*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*625 వ రోజు*
అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము
దానము
ధర్మరాజు " పితామహా ! నాకు దానము దాని మహిమ గురించి వివరించండి " అనీడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మంచి పాలిచ్చే పాడి ఆవును ఒక సందబ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఆ ఆవుకు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. అతడికి అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు సద్గతులు పొందుతారు. గోదానము కాక ఇతరదానములు కూడా చెయ్య వచ్చు. కన్యాదానము, భూదానము, గృహదానము, కనకదానము, అన్న దానము, జలదానము, వస్త్రదానము, శయ్యాదానము, ఆసనదానము, వాహనదానము మొదలైనవి సద్బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఇహ లోకములోను, పర లోకములోను సుఖములు అనుభవిస్తాడు. కాని ధర్మనందనా ఎవరైతే దానము కొరకు తన వద్దకు వచ్చిన వానికి అతని మనోరధము ఎరిగి అతడికి కావలసినది దానంగా ఇస్తే అది అత్యుత్తమదానము ఔతుంది. భయంతో ఉన్న వాడికి అభయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైనది. యుద్ధములో ప్రాణములు దానంగా ఇవ్వడం ఉత్తమోత్తమం. శత్రువు ఎటువంటి వాడైనా అతడు శరణు కోరినప్పుడు ప్రసన్నమైన మనసుతో అతడి కోరిక తీర్చిన వాడు పురుషోత్తముడు అని అంటారు. భార్యా బిడ్డలను పోషించ లేక బాధపడుతున్న వాడికి సాయంచెయ్యడం అతడి దుఃఖాన్ని పోగొట్టడం అత్యంత గొప్పగుణం. తన భార్యను తప్ప అన్యకాంతలను యజ్ఞయాగములు చెయ్యడంలో ఆసక్తి కల వారు, అటువంటి సద్బ్రాహ్మణులను వెతికి వారికి దానం చెసిన వాడు మూడు లోకములలో పూజనీయుడు " అని భీష్ముడు చెప్పాడు.
ఉత్తమ దానము
ధర్మరాజు " పితామహా ! దానము కొరకు తన వద్దకు వచ్చి వానికి దానము చెయ్యడం మంచిదా! లేక తనను ఏదానము కోరక పోయినా అతడి మనసు తెలుసుకుని దానము చెయ్యడం మంచిదా ! భీష్ముడు " ధర్మనందనా ! అడిగిన వాడికి అందరూ సహజముగా దానము చేస్తారు. కాని అడుగ కుండా ఎదుటి వాని మనసెరిగి దానం చెయ్యడమే ఉత్తమం. సత్పురుషుడికి దానం ఇవ్వడం మరణం వంటిది. దానం కావాలా అని అడగబడడం అంతకంటే పెద్ద చావు వంటిది. కనుక అడగని వాడి మనసెరిగి దానము చెయ్యడం వలన తనను తాను రక్షించుకుని దానం పుచ్చుకున్న వాడిని రక్షిస్తాడు " అని భీష్ముడు చెప్పాడు.
దానము ఫలితము
ధర్మరాజు " పితామహా ! దానము యజ్ఞము వంటిది. దానం చెయ్యడంలో అనేక ధర్మవిధులు ఉన్నాయి. కాని ఆ దానములలో అధిక ఫలము ఇచ్చే దానము ఏదో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధనము, ధాన్యము, గోవులు, మణులు, భూమి, జలము, అన్నము మొదలైనవి వినయ పూర్వకంగా బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచి యజ్ఞములు చేసిన ఫలము దక్కుతుంది. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడు దాన ధర్మములు చేస్తుండు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి