రార కమల స్థాయికి చేరుకుంటే, సుషుమ్నానాడి ద్వారా పైకి వెళ్లిన 

జీవుడికి దొరికేది అమృతవర్షము. అమ్మ అక్కడ చంద్రవంక రూపములో సుధలను వర్షిస్తుంది. 

ఆ సుధాధారలను స్రవిస్తున్న తత్వమే కామధేను తత్వము. 

గ్రంధి భేదనములు జరిగి, ఇంద్రియ నిగ్రహంతో, అసూయ లేని అనసూయ తత్వంతో, 

సమస్త సృష్టి పట్లా ఏకత్వ భావము పొందిన, జీవుడికి ఇక్కడ కామధేనుతత్వం బోధపడుతుంది. 

ఈ జ్ఞానం పొందిన వారికి, గరికపోచ బ్రహ్మాస్త్రమెలా అవుతుందో, 

అదే విధంగా సామాన్య ధేనువు, కామధేనువు అవుతుందని అవగాహన కలుగుతుంది. 

అటువంటి కామధేనువు జ్ఞాన సుధాధారలను తన పొదుగు నుంచి వర్షిస్తుంటే, 

డెబ్బై రెండు వేల నాడులూ ఆ అమృత ధారలలో తడిసి జీవుడు ఆనందభరితుడవుతాడు.  

సరియైన మార్గంలో సాధన చేస్తే, ప్రతి గ్రంధీ ఉపాసకుల పాలిట కామధేనువు అవుతుంది. 

ఆ స్థితికి చేరుకోవాలంటే అమ్మ చరణాలను పూజించాలి. అప్పుడు ఆ చరణకమలాలే 

ఉపాసకులను సహస్రార కమలానికి చేరుస్తాయి. జీవుని శరీరమంతా పద్మమయం. 

ప్రతి పద్మమూ, దాని ప్రతి దళమూ ఉపాసకులకు దివ్యానుభూతులను అందిస్తాయి.

ఆ అమృత అనుభూతులను, సహస్రారకమలం చేరుకున్న ఉపాసకుల కొరకు, 

చంద్రమండలం నుంచి, సుధాధారల రూపంలో వర్షిస్తున్న, ఆ సుధాసారాభి వర్షిణి కి వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

తటిల్లతా సమరుచిః🌹

  🌹తటిల్లతా సమరుచిః🌹


అమ్మ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుందని చెప్పుకున్నాం కదా. 

తటిల్లత అంటే శంపాలత, మెరుపుతీగ. రుచి అంటే కిరణము, కాంతి. 

అమ్మ ఆ సహస్రార స్థానంలో ఒక తటిల్లతా కాంతితో మెరిసిపోతూ దర్శనం ఇస్తూ ఉంటుంది. 

మెరుపు ఒక్క క్షణమాత్రం మెరిసి మాయమైపోతుంది. ఆ మెరుపులంత సౌందర్యం అమ్మది. 

క్షణం పాటు కనిపిస్తుంది కనుకే, అంత మహోత్కృష్టమైన కాంతితో మెరిసిపోతున్నా, 

ఆ మెరుపులని మనం చూడగలుగుతున్నాము. మెరుపు ఎంత అందంగా వున్నా, 

ఎంత ప్రకాశంగా వున్నా, ఎంత మోహింపచేసేలా వున్నా, అది క్షణకాలం ఉంటేనే చూడగలం. 

ఒక్కోసారి మెరుపు దగ్గరగా వచ్చినప్పుడు, మనం వున్న ప్రాంతమంతా కూడా అద్భుతమయిన 

విద్యుత్ కాంతితో వెలిగిపోయి, దానిని చూసాక, కళ్ళు చెదరి, కొంత సేపు మరి ఏమీ కనపడవు. 

అటువంటి మిరుమిట్లు గొలిపే కాంతితో వెలిగిపోయే 

అమ్మను చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవు. 

అది కన్నులు తెరచి చేసే దర్శనం కాదు. కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం. 

చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాలు, మధ్యలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ. 

అదే అమ్మ దర్శనం. జీవితం తరించటానికి ఆ క్షణ మాత్ర దర్శనం చాలు. 

ఉపాసకులు, ఋషులు, ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైన ఏ కొద్దిమందో, 

అమ్మ అనుమతితో, తమ అంతః చక్షువులతో ఆ దర్శనం చేయగలరు. 

మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరుమే ఉరుములాగా, అమ్మ వాహనమైన సింహం 

గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది. 

ఆ గర్జన వల్ల కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు

మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకుని

వెనువెంటనే తళుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసుల

దర్శించగలితే, అంతకన్నా కావలసిందేమిటి. అమ్మ తటిల్లతా కాంతులను చూడలేము కనుక,

ఆ తల్లి కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే, ఆ తల్లి కరుణించి దారి చూపుతుంది. 

సహస్రారం చేరి, తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు,

తన అపురూపమైన తటిల్లతా రూపంతో కటాక్షిస్తున్న ఆ తటిల్లతాసమరుచి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

పెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


      🍁 *శుభోదయం🐍


🌹 *నేటి పెద్దలమాట* 🌹

భగవంతుడు మెచ్చుకొనే దివ్య గుణాలలో కరుణ ఒకటి ఆయన దాయాస్వరూపుడు అందుకే ఆలక్షణం కలవారు ఆయనకీ ప్రీతిపాత్రులౌతారు.

తన చుట్టూ ఉన్న ప్రాణికోటి ఆనందం గా ఉంటేనే తానూ ఆనందించడం ఇతరులకు ఏకొద్ది*కష్టం కలిగినా సహించలేక పోవడం ఉత్తమ సంస్కార లక్షణం.


🌹 *నేటిమంచిమాట* 🌹

   

అందం విలువైనదే కానీ మంచి మనసంతా విలువైనది ఐతే మాత్రం కాదు అందం ఉన్నచోట అవసరం పెరుగుతుంది మంచి మనసు ఉన్న దగ్గర బంధం పెరుగుతుంది.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼

             

           *_నేటి విశేషం_*


           _*కనుమ పండగ ... “పశువుల పండుగ”*_

కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. 

పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు.

 సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. 

పక్షులు కూడా రైతన్ననేస్తాలే, అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.



*పశువుల పండుగ*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.  

ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. 

కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు. 

కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. 

అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. 

అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని *"ఉప్పు చెక్క''* అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. 

అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. 

అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. 

లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు.

 ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. 

మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. 

ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. 

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు.

పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. 

ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. 

దాన్ని *"చిట్లా కుప్ప"* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి.


ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. 

అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. 

పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు.

పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి.


ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. 

దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. 

ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. 

ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని *''పొలి''* అంటారు. 

ఆ *"పొలి"* ని తోటకాపరి గాని , నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో *"పొలో.... పొలి"* అని అరుస్తూ చల్లుతాడు. 

అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. 

అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.


ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. 

కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. 

దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది...


               *_🍃శుభమస్తు🍃_*

    🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

శ్రీహరి స్తుతి 37*

 *శ్రీహరి స్తుతి 37* 


*కం.నరసింహుడు కరుణించిన* 

*నరులకు సంపద కలుగును నానందమ్మున్*

*జరుగును శుభ కార్యంబులు* 

*ధరణంతయు సంతసంబు తప్పక దొరుకున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

అందరమొకటై చేయగ

 *2321*

*కం*

అందరమొకటై చేయగ

సుందరమై పండుగ యిల శోభిల్లునయా.

అందరునూ కలిసెడి యా

నందదినమె పండుగయగు ననయము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అందరూ ఒకటి గా కలిసి నిర్వహించుకుంటే పండుగ ఈ లోకంలో అందంగా ప్రకాశిస్తుంది. అందరూ కలిసి ఉండే ఆనందకరమైన దినమే ఎల్లప్పుడూ పండుగ కాగలదు.

*సందేశం&సందర్భం*:-- ఈ రోజల్లో చాలా మంది ఎవరికి వారు గా ఒంటరిగా పండుగ లు నిర్వహించుకొనుచూ సరైన సంతృప్తి ని పొందటం లేదు., అలాగే పండుగ నాడైనా స్వజనులకు దగ్గరగా వచ్చుటలేదు,అలా పండుగ సంతోషాలను పరిపూర్ణముగా ఆస్వాదించడం లేదు. కనీసం మరో సందర్భంలో అయినా అందరూ కలిస్తే ఆ రోజు నే పండుగ నిర్వహించుకొనవచ్చుననేది సందేశం, ఎందుకంటే అందరూ కలిసి ఉండే ఏ రోజైననూ పండుగ రోజు వంటి దే కదా!!

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

బసవడికి కోటి దండాలు*

 



       *బసవడికి కోటి దండాలు*

                 ➖➖➖✍️```

      కనుమ పండుగ ప్రత్యేకం


పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేకపూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే జీవులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ.


సంక్రాంతి వ్యవసాయ పండుగ! శ్రమైక జీవన సౌందర్యానికిది ప్రతీక! ఆరుగాలం శ్రమపడ్డ రైతుకు పంట ఇంటికి చేరితే నిజంగా పండుగ! సకల శుభదాయకంగా సమస్త శ్రేయస్కరంగా భావించి, ప్రాంతాలతో నిమిత్తలేకుండా పల్లె ప్రజానీకమంతా హర్షాతిరేకాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి.


ప్రకృతి మాపై కరుణ చూపాలి. సూర్యునితో సహా నవగ్రహాల దయ మాపై ఉండాలి. మబ్బులు రావాలి, ఉరుములు మెరవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, పంటలు పండాలి, గాదెలు నిండాలి, కడుపునిండా తిండి దొరకాలి, సమస్తం క్షేమంగా ఉండాలి. సకల వృద్ధి పొందాలి, అంతటా సంతోషం వెల్లివిరియాలనే భావనే సంక్రాంతి నేపథ్యంగా ఉంటుంది.```



*పశువుల పండుగ*```

భోగి, మకర సంక్రాంతి తరువాతి రోజు కనుమ పండుగ. వ్యవహారంలో కనుమ పండుగగా స్థిరపడినప్పటికీ దీని అసలు పేరు 'కనుము పులు' పండుగ. కనుము అంటే పశువు అని అర్ధం. పులు అనే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యం, అల్పమైనది, కసవు అర్ధాలున్నాయి. కసవు అంటే గడ్డి. 

కనుమ పండుగనాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఈ పండుగకు 'కనుము పులు' పర్వం అని పిలిచారు.


కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు చెల్లించుకునే పర్వంగా కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంప్రదాయం.


పరోపకారమే ధ్యేయంగా గల మూగజీవులను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సంప్రదాయం కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా భావించి, అనంతకోటి ప్రాణిపట్ల దయార్ద్ర హృదయాన్ని కలిగి ఉండాలనే భావనతో కనుమ రోజున విశిష్టంగా రైతన్నలు జరుపుకునే పండుగ ఇది. సిరిసంపదలిచ్చే గోమాతను, బవసన్నను పూజించే పండుగ. మూగజీవాల పట్ల ప్రేమను తెల్పుతూ కనుమనాడు రైతులు పశుశాలను శుభ్రపరచి పశువులను శుభ్రంగా కడుగుతారు. పశువులకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెడతారు. మెడలో గంటలు, గవ్వలు కడతారు. కొమ్ములకు వెండి తొడుగులు, కాళ్లకు గజ్జలు తొడుగుతారు. పూల మాలలు వేసి పూజిస్తారు. ఆ తర్వాత పశువులన్నింటికీ పచ్చగడ్డి, సెనగపిండి పొంగళ్లను దాణాగా తినిపిస్తారు♪. ఆ సాయంత్రం రైతులు, వ్యవసాయదారులు పశువులను మేళతాళాలతో ఊరంతా తిప్పుతారు. కనుమ నాడు గోవును పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలం పొందుతారని శాస్త్రోక్తి. సంతానానికి గోవు సంకేతం. ధర్మానికి ఎద్దు సంకేతంగా భావిస్తారు.```



*పొలి చల్లడం*```

కష్టించి పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి వచ్చిన సమయంలో రైతులు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. కొత్త ధాన్యంలో ఆవుపాలు, చక్కెర కలిపి పొంగలి తయారు చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు. పొంగలి మెతుకులు పొలమంతా చల్లుతారు. అందువల్ల పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. ఈ ఆచారానికే పొలిచల్లడం అని పేరు. 


కనుమ రోజున కాకి కూడా ప్రయాణం చేయదు అని సామెత. కాబట్టి ఈ రోజు ప్రయాణం నిషిద్ధం. మాంసాహారులు ఈ రోజు మాంసాన్ని వండుకుంటారు సాధారణంగా పందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం కనుమ పండుగలో కనపడుతుంది.```



*వరికంకుల సౌందర్యం*```

పక్షులు పంట పాడుచేయకుండా ఉండేందుకు పురుగులను తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను చెప్తారు మన రైతన్నలు. అప్పుడే నూర్చిన వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేస్తారు. ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమ నాడు గుడిలో వరికంకుల గుత్తులను కడతారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపు ముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. తమిళులు కనుమను 'మాట్టు పొంగల్' అని పిలుస్తారు. తెలుగువారు పులగం అంటారు. కొత్త బియ్యం కొత్త పెసర పప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. కొత్త బియ్యాన్ని లేగంటి ఆవు పాలలో వండి కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారు చేయటం ఈ పండుగతోనే ప్రారంభిస్తారు. ```



*ఆధ్యాత్మిక కనుమ*```

అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకెత్తి నందగోకులాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించింది కనుమ పండుగ రోజునే అని చెబుతారు. పశుపోషణ, రక్షణ మానవజాతి కర్తవ్యంగా నాటినుంచి కనుమనాడు పశువులను పూజించే ఆచారం వచ్చిందని ఒక గాథ. 


సంక్రమణ కాలంలో ప్రధానంగా పితృతర్పణలు నిర్వర్తించాలి. ఇది పెద్దలను సంస్మరించుకునే పండుగగా మనవారు నిర్దేశించారు. మినుముతో చేసిన గారెలను కనుమనాడు పితృదేవతలకు నివేదిస్తారు. గోదావరి ప్రాంతాల్లో ముత్తైదువలు సకల పిండివంటలతో వేడినైవేద్యం వండి గ్రామదేవతలకు సమర్పణగా రజకులకు అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి ఆడపడుచులు అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి అన్నల చేతుల్లో ఉంచి మంచి జరగాలని కోరుకుంటారు.```


*ముక్కనుమ*```

సంక్రాంతి నాలుగోరోజు ముక్కనుమ అంటారు. కానీ ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు కానీ, కొంత మంది కనుమ నాడు కాక ఈ రోజే మాంసాహారాన్ని తినటానికి కేటాయిస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడవారు సావిత్రి గౌరీ వ్రతాన్ని మొదలు పెడతారు. పదహారు రోజుల పాటు చేసే ఈ వ్రతాన్ని గ్రామంలో ఉన్న ఆడవారందరూ కలిసి చేసుకుంటారు. మట్టితో చేసిన గౌరీ దేవి బొమ్మని కుమ్మరి ఇంటినుంచి మేళతాళాలతో తెస్తారు. కుమ్మరికి స్వయం పాకం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. అన్ని వృత్తుల గౌరవించటం సంక్రాంతి సంప్రదాయాల పరమార్ధం.✍️```-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

⚜ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1359


⚜  తమిళనాడు : మైలాపూర్


⚜  శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం


💠 ఆదికేశవ పెరుమాళ్ ఆలయం మైలాపూర్ పశ్చిమ భాగంలో చితిరై కులం సమీపంలో ఉంది. 

ఆది కేశవ పెరుమాళ్ ఆలయం మరియు వేదాంత దేశిక దేవస్థానం ఒకదానికొకటి ప్రక్కనే ఉన్నాయి.


💠 ఋషులను అసురుల నుండి విడిపించడానికి కేశవుడు ఇక్కడ అవతరించాడని మరియు ఈ పెరుమాళ్ సూర్య చంద్రులకు శాప విమోచనం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.


💠 వైష్ణవ  పే ఆళ్వార్ అవతార స్థలం కూడా అయిన ఈ పురాతన ఆలయం తెంకలై వైష్ణవ సంప్రదాయానికి చెందినది.


💠 స్థలపురాణం ప్రకారం, క్షీర సాగర మథనం సమయంలో, విష్ణువు తన భార్య లక్ష్మిని భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకోవాలని ఆదేశించాడు. ఆ మహర్షి ఆడపిల్లను పొందాలని తపస్సు చేస్తూ, లక్ష్మీదేవిని స్వీకరించాడు. 


💠 ఆదికేశవుడు భృగుమహర్షి కుమార్తె అయిన భార్గవినీ  వివాహం చేసుకున్నాడని నమ్ముతారు.

భృగు మహర్షి కుమార్తెగా, ఆమెను 'భార్గవి' అని పిలుస్తారు. 

ఆమె భగవంతుని కుడి వైపున ఒక ప్రత్యేక గర్భగుడిలో ఉంటుంది. 

ప్రతి శుక్రవారం ఉదయం ప్రత్యేక హోమం చేస్తారు మరియు శ్రీసూక్తం జపించడం ద్వారా ఆమెను 'విల్వ' ఆకులతో పూజిస్తారు. 

తాయారు పూజించడానికి ఇది చాలా శుభ సమయం. 


💠 వివాహానికి ఉన్న అడ్డంకుల నుండి ఉపశమనం పొందడానికి, చదువులో వృద్ధి చెందడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి భక్తులు ఆమెను బిల్వ ఆకులతో ప్రార్థిస్తారు. 


💠 ఈ ఆలయం  6-9 శతాబ్దాల పన్నెండు ఆళ్వార్ సాధువులలో మొదటి ముగ్గురిలో ఒకరైన పెయాళ్వార్ జన్మస్థలం అని నమ్ముతారు. 


💠 ఈ ఆలయ ప్రధాన దైవం ఆదికేశవుడు తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో, ఉత్సవర్ శ్రీదేవి మరియు భూదేవి భార్యలతో ఉన్నారు.


💠 రాముడు విభీషణుడిని అభిముఖంగా చూస్తూ ఆశీర్వదించే సన్నిధి కూడా ఉంది. 

ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, తెంగలై శాఖకు చెందిన 12 మంది ఆళ్వార్లు మరియు 22 మంది ఆచార్యులు ఒకే సన్నిధిలో ఉన్నారు, దీనిని మీరు మరే ఇతర ఆలయంలోనూ చూడలేరు. 


💠 తాయార్ మయూరవల్లి తూర్పు ముఖంగా ప్రత్యేక సన్నిధిని కలిగి ఉన్నారు. 

తాయార్‌కు శుక్రవారం జరిగే ప్రత్యేక పూజ చాలా మంది భక్తులను ఆకర్షిస్తుంది.


💠 శ్రీమహావిష్ణువు ఆయుధాలలో ఒకటైన 'నందకం' ఖడ్గం, మహాలక్ష్మిని మంత్రాలను బోధించమని కోరింది.

ఆ ఖడ్గం భూమిలో జన్మించి, విష్ణువును పూజించి, ఆ తర్వాత బోధించాలనే షరతుపై మహాలక్ష్మి అంగీకరించింది. 

దీని ప్రకారం, మణి కైరవిణి తీర్ధంలో వికసించిన పువ్వులో నందకం జన్మించాడు. 


💠 అతన్ని "మహాతాహ్వాయర్" అని పిలుస్తారు. అతను ప్రతిరోజూ భగవంతునికి దండలు వేసే విధిని నిర్వర్తిస్తున్నాడు మరియు లక్ష్మి సంతోషంగా అతనికి బోధించింది. పెరుమాళ్ పట్ల ఆయనకున్న అపారమైన భక్తి కారణంగా ఆయనను 'పెయాళ్వార్' అని పిలుస్తారు.

'పే' అంటే 'వృద్ధుడు'. 

ఆయన ఆళ్వార్లలో పెద్దవాడు కాబట్టి ఆయనను అలా పిలిచారని చెబుతారు.


💠 పెరుమాళ్ గర్భగుడి ముందు మండపంలో పెయాళ్వార్ ప్రత్యేక గర్భగుడిలో, దక్షిణం వైపు కూర్చుని ఉన్నారు. 

ఇప్పటికీ మనం పెయాళ్వార్ జన్మించిన కైరవిణి బావిని, సమీపంలోని దూరంలో చూడవచ్చు. 


💠 ఆళ్వార్ పుట్టినరోజును ఐప్పసి మాసంలోని 'సదయం' నక్షత్రం రోజున జరుపుకుంటారు. 

ఆ రోజున, అరుల్మిగు పార్థసారథి పెరుమాళ్ ఆలయం నుండి పూలమాల, తులసి, పరివట్టం, చెప్పులు మరియు భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని తీసుకువచ్చి పెయాళ్వార్కు సమర్పిస్తారు. 


💠 చంద్రుడు ఈ స్వామిని శాపం నుండి విముక్తి కోసం పూజించాడు. ఇక్కడ పవిత్ర జలాలన్నీ ప్రవహించేలా చేయడం ద్వారా భగవంతుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. 

ఈ నీటిలో స్నానం చేసి చంద్రుడిని పూజించడం ద్వారా తన శాపం నుండి విముక్తి పొందాడు. 

అన్ని జలాలు ఈ ప్రదేశంలోనే ఉండాలని భగవంతుడు కోరాడు. అన్ని జలాలు ఐక్యమై ఒకే చోట ఉండటం వల్ల దీనికి 'సర్వ తీర్థం' అని పేరు వచ్చింది, మరియు చంద్రుడు తన శాపం నుండి విముక్తి పొందడం వల్ల దీనికి 'చంద్ర పుష్కరిణి' అనే పేరు కూడా వచ్చింది. 

ఇప్పుడు దీనిని 'చిత్రకులం' అని పిలుస్తారు.


💠 ప్రధాన గర్భగుడిలో, ఆది కేశవ పెరుమాళ్ నిలబడిన భంగిమలో కనిపిస్తాడు. శ్రీదేవి, భూదేవి ఆయన దగ్గర లేరు.  ప్రాకారంలో శ్రీరాముడు, చక్రతాళ్వారు, ఆండాళ్, వీర ఆంజనేయరులకు గర్భాలయాలు అందుబాటులో ఉన్నాయి. 


💠 మయూరవల్లి దేవతను బిల్వ ఆకులతో పూజిస్తారు , వీటిని శివాలయాలలో మాత్రమే ఉపయోగిస్తారు . 

మయూరవల్లి రూపంలో శివుడు, పార్వతి మరియు లక్ష్మి ఆది కేశవ పెరుమాళ్‌ను పూజించి వారి శాపాల నుండి విముక్తి పొందారని నమ్ముతారు. 


💠 ఈ ఆలయ ఊరేగింపు ఏకాదశి రోజు, తిరువోణం, పౌర్ణమి మరియు అమావాస్య సందర్భాలలో జరుగుతుంది , ఆ సమయంలో ఆదికేశవ, శ్రీదేవి మరియు భూదేవి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళతారు.


💠 ఆలయం యొక్క ప్రధాన పండుగ అయిన బ్రహ్మోత్సవం తమిళ మాసం పంగునిలో నిర్వహిస్తారు. 

10 రోజుల పండుగ సమయంలో, 12 మంది ఆళ్వార్లు మరియు 21 వైష్ణవ ఆచార్యులను ఆదికేశవ పెరుమాళ్ తో పాటు ఊరేగింపుగా తీసుకువెళతారు. తమిళ మాసం ఆదిలో తెప్పోత్సవం 5 రోజులు నిర్వహిస్తారు.


రచన 


©️ Santosh Kumar

సుభాషితమ్

 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


        శ్లో𝕝𝕝  *తృణం భుక్త్వాపి పశవః*

                *యచ్ఛన్తి మధురం పయః* l

                *కామదాః కర్షకాణాం చ*

                *పశవః మమ దేవతాః* ll


     *_𝕝𝕝ॐ𝕝𝕝  - కనుమ - గో - వృషభ పూజ 𝕝𝕝卐𝕝𝕝_*


తా𝕝𝕝 *గడ్డి తింటున్నప్పటికీ మధురమైన పాలని ఇచ్చు, రైతులకు ఆనందాన్ని కలిగించి... వారికి కామధేనువుల్లా కోరిన కోర్కెలను అనుగ్రహించే పశువులు.... దైవసమానములు*.


          🪁 *కనుమ శుభాకాంక్షలు* 🪁


✍️💐🌹🌸🙏

నక్షత్ర స్తోత్ర మాలిక - 16 వ రోజు*.

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 16 వ రోజు*. 


*నక్షత్రం*_ *విశాఖ* (Vishakha)


*అధిపతి*_ *గురువు* (Jupiter)


*ఆరాధించాల్సిన దైవం. ఇంద్రాగ్నులు / దత్తాత్రేయ స్వామి /దక్షిణామూర్తి*


*విశాఖ నక్షత్ర జాతకులు, విద్యార్థులు మరియు వృత్తిలో ఉన్నత స్థాయిని కోరుకునే వారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.*


🙏*గురు గ్రహ పంచరత్న స్తోత్రం*🙏


*దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభమ్* ।

*బుద్ధి మంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్* ॥ 1 ॥


*వరాక్షమాలాం దండం చ కమండలధరం విభుమ్* । 

*పుష్యరాగాంకితం పీతం వరదాం భావయేత్ గురుమ్* ॥ 2 ॥


*అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితమ్* । 

*సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా* ॥ 3 ॥


*ఆంగీరసాబ్దసంజాత అంగీరస కులోద్భవః*। 

*ఇంద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః* ॥ 4 ॥


*బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః* । 

*చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్* ॥ 5 ॥


🙏 దేవగురు శ్రీ బృహస్పతయే నమః 🙏


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

పద్యభారతి వర్ణన

  పద్యభారతి వర్ణన:-"పశుపోషణ"నాడు -నేడు".

                     పూరణ:-",సీసము "

  "పాడి పంటలు నాడు ప్రాణమై దేశము 

               పశు పాలనము జేసి పరిఢవిల్లె 

   ఆయు రారోగ్యము లద్భుత రీతిని 

                యందరి సొత్తుగ పొంది నారు 

   పాడి పంటల వల్ల ఫలితంబు లేదని 

               పశు పాలనము మాని పనులు లేక 

    కాయ కష్టము మర్చి కని విని యెరుగని

              రోగాల మూల్గుచు రోగు లయిరి 

   తే"గీ"

   "పశువు లను జంపి ప్రకృతిని పాడు జేసి

    పుడమి యునికిని గూల్చంగ బూను కొనిరి 

    శాస్త్ర విజ్ఞాన మనుచును చతికిల బడి 

    నిలచు కొమ్మను నరికిరి నేటి నరులు".

                      నమస్సులతో...

                       డి.సి.నరసింహులు,

                                మేడ్చల్.

హిందువుల విషాద అధ్యాయం

 💔 1972 – ప్రపంచం మరిచిపోయిన హిందువుల విషాద అధ్యాయం 💔


నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ కు “అల్లాహ్ తనకు కలలో కనబడి హిందువులను..సిక్కులను దేశం నుంచి వెళ్లగొట్టమని చెప్పాడట…”


ఇది 1972లో ఉగాండాలో వేలాది హిందువులు అనుభవించిన భయంకరమైన నరకం..


1972లో జనరల్ ఇడి అమిన్ ఉగాండాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఒక్క ప్రకటనతో —

👉 ఉగాండాలో ఉన్న భారతీయులందరూ 90 రోజుల్లో దేశం విడిచిపెట్టాలి అని ఆదేశించాడు.


ఆ 90 రోజులు…

భయంతో నిండిపోయాయి.

భద్రత లేకుండా పోయాయి.


భారతీయుల ఇళ్లపై దాడులు,

వ్యాపారాల దోపిడీ,

మహిళలపై అఘాయిత్యాలు…

దీంతో వేలాది కుటుంబాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, ఏమీ తీసుకోలేక, రాత్రికి రాత్రే దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది.


ఉగాండాలో ఉన్న భారతీయుల్లో 90% గుజరాతీలు, పంజాబీలు.

వారికి చెప్పిన మాట ఒక్కటే..


👉 “మూడు జతల బట్టలు తప్ప ఇంకేమీ తీసుకెళ్లకూడదు.”


ప్రతి విమానాశ్రయం, ప్రతి బస్ స్టేషన్…

కఠిన తనిఖీలు.

మహిళలకు అవమానం.


👉 సుమారు 80,000 మంది హిందువులు ఒక్క రాత్రిలోనే వలస వెళ్లారు.

వాస్తవ సంఖ్యలు ఇంకా ఎక్కువనే నమ్మకం ఉంది…

కానీ ఈ భారీ స్థాయి జాతి శుద్ధిని (ethnic cleansing) ప్రపంచం తక్కువగా మాట్లాడింది.


ఇది ఎందుకు జరిగిందో చెబుతూ, అమిన్ అనుచరులు చెప్పిన కారణం..


👉 “అల్లాహ్ కలలో చెప్పాడు” అని.


అప్పట్లో భారత్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఉక్కు మహిళ అని కీర్తించబడ్డ ప్రధానమంత్రి — ఇందిరా గాంధీ.

పంజాబ్, గుజరాత్‌లో కూడా అదే పార్టీ పాలన.


అప్పుడే పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రేస్ నాయకత్వం, ఉగాండా హిందువుల మీదా సిక్కుల మీదా కనీస మానవత్వం చూపలేదు.. 


👉 భారతీయులపై జరిగిన ఈ దారుణంపై భారత్ నుంచి గట్టి స్పందన లేదు..

👉 ఖండన లేదు.

👉 చర్చలు లేవు.

👉 పైగా, ఉగాండా నుంచి వచ్చిన భారతీయ శరణార్థులను భారత్‌లోకి తీసుకోవడానికి కూడా నిరాకరణ.


ఆ సమయంలో ఎవరు ముందుకు వచ్చారు తెలుసా?


👉 బ్రిటన్.


తమ దేశం పాలనలోనే ఒకప్పుడు ఉగాండాకు వెళ్లిన భారతీయులని గుర్తు చేసుకున్న బ్రిటన్,

👉 వారిని స్వదేశానికి ఆహ్వానించింది.

👉 ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది.

👉 శిబిరాలు ఏర్పాటు చేసింది.

👉 జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఇచ్చింది.

👉 సిక్కులకు హిందువులకు లకు బ్రిటిష్ పౌరసత్వం కూడా కల్పించింది.


ఈరోజు బ్రిటన్‌లో ఉన్న లక్షలాది హిందూ సిక్కు కుటుంబాల వెనుక

వేదన అవమానాలతో నిండిన ఉగాండా కథ ఉంది.


ఇది రాజకీయ కథ కాదు…

ఇది తమ మట్టిని కోల్పోయిన హిందువుల కధ..సిక్కుల కన్నీటి గాథ.


ఈ చరిత్రను మర్చిపోవద్దు.

ఒక దేశం తన ప్రజలను ఎలా కాపాడిందో — లేదా కాపాడలేకపోయిందో అన్న ప్రాతిపాధికనే దేశ నాయకత్వ పఠిమ ను గుర్తిస్తారు..దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు..


ఈ ఉక్కు మహిళ గా చెప్పబడే ఇందిరా గాంధీ గారు ఏనాడూ హిందువుల పట్ల..సిక్కుల పట్ల మానవత్వంతో వ్యవహరించలేదు..


గోపాష్టమి రోజు హిందూ సన్యాసులను కాల్చి చంపించడం దగ్గర నుంచి ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో సిక్కు మారణహోమం వరకూ..

స్వంత భూభాగం మిజోరం మీద వైమానిక దాడులు..

ఆపరేషన్ బ్లూ సార్ లో ఆర్మీ ని వాడడం..కుటుంబ నియంత్రణతో హిందూ జనాభా తగ్గించే కుట్ర చేయడం వరకూ అన్నీ హిందూ వ్యతిరేక చర్యలే..


ఇవన్నీ దాచేసి బంగ్లాదేశ్ యుద్ధం మాత్రమే హైలెట్ చేస్తారు..ఆ యుద్ధంలో కూడా గెలిచి ఏ ప్రయోజనమూ సాధించకుండానే రాజీ పడ్డారు..


మరోసారి చెప్తున్నాము..వాస్తవ చరిత్రను తెలుసుకుందాం..కాంగ్రేస్ సృష్టించే కధనాల ట్రాప్ లో పడకుండా మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం..


భారత్ మాతాకీ జై..🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

షట్చక్రోపరి సంస్థితా

 🌹షట్చక్రోపరి సంస్థితా 🌹


మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ 

అనే ఈ ఆరు చక్రాలు ఈ దేహంలో వున్నవి అని చెప్పుకున్నాం కదా. 

ఆ ఆరు చక్రాలకూ పైన వున్న సహస్రార పద్మంలో ఆ శ్రీదేవి కొలువై వున్నది. 

అక్కడ వున్న ఆ జగదంబను మనసులో దర్శించండి. 

మూలాధారం వద్ద భూలోక స్థితిలో వున్న జీవుడు, స్వాధిష్ఠానం చేరి భువర్లోక స్థితికీ,

మణిపూరము చేరి సువర్లోక స్థితికీ, అనాహతము చేరి మహర్లోక స్థితికీ, విశుద్ధి చేరి జనలోక స్థితికీ, 

ఆజ్ఞ చేరి తపోలోక స్థితికీ, ఆజ్ఞ దాటి సహస్రారం వద్ద సత్యలోక స్థితికీ చేరుకుంటాడు. 

సహస్రారం వద్ద వున్న పరమేశ్వరుణ్ణి కలిసి, ఆ పరమేశ్వరి ఆనందంగా ఉంటుంది. 

కామేశ్వరి, తన తటిల్లతా కాంతితో తానూ ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. 

అలా సంతోషంతో వెలిగిపోతూ, ఆ షట్చక్రాలకు పైన వున్న వెయ్యి రేకుల పద్మంపై

ఆనందంగా ఆశీనురాలై వున్న ఆ రాజరాజేశ్వరిని మనసారా దర్శించటం ఒక అలౌకికానుభూతి. 

ఆ అలౌకికానుభూతులను ఉపాసకులకు ప్రసాదిస్తున్న, ఆ షట్చక్రోపరిసంస్థిత కు వందనం. 🌹


🌹మహాసక్తిః🌹


మహాసక్తి అంటే అమ్మ ఎంతో ఆసక్తి కలది అని భావం. 

ఆ ఆసక్తి దేనిమీద అనేది తెలిస్తే, మనం అమ్మను తృప్తిపరచగలం. 

ఆ లలితా దేవికి ఉత్సవాలంటే ఆసక్తి. యజ్ఞాలంటే, హోమాలంటే ఆసక్తి. 

కామేశ్వరుణ్ణి కలవాలంటే ఆసక్తి. పండుగ వాతావరణం అంటే ఆసక్తి. 

నిత్యమూ మహోత్సవాలు జరుపుతుంటే, జరుగుతుంటే ఆసక్తి.  

ఈ లోకా లోకాలన్నింటిలో జరిగే సమస్త కార్యములూ, కారణములూ 

అన్నీ కూడా అమ్మకి ఆసక్తిదాయకమే. 

అమ్మకి ఎల్లప్పుడూ సంబరాలు జరుగుతూ కోలాహలంగా ఉంటే ముచ్చట. 

అవి అన్నీ జరిపించేదీ, జరిపించుకునేదీ కూడా ఆ అమ్మే. 

సహస్రారకమలంపై, ఆ రాజరాజేశ్వరుని కూడి, ఈ చరాచర జగత్తులో జరిగే 

అన్ని విశేషముల పట్ల ఎంతో సంభ్రమంతో, ఆసక్తితో వుండే, ఆ మహాసక్తి కి వందనం. 🌹


🌹కుండలినీ🌹


మూలాధారము నందు శక్తి ఒక సర్పము వలె చుట్టలు చుట్టుకుని వున్నదని చెప్పుకున్నాం కదా. 

ఆ చుట్టల మధ్య భాగములో, కుండలినీ శక్తి తలని కప్పుకుని, నిద్రాణముగా ఉంటుంది. 

ఆ మధ్యభాగాన్ని కుండలము అంటాం. ఆ శక్తే కుండలిని. కుండలములు అంటే చెవి కమ్మలు.  

ఒరిస్సా ప్రాంతంలో కొందరు వృద్ధులు ఒక ప్రత్యేకమైన చెవికమ్మలు ధరించేవారు. 

ఎంత బరువుగా, వెడల్పుగా ఉండేవంటే ఆ బరువుకి ఆ కమ్మలు జారి భుజం దాకా వచ్చేవి. 

అవి సర్పాకారంలో వుండి, మూడున్నర చుట్లు చుట్టుకుని, పడగ భాగం విప్పుకుని ఉండేవి. 

అది తలఎత్తిన కుండలినీ రూపం వలె ఉండేది. 

ఈ మధ్య కాలంలో అటువంటి చెవి కమ్మలు ఎవరూ ధరించగా చూడలేదు. 

మూలాధారం నుంచి ఇడా, పింగళా నాడులు కూడా సర్పముల వలె ఒకదాన్ని ఒకటి

చుట్టుకుని, సుషుమ్నతో పాటు పయనం సాగిస్తాయి. 

ఇడానాడి చంద్రనాడి అయితే, పింగళానాడి సూర్యనాడి. 

ప్రతి గ్రంధి వద్ద అవి ఒకసారి మెలికపడి స్థానాలు మార్చుకుంటాయి. 

ఆజ్ఞ చేరేసరికి అవి సంపూర్ణంగా ప్రచోదితమయి సూర్య చంద్ర వహ్ని నేత్రాలను తెరుస్తాయి. 

కుండలినే జీవుడిని మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేర్చే శక్తి. 

మూలాధారం వద్ద శక్తి రూపములో వున్నది ఆ కుండలినీ స్వరూపిణియే. 

కనుకనే అమ్మని కుండలినీ అన్నారు. జీవుడిని ఉద్ధరించే మహాశక్తి, ఆ కుండలిని కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

జగన్నాధ భోగం ..

  



             *జగన్నాధ భోగం ...!!*

                  ➖➖➖✍️


మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న ‘కర్మాబాయి’ అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.


ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది.


నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమై పోయేది. ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది.


అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది.


క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది.


ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు.


మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు.


అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. 


ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని, ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు.


ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి కి నచ్చలేదు. ఒక మడీ, ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతీ నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి, అక్కడే స్వామికి నివేదన చేసి, అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు.


ఆ బైరాగి కర్మాబాయి కి ఆచారవ్యవహారాలు బోధించాడు. “ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు” అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు.


అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్లూ తప్పు చేసాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది.


మరునాడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతోంది. 


సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి, ’ఆకలికి తాళలేకపోతున్నాను’ అని, ‘ఏముంటే అది, ఇంత ఆహారం పెట్టమ’ని వేడుకుంటున్నాడు. 


ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు.


కర్మాబాయి కి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. 


అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకూడా చేసుకోని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది.


తాను ఇంట్లో చేసిన కిచిడీ, ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగూ గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక, ‘ఆ కిచిడీ ఆ సాధువు కి పెట్టేస్తే!’ అని అనుకుంది. 


‘అలా చేస్తే అతని ఆకలీ తీరుతుంది, అతని ప్రాణాలూ నిలబడతాయి’ అని అనుకుంది.


ఆ సాధువు కి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీ వడ్డించింది. 


అతనెంతో ఆత్రంగా, ఆప్యాయంగా ఆ కిచిడీ తిని, ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.


ఆ తరువాత మడి కట్టుకుని, గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది.


అర్చకులు, నిన్న తనకు ఆచారవ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తున్నారు.

“ఇంత ఆలస్యం ఏమిటమ్మా” అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామి కి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి, తెర తొలగించారు.


 ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.

స్వామి నోటికంతా కిచిడీ అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కోని చిన్ని పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది.


ఆ మహిమ కు అందరూ ఆశ్చర్యపోయినా, అలా స్వామి నోటికి ఆహారపదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు. 


ఆ బైరాగి ని అడిగారు. “స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా, అసలేమయ్యిందో కనుక్కోండి” అని అడిగారు. 


సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. 


అప్పుడు స్వామి వైపునుండి అదృశ్యవాణి వినిపించసాగింది…

“బైరాగీ, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్దగా వినండి. కేవలం భక్తిశ్రద్ధలతో పరిశుద్దంతరంగయైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడీ భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ, నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్లి భక్తిశ్రద్ధలతో బాటు ఆచారాలు, వ్యవహారాలూ ఇవీ అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది. భయపడ్డది. దుఃఖించింది. 


తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి, ఆలయ నిమిత్తం మడి కట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది.


దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి అయిదు ఘడియలు ఆలస్యం అయ్యింది. నేనా ఆలస్యం తో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు. 


నాకు అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్లి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేసాను. 


మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి” అని వినిపించింది.


ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాలప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు.


కర్మాబాయి మాత్రం స్వామి వారు తన పై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. 


అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచారవ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. 


అయితే, తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. 

వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి… “అమాయకుడా, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరం.


కానీ, ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో, వాళ్లకు ఆచారవ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడి బట్టలు ఎందుకయ్యా అని.


అంతే కాదు, ఆచారవ్యవహారాలు తెలిసిన వారు, ఆ ప్రకారమే చేయాలి, అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి.


ఆచారవ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను.


బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయి కి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. 


ఆ నాడే కాదు, ఈ నాడు కూడా, ఇప్పటికీ కూడా, కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడీ భోగం బంగారు పళ్లెంలో ఉంచి భోగం జరుపుతారు. 


ఎంత పావనమైన విషయం కదా...

మనం త్రికరణశుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే, స్వామి స్వీకరిస్తాడు.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

శ్రీ అక్షేశ్వర స్వామి ఆలయం

  🕉 మన గుడి : నెం 1360


⚜  తమిళనాడు : ఆచరపక్కం


⚜  శ్రీ అక్షేశ్వర స్వామి ఆలయం



💠 తమిళనాడులోని కాంచీపురంలోని అచ్రపక్కంలో ఉన్న అక్షీశ్వరస్వామి  స్వామి ఆలయం శివుడు, పార్వతి మరియు వినాయకుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. 


💠 ఈ ఆలయం 5 అంతస్తుల రాజగోపురం కలిగి ఉంది. 

ప్రధాన ఆలయం విశాలమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. 


💠 అచ్చేశ్వరుడికి ప్రార్థనలు చేసే భక్తులు విద్యలో వృద్ధి చెందుతారని మరియు వారి ఆర్థిక జీవితంలో సానుకూల వృద్ధికి దారితీస్తుందని గట్టిగా నమ్ముతారు. 


💠 ఆలయ ప్రాంగణంలో రెండు ప్రాహారాలు ఉన్నాయి, వీటిలో ఒక ప్రాహారంలో అచ్చేశ్వర విగ్రహం మరియు మరొక ప్రాహారంలో శివుడు మరియు పార్వతి దేవత విగ్రహాలు కూర్చుని ఉన్నాయి. 


💠 ఈ ఆలయం రోజువారీ సంప్రదాయాలు మరియు ఆచారాలను కలిగి ఉంది. 

ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలి యొక్క సారాన్ని పూర్తిగా ప్రసరింపజేస్తుంది.


💠 శివుడిని అక్షీశ్వరస్వామి లేదా అచ్చికొంటంతర్‌గా పూజిస్తారు మరియు లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు మరియు అతని భార్య పార్వతిని సుందరనాయగిగా చిత్రీకరించారు. 


💠 7వ శతాబ్దపు తమిళ శైవ కానానికల్ రచన అయిన తేవరంలో ప్రధాన దేవత గౌరవించబడుతుంది, దీనిని తమిళ సాధువులు కవులు నయనర్లు అని పిలుస్తారు మరియు దీనిని పాదల్ పెట్రా స్థలంగా వర్గీకరించారు. 


💠 ఈ దేవాలయాలలో కులోత్తుంగ చోళుడి కాలం (1070-1120) కాలం నాటి అనేక శాసనాలు ఉన్నాయి.


⚜ స్థల పురాణం


💠 ఈ ఆలయం త్రిపుర సంహారం (తిరువతికై వీరట్టానం వద్ద ఉన్న దానికి సంబంధించినది) యొక్క పురాణంతో ముడిపడి ఉంది.


💠 త్రిపురాలలో తరహన్, విత్మన్మాలి మరియు కమలాక్షన్ అనే ముగ్గురు రాక్షసులను నాశనం చేయడానికి శివుడు బయలుదేరినప్పుడు ఆయన దివ్య రథం యొక్క ఇరుసు ఇక్కడ విరిగిపోయిందని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి, ఎందుకంటే ఆయన తన లక్ష్యానికి బయలుదేరినప్పుడు గణేశుడిని ధ్యానం చేయలేదు. అందుకే ఈ ప్రదేశం పేరు అచు ఇరు పాక్కం అని పిలువబడింది. 


💠 ఇది శివుడికే జరిగినప్పుడు, ఏదైనా పనికి బయలుదేరే ముందు గణేశుడిని పూజించడం ఎంత ముఖ్యమో మనం ఊహించవచ్చు.


💠 సర్వశక్తిమంతులైన అసురులు, తారకన్, కమలాచ్చన్ మరియు విత్వన్ మాలి వరుసగా బంగారం, వెండి మరియు ఇనుముతో రాజభవనాలు నిర్మించారు మరియు దేవతలను తరచుగా ఇబ్బంది పెట్టారు. 

విష్ణువు మరియు బ్రహ్మతో పాటు దేవతలు శివుడిని పూజించారు . శివుడు ఆకాశాన్ని పైకప్పుగా, భూమిని ఆధారం వలె, సూర్యుడు మరియు చంద్రుడిని చక్రాలుగా, నాలుగు వేదాలను గుర్రాలుగా, మేరు పర్వతాన్ని విల్లుగా, వాసుకిని తాడుగా చేసుకున్నారు.


💠 బ్రహ్మ రథాన్ని నడిపిస్తున్నాడు. యుద్ధంలో పాల్గొనకపోవడంతో వినయుడు కోపంగా రథం యొక్క ముళ్ళను విరిచాడు. 

శివుడు వినాయగర్ కు మంచి పనులు చేసి తిర్వతికై వద్ద అసురులను ఓడించి ముందుకు సాగాడు.

 అచు (ముళ్ళను) ముక్కలుగా (పక్కం) విరిగినందున, ఈ ప్రదేశాన్ని అచిరుపక్కం అని పిలుస్తారు.


💠 త్రిపురాంతక వధ జరిగిన త్రిపురసంహారం సమయంలో, శివుడు యుద్ధానికి బయలుదేరే ముందు గణేశుడిని పూజించడం మర్చిపోయాడు. 

అతను దానిని గ్రహించి గణేశుడిని పూజించడానికి తిరిగి వచ్చి రాక్షసుడిని ఓడించడానికి ముందుకు వెళ్ళాడు. 

ఇదే పురాణం తిరువతిగై వీరత్తనేశ్వరర్ ఆలయం మరియు తిరువిర్కోలం శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంతో ముడిపడి ఉంది .


💠 అక్షీశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రముఖమైనది. 

గర్భగుడి ధ్వజస్తంభం మరియు గోపురానికి అక్షంగా అమర్చబడింది. 


💠 భార్య సుందరనాయకి చిత్రం పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయంలో ప్రతిష్టించబడింది. 

గర్భగుడి చుట్టూ మొదటి ఆవరణలో సరస్వతి , లక్ష్మి , సప్తమాత్రిక మరియు అయ్యప్ప చిత్రాలు ఉన్నాయి. 


💠 ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు రోజువారీగా పూజలు (ఆచారాలు) నిర్వహిస్తారు. తమిళనాడులోని ఇతర శివాలయాల మాదిరిగానే, పూజారులు బ్రాహ్మణ ఉప కులమైన శైవ సమాజానికి చెందినవారు. 


💠 ఆలయ ఆచారాలు రోజుకు నాలుగు సార్లు నిర్వహిస్తారు; 

ఇది ఇసుక దిబ్బతో చేసిన లింగం కాబట్టి, అన్ని అభ్యంగనలు పీఠానికి మాత్రమే చేయబడతాయి.


💠 సోమవరం మరియు శుక్రవారం వంటి వారపు ఆచారాలు , ప్రదోషం వంటి పక్షం రోజుల ఆచారాలు మరియు అమావాస్య, కృత్తికా నక్షత్రం, పౌర్ణమి మరియు చతుర్థి వంటి మాస పండుగలు ఉన్నాయి . 


💠 ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ చిత్తిరై బ్రహ్మోత్సవం, ఇది ఏప్రిల్ మరియు మే మధ్య తమిళ నెల చిట్టిరైలో పది రోజులు ఉంటుంది. 


💠 ఆచారపక్కం త్రిచి - చెన్నై జాతీయ రహదారి (NH45) యొక్క 79వ కి.మీ దూరంలో మరియు మధురాంతకం నుండి 10 కి.మీ దూరంలో ఉంది .



రచన

©️ Santosh Kumar

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 *మ. భువన శ్రేణి వహించు శేషుడు ఫణా భోగంబుపై సంతతం* 

        *బవలీలన్  భరియించు బృష్టమున గూర్మాధీశ్వరుండాతనిన్* 

        *ధవళ క్రోడ  వశాత్ముజేయు నతనిన్  వారాశి యశ్రాంతి చే* 

        *నవురా!  ధీరచరిత్ర సంపదల సంఖ్యాత ప్రబోవోన్నతుల్* 


తా𝕝𝕝 *ఆదిశేషుడు పదునాలుగు లోకములను తన పడగల చేత మోయుచున్నాడు. అతనిని ఆదికూర్మమూర్తి మూపున వహించు చున్నాడు. ప్రళయకాల సముద్రుడు అట్టి యాదికూర్మమును ఆదివరాహునికి లోబడిన వానినిగా జేయుచున్నాడు. కావున మహాత్ముల మహిమకు మేరలేదు*.   


✍️💐🌹🌸🙏

వేదపండితుల ఫించను

 వేదపండితుల ఫించను

               


ఈ సదుపాయాన్ని అర్హులైన పండితులకు వివరించండి. 


కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు. 


ఈ సదుపాయాన్ని, 

ఏ ప్రాంతం‌వారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును. 


గమనించండి…

వేదిక్ స్కాలర్స్ కు మాత్రమే!


60 సం ॥ లు పైబడినవారికి మాత్రమే!



మీరు పంపవలసిన వివరాలు :- 


పేరు:

పుట్టిన తేది:

వయసు:

గోత్రము: 

తండ్రి పేరు:

తల్లి పేరు:

చిరునామా:

ఫొటో:

సెల్ నం:

ఇల్లు‌: (సొంత ఇల్లు) లేదా (అద్దె)

చదివిన వేదం: 

పాఠశాల పేరు:

పాఠశాల చిరునామా:

అధ్యాపకుల పేరు:



వివరాలు పంపవలసిన చిరునామా:-

 Shri Ramana Dikshithar, 

136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com

సెల్ నం: 9443188245 ఈవని విశ్వేశ్వర శర్మ.

సంస్కృతి, సాంప్రదాయాలు

 *కూతురిని రైలెక్కించి*... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన.

          పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది.

          కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు"....అలా ఇంకా ఏదేదో చెబుతుండగానే... "అలాగేనమ్మా , నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త...ఇక ఉంటాను", అని ఫోన్ పెట్టేయబోతుంటే... *"నాన్నా! ఉండండి...మీ మనవరాలు మీకు వాట్సాప్ లో ఏదో సందేశం పంపించిందంట", అని ముగించింది..* పదిహేడు సంవత్సరాల మనవరాలు తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆత్రుతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా.

             *"తాతయ్యా!* మీతో ఉన్న ఈ నాలుగురోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో.‌..అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మనింట్లో మీరు వండించిన పిండివంటల వాసనలు ఇంకా నా ముక్కుపుటాల పై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్ కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో! ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లంపాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. 

          *భోగి పండుగ రోజు...* తెల్లవారుఝామున నిద్రలేచి, తలస్నానం చేసి, ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్లి... మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి, అందులో పిడకల దండ వేసి, ఆ చలిలో వెచ్చగా రెండు చేతులూ చాపి... చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ..." మీ మనవలా అండి", అని పలకరిస్తుంటే... మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా ... "అవునండీ, పండక్కి వచ్చారు"... అని బదులిస్తుంటే, నాకు ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరంగా అనిపించింది... ఎందుకంటే, మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు, మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు.

           *సంక్రాంతి పండుగ రోజున...* గతించిన పెద్దలకు గారెలు , పరమాన్నం నివేదించి, పూజ చేసి,మేమందరం మీ కాళ్ళకి నమస్కరిస్తుంటే ... "దీర్ఘాయుష్మాన్ భవ", అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే..."మీవంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష" అని, అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని... పిండివంటలు తింటూ...ఆ రోజంతా ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో ఎంత సందడిగా గడిచిపోయిందో! పనమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి... మనం చేసుకున్న పిండివంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు, వాళ్ళు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళ్తుంటే... పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆరోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్యా. 

          *కనుమ పండుగ రోజున* మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్లి అందరినీ కలిసి వస్తుంటే... మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్యా... ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నందుకు మామీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా ...మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు "మన" అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్యా.

          తెల్లవారుఝామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ళ ముందు అందమైన ముగ్గులు... వాటి మధ్యలో పసుపు రంగు చామంతిలతో కూడిన గొబ్బెమ్మలు... పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం... బ్రతుకుతెరువుకై వలసపోయిన కుటుంబాలు, పండుగ కోసం సొంతూరుకి రావడం... పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు,అల్లుళ్ళతో కళకళలాడిన లోగిళ్ళు...అందంగా ముస్తాబైన పశువులు... బంధుమిత్రుల కోలాహలం... అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం...

ఇలా ఒకటా,రెండా...ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు... యాంత్రికత మోజులో మునిగితేలుతున్న మా నగర సమాజానికి ఆటవిడుపుగా, ఒకింత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా....

ఈ అనుభవాలని,అనుభూతులని మూటగట్టుకుని... మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా... తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు ఇంత మంచిగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్యా!".

          సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై, అంతవరకూ తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ... ఇనుమడించిన ఉత్సాహంతో ...

*"మీ తరానికి... మన సంస్కృతి, సాంప్రదాయాలు అందించాలనే తహతహ తోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లీ*...మా తరాలకి, రాబోయే భావి తరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లీ. అందుకే ఎంత ప్రయాసపడైనా పండుగలకు సొంత ఊరికి రండి , మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి...మాకు బలం అవ్వండి..‌నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా... ", అని 

 తిరుగు సందేశం పంపాడు తాతగారు... *మీసం సవరించుకుంటూ,కొండంత తృప్తితో. Happy PongaL*🙏🏻🙏🏻🙏🏻

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 *ॐ卐 _-!!సుభాషితమ్!!-_ ॐ卐* 💎 


*_ఏకో దేవః కేశవో వా శివో వా_౹*

*_ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా_।*

*_ఏకో వాసః పట్టణే వా వనే వా_౹*

*_ఏక: నారీ సుందరీ వా దరి వా_।।*


తా𝕝𝕝 *ఒక్కడే దేవుడు శివుడినైన,విష్ణువు అయినా*....

[నీవు ఎవరిని ఆరాధించినా? దేవుడు ఒక్కడనే భావనతోనే పూజించాలి....]

*ఒకడే మిత్రుడు.... అతడు ధనికుడైనా? పేదవాడైనా? [ స్నేహం చేస్తే మిత్రుడు సంపదలు ఉన్న రాజైన,బూడిద పూసుకుని యతి అయిన వారియందు సద్భావన ప్రేమ కలిగి ఉండాలి..] ఒకటే నివాసం అది పట్టణమైన, గ్రామమైనా*? 

*[ నీవు సుఖంగా? శాంతి గా? ఆనందంగా? ఉన్నప్పుడు అది కుగ్రామమైనా? విశాలమైన నగరమైనా? చిన్న గుడిశైనా? ఇంద్రభవనమైనా? ఒక్కటే నివాసం.....]*

*ఒక్కతే జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి*.... 

*[ వివాహమాడిన స్త్రీ సౌదర్యవతి అయిన, కురూపి అయిన  ప్రేమ కలిగి ఉండాలి...]*

*తృప్తి ని సంతోషాన్ని... అనేకం ఇవ్వవు..*. 🧘‍♂️🙏🪷🌻 


✍️💐🌸🌹🙏

నక్షత్ర స్తోత్ర మాలిక - 18 వ రోజు.*

 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 18 వ రోజు.*


*​నక్షత్రం*_ *జ్యేష్ట* (Jyeshtha)


*అధిపతి*_ *బుధుడు. (Mercury)*

*ఆరాధించాల్సిన దైవం*. : *ఇంద్రుడు/శ్రీకృష్ణుడు (గోవిందుడు)*


*​జ్యేష్ట నక్షత్ర జాతకులు, కుటుంబ పెద్దలు మరియు నాయకత్వ లక్షణాలు, మానసిక ప్రశాంతత కోరుకునే వారు పఠించాల్సిన స్తోత్రం.*


​ *శ్రీ గోవిందాష్టకం.* 


*సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం*

*గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్* ।

*మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం*

*క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 1 ॥


*మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవసంత్రాసం*

*వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్* ।

*లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం*

*లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 2 ॥


*త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం*

*కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్* ।

*వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం*

*శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 3 ॥


*గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం*

*గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్* ।

*గోభిర్నిగదితగోవిందస్ఫుటనామానం బహునామానం*

*గోధీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 4 ॥


*గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం*

*శశ్వద్గోఖురనిర్ధూతోద్గతధూళీధూసరసౌభాగ్యమ్* ।

*శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం*

*చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 5 ॥


*స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం*

*వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః* ।

*నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతఃస్థం*

*సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 6 ॥


*కాంతం కారణకారణమాదిమనాదిం కాలఘనాభాసం*

*కాళిందీగతకాళియశిరసి సునృత్యంతం ముహురత్యంతమ్* ।

*కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం*

*కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 7 ॥


*బృందావనభువి బృందారకగణబృందారాధితవంద్యాయాం*

*కుందాభామలమందస్మేరసుధానందం సుమహానందమ్* ।

*వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం*

*నంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్* ॥ 8 ॥


*గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో*

*గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి* ।

*గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో*

*గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి* ॥ 9 ॥


*ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య* *శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ గోవిందాష్టకమ్* ।


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

గాయత్రీ

 *గాయత్రీ మంత్రం ఎందుకు?*


*మరియు ఎప్పుడు అవసరం?*


1.మీరు ఉదయం లేచినప్పుడు 8 సార్లు


గెలుపు కోసం.


2.భోజనం సమయంలో 1 సారి


అమృతం లాంటి భోజనం పొందడానికి!!


3.బయటకు వెళ్ళేటప్పుడు 3 సార్లు


శ్రేయస్సు, విజయం మరియు సాధన కోసం!!


4.ఆలయంలో 12 సార్లు


దేవుని శరణువేడు కొందుకు.


5.తుమ్మినప్పుడు గాయత్రీ మంత్రాన్ని జపించడం

 1 సారి

చెడును వదిలించుకోవడానికి!!


6.నిద్రపోయే ముందు 7 సార్లు చదవాలి.


ఏడు రకాల భయాలను అధిగమించడానికి!!

సూక్తి

  *నేటి సూక్తి*


*మీరు తగ్గినప్పుడే మీ బలం ఏమిటో గుర్తించగలుగుతారు*


*క్రాంతి కిరణాలు*


*1.కం. ఏ విషయము నందైనను*

*మావే గొప్ప యని యెపుడు మాట్లాడకు మీ* 

*కావలసిన కార్యముకై* 

*చేవను కల్గించుచుండు జీవుల కెపుడున్*



*క్రాంతి కిరణాలు*


*2. కం.బరువుగ నిండిన విస్తరి* 

*పరువేమియు తగ్గదెపుడు పంక్తుల లోనన్*

*బరువేమియు లేకుండిన*

*సరిగా నిలువదొక చోట జరుగుచు నుండున్* 


*పద్య కవితా శిల్పకళానిధి మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

భవారణ్య కుఠారికా 🌹

  🌹భవారణ్య కుఠారికా 🌹


సంసారబంధాలు ఎంత గట్టిగా పట్టుకుంటాయో తెలుసు గదా, 

ఆ కట్లు తెంపాలంటే పదునైన గండ్రగొడ్డళ్ళు కావాలి. 

మనచుట్టూ, మనకే తెలిసీ తెలియక అల్లుకున్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, 

మత్సరం వంటి దృఢంగా పెనవేసుకుని పోయి వున్న లతలని నరకాలంటే తేలికైన పని కాదు. 

మనం అమ్మకి శరణాగతులమైతే, ఆ భవారణ్యకుఠారిక, మనపై కరుణతో, తానే స్వయముగా 

ఆ గండ్రగొడ్డలియై, ఆ అరణ్యాన్ని ఛేదిస్తుంది. 

భవారణ్యములో, అంటే సంసారపు కారడవిలో, విపరీతంగా, విచ్చలవిడిగా పెరిగిన 

ఆ మహా వృక్షాలను నరకటానికి గండ్ర గొడ్డళ్లు కావాలి. లేకపోతే అవి నరకబడవు. 

నిజానికి ఈ కారడవిని సృష్టించిందీ ఆ తల్లే, దానిని నరికి మనలను రక్షించేదీ ఆ తల్లే. 

అంతా ఆ మహామాయ లీల, ఇచ్ఛ, విలాసము.  

మనలను ఈ సంసారం అనే అరణ్యము నుంచి విముక్తులను చేయటానికి గండ్రగొడ్డలియై, 

ఆ అరణ్యమును నరికి మనలను ఉద్ధరిస్తున్న, ఆ భవారణ్యకుఠారిక కి వందనం. 🌹


🌹భద్రప్రియా🌹


భద్రము అంటే శుభము, మంగళము అని అర్ధం. అమ్మ భద్రప్రియ, 

అంటే ఎల్లప్పుడూ మంగళకార్యములే ఇష్టపడునది. శుభమే కోరుకునేది. 

అంతే కాదు, ఒకరకం ఏనుగులను భద్రగజము అంటాం. అమ్మకు ఆ భద్రగజములంటే మక్కువ. 

అమ్మకి శుభాల మీద, శుభ సంకేతాల మీద, శుభ కార్యాల మీదా మక్కువ ఎక్కువ. 

మంగళకరమైన అన్ని వస్తువులూ ఆ పరమేశ్వరికి ఇష్టం. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, 

పళ్ళు, తాంబూలం, అలంకరణ, అన్నీ ఆ ఆదిపరాశక్తికి ఎంతో ఇష్టం. 

ఆ మహాదేవి మన ఇంటికి రావాలంటే, ఈ మంగళప్రదమైన సంబారాలు ఇంట్లో సమకూరిస్తే, 

ఎంతో ఇష్టంగా, సంతోషంగా, శుభకరంగా మన ఇంట అడుగిడుతుంది. 

ఒక్కసారి ఆ రాజరాజేశ్వరిని దర్పముగా భద్రగజము మీద మన ఇంటికి వస్తున్నట్టు మనసులో 

ఊహించండి. ఎంత ఆనందం కలుగుతుందో. 

మంగళము చేకూర్చే, ఆ భద్రప్రియ కు వందనం. 🌹


 🌹భద్రమూర్తిః 🌹


అందరికీ భద్రాన్ని కోరే భద్రమూర్తి ఆ జగజ్జనని. ఆ తల్లే స్వయముగా భద్రమూర్తి. 

అందమైన తల్లి, సుశోభితమైన ముఖము కలది, మంగళరూపిణి. 

సౌందర్యాన్ని ఇనుమడింపచేసే, సమస్త ఆభరణములనూ ధరించి, ప్రసన్నంగా వున్న తల్లి. 

ఆమె రూపము, సౌందర్యము, అలంకరణము, చిరునగవు, అన్నీ మంగళకరముగా ఉంటాయి.  

ఆ అమ్మ మంగళాకారమును మనస్సులో దర్శించండి. ఆ అమ్మ చల్లని చూపుని, ఆ కొనగంటి 

వీక్షణనూ, ఆ అపార కరుణామూర్తినీ మనసారా చూడండి. ఆమే భద్రమూర్తి.

శరణన్న వారందరకూ మంగళాన్నీ, అభయాన్నీ, భద్రాన్నీ ఇచ్చే, ఆ భద్ర*నేటి సూక్తి*


*మీరు తగ్గినప్పుడే మీ బలం ఏమిటో గుర్తించగలుగుతారు*


*క్రాంతి కిరణాలు*


*1.కం. ఏ విషయము నందైనను*

*మావే గొప్ప యని యెపుడు మాట్లాడకు మీ* 

*కావలసిన కార్యముకై* 

*చేవను కల్గించుచుండు జీవుల కెపుడున్*



*క్రాంతి కిరణాలు*


*2. కం.బరువుగ నిండిన విస్తరి* 

*పరువేమియు తగ్గదెపుడు పంక్తుల లోనన్*

*బరువేమియు లేకుండిన*

*సరిగా నిలువదొక చోట జరుగుచు నుండున్* 


*పద్య కవితా శిల్పకళానిధి మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*మూర్తి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*625 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము

దానము

ధర్మరాజు " పితామహా ! నాకు దానము దాని మహిమ గురించి వివరించండి " అనీడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మంచి పాలిచ్చే పాడి ఆవును ఒక సందబ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఆ ఆవుకు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. అతడికి అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు సద్గతులు పొందుతారు. గోదానము కాక ఇతరదానములు కూడా చెయ్య వచ్చు. కన్యాదానము, భూదానము, గృహదానము, కనకదానము, అన్న దానము, జలదానము, వస్త్రదానము, శయ్యాదానము, ఆసనదానము, వాహనదానము మొదలైనవి సద్బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఇహ లోకములోను, పర లోకములోను సుఖములు అనుభవిస్తాడు. కాని ధర్మనందనా ఎవరైతే దానము కొరకు తన వద్దకు వచ్చిన వానికి అతని మనోరధము ఎరిగి అతడికి కావలసినది దానంగా ఇస్తే అది అత్యుత్తమదానము ఔతుంది. భయంతో ఉన్న వాడికి అభయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైనది. యుద్ధములో ప్రాణములు దానంగా ఇవ్వడం ఉత్తమోత్తమం. శత్రువు ఎటువంటి వాడైనా అతడు శరణు కోరినప్పుడు ప్రసన్నమైన మనసుతో అతడి కోరిక తీర్చిన వాడు పురుషోత్తముడు అని అంటారు. భార్యా బిడ్డలను పోషించ లేక బాధపడుతున్న వాడికి సాయంచెయ్యడం అతడి దుఃఖాన్ని పోగొట్టడం అత్యంత గొప్పగుణం. తన భార్యను తప్ప అన్యకాంతలను యజ్ఞయాగములు చెయ్యడంలో ఆసక్తి కల వారు, అటువంటి సద్బ్రాహ్మణులను వెతికి వారికి దానం చెసిన వాడు మూడు లోకములలో పూజనీయుడు " అని భీష్ముడు చెప్పాడు.

ఉత్తమ దానము

ధర్మరాజు " పితామహా ! దానము కొరకు తన వద్దకు వచ్చి వానికి దానము చెయ్యడం మంచిదా! లేక తనను ఏదానము కోరక పోయినా అతడి మనసు తెలుసుకుని దానము చెయ్యడం మంచిదా ! భీష్ముడు " ధర్మనందనా ! అడిగిన వాడికి అందరూ సహజముగా దానము చేస్తారు. కాని అడుగ కుండా ఎదుటి వాని మనసెరిగి దానం చెయ్యడమే ఉత్తమం. సత్పురుషుడికి దానం ఇవ్వడం మరణం వంటిది. దానం కావాలా అని అడగబడడం అంతకంటే పెద్ద చావు వంటిది. కనుక అడగని వాడి మనసెరిగి దానము చెయ్యడం వలన తనను తాను రక్షించుకుని దానం పుచ్చుకున్న వాడిని రక్షిస్తాడు " అని భీష్ముడు చెప్పాడు.

దానము ఫలితము

ధర్మరాజు " పితామహా ! దానము యజ్ఞము వంటిది. దానం చెయ్యడంలో అనేక ధర్మవిధులు ఉన్నాయి. కాని ఆ దానములలో అధిక ఫలము ఇచ్చే దానము ఏదో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధనము, ధాన్యము, గోవులు, మణులు, భూమి, జలము, అన్నము మొదలైనవి వినయ పూర్వకంగా బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచి యజ్ఞములు చేసిన ఫలము దక్కుతుంది. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడు దాన ధర్మములు చేస్తుండు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ జలకండేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1362


⚜  తమిళనాడు : వెల్లూరు 


⚜  శ్రీ జలకండేశ్వర ఆలయం



💠 జలకండేశ్వర ఆలయం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న వెల్లూరు కోటలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ఆలయం.


💠 ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది, దాని క్లిష్టమైన శిల్పాలు, గంభీరమైన గోపురాలు మరియు అలంకరించబడిన స్తంభాలతో విభిన్నంగా ఉంటుంది.



⚜ ఆలయ కథ & చరిత్ర :– 


💠 "అత్రి ముని" ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు. అతను వెళ్ళినప్పుడు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల, ఈ లింగాన్ని చీమల దాడి చేసి, తరువాత చీమల పుట్టగా మారింది. వర్షం పడటం ప్రారంభించిన తర్వాత, చీమల పుట్ట వరదలు రావడం ప్రారంభించి నీటి తొట్టిగా మారింది.


💠 అప్పుడు కోటను నియంత్రిస్తున్న విజయనగర రాజవంశంలోని వెల్లూరు అధిపతి చిన్న బొమ్మ నాయకుడికి ఒక కల వచ్చింది, అక్కడ శివుడు ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని అడిగాడు. నాయకులు చీమల పుట్టను కూల్చివేసి, లింగాన్ని కనుగొని, 1550లో ఆలయాన్ని నిర్మించారు.


💠 ఆలయ ప్రణాళికను పూర్తి చేయడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది మరియు అప్పటి నుండి లింగం నీటితో (తమిళ భాషలో జలం అని పిలుస్తారు) చుట్టుముట్టబడింది.


💠 లింగం నీటితో చుట్టు ముట్టబడినందున ఆ దేవతను జలకండేశ్వరర్ ("నీటిలో నివసించే శివుడు") అని పిలిచేవారు. 


💠 ఇక్కడ ఉన్న శివలింగం చాలా 'వేడిగా' ఉండటం వల్ల దానిని నీటి కొలనులో ముంచి ఉంచాల్సి వస్తుందనే పురాణం మరియు నమ్మకం నుండి దీనికి ఆ పేరు వచ్చింది. 


💠 విజయనగర రాజు సదాశివ దేవ్ మహారాయ ( 1540–1572) పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది మరియు ఈ ఆలయ నిర్మాణం విజయనగర రాజుల నిర్మాణ శైలిలో ఉంది.


💠 ఈ ఆలయంలో జలకండేశ్వరుడి భార్య శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంది.

అఖిలాండేశ్వరి అంటే విశ్వం, అండ అంటే విశ్వ గుడ్డు, మరియు ఈశ్వరి అంటే దైవిక తల్లి. 

కాబట్టి, దేవత, తన గర్భంలో విశ్వమంతా రక్షించే దైవిక తల్లి.


💠 జలకండేశ్వర ఆలయం విజయనగర నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణ. 

ఈ ఆలయం దాని గోపురం (గోపురం) పై అద్భుతమైన శిల్పాలు, అద్భుతంగా చెక్కబడిన రాతి స్తంభాలు, పెద్ద చెక్క ద్వారాలు మరియు అద్భుతమైన ఏకశిలలు మరియు శిల్పాలను కలిగి ఉంది.


💠 నంది విగ్రహం వెనుక ఒక మట్టి దీపం ఉంది, ఎవరైనా దానిపై చేయి ఉంచినప్పుడు అది తిరుగుతుందని చెబుతారు. 

భక్తుల కోరికలు నెరవేరాయని భ్రమణం సూచిస్తుందని చెబుతారు.


💠 ఆలయంలోని రాతి శిల్పాలు, ప్రధాన ప్రవేశ ద్వారం, రాతి స్తంభాలు అద్భుతంగా ఉన్నాయి. 

ప్రధాన శివుని మందిరం పక్కన ఆలయ ప్రాంగణం లోపల అనేక దేవాలయాలు ఉన్నాయి. 

అయితే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మండపంపై అత్యంత అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి.


💠 ఈ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని వెయ్యి స్తంభాల హాలు, ఇది వాస్తుశిల్పం మరియు శిల్పకళ యొక్క కళాఖండం.


💠 దక్షిణ భారతదేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు. 

ఫలాన గుడిని ఎవరు కట్టించారనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు అని. వారు కట్టిన ఆలయాలు అంత విస్త్రుతంగా ఉన్నాయి.

వాటిలోని శిల్పకళ కూడా అంత విశిష్టంగా ఉంటుంది. 


💠 ఆ ఆలయాలలోని కళ్యాణ మంటపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది. 

అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా, ప్రత్యేకంగా కొన్నింటిని చెప్పుకోవాలి. 

అవి, హంపి లోని విఠలాలయంలో కళ్యాణ మండపం, మధురై లోని వేయి స్తంభాల మండపం, తిరునల్వేలి లోని మండపం., కోయంబత్తూరు దగ్గర ఉన్న పేరూరు మండపం., రాయ వెల్లూరు లోని జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం. 


💠 ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత అందమైన మండపాలు. వీటిలో జలకంఠేశ్వరాలయం లోని కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది.


💠 స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి.


💠 ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. 

ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. 

అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాంటి చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను ఉన్నాయి.


రచన

©️ Santosh Kumar

పరిస్థితులపై

  సాధారణంగా మనం ఉన్న పరిస్థితులపై నిర్లక్ష్యం, చులకన భావం, అసంతృప్తి ఉంటాయి వేసవికాలం చల్లగా ఉండాలని, చలికాలం వెచ్చ గా ఉండాలని, వర్షాకాలం తడిగా లేకుండా పొడిగా ఉండాలని కోరుకుంటాం కానీ ఋతువులు ప్రకారం ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఋతు నియమం అనుసరించి జరిగే మార్పుకు మనం సిద్ధపడాలి. అలాగే మన జీవితంలో కుడా కొన్ని తప్పక జరుగుతూ ఉంటాయి. వాటి యందు ద్వేష భావం పెంచుకొనక తటస్థ వైఖరితో, సాక్షి భావనతో, సమవర్తి గా ఉండటం మంచిది. కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు అవి విమాన ప్రయాణం లా ఉంటాయి. ప్రయాణం మొదలైన తర్వాత మధ్యలో మార్చుకునే దానికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్న జరిగేది జరుగుతుంది. జరుగుతున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితినీ ద్వేషించకుండా ప్రశాంతంగా ఉండటం మేలు. భూమిపైకీ ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు అందరూ అతిధులే ఆలోచించండి

సోమవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

19-01-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మిధునం


ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

---------------------------------------


సింహం


ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------


కన్య


వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

---------------------------------------


వృశ్చికం


వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.

---------------------------------------


ధనస్సు


కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 

---------------------------------------


మకరం


సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కుంభం


నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముక్యమైనా పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు.

---------------------------------------


మీనం


చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

---------------------------------------

తెలుగు క్యాలెండర్*

 *హిందూ ఉపాధ్యాయ సమితి*

                 67/2020


  *పరాభవ నామ సంవత్సర*

   *అచ్చ తెలుగు క్యాలెండర్* 

           *ఉగాది to ఉగాది*

ప్రతీ *హిందూ తెలుగు లోగిట్లో* ఉండాల్సిన కాలమాన పత్రిక.


స్వచ్ఛమైన తెలుగు కాలమాన పట్టిక 

1. తిధి 

2. వారము 

3. నక్షత్రము 

4. కార్తెలు 

5. రాహుకాలము

6. దుర్ముహూర్తాలు 

7. పండుగలు

8. ఉత్సవాలు 

9. ఋతువులు

కలగలిపి *తెలుగు నెలల పేర్లతో* *తెలుగు సంవత్సర నామంతో* కూడినటువంటి కేలండర్ ఇది.


పంచాంగ కర్త 

బ్రహ్మశ్రీ 

శ్రీ రామకృష్ణ శాస్త్రి గారిచే 

*హిందూ ఉపాధ్యాయ సమితి* సహకారంతో నిర్మించబడిన పరాభవ నామ సంవత్సర  తెలుగు కాలమాన పట్టిక ను సులభంగా *ఉగాది కంటే ముందుగా మీ ఇంటికి చేరవేయాలనే* మా సంకల్పానికి చేయూత ఇవ్వండి.


పరాభవ నామ సంవత్సర ఉగాది తెలుగు క్యాలెండర్ కొరకు ఇప్పుడే నమోదు చేసుకోండి.

ఒక క్యాలెండర్ ధర: *₹ 60*   

 *60*5 = 300*

*60*10=600*

          (తపాలా రవాణాతో సహా).

ఆ దామాషాన 

ఎన్ని పత్రికలైనా, 

మీరు కోరిన చిరునామాకు చేర్చగలము.

మీ 

బంధు మిత్ర కుటుంబాలకు

మీ ద్వారా *ఉగాది పండుగ కానుకగా* చేర్చండి.

*అధిక ప్రతులకు ముందుగానే నమోదు చేసుకోండి.* 

కాలమాన పట్టికలు తక్కువ ఉన్నాయి. 

నగదు చేరవేయండి.

ఫోన్ పే no. 9704568017 నెంబరు కు పంపి 

స్లిప్ ను మరియు *చిరునామాను* అదే నెంబర్కు వాట్సాప్ కు పంపగలరు.

       🚩🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🚩

*మహేష్ డేగల - 9704568017*

జాతీయ అధ్యక్షులు. 

హిందూ ఉపాధ్యాయ సమితి.

🙏

శరీరం గురించి శివుడు

 మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు -

 

* స్వరం ఒకటి మూడు రూపములుగాను , అయిదు రూపములుగాను అగును. ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును. మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.

 * శరీరం నందు స్వరం పుట్టును . స్వరము నందు నాడిపుట్టును. స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.

 * శరీరం పిండం అనబడును. ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును. శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.

 * ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును. అయిదు దినములకు బుడగ వలే అగును. పది దినములకు నెత్తురు అగును. పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.

 * ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.

 * మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండొవ నెల యందు మేథస్సు కలుగును. మూడోవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగోవ మాసము నందు అవయవములు జనించును.

 * అయిదోవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును. ఆరొవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును .

 * ఎడొవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.

 * ఎనిమిదోవ మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు . తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును . కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.

 * తొమ్మిదోవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదోవ మాసమున గాని పదోవ మాసమున గాని ప్రాణములతో పుట్టును .

 * స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము , బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.

 * పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను. స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును .

 * ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు , దరిద్రుడు అగును. గర్బం అయిదోవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును. ఆరొవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.

 * ఎడొవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు , ఎనిమిదొవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు , తొమ్మిదోవ దినమున పతివ్రత అగు కూతురు , పదొవ దినమున మంచి కుమారుడు పుట్టును . ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.

 * ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును. నెత్తురు , రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.

 * రోమములు , చర్మము , ఎముకలు , మాంసము ఇవి పృథ్వి అంశములు , శుక్లము, పురీషము , మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు .

 * ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు , ముడుచుకొనుట , చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు. కోపం , సిగ్గు , భయం , మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు .

 * నాలిక , చర్మము , చెవులు , ముక్కు , కన్నులు ఈ అయిదు జ్ఞానేంద్రియములు , ఉపస్థము , ఆసనం , వాక్కు , హస్తములు , పాదములు ఇవి కర్మేంద్రియాలు .

 * మూలాధారం నందు నాలుగు దళముల పద్మము , యోని నందు ఆరు దళముల పద్మము , నాభి యందు పది దళముల పద్మము , హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.

 * కంఠము నందు పదహారు దళముల పద్మము , కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము , బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము ఉండును.

 * ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును. ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.

 * సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.

 * నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.

 * అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.

 * నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.

 * సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది . అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.

 * ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి. వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద అనునవి కలవు. వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు వహించి ఉండును. 

 * సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును. పూషలము , భూషితము అను నాడులు నేత్రముల యందు ఉండును.

 * గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును. కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.

 * మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును.

 * పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును. నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు , హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .

 * అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను , గుదము , లింగము , నాభి , వృషణము , తొడలు , మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును .

 * వ్యాన వాయవు కన్నులు , చెవులు , కాలి మడములు , పిరుదు , ముక్కు , ఈ స్థానముల యందు ఉండును. ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును .

 * సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును. భుజించబడిన , తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును .

 * ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు , కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.

 * ధనుంజయ వాయవు వలన ఘోషము , మాటలాడుట నాగము వలన , ఆవులింత దేవదత్తం వలనను , తుమ్ము కృకరము వలనను , కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును. మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం. 

         మరిన్ని మానవ శరీరానికి సంబంధించిన పరమ రహస్యాలగు యోగ కారక విషయాలు తరవాతి పోస్టులలో తెలియచేస్తాను.

 

  

  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

మాఘ పురాణం - 1 వ* _*అధ్యాయము*_

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷 సోమవారం 19 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 1 వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ మాస మహిమ*


☘☘☘☘☘☘☘☘☘


*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*


           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను , వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.


*మాఘపురాణం ఒకటవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*